Sunday, May 22, 2022

పదకొండవ రోజు యుద్ధం, ద్రోణాచార్యుడు సర్వసేనాధిపతిగా మొదటిరోజు : ఆస్వాదన-72 : వనం జ్వాలా నరసింహారావు

 పదకొండవ రోజు యుద్ధం, ద్రోణాచార్యుడు సర్వసేనాధిపతిగా మొదటిరోజు

ఆస్వాదన-72

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక ఆదివారం అనుబంధం (22-02-2022)

భీష్ముడు పదవరోజు జరిగిన యుద్ధంలో రణరంగం నుండి తొలగి పోయిన తరువాత కౌరవ వర్గం మళ్లీ ఎవరిని సేనాపతిగా నియమించాలని, పరాక్రమంలో సాటిలేని పాండవ సైన్యాన్ని ఎలా ఎదుర్కోవాలని ఆలోచన చేసింది. భీష్ముడు శరతల్పగతుడై దేవత్వాన్ని పొందిన సందర్భంలో ఆయన చెప్పిన మంచి మాటలు కౌరవులు పట్టించుకోకుండా అక్కడి నుండి లేచి వెళ్లిపోయారు. ఆ నేపధ్యంలో దుర్యోధనుడి దగ్గరకు వచ్చిన కౌరవ పక్షానికి చెందిన రాజులు కర్ణుడు ఇకనైనా యుద్ధరంగానికి వస్తే బాగుంటుందని ఆయనతో అన్నారు. అంతా ఒక విధంగా కర్ణుడిని తలచుకున్నారు.

హస్తినాపురం నుండి కర్ణుడు దుర్యోధనుడి దగ్గరకు వచ్చాడు. భీష్ముడిని తలచుకుని కర్ణుడు విచారగ్రస్తుడయ్యాడు. కన్నీరు కారుస్తూ ఏడ్చి, తనను తాను ఓదార్చుకున్నాడు. తాను చెదిరిపోయిన కౌరవ సైన్యాన్ని కాపాడుతానని, అర్జునుడి పూనికను ప్రతిఘటిస్తానని, భీష్ముడు ఏవిధంగా శౌర్యంతో ప్రకాశించాడో అట్లాగే తానూ తన భుజబలాన్ని ప్రదర్శిస్తానని అన్నాడు కర్ణుడు. ఒకవేళ తాను పాండవులను జయించలేకపోతే సంతోషంగా వీరస్వర్గాన్ని అలంకరిస్తానని చెప్పాడు. అలా అంటూ తన సారథితో రథాన్ని సిద్ధం చేయమన్నాడు. రథం ఎక్కి కర్ణుడు దుర్యోధనుడికి నమస్కారం చేసి భీష్ముడు వున్న చోటుకు వచ్చాడు. శరతల్పగతుడైన ఆ మహానుభావుడికి నమస్కరించాడు. భీష్ముడు ఆజ్ఞాపిస్తే దివ్యాస్త్రోపేతుడైన అర్జునుడి బాహుగర్వాన్ని తానొక్కడినే తన అస్త్ర శస్త్ర విద్యా నైపుణ్యంతో అణచివేస్తానని అన్నాడు. ఆర్జునుడిని ఓడించడానికి తనను యుద్ధరంగానికి పంపమని భీష్ముడిని అడిగాడు కర్ణుడు.

జవాబుగా, దుర్యోధనుడి రాజ్య రక్షణ భారం ఇక కర్ణుడి మీదే వున్నదని అతడు తెలుసుకోవాలని, కర్ణుడి క్షేమాన్ని తానెప్పుడూ కోరుతానని, కౌరవులను ముందుకు నడిపించి ఆ మహారాజుకు విజయం చేకూర్చమని భీష్ముడు కర్ణుడితో అనగానే, కర్ణుడు సంతోషంతో భీష్ముడి పాదాల మీద శిరస్సు మోపి నమస్కరించి, సెలవు తీసుకున్నాడు. ఆ తరువాత కర్ణుడు యుద్ధ భారాన్ని స్వయంగా తన మీద మోపుకున్నాడు. చతురంగ బలాలను సంఘటితపరచాడు. ఆ సమయంలో దుర్యోధనుడు తన రథాన్ని కర్ణుడి దగ్గరకు పోనిచ్చాడు. భవిష్యత్ కార్యక్రమం ఏమిటో చెప్పమని కర్ణుడిని అడిగాడు దుర్యోధనుడు. కౌరవ యోధులలో సేనాపతిగా ఎవరిని నియమించవచ్చో తెలియచేయమని కోరాడు కర్ణుడిని.

దానికి స్పందిస్తూ కర్ణుడు, కౌరవ యోధులలో సేనాపతికాగల ఆర్హతలు చాలామందికి వున్నాయని, అంతా సమర్థులే అని, అంతమాత్రంచేత అందరినీ నియమించలేం కదా అని, గురువు, బ్రాహ్మణుడు, అన్ని యుద్ధ విద్యల్లో మహా నిపుణుడు, వయోవృద్ధుడు, మిక్కిలి బలశాలి, మహావీరుడైన ద్రోణాచార్యుడికి సర్వసేనాధిపతిగా పట్టం కట్టమన్నాడు. అప్పుడు ఆ పదవికి ఒప్పుకొమ్మని ద్రోణుడి దగ్గరికి వెళ్లి ప్రార్థించాడు దుర్యోధనుడు. ఆయన సర్వసైన్యాధిపత్యానికి అంగీకరించాడు. వెంటనే దుర్యోధనుడు ద్రోణాచార్యుడికి సేనాధిపత్యాన్ని అభిషేకించాడు.

సర్వసైన్యాధిపతైన ద్రోణాచార్యుడు తనను దుర్యోధనుడు ఆ విధంగా గౌరవించినందుకు ఏదైనా వరాన్ని కోరుకొమ్మని చెప్పాడు. యుద్ధంలో ధర్మరాజును సజీవంగా బంధించి తన ముందుకు తీసుకురావాలని అడిగాడు దుర్యోధనుడు. అతడిని బంధించి తెమ్మనడానికి కారణం ఏమిటని, తెస్తే ఏం చేస్తావని, అర్థరాజ్యం ఇస్తావా? అని ప్రశ్నించాడు ద్రోణుడు. ధర్మరాజుతో మళ్లీ జూదం ఆడించి, ఓడగొట్టి అడవులకు పంపితే అతడితో పాటు తమ్ములు కూడా పోతారని, అప్పుడు భూమండలాన్ని చాలాకాలం పాలిస్తానని అన్నాడు దుర్యోధనుడు. అతడి కుత్సితమైన అభిప్రాయానికి ద్రోణుడు అసహ్యించుకున్నాడు. అర్జునుడు యుద్ధంలో అడ్డగిస్తే ధర్మరాజును బంధించడం తన చేతకాదని, అర్జునుడు లేకుండా చేస్తే బంధించి తెస్తానని చెప్పాడు ద్రోణుడు తెలివిగా. దుర్యోధనుడు ద్రోణుడి ప్రతిజ్ఞను అంతట చాటించాడు. ధర్మరాజుకు వేగులవారి ద్వారా ఆ విషయం తెలిసింది.

ధర్మరాజు ఆ విషయాన్ని అర్జునుడికి చెప్పాడు. తాను జీవించి వుండగా ధర్మరాజును ప్రాణాలతో బంధించడం ద్రోణుడికే కాదు, రుద్రుడికి కూడా సాధ్యం కాదన్నాడు అర్జునుడు. ధర్మరాజు సంతోషించాడు ఆ మాటలకు. పాండవులు ఆరోజున క్రౌంచ వ్యూహాన్ని రచించారు. దాని ముందు భాగంలో శ్రీకృష్ణుడు, అర్జునుడు వున్నారు. అర్జునుడి రథం పక్కన ధృష్టద్యుమ్నుడి రథం వున్నది. భీముడు, అభిమన్యుడు, ద్రౌపది పుత్రులు, ద్రుపదాదులు, ధృష్టకేతువు మొదలైనవారు ఆ వ్యూహం మధ్యలో వున్నారు. ధర్మరాజు వ్యూహం నడిమధ్యలో మంచి ఏర్పాట్లతో, గట్టి ప్రయత్నంతో వచ్చి నిలబడ్డాడు. కౌరవులు శకట వ్యూహాన్ని రచించారు. దాంట్లో కుడిపక్క జయద్రథ, భగదత్తులతో కలిసి వికర్ణుడు; అతడికి సహాయంగా శకుని; ఎడమ పక్క కృతవర్మ, వివింశతి, చిత్రసేనలతో కూడిన దుశ్శాసనుడు; అతడికి సహాయంగా పక్కన కాంభోజ, శక, యవన దేశాధీశులు; నడుమ త్రిగర్త, మద్ర, శిబి, శూరసేన దేశాల రాజులు చుట్టూ వున్నారు. ద్రోణుడు ముందుండగా దుర్యోధనుడు, కర్ణుడు ఆ ముందర నిలిచారు.

ఇరుపక్షాల సైనికులు యుద్ధానికి సిద్ధం కాగా కర్ణార్జునులు యుద్ధం చేయడానికి ఉబలాటపడి నిలిచారు. కౌరవ పాండవ సైన్యాలు మహోగ్రంగా పోరాడారు. ద్రోణుడు స్వైరవిహారం చేశాడు. ఆయన తన సాటిలేని శూరత్వాన్ని, బాహుబలాన్ని, దివ్యాస్త్రాల మహిమను చూపడంతో పాండవ సైన్యంలో రక్తపుటేఱులను ప్రవహింప చేశాడు. అప్పుడు ధృష్టద్యుమ్నుడు మహాభయంకరంగా ద్రోణాచార్యుడిని ఢీకొన్నాడు. అర్జునుడు అతడితో కలిశాడు. వారిద్దరినీ ద్రోణుడు ఎదుర్కున్నాడు భీకరంగా. మరోవైపున శకునికి, సహదేవుడికి మధ్య యుద్ధం జరిగింది. భీముడు వివింశతి రథాశ్వాసాలను నేలకూల్చాడు.

అలంబసుడు, ఘటోత్కచుడు రాక్షసమాయలతో, అదృశ్యులై యుద్ధం చేయసాగారు. క్షత్రదేవుడు దుర్యోధనుడి కొడుకు లక్ష్మణ కుమారుడితో తలపడ్డాడు. శల్యుడు నకులుడితో, కృపాచార్యుడు ధృష్టకేతువుతో, కృతవర్మ సాత్యకితో యుద్ధం చేశారు. ధృష్టద్యుమ్నుడు సుశర్మను నొప్పించాడు. కర్ణుడు తనను ఎదుర్కున్న విరాటరాజు చతురంగ బలాలను సంహరించాడు. ద్రుపదుడు, భగదత్తుడు పోరాడారు. పౌరవుడు అభిమన్యుడితో యుద్ధం చేశాడు. మధ్యలో వచ్చిన జయద్రథుడిని పారిపోయేట్లు చేశాడు అభిమన్యుడు. తన శక్త్యాయుధంతో శల్యుడి సారథిని చంపాడు అభిమన్యుడు. శల్యుడు రథం మీదనుండి కిందికి దిగి గదా యుదానికి సిద్ధమయ్యాడు. అది చూసిన భీమసేనుడు అభిమన్యుడిని పక్కకు నెట్టి శల్యుడిని ఢీకొన్నాడు. ఇద్దరూ ఒకరికొకరు తీసిపోకుండా గదా యుద్ధం చేశారు. కాసేపటికి భీమశల్యులు ఇద్దరూ నేలమీద పడ్డారు. కృతవర్మ శల్యుడిని తీసుకునిపోయాడు. దుర్యోధనాదులు భీముడిని ఎదుర్కున్నారు. ఇంతలో మధ్యాహ్నం అయింది.

కర్ణుడి కొడుకు వృషసేనుడు నకులుడి కొడుకైన శతానీకుడితో తలపడ్డాడు. ద్రౌపది కొడుకులంతా శతానీకుడికి సహాయంగా వచ్చారు. ఇంతలోనే ఇరుపక్షాల వైపున యోధానుయోదులంతా యుద్ధానికి దిగారు. కౌరవ సైన్యం కలత చెంది వెనుదిరిగి పోసాగింది. ద్రోణాచార్యుడు కౌరవ సైన్యాన్ని యుద్ధానికి మళ్లించి ధర్మారజును ఢీకొన్నాడు. అప్పుడు ధర్మరాజు చక్ర రక్షకుడైన సుకుమారుడు ద్రోణుడి రొమ్ములో తీక్షణమైన బాణాన్ని నాటాడు. తెప్పరిల్లుకున్న ద్రోణుడు ధర్మరాజును తాకాడు. ఆ సమయంలో పాండవ వీరులంతా ధర్మరాజుకు సహాయంగా వచ్చి, ద్రోణుడిని చుట్టుముట్టారు. అప్పుడు ద్రోణుడు రథికులందరినీ బాధించి ధర్మరాజును ఆక్రమించడానికి సమీపించాడు. సరిగ్గా అదే సమయంలో అర్జునుడు వచ్చి ద్రోణాచార్యుడిని ఎదుర్కున్నాడు.

కౌరవ వీరులు అంతా ఒక్కటై ద్రోణుడికి సహాయంగా అర్జునుడిని చుట్టుముట్టారు. అర్జునుడు విజృంభించి కౌరవ పక్షంలో రక్తపు నదులను ప్రవహింప చేశాడు. ఇంతలో సూర్యుడు అస్తమించాడు. ద్రోణాచార్యుడు, దుర్యోధనుడు యుద్ధం ఆపుచేసి సైన్యాలను వెనక్కు మరల్చారు. పాండవుల జయజయ ధ్వానాల మధ్య అర్జునుడు సైన్యాలను మరల్చి ధర్మరాజు దగ్గరకు వెళ్లాడు. ఈ విధంగా రెండు సైన్యాలు తమతమ శిబిరాలకు చేరాయి.

ధర్మరాజును బంధించే విషయాన్ని మళ్లీ ప్రస్తావించాడు దుర్యోధనుడు ద్రోణుడితో. అర్జునుడు దగ్గర వున్నప్పుడు ధర్మరాజును బంధించడం ఎవరివల్లా కాదని తాను మొదటే చెప్పానని, వీరుడెవరైనా పరాక్రమంతో అర్జునుడిని యుద్ధభూమికి దూరంగా తీసుకోనిపోతే ధర్మరాజును ఉపాయంగా పట్టుకుంటానని చెప్పాడు ద్రోణుడు. 

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, ద్రోణపర్వం, ప్రథమాశ్వాసం

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)

Thursday, May 19, 2022

ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు ఎలా సాధ్యం? : వ‌నం జ్వాలా న‌ర‌సింహారావు

 ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు ఎలా సాధ్యం?

వ‌నం జ్వాలా న‌ర‌సింహారావు

సాక్షిదినపత్రిక (20-05-2022)

ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు (రేపు) జ‌రిగితే తెలంగాణ రాష్ట్రంలో భార‌తీయ జ‌న‌తా పార్టీ అధికారంలోకి వ‌స్తుంద‌ని అమిత్ షా అంటున్నారు. హైద‌రాబాద్ స‌మీపంలోని తుక్కుగుడాలో ఇటీవ‌ల జ‌రిగిన భారతీయ జనతా పార్టీ బ‌హిరంగ స‌భ‌లో త‌న స్వ‌ప్నం సాకార‌మ‌వుతుందన్న రీతిలో ఆయన వ్యాఖ్యానించారు. అక్క‌డితో ఆగ‌కుండా ఆయ‌న తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ‘రేపే’ ఎన్నిక‌లు నిర్వ‌హిస్తామ‌ని ప్ర‌క‌టించాల‌ని స‌వాలు చేశారు. ఎన్నిక‌ల‌ను ఎదుర్కొనేందుకు తాము స‌ర్వ‌స‌న్నద్ధంగా ఉన్నామ‌న్నారు కేంద్ర హొం మంత్రి అమిత్ షా. ఈ వ్యాఖ్య‌ల‌లో ఆయ‌న‌కు రాజ్యాంగ ప్రకరణాలు కానీ, ఎన్నిక‌ల క‌మిష‌న్ చ‌ట్టాల గురించి కానీ ఏమాత్రం అవగాహన లేదనే విషయం స్పష్టంగా అర్థమవుతున్నది.

రాష్ట్రానికి సంబంధించినంతవరకు ప్ర‌తిప‌క్ష పార్టీ అయిన బీజేపీ జాతీయ నాయ‌కుడు డిమాండ్ చేసిన వెంట‌నే ఎన్నిక‌లు నిర్వ‌హించే ప‌రిస్థితి ఉండ‌ద‌ని ఆయ‌నకు తెలియదా? రాష్ట్ర శాసనసభలో మెజారిటీ వున్నప్పుడు ఎప్పుడు ఎన్నికలకు పోవాలా అన్న విషయం, ముంద‌స్తుగా శాసనసభను రద్దు చేయాలా వద్దా అన్న విషయం, శాసనసభాపక్ష నాయకుడు, ముఖ్య‌మంత్రి ఇష్టా అయిష్టాల మీద ఆధార‌ప‌డి ఉంటుంద‌నేది జగమెరిగిన స‌త్యం. తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీ పూర్తి మెజారిటీని కలిగి వున్నప్పుడు అలా ముంద‌స్తుకు ఎందుకు మొగ్గు చూపుతారు? చూపాల్సిన అవసరం వున్నదా? అసెంబ్లీ ర‌ద్ద‌యిన మ‌రుస‌టి రోజే ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ అసాధ్యం కదా? ఎందుకంటే ఎన్నిక‌ల‌ నిర్వహణకు ఒక సుదీర్ఘ ప్ర‌క్రియ ఉంటుంది.

ఎన్నిక‌ల షెడ్యూలును ప్ర‌క‌టించే ముందు ఎన్నిక‌ల క‌మిష‌న్ అందులో ఉన్న మంచి చెడుల‌ను బేరీజు వేసుకుంటుంది. కాబ‌ట్టి, అసెంబ్లీ ర‌ద్ద‌యిన మ‌ర్నాడే ఎన్నిక‌లు నిర్వ‌హించ‌డ‌మ‌నేది క‌ల్ల‌. కేంద్ర హోం మంత్రి స్థాయిలో ఇలా మాట్లాడ‌డం ఆయ‌న‌కు త‌గ‌దు. ఇది గార‌డీ మాట‌గా భావించాల్సి ఉంటుంది. అమిత్ షా ఎప్పుడు హైద‌రాబాద్ లేదా తెలంగాణ రాష్ట్రంలో ప‌ర్య‌టించినా అదోరకమైన విచిత్రంగా మాట్లాడుతుంటారు. కొంత మేరకు హ‌ద్దులు మీరి మాట్లాడతారని అన్నా అతిశయోక్తి కాదేమో! ఇలా మాట్లాడి త‌న బేల‌త‌నాన్ని వెల్ల‌డించుకుంటుంటారు.

2018లో కేసీఆర్ ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్ళిన‌ప్పుడు అదెంతో ఖ‌ర్చుతో కూడుకున్న ప‌ని అంటూ విమ‌ర్శించిన ఇదే అమిత్ షా ఇప్పుడు ఆయ‌నంత‌ట ఆయ‌నే రేపే ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని కోర‌డం వింత‌గా ఉంది. అప్పుడప్పుడు ఆయ‌న మాట్లాడే మాటల‌లో హేతుబ‌ద్ధ‌త ఉండ‌దు. లాజిక్ లేకుండానే మాట‌లు తూటాలు వ‌దులుతుంటారు. రాష్ట్ర అసెంబ్లీని ర‌ద్దు చేయాల‌ని పరోక్షంగా అడ‌గ‌డం దీనికి ఒక మంచి ఉదాహ‌ర‌ణ‌. ముందస్తు ఎన్నిక‌లు జ‌రిగితే త‌మ పార్టీ అధికారంలోకి వ‌స్తుంద‌ని షా క‌ల‌లు కంటున్నారు. 2014, 2018లో నిర్వ‌హించిన తెలంగాణ‌ అసెంబ్లీ ఎన్నిక‌ల‌లో బీజేపీ ద‌క్కించుకున్న‌ స్థానాలు అతి స్వల్పం. అలాంటప్పుడు ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు నిర్వ‌హిస్తే బీజేపీ అధికారంలోకి వ‌స్తుంద‌న్న ఆయన వ్యాఖ్య ఎంత‌వ‌ర‌కు స‌మంజ‌స‌మో ఆ దేవుడికే తెలియాలి.

గతంలో కేసీఆర్ ఎందుకు ముందస్తుగా ఎన్నికలకు పోయారన్న ప్రశ్న తలెత్తవచ్చు. అప్పుడు కేసీఆర్ అసెంబ్లీని ర‌ద్దు చేయాల‌ని ఎందుకు సిఫార్సు చేశార‌నే అనుమానం అంద‌రికీ రావ‌చ్చు. రాజ్యాంగ స‌భ‌ల‌ను ర‌ద్దు చేసే అంశంలో రాజ్యాంగం పూర్తి స్వేచ్ఛ‌ను ఇచ్చింది. ఈ స్వేచ్ఛ‌ను కేసీఆర్ ఉప‌యోగించుకున్నారు. అప్ప‌టి రాజ‌కీయ ప‌రిస్థితుల‌కు చెక్ పెట్ట‌డానికీ, ప్ర‌భుత్వం త‌ల‌పెట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్య‌క్ర‌మాలు కొన‌సాగించ‌డానికీ ఆయ‌న ముంద‌స్తు ఎన్నిక‌ల నిర్ణ‌యం తీసుకున్నారు.

కేసీఆర్ గ‌తంలో ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్ళ‌డం ముమ్మాటికీ స‌హేతుకం, రాజ్యాంగ‌బ‌ద్ధం, చ‌ట్ట‌బ‌ద్ధం, న్యాయం. ఆ సంద‌ర్భంలో కేసీఆర్ నిర్ణ‌యాన్ని షా త‌ప్పు ప‌ట్టారు. అసెంబ్లీని ర‌ద్దుచేసి, ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్ళాల‌ని నిర్ణ‌యించిన మొట్ట‌మొద‌టి సీఎం కేసీఆర్ మాత్ర‌మేన‌నీ, ఈ ఎన్నిక‌ల వ‌ల్ల ఎంతో ప్ర‌జాధ‌నం ఖ‌ర్చువుతుంద‌నీ విమ‌ర్శించారు. ఈ అంశాన్ని ఇక్క‌డ ప్ర‌స్తావించ‌డం అసంద‌ర్భం కాబోదు. ఎందుకంటే రెండు ర‌కాలుగా మాట్లాడుతున్న‌ది అమిత్ షానే క‌దా? అప్పటి ఆయ‌న మాట‌లు వింటే దేశంలో ఎప్పుడూ ముంద‌స్తు ఎన్నిక‌లు జ‌ర‌గ‌న‌ట్లే ఉంది.

న‌డుస్తున్న చ‌రిత్ర‌ను అమిత్ షాలాంటి స్థాయి వ్య‌క్తి విస్మ‌రించి ఎలా మాట్లాడ‌గ‌ల‌రు. దేశంలో రాజ‌కీయ ప‌రిణామాలు ఆయ‌న‌కు తెలియ‌వు అంటే న‌మ్మాలా? అసాధ్య‌మైన కార్యాన్ని త‌క్ష‌ణం చేయాల‌ని షా డిమాండ్ చేయ‌డం దుర‌దృష్ట‌క‌రం. రాష్ట్రం ఎన్నిక‌లకు ఎప్పుడు వెళ్ళాలో నిర్ణ‌యించాల్సింది అమిత్ షా కాదు. ప్ర‌త్యేకించి అధికారంలో ఉన్న పార్టీ పూర్తి మెజారిటీని అనుభ‌విస్తున్న‌ప్పుడు ఇలా డిమాండ్ చేయ‌డం అస్స‌లు స‌రికాదు. త‌మ‌కు తెలంగాణ‌లో అధికారంలోకి రావాల‌నే క‌ల‌ను ప్ర‌జ‌ల‌కు వెల్ల‌డించ‌డానికే ఆయ‌న అలా వంక‌రగా ఎన్నిక‌లు పెట్టాల‌ని డిమాండ్ చేస్తున్నారు. రేపే ఎన్నికలు పెట్టితే అధికారంలోకి వచ్చే పార్టీ మరో ఏడాదిన్నర ఆగవచ్చు కదా?

ఆయ‌న‌కు అంత ఉబ‌లాటంగా ఉంటే వెంట‌నే ప్ర‌ధానిని క‌లిసి, బీజేపీ పూర్తి మెజారిటీని అనుభ‌విస్తున్న లోక్ స‌భ‌ను ర‌ద్దు చేసి, ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని కోరాలి. గ‌డువు పూర్త‌యిన త‌ర‌వాత లేదా గ‌డువుకు ముందే అసెంబ్లీ లేదా పార్ల‌మెంటును ర‌ద్దు చేసి ఎన్నిక‌లు జ‌ర‌పాల‌ని రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ లేదా రాష్ట్ర‌ప‌తిని కోర‌డం కొత్త అంశ‌మేమి కాదు. ఐదేళ్ళ పాటు పార్ల‌మెంటు, అసెంబ్లీలు కొన‌సాగ‌డానికి అనుమతిస్తున్న రాజ్యాంగం ఆర్టికిల్ 85, 174 ద్వారా రాష్ట్ర‌ప‌తి లేదా గ‌వ‌ర్న‌ర్‌ల‌కు ప్ర‌భుత్వాధినేత‌ల సిఫార్సుల‌పై వాటిని ముంద‌స్తుగా ర‌ద్దుచేసే అధికారాన్నీ క‌ట్ట‌బెట్టింది. అది కేవలం ప్ర‌భుత్వాధినేత‌ల హక్కు మాత్రమె. అలాంటప్పుడు, అమిత్ షా కేసీఆర్‌ను ముంద‌స్తు ఎన్నిక‌లకు వెళ్ళాల‌ని ఎలా బ‌ల‌వంతం చేయ‌గ‌ల‌రు? అమిత్ షా డిమాండ్ వెనుక మూల కార‌ణం ఏమిటి? దానికి న్యాయ‌బ‌ద్ధ‌త ఏమిటి? ఇంకా తెలంగాణ అసెంబ్లీ కాల‌ప‌రిమితి ఏడాదిన్న‌ర పైనే ఉండ‌గా ఇలా కోర‌డం ఏమిటి?

దేశంలోని ప్ర‌తిప‌క్షాల‌న్నీ పార్ల‌మెంటును ముందే ర‌ద్దుచేసి, ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని కోరితే అమిత్ షాకు మింగుడుప‌డుతుందా? పూర్తి మెజారిటీని పొంది ఉన్న ముఖ్య‌మంత్రి లేదా ప్ర‌ధాన మంత్రికి మాత్ర‌మే స‌భ‌ను ర‌ద్దుచేయాల‌ని కోరే హ‌క్కు ఉంటుంది. ఒక‌రు కోరితే ర‌ద్దు చేయాల‌నుకోవ‌డం స‌రికాదు. అలా కోర‌డానికి కార‌ణం ఏదైనా కావ‌చ్చు. రాజ‌కీయ, ప‌రిపాల‌న‌, లేదా మ‌రేదైనా కావ‌చ్చు. అమిత్ షా లాంటి స్థాయి వ్య‌క్తి చేయాల్సిన వ్యాఖ్య‌లు కావు. స‌భ ఎప్పుడు ర‌ద్దు చేయాలి  అనేది ముఖ్యమంత్రికి రాజ్యాంగం క‌ల్పించిన హ‌క్కు.

2018 ఎన్నిక‌ల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీనీ కేసీఆర్ నెర‌వేర్చ‌లేదంటూ హోం మంత్రి అమిత్ షా ఆరోపించారు. వార‌స‌త్వ రాజ‌కీయాల‌ను కేసీఆర్ ప్ర‌భుత్వం అనుస‌రిస్తోంద‌న్నారు. 57 సంవ‌త్స‌రాల జీవితంలో ఇంత అవినీతి ప్ర‌భుత్వాన్ని చూడ‌లేద‌ని కూడా అమిత్ షా అన్నారు. అర‌గంట సేపు సాగిన షా ప్ర‌సంగంలో కేసీఆర్ ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శించారు. గ‌తంలో మాదిరిగానే ఆ విమ‌ర్శ‌లు ఫ‌క్తు అబద్ధాలు.

ఎన్నిక‌ల ప్ర‌ణాళిక‌లో ఇచ్చిన హామీలను కేసీఆర్ నెర‌వేర్చ‌లేదంటూ చెప్పి, ఆయ‌న ప్ర‌జ‌ల‌ను త‌ప్పు దోవ ప‌ట్టించ‌డానికి ప్ర‌య‌త్నించారు. వాస్త‌వానికి ఒకరి తరువాత మరొకరు అధికారంలో వున్న కాంగ్రెస్ లేదా బీజేపీ ప్ర‌భుత్వాలు ఎప్పుడూ ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన ఎన్నిక‌ల హామీల‌ను నెర‌వేర్చేలేద‌నేది ప‌చ్చి నిజం. 2014 టిఆర్ఎస్ ఎన్నిక‌ల ప్ర‌ణాళిక‌లో లేని ప‌థ‌కాల‌ను, ఇవ్వ‌ని హామీల‌ను కూడా టిఆర్ఎస్ అమ‌లు చేసింది. వీటిని కూడా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటే టీఆర్ఎస్ ప్ర‌భుత్వం 200శాతం ఎన్నికల హామీల‌ను నెర‌వేర్చినట్లయ్యింది. ఈ విష‌యాల‌ను అమిత్ షా గారు ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటే మంచిది.

తాను చేసిన వ్యాఖ్య‌ల‌కు కేంద్ర మంత్రి, బీజేపీ జాతీయ స్థాయి నాయ‌కుడు అయిన అమిత్ షా భేష‌జాన్ని విడిచి తెలంగాణ ప్ర‌జ‌ల‌కు క్ష‌మాప‌ణ చెప్పాలి. లేదంటే, తెలంగాణ ప్ర‌భుత్వాన్నీ, ప్ర‌జ‌ల‌ను అవ‌మానించ‌డమే కాగ‌ల‌దు. అమిత్ షా వ్యాఖ్య‌ల‌ను తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. అమిత్ షా ను అబద్ధాల బాద్షాగా అభివ‌ర్ణించారు. అమిత్ షా వ్యాఖ్య‌లు నిరాధార‌మైన‌వ‌ని ఒక ప్రెస్‌మీట్లో కేటీఆర్ స్ప‌ష్టంచేశారు. ఆయ‌న మాట‌లు వాస్త‌వానికి దూరంగా ఉన్నాయ‌నీ, వ‌క్రీక‌ర‌ణ‌ల‌నీ పేర్కొన్నారు. తెలంగాణను కింద‌చ‌ప‌ర‌చ‌డానికి అమిత్ షా చేసిన దుష్ప్ర‌చారంగా కేటీఆర్ వివ‌రించారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవ‌డానికి షా ఈ ర‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్నారు.

తెలంగాణ ప్ర‌భుత్వం చేప‌ట్టిన వినూత్న, సృజ‌నాత్మ‌క కార్య‌క్ర‌మాల‌కు ఇత‌ర రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌, కేంద్ర మంత్రుల‌తో పాటు ప్ర‌ధాన మంత్రి, నీతి ఆయోగ్ ఉపాధ్య‌క్షుని నుంచి ప్ర‌శంస‌లు అందుకున్న విష‌యాన్ని అమిత్ షా గుర్తుచేసుకోవాలి. తెలంగాణ చేప‌ట్టిన కార్య‌క్ర‌మాల‌కు దేశ విదేశాల నుంచి కూడా ప్ర‌శంస‌లు ల‌భించిన విష‌యం అంద‌రికీ తెలిసిందే. తెలంగాణ ప్ర‌భుత్వం కేవ‌లం రాష్ట్రాల‌తో, కేంద్రంతోనే కాదు ప్ర‌పంచంలోని ఇత‌ర దేశాల‌తో కూడా పోటీప‌డుతోంది. ప్ర‌తి ఒక్క‌రూ తెలంగాణ రాష్ట్రాన్ని ఆద‌ర్శంగా తీసుకుంటున్నార‌నే విష‌యం అంద‌రికీ తెలిసిందే. యుఎన్‌డిపి, నీతి ఆయోగ్ సంస్థ‌లు మిష‌న్ కాకతీయ‌, మిష‌న్ భ‌గీర‌థ ప్రాజెక్టుల‌ను ప్ర‌శంసించాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా తెలంగాణ మోడల్ ను గురించిన చర్చ జరుగుతున్నది కదా!

Time for CPI (M) to change its style : Vanam Jwala Narasimha Rao

 Time for CPI (M) to change its style

Vanam Jwala Narasimha Rao

The Pioneer (20-05-2022)

The largest arm of the Communist Party in the country the CPI (Marxist) founded by great stalwarts like Pucchalapalli Sundarayya, EMS Namboodiripad, Hari Kishan Singh Surjit, Pramod Das Gupta, AK Gopalan, BT Ranadive, M Basava Punniah, P Ramamurti and Jyoti Bose could manage to win just three Lok Sabha seats in the 2019 elections. For the first time since its formation in 1964, the party drawn a blank in West Bengal. The CPI(M) which played a pivotal role in government formation at the centre in 1989, 1996 and 2004 no more is a confident of Government of the day. Failure of Communists will certainly enhance the influence and authority of right-wing extremism, fanatic communalism which is not healthy for the nation. 

After India's Independence, a series of events like Sino-Soviet split and Sino-Indian war led to the split in the Communist Party of India in 1964. The breakaway Communist Party of India (Marxist) emerged stronger both in terms of membership and performance in the Indian Elections. CPI (M) has a glorious record in conducting class and mass struggles. The CPI (M) is the biggest contingent of the Left. It was once heading Left-led governments in three states which is now cut down to size one.

In early 1950s, the united CPI was bitterly divided over the manner in which political power in India should be captured. The militants advocated the 'Chinese path', or capture of power through violent means and the other group was for the 'Indian path' or capture power within the constraints of Indian Constitution. Chandra Rajeswar Rao, who advocated Chinese Path, did not sail with CPIM after the split. Makineni Basava Punniah who advocated Chinese Path along with Rajeswar Rao, became a politburo member of the Communist Party of India (Marxist) after the split in 1964. Then there were certainly no personal interests involved in their choosing either CPI or CPM. However, Sundarayya in his letter to the party Polit Bureau and Central Committee Members in August 1975 offering his resignation as party General Secretary criticized Basava Punniah for limiting his role to giving advice and opinion but actually not fighting for his line.

Pucchalapalli Sundarayya was a founding member of the Communist Party of India (Marxist) and a leader of the peasant revolt in the Telangana Rebellion. In 1936, Sundarayya became a member of the Central Committee of the undivided Communist Party of India. He went underground between 1948 and 1952. He was re-elected to the Central Committee in 1952. He was also elected to the Polit Bureau, the highest forum in the Party. When the Party leadership was in favour of supporting the Government at the time of the Sino-Indian War, Sundarayya resigned his positions protesting against the policies of the dominant leadership of the Party. He was arrested and imprisoned during November 1962 at the time of India-China border war. After the split Sundarayya was elected as its General Secretary. He continuously remained Party’s General Secretary till 1976. In that year, which fell during the Emergency, he resigned from the General Secretary Ship and Polit bureau membership, for what he called the “revisionist habits” acquired by the Party.

Sundarayya in his resignation pointed out among others, Polit Bureau’s failure to concretize party’s tactical line, non-seriousness on agrarian resolution in practice, ignoring building of secret part of party’s organization, Polit Bureau not functioning as a collective body and so on. Had the Party taken serious note of his anguish, CPI (M) position would have been much, much better than the present humiliating status.

The 19th CPM Party Congress held during March 29 to April 3, 2008 at Coimbatore called for a rectification campaign against wrong trends in the Party. The rectification was meant to unify and strengthen the Party on correct principles. How far the objective could be achieved and how far the campaign percolated down below the cadre in its true spirit is not known. 

            There is no doubt that alien values and ideas affected CPM Party leaders and cadres. Along with the concentration of wealth, the creation of business-politician nexus at all levels is intertwining between corporate and business interests and the political system. Even the CPI (M) Central Committee once observed that the role of money power has increased to an unprecedented level in politics, particularly in elections and CPIM cadre is no exception to it. With the association with bourgeois parties at various levels, particularly through electoral understandings and with the rise of the business-political nexus, there is a corresponding rise in use of money and other bourgeois practices. These have corrosive effect on CPM cadres. CPIM’s relationship with secular parties also on the declining mode.

Majority of the Party membership consists of new entrants who are still to acquire the basic outlook of the Party and they are yet to be grounded in the class and mass struggles. Such a situation leads to all sorts of feudal, bourgeois and petty bourgeois trends emerging within the Party. The party top leadership noted that, in the leading committees of the Party only around 30 per cent belong to working class, poor peasants and agricultural workers.  Violation of communist norms have also arisen. Due to parliamentary outlook and electoral opportunism, mass movements, launching struggles and building the Party is being neglected by CPI (M).

Due to distinct increase in parliamentary opportunism among CPM cadre, Increased numbers of individual comrades resorted to revolting when refused party ticket. The use of money, liquor and other corrupt practices has grown in the party. The money used in elections has reached an unprecedented level in states where the party is in existence even for namesake.

The party feels threatened when some leaders and cadres fail to live up to the communist standards and values. For lavish lifestyle, building houses which are far above the minimum needs required, spending large amounts on weddings of children, organizing festivities on a lavish scale CPI (M) is no exception. There are examples of comrades who have acquired assets and incur expenses disproportionate to their known sources of income. There are cases of Party leaders running NGOs with no check or accountability about the funds being used. Real estate promoters, contractors and liquor contractors seek to establish connections with CPM cadre and those in elected positions. The tendency to collect big amounts of money from individuals and affluent sections, instead of mass collection, has increased specially to meet election expenses. Accounts for these are not properly maintained and submitted to the respective committees. Often the Party committees are unable to initiate action due to various reasons such as factional trends, liberalism and reluctance to antagonize an important Party cadre.

Against this background now it’s time for the CPI (M) the largest arm of the Communist Party to have an introspection and live up to the expectations of people. It is their essential duty to align with likeminded forces of secular, democratic and socialist to contain right wing and national extremism. Maybe it is time for the party leadership to think in terms of actively supporting the alternate national agenda proposed by Telangana Chief Minister KCR so that the rise of right-wing extremism is checked and democratic forces are strengthened.    

Wednesday, May 18, 2022

ఇప్పుడు అపనమ్మకమే ప్రచారాస్త్రం : వనం జ్వాలా నరసింహారావు

 ఇప్పుడు అపనమ్మకమే ప్రచారాస్త్రం

వనం జ్వాలా నరసింహారావు

నమస్తే తెలంగాణ దినపత్రిక (19-05-2022)

తెలంగాణ రాష్ట్రానికి ఇటీవల కాలంలో వచ్చి బహిరంగసభలను ఉద్దేశించి మాట్లాడిన భారత జాతీయ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కాని, భారతీయ జనతా పార్టీ నాయకుడు అమిత్ షా కాని తమ ప్రసంగాలలో, తెలంగాణ రాష్ట్రంలో గత ఎనిమిదేళ్లుగా ఒక్కటంటే ఒక్క మంచి పనైనా జరగలేదన్నట్లు పలికారు. ముఖ్యంగా అమిత్ షా, కేంద్రం రాష్ట్రానికి ఎన్నో నిధులను సమకూరుస్తున్నట్లు, కేంద్రం ఇస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగ పరుస్తున్నట్లు, ప్రాజెక్టులలో అవినీతి జరుగుతున్నట్లు, రాష్ట్రంలో అమలవుతున్న ప్రతి పథకానికి పేర్లు మార్చి రాష్ట్ర పథకాలుగా చూపిస్తున్నట్లు, ఎన్నికల మానిఫెస్టోలో చేసిన ఒక్క వాగ్దానాన్ని కూడా కేసీఆర్ అమలు చేయలేదని, రాష్ట్రం విపరీతంగా అప్పులు చేస్తున్నట్లు, ఇలా ఏవేవో, రాసుకుంటూ పొతే ఇంకెన్నో అన్నారు.

తెరాస మీద, కేసీఆర్ ప్రభుత్వం మీద అపనమ్మకం కుదిరేలా ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ‘రేపే’ ఎన్నికలు పెట్టితే తమ పార్టీ మెజారిటీ సీట్లను గెల్చుకుని ప్రభుత్వాన్ని స్థాపిస్తుందని అన్నారు అమిత్ షా. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ‘రేపంటే రేపే’ ఎన్నికలు జరపడం సాధ్యం కాదనే విషయం బహుశా అమిత్ షా గారికి తట్టి వుండక పోవచ్చు. ఒక రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు జరగాలంటే దానికి పెద్ద ప్రహసనం వుంటుంది. ప్రజలకు ఇవన్నీ తెలియదనుకోవడం పొరబాటు. అయినా ఒక రకమైన అపనమ్మకం కుదిరేలా మాట్లాడడం పరిపాటై పోయింది కొందరికి.       

ఇటీవలి కాలంలో, "అపనమ్మకం" అనే ఆయుధం అలవోకగా వాడకంలో కొచ్చింది. శత్రువును దెబ్బ తీయడానికి అంత కంటే సులువైన ఆయుధం మరొకటి లేదనే భావన అందరి లోను, ప్రత్యేకించి రాజకీయ నాయకులలోను బలంగా నాటుకుని పోయింది. ఉభయ తెలుగు రాష్ట్రాలైన ఆంధ్ర ప్రదేశ్, ప్రత్యేకించి తెలంగాణాలో ఈ ఆయుధాన్ని విచ్చలవిడిగా వాడుకుంటున్నారు. ఆది మానవుడు చేతికి దొరికిన దాన్నే తనకు రక్షణగా ఉపయోగించుకుంటే, పాత రాతి యుగం నుంచి కొత్త రాతి యుగానికి మారడంతో, అలా రక్షణకు వాడిన వాటినే, ఇతరులపై దాడికి ఉపయోగించుకో సాగారు. మరి కొంతకాలం గడిచాక, వాటినే పదునైన ఆయుధాలుగా మలచుకోవడం మొదలైంది. ఇలా ఆరంభమైన ఆయుధాల వాడకం, పరిణామ క్రమంలో, శాస్త్ర సాంకేతిక రంగం అభివృద్ధి చెందడంతో, తుపాకులుగాను, ఫిరంగులగాను, దరిమిలా రసాయన, అణ్వాయుధాల వాడకం వరకూ పోయింది. ఆ తర్వాత ఆంత్రాక్స్, కరోనా అలాంటి మరి కొన్ని మాధవ మేధస్సులోంచి బయటకొచ్చాయి.

ఒక వ్యక్తి మరో వ్యక్తి నుంచి తన రక్షణకోసం, లేదా, ఎదుటివారిని దెబ్బతీయడానికి ఆది మానవుల కాలం నుంచి మొదలైన ఆయుధాల వాడకం, నాగరికత పెరిగే కొద్దీ, దేశ దేశాల మధ్య యుద్ధాలకు దారితీసే దాకా పోయింది. ఇవన్నీ ఒక వైపు ఇలా కొన సాగుతూంటే, ఆధిపత్య పోరులో భాగంగా, అధికారం కొరకు, వ్యక్తుల మధ్య పోరాటం మొదలైంది. ఆ పోరాటానికి వాడే ఆయుధాలు, వ్యూహాత్మకమైన ఆయుధాలు కాసాగాయి. వాటి రూపకర్తలు ప్రజాస్వామ్యం ముసుగులో అధికారాన్ని హస్తగతం చేసుకోవాలనుకుంటున్న రాజకీయ నాయకులు. మొదట్లో ఆ వ్యూహాలు, ప్రజలకు తామేం మంచి చేయదల్చు కున్నామో తెలియచేసే "వాగ్దానాలు" మాత్రమే. అలా చెప్పే వారిలో నిజాయితీ ప్రతి బింబించేది మొదట్లో, అంటే స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలో. క్రమేపీ, చేస్తామని మభ్య పెట్టే వాగ్దానాలు మొదలయ్యాయి. సమాంతరంగా, ఎదుటి వారి వ్యూహాలకు ప్రతి వ్యూహాలు కూడా మొదలయ్యాయి. చాలా కాలం వరకు కొంతలో కొంత నిజాయితీగానే, ఒకరిపై మరొకరు ప్రచారాలు చేసుకునే వారు. అవన్నీ పనికి రాని రోజులొచ్చాయిప్పుడు. ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలు, వారి నుంచి పాఠాలు నేర్చుకుంటూ, వారినే ఆదర్శంగా తీసుకుంటున్న అనేక మంది, ఎదుటి వారిని దెబ్బ తీయడానికి వాడుకుంటున్న అతి పదునైన ఆయుధం "అప నమ్మకం". తన ప్రత్యర్థి విషయంలో ఎంత ఎక్కువ అపనమ్మకం ప్రజల్లో కలిగించగలిగితే అంత భారీగా విజయం తమ సొంతం చేసుకోవచ్చనే భావన మొదలైంది. ఈ అంటు వ్యాధి అన్ని రంగాల్లోకి పాక సాగింది. దానికి ప్రత్యక్ష సాక్ష్యం, ఉభయ తెలుగు రాష్ట్రాలలో గత కొంతకాలం నుంచి, సాగుతున్న మాటల యుద్ధమే.

నలబై సంవత్సరాల క్రితం, సినిమా హీరో నందమూరి తారక రామారావు, తెలుగు దేశం పార్టీని స్థాపించి, తెలుగు వారి ఆత్మగౌరవం ఢిల్లీ నడివీదుల్లో అవమానం పాలైందనీ, ఆ అవమానానికి ప్రతీకారంగా భారత జాతీయ కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలోను, దేశంలోను ఓడించాలని ఇచ్చిన పిలుపుకు తొలుత ఆయన స్వరాష్ట్రంలోను, అనంతరం దేశ వ్యాప్తంగానూ స్పందించిన ఓటర్లు, కాంగ్రెస్ పార్టీని గద్దె దింపారు. అప్రతిహతంగా, స్వాతంత్ర్యం వచ్చిన నాటినుంచి అటు కేంద్రంలోను, ఇటు పలు (ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ తో సహా) రాష్ట్రాలలోను, అధికారం అనుభవిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బలు తగలడం గత శతాబ్ది డబ్బై దశకంలో మొదలైంది. రాష్ట్రాలలో ఆ ప్రక్రియ కొంత ముందుగా మొదలైనప్పటికీ, కేంద్రంలో తొలి కాంగ్రెసే తర ప్రభుత్వం అధికారం చేపట్టడానికి 1977 వరకు ఆగవలసి వచ్చింది. 1971 లో కాంగ్రెస్ పార్టీని విజయ పధంలో నడిపించిన ఇందిరా గాంధిని ఓడించడానికి, అప్పటి రాజకీయ పార్టీలు, ఎదురు దెబ్బ తీశారే తప్ప, వెన్ను పోటు రాజకీయాలను కాని, అవాస్తవాలు ప్రచారం చేయడం కాని చేయ లేదు. ఆమె చేసిన "తప్పు" నే తమ ఎన్నికల ప్రధానాంశంగా, ఆయుధంగా ఉపయోగించుకున్నారు. ఉవ్వెత్తున పెల్లుబుకిన "అవినీతి వ్యతిరేక ఉద్యమం" లోక్ నాయక్ జయ ప్రకాశ్ నారాయణ్ నాయకత్వంలో, ఇంతై, ఇంతింతై, వటుడింతై అన్న చందాన, ఆబాల గోపాలాన్ని అందులో పాల్గొనేలా చేసింది. వారూ-వీరూ అనే తేడా లేకుండా, ఇందిరా గాంధి పార్టీకి చెందిన కొందరు నాయకులతో సహా, ఎందరో, ఆ ఉద్యమానికి మద్దతిచ్చి ఇందిరను ఓడించారు. ఆమె చేసిన తప్పులను మాత్రమే ఎంచి చూపారు కాని, ఆమె చేయని, ఆమెకు సంబంధం లేని విషయాలపై, ప్రజల్లో ఆమెపై "అపనమ్మకం" కలిగే ప్రయత్నం ఎవరూ చేయలేదు.

1977 ఎన్నికలలో, ఇందిరా గాంధీకి వ్యతిరేకంగా కాంగ్రేసేతర ప్రతిపక్షాల నాయకులు ఉపయోగించిన మరో బ్రహ్మాస్త్రం "నియంతృత్వమా-లేక-ప్రజాస్వామ్యమా" కోరుకొమ్మని ఓటర్లను అడగడం. ఎమర్జెన్సీకి ముందు, ఎమర్జెన్సీ అమల్లో వున్నప్పుడు, కారణాలు సహేతుకమైనా, కాక పోయినా, ఇందిరా గాంధీలో నియంతృత్వ పోకడలు చోటు చేసుకున్న విషయం, ఆమెకు అతి సన్నిహితంగా మెలిగిన వారు సహితం ధృవీకరించిన మాట వాస్తవం. ప్రతిపక్షాల పిలుపుకు స్పందించిన ఓటర్లు, "ప్రజాస్వామ్యానికి" ఓటే సారు. జనతా పార్టీని గెలిపించారు. రెండేళ్ల లోనే ప్రజాస్వామ్యానికి సరైన సారధులు "జనతా పార్టీ నాయకులు" కానే కాదని, కాలేరని నిరూపించడానికి ఇందిరకు అవకాశం దక్కింది. తనపై నమ్మకం పెట్టుకునే దిశగా దరిమిలా వచ్చిన మధ్యంతర ఎన్నికలలో వాగ్దానాలు చేసిందే కాని, ప్రత్యర్థులపై అపనమ్మకం అస్త్రాన్ని వాడుకోలేదు. జనతా పార్టీ అప్పట్లో సుస్థిర ప్రభుత్వాన్ని అందించడంలో విఫలమయిందని ఓటర్లకు తెలియచేసే ప్రయత్నం మాత్రం చేసింది ఇందిరా గాంధి.

ఇందిరా గాంధీనైతే ఓడించ గలిగారు కాని, నిల దొక్కుకోలేక పోయారు అలనాటి కాంగ్రేసేతర రాజకీయ నాయకులు. ఎన్నికలొచ్చాయి. ఇందిరా గాంధి వ్యూహాత్మకంగా, "సుస్థిరతా? అస్థిరతా" అన్న నినాదం లేవనెత్తిందే కాని, "అప నమ్మకం" ఆయుధాన్ని వాడ లేదు. శత్రువును తన బలంతోను, వారి బలహీనతల తోను, గెలిచిందే తప్ప, వాళ్లకు అపవాదు అంటగట్టే విధంగా ప్రచారం చేయలేదు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ఇందిరా కాంగ్రెస్ తాను చేయబోయే పనుల ప్రాతిపదికగానే గెలిచింది. అలాగే, అయిదేళ్ల తర్వాత, అదే మోతాదు ప్రభంజనంలో ఆమె పార్టీని ఓడించిన ఎన్ టీ రామారావు, ఇందిరా కాంగ్రెస్ ను రాజకీయంగా దెబ్బ తీశాడే కాని ఆమెపై ప్రజల్లో "అప నమ్మకం" ప్రచారం చేయలేదు. తన వ్యతిరేకులతో ఆమె జత కట్టిందని అసత్య ప్రచారాలు చేయలేదు. "మాచ్ ఫిక్సింగ్" అన్న పదాలు ఆమెకు వ్యతిరేకంగా వాడిన దాఖలాలు లేవు. బహుశా ఇదే పద్ధతి, మన దేశంలోని రాజకీయ పార్టీలన్నీ ఇటీవలి కాలం వరకూ అవలంబిస్తూనే వున్నాయి. కాని కాలం మారింది. ఎన్నికల ప్రణాళికలో, బహిరంగ సభలలో వాగ్దానాల కన్నా, తప్పుడు వాగ్దానాల కన్నా పదునైంది, ప్రత్యర్థిని కించపరచడం, అసత్యాన్ని ప్రచారం చేయడం, ఎన్ని విధాల వీలైతే అన్ని విధాల వారిపై ప్రజలలో "అప నమ్మకం" కలగ చేయడం అని గ్రహించాయి రాజకీయ పార్టీలు. ఈ విషయంలో ప్రతిపక్షాలు అగ్రభాగాన నిలుస్తున్నాయి.

ఇటీవల తరచుగా వినిపిస్తున్న పదం "మాచ్ ఫిక్సింగ్". క్రికెట్ ఆటలో గెలిచిన జట్టు గెలుపుకు ప్లేయర్ల, కోచ్ ల, కెప్టెన్ల ప్రతిభ కాదని, ఓడిన జట్టులోని కొందరితో రహస్యంగా చేసుకున్న ఒప్పందం వల్లనే అని, ప్రచారాలు మొదలయ్యాయి. దాన్నే "మాచ్ ఫిక్సింగ్" అని ముద్దుగా పిలువ సాగారు. అదొక అ నైతిక ఒప్పందంగా ముద్ర పడింది. నిజానికి అలా జరిగుంటే అది అ నైతికమే. ఒకటి రెండు సందర్భాలలో అలా జరిగుండొచ్చు కూడా. కాకపోతే, ఎప్పుడు ఏ మాచ్ ఏ టీం గెలిచినా, దానికి ఏదో రకమైన "మాచ్ ఫిక్సింగ్" కారణం అనే "అప నమ్మకం" ప్రచారంలోకొచ్చింది. ఆ తరహా "అప నమ్మకం" ఎంత బలంగా క్రికెట్ క్రీడాభిమానుల్లో నాటుకు పోయిందంటే, గెలిచిన ప్రతి టీం విజయ రహస్యం "మాచ్ ఫిక్సింగే మో!" అన్నంత "నమ్మకం" గా భావించడం మొదలైంది. ఇక రాజకీయ నాయకులు ఆ ఆయుధాన్ని వాడకంలోకి తెచ్చారు. దానికి మీడియా తన వంతు సహకారాన్ని అందించ సాగింది. మీడియా-రాజకీయ నాయకుల మధ్య "మాచ్ ఫిక్సింగ్" స్థాయికి ఎదిగిందా అపనమ్మకం ఆయుధం.

ఉదాహరణలుగా ఎన్నో చెప్పుకోవచ్చు. భారతీయ జనతా పార్టీకి, తెలంగాణ రాష్ట్ర సమితికి మధ్య అవగాహన వుందని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఒక అపనమ్మకాన్ని ప్రచారం చేస్తుంటే, కాదు...కానేకాదు....కాంగ్రెస్ పార్టీకి, తెరాసకు మధ్య చీకటి ఒప్పందం వున్నదని బీజేపీ ఎలుగెత్తి చాటుతున్నది. బీజేపీ ఒక అడుగు ముందుకు పోయి తెరాస కారు స్టీరింగ్ అసదుద్దీన్ ఒవైసీ చేతుల్లో వుందని మరో అపనమ్మకాన్ని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేశారు. తామేంటో, తమ వ్యూహం ఏంటో, గెలుస్తే తమ పంథా ఎలా వుండబోతుందో, ప్రచారం తెలియచేయాల్సిన రాజకీయ పార్టీలు, దాన్ని గాలికి వదిలేసి, ప్రత్యర్థుల పై ఓటర్లలో, ప్రజల్లో అపనమ్మకం కలిగేలా వ్యవహరించడం విడ్డూరం. అలాగే అన్నీ కాకపోయినా కేవలం కొన్ని పత్రికలలో వస్తున్న వ్యాస పరంపరలు, వ్యతిరేకుల మీద "అప నమ్మకం" కలిగించేలా వున్నవే తప్ప, వాస్తవాలు వెలుగులోకి తేవాలన్న తపన మృగ్యం.

ఈ జాడ్యం రాజకీయాలకే పరిమితమై పోలేదు. అన్ని రంగాలకూ వ్యాపించ సాగింది ఒక అంటు జబ్బులా. దీన్ని అరికట్ట లేక పోతే, ఇది అవినీతి కంటే వేయి రెట్ల ప్రమాదం కలిగించే స్థాయికి పోతుంది. మరో అన్నా హజారే లాంటి వారు ఉద్యమించాల్సిన అవసరం కలిగినా ఆశ్చర్య పోనక్కర లేదు. తస్మాత్ జాగ్రత్త! "

Monday, May 16, 2022

IS IT FEASIBLE TO CONDUCT ELECTIONS ‘TOMORROW’? : Vanam Jwala Narasimha Rao

 IS IT FEASIBLE TO CONDUCT ELECTIONS ‘TOMORROW’?

Vanam Jwala Narasimha Rao

The Hans India (17-05-2022)

              Amit Shah addressing a public meeting near Hyderabad disclosed his dream desire that the Bharatiya Janata Party would win the next assembly election hands down even if the polls were held as early as the next day. He even challenged KCR to declare the election ‘tomorrow’ and they are ready for it. It shows that Amit Shah is unaware of the constitutional requirement and election commission laws that elections to the state assembly cannot be held as and when an individual not to speak of an opposition party leader demands.

             The fact is that it is purely the prerogative of the Chief Minister to prefer for an early poll when he enjoys the majority in the assembly and even then, they cannot be held the ‘next day’ of dissolution, since it must take its own process. The Election Commission has to take in to account all pros and cons before announcing the schedule and certainly not the next day of dissolution! These gimmick talks by a responsible leader of the caliber of a Union Home Minister is in a way unbecoming of him.

Amit Shah, whenever he visits Hyderabad and Telangana state, funnily turns hysterical and utters exceeding his limits and in the process exposes himself. Amit Shah who illogically questioned the propriety and rationale for dissolution of State Assembly and going for early elections alleging that it involves huge expenditure during 2018 has preferred now to push KCR for an early poll dreaming that his party would win the battle. Both in 2014 and 2018 assembly elections BJP won negligible number of seats and God alone knows from where he will get majority in the forthcoming elections as and when they are held.

It may not be out of context if it is mentioned here that when KCR decided to go for early polls in 2018 which was reasonable, constitutional, legal and justifiable, the same Amit Shah questioned KCR alleging that he was the first CM of any state to have recommended for dissolution of assembly and going for an early election causing huge expenditure to the exchequer. That time his argument was that such an act never ever happened in India earlier. That was shear ignorance of the concurrent history and how can a person of Amit Shah stature be so ignorant and not aware of political happenings in the country. And now he went on record demanding to conduct polls the very next day which is impossible by any means.

Notwithstanding all this to put the things straight, it is not Amit Shah who decides when a state should go for election particularly when the party in power in that state enjoys absolute majority. If he so desires, he can recommend to Prime Minister to dissolve Lok Sabha where BJP enjoys absolute majority. In India recommending to President of India or the Governor of a state, for dissolution of either Lok Sabha or State Assembles before completion of its term and prefer an early election is not new.

         Constitution of India which provides full five-year term to Lok Sabha and State Assemblies also through Articles 85 and 174 empowers the President and Governors, to dissolve legislatures before the expiry of term on the recommendation of concerned Council of Ministers only but certainly not on the recommendation of other than CM or PM as the case may be. Then how can Amit Shah attempt to propel CM KCR to declare elections? What is the justification behind Amit Shaw demanding KCR for an early poll which amounts to dissolution of assembly almost a year and half in advance? Will he digest if the opposition parties nationwide demand for an early poll for Lok Sabha by dissolving it earlier than its actual expiry of full term?

It is only the CM or PM, as the case may be as long as he or she enjoys absolute majority in the House, has unquestionable and absolute right, to recommend for dissolution of legislature, whether it is for political, administrative reasons or otherwise. Constitution provided for this, and no one has any say in this not to speak of a responsible person like Amit Shah.

            Then a question may arise as to why KCR preferred dissolution of the house during his first term. For dissolution of legislatures Constitution is highly flexible. CM KCR made use of these flexible provisions to put an end to the then prevailing political fragility in the state and to prevent hurdles for continuation of developmental and welfare programs.

Shah even alleged that not a single promise made before the previous polls has been fulfilled by Chief Minister K Chandrashekar Rao to the state. He labeled KCR governance as the one that has been following dynasty politics and added that he has not seen such a corrupt government in his 57 years of life. In the process of his 30-minute checkered speech Amit Shah castigated in many ways the KCR government and as in the past it included full of blatant lies.

Amit also attempted to mislead people when he said that the TRS Government did not fulfil its promises made in election manifesto. In fact, neither his BJP nor the Congress Party that ruled the country alternately for most of the time, never-ever fulfilled the electoral promises they made in every election they won. For the first time in the country, here is a government which fulfilled all the electoral promises. In addition, umpteen schemes and programs that were not part of 2014 and 2018 manifestos, were also initiated and implemented in the state by TRS Government. If these are also considered, then, it is more than 200% implementation of manifesto! Amit Shah Ji should make a note of this please.

This demands an unconditional and unequivocal apology from Union Home Minister and BJP national leader Amit Shah to the people of Telangana, for uttering blatant lies, falsehood and insulting the Telangana state and its people. Confronting and countering Amit Shah’s utterances with detailed statistics, State Municipal Administration and IT Minister KT Rama Rao described him as ‘Badusha of lies.

Addressing a media conference KTR repeatedly proved Amit Shah’s comments and statements as baseless and far from truth and charged the BJP National Leader with indulging in malicious propaganda to show Telangana State in poor light and attempting to scuttle its growth.

It is appropriate to mention here and remind Amit Shah that several new and innovative initiatives taken by the Telangana government have won appreciation from Chief Ministers of other states, Central ministers including the Prime Minister, NITI Aayog Vice Chairmen and even from heads of States abroad.

Telangana is just not competing with the neighboring state or other states, or even Centre. But is in global competition and literally competing with countries abroad. The fact is that everyone is openly saying to emulate the Telangana State model. UNDP and NITI Aayog have praised Mission Kakatiya and Mission Bhagiratha way back itself, but union government did not grant even a single rupee for these schemes. Not even a single project from the State was declared as a national project.