Sunday, July 20, 2025

వ్యక్తిత్వ వికాసం, జీవన పాఠాలు, స్వీయానుభవాల పరిపక్వత-12 ఎల్విఎస్ఆర్ శర్మ కత్రి సరాయ్ ఆయుర్వేదాశ్రమం నుండి రాసిన ఉత్తరం .... ఇద్దరు కుమారులు అంజిబాబు, రమేష్ ల ఉన్నత స్థానం : వనం జ్వాలా నరసింహారావు

 వ్యక్తిత్వ వికాసం, జీవన పాఠాలు, స్వీయానుభవాల పరిపక్వత-12

ఎల్విఎస్ఆర్ శర్మ కత్రి సరాయ్ ఆయుర్వేదాశ్రమం నుండి రాసిన ఉత్తరం

ఇద్దరు కుమారులు అంజిబాబు, రమేష్ ల ఉన్నత స్థానం   

వనం జ్వాలా నరసింహారావు

బాల్యస్నేహితుడు ఎల్విఎస్ఆర్ శర్మ ఉద్యోగాన్వేషణలో హైదరాబాద్ కు రావడం, చిక్కడపల్లి మా అద్దె ఇంట్లో వుండడం, చివరకు హైదరాబాద్ నచ్చక వెళ్లిపోయి, పెళ్లి చేసుకుని విజయవాడలో స్థిరపడి పోయాడు. అంతకు పూర్వం కొన్నాళ్లు (బీహార్) గయ దగ్గర ఒక ఆయుర్వేద కంపెనీలో పని చేశాడు. అక్కడ నుంచి నా జీవితాతంతం భద్రంగా దాచిపెట్టుకునే రీతిలో చక్కటి ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరంలోని అక్షరం, అక్షరం పొల్లుపోకుండా ఇక్కడ రాయడానికి కారణం, ఆ రోజుల్లో ఆప్యాయతలు, అనురాగాలు, చిన్ననాటి సంగతులు గుర్తుంచుకునే పధ్ధతి, ఇలా ఎన్నో చాలామంది తెలుసుకోవాలన్న ఉద్దేశమే. దీనికి ముందు నాకు, వాడికి, మరొక మాక్లాస్మేట్ జూపూడి హనుమత్ ప్రసాద్ కు మధ్యన వున్న సంబంధం, స్నేహం గురించి రాస్తాను.

మామిళ్ళగూడెంలోని మా ఇంటికి అతి సమీపంలో, రికాబ్ బజార్ స్కూల్ కు ఆవలి వైపున, రంగుభట్ల యజ్ఞనారాయణ గారింట్లో, ప్రసాద్ చిన్నతనంలో, వాడి కుటుంబం అద్దెకుండేవారు. వాడి నాన్నగారు జూపూడి నరసింహారావుగారు కాలేజీ చదువులు ఫార్మల్ గా చదువుకొకపోయినప్పటికీ, వ్యాపార రంగంలో అద్భుతంగా రాణించిన బ్రాహ్మణుడు. పెట్రోల్, కిరోసిన్, ఎరువుల వ్యాపారాలుండేవి. ఖమ్మంలో ధనవంతులుగా పేరున్న కొద్దిమందిలో ప్రసాద్ కుటుంబం కూడా ఒకటి. ‘యాజమాన్యంలో కార్మికుల భాగస్వామ్యం’ అని గొప్పగా ఆధునిక యుగంలో చెప్పడానికి ఎంతో పూర్వమే తన వ్యాపారాలలో, తనదగ్గర పనిచేసిన వారందరికీ వాటా ఇచ్చే సాంప్రదాయం నెలకొల్పారు. వారి నెలసరి వ్యయానికి సరిపోయేంత మేరకే జీతంలాగా ఇచ్చి, మిగతాది వారి పేరుమీద భద్రంగా బాంకులో డిపాజిట్ చేసి, వారి ఇతర రకాల కుటుంబ (పెళ్లిళ్లు, ఇల్లు కొనుక్కోవడం, ఆరోగ్యపరమైన లాంటి) అవసరాలకు, చివరకు పదవీవిరమణ అనంతరం అక్కరకు వచ్చేలా ఇచ్చేవారు.  

జూపూడి ప్రసాద్ తరువాతి కాలంలో నాకు తోడల్లుడైనాడు. వాడి తల్లిదండ్రులు, ఒక్కడే కొడుకైనందున అతి గారాబంగా పెంచుకునే వారు. బయటకెక్కడికీ పోనిచ్చేవారు కాదు. ఒక్క మాఇంటికి మాత్రం రానిచ్చేవారు. అలానే వారింటికి రానిచ్చే వాడి స్నేహితుడిని నేనొక్కడినే! పాఠశాల ‘ఇంటర్వెల్’ సమయంలో, ఆ పది నిమిషాలు గడపడానికైనా, మధ్యాహ్నం లంచ్ టైమప్పుడైనా, ఒక్కోసారి మాఇంటికి వాడో, లేదా, వాడింటికి నేనో వెళ్లే వాళ్లం. మాఇద్దరికీ మంచి స్నేహితుడు శర్మ. వాడికి తనవారు అన్న వారెవరూ లేరు. స్వగ్రామమైన ‘వేంట్రప్రగడ’ (కృష్ణాజిల్లా) లో ఒక బామ్మ వుండేది. ఖమ్మంలో (వరుసకు) వాడి మేనత్తగారింట్లో వుండి చదువుకునే వాడు.

బహుశా వాడు పదవ తరగతిలో వున్నప్పుడనుకుంటా, వాడి మామయ్యతో వచ్చిన తగాదా (వాడు సిగరెట్ తాగుతున్నాడని అసత్య ఆరోపణ చేసినందున అని నాకు జ్ఞాపకం) కారణంగా, ఇంటి నుంచి బయటకొచ్చాడు. ఆ సమయంలో మా అమ్మ, ప్రసాద్ అమ్మ వాడిని మాతో పాటే, సొంతపిల్లల్లాగానే వుండి చదువుకొమ్మన్నారు. కొంతకాలం అలానే వున్నాడు. బామ్మ ప్రోద్బలంతో, రాజీ కుదిరించిన దరిమిలా, వాడు అత్తయ్య-మామయ్యలతో వుండడానికి సమాధానపడి, హెచ్ఎస్సీ పూర్తయ్యేంతవరకు వాళ్లింట్లోనే వుండి చదువుకున్నాడు. పియుసి కాలేజీ చదువుకు వచ్చేసరికి ఆ ఇల్లు వదిలి ‘వారాలు’ చేసుకుంటూ చదువుకున్నాడు. అలావద్దని, మాతోపాటే వుండమని మా అమ్మ, ప్రసాద్ అమ్మ నచ్చచెప్పే ప్రయత్నం చేసినప్పటికీ వినలేదు. ఏ రోజునైనా ‘వారం’ దొరకకపోతే మా ఇంట్లో కాని, ప్రసాద్ ఇంట్లో కాని భోజనం చేసేవాడు.

కొన్ని దశాబ్దాల క్రితం బాగా చదువుకుంటూ పేదరికం వలన చదువు మానేయాల్సిన పరిస్థితులలో ఆ విద్యార్థిని ప్రోత్సహించడానికి కొన్ని కుటుంబాలు ముందుకు వచ్చి వారంలో ఒక్కోరోజున ఒకరు తమ ఇంట్లో, తమ పిల్లలతోపాటు ఆ విద్యార్థి  ఉచితభోజనానికి ఏర్పాటుచేసి, ఆదుకొనే సాంప్రదాయానికే ‘వారాలు చేసుకోవడం’ అన్న పేరు వచ్చింది. వారాలు చేసుకోవడమంటే ఒక్కొక్కవారం-ఇక్కడ వారం అంటే ఒక రోజు, అది ఆదివారం నుంచి శని వారం దాకా ఏదయినా ఒకరోజు-ఒక్కొక్కదాత ఇంట్లో భోజనం చేయడం.  అలా చదువుకునే విద్యార్థిని వారాలబ్బాయ్ అనేవారు. వారాలబ్బాయ్ అనే సినిమాకూడా వచ్చింది. మా చిన్నతనంలో ఈ వారాల భోజన సర్వసాధారణం. సత్సంప్రదాయం. ఇప్పుడు అంతగా పాటిస్తున్నట్లు లేదు.

నిరుపేద కుటుంబంలో పుట్టిన సుప్రసిద్ధ స్వాతంత్ర్య సమర యోధుడు, ఆంధ్రరాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి, టంగుటూరి ప్రకాశంపంతులు, వారాలు చేసుకుంటూ చదువుకుని, తదనంతరం ఉన్నత విద్యను అభ్యసించాడని అంటారు. ప్రకాశంపంతులు పదకొండోయేట తండ్రి మరణించడంతో, పిల్లలను తీసుకుని తల్లి ఒంగోలు చేరింది. ఒంగోలులో ఆమె భోజనశాల నడపవలసి వచ్చింది. ఆ రోజుల్లో ఇలాంటి వృత్తి చేసే వారిని సమాజంలో చాలా తేలికగా చూసేవారు. పూటకూళ్ళ వ్యాపారం చేసే తల్లి సంపాదన చాలక, ప్రకాశం ధనికుల ఇళ్ళల్లో వారాలకు కుదిరాడు. ప్రకాశంపంతులు లాగానే వారాలు చేసి ఉన్నతస్థాయికి చేరుకున్నవారెందరో?

ఎల్విఎస్ఆర్ శర్మ, నేను, తరువాతి కాలంలో వృత్తిరీత్యా-ఉద్యోగంరీత్యా వేర్వేరు జాగాలలో వున్నప్పటికీ మధ్య-మధ్య కలవడమో, ఉత్తరాలు రాసుకోవడమో తప్పక చేసేవాళ్లం. వాడు పియుసి తరువాత చదువు మానేశాడు. బెజవాడ వెళ్లి కొన్నాళ్లు, మద్రాస్ వెళ్ళి కొన్నాళ్లు ఉద్యోగంలో చేరాడు. నేను హైదరాబాద్ లో చదువుకుంటున్నప్పుడు (1964-1966) అక్కడ కొచ్చి మాతో పాటే వుండేవాడు. మా నాన్నగారు నాకు పంపించే పైకంతోనే ఇద్దరం సర్దుబాటు చేసుకునే వాళ్లం. సరిపోకపోతే, వాడు చిల్లర-మల్లర ఉద్యోగాలు చేసేవాడు. తరువాత మళ్ళీ విజయవాడ వెళ్ళి పెళ్లి చేసుకుని, ఒక హోటెల్ నడుపుకుంటూ స్థిరపడిపోయాడు. 15 సంవత్సరాల క్రితం చనిపోయాడు పాపం!

బీహార్ రాష్ట్రం గయ సమీపంలో కత్రి సరాయ్ లోని నాథ్ ఆయుర్వేదాశ్రమంలో ఉద్యోగం చేస్తున్నప్పుడు 22-1-1996 తేదీతో నాకు రాసిన ఒక ఉత్తరాన్ని ఇంకా పదిలంగా బధ్రపరుచుకున్నాను. అందులో మా స్నేహితులకు సంబంధించిన పేరాలతో సహా మిగతా అంశాలను వాడి మాటల్లోనే యధాతధంగా ఇక్కడ రాస్తున్నాను. ఒక నాడు అనుకోకుండా ‘అన్వేషణ’ అనే వారపత్రిక చూడడం జరిగింది. అందులో మాఇద్దరికీ బాల్యస్నేహితుడు భండారు శ్రీనివాసరావు (హెచ్ఎస్సీ వరకు క్లాస్మేట్స్) రాసిన ఒక వ్యాసం చదివాడు. వెంటనే స్పందిస్తూ, ఒక ఉత్తరం రాశాడు. అందులోని విషయాలు చాలావరకు మా ముగ్గురికీ, ఆ మాటకొస్తే, మా సమకాలీన విద్యార్థులు అందరికీ వర్తించేవిగా వున్నాయి. వివరాల్లోకి పొతే:

‘నేను కొన్నాళ్లుగా ఇక్కడ గయ దగ్గర ఒక ఆయుర్వేదాశ్రమంలో (కంపెనీ) ఉద్యోగం చేస్తున్న సంగతి నీవెరిగినదే కదా. నీవు నన్ను గుర్తు చేసుకుంటూ ఉంటావో లేదో గాని, నేను నిన్ను, మన స్నేహితులందర్నీ ఏదో ఒకసందర్భంలో తలుస్తూనే ఉంటాను. 10 రోజుల క్రితం 9-01-96 అన్వేషణ అనే వారపత్రిక తిరగవేస్తుండగా, పేజీ 45 లో, శ్రీ భండారు శ్రీనివాసరావు వ్రాసిన ఒక వ్యాసం ప్రచురితమయింది నా కంట పడింది. క్రింద రచయిత పేరు చూసి వ్యాసం పూర్తిగా చదివాను. అలా మన చిన్ననాటి జ్ఞాపకాలు, పాత రిక్కా బజారు హైస్కూల్, మామిళ్లగూడెం మన ఇల్లు, పక్క మురికి కాలువ, మనం భోజనం చేసే మైసూర్ కేఫ్, ‘భోజనం తయార్ బోర్డు, “చలిగా ఉన్నది, చలి చలి వేస్తున్నది” అని కవిత రాసిన మీ స్నేహితుడు, మన నర్సింగరావు గారు, భండారు శ్రీనివాసరావు గారు, బాలమౌళి, నోములవారు, గుర్రంవారు, బూర్లెవారు, దోసపాటివారు, మొదలైన మన బాల్యస్నేహితులు గుర్తుకొచ్చాయి.’

‘పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించబడుతున్నది కాబట్టి, మీ ఇంటి ఎదురుగా ఉండే పోలియో స్నేహితుడు మన క్లాసే కాని  పేరు గుర్తు లేదు, సయీద్ రహ్మాన్, అబ్దుర్ రెహ్మాన్, షుకూర్, వారి స్నేహితులు, “గొట్టం పాపయ్య, పానుగంటి పిచ్చయ్య” అంటూ వుండే శ్రీ కొండలరావు సారు, మనకి మాత్రమే విడమర్చి చెప్పి మిగతా వాళ్లను కసురుకునే వెంకట్రాంరెడ్డి సారు, “వనజ భవుండు నిన్నొసట” అంటూ చెప్పే తెలుగు సారు అయ్యదేవర రామచంద్రరావు, బాగా కొట్టి చెప్పే సర్వశ్రీ చిన్ని రామారావు, వీరభద్రం (సైన్స్), అవధాని, రసూల్ మొదలైన వారు, డ్రామాలు వేయించే సత్యం, సీతారామయ్య మాస్టార్లు, కాలేజీకి వెళ్లేటప్పుడు నీవు సైకిలు తొక్కడం, నేను కూర్చోవడం, గుట్టల బజారు చడావ్ దగ్గర దిగడం, సైకిల్ తోయడం, లిటరేచర్ పేకాట ఆడడం, Self Service Day గుర్తుకు వచ్చాయి.’

‘అలాగే, మన స్కూల్ ఒంటికన్ను చప్రాసి, పక్కనే జిలేబి అమ్మే హిందీ తాత, జూపూడి ప్రసాద్, ఏమ్వీ కేహెచ్ ప్రసాద్, ఇట్లా అందరూ జ్ఞాపకం వస్తూ ఎన్నో విషయాలు మదిలో మెలిగాయి. గయోపాఖ్యానం, దేవుని లాలూచీ, అనే స్కూల్ డ్రామాలు గుర్తుకొచ్చాయి. చిక్కడపల్లిలో నీ రూమ్మేట్స్ అయిన స్వర్గీయ వనం రంగారావు గారు (ఎంఎ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్), రమణ (కల్మలచెర్వు), అజీజ్, తాజ్ మహల్ హోటెల్ ట్రేసర్ ఉద్యోగం, ‘Buy and Cry’ Pant, నా పురోహితుడి (తద్దినం బ్రాహ్మణుడి) అవతారం, ఖమ్మంలోని సుందర్, ప్రభాత్, నవాబ్ మొదలైన సినిమా హాళ్లు,  జాన్వీరా, నవాబ్, చీనా, ధర్మ, లాంటి పెద్ద వయసున్న మన క్లాస్ స్నేహితులు, ఖమ్మం నుండి హైదరాబాద్ వెళ్లేటప్పుడు బస్సులో నీకు వినిపించిన హరికధా కాలక్షేపం, మొదలైనవి మనసులో మెదిలాయి.’

‘ఇలా వ్రాస్తూ పోతూ ఉంటే అంతం ఉండదు. ఈ సారి హైదరాబాద్ వచ్చినప్పుడు మన చిన్ననాటి సంగతులు అన్నీ ఏకరవు పెట్టి ముచ్చటించాలని ఉన్నది. మా అమ్మాయి వాళ్లు కూడా హైదరాబాద్ లోనే ఉంటున్నారు. మొన్న ఈ మధ్య ఒకసారి మా అమ్మాయిని గురించి హైదరాబాద్ వచ్చాను. కాని నీ ఫోన్ నెంబరుకి ఫోన్ చేసినా ఫోన్ మారిందా ఏమో నెంబరు పలక లేదు. సమయం లేనందున కలవలేకపోయాను.’

‘ఇలా ఈ పత్రిక తిరగేస్తూ శ్రీ భండారు శ్రీనివాసరావు గారి వ్యాసం చదువుతూంటే, వారిని గురించిన జ్ఞాపకాలు కూడా వచ్చాయి. ఆకాశవాణిలో వింతలు-విశేషాలు (జీవనస్రవంతి) అనే వారి వార్తలు లోగడ ప్రసారమవుతూ ఉండేవి. తర్వాత ఆయన రష్యా వెళ్లినట్లుగా నీవు చెప్పావు. ఇలాంటివే మరెన్నో వ్యాసాలు, ప్రజలకి, ఈనాటి యువతకి పనికి వచ్చేట్లుగా వ్రాయాలని శ్రీ భండారు వారిని మరీ మరీ కోరుతున్నాను. ఈ విషయాలలో వారితో వ్యక్తిగతంగా ఒకసారి Discuss చేయాలని అనుకుంటున్నాను.’

‘మన భారతదేశం ఒక పుణ్యభూమి. ఎంతో మంది మేధావులకు, మహానుభావులకు జన్మనిచ్చిన మాతృ భూమి. మన వేదాలు, పురాణాలు, మన సాంఘిక ఆచార వ్యవహారాలు, మొదలైనవన్నీ మన ఉనికి, మనుగడలకై ఎంతో ఉపయోగపడేవిగా నిర్ణయించబడి, ఆచరించబడుతున్నవి. ఈ ఆచారాలన్నీ మన శీతోష్ణ స్థితి, Environment పై ఆధారపడి ఉన్నాయి. వాటిని వదిలేసి, పాశ్చాత్య నాగరికతలో ఈనాటి భారతీయుడు కొట్టుమిట్టాడుతున్నాడు. ఆరోగ్య దృష్ట్యా, తోలు చెప్పులు, నూలు దుస్తులు, తాజా ఆహారం, సాత్విక మితాహారం తీసుకోవాల్సి వుండగా Plastic చెప్పులు, బూట్లు, Synthetic దుస్తులు, ఫ్రిజ్ లో నిలవ వుంచిన Tinned Foods తీసుకుంటున్నారు. Christianity లో లాగా మన మతానికి ఒక క్రమశిక్షణ లేదు.’

‘మన తాత, ముత్తాతలు శివుడు, విష్ణువులను, మనం వెంకటేశ్వరుడు మొదలైన వారిని దేవుడిలాగా పూజించాం. ఈ నాటివారు బాబాలను, జిల్లెడమూడి అమ్మలను, తాంత్రిక స్వాములను, ఇలా వెలిసిన వూరికొక దేవదూతలను పూజిస్తున్నారు. వేలకువేలు ఖర్చుచేసి దేవుడికి కళ్యాణం చేయిస్తాంకాని మన పొరుగువాడు ఆకలితో అలమటిస్తూ ఉంటే చూస్తూఉంటాం. మన చరిత్రలోని మంచిని తీసుకోం. ధర్మరాజు అబద్ధం చెప్పలేదా?, కృష్ణుడు మాయ చేసి యుద్ధంలో పాండవులను గెలిపించలేదా? అని విమర్శిస్తూ ఉంటాం. ఉన్న గుళ్లు చాలన్నట్లు ప్రతి రోజూ, ప్రతి వూళ్లో గుడి కట్టడానికి చందాలు వసూలు చేస్తుంటారు. ప్రజలు నడిచే రోడ్లను ఆక్రమించి చిన్న, చిన్న గుళ్లను కట్టారు. అంతేగాని, మదర్ థెరిస్సాలాగా బీదవారికంటూ మన వాళ్లు నడిపే Poor Homes ఏమీ లేవు.’

‘ఒకడు నిజాయితీగా వ్యాపారం చేస్తూ తృప్తిగా జీవిస్తుంటే, పక్కవాడు ఏదో మతలబులు చేసి, బాగా సంపాదిస్తూ మేడలు, కార్లు కొంటుంటే, మొదటి వాడిని శుంఠ, చేతకానివాడి కింద లెక్క కడతారు. రెండవ వాడిని తెలివి తేటలు కలవాడంటారు. అందరూ వాడినే గౌరవిస్తారు. మన ప్రభుత్వం కూడా Reservations కల్పించి ప్రజలకు మంచే చేస్తున్నప్పటికీ, కనీసం విద్య, వైద్య, సాంకేతిక, ఇంజనీరింగ్ రంగాల్లోనైనా Merit ఉన్నవాళ్లకు (Irrespective of the Caste) అవకాశాలు ఇవ్వకుండా, మార్కుల రాయితీలు ప్రకటించి నందువల్ల, ఈనాటి స్కూలు మాస్టార్లు “శ్రీ రఘురామ చారు తులసీ దళ ధామ” అంటే, “శ్రీరాములవారు తులసి ఆకులతో చారుకాచి” అని చెప్పేవారిగా మారిపోతున్నారు. అదే మన రోజుల్లో, మన చదువులు తీసుకుంటే, మన చిన్నతనంలో మనం చదువుకున్న మన పాఠం, మను చరిత్రలోని పద్యం ఇంకా నాకు గుర్తున్నది.’

‘ఆ పద్యాన్ని నేను ఏమాత్రం చదవలేదు. కంఠస్థం అంతకన్నా చేయలేదు. లెక్చర్ విని, మాస్టారు విడమర్చి చదవగా విని గుర్తు పెట్టుకున్నాను. వాటిలో కొన్ని: ‘అచటి విప్రులు మెచ్చరఖిల విద్యా ప్రౌఢి, ముదిమది తప్పిన మొదటి వేల్పు.....అచట పుట్టిన చిగురు కొమ్మైన చేవ’; ధర్మరాజు రాజసూయ యాగం సందర్భంలో నన్నయగారి భారతంలోది, ‘చనపేడికి తారక్రియయును......కృష్ణు పూజించుటిలన్’; ఏనుగు లక్ష్మణకవి సుభాషితం, ‘ఆకాశంబున నుండి, శంభుని శిరంబందుండి.....వివేక భ్రష్ట సంపాతముల్’; ‘జలమున నగ్ని, చాత్రమున జండ మయూఖుని.....మూర్ఖుని మూర్ఖత మాన్పవచ్చునే’; ‘అవనీనాధులనేకులుండగ విశిష్టారాధ్యుల్. ఆర్యుల్ పూజ్యులు పల్వురుండగ....దాశార్హుండు పూజార్హుండే’; ‘ఈతనికి ధనమిత్తురేని అభీష్టములైన కార్యముల్....అనర్హుడర్హుడని అత్యుతునచ్యుత చేయపాడియేధర్మవు ధర్మ నందనా’.

‘Eighth Class English లో ‘Her arms across her breast she laid she was fairer than words can say’; Waste Not Want Not Proverb లో శ్రీ గెంటాల రంగారావుగారు చెప్పిన మాటలు ‘Economy does not mean stringency. One must enjoy life according to his status and earnings. If he goes beyond it, he may be called Spend Thrift’ కూడా జ్ఞాపకం వున్నాయి చాలావరకు. పై విషయాలన్నీ నీకు Bore కలిగించవచ్చునేమో కాని, ఇక్కడ ఖాళీగా ఉన్న నాకు (ఈ రోజు ఆదివారం. ఒంటరిగా ఆఫీసులో ఉన్నాను) ఏదో రాయాలనిపించి, నీవు కూడా పాత జ్ఞాపకాలు నెమరు వేసుకుని ఆనందించుతావని వ్రాస్తున్నాను.’

‘మనకు ముఖం తెలియని వాడెవడో బాబా గురించి ఉత్తరం వ్రాస్తూ, ఇలాంటి ఉత్తరం 100 ప్రింట్ చేయించి Mr Ex లక్ష రూపాయలు లాటరీ కొట్టాడు, Mr Y నిర్లక్ష్యం చేసి తలపగిలి లేదా పాము కాటుకు గురై చచ్చాడని అంటూ, ఇలాంటివే 100 ప్రింట్ చేసి బట్వాడా చేయాలని వ్రాస్తూ వుంటారు. హిందూ మతం దిగజారడానికి ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలి? మన రోజుల్లో మనకు తెలిసింది, తెలియని వాళ్లకి విడమర్చి చెప్పేవాళ్లం. ఈ రోజుల్లో చెప్పడం చేతకాదు కొందరికి. చెప్పితే నేర్చుకుంటాడోమో అని ఈర్ష్య కూడా.’

‘ఆ రోజుల్లో Cricket గురించి, Sixer, Four, Wide, Wicket అంటూ చెప్పింది నీవే. ఈ రోజుల్లో ప్రతి పిల్లాడికి తెల్సుననుకో. ఇంత భారతం వ్రాయడానికి, ఇన్ని విషయాలు మననం చేసుకోవడానికి ధనస్సు రాశిలో వ్రాసిన వారఫలాలు కూడా కాకతాళీయంగా ఏకీభవిస్తున్నాయి! (ఒక పేపర్ క్లిప్పింగ్‌ను వాడి వుత్తరానికి జత పర్చాడు. అందులో వార ఫలాలలో ధనస్సు రాశివారికి ‘చిన్ననాటి జ్ఞాపకాలు రాగలవు’ అని వుంది. బహుశా శర్మ జన్మ రాశి ధనస్సు కావచ్చు).’

ఎల్విఎస్ఆర్ శర్మ 2002 సంవత్సరంలో చనిపోయిన తరువాత కారణాలేవైనా అతడి కుటుంబ సభ్యులతో సంబంధాలు కొనసాగలేదు. శర్మ గురించి రాస్తున్నప్పుడు వాడి పిల్లల గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి కలిగింది. శర్మకు ఒక కూతురు, ఇద్దరు కుమారులు వున్నసంగతి బాగా గుర్తున్నది కానీ, వారు ఎక్కడ వుండేది, ఏమి చేస్తున్నది, తెలుసుకోవడమెట్లా అని ఆలోచిస్తుంటే శర్మ ఉన్నరోజుల్లో విజయవాడ సత్యనారాయణపురం వీధిలో ‘గణేష్ టిఫిన్ సెంటర్’ అనే పేరుతో వాడు అద్దెకున్న ఇంటి నుంచే ఇడ్లీలు తయారుచేసి వేడివేడిగా పొద్దున్న పొద్దున్నే తిన్నట్లు జ్ఞప్తికి వచ్చింది. ఆధారం దొరికింది అని నన్ను నేనే మెచ్చుకుని, ఈ విషయం, శర్మ సంగతి వివరాలు చెప్పి, విజయవాడతో బ్రహ్మాండగా పరిచయం వున్న మా శ్రీమతి కజిన్ సోదరుడు తుర్లపాటి పరేష్ (అద్భుతమైన వచన రచయిత) సహాయం కోరాను.

నా ఫోన్ రిసీవ్ చేసుకుంటూనే ‘బావగారూ’ అంటూ ఆప్యాయంగా పలకరించి, నాక్కావాల్సింది వినడమే కాకుండా, ఒక సీజనల్ డిటెక్టివ్ లాగా పరిశోధన చేసి, ఎల్విఎస్ఆర్ శర్మ ఇద్దరు కుమారుల పేర్లు, మొబైల్ నంబర్లతో సహా, శర్మ ఒకప్పుడు నడిపిన ‘గణేష్ టిఫిన్ సెంటర్’ నే వాడి పెద్దబ్బాయి అంజిబాబు అదే ఇంటి నుండి నడుపుతున్న విషయం, అదిప్పుడు ఆ పేరుగా వుంటూనే ‘అంజి ఇడ్లీ షాప్’ గా, ‘గణేష్ భవన్’ గా కూడా పిలిస్తున్న సంగతి చెప్పాడు. చిన్న కొడుకు రమేష్ (MSc Mathematics) విజయవాడలోని ఒక పాపులర్ డిగ్రీ (నారాయణ) కళాశాలలో ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్న సంగతీ క్లుప్తంగా చెప్పాడు.

నేను తక్షణమే శర్మ ఇద్దరు కొడుకులతో మాట్లాడాను. వాళ్లతో మాట్లాడినప్పుడు శర్మతో మాట్లాడిన ఫీలింగ్ కలిగిందంటే అతిశయోక్తికాదు. ఇద్దరు పిల్లల స్వరం అచ్చు శర్మ స్వరంలాగే వున్నది. ఫోన్ చేసినప్పుడు ఇద్దరూ వారివారి వృత్తి, ప్రవృత్తి పనుల్లో బిజీగా వున్నప్పటికీ మాట్లాడారు. ఆశ్చర్యంగా చిన్నబ్బాయి రమేష్ అప్పుడే కృష్ణానది మధ్యకు వెళ్లి అక్కడ గంటసేపు కూర్చుని వచ్చానన్నాడు. ఎందుకంటే తన శరీరాన్ని ‘రీచార్జ్’ చేయడానికి క్రమం తప్పకుండా ఇలా చేస్తుంటానని అన్నప్పుడు అతడి తండ్రి శర్మ కళ్లల్లో మెదిలాడు. ఇద్దరినీ, వారు హైదరాబాద్ వచ్చినప్పుడన్నా, లేదా, నేను విజయవాడ వెల్లినప్పుడన్నా కలుసుకుందామని చెప్పాను. 

ఇదిలా వుండగా, ఫేస్ బుక్ పోస్టులు పెట్టడంలో దిట్ట, ‘బులెట్, వందేమాతరం రైళ్లలా పరుగులెత్తే’ పరేష్ తుర్లపాటి ఈ అంశం మీద ‘24 గంటల్లో దొరికిన ఆచూకీ’ శీర్షికతో చక్కటి పోస్ట్ పెట్టాడు. దాన్ని దాదాపు యధాతథంగా, పరేష్ పర్మీషన్ తీసుకుని రాస్తున్నాను.  

‘హెడ్డింగ్ చూసి ఇదేదో క్రైమ్ స్టోరీ అనుకుంటున్నారా ? అయితే మీరు పిండిలో కాలేసినట్టే. అన్నట్టు పిండి అంటే గుర్తొచ్చింది. ఎప్పుడో మిస్ అయిన స్నేహితుడి ఆచూకీ కనిపెట్టింది ఇడ్లీ పిండే అంటే నమ్ముతారా? ఇప్పుడు అసలు విషయంలోకి వద్దాం. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆ మధ్య గన్నవరం నుంచి నేరుగా మొగల్రాజపురంలోని ఇడ్లీ పాకకు వెళ్ళి ఇడ్లీలు తిని టిఫిన్ చాలా బావుందని మెచ్చుకుంటూ ఓ వీడియోలో చెప్పిన సంగతి మా రచ్చబండ కబుర్లు సైట్ లో ఈ మధ్యనే పబ్లిష్ చేసిన ఆర్టికల్ ను గుర్తుచేసుకుంటూ ఒకప్పుడు ‘ఇడ్లీ అంటే బాబాయ్ హోటలే’ కానీ ఇప్పుడు విజయవాడలో అటువంటి ఇడ్లీ పాకలు కొన్ని వెలిసి చక్కటి రుచులను అందిస్తున్నాయి అనుకుంటుండగా ఫోన్ మోగింది.’

‘చూస్తే మా బావగారు జ్వాలా నరసింహా రావు గారు. ఫోన్ ఎత్తగానే “పరేష్ ! నీకు బెజవాడ కొట్టిన పిండి కదా. చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. విజయవాడలో ఎల్విఎస్ఆర్ శర్మ (లింగాల వెంకట సత్యనారాయణ శర్మ), లేదా లింగాల శర్మ అని నా చిన్ననాటి స్నేహితుడు ఉండేవాడు. అయితే అతను ఇప్పుడు లేడు. వీలుంటే అతని కొడుకులు ఎవరన్నా విజయవాడలో ఉన్నారేమో కనుక్కుని చెప్పగలవా?” అనడిగారు. బెజవాడ గురించి అనగానే నాలో క్యూరియాసిటి ఎక్కువగా ఉంటుంది.’

‘ఎందుకంటే బెజవాడ నాకు బోలెడుమంది ఆత్మీయులను ఇచ్చింది. అయితే ఈ లింగాల శర్మ గారెవరో నాక్కూడా తెలీదు. మరి ఆయన వారసులను ఎక్కడని వెతకాలి? అని ఆలోచిస్తుండగానే ఆయనే ఓ క్లూ ఇచ్చారు. “నా స్నేహితుడు విజయవాడ సత్యనారాయణపురంలో ఇంట్లోనే ఇడ్లీలు అమ్మేవాడు” అన్నారు. ఈ క్లూ చాలు నాకు.  విజయవాడలో ఉంటున్న నా బాల్య మిత్రుడు రమణ శర్మకు ఫోన్ చేసి విషయం చెప్పా. "ఏంటీ నువ్వు లింగాల శర్మ గారి గురించి వెతుకుతున్నావా?” అని నవ్వాడు. అవునని చెప్పా.’

"నువ్వు వెతుకుతున్న  శర్మ గారు 1982లో కేదారేశ్వర పేటలోని మా ఇంట్లో 312 రూపాయల అద్దెకు దిగారు. చాలా మంచి వ్యక్తి. ఇంట్లోనే ముందుగదిలో ఇడ్లీలు వేసి అమ్మేవాడు. ఆయన ఇడ్లీలకు పేరు రావడంతో బిజినెస్ పెరిగింది. అయితే ఆయన చనిపోయిన తర్వాత ఆయన కొడుకు అంజిబాబు ఆ టిఫిన్ సెంటర్ ను రన్ చేస్తున్నాడు. ఎప్పుడూ జనంతో కిటకిటలాడుతూ ఉంటుంది. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విజయవాడ వస్తే అంజిబాబు ఇడ్లీలు పార్సిల్ వెళతాయని. సినీ నటుడు తనికెళ్ళ భరణి తో సహా చాలామంది సినీ సెలబ్రిటీస్ అంజిబాబు కస్టమర్లే” అని చెప్పాడు.

 ‘వెతకబోయిన తీగ కాలికి దొరికింది. వెంటనే అతని నెంబర్ తీసుకుని మా బావగారికి పంపించా. (ఇక్కడ మా బావగారు జ్వాలా నరసింహ రావు గారి గురించి రెండు మాటలు చెప్పాలని పది మాటలు చెప్పాడు. అవిప్పుడు అప్రస్తుతం). ఎప్పుడో కలిసి చదువుకున్న విజయవాడకు చెందిన లింగాల శర్మ గారిని గుర్తుపెట్టుకుని మరీ ఆయన కుటుంబ సభ్యుల ఆచూకీ కోసం మా జ్వాలా బావగారు పడిన తపన నిజమైన స్నేహానికి నిర్వచనం. ఏదైతేనేమి శర్మగారి ఇడ్లీలు ఆయన చిన్ననాటి స్నేహితునికి క్లూ ఇచ్చి ఆయన కొడుకుతో ముచ్చటించే అవకాశం లభించింది!’ చాలా గొప్పగా రాశావు పరేష్!

సత్యనారాయణపురంలోని అంజి ‘వెన్న లేదా నేతి ఇడ్లీ’ ప్రత్యేక రుచులతో ప్రసిద్ధి చెందినది. ఇంటి నుండి నడిపే ఇడ్లీ హోటల్ విజయవాడకు వచ్చే వారందరూ సందర్శించాల్సిన స్థలం. ‘అంజిబాబు ఇడ్లీహోటల్’ రుచులకు చిరునామా. ఆహారానికి మాత్రమే కాకుండా, ఆత్మీయతకు, ఆదరణకు, విశ్వాసానికి ప్రతీక అని  చెప్పుకుంటారు. హోటల్‌ నడుపుతున్న అంజిబాబు నా బాల్యస్నేహితుడు స్వర్గీయ  ఎల్విఎస్ఆర్ శర్మ పెద్ద కుమారుడు. తండ్రి సంప్రదాయాన్ని, శ్రద్ధను, పట్టుదలతో కూడిన జీవనవేదాన్ని, స్వయంకృషి, వినయం, పరస్పర గౌరవంతో కూడిన సదాచారాన్ని అంజిబాబు పుణికిపుచ్చుకున్నాడు. శర్మ నిబద్ధత, నైతిక విలువలు అంజిబాబులో ప్రతిఫలిస్తున్నాయి. హోటల్ చుట్టూ విశ్వాసమయమైన కస్టమర్ల వలయం ఏర్పడింది.

బాల్యస్నేహం గుర్తుంచుకోగల శక్తి భగవంతుడు ఇవ్వడం నాపూర్వజన్మ పుణ్యఫలం. స్నేహం కాలాన్ని దాటి అన్వేషణగా మారినప్పుడు, అది ఒక జీవిత తాత్వికాన్వేషణకే మారుతుంది. ఎల్విఎస్ఆర్ శర్మ మౌనంగా బోధించిన జీవనవిద్యకు నిదర్శనం జీవితంలో పైకెదిగిన వాడి ఇద్దరు కుమారులే. వాడు నాకు రాసిన ఉత్తరం ఓ నిశ్శబ్ద జీవచరిత్ర. ఒక సజీవ ఆత్మకథ. శర్మ పిల్లలు తండ్రి సంప్రదాయాన్ని, సంస్కారాన్ని నిలిపారు. అది నిజమైన జీవనవిజయం. ఎల్విఎస్ఆర్ శర్మ జీవనయానం, అనేకానేక అంశాలమీద అనర్ఘళమైన పట్టు, రాజకీయ అంశాల మీద అవగాహన, తదితర సద్గుణాల ప్రభావం నామీద బాగా పడింది. వాడికి నివాళి.

 

POLITICAL LEADERSHIP IS ALL ABOUT RESPECTING AND HONORING CONSCIENTIOUS WELL-WISHERS : Vanam Jwala Narasimha Rao

 POLITICAL LEADERSHIP IS ALL ABOUT RESPECTING AND

HONORING CONSCIENTIOUS WELL-WISHERS

(WISDOM OF THE HEART MATTERS, NOT COLOR OF THE SHIRT)

Vanam Jwala Narasimha Rao

Hans India (20-07-2025)

{Leaders, who are consistently available, accessible, and possess the sacred capacity to listen to conscientious well-wishers, have become a rare breed. A real skill and challenge for a sincere leader is discipline and accountability, especially when party’s broad agenda is disseminated to people. It must be ‘Specific, Measurable, Attainable, Realistic, and Time-bound (SMART).’ Evading execution after gaining power, or avoiding a responsive role in opposition, is betrayal of leadership. A true leader need not always head the government, but must be capable of leading the shadow government, as in the case of United Kingdom} -Editor Synoptic Note

Leadership is an enduring engagement, not an entitlement; continuous dialogue with people, place, and purpose. Indian Democracy has long lasted, largely due to the collective consciousness and moral seriousness of previous and our generations. Overtime, political leadership has become fascinated in transactional politics, drowned in noise, and distanced from true distinction. Political approach of large number of leaders is, gaining power and influence for indiscriminate personal gain or specific benefits. This decline of passion and spirit that once fueled ideology-driven movements, stems from erosion of values and weakening sense of accountability.

Leaders who are consistently available, genuinely accessible, and possess the sacred capacity to sincerely listen to conscientious well-wishers have become a rare breed. Most political leaders, in power or not, surround themselves with YES-MEN and isolate the wise, which is grave, even suicidal, mistake. The soul of political leadership committed to democratic spirit, is found in the ability to touch minds, move emotions, and change lives. Vision, dedication, and relentless assurance to people-first approach is leadership.

Leaders define, design, and deliver meaningful thought course. Leadership in its highest form is not flamboyant, but it is quiet, persistent, and purposeful. It stands tall when storms hit, but knows when to bow in humility. It is not charisma but character, not slogans but service, not optics but outcomes. Leaders walk that extra mile to consult, to confront facts, and to transcend personal agendas. As observed by the Supreme Court on July 14, 2025, that the ‘Freedom of Expression’ was being ‘Abused,’ most leaders commit ‘Extreme Suicidal Mistake’ by indiscriminately deploying ‘Social Media Warriors’ who forget that it is not color of the shirt but wisdom of the heart that matters, before abusing and snubbing meaningful critics, often with filthy language.

A real skill and challenge for a sincere leader is discipline and accountability, especially when party’s broad agenda is disseminated to people. It must be ‘Specific, Measurable, Attainable, Realistic, and Time-bound (SMART).’ Evading execution after gaining power, or avoiding a responsive role in opposition, is betrayal of leadership. A true leader need not always head the government, but must be capable of leading the shadow government, as in the case of United Kingdom. Leadership is not about impressing but about groundwork, and certainly not about hiding when circumstances demand. Leader should stand firm, speak reality, and act with transparency.

Overtime, political decision-making is no more collective intellectual process or shaped by inner-party democracy and shared wisdom. Diktat of single person is consensus these days. Dissent is branded as scrupulous disloyalty. Civility has been replaced with contempt, patience with provocation, and humility with hubris, a trait of ‘Overconfident Pride combined with Arrogance.’ The moral compass of leadership is without needle. Only when Leaders are ‘Available, Accessible, and open to Consultation’ then only they make huge difference. Here it is apt to quote TG State BJP President Naraparaju Ramchander Rao, who recently emphasized that, ‘Intellectuals Possess Moral and Analytical Clarity needed to inform the Public, Raise Awareness, and Counter Misinformation.’

Great leader believes that, failure is only a suspended success. Rudyard Kipling in his ‘IF Poem’ wrote that, ‘Triumph and Disaster the Two Impostors’ represent ‘Success and Failure’ and both can be deceptive. Though Alexandre Dumas said, ‘Nothing succeeds like success’ the visionary leader embraces failure as the crucible of growth. Leadership is not about convenience, but about consequence, conscience, and character. Retreating to ‘Shell the tortoise way’ to protect from possible intimidations, wrongfully advised by deceptive YES-MEN who surround the leader is ‘More a Damage than Gain.’

Fostering structural political decentralization, enabling access to field-level leaders, listening to intellectuals and non-political voices in party building, and to be receptive to advise is the real characteristic of the leader. A political culture that respects elders, values its thinkers, and uplifts its people is needed. Let us not ask ‘Who will lead us?’ and start demanding for ‘the kind of leadership we deserve, and deserve urgently.’

Transformative frameworks and critical qualities that define true leadership, set forth by Jim Collins in his book ‘Good to Great’ are worth absorbing by any leader. Collins distinguishes between Competent Managers and truly Great Leaders, whom he calls as ‘Level Five Leadership’ and puts as, rare yet revolutionary. Jim Collins articulates in his book that ‘Level Five Leadership’ represents a paradox mix of personal humility and professional will, one that shuns ego and seeks established greatness. They are not attention seekers. They do not crave the spotlight. Their ambition is not for personal recognition but for organizational (Political) excellence.

Such Level Five Leaders embrace brutal facts, build teams based on ‘first who, then what,’ and drive transformation through discipline and vision. With such qualities they channel ambition into legacy. Such Leaders are desperately required. The journey from Good to Great, does not occur overnight. It demands deliberate nurturing of strategic depth, consistent values, adaptability, and the courage to confront uncomfortable truths. It calls for visionary (Political) leadership, cultivating a culture of discipline, and ‘Not Blind Loyalty’ of YES-MEN to drive outcomes.

Further, the crucial distinction between Peter Drucker terms ‘Efficiency and Effectiveness’ both of which are important for success, must be clearly understood, if one wants to be Level Five Leader. Efficiency is mechanical and Effectiveness is moral. Efficiency is ‘Doing Things Right’ or maximizing output with minimal input. Effectiveness is ‘Doing the Right Things’ or achieving the desired result, regardless of the resources used or the time it takes. Both are crucial for success, but understanding the difference depends on knowledge and skill of the Leader.

An Effective Leader with vision, humility, passion, and people-driven clarity, will be capable of inspiring change. As my illustrious Political Science Professor Late VS Murthy told me, ‘Task accomplishment and Target Fulfilment’ is more important to them, than conforming to orthodox rules. Only such a leader treats every individual with respect. Their words are not theatrics but repositories of evidence, reasoning, literary finesse, and multilingual richness, coupled with subtle humor. When they communicate it will be backed with intensive memory power. They are highly capable of multitasking, impromptu responses, and switch-tasking with strategic clarity.

Equally important for a true leader is the attitude of ‘Treating Politics as a Task but not a Game’ as often Telangana first CM KCR puts it. True leaders are also to be stewards of public trust, and should know when to be firm, to be flexible, and to say, ‘Thus far, and no further’ but unambiguously with a high degree of rationale. Fearlessly walking an extra mile, if that path ensures justice or secures progress, it is leadership, but not shying away from criticism or confrontation. Strategic political acumen enable Leaders to convert vulnerabilities into strengths.

Leaders must embody statesmanship, with the rare ability to envision the long term and first earn trust in themselves, through triumphs and trials alike. Political leadership should serve as a living lesson, a daily example, and a moral compass for generations, rooted in principles, driven by people, and dedicated to posterity. More than a crowd of ‘Casual Leaders’ India needs better ones, those who do not chase applause but leave behind enduring institutions, transformative ideas, and unshakable integrity.

Era of modest, principled political leaders who lived simply and thought greatly is bygone memory. Such leaders became Chief Ministers, Speakers, Presidents, and Prime Ministers etc. not because they sought power, but because power trusted them. Degeneration in politics is typical phenomenon, a feeling of deep sadness, shock, and worry. Ultimately, political leadership is not about rising to power, but about raising the people; not about winning elections, but about winning hearts even after losing. It is about the courage to be right, the humbleness to listen and the wisdom to act.

Saturday, July 19, 2025

వ్యక్తిత్వ వికాసం, జీవన పాఠాలు, స్వీయానుభవాల పరిపక్వత-11 ..... న్యూసైన్స్ కళాశాల బీఎస్సీ క్లాసులో , క్రికెట్ మైదానంలో ఆహ్లాదానుభవాలు : వనం జ్వాలా నరసింహారావు

 వ్యక్తిత్వ వికాసం, జీవన పాఠాలు, స్వీయానుభవాల పరిపక్వత-11

న్యూసైన్స్ కళాశాల బీఎస్సీ క్లాసులో , క్రికెట్ మైదానంలో ఆహ్లాదానుభవాలు

వనం జ్వాలా నరసింహారావు

న్యూ సైన్స్ కాలేజీలో బీ ఎస్సీ (ఎంపీసీ) క్లాస్‍లో 150 మందికి పైగా నా సహాధ్యాయులుండే వారు. సందడిగా, సరదాగా, గలగలా పారే సెలయేరులా, అప్పట్లోని మా పాలేరు ఉపనదిలాగా వుండేది మా క్లాస్. బయటేమో నిత్యం ఒక నిర్మాణం జరుగుతుండేది మా కాలేజీ ఆవరణలో. కాలేజీకి వున్న మంచి పేరువల్ల, విద్యార్థుల తాకిడి బాగా వుండేది. అంతమందిని చేర్చుకోవాలంటే, అధికసంఖ్యలో క్లాస్ రూమ్‌లు కావాలి. అందుకే, ఎప్పుడూ, భవనాన్ని పెంచడం జరుగుతుండేది. ఆవరణ తక్కువైనందున విస్తరణ ఒక్కో అంతస్తు (అపార్ట్మెంట్లలాగా) జరిగేది.

ఒక విద్యార్థి, పేరు గుర్తుకు రావడం లేదిప్పుడు, (బహుశా మునీర్ కావచ్చు) తన దగ్గర ఎప్పుడూ, ఒక ‘టిక్-టిక్’ ధ్వని చేసే టాయ్ వుంచుకునే వాడు. ఆ రోజుల్లోనే ‘దేవాంతకుడు’ అనే సినిమాలో హీరో అలాంటి దాన్ని ఉపయోగించేవాడు. ఎవరూ చూడకుండా దాంతో ధ్వని చేయడం అతడికో హాబీ. ‘సీటింగ్ అరేంజ్ మెంట్’ అని రాసి వుంటే, అందులోంచి ‘ఎస్’ అక్షరం తొలగించి, దాన్ని ‘ఈటింగ్’ అని చేసేవాడు. మరి కొందరి క్లాస్ మేట్స్ పేర్లు కూడా గుర్తుకొస్తున్నాయి.

ఖమ్మంలో నాతో పాటు పియుసి చదువుకున్న బాలమౌళి (ఇప్పుడో పేరున్న ఛార్టెడ్ అకౌంటెంట్) న్యూసైన్స్ కాలేజీలో కూడా క్లాస్ మేట్ అయ్యాడు. రాంప్రసాద్ (ఆయన భార్య గీత, ఆ తరువాతి కాలంలో నాకు స్నేహితురాలైంది) మరొక క్లాస్ మేట్. ఒక ప్రయివేట్ కంపెనీలో పని చేసి రిటైరై బెంగుళూరులో వున్నప్పుడు మరణించాడు. అలానే, రంగ రామానుజం, కుల్ కర్ణి (అతివాద-తీవ్ర వాద భావాల విద్యార్థి, మేథావి), జ్యోతి ప్రసాద్, ఎర్రంరాజు, మల్లికార్జున్, బాబ్జి, సుబ్బారావు (సీనియర్ సైంటిఫిక్ అధికారిగా పదవీ విరమణ చేశాడు), విఎస్పి శాస్త్రి, మల్లాడి వెంకట సుబ్బయ్య, కపాడియా, త్యాగరాజన్, టిఆర్ శ్రీనివాసన్ (ప్రస్తుతం షికాగోలో స్థిరపడ్డాడు), ప్రేంచంద్ (అమెరికాలో స్థిరపడ్డాడు), విద్యాసాగర్, తదితరులు కూడా నాకు క్లాస్ మేట్సే.

నిజాం కాలేజీలో డిగ్రీ రెండో సంవత్సరం పూర్తి చేసిన వల్లూరి శ్రీ రాం అనే విద్యార్ధిని, ప్రిన్సిపాల్ సుదర్శన్ నచ్చచెప్పి ఫైనల్ ఇయర్ లో మా క్లాస్ లో చేర్పించాడు. అతడికి సెకండ్ ఇయర్ లాంగ్వేజెస్ లో యూనివర్సిటీ ఫస్ట్ రావడంతో, ఫైనల్లో కూడ రాంక్ వచ్చే అవకాశాలున్నాయని భావించిన సుదర్శన్ గారు అలా చేశారు. ఆయన గెస్ నిజమైంది. డిగ్రీలో అతడికే యూనివర్సిటీ ఫస్ట్ వచ్చింది. క్రెడిట్ న్యూ సైన్స్ కాలేజీకి దక్కింది.

శ్రీ రాం పక్క నంబరైన నేను కనీసం పాసు కూడా కాలేదు! అసలు పరీక్షలే పూర్తిగా రాయలేదు! ఇంటర్ నెట్‌లో చూసి, శ్రీ రాం అమెరికాలో పని చేస్తున్నట్లు తెలుసుకుని, చొరవతీసుకుని కాంటాక్ట్ చేశాను. తన కూతురు వివాహానికి ఒక దశాబ్దంన్నర క్రితం హైదరాబాద్ వచ్చినప్పుడు కలిశాం. మా కాలేజీ అనుభవాలను పంచుకున్నాం. అలాగే కువైట్లో పనిచేస్తున్న కపాడియా వచ్చినప్పుడు విద్యాసాగర్ చొరవతో మేమంతా హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో కలుసుకున్నాం. దరిమిలా విద్యాసాగర్ (నాకు బంధువు కూడా) చనిపోయాడు.   

లెక్చరర్ల విషయానికొస్తే, బహుశా, అంత నైపుణ్యం కల అధ్యాపకులు, మరే కాలేజీలోను వుండరంటే అతిశయోక్తి కాదేమో! తెలుగు బోధించడానికి మంజు శ్రీ (డాక్టర్ అక్కిరాజు రమాపతి రావు), అరిపిరాల విశ్వం, వుండేవారు. మాకు తెలుగు పాఠ్యపుస్తకంగా ‘ఆంధ్ర మహాభారతోపన్యాసాలు,’ నాన్-డిటేల్‍గా ‘పురుషోత్తముడు,’ నాటకంగా ‘హాలికుడు’ వుండేవి. ఆంధ్ర మహాభారతోపన్యాసాలలో, ధర్మరాజు రాజసూయయాగం చేస్తున్న సందర్భంలో ఆయనను ఆక్షేపిస్తూ శిశుపాలుడు అన్న మాటలు ‘అవనీ నాధులనేకు లుండఁగ విశిష్టారాధ్యు లార్యుల్ మహీదివిజుల్ పూజ్యులు పల్వురుండఁగ ధరిత్రీనాథ! గాంగేయుదుర్వ్యవసాయంబునఁ గృష్ణు గష్టచరితున్ వార్ష్ణేయు బూజించి నీ యవివేకం బెఱిఁగించితిందఱకు దాశార్హుండు పూజార్హుఁడే’ గుర్తున్నాయి.

పద్యభాగం పుస్తకంపేరు గుర్తుకు రావడంలేదు కాని, ‘గంగావతరణం’ పాఠం మాత్రం జ్ఞాపకం వున్నది. అందులోని ఒక పద్యం, ‘ఆకాశంబున నుండి శంభుని శిరం, బందుండి శీతాద్రి, సుశ్లోకంబైన హిమాద్రినుండి భువి, భూలోకమునందుండి యస్తోకాంభోధి, పయోధినుండి పవనాంధోలోకమున్ చేరె గంగా కూలంకష, పెక్కుభంగులు వివేక భ్రష్ట సంపాతముల్’, ఇలా కొంచెం, కొంచెం గుర్తుకొస్తోంది. అరిపిరాల విశ్వం గారి తమ్ముడు రామ్మోహన రావు కూడా నా క్లాస్ మేట్.

ఇంగ్లీష్ లెక్చరర్లుగా షమీం మేడం, వివి చారి, వై ఆర్ అయ్యంగార్, కుమారి శ్యామల గారుండేవారు. వాచకంగా ఇఎఫ్ డాడ్ సంపాదకీయంలోని వ్యాసాల సంకలనం వుండేది. ఎజి గార్డినర్ రాసిన వ్యాసం ఒకటుంది. ఇఎం ఫార్స్టర్ రాసిన ‘పాసేజ్ టు ఇండియా’ నాన్-డిటేల్ గా వుండేది. ఫార్స్టర్ ఆ పుస్తకాన్ని 1924 లో భారత దేశంలో ఆంగ్లేయుల పాలన, 1920 నాటి స్వాతంత్ర్య పోరాటం నేపధ్యంలో రాశారు. ప్రపంచంలోని వంద అత్యుత్తమైన ఇంగ్లీష్ లిటరేచర్ పుస్తకాలలో ఒకటిగా పాసేజ్ టు ఇండియాను ‘మాడరన్ లైబ్రరీ’ ఎంపిక చేసింది. 1923-2005 మధ్య కాలంలో వచ్చిన అత్యుత్తమైన వంద ఇంగ్లీష్ నవలలో ఒకటిగా ఈ పుస్తకాన్ని ‘టైం మాగజైన్’ ఎంపిక చేసింది. నవల మొత్తం కేవలం నాలుగు పాత్రల చుట్టూ తిరుగుతుంది. డాక్టర్ అజీజ్, ఆయన బ్రిటీష్ స్నేహితుడు సిరిల్ ఫీల్డింగ్, శ్రీమతి మూర్, కుమారి అడెలా క్వెస్టెడ్.

ఇంగ్లీష్ పోయెట్రీలో జార్జ్ హెర్బర్ట్ రాసిన Virtue (సద్గుణం, సత్ ప్రవర్తన) లో చక్కటి నీతి వుంది. ప్రపంచం మొత్తం కాలగర్భంలో కలిసి పోయినా మనిషి సత్ ప్రవర్తన, సద్గుణం అజరామరంగా వుంటుందని దాని భావన (Only a sweet and virtuous soul, Like seasoned timber, never gives; But though the whole world turn to coal. Then chiefly lives). మరో పోయెం 1608-1674 మధ్య కాలంలో జీవించిన ‘జాన్ మిల్టన్’ రాసిన ‘పారడైజ్ లాస్ట్.’ ఆయనే రాసిన మరో పోయెం ‘ఆన్ హిజ్ బ్లయిండ్ నెస్.’ ఇంకో పోయెం ‘విలియం వర్డ్స్‌ వర్త్’ రాసిన ‘సాలిటరీ రీపర్’ (Alone she cuts and binds the grain, And sings a melancholy strain..). జనరల్ ఎడ్యుకేషన్ సబ్జెక్ట్ ను నాందేడ్కర్, సుబ్రహ్మణ్యం చెప్పేవారు. చాలా ఇంటరెస్టింగ్ గా వుండేదా క్లాస్.

ఆప్షనల్ సబ్జెక్టులైన లెక్కలు, భౌతిక, రసాయన శాస్త్రాలు చెప్పే లెక్చరర్లు ఆయా విషయాలను అత్యంత ఆసక్తికరంగా బోధించే వారు. లెక్కల సబ్జెక్టులో ఫైనల్ ఇయర్ పరీక్షల్లో బీజగణితం, రేఖాగణితం, త్రికోణమితి (మూడు) పేపర్లు రాయాలి. రేఖాగణితం పుస్తకం ‘మాణిక్య వాచికం పిళ్లే’ రాసినదాన్ని ఉపయోగించే వాళ్లం. బీజగణితాన్ని షఫీ ఉల్ హక్, రేఖాగణితాన్ని భాస్కర రావు, త్రికోణమితిని డాక్టర్ కుప్పుస్వామి బోధించేవారు. మొదటినుంచి లెక్కల సబ్జెక్ట్ అంటే నాకు చాలా ఇష్టం. పరీక్ష రాసిన ప్రతి సారీ ఆ ఒక్క సబ్జెక్ట్ మంచి మార్కులతో పాసయ్యేవాడిని. మిగతావి (భౌతిక, రసాయన శాస్త్రాలు) రాయడానికే ధైర్యం లేకపోయేది. భౌతిక శాస్త్రాన్ని హరి లక్ష్మీపతి, ప్రభాకర్ బోధించేవారు. భౌతిక శాస్త్రంలో మాడరన్ ఫిజిక్స్ అనే నాలుగో పేపర్ కూడా వుండేది.

డిమాన్ స్ట్రేటర్‌గా పివివి ఎస్ మూర్తి మాతో ప్రయోగశాలలో ప్రాక్టికల్స్ చేయించేవారు. వెలాసిటీ ఆఫ్ సౌండ్, వర్నియర్ కాలిపర్స్, స్క్రూగేజ్, ఫిజికల్ బాలెన్స్ లతో చేసిన ప్రయోగాలింకా గుర్తున్నాయి. రసాయన శాస్త్రం ప్రయోగాలను రఘురాంగారు చేయించేవారు. వాల్యూమెట్రిక్ అనాలసిస్, పిప్పెట్, బ్యూరెట్ట్ ఉపయోగించడం, కాపర్ సల్ఫేట్ స్ఫటికాలు తయారు చేయడం సరదాగా వుండేది. రసాయన శాస్త్రం థియరీలో ఆర్గానిక్, ఇన్-ఆర్గానిక్, ఫిజికల్ అనే ఆ మూడింటిని ముగ్గురు లెక్చరర్లు బోధించేవారు.

ఆర్గానిక్ సబ్జెక్టు చెప్పే వై సూర్యనారాయణ మూర్తి బోర్డు మీద వేసిన బెంజిన్ రింగ్ ఇప్పటికీ కళ్లలో మెదులుతుంది. ఇన్-ఆర్గానిక్ సబ్జెక్ట్ ప్రిన్సిపాల్ సుదర్శన్ గారు చెప్పేవారు. ఫిజికల్ కెమిస్ట్రీని కూడా వై సూర్యనారాయణ మూర్తి గారు చెప్పినట్లు గుర్తు. సర్కార్ అండ్ రక్షిత్ రాసిన ఆర్గానిక్ కెమిస్ట్రీ పుస్తకాన్ని, బాల్ అండ్ తులి రాసిన ఇన్-ఆర్గానిక్ కెమిస్ట్రీ పుస్తకాన్ని చదివే వాళ్లం. లైబ్రరీకి అడపదడప పోయే వాళ్లం. లైబ్రేరియన్‍గా పుల్లయ్య పని చేసేవాడు. తరువాత రోజుల్లో (1973-1974) ఉస్మానియా యూనివర్సిటీలో నేను లైబ్రరీ సైన్స్ లో డిగ్రీ చేసేటప్పుడు, అతడు నాతోపాటు చదివాడు. 80 సంవత్సరాల వయసుదాటిన పుల్లయ్య, స్వయం కృషితో అత్యున్నత స్థాయికి చేరుకున్న పుల్లయ్య, ఇప్పటికీ చాలాచాలా యాక్టివ్ గా, అధ్యాపకుల సంఘానికి జాతీయ స్థాయి నాయకుడిగా వున్నాడు. క్రమం తప్పకుండా మేమిద్దరం కనెక్ట్ అవుతాం.   

కాలేజీ చదువుతో పాటు క్రికెట్ ఆట ప్రాక్టీసుకు నిత్యం పోవడం కూడా అలవాటు చేసుకున్నాను. బర్కత్ పూరా సమీపంలోని యువతీ మండలి మైదానంలో (ఇప్పుడు మైదానం కనిపించడంలేదు) క్రికెట్ ప్రాక్టీసుకు వెళ్లేవాడిని. ‘జాలీ రోవర్స్ క్రికెట్ క్లబ్’ ఆ రోజుల్లో హైదరాబాద్ ‘బి-లీగ్’ మాచ్‍లు ఆడుతుండేది. నేను ఆ క్లబ్ పక్షాన ఆడేవాడిని. అంతగా ఆటలో రాణించక పోయినా ప్రాక్టీసు మానక పోయేవాడిని. నేను ప్రాక్టీసు చేస్తున్న రోజుల్లో అదేమైదానంలో ఆడిన పెద్ద క్రికెట్ క్రీడాకారుల్లో అబ్దుల్ హాయ్, సాయినాథ్, ప్లహ్లాద్, పవన్ వున్నారు. దరిమిలా వాళ్లంతా రంజీ ట్రోఫీ స్థాయి వరకు ఎదిగారు. అప్పుడప్పుడూ వచ్చి, ఆడిపోతుండే వారిలో అబ్బాస్ అలీ బేగ్, కలీముల్ హక్, బహుశా ఆవీద్ అలీ కూడా వున్నారు. ఇటీవలే వీరిలో కొందరిని కలిశాను.

2015 అక్టోబర్ 10న, 1964-66 కాలంలో నాకు నేరుగా లేదా పరోక్షంగా పరిచయం ఉన్న కొంతమంది క్రికెటర్లను కలవాలనే ఉద్దేశంతో మేము ఫతే మైదాన్ క్లబ్‌లో భోజనంతో కూడిన చిన్న సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఆ సమావేశానికి స్పీడ్ బౌలర్ గోవింద్‌రాజ్ కూడా హాజరయ్యారు. ఆయనకు ఆ కాలంలో ఎంఎల్ జైసింహా, అబ్బాస్ అలీ బేగ్, కృష్ణమూర్తి, జయంతిలాల్ లతోపాటు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టులో చోటు లభించినా, దురదృష్టవశాత్తు తుది పదకొండు మంది ఆటగాళ్లలో స్థానం దక్కలేదు. అప్పటి ఆ విషయాలను, కారణాలను ఆసక్తికరంగా వివరించాడు గోవిందరాజ్.

మాజీ టెస్ట్ క్రికెటర్ ఎంవీ నరసింహారావు, నౌషిర్ మెహతా, అబ్దుల్ హై, మహేశ్వర్ సింగ్, ప్రహ్లాద్, కె సాయిబాబా, సర్వేష్ కుమార్ కూడా హాజరయ్యారు. జ్యోతిప్రసాద్, సాయినాథ్, విజయ్ పాల్, మహేందర్ కుమార్, అబ్దుల్ అజీమ్ లాంటివారు రావాలని భావించామని, కానీ వారి అప్పటి ఇతరపనుల కారణాన హాజరుకాలేకపోయామని ఫో చేసి చెప్పారు. ఇంతమంది క్రికెట్ అభిమానులను ఒకచోట చేర్చిన ఘనత సీనియర్ జర్నలిస్టు ఎంఎస్ శంకర్‌కు చెందుతుంది. ఆయనే మంచి క్రికెట్ అభిమాని, ఆటగాడు కూడా.

ఈ సమావేశంలో పాల్గొన్నవారు తమ చక్కని క్రికెట్ అనుభవాలను పంచుకున్నారు. అబ్దుల్ హై, మహేశ్వర్ సింగ్, సాయిబాబా, సర్వేష్ కుమార్ రాష్ట్ర జట్టుకు ఆడే స్థాయికి చేరడం పట్ల సంతృప్తిగా కనిపించారు. యాదృచ్ఛికంగా, ప్రహ్లాద్ అనే క్రికెటర్ నా సమకాలీనుడే. నేను 1964–66 మధ్య కాలంలో న్యూ సైన్స్ కాలేజ్‌లో బీఎస్సీ చదువుతుండగా, ఆయన సైఫాబాద్ సైన్స్ కాలేజ్‌లో డిగ్రీ చదివాడు. మేమిద్దరం కలసి ఆంధ్ర యువతి మండలి మైదానంలో క్రికెట్ ప్రాక్టీస్ కూడా చేశాం. దాదాపు నలభై ఏళ్ల తర్వాత ప్రహ్లాద్ ను కలవడం ఆనందాన్నిచ్చింది. రెండు గంటలన్నరలపాటు జరిగిన ఈ సమ్మేళనం మాకు ఎంతో ఆనందాన్నిచ్చింది.

నేను హైదరాబాద్‌లో ఆడడంతో, శెలవులకు ఖమ్మం వెళ్లినప్పుడు అదో రకమైన గౌరవం లభించేది. మామిళ్లగూడెం క్రికెట్ క్లబ్ పక్షాన టోర్నమెంటులకు వెళ్లే జట్టులో నేనుండే వాడిని. వనం రంగారావు, నర్సింగరావు, శేషగిరి, మూర్తి, దిలీప్, శంకర్, దివాకర్, ప్లహ్లాద్, కళాధర్, రాధాకృష్ణలతో ఆడాను. మామిళ్ళగూడెం క్రికెట్ క్లబ్ కు, ఖమ్మం కాలేజీ క్రికెట్ టీంకు ఆడిన కొందరం హైదరాబాద్ బోట్స్ క్లబ్ లో 9 సంవత్సరాల క్రితం కలిశాం. వనం నర్సింగ్ రావు, విజయ రామ్ శర్మ, దివాకర్, భరద్వాజ్, నాగభూషణం, వనం రంగారావులతో పాటు అప్పటి రాష్ట్ర కాబినెట్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ఆ భోజన సమావేశానికి హాజరయ్యారు.

డిగ్రీ ఫైనల్ ఇయర్ పరీక్షలు మార్చ్-ఏప్రిల్ 1966 లో జరిగాయి. లెక్కల పేపర్ రాసిన తరువాత మంచి మార్కులు రావని భావించి, మిగతా పేపర్‌లకు కేవలం హాజరవడం (పరీక్ష పేపర్లు తెచ్చుకోవడానికి) తప్ప రాయలేదు. ఫలితాలు ఊహించినట్లే ఫెయిలయ్యాను. లెక్కల సబ్జెక్టులో పాసయ్యాను. సప్లిమెంటరీ పరీక్షలు రాయలేదు. చిక్కడపల్లిలో ఇల్లు అద్దెకు తీసుకుని రమణ, నేను అజీజ్ అనే స్నేహితుడు వుండేవాళ్లం. నేను ఎక్కువగా మావూళ్లోనే వుంటూ, గ్రామ రాజకీయాలలో యాక్టివ్ గా వుండేవాడిని. ఆ విషయాలు మున్ముందు.  

ఇక్కడ అన్నింటికన్నా ఎల్విఎస్ఆర్ శర్మ అనే నా బాల్యస్నేహితుడైన ఒక ముఖ్యమైన వ్యక్తి విషయం తెలియచేయాలి. వాడు నాకు, భండారు శ్రీనివాసరావుకు హెచ్ ఎస్ సి వరకు, ఆ తరువాత నాకు పియుసిలో క్లాస్ మేట్. తల్లీ, తండ్రి చిన్నతనంలోనే చనిపోడంతో, ‘నా’ అనేవారెవరూ లేని స్నేహితుడు. ఖమ్మంలో చిన్నప్పుడు వరసకు మేనత్తగారింట్లో వుండి చదువుకునేవాడు. మామయ్యగారితో తనను వేదిస్తున్నందుకు గొడవపడి, మొదట్లో కొంతకాలం తాత్కాలికంగా హెచ్ ఎస్ సిలో వున్నప్పుడు, ఆ తరువాత పియుసిలో చేరాక శాశ్వతంగా వాళ్లింటి నుంచి బయటకొచ్చాడు. వారాలు చేసుకుని ఖమ్మంలో పియుసి పూర్తి చేశాడు. బహుశా పాసవ్వలేదనుకుంటా. ఆ తరువాత విజయవాడకు చేరాడు. కొన్నాళ్లు మద్రాస్‌లో వుండేవాడు. పిన్నవయసులోనే ఇంగ్లీష్, ఉర్దూ, తెలుగు, తమిళం అనర్గళంగా మాట్లాడేవాడు.

విజయవాడ, మద్రాస్ లలో చేసిన ఉద్యోగాలేవీ నచ్చలేదు. నేను హైదరాబాద్‌లో చిక్కడపల్లిలోని ఇంట్లో రమణ, రంగారావులతో వుంటున్నప్పుడు, తనకేదన్నా ఉద్యోగం ఇప్పించమని, హైదరాబాద్ వస్తానని ఉత్తరం రాశాడు. సరే, రమ్మన్నాను. తాజ్ మహల్ హోటల్లో లెక్కల పద్దురాసే ఉద్యోగాన్ని మిత్రుడు కామత్ ఇప్పించాడు. అది వాడికి నచ్చలేదు. మేం తెప్పించుకునే కారేజీ భోజనంలోనే వాడు కూడా సర్దుకుపోయేవాడు. పెద్దగా అవసరాలు వాడికేమీ లేనందున చేతిలో పైకం అవసరం అంతగా లేకుండేది. ఏదన్నా వుంటే, నిర్మొహమాటంగా అడిగి తీసుకునేవాడు. నాదగ్గర లేకపోతే, అడిగినప్పుడు ఇవ్వలేకపోతే నిష్టూరాలు ఆడే వ్యక్తికాదు శర్మ. 

చివరకు ‘తద్దినం బ్రాహ్మణుడి’ అవతారం ఎత్తాడు. స్నానంచేసి, గోడకున్న సున్నాన్ని ‘విభూతి’లాగా పెట్టుకుని, చేతికందిన పూజల పుస్తకాన్ని పట్టుకుని, చిక్కడపల్లి స్వరాజ్ హోటెల్ దగ్గరున్న బ్రాహ్మణుల ‘అడ్డ’కు పోయి ఉదయాన్నే కూర్చుండేవాడు. అక్కడికి ‘బ్రాహ్మణీకం’ అవసరాలున్నవారు వచ్చేవారు. వాళ్ల అవసరాలకు అనుగుణంగా, వీడు ‘భోక్త’ గానో, ‘తద్దినం పెట్టించే బ్రాహ్మణుడు’ గానో, వ్రతాలు చేయించే ‘పూజారి’గానో మారేవాడు. తద్వారా, ఆపూటకు భోజనం, కొంత ‘సంభావన’ గిట్టేది. సంభావనతో రాత్రి భోజనం కానిచ్చేవాడు. ఏపనీ దొరకని నాడు మాతోనే భోజనం. అలా కొన్నాళ్లు చేసి, మళ్లీ మద్రాస్ వెళ్లి పోయాడు.

కొన్నాళ్లు గయ దగ్గర ఆయుర్వేద కంపెనీలో పని చేశాడు. అక్కడ నుంచి చక్కటి ఉత్తరం రాశాడు. అందులోని అక్షరం, అక్షరం మున్ముందు రాస్తాను.  పెళ్లి చేసుకుని విజయవాడలో స్థిరపడి పోయాడు. కొన్నాళ్లు మద్యం దుకాణాలలో పని చేసేవాడు. ఆ తరువాత సత్యనారాయణపురంలోని తన ఇంటి నుండే చిన్న ఇడ్లీల హోటెల్ ప్రారంభించాడు. 15 సంవత్సరాల క్రితం హఠాత్తుగా చని పోయాడు.

విద్యార్జనకు పటిష్ఠ పునాది వేసిన రోజులు మాత్రమే కాదు అవి. నాలో వ్యక్తిత్వ వికాసానికి, సామాజిక స్పర్శకు, రాజకీయాల పట్ల పెరుగుతున్న ఆసక్తికి పటిష్టమైన బీజం పడిన రోజులు. న్యూసైన్స్ కాలేజీలో గడిపిన విద్యార్ధి జీవితం, యువతీ మండలి మైదానంలో నా అభిమాన క్రికెట్ ఆట ఆడుతూ చెమట చిందించిన క్షణాలు, విద్యార్థి స్నేహితులతో గడిపిన సంతోష సందర్భాలు, భవిష్యత్తులో నా జీవితానికి బలం చేకూర్చాయి. పాఠాలు నేర్చుకోవడం మాత్రమే కాదు, పరాజయాన్ని అంగీకరించడం, ఆ పరాజయాల నుండే విజయాలకు బాటలు వేసుకోవడం, పునరుజ్జీవనం పట్ల నాదైన శైలిలో నమ్మకం పెంచుకోవడం అప్పుడు నేర్చుకున్నాను.

విద్యార్థిగా రాసిన పరీక్షలు కంటే, జీవితం పెట్టిన పరీక్షలే ఎక్కువ నేర్పాయి. బీఎస్సీ ఫైనల్ ఇయర్ పరీక్షలలో లెక్కల పేపర్ ఒక్కటే రాసిన సందర్భంలో, మిగిలినవేవీ రాయ(లే)క పోవడాన్ని అప్పట్లో పరాభవంగా భావించినా, అంతర్మథనం దరిమిలా, నాలో రాజకీయాలు, సమాజం, ప్రజల సమస్యలపట్ల అవగాహన కలగడానికి, లైబ్రేరియన్ స్థాయినుండి గవర్నర్, ముఖ్యమంత్రుల దగ్గర పనిచేసే అవకాశం కలగడానికి దోహదపడింది. నా స్నేహితులలో ప్రపంచం చుట్టినవారు, శాస్త్రవేత్తలైనవారెందరో, జీవితయాత్రను నిశబ్దంగా సాగిస్తున్నారు. అప్పటి అనుబంధాలు, చిరునవ్వులు, కలసి నడిచిన క్షణాలు జీవితాన్ని సార్ధకంగా మార్చాయి. ప్రతి వ్యక్తి, ప్రతి సంఘటన, ప్రతి గది, జీవిత పాఠశాలలో ఓ గురువు, గురుకులం అయ్యాయి.

వెనుకంజలను చూసుకుంటూ ముందుకు నడవడమే నా ఈ జ్ఞాపకాల గొప్పతనం. ఇవి నా గతాన్ని గుర్తుచేయడమే కాదు, నా ఎదుగుదలకు పునాది కూడా. ఈ అనుభవాలను పంచుకోవడం, నిజానికి, నన్ను నాలోనే మరోసారి చూసుకోవడం. ఇదే వ్యక్తిత్వ వికాసం. జీవన పాఠం. స్వీయానుభవాల పరిపక్వతలలో భాగం.

 

Thursday, July 17, 2025

వ్యక్తిత్వ వికాసం, జీవన పాఠాలు, స్వీయానుభవాల పరిపక్వత-10 ...... 1964-66 మధ్యకాలంలో హైదరాబాద్ అనుభవాలు: నిజాం, రామానందతీర్థ : వనం జ్వాలా నరసింహారావు

 వ్యక్తిత్వ వికాసం, జీవన పాఠాలు, స్వీయానుభవాల పరిపక్వత-10

1964-66 మధ్యకాలంలో హైదరాబాద్ అనుభవాలు: నిజాం, రామానందతీర్థ  

వనం జ్వాలా నరసింహారావు

హైదరాబాద్ న్యూసైన్స్ కళాశాల విద్యార్థిగా ఎప్పటికీ మరువలేని అనుభవం, కాలేజీలో నా సహాధ్యాయిగా కాకపోయినప్పటికీ, స్థానిక వివేకవర్ధని కాలేజీలో బిఎ (ఎకనామిక్స్, పాలిటిక్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్) చదువుతుండే స్నేహితుడు నరసింహ మూర్తి, నేను కలిసి ప్రతిరోజు సాయంత్రం క్రమం తప్పకుండా, కాలేజీ నుంచి వచ్చిన తరువాత సాయంత్రం నాలుగు-ఐదు గంటల ప్రాంతంలో నారాయణగుడా తాజ్ మహల్ హోటెల్ ముందు కలిసే వాళ్లం. నరసింహమూర్తి వాళ్లన్నయ్య కృష్ణమూర్తి గారు మామయ్యతో పాటు సచివాలయంలో పని చేస్తుండేవాడు. వాళ్ల మధ్య స్నేహం దాదాపు సమవయస్కులమైన మమ్మల్ని కూడా దగ్గరికి చేర్చింది.   

ఇద్దరం కబుర్లు చెప్పుకుంటూ, ఒక ప్లేట్ ‘ముర్కు’ తిని, ‘వన్ బై టు’ కప్పు కాఫీ తాగి (బహుశా అంతా కలిపి అర్థ రూపాయ కన్నా తక్కువ బిల్లు అయ్యేదేమో!) బయట పడే వాళ్లం. తాజ్ మహల్ హోటెల్ లో పనిచేసే కామత్ అనే అతను మాకు మంచి స్నేహితుడయ్యాడు. కూపన్ మరిచి పోయి వచ్చినా, డబ్బులు టైంకు ఇవ్వలేక పోయినా, భోజనం విషయంలో కాని, టిఫిన్ విషయంలో కాని, ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు. కాఫీ-టీలు ఫ్రీ గా తాగిన రోజులు కూడా ఎన్నో వున్నాయి. మాతో పాటు ఒక్కోసారి రూమ్మేట్ కల్మల చెర్వు రమణ, ఉస్మానియా ‘బి-హాస్టల్’ లో వుంటూ ఎంఎ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చదువుతున్న స్వర్గీయ వనం రంగారావు (నర్సింగరావు తమ్ముడు) కూడా వుండేవారు.

తాజ్ మహల్ నుంచి బయటికొచ్చి, కాసేపు నారాయణ గుడా బ్రిడ్జ్ పక్కనున్న (అప్పట్లో) పార్క్ లో కూచుని కబుర్లు చెప్పుకునే వాళ్లం. ఒక్కోసారి హిమాయత్ నగర్ మీదుగా, పీపుల్స్ హై స్కూల్ పక్కనుంచి నడుచుకుంటూ, చిక్కడపల్లి దాకా పోయి, నరసింహమూర్తిని వదిలేసి, నేను తాజ్ మహల్ హోటెల్ కు పోయి భోజనం చేసి రూమ్ కు వెళ్లే వాడిని. మధ్య-మధ్య నారాయణ గుడా నుంచి నడుచుకుంటూ వైఎంసిఏ మీదుగా, బడీ చావడీ, సుల్తాన్ బజార్, కోఠి తిరిగి వచ్చే వాళ్లం. తిరుగు ప్రయాణం, ఒక వేళ అలిసిపోతే, బస్సులో చేసే వాళ్లం.

హిమాయత్ నగర్, అశోక్ నగర్ మధ్య ఇప్పుడున్న ‘బ్రిడ్జ్’ అప్పుడు లేదు. వర్షాకాలంలో మోకాలు లోతు నీళ్లలో నడుచుకుంటూ వెళ్లేవాళ్లం. అశోక్ నగర్ లో ఇప్పుడు బ్రహ్మాండంగా వెలిగిపోతున్న ‘హనుమాన్’ గుడి అప్పుడు లేదు. కేవలం ఒక విగ్రహం మాత్రం రోడ్డు మధ్యలో-కొంచెం పక్కగా వుండేది. నేను, మూర్తి, ఒకరు చూడకుండా మరొకరు ఆ విగ్రహానికి దండం పెట్టుకుని కదిలే వాళ్లం. పీపుల్స్ హైస్కూల్ దాటిన తరువాత మలుపు తిరిగి చిక్కడపల్లి వైపు పోతుంటే, ఇప్పుడు సిటీ సెంట్రల్ లైబ్రరీ భవనం వున్న చోట ఒక కల్లు కాంపౌండ్ వుండేది. దాని ముందర నుంచి చీకటి పడిన తరువాత వెళ్లాలంటే కొంచెం భయమేసేది కూడా. ఇక మా కబుర్లలో వర్తమాన రాజకీయాలు ఎక్కువగా వుంటుండేవి.

కేరళ నంబూద్రిపాద్ ప్రభుత్వాన్ని ఇందిరా గాంధి ఎలా పడగొట్టింది, కెన్నెడీని ఎందుకు, ఎలా చంపారు, మావో సేటుంగ్ వ్యవహారం, ఇలా, జాతీయ-అంతర్జాతీయ రంగానికి చెందిన కబుర్లుండేవి. మూర్తికి, నాకు మధ్య స్నేహం ఇప్పటికీ కొనసాగుతూనే వుంది. పోలీసు స్పెషల్ బ్రాంచ్ లో సీనియర్ అధికారిగా పనిచేసి పదవీ విరమణ చేసాడు మూర్తి. అప్పట్లో హైదరాబాద్ లో ఒక సారి అఖిల భారత కాంగ్రెస్ కమిటీకి సంబంధించిన ఒక బహిరంగ సభ ఫతే మైదాన్ స్టేడియంలో జరిగినట్లు, ఆ సభలో నాటి ముఖ్యమంత్రి బ్రహ్మానంద రెడ్డి ‘టోపీ’ని సవరించుకోగానే రాబోయే రోజుల్లో, ఏదో ఒక రాజకీయ మార్పు వుంటుందని పరిశీలకులు వ్యాఖ్యానించినట్లు గుర్తు. మా ఇద్దరిమధ్య జరిగిన రాజకీయాల చర్చ పర్యవసానమే దరిమిలా నా రాజకీయాసక్తి.  

హైదరాబాద్‌లో ఆ రోజుల్లో ఇప్పుడున్నన్ని సినిమా టాకీసులు లేవు. వున్నవాటిలో ఎయిర్ కండిషన్ థియేటర్లు కాని, ఎయిర్ కూల్డ్ థియేటర్లు కాని దాదాపు లేనట్లే. ఆబిడ్స్ లో వున్న ‘జమ్రూద్’ టాకీసు ఒక్కటే జనరేటర్ బాక్-అప్ వున్న ఎయిర్ కండిషన్ థియేటర్. అలానే వి వి. కాలేజీ పక్కనున్న ‘నవరంగ్’ థియేటర్ ఒకే ఒక్క ఎయిర్ కూల్డ్ థియేటర్. ఇవి కాకుండా నారాయణ గుడాలో ‘దీపక్ మహల్’, హిమాయత్ నగర్ లో ‘లిబర్టీ’, సికిందరాబాద్ లో ‘పారడైజ్, తివోలీ’ థియేటర్లుండేవి. సికిందరాబాద్ లో ఎక్కువగా ఇంగ్లీష్ సినిమాలు చూపించేవారు. ఆర్టీసీ క్రాస్ రోడ్డులో ఇప్పుడున్న థియేటర్లు ఏవీ అప్పుడు లేవు. ముషీరాబాద్‌లో "రహమత్ మహల్" టాకీసుండేది.

నారాయణ గుడా దీపక్ మహల్ పక్కన ‘రాజ్ కమల్’ బార్ అండ్ రెస్టారెంట్ వుండేది. బహుశా అందులో మద్యపానం అలవాటు చేసుకోని వారు అరుదుగా వుంటారేమో! నాకు ఇప్పటికీ బాగా గుర్తుంది. డిగ్రీ పరీక్షల్లో, చివరిగా, మాడరన్ ఫిజిక్స్ పేపర్ (వాస్తవానికి హాజరవడమే కాని మొదటి సారి నేను రాయలేదు) అయిపోయిన తరువాత, మధ్యాహ్నం పూట, మొట్ట మొదటి సారిగా, రాజ్ కమల్ బార్‌కు వెళ్లి, ‘గోల్డెన్‌ ఈగిల్’ బీర్ తాగాను. నేను తాగలేనని వనం రంగారావు ఛాలెంజ్ చేయడంతో ఆ పని చేయాల్సి వచ్చింది. అప్పట్లో బీర్ బాటిల్ ధర కేవలం మూడు రూపాయలే! 1966 లో అలా మొదలైన ఆ అలవాటుకు షష్టిపూర్తి సెలబ్రేషన్స్ చేసుకోవచ్చేమో! అప్పుడు మూడు రూపాయల ధర మాత్రమే వున్న బీర్ బాటిల్ ఇప్పుడు రెండువందలు దాటి పోయింది. అలాగే లెక్క లేనన్ని బ్రాండ్లు వచ్చాయి. టిన్ బీర్లు కూడా వచ్చాయి.  

ఇదిలా వుండగా ఆరోజుల్లో పేర్కొనాల్సిన ఇద్దరు వ్యక్తులు ఒకరు ఏడవ, చివరి నిజాం నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, మరొకరు స్వామీ రామానంద తీర్థ. 1964–66 కాలం నాటికి భారత ప్రజాస్వామిక వ్యవస్థ సంస్థాగతంగా స్థిరపడే దశలో ఉంది. నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ చివరి సంవత్సరాలు సాగుతున్నాయి. హైదరాబాద్ స్టేట్ భారతదేశంలో విలీనమైన తర్వాత ఆయనది నామమాత్రపు రాజశ్రేయస్సు మాత్రమే. నిజాం గతంలో ఒక శక్తిమంతమైన రాజుగా, అత్యంత ధనికుడిగా, దేశంలోని అతిపెద్ద దేశీ సంస్థానాన్ని పాలించినవాడు,

ప్రజాస్వామిక భారత ప్రభుత్వం ఆయనను గౌరవంతో, పరిమిత అవకాశాలతో వ్యవహరించడం ముఖ్యమైన లక్షణం. ఈ సమన్వయమే దేశపు బహుళతా చైతన్యానికి నిదర్శనం. జవహర్‌లాల్ నెహ్రూ మరణానంతరం, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరా గాంధీలు, నిజాం పట్ల ఒక నిబద్ధతతో కూడిన గౌరవం పాటించింది. ఆయనకు ‘రాజప్రముఖుడు’ హోదా తొలగించినా, చారిత్రక పరంగా దేశానికి చేసిన సేవలు గుర్తిస్తూ, ప్రభుత్వం ఆయనకు ప్రతి ఏడాది ‘ప్రివిపర్స్’ రూపంలో ఆర్థిక సాయం కొనసాగించడమే కాక, ఆయన నివాసం, భద్రతకు గౌరవప్రదమైన వాతావరణం కల్పించబడింది.

ఒక పాత సామ్రాజ్య అధిపతిగా మీర్ ఉస్మాన్ ఆలీఖాన్ సుస్థిర జీవితం సాగిస్తున్న కాలం అదే. ప్రముఖ సాంస్కృతిక కార్యక్రమాలలో ఆయనకు ఆహ్వానం లభించేది. కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరయ్యేవారు గానీ, రాజకీయంగా అసక్తి కనపరచలేదు. ప్రభుత్వ పెద్దలు కొన్నిసార్లు ఆయన్ని మర్యాదపూర్వకంగా కలుసుకునేవారు. ఇది ప్రజాస్వామిక వ్యవస్థకు, పాత రాజ్య సమాజానికి మధ్య స్వీకార మార్గాన్ని సూచిస్తుంది. చివరకు, ఉస్మాన్ అలీ ఖాన్ తన ప్రభావాన్ని కోల్పోయి, నిశ్శబ్ద పాలకుడిగా మారిపోయారు. ఆయన జీవించినంత కాలం, ఆయన జీవితం పునఃప్రభలేకుండా, పాత గొప్పదనాన్ని తలుచుకుంటూ గడిచింది.

ఇక స్వామీ రామానంద తీర్థ విషయానికి వస్తే, ఆయనే నిజంగా 1960ల మధ్య కాలంలో తెలంగాణ ప్రజల ఆశల ప్రతీక. 1950 లలో కామ్రేడ్‌లతో పరోక్షంగా కలసి నిజాం నిరంకుశత, ఫ్యూడల్ విధానాల్ని ఎదుర్కొన్న వీరుడు. అయితే 1964–66 నాటికి ఆయన క్రియాశీల రాజకీయాల నుంచి దాదాపు విరమించుకున్నారు. ముఖ్యంగా, తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేక న్యాయం జరిగేలా చూస్తున్నామంటూ, కాంగ్రెస్‌ లోపలే చైతన్యాన్ని కలిగించే పని కొనసాగించేవారు. తెలంగాణలో ప్రత్యేక రాష్ట్ర ఆశయాలతో ఉద్యమం కొదవైన సమయంలో, ఆయన ఓ మేధావి, ప్రజల అభిమతాన్ని సూచించే గొంతుగా మిగిలారు. రామానందతీర్థ యువ రాజకీయ నాయకులకు ఆదర్శంగా నిలిచారు. గాంధీయవాది, నిజాయితీకి ప్రతీకగా ఆయనకు సమాజంలో గౌరవం ఉండేది. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు స్థాపించిన ఆయన మెమోరియల్ ట్రస్ట్ లో నేను సభ్యుడిని.

హైదరాబాద్ నగరంలోని ముస్లింలలో, ముఖ్యంగా వృద్ధ తరగతిలో నిజాం పట్ల మమకారం ఉండేది. ‘పాత రోజులే మంచివి’ అన్న భావన కొందరిలో ఉండేది. నిజాం కాలంలో ఉపాధి, విశ్వవిద్యాలయ అభివృద్ధి (ఉస్మానియా యూనివర్శిటీ), నీటి ప్రాజెక్టులు వంటి అభివృద్ధి చరిత్ర వారిని ఆకట్టుకునే అంశాలు. హిందువులలోనూ కొన్ని వర్గాల్లో ఆయన గౌరవించబడేవాడు. ముఖ్యంగా, విద్యార్థులు చదువుకోగలిగేలా ఉస్మానియా విశ్వవిద్యాలయం, ఉస్మాన్ జనరల్ ఆసుపత్రి వంటి సంస్థలు స్థాపించడం వల్ల కొందరికి ఆయనపై గౌరవం బాగా ఉండేది. కానీ మరోవైపు, కమ్యూనల్ జ్ఞాపకాలతో గుండెల్లో మరకల్ని మోస్తున్న వారు కూడా ఉన్నారు. ఫ్యూడల్ వేదింపులు ఇంకా కొన్ని కుటుంబాల స్మృతుల్లో నిలిచివుండేవి.

తెలంగాణ రచయితలు, చరిత్రకారులు, సాంస్కృతిక వేత్తలు నిజాం గురించి ఒక సంక్లిష్ట భావన కలిగి ఉండేవారు. ఒకవైపు ఆయన సంస్కృతీ పరమైన విలువలకు, వాస్తు కళలకు, విద్యాభివృద్ధికి చేసిన కృషిని ప్రశంసించేవారు. మరోవైపు ప్రజాస్వామికత దిశగా ఎదగలేని వ్యక్తిగా విమర్శించేవారు. ఉస్మాన్ అలీ ఖాన్ 1965లో తన మనుమడు ముకర్రమ్ జాహ్‌ను వారసుడిగా ప్రకటించినప్పుడు, అది ఒక కుటుంబ విషయంగా చూచినప్పటికీ, హైదరాబాద్‌లో పలు వర్గాల నుంచి ఆసక్తికరమైన స్పందన వచ్చింది. అది రాచరికం పోయినా, చరిత్రపైన ఉన్న భావన వదలిపెట్టలేని వాస్తవాన్ని సూచిస్తుంది. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ మరణం తర్వాత, అతని కుమారుడు ముకర్రం జా 967లో హైదరాబాద్‌కు ఎనిమిదవ నిజాం అయ్యాడు. అయితే, ప్రస్తుతం నిజాం బిరుదును మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ మునిమనవడికి సంక్రమించింది.

ఇక స్వామీ రామానంద తీర్థ రాజకీయంగా క్రియాశీలంగా లేకపోయినా, అప్పటి ప్రభుత్వానికి ఒక మానసిక దార్శనిక మార్గదర్శకుడిగా మిగిలాడు. నిజాం కాలంలోని న్యాయవ్యతిరేకతకు ఎదిరించిన వ్యక్తిగా గౌరవించబడిన ఆయన, ప్రజాస్వామిక వ్యవస్థలో నైతిక విలువలకు ప్రతినిధిగా కనిపించేవాడు. నిజాం పట్ల వ్యతిరేకత చూపినా, వ్యక్తిగతంగా అతనిని చిన్నచూపు చూడలేదనే భావనలు ఉన్నాయి. ఆయన ఒక సత్యనిష్ఠుడు, శాంతియుత మార్గాలపై నమ్మకమున్న నాయకుడిగా సమాజంలోని అన్ని వర్గాలకూ ఆమోదయోగ్యుడయ్యాడు.

ఈ మొత్తం పరిస్థితి ఒక విశిష్టతను ప్రతిబింబిస్తుంది. సమన్వయాన్ని సూచిస్తుంది. అదే, చరిత్రను తృణీకరించకుండా, ప్రజాస్వామ్యాన్ని ముందుకు నడిపించే సహనవృత్తి. భారత ప్రజాస్వామ్యం ఎలా పాత వర్గ సమాజాల్ని వెనక్కు నెట్టకుండా, వాటిని గౌరవంగా చరిత్రలో నిలిపిందో ఈ సందర్భాలు బలంగా ప్రతిబింబిస్తాయి. హైదరాబాద్ నగరం ఒక వైపు మౌలిక ప్రజాస్వామిక ఉద్యమాల గడ్డగా, మరోవైపు నిజాం కాలపు రాచరిక సంస్కృతికి జ్ఞాపక చిహ్నంగా నిలబడింది. ఇది భారత ప్రజాస్వామికతకు, కలిసిమెలిసి జీవించే సామర్థ్యానికి ఒక సూక్ష్మ ప్రతిబింబంగా చెప్పుకోవచ్చు.

1960ల మధ్యన విద్యార్థులుగా మేం ఉన్న రోజులవి. అప్పటికి స్వాతంత్ర్యాన్ని పొందిన తర్వాత దేశం ప్రజాస్వామికత బాటలో నడుస్తూ, పాత రాచరికపు జీవనశైలిని మరచిపోతున్న దశలో ఉంది. అయినా ఆ కాలంలో కొందరి వ్యక్తిత్వాలు, ఒకవైపు చారిత్రక రాజసందర్భాల్లోకి వెళ్ళిపోతూ, మరోవైపు మానసికంగా ప్రభావం చూపించేలా నిలిచాయి. నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ చరిత్ర, చేపట్టిన నిర్మాణాలు, విద్యా సంస్థలు, రాజధానిగా హైదరాబాద్‌కి అందించిన మూల్యాలు, ఇవన్నీ ఓ అంతర్భావ గౌరవాన్ని కలిగించేవి. రాజ్యానికి దూరమయ్యాక కూడా ప్రజల మదిలో మిగిలిపోయిన ప్రతీక.

ఇక స్వామీ రామానంద తీర్థ, ఆయన త్యాగబుద్ధి, ప్రజాస్వామిక నిబద్ధత, నిజాం పరిపాలనలో వ్యవస్థాపిత అన్యాయాలకు వ్యతిరేకంగా తిరగబడ్డ యోధత్వం, ఇవన్నీ మాకెప్పుడూ విద్యార్థిగా మానసికంగా మార్గదర్శకాలుగా నిలిచాయి. నీతితో నిలిచే నాయకుడిగా, రాజకీయం అంటే సేవల మాలగా మలిచే విధంగా, ఆయన వ్యక్తిత్వం మాలో అంతర్మధన కలిగించేది.

వీరిద్దరూ చరిత్రను మోస్తున్న భిన్న రూపాలు. విధ్యార్తులమైన మేము వారిని విమర్శాత్మక గమనంలో చూడలేదు. చూడలేకపోయాం కూడా. ఎందుకంటే, మా ఎదుగుదల సమయంలో వారు ఒక కొలమానంలా, చరిత్రను అర్థం చేసుకునే సూచికల్లా, గౌరవాన్ని ఎలా వహించాలో నేర్పిన ఓ మౌన పాఠంలా ఉన్నారు. వారు చెప్పిందే కాక, వారు మిగిల్చిన భావం మాకు అప్పట్లో స్ఫూర్తిదాయకం.

ఇవన్నీ నాలో రాజకీయాలపట్ల ఆసక్తి పెరగడానికి, ప్రత్యక్షంగా, పరోక్షంగా దోహదపడ్డాయనాలి.