Sunday, May 31, 2026

భాగవత ఫలశ్రుతి , శ్రీ మహాభాగవత కథ-88 >>>>> వేదాలను, పురాణాలను లోకానికి అందించిన వేదవ్యాసుడు: వనం జ్వాలా నరసింహారావు

 వేదాలను, పురాణాలను లోకానికి 

అందించిన వేదవ్యాసుడు, భాగవత ఫలశ్రుతి  

శ్రీ మహాభాగవత కథ-88

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (జూన్ 1, 2026)

కంII              చదివెడిది భాగవతమిది,

చదివించును కృష్ణు, డమృతఝరి పోతనయున్

                               చదివినను ముక్తి కలుగును,

చదివెద నిర్విఘ్నరీతి ‘జ్వాలా మతినై

వేదవ్యాసుడు వేదాలను, పురాణాలను లోకానికి అందించిన విషయాన్ని సూతుడు శౌనకుడికి వివరించాడు. పరాశర మహర్షి పుత్రుడైన వేదవ్యాసుడికి పైలుడు, సుమంతుడు, జైమిని, వైశంపాయనుడు అనే నలుగురు శిష్యులు వుండేవారు. వీరు ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం అని వున్న నాలుగు వేదాలను వ్యాసమహర్షి ఉపదేశించిన క్రమంలో అన్ని లోకాలలో ఆవిష్కరించారు. మొట్టమొదట బ్రహ్మ హృదయాకాశంలో ఒక నాదం ఉత్పన్నమైంది. ఆయన ఆత్మయోగంతో చిత్తవృత్తులను నిరోధించి వున్నప్పుడు ఆ నాదం ఆయన శ్రవణ పుటాలలో వ్యక్త రూపాన్ని పొందింది.

బ్రహ్మ హృదయాకాశంలో ఉదయించిన ఆ నాదం, బృహతీ వాక్కుగా, ‘ఓమ్’ అన్న ధ్వనిగా వినిపించి, అక్షరాకృతిని ధరించింది. ఆ ఓంకారమే బ్రహ్మవిద్యాసర్వస్వములైన అన్ని మంత్రాలకు, అన్ని ఉపనిషత్తులకు, పుట్టినిల్లైన వేదమాత అని చెప్పబడింది. ఆ ఓంకారం త్రిగునాత్మకమైనది. అంటే, సత్త్వరజస్తమస్సులనే మూడు గుణాలు, ఋగ్యజుస్సామములనే మూడు నామాలు, భూర్భువస్సువస్సులనే మూడులోకాలు, జాగ్రత్స్వప్నసుషుప్తులనే మూడు వృత్తులను కలిగినది. అప్పుడు బ్రహ్మదేవుడు ఆ ఓంకారం నుండి స్వరాలు, స్పర్శలు, అంతస్థములు, ఊష్మములు (హ్రస్వములు, దీర్ఘములు) మొదలైన లక్షణాలతో కూడిన అక్షర సమామ్నాయాన్ని రూపొందించాడు. ఆ అక్షరాల సహాయంతో ఆయన తన నాలుగు ముఖాల నుండి నాలుగు వేదాలను ఉద్భవింపచేశాడు. ఆయన మానస పుత్రులైన మరీచి మొదలైన వారు ఆయన ఉపదేశానుసారం ఆ వేదాలను నేర్చుకుని, తమ శిష్యగణానికి బోధించారు. ఆ విధంగా ఒక్కొక్క యుగంలో మహర్షులు గురుముఖతః వేదాలను అభ్యసిస్తున్నారు.

కాలమహిమ వల్ల వేదాలను సమగ్రంగా అధ్యయనం చేసే శక్తి లేనివారికి దారి చూపడానికి ద్వాపర యుగారంభంలో దాశరాజు కూతురు సత్యవతీదేవి కడుపున భగవంతుడు స్వయంగా పరాశర మహర్షికి పుత్రుడై అవతరించాడు. అనంతమైన వేదరాశిని ప్రకరణానుసారం, ఛందస్సుల ప్రకారం, ఋగ్యజుస్సామాధర్వములని నాలుగు సంహితలుగా చేసి, వాటిని పైల, వైశంపాయన, జైమిని, సుమంతులనే నలుగురు శిష్యులను పిలిచి, ఒక్కొక్కటి వారికి ఉపదేశించారు.

పైలమహర్షి అధ్యయనం చేసిన ఋక్సంహిత పరిమాణం చాలా పెద్దది. ఋక్కుల సంఖ్య చాలా ఎక్కువ. దాన్ని అందుకే బహ్వ్ఋచ సంహిత అనేవారు. పైలుడు దాన్ని రెండుగా విభజించి ఇంద్రప్రమితికి, భాష్కలుడికి బోధించాడు. భాష్కలుడు తన భాగాన్ని నాలుగు శాఖలుగా పునర్విభాగం చేసి, తన శిష్యులైన బాద్య, యాజ్ఞవల్క్య, పరాశర, అగ్నిమిత్రులకు నేర్పాడు. ఇంద్రప్రమితి తన సంహితభాగాన్ని తన కొడుకు మాండూకేయ ఋషికి ఉపదేశించాడు. మాండూకేయుడు తన శిష్యుడు దేవమిత్రుడికి బోధించిన విద్యను సౌభరి మొదలైన ఋషులు నేర్చుకున్నారు. సౌభరి కొడుకు శాకల్యుడు తాను నేర్చుకున్న శాఖను ఐదుగా విభజించి తన శిష్యులైన వాత్స్య, మౌద్గల్య, శాలీయ, గోముఖ, శిశిరులకు ఉపదేశించాడు. వారు జాతుకర్ణికి, ఆయన బలాకుడు, పైంగుడు, వైతాలుడు, విరజుడు అనే ఋషులకు నేర్పాడు. భాష్కలుడి కొడుకు భాష్కలి వాలఖిల్య సంహితను సంకలనం చేసి తన శిష్యులు బాలాయని, గర్గ్యుడు, కాసారుడు అనేవారికి చెప్పాడు. అలా, అలా, బహ్వ్ఋచ సంహితను సత్సంప్రదాయానుగుణంగా బ్రహ్మర్షులంతా అధ్యయనం చేశారు.

వైశంపాయనుడు యజుర్వేదాన్ని క్షుణ్ణంగా నేర్చుకున్నాడు. అతడి శిష్యులు చరకుడు, అధ్వర్యువు. వారు గురువుగారి దగ్గర అన్ని క్రతువులు సలక్షణంగా చేయించడం నేర్చుకున్నారు. ఒకసారి ఆ శిష్యులు చేపట్టిన కర్మకాండను వైశంపాయనుడి మరో శిష్యుడు యాజ్ఞవల్క్యుడు అధిక్షేపించాడు. దానికి కోపగించుకున్న వైశంపాయనుడు యాజ్ఞవల్క్యుడిని ఆయన నేర్చుకున్న వేదాన్ని మొత్తం అక్కడ వదిలి తక్షణమే వెళ్లిపొమ్మన్నాడు. యాజ్ఞవల్క్యుడు మొత్తం కక్కేసి వెళ్లిపోయాడు. ఆ కక్కును ఆయాశాఖాధి దేవతలు తిత్తిరి పక్షుల రూపంలో భుజించారు. అప్పటి నుండి ఆ భాగానికి తైత్తిరీయ శాఖ అన్న పేరొచ్చింది. ఆ తరువాత యాజ్ఞవల్క్యుడు సూర్య భగవానుడిని ప్రసన్నం చేసుకుని, ఇతరులకు తెలియని యజుర్వేద సూత్రాలను నేర్చుకున్నాడు. ఆ నవీన శుక్లయజుర్వేద భాగం వాజసనేయ సంహితగా ప్రసిద్ధికెక్కింది.

సామవేదాన్ని నేర్చుకున్న జైమిని మహర్షి తన కొడుకైన సుమంతుడికి ఉపదేశించాడు. సుమంతుడు ఆయన కొడుకైన సుకర్ముడికి నేర్పాడు. అతడు సామవేద తరువును వేయి శాఖలుగా విభజించి శిష్యులకు నేర్పాడు. అధర్వవేద పండితుడైన సుమంతుడు తన విద్యను కబంధుడనే శిష్యుడికి, అతడు పధ్యుడికి, వేదదర్శుడికి, వారు వారి శిష్యులకు, అలా అలా శాఖోపశాఖలతో అధర్వవేదం వృద్ధి చెందింది.

త్రయ్యారుణి, కశ్యపుడు, సావర్ణి, అకృతవ్రణుడు, వైశంపాయనుడు, హారీతుడు అనే ఆరుగురు వేదాంగవేత్తలు సూతుడి తండ్రి రోమహర్షుడి దగ్గర పురాణాలను నేర్చుకున్నారు. సూతుడు వారి దగ్గర శిష్యరికం చేసి పురాణ సంహిత మొత్తాన్నీ అభ్యసించాడు. కశ్యపుడు, సూతుడు, సావర్ణి, అకృతవ్రణుడు, రోమహర్షుడి దగ్గర మూల సంహితలు నాలుగూ నేర్చుకున్నారు.

పద్దెనిమిది మహాపురాణాలు: బ్రహ్మ, పద్మ, విష్ణు, శివ, భాగవత, భవిష్య, నారద, మార్కండేయ, అగ్ని, బ్రహ్మవైవర్త, లింగ, వరాహ, స్కాంద, వామన, కూర్మ, మత్స్య, బ్రహ్మాండ, గరుడ పురాణాలు. ఇవి కాకుండా ఉపపురాణాలు కూడా వున్నాయి.

పద్దెనిమిది మహా పురాణాల పరిమాణం వేర్వేరుగా వుంటుంది. బ్రహ్మ పురాణం పదివేల శ్లోకాలతో కూడి వున్న గ్రంథం. పద్మ పురాణం 55 వేల, విష్ణు పురాణం 23 వేల, శివ పురాణం 24 వేల, శ్రీమద్భాగవత పురాణం 18 వేల, నారద పురాణం 25 వేల, మార్కండేయ పురాణం 9 వేల, అగ్ని పురాణం 15400, భవిష్యోత్తర పురాణం 14500, బ్రహ్మవైవర్త పురాణం 18 వేల, లింగ పురాణం 11 వేల, వరాహ పురాణం 24 వేల, స్కాంద పురాణం 81100, వామన పురాణం 10 వేల, కూర్మ పురాణం 17 వేల, మత్స్య పురాణం 14 వేల, గరుడ పురాణం 19 వేల, బ్రహ్మాండ పురాణం 12 వేల శ్లోకాలు వుంటాయి.

ఇలా నాలుగు లక్షల శ్లోకాలతో కూడి వున్న అష్టాదశ పురాణాలలోను, భాగవత పురాణం శ్రేష్టమైనది. భాగవత పురాణాన్ని పఠించినవారు శ్రీమహావిష్ణువుతో సాయజ్యముక్తిని పొందుతారు.   

ఫలశ్రుతి

         సర్వ పురాణాలలో శ్రేష్టతమమైన భాగవతాన్ని వినేవారు, వినిపించేవారు, చదివేవారు, వ్రాసేవారు, ఆయురారోర్గ్య ఐశ్వర్యాలు సిద్ధించి శ్రీమహా విష్ణువుతో సాయుజ్యం పొందుతారు. ఆసక్తితో ఆదివారం నాడు భాగవత పఠనం గావించిన భక్తుడు సంసార సాగరాన్ని అవలీలగా దాటుతాడు.

         పరమాత్మ సకల గుణాతీతుడు, సర్వజ్ఞుడు, సర్వేశ్వరుడు, అఖిల లోకాధారుడు, ఆదిదేవుడు, త్రిదశాభివందితపాదాబ్జుడు, వనధిశయనుడు, ఆశ్రితమందారుడు, ఆద్యంతశూన్యుడు, వేదాంతవేద్యుడు, విశ్వమయుడు, కౌస్తుభ శ్రీవత్స కమనీయవక్షుడు, శంఖచక్రగదాసిశార్జ్గధరుడు, శోభనాకారుడు, పీతాంబరాభిరాముడు, రత్నరాజిత మకుట విభ్రాజమానుడు, పుండరీకాక్షుడు, మహనీయ పుణ్యదేవుడు అని స్తుతించిన సూతుడు శ్రీకృష్ణ పరమాత్ముడిని సర్వకాల సర్వావస్థలలోనూ తలచుకుంటూ, సన్నుతిస్తూ వుంటానని శౌనకుడికి చెప్పాడు.

         ఇలా స్తుతించి భాగవతాన్ని ఆసాంతం సూతుడు చెప్పగా, మునులంతా విని, శ్రీ వాసుదేవుడిని హృదయ మందిరాలలో నిలుపుకుని, ఆయన గుణాలను కొనియాడుతూ, పరవశులై, ఉత్సాహం పొంగుతుండగా, తమతమ నివాసాలకు తరలి వెళ్లారు. (భాగవతం సమాప్తం)  

          (బమ్మెర పోతన శ్రీమహాభాగవతం, రామకృష్ణ మఠం ప్రచురణ ఆధారంగా)

An Evening of Immersive Musical Conversations >>>>> At Specially Curated Experiential Space, The ‘SoMa Unframed’ : Vanam Jwala Narasimha Rao

 An Evening of Immersive 

Musical Conversations

At Specially Curated Experiential Space, 

The ‘SoMa Unframed’

(District 150, Elixir Tower, 

Knowledge City Road, Hyderabad)

Vanam Jwala Narasimha Rao (May 31, 2026)

I had the privilege of attending an engaging musical evening curated by Soumya Varanasi under her artistic initiative, Soma Unframed. Accompanied by my wife Vijayalakshmi, daughter Prema Malini, and son-in-law Vijay Gopal. We spent nearly ninety minutes immersed in a thoughtfully crafted musical experience. More than a conventional concert, the programme unfolded as an intimate artistic dialogue, creating a space where music, ideas, emotions, and diverse creative influences converged in a spirit of exploration and shared discovery.

Conceived as a collaborative platform, Soma Unframed brings together artists from diverse disciplines while remaining anchored in the unifying language of music. For its inaugural edition, Soumya collaborated with the versatile percussionist, vocalist, and rhythm artist Charu Hariharan from Chennai. The evening moved seamlessly between classical compositions, original works, devotional music, rhythmic explorations, and personal reflections, creating a Melodic Environment.

What distinguished the programme was its exploration of music as combination of performance, sound, conversation, inspiration, and a shared human experience. The evening opened with a reflection on artistic openness. Soumya observed that a musician need not be confined to a single tradition or form and spoke of the value of collaboration across artistic boundaries. Her association with Charu Hariharan was presented not as an experiment in fusion, but as a natural extension of a shared commitment to music.

The choice of the opening composition, Nada Tanumanisham, was therefore especially apt. Celebrating Nada, the sacred principle of sound, the work suggests that music itself can become a vehicle of transcendence. It served as a thematic prelude to the entire concert, which repeatedly returned to the idea that diverse musical expressions, whether through Sufi devotion, the charm of the nottuswaram, the celebration of Sita Kalyana Vaibhogame, or the meditative invocation of Shiva: ultimately arise from a common source.

Following the opening invocation of Nada as the essence of music, Soumya reflected on the personal experience of musical creation. She remarked that when she begins with the note ‘SA’ music itself seems to respond and enter into conversation with her. The musician’s journey, she suggested, is one of continual discovery rather than repetition. This idea found expression in Chaya, a composition associated with Charu Hariharan, which underscored the notion that musical performance is not merely the rendering of a prepared piece, but an ongoing dialogue between artist, sound, and imagination.

Having explored music as a process of discovery, the concert then moved into a lighter and more playful register with Kamala Nayane, presented in the nottuswaram tradition. Unlike the more elaborate Carnatic kritis, the nottuswaram is marked by melodic simplicity, accessibility, and rhythmic charm. Invoking the ‘lotus-eyed one,’ the composition carried devotional overtones, yet its musical character was distinguished by grace, spontaneity, and delight rather than solemnity.

Kamala Nayane extended the conversation begun in Chaya. If the earlier composition suggested that music speaks back to the musician, this piece demonstrated how that dialogue can assume a playful form. It conveyed the impression of a devotee approaching the divine not through awe alone, but through affection, intimacy, and joy, reminding listeners that devotion can be expressed as much through lightness and wonder as through introspection.

Soumya next took up Khwaja Mere Khwaja from the film Jodhaa Akbar. Before beginning the piece, she reflected on the idea of solitude in music, suggesting that solitude is not merely the absence of company but the presence of deeper listening. In such moments of inward quietude, music becomes a bridge between the self, the world, and the transcendent. The reflection provided a fitting introduction to a composition distinguished by both its contemplative spirit and melodic beauty.

A Sufi devotional hymn addressed to the revered saint Khwaja Moinuddin Chishti, Khwaja Mere Khwaja expresses humility, trust, and surrender. The recurring invocation is less a plea for worldly favours than an act of remembrance, seeking inner peace and closeness to the Divine. In Soumya’s rendering, the composition invited the audience into a shared space of introspection, where music became a medium for reflection rather than display.

The placement of Khwaja Mere Khwaja within the concert was particularly significant. If Kamala Nayane celebrated the playful and affectionate dimensions of devotion, this Sufi hymn explored its contemplative and meditative aspects. Together, they demonstrated how devotion can find expression through diverse emotional registers, through joy and intimacy on the one hand, and through silence, reverence, and surrender on the other. Rooted in the inclusive ethos of the Sufi tradition, Khwaja Mere Khwaja carried a universal message of grace and inner harmony, reaffirming music’s unique ability to transcend cultural boundaries and connect the listener with something larger than oneself.

Listening to Sita Kalyaṇa Vaibhogame in a concert setting evokes a sense of collective celebration rather than individual prayer. Recalling the wedding of Sita and Rama, the composition symbolizes harmony, virtue, and the union of ideals in the Indian imagination. Its appeal lies not only in its devotional content but also in its ability to draw listeners into a shared cultural and spiritual experience. More broadly, it underscored a recurring theme of the evening: music's capacity to foster reflection, joy, and transcendence, serving at once as a personal companion and a social bond that transforms collective memory into living experience.

Soumya then introduced ‘Shambho, Shambho, Shambho, Hara Hara Mahadeva Shambho’ by recalling her guru, D Raghava Chary, who would inwardly visualize Ammavaru (the Divine Mother) before singing. This reflected a familiar idea in Indian classical music: that music is not merely performance but an act of invocation, with the mental image of the deity serving as a source of concentration, humility, and inspiration. The composition transformed the concert space into one of contemplation, where music became an offering rather than a display. The sequence itself: remembrance of the Divine Mother followed by a hymn to Shiva, evoked the traditional understanding of the inseparable unity of Shiva and Shakti, affirming the belief that artistic inspiration is ultimately a form of divine grace.

After an interlude featuring younger voices, the concert returned to introspection through an original composition by Soumya inspired by a phrase from a Tyagaraja Kriti. Taking Sukhama, suggesting well-being, contentment, and inner fulfilment, as her thematic anchor, she fashioned a musical meditation on the interplay of Saukhyam and Shokam, joy and sorrow. The composition suggested that music is not merely a celebration of happiness or a lament for suffering, but a space where both emotions can be contemplated and reconciled. In doing so, it demonstrated how the classical legacy of Tyagaraja continues to inspire fresh and contemporary artistic expression.

The concert then moved into a group Tillana led by Soumya, bringing a welcome shift from introspection to exuberance. Built around the recurring Swara patterns of ‘Sa Ri Ga Ma,’ the composition celebrated music in its most elemental form. Drawing its vitality from the Swaras themselves, the fundamental building blocks of Carnatic melody, the Tillana transformed simple notes into a vibrant expression of rhythm, energy, and collective joy.

The piece also served as a fitting culmination of the evening's themes. If the preceding compositions explored sound, artistic inspiration, devotion, and inner fulfilment, the Tillana revelled in the sheer delight of musical movement. The recurring Sa Ri Ga Ma patterns brought the concert full circle, returning to the foundational language of music while affirming its power to unite performers and listeners in a shared experience of celebration.

            As the programme concluded, Soumya Varanasi delighted the audience with a much-appreciated rendering of Kamakshi in her distinctive style. Soma Unframed proved to be far more than a concert, and Soumya Varanasi and her team deserve warm congratulations for conceiving and presenting a programme of such imagination, depth, and artistic excellence.

The Telugu Literary Journey Incessantly Reinvented Itself >>>>> (From ARASAM to VIRASAM through DIGAMBARA A Bird’s-Eye View) : Vanam Jwala Narasimha Rao

The Telugu Literary Journey 

Incessantly Reinvented Itself

(From ARASAM to VIRASAM 

through DIGAMBARA: A Bird’s-Eye View)

Vanam Jwala Narasimha Rao

The Hans India (May 31, 2026)

{Personalities like Kaloji Narayana Rao, Sri Sri, Cherabanda Raju, Varavara Rao and Arudra, among others, not only composed verses, but also redefined relationship between creativity and society. The transformation of Telugu intellectual culture across centuries shows how emotionally idealism gradually yielded space to realism, dissent, existential inquiry, and revolutionary engagement. Organizations such as ARASAM and VIRASAM became platforms where artistic conviction intersected with political consciousness and public responsibility. Telugu literature incessantly reinvented itself, preserving cultural memory while confronting inequality, oppression, and moral contradiction.} – Editor’s Synoptic Note.

The recently concluded two-day 20th State-Level Conferences of Abhyudaya Rachayitala Sangham (ARASAM), held at Tirupati on May 23 and 24, 2026, carry messages far deeper than the reported proceedings, if only they are read ‘between the lines.’

If I could read correctly, ARASAM continues to symbolize an enduring commitment to socially responsive creativity. Their deliberations reflect attempts to revive collective cultural engagement at a time when democratic values, civil liberties, pluralism, and constitutional safeguards demand vigilant public participation.

 In their backdrop, I could not help recalling an incident at my residence in June 1982, when I had the privilege of hosting the Great People’s Poet Kaloji Narayana Rao as our family guest for dinner one evening. When my wife served Kaloji Narayana Rao the characteristic ‘Pachi Pulusu,’ a dish prepared with tamarind, onions, chilies, jaggery and mild local flavours such as coriander, curry leaf and garlic, occasionally with simmered raw mango replacing tamarind seasonally, the cheerful atmosphere suddenly changed.

Until then, we had been engaged in casual conversations, mostly listening to Kaloji on literary themes. But the moment he touched the dish, his voice turned emotional, choked with sadness, and the evening unexpectedly slipped into silence. Literally, Kaloji Narayana Rao broke down.

After a brief stoic silence, he regained composure and explained the reason for his grief. The first, though apparently trivial, was that he had not tasted ‘Pachi Pulusu,’ of which he was extremely fond, for quite some time. The second was that the dish reminded him of similar meals he once shared at Cherabanda Raju’s residence.

Incidentally, earlier that very day, Kaloji had visited the ailing Cherabanda Raju and was deeply disturbed by his deteriorating health, which further added to his sorrow. Unfortunately, Cherabanda Raju, while serving a prison sentence, died in July 1982 at the age of 38, barely a month after Kaloji Narayana Rao visited us.

During that dinner, Kaloji, among many other themes, reflected on the ‘Telugu Literary Journey,’ fragments of which still return to me occasionally. My enduring interest in such literary currents, shaped partly by progressive political influences, later prompted me to gather and document related aspects intermittently.

This, is an attempt at presenting ‘A Bird’s-Eye View of Telugu Literary Journey’ from Abhyudaya Rachayitala Sangham to Viplava Rachayitala Sangham (VIRASAM) through DIGAMBARA poetry: its genesis, purpose and evolution. Telugu literary evolution never moved in a straight line. It advanced through upheavals, awakenings, dissent, introspection, and social urgency. From devotional classicism to romantic sensibility, from progressive humanism to rebellious resistance, successive generations reshaped language into an instrument reflecting the anxieties and aspirations of their times.

Poetry, prose, theatre, criticism, and public discourse became mirrors of collective consciousness, recording not merely aesthetic refinement, but also hunger, injustice, alienation, revolt, and hope. Within this continuum emerged powerful streams that transformed creative expression into social intervention. Reformist imagination challenged orthodoxy, progressive thought aligned literature with labouring communities, DIGAMBARA articulation shattered artificiality, and revolutionary voices converted poetry into ideological assertion.

Personalities like Kaloji Narayana Rao, Sri Sri, Cherabanda Raju, Varavara Rao, Arudra etc. not only composed verses, but also redefined relationship between creativity and society. The transformation of Telugu intellectual culture across centuries shows how emotionally idealism gradually yielded space to realism, dissent, existential inquiry, and revolutionary engagement. Organizations such as ARASAM and VIRASAM became platforms where artistic conviction intersected with political consciousness and public responsibility. Telugu literature incessantly reinvented itself, preserving cultural memory while confronting inequality, oppression, and moral contradiction.

The hallmarks of the changing era included concern for the oppressed, the vision of an egalitarian and classless society, realism in thought, and modernity in language. Sri Sri stood as the ‘Charioteer of the Progressive Poetry Movement.’ Adopting free verse with remarkable ease, ‘Abhyudaya Kavita’ transformed Telugu literature significantly. That also marked the genesis of ARASAM. Then came introspection over what the common man had truly gained from freedom. The need to raise a voice for the weaker sections became both evident and inevitable. That voice transformed into poetry and reached the people as ‘DIGAMBARA Poetry.’

This shattered the hypocrisy in Telugu literature and sought to rediscover the true human being. Cherabanda Raju (Baddam Bhaskara Reddy), whom Kaloji Narayana Rao mentioned, was a revolutionary Telugu poet, novelist, and songwriter who rose to prominence in the late sixties along with five other poets collectively known as ‘DIGAMBARA Kavulu’ (Naked Poets). Adopting evocative pseudonyms: Nikhileswar (Yadava Reddy), Jwala Mukhi (Veera Raghavacharyulu), Nagna Muni (Manepalli Hrushikeshwara Rao), Maha Swapna (Kammisetti Venkateswara Rao) and Bhairavayya (Manmohan Sahay).


They produced a strikingly unconventional and unparalleled body of poetry that stood apart in Telugu literature. Against the backdrop of the tribal struggles in Srikakulam, Revolutionary Poetry stormed Telugu literature like a hurricane. The DIGAMBARA poets, who believed Progressive Poetry or ‘Abhyudaya Kavita’ had lost its combative spirit, gradually evolved into ‘Viplava Rachayitalu.’ In due course, Cherabanda Raju, along with Jwala Mukhi, Nikhileswar and Nagna Muni, transformed into Marxist-Leninist writers and co-founded VIRASAM, the Revolutionary Writers’ Association.


Prominent revolutionary writers such as Varavara Rao, Sri Sri, Kutumba Rao, Rachakonda Viswanatha Sastri, and Ramana Reddy founded VIRASAM on July 4, 1970. Sivasagar, Gaddar and Vanga Pandu were among other influential voices associated with the movement. Cherabanda Raju remained active in the organization until his death. Emerging from a Marxist Philosophical Foundation, Progressive Poetry from the 1930s produced eminent poets such as Maha Kavi Sri Sri (Srirangam Srinivasa Rao), Aarudra, Avantsa Soma Sundar, Kundurthi Anjaneyulu etc.


Sri Sri declared that his path was the path of revolution. Supporting revolutionary movements across the Telugu States, reflecting their history, and propagating revolutionary ideals became the hallmarks of Revolutionary Poetry. It sought to inspire people towards radical change, respond to national and international developments, and bring the lives and voices of the poor into literature. In the process, revolutionary poetry brought significant changes in both thought and language.


The journey of Telugu literature from Bhava Kavitha to VIRASAM reflects a dynamic interplay of tradition and modernity, devotion and rebellion, individualism and collectivism. Each phase mirrored the changing aspirations and struggles of Telugu-speaking people. Gradually, literature became a weapon of class struggle, critiquing feudalism, capitalism, and casteism while continuously reshaping social consciousness.


ARASAM, which sought gradual change, laid the groundwork by introducing social consciousness into literature. DIGAMBARA poets, exploring psychological depth, represented an intellectual shift towards existential and modernist themes. VIRASAM, aiming at systemic upheaval, transformed literature into a tool of revolution. Each movement reflected the socio-political milieu of its time, marking a progression from reformist to radical ideologies. Together, they form a rich tapestry of modern Telugu literature’s journey.

Against this backdrop, ARASAM organized its 20th State-Level Conferences with wide participation from progressive writers across the Telugu States. According to media Reports, the new State Executive Committee comprising eminent literary figures was constituted. A strong appeal for progressive groups to overcome internal differences and unite on national and social concerns was made. Major themes were: Social reform through Literature, Unique power of Literature to unite people, Inevitability of Literary Institutions to Protect Democratic and Constitutional Rights.

Contemporary Telugu intellectual history demonstrates that creative expression acquires enduring relevance only when connected with human suffering, ethical responsibility, constitutional morality, and social transformation. Every phase contributed uniquely. Even where ideological fractures weakened collective momentum, the larger contribution of these movements remains unmistakable.

They democratized discourse, expanded participation, challenged caste and class hierarchies, questioned authoritarian tendencies, and established literature as a living public force rather than an isolated academic pursuit. Ultimately, the vitality of Telugu literary activism will depend not on rhetoric alone, but on its ability to remain empathetic, inclusive, self-critical, and accessible to future generations. And therefore, the significance of ARASAM remains enduringly undisputed. 

‘అర‌సం’ నుంచి ‘విర‌సం’ వ‌ర‌కు తెలుగు సాహిత్య ప్ర‌స్థానం >>>>> వనం జ్వాలా నరసింహారావు

 

అర‌సం’ నుంచి ‘విర‌సం’ వ‌ర‌కు 

తెలుగు సాహిత్య ప్ర‌స్థానం

వనం జ్వాలా నరసింహారావు

ప్రజాతంత్ర దినపత్రిక (మే నెల, 31, 2026)

         {భావ కవిత్వం’ నుండి ‘విరసం’ వరకు సాగిన తెలుగు సాహిత్య ప్రస్థానం, సంప్రదాయం-ఆధునికత, భక్తి-తిరుగుబాటు, వ్యక్తివాదం-సమ‌ష్టివాదం వంటి విభిన్న ధోరణుల మధ్య జరిగిన చైతన్యవంతమైన సంఘర్షణను ప్రతిబింబిస్తుంది. ప్రతి దశ కూడా తెలుగు మాట్లాడే ప్రజల మారుతున్న ఆకాంక్షలను  పోరాటాలను అద్దం పట్టి చూపింది. క్రమంగా, సాహిత్యం వర్గ పోరాటానికి ఒక ఆయుధంగా రూపుదిద్దుకుంది; అది భూస్వామ్య వ్యవస్థను, పెట్టుబడిదారీ విధానాన్ని, కుల వ్యవస్థను విమర్శిస్తూనే, సామాజిక చైతన్యాన్ని నిరంతరం పునర్నిర్మించింది.} – ప్రజాతంత్ర సంపాదకుడి క్లుప్త వ్యాఖ్య

          2026 మే 23, 24 తేదీలలో తిరుపతిలో ఇటీవల రెండు రోజుల పాటు జరిగిన అభ్యుదయ రచయితల సంఘం (అర‌సం) 20వ రాష్ట్ర స్థాయి సమావేశాలు, ప్రసార, ప్రింట్ మాధ్యమాలలో నివేదించిన‌ విధమైన కార్యకలాపాల కంటే చాలా లోతైన సందేశాలను కలిగి ఉన్నాయి. అయితే వాటిని ‘అంతరార్థంలో’ శోధించిన‌ప్పుడు మాత్ర‌మే ఇవి అర్థ‌మ‌వుతాయి. సామాజిక బాధ్యతతో కూడిన సృజనాత్మకత పట్ల నిరంతర నిబద్ధతకు  ‘అర‌సం ‘ ప్రతీకగా నిలుస్తూనే ఉందనేది నేను అవగాహన చేసుకున్నాను.  ప్రజాస్వామ్య విలువలు, పౌర స్వేచ్ఛలు, బహుళత్వం, రాజ్యాంగ రక్షణలు జాగృత ప్రజా భాగస్వామ్యాన్ని కోరుతున్న తరుణంలో, వారి చర్చలు సామూహిక సాంస్కృతిక భాగస్వామ్యాన్ని పునరుద్ధరించే ప్రయత్నాలను ప్రతిబింబిస్తున్నాయి.

         ఈ నేపథ్యంలో, సుమారు నాలుగున్నర దశాబ్దాల క్రితం, 1982 జూన్ నెలలో హైదరాబాద్ నగరంలోని మా నివాసంలో జరిగిన ఒక సంఘటన నాకు ఇప్పటికీ గుర్తుకు వ‌స్తోంది. ఆ సాయంత్రం ప్రజాకవి కాళోజీ నారాయణరావు గారిని మా కుటుంబ అతిథిగా ఆతిథ్యం ఇచ్చే అదృష్టం నాకు కలిగింది. చింతపండు, ఉల్లిపాయలు, మిరపకాయలు, బెల్లం, కొత్తిమీర, కరివేపాకు, వెల్లుల్లి వంటి తేలికపాటి స్థానిక సుగంధ ద్రవ్యాలతో తయారుచేసే, అప్పుడప్పుడు కాలానుగుణంగా చింతపండుకు బదులుగా ఉడికించిన పచ్చి మామిడికాయను కూడా వాడే, ప్రత్యేకమైన ‘పచ్చి పులుసు’ను నా భార్య కాళోజీ నారాయణరావు గారికి వడ్డించగానే,  ఆక్షణందాకా అక్కడు నెలకొన్న ఉల్లాసభరితమైన వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.

అప్పటి వరకు మేమిద్దరం సాధారణ సంభాషణలలో మునిగిపోయి, ఎక్కువగా కాళోజీ గారు సాహిత్య విషయాలపై చెప్పే విషయాలను వింటూ ఉన్నాము. కానీ  పచ్చిపులుసు వంటకాన్ని ముట్టుకోగానే, ఆయన గొంతు భావోద్వేగంతో నిండిపోయింది, దుఃఖంతో గొంతు పూడుకుపోయింది. అంతేకాదు ఆ సాయంత్రం అనుకోకుండా నిశ్శబ్దంలోకి జారిపోయింది. అక్షరాలా, కాళోజీ నారాయణరావు గారు భావోద్వేగానికి లోనవుతూ కన్నీటితో కుప్పకూలిపోయారు. కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉన్న తర్వాత, ఆయన తనంతట తానే తేరుకుని తన దుఃఖానికి గల కారణాన్ని వివరించారు. పైకి చిన్న విషయంగా అనిపించినప్పటికీ, త‌న‌కు ఎంతో ఇష్టమైన ‘పచ్చి పులుసు’ను చాలా కాలంగా రుచి చూడకపోవడం మొదటి కారణ. రెండవది, అలాంటి పచ్చిపులుసు డిష్ తో వడ్డించిన బోజనాన్ని ఒకప్పుడు చెరబండ రాజు గారి ఇంట్లో తాను తిన్న సంగతి గుర్తుకు రావ‌డం.

యాదృచ్ఛికంగా, అదే రోజు అంతకుముందే కాళోజి అనారోగ్యంతో ఉన్న చెరబండ రాజును పరామర్శించారు. ఆయన ఆరోగ్యం క్షీణిస్తుండటం చూసి తీవ్రంగా కలత చెంది, అది త‌న‌ దుఃఖాన్ని మరింత పెంచింది. దురదృష్టవశాత్తు, కాళోజీ నారాయణరావు మమ్మల్ని పరామర్శించిన కేవలం ఒక నెల తర్వాత, చెరబండ రాజు జైలు శిక్ష అనుభవిస్తూ, 1982 జూలైలో 38 ఏళ్ల వయసులో మరణించారు. మా ఇంట్లో భోజనం చేస్తున్న సమయంలో, కాళోజీ అనేక ఇతర విషయాలతో పాటు, ‘తెలుగు సాహిత్య ప్రస్థానం’ గురించి కూడా వివ‌రించారు. అందులోని కొన్ని అంశాలు ఇప్పటికీ నాకు అప్పుడప్పుడు గుర్తుకు వస్తుంటాయి. ప్రగతిశీల రాజకీయ ప్రభావాల నేపధ్యంలో పాక్షికంగా రూపుదిద్దుకున్న ఇటువంటి సాహిత్య ప్రవాహాల పట్ల నాకున్న నిరంతర ఆసక్తి, ఆ తర్వాత వాటికి సంబంధించిన అంశాలను అడపాదడపా సేకరించి, నమోదు చేయడానికి నన్ను పురికొల్పింది.

         అభ్యుదయ రచయితల సంఘం నుండి విప్లవ రచయితల సంఘం (విరసం) వరకు దిగంబర కవిత్వం ద్వారా సాగిన ‘తెలుగు సాహిత్య ప్రస్థానం’  పుట్టుక, ఉద్దేశం, పరిణామాన్ని విహంగ వీక్షణం రూపంలో అందించే ప్రయత్నమే ఇది. తెలుగు సాహిత్య పరిణామం ఎన్నడూ సరళరేఖా మార్గంలో సాగలేదు. అది పెను మార్పులు, చైతన్యాలు, అసమ్మతి, ఆత్మపరిశీలన, సామాజిక ఆవశ్యకతల ద్వారా ముందుకు సాగింది. భక్తిరస శాస్త్రీయత నుండి శృంగారరస భావన వరకు, ప్రగతిశీల మానవతావాదం నుండి తిరుగుబాటు ప్రతిఘటన వరకు,  తమతమ కాలంలోని ఆందోళనలను, ఆకాంక్షలను ప్రతిబింబించే సాధనంగా త‌ర్వాతి త‌రాల‌కోసం భాషను పునర్నిర్మించాయి.

కవిత్వం, గద్యం, నాటకం, విమర్శ, ప్రజా ప్రసంగం అనేవి సామూహిక చైతన్యానికి అద్దం ప‌ట్టాయి. అవి కేవలం సౌందర్యాత్మక పరిణితిని మాత్రమే కాకుండా, ఆకలి, అన్యాయం, పరాయీకరణ, తిరుగుబాటు, ఆశలను కూడా నమోదు చేశాయి. ఈ నిరంతర ప్రవాహంలోనే సృజనాత్మక వ్యక్తీకరణను సామాజిక జోక్యంగా మార్చిన శక్తివంతమైన ప్రవాహాలు ఉద్భవించాయి. సంస్కరణవాద భావ‌జాలం సాంప్రదాయవాదాన్ని సవాలు చేసింది, ప్రగతిశీల ఆలోచన సాహిత్యాన్ని శ్రామిక వర్గాలతో అనుసంధానించింది. దిగంబర కవిత్వం వ్యక్తీకరణ కృత్రిమత్వాన్ని ఛేదించింది.  విప్లవ స్వరాలు కవిత్వాన్ని సైద్ధాంతిక ప్రకటనగా మార్చాయి.

కాళోజీ నారాయణరావు, శ్రీశ్రీ, చెరబండ రాజు, వరవరరావు, ఆరుద్ర వంటి మహనీయులు కేవలం పద్యాలు, గేయాలు రచించడమే కాకుండా, సృజనాత్మకతకు, సమాజానికి మధ్య ఉన్న సంబంధాన్ని కూడా పునర్నిర్వచించారు. శతాబ్దాలుగా తెలుగు మేధోసంస్కృతిలో జరిగిన పరివర్తన, భావోద్వేగపరంగా ఆదర్శవాదం క్రమంగా వాస్తవికవాదానికి, అసమ్మతికి, అస్తిత్వ అన్వేషణకు, విప్లవవాత్మ‌క‌ నిమగ్నతకు ఎలా చోటు కల్పించిందో చూపిస్తుంది. అరసం, విరసం వంటి సంస్థలు కళాత్మక విశ్వాసం, రాజకీయ చైతన్యం, ప్రజా బాధ్యత కలిసే వేదికలుగా మారాయి. తెలుగు సాహిత్యం అసమానత, అణచివేత, నైతిక వైరుధ్యాలను ఎదుర్కొంటూనే, సాంస్కృతిక స్మృతిని కాపాడుకుంటూ నిరంతరం తనను తాను పునరావిష్కరించుకుంది.

మారుతున్న ఈ యుగం  ముఖ్య లక్షణాలలో అణగారిన వారి పట్ల ఆందోళన, సమానత్వంతో కూడిన వర్గరహిత సమాజం అనే దార్శనికత, ఆలోచనలో వాస్తవికవాదం, భాషలో ఆధునికత ఉన్నాయి. శ్రీశ్రీ ‘ప్రగతిశీల కవితా ఉద్యమ సారథి’గా నిలిచారు. స్వేచ్ఛా పద్యాన్ని అద్భుతమైన సులభత్వంతో స్వీకరించిన ‘అభ్యుదయ కవిత’ తెలుగు సాహిత్యాన్ని గణనీయంగా మార్చివేసింది. అది ‘అరసం’ ఆవిర్భావానికి కూడా నాంది పలికింది. స్వాతంత్య్రం వల్ల సామాన్యుడు నిజంగా ఏమి పొందాడు అనే దానిపై ఆత్మపరిశీలన మొదలైంది. బలహీన వర్గాల కోసం గళం విప్పాల్సిన అవసరం స్పష్టంగా, అనివార్యంగా మారింది. ఆ గళమే కవిత్వంగా రూపాంతరం చెంది ‘దిగంబర కవిత్వం’గా ప్రజలకు చేరింది.

ఇది తెలుగు సాహిత్యంలోని కపటత్వాన్ని బద్దలు కొట్టి, నిజమైన మాన‌వుడిని కనుగొనడానికి ప్రయత్నించింది. కాళోజీ నారాయణరావు ప్రస్తావించిన చెరబండ రాజు (బద్దం భాస్కర రెడ్డి), అరవ‌య్య‌వ  దశాబ్దం చివరిలో ‘దిగంబర కవులు’ (నగ్న కవులు)గా ప్రసిద్ధి చెందిన మరో ఐదుగురు కవులతో పాటు ప్రాచుర్యం పొందిన ఒక తెలుగు విప్ల‌వ క‌వి,  నవలా రచయిత, గేయరచయిత. వీరు నిఖిలేశ్వర్ (యాదవ రెడ్డి), జ్వాలా ముఖి (వీర రాఘవాచార్యులు), న‌గ్న ముని (మానేపల్లి హృషికేశ్వరరావు), మహా స్వప్న (కమ్మిశెట్టి వెంకటేశ్వరరావు), భైరవాయ (మన్మోహన్ సహాయ్) వంటి భావోద్వేగభరితమైన మారుపేర్లను స్వీకరించారు.

వారు తెలుగు సాహిత్యంలో ప్రత్యేకంగా నిలిచే, అత్యంత వినూత్నమైన, సాటిలేని కవితా సంపదను సృష్టించారు. శ్రీకాకుళం గిరిజన పోరాటాల నేపథ్యంలో, విప్లవ కవిత్వం ఒక పెను తుఫానులా తెలుగు సాహిత్యంలోకి దూసుకొచ్చింది. అభ్యుదయ కవిత్వం తన పోరాట స్ఫూర్తిని కోల్పోయిందని భావించిన ‘దిగంబర కవులు’, క్రమంగా ‘విప్లవ రచయితలు’గా పరిణామం చెందారు. కాలక్రమేణా, చెరబండరాజు, జ్వాలాముఖి, నిఖిలేశ్వర్, నగ్నమునిలతో కలిసి మార్క్సిస్టు-లెనినిస్టు రచయితలుగా మారి, ‘విప్లవ రచయితల సంఘం (విర‌సం)ను కూడా స్థాపించారు.

వరవరరావు, శ్రీశ్రీ, కుటుంబరావు, రాచకొండ విశ్వనాథశాస్త్రి , రమణారెడ్డి వంటి ప్రముఖ విప్లవ రచయితలు జూలై 4, 1970న ‘విరసం’ను స్థాపించిన‌వారిలో ఉన్నారు. శివసాగర్, గద్దర్, వంగపండు వంటి ఇతర ప్రభావశీల గళాలు కూడా ఈ ఉద్యమంతో అనుబంధం కలిగి ఉన్నాయి. చెరబండరాజు తన మరణం వరకు ఈ సంస్థలో క్రియాశీలకంగా కొనసాగారు. మార్క్సిస్టు తాత్విక పునాది నుండి ఉద్భవించిన 1930ల నాటి అభ్యుదయ కవిత్వం, మహాకవి శ్రీశ్రీ (శ్రీరంగం శ్రీనివాసరావు), ఆరుద్ర, అవంత్స సోమసుందర్, కుందుర్తి ఆంజనేయులు వంటి ప్రముఖ కవులను తెలుగు సాహిత్యానికి అందించింది.

తన మార్గమే విప్లవ మార్గమని శ్రీశ్రీ ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల అంతటా సాగిన విప్లవ ఉద్యమాలకు మద్దతు ఇవ్వడం, వాటి చరిత్రను ప్రతిబింబించడం, విప్లవ ఆదర్శాలను ప్రచారం చేయడం విప్లవ కవిత్వానికి ప్రధాన లక్షణాలుగా మారాయి. ప్రజలను సమూల మార్పుల దిశగా ప్రేరేపించడం, జాతీయ, అంతర్జాతీయ పరిణామాలకు స్పందించడం, పేదల జీవితాలను, గళాలను సాహిత్యంలోకి తీసుకురావడం ఈ కవిత్వం  ఆశయాలుగా నిలిచాయి. ఈ క్రమంలో విప్లవ కవిత్వం భావనలోనూ, భాషలోనూ గణనీయమైన మార్పులను తీసుకువచ్చింది.

భావ కవిత్వం’ నుండి ‘విరసం’ వరకు సాగిన తెలుగు సాహిత్య ప్రస్థానం, సంప్రదాయం-ఆధునికత, భక్తి-తిరుగుబాటు, వ్యక్తివాదం-సమ‌ష్టివాదం వంటి విభిన్న ధోరణుల మధ్య జరిగిన చైతన్యవంతమైన సంఘర్షణను ప్రతిబింబిస్తుంది. ప్రతి దశ కూడా తెలుగు మాట్లాడే ప్రజల మారుతున్న ఆకాంక్షలను  పోరాటాలను అద్దం పట్టి చూపింది. క్రమంగా, సాహిత్యం వర్గ పోరాటానికి ఒక ఆయుధంగా రూపుదిద్దుకుంది. భూస్వామ్య వ్యవస్థను, పెట్టుబడిదారీ విధానాన్ని, కుల వ్యవస్థను విమర్శిస్తూనే, సామాజిక చైతన్యాన్ని నిరంతరం పునర్నిర్మించింది.

క్రమమైన మార్పును ఆకాంక్షించిన అరసం, సాహిత్యంలోకి సాంఘిక చైతన్యాన్ని ప్రవేశపెట్టి పునాది వేసింది. మానసిక లోతులను అన్వేషించిన దిగంబర కవులు, అస్తిత్వవాద, ఆధునికవాద ఇతివృత్తాల వైపు ఒక మేధోపరమైన మార్పుకు ప్రాతినిధ్యం వహించారు. వ్యవస్థాగత విప్లవాన్ని లక్ష్యంగా పెట్టుకున్న విరసం, సాహిత్యాన్ని ఒక విప్లవ సాధనంగా మార్చింది. ప్రతి ఉద్యమం దాని కాలంలోని సామాజిక-రాజకీయ వాతావరణాన్ని ప్రతిబింబిస్తూ, సంస్కరణవాదం నుండి తీవ్రవాద భావజాలాల వైపు ఒక ప్రగతిని సూచించింది. ఇవన్నీ కలిసి ఆధునిక తెలుగు సాహిత్య ప్రస్థానంలోని ఒక సుసంపన్నమైన చిత్రాన్ని ఆవిష్కరిస్తాయి.

ఈ నేపథ్యంలో, అరసం తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఉన్న ప్రగతిశీల రచయితల విస్తృత భాగస్వామ్యంతో తన 20వ రాష్ట్ర స్థాయి సమావేశాలను నిర్వహించింది. మీడియా నివేదికల ప్రకారం, ప్రముఖ సాహిత్యవేత్తలతో కూడిన కొత్త రాష్ట్ర కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. ప్రగతిశీల బృందాలు అంతర్గత విభేదాలు అధిగమించి, జాతీయ, సామాజిక సమస్యలపై ఏకం కావాలని గట్టిగా విజ్ఞప్తి చేశారు.  సాహిత్యం ద్వారా సాంఘిక సంస్కరణ, ప్రజలను ఏకం చేయడంలో సాహిత్యానికి ఉన్న అద్వితీయ శక్తి, ప్రజాస్వామ్య రాజ్యాంగ హక్కులను పరిరక్షించడంలో సాహిత్య సంస్థల ఆవశ్యకత అనేవి ప్ర‌ధాన ఇతివృత్తాలు.

మానవ బాధలు, నైతిక బాధ్యత, రాజ్యాంగ నైతికత, సామాజిక పరివర్తనలతో ముడిపడి ఉన్నప్పుడే సృజనాత్మక వ్యక్తీకరణకు శాశ్వతమైన ప్రాసంగికత లభిస్తుందని సమకాలీన తెలుగు మేధో చరిత్ర నిరూపిస్తుంది. ప్రతి దశ తనదైన ప్రత్యేక సహకారాన్ని అందించింది. సైద్ధాంతిక విభేదాలు సామూహిక గమనాన్ని బలహీనపరిచినప్పటికీ, ఈ ఉద్యమాల  బృహత్తర కృషి సుస్పష్టంగా నిలుస్తుంది. అవి చర్చను ప్రజాస్వామ్యీకరించాయి, భాగస్వామ్యాన్ని విస్తరించాయి, కుల, వర్గ శ్రేణులను సవాలు చేశాయి, నిరంకుశ ధోరణులను ప్రశ్నించాయి.

సాహిత్యాన్ని ఒక ఏకాంత విద్యా కార్యకలాపంగా కాకుండా ఒక సజీవ ప్రజాశక్తిగా స్థాపించాయి. అంతిమంగా, తెలుగు సాహిత్య క్రియాశీలత  చైతన్యం కేవలం వాక్చాతుర్యం పైనే కాకుండా, అది సానుభూతితో, సమ్మిళితంగా, స్వీయ-విమర్శనాత్మకంగా, భవిష్యత్ తరాలకు అందుబాటులో ఉండే దాని సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. అందువల్ల, ‘అరసం’  ప్రాముఖ్యత శాశ్వతంగా వివాదరహితంగా నిలిచి ఉంటుంది.

(My The Telugu Literary Journey has incessantly reinvented itself’ ఆంగ్ల వ్యాసానికి ప్రజాతంత్ర పత్రిక వారు సుహృద్భావంతో చేసిన చక్కటి, స్వేచ్చానువాదం. సంపాదకుడు అజయ్ కు అనువాదకులకు హృదయపూర్వక ధన్యవాదాలు)

Saturday, May 30, 2026

కృష్ణ రాయబారం, సమరానికి ‘సై’ >>>>> (18 రోజుల కురుక్షేత్ర మహాభారత సంగ్రామ విశేషాలు-1) : వనం జ్వాలా నరసింహారావు

 కృష్ణ రాయబారం, సమరానికి ‘సై’

(18 రోజుల కురుక్షేత్ర మహాభారత సంగ్రామ విశేషాలు-1)

వనం జ్వాలా నరసింహారావు

(భక్తి పత్రిక, జూన్ నెల 2026)

{తింటే గారెలే తినాలి...వింటే భారతం వినాలి. తెలుగువారికి మహాభారతం అంటే తగని ప్రీతి. పద్దెనిమిది పర్వాల మహాభారతంలో కురుక్షేత్ర సంగ్రామ ఘట్టం ఆద్యంతమూ ఆసక్తికరమైనది. అచ్చంగా భారతంలో పర్వాల సంఖ్య వలెనె కురుక్షేత్ర సంగ్రామం కూడా పద్దేనిమిడ్ అక్షౌణిల సేనావాహిని మధ్య పద్దేనిమిడ్ రోజులపాటు జరగడం విశేషం. కురుక్షేత్ర సంగ్రామ విశేషాలను ఆంధ్రమహాభారతం ఆధారంగాపద్దెనిమిది భాగాలుగా భక్తి పత్రిక పాఠకులకు అందించబోతున్నాం. అందులో ఇది మొదటి భాగం.)-సంపాదకుడు, భక్తి పత్రిక  

కురుక్షేత్ర సంగ్రామం పూర్వరంగంలో రాజనీతికి శిఖరాయమాణమైన రాయబార ఘట్టంలో శ్రీకృష్ణుడు ఒక దివ్యాదివ్యవిభావం.  కౌరవుల దగ్గరికి రాయబారిగా వచ్చిన శ్రీకృష్ణుడు, ప్రముఖులందరూ కూర్చున్న తరువాతనే కూర్చున్నాడు. సభ అంతటా శ్రీకృష్ణాధీనమైన ఒక దివ్యానుభూతి వాతావరణం నెలకొన్నది. కొలువుకూటంలో వున్న వారందరూ శ్రీకృష్ణ సందర్శనంతో సంతోష పరవశులయ్యారు. శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రుడిని ఉద్దేశించి, కౌరవపాండవులు పాలు, నీరులాగా కలసి మెలసి జీవించడం మంచి పనని, వారలా వుండే విధంగా నడిపించడం ధృతరాష్ట్రుడి బాధ్యత అని అన్నాడు. ఆ విధంగా ‘న్యాయం, హితంతెలియచేశాడు. భరతవంశ గౌరవ, సంప్రదాయ పరిరక్షణను సోదాహరణంగా వివరించాడు.

భరతవంశపు కీర్తి

         ‘భరతవంశం ధర్మం, న్యాయం, సత్యం, పొత్తు, పెంపు, కరుణ కలిగి నుతి కెక్కింది. దాయాది భాగాలకై తగవులాడుకొని కుత్తుకలను ఉత్తరించుకోవటానికి ఎప్పుడూ సిద్ధం కాలేదు. రాజ్యాన్ని త్యాగం చేయటమే గాని దానికై వంశ నాశనానికి పూనుకోవటం భరతవంశ సంప్రదాయం కాదు. ఆ వంశం యొక్క సుచరిత్ర క్రమాన్ని ఇప్పుడు తప్పటం దేనికి’ అని అంటూ, ధృతరాష్ట్రుడు కౌరవవంశ రాజులలో అగ్రగణ్యుడు కావాలంటే ఈ న్యాయం పాటించాలని శ్రీకృష్ణుడు అపష్టం చేశాడు. దుర్యోధనాదులు భరతవంశ సంప్రదాయాన్ని కలుషితం చేస్తున్నారని కూడా అన్నాడు. కౌరవపాండవుల మధ్య  యుద్ధమే జరుగుతే మహావిపత్తు కలుగుతుందని, తన మాటలమీద విశ్వాసం వుంచి సంధి జరిపించాలని కోరాడు. శ్రీకృష్ణుడు పాండవులు చెప్పమన్న మాటలు కూడా ధృతరాష్ట్రుడితో వివరంగా చెప్పాడు.

సందికార్యం ధృతరాష్ట్రుడి చేతిలోనే వుందని, ‘ధర్మం అధర్మం చేత, సత్యం అసత్యం చేత ఫలితాన్ని పొందలేని దుస్థితి కలిగినప్పుడు సమర్థులు ఉపేక్షించ కూడదు. అలా చేస్తే వారికే చేటు కలుగుతుంది. కౌరవుల వలన సత్యానికి ధర్మానికి హాని చేకూరింది. సత్యాన్ని, ధర్మాన్ని పాలించే పాండవులను దైవం తప్పక రక్షిస్తాడు’ అని చెప్పాడు. సభలో వున్న జామదగ్న్య మహాముని, కణ్వమహాముని, నారదుడు, శ్రీకృష్ణుడి మాటలు విని కురువంశాన్ని కాపాడమని దుర్యోధనుడికి చెప్పారు. తానేమీ చేయలేనని ధృతరాష్ట్రుడు తన అభిప్రాయాన్ని చెప్పాడు.

         విశ్వరూప ప్రదర్శన

దుర్యోధనుడు క్షత్రియ ధర్మం ప్రకారం తాను యుద్ధం చేస్తానన్నాడు. యుద్ధం చేస్తే విజయమో, వీరస్వర్గమో లభిస్తుందని, పాండవులకు సగ భాగం ఇవ్వడానికి తాను అంగీకరించనన్నాడు. తామూ, పాండవులు భూమిని పంచుకుని పరిపాలించడం జరగదని, ‘వాడి సూది మొన మోపినంత మాత్రమైనా భూమినిపంచి పాండవులకు తానివ్వనని, తమలో ఎవరో ఒకరు యుద్ధంలో విజయం సాధించి రాజ్యం చేయాలని తన నిర్ణయమని అన్నాడు దుర్యోధనుడు. దుర్యోధనుడు చెప్పినట్లే రణరంగంలో అతడు ఓడిపోతాడని, యుద్ధం రాబోతున్నదని శ్రీకృష్ణుడు స్పష్టం చేశాడు. గాంధారి హితవాక్యాలు కూడా దుర్యోధనుడికి నచ్చలేదు.

         తనను బంధించాలని ప్రయత్నం చేసిన దుర్యోధనుడిని చూసి, శ్రీకృష్ణుడు చిరునవ్వుతో విశ్వరూపం ప్రదర్శించాడు. నారదాది మహర్షులకు, భీష్మ, ద్రోణ, విదుర, సంజయులకు తన విశ్వరూపం చూడడానికి దివ్యదృష్టి ప్రసాదించాడు శ్రీకృష్ణుడు. తనకు కూడా ఆ భాగ్యాన్ని కలిగించమని వేడుకున్న ధృతరాష్ట్రుడికి కూడా దివ్యదృష్టిని ఇచ్చాడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రుడి కోరిన విధంగా మల్లీ గుడ్డివాడిని చేసి, విశ్వరూపాన్ని ఉపసంహరించాడు. శ్రీకృష్ణుడు సభ నుండి బయల్దేరి వెళ్లిపోయాడు. 

ఆ తరువాత శ్రీకృష్ణుడు కర్ణుడి దగ్గరికి వెళ్లాడు. కర్ణుడి జన్మ రహస్యం చెప్పాడు. కుంతీదేవి సూర్యుడివల్ల అతడికి జన్మనిచ్చిందని, అందువల్ల ఆయన పాండురాజు పెద్ద కుమారుడని, కర్ణుడు తమ అన్న అని ధర్మరాజుకు తెలిస్తే అతడికే రాజ్యభారం వహించడానికి పట్టం కడుతారని, కాబట్టి తనతో కలిసి పాండవుల దగ్గరికి కలిసి రమ్మని అన్నాడు. దేవేంద్ర వైభవంతో మహానీయుడివై మహీమండలాన్ని పరిపాలించమని పలికాడు. కుంతీదేవి తనను కనికరం లేకుండా గంగలో తోసిందనీ, సూతదంపతులు తనను దయతో పెంచారనీ, తనను వారు కన్నకుమారుడిలాగా చూశారనీ, ఇప్పుడు వారిని వదిలితే ధర్మం తప్పినవాడిని అవుతాననీ కర్ణుడు బదులు చెప్పాడు.

ధర్మజుని యుద్ధ సన్నాహాలు

శ్రీకృష్ణుడు హస్తినాపురం నుండి ఉపప్లావ్యానికి వచ్చి ధర్మరాజును కలిసి, కౌరవులు సంధికి అంగీకరించలేదని చెప్పాడు. దుర్యోధనుడు యుద్ధం చేస్తాడు కాని పాండవులకు రాజ్యం ఇవ్వడని స్పష్టం చేశాడు. అంతా విన్న ధర్మరాజు రణరంగానికి కదలమని తమ్ములను ఆదేశించాడు. పాండవుల పక్షాన వున్న ఏడక్షౌహిణుల సైన్యాన్ని నడిపించగలిగి, భీష్ముడిని ఎదుర్కునే శక్తి-సామర్థ్యాలు కల మేటి విలుకాడెవ్వరని ఆలోచనచేసి, ద్రోణాచార్యుడిని నిర్మూలించడానికే ఉద్భవించి, బాహుబలం, ప్రతాపం కలవాడైన ధృష్టద్యుమ్నుడు సర్వసైన్యాధిపతిగా  వుండడానికి తగినవాడని నిర్ణయించారు.

ఆ తరువాత ఏడక్షౌహిణుల సైన్యానికి విడివిడిగా అధిపతులను శ్రీకృష్ణుడినే నిర్ణయించమని ధర్మరాజు కోరాడు. ద్రుపదుడిని, విరాటుడిని, సాత్యకిని, జరాసంధుడి కుమారుడు సహదేవుడిని, చేకితానుడిని, శిశుపాలుడి కొడుకు ధృష్టకేతువుని, శిఖండిని ఏడక్షౌహిణులకు అధిపతులుగా నియమించమని శ్రీకృష్ణుడు సలహా ఇచ్చాడు. ఇది జరిగిన మర్నాడు ధర్మరాజు నిండు కొలువులో శ్రీకృష్ణుడి ఆదేశానుసారం ద్రుపదుడు మొదలైనవారిని వేర్వేరుగా అక్షౌహిణులకు నాయకులను చేశాడు. ధృష్టద్యుమ్నుడికి ప్రత్యేకంగా అభిషేకం చేసి, సర్వసేనాధిపత్యానికి పట్టం కట్టాడు. ప్రయాణ భేరి మోగగానే యుద్ధయాత్రకు సమస్త సైన్యాలు సంసిద్ధమయ్యాయి. పాండవులు ద్రౌపదీదేవికి వెళ్లి వస్తామని చెప్పి వీడ్కోలు తీసుకున్నారు.

ధర్మరాజు రథాన్ని అధిరోహించాడు. ఆయనకు నమస్కరించిఅర్జునుడు శ్రీకృష్ణుడి సారథ్యంలోని రథం మీద ఎక్కి తన శంఖాన్ని పూరించాడు. ఆ రథం మీద హనుమద్ద్వజం రెపరెపలాడుతున్నది. భీముడు, నకులుడు, సహదేవుడు, అభిమన్యుడు, ఉపపాండవులు రథాలను అధిరోహించే ముందర ధర్మరాజుకు నమస్కరించారు. ధృష్టద్యుమ్నుడు ధర్మరాజుకు సాగిలపడి నమస్కరించి అశ్వాన్ని అధిరోహించాడు. సేనతో కలిసి ధర్మరాజు కురుక్షేత్రాన్ని సమీపించాడు. హిరణ్వతి అనే ఒక పవిత్ర నది ఒడ్డున ఆగాడు. శ్రీకృష్ణుడు యుద్దారంభానికి సిద్ధమనే సంకేతంగా పాంచజన్యాన్ని పూరించాడు. ధర్మరాజాదులు కూడా అలాగే తమ వీరశంఖాలను పూరించారు.

కౌరవుల పక్షాన ...

ఇదిలా వుండగా, తాము సైన్యంతో విడిది చేయాల్సిన స్థలం కురుక్షేత్రమని అంటూ, దుశ్శాసనుడిని అన్ని పనులు చూసుకోమని  చెప్పిన దుర్యోధనుడు మర్నాడు కొలువు కూటానికి వచ్చాడు. ద్రోణాచార్యుడిని, రాధేయుడిని, అశ్వత్థామను, బాహ్లికుడిని, శల్యుడిని, కృపాచార్యుడిని, భూరిశ్రవుడిని, శకునిని, కృతవర్మను, కాంభోజరాజును, సైంధవుడిని కౌరవుల పదకొండక్షౌహిణులకు సేనానాయకులుగా నియమించాలని నిశ్చయించిన దుర్యోధనుడు వారందరినీ సభకు పిలిపించాడు. వారిని సేనాపతిత్వానికి అభిషిక్తులు కమ్మని కోరి, వారందరినీ వైభవంగా అక్షౌహిణీపతులుగా అభిషిక్తులను చేశాడు దుర్యోధనుడు.

         భీష్ముడి దగ్గరికి వెళ్లి వారిని సేనానాయకులుగా పరిచయం చేశాడాయనకు. యావత్ యుద్ధానికి రణభారం వహించి సర్వసైన్యాధిపత్యం నిర్వహించడానికి అంగీకరించమని భీష్ముడిని ప్రార్థించాడు. తాను సర్వసేనాధిపత్యం వహిస్తానని, తనను ఎదుర్కోగల పురుషులెవ్వరూ భూమ్మీద లేరని, అయితే తాను ఆర్జునుడిని మాత్రం ఎదుర్కోలేనని అన్నాడు. పాండుకుమారులను సంహరించడానికి తనకు చేతులు రావని కూడా చెప్పాడు. ముందు తనను కాని, కర్ణుడిని కాని యుద్ధం చేయడానికి నియోగించమని అన్నాడు. అలా అయితేనే తాను సర్వసేనాధిపత్యం వహిస్తానని స్పష్టం చేశాడు. తానెలాగు భీష్ముడు రణరంగంలో నేలకూలేదాకా యుద్ధం చేయనన్నానుగా అన్నాడు కర్ణుడు. సరే అని భీష్ముడు కౌరవుల సర్వసేనాధిపతిగా పట్టం కట్టుకోవడానికి అంగీకరించాడు. దుర్యోధనుడు సర్వసేనాధిపత్యానికి భీష్ముడిని అభిషేకించి, ఆయన్ను ముందుంచుకొని కురుక్షేత్రానికి నడిచాడు. కురుక్షేత్రంలో కౌరవ-పాండవ సేనలు చేరి యుద్ధానికి సిద్ధమయ్యాయి. 

సంజయుని వ్యాఖ్యానం

పుణ్యక్షేత్రమైన కురుక్షేత్రంలో కౌరవపాండవులు యుద్ధానికి సంసిద్ధమై వున్న సమయంలో సంజయుడితో కూడి వున్న ధృతరాష్ట్రుడి దగ్గరకు వేదవ్యాస మహర్షి వచ్చాడు. యుద్ధాన్ని ఆయన ప్రత్యక్షంగా చూడాలనుకుంటే దివ్యదృష్టిని ఇస్తానని అన్నాడు. జవాబుగా ధృతరాష్ట్రుడు, అన్నదమ్ముల మధ్య జరిగే ఘోర యుద్ధాన్ని తాను చూడలేనని, కేవలం వినగలనని, ఆ ఏర్పాటు చేస్తే చాలని కోరాడు. వేదవ్యాసుడు కరుణించి, యుద్ధ విషయాలను ధృతరాష్ట్రుడికి జరిగినవి జరిగినట్లుగా చెప్పడానికి సంజయుడిని నియోగించాడు. సంజయుడికి కొన్ని అతిలోక శక్తులు ప్రసాదించాడు. దాని ప్రకారం, సంజయుడు యుద్ధభూమిలో ఇష్టం వచ్చినట్లు నిర్భయంగా తిరగవచ్చు. అతడిని ఏ ఆయుధాలు తాకలేవు. అందరి మాటలు వినగలదు. మనసులను పసిగట్టగలడు.

వేదవ్యాసుడు అంతర్థానమై పోయిన తరువాత, ‘రాజుకు భూమి కామధేనువై వర్తిల్లుతుంది. శక్తి, సామర్థ్యాలున్న రాజులు, ఉపాయంకల రాజులు, తమకు ఎంతో విశాలమైన రాజ్యం ఉన్నప్పటికీ, తృప్తి చెందక, తండ్రి-కొడుకు, అన్న-తమ్ముడు అనే విచక్షణ లేకుండా యుద్ధం చేసి భూమిని బలవంతంగా లాక్కుంటారు అని చెప్పాడు సంజయుడు. పూర్వకాలం నుండి రాజులు భూమికోసం పోరాడుతూనే వున్నారని, కౌరవపాండవులు కూడా భూమికోసం పోరాడడం వెనుకటి పరిపాటిమాత్రమే కాని కొత్త తప్పేమీ కాదని అన్నాడు. దైవం ఎవరిని అనుకూలిస్తే వారికి విజయం చేకూరుతుందని, ఏం జరగనున్నదో అని ధృతరాష్ట్రుడు దుఃఖించాల్సిన పని లేదని చెప్పాడు. వేదవ్యాసుడిని మనసులో ధ్యానం చేసుకుని, సంజయుడు, తాను చూసిన, తనకు తెలియవచ్చిన భారత యుద్ధ విశేషాలను యుద్ధం మొదలైనప్పటి నుండి ధృతరాష్ట్రుడికి వివరించసాగాడు.

సమరానికి ప్రారంభం      

మర్నాడు సూర్యోదయం కాగానే యుద్ధం ఆరంభం అయింది. సేనాపతైన భీష్ముడు ప్రత్యేక ఆకర్షణగా వెలుగొందాడు. ఆయన రథం, దానికి కట్టిన గుర్రాలు, ఆయన ధరించిన వస్త్రాలు, పట్టుకున్న ధనుస్సు, బంగారు తాడిచెట్టుతో రెపరెపలాడుతున్న జెండా, కాంతులీనే కవచం అన్నీ ప్రత్యేకంగా కనిపించాయి. ఇక మిగిలిన మహావీరుల రథాలు, జెండాలు కూడా ప్రత్యేకంగానే వున్నాయి.

పూర్వం మహావీరులు తమ రథాలకు అమర్చిన జెండా మీద వారిని స్ఫురింపజేసే ఒక చిహ్నం ఫలానా వీరుడని గుర్తు పట్టడానికి వీలుగా వుండేది. ద్రోణాచార్యుడి జెండా గుర్తు బంగారంతో నిర్మింపబడిన యజ్ఞవేదిక. కృపాచార్యులవారి జెండా బంగారం కాంతితో మెరసిపోయే ఆబోతు విలాస వైభవం.  ద్రోణాచార్యుడి కుమారుడు అశ్వత్థామ జెండా గుర్తు, వెలుగులు విరజిమ్మే మణి నిర్మితమైన సింహం తోక.  శల్యుడి జెండా గుర్తు, రత్నాల రాళ్లతో ధగ ధగా మెరిసిపోయే అరటిచెట్టు. వీరంతా తమ రథాలపై వారి జెండాలు రెపరెపలాడుతుండగా, ముచ్చట్లు చెప్పుకొంటూ, అమితోత్సాహంతో, చతురంగబలాలతో పరిహాస వచనాలు వెదజల్లుకుంటూ కదనరంగానికి కదలి వెళ్లారు.    

కృతవర్మ, జయద్రథుడు, విందుడు, అనువిందుడు, భగదత్తుడు, శకుని, బాహ్లికుడు, సోమదత్తుడు, భూరిశ్రవుడు, సుదక్షిణుడు, బృహద్బలుడు, నీలుడు, సుశర్మ, అలంబసుడు, హలాయుధుడు, సాల్వ, సౌవీర, శూరసేన, ఆభీర, యవన మొదలైన రాజులందరూ యుద్ధభూమికి తరలి వెళ్లారు కౌరవుల పక్షాన. వీరివెంట పది అక్షౌహిణుల సైన్యం తరలి వెళ్లగా, పదకొండో అక్షౌహిణి బలం వెంటరాగా సార్వభౌముడు దుర్యోధనుడు కదన రంగానికి కదిలి వెళ్లాడు. అతడి వెంట ఆయన తమ్ములు దుశ్శాసనుడు, దుర్మర్షణుడు, వివింశతి, వికర్ణుడు వెళ్లారు. (మహాభారత యుద్ధంలో కౌరవుల పక్షాన 11, పాండవుల పక్షాన 7 అక్షౌహిణిల సైన్యం పాల్గొంది. అక్షౌహిణి అనగా: 218170 రథాలు, 218170 గజాలు, 65610 గుర్రాలు, 109350 కాల్బలం)

వ్యూహ ప్రతివ్యూహాలు  

మహాభారత యుద్ధంలో నేటి భారత దేశం ఎల్లలు దాటిన కాంభోజ దేశం నుండి సేనలు, యవనులు, రాక్షసులు పాల్గొనడం ఒక విశేషం. ఒక విధంగా అది తొలి ప్రపంచ యుద్ధం’ అని ఒక మహాకవి వర్ణించారు. ఈ నేపధ్యంలో భీష్ముడు రాజులందరినీ ఒక చోట సమావేశపరచి, యుద్ధం స్వర్గంలో ప్రవేశించడానికి తెరువబడిన ద్వారం అని, రణరంగమే రాజులకు పంట చేనని, యుద్ధభూమిని దర్శించడం అంటే పెన్నిధిని చూసినట్లే అని అన్నాడు. రాజులలో ఉత్సాహం పొంగిపోయింది. కర్ణుడు, అతడి స్నేహితులు, కొడుకులు, మంత్రులు, బంధువులు యుద్ధంలో పాల్గొనకూడదని దుర్యోధనుడితో అన్నాడు భీష్ముడు. ఆ విధంగా భీష్ముడు కర్ణుడిని యుద్ధ రంగానికి రాకుండా నిషేధించాడు. ఇది దుర్యోధనుడికి బాధ కలిగించే అంశమైనా, భీష్ముడిని ప్రశంసించాడు.

భీష్ముడు మనుష్యాకారమైన ఒక గొప్ప ‘నరవ్యూహాన్ని’ అమర్చాడు. ఆ వ్యూహంలో భాగంగా యుద్ధం చేయడానికి తనతోపాటు ద్రోణుడిని, కృపాచార్యుడిని, అశ్వత్థామను, కృపవర్మను, శల్యుడిని, బాహ్లికుడిని, సోమదత్తుడిని, భూరిశ్రవుడిని నిలిపాడు. మధ్యలో దుర్యోధనుడు తన తమ్ములతో వుండేలా ఏర్పాటు చేశాడు ఆ వ్యూహాన్ని. ఆ వ్యూహంలో మరో విశేషం, ఆయా సైన్యాలను కాపాడడానికి రక్షగా ఏనుగులు అమర్చబడ్డాయి. వాటి ముందు రథాలు, రథాలకు రక్షగా అశ్విక బలాలు, అశ్విక బలాలకు రక్షగా విలుకాండ్రు, వారికి రక్షగా ఆయుధాలు ధరించిన సైనికులు నిలిచే ఏర్పాటు జరిగింది. ఇలాంటి దృఢమైన వ్యూహాన్ని కనీవినీ ఎరుగమని చూసిన వారంతా ఆశ్చర్యం చెందారు.

ఏడు అక్షౌహిణుల పాండవుల సేన సహితం యుద్ధ రంగానికి కదిలింది. ధర్మరాజు, ఆయన వెంట భీముడు వచ్చాడు. దేదీప్యమానంగా ప్రకాశించే ఆంజనేయుడి జెండా వున్న దివ్యమైన రథం మీద సారథిగా శ్రీకృష్ణుడు వుండగా, దేవదత్తం అనే శంఖం పూరిస్తూ అర్జునుడు యుద్ధ భూమికి బయల్దేరి వెళ్లాడు. నకుల సహదేవులు సల్లాపాలు ఆడుకుంటూ బయల్దేరి యుద్ధరంగానికి వచ్చారు. అభిమన్యుడు, ద్రౌపదీదేవి కొడుకులు ప్రతివింద్యుడు, శ్రుతసోముడు, శ్రుతకీర్తి, శతానీకుడు, శ్రుతసేనుడు రణరంగానికి కదలి వచ్చారు. ద్రుపదుడు, ఆయన కొడుకులు, తమ్ముళ్లు, విరాటుడు, సాత్యకి, చేకితానుడు, శిఖండి, మగధ దేశాధిపతి సహదేవుడు, ఆయన తమ్ముడు, ధృష్టకేతుడు, ఘటోత్కచుడు, పాండ్యరాజు; శిబిరాజు, కాశ కరూశాది రాజులు, పంచ కేకయులు కూడా యుద్ధానికి తరలి వచ్చారు. భీష్ముడి నరవ్యూహం కన్నా గొప్పదైన ‘అచల వ్యూహాన్ని దృష్టద్యుమ్నుడు పన్నాడు.

(తరువాయి వచ్చే సంచికలో)