Friday, December 6, 2013

భారత రత్న నెల్సన్ మండేలా:వనం జ్వాలా నరసింహారావు

నెల్సన్ మండేలా గురువారం, డిసెంబర్ 5, 2013 న మరణించారు

 భారత రత్న నెల్సన్ మండేలా

వనం జ్వాలా నరసింహారావు

నెల్సన్ మండేలా తన 95 వ ఏట మరణించారు. జోహన్స్ బర్గ్ లోని ఆయన స్వగృహంలో, మధ్య-మద్య ఆరోగ్యం కుదుటబడి, కోలుకుంటున్నప్పటికీ, చివరకు మృత్యువాత పడ్డారు. ఎప్పటికప్పుడు, ఆయన ఆరోగ్య పరిస్థితిని దక్షిణాఫ్రికా మాత్రమే కాకుండా యావత్ ప్రపంచం, ఆందోళనతో గమనిస్తూ వచ్చింది. జాత్యహంకార శ్వేత జాతి పాలకుల గుండెల్లో నిద్రపోయి, నల్లజాతివారిపాలిట మహాత్ముడయ్యాడు నెల్సన్ మండేలా. మరణించే చివరి రోజుల వరకు కూడా, పండు ముదుసలి వయసులో సహితం, ఆయన కర్ర సహాయంతో నడుచుకుంటూ, అనునిత్యం తాను అధ్యయనం చేసే గదిలోకి వెళుతుండేవాడు. అతికష్టం మీద మండేలా ఒక కుర్చీలో కూర్చుని, వెనుకకు వాలి, ఒక్కో కాలుని ఇబ్బందికరంగా పైకి లేపి, ఎదురుగా వుంచిన చిన్న బల్లపై పెట్టుకుని దీర్ఘాలోచనలో మునిగిపోతే, ఆయన భార్య గ్రీసా ఆ సమయంలో ఆయన పాదాలను సవరించేదట. ఆయన కుర్చీ పక్కనే, మండేలాను ఇరవయ్యేడు సంవత్సరాల పాటు జైలులో నిర్బంధానికి గురిచేసిన జాత్యహంకారుల ఆంగ్ల, ఆఫ్రికన్ భాషల వార్తాపత్రికలు, మాగజైన్లు ఒక బల్లపై పడివుండేవి. ఆయనకు అతి సమీపంలో, ఆయన పక్కనే, ఆయనకు వినిపించేంత దగ్గరలో, కబుర్లు చెప్పుకుంటూ, ఆయన కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు కూచుండేవారు. మండేలా జ్ఞాపక శక్తి క్రమేపీ తగ్గిపోయినా, పాత జ్ఞాపకాలను నెమరేసుకుంటూనే కాలం గడిపేవాడు. చనిపోయేంతవరకు కూడా ఆయనలో ప్రశాంతత కొట్టొచ్చినట్లు కనిపించేదని వార్తా పత్రిక కథనాలు.

జులై 18, 1918 న జన్మించిన మండేలా, దక్షిణాఫ్రికా మొట్టమొదటి ఎన్నికైన అధ్యక్షుడిగా, 1994-1999 మధ్య కాలంలో పనిచేశారు. అధ్యక్ష పీఠం అధిష్టించడానికి పూర్వం, దీర్ఘకాలం, వర్ణ-జాతి వివక్షతకు వ్యతిరేకంగా పోరాటం సల్పిన ధీరుడు. ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ సైనిక విభాగానికి నాయకుడు. 1962 లో అరెస్టు కాబడి, శిక్షకు గురై, జీవిత ఖైదీగా 27 సంవత్సరాల పాటు జైలులో గడిపారు. ఫిబ్రవరి 11, 1990 న విడుదలై, ప్రభుత్వంతో విజయవంతంగా చర్చలు జరిపి, 1994 లో "బహుళ జాతి ప్రజాస్వామ్యం" స్థాపనకు కారకుడైనాడు. ఆ ఏడాది జరిగిన ఎన్నికలలో ఘన విజయం సాధించి దక్షిణాఫ్రికా అధ్యక్షుడయ్యారు. 1993 నోబెల్ శాంతి బహుమానం, అదే ఏడాది టైమ్స్ మాగజైన్ "మాన్ ఆఫ్ ద యియర్" గౌరవం, 1980 లో జవహర్లాల్ నెహ్రూ అంతర్జాతీయ బహుమతి, 1988 లో "లెనిన్ శాంతి బహుమతి", 1990 లో "భారతరత్న" ఆవార్డు అందుకున్నారు మండేలా. భారతదేశ పౌరుడు కాకపోయినా ఆయనకు "భారతరత్న" పురస్కారం ఇచ్చి గౌరవించింది ప్రభుత్వం. 1973 లో లీడ్స్ విశ్వవిద్యాలయంలో శాస్త్రజ్ఞులు కనుగొన్న ఒక అణు రేణువుకు "మండేలా పార్టికిల్" అని పేరు పెట్టారు. న్యూఢిల్లీలోని ఒక రోడ్డును నెల్సన్ మండేలా మార్గం అని పిలుస్తారు.


తింబు రాజ వంశానికి చెందిన మండేలా పితామహుడు కూడా ఒక రాజుగా ప్రసిద్ధిగాంచిన వాడే. తన తండ్రి పదమూడు మంది సంతానంలో పాఠశాలకు వెళ్లిన మొదటి వాడు మండేలానే. పాఠశాలలోనే ఆయన టీచర్ మండేలా పేరు ముందర "నెల్సన్" చేర్చింది. 1937 లో కళాశాలలో చేరిన మండేలా, ఫోర్ట్ హారే యూనివర్సిటీలో ఇంకా మొదటి సంవత్సరం చదువుతుండగానే, విశ్వవిద్యాలయం విధానాలకు వ్యతిరేకంగా విద్యార్థి సంఘం చేపట్టిన ఉద్యమంలో పాలు పంచుకోవడంతో, బహిష్కృతుడై, దూర విద్య ద్వారా డిగ్రీ చదువు పూర్తి చేశాడు. కాలేజీలో చదువుకునే రోజుల్లోనే, వర్ణ-జాతి వివక్షతకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న విద్యార్థి నాయకులతో, స్నేహం ఏర్పడింది. అలనాటి ఆయన స్నేహితులు దరిమిలా యావజ్జీవిత స్నేహితులుగా మిగిలిపోయారు.

1948 లో దక్షిణాఫ్రికా దేశంలో జరిగిన ఎన్నికలలో, వర్ణ-జాతి వివక్షతను సమర్థిస్తున్న జాత్యహంకార ఆఫ్రికన్ల జాతీయ పార్టీ గెలుపొందడంతో, మండేలా రాజకీయాలలో చురుగ్గా పాల్గొనడం మొదలెట్టాడు. అదే రోజుల్లో మహాత్మా గాంధీ ప్రభావం మండేలా మీద బాగా పడింది. 150 మంది సహచరులతో సహా డిసెంబర్ 5, 1956 న మండేలాను అరెస్ట్ చేసి కొద్దికాలం తరువాత విడుదల చేసింది ప్రభుత్వం. 1961 లో, "ఎంకే" అన్న పేరుతో పిలువబడిన, ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ సైనిక విభాగానికి మండేలా నాయకు డయ్యారు. ప్రభుత్వ సైనికులకు వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభించారు. విద్రోహ-విధ్వంసక చర్యలకు కూడా సమన్వయకర్తగా వ్యవహరించారాయన. అవి కూడా ఫలితాన్నివ్వకపోతే, వర్ణ-జాతి వివక్షతను ఆపు చేయలేకపోతే, గొరిల్లా తరహా పోరాటానికి కూడా సిద్ధమవ్వాలని ఒకానొక సందర్భంలో పిలుపిచ్చారు మండేలా. ఏళ్ల తరబడి జాత్యహంకార శ్వేత జాతీయుల వర్ణ-జాతి వివక్షతకు అడ్డూ-అదుపూలేకపోవడంతో, అహింసా మార్గం వదిలి, హింసాయుత మార్గంలో పోతే మంచిదన్న ఆలోచన కూడా చేశారాయన. "ఎంకే" ఆధ్వర్యంలో వర్ణ-జాతి వివక్షత చూపుతున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా, మొదలెట్టిన గొరిల్లా పోరాటంలో, సాధారణ పౌరుల ప్రాణాలు కూడా పోవడంతో, మండేలా స్పందించారు. తన నాయకత్వంలోని కొందరిని ఆయన తీవ్రంగా విమర్శించడమే కాకుండా, ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్, వర్ణ-జాతి వివక్షతకు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో, మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందని అంగీకరించారు. ఇదిలా కొనసాగుతుండగానే, ఆగస్ట్ 5, 1962 న మండేలాను అరెస్ట్ చేసి,  అక్టోబర్ 25, 1962 న తొలుత ఐదేళ్ల పాటు శిక్ష విధించింది ప్రభుత్వం. జూన్ 12, 1964 న ఇతర సహచరులతో సహా మండేలాకు యావజ్జీవ శిక్ష విధించింది న్యాయస్థానం.

ఆయన 27 సంవత్సరాల జైలు జీవితంలో మొదటి 18 ఏళ్లు "రాబిన్ ఐలాండ్" జైలులో వుంచింది ప్రభుత్వం. దక్షిణాఫ్రికా శ్వేత జాతి ప్రభుత్వానికి వ్యతిరేకంగా, నల్ల జాతీయుల హక్కులకొరకు పోరాడుతున్న యోధుడిగా, జైలులో వున్న రోజుల్లో, మండేలాకు, ప్రపంచ వ్యాప్త గుర్తింపు రావడం మొదలైంది. జైలులో వుండగా, ఒక సున్నపు క్వారీలో, కఠినతరమైన కూలీ పని చేయించారు మండేలాతో. జైలు జీవితం చాలా దుర్భరంగా వుండేది. నల్ల జాతి ఖైదీలని, శ్వేత జాతీయులని విడి-విడిగా వారిని చూసేవారు జైలు సిబ్బంది. ఆహార విషయంలోనూ వివక్షత పాటించేవారు. రాజకీయ ఖైదీలకు ప్రత్యేకించి ఏ హక్కులూ వుండకపోయేది. మండేలాను చూడడానికి ఆరు నెలలకు ఒకసారి ఒక విజిటర్‌ను, చదవడానికి ఆర్నెల్లకి ఒక్క సారి ఒక్క ఉత్తరాన్ని అనుమతించేవారు! వచ్చిన ఆ ఒక్క ఉత్తరమైనా, ఎన్నాళ్లకో కాని మండేలాకు చేర్చేవారు కాదు. అది కూడా పూర్తిగా చినిగి, చదవడానికి పనికిరాని విధంగా చేసేవారు జైలు అధికారులు. ఇంత నిర్బంధంలో కూడా, జైలులో దూర విద్య ద్వారా చదువుకుని, లండన్ విశ్వ విద్యాలయం నుండి న్యాయ శాస్త్రంలో డిగ్రీ సంపాదించారు మండేలా. మార్చ్ 1982 లో, సహచర ఖైదీలతో సహా, మండేలాను, రాబిన్ ఐలాండ్ జైలు నుండి, పోల్స్ మూర్ జైలుకు మార్చింది ప్రభుత్వం.


"రాజకీయ ఆయుధంగా హింసాయుత మార్గాన్ని వ్యతిరేకించడానికి" నెల్సన్ మండేలా అంగీకరిస్తే, ఆయనను విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా వున్నట్లు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు బోథా ఫిబ్రవరి 1985 లో సంసిద్ధత వ్యక్తం  చేసారు. ఆయన సూచనను మండేలా నిర్ధంద్వంగా తిరస్కరించారు. "ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ మీద నిషేధం వున్నంతకాలం నాకు స్వేచ్ఛ ఇస్తాననడంలో అర్థం లేదు. స్వతంత్ర వాయువులు పీలుస్తున్న వారే చర్చలకు అర్హులు కాని, నా లాంటి జైలులో వున్నవారు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోవడానికి వీలు కాదు" అని తన కూతురు ద్వారా ప్రభుత్వానికి ఒక సందేశం పంపారు మండేలా. చివరకు నవంబర్ 1985 లో బోథా నేషనల్ పార్టీ ప్రభుత్వ ప్రతినిధికి, మండేలాకు మధ్య మొదటి విడత సమావేశం చోటుచేసుకుంది. ఆ రోజుల్లో సమావేశం జరిగిన వోల్క్స్ ఆసుపత్రిలోనే మండేలా ప్రొస్టేట్ సర్జరీ చేయించుకున్నారు. అలాంటి సమావేశాలు మరి కొన్ని,  మరో నాలుగేళ్లు జరిగినప్పటికీ, ఫలితం అంతగా కనపడలేదు. కాకపోతే, భవిష్యత్ చర్చలకు అవి పునాదులేశాయి.1988 లో మండేలాను "విక్టర్ వెర్స్ టర్" జైలుకు తరలించి, విడుదల చేసేంతవరకు అక్కడే వుంచారు.

"నెల్సన్ మండేలాను విడుదల చేయాలి" అన్న నినాదంతో, ఆయన జైలులో వున్నంత కాలం, జాతీయ-అంతర్జాతీయ స్థాయి ఒత్తిడులు దక్షిణాఫ్రికా ప్రభుత్వంపై వచ్చాయి పలుమార్లు. రెడ్ క్రాస్ సంస్థ అంతర్జాతీయ విభాగం ప్రతినిధులు ఎన్నో మార్లు మండేలాను జైలులో కలుసుకున్నారు. 1989 లో బోథా స్థానంలో ఫ్రెడెరిక్ విలియం క్లర్క్ దేశాధ్యక్షుడయ్యారు. ఏడాది తిరక్కుండానే, మండేలా విడుదల నిర్ణయాన్ని ప్రకటించింది ప్రభుత్వం. ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ మీద, ఇతర వర్ణ-జాతి వివక్షత వ్యతిరేక సంస్థల మీద అంతవరకున్న నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు తొలుత ప్రకటించి, ఆ తరువాత ఫిబ్రవరి 1990 లో మండేలాను విడుదల చేసింది ప్రభుత్వం. ఆయన విడుదల కార్యక్రమాన్ని ప్రపంచ వ్యాప్తంగా టెలివిజన్ ప్రత్యక్ష ప్రసారం చేసింది. విడుదలైన రోజున జాతినుద్దేశించి మండేలా ప్రసంగం చేశారు. శ్వేత జాతీయులతో సఖ్యతకు-సహ జీవనానికి, శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పడానికి తన నిబద్ధతను వ్యక్త పరుస్తూనే, ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ సైనిక పోరాటం ఆగిపోలేదని ఇంకా కొనసాగుతుందని ప్రకటించారు మండేలా.

జైలునుంచి విడుదలైన మండేలా తిరిగి 1990-1994 మధ్య కాలంలో ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ నాయకత్వ బాధ్యతలు చేపట్టారు. ఏప్రిల్ 27, 1994 న బహుళ జాతీయులందరూ పాల్గొన్న మొదటి ఎన్నికలు జరిగాయి. 62%  ఓట్లను పొందిన ఆఫ్రికన్ జాతీయ కాంగ్రెస్ నాయకుడు మండేలా, మే 10, 1994 న, నల్ల జాతి వారికి చెందిన ప్రప్రధమ దక్షిణాఫ్రికా దేశాధ్యక్షుడయ్యారు. ఎన్నికైన ప్రభుత్వాన్ని సమర్థిస్తున్నట్లు నిదర్శనంగా, క్లర్క్ కూడా మంత్రివర్గంలో చేరారు. "ట్రేడ్ మార్క్ బాటిక్ చొక్కాలను" ధరించుతూ, అంతర్జాతీయ స్థాయిలో దక్షిణాఫ్రికా గౌరవాన్ని ఇనుమడించే విధంగా ఆయన అధ్యక్ష పాలన కొనసాగింది. ఉచిత వైద్యం, సంక్షేమ పథకాలకు ఎక్కువ బడ్జెట్ కేటాయింపులు, విద్యకు ప్రాధాన్యత, భూ సంస్కరణల అమలు, కార్మికులతో సత్సంబంధాలు లాంటివి ఆయన పాలనలో చెప్పుకోదగ్గవి. కల్నల్ గడ్డాఫీ లిబియాకు, అమెరికా-బ్రిటన్ దేశాలకు మధ్య విభేదాలను తొలగించేందుకు మండేలా కృషి చేశారు.

మండేలా మొదటి భార్యతో పదమూడేళ్లు కాపురం చేసి విడాకులిచ్చారు. దానికి ప్రధాన కారణం, మండేలా నిరంతరం ఉద్యమంలో పాల్గొనడమే! ఆ తరువాత రెండు సార్లు మళ్లీ పెళ్ళి చేసుకున్నారు. తన 80 వ పుట్టిన రోజున 1998 లో ఇప్పుడున్న మూడో భార్య గ్రీసా మాషెల్‍ను వివాహమాడారు మండేలా. ఆమె దివంగత మొజాంబిక్ అధ్యక్షుడు సా మోరా మాషెల్ భార్య. పెళ్లికి ముందు ఎన్నో దఫాలుగా చర్చలు సాగాయి. రెండవ పర్యాయం ఎన్నికలలో పోటీ చేయరాదని నిర్ణయించుకున్న మండేలా, తన రిటైర్‌మెంట్‌ ప్రకటించారు. అప్పటినుంచి, రకరకాల సాంఘిక-మానవ హక్కుల సంస్థలకు సలహాదారుడిగా పనిచేయడం ప్రారంభించారు మండేలా.   జులై 2001 లో మండేలాకు ప్రోస్టేట్ కాన్సర్ వున్నట్లు నిర్ధారణ ఐంది. చికిత్స కూడా జరిగింది. 2003 లో పొరపాటున ఆయన మరణ వార్తను సిఎన్ఎన్ ప్రసారం చేసింది. తప్పు సరి దిద్దుకుంది. 2007 లోనూ అలాంటి పొరపాటే మరో విధంగా జరిగింది. వాస్తవానికి మండేలా ఆ సమయంలో మొజాంబిక్ లో కులాసాగా గడుపుతున్నారు.

జూన్ 2004 లో, తన  85 వ ఏట, ప్రజా జీవనం నుంచి పూర్తిగా వైదొలగుతున్నట్లు ప్రకటించారు మండేలా. ప్రజలకు తన అవసరం వుందని తాను అనుకున్నప్పుడు తానే ప్రజలకు పిలుపిస్తానని, వారి వద్దకు వస్తానని, తనను వారు పిలువ వద్దని విజ్ఞప్తి చేశారు. అన్నమాట ప్రకారం అలానే వుండి పోయారు. ఆగస్ట్ 22, 2007 న అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, దక్షిణాఫ్రికా పర్యటనలో, మర్యాదపూర్వకంగా మండేలాను కలిసింది. ఇరువురు బహుమతులను ఇచ్చి పుచ్చుకున్నారు. ఆ సందర్భంగా, 1967 లో, భారత దేశంలో, ఇందిరా గాంధీ సమక్షంలో, ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం న్యూ ఢిల్లీలో ప్రారంభోత్సవం చేసిన నాటి చారిత్రాత్మక ఫొటోని మండేలాకు బహుకరించారు సోనియా గాంధీ. వాస్తవానికి, ఇందిరా గాంధీ, తన విద్యార్థి దశ నాటి నుంచీ, ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా, వారి పోరాటానికి మద్దతుగా ఎల్లప్పుడూ వుంటుండేవారు. అలనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి రాయభార హోదా కలిగించింది కూడా. జనవరి 25, 1995 న రాజీవ్ గాంధీ ఫౌండేషన్ ఉపన్యాసం ఇవ్వడానికి న్యూ ఢిల్లీకి వచ్చారు మండేలా.

మండేలా మరణంతో పాత తరం అంతర్జాతీయ స్వాతంత్ర్య సమరయోధుల శకం ముగిసినట్లే అనుకోవాలి!
End


Thursday, December 5, 2013

Bharat Ratna Nelson Mandela:Vanam Jwala Narasimha Rao

Nelson Mandela died on 5th December 2013
Bharat Ratna Nelson Mandela

A long-term icon of the struggle 
against racial oppression

Vanam Jwala Narasimha Rao

Nelson Mandela, South Africa’s first black president and a long-term icon of the struggle against racial oppression, died on Thursday in Johannesburg after prolonged illness. His declining health condition was keenly followed in the country and across the world. Recent media reports mentioning about him wrote that with white hair, frail body Mandela used to lean heavily on a cane when he walked into his study. He used to slip off his shoes, lower himself into a stiff-backed chair and lift each leg onto a cushioned stool. His wife, Graça, adjusting his feet always attended on him. To Mandela’s left was a small table piled with newspapers in English and Afrikaans, the language of the whites who imprisoned him for 27 years.

Nelson Rolihlahla Mandela born on 18 July 1918, served as President of South Africa from 1994 to 1999, and was the first South African president to be elected in a fully representative democratic election. Before his presidency, Mandela was an anti-apartheid activist, and the leader of the armed wing of the African National Congress (ANC). In 1962 he was arrested and convicted and was sentenced to life in prison. Mandela served 27 years in prison. Following his release from prison on 11 February 1990, Mandela led his party in the negotiations that led to multi-racial democracy in 1994. Mandela received more than 250 awards over four decades, including the 1993 Nobel Peace Prize. He was named Person of the Year by Time Magazine same year. In the year 1980 he received Jawaharlal Nehru Award for International Understanding. India's highest civilian award, Bharat Ratna, was awarded to Nelson Mandela in 1990. In 1973, a nuclear particle discovered by scientists at the University of Leeds was named as "Mandela particle". There is a Nelson Mandela Road in New Delhi since December 10, 1988. Mandela was awarded the Lenin Peace Prize for 1990-the last-ever recipient.


            Nelson Mandela belongs to Thimbu dynasty. He became the first member of his family to attend a school, where his teacher gave him the English name "Nelson". In 1937 Mandela moved to college. While a law student at the University of Witwatersrand, he first befriended fellow students and future anti-apartheid political activists who remained his lifelong friends.

            After the 1948 election victory of the Afrikaner-dominated National Party, which supported the apartheid policy of racial segregation, Mandela began actively participating in politics. Mahatma Gandhi influenced Mandela's approach, and subsequently the methods of succeeding generations of South African anti-apartheid activists. Mandela later took part in the 29–30 January 2007 conference in New Delhi marking the 100th anniversary of Gandhi's introduction of Satyagraha (non-violent resistance) in South Africa.

            In 1961 Mandela became leader of the ANC's armed wing, which he co-founded. He coordinated sabotage campaigns against military and government targets, making plans for a possible guerrilla war if the sabotage failed to end apartheid. When many years of non-violent protest against apartheid could not achieve considerable progress, a guerrilla war against the government took place in which many civilians became casualties. Mandela later admitted that the ANC, in its struggle against apartheid, also violated human rights, sharply criticizing those in his own party. On 5 August 1962 Mandela was arrested and was imprisoned in the Johannesburg Fort. On 25 October 1962, Mandela was sentenced to five years in prison.

            Mandela was imprisoned on Robben Island where he remained for the next eighteen of his twenty-seven years in prison. While in jail, his reputation grew and he became widely known as the most significant black leader in South Africa. On the island, he and others performed hard labor in a lime quarry. Prison conditions were very basic. Prisoners were segregated by race, with black prisoners receiving the fewest rations. Political prisoners were kept separate from ordinary criminals and received fewer privileges. Mandela was allowed one visitor and one letter every six months. Letters, when they came, were often delayed for long periods and made unreadable by the prison censors. While in prison Mandela undertook study with the University of London by correspondence through its External Programme and received the degree of Bachelor of Laws.

            In March 1982 Mandela was transferred from Robben Island to Pollsmoor Prison. The first meeting between Mandela and the National Party government came in November 1985.  Over the next four years, a series of tentative meetings took place, laying the groundwork for further contact and future negotiations, but little real progress was made. In 1988 Mandela was moved to Victor Verster Prison and would remain there until his release. Various restrictions were lifted.

            Throughout Mandela's imprisonment, local and international pressure mounted on the South African government to release him, under the resounding slogan Free Nelson Mandela! In 1989, Botha was replaced as president by Frederick Willem de Klerk. He announced Mandela's release in February 1990. Mandela was visited several times by delegates of the International Committee of the Red Cross, while at Robben Island and later at Pollsmoor prison.

            On 2 February 1990, President F. W. de Klerk reversed the ban on the ANC and other anti-apartheid organizations, and announced that Mandela would shortly be released from prison. Mandela was released from Victor Verster Prison in Paarl on 11 February 1990. The event was broadcast live all over the world. On the day of his release, Mandela made a speech to the nation. He declared his commitment to peace and reconciliation with the country's white minority, but made it clear that the ANC's armed struggle was not yet over.

Following his release from prison, Mandela returned to the leadership of the ANC and, between 1990 and 1994, led the party in the multi-party negotiations that led to the country's first multi-racial elections. In 1991, the ANC held its first national conference in South Africa after its unbanning, electing Mandela as President of the organization. His old friend and colleague Oliver Tambo, who had led the organization in exile during Mandela's imprisonment, became National Chairperson. Mandela's leadership through the negotiations, as well as his relationship with President F. W. de Klerk, was recognized when they were jointly awarded the Nobel Peace Prize in 1993.

South Africa's first multi-racial elections in which full enfranchisement was granted were held on 27 April 1994. The ANC won 62% of the votes in the election, and Mandela, as leader of the ANC, was inaugurated on 10 May 1994 as the country's first black President, with the National Party's de Klerk as his first deputy and Thabo Mbeki as the second in the Government of National Unity. As President from May 1994 until June 1999, Mandela presided over the transition from minority rule and apartheid, winning international respect for his advocacy of national and international reconciliation.

During the course of his presidency, a wide range of progressive social reforms were enacted by Mandela's government, aimed at reducing long entrenched social and economic inequalities in South Africa. Mandela married third time, on his 80th birthday in 1998, to Graça Machel widow of Samora Machel, the former Mozambican president.


Nelson Mandela received a courtesy call from Sonia Gandhi, on Wednesday, 22 August, 2007. Gifts were exchanged at the meeting, and speeches made commemorating the ties between South Africa and India. An historic photograph taken at the opening of the ANC’s office in India in 1967 was presented to Mandela then. Indira Gandhi, beginning with her student years, and throughout her life, gave her unwavering support to the ANC and to the struggle of the oppressed people for a non-racial democracy. End


ఆంధ్ర వాల్మీకి (వాసుదాస స్వామి) రామాయణంలో ఛందః ప్రయోగాలు-అయోధ్యా కాండ -2: వనం జ్వాలా నరసింహారావు

ఆంధ్ర వాల్మీకి (వాసుదాస స్వామి) 

రామాయణంలో ఛందః ప్రయోగాలు

అయోధ్యా కాండ -2

వనం జ్వాలా నరసింహారావు


శ్రీరామ పట్టాభిషేకానికి సన్నాహాలు జరుగుతుంటాయి. ఆ సంబరం చూద్దామనుకుంటున్న అయోధ్యా పురజనులు గుంపులుగా వీధుల్లో తిరుగుతుంటారు. జనులలా గుంపులుగా గూడిన విధానాన్ని వర్ణించిన తర్వాత, ఆ వివరాలన్నీ గురువర్యుడైన వశిష్ఠుడి ద్వారా తెలుసుకొని, ఆయన అనుమతితో తన ఇంటికి పోతున్న వైనాన్ని వర్ణిస్తూ "మానిని" వృత్తంలో రాసారీ పద్యాన్ని కవి ఇలా:

మానిని:        వారల  నెల్లరఁ బోవఁ గఁ  బంచి నృపాలుఁ డు సింహము  శైలగుహన్
                జేరెడిరీతి సమగ్ర్యసువేషవి  శేషవధూజనతాకులజం
                భారినిశాంతమనోహరరాజగృ హంబును  జొచ్చి  సఋక్షగణో
                దారనభంబును జందురునట్టులు దా వెలిఁ గించె  స్వదీధితులన్ - 19

ఛందస్సు:      22 అక్షరాలతో, ఏడు "భ" గణాల గురువుతో, యతిస్థానంలో 7-13-19 అక్షరాలు కలిగి వుంటుంది. ప్రాస నియమం వుంది.


తాత్పర్యం:     దశరథ మహారాజు (సభలోని) సభ్యుల నందరినీ వెళ్ళమని అనుజ్ఞ ఇచ్చి, సింహం తన గుహలోకి పోయిన విధంగా, నానా విధాలైన నూతన అలంకారాలతో వుండి, స్త్రీ సమూహాంతో నిండిన, ఇంద్రుడి మేడలాంటి అందమైన తన గృహంలోకి ప్రవేశించి, తన (దశరథుడు) కాంతులతో, నక్షత్ర సమూహం మధ్య ఆకాశంలో వున్న చంద్రుడి లాగా ప్రకాశింప చేశాడు. 

Wednesday, December 4, 2013

Forgotten Great Leaders of world:Vanam Jwala Narasimha Rao

Forgotten Great Leaders of world
Vanam Jwala Narasimha Rao

The role model international level leader ship of yester years is rare phenomenon these days. Not that there are none, but the kind of statesmanship, the way they represented their country and region individually and collectively, the way they exhibited extraordinary commitment to the cause for which they were fighting, is absent in the present day world leaders. Unfortunately those great personalities are hardly remembered by present day students of political science and or contemporary history not to speak of general youth. Whether it was a summit, a conference, an international meet or any such thing that used to take place anywhere in the world was all with lot of enthusiasm which too is absent these days. For instance take the Non-Aligned Movement that was founded in Belgrade in 1961, conceived by Jawaharlal Nehru, Sukarno, Nasser, Nkrumah and Tito. All five leaders were prominent advocates of a middle course for states in the developing world between the western and eastern blocks in the Cold War. Does the present day generation ever attempted to read this contemporary history? The Geneva Summit of 1955, the UN General Assembly sessions, the Commonwealth Heads of Government Meetings (CHOGM), the Afro–Asian Conference also known as the Bandung Conference, the Geneva Conference of 1954 and many more such international summits and peace conferences of yester years are seldom remembered.

To name few among yester years’ international politicians and statesmen we have Jawaharlal Nehru, his daughter Indira Gandhi, John Fitzgerald Kennedy, Nikita Khrushchev, Charles de Gaulle , Golda Meir, her predecessor David Ben-Gurion, Marshal Tito, Gamal Abdel Nasser, Chou En-lai and Mao, Yasser Arafat , Sirimavo Bandaranaike, Willy Brandt , Sukarno, Kwame Nkrumah, Fidel Castro and Ho-Chi-Minh.

Jawaharlal Nehru, Sukarno, Nasser, Nkrumah and Tito

Jawaharlal Nehru first Prime Minister of India from 15 August 1947 to 27 May 1964 was a champion of pacifism and a strong supporter of the United Nations. He pioneered the policy of non-alignment and co-founded the Non-Aligned Movement of nations professing neutrality between the rival blocs of nations led by the US and the USSR. In 1954 Nehru signed with China the Five Principles of Peaceful Coexistence, known in India as the Panchsheel.

Indira Gandhi was the third Prime Minister of India who served from 1966 to 1977 and then again from 1980 until her assassination in 1984. Indira Gandhi presided over a period where India emerged with greater power than before to become the regional supremacy of South Asia with considerable political, economic, and military developments. 

 John Fitzgerald Kennedy was 35th President of the United States from January 20, 1961 to November 22, 1963 until he was assassinated. Events during his presidency included the Bay of Pigs Invasion, the Cuban Missile Crisis, the building of the Berlin Wall, the African-American Civil Rights Movement and increased U.S. involvement in the Vietnam War.

Nikita Khrushchev was Premier of Soviet Union from March 14, 1953 to October 14, 1964. Khrushchev sought to find a lasting solution to the problem of a divided Germany. In November 1958, he gave the United States, United Kingdom and France six months to conclude a peace treaty with both German states and the Soviet Union. If one was not signed, Khrushchev stated, the Soviet Union would conclude a peace treaty with East Germany.


Charles de Gaulle was a French general and statesman who founded the French Fifth Republic in 1958 and served as its first president from 1959 to 1969. De Gaulle secured a permanent seat on the United Nations Security Council for France in 1945. He withdrew France from NATO military command and twice vetoed Britain's entry into the European Community. De Gaulle was convinced that a strong and independent France could act as a balancing force between the United States and the Soviet Union.

Golda Meir was the fourth Prime Minister of Israel and was in office from March 17, 1969 to June 3, 1974. She was described as the "Iron Lady" of Israeli politics. In 1969 and the early 1970s, Meir met with many world leaders to promote her vision of peace in the Middle East. Golda Meir’s predecessor David Ben-Gurion was an Israeli statesman and founding father. He was the main founder and the first Prime Minister of Israel from 17 May 1948 to 26 January 1954 and again from 3 November 1955 – 26 June 1963. Ben-Gurion led Israel during the 1948 Arab–Israeli War, and united the various Jewish militias into the Israel Defense Forces.

Marshal Tito was a Yugoslav revolutionary and statesman, serving in various roles from 1945 until his death in 1980. He gained international attention as the chief leader of the Non-Aligned Movement, working with Jawaharlal Nehru, Gamal Abdel Nasser, Nkrumah and Sukarno. He became the first Secretary-General of the Non-Aligned Movement. He was the Prime Minister (1943–63), President (later President for Life) (1953–80) of the Socialist Federal Republic of Yugoslavia.


Gamal Abdel Nasser was the second President of Egypt, from 23 June 1956 to 28 September 1970 until his death. Nasser's retaliatory move to nationalize the Suez Canal Company in 1956 was acclaimed within Egypt and the Arab world. Nasser formed the United Arab Republic with Syria. All Arab heads of state attended his funeral. Jordanian King Hussein and PLO chairman Yasser Arafat cried openly, and Muammar Gaddafi of Libya fainted from emotional distress twice.

Chou En-lai was the first Premier of the People's Republic of China, serving from October 1949 until his death in January 1976. He advocated peaceful coexistence with the West after the stalemated Korean War.  He participated in the 1954 Geneva Conference. He helped devise policies regarding the bitter disputes with USA, Taiwan, Soviet Union, India and Vietnam. Chou’s leader Mao Tse-tung founded the People's Republic of China in 1949. He was also one of the founders of the Chinese Communist party in 1921, and was regarded, along with Karl Marx and Lenin, as one of the three great theorists of Marxian Communism. Mao’s contribution to history has changed the world itself.

Yasser Arafat was a Palestinian leader and Chairman of the Palestine Liberation Organization. He was 1st President of the Palestinian National Authority from 5 July 1994 to 11 November 2004. Arafat spent much of his life fighting against Israel in the name of Palestinian self-determination. Originally opposed to Israel's existence, he modified his position in 1988 when he accepted UN Security Council Resolution.

Sirimavo Bandaranaike was Prime Minister of Sri Lanka several times, from 1960 to 1965; from 1970 to 1972; from 1972 to 1977 and from 1994 to 2000.

Willy Brandt was a German statesman and politician and chancellor of the Federal Republic of Germany from 1969 to 1974. He was awarded the Nobel Peace Prize in 1971 for his efforts to achieve reconciliation between West Germany and the countries of the Soviet bloc.


Sukarno was Indonesia's first president and was in office from 1945 to 1967. The early 1960s saw Sukarno veering Indonesia to the left by providing support and protection to the Indonesian Communist Party. He embarked on a series of aggressive and assertive policies based on anti-imperialism to increase Indonesia's international prestige.

Kwame Nkrumah was the leader of Ghana. Overseeing the nation's independence from British colonial rule in 1957, Nkrumah was the first President of Ghana and the first Prime Minister of Ghana. He was a founding member of the Organization of African Unity and was the winner of the Lenin Peace Prize in 1963.

Ho chi Minh was a Vietnamese communist revolutionary leader who was prime minister (1945–1955) and president (1945–1969) of the Democratic Republic of Vietnam (North Vietnam). He led the Viet Minh independence movement from 1941 onward, establishing the communist-ruled Democratic Republic of Vietnam in 1945 and defeating the French Union in 1954.

Fidel Castro held power longer than any national leader other than Queen Elizabeth. His personal control over a Communist revolution made him perhaps the most important leader in Latin America since its 19th century wars of independence. Since January 9, 1959, he became Cuba's unchallenged leader. On 19th February, 2008, Fidel Castro announced he would neither seek nor accept a new term as either president or commander-in-chief of Cuba.


May be many more such leaders in the past…but where are such leaders today? End

Tuesday, December 3, 2013

ఆంధ్ర వాల్మీకి (వాసుదాస స్వామి) రామాయణంలో ఛందః ప్రయోగాలు - అయోధ్యా కాండ -1: వనం జ్వాలా నరసింహారావు

ఆంధ్ర వాల్మీకి (వాసుదాస స్వామి) 
రామాయణంలో ఛందః ప్రయోగాలు
అయోధ్యా కాండ -1
వనం జ్వాలా నరసింహారావు

          దశరథుడు శ్రీరాముడికి పట్టాభిషేకం చేయాలనుకొని అందరినీ సంప్రదించి వారి సమ్మతిని పోందాడు. తనకు కలిగిన అభిప్రాయాన్ని రాముడికి తెలియచేస్తూ, అతడికి పుట్టుకతోనే వినయం-సుగుణాలు వచ్చాయని, అతనికి సమానులైన వారు మనుష్యులలో ఎవరూ లేరని అంటూ దశరథుడన్న మరికొన్ని విషయాలను చెప్పేందుకు "మత్తకోకిలము" వృత్తాన్ని ఎంచుకుంటారు వాసు దాసుగారు. ఆ పద్యమిలా సాగింది:


మత్తకోకిలము:     నీ వెరుంగని యట్టినీత్యవి నీతు  లున్న వె  యెందునే ?
                        నేవి  క్రొత్తగ నీకు  నేర్పఁ గ నేను  నేర్తుఁ గుమారకా !
                        భావితాదృతిఁ జేసి  పుత్రక వత్సలత్వము పేర్మి  నే
                        నేవియో  యొకకొన్నిటిన్ వచి యించెద న్విను  నందనా ! -18

ఛందస్సు:      మత్తకోకిలము వృత్తానికి ర-స-జ-జ-భ-ర గణాలు. పదకొండో అక్షరం యతి.


తాత్పర్యం:     కుమారా ! నీకు తెలియని నీతులు-అవినీతులు లేవు. నేను నీకు కొత్తగా ఏం నేర్పగలను? అయినా నీవు నా కొడుకువు కనుక, పుత్రవాత్సల్యం వల్ల కలిగిన ఆదరణతో, తండ్రులు కొడుకులకు హితోపదేశం చేయడం ధర్మం కనుక ఏవో కొన్ని విషయాలు చెప్పదల్చుకున్నాను. నువ్వు నా కొడుకువు కావడంవల్ల నన్ను సంతోషపర్చడం నీకు తగిన కార్యం. తండ్రి బతికున్నంతవరకు ఆయన చెప్పినట్లు నడుచుకొనేవాడినే పుత్రుడంటారు. కాబట్టి నేను చెప్పినట్లు నీవు నడుచుకుంటే సంతోషిస్తాను. అలా అయితే నన్ను ఏమి చేయమందువా?