Friday, July 31, 2015

ఆచి తూచి...అసలైన నిర్ణయం : వనం జ్వాలా నరసింహారావు

ఆచి తూచి...అసలైన నిర్ణయం
నమస్తే తెలంగాణ (01-08-2015)
వనం జ్వాలా నరసింహారావు
తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్‌ పార్టీ నుంచి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిన ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాయింపుల  నిరోధక చట్టం కిందఅనర్హులుగా ప్రకటించమని శాసన సభాపతికి, గవర్నర్‌కు విజ్ఞప్తులు చేశారు కొందరు ప్రతిపక్ష నాయకులు. తెలుగుదేశం పార్టీ టికెట్‌పై గెలిచి, రాష్ట్ర మంత్రివర్గంలో చేరిన తలసాని శ్రీనివాస్ యాదవ్ రాజీనామాకు సంబంధించి, సమాచార హక్కు చట్టం కింద వివరాలను సేకరించి ఆ విషయాన్ని వివాదాస్పదం చేసే ప్రయత్నం కూడా జరిగింది. టిఆర్ఎస్‌లోకి వెళ్లిన ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేయాలని స్పీకర్‌ను హైకోర్టు ఆదేశించిందని వార్తలొచ్చాయిఎమ్మెల్యే అనర్హత పిటిషన్‌పై హైకోర్టులో జరిగిన వాదనల సందర్భంగా శాసన సభ సభాపతికి కూడా వ్యక్తిగతంగా నోటీసులు జారీ చేయాలని  న్యాయస్థానం ఆదేశించింది. గతంలో కూడా కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ నుంచి టీఆర్ఎస్ లోకి ఎమ్మెల్యేలు వెళ్లడాన్ని ఆక్షేపిస్తూ, వారు పార్టీ ఫిరాయింపు చట్టాన్ని ఉల్లంఘించినా స్పీకర్ ఎందుకు మిన్నకుండిపోయారనీ, వెంటనే సమాధానం చెప్పాలనీ హైకోర్టు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ను కోరారుఅలాగే ఎమ్మెల్సీల విషయంలో శాసనమండలి ఛైర్మన్ ను అనర్హతపై తేల్చి చెప్పాలని హైకోర్టు అంది.
పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టానికి రాజ్యాంగపరమైన నియమ నిబంధనలున్నాయికాకపోతేఅవి ఎంత సక్రమంగా అమలుకు నోచుకుంటున్నాయనేది మిలియన్ డాలర్ల ప్రశ్నపోనీసత్ సాంప్రదాయాలే మన్నా నెలకొన్నాయంటేఅలా ఏ రాష్ట్రంలోను జరిగిన దాఖలాలు లేవుపార్లమెంటరీ ప్రజాస్వామ్యం పది కాలాల పాటు మనుగడ సాగించాలంటేరాజ్యాంగ నియమ నిబంధనలకు అదనంగాచిరకాలం గుర్తుంచుకునే సంప్రదాయాలు నెలకొనడం తప్పని సరిదాదాపు రాజకీయ పార్టీలన్నీ కూడా, వారి వారి రాజకీయ అనుకూలతలు-అననుకూలతల ఆధారంగానడచుకుంటారన్న అపవాదు అన్ని రాజకీయ పార్టీలకు వర్తిస్తుందిఫిరాయింపులను ప్రోత్సహించని పార్టీ బహుశా భారత దేశంలో ఏ ఒక్కటి కూడా లేదంటే అతిశయోక్తి కాదేమో! తప్పొప్పుల సంగతి వేరే విషయం.
అనర్హత విషయంలో నిర్ణయాధికారం పూర్తిగా సభాపతిదేపదవ షెడ్యూల్ కింద పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టానికి సంబంధించిసభాపతి తీసుకున్న ఎటువంటి నిర్ణయమైనాన్యాయ స్థానాల తీర్పు పరిధిలోకి రావుపదవ షెడ్యూల్ నిబంధనలను అమలు పరిచే విషయంలోతదనుగుణమైన విధి-విధానాలను రూపొందించుకునే అధికారం సభాపతికి వుందిరాజకీయ పార్టీలు తమ-తమ పార్టీలకు చెందిన సభ్యుల వివరాలుకొత్తగా చేరిన వారి వివరాలుపార్టీ వ్యతిరేకంగా పని చేస్తున్న వారి వివరాలుపార్టీ ఆదేశాలకు వ్యతిరేకంగా ఓటేసిన వారి వివరాలుసంబంధిత అంశాలకు చెందిన ఇతర వివరాలను పార్టీలు నమోదు చేసుకోమని అడిగే అధికారం వుంది సభాపతికిసభ్యుల అర్హత-అనర్హతలు నిర్ధారించ వలసిన సమయంలో అవి ఉపయోగ పడే అవకాశాలున్నాయిపార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం సభ్యత్వానికి అనర్హులైన వ్యక్తులుయాంత్రికంగాహఠాత్తుగా, తమ సభ్యత్వాన్ని కోల్పోరువారిని పార్టీ నుంచి తొలగించ వచ్చు కానీచట్ట సభల సభ్యత్వాన్నించి తొలగించడానికి,పార్టీ నాయకత్వం నియమించిన ప్రతినిధిసంబంధిత సభ్యుల అనర్హత విషయాన్ని సభాపతి దృష్టికి తీసుకుని పోయిన తదుపరితగు విచారణ జరిపిన తర్వాతేసభాపతి తగు నిర్ణయం తీసుకుంటారు. సభాపతి తీసుకునే నిర్ణయాన్ని ప్రశ్నించే అధికారం న్యాయ స్థానాలకు లేకపోయినాచట్టంలో పొందు పరిచిన నియమ నిబంధనలకు భాష్యం చెప్పే అధికారంరాజ్యాంగ పరంగాన్యాయ మూర్తులకు వుందిపార్టీలు మారడం వివిధ రాష్ట్రాలలో చోటు చేసుకోవడం చాలా కాలం నుండి జరుగుతున్న వ్యవహారంపాతిక సంవత్సరాల క్రితం ఫిరాయింపుల నిరోధక చట్టం వచ్చినాదాని అమలు అంతంత మాత్రమేచట్టం తేవడం జరిగినప్పటికీ,ఫిరాయింపులు మాత్రం ఆగలేదుఅవసరార్థం ఎమ్మెల్యేలను విపక్షం నుంచి స్వపక్షానికి తెచ్చుకునే ప్రయత్నాలు అన్ని రాజకీయ పార్టీలు చేస్తూనే వున్నాయి
పార్టీ ఫిరాయింపులకు పాల్పడే వారి విషయంలోనుదానికి కారణమైన వారి మాతృ సంస్థ రాజకీయ పార్టీల విషయంలోనుఎన్నికల సంఘం అంతో-ఇంతో అప్రమత్తంగా వుండాలి. ఎన్నికల ప్రణాళికలో చేసిన వాగ్దానాలను నెరవేర్చని పక్షంలోపార్టీ వీడిపోయే సభ్యులకు ఎన్నికల సంఘం రక్షణ ఇచ్చి తీరాలి. ఒక పార్టీఒక సారి ప్రణాళికలో చేర్చిన అంశాలకు సంబంధించిఅమలుకు నోచుకోని అంశాల విషయంలోఎన్నికల సంఘం చర్యలు తీసుకోలేని పరిస్థితులున్నంత కాలం పార్టీలను వీడేవారు వుండే అవకాశాలున్నాయి. అదే విధంగాపదవ షెడ్యూల్ అమలు విషయంలోను,కనీసంసభాపతి దృష్టికి తీసుకుపోయే విషయంలోనైనాఎన్నికల సంఘం పాత్ర అంతో-ఇంతో వుండడం మంచిదిఐదేళ్లకో సారి మేల్కొన కుండా,రాజకీయ పార్టీల-పార్టీల ద్వారా ఎన్నికైన సభ్యుల విషయంలో కొంత క్రియాశీలక పాత్ర పోషించాల్సిన బాధ్యతను ఎన్నికల సంఘం మరిచిపోకూడదు.
భారత రాజ్యాంగ నిర్మాణ స్వరూపం చాలా వరకువెస్ట్ మినిస్టర్ నమూనా పార్లమెంటరీ పద్దతితోనే రూపు దిద్దుకుంది. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అనుసరించే భారతఇంగ్లాండ్ దేశాలకుదాదాపు ఒకే రకమైన సంప్రదాయాలుప్రక్రియలున్నాయి. యునైటెడ్ కింగ్డమ్ పార్లమెంట్ నియమ-నిబంధనలుసంప్రదాయాలు భారత దేశం అనుకరించడం జరుగుతున్నప్పటికీఅ దేశంలో ఎన్నికైన పార్లమెంట్ సభ్యులు పూర్తికాలం పదవిలో కొనసాగకుండా మధ్యలో రాజీనామా చేయాలనుకున్నప్పుడురాజ్యాంగ స్ఫూర్తితో స్పీకర్ తీసుకునే నిర్ణయానికి సంబంధించిన ప్రకరణ మన రాజ్యాంగంలో పొందుపరచక పోవడం బహుశా పొరపాటే మో! అసలా మాటకొస్తే వెస్ట్ మినిస్టర్ నమూనా పార్లమెంటరీ విధానంలో ఎప్పటికప్పుడు ఏదో ఒకటి నేర్చుకునే విధానం అంతర్లీనంగా వుంటుందనాలి. అలాంటివి ప్రజాస్వామ్యం బలపడటానికి దోహదపడతాయి. ఉదాహరణకుఆ దేశంలో లాగాఇక్కడి లోక్ సభ-రాష్ట్ర శాసన సభల స్పీకర్లుచట్ట సభల కాలపరిమితి తర్వాత జరిగే ఎన్నికలలోఏ పార్టీకి చెందని అభ్యర్థులుగా పోటీ చేసే అవకాశం కలిగించాలి.
ఇంగ్లీష్ పార్లమెంటుకు ఒక సారి ఎన్నికైన వ్యక్తికిపదవీ కాలం పూర్తవకుండా-లేదా మళ్లీ ఎన్నిక లొచ్చే వరకైనారాజీనామా చేసే అవకాశం లేనే లేదు. పదిహేడవ శతాబ్దంలోరాచరిక వ్యవస్థ నేపధ్యంలోబ్రిటీష్ పార్లమెంటుకు ఎన్నిక కావడంసభ్యులుగా వుండడం అరుదైన గౌరవంగాప్రజలకు సేవ చేసే గొప్ప అవకాశంగా భావించినందున ఎవరు రాజీనామా చేసేందుకు ఇష్టపడేవారు కాదు. ఆ అవసరం దృష్ట్యాఎన్నికైన పార్లమెంట్ సభ్యులు తమ సభ్యత్వానికి రాజీనామా చేసేందుకు వీలుపడకుండామార్చ్ 2, 1623  సభ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. మన దేశంలో పరిస్థితి వేరు. చట్ట సభలకు గెలిచిన అభ్యర్థి తన ఇష్టం వచ్చినప్పుడు రాజీనామా చేసిఉప ఎన్నికలొచ్చిందాకా వేచి వుండి తిరిగి పోటీకి దిగవచ్చు. బహుశా ఈ విధానానికి స్వస్తి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందనాలి.
ఇండియాకెనడాఆస్ట్రేలియా,  న్యూజిలాండ్ దేశాలలో,  చట్ట సభలకు ఎన్నికై నవారురాజీనామా చేయదల్చు కుంటేఆ విషయాన్ని ఫార్మాట్ లోస్పీకర్ కు తెలియ చేస్తే సరిపోతుంది. స్పీకర్ తక్షణం రాజీనామాను ఆమోదించవచ్చులేదా,నిర్ణయం వాయిదా వేయడమోరాజీనామాలను తిరస్కరించడమో చేయవచ్చు. ఇలా చేశాం అని చెప్పాల్సిన అవసరం లేదు. స్పీకర్ అందుబాటులో లేకపోతేరాజీనామా చేయదల్చుకున్న వ్యక్తి డిప్యూటీ స్పీకర్ కు కానికార్యాలయంలో సిబ్బందికి కాని ఇచ్చి పోవచ్చు. ఎంత వేగంగా వారు రాజీనామాలను సమర్పించుకుంటారోఅంతే మోతాదులోఅత్యంత నెమ్మదిగానిర్ణయాన్ని వాయిదా వేయవచ్చు. ఇంగ్లాండులో సభ్యులకు రాజీనామా చేసే అవకాశం లేకపోయినాసభ్యత్వం నుంచి తొలగడానికి రాజ్యాంగం ఒక వెసులుబాటు కలిగించింది. "రాజీనామా" కు బదులుగా "పదవీ విరమణ" చేసే అవకాశం పార్లమెంట్ కలిగించింది. పార్లమెంటు సభ్యులుగా వున్న వారు "ఆదాయం లభించే" పదవులను అంగీకరించ రాదన్న నిబంధన వున్నందునసభ్యులు ఆ నిబంధన ప్రకారం సభ్యత్వాన్ని కోల్పోయేందుకుప్రభుత్వ పరంగాప్రత్యేకంగా దీని కొరకే ఉద్దేశించబడిన ఒక పదవి కావాలంటూ అభ్యర్థన చేసుకోవాలి. దాన్ని మన్నించిబ్రిటీష్ రాణి (లేదా రాజు)ఆర్థిక మంత్రి (ఛాన్సలర్ ఆఫ్ ఎక్స్ చెకర్) ద్వారా ఆ పదవిలో వారిని నియమించడంతక్షణమేసభ్యత్వం రద్దు కావడం జరుగుతుంది. అలాంటి వారుతాము ఖాళీ చేసిన సీటుకు ఉప ఎన్నికలలో పోటీ చేయడానికి సాధారణంగా సాహసించరు. పార్టీ టికెట్ కూడా లభించదు. ఆశ్చర్యకరమైన విషయం... దీని కొరకు కేటాయించిన పదవులు కాగితం పై మాత్రమే వుంటాయి. ఎప్పుడోమాంధాతల కాలంలోరాచరిక వ్యవస్థ పూర్తిగా వేళ్లూనుకున్న రోజుల్లోఏర్పాటైన ఆ పదవులుప్రస్తుతం "చట్టపరమైన కల్పితాలు" గా మిగిలి పోయాయి.
న్యాయ శాస్త్ర పరమైన నియమ-నిబంధనల నేపధ్యంలో రాజ్యాంగ ప్రకరణాలున్యాయ స్థానాల తీర్పులు వుండి తీరాలి. సంప్రదాయాలకు ఇదమిద్ధమైన నిబంధనలంటూ ఏదీ వుండాల్సిన అవసరం లేదు. చట్ట ప్రకారం నడచుకోక పోతే దాని పరిణామాలు ఒక విధంగా వుంటాయి. సంప్రదాయాలకు అలాంటి ఇబ్బంది లేదు. చట్టాలను సవరించవచ్చు. సంప్రదాయాలను మెరుగుపర్చవచ్చు. ఎంత మంచి సంప్రదాయమైనా చట్టానికి లోబడితేనే దానికి విలువ వుంటుంది. చట్టం స్పష్టంగా వుంటేస్పీకర్ కు సరైన మార్గదర్శకాలుంటేఆయన తీసుకునే నిర్ణయం తిరుగులేనిదే అవుతుంది. ఆ నిర్ణయాన్ని ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు. చట్టంలో స్పష్టత లేనప్పుడుసంప్రదాయాల ఆసరా దొరకనప్పుడుస్పీకర్ అత్యంత జాగ్రత్తతో ముందుకు సాగాలి. తొందరపడి నిర్ణయం తీసుకోవడం భావ్యం కాదు.
          అ నైతిక పార్లమెంటరీ ప్రజాస్వామ్య సంప్రదాయాలకు ఆద్యులెవరు? బాధ్యులెవరు? అన్ని రాజకీయ పార్టీల వారు ఆత్మ విమర్శ చేసుకోవడం మంచిదే మో! 

To whom does the Secunderabad cantonment land belong?: Vanam Jwala Narasimha Rao

To whom does the 
Secunderabad cantonment land belong?
Vanam Jwala Narasimha Rao

Interesting information recorded on 10th October 1926, by Sir William Barton, a former Resident in Hyderabad, about Secunderabad cantonment land, is available in India Office Library, London. It is evident from the report that, Government of India did not acquire any land from state Government or erstwhile Hyderabad Nizam Government for establishing Secunderabad Cantonment. The inference could be that the defense establishment at Secunderabad is in occupation of about 13000 (58 % of the 40.17 square kilometers) acres of state and private lands without a valid ownership right. Barton report emphasizes that there was no transfer of ownership of any part of the land to British Government by the Nizam.

There is no land in Secunderabad which absolutely belongs to the Government of India and the Military authorities are entitled to exercise control only over so much of the land within the outer boundary line as has been actually assigned for Military purposes. Land actually in military occupation like barracks and parade grounds were handed over only for Military purposes and it reverts to the Nizam’s Government when no longer required by the military authorities. The title to the land would, on relinquishment, revert to the Nizam’s Government.

Secunderabad, the twin city of Hyderabad is named after Sikandar Jah, the third Nizam of the Asaf Jahi dynasty. The city was formed in 1806, after the order was signed by the Nizam allotting the land north of Hussein Sagar to set up the British Cantonment. It was founded as a British cantonment after the Nizam Asaf Jah II was defeated at the hands of the British East India Company and was forced to sign the Treaty of Subsidiary Alliance in the year 1798. Subsequently, various new markets such as Regimental Bazaar and General Bazaar were created. Secunderabad Railway Station one of the largest in India was established in 1874. The King Edward Memorial Hospital, now known as Gandhi Hospital was established in 1851. Residency House, now known as the Rashtrapati Nilayam, the official retreat of the President of India was constructed in 1860. Being one of the largest cantonments in India, Secunderabad has a large presence of army and air force personnel. Area around Secunderabad changed hands between various rulers and by the 18th century, the area was part of Nizam's Hyderabad.


Residency House

Noted author and a former bureaucrat in his book “Lashkar”(meaning army camp) commented that British cantonments across India evolved as enduring symbols of the imperial power. The very location of these cantonments, some of which were virtually mini-fortresses, was often cited as a reflection of social separation of the British from the natives. Secunderabad Cantonment has been no different according to Narendra Luther. Even after independence the same style is continued. In course of time, the camp expanded to emerge as the first cantonment to provide a settled home for the British army in the South. The houses built for officers, Luther recounts, were typified by the one called “The Retreat”, in which Winston Churchill stayed as second lieutenant in 1896. The house is still in intact and accommodates a colonel.

Secunderabad Municipality was first formed in 1945. By the Hyderabad Municipal Corporation Act 1955, Secunderabad Municipal Corporation was merged with Hyderabad Corporation to form a single Municipal Corporation in the year 1960. Today Secunderabad is part of the Hyderabad district. The Greater Hyderabad Municipal Corporation (GHMC) established in 2007 is responsible for the administration and infrastructure of Secunderabad. Post-Independence, the Secunderabad Cantonment Board came under the jurisdiction of the Indian Armed forces. Today large parts of Secunderabad and some parts of Hyderabad, where defense installations are located come under the purview of Secunderabad Cantonment Board (SCB). The infrastructure management and civic administration in the cantonment are handled by the SCB, which comes under the purview of the union Defense Ministry.


All saints Church, Trimalghery

Consequent to the treaty of 1768 the British Government undertook to provide Nizam with two battalions and Sepoys. Later a Resident was appointed at Hyderabad and year after year the battalions were increased which reached to eight and by 1806 British Government resolved to station the troops at Hyderabad. During the year 1903 the Bolaram cantonment was abolished and merged with the Cantonment of Secunderabad and the land held by it was occupied by the Military authorities free of cost. There was no assignment of land by the Nizam to the Military authorities. The large area of land had been given to British Army at different times for the use of the Military authorities, starting from 1806. However there was no transfer of ownership of the lands to the Government of India (British Government) by the Nizam Government. The 13 Mughlai villages namely, Chinna Thokatta, Pedda Thokatta , Sitharampur, Bowinpally, Balamrai, Kakaguda, Sikh Village, Alwal, Marredpally, Rasoolpura, Busareddyguda, Bolarum, Trimulgherri, and Lalapet were also not the military property. There was at no time any definite assignment of the land and land was taken up as required by the Military authorities. All this information is available in the report of William Barton.


Secunderabad in 1800

The lands were temporarily requisitioned by the British Army from the Nizam Government to meet the exigencies of Second World War and for six months thereafter. A resolution of Secunderabad Cantonment Board meeting held on 21st June 1968, to which all the Defense Authorities and Officers of the Secunderabad Sub-Area were Signatories, ascertain that the Defense  Authorities never owned any land in Secunderabad Cantonment and that whatever land that was requisitioned temporarily for military purposes was restored to Nizam’s Government on First December 1945, as it was no longer required for military purposes. The resolution further noted that, the Cantonment of Secunderabad, in erstwhile domain of Nizam cannot be equated with the rest of the Cantonments as the laws applicable in the Secunderabad Cantonment were the laws prevailing in the Jagirs and Government of Nizam and not the British Indian laws. Starting from 1806, land was taken by the military authorities from the Nizam’s Government, as and when needed by them for cantoning of the troops with a condition that they need to be restored to the Nizam’s Government when no longer required for military purposes. The case of Secunderabad Town, which formerly formed part of this cantonment, was restored to the Nizam’s Government.


Cantonment Office

In Ameer-un-nissa Begum V. Mahboob Begum, the Supreme Court while referring to the nature of sovereign function exercised by the Nizam of Hyderabad observed that "prior to integration of Hyderabad State with the Indian Union and the coming into force of the Indian Constitution, the Nizam of Hyderabad enjoyed uncontrolled sovereign powers. He was the supreme legislature, the supreme judiciary and the supreme head of the executive, and there were no constitutional limitations upon his authority to act in any of these capacities. The Firmans were expressions of the sovereign will of the Nizam and they were binding in the same way as any other law; nay, they would override all other laws which were in conflict with them. So long as a particular Firman held the field, that alone would govern or regulate the rights of the parties concerned, though it could be annulled or modified by a later Firman at any time that the Nizam willed.




After the integration of Hyderabad in the Indian Union, the land said to have been given for military purposes by Nizam and later restored to the Nizam Government as it was no longer required for military purposes, automatically becomes the state government land with absolute powers. Any part of the land in the cantonment area either in Secunderabad or in Hyderabad shall belong to Telangana State Government and it has an absolute right to make use of it as it deems fit. The military authorities or to that matter the Government of India’s Defense Ministry should not have any objection for this. End

Monday, July 27, 2015

విశ్వ నగరంగా భాగ్యనగరం:వనం జ్వాలా నరసింహారావు

విశ్వ నగరంగా భాగ్యనగరం
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రజ్యోతి దినపత్రిక (28-07-2015)
          భాగ్యనగరంగా పిలువబడే  తెలంగాణ రాజధాని నగరం హైదరాబాద్ 1591లో మహ్మద్‌ కులీకుతుబ్ షా నిర్మించాడు. ఈ నగరానికి 400 ఏళ్ల కు పైగా చరిత్ర ఉంది. నగర చరిత్రకు చార్మినార్, గోల్కొండ కట్టడాలు మకుటాయమానం. 1948 సైనిక చర్య తర్వాత హైదరాబాద్ భారత దేశంలో అంతర్భాగమైంది. హైదరాబాద్-సికింద్రాబాద్ జంట నగరాలుగా ప్రసిద్ధికెక్కాయి. ప్రస్తుతం నగరం గ్రేటర్ హైదరాబాద్‌గా విస్తరిస్తోంది. పారిశ్రామికంగా, వాణిజ్యపరంగా, సాంకేతికంగా శరవేగంగా అభివృద్ధి సాధిస్తోంది. ముఖ్యంగా ఐటీ హబ్‌గా వర్థిల్లుతోంది. ఇబ్రహీం హుస్సేన్ సాగర్‌ను నిర్మించి ప్రజలకు మంచి నీటి సౌకర్యం కల్పించాడు. మూసీ నదిలో కలిసే మూడు చిన్న చిన్న ఏరులకు అడ్డకట్ట (టాంక్‌బండ్) వేయించడంతో ఈ సరస్సు ఏర్పడింది. దీని పేరు దాని నిర్మాత అయిన ఇబ్రహీం పేర ఇబ్రహీం సాగర్‌గానే కుతుబ్‌షాహీ రికార్డుల్లో వుందట. అయితే, దాని నిర్మాణానికి రూపకల్పన చేసి దానిని అమలు పరచడంలో ప్రముఖపాత్ర వహించిన హుస్సేన్‌ షా వలి పేరు మీద హుస్సేన్‌సాగర్ గా ప్రసిద్ధికెక్కింది. హైదరాబాద్ నగర నిర్మాణానికి మహమ్మద్ కులీకుతుబ్ షా హిందూ, ముస్లిం పంచాంగాలను అనుసరించి ముహూర్తం పెట్టించాడని అంటారు. చంద్రుడు సింహరాశిలోను, బృహస్పతి తన స్వస్థానంలో ఉన్న శుభ ముహూర్తంలో ఈ నగర శంకుస్థాపన జరిగిందని కూడా ప్రచారంలో వుంది.
అలా అలనాడు నిర్మించబడిన హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత బహుశా మున్నెన్నడూ కనీ-వినీ ఎరుగని రీతిలో అభివృద్ధిపధాన సాగుతోంది. ఒకవైపు హుస్సేన్ సాగర్ ప్రక్షాళన, మరోవైపు దానిలో పడే మురికి నాలాల మళ్లింపు, హుస్సేన్ సాగర్ పరిసరాలలో-నగరంలోని ఇతర ప్రదేశాలలో భారీ బహుళ అంతస్తుల నిర్మాణానికి రూపకల్పన, విశ్వ నగరంగా తీర్చిదిద్దేందుకు ట్రాఫిక్ నియంత్రణ కొరకు సిగ్నల్ ఫ్రీ మల్టీ లెవెల్ ఫ్లయ్ ఓవర్ల నిర్మాణానికి ప్రభుత్వ నిర్ణయం, అంతర్జాతీయ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటుకు సన్నాహాలు...ఇలా ఎన్నెన్నో పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేసింది.
                బహుళార్థ సాధకుడుగా పేరు తెచ్చుకున్న మందుముల నరసింగరావు రాసిన "ఏబై సంవత్సరాల హైదరాబాద్" అలనాటి విషయాలకు సంబంధించిన ఒక విజ్ఞాన సర్వస్వం. ఆయన తన పుస్తకంలో అలనాటి విషయాలను ఎన్నో వివరించారు. అప్పట్లో, హైదరాబాద్ లో పెద్ద భవంతులు-దేవిడీలు వుండేవి. పత్తర్ ఘట్టి నగరంలోని ప్రధాన వర్తక కేంద్రం. 1908 నాటి మూసీ వరదల అపార నష్టాన్ని పూరించుకునేందుకు హైదరాబాద్ పట్టణాభివృద్ధి మొదలైంది. 1918 లో ఉస్మానియా విశ్వ విద్యాలయం స్థాపించడం జరిగింది. 1914-1918 మధ్య కాలంలో జరిగిన ప్రధమ ప్రపంచ సంగ్రామ ప్రభావం హైదరాబాద్ పాలనపై కూడా పడింది. విద్యారంగంలో, "హైదరాబాద్ ఎడ్యుకేషనల్ కాన్ఫరెన్స్" ను మౌల్వీ మహమ్మద్ ముర్తజా స్థాపించారు. 1916 లో వివేక వర్ధని హైస్కూల్ స్థాపన జరిగింది. సుల్తాన్ బజార్ లోని శ్రీకృష్ణదేవరాయలు ఆంధ్ర భాషా నిలయం, సికిందరాబాద్ లోని ఆంధ్ర సంవర్ధనీ గ్రంధాలయం, తెలంగాణ ప్రాంతంలో చైతన్యం కలగడానికి దోహద పడ్డాయనాలి. 1923 ప్రాంతంలో ఉస్మాన్ సాగర్ నుంచి హైదరాబాద్ పౌరులకు మంచినీటి వసతి కలిగించడం జరిగింది.
అలాగే, 40-50 సంవత్సరాల క్రితం నాటి విషయాలు కొన్ని గుర్తు తెచ్చుకుంటే ఆసక్తికరమైన అంశాలుంటాయి. అలనాటి హైదరాబాద్ నగరం-దాని సంస్కృతి కొంత అవగతమౌతుంది. విద్యానగర్‍లోని చెలమయ్య హోటెల్ ఇడ్లీలునేటి ఆర్. టి. సి. క్రాస్ రోడ్స్ ను "చార్మీనార్ చౌ రాస్తా" గా పిలవడం, చార్మీనార్ చౌ రాస్తా చుట్టుపక్కలంతా పారిశ్రామిక వాడగా వుండడం, సమీపంలో వున్న చార్మీనార్ సిగరెట్ కర్మాగారం (వజీర్ సుల్తాన్ టొబాకో కంపెనీ), గోలకొండ సిగరెట్ (నీలం రంగు పాకెట్ లో వచ్చే) కర్మాగారం ...ఇలా ఎన్నో వున్నాయి. చార్మీనార్ చౌ రాస్తా (ఆర్. టి. సి. క్రాస్ రోడ్స్) నుంచి టాంక్ బండును కలిపే రోడ్డు కూడా అప్పట్లో లేదు. ఇప్పుడు టాంక్ బండును కలిపే స్థలంలో కొంచెం అటు-ఇటుగా ఒక "కల్లు కాంపౌండ్" వుండేది. ఇందిరా పార్క్ అసలే లేదు. ధర్నా చౌక్ కూడా లేదు. ఆ రోజుల్లో హైదరాబాద్ లో కనీసం పాతిక-ముప్పై వేల రిక్షాలన్నా వుండేవి. మీటర్ టాక్సీలుండేవి కాని, బేరం కుదుర్చుకోని ఎక్కించు కోవడం తప్ప మీటర్ ఎప్పుడూ వేయక పోయేవారు. టాక్సీలకు కిలోమీటరుకు పావలా చార్జ్ వున్నట్లు గుర్తు. సిటీ బస్సుల్లో హాయిగా ప్రయాణం చేసే వాళ్లు. "ఆగే బడో" అనుకుంటూ కండక్టర్ సున్నితంగా చెపుతుంటే ప్రయాణీకులు క్రమ శిక్షణతో దొరికిన సీట్లలో కూచోవడమో, లేదా, ఒక క్రమ పద్ధతిన నిలబడడమో చేసేవారు. సింగిల్ బస్సులు, ట్రైలర్ బస్సులు, డబుల్ డెక్కర్ బస్సులు వుండేవి. కండక్టర్ చేతిలో టికెట్ ఇచ్చే మిషన్ వుండేది. బర్రున తిప్పి ఒక చిన్న టికెట్ ఇచ్చేవాడు. టికెట్ ఖరీదు పైసల్లోనో, అణా-బేడలలోనో వుండేది.
ఇరానీ రెస్టారెంటులో 15 పైసలిస్తే ఇరానీ "చాయ్" దొరికేది. "పౌనా" కూడా దొరికేది. 5 పైసలకు ఒక సమోసా, లేదా, ఒక బిస్కట్ కొనుక్కుని తినే వాళ్లు. అప్పట్లో "పానీ పురి" ఖరీదు కూడా 5 పైసలే. మిర్చి బజ్జీ కూడా 5 పైసలకే దొరికేది. అలానే మిఠాయి భండార్ లో "గులాబ్ జామూన్", "కలకంద" తిని, "హైదరాబాద్ మౌజ్" కలుపుకుని పాలు-పౌనా తాగే వాళ్లు. పావలాకు అర డజన్ మౌజ్-అరటి పళ్లు దొరికేవప్పుడు. 36 రూపాయలిస్తే 60 భోజనం కూపన్లు ఇచ్చేవారు. తడవకు 18 రూపాయలిచ్చి 30 కూపన్లు కొనుక్కోవాలి. కూపన్ పుస్తకంలో "అతిధులకు" అదనంగా రెండు టికెట్లుండేవి. నెలకు అలా నలుగురు గెస్టులను ఉచితంగా భోజనానికి తీసుకెళ్ల వచ్చు. ఇక భోజనంలో "అన్ లిమిటెడ్" పూరీలు ఇచ్చేవారు. సైజు చిన్నగా వుండేవి. వూరగాయ పచ్చళ్లతో సహా తీరు-తీరు రుచులతో భోజనం, పరిశుభ్రంగా పెట్టేవారు హోటెల్ వారు. ఇప్పుడు 36 రూపాయలకు "ప్లేట్" ఇడ్లీ కూడా రాని పరిస్థితి! హిమాయత్ నగర్, అశోక్ నగర్ మధ్య ఇప్పుడున్న "బ్రిడ్జ్" అప్పుడు లేదు. వర్షాకాలంలో మోకాలు లోతు నీళ్లలో నడుచుకుంటూ వెళ్లాల్సి వచ్చేది. అశోక్ నగర్ లో ఇప్పుడు బ్రహ్మాండంగా వెలిగిపోతున్న "హనుమాన్" గుడి అప్పుడు లేదు. కేవలం ఒక విగ్రహం మాత్రం రోడ్డు మధ్యలో-కొంచెం పక్కగా వుండేది. పీపుల్స్ హైస్కూల్ దాటిన తరువాత మలుపు తిరిగి చిక్కడపల్లి వైపు పోతుంటే, ఇప్పుడు సిటీ సెంట్రల్ లైబ్రరీ భవనం వున్న చోట ఒక కల్లు కాంపౌండ్ వుండేది. ఆ రోజుల్లో ఇప్పుడున్నన్ని సినిమా టాకీసులు లేవు. వున్నవాటిలో ఎయిర్ కండిషన్ థియేటర్లు కాని, ఎయిర్ కూల్డ్ థియేటర్లు కాని దాదాపు లేనట్లే. ఆబిడ్స్ లో వున్న "జమ్రూద్" టాకీసు ఒక్కటే జనరేటర్ బాక్-అప్ వున్న ఎయిర్ కండిషన్ థియేటర్. అలానే వి. వి. కాలేజీ పక్కనున్న "నవరంగ్" థియేటర్ ఒకే ఒక్క ఎయిర్ కూల్డ్ థియేటర్.
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించడంతో మొదటి ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బాధ్యతలు చేపట్టడం, వెనువెంటనే ఆయన ప్రాధాన్యతాంశాలలో హైదరాబాద్ నగరాన్ని విశ్వ నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికా రచన జరగడం జరిగింది. హైదరాబాద్ విషయంలో రాజీ పడితే తెలంగాణ రాష్ట్రం ఎప్పుడో వచ్చేదని, ఎట్టి పరిస్థితుల్లో కూడా అలా రాజీ పడే ప్రసక్తే లేదని, తాను చెప్ప బట్టే హైదరాబాద్ తో కూడిన తెలంగాణ వచ్చిందని ముఖ్యమంత్రి ఎన్నో సార్లు అంటుంటారు. హైదరాబాద్‌కు ఎంతో చరిత్ర, ప్రాముఖ్యతలు వున్నాయని, అవి చెదిరిపోకుండా అభివృద్ధి జరగాలన్నదే తన ధ్యేయం అనీ ముఖ్యమంత్రి అంటారు. అందుకే నగరాన్ని ఒక అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దాలనే తపన తెలంగాణ ప్రభుత్వానికి కలిగింది. ఆ దిశగా తొలుత హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ నియంత్రణ చర్యలకు శ్రీకారం చుట్టారు. ఏటేటా నగరంలో పెరుగుతున్న సుమారు 10-15 లక్షల జనాభా అవసరాలకు అనుగుణంగా, నగరం నాలుగు దిక్కులా ఎక్స్ ప్రెస్ హైవేల నిర్మాణం, ఆకాశ రహదారుల నిర్మాణం జరగాలని ముఖ్యమంత్రి అన్నారు. అవసరమైన ప్రదేశాలలో రింగ్ రోడ్ల నిర్మాణాలు కూడా చేపట్టనుంది ప్రభుత్వం. వాహనాల "గ్రిడ్ లాక్" లను అరికట్టే విధంగా రహదారుల అభివృద్ధి జరుగబోతోంది. వాహనాల రద్దీ ఎక్కువగా వుండే పలు రూట్‌లను హై ప్రెషర్ కారిడార్లుగా గుర్తించింది ప్రభుత్వం. వాహనాలు ఆగకుండా సిగ్నల్ ఫ్రీ తరహా రవాణా వ్యవస్థకు రూపకల్పన జరుగుతోంది. రహదారుల, ఫ్లయ్ ఓవర్ల నిర్మాణ దశలోనే భూగర్భ డ్రైనేజీ, భూగర్భ కేబుల్ వ్యవస్థపైనా దృష్టి సారించడం జరుగుతుంది. బంజారా హిల్స్, ఖైరతాబాద్, చాదర్ ఘాట్, కోఠి, ప్యారడైజ్, నాంపల్లి లాంటి జనం రద్దీ ఎక్కువగా వుండే 20 జంక్షన్ లలో మల్టీ లెవెల్ ఫ్లయ్ ఓవర్ల నిర్మాణానికి  రు. 2631 కోట్లు ఖర్చు చేయనుంది ప్రభుత్వం. టెండర్ల ప్రక్రియ కూడా ప్రారంభమైంది.  

హైదరాబాద్‌లో తెలంగాణ కళా భారతి నిర్మాణం జరుగనుంది. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో నిర్మించే కళా భారతిలో వేరువేరు వేరు సామర్ధ్యాలతో కలిగిన ఆడిటోరియాలు ఉంటాయి. 500 మంది పట్టే ఒక చిన్న ఆడిటోరియం, 1000, 1500మందికి సరిపడా మీడియం ఆడిటోరియాలు, 3000 మంది పట్టే పెద్ద ఆడిటోరియం ఇందులో ఉంటాయి. 125-125 చదరపు మీటర్ల వైశాల్యంలో లక్షా ఇరవై ఐదు వేల చదరపు అడుగుల మేర కళా భారతి నిర్మిస్తారు. ఈ కళా భారతిలో ఆహ్లాదాన్ని కలిగించే పచ్చిక బయళ్లు, చల్లదనం చేకూర్చే నీటి కొలనులు, కను విందు, చేసే ఫౌంటేన్‌లు నిర్మిస్తారుదీనిలో అంతర్భాగంగా అత్యాధునిక థియేటర్, ప్రివ్యూ థియేటర్, కళాకారుల శిక్షణ, రిహార్సల్స్ కోసం ప్రత్యేక హాళ్లు, లైబ్రరీ, ఆర్ట్ మ్యూజియం, పెయింటింగ్ గ్యాలరీ, శిల్ప కళాకృతుల గ్యాలరీ, విఐపి లాంజ్, మీడియా లాంజ్ ఉంటాయి. 25, 50, 100 మందితో సదస్సులు నిర్వహించుకోడానికి 3 ప్రత్యేక సెమినార్ హాళ్లు, డార్మెటరీ సౌకర్యం, అతిథి గృహాలు, 3 రెస్టారెంట్లు, 40 గదులు, 10 సూట్స్, 1000 మంది పట్టే ఫుడ్ కోర్టు ఉంటాయిలలిత కళా అకాడమీ, సాహిత్య అకాడమీ, సంగీత నాటక అకాడమీ లాంటి విభాగాల నిర్వహణ కోసం కార్యాలయాల నిర్మాణం కూడా ఇందులోనే చేస్తారు. 3000 వాహనాలకు సరిపోయేలా పార్కింగ్ ఏర్పాటు చేస్తారు. 10వేల మందితో ఒకే సారి సమావేశాలు నిర్వహించుకున్నా సరిపోయేలా కళా భారతి డిజైన్ రూపొందించారు. తెలంగాణ సాంస్కృతిక వికాసానికి ప్రతిబింబంగా ఈ కళా భారతి ఉండాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు భావిస్తున్నారు.

హైదరాబాద్ నగరంలోని బంజారా హిల్స్ ప్రాంతంలో, ఎనిమిదెకరాల స్థలంలో, అత్యంత ఆధునికమైన హంగులతో, అంతర్జాతీయ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణం జరుగనుంది. నగరానికి ఒక ఐకాన్ భవనంగా మారనున్న ఈ సెంటర్‌లో, రెండు టవర్లతో కూడిన అద్దాల భవనం వస్తుంది. ఒక టవర్ 16 అంతస్తులు, మరో టవర్ 24 అంతస్తులుంటాయి. రెండు టవర్ల మధ్య వంతెన వుంటుంది. టవర్లపైన హెలిపాడ్ సౌకర్యం, సోలార్ రూఫ్ కూడా వుంటాయి. వేయి మంది పట్టే ఆడిటోరియం, వీడియో వాల్స్, లాండ్ స్కేపింగ్, వాటర్ ఫౌంటెన్స్ వుంటాయి. 600 వాహనాలు పట్టే పార్కింగ్ స్థలం వుంటుంది.

ప్రస్తుతం రవీంద్ర భారతి వున్న స్థలంలో హైదరాబాద్ చారిత్రక, సాంస్కృతిక ప్రత్యేకతలను చాటే విధంగా మరో కట్టడం వచ్చే అవకాశం వుంది. మూసీ నదికి ఇరువైపులా అద్భుతమైన పార్కులకు ప్రణాళికలు తయారవుతున్నాయి. నది ప్రక్షాళన, సుందరీ కరణ పనులకోసం కూడా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. నిజాం రాజులు కట్టించిన మోండా మార్కెట్‌ను ఆధునీకరించి అభివృద్ధి పర్చాలని ముఖ్యమంత్రి సంకల్పం. 143 సంవత్సరాల క్రితం 1872 లో నిర్మించిన మోండా మార్కెట్ ఇప్పటికీ చెక్కు చెదర లేదు. సికిందరాబాద్ రైల్వే స్టేషన్‌ను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధమౌతున్నాయి. హైదరాబాద్‌ను అంతర్జాతీయ నగరంగా తీర్చి దిద్దే ప్రయత్నంలో భాగంగా, మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక అధ్యయనం చేయించింది ప్రభుత్వం. రెండు కోట్ల జనాభా నివసించేందుకు అనువుగా, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా హైదరాబాద్ మాస్టర్ ప్లాన్ తయారైంది. 150 కూరగాయల మార్కెట్ల నిర్మాణానికి, 80 మల్టీ లెవెల్ పార్కింగ్ కాంప్లెక్స్ ల ఏర్పాటుకు, 136 బస్ బే ల నిర్వహణకు, అనువైన స్థలాలను ఎంపిక చేసింది నగరపాలక సంస్థ. స్మశాన వాటికల ఆధునీకరణ, దోభీఘాట్ల నిర్మాణం, పబ్లిక్ టాయ్ లెట్ల ఏర్పాటు కూడా ఇందులో భాగమే.

హైదరాబాద్ నగరానికి అతి సమీపంలో, ఏడెనిమిది వేల ఎకరాల విస్తీర్ణంలో, జాతీయ రహదారికి-రైల్వే లైనుకు దగ్గరలో, అద్భుతమైన ఫార్మా సిటీ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అందులో భాగంగా అక్కడ పనిచేసే వారికి నివాస గృహాల వసతి కూడా జరుగనుంది. అలానే నగర సరిహద్దుల్లో ఒక క్రీడా నగరాన్ని కూడా నిర్మించే ఆలోచనలో వుంది ప్రభుత్వం. అలా నిర్మించ తలపెట్టిన ప్రదేశంలో జాతీయ-అంతర్జాతీయ క్రీడల పోటీల నిర్వహణతో పాటు, ఒకనాటికి ఆ సిటీ ఒలింపిక్ పోటీలను నిర్వహించే స్థాయి కూడా ఎదగాలన్నది ముఖ్యమంత్రి ఆలోచన. బంజారా హిల్స్ ప్రాంతంలో బంజారా భవన్, కొమరం భీమ్ భవన్ పేర్లతో ఆదివాసీలకు రెండు ప్రత్యేక భవనాలు నిర్మించనుంది ప్రభుత్వం. హైదరాబాద్ నగర పరిధిలో నివసిస్తున్న సుమారు రెండు లక్షల మంది పేద కుటుంబాలు గుడిసెలు, రేకుల షెడ్డులు వేసుకుని ఇరుకు ఇళ్లల్లో, మురికివాడల్లో వుంటున్నారని గుర్తించిన ప్రభుత్వం, వారికి మెరుగైన ఆవాసాలను కలిగించనుంది.
హైదరాబాద్ నగరానికి హుస్సేన్‌సాగర్ ఒక వరమని భావించిన ముఖ్యమంత్రి, దానిని ఒక మంచినీటి సరస్సుగా మార్చడానికి, దాంతో పాటు దాని చుట్టూ ఆకాశ హర్మ్యాలను నిర్మించడానికి సంకల్పించారు. సాగర్ చుట్టూ నిర్మించనున్న భారీ టవర్స్ నగరానికే ఒక మణి హారంలాగా కానున్నాయి. తెలంగాణ అభివృద్ధికి, ఆర్థిక స్థితికి, సంకేతంగా ఈ ఆకాశ హర్మ్యాలుంటాయి. సాగర్ ప్రక్షాళణకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించడం జరిగింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో కార్యదర్శుల ఉపసంఘాన్ని కూడా ఇందుకోసం ఏర్పాటు చేసింది ప్రభుత్వం. సాగర్ లోకి వివిధ ప్రాంతాల నుంచి నాలాల ద్వారా వచ్చే మురుగు నీటి వల్ల జల కాలుష్యం జరగకుండా నివారించేందుకు చర్యలు కూడా చేపట్టింది ప్రభుత్వం. హుస్సేన్ సాగర్‌లోకి పోయే 5 నాలాలతో సహా హైదరాబాద్ లో మొత్తం 77 నాలాలున్నాయి. మిగిలిన 72 నాలాలు మూసీ నదిలో కలుస్తాయి. ఇవన్నీ కూడా దారుణమైన నిర్వహణలో వున్నందున వాటిని పరిశుభ్రంగా మార్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.

ప్రతిష్టాత్మకమైన మెట్రో రైలు ప్రాజెక్ట్ హైదరాబాద్ నగరానికి అత్యంత ఆవశ్యకమైన ఆధునిక సదుపాయం. ఉమ్మడి రాష్ట్రంలో నత్తనడకలాగా సాగిన మెట్రో రైలు నిర్మాణ పనులు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత వేగంగా సాగుతున్నాయి. అదొక సమగ్ర ప్రాజెక్టుగా హైదరాబాద్ ప్రజలకు సేవలందించనుంది. నగరంలోని చారిత్రక కట్టడాలు, వారసత్వ ఆస్తులు, ప్రార్థనా మందిరాలు, ప్రజల మనోభావాలతో ముడిపడిన చిహ్నాలు చెదిరిపోకుండా మెట్రో రైలు ప్రాజెక్ట్ నిర్మాణం కొనసాగుతోంది.
చారిత్రక ఆనవాళ్లు చెదిరిపోకుండా హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ స్థాయి ఆధునిక నగరంగా తీర్చిదిద్దాలి. హైదరాబాద్ అద్భుతమైన నిర్మాణ నైపుణ్యంతో కట్టబడిన అపురూపమైన నగరం. నిజాం నవాబులు చార్మినార్, గోల్కొండ, ఫలక్ నుమా, చౌ మహల్లా ప్యాలస్, మక్కా మస్జీద్, సాలార్‌జంగ్ మ్యూజియం, అసెంబ్లీ, హైకోర్ట్ లాంటి అద్భుతమైన భవనాలు నిర్మించి నగరానికి ప్రపంచ ఖ్యాతిని తెచ్చిపెట్టారు. తదనంతరం వచ్చిన పాలకులు ఆ వారసత్వాన్ని కొనసాగించడంలో పూర్తిగా విఫలమయ్యారు. నిజాం నవాబుల అద్భుత నిర్మాణాలకు అదనంగా-అనుబంధంగా మరిన్ని కట్టడాలు తేవాల్సింది పోయి, దానికి బదులుగా నగరాన్ని ఒక రియల్ ఎస్టేట్ వ్యాపార కేంద్రంగా మార్చారు ఆ పాలకులు. అందుకే గత వైభవం ఉట్టిపడేలా నూతన నిర్మాణాలు రావాల్సిన అవసరం వుంది. ఇదొక యూనిక్ సిటీగా రూపాంతరం చెందాలి. దానర్థం హైటెక్ సిటీ లాంటి సాధారణ కట్టడాలు కాదు. ఏ ప్రాంతంలో ఎలాంటి కట్టడం రావాలి? ఎంత విస్తీర్ణంలో ఆ నిర్మాణం జరగాలి? వాటిని ఎలా-ఎందుకోసం ఉపయోగించాలి? అనే అంశాలపై సమగ్ర అధ్యయనం జరగాలని, తదనుగుణంగానే ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి అంటారు. హైదరాబాద్ నగరమంతా ఒకే రకంగా లేదు. వాటి చారిత్రక నేపధ్యం, సామాజిక పరిస్థితుల ఆధారంగా మాత్రమే కొత్త నిర్మాణాలు జరగాలన్నదే ముఖ్యమంత్రి కోరిక. మూసీ నదికి దక్షిణ భాగంలో వున్న పురాతన నగరం, ఉత్తర భాగంలో వున్న నగరం, బంజారా హిల్స్-జూబ్లీ హిల్స్-మాధాపూర్ లాంటి ప్రాంతాలు, పారిశ్రామిక వాడల ప్రాంతాలు, ఐటీ పరిశ్రమ అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలు, మురికివాడలు...ఇలా వేటికవే ఆయా ప్రాంతాల ప్రాధాన్యతలకు అనుగుణంగా అభివృద్ధి చెందాలని అంటారు ముఖ్యమంత్రి. నగరంలో అనేక చోట్ల ఫ్లయ్ ఓవర్లు వున్నప్పటికీ, అవేవీ నగర ట్రాఫిక్ అవసరాలకు అనుగుణంగా లేనందున వాటి స్థానంలో మల్టీ లేయర్ ఫ్లయ్ ఓవర్ల నిర్మాణ ఆవశ్యకత వుందంటారు ముఖ్యమంత్రి.

          భౌగోళికంగా, వాతావరణ పరంగా, సామాజికంగా, హైదరాబాద్ నగరానికి ఒక ప్రత్యేకత వుంది. నగర వాతావరణ సమతుల్యతను కాపాడడం అత్యంత అవసరమని కూడా ముఖ్యమంత్రి అంటారు. నగర పరిధిలో వున్న లక్షకు పైగా అటవీ భూమిని రక్షించుకోవడంతో పాటు, దానిని అందమైన ఉద్యానవనాలుగా తీర్చి దిద్దాలని, లంగ్ స్పేస్ పెంచాలని, పార్కుల కోసం కేటాయించిన స్థలాలను అందుకే ఉపయోగించాలని, వీటన్నిటి పర్యవేక్షణకు పౌర సంఘాలు ఏర్పాటు కావాలని ముఖ్యమంత్రి అంటారు.
ముఖ్యమంత్రి ఆలోచనలకు-ఆదేశాలకు అనుగుణంగా హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ నగరంగా, విశ్వ నగరంగా తీర్చి దిద్దడానికి కార్యాచరణ పథకం రూపుదిద్దుకుంటున్నది. అమలకు రంగం సిద్ధమౌతోంది. అనతి కాలంలోనే భాగ్యనగరం రూపురేఖలు మారనున్నాయి. విశ్వ నగరంగా భాగ్యనగరం కాబోతోంది.End


Monday, July 20, 2015

పర్యాటక-తీర్థ యాత్రా స్థలంగా తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణం కానున్న యాదాద్రి : వనం జ్వాలా నరసింహారావు

పర్యాటక-తీర్థ యాత్రా స్థలంగా 
తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణం కానున్న యాదాద్రి
వనం జ్వాలా నరసింహారావు
{పర్యాటక మకుటంగా యాదాద్రి

నమస్తే తెలంగాణ (27-07-2015)}

          తెలంగాణ రాష్ట్రం, నల్గొండ జిల్లాలోని ఒకనాటి యాదగిరిగుట్ట, నేటి యాదాద్రి నారసింహ దేవాలయం, దాని పరిసర ప్రాంతాల సమగ్రాభివృద్ధికి చెందిన ప్రణాళికా రచన, అమలు చురుగ్గా-వేగవంతంగా సాగుతోంది. అచిర కాలంలోనే, అక్కడున్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం, రాష్ట్రవ్యాప్తంగా-దేశవ్యాప్తంగా అనుదినం వచ్చే లక్షలాది భక్తులతో, పర్యాటకులతో భాసిల్లే పర్యాటక-తీర్థ యాత్రా స్థలంగా రూపు దిద్దుకోనుంది. దేవాలయం, పరిసర ప్రాంతాలలో అభివృద్ధి జరుగనున్న వార్తల నేపధ్యంలో, ఇటీవల కాలంలో భక్తుల-యాత్రీకుల సంఖ్య గణనీయంగా పెరిగింది. వారాంతపు-ఇతర సెలవు దినాలలో, శని-ఆదివారాలలో గత రెండు మూడు నెలలుగా భక్తుల సంఖ్య సుమారు రోజుకు 70, 000 లకు చేరుకుంది. దేవస్థానం ఆదాయం కూడా పెరిగింది. బహుశా ఈ కారణాన నేమో, దేవస్థానం చరిత్రలో మొట్ట మొదటి సారి, ప్రముఖులకు ప్రత్యేక వీఐపీ దర్శనం పద్ధతిని కూడా ప్రవేశ పెట్టారు ఆలయ నిర్వాహకులు. టాటాలు, అంబానీలు, జెన్‌కో, బీహెచె‍ఈఎల్ లాంటి పారిశ్రామిక దిగ్గజాలు సుమారు రు. 500 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టి, దేవాలయ పరిసరాలలో మౌలిక వసతులు కలిగించేందుకు సంసిద్ధత కనబరిచాయి.
            హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిలో, హైదరాబాద్‌కు సుమారు 70 కిలో మీటర్ల దూరంలో వుంది యాదగిరిగుట్ట దేవాలయం. అక్కడికి చేరుకోవడానికి, గుట్ట వరకు బస్ సౌకర్యం, సమీపంలో రైలు సౌకర్యం కూడా వుంది.

          పంచ నారసింహ క్షేత్రంగా పిలువబడే ఇక్కడి అతి పురాతన-పవిత్ర దేవాలయంలో నరసింహ స్వామి ఐదు అవతారాలలో (జ్వాలా నరసింహ, యోగానంద నరసింహ, ఉగ్ర నరసింహ, గండ భేరుండ నరసింహ, లక్ష్మీ నరసింహ) భక్తులకు దర్శనమిస్తాడు. అనునిత్యం వేలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి, అనేక రకాల సంప్రదాయ బద్ధమైన పూజలు చేస్తారు. హిందూ మతానికి అనుగుణంగా అనేక రకమైన వేడుకలు కూడా జరుపుకుంటారు. వీటిలో అన్నప్రాశన, పుట్టు వెంట్రుకలు, అక్షరాభ్యాసం, వివాహాలు మొదలైనవి వుంటాయి. భక్తులు తల నీలాలు సమర్పించుకునే ఆనవాయితీ కూడా వుందిక్కడ. ఈ దేవాలయ ఆవిర్భావం గురించి స్కాంద పురాణంలోను, ఇతిహాసాలలోను పేర్కొనబడింది.

ఫాల్గుణ (ఫిబ్రవరి-మార్చ్) మాసంలో వచ్చే బ్రహ్మోత్సవాలు, వైశాఖ (మే నెల) మాసంలో వచ్చే నరసింహ జయంతి లతో సహా ఎన్నో పండుగలను, ఉత్సవాలను, ప్రతి ఏడు యాదాద్రిలో నిర్వహిస్తారు. లక్ష్మీ నరసింహ స్వామి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రంలో దేవాలయంలో శత ఘటకాభిషేకం జరుపుతారు. ఇలాంటివి జరిగినప్పుడల్లా భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి, దైవ దర్శనం చేసుకుని, ప్రత్యేక పూజలు చేయడం ఆనవాయితీ. ఈ పుణ్య క్షేత్రంలోనే, ఎన్నో సంవత్సరాల పూర్వం, ప్రాముఖ్యత సంతరించుకున్న పెద్ద ఆగమ శాస్త్ర సదస్సు జరిగింది. ఆ సదస్సులో దక్షిణాది ప్రాంతానికి చెందిన అనేకమంది ఆగమ పండితులు పాల్గొని దేవాలయాలలో పాటించాల్సిన పద్దతులను, అనుసరించాల్సిన విధివిధానాలను చర్చించి, వాటిని ఒక క్రమ పద్ధతిలో పొందు పరిచారు. ఈ విషయాన్ని స్వయంగా త్రిదండి చిన జీయర్ స్వామి వెల్లడించారు.

పర్యాటక-తీర్థ యాత్రా స్థలంగా యాదగిరిగుట్టకున్న చారిత్రక ప్రాధాన్యతను గుర్తించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, వాటికన్ సిటీ తరహాలో, అక్కడి దేవస్థానాన్ని-పరిసర ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. దేవాలయానికి సంబంధించినంతవరకు కొన్ని మార్పులు-చేర్పులు చేయాలని కూడా ముఖ్యమంత్రి అదే సందర్భంగా సూచించారు. వీటిలో ప్రధానమైనవి, దేవాలయాన్ని స్వర్ణ తాపడం చేయడం, గోపురం స్పష్టంగా కనిపించే రీతిలో దాని ఎత్తు పెంచడం, యాదగిరిగుట్ట పరిసరాలలో అభివృద్ధికి చాలినంత భూసేకరణ చేయడం, ప్రస్తుతం వున్న స్థలంలో-సేకరించనున్న స్థలంలో కల్యాణ మండపం,వేద పాఠశాల, అభయారణ్యం, సంస్కృత పాఠశాల, ఆలయ అభివృద్ధికి స్వతంత్ర ప్రతిపత్తిగల సంస్థ ఏర్పాటు వున్నాయి. ఈ సూచనలు చేసిన నాడే ఆలయాభివృద్ధికి ఒక ప్రత్యేక అధికారిని కూడా నియమించారు ముఖ్యమంత్రి.

బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటి సారి యాదగిరిగుట్టకు వచ్చి దైవ దర్శనం చేసుకోవడానికి ముందు, ఆ గుట్ట పరిసరాల విషయంలో స్వయంగా ఒక అవగాహనకు వచ్చేందుకుదేవాలయాన్ని ప్రణాళికా బద్ధంగా అభివృద్ధి పరచడానికి ఎలా ముందుకు పోవాలో నిర్ణయించేందుకు, ముఖ్యమంత్రి ఏరియల్ సర్వే చేశారు. దేవాలయ అభివృద్ధిపై అక్కడే సమీక్షా సమావేశం కూడా నిర్వహించారు. గుట్టపై నున్న అస్తవ్యస్త కట్టడాలను తొలగించాలని, కాటేజీలను నిర్మించాలని, పవిత్ర ఆధ్యాత్మిక కేంద్రాలను ఏర్పాటు చేయాలని, ఆగమ శాస్త్రానికి అనుగుణంగా దేవాలయ మండపాన్ని విస్తరించాలని, గుట్టపైన దైవ సంబంధమైన కార్యక్రమాలు మాత్రమే జరిగేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. ఇవే కాక, దూరంనుంచి కూడా భక్తులకు దేవుడు కనిపించే విధంగా గర్భగుడిని ఉత్తర దిశగా, ఆగమ శాస్త్ర పండితుల సలహా మేరకు, విస్తరించాలని ఆయన అన్నారు. గుట్టపైన, అతి పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహాన్ని, గరుత్మంతుడి విగ్రహాన్ని నెలకొల్పడానికి అనువైన స్థలాలను ఎంపిక చేయాలని కూడా అయన సూచించారు. గుట్ట చుట్టూ భక్తులు గిరి ప్రదక్షిణ చేయడానికి అనువుగా స్థల సేకరణ, రహదారి ఏర్పాటు జరగాలని అన్నారు.

దరిమిలా, ముఖ్యమంత్రి సూచన మేరకు-ఆదేశాల మేరకు, 13 మంది సభ్యులతో, ముఖ్యమంత్రి  చంద్రశేఖర్ రావు చైర్మన్‌గా, దేవాలయ ప్రత్యేకాధికారి కిషన్ రావు ఉపాధ్యక్షుడిగా, యాదగిరిగుట్ట దేవాలయ అభివృద్ధి అథారిటీ ఏర్పడింది. ఇందులో స్థానిక ఎంపీ, ఆలేరు, భువనగిరి ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్, జిల్లా పోలీస్ సూపరింటెండెంట్, ఇతరులు సభ్యులుగా వుంటారు. యాదగిరిగుట్ట, దాని పరిసరాల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ పథకాన్ని రూపొందించాల్సిన అవసరం దృష్ట్యా, చుట్ట పక్కలున్న ఆరు గ్రామాలను కూడా అభివృద్ధిలో భాగంగా కలిపింది ప్రభుత్వం. అభివృద్ధి ప్రణాళికలో భాగంగా రాయగిరి దగ్గరున్న చెరువును అందంగా తీర్చి దిద్దాలని, భువనగిరి-యాదగిరిగుట్ట మధ్యలో నాలుగు లేన్ల రహదారి నిర్మించాలని, గుట్టకు నాలుగు దిక్కుల వున్న వంగపల్లి, తుర్కపల్లి, రాయగిరి, రాజుపేట రహదారులను కూడా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. భూ సేకరణకు లేదా కొనుగోలుకు, ఇతర సంబంధిత అభివృద్ధి పనులకు చేయాల్సిన ఖర్చు కొరకు రు. 100 కోట్లను యాదగిరిగుట్ట దేవాలయ అభివృద్ధి అథారిటీ అకౌంట్‌లో జమ చేసింది ప్రభుత్వం. ఆగమ శాస్త్ర-వాస్తు నిబంధనలకు అనుగుణంగా, దేవాదాయ-ధర్మాదాయ శాఖ స్థపతిల సలహా మేరకు, అభివృద్ధికి కావాల్సిన డిజైన్లను తయారు చేసేందుకు, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయిని నియమించింది అథారిటీ.

ప్రసిద్ధ ఆధ్యాత్మిక గురువు, శ్రీ శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చిన జీయర్ స్వామితో కలిసి, ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఒకసారి యాదగిరిగుట్టపై ఏరియల్ సర్వే నిర్వహించారు. యాదగిరిగుట్టతో పాటు, ప్రభుత్వం అభివృద్ధి చేయదల్చుకున్న గుట్ట చుట్టుపక్కల ప్రదేశాలను కూడా వారిరువురు పరిశీలించారు. యాదగిరిగుట్టకు దారితీసే రాయగిరి, వంగపల్లి, తుర్కపల్లి, రాజుపేట మార్గాలను కూడా ముఖ్యమంత్రి జీయర్ స్వామికి చూపించారు. అక్కడా చేపట్టదలచిన పనులను కూడా ఆయనకు వివరించారు. ఇద్దరు కలిసి దేవాలయ ప్రాంగణం మొత్తం కలియతిరిగారు. అక్కడి అణువణువును పరిశీలించారు. తన ఆలోచనలను, దేవాలయంలో తలపెట్టిన మార్పులను జీయర్ స్వామికి వివరించారు ముఖ్యమంత్రి. ఆలయ నిర్మాణ రూప శిల్పులు, స్థపతి, వేద పండితులు, దైవ క్షేత్రాల నిర్మాణ-నిర్వహణలో అనుభవజ్ఞులైన వారి సలహాలు-సూచనల మేరకు తాత్కాలికంగా రూపొందించిన డిజైన్లను జీయర్ స్వామికి ముఖ్యమంత్రి చూపించారు. అవి చాలా బాగున్నాయని, ఆగమ శాస్త్ర నిబంధనలకు, వైదిక ఆచారాలకు-సాంప్రదాయాలకు అనుగుణంగా వున్నాయని స్వామి అభినందించారు. ఆధ్యాత్మిక కేంద్రాలుగా రూపు దిద్దుకోనున్న యాదగిరిగుట్టతో పాటు చుట్టూ వున్న నవ గిరులకు నామకరణం చేయాల్సిందిగా జీయర్ స్వామిని కోరారు ముఖ్యమంత్రి. యాదగిరిగుట్టకు యాదాద్రిగా నామకరణం చేసిన స్వామి, మిగతా వాటికి త్వరలోనే పేర్లు పెడతామన్నారు. యాదగిరిగుట్టకోసం ముఖ్యమంత్రి చేస్తున్న ప్రయత్నాలను అభినందించిన జీయర్ స్వామి, తెలంగాణ రాష్ట్రంలో ఆధ్యాత్మిక ఉద్యమాన్ని ప్రారంభించిన వ్యక్తిగా ముఖ్యమంత్రిని ప్రశంసించారు.

ఈ నేపధ్యంలో, ముఖ్యమంత్రి ఆదేశాలకు-సూచనలకు అనుగుణంగా యాదాద్రి దేవస్థానం, యాదగిరిగుట్ట-పరిసర ప్రాంతాల అభివృద్ధి పనులు వేగవంతంగా-త్వరితగతిన పూర్తి చేయడానికి సంబంధిత అధికారులు చర్యలు చేపట్టారు. 943 ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించడంతో పాటు, మరో 100 ఎకరాలు సేకరించి, మొత్తం 1000+ ఎకరాల భూమిని ఆలయ అభివృద్ధికి వినియోగించనున్నారు. 2014-2015, 2015-2016 ఆర్థిక సంవత్సరాలకు కలిపి మొత్తం రు. 200 కోట్ల బడ్జెట్ ను యాదగిరిగుట్ట దేవాలయ అభివృద్ధి అథారిటీకి కేటాయించింది ప్రభుత్వం. 180 ఎకరాల విస్తీర్ణం గల యాదగిరిగుట్ట స్థలాన్ని సమర్ధవంతంగా ఉపయోగించుకునేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. గుట్ట చుట్టూ తిరగడానికి గిరి ప్రదక్షిణ రోడ్ ను ఏర్పాటు చేయనున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు, అభివృద్ధిలో భాగంగా, గుట్ట ప్రాంతమంతా నాలుగు లేన్ల రహదారి ఏర్పాటుతో పాటు, రోడ్ డివైడర్లు, ఫుట్ పాత్ లు, ఐ లాండ్లు నిర్మించనున్నారు. ఆ ప్రాంతమంతా అందమైన చెట్లతో ఆహ్లాదకరంగా అలరారనున్నది. భక్తి భావన పెంపొందే విధంగా, గుట్ట ప్రాంతమంతా మారుమోగే సౌండ్ సిస్టమ్ ఏర్పాటు జరుగనుంది. సుమారు 1,000 ఎకరాల చుట్టుపక్కల స్థలాన్ని జోనింగ్ చేసి, లే అవుట్లు సిద్ధం చేయడానికి చర్యలు చేపట్టారు. యాదాద్రి సమీపంలో వున్న బస్వాపూర్ చెరువును రిజర్వాయర్‌గా మార్చి, అక్కడ బోటింగ్, వాటర్ గేమ్స్ ఏర్పాటు చేయబోతున్నారు.

యాదాద్రి గుట్టపై వున్న 15 ఎకరాల భూమిలో ప్రధాన గుడి కింద వచ్చే 5 ఎకరాలలో ప్రాకారం, మాడ వీధుల నిర్మాణం జరుగుతుంది. దేవాలయ ప్రాంగణంలోనే లక్ష్మీ నరసింహ స్వామి 32 రకాల ప్రతిమలు ఏర్పాటు కానున్నాయి. దేవుడి ప్రసాదాలు తయారుచేసే వంటశాల, అద్దాల మందిరం ఇక్కడే నిర్మిస్తారు. యాదాద్రి పైనే, పుష్కరిణి, కల్యాణ కట్ట, అర్చకులకు వసతి-నివాస గృహాలు, రథ మండపం, క్యూ కాంప్లెక్స్, విఐపి గెస్ట్ హౌజ్, విఐపి పార్కింగ్ స్థలం నిర్మించనున్నారు. యాదాద్రి కింది భాగంలో ఉద్యానవనం, కాటేజీలు, బస్ స్టాండ్, కళ్యాణ మండపం, షాపింగ్ కాంప్లెక్స్, స్వామివారి పూజకు వినియోగించే పూల చెట్లతో కూడిన ఉద్యానవనం, యాత్రీకులకు వసతి కేంద్రాలు, గోశాల, అన్నదానం కోసం భోజన శాల, హెలిపాడ్ నిర్మించనున్నారు. గుట్ట కింద కూడా వివాహాలు చేసుకునేందుకు కల్యాణ మండపాలు కట్టే ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం వున్న పున్నమి గెస్ట్ హౌజ్ ను ఆధునీకరించి, మరింత వసతి సదుపాయం కలిగించనుంది అథారిటీ. యాదాద్రి సమీపంలోని 11 ఎకరాల స్థలంలో మూడు గెస్ట్ హౌజ్ ల నిర్మాణం కూడా జరుగనుంది. పాత యాదగిరిని దర్శించుకునేందుకు సౌకర్యం కూడా కలిగించనుంది ప్రభుత్వం.


అచిర కాలంలోనే యాదాద్రి-యాదగిరిగుట్ట ఒక ప్రసిద్ధి గాంచిన పుణ్య క్షేత్రంగా, యాత్రా స్థలంగా రూపు దిద్దుకోనుంది. End

Saturday, July 18, 2015

Yadadri to become the tourist and pilgrimage Pride of Telangana State:Vanam Jwala Narasimha Rao

Yadadri to become the tourist and pilgrimage
Pride of Telangana State
Vanam Jwala Narasimha Rao

Integrated Development of Yadadri earlier known as Yadagirigutta in Nalgonda District of Telangana State is expeditiously in progress. In few months from now, the famous Lakshmi Narasimha Swami Devasthanam there would become the most sought after tourist and pilgrimage centre attracting Lakhs of devotees from all corners of state and country every day. There are already indications of increase in the pilgrims. The temple had started receiving over 50,000 pilgrims on weekends. The number of pilgrims visiting the temple had touched 70,000 on Sundays in May and June this year. There was a spurt in income of Temple. This may be attributed to various measures initiated by State government to develop the temple. In tune with this for the first time in its history, the administration of Temple has introduced break Darshanam for visiting VIP devotees on weekends. Top industrial companies like Tatas, Ambanis, GENCO and BHEL had evinced keen interest in investing up to Rs. 500 Crore in creation of infrastructure in the temple town Yadagirigutta.

Yadagirigutta is about 70 Kilometres from Hyderabad on the Hyderabad-Warangal Highway.

In this ancient holy shrine known as Pancha Narasimha Kshetram, Lord Narasimha had come into existence in Five Avatars, namely, Jwala Narasimha, Yogananda Narasimha, Ugra Narasimha, Gandaberunda Narasimha and Lakshmi Narasimha. Daily thousands of devotees visit this divine temple, offer prayers and perform rituals and ceremonies like Annaprasanna, Puttu Ventrukalu, Aksharabhyasam, Marriages etc. There is a mention about the origin of this temple in the Skanda Purana besides a Pouranic and traditional background.



Brahmothsavams during the months of February-March (Phalguna), Narasimha Jayanthi in the month of May (Vaishakha) and many more festivals are celebrated in the temple every year. On Every Swati Nakshatra which is also the Birth Star of Lord Lakshmi Narasimha Swami, Satha Ghatabhishekam is performed. For all these celebrations, devotees in large numbers visit the temple and have a Darshanam of Lord Laxmi Narasimha Swami. According to China Jeeyar Swami, it was here in this temple premises, many years ago, a leading Agama Conference was held in which several pundits of Agama Sastra from southern India participated and deliberated on temple procedures.

Realizing the historical importance of pilgrim center Yadagirigutta, Chief Minister K. Chandrashekhar Rao directed the concerned officials to prepare master plans for developing the temple on the lines of Vatican City. CM also hinted at some changes like gold plating the entire temple, elevating the height of the Gopura, acquisition of adequate land around Yadagirigutta for creating amenities and facilities like Kalyana Mandapam, Vedic School, and a reserve forest on Lord’s name as well as formation of an autonomous body for the temple town on the lines of Tirupati.



During his maiden visit to Yadagirigutta after becoming CM he offered prayers at the shrine preceded by an aerial survey around Yadagirigutta to personally acquaint with the surroundings for putting forth his ideas for development. Later CM suggested creating amenities like construction of cottages, development of spiritual centers and expansion of temple Mandapam etc. CM further suggested extending the Sanctum Sanctorum to the north side to make the presiding deity visible to devotees from distance, in consultation with Agama Sastra Pundits. CM also wanted to find a suitable place on the hill shrine to install the highest Anjaneya Swami Idol and Lord Garuda Idol besides preparing a plan to lay proper way around Yadagirigutta hill to provide a safer way for Giripradakshanam for devotees.



Yadagirigutta Temple Development Authority (YTDA) with 13 members headed by Chief Minister as Chairman was constituted. Special Officer Yadagirigutta G. Kishan Rao has been nominated as Vice-Chairman of the authority with Local MP, MLAs of Alair and Bhongir, District Collector and SP and others as members. As the surroundings of the Yadagirigutta temple require a special planning and development control, six villages abutting the temple have been included in the development authority for its orderly development. CM also wanted the temple authority to include beautification of tank at Rayagiri and four-laning of Bhongir-Yadagirigutta stretch in the development plan. A special grant of Rs 100 crores was credited initially to the Account of YTDA to meet the expenditure on land acquisition and other connected activities. Art Director Anand Sai has been appointed to prepare designs strictly in accordance with Agama Sastra and Vaastu in consultation with Stahapathis of Endowments department.



Chief Minister visited the temple once with spiritual leader Tridandi Srimannarayana Ramanuja China Jeeyar Swami with whom he undertook an aerial survey. In addition to Yadagirigutta, CM had also shown him the adjoining hills and also the roadway leading to Yadagirigutta namely Rayagiri, Vangapalli, Turkapalli and Rajupeta as well as the plans of proposed works there. They together inspected the temple where government planned major changes. Tentative designs prepared with expert suggestions from pundits were shown to the Jeeyar swami who praised the proposals as they were in line with Agama Sastras, Vedic traditions and conventions. It was only during this visit China Jeeyar Swami renamed Yadagirigutta as Yadadri on the request of CM. Jeeyar Swami also said that the remaining eight adjoining hills will be renamed later. Together, all these nine hills would be developed as spiritual centres. Jeeyar Swami was all praise for CM for his keen interest to develop Yadagirigutta and said that he is spearheading a spiritual movement in Telangana State.



Against this background and in accordance with the instructions of Chief Minister, development works of Yadadri and Yadagirigutta surroundings are being expedited in a big way. 943 acres of land has already been identified for works and in successive budgets of 2014-2015 and 2015-2016 financial years, Rs. 200 Crores has been allocated to the development authority. In addition another 100 acres is being acquired and together these 1000+ acres would be developed. The Yadagirigutta area which comprises of about 180 acres is being effectively and judiciously utilized. A road round the hill is being developed for Giripradakshanam. As per the instructions of CM there would be four lanes around the hill and each road will have dividers, islands and footpath. The area would be abounding with trees. Sound system would be developed to promote religious fervor. About 1,000 acres around the hill would be converted into zones and layout to be prepared. The nearby tank at Basavapur will be converted into a reservoir with water games and boating facilities.



Out of the 15 acres of land available on the hill about 5 acres would come under the main temple area. In these five acres compound wall and Mada streets would be built. The 32 forms of the presiding deity Laxmi Narasimha swami should be reflected in the form of models in the temple precincts. A kitchen and glasshouse would be constructed. Pushkarini, Kalyanakatta, residences for priests, Rathamantapam, queue complex, Gardens, cottages, VIP Guesthouse, parking places, cowshed, dining hall etc would come up. At the foot of the hill bus stands, Kalyana Mandapam, Shopping Complex, flower garden for prayers, lodging facilities, cottages etc. are expected to come. The existing Punnami guest house will be modernized and three more Guest Houses in the eleven acres available near Yadadri will be constructed. Facilities will also be created to visit the old Yadagirigutta also.



Ultimately Yadadri or Yadagirigutta will become one of the famous shrines of India.