Monday, August 29, 2016

అంతర్ రాష్ట్ర జల ఒప్పందాల నూతన ఒరవడి : వనం జ్వాలా నరసింహారావు

అంతర్రాష్ట్ర జల ఒప్పందాల్లో నూతన ఒరవడి
వనం జ్వాలా నరసింహారావు

ఆంధ్రజ్యోతి దిన పత్రిక (03-09-2016)

ఆంధ్ర భూమి దినపత్రిక (02-09-2016)

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర  రావు, మహారాష్ట్ర ప్రభుత్వం పక్షాన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, మూడు అంతర్ రాష్ట్ర జల ఒప్పందాలపై 2016 ఆగష్టు 23న సంతకాలు చేయడంతో ఒక నూతన ఒరవడికి శ్రీకారం చుట్టినట్లయింది. పెన్ గంగ, ప్రాణహిత, గోదావరి నదులపై, చనాఖా-కోరటా, తుమ్మిడిహట్టి, మేడిగడ్డ ప్రాజెక్టుల వద్ద బారేజీల నిర్మాణానికి మార్గం సుగమమైంది.   ప్రాణహిత పై తుమ్మిడిహట్టి బారేజీ ద్వారా ఆదిలాబాద్ జిల్లాలో 148 మీటర్ల సామర్థ్యం కలిగిన పూర్తిస్థాయి రిజర్వాయరు, కరీంనరగ్ జిల్లాలో మేడిగడ్డ వద్ద గోఫ్దావరి నదిపై 100 మీటర్ల సామర్థ్యం కలిగిన పూర్తి నీటి స్థాయి రిజర్వాయరు, ఆదిలాబాద్ జిల్లాలో పెన్ గంగ నదిపై చనాఖాకోరటా రిజర్వాయరు వల్ల  213 మీటర్ల పూర్తి స్థాయి రిజర్వాయరు నిర్మాణం కానున్నాయి. ఒప్పందంలో భాగంగానే, మేడిగడ్డ వద్ద నిర్మించనున్న రిజర్వాయర్ ఎత్తును మరో మీటరు ఎత్తుకు పెంచే అవకాశాన్ని, అవసరాన్ని- ఆవశ్యకతను పట్టి పరిశీలించాలని నిర్ణయించారు. ఈ మూడు రిజర్వాయర్ల నీటి నిల్వ సామర్థ్యం 1.8 టిఎంసీలు, 16.17 టిఎంసీలు, 0.85 టిఎంసిలు. గోదావరి నీటి నుండి తెలంగాణాకు కేటాయించిన 950 టిఎంసీల నీటి నుండి 200 టిఎంసీల నీటిని వినియోగించుకునే విధంగా  రిజర్వాయర్ల నిర్మాణం జరుగుతుంది. ఈ బ్యారేజీల ద్వారా రాష్ట్రంలో రమారమి 40 లక్షల ఎకరాలకు సాగునీరందించేందుకు వెసులు బాటు కలుగుతుంది. చారిత్రాత్మకమైన ఈ ఒప్పందాల ద్వారా ప్రధానంగా ప్రస్తుత ఆదిలాబాద్ జిల్లాకు గణనీయంగా లాభం కలుగుతుంది

            తెలంగాణ, మహారాష్ట్ర ముఖ్యమంత్రుల నేతృత్వంలో మార్చి 8, 2016న గోదావరి ప్రాజెక్టులపై  అంతర్ రాష్ట్ర నీటి బోర్డును ఏర్పాటు చేసే అంశంపై అవగాహన పత్రాలపై సంతకాలు జరిగిన నాడే మొన్న జరిగిన ఒప్పందాలకు బీజం పడింది. తద్వారా దశాబ్దాల కాలంగా బారేజీల నిర్మాణం విషయంలో చోటుచేసుకున్న అనవసర జాప్యానికి, అంతర్ రాష్ట్ర జల వివాదానికి తెరపడి, గోదావరి తదితర ఉప నదుల జల వినియోగానికి శ్రీకారం చుట్టబడింది. ఈ ఒప్పందాలను ఒక చారిత్రాత్మక  ఘట్టంగా, కేంద్ర ప్రభుత్వం జోక్యం లేకుండా, కోర్టులను, ట్రిబ్యునల్స్ ను ఆశ్రయించకుండా, దశాబ్దాల కాలంగా నలుగుతున్న సమస్యకు అవగాహన ఒడంబడిక ఒక చరమ గీతం పలికినట్లుగా, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సంతకాల అనంతరం పేర్కొనడం విశేషం.

            నేడు ప్రపంచం వ్యాప్తంగా చోటుచేసుకుంటున్న పరిణామాల నేపధ్యంలో, ప్రత్యేకించి, మరీ ముఖ్యంగా జలవనరుల వినియోగం విషయంలో, ఇరుగు-పొరుగున వున్న వివిధ దేశాల మధ్య స్నేహ సంబంధాలు పెంపొందించుకునే దిశగా జరిగిన అనేక ఒడంబడికల నేపధ్యంలో, అప్పటి మహారాష్ట్ర ప్రభుత్వ పాలకులు గానీ, పూర్వ ఆంధ్రప్రదేశ్ పాలకులు గానీ ఏ విధమైన ఆలోచన చేయకపోవడం, చొరవ చూపకపోవటం విచారకరం. వాస్తవానికి అప్పట్లో అటు కేంద్రంలోనూ, ఇటు ఉభయ రాష్ట్రాలలోనూ వున్నది కాంగ్రెస్ ప్రభుత్వాల పాలనే!  అలాగే పెన్ గంగ, ప్రాణహిత, గోదావరి నదులపై తలపెట్టిన ప్రాజెక్టుల విషయంలో అంతర్ రాష్ట్ర వివాదాలు అనేకం చోటు చేసుకున్నా వాటి పరిష్కారానికి ఏ విధమైనా చర్య తీసుకోలేదు. క్రమేపీ సమస్యలు పరిష్కారం కాకపోగా మరింత జటిలం కాసాగాయి.

ఒక మోడల్ డాక్యుమెంటుగా పేర్కొనాల్సిన ఈ అవగాహన ఒడంబడికలో, భవిష్యత్ లో, బారేజీల నిర్మాణ క్రమంలో ఇరు రాష్ట్రాలు చేయాల్సిన, చేయకూడని పలు అంశాలు పొందుపరచడం జరిగింది. ప్రామాణికతలకు అనుగుణంగా పొందాల్సిన అనుమతులు, చేపట్టవలసిన చర్యలు, వరద నీటి సంబంధమైన అధ్యయనాలు, భూసేకరణలు, ప్లడ్ బ్యాంక్ ల నిర్మాణం, నీటి సామర్థ్యం పరీక్షలు, ఖర్చులు, నీటి బట్వాడా, తాగునీటి అవసరాలు, మత్స్యకారుల సమస్యలు, నావిగేషన్ హక్కులు లాంటివి ఇందులో ప్రధానంగా వున్నాయి. ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు ఒడంబడిక మేరకు పనులను వేగవంతం చేసి బారేజీల త్వరితగతి నిర్మాణానికి దోహదపడే చర్యలు చేపట్టాలని కూడా ఒప్పందంలో పొందుపర్చడం జరిగింది.


          ఇరుగు పొరుగున వున్న రాష్ట్రాలు కాని, దేశాలు కాని, సమర్ధవంతంగా, సక్రమంగా జలాలను పంచుకునే విషయంలో దౌత్యం-రాజనీతి ప్రధానమనేది ప్రపంచ వ్యాప్తంగా అనుభవం నేర్పిన పాఠంఅంతర్జాతీయంగా చరిత్రను నిశితంగా పరిశీలించినట్లయితే జలాల విషయంలో ప్రపధమ ఒప్పందం క్రీస్తు పూర్వం 2500 లో మొదలయింది. అప్పట్లో నిరంతరం విభేదించుకుంటున్న మెసపోటేమియా పట్టణాలురాష్ట్రాలైన , లగాష్, ఉమ్మా ప్రాంతాలు తొలి సంధి సంతకాలు చేపట్టడం ద్వారా టైగ్రిస్ నది నీటి వినియోగ పంపకాలకు ఆస్కారం కలిగింది. ఆ క్రమంలో దరిమిలా రమారమి 3600 జలవనరుల ఉపయోగ ఒడంబడికలు అంతర్జాతీయంగా చేపట్టడం జరిగింది. ఎన్ని విభేదాలు చోటు చేసుకున్నప్పటికీ, యుద్ధాలు జరిగినప్పటికీ సంబంధిత దేశాలురాజ్యాలు, అందుకు బద్దులై ఆయా సంధి ఒడంబడికలను తుచ తప్పక పాటించటం పరిపాటయిందిఇందుకు చక్కని మచ్చుతునక ఇండస్ రివర్ కమిషన్”. ఈ  రివర్ కమిషన్ ఏర్పాటు అనంతరం భారత పాకిస్థాన్ ల మధ్య మూడు మార్లు యుద్ధాలు జరిగినప్పటికి నిలదొక్కుకోగలిగింది. ఇప్పటికీ నిరంతరాయంగా సంప్రదింపులు, స్వల్ప సమస్యల పరిష్కార చర్యలు, సమన్వయం, పర్యవేక్షత, గణాంకాల పరిశీలనల ద్వారా కొనసాగింపబడుతోంది.

            భారత పాకిస్థాన్ దేశాల మధ్య జరిగిన జలదౌత్య ఒప్పందం అంతర్జాతీయ ఒప్పందాలలో అత్యంత ప్రనుఖమైందిగా పేర్కొంటారుబ్రిటిష్ ఇండియా పునర్విభజన నేపధ్యంలో ఇండస్ బేసిన్ లో ఎక్కువ స్థాయిలో జలాలు ఉండటం వివాదాలకు దారితీసింది. అప్పటి నూతన దేశాలు జల వినియోగం, సాగునీటి అవసరాల సర్దుబాట్లు ఏ విధంగా చేపట్టాలి అన్న దిశలో మొదట్లో ఏక పక్షంగా వ్యవహరించాయి. ఏది ఏమైనప్పటికి ఇండస్ వాటర్స్ ట్రీటీగా పేర్కోనబడ్డ జలదౌత్యం ప్రపంచ బ్యాంక్ ద్వారా  భారత, పాకిస్థాన్ దేశాల మధ్య కరాచీలో సంధి పత్రాలపై సంతకాలు చేసుకోవడానికి ఊతమిచ్చింది. నాటి భారత ప్రధాని దివంగత పండిట్ జవహర్ లాల్ నెహ్రూ, నాటి పాకిస్థాన్ అధ్యక్షులు దివంగత ఆయూబ్ ఖాన్ లు సెప్టెంబర్ 19, 1960లో సంతకాలు చేశారు. ఈ జల సంధి ఒడంబడిక ద్వారా తూర్పున ఉన్న బీస్ నది, రవి, సట్లెజ్ నదుల నియంత్రణ భారతదేశానికి, పడమటి దిక్కున వున్న ఇండస్, భిసాబ్, జేలమ్ నదుల నియంత్రణ పాకిస్థాన్ కు అప్పజెప్పటం జరిగింది. పాకిస్థాన్ నదులు తొలుత భారతదేశం మీదుగా ప్రయాణిస్థాయి కాబట్టి సంధిలో మన సాగునీటి అవసరాల వినియోగానికి, ప్రయాణానికి, విద్యుత్ అవసరాలకు అనుమతించడం జరిగింది. దరిమిలా 1960లో జరిగిన ట్రీటీ రాటిఫికేషన్ద్వారా  భారత, పాకిస్థాన్ దేశాల మధ్య నీటి యుద్ధాలకు పూర్తిగా ముగింపు పలికినట్లయింది.

ఇదే తరహాలో ఇంకో చక్కని ఉదాహరణగా చెప్పుకోదగ్గ విషయం భారత బంగ్లాదేశ్ ల మధ్య జరిగిన గంగా నదీ జలాల వినియోగ ఒప్పందం. ఇరు దేశాల మధ్య పారే గంగానది ఉత్తర భారతం నుండి బంగ్లాదేశ్ కు ప్రవహిస్తుంది. ఈ విషయంలో 35 సంవత్సరాల పాటు వివాదం చోటు చేసుకుంది. పలు రకాల అంతర్గత ఒడంబడికలు, సంప్రదింపులు పరిష్కారం చూపలేకపోయాయి. క్రమేణా సమగ్రమైన అంతర్గత సంధి ఒడంబడికకు సంబంధించిన సంతకాలు అప్పటి భారత ప్రధాన హెచ్. డి. దేవేగౌడ, నాటి బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా వాజేద్ ల మధ్య డిసెంబర్ 12,  1996న  ఢిల్లిలో జరిగాయి. ఈ సంధి వల్ల 30 సంవత్సరాల సమస్యకు, జల పంపకాలకు ఒక అవగాహన కుదిరి గుర్తింపు పొందిన బంగ్లాదేశీయ హక్కుల ఆధారంగా  లోవర్ లెవెల్ రిపారియన్పేరుతో పంపకం జరిగింది.

విజయవంతంగా నీటి వినియోగం, పంపకం, సర్దుబాట్లు అన్నవి ముఖ్యంగా నిర్దేశిత ప్రామాణికతలపై, కట్టుబాట్లపై, సమగ్ర సంప్రదింపులపై ఆధారపడతాయి. పరస్పర సహకారం, సక్రమ వినియోగం, సరైన ఆలోచనలతో కూడిన అవగాహన ఒడంబడికలు దీర్ఝకాలం మనుగడ సాగేందుకు దోహదపడతాయి. వీటిన్నింటి సమ్మిళితమే తెలంగాణ మహారాష్ట్ర మధ్య జరిగిన ఒడంబడిక. ఈ దిశా నిర్దేశాలను తూచా తప్పకుండా పాటించటంలో ఇరు రాష్ట్రాలూ విజయం  సాధించాయి. భవిష్యత్ లో ఇతరులకు మార్గదర్శికంగా కూడా వుండబోతున్నాయి.  

భారత దేశంలో అనేక నదులు అంతర్ రాష్ట్రంగా పారుతుంటాయి. కొన్ని నదులు ఒక రాష్ట్రానికే పరిమితం కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ పారుతుంటాయి. నీటి అవసరాలు పెరుగుతున్న నేపథ్యంలో అంతర్ రాష్ట్ర కలహాలు ఏర్పడుతూ ఉంటాయి. ముఖ్యంగా నీటి పంపకాల విషయంలో ఇది పరిపాటిఇందుమూలంగానే 1956లో  ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ట్రిబ్యూట్ యాక్ట్”  పేరుతో ఆర్టికల్ 262 లో పేర్కోన్న విధంగా భారత  రాజ్యాంగం రూపొందించింది. భాషా ప్రయుక్త  రాష్ట్రాల ఏర్పాటు నేపధ్యంలో జల వివాదాలు తలెత్తిన  పక్షంలో  తగు చర్యలు తీసుకోవటం కొరకు ఈ చట్టాన్ని తెచ్చారు. తద్వారా నీటి వినియోగం, అంతర్ రాష్ట్ర సర్దుబాట్లు చేయాలన్న ఆలోచన జరిగింది. ఈ చట్టంలో అనేక మార్పులు కూడా కాలానుగుణంగా చోటు చేసుకున్నాయి. ఈ చట్ట్ర ప్రకారం ఎగువ ప్రాంతాలు, దిగువ ప్రాంతాలు వాటి సమస్యలు అన్నవి పరిష్కరించటం అన్నవి ఒక అంశం.

కాకపోతే ఎంతమేరకు ఈ చట్టం వల్ల అంతరాష్ట్ర సమస్యల పరిష్కారం జరిగింది అన్నది చర్చనీయాంశం. నిజంగా ఆ చట్ట్రమే సక్రమంగా అమలయినట్లయితే గోదావరి నదిపై మహారాష్ట్ర ప్రభుత్వం 450 పైగా బ్యారేజీలను, చెక్ డ్యాంలను నిర్మించడం సాధ్యపడేదా? కేంద్ర ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ట్రిబ్యూట్ యాక్ట్”  ద్వారా చేయలేని పని దౌత్య నీతి ద్వారా, రాజనీతి ద్వారా తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు చేయగలిగారు. ఫలితంగానే   మహారాష్ట్ర - తెలంగాణల మధ్య ఒడంబడిక జరిగింది.. ఇతర రాష్ట్రాలకు మార్గగామిగా నిలబడగలిగింది.

          తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ల మధ్య కుదిరిన బారేజీల నిర్మాణాల ఒప్పందాలు, చరిత్ర పుటల్లో సువర్ణాక్షారాల్లో లిఖించబడతాయి అనటంలో సందేహం లేదు. ఇది  ప్రప్రధమ అంతర్జాతీయ ఒప్పందమైన "లగాష్ ఉమ్మా ట్రీటీ", భారత పాకిస్థాన్ ల మధ్య జరిగిన ఇండస్ వాటర్స్ ట్రీటీ”, భారత్ బంగ్లాదేశ్ ల మధ్య జరిగిన గేంజెస్ రివర్ వాటర్స్ ట్రీటీ లకు ధీటుగా చరిత్ర పుటల్లోకి ఎక్కుతుందని అనడంలోనూ అతిశయోక్తి లేదేమో! End


Thursday, August 25, 2016

Historic Pact among inter-state agreements : Vanam Jwala Narasimha Rao

Historic Pact among inter-state agreements
Vanam Jwala Narasimha Rao
Metro India (26-08-2016)

Government of Telangana represented by none other than its Chief Minister K Chandrashekhar Rao signed three agreements with Maharashtra Government represented by its Chief Minister Devendra Fadnavis on 23rd August 2016 paving way for constructing three barrages across Penganga, Pranahita and Godavari rivers at Chanakha-Korata, Tambhidihatti and Medigadda respectively. Barrage across Pranahita at Tambhidihatti in Adilabad district will be of 148-metre full reservoir level (FRL), at Medigadda in Karimnagar across the Godavari will be of 100-metre FRL and at Chanakha-Korata in Adilabad across Penganga river will be of 213-metre FRL. However the design for the barrage at Medigadda shall provide for further scope of increasing barrage height by one more meter and the final decision of raising the height will be taken by the Inter-State Board after experiencing the actual submergence.

The capacity of the barrages designed at the three places is 1.8 TMC feet, 16.17 TMC feet and 0.85 TMC feet, respectively and utilization of about 200 TMC feet water out of allocated share of 950 TMC feet for Telangana in Godavari waters. About 50 lakh acres would be brought under irrigation through these barrages. Present Adilabad district will be the major beneficiary of the historic agreement.

Earlier on 8th March 2016 Chief Ministers of Telangana and Maharashtra signed a Memorandum of Understanding (MoU) at Mumbai on setting up an Inter-State water board on Godavari projects, ending decades of discord between the two States on utilization of water in the River Godavari and its tributaries. The move may be described as first of its kind in this direction. The two Chief Ministers termed the signing of MoU as historic event, since they resolved water disputes lingering on for decades without the intervention of the Center, tribunals or courts.

At an era when neighboring countries could have good relations and could sign agreements, an agreement of this was never conceived either by earlier Maharashtra or erstwhile Andhra Pradesh governments and the projects across Penganga, Pranahita and Godavari rivers ended up in inter-state dispute, even though same party governments were in office not only in both the states but also at center. The agreement signed by both the CMs has in it number of clauses similar to dos and don’ts, like obtaining statutory clearances, carrying out flood studies, land acquisition issues, construction of flood banks, monitoring water levels, cost and water sharing, drinking water needs, fishing and navigation rights etc. Both the governments will as per the agreement initiate necessary actions for completion of the barrages.


Experience reveals that complexity of water sharing problems all over the world can be better handled diplomatically. The history of international water treaties dates as far back as 2500 BC, when the two warring city-states of Mesopotamia, Lagash and Umma, signed the first ever recorded treaty ending a prolonged water dispute along the Tigris River. Since then more than 3,600 treaties related to international water resources have been drawn up. A number of these agreements remained intact despite wars and conflicts between the nations concerned. The best example is, the Indus River Commission that survived two wars between India and Pakistan. The Permanent Indus Commission has survived three wars and provides an ongoing mechanism for consultation and conflict resolution through inspection, exchange of data and visits.

The treaty between India and Pakistan is considered to be one of the most successful water sharing endeavors in the world even today. The partition of British India created a conflict over the plentiful waters of the Indus basin. The newly formed states were at odds over how to share and manage what was essentially a cohesive and unitary network of irrigation. The Indus Waters Treaty between India and Pakistan initiated by the World Bank was signed in Karachi on September 19, 1960 by the Indian Prime Minister Late Jawaharlal Nehru and President of Pakistan Late Ayub Khan. According to this agreement, control over the Beas, Ravi and Sutlej, the three "eastern" rivers, was given to India and the Indus, Chenab and Jhelum, the three "western" rivers, to Pakistan. Since Pakistan's rivers flow through India first, the treaty allowed India to use them for irrigation, transport and power generation, while laying down precise do's and don'ts for Indian building projects along the way. Since the ratification of the treaty in 1960, India and Pakistan have not engaged in any water wars.

Another best example is the sharing of the Ganges River waters that flows from northern India into Bangladesh between India and Bangladesh. The issue has remained a subject of conflict for almost 35 years, with several bilateral agreements and rounds of talks failing to produce results. However, a comprehensive bilateral treaty was signed by the former Indian Prime Minister H. D. Deve Gowda and the then-Bangladeshi Prime Minister Sheikh Hasina Wajed on December 12, 1996 in New Delhi. The treaty established a 30-year water-sharing arrangement and recognized Bangladesh's rights as a lower-level riparian. Earlier in accordance with an agreement signed by Indian Prime Minister Late Indira Gandhi and Bangladesh's founding leader Sheikh Mujibur Rehman on March 19, 1972 the two nations established a Joint River Commission to work for the common interests and sharing of water resources, irrigation, floods and cyclones control.

Successful water sharing negotiations are based on certain guiding Principles and adherence to certain standards in the negotiations. Coordination and Cooperation, limited purpose and comprehensive management with focus on the allocation and use of shared waters and on resolving conflicts involving such waters will be of great help to keep the agreement live for longer years. The Telangana-Maharashtra agreement included all these.

Most of the Indian rivers are inter-state, flowing through more than one state. Due to increase in demand for water, a number of inter­state disputes over sharing river waters have surfaced. The Interstate River Water Disputes Act, 1956 (IRWD Act) enacted under Article 262 of Constitution of India on the eve of reorganization of states on linguistic basis is aimed at resolving the water disputes that would arise in the use, control and distribution of an interstate river or river valley. This Act further has undergone amendments subsequently and its most recent amendment took place in the year 2002. The Act among others addresses actions of a downstream state affecting the interest of an upstream state and as well as actions of an upstream state affecting the interest of a downstream state. It is however debatable as to how many times the Act could be successfully implemented. Had it been done Maharashtra could not have constructed 450+ barrages and check dams across River Godavari. Hence the need to enter in to a bilateral agreement had arisen and both Maharashtra and Telangana have shown a way for other states.

It may be apt to quote here former UN Secretary-General Kofi Annan who said that "Fierce national competition over water resources has prompted fears that water issues contain the seeds of violent conflict. If the entire world's peoples work together, a secure and sustainable water future can be ours”. 


The agreement signed by CM KCR and Devendra Fadnavis will be recorded in the history as an unprecedented and unique one like the first ever recorded treaty between Lagash and Umma, like the Indus Waters treaty between India and Pakistan and Ganges River waters treaty between India and Bangladesh. End 

Saturday, August 20, 2016

పౌరసంబంధాల పథనిర్దేశకుడు భండారు పర్వతాలరావు : వనం జ్వాలా నరసింహారావు

పౌరసంబంధాల పథనిర్దేశకుడు భండారు పర్వతాలరావు
ఆంధ్రజ్యోతి దినపత్రిక (21-08-2016)
వనం జ్వాలా నరసింహారావు

సరిగ్గా పదేళ్ల క్రితం ఇదే రోజున (ఆగస్ట్ 21, 2006) 71 సంవత్సరాల భండారు పర్వతాలరావు పుట్టపర్తిలో మరణించారు. ప్రభుత్వ సర్వీసులో పనిచేస్తున్న పర్వతాలరావు స్వఛ్చందంగా పదవీ విరమణ చేసిన కొన్నాళ్ల నుంచి పుట్టపర్తి భగవాన్ సత్యసాయిబాబా సన్నిధిలోనే వుంటూ ఆయన సేవలో తరించిపోయేవారు. ఈ తరం పాత్రికేయులకు కాని, ఇతరులకు కాని, అంతగా తెలిసుండని, వుండే అవకాశం లేని భండారు పర్వతాల రావు కాంగ్రెస్ పార్టీకి చెందిన స్వర్గీయ డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తో మొదలుపెట్టి తెలుగుదేశం పార్టీకి చెందిన స్వర్గీయ ఎన్టీ రామారావు వరకు, ఆ తరువాత స్వర్గీయ ఎన్, జనార్ధన రెడ్డికి, అంటే ఆరుగురు ముఖ్యమంత్రులకు ప్రజా సంబంధాల అధికారిగా పనిచేసి ఆ పదవికే వన్నె తెచ్చిన సంగతి కూడా బహుకొద్ది మందికే తెలిసుంటుంది. "పీఆర్వో టు సీఎం" అనే పదవిని మొట్టమొదటి సారి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, డాక్టర్ మర్రి చెన్నారెడ్డి 1978 లో మొదటి దఫా ముఖ్యమంత్రిగా పనిచేసిన రోజుల్లో ఏర్పాటైంది. భండారు పర్వతాలరావును ఆ పదవిలో ఆయన నియమించారు. విరివిగా పుస్తకపఠనం, రచనలు చేసే అలవాటున్న పర్వతాలరావు ఉమ్మడి రాష్ట్రంలో సమాచార-పౌర సంబంధాల శాఖకు డైరెక్టర్ గా, ఆంధ్రా బాంక్ పౌర సంబంధాల అధికారిగా, చలనచిత్ర అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్ట్రర్ గా, అంబేడ్కర్ సార్వత్రిక విశ్వ విద్యాలయానికి పరీక్షల విభాగపు కౌన్సిలర్ గా పనిచేశారు. స్వఛ్చంధ పాత్రికేయుడిగా ప్రసిద్ధికెక్కిన ఆయన ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి సంస్థ సలహాదారుడిగా, నేషనల్ ఇన్పర్మేషన్ సర్వీసెస్ న్యూస్ ఫీచర్ గౌరవ సంపాదకుడిగా కూడా పనిచేశారు.

1958 లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమాచార పౌరసంబంధ శాఖలో డీపీఆర్వో గా ఉద్యోగంలో చేరిన పర్వతాలరావు, స్వయం కృషితో, స్వయం ప్రతిభతో, అదే శాఖలో ఉన్నతోన్నత స్థానమైన డైరెక్టర్ పదవిని నిర్వహించారు. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మొట్టమొదటి సారి ముఖ్యమంత్రి పదవి చేపట్టినప్పుడు, ప్రప్రధమంగా సీఎం పీఆర్వో పదవిని ఏర్పాటు చేయగానే, సమాచార పౌర సంబంధాల శాఖలో డిప్యూటీ డైరెక్టర్ గా పనిచేస్తున్న పర్వతాలరావును ఆయనే స్వయంగా ఆ పదవిలో నియమించారు. బహశా ఆ పదవిని ఆయన నిర్వహించిన తీరు అప్పటికీ, ఇప్పటికీ, బహుశా ఎప్పటికీ ఒక ఆదర్శంగా వుండిపోతుందనడంలో అతిశయోక్తి లేదు. ఆ పదవిలో వున్న మాలాంటి ఎంతో మందికి ఆయన స్ఫూర్తిదాత అనవచ్చు. ఆంగ్లం, తెలుగు భాషల్లో ప్రావీణ్యం వున్న పర్వతాలరావు, వచన, కవిత్వ రచనలెన్నో చేసారు. బహుగ్రంథకర్త. ప్రముఖంగా పేర్కొనాల్సిన వాటిలో: టంగుటూరి ప్రకాశం పంతులు జీవిత చరిత్ర ఆధారంగా వంద చిన్ని కథలను "ప్రకాశం గాథా శతి", "మన సుప్రసిద్ధ దేవాలయాలు", "పరమాచార్య పావన గాథలు", "నారసింహాయ" పేర్కొనవచ్చు. అనేక పత్రికలకు, మాగజైన్లకు ఆయన వ్యాసాలు రాసేవారు.


స్వఛ్చంద పదవీ విరమణ అనంతరం, పుట్టపర్తిలో నివాసం ఏర్పాటు చేసుకునే ముందర కొన్నాళ్ల పాటు, ఆయన అపారమైన అనుభవాన్ని ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి సంస్థ, డాక్టర్ ఎంసీఆర్ హెచార్డీ సంస్ద కొంతమేరకు ఉపయోగించుకున్నాయి. అంతరించి పోతున్న హస్తకళల మీద ఆయన సుదీర్ఘ అధ్యయనం చేశారు. వాటి తయారీ ప్రదేశాలకు వెళ్లి, హస్తకళాకారులతో స్వయంగా అనేక మార్లు మాట్లాడి, వాటి నేపధ్యం, తయారీ విధానం, అంతరించి పోవడానికి దారితీస్తున్న కారణాలను కూలంకషంగా పరిశీలించి సమగ్ర నివేదికలు తయారుచేసారాయన. వాటినెలా పునరుద్ధరించాలో కూడా సూచించారు. ఆయన నివేదిక ఆధారంగానే వాటి పునరుద్ధరణకొరకై "హస్తకళల అభివృద్ధి కేంద్రాలను" కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త నిధులతో ఏర్పాటు చేయడం కూడా జరిగింది. "వీణల తయారీ", "మృదంగం తయారీ", "తోలుబొమ్మలు" మీద ఆయన చేసిన అధ్యయన నివేదికలను ఒక పుస్తక రూపంలో తెచ్చి వున్నట్లయితే భావితరాల వారికి ఎంతో ఉపయోగంగా వుండేది కాని నేనెంత ప్రయత్నం చేసినా హస్తకలల అభివృద్ధి సంస్థతో ఆ పని చేయించలేకపోయాను. ఇప్పటికీ ఆ డమ్మీ కాపీ నా దగ్గర భధ్రపరచాను.


ప్రముఖ పాత్రికేయుడు పొత్తూరి వెంకటేశ్వర రావు, పౌరసంబంధాల పితామహుడు డాక్టర్ సీవీ నరసింహారెడ్డి, అత్యవసర సహాయ సేవల రూప శిల్పి డాక్టర్ ఏపీ రంగారావు, పర్వతాలరావుతో తమకున్న అనుబంధాన్ని నెమరేసుకుంటూ ఆయన గురించి ఎంతో గొప్పగా చెప్పారు. స్వయానా మేనమామ అయిన పర్వతాలరావును తన బాల్యం నుంచే అమితంగా అభిమానించే వాడినని, "పర్వతాలరావు చెడువారిలో కూడా వారిలోని మంచి గుణాలను మాత్రమే వెలికితీసే అపురూపమైన శక్తిగల అరుదైన వ్యక్తి" అన్నారు రంగారావు. పర్వతాల రావు ఎప్పుడూ, ఎవరినీ, ఒక్క పొల్లుమాట కూడా అనేవాడు కాదని, కోపమంటే ఏమిటో ఆయనకు తెలియదని రంగారావు అన్నారు. ఒక గొప్ప రచయితగా, ఉపన్యాసకుడిగా, వక్తగా, సంఘ సంస్కర్తగా, నాయకుడిగా ఆయనలో దాగి వున్న శక్తి అనిర్వచనీయం అన్నారాయన. అహర్నిశలూ మార్పుకు ప్రేరేపణ కలిగిస్తూనే, ఒక గొప్ప వ్యక్తిగా సమాజంలో తనకొక స్థిరమైన స్థానాన్ని సంపాదించుకునే అవకాశాలున్నప్పటికీ, కారణాలేవైనా, పర్వతాలరావు స్వఛ్చందంగా ఒక ప్రేమైక జీవిగా మారి, ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్లాడని రంగారావు కొనియాడారు.

సమాచార పౌర సంబంధాల శాఖకు-వృత్తికి, ఒక గొప్పతనాన్ని, క్రమశిక్షణను, నిబద్ధతను, ఆత్మగౌరవాన్ని సమకూర్చిన ఒక మహనీయుడిగా, ఓ అరుదైన పౌరసంబంధాల వృత్తి నిపుణిడిగా పర్వతాలరావును వర్ణించారు ఆయన సహాద్యోగి, ఆ శాఖ మాజీ డైరెక్టర్ డాక్టర్ సీవీ నరసింహారెడ్డి. సత్యసాయి బాబా ఆశయానికి, సిద్ధాంతానికి, బోధనలకు ప్రభావితుడై, ఆయన అడుగుజాడల్లో పయనించడానికొరకే, మానవసేవ ధ్యేయంగా తన అంతరాత్మ ప్రబోధానికి అనుగుణంగా, పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో పర్వతాలరావు వానప్రశ్తం చేశాడని ఆయన అన్నారు. "ఒక వైవిధ్యభరితమైన వ్యక్తి ఆయన. ఒక గొప్ప స్కాలర్ గా, మేధావిగా, నిపుణిడిగా, అత్యున్నత ప్రమాణాలను పాటించిన మహా మనీషి పర్వతాలరావు. సేవే పరమావధిగా ఆయన జీవించాడు. ఆయన ఆలోచనలు, మాటలు, చేతలు ఆధ్యాత్మిక మార్గంలో వుండేవి. అసలు-సిసలైన అజాతశత్రువు పర్వతాలరావు ఒక గొప్ప స్నేహితుడు, దార్శనికుడు, తాత్వికుడు" అన్నారు ఆయన గురించి నరసింహారెడ్డి.

ఆత్మగౌరవానికి ప్రతీకగా, అరుదైన అసామాన్య వ్యక్తిత్వానికి నిదర్శనంగా పర్వతాలరావు తనకెప్పుడూ ఆరాధ్యనీయమైన మనిషన్నారు సీనియర్ పాత్రికేయులు, మాజీ ఏపీ ప్రెస్ అకాడెమీ అధ్యక్షులు పొత్తూరి వెంకటేశ్వ్రర రావు. వర్కింగ్ జర్నలిస్టుగా తనకాయన పరిచయమయ్యారని అన్నారు పొత్తూరి. "ఆయనో నిశ్శబ్ద అగ్నిపర్వతం లాంటివాడని, ఎన్నో సమస్యలను తనలోనే దాచుకునేవాడని, వాటిలో కొన్ని ఆయనకు సంబంధించినవైతే మిగతావి ఇతరులవని నాకెప్పుడూ అనుమానంగా వుండేది. ఆయనెప్పుడూ ఇతరులను తన సమస్యలతో ఇబ్బందిపెట్టేవాడుకాదు కాని, ఇతరుల-ముఖ్యంగా స్నేహితుల బాధలను ఎప్పుడూ పంచుకునేవాడు" అన్నారాయన. "ఆయుర్వేద వైద్యంలో ఆయనకు బాగా ప్రవేశం వుంది. ప్రాక్టీస్ చేయడానికి ఆయన అర్హుడు కూడా. మెడిటేషన్ కూడా బాగా తెలిసిన వాడు. ఆయనో గొప్ప పరిశోధకుడు. నరసింహ స్వామి మీద ఆయన రాసిన పరిశోధనాత్మక పుస్తకాలు అరుదైన సాహిత్యం" అన్నారు పొత్తూరి.

"చెన్నా టు అన్నా" (చెన్నారెడ్డి నుంచి ఎన్టీ రామారావు వరకు) పేరుతో ఒక పుస్తకం రాయాలని పర్వతాలరావు అంటుండేవారు. దురదృష్ట వశాత్తు అది ఇంకా వెలుగుచూడలేదు. ఆ పుస్తకం ప్రచురితమై వున్నట్లయితే, అలనాటి ఎన్నో రాజకీయ చారిత్రక ప్రాధాన్యతాంశాలను, మెలకువలను, ముఖ్యమంత్రుల మనోగతాన్ని, మనం తెలుసుకోగలిగే వాళ్లం. స్వర్గీయ టీ. అంజయ్య ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ఆయనదగ్గర పర్వతాలరావు పీఆర్వోగా పనిచేసిన రోజులనాటి ఒక సంఘటనను పొత్తూరి ఎప్పుడూ గుర్తుచేసుకుంటారు. అప్పట్లో పొత్తూరి ఆంధ్రప్రభ మాగజైన్ సంపాదకులు. "ముఖ్యమంత్రితో ముఖాముఖి" శీర్షికన వారంవారం ఆంధ్రప్రభలో ఒక ఫీచర్ ప్రచురించేవారప్పట్లో. సంపాదకుడిగా, పత్రికాముఖంగా పాఠకులనుండి ప్రశ్నలను ఆహ్వానించేవారాయన. వాటికి సీఎం ఇచ్చిన సమాధానాలను మాగజైన్ లో వారంవారం ప్రచురించేవారు. సమాధానాలు ఇచ్చే విషయంలో, విషయ సేకరణకు సంబంధించి, ముఖ్యమంత్రి అంజయ్యకు ఆయన కార్యదర్శి స్వర్గీయ యు బి రాఘవేంద్ర రావు. పీఆర్వో పర్వతాలరావు సహాయపడేవారు. వారిద్దరూ, ముఖ్యంగా పర్వతాలరావు రాసిచ్చే సమాధానాలు ఏ మార్పులూ లేకుండా అంజయ్య అంగీకరించే వారనీ, అది ఆయనపై అంజయ్యకు వున్న అపారమైన నమ్మకం అనీ పొత్తూరి గుర్తుచేసుకున్నారు.

సుమారు ఏబైఅయిదు ఏళ్ల క్రితం ఆయన ఖమ్మంలో డీపీఆర్వోగా పనిచేస్తున్న రోజుల్లో పర్వతాలరావుతో నాకు మొదటిసారిగా పరిచయమైంది. రికాబ్-బజార్ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుకుంటున్న నాకు ఆయన సోదరుడు (ప్రముఖ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకుడు) భండారు శ్రీనివాస రావు క్లాస్ మేట్. ఆయన ద్వారా పరిచయం అయింది. ఆ తరువాత నేను ఆయన మేనకోడలిని వివాహం చేసుకోవడంతో పరిచయం కాస్తా చుట్టరికంగా మారింది. 1989 లో స్వర్గీయ డాక్టర్ మర్రి చెన్నారెడ్డి రెండవ సారి ముఖ్యమంత్రి అయినప్పుడు నేనాయనకు పీఆర్వోవో గా పనిచేశాను. అప్పట్లో డిప్యుటేషన్ మీద ఆంధ్రాబాంక్ పీఆర్వోగా పనిచేస్తున్న పర్వతాలరావును ఏరి-కోరి శాఖకు తిరిగి రప్పించుకుని సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ గా నియమించారు ముఖ్యమంత్రి చెన్నారెడ్డి. ఆ విధంగా ఆ హోదాలో వున్న ఆయనతో కలిసి సమన్వయంతో పనిచేసే అవకాశం కలిగింది నాకప్పట్లో. చెన్నారెడ్డి ఉపన్యాసాలను సేకరించి, ఎడిట్ చేసి, ఒకచోట చేర్చి, చాలాకాలం తరువాత "యాన్ ఎజెండా ఫర్ డెవలప్ మెంట్ ఆఫ్ ఏపీ" పేరుతో పుస్తక రూపంలో తేవడానికి ఆయన ఎంతగానో తోడ్పడ్డారు.

దురదృష్ట వశాత్తు పర్వతాలరావు సతీమణి, 78 ఏళ్ల వయసున్న శ్రీమతి సరోజినీదేవికి, భర్త చనిపోయి పదేళ్లయినా, ఆమెకు రావాల్సిన కుటుంబ పింఛను, ప్రభుత్వ నిబంధనలు అనుమతించడం లేదన్న కారణాన ఇంకా మంజూరు కాలేదు. తన ఆర్థిక ఇబ్బందులను మాత్రమే తన శ్రీమతికి వారసత్వంగా ఇవ్వగలిగిన మహానుభావుడాయన. తనకంటూ ఆయన ఏమీ మిగుల్చుకోలేదు.   


పర్వతాలరావు ఎంతమందికో స్నేహితుడు...తాత్వికుడు...దార్శినికుడు. వారిలో నేనూ ఒకడిని కావడం గర్వకారణమే! End 

Honesty was his (Bhandaru Parvatala Rao) name & life : Vanam Jwala Narasimha Rao

Honesty was his (Bhandaru Parvatala Rao) name & life
Vanam Jwala Narasimha Rao
Metro India (21-08-2016)

            Ten years ago on this day, August 21, 2006, Bhandaru Parvatala Rao passed away at the age of 71 years in Puttaparti where he was staying in the service of Satya Saibaba ever since he took voluntary retirement. Very few people of this generation know him though he served five successive Chief Ministers beginning with Congress Party’s Marri Channa Reddy to Telugu Desam’s NT Rama Rao and later to N Janardhan Reddy as Public Relations Officer without a break. The institution of PRO to CM was in fact started for the first time in 1978 during the first tenure of Dr M Channa Reddy as CM and Parvatala Rao was appointed as the first PRO. A voracious reader and prolific writer, he also worked as Director Information and Public Relations of Government of Andhra Pradesh; as Public Relations Officer to Andhra Bank; as Managing Director State Film Development Corporation as well as Counselor and Examiner of Ambedkar Open University. Parvatala Rao was also a journalist, consultant of AP Handicrafts Development Corporation and Honorary Managing Editor of the Bi-Lingual News Feature National Information Services.

Parvatala Rao entered AP Information Service as DPRO in 1958 and rose to the highest position in the department. When for the first time Chief Minister Late Dr M Channa Reddy introduced the position of an exclusive PRO to CM, Parvatala Rao then working as Deputy Director in the department, was the automatic choice. He excelled in it and even now who ever occupies that place at some time or other quote him. He authored number of books both in verse and in poetry both in English and Telugu languages. Prominent among them were “Prakasham Gadha Sathi”-100 short biographical anecdotes of Tanguturi Prakasham Pantulu, “Mana Suprasiddha Devalayalu” (Tel-prose) - of Publications Division and “Paramacharya Pavana Gathalu”-108 Anecdotes from the life of late Sri Jagadguru Sankaracharya of Kanchi Kamakoti Peetham.

After retirement from Government service and before he decided to settle at Puttaparti Prashanti Nilayam of Bhagavan Sri Satya Saibaba, his expertise was utilized by the then AP Handicrafts Development Corporation and DR MCR HRD Institute. His greatest contribution to the Handicrafts Corporation was documentation of rich but rare and languishing handicrafts of the state. Parvatala Rao visited places where craft persons engaged in work, talked to them, observed the process studied the reasons for languishing and then prepared a report suggesting the methodology for their revival leading to establishing Craft Development Centres. This resulted in their survival till this day. The report on three important crafts namely “Veena Making”, “Mridangam Making” and “Leather Puppetry” should have been brought out in a book form under the title “Languishing Handicrafts of AP”. It is a rich contribution from Parvatala Rao. Unfortunately it did not happen despite efforts put up by me.

Three eminent persons Potturi Venkateswara Rao, Dr CV Narasimha Reddy and Dr AP Ranga Rao, recalled their association in their introduction of author for the unpublished book. Former State Secretary AP Branch of Indian Red Cross Society Dr AP Ranga Rao also his nephew says that he was Parvatala Rao’s admirer in his childhood. “Parvatala Rao was someone capable of finding something good even in an evil person and not to antagonize anyone. He had a tremendous potential to become a great writer, speaker, debater, reformer and a great leader. He had the capacity to influence and change for better. He could have become easily any one of those; instead he has voluntarily chosen a path to be a loving human being” described Ranga Rao.


Former Director of Information and Public Relations Dr CV Narasimha Reddy also a colleague of Parvatala Rao said Parvatala Rao was the department’s most outstanding Public Relations Professionals-who not only brought his fierce commitment to the discipline but also a quiet, grace, self-respect and dignity to the profession. Narasimha Reddy interprets the decision of Parvatala Rao to settle in Prashanti Nilayam as his inner desire to serve the cause of humanity in tune with the Baba’s Vision and Mission which bears an eloquent proof to the fact, that he committed his life, to the cause of needy and under privileged. “That was Parvatala Rao with a difference, combining in himself many unique features of great Scholarship, intellect, competence of highest standards and abundant aptitude to the spirit of service. In his thoughts, words and deeds Parvatala Rao devoted to spirituality. He was not only a highly non-controversial Person but also a Friend, Philosopher and Guide to one and all”. That makes him a True “AJATASHATRUVU” says Dr Reddy.

Senior Journalist and former Chairman AP Press Academy Sri Potturi Venkateswara Rao described Parvatala Rao as essentially a “Man of Self Respect, an extraordinary and unique personality”. Potturi as a working Journalist came in to contact with Parvatala Rao. “I had a lingering suspicion that he was like a silent volcano with problems and worries inside, a few of his own and many of others. While he never bothered others with his problems, he was always ready to share the worries of his friends” recollected Potturi.

Potturi disclosed that Parvatala Rao was qualified to practice Ayurvedic medicine and also knew certain techniques of healing by meditation. “Parvatala Rao was a great researcher. His expertise in collecting information helped the department he served. His research on the temples of Lord Narasimha Swami in Andhra Pradesh resulted in the publication of a comprehensive work in a few volumes” says Potturi.

Parvatala Rao planned to write a book with the title “Channa to Anna”. Potturi says that it is unfortunate that it did not see the light. Channa means Dr. M. Channa Reddy and Anna was Sri N. T. Rama Rao. The book would have revealed many interesting anecdotes and so far untold political happenings of historic importance. Potturi also narrated an instance that occurred when Anjaiah was Chief Minister. At that time he as Editor of Andhra Prabha weekly offered to publish a feature called “Mukhya Mantri to Mukha Mukhi”, meaning face to face with the Chief Minister. He invited questions from the readers and the Chief Minister was replying to them. Late U. B. Raghavendra Rao, CM Secretary then and Parvatala Rao were assisting Anjaiah in this exercise. Anjaiah used to ask Parvatala Rao for his views also when he was in doubt. The replies provided by Parvatala Rao were simply accepted without discussion. Such was the confidence that the Chief Minister had in Parvatala Rao recalled Potturi.

It was fifty years ago I first met Parvatala Rao while he was working in Khammam. His brother Bhandaru Srinivasa Rao was my classmate in ninth and that was how I came to know him. In later days I married his niece and our association further increased. When Dr Channa Reddy became Chief Minister of AP in 1989 I was PRO to CM. Parvatala Rao then working as PRO Andhra Bank was requested by CM to come back to the department as Director Information and Public Relations. In that capacity he was my boss in the department for about a year. We together collected, edited and compiled a book based on the extempore speeches of Dr Channa Reddy as CM which has been published as “An Agenda for Development of AP”.


Parvatala Rao was always a friend, philosopher and guide to one and all who knew him and I am one among those many. It is however unfortunate that even after ten year since his death Parvatala Rao 78 year old wife has not been sanctioned family pension as the government rules do not permit to do so. End  

Thursday, August 11, 2016

శ్రీ సుబ్రహ్మణ్యాష్టకమ్



శ్రీ సుబ్రహ్మణ్యాష్టకమ్

హే స్వామినాథ కరుణాకర దీనబందో
శ్రీ పార్వతీసుముఖపజ్కజపద్మబంధో
శ్రీ శాదిదేవగణపూజితపాదపద్మ
వల్లీసనాథ మమదేహి కరావలంబమ్

దేవాధిదేవనుత దేవగణాధినాథ
దేవేంద్రవంద్య మృదుపంకజమంజుపాద
దేవర్షినారదమునీంద్రసుగీతకీర్తే
వల్లీసనాథ మమదేహి కరావలంబమ్

నిత్యాన్నదాననిరతాఖిలరో గహారిన్
తస్మాత్ప్రదానపరిపూరితభక్తకామ
శృత్యాగమప్రణవవాచ్యనిజస్వరూప
వల్లీసనాథ మమదేహి కరావలంబమ్

క్రౌంచాసురేంద్రమదఖండనశక్తిశూల
పాశాదిశస్త్రపరిమండితదివ్యపాణే
శ్రీకుండలీశధృతతుండశిఖీంద్రవాహ
వల్లీసనాథ మమదేహి కరావలంబమ్

దేవాధిదేవ రథమండలమధ్యవేద్య
దేవేంద్ర పీఠనగరం దృఢ చాపహస్తమ్
శూరం నిహత్య సురకోటి భిరీడ్యమాన
వల్లీసనాథ మమదేహి కరావలంబమ్

హీరాదిరత్న మణియుక్తకిరీటహార
కేయూరకుండల లసత్కవచాభిరామ
హేవీర తారక జయామర బృందవంద్య
వల్లీసనాథ మమదేహి కరావలంబమ్

పంచాక్షరాది మను మన్త్రితగాజ్గయోయైః
పంచామృతైః ప్రముదితేంద్ర ముఖైర్మునీంద్రైః
పట్టాభిషిక్త హరియుక్త పరాసనాధ
వల్లీసనాథ మమదేహి కరావలంబమ్

శ్రీ కార్తికేయ కరుణామృతపూర్ణ దృష్ట్యా
కామాదిరోగకలుషీకృతదుష్టచిత్తమ్
సిక్త్వాతు మామవ కళాధరకాంతికాన్త్యా
వల్లీసనాథ మమదేహి కరావలంబమ్

సుబ్రహ్మ్యష్టకం పుణ్యం యే పఠన్తి ద్విజోత్తమాః
తే సర్వే ముక్తి మాయాన్తి సుబ్రహ్మణ్యప్రసాదతః
సుబ్రహ్మణ్యాష్టకమిదం ప్రాతరుత్థాయ యః పఠేత్
కోటిజన్మకృతం పాపం తత్క్షణా దేవ నశ్యతి.