Showing posts with label నిజాం-ఉల్-ముల్క్. Show all posts
Showing posts with label నిజాం-ఉల్-ముల్క్. Show all posts

Friday, May 3, 2013

నాలుగు శతాబ్దాల హైదరాబాద్-3: ఆసఫ్ జాహీ వంశీయులు: వనం జ్వాలా నరసింహారావు


నాలుగు శతాబ్దాల హైదరాబాద్-3
ఆసఫ్ జాహీ వంశీయులు
వనం జ్వాలా నరసింహారావు
ప్రశ్నలు: జవాబులు
1.    ఎవరి ఏలుబడిలో, ఏ సంవత్సరంలో, నిజాం-ఉల్-ముల్క్ దక్కన్ గవర్నర్‍గా నియమించబడ్డాడు? (ఫారూక్ సియార్, 1773)

2.   హైదరాబాద్ ప్రధమ నిజాం అసలు పేరు, పూర్తి పేరు ఏమిటి? (మీర్ క్వుమార్ ఉద్దీన్ ఖాన్; నిజాం-ఉల్-ముల్క్ ఫోరోజ్ జంగ్ ఆసఫ్ జా)

3.   మొదటి నిజాం తాతగారి పేరేంటి? (క్వాలిచ్ ఖాన్ లేదా ఖాజా ఆబిద్)

4.   మొదటి నిజాం తండ్రి గారు ఏం ఉద్యోగం చేస్తుండేవారు? (షాజహాన్ ప్రధాన మంత్రిగా)

5.   నిజాం-ఉల్-ముల్క్ పుట్టిన తేదీ ఏమిటి? ఆయన పుట్టినప్పుడు పెట్టిన పేరేంటి? పేరు పెట్టిందెవరు? ఆయన చనిపోయింది ఎప్పుడు? (ఆగస్ట్ 11, 1671-14 రబీ-ఉస్-సానీ-1082 హిజ్రీ; మీర్ క్వుమార్ ఉద్దీన్; ఔరంగజేబ్; మే 22, 1748)

6.   మొదటి ఆసఫ్ జా నిజాం-ఉల్-ముల్క్ మరణానంతరం ఆయన ఇద్దరు కుమారులు, కూతురు కొడుకు, దక్కన్ సుబేదారులుగా ఒకరి తదుపరి మరొకరు సుమారు 14 సంవత్సరాల పాటు నియమించబడ్డారు. ఆయితే వారెవరు ఆసఫ్ జా అని కాని, నిజాం అని కాని బిరుదు పొందలేదు. వారెవరు? (నసీర్ జంగ్, సల్బత్ జంగ్, ముజఫర్ జంగ్-నిజాం కూతురు ఖైరున్నిస్సా బేగం కుమారుడు)

7.   రెండవ ఆసఫ్ జా నిజాం అలీఖాన్ పుట్టినదెప్పుడు? ఆయన దక్కన్ సుబేదారుగా పదవీ బాధ్యతలు చేపట్టినదెప్పుడు? చనిపోయింది ఎప్పుడు? (ఫిబ్రవరి 24, 1734; జులై 8, 1762; ఆగస్ట్ 6, 1803)

8.   మూడవ ఆసఫ్ జా ఎవరు? పుట్టిన దెప్పుడు? దక్కన్ సుబేదారుగా ఎప్పుడు నియమితులయ్యారు? ఆ నియామకాన్ని ధృవీకరించినదెవ్వరు? (సికందర్ జా; నవంబర్ 11, 1768: ఆగస్ట్ 11, 1803; షా ఆలం చక్రవర్తి)

9.   నాలుగవ ఆసఫ్ జా ఎవరు? పుట్టినదెప్పుడు? సింహాసనం అధిష్టించినదెప్పుడు? చనిపోయిందెప్పుడు? (సికందర్ జా పెద్ద కొడుకైన మీర్ ఫర్ కుందా ఆలీఖాన్ నజీర్-ఉద్-దౌలా; ఏప్రిల్ 25, 1794; మే 23, 1829; మే 16, 1857)

10. 1829 వ సంవత్సరంలో సింహాసనం అధిష్టించిన వెనువెంటనే నాలుగవ ఆసఫ్ జా తీసుకున్న మొట్టమొదటి ప్రాముఖ్యత సంతరించుకున్న చర్య ఏంటి? (యూరోపియన్ అధికారులను సివిల్ సర్వీస్ ఉద్యోగాల నుంచి ఉపసంహరించుకోవాల్సిందిగా గవర్నర్ జనరల్ లార్డ్ విలియం బెంటింక్‌కు విజ్ఞప్తి చేయడం-దానికి ఆయన అంగీకారం తెలపడం)

11.  నసీర్ ఉద్-దౌలా పాలనా కాలంలో ఆయన వద్ద మంత్రిగా పని చేస్తున్న నవాబ్-సిరాజ్-ఉల్-ముల్క్ సలహా మేరకు నిజాం ప్రవేశ పెట్టిన అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న సాంఘిక సంస్కరణ ఏంటి? (సతీ సహగమన నిషేధ చట్టం)

12. 1857  కాలం నాటి ప్రధమ స్వాతంత్ర్య సంగ్రామం లేక సిపాయిల తిరుగుబాటు జరిగినప్పుడు అధికారంలో వున్న ఆసఫ్ జా ఎవరు? (ఐదవ ఆసఫ్ జా అఫ్జల్-ఉద్-దౌలా)

13. ఐదవ ఆసఫ్ జా అఫ్జల్-ఉద్-దౌలా పుట్టిన దెప్పుడు? గద్దె ఎక్కింది ఎప్పుడు? చనిపోయిందెప్పుడు? (అక్టోబర్ 11, 1827; మే 18, 1857; 26, ఫిబ్రవరి 1869)

14. మొగలు సుబేదారుగా నిజాం వ్యవహరించడం ఆగిపోయిందెప్పుడు? (1857)

15. "ఆర్డర్ ఆఫ్ ద స్టార్ ఆఫ్ ఇండియా" అన్న బిరుదును బ్రిటీష్ ప్రభుత్వం, నవాబ్ అఫ్జల్-ఉద్-దౌలాకు ప్రధానం చేసిందెప్పుడు? (ఆగస్ట్ 31, 1861)

16. నగర సరిహద్దుల లోపున ఏ తరహాకు చెందిన దుకాణాలుండ కూడదని ఆదేశించి, వున్నవాటిని తొలగించమని అఫ్జల్-ఉద్-దౌలా ఉత్తర్వులు జారీచేయడం జరిగింది? (మద్యం దుకాణాలు)

17. అఫ్జల్-ఉద్-దౌలా చొరవ తీసుకుని, ఆయన పర్యవేక్షణ-బాధ్యత కింద హైదరాబాద్‌లో నిర్మించబడిన మూడు ప్రధాన కట్టడాలు ఏమిటి? (అఫ్జల్ గంజ్ మస్జీద్, అఫ్జల్ గంజ్ వంతెన, అఫ్జల్ గంజ్ బజారు)


18. ఆసఫ్ జా రాజ వంశపు సింహాసనాన్ని నవాబ్ అఫ్జల్-ఉద్-దౌలా ఏకైక కుమారుడు మీర్ మహబూబ్ అలీఖాన్ అధిష్టించిన సమయంలో అతడి వయసెంత? ఆయన పుట్టినదెప్పుడు? మరణించినదెప్పుడు? ( కేవలం రెండు సంవత్సరాల ఏడు నెలల వయస్సులో ఫిబ్రవరి 29, 1869 న; ఆగస్ట్ 17, 1866; ఆగస్ట్ 29, 1911)

19. వైస్రాయ్ లార్డ్ రిప్పన్, మీర్ మహబూబ్ అలీఖాన్‌కు సంపూర్ణ పరిపాలనా బాధ్యతలు అప్పగించినదెప్పుడు? (ఫిబ్రవరి 5, 1885)

20.                1893 లో మీర్ మహబూబ్ అలీఖాన్ ప్రవేశపెట్టిన ముఖ్యమైన సంస్కరణ ఏమిటి? (శాసనాధికార వ్యవహారాల కాబినెట్ కౌన్సిల్, చట్టాలు రూపొందించే విధాన మండలి ఏర్పాటుకు వీలు కలిగించే "క్వానుంచే ముబారిక్" అనే ప్రభుత్వ అధికారిక ప్రకటన)

21. హిందూ-ముస్లిం అనాథ-నిరుపేద పిల్లలకు ఆశ్రయం కలిగించే లక్ష్యంతో నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్, హైదరాబాద్‌లో నెలకొల్పిన సంస్థ పేరేమిటి? ఎప్పుడు నెలకొల్పారు? (సరూర్ నగర్ లో అసంపూర్తి గా నిర్మించిన తన భవనాన్ని విక్టోరియా మహారాణి జ్ఞాపకార్థం ఇచ్చి, అందులో "విక్టోరియా మెమోరియల్ ఆర్ఫనేజ్" నెలకొల్పారు. మే 5, 1905)

22.                "గ్రాండ్ కమాండర్ ఆఫ్ ద స్టార్ ఆఫ్ ఇండియా" అన్న బిరుదును మీర్ మహబూబ్ అలీఖాన్‌కు ఎప్పుడు ప్రదానం చేశారు? (ఫిబ్రవరి 5, 1885)

23.                మీర్ మహబూబ్ అలీఖాన్ కున్న ప్రజాదరణతో ఆయనను పిలిచే పేరేమిటి? (మహబూబ్ అలీ పాషా)

24.                మహబూబ్ అలీ ఖాన్ ఎలా, ఎక్కడ, ఎప్పుడు మరణించారు? (పక్షవాతంతో ఆగస్ట్ 29, 1911 న ఫలక్ నుమా పాలెస్ లో చనిపోయారు)

25.                ఏడవ ఆసఫ్ జా మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పుట్టిన దెప్పుడు? నిజాంగా ప్రకటించబడిందెప్పుడు? ఎప్పుడు మరణించారు? (ఏప్రిల్ 5, 1886; ఆగస్ట్ 29, 1911; ఫిబ్రవరి 24, 1967)

26.                ఎప్పుడు, ఎక్కడ, ఎవరిని మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ వివాహమాడారు? (ఏప్రిల్ 14, 1906; తన 21 వ ఏట; ఈడెన్ బాగ్ లో నవాబ్ జహంగీర్ జంగ్ కుమార్తె దుల్హన్ షా బేగంను)

27.                ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్  పట్టాభిషేకం ఎక్కడ, ఎప్పుడు జరిగింది? (సెప్టెంబర్ 12, 1911 న చౌ మహల్లా పాలెస్ లో)

28.                నిజాం డొమినియన్ ఏలికగా మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ సాధించిన అత్యంత ప్రాముఖ్యమైన విషయమేంటి? (నవంబర్ 17, 1919 న ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ నూతన రాజ్యాంగ రూపకల్పన)

29.                నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పెద్ద కొడుకు ప్రిన్స్ ఆజం జా బహదూర్, మరో కొడుకు ప్రిన్స్ మౌజం జా బహదూర్ పెళ్లి చేసుకున్నదెవరిని? ఎప్పుడు? (రాజకుమారి దుర్రు షెహవార్, రాజకుమారి నిలోఫర్; నవంబర్ 12, 1931)

30.                నవంబర్ 29, 1947 న భారత డొమినియన్‍తో నిజాం కుదుర్చుకున్న ఒప్పందం ఏమిటి? ఎవరి సలహా మేరకు ఆయన దానిపై సంతకం చేసారు? (ఒక సంవత్సర కాలం పాటు అమలులో వుండేలా అంగీకరించబడిన "స్టాండ్ స్టిల్" ఒడంబడిక. లార్డ్ మౌంట్ బాటన్, సర్ వాల్టర్ మెన్క్ టాన్ ల సలహా మేరకు)

31. నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌ను రద్దు చేసిందెప్పుడు? (నవంబర్ 28, 1947 న)

32.                హైదరాబాద్ పైన పోలీస్ చర్య పర్యవసానంగా, దానిని ఇండియన్ యూనియన్‌లో విలీనం చేయడంతో, భారత ప్రభుత్వం, నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్‌కు ఏ పదవినిచ్చింది? ఆయన ఆ పదవిలో ఎంత కాలం వున్నారు? (రాజ ప్రముఖ్, జనవరి 26, 1950 నుండి అక్టోబర్ 31, 1956 వరకు-ఆరు సంవత్సరాల తొమ్మిది నెలలకు పైగా)

33.                మొగల్ చక్రవర్తి పంపే ఫర్మానాలను స్వీకరించేందుకు నిజాం-ఉల్-ముల్క్ వెళ్తుండే రాజ ప్రాసాదం పేరేమిటి? ఫర్మానాలను అందుకునే సమయంలో చక్రవర్తి పట్ల తనకున్న గౌరవ మర్యాదలను నిజాం ఏ విధంగా వ్యక్తం చేసేవారు? (ఫర్మాన్ బాడి భవనం. సకల లాంఛనాలతో ముందుగా ఫర్మానాలను అందుకున్న దివాన్, వాటిని వెంటనే నిజాం-ఉల్-ముల్క్ కు ఇచ్చేవారు. నిజాం తన నెత్తిపై వరకు గౌరవ సూచకంగా వాటిని ఎత్తి చూపేవారు)

34.                మొదటి నిజాం మరణానంతరం జరిగిన అధికార కుమ్ములాటలో ఫ్రెంచ్ వారు ఎవరిని, ఆంగ్లేయులు ఎవరిని సమర్థించారు? (ఖైరున్నిసా బేగం కొడుకు, నిజాం మనుమడు ముజఫర్ జంగ్‍కు ఫ్రెంచ్ వారి మద్దతు లభించగా, ఆయన రెండవ కుమారుడు నసీర్ జంగ్‍కు బ్రిటీష్ వారు అండగా నిలిచారు)

35.                హైదరాబాద్ ప్రజలు తరతరాలుగా గుర్తుంచుకోవాల్సిన ఒక ప్రధానమైన పనిని రెండవ ఆసఫ్ జా నిజాం అలీఖాన్ చేశారంటారు. అదేంటి? (76 సంవత్సరాల విరామం తరువాత రాజధానిని ఔరంగాబాద్ నుంచి హైదరాబాద్‌కు తరలించి, దానికి గత వైభవాన్ని పునరుద్ధరించడం)

36.                గుంటూరు సర్కారు ప్రాంతాల విషయానికి సంబంధించిన ఒప్పందాన్ని వివరంగా తెలియచేసేందుకు, హైదరాబాద్ లోని నిజాం కోర్టుకు, మద్రాస్ ప్రభుత్వం ఏప్రిల్ 1779 లో పంపిన వ్యవహార దక్షుడెవరు? (జాన్ హాలెండ్)

37.                ఏప్రిల్ 1779 లో మద్రాస్ ప్రభుత్వం దౌత్య బృందం ప్రతిపాదించిన ఒప్పంద వివరాలను నిజాం తిరస్కరించడంతో, తిరిగి జులై 1780 లో ఎవరిని పంపటం జరిగింది? (జేమ్స్ గ్రాంట్)

38.                "నిజాం పోతే అంతా పోయినట్లే" అని వ్యాఖ్యానించిందెవరు? ఏ సందర్భంలో అలా వ్యాఖ్యానించారు? (1857 నాటి సిపాయిల తిరుగుబాటు సందర్భంలో హైదరాబాద్ లోని బ్రిటీష్ రెసిడెంట్‌కు పంపిన టెలిగ్రాంలో బొంబాయి గవర్నర్ ఆ విధంగా వ్యాఖ్యానించారు)

39.                నిజాం రాజులు అధికారికంగా స్వతంత్రులెప్పుడు అయ్యారు? (1857 నాటి సిపాయిల తిరుగుబాటు తదుపరి కాలంలో మొగలాయి చక్రవర్తుల అధికారం అంత్య దశకు చేరువవుతున్నప్పుడు)

40.                మీర్ మహబూబ్ అలీఖాన్, ఆరవ నిజాం హోదాలో ప్రప్రధమంగా ప్రజలకు దర్శనమిచ్చినప్పుడు ఆయన వయసెంత? ఎప్పుడు కనిపించారు? ఏ సందర్భంలో కనిపించారు? (11 సంవత్సరాల బాలుడుగా వున్నప్పుడు. జనవరి 1877 లో ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో బ్రిటీష్ మహారాణి నిజాంకు అధికారాలు అప్ప చెప్పినప్పుడు)

41. 18 సంవత్సరాల వయస్సు పూర్తి చేసుకోవడంతో ఆరవ నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ ఫిబ్రవరి 5, 1885 న, ప్రభుత్వ నిర్వహణకు పాలనాపరమైన సమస్త బాధ్యతలను స్వీకరించారు. అప్పటి పదవీ  ప్రమాణ స్వీకార ఉత్సవానికి హైదరాబాద్ విచ్చేసిన వైస్రాయ్-భారత గవర్నర్ జనరల్ ఎవరు? (లార్డ్ రిప్పన్)

42.                1893 వ సంవత్సరంలో, పాలనాపరంగా, హైదరాబాద్ ఒక ప్రాముఖ్యమైన రాజ్యాంగ మెట్టును అధిగమించింది. అదేంటి? ("క్వానుంచే-ఇ-ముబారిక్" అనే ప్రభుత్వ ప్రకటన ద్వారా రాజ్యాంగంలో పలు సంస్కరణాత్మక మార్పులకు ఆరవ నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ శ్రీకారం చుట్టారు. అందులో ముఖ్యమైంది కాబినెట్ కౌన్సిల్, విధాన మండలి ఏర్పాటు)

43.                పిన్న వయస్సులో మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఆటలు, గుర్రపు స్వారీ, షూటింగ్, క్రికెట్ ఎవరి పర్యవేక్షణలో నేర్చుకున్నారు? (నిజాం ఆర్మీ కమాండర్-ఇన్-ఛీఫ్ కల్నల్ సర్ అఫ్ సర్-ఉల్-ముల్క్ పర్యవేక్షణలో)

44.                మీర్ ఉస్మాన్ అలీఖాన్‌కు ఆంగ్ల భాష నేర్పిందెవరు? (సర్ బ్రియర్ ఈగర్టన్)

45.                నవంబర్ 17, 1919 న ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ హైదరాబాద్ రాష్ట్రంలో, అభ్యుదయం-అభివృద్ధి దిశగా ఒక నూతనాధ్యాయానికి నాంది పలికారు. అది ఆయన ఏ విధంగా చేసారని చెప్పవచ్చు? (ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ వుండే నూతన రాజ్యాంగాన్ని అమలులోకి తేవడం)

46.                నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఏర్పాటు చేసిన ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌కు సదర్-ఇ-ఆజం (అధ్యక్షుడు) ఎవరు? (సర్ అలీ ఇమాం)

47.                బ్రిటీష్ ఇండియా పౌరుల ఆందోళనా ఫలితంగా వారి డిమాండ్ మేరకు, మొట్టమొదట హైదరాబాద్‌లో ప్రవేశపెట్టిన ఒక సంస్కరణకు బాధ్యుడు నిజాం ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అధ్యక్షుడు. ఆ సంస్కరణ ఏంటి? (న్యాయ వ్యవస్థను శాసనాధికారం నుంచి వేరు చేయడం)

48.                1914 నాటి గవర్నర్ జనరల్ లార్డ్ హార్డింగే అధికారిక ఉత్తర్వు ద్వారా చేసిన ఒక అభ్యర్థనను పురస్కరించుకుని, ఆ నాటి ప్రజాదరణ పొందిన ఉద్యమానికి వ్యతిరేకంగా తగు చర్యలు తీసుకున్నారు నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్. ఏమిటా ఉద్యమం? (భారత దేశంలో చెలరేగిన నాటి ఖిలాఫత్ ఉద్యమం)

49.                సెప్టెంబర్ 28, 1803 న మూడవ ఆసఫ్ జా సికందర్ జా ఆసఫ్ నిజాం జండాను ఎగురవేసిందెక్కడ? (హైదరాబాద్ నగరం, గోలకొండల మధ్య ఆసిఫ్ నగర్ సమీపాన వున్న గోవర్ధన్ దాస్ గార్డెన్‌లో)

50.                అక్టోబర్ 30, 1807 న ఆ ఏడాది దీపావళి పండుగను పురస్కరించుకుని, నాటి నిజాం సికందర్ జా నిర్వహించిన దర్బారుకు హాజరైన ప్రముఖ వ్యక్తి ఎవరు? (మీర్ ఆలం బహదూర్)

51. మొదటి, చివరి నిజాంల సమాధులు మిగిలిన ఐదుగురి సమాధులున్న మక్కా మస్జీద్‍లో లేవు. అవి ఎక్కడ వున్నాయి? (నిజాం-ఉల్-ముల్క్ సమాధి ఖుల్దాబాద్ లోను, ఏడవ నిజాం సమాధి కింగ్ కోఠి సమీపం లోని జుడీ మస్జీద్ వద్దనూ వున్నాయి)

52.                ఎవరి ప్రేరణతో, నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్, లక్ష రూపాయల విరాళాన్ని బనారస్ హిందూ విశ్వ విద్యాలయానికి ఇచ్చాడు? (బికనీర్ మహరాజా పంపిన ఉత్తరం ప్రేరణతో)

53.                మూడవ ఆసఫ్ జా, సికందర్ జా, హైదరాబాద్ పాలకుడిగా ఎప్పుడు నియుక్తులయ్యారు? (1803 లో)

54.                "వాలాషన్ సోదరులు" గా ఎవరిని సంబోధిస్తారు? (మీర్ ఉస్మాన్ అలీఖాన్ కుమారులైన ప్రిన్స్ ఆజం జా బహదూర్, ప్రిన్స్ మౌజం జా బహదూర్ లను అలా పిలుస్తారు)

55.                బ్రిటీష్ రెసిడెంట్లు, వారి అనుచరులు, నిజాం దర్బారులో ప్రవేశించిన తరువాత, నెత్తి మీద టోపీ లేకుండా, కాళ్లకు పాద రక్షలు లేకుండా, ఒక తివాచిపై నిజాంకు కుడి భాగాన కూర్చునే ఆచారం వుండేది. బాసిపట్లు వేసుకుని, కింద కూర్చోవడం ఇబ్బందిగా వున్నందున కుర్చీలు ఉపయోగించుకునేందుకు అనుమతి కోరాడు ఒక రెసిడెంట్. నాటి నిజాం అఫ్జల్-ఉద్-దౌలా ఆ అభ్యర్థనకు ఎలా స్పందించారు? (రెసిడెంట్ తన కాళ్లు పెట్టుకునేందుకు ఒక గుంట తవ్వితే మంచిదని అన్నారు)

56.                తరతరాలుగా వాడుకలో లేని ఓ సనాతన సంప్రదాయాన్ని పునరుద్ధరించడానికి దోహదపడిన ప్రక్రియ న్యాయ వ్యవస్థను శాసనాధికారం నుంచి విడదీయడం. ఇది హైదరాబాద్ రాష్ట్రంలో 1921 లో ప్రవేశ పెట్టిందెవరు? (సర్ అలీ ఇమాం అనే బీహార్ కు చెందిన ప్రముఖ బారిస్టర్)

57.                సంస్థానాధీశులు ఆంగ్లేయ భాషను విధిగా నేర్చుకోవాలన్న బ్రిటీష్ ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు పర్చేందుకు ఒక నిజాంకు ఇంగ్లీష్ ట్యూటర్‍ను 1869 లో నియమించారు. ఎవరా నిజాం? ఆ ట్యూటర్ పేరేమిటి? (నిజాం మీర్ మహబూబ్ అలీ పాషా. శ్రీమతి క్లాడ్ క్లర్క్ నీ సెర్ యాంటోనియా) 

Wednesday, April 10, 2013

నాలుగు శతాబ్దాల హైదరాబాద్-1: కుతుబ్‌షాహీల పాలన నుండి స్వతంత్ర భారతావనికి: వనం జ్వాలా నరసింహారావు


నాలుగు శతాబ్దాల హైదరాబాద్-1

కుతుబ్‌షాహీల పాలన నుండి స్వతంత్ర భారతావనికి

వనం జ్వాలా నరసింహారావు

ప్రశ్నలు: జవాబులు

1.      170 సంవత్సరాల సుదీర్ఘ కుతుబ్‌షాహీ వంశీయుల గోలకొండ పాలనకు చరమగీతం పాడినది ఎవరు? (మొగలాయి చక్రవర్తి ఔరంగజేబ్)

2.      మొగలాయిల పాలన తరువాత ఏ రాజవంశం అధికారంలోకి వచ్చింది? (ఆసఫ్ జాహీ రాజవంశం)

3.      ఆంగ్లేయులకు, హైదరాబాద్ సంస్థానానికి మధ్య పటిష్ఠమైన సంబంధ బాంధవ్యాలు దేనితో ప్రారంభమయ్యాయి? (హైదరాబాద్ నిజాం, బ్రిటీష్ ప్రభుత్వంతో 1800 వ సంవత్సరంలో కుదుర్చుకున్న "ఆశ్రిత మైత్రి ఒడంబడిక" లేక సబ్సిడియరీ ఎలయన్స్ ట్రీటీ)

4.      హైదరాబాద్‌ను పాలించిన ఆసఫ్ జాహీ వంశీయులు తొలుత ఏ దేశానికి చెందినవారు? (టర్కీ-మధ్య ఆసియా దేశపు రాజ కుటుంబానికి చెందిన టర్కీ యులు)

5.      ఆసఫ్ జాహీ వంశీయుడైన నిజాం-ఉల్-ముల్క్ ఎప్పుడు జన్మించారు? ఎప్పుడు మరణించారు? (1724, 1748)

6.      ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ హైదరాబాద్ పరిపాలకుడుగా ఎప్పుడు నియుక్తులయ్యారు? (సెప్టెంబర్ 18, 1911)

7.      ప్రధమ ప్రపంచ సంగ్రామం ఆసాంతం, దివాన్‌గా కూడ బాధ్యతలు నిర్వహించిన హైదరాబాద్ నిజాం ఎవరు? ( ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్)

8.      గుల్ జార్ హౌజ్, బాద్-ఎ-షాహి, అశూర్ ఖానాలు, జామె-మస్జీద్, దాదా మహల్, చందన్ మహల్, లఖిన్ మహల్ లాంటి రాజ ప్రాసాదాలను నిర్మించింది ఎవరు? (హైదరాబాద్ మహానగరాన్ని అతి వైభవోపేతంగా 1591 లో భాగ్యనగర్ అనే పేరుతో నిర్మించిన మహ్మద్ కులీ కుతుబ్ షా)

9.      హైదరాబాద్ నగరం నడిబొడ్డున వున్న మక్కా మస్జీద్‍కు శంఖుస్థాపన చేసింది ఎవరు? ఎప్పుడు? (మహ్మద్ కులీ కుతుబ్ షా, 1617)

10. కుతుబ్ షాహీ రాజ వంశానికి చెందిన రాజులు ఎందరు? (ఎనిమిది మంది)

11. పురాతన గోలకొండ మట్టిబురుజు పునాదులపై సుల్తాన్ కులీ కుత్బుల్ ముల్క్ నిర్మించిన మహానగరం పేరేమిటి? (మహ్మద్ నగర్)



12. కుతుబ్ షాహీ ఎలా చనిపోయారు? అది సహజ మరణమేనా? (సహజ మరణం కాదు. అతడి సొంత కుమారుడు, ఆయన వారసుడిగా-ప్రభుత్వాధినేతగా అధికారం చేపట్టిన జమ్‍షద్ కులీ చేతుల్లో హత్యకు గురయ్యాడు)

13. చరిత్రకారుల దృష్టిలో కుతుబ్ షాహీ రాజవంశీయులలోని ఎవరి పాలనలో హైదరాబాద్ నగరం అంగరంగ వైభోగంగా పేర్కొనబడింది? (1580-1612 మధ్య కాలంలో పాలించిన మహ్మద్ కులీ కుతుబ్ షా పాలన రోజుల్లో)

14. కులీ కుతుబ్ షా ప్రేమికురాలిగా గణుతికెక్కి, భాగ్యనగర్ నిర్మాణానికి ప్రేరణ కలిగించిన నాట్యగత్తె భాగుమతి నివసించిన గ్రామం పేరేమిటి? ప్రస్తుతం ఆ స్థలంలో ఏ కట్టడం వుంది? (చిచేలం. చార్మీనార్)

15. భాగ్యనగర్ పేరును హైదరాబాద్‌గా మార్చే ముందు భాగుమతికి ప్రదానం చేసిన బిరుదేమిటి? (హైదర్ మహల్)

16. కులీ కుతుబ్ షా ఏకైక కుమార్తె పేరేమిటి? (హయాత్ బక్షీ బేగం)

17. మొగలు చక్రవర్తి ఔరంగజేబును ఎదుర్కొని ఓడిపోయిన ఎనిమిదవ చివరి గోలకొండ రాజెవరు?ఆయన ఎప్పుడు పాలించారు? ఎప్పుడు మరణించారు? ( సహనశీలి, మృధు స్వభావుడుగా ప్రసిద్ధికెక్కిన అబుల్ హసన్ తానాషా. 1672-1687. 1699)

18. హైదరాబాదీ సంస్కృతిపై చెరగని ముద్రవేసి, హైదరాబాద్ నగర రూపురేఖల తయారీతో ప్రత్యక్ష సంబంధమున్న కుతుబ్ షాహీల కాలం నాటి పెద్దమనిషి ఎవరు? (1585 లో పీష్వాగా నియుక్తుడైన మీర్ మొమిన్ పీష్వా)

19. 1656 లో ఔరంగజేబ్ సైన్యాన్ని ఎదుర్కొని, గోలకొండ కోటను రక్షించిన సేనానాయకుడు ఎవరు? (మూసా ఖాన్ మహల్ దార్)

20. కుతుబ్ షాహీల కాలంలో వెలసిన చారిత్రాత్మక కట్టడం చార్మీనార్‍ను నిర్మించిన మహానుభావుడెవరు? ఎప్పుడు? (మహ్మద్ కులీ కుతుబ్ షా, 1590-1591)

21. హైదరాబాద్, సికిందరాబాద్ జంట నగరాలను కలిపేది, విడదీసేది ఏ నిర్మాణం? (హుస్సేన్ సాగర్-టాంక్ బండ్)

22. ప్రప్రధమ భారత ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ, హైదరాబాద్ నగరాన్ని ఏమని వర్ణించారు? (భారతీయ సంస్కృతికి "విశ్వం" లాంటిదని)

23. దక్కన్ రాజధానిని, ఔరంగాబాద్ నుండి హైదరాబాద్‌కు మార్చినది ఎవరు? ఎప్పుడు? (రెండవ ఆసఫ్ నిజాం అలీఖాన్, 1763)

24. ఆధునిక హైదరాబాద్ నిర్మాత పూర్తి పేరు, బిరుదులతో సహా ఏమిటి? (లెఫ్ట్ నెంట్ జనరల్, హిజ్ ఎక్జాల్టెడ్ హైనెస్, రుస్తుం-ఇ-దౌరాన్, అరస్తు-ఇ-ఇజామాం, సిఫాసాలార్, ఆసఫ్ జా, ముజఫర్-ఉల్-ముల్క్-వాల్-మామాలిక్, నిజాం-ఉల్-ముల్క్, నిజాం-ఉద్-దౌల్హా, నవాబ్ సర్ మీర్ ఉస్మాన్ అలీఖాన్ బహదూర్, పతేజంగ్, సుల్తాన్-ఉమ్-ఉలూమ్, జి.సి.ఎస్.ఐ.జి.బి.ఐ, బ్రిటీష్ ప్రభుత్వ విశ్వాస పాత్రుడు, హైదరాబాద్-చీరాల నిజాం)

25. మూడవ ఆసఫ్ జాహి, సికిందర్ జాహి పేరుమీద నిర్మించిన నగరం పేరేంటి? ( జంట నగరాలలో ఒకటైన సికిందరాబాద్)

26. హైదరాబాద్ నగరానికి సంబంధించినంతవరకు ఫిబ్రవరి 5, 1885 ఎందుకని ముఖ్యమైన దినంగా చెప్పుకోవచ్చు? ( ప్రప్రధమంగా బ్రిటీష్ రాణి ప్రత్యేక దూతగా హైదరాబాద్ నగరానికి విచ్చేసిన భారత వైస్రాయ్ సమక్షంలో, ఆయన చేతుల మీదుగా మీర్ మెహబూబ్ అలీఖాన్ నిజాం నవాబ్‍గా పట్టాభిషిక్తుడైన రోజది. అలా పట్టాభిషిక్తుడైన మొదటి నిజాం ఆయనే)

27. హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్‌లో విలీనం చేసే ప్రయత్నంలో భాగంగా పోలీసు చర్య ఎప్పుడు ప్రారంభమైంది? దరిమిలా నిజాం మంత్రివర్గం రాజీనామా చేసిందెప్పుడు? (సెప్టెంబర్ 13, 1948: సెప్టెంబర్ 17, 1948)

28. భారత సైన్యం హైదరాబాద్‌ను ఆక్రమించుకున్నదెప్పుడు? ఎప్పుడు సైనిక పాలన విధించడం జరిగింది? తుదకు భారత యూనియన్‌లో హైదరాబాద్ సంస్థానం విలీనం జరిగిందెప్పుడు? (సెప్టెంబర్ 19, 1948)

29. హైదరాబాద్ నగరం నడి మధ్యలో ప్రవహిస్తుండే మూసీ నదికి భీభత్సమైన వరదలు సంభవించిందెప్పుడు? (సెప్టెంబర్ 28, 1908 మంగళవారం)

30. ఆధునిక హైదరాబాద్ రూపురేఖల రూపకల్పనలో మహ్మద్ కులీ కుతుబ్ షా కు సహాయకుడుగా వ్యవహరించిన పీష్వా ఎవరు? (మీర్ ముమీన్ అస్ట్రాబడి)

31. ఆధునిక హైదరాబాద్ నగరానికి 1591 వ సంవత్సరంలో సుల్తాన్ కులీ కుతుబ్ షా శంఖుస్థాపన చేసిన రోజు శుభ దినం కాదని కొందరంటారు. కారణమేంటి? (చంద్రుడు సింహరాశి నక్షత్ర మండలంలోను, బృహస్పతి తనదైన వేరే మార్గంలోను కదులుతున్న రోజైనందున ఆ దినాన్ని అశుభమైనదిగా కొందరు పరిగణిస్తారు)

32. హైదరాబాద్ అసలు పేరేంటి? ఎవరి పేరుపై అలా పిలవడం జరిగిందసలు? (ఇస్లాం నాల్గవ మత ప్రవక్త హజ్రత్ అలీ బిరుదు ఆధారంగా, హయిదరాబాద్ అనీ, హయిదర్ నగరమనీ పిల్చేవారు)

33. భాగుమతి పేరు మీద హైదరాబాద్ నగరాన్ని భాగ్యనగరం అని పిలవడానికి మరేదైనా కారణం కూడా వుందా? (భాగ్ నగర్ అంటే ఉద్యానవనాల నగరం అని కూడా అర్థం)

34. కులీ కుతుబ్ షా పాలనా కాలంలో హైదరాబాద్ నగరం ఎన్ని ముహల్లాలుగా విభజించడం జరిగింది? ప్రధాన రహదారులలో ఆ రోజుల్లో వున్న భవంతులెన్ని? (12, 000 ; 14, 000)

35. కులీ కుతుబ్ షా కాలం నాటి హైదరాబాద్ నగరంలో, ఏఏ ప్రాంతాలను రాజ ప్రాసాదాల కొరకు, ప్రభుత్వ కార్యాలయాల నిమిత్తం కేటాయించారు? ప్రముఖుల నివాసం కొరకు ఏర్పాటు చేసిన ప్రాంతం ఏది? (వాయువ్య, ఈశాన్య ప్రాంతాలు)

36. కులీ కుతుబ్ షా కాలంలో, ఆధునిక హైదరాబాద్ నిర్మాణాలలో భాగంగా, పూర్తిగా విభజించబడిన ప్రప్రధమ కట్టడం ఏది? (1592 నాటి చార్మీనార్)

37. ఫ్రాన్స్ దేశానికి చెందిన ప్రముఖ యాత్రీకుడు, వ్యాపారస్తుడు టావర్నీర్ 1652 వ సంవత్సరంలో, హైదరాబాద్ నగరాన్ని దర్శించిన తరువాత దానిని ఏ నగరంతో పోల్చాడు? (ఫ్రాన్స్ దేశంలోని ఆర్లియన్స్)

38. రాష్ట్ర రాజధానిగా హైదరాబాద్ నగరం ఎంతకాలం పాటు వ్యవహరించబడలేదు? తిరిగి ఎవరి చొరవతో అది తన పూర్వ వైభవాన్ని పొందగలిగింది? (1687-1763 మధ్య కాలంలో 76 సంవత్సరాల పాటు. రెండవ ఆసఫ్ జాహి నిజాం అలీఖాన్ చొరవతో)

39. నిజాం-ఉల్-ముల్క్ కు చెందిన ఆరు ప్రాంతాలను ఆ రోజుల్లో ఎన్ని సర్కారులు గాను, ఎన్ని పరగణాలు గాను విభజించడం జరిగింది? (93 సర్కార్లు, 1228 పరగణాలు)

40. హైదరాబాద్-సికిందరాబాద్ జంట నగరాల అభివృద్ధి కార్యక్రమంలో ప్రధాన భాగంగా, ఒక నూతన శకారంభం ఎప్పుడు-ఎందువలన జరిగింది? (1798 లో కుదుర్చుకున్న ఆశ్రిత మైత్రీ ఒడంబడిక వలన సికిందరాబాద్ కంటోన్మెంటు బ్రిటీష్ సైనికుల స్థావరంగా తయారైంది. అభివృద్ధి కార్యక్రమాల అమలులో అలా ఒక నూతన శకం ఆరంభమైంది)

41. ప్రప్రధమంగా హైదరాబాద్ శాసనసభను ఏర్పాటు చేసినప్పుడు ఎందరు సభ్యులుండేవారు? వారిలో ఎన్నికైన వారెందరు? నామినేటెడ్ ఎందరు? (మొత్తం 132, ఎన్నికైన వారు 76, నామినేటెడ్ 56)

42. ఏఏ రాజ ప్రముఖుల జన్మ దినాలను అధికారిక శెలవు రోజులుగా అలనాటి హైదరాబాద్లలో పరిగణించేవారు? (నిజాం పుట్టిన రోజు, విక్టోరియా మహారాణి పుట్టిన రోజు, బ్రిటీష్ రాజు జన్మ దినం)

43. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా హైదరాబాద్ నగరం ఎప్పుడైంది? (నవంబర్ 1, 1956 న- రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ తరువాత)