Monday, March 21, 2022

తన వంశక్రమాన్ని వశిష్ఠుడికి చెప్పిన జనకుడు ..... శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-100 : వనం జ్వాలా నరసింహారావు

 తన వంశక్రమాన్ని వశిష్ఠుడికి చెప్పిన జనకుడు

శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-100

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (21-03-2022)

         ఇక్ష్వాకు వంశ క్రమం వివరించిన వశిష్ఠుడితో జనక మహారాజు తనవంశక్రమాన్ని వినిపించాడీవిధంగా: "మునీంద్రా, కన్యాదానం చేసేవాడు మంచి కులంలో పుట్టినవాడైతే తన వంశం గురించి తెలపడం అత్యంతావశ్యకం. మా వంశానికి పూర్వుడు మిక్కిలి ధర్మాత్ముడైన నిమి. అతడి కొడుకు మిథి అనే మహాత్ముడే ఈ మిథిలా పురాన్ని కట్టించాడు. ఆయనే మొదటి జనకుడు. ఆ పేరే మా వంశంలో జనకుడు అని రాసాగింది. అది వంశనామమే అయింది. మిథి కొడుకు కుదావసువు. అతడి పుత్రుడు నందివర్దనుడు-ఆయన కొడుకు సుకేతుడు-అతడి కుమారుడు దేవరాతుడు. దేవరాతుడికి బృహద్రధుడు జన్మించాడు. ఆయనకు మహావీరుడు పుట్టాడు. మహావీరుడి కొడుకు సుధృతి. అతడి కొడుకు ధృష్టకేతువు-ఆయన కొడుకు హర్యశ్వుడు-ఆయన కొడుకు మరువు-ఆయన కుమారుడు ప్రతీంధకుడు-ఆతడి కొడుకు కీర్తిరథాక్యుడు-అతడి కొడుకు దేవమీఢుడు-అతడి కొడుకు విబుధుడు-అతడి కొడుకు మహీధ్రకుడు-అతడికి కీర్తిరాతుడు-కీర్తిరాతుడికి మహారోముడు-మహారోముడికి స్వర్ణరోముడు-అతడికి హ్రస్వరోముడు జన్మించారు”.

         “హ్రస్వరోముడికి ఇద్దరు కుమారులు వారిలో నేను పెద్దవాడిని. నా తమ్ముడు కుశధ్వజుడు. మా తండ్రి తపస్సు చేసేందుకు అడవికి పోతూ వీడిని నాకప్పగించి కొంతకాలానికి మరణించాడు. జనకుడనబడే నేను ఇతడిని కాపాడుతున్నాను. సాంకాశ్య పురపతి సుధన్వుడనేవాడు సీతను-శివుడి ధనస్సును తనకిమ్మని దూతలను పంపాడు. నేనొప్పుకోనందున వాడికీ-నాకు భయంకరమైన యుద్ధం జరిగింది. వాడిని చంపి, నా తమ్ముడిని సాంకాశ్య ప్రభువుగా చేసాను. నేను జ్యేష్టుడను-కుశధ్వజుడు నా తమ్ముడు. శ్రీరామ లక్ష్మణులకు నా కూతుళ్లు సీత-ఊర్మిళలను సంపూర్ణ ప్రీతితో, నీ ఆజ్ఞ ప్రకారం ఇచ్చి వివాహం జరిపిస్తాను".

         వంశ క్రమాన్ని వివరించిన జనకుడు దశరథుడితో, ముమ్మాటికి తన ఇద్దరు కూతుళ్లను ఆయన ఇద్దరు కుమారులకిస్తానని, కాబట్టి, ఆయన కొడుకులిద్దరితో గోదానం చేయించడానికి ఇదే సరైన సమయమని చెప్పాడు. చెప్పి ఇలా అంటాడు: " రాజేంద్రా, నేడు మఖా నక్షత్రం. నేటికి మూడోరోజు-అనగా రేపుకాక ఎల్లుండి ఉత్తర ఫల్గుని నక్షత్రం వస్తుంది. ఆ రోజున వివాహం చేద్దాం. నీ కొడుకులతో దానాలు చేయించు. భవిష్యత్ కాలంలో సుఖం కలుగుతుంది".

         (గోదానం-కేశఖండనం- చౌలంలాగా చేయాలిగాని తొడమీద కూచోడం కాదు. మీసాలు మాత్రం పవనం చేయాలి. స్నానంచేసి, మౌనం వహించి పగలంతా గడిపి, సూర్యాస్తమానంకాగానే, గురువు దగ్గర మౌనం వీడాలి. గురువుకు దక్షిణ ఇస్తానని చెప్పి గోమిథునం ఇవ్వాలప్పుడు. దీనికి గోదానం అనిపేరు. ఇది మొదలు చేసిన తర్వాత సమావర్తనం చేయాలి. గోదానం, సమావర్తనం చేయకుండా వివాహం జరిపించరాదని మనుస్మృతిలో చెప్పబడింది. ఉత్తర ఫల్గునీ నక్షత్రం నాడు వివాహం చేద్దామని జనకుడు మరో విషయం చెప్పాడు. ఉత్తర ఫల్గునీ నక్షత్రం శ్రీరామచంద్రమూర్తికి శుభకరమే కాని సీతకు జన్మ నక్షత్రం. అయినా గాని, తిథి-వార-నక్షత్ర దోష శాస్త్రం ప్రకారం, అభిజిత్సర్వదోషఘ్నం అయినందున, ఆ లగ్నమే మంచిది. అదే నక్షత్రంలో మొదటి పాదం తర్వాత ఆమెది కన్యారాశి అయినందున, తృతీయ ఏకాదశ రూప నక్షత్రకూట శుద్ధి కావడంతో నక్షత్ర దోషం లేదు. అయినా, భార్యా-భర్తలిద్దరికి ఏక నాడి అయినందున వియోగప్రాప్తంటారు).

గోదాన వివరణ

         జనక మహారాజు ఇలా తమ వంశ క్రమాన్ని చెప్పి, శ్రీరామ లక్ష్మణులకు తన ఇద్దరు కూతుళ్లైన సీత ఊర్మిళలను ఇచ్చి వివాహం జరిపించుదామని చెప్పిన తర్వాత, విశ్వామిత్రుడు వశిష్ఠుడు ఆలోచించి మరో ప్రతిపాదన చేశారు. ఆ విషయం చెప్పడానికి ముందు, జనకుడి వంశం-దశరథుడి వంశం రెండూ తెలుసుకోలేనంత మహిమగలవని, మిక్కిలి గొప్పవని, వారిని మించినవారెవరూలేరని, సౌందర్యంలో-సంబంధంలో రామ లక్ష్మణులకు సీత ఊర్మిళలు సరిసమానమని అంటూ, జనకుడి చెప్పింది తమకు సమ్మతమేనని దశరథుడి పక్షాన తెలియచేశారు. జనకుడి తమ్ముడైన కుశధ్వజుడి ఇరువురు పుత్రికలను, దశరథుడి కుమారులైన భరత శత్రుఘ్నులకిచ్చి వివాహం చేయమని కోరారు వారు. సౌందర్యంలో-భుజబలంలో-ప్రాయంలో దశరథుడి నలుగురు కుమారులు సమానమైన వారని, అందరూ దిక్పాలురవలె బలశాలురని, ఆనందించతగినవారని, రామ లక్ష్మణులకు సీత ఊర్మిళల ఈడు-జోడు ఎలా బాగుంటుందో అలాగే భరత శత్రుఘ్నులకు కుశధ్వజుడి కుమార్తెలిరువురి ఈడు-జోడు బాగుంటుందని లోకులు శ్లాఘిస్తారని చెప్పరు. విశ్వామిత్ర వశిశ్ఠులు చెప్పినదానికి జనకుడంగీకరిస్తూ, తమ ఇరువురి వంశాలు సమానమని-పరస్పర సంబంధం చెల్లుతుందని వారన్నారంటే, సూర్య వంశపు రాజులతో తమ వంశపు రాజులను సమానం చేసి తమను పావనం చేయడమేనని అంటాడు. సంతోషంతో కుశధ్వజుడి ఇరువురు పుత్రికలను భరత శత్రుఘ్నులకిస్తానని, నలుగురికీ ఒకే రోజున వివాహం చేస్తానని, ఒకే రోజున నలుగురు కోడళ్లను సంపాదించుకొని దశరథుడు సంతోషించవచ్చని అంటాడు జనకుడు.

         "ఎల్లుండి ఉత్తర ఫల్గుని. దానికధిపతి భగుడనే ప్రజాపతి. ఆయన శుభకరుడు కాబట్టి, ఉత్తర ఫల్గుని ఉత్తమమని అందరు ప్రశంసిస్తారు. నేను మీ శిష్యుడను-మీ దయకు పాత్రుడను-మీరు నాకు గొప్ప ధర్మాన్ని చెప్పారు. ఋశీష్వరులారా, మీరు ఈ మూడు ఆసనములమీద కూర్చోండి. నా రాజ్యం-తమ్ముడి రాజ్యం-దశరథుడి రాజ్యం అన్నీ మీవే కదా. దశరథుడికి ఇక్కడెంత స్వతంత్రముంటుందో, అంతే నాకు అయోధ్యలో వుంటుందికదా. ఇదీ-అయోధ్యా నా సొంతమే. అయోధ్య-ఇది దశరథుడి సొమ్మే. కాబట్టి మీ యోగ్యతకు తగిన విధంగా కార్య భారం వహించండి. సందేహించ వద్దు. దోషమేదైనా జరిగితే, ఆ తప్పు మీదే-నాది కాదు. మీ రాజ్యంలో తప్పు జరిగితే దోషం మీకు తగులుతుంది" అని కలుపుగోలుగా జనకుడన్నాడు. ఆ మాటలకు మెచ్చిన దశరథుడు, "మీ ఇరువురు అన్నదమ్ములు అమితమైన కల్యాణగుణాలున్నవారు. కోటాను-కోట్ల రాజులు, ముని శ్రేష్టులు పూజించే పుణ్యాత్ములు మీరు. మీకు తెలియందేదీలేదు. కార్య భారం అన్నీ తెలిసిన వారిమీద వుండాలికాని, ఏమీ తెలియని మామీద వేస్తే ఫలితం లేదు. తెలివితక్కువగా మేం ఏదైనా లోపంచేస్తే, అన్నీ తెలిసిన జనకుడు ఏం చేస్తున్నాడని మిమ్ములనే నిందిస్తారు. కాబట్టి మీరేం చెపితే అదే చేస్తాం" అని జనకుడితో చెప్పాడు. నాంది మొదలైన కార్యక్రమాలు జరిపించాలని అంటూ, విశ్వామిత్ర వశిష్ఠులతో కలిసి విడిదికి పోయాడు.

తన విడిదికి పోయిన దశరథుడు, నాందీ కార్యక్రమాలను జరిపించి, ఉదయమే నిద్రలేచి, తన ప్రియమైన కొడుకులను పిల్చాడు. బంగారు కొమ్ములున్న బాగా పాలిచ్చే నాలుగు లక్షల ఆవులను తెప్పించి, వాటి పాలుపితుకేందుకు తన నలుగురు కొడుకులకు కంచు పాత్రలనిచ్చాడు. కొడుకుల కొరకై, శాస్త్ర ప్రకారం బ్రాహ్మణులకు, విశేష దానాలు చేసిన దశరథుడు, నలుగురు దిక్పాలకులతో కూడిన బ్రహ్మలాగా కనిపించాడు.

దశరథుడిని చూసేందుకొచ్చిన యుధాజిత్తు

         గోదానం జరిగిన రోజునే, కేకయ రాజకుమారుడు మేనల్లుడు భరతుడిని, బావగారు దశరథుడినీ చూడడానికొచ్చాడు. తండ్రి పంపగా వచ్చిన కేకయ రాజకుమారుడు యుధాజిత్తు, భరతుడిని తీసుకుపోయేందుకు తాను అయోధ్యకు పోయానని, వారంతా పెళ్లికై మిథిలకొచ్చారని విని, ఇక్కడకొచ్చానని, ఉభయ కుశలోపరి దశరథుడితో అంటాడు. సంతోషించిన దశరథుడు బావగారిని తగిన మర్యాదలతో గౌరవించాడు. ఆ రాత్రి కొడుకులతో వినోదంగా గడిపి దశరథుడు, మర్నాడు ఉదయం తూర్పు తెల్లవారుతుండగానే, కాల కృత్యాలు తీర్చుకొని యజ్ఞ భూమికి చేరుకున్నాడు. అందమైన ఆభరణాలను ధరించి, కంకణం కట్టుకొని, రామచంద్రమూర్తి మంచి ముహూర్తంలో తమ్ములతో కలిసి వచ్చాడక్కడకు. వశిష్ఠుడు-ఇతర మునీంద్రులు ముందుండి తమ వెంట వస్తుంటే యజ్ఞ భూమి (యజ్ఞ భూమి అంటే, సమీపంలో పెళ్లిజరిపించేందుకై ఏర్పాటుచేసిన ఉత్సవశాల అని అర్థం) ప్రవేశించాడు దశరథుడు. అలా ప్రవేశిస్తుండగానే వశిష్ఠుడు జనక రాజును చూసి, దాత కొరకు దశరథుడు వేచి వున్నాడని చెప్పాడు. ఇచ్చేవాడు-పుచ్చుకునేవాడు ఒకచోట వున్నప్పుడే తదుపరి తతంగం జరుగుతుందని అంటూ, ఆయన స్వధర్మమైన-దాత చేయాల్సిన కార్యమైన పెళ్లి జరిపించమని వశిష్ఠుడు జనకుడికి తెలియచేశాడు.

         జవాబుగా " మునీంద్రా, ఇక్కడ కొత్తవారెవ్వరు? ఎందుకంత ఆలస్యం చేసారు? ఇంతకు ముందే కార్యం ఆరంభం చేయకుండా మీకెవరైనా అడ్డమొచ్చారా? కార్యం జరిపించేందుకు ఎవరి ఆజ్ఞకొరకు వేచి వున్నారు? నా రాజ్యమంతా మీదేనని ముందే చెప్పానుకదా. అలాంటప్పుడు ఈ ఇల్లు కూడా మీదేకదా. అలంకరించుకొని పెళ్లికూతుళ్ల వేషాల్లో, నా నలుగురు కుమార్తెలు సంతోషంగా వేదిలోని అగ్నివలె వెలుగుతూ, మండపం దగ్గరే వున్నారు. సర్వం సిద్ధంగా వుంది. మీరింకా రాలేదని మీరాక కొరకే ఎదురు చూస్తున్నాను. ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? నేను చేయాల్సిన కార్యమంతా చేసాను. మిగిలిన కార్యం చేయాల్సినవారు మీరే" అని జనకుడు వశిష్ఠుడికి చెప్పగానే, ఆ విషయాన్నే దశరథుడికి చెప్పేందుకు దూతలను పంపాడాయన. అది విన్న దశరథుడు, తన కొడుకులను, మహర్షులను యజ్ఞశాలకు పంపాడు.

వశిష్ఠుడితో జనకుడు, ఇతర ఋశీష్వరులతో కలిసి త్రిలోకాభిరాముడైన రామచంద్రమూర్తికి శీఘ్రంగా-సంతోషంగా వివాహ సంబంధమైన కార్యాలన్నీ జరిపించమని అన్నాడు. అలానే జరిపిస్తానన్న వశిష్ఠుడు, తనకు సహాయంగా విశ్వామిత్రుడు, శతానందుడు తోడుండగా వివాహ సంబంధమైన కార్యక్రమం చేపట్టాడు. చలువ పందిరిలో శాస్త్ర ప్రకారం వేదిని తీర్చి, పూలతో-పరిమళ ద్రవ్యాలతో దానిని అలంకరించి, మెరుస్తున్న బంగారు పాలికలతో-మొలకలెత్తిన శుభకరమైన అడుగులేని పాత్రలతో-జిగుళ్లుగల మూకుళ్లతో-ధూపమున్న ధూప పాత్రలతో-స్రుక్కులు, స్రువాలు, అర్ఘ్యం పేలాలతో నిండిన స్వచ్ఛ పాత్రలతో-పచ్చని అక్షతలతో వేదిని నింపాడు వశిష్ఠుడు. మంత్రాలు పఠిస్తూ, పరిశుద్ధమైన దర్భలను పరిచి, శాస్త్రోక్తంగా వేదిలో అగ్నిని వుంచి, వశిష్ఠుడు హోమం చేశాడు.

The imperatives of treating politics as a task but not as a game : V Jwala Narasimha Rao and VJM Divakar

 The imperatives of treating politics as a task but not as a game

V Jwala Narasimha Rao

VJM Divakar

During the recent session of the Telangana State Assembly, Chief Minister K Chandrashekhar Rao made an illuminating comment on statecraft. He said for him and his TRS party, "politics is a task and not a game".

 Manipulating people to get their votes is a game that is easy for most politicians to play, but to get whole-hearted public support requires that the ruling party performs its task impressively with focus on welfare of people.

 In the post-2014 scenario, the Bharatiya Janata Party under Narendra Modi seems to be formidable. However, many political rivals and leaders of the BJP fail to realise that it may not be simple; yet, it is not impossible to defeat the Modi-led BJP in the 2024 General Election. But to achieve this parties that take up this task need to introspect, examine one another's strengths and weaknesses, draw up a grand strategy, and execute it in letter and spirit, while shedding age-old tricks that have no relevance now.

 From the just-concluded elections to the Assemblies in five states, in which BJP won four and AAP swept Punjab, it is clear that the election narrative in the country has undergone a paradigm shift. This is precisely the reason why the Congress is almost decimated, along with the Bahujan Samaj Party and the Samajwadi Party.

 In the early 70s, before the imposition of Emergency in June 1975, all political parties, from far right to far left, came under one umbrella and the consortium was successfully led by Lok Nayak Jayaprakash Narayan. The Janata Party thus came to power at the Centre as the first non-Congress government post independent India. However, due to internal squabbles, the Janata Party lost power and once again Indira Gandhi came back to power.

 During the formative days of Janata Party, there was never any question about who would be the Prime Minister should Janata Party come to power. The Congress then tried to pose the question: Who can take on Indira Gandhi? A similar question is now being asked by the BJP and its supporters: Who can take on Modi?

 The strong narrative that went well with people then, especially in the north, was to overthrow the Congress. No one ever thought that the octogenarian Morarji Desai would become the Prime Minister as the Janata Party had several stalwarts in the party who had all the qualifications to become the PM. Moreover, no one ever predicted that a veteran political leader like Jayaprakash Narayan, who had almost become a non-entity, would rise and stand up to the then mighty Indira Gandhi! The Janata Party government at the Centre might have failed but the Janata Party experiment opened new vistas in the country's political landscape resulting in a series of Fronts, from the National Front, United Front, United People's Alliance (UPA I and II) and the National Democratic Alliance (NDA I and II). This time it may not be a front, but something else and in all probability a consortium of like-minded political parties.

 Post-2014, under the leadership of PM Narendra Modi, the political scenario in the country has undergone a sea-change. Hindutva, despite the stigma previously attached to it, has become the main narrative and the BJP and its right-wing affiliates have managed to drill this effectively into the minds of people. An analysis of the five-state elections clearly reveals that BJP's Hindutva worked well in three states and helped the saffron party cut the SP to size in UP.

 Hence, the message is very clear: no political party on its own may be able to take on the might of the BJP under Modi in the next General Election. A consortium of non-Congress, non-BJP parties, as propounded by TRS supremo and Telangana State Chief Minister K Chandrashekhar Rao, would certainly be able to halt BJP in its tracks. Such a consortium should refrain from participating in the debate on who would become the PM should it win.

 Since 2018, KCR has been emphasising that there should not be any debate on who should lead the non-BJP and non-Congress alliance? Echoing the same, NCP chief Sharad Pawar stated that there was no issue of who would lead the possible anti-BJP alliance in the next General Election.

 The consortium should take up the narrative of secularism plus welfare and pit them against the Hindutva plank of the BJP. They should not only highlight the failures of the Modi government, but also offer solutions to those problems. In UP, SP failed in this aspect. SP harped on problems that people knew they were facing, but without offering solutions.

 In Punjab, the Aam Aadmi Party did highlight the problems and offer solutions under the Kejriwal model of governance.

 For those who argue that there is no place for a consortium against the BJP without the Congress on board, the reply is: As on date, the Congress has miserably failed to play any active role against the BJP. It is the regional parties like AAP that were able to halt the march of BJP. If the Congress wants, it can join the consortium as a junior partner.

 A national agenda has to be put forward mainly highlighting the Telangana model of schemes and programmes that have been successfully implemented, benefiting crores of people. Telangana irrigation projects can serve as examples to let people know that a non-Congress, non-BJP consortium of parties that replaces the existing government can do wonders.

 A task is like an assignment, which should be completed on a scheduled time. A task is accomplished by all means and with a well-laid-out plan. Playing games a few months before polls will not work. A clear strategy is the need of the hour.

 As rightly pointed out by KCR, the demand for change for the better would come from people and the leadership to bring about such qualitative change would emerge automatically.

Wednesday, March 16, 2022

కుముద్ బెన్ జోషి...కొన్ని జ్ఞాపకాలు : వనం జ్వాలా నరసింహారావు

 కుముద్ బెన్ జోషి...కొన్ని జ్ఞాపకాలు

 వనం జ్వాలా నరసింహారావు

ఆంధ్రజ్యోతి దినపత్రిక (17-03-2022)

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నవంబర్ 26, 1985 నుండి ఫిబ్రవరి 7, 1990 వరకు, సుమారు నాలుగు సంవత్సరాలకు పైగా గవర్నర్ గా పనిచేసిన కుముద్ బెన్ జోషి మరణ వార్త, ఆమె దగ్గర పనిచేసిన నాకు చాలా విచారాన్ని కలిగించింది. అతి చిన్న వయస్సులోనే మూడు పర్యాయాలు రాజ్యసభకు ఎన్నిక కావడమే కాకుండా, కేంద్ర సహాయ మంత్రిగా రెండుసార్లు పనిచేశారామె. అప్పట్లో అతి చిన్న వయసులోనే గవర్నర్ గా నియమించబడ్డ వ్యక్తిగా కూడా ఆమె పత్యేకతను సంతరించుకున్నది. గవర్నరుగా పదవి స్వీకరించిన వెంటనే, ఈమె రాష్ట్రంలోని 23 జిల్లాలు, రాష్ట్రం బయటా పర్యటించి, తనముందు వచ్చిన 13 మంది గవర్నర్ల కంటే తాను క్రియాశీలకమైన గవర్నరని చూపే ప్రయత్నం చేసింది.

గవర్నర్ గా కుముద్ బెన్ జోషి పదవీ బాధ్యతలు చేపట్టిన నెలరోజులకే, హైదరాబాద్ సమీపంలో గల  రామచంద్రాపురం లోని బిహెచ్ఇఎల్ హయ్యర్ సెకండరీ పాఠశాలలో లైబ్రేరియన్ గా ఉద్యోగం చేస్తున్న నన్ను గవర్నర్ కార్యదర్శిగా పనిచేస్తున్న స్వర్గీయ డాక్టర్ చంద్రమౌళి ఐఏఎస్ సలహా మేరకు, చేతన స్వచ్ఛంద సంస్థ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గా నియమించడం జరిగింది. కుముద్ బెన్ జోషి గవర్నర్ గా ఉన్నంత కాలం, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ చెన్నారెడ్డి పీఆర్వో గా వెళ్లేంత వరకూ నేను అక్కడే పనిచేశాను.  గ్రామీణాభివృద్ధి లక్ష్యంగా స్వర్గీయ శారదా ముఖర్జీ గవర్నర్ గా పనిచేస్తున్న రోజుల్లో అప్పట్లో ఆమె కార్యదర్శి మోహన్ కందా సలహా మేరకు గవర్నర్ అధ్యక్షతన స్థాపించబడిన సంస్థ చేతన. కాకపోతే ఆమె వేల్లిపోయిన తరువాత అచేతనంగా పడివున్న చేతన సంస్థను పునరుద్ధరించే దిశగా నన్ను ఉద్యోగంలోకి తీసుకోవడం జరిగింది. నాకున్న లైబ్రరీ నేపధ్యంలో గవర్నర్ కుముద్ బెన్ జోషి ఆదేశాల మేరకు రాజ్ భవన్ లైబ్రరీని కూడా ఒక పద్ధతిలో పెట్టడం జరిగింది.

గవర్నర్ గా పనిచేస్తున్న రోజుల్లో ఆమె అధ్యక్షతన వున్న చేతన సంస్థ ద్వారా నిరంతరం గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలను చేపట్టేవారు కుముద్ బెన్ జోషి. భారీ ఎత్తున చెట్లు నాటే కార్యక్రమం, పొగలేని పొయ్యిల వాడకం ప్రచారం, భారీ వర్షాలు కురిసినప్పుడు రెడ్ క్రాస్ కు సహాయంగా వరద సహాయక కార్యక్రమాలు లాంటివి చేతనా ద్వారా జరిగేవి.

కుముద్ బెన్ జోషి అధ్యక్షతన నెలకొల్పబడిన మరో స్వచ్చంద సంస్థ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ యాక్షన్ (నీసా). రెడ్ క్రాస్ సంస్థ ఎలాగూ వుండనే వుంది. నీసా సంస్థ కార్య కలాపాలను విజయవంతంగా నిర్వహించడానికి కుముద్ బెన్ జోషి కి చేదోడు వాదోడుగా గవర్నర్ కార్యదర్శి స్వర్గీయ చంద్రమౌళి, అప్పట్లో రెడ్ క్రాస్ కార్యదర్శిగా పనిచేస్తున్న స్వర్గీయ డాక్టర్ ఎపి రంగారావు వుండేవారు. నిధుల కొరతతో ఇబ్బందులు ఎదుర్కుంటున్న రెడ్ క్రాస్ ను బలోపేతం చేయడానికి కుముద్ బెన్ జోషి అహర్నిశలు కృషి చేసేవారు. హైదరాబాద్ లో వున్న రెడ్ క్రాస్ అనుబంధ సంస్థలను మెరుగు పరచడం జరిగింది.    

చేతన, నీసా, రెడ్ క్రాస్ సంస్థలు మూడూ కూడా రాజ్ భవన్ భవన సముదాయంలోనే కార్యకలాపాలు నిర్వహించేవి. నీసా ఆధ్వర్యంలో కుముద్ బెన్ జోషి చొరవతో విజయవంతంగా నిర్వహించిన ఒక గొప్ప చారిత్రాత్మక కార్యక్రమం తెలంగాణ ప్రాంతంలోని నిజామాబాద్, తదితర జిల్లాలో పాతుకుపోయిన జోగిని దురాచార వ్యవస్థను రూపుమాపడం. స్వర్గీయ లవణం, హేమలత లవణం సహాయ సహకారాలతో వర్నిలో జోగిని వ్యవస్థ నిర్మూలనకు కుముద్ బెన్ జోషి అనేక కార్యక్రమాలు చేపట్టారు. చరిత్రలో మొట్ట మొదటి సారిగా రాజ్ భవన్ దర్బార్ హాల్ లో కుముద్ బెన్ జోషి పుట్టిన రోజైన జనవరి 31, 1988 నాడు ముగ్గురు జోగిన్ల జంటలకు స్వయంగా తన ఆధ్వర్యంలో వివాహం జరిపించింది. సాక్షాత్తు పెళ్ళిళ్ళ రిజిస్త్రార్ సమక్షంలో జరిగిన ఆ వివాహాలకు నాటి కేంద్ర మంత్రి జలగం వెంగళరావు , రాష్ట్ర ముఖ్య మంత్రి ఎన్టీ రామారావు హాజరయ్యారు. మర్నాటి పత్రికలలో పొగడ్తలతో పాటు విమర్శలు కూడా వచ్చాయి. జాతీయ స్థాయిలో జోగిన్ల సమస్య చర్చకు తేవడానికి న్యూ డిల్లీలో జోగిన్ల సంక్షేమం అనే అంశ మీద రెండురోజుల జాతీయ  సమావేశం కూడా కుముద్ బెన్ జోషి అధ్యక్షతన జరిగింది. నాటి కేంద్ర మంత్రులు పీవీ నరసింహారావు, జలగం వెంగళరావులె కాకుండా స్వామీ అగ్నివేష్ లాంటి ప్రముఖ సామాజిక ఉద్యమ నాయకులు హాజరయ్యారు.

జోగిన్ల వ్యవహారమే కాకుండా జాతీయ స్థాయి స్వచ్చంద సంస్థల సమావేశాన్ని కూడా హైదరాబాద్ రాజ్ భవన్ లో కుముద్ బెన్ జోషి అత్యంత విజయవంతంగా నిర్వహించారు. నీసా ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా నిర్వహించిన మరో కార్యక్రమం భారతరత్న ఇందిరమ్మ రూపవాణి ప్రదర్శన. హైదరాబాద్ లో తొలుత ప్రదర్శించబడి దరిమిలా రాష్ట్రంలోని పలు జిల్లా కేంద్రాలతో సహా డిల్లీ నగరంలో కూడా ప్రదర్శించడం జరిగింది. అప్పట్లో రెడ్ క్రాస్ కార్యకలాపాలలో చురుగ్గా పాల్గొనే మాజీ మంత్రి డాక్టర్ గీతారెడ్డి ఈ రూపవాణి కార్యక్రమంలో ఇందిరా గాంధి పాత్రను పోషించింది. దేశంలోని పలువురు రాజకీయ, రాజకీయేతర రంగ ప్రముఖులు ఈ ప్రదర్శనకు అతిథులుగా వచ్చి ఆసాంతం తిలకించి ప్రశంసల వర్షం కురిపించారు.  అనుపమ చలన చిత్ర దర్శక నిర్మాత, అలనాటి సినీరంగ ప్రముఖ వ్యక్తి స్వర్గీయ కేబీ తిలక్ ఈ రూపవాణి కార్యక్రమానికి రూపకర్త. అదేవిధంగా ఆయన చొరవతో రాజ్ భవన్ ప్రాంగణంలో అమెరికా సాంకేతిక సహాయంతో రూపుదిద్దుకున్న డోమ్ హౌజ్ నిర్మాణం కూడా కుముద్ బెన్ జోషి గవర్నర్ గా ఉన్నప్పుడే జరిగింది. ప్రస్తుతం దాని ఆనవాళ్ళు లేవు. ఒక కంప్యూటర్ శిక్షణా కేంద్రం కూడా నెలకొల్పారు జోషి.  

రెడ్ క్రాస్ సంస్థ మూడు పూవులు, ఆరుకాయలుగా వర్ధిల్లిన కాలం కుముద్ బెన్ జోషి గవర్నర్ గా వున్న రోజుల్లోనే అని అనడంలో అతిశయోక్తి లేదు. కరవు కాటకాలు వచ్చినా, వరదలు వచ్చినా, మరేఉపద్రవం సంభవించినా నేనున్నాను అంటూ ఆమె ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ సేవలు అందించేది. రెడ్ క్రాస్ మరింత ప్రాచుర్యంలోకి రావాలని సభ్యత్వ కార్యక్రమం, ఉపాధ్యక్షుల నియామకం ఆమె హయాంలోనే జరిగింది. భారత పాకిస్తాన్ దేశాల మధ్య ఒక బెనిఫిట్ క్రికెట్ మాచ్ నిర్వహణ కూడా కుముద్ బెన్ జోషి గవర్నర్ గా వున్న రోజుల్లో జరిగింది. ప్రస్తుతం పాకిస్తాన్ అధ్యక్షుడుగా వున్న ఇమ్రాన్ ఖాన్ ఆ దేశ జట్టుకు నాయకత్వం వహించగా, భారత జట్టుకు కపిల్ దేవ్ కెప్టెన్ గా వ్యవహరించాడు. ఆ మాచ్ జరగడానికి కొద్ది రోజుల ముందర హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాలలో మత కలహాలు చెలరేగాయి. ఆ నేపధ్యంలో మాచ్ ప్రారంభానికి ముందు స్టేడియం చుట్టూ మైదానంలో కుముద్ బెన్ జోషి సారధ్యంలో మేమంతా చుట్టి రావడం నాకింకా గుర్తుంది.

కుముద్ బెన్ జోషి ఎన్ని కార్యక్రమాలలో బిజీగా ఉన్నప్పటికీ ఆమె దగ్గర పనిచేస్తున్న సిబ్బంది ఆలనా పాలనా అత్యంత ఆప్యాయంగా చూసుకునేవారు. నేను పేరుకు చేతన సంస్థ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అయినప్పటికీ అధికారేతర ప్రజాసంబంధాల పనులకు (ముఖ్యంగా ఆమె ఆధ్వర్యంలో నడుస్తున్న స్వచ్చంద సంస్థలకు సంబంధించి) నన్ను కుముద్ బెన్ జోషి పురమాయించేవారు. హోదా రీత్యా నాది పెద్ద పదవి కాకపోయినా ఆమె నిర్వహించే ప్రతి కార్యక్రమానికి నాకు ఆహ్వానం వుండేది. ఆమె నివసిస్తుండే మెయిన్ హౌజ్ లో గవర్నర్ హోదాలో ఆమె అడపా దడపా ఆతిధ్యం ఇచ్చే ప్రతి విందుకు నన్ను సతీ సమేతంగా ఆహ్వానించేవారు. మా పిల్లలు, కుముద్ బెన్ జోషి అన్న గారి పిల్లలు బేగంపేట్ పబ్లిక్ స్కూల్ లో చదువుకుంటున్నందు వల్ల రాజ్ భవన్ ప్రాంగణంలోనే క్వార్టర్స్ లో నివసుస్తున్న మా ఇంటికి ఆ పిల్లలు రావడమో, లేక మా పిల్లలు అక్కడికి పోవడమో జరిగేది. ఆ విషయాలలో ఆమె గవర్నర్ అన్న హోదా ఎప్పుడూ ప్రదర్శించక పోయేది.

రాజ్ భవన్ ప్రాంగణంలో అప్పట్లో మంచి ఉద్యాన వనం వుండేది. ఆవులు వుండేవి. దాదాపు రెగ్యులర్ గా కుముద్ బెన్ జోషి ఆదేశాల మేరకు క్వార్టర్స్ లో వున్న మాలాంటి సిబ్బందికి పాలు వస్తుండేవి. కుముద్ బెన్ జోషికి చింతపండు పులిహోర, మొక్క ఎత్తిన పెసలు, గోధుమలు, చల్ల మెరపకాయలు అంటే చాలా ఇష్టం. అవి విరివిగా దొరికే మా ఇంటికి ఆమె హోదా పక్కన పెట్టి చాలా సార్లు రావడం జరిగింది.

కుముద్ బెన్ జోషి కార్యదర్శిగా మొదలు పని చేసిన స్వర్గీయ చంద్ర మౌళి, ఆ తరువాత పనిచేసిన బీవీ రామారావు, ఇతర అధికారులైన ఉప కార్యదర్శి  సూర్యనారాయణ, ప్రెస్ సెక్రటరీ స్వర్గీయ సంజీవి, రెడ్ క్రాస్ కార్యదర్శి స్వర్గీయ డాక్టర్ రంగారావు, ఏడీసీ మేజర్ గులాటి, సెక్యూరిటీ ఆఫీసర్ సీతారం సింగ్, పేఏ శేషగిరిరావు, పీఎస్ స్వర్గీయ శేషాచార్యులు తదితరుల పట్ల కుముద్ బెన్ జోషి ఎల్లప్పుడూ ఆదరాభిమానాలతో వుండేవారు. గుజరాత్ లో ఆమె స్వగ్రామంలో నివసిస్తుండే కుముద్ బెన్ జోషి తో ఆమె ఆనారోగ్యంతో గురయ్యేంత  వరకూ నేను ఫోన్లో టచ్ లో వున్నాను.  

Sunday, March 13, 2022

జనకుడికి సూర్యవంశ క్రమాన్ని చెప్పిన వశిష్ఠుడు ...... శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-99 : వనం జ్వాలా నరసింహారావు

జనకుడికి సూర్యవంశ క్రమాన్ని చెప్పిన వశిష్ఠుడు

శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-99

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (14-03-2022)

         జనక మహారాజు ఉదయమే నిద్రలేచి, ప్రాతస్సంధ్యాది కృత్యాలను తీర్చుకొని, పురోహితుడైన శతానందుడుతో తన తమ్ముడి ప్రస్తావన తెచ్చాడు. యిక్షుమతీ నదీతీరంలో వున్న పుష్పకంలాంటి సాంకాశ్య నగరాన్ని, నీతి ధర్మం తప్పకుండా, తన తమ్ముడు కుశధ్వజుడనే రాజు, పాలిస్తున్నాడని అంటాడు. తను చేసిన యజ్ఞాన్ని వాడు కాపాడినవిషయం జనకుడు గుర్తుచేసుకున్నాడు.వాడిని చూడాలనుకుంటున్నానని, జరుగనున్న వివాహమహోత్సవం వాడితో కలిసి అనుభవించాలని వుందని, కాబట్టి అతడిని తీసుకొచ్చేందుకు శీఘ్రంగా పోగలిగే దూతలను పంపాలని చెప్పి ఆ పనికి తగినవారిని పంపించాడు. రాజాజ్ఞ ప్రకారం వేగంగా పోయే గుర్రాలపై దూతలు ఆలస్యం చేయకుండా ప్రయాణంచేసి, కుశధ్వజుడికి జనక మహారాజు చెప్పిన వార్తను తెలియచేశారు. అన్న రమ్మనగానే బయలుదేరి వచ్చిన కుశధ్వజుడు, సంతోషాతిశయంతో, అన్నకు-పురోహితుడికి నమస్కరించి తన ఆసనంపై కూర్చున్నాడు. అన్నదమ్ములిద్దరు తమ ఆసనాలపై కూర్చుని మాట్లాడుకుంటూ, ముఖ్యమంత్రి సుధాముడుని పిలిచి, దశరథ మహారాజుదగ్గరికి పోయి, ఆయనను మంత్రులతోను-పుత్రులతోను వెంటబెట్టుకొని తీసుకొని రమ్మంటాడు. సుధాముడు జనకుడు చెప్పినట్లే దశరథుడు విడిదిచేసిన శిబిరానికి పోయి, ఆయనకు శిరస్సుతో నమస్కరించి, పురోహితుడితో వున్న జనక మహారాజు దశరథుడిని చూడాలనుకుంటున్నాడని చెప్పాడు.

         సుధాముడు ఇలా చెప్పడంతో, దశరథుడు ఋషులతో బంధువులతో కలిసి జనకుడున్న చోటికి పోయి, ఆయనకు వశిష్ఠుడిని చూపించి, ఇక్ష్వాకువంశానికి ఆయన కులగురువనీ, తమ గురించి చెప్పాల్సిన విషయాలన్ని ఆయన చెప్తాడనీ అంటాడు. కార్యాలన్నీ సాధించగల శక్తి వశిష్ఠుడికుందనీ, విశ్వామిత్రుడు-ఇతర మునీశ్వరులు అనుమతిస్తే, తమ వంశ విధాన్ని వశిశ్ఠుడు సందేహానికి ఏమాత్రం తావులేకుండా చెప్పుతాడని అని, మౌనంగా కూర్చుంటాడు. హితులతో-మంత్రులతో-పురోహితులతో కూడి వున్న జనకుడితో వశిష్ఠుడు సూర్యవంశక్రమాన్ని వివరించాడీవిధంగా:

         "అవ్యక్తసంభవుడు-నిత్యుడు-అవ్యయుడైన చతుర్ముఖ బ్రహ్మకు మరీచి జన్మించాడు. మరీచికి కశ్యపుడు-ఆయనకు వివస్వంతుడు-ఆయనకు మనువు-ఆయనకు ఇక్ష్వాకుడు కలిగారు. ఇక్ష్వాకుడి రాజధాని అయోధ్య. ఇక్ష్వాకుడి తనయుడు కుక్షికి వికుక్షి, అతడికి బాణుడు, అతడికి అనరణ్యుడు, అతడికి ప్రుథుడు, అతడికి త్రిశంకుడు, అతడికి దుంధుమారుడు (యువనాశ్వుడని కూడా అంటారు), అతడికి మాంధాత, అతడికి సుసంధి కలిగారు. , సుసంధికి ధ్రువసంధి-ప్రసేనజిత్తు అనే ఇరువురు కుమారులు కలిగారు. ధ్రువసంధి కొడుకు భరతుడు. అతడి కొడుకు యసితుడు. యసితుడి విరోధులైన హైహయులు యుద్ధంలో ఓడించడంతో ఆయన మంత్రులతో పారిపోయి అడవులకెళ్లి, హిమవత్పర్వతం దగ్గర భృగు ప్రస్రవణంలో మితబలుడై నివసించాడని విన్నాను. యసితుడికి ఇద్దరు భార్యలు. ఇద్దరూ గర్భిణులే. అందులో ఒకామె తన సవతికి విషం కలిపిన భక్ష్యాన్ని తినడానికిచ్చింది. భృగువంశంలో పుట్టిన చ్యవనుడనే మహర్షి వీరుండే చోటుకొచ్చాడొకనాడు. యసితుడి భార్య కాళింది ఆయనతో, తనకు పుత్రుడు కలిగేట్లు అనుగ్రహించమని కోరడంతో, ఆమె శూరుల్లో శ్రేష్ఠుడైన కొడుకును కంటుందని చెప్పాడు. ఆమెకు పుట్టనున్న కొడుకు గరళంతో పుడతాడు కనుక అతడి పేరు సగరుడని, అతి బలవంతుడవుతాడని అంటాడు చ్యవనుడు కాళిందితో. ఆయన చెప్పినట్లే సగరుడిని కనింది కాళింది".

         "సగరుడి కుమారుడు అసమంజుడు-అసమంజుడి కొడుకు అంశుమంతుడు-అంశుమంతుడి కుమారుడు దిలీపుడు-దిలీపుడి కొడుకు భగీరథుడు-భగీరథుడి కొడుకు కకుత్థ్సుడు-అతడి కొడుకు రఘుడు-అతడి కొడుకు ప్రవృద్ధుడు. ప్రవృద్ధుడికి శంఖణుడు-అతడికి సుదర్శనుడు-అతడికి అగ్నివర్ణుడు-అతడికి శీఘ్రగుడు-అతడికి మరువు-అతడికి ప్రశుశ్రుకుడు-అతడికి అంబరీషుడు-అతడికి నహుషుడు-అతడికి యయాతి-అతడికి ఆభాగుడు-అతడికి అజుడు-అతడికి బలశాలైన దశరథుడు కొడుకులుగా పుట్టారు. దశరథుడి కుమారులే శ్రీరామ లక్ష్మణులు. ఇలా వీరి వంశం ఆదినుండి పరిశుద్ధమైంది. వీరందరు అసమాన ధర్మరతులు-వీరులు. సత్యమంటే ప్రీతికలవారు". ఇలా సూర్యవంశ క్రమాన్ని వివరించిన వశిష్ఠుడు, శ్రీరామచంద్రుడికి-లక్ష్మణుడికి సరితూగే గుణగణాలుగల తన ఇరువురు పుత్రికలను ప్రేమపూర్వకంగా ఇచ్చి వివాహం చేయమని, ఇది తన మనవి అని కోరాడు జనకుడిని.          (కన్యను ఇచ్చుకొనేటప్పుడు, పుచ్చుకొనేటప్పుడు, అధమ పక్షం మూడు తరాల వంశ జ్ఞానం ప్రధానంగా తెలుసుకోవాలి. కులం తెలుసుకోకుండా కన్యను ఇవ్వకూడదు-తీసుకొననూ కూడదు. వివాహంలో వధూవరుల కుల జ్ఞానం అవశ్యంగా తెలియాలి. తొలుత తల్లి కులం, తండ్రి కులం పరీక్షించాలి. ధన ధాన్యాలు ఎంత సమృద్ధిగా వున్నప్పటికీ, వివాహ విషయంలో పది రకాల వంశం వారిని వదలాలని శాస్త్రం చెపుతున్నది. జాతకర్మాది క్రియలు లేని, పురుష సంతానంలేని, విద్యా శూన్యమై, మిగిలి దీర్ఘ రోగాలు కలదై, మూల రోగాలు కలదై, క్షయ-అజీర్ణం-అపస్మారం-బొల్లి-కుష్ఠు రోగాలు కలదైన వంశాలతో వివాహ సంబంధం చేయరాదు. తోడబుట్టినవాడు లేని పిల్లను, తండ్రెవరో తెలియని దానిని వివాహం చేసుకోకూడదు).

         (ఇక్ష్వాకు వంశంలో జన్మించిన సగరుడి తండ్రి అసితుడిని హైహయులు-తాల జంఘులు-మరికొందరు కలిసి రాజ్య భ్రష్టుడిని చేసి తరిమేశారు. ఆయనప్పుడు హిమవత్పర్వతానికి పోయి నివసించాడు. అక్కడప్పుడు సగరుడి తల్లి గర్భవతిగా వుంది. ఆ సమయంలో అసితుడు మరణించాడు. ఆయన భార్య సహగమనం చేయబోతుంటే, చ్యవనుడు వారించి ఆమెను తన ఆశ్రమంలో వుంచి రక్షించాడు. ఆమెకు పుట్టిన సగరుడికి తానే సంస్కారాదులు చేసి, ఆగ్నేయాస్త్రం లాంటి అస్త్ర విద్యలనూ నేర్పాడు. బుద్ధి తెలిసిన సగరుడు తన తండ్రి వివరాలను అడిగితే, తల్లి ఆ వృత్తాంతమంతా వివరించింది. సగరుడు తండ్రిని తరిమిన వారితో యుద్ధంచేసి, ఓడించాడు. గురువాజ్ఞ ప్రకారం వారిని చంపలేదు. వారిలో యవనులను బోడితలల వారిగానూ, శకులను అర్థముండులుగా, బారదులను విరితల వారిగా జాతి భ్రష్టులను చేశాడు. అలా ఆ క్షత్రియులందరినీ స్వాధ్యాయ హీనులుగా-వషట్కార రహితులుగా-స్వధర్మ హీనులుగా చేసి దేశంనుండి వెళ్లగొట్టాడు సగరుడు.వీరే "మ్లేచ్ఛులు".ఇప్పటి తురకలపూర్వీకులైన ఇరానీయులు ఆర్య శబ్దంనుండి పుట్టినవారే. ఆర్యన్ కు వికృతి "అయిరాన్". అదే ఇరాన్ గా మారింది తదనంతరం).

Saturday, March 12, 2022

మహాభారత యుద్ధం రెండవ రోజున అర్జునుడి ధాటికి కంపించిన కురుక్షేత్ర రణరంగం .... ఆస్వాదన-63 : వనం జ్వాలా నరసింహారావు

 మహాభారత యుద్ధం రెండవ రోజున అర్జునుడి ధాటికి కంపించిన కురుక్షేత్ర రణరంగం

ఆస్వాదన-63

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (13-02-2022)

కురుక్షేత్ర సంగ్రామంలో మొదటి రోజు జరిగిన యుద్ధంలో పాండవుల మీద కౌరవులది పైచేయి కావడంతో ధర్మరాజు మనస్సు దుఃఖభరితమై పోయింది. తన తమ్ములను, కొందరు స్నేహితులను వెంటబెట్టుకుని శ్రీకృష్ణుడి దగ్గరికి పోయాడు. తన తమ్ములు భీష్ముడితో యుద్ధం చేయడానికి సమర్థులు కారేమోనన్న అభిప్రాయాన్ని వెల్లడించిన ధర్మరాజు, యుద్ధం విరమించాలని తనకు అనిపిస్తున్నదన్నాడు. తన పక్షాన యుద్ధం చేయడానికి వచ్చిన రాజులను భీష్ముడికి ఎరగా సమర్పించలేనని, తాను తిరిగి అడవులకు పోయి అక్కడే కూరలు, ఆకులు తింటూ వుంటానని శ్రీకృష్ణుడితో అన్నాడు. తమ కర్తవ్యం ఏమిటో చెప్పమని కోరాడు ఆయన్ను.

జవాబుగా శ్రీకృష్ణుడు, ధర్మరాజును ఆవేదన చెందవద్దని, ఆయనకు ఎదురెవ్వరూ లేరని, ఆయన తమ్ములంతా లోకాలను జయించగల సమర్థులని, భీష్ముడిని శిఖండి జయిస్తాడని, ధర్మరాజుకు ఇష్టం కాని వారందరినీ వరుసగా ఎదో ఒక తీరున తాను సంహరిస్తానని చెప్పాడు. పాండవుల పక్షాన పోరాడే వారంతా తమ ప్రాణాలను అర్పించడానికి, విజయం చేకూర్చడానికి సిద్ధంగా వున్నారని అన్నాడు. అప్పుడు, ఆ మాటలకు తృప్తి చెందిన ధర్మరాజు, యుద్దోత్సాహంగా వున్న ధృష్టద్యుమ్నుడితో, మర్నాటి యుద్ధంలో అద్భుతమైన ‘క్రౌంచవ్యూహాన్ని’ నిర్మించి ఆయన తెలివితేటలను చూపించమని అడిగాడు. ధర్మరాజు చెప్పినట్లే చేస్తానన్నాడాయన.

మర్నాడు ధృష్టద్యుమ్నుడు క్రౌంచవ్యూహం పన్నాడు. అందులో అర్జునుడు ముక్కుగా; కుంతి భోజుడు, శైల్యుడు కన్నులుగా; ద్రుపదుడు తురాయిగా; దశార్ణరాజు, శూరసేన రాజు, కిరాతరాజు కుత్తుకగా; భీముడు, ధృష్టద్యుమ్నుడు కుడి-ఎడమ రెక్కలుగా అయ్యారు. అభిమన్యుడు, సాత్యకి, ద్రౌపది కొడుకులు, పౌండ్ర, చోళ పాండ్యులు భీముడి దగ్గరికి చేరారు. నకుల సహదేవులు, ఘటోత్కచుడు, శంబర వత్స రాజులు, ధృష్టద్యుమ్నుడి దగ్గర చేరారు. కేకయరాజు, కాశిరాజులతో కలిసి విరాటుడు మొల స్థానంలో నిలిచాడు. హూణపతి మొదలైనవారు ధర్మరాజు చుట్టూ చేరి ఆయన వెనక వున్నారు. ఇలా వున్నదా వ్యూహం.

కౌరవ సేనలు మూడు వ్యూహాలుగా ఏర్పడింది. మధ్యలో భీష్ముడు నిలబడ్డాడు. కురుపాండవ సేనలు రెండూ యుద్ధానికి సన్నద్ధులై ఒకరినొకరు ఎదుర్కున్నారు. భీష్ముడు పాండవుల వ్యూహాన్ని చిన్నాభిన్నంచేశాడు. భీష్ముడి విజృంభణ చూసి అర్జునుడు ఆగ్రహించి రథాన్ని అటు తోలమని శ్రీకృష్ణుడికి చెప్పాడు. కొన్ని జాగ్రత్త మాటలు చెప్పి శ్రీకృష్ణుడు భీష్ముడి దిక్కుగా రథాన్ని తీసుకెళ్లాడు. అర్జునుడు భీష్ముడితోను, అతడికి సహాయంగా వచ్చిన కౌరవ వీరులతోను పోరాడుతుంటే, అర్జునుడికి సహాయంగా సాత్యకి మొదలైన వారొచ్చారు. అర్జునుడి ధాటికి కౌరవ వీరులు చెల్లాచెదరైపోయారు. అది చూసి దుర్యోధనుడు భీష్ముడిని అధిక్షేపించాడు. భీష్ముడు అతడి మాటలకు నొచ్చుకున్నాడు.

భీష్మార్జునుల యుద్ధం తీవ్రమైంది. భీష్ముడు తన బాణాలతో శ్రీకృష్ణుడి వక్షఃస్థలం ఛేదించాడు. అర్జునుడు భీష్ముడి సారథిని నొప్పించాడు. ఇరువురూ సమ ఉజ్జీగా పోరాడారు. మరోవైపున ధృష్టద్యుమ్నుడికి, ద్రోణాచార్యుడికి అదే మోతాదులో భీకరమైన యుద్ధం జరిగింది. ఒకరిని మరొకరు తీవ్రంగా నొప్పించారు. ఎవరూ తగ్గలేదు. ద్రోణాచార్యుడి ధాటికి ధృష్టద్యుమ్నుడు ఆగలేకపోయాడు. అప్పుడు భీముడు ధృష్టద్యుమ్నుడిని ఆదుకున్నాడు. వెంటనే కళింగరాజు, ఇతర కౌరవ వీరులు భీముడిని ఎదుర్కున్నారు. భీముడు భయంకరమైన శౌర్యాన్ని ప్రదర్శించాడు. పోరులో భీముడి చేతిలో కళింగదేశ రాజు శ్రుతాయువు కొడుకైన శక్రదేవుడు, తమ్ముడు భానుమంతుడు మరణించారు. శ్రుతాయువు కూడా మూర్ఛపోయాడు. అప్పుడు భీష్ముడు రంగంలో దిగి భీముడిని కలత పెట్టాడు.

ఆ తరువాత ధృష్టద్యుమ్నుడికి, అశ్వత్థామకు యుద్ధం జరిగింది. లక్ష్మణ కుమారుడికి, అభిమన్యుడుకి జరిగిన యుద్ధంలో తన కొడుకు నొచ్చిన సంగతి తెలిసికొని దుర్యోధనుడు అభిమన్యుడు మీదికి యుద్ధానికి పోయాడు. ఆయన వెంటే భీష్మద్రోణాది వీరులు కూడా అభిమన్యుడి మీదికి వెళ్లారు. తన కొడుకుని అనేకమంది వీరులు చుట్టుముట్టడం చూసిన అర్జునుడు అటువచ్చి భీభత్సాన్ని సృష్టించాడు. అతడి ధాటికి రణరంగం కంపించింది. కౌరవసేనలు భయంతో వెనుకంజ వేశాయి. వారలా పారిపోవడం చూసిన శ్రీకృష్ణుడు, అర్జునుడు విజయగర్వంతో తమ శంఖాలను పూరించారు.

భీష్ముడు కౌరవసేన దుస్థితిని గమనించి ద్రోణుడితో, శ్రీకృష్ణుడు తన రథానికి సారథిగా వుండగా అర్జునుడు కౌరవసేనలను సంహరించాడని, రథం నడపడంలో శ్రీకృష్ణుడిని మించిన నేర్పుగల సారథి లేడని, అంత గొప్ప సారథి లభించడం వల్ల రథికుడిగా అర్జునుడు రాణించి కౌరవ సేనలను చీల్చి చెండాడగలిగాడని, ఘోరమైన యుద్ధ భూమిని క్రీడారంగంగా చేసికొని వీరవినోద విహారం చేశాడని అన్నాడు. ఆర్జునుడిని చూస్తుంటే అతడు మూడవ కన్ను విప్పిన పరమ శివుడిలాగా కనిపిస్తున్నాడని, కౌరవ సేనలు అధీనం తప్పాయని, పారిపోయే సేనలను మళ్లించమని ద్రోణుడికి చెప్పాడు భీష్ముడు.

సూర్యాస్తమయం అవుతున్నందున ఆ రోజుకు ఇక యుద్ధం చాలించడం మంచిదని భీష్ముడు అన్నాడు. ద్రోణుడు అతడి మాటలకు తన అంగీకారం తెలిపాడు. అప్పుడు భీష్ముడు అందరినీ యుద్ధభూమినుండి నిష్క్రమించమని ఆజ్ఞాపించి కౌరవ సేనలను మరలించాడు. పాండవులు సింహనాదాలు చేస్తూ తమ శిబిరాలకు పోయారు. అలా రెండవ రోజు యుద్ధంలో పాండవులది పైచేయి అయింది.

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, భీష్మపర్వం, ద్వితీయాశ్వాసం

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)