Tuesday, April 16, 2024

వాల్మీకి సంస్కృత రామాయణంలో శ్రీరాముడు : వనం జ్వాలా నరసింహారావు

 వాల్మీకి సంస్కృత రామాయణంలో శ్రీరాముడు

వనం జ్వాలా నరసింహారావు

ఆంధ్రప్రభ దినపత్రిక చింతన కాలమ్ (శ్రీరామనవమి, (17-04-2024)}

శ్రీ రామాయణం భారతీయ సంస్కృతీ, సనాతన ధర్మ ప్రతిరూపం, దీని మౌలిక తత్వాలు, ధర్మ, జ్ఞానాలు. రెండింటినీ వాచ్య-వ్యంగార్థాలతో శ్రీ మద్రామాయణం ఆవిష్కరిస్తోంది. వాల్మీకి ఆదికవి. రామాయణం ఆదికావ్యం. ఇది ధ్వని, అర్థ ప్రతిపాదిత మహా మంత్రపూతం. గాయత్రీ బీజసంయుతం. ఔపనిషతత్వసారం. స్మరణ, పారాయణ మాత్రంగా అంతఃకరణ శుద్ధి అవుతుంది. కావ్యాలలో అగ్రస్థానంలో నిలిచిన వాల్మీకి సంస్కృతంలో రచించిన శ్రీమద్రామాయణంలో నాయిక సీతా దేవి. నాయకుడు శ్రీరామచంద్రమూర్తి.

వాల్మీకిదొక విలక్షణమైన శైలి. ఏ విషయాన్నీ ఒకేచోట సంపూర్ణంగా చెప్పడు. ఒక విషయాన్నే రెండు, మూడు సందర్భాల్లో చెప్పాల్సి వస్తే, అక్కడ కొంచెం, అక్కడ కొంచెం చెప్తాడేకాని, మొదట్లోనే అంతా చెప్పడు. ఒక సందర్భంలో వనవాసానికి వచ్చేటప్పటికి శ్రీరాముడికి 25 సంవత్సరాలని చెప్పాడు. అంటే, వనవాసం వెళ్ళేటప్పుడు 25 సంవత్సరాలనీ, విశ్వామిత్రుడి వెంట పోయేటప్పుడు 12 సంవత్సరాలనీ అనుకోవాలి. పన్నెండో నెలలో శ్రీరాముడి జననం, పన్నెండో ఏట విశ్వామిత్రుడితో వెళ్ళడం, పన్నెండేళ్లు అయోధ్యా వాసం, పద్నాలుగేళ్లు అరణ్యవాసం, పన్నెండేళ్లు సీతాదేవి వాల్మీకి ఆశ్రమంలో నివాసం. ఈ పరంపరలోనే సీతారాముల కల్యాణం ఎప్పుడు జరిగిందో రాస్తాడు వాల్మీకి.

ఆంధ్రవాల్మీకి, కవిసార్వభౌమ వావిలికొలను సుబ్బారావు (వాసుదాసు) శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం మందరం, అయోధ్యాకండ చివర్లో శ్రీరాముడి దినచర్య గురించి వివరించారు. సాధువులను రక్షించడానికి, పాపాత్ములను నాశనం చేయడానికి, ధర్మ స్థాపన కొరకు, ప్రతియుగంలో శ్రీమన్నారాయణుడు భూమ్మీద అవతరిస్తుంటాడు.

{ఈ అవతారాలే మళ్లీ, మళ్లీ పునరావృతమవడం వల్ల, ఇప్పటికి ఎన్ని మత్స్యావతారాలు, నృసింహావతారాలు, శ్రీరామావతారాలు, కృష్ణావతారాలు అయ్యాయో చెప్పడం కష్టం. మళ్లీ, మళ్లీ అవతారాలు వచ్చినప్పుడు, వారితో పాటే మళ్లీ-మళ్లీ హిరణ్యాక్ష, హిరణ్యకశిపులు, బలిచక్రవర్తి, రావణ, కుంభకర్ణులు, కంస, శిశుపాలులు లాంటి వారు కూడా రావాలికదా? వారు వచ్చినప్పుడు వారి సహాయకులు, సహచరులు, తల్లిదండ్రులు, అవతార పురుషుడికి కావాల్సినవారు రావాలి కదా? అలాంటప్పుడు పరిణామవాదం తప్పవుతుంది కదా? అలాగే ముక్తి, జన్మరాహిత్యం అనే పదాలు వ్యర్తమైనవే కదా?

          అవతారాలు రావడం నిజమే. వారికి కావాల్సినవారు, విరోధులు రావడం కూడా నిజమే. బ్రహ్మేంద్రాదులు, అష్టదిక్పాలకులు, సూర్యచంద్రులు, సప్తర్షులు, అందరూ పుట్టడం యదార్థమే. అయినా పరిణామ వాదం తప్పుకాదు. ముక్తి అనేది వ్యర్థపదం కానేకాదు. బ్రహ్మ, రుద్ర, అగ్ని, వరుణుడు...లాంటి పదాలన్నీ ఆయా పదవుల పేర్లే కాని ఆ ఉపాధిలో వుండే జీవాత్మల పేర్లు కావు. కలెక్టర్, డిప్యూటీ కలెక్టర్, తహసీల్దార్ అనే పదవుల్లో వుండేవారు మళ్లీ-మళ్లీ వచ్చారంటే, అదే మనిషి వచ్చాడని అర్థం కాదు. అలాగే బ్రహ్మ, రుద్ర, అగ్ని, వరుణుడు అనే పదవుల్లో వున్నవారు పోగానే, ఆ స్థానం ఖాళీ కాగానే, మరో అర్హుడు ఆ స్థానంలో నియమించబడుతాడు. వాడి ఉద్యోగం వాడు చేస్తాడు. ఇలా వచ్చేవాడు భిన్న జీవుడే కాని ఇంతకు ముందు వున్నవాడు కాదు. కాబట్టి పరిణామ వాదానికి ప్రాణ భయం లేదు.....ముక్తుడికి పునర్జన్మ భయం లేదు. ఒక స్థానంలో రెండు జీవులుండవు. జీవయాత్రా విషయంలో పరిణామమే సరైన మార్గం.

          బ్రహ్మాండకోటులు అనంతం. జీవకోటులూ అనంతమే. ప్రపంచం నిత్యం. సంసారం నిత్యం. కాలం నిత్యం. నది ఒడ్డున నిలుచుని చూస్తుంటే నీళ్లు, నీటి బిందువులు దాటిపోతూనే వుంటాయి. వాటి స్థానంలో మరికొన్ని వస్తాయి. ఒక నీటి బిందువు సముద్రంలో ప్రవేశించగానే ఆద్యంతాలలో శూన్య స్థానం లేనట్లే, జీవుడు ముక్తుడు కాగానే ఆ స్థానంలో కాని, ఆదిలో కాని, శూన్యం వుండదు.}

శ్రీరామ జననం వైవస్వత మన్వంతరం, త్రేతాయుగంలో జరిగింది. కొడుకులకై దశరథుడు హేవిలంబినామ సంవత్సరంలో అశ్వమేధ, పుత్రకామేష్టి యాగాలు చేశాడు. దుర్ముఖి సంవత్సరం చైత్రమాసంలో అశ్వం విడిచారు. విలంబినామ సంవత్సరంలో శ్రీరామ జననం. మహారాజు పుత్రకామేష్ఠి యాగం చేస్తుండగా, అగ్నిహోత్రం మధ్యనుండి ప్రాజాపత్య మూర్తి బంగారు పాత్రతో వచ్చి, దానిని ఆయనకిచ్చి, అందులోని పాయసాన్ని భార్యలతో తాగించమని చెప్పాడు. పాయసం తాగిన భార్యలు గర్భవతులయ్యారు. పన్నెండో నెలలో, (విలంబి) చైత్ర మాసం, శుక్లపక్షం, నవమి తిథి నాడు, పునర్వసు నక్షత్రంలో, అభిజిల్లగ్నం, కర్కాటక లగ్నంలో, చంద్రుడిని కూడిన బృహస్పతి కలిగిన బుధవారం ఉదయాన, దశరథుడి జ్యేష్ట భార్య కౌసల్యాదేవి శ్రీమహావిష్ణువు అర్థాంశమూర్తి, శుభ లక్షణాల రఘువంశ వర్ధనుడిని, శ్రీ రాముడికి జన్మనిచ్చింది. శ్రీరాముడి జన్మ లగ్నం కర్కాటకం కాగా, మేషంలో రవి, బుధులు, తులలో శని, మకరంలో కుజుడు, మీనంలో శుక్రుడు వున్నారు. శ్రీరామజననం తరువాత, భరతుడు గురువారం పుష్యా నక్షత్రంలోను, లక్ష్మణ-శత్రుఘ్నులు శుక్రవారం ఆశ్లేషా నక్షత్రంలోనూ జన్మించారు.

చైత్ర బహుళ పంచమి నాడు శ్రీరామలక్ష్మణ భరతశత్రుఘ్నులకు నామకరణం జరిగింది. పరాభవ సంవత్సరంలో తొమ్మిదో ఏట ఉపనయనం జరిగింది. శ్రీరాముడికి 12 ఏళ్ల వయసున్నప్పుడు, సౌమ్యనామ సంవత్సరంలో యాగరక్షణ కొరకు విశ్వామిత్రుడి వెంట అరణ్యాలకు పోయాడు. అరణ్యవాసానికి పోయేటప్పుడు శ్రీరాముడికి 25 సంవత్సరాలని, సీతాదేవికి 18 సంవత్సరాలని, మారీచుడు రావణాసురుడితో సీతాపహరణం ముందర చెప్పినట్లు రామాయణంలో వుంది. శ్రీరాముడికి 12 సంవత్సరాల, సీతకు ఆరేళ్ళ వయసులో వారి వివాహం జరిగింది. దీనికి దృష్టాంతరంగా విశ్వామిత్రుడి యాగం కాపాడడానికి రామలక్ష్మణులు వెళ్లిన రోజు నుంచి మిథిలా నగరం వెళ్లడం వరకు తీసుకోవచ్చు. సౌమ్యనామ సంవత్సరం మాఖ బహుళంలో శ్రీరామలక్ష్మణులు విశ్వామిత్రుడి వెంట పోయారు. 15వ నాటి ఉదయం మిథిలా ప్రవేశం చేసి, శివ ధనుర్భంగం చేశాడు. 27 వ రోజున శుక్ల త్రయోదశి శుభ దినం కాబట్టి, ఉత్తర ఫల్గుణీ నక్షత్రంలో సీతారాముల కల్యాణం జరిగింది. ఉత్తర ఫల్గుణీ నక్షత్రం శ్రీరాముడి జన్మ నక్షత్రానికి ఆరవది.

27 వ రోజు ఫాల్గున శుద్ధ త్రయోదశి అయితే, అయోధ్య నుండి బయల్దేరిన రోజు మాఘబహుళ విదియ కావాలి. విదియ, హస్తా రోజు ప్రయాణానికి మంచి రోజే. అది శ్రీరాముడికి ధృవతార కూడా అవుతుంది. కాబట్టి ఆ రోజున హస్త పోయిన తరువాత అభిజిల్లగ్నంలో ప్రయాణమై వుండాలి. సీతారాముల కళ్యాణమైన తరువాత, అంటే, బహుళ విదియతో ముగిసి, తదియనాడు జనకుడు బిడ్డలకు అరణాలిచ్సిన తరువాత, చవితినాడు అప్పగింతలై, ఫాల్గుణ బహుళపంచమి నాడు అయోధ్యకు ప్రయాణమయ్యారు. షష్టి, సప్తముల్లో పరశురాముడి గర్వభంగమైంది. దశమినాడు అయోధ్య ప్రవేశం జరిగింది. ఆ తరువాత 12 సంవత్సరాలు సుఖసంతోషాలతో అయోధ్యలో గడిపారు.

దుందుభి నామ సంవత్సర చైత్ర శుద్ధ పంచమి నాటి ఉదయం పుష్యా నక్షత్రంలో దశరథుడు, శ్రీరాముడికి యౌవరాజ్య పట్టాభిషేకం జరిపించాలని నిర్ణయించాడు. మరో రకంగా చెప్పాలంటే, చైత్ర శుద్ధ పంచమే వనవాసారంభమైన రోజు. మర్నాడు గంగాతీర వాసం, ఆ మర్నాడు గుహుడి దర్శనం. అయోధ్య విడిచిన మూడో రోజు సప్తమినాడు జడలు ధరించడం, నాలుగోనాడు అష్టమి రోజున భరద్వాజాశ్రమం వెళ్లడం జరిగింది. ఐదవనాడు నవమిన యమున దాటారు. ఆరవనాడు దశమి రోజున చిత్రకూటమి వెళ్లి వాల్మీకి దర్శనం చేసుకుని, పర్ణశాల నిర్మించుకున్నారు. అదే రోజున అక్కడ అయోధ్యలో దశరథుడు మరణించాడు.  

శ్రీరాముడు అయోధ్య విడిచిన 17 వ రోజున భరతుడు అక్కడికి చేరుకున్నాడు. మర్నాడు తండ్రికి కర్మలు ప్రారంభించాడు. 29 వ రోజున కర్మకాండలన్నీ పూర్తయ్యాయి. మర్నాడు 30 వ రోజున వైశాఖ శుద్ధ చవితినాడు రాజకర్తలు భరతుడిని రాజ్యభారం వహించమని కోరారు. 31 వ రోజున పంచమి నాడు సభకు వచ్చిన భరతుడిని వసిష్ఠుడు పట్టాభిషేకం చేసుకొమ్మని అడిగాడు. భరతుడు తిరస్కరించాడు. వైశాఖ శుద్ధ షష్టి రోజున భరతుడు చిత్రకూటానికి బయల్దేరాడు. అదే రోజున గుహుడిని కలిశాడు. మర్నాడు సప్తమినాడు జడలు ధరించాడు. భరద్వాజుడి విందు స్వీకరించాడు.

34 వ రోజున, వైశాఖ శుద్ధ అష్టమి నాడు, చిత్రకూటానికి బయల్దేరి శ్రీరామదర్శనం చేసుకున్నాడు. అదే రోజున రాముడు తండ్రికి నీళ్లు విడిచాడు. 35 వ రోజున రామ, భరత సంభాషణ అనంతరం మర్నాడు భరతుడికి తన పాదుకలను ఇచ్చాడు శ్రీరాముడు. అదే రోజు, అంటే, వైశాఖ శుద్ధ దశమిన భరతుడు అయోధ్యకు చేరాడు. 37 వ రోజున వైశాఖ శుద్ధ ఏకాదశి నాడు భరతుడు నందిగ్రామం చేరాడు. భరతుడు వెళ్ళిపోయిన తరువాత పౌర్ణమి వరకు చిత్రకూటం లోనే వుండి సీతారామలక్ష్మణులు, వైశాఖ బహుళ పాడ్యమినాడు అత్రి ఆశ్రమానికి చేరారు.

అరణ్యవాసంలో భాగంగా, శరభంగ మహర్షి, సుతీక్ష్ణ ముని, మాండకర్ణి, సుదర్శనముని, అగస్త్యుడి ఆశ్రమాలకు, పంచవటికి వెళ్లారు. క్రౌంచారణ్యం, మతంగవనం, పంపానది ఒడ్డునున్న ఋశ్యమూక పర్వతం, ప్రస్రవణ పర్వతం దగ్గర వున్నారు. అప్పుడే సీతాన్వేషణ జరిగింది. హనుమంతుడు లంక నుండి తిరిగి వచ్చి, సీత జాడ చెప్పడం చెప్పడం పూర్తవగానే, అదేరోజున, ఫాల్గుణ మాసంలో పౌర్ణమినాడు, ఉత్తర ఫల్గుణీ నక్షత్రంలో యుద్ధానికి బయల్దేరుదామని రాముడు అన్నాడు. తగిన ఏర్పాట్లు చేయమన్నాడు.

రాముడు కిష్కింధకు ఆగ్నేయంగా వున్న లంకకు పోతున్నప్పుడు, తరచుగా సూర్యుడున్న రాశికి ముందు రాశిలో వుండే శుక్రుడు, అనుకూలంగా వెనుక వున్నాడు. రాముడు బయల్దేరిన ఫాల్గుణ మాసం పౌర్ణిమనాడు సూర్యుడు మీనరాశిలో, శుక్రుడు మేషరాశిలో వున్నట్లు భావించాలిరాముడి జన్మరాశి కర్కాటకానికి పదవరాశైన మేషంలో శుక్రుడు వుండడం రాముడికి అనుకూలంవెనుక శుక్రుడు వుండడం కూడా అనుకూలమేశుక్రానుకూలత చెప్పడం వల్ల బృహస్పత్యాది అనుకూలత కూడా వుందిబృహస్పతి శ్రీరాములవారి జన్మకాలంలో కటకరాశిలో వున్నాడుఇతడికి ఒక్కోరాశిలో ఒక్కొక్క సంవత్సరం నివాసం కాబట్టి పన్నెండేళ్లకు పన్నెండు రాశులను చుట్టి వస్తాడుఅలా మూడుసార్లు చేస్తే ముప్పయ్యారు సంవత్సరాలు గడిచాయిముప్పైఎనిమిదో ఏట రాముడి దండయాత్ర.

ఆ ఏడు బృహస్పతి రామరాశిద్వితీయ రాశైన సింహంలో వున్నాడుగురువు రెండో ఇంట వుండడం అనుకూలంరామజన్మకాలంలో శని తులావర్గోత్తమంలో వున్నాడుశనికి రెండున్నరేళ్లు ఒక రాశిలో నివాసంతులనుండి పన్నెండు రాశులు చుట్టిరావడానికి ముప్పై సంవత్సరాలు గడుస్తాయిముప్పై రెండున్నర దాకా తులలోనుఆ పైన రెండున్నర వృశ్చికంలోనుఆపైన రెండున్నర ధనస్సులోను వుండి ఆపైన అంటేముప్పై ఏడున్నర ఏళ్ల తరువాత మకరానికి పోవాల్సినప్పటికీ వక్రతాదులవల్ల ధనస్సులోనే వున్నాడని అర్థమవుతున్నదిరామావతారకాలంలో రాహువు సింహరాశిలో వున్నాడు

రాహువుకు ప్రతిరాశిలోను ఒకటిన్నర సంవత్సరం నివాసంఅప్రదక్షిణ సంచారంఅక్కడినుండి ముప్పైఎనిమిదో ఏట కటకరాశిలో వుండాల్సినవాడు మిథునరాశిలో వున్నాడని అనుకోవాలిరాహువుకు ఏడవ ఇంట కేతువు నివాసంకాబట్టి అప్పుడు ధనస్సులో కేతువున్నాడుధనస్సు కర్కాటక రాశికి ఆరోదిఅక్కడున్న శనికేతువులు రాముడికి అనుకూలురుబుధుడు రాముడికి పదవ రాశిలో వున్నాడు కాబట్టి అనుకూలుడుచంద్రుడు ఉత్తరఫల్గుణితో చేరి వున్నాడు కాబట్టి కన్యారాశిలో వున్నట్లు లెక్కఅప్పటికి తృతీయ చంద్రుడు కాబట్టి రాముడికి అనుకూలుడుమీనంలో వున్న సూర్యుడు కటకానికి తొమ్మిదో ఇంట వున్నాడు కాబట్టి అనుకూలుడు. మిథునంలో వున్న రాహువు కటకానికి పన్నెండో ఇంట వుండడంవల్ల రాముడికి కొంచెం బాధకలిగిస్తాడు. ఇలా రాముడికి అనుకూలమైన గోచార ఫలాలు కనబడ్డాయి. ఈ గోచారం జన్మరాశినిబట్టి చూపించిందిచంద్రరాశినిబట్టి చూడలేదురాక్షసులకు ఈ గోచారం విపరీత ఫలితాన్నే ఇస్తుంది. అలాగే, ఇక్ష్వాకు వంశతార విశాఖ కాబట్టి నిస్సందేహంగా రాముడికి విజయం చేకూరింది.

(వాసుదాసు గారి ఆంధ్రవాల్మీకి రామాయణం మందరం ఆధారంగా)

Sunday, April 14, 2024

మాళవ గుప్త, రాజపుత్రస్థాన ఘూర్జర, నందిపురి ఘూర్జర వంశాలు (బ్రాహ్మణ రాజులు-13, 14, 15) : వనం జ్వాలా నరసింహారావు

 మాళవ గుప్త, రాజపుత్రస్థాన ఘూర్జర, నందిపురి ఘూర్జర వంశాలు

(బ్రాహ్మణ రాజులు-13, 14, 15)

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (15-04-2024)  

మాళవ గుప్త వంశం

గుప్త చక్రవర్తుల సామంతులుగా మాళవ గుప్తులు వ్యవహరించబడ్డారు. గుప్తరాజ్య పతనానంతరం ఈ వంశీయులు స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకున్నారు. అప్షద్ శాసనం వల్ల వీరు నృపశబ్ద వాచ్యులని అర్థమవుతున్నది. ఈ వంశీయుల వారైన కృష్ణగుప్త, హర్షగుప్త, జీవితగుప్తులు గుప్త చక్రవర్తుల సామంతులుగా వుండి, అనేక యుద్ధాలను చేశారు. ఈ వంశీయులలో నాల్గవ వాడైన కుమారగుప్తుడు అతి బలసంపన్నుడు. గొప్ప విజేత. అతడు మౌఖరి ఈశానవర్మను యుద్ధంలో ఓడించి విజయుడై, ఈ వంశ విజయానికి, అభ్యుదయానికి తోడ్పడ్డాడు.

         కుమారగుప్తుడి అనంతరం అతడి కుమారుడు దామోదర గుప్తుడు మౌఖరులను ఓడించాడు. ఆ తరువాత మౌఖరి ప్రభువులు ఇతడిని ఓడించారు. దామోదర గుప్తుడి కుమారుడు మహాసేన గుప్తుడు. ఇతడు పాలనా బాధ్యతలు వహించేనాటికి మాళవ గుప్త రాజ్యం తూర్పు మాళవం దాకా అనగా లోహితీ నది పర్యంతం వ్యాపించినది. ఈ వంశీయులు సుస్థిరవర్మను ఓడించి కామరూప రాజ్యాన్ని ఆక్రమించారు. మహాసేన గుప్తుడు దండయాత్రలు నిర్వహించి విజయాలు సాధించినప్పటికీ, చాలాకాలం జయించిన భూ భాగాలను నిల్పుకోలేకపోయాడు. వల్లభిరాజు మొదటి శిలాదిత్యుడు దండయాత్ర నిర్వహించి పశ్చిమ మాళవ రాజ్యాన్ని జయించాడు. కాలచురి శంకర గణరాజు ఉజ్జయినీ నగరాన్ని క్రీస్తుశకం 595 లో జయించాడు. ఇదే సమయంలో మహాసేన గుప్తుడు మాళవ రాజ్యం మీద తన అధీనాన్ని కోల్పోయాడు. అతడి సామంతుడైన శశాంకుడు వంగ దేశంలోని ఉత్తర, పశ్చిమ ప్రాంతాలలో స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకున్నాడు.

         మహాసేన గుప్తుడి ఇద్దరు కుమారులు కుమార గుప్తుడు, మాధవ గుప్తుడు రాజ్యంలేక స్థానేశ్వర ప్రభువైన ప్రభాకరవర్మ శరణుజొచ్చారు. మహాసేన గుప్తుడి సోదరి మహాసేన గుప్త ప్రభాకర వర్ధనుడి మాతృమూర్తి. కుమార గుప్తుడికి, మాధవ గుప్తుడికి ఆమె మేనత్త. మాధవ గుప్తుడు స్తానేశ్వరంలో పెరిగి పెద్దవాడయ్యాడు. అతడి కుమారుడు ఆదిత్య గుప్తుడు. ఆదిత్య సేనుడి పినతండ్రి కుమారుడు దేవగుప్తుడు. ప్రభాకర వర్ధనుడి సహాయంతో తన పూర్వుల రాజ్యాన్ని సాధించాడు.

         ఇదిలా వుండగా దేవగుప్తుడు మాళవ రాజ్యాన్ని ఆక్రమించి పాలించాడు. కాకపోతే సంపూర్ణంగా జయించలేదు. దేవగుప్తుడు శశాంకుడి స్వాతంత్ర్యాన్ని అంగీకరించి అతడితో స్నేహంగా వుండేవాడు. మహాసేన గుప్తుడి మనుమడు, మాధవ గుప్తుడి కుమారుడు ఆదిత్యగుప్తుడు , దేవగుప్తుడి తరువాత మాళవ రాజ్యాన్ని ఆక్రమించి మగథను సాధించి, గుప్త వంశపు కీర్తిని పునరుద్ధరించాడు.

         మహాసేన గుప్తుడి వరకు ఈ రాజ వంశీయులు మాళవ రాజ్య పాలకులుగా వుండేవారు. తరువాత మగథ రాజ్యాన్ని ఏలారు. మహాసేన గుప్తుడు మగథ, గౌడ రాజ్యాలను జయించి పాలించాడు. అతడు తన రాజ్యంలోని ప్రాగ్భాగాలను కోల్పోయినప్పటికీ, వున్న మగథ రాజ్యాన్ని పాలించాడు. ఆదిత్యగుప్తుడి అనంతరం అతడి కుమారుడు, ఆ తరువాత అతడి కుమారుడు రెండవ జీవిత గుప్తుడు మాళవ గుప్త రాజ్యాన్ని పాలించారు.         

రాజపుత్రస్థాన ఘూర్జర వంశం

         క్రీస్తుశకం ఆరవ శతాబ్ది ఉత్తరార్థంనుండి ఘూర్జరులు ప్రసిద్ధికెక్కారు. వీరు గుప్త రాజ్య పతనానంతరం విజృంభించి రాజ్యస్తాపన చేశారు. పూర్వకాలంలో గుజరాత్ ఘూర్జర దేశంగా పరిగణించబడింది. గుజరాత్ ప్రాంతాన్ని ఏలడం వల్ల వీరు ఘూర్జరులు అని పిలువబడ్డారు. రాజాస్థాన్ లోని జోద్పూర్ ప్రాంతంలో ఘూర్జరుల రాజ్యం వర్దిల్లినది. గుజరన్వాల, గుజరాత్, పంజాబ్ రాష్ట్రంలోని గుజర్ ఖాన్, గుజరాత్ గా వ్యవహరించబడ్డ సహరాన్పూర్ జిల్లా ఘూర్జరుల ఆవాస స్థలాలుగా పరిగణించబడ్డాయి.

         ఘూర్జరులు అనేక ప్రదేశాలలో రాజ్యాలను నెలకొల్పి పాలించారు. వీరు మొదట్లో హిమాలయా పర్వత పశ్చిమ భాగాలలోనూ, పంజాబ్, ఉత్తర ప్రదేశ్, పశ్చిమ రాజస్థాన్, సింధు రాష్ట్రంలో వున్న కొండ ప్రదేశాలలో నివసించారు. భారతావని మీద దండయాత్రలు చేసిన హూణుల వెంట ఘూర్జరులు వచ్చి, పంజాబ్, రాజపుత్ర స్థానం, గుజరాత్ ప్రాంతాలలో నివసించినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. గుజరాత్ ప్రదేశంలో వున్న అనేక ప్రదేశాల పేర్లు ఘూర్జర నామ సామ్యాన్ని కలిగి వున్నాయి. ఘూర్జరులు భారతీయులే అని, వారు గుజరాత్ రాష్ట్ర వాసులని, విదేశీయులు కానేకారని పలు ఆధారాలున్నాయి.

         ఘూర్జర వంశ స్థాపకుడు హరిశ్చంద్రుడు. ఇతడు గుప్త సామ్రాజ్య పతనానంతరం రాజపుత్ర స్థానమందలి జోధ్పూర్ నగరాన్ని రాజధానిగా ఘూర్జర రాజ్యాన్ని స్థాపించాడు. హరిశ్చంద్రుడు సమరశూరుడు. బ్రాహ్మణుడు. వేదాధ్యయనం చేసినవాడు. అతడు వాకాటక, విష్ణుకుండిన, కదంబాది బ్రాహ్మణ వంశీయుల లాగానే క్షత్రియ ధర్మం అవలంభించి సైన్యాన్ని సమకూర్చుకుని, క్రీస్తుశకం 550 లో జోధ్పూర్ నగరాన్ని ఆక్రమించి, ఘూర్జర రాజ్య స్థాపన చేసి, పరిసర భూభాగాలను జయించాడు. హరిశ్చంద్రుడు వేదవిదుడై అనేక శాస్త్రాలను అభ్యసించాడు.

         హరిశ్చంద్రుడికి ఇద్దరు భార్యలు. ఒకరు కులస్త్రీ కాగా, వేరొకరు క్షత్రియ వంశ సంజాత. బ్రాహ్మణ స్త్రీ వల్ల కలిగిన సంతతి ప్రతీహార బ్రాహ్మణులు అని పిలవబడ్డారు. క్షత్రియ వనిత వల్ల కలిగిన సంతానం ప్రతీహార రాజవంశం వారైనారు.

         గుప్తరాజ్యం పతనావస్థలో వున్న సమయంలో హరిశ్చంద్రుడు మిహిరకులుడిని, యశోధరుడిని ఎదిరించి రాజ్యస్థాపన చేశాడు. హరిశ్చంద్రుడు తాను స్థాపించిన ఘూర్జర రాజ్యాన్ని క్రీస్తుశకం 550 నుండి క్రీస్తుశకం 565 వరకు 15 సంవత్సరాలు పాలించాడు.

         హరిశ్చంద్రుడికి క్షత్రియ రాణి భద్రాదేవి వల్ల నలుగురు కుమారులు పుట్టారు. ఈ నలుగురు వేర్వేరు రాజ్యాల పాలకులుగా వుండేవారు. ఒక కుమారుడు రజ్జల రాజు మాండవ్యపుర రాజ్యాన్ని 25 సంవత్సరాలు పాలించిన తరువాత అతడి కుమారుడు నరభట రాజ్యాదిపత్యాన్ని వహించాడు. ఇతడి పాలనాకాలం క్రీస్తుశకం 590 నుండి క్రీస్తుశకం 620 వరకు, సుమారు 30 సంవత్సరాలు.

         నరభట అనంతరం అతడి కుమారుడు నాగభట మాండవ్యపుర రాజ్య సింహాసనం అధిష్టించాడు. ఇతడి రాజధాని జోధ్పూర్ పట్టణానికి దగ్గరలో వున్న మెడంతకం. నాగభట ఘూర్జర రాజ్యాన్ని క్రీస్తుశకం 620 నుండి క్రీస్తుశకం 640 వరకు సుమారు 20 సంవత్సరాలు పాలించాడు. నాగభట తరువాత ఇతడి వంశానికి చెందిన 8 తరాల వారు, 10 మంది రాజులు సుమారు 200 సంవత్సరాలు ఘూర్జర రాజ్యాన్ని ఏలారు. 

నందిపురి ఘూర్జర వంశం

           నందిపురి ఘూర్జర వంశపు రాజులు, రాజస్థాన ఘూర్జర స్థాపకుడైన హరిశ్చంద్రుడి సంతతివారు. హరిశ్చంద్రుడికి నలుగురు కుమారులు. భోగభట, కక్క, రజ్జిల, దడ్డ  అనే ఆ నలుగురిలో మొదటి ఇద్దరికీ పాలనా విషయాలు అంతగా తెలియదు. కాని రజ్జల మాండ్యపుర రాజ్యాన్ని పాలించగా, దడ్డ నందిపురి రాజ్యపాలనా బాధ్యత వహించాడు.

         ఘూర్జర వంశీయుడైన మొదటి దడ్డరాజు క్రీస్తుశకం 575 లో రాజ్యాదిపత్యాన్ని వహించాడు. ఇతడి వంశీయులు భరుకచ్చం రాజ్యానికి తోడుగా అవంతీనగరం రాజధానిగా కల రాజ్యాన్ని సైతం పాలించారు. వీరు ప్రతీహారులుగా పరిగణింపబడినారు. శాసనాల ఆధారంగా నందిపురి ఘూర్జర రాజ వంశీయులు క్రీస్తుశకం 575 నుండి క్రీస్తుశకం 641 వరకు పాలించారు.

         మొదటి దడ్డరాజు బలపరాక్రమ సంపన్నుడు. ప్రజ్ఞాశాలి. ఇతడు భరుకచ్చం రాజ్య సరిహద్దులలో వున్న నాగ రాజులను ఓడించి, వారి రాజ్యాలను స్వాధీనపర్చుకున్నాడు. మొదట్లో దడ్డరాజు వంశేయులు రాజస్థాన ఘూర్జర రాజుల సామంతులుగా వుంది, తరువాత బాదామీ చాళుక్యుల విధేయ సామంతులుగా మారారు. దడ్డరాజు స్వతంత్ర పాలకుడిగా క్రీస్తుశకం 575 నుండి క్రీస్తుశకం 600 వరకు సుమారు 25 సంవత్సరాలు ఘూర్జర రాజ్యాన్ని పాలించాడు.

         మొదటి దడ్డరాజు కుమారుడు జయభటరాజు. ఇతడు తండ్రితో కలిసి అనేక యుద్ధాలు చేశాడు. ఇతడి పాలనాకాలం 15 సంవత్సరాలు (క్రీస్తుశకం 600-క్రీస్తుశకం 615). జయభటరాజు కుమారుడు రెండవ దడ్డరాజుతండ్రి అనంతరం బ్రోచ్ రాజ్య సింహాసనాన్ని అధిష్టించాడు. ఇతడి రాజ్యానికి ఉత్తరాన మహీనది, దక్షిణాన కిమ్, పడమర సముద్రం, తూర్పున మాళవ, ఖాందేశ్ రాజ్యాలున్నాయి. నందిపురం ఈ వంశీయుల రాజధాని. నందిపుర నగరమే బ్రోచ్ లేక భరుకచ్చం. రెండవ దడ్డరాజు నందిపుర రాజ్యాన్ని క్రీస్తుశకం 615 నుండి క్రీస్తుశకం 635 వరకు 20 సంవత్సరాలు ప్రశాంతంగా పాలించాడు.

         రెండవ దడ్డరాజు కాలం నుండి ఈ వంశీయులు కాలచురి రాజ వంశీయులతో వైరం కలిగి వున్నారు. రెండవ దడ్డరాజు బాదామీ చాళుక్యుల సామంతుడు. ఇతడు, ఇతడి వంశీయులు రెండవ పులకేశికి, కాలచురి రాజులతో జరిగిన సంగ్రామాలలో సహాయపడ్డారు. కాలచురి రాజ్యాన్ని జయించిన చాళుక్యులు ఆ రాజ్యాన్ని తమ రాజ్యంతర్భాగంగా గ్రహించారు. రెండవ దడ్డరాజు తరువాత అతడి కుమారుడు రెండవ జయభట, అతడి వంశీయులైన మూడవ దడ్డరాజు, మూడవ జయభట, ఆహిరోల, నాలగవ జయభట నందిపురి రాజ్యాన్ని పాలించారు.  

(స్వర్గీయ బిఎన్ శాస్త్రి గారి బ్రాహ్మణ రాజ్య సర్వస్వం ఆధారంగా)

     

      

 

Saturday, April 13, 2024

Indeed, Kanyadaan is Core Ritual of Hindu Marriage : Vanam Jwala Narasimha Rao

Indeed, Kanyadaan is Core Ritual of Hindu Marriage

Vanam Jwala Narasimha Rao

The Hans India (14-04-2024)

{Notwithstanding the Hindu Marriage Act, which says it is not necessary for solemnization of the marriage, the ritual ‘Kanyadaan’ practice of Hindu marriage denotes an essential feature, denoting ‘Giving Away’ of the daughter (bride) by her parents to the bridegroom, treating him as ‘Vishnu,’ and bride as ‘Lakshmi.’ Bride’s father, ‘Kanya Data’ places her right hand into groom’s, known as ‘Pani Grahana,’ a ritual in presence of sacred fire, symbolizing the bride ‘Conceding Her Heart’ to the groom}-Editor Synoptic Note.

Interestingly, a Single Bench Allahabad High Court on March 22, 2024, has held that ‘Kanyadaan’ was not necessary for solemnization of Marriage under the Hindu Marriage Act, and only 'Saptapadi' is an Essential Ceremony. Yes, it is mentioned so, in the Hindu Marriage Act, under Ceremonies that, a Hindu Marriage may be solemnized where the ceremonies include the ‘Saptapadi’ or taking of ‘Seven Steps’ by the Bridegroom and Bride jointly before the sacred fire. Marriage becomes complete and binding when the ‘Seventh Step’ is taken.

Notwithstanding the Act, the Ritual ‘Kanyadaan’ of Hindu Marriage Practice, alone denotes ‘Giving Away’ the daughter (Bride) by her parents to the Bridegroom, treating him as ‘Vishnu,’ and Bride as ‘Lakshmi.’ Bride’s father, ‘Kanya Data’ places her Right Hand into Groom’s, known as ‘Pani Grahana,’ a ritual in presence of sacred fire, symbolizing the bride ‘Conceding Her Heart’ to the Groom. The Groom pledges to treat Bride as an ‘Equal Partner’ and also ‘Take her Responsibility.’ Marriage signifies spiritual and emotional union of two individuals and two families depicting a ‘Way of Life,’

Even Celestial Weddings are performed consistent with similar customs and traditions. For instance, in Sri Sita Rama Kalyanam, Janaka, while giving away his daughter Sita, as ‘Kanyadaan’ said to Rama that, ‘Take her in marriage and take her from her father by holding her palm with your palm.’ Later Rama and Sita holding their palms, performed circumambulations around the Ritual Fire, and around Altar of Fire, what is known as ‘Saptapadi.’

The Hindu Marriage symbolizes ‘Conjugal Dharma’ an unwritten staunch relationship that knows no boundaries, between Husband and Wife. At every stage of marriage, the mantras explicitly reveal this. ‘Kama’ (Lust) one of the four ‘Purusharthas’ namely, ‘Dharma, Artha, Kama and Moksha’ can be dedicated to Dharma as ‘Love’ only through Marriage. Common Well Wishers of prospective Bride and Groom families, as a self-imposed responsibility, normally initiate the ‘Arranged Marriage’ process which is still prevalent in many families. Through them the two families come to know of each other better, that paves way to ‘In Principle Acceptance.’

‘Nischitartham’ or ‘Nischaya Tambulam’ which now is called as ‘Engagement’ on an agreed day is the next step. Exchange of rings, fixing (Muhurta) auspicious date and time of marriage, followed by formal writing of ‘Wedding Invitation Card’ on a white paper duly applying turmeric on four sides etc. are done on that day. Muhurta is fixed based on Bride and Groom’s Birth Stars and Horoscope. Printing and distribution of wedding cards follows. Hindu Marriages are the ‘Social Gatherings’ where among others, prospective brides and grooms meet.

Ritual ‘Snatakam,’ performed either in Bridegroom’s house or in a guest house arranged by Bride’s side, prepares him to leave ‘Brahmacharya’ (Bachelor Life) for ‘Grihastha Ashram’ (Marital Life). The ‘Guru’ (Teacher), here the Purohit guides the Bridegroom, that he shall not ‘Err in the Matter of Truth, Righteousness, and Cleverness.’ Bride and Groom will be Getting Ready with traditional head baths (Mangala Snana) in their respective places. Ritual ‘Ankurarpan’ where nine varieties of seeds (Nava Dhanya) are poured in a mud plate, filled with water, for germination as sprouts takes place.

On the day of marriage, Bride considered as combined form of ‘Laxmi, Parvati, Saraswati’ performs ‘Gouri Pooja’ and Groom considered as ‘Divine form of the Trinity’ performs ‘Vara Pooja’ at their respective places. Meanwhile, Bride’s Father (Kanya Data) accompanied by relatives proceed to Groom’s place and as part of Vara Pooja, wedding Invitations are ceremonially exchanged. Bride’s father formally makes a request to Groom’s relatives to come to marriage. As Groom’s side proceed to marriage venue, Bride continues to perform her Gouri Pooja.

‘Kanya Data’ welcomes Bridegroom, at the entrance of venue, and leads him on to the ‘Kalyan Mandap’ (Marriage Platform). Preceding Marriage Event, Kanya Data performs ‘Pada Prakshalana’ (Washing Groom’s Feet) to the Bridegroom (Treating as Lord Narayana). Bride’s maternal uncle ‘Hosts’ Bridegroom with Honey (Madhu Parkam). Groom wears the new cloths presented to him during ‘Madhu Parka’ and waits for Bride’s arrival.

In the interim, Kanya Data with Groom’s father arrive at ‘Gowri Pooja’ being performed by Bride. ‘Gotra and Pravara’ of both sides are pronounced here, and depending upon the capability of Purohit, it evinces interest. Gotra is the Clan and Pravara denotes genesis and three generations family tree. Then Groom’s father makes a request to Kanya Data to give his daughter for marriage with his son. After Kanya Data consents, the next step commences. An interesting rather amusing phase of marriage is maternal uncles of the Bride carrying her holding a ‘Coconut Bonda’ in her hands, ceremonially in a ‘Bamboo Basket’ up to the wedding platform, amidst cheers and claps.

Then, despite being elder to Groom, Kanya Data washes Groom’s feet, when Purohit chants Hymns. This is, ‘The Essential Part’ of Kanyadaan. Bride and Groom are literally considered to be alike to ‘Laxmi and Narayana’ respectively and the Marriage is performed as ‘Laxmi Narayana Kalyanam.’ Bride still in the Basket, Purohit delivers ‘Maha Sankalpa’ and proceeds to the next step. Maha Sankalpa comprises Genesis of Creation, Infinite Capabilities of Creator, Cosmic Form, Celestial Position, Seven Islands, Nine Varshas, Nine Continents, Ten Forests, Island of Jambu, Bharata Varsha, Bharata Khanda, and finally venue of Kanyadaan with geographical boundaries.

After this ‘Kanyadaan’ at the auspicious Muhurta as fixed already, Purohit recites as ‘Kanyam Kanaka Sampannam Kanakabharanairyutam! Daswami Vishnave Tubhyam Brahma Loka Jagishiya.’ Kanya Data thus offers his daughter to Groom, to attain ‘Brahma Loka.’ Kanya Data pours water in the hands of Groom and says that, despite her marriage with him, ‘She shall be my Daughter.’ Kanya Data administers Oath with Groom as, ‘Dharmecha, Arthecha, Kamecha, Esha Nathi Charitavya.’ Bride responds as ‘Nathi Cha Rami’ thrice. Exactly on dot at the auspicious Muhurta, Purohit makes both Bride and Groom, to apply paste made of ‘Cumin stick-jaggery’ on each other’s head. 

 ‘Mangalya Dharana’ follows next. Indian and Hindu Tradition is, from the time of marriage, women wear round the neck, the ‘Mangal Sutra’ often referred as ‘Shata Manas’ and made of Gold, one of the two by Bride’s side and the other by Groom’s side, and which is knotted by the Groom. When musical instruments are played and when Pujari recites ‘Mangalyam Tantunanena Mamajivana Hetuna! Kanthe Midnami Subhage Tvam Jiva Sharadam Shatam’ the Bride Groom ties the Sutra around the neck of Bride with three knots, representing Three Worlds, Trinity, and Sattva-Raja-Tamo qualities. Veda Pundits bless the couple as, ‘Shatamanam Bhavathi, Shatayu: Purusha.’

After the Mangalya Dharana, the most uproarious, hilarious, and funny event of Marriage, pouring of ‘Talambralu’ prepared with Rice mixed in Cumin Powder Liquid, Ghee, Cow Milk etc. giving a yellow look, by bride and groom on each other head, in competition follows. Friends and Relatives enjoy a lot and encourage both taking sides. This is followed with tying one end of bride’s saree with bride groom’s one attire (Uttariyam) end, suggesting that henceforth they are together in every activity and she as the ‘Owner of the House’ shall hold all responsibilities.

Next event is ‘Sthalipakam’ near a Sacred Ritual Fire known as ‘Homam.’ Here the Most Important part of Hindu Marriage ‘Saptapadi’ or solemnization of Marriage under the Hindu Marriage Act, takes place, where, Fire God (Agnihotra) as a witness, the Bride and Bridegroom take seven steps, starting with the right foot of the bride, and circumambulations around the Ritual Fire and around Altar of Fire. This signals the ultimate step into ‘Grihastha Ashram’ and with this the bride’s Gotra, Pravara, Surname changes to that of Bride Groom.  The other rituals are: ‘Nagavalli, Sadashyam, and finally Appagintalu (Physically passing on the Bride to Groom’s family elders).’

Every step of Hindu Marriage is an ‘Essential Implicit Feature’ of ‘Kanyadaan.’

  

Sunday, April 7, 2024

పృధ్వీ మూలరాజు వంశం, గుప్త వంశం (బ్రాహ్మణ రాజులు-11, 12) : వనం జ్వాలా నరసింహారావు

 పృధ్వీ మూలరాజు వంశం, గుప్త వంశం

(బ్రాహ్మణ రాజులు-11, 12)

వనం జ్వాలా నరసింహారావు  

సూర్యదినపత్రిక (08-04-2024)

పృధ్వీ మూలరాజు వంశం

వేంగీ నగరం రాజధానిగా ఆంధ్రదేశాన్ని పాలించిన శాలంకాయన రాజుల సామంతులుగా, గుణపాశపురం రాజధానిగా, తీరాంధ్రాన్ని ఏలిన మూలరాజు వంశీయులు పరాక్రమవంతులు. సాహసోపేతులు. అరివీర భయంకరులు. శాలంకాయన రాజులలో చివరివారు భీరువులై, అసమర్థులై, భోగలాలసులై, వున్న తరుణంలో మూలరాజు వంశీయుడైన ప్రభాకర మహారాజు స్వతంత్రుడై, తన పరిధి రాజ్యాన్నే కాకుండా, పరిసర సామంతులను ఓడించి, విశాల రాజ్యాన్ని నెలకొల్పి పాలించాడు. ఈ వంశీయులు బ్రాహ్మణులు. ఈ వంశానికి ఆద్యుడు ప్రభాకర మహారాజు.

         ప్రభాకర మహారాజు శక్తిసంపన్నుడు. యుద్ధ విద్యా విశారదుడు. సాహసి. ఇతడు శాలంకాయన ప్రభువుల సామంతుడిగా వుండి, విష్ణుకుండినుల విజృంభణాన్ని గమనించి, స్వాతంత్ర్యం ప్రకటించి, విష్ణుకుండినుల వంశీయులతో వైవాహిక సంబంధాలను ఏర్పరుచుకుని, తన సామంత రాజ్యాన్ని సుస్థిరపర్చుకున్నాడు. ఇతడు సుమారు 38 సంవత్సరాలు (క్రీస్తుశకం 360-398) పాలించాడు.

         ప్రభాకర మహారాజు మరణానంతరం అతడి కుమారుడు పృధ్వీమూలరాజు సింహాసనాన్ని అధిష్టించాడు. పృధ్వీమూలరాజు శక్తిసంపన్నుడు. అనేక యుద్ధాలలో విజయాన్ని సాధించాడు. ప్రభు భక్తి పరాయణుడు. యుద్ధ విద్యా విశారదుడు. పృధ్వీమూలరాజు రాజకీయ పరిజ్ఞాని. భవిష్యత్కాలాన్ని గమనించి, తండ్రి ప్రభాకర మహారాజు ఆజ్ఞానుసారం, తన ఏకైక కుమార్తె పరమ భట్టారికా మహాదేవిని విష్ణుకుండిన రాజ్యాన్ని ఏలుతున్న మొదటి గోవిందవర్మకు ఇచ్చి వివాహం చేశాడు. పృధ్వీమూలరాజు వివేకనయ విద్యా సంపన్నుడు. యుద్ధ విద్యలలో ఆరితేరినవాడు. అనేక యుద్ధాలలో పాల్గొన్నాడు. విష్ణుకుండినుల సామంత రాజుగా వారికి తోడ్పడి వారి రాజ్య విస్తరణకు సహాయం చేశాడు. ఇతడి పాలనా కాలం క్రీస్తుశకం 398-460, సుమారు 62 సంవత్సరాలు.

         పృధ్వీమూలరాజు మరణానంతరం అతడి కుమారుడు హరివర్మ మూలరాజ వంశ సింహాసనాన్ని అధిష్టించాడు. ఈ వంశీయుల రాజధాని గుణపాశపురం, నేటి తూర్పు గోదావరి జిల్లాలోని తాడూరు. హరివర్మ తన మేనల్లుడు విష్ణుకుండిన రెండవ మాధవ వర్మకు తన ఏకైక కుమార్తెను ఇచ్చి వివాహం చేయడమే కాకుండా, శాలంకాయన రాజ్యాన్ని విష్ణుకుండిన మహాసామ్రాజ్యంలో విలీనం కావడానికి తోడ్పడ్డాడు. హరివర్మ క్రీస్తుశకం 460-528 మధ్య కాలంలో సుమారు 68 సంవత్సరాలు పాలించాడు.

         హరివర్మ కుమారుడు మూలరాజు. ఇతడు పల్లవ  సింహవర్మను ఓడించి తన ప్రభువైన విక్రమేంద్ర భట్టారకునికి విజయం చేకూర్చాడు. ఇతడి పాలనా కాలం క్రీస్తుశకం 528-580, సుమారు 52 సంవత్సరాలు. మూలరాజుతో ఈ వంశం అంతరించినది.        

గుప్త వంశం

           కుషాణు, శాతవాహన వంశాలు పతనమైన అనంతరం భారతదేశ చరిత్రలో ప్రముఖ స్థానాన్ని ఆక్రమించిన రాజవంశం గుప్త వంశం.ఈ వంశీయుల పాలన క్రీస్తుశకం 275 నుండి ప్రారంభమైంది.కాకపోతే ఈ వంశపు రాజుల అభ్యున్నతి మాత్రం క్రీస్తుశకం 320 నుండి ఆరంభమైంది. శక రాజులు, క్షహరాట వంశీయులు భారతావని పశ్చిమ భాగంలోను, ఉత్తర భాగంలోనూ, చిన్న-చిన్న రాజ్యాలను స్థాపించుకుని పాలిస్తూ ప్రబల శక్తి సమన్వితులై వున్న సమయంలో గుప్త వంశీయుల పాలన మొదలైంది. గుప్త రాజుల పరిపాలనను స్వర్ణయుగ పాలనగా పరిగణింపబడుతున్నది. భారతీయ సంస్కృతీ వికాసానికి ఈ వంశీయులు దోహద పడ్డారు. భారత జాతి ప్రపంచంలో ఉన్నత సంస్కారంగల జాతిగా గుప్తుల కాలంలో ప్రసిద్ధికెక్కింది. పదమూడుమంది గుప్త వంశపు రాజులు క్రీస్తుశకం 275 నుండి క్రీస్తుశకం 600 వరకు భారత భూభాగాన్ని ఏలారు. ఈ వంశీయులలో ప్రథముడు శ్రీగుప్తుడు.

         గుప్త వంశ చక్రవర్తులు బ్రాహ్మణులు. గుప్త వంశానికి చెందిన రెండవ చంద్రగుప్త సార్వభౌముడి కూతురు ప్రభావతీ గుప్త వాకాటక ప్రభువైన రెండవ రుద్రసేనుడిని వివాహం చేసుకున్నది. వాకాటకులు బ్రాహ్మణులు. గుప్త, వాకాటక రాజ వంశాలకు చెందిన ధారణ, విష్ణువృద్ధ గోత్రాలు బ్రాహ్మణులలో సుప్రసిద్ధమైన అగస్త్య, భారద్వాజ గోత్రాంతర్గతాలు. గుప్త యుగానికి చెందిన రాజన్యులు బ్రాహ్మణులైనప్పటికీ, వారు తమ పేరు చివర పితృ వంశ నామాలనే నిలుపుకున్నారు.

         గుప్త వంశ స్థాపకుడు శ్రీగుప్తుడు. ఇతడి పూర్వీకులు శాతవాహన నరేంద్రులకు, కుషాణు వంశపు రాజులకు విదేయ సామంతులుగా వుండి పాటలీపుత్ర ఉత్తర పరిసర ప్రాంతాలను పాలించారు. విదేశీయులైన శక, యవన, పహ్లవ, కుషాణు రాజ వంశీయులు ప్రజా కంటకులుగా మారిన సమయంలో హైందవ మతాన్ని, హిందువుల ఆచార వ్యవహారాలను, సంస్కృతీ సభ్యతలను ఒక శక్తియుతమైన రాజ్యాన్ని స్థాపించడం ద్వారా పూర్తిచేసిన ఘనత గుప్త వంశానికి దక్కింది. శ్రీగుప్తుడు చిన్న రాజ్యాన్ని స్థాపించుకుని, చుట్టుపక్కల వున్న చిన్న సామంత రాజ్యాలను జయించి, తన ఆధిపత్యాన్ని నెలకొల్పాడు. మౌర్య, శాతవాహన సామ్రాజ్యాల నాటి ప్రాభవాన్ని పునరుద్ధరించడానికి ఆవిర్భవించిన రాజ వంశం గుప్త వంశం. శ్రీగుప్తుడు యుద్ధ విద్యలలో ఆరితేరినవాడు. అసహాయశూరుడు. గుప్త రాజ్యాన్ని అతి వైభవంగా పాలించాడు. పరమత సహనం కల ఈ రాజు అనేక దేవాలయాలను నిర్మించాడు. పాటలీపుత్ర నగరాన్ని జయించి, దానిని తన రాజధానిగా చేసుకుని, చుట్టుపక్కల వున్న రాజ్యాలను జయించాడు. ఇతడు సుమారు 25 సంవత్సరాలు (క్రీస్తుశకం 275-3000) పాలించాడు.

         శ్రీగుప్తుడు మరణించిన తరువాత అతడి కుమారుడు ఘటోత్కచుడు మగథ సింహాసనాన్ని అధిష్టించాడు. ఇతడు గుప్త సామ్రాజ్యాన్ని విస్తృత పర్చాడు. ఇతడు అనేక సంస్కరణలను ప్రవేశ పెట్టి ప్రజాభిమానాన్ని చూరగొన్నాడు. పాటలీపుత్ర మహానగరాన్ని తీర్చిదిద్దిన ఘనుడు. ఇతడు 20 సంవత్సరాలు (క్రీస్తుశకం 300-320) పాలించాడు.

ఘటోత్కచుడి మరణానంతరం అతడి కుమారుడు మొదటి చంద్రగుప్తుడు మగథ రాజ్య సింహాసనం అధిష్టించాడు. ఇతడు గొప్ప విజేతగా, అరివీరభయంకరుడిగా కీర్తి గాంచాడు. లిచ్చవీ రాజవంశీయులతో సంబంధ బాంధవ్యాలను ఏర్పరచుకున్నాడు. తనమీద దండెత్తిన లిచ్చవీ వంశీయులు ఇతడి పరాక్రమాన్ని చూసి సంధి చేసుకున్నారు. వారి రాజ్యాలన్నీ మగథ సామంత రాజ్యాలుగా వుండడానికి అంగీకరించారు. చంద్రగుప్తుడు రాజ్యానికి వచ్చిన క్రీస్తుశకం 320 నుండి గుప్త శకం ప్రారంభమైంది. ఇతడు క్రీస్తుశకం 326 వరకు 6 సంవత్సరాలు పాలించాడు. గుప్తరాజ్యాన్ని ఉన్నత స్థితికి తీసుకు రావడానికి కృషి చేసిన మహారాజుగా కీర్తి గాంచాడు.

మొదటి చంద్రగుప్తుడి అనంతరం అతడి కుమారుడు సముద్రగుప్తుడు మగథ సామ్రాజ్యాధిపతి అయ్యాడి. సముద్రగుప్తుడు గుప్త రాజులలో గొప్ప విజేతగా కీర్తిని పొందినవాడు. అసాదారణ ప్రజ్ఞాపాటవాలు వున్నవాడు. రాజకీయ పరిజ్ఞాని. శక్తిమంతుడు. యుద్ధవిద్యా విశారదుడు. సంగీత సాహిత్యాలను క్షుణ్ణంగా అభ్యసించాడు. అనితర సాధ్యమైన దండయాత్రలు నిర్వహించి, అనేకమంది రాజులను ఓడించిన మహావీరుడు. ప్రపంచ విజేతలలో ఒకడు. పాటలీపుత్రనగరాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి పరచాడు. మగథ సామ్రాజ్యాన్ని క్రీస్తుశకం 326 నుండి క్రీస్తుశకం 375 వరకు సుమారు 50 సంవత్సరాలు అతి వైభవంగా పాలించాడు. అనేక దండయాత్రలు (ఉత్తర, దక్షిణ భారత) చేశాడు. విశాల సామ్రాజ్యంగా మగథ రాజ్యాన్ని స్థాపించాడు. సముద్రగుప్తుడు చక్రవర్తి. భారతదేశం విచ్చిన్నమై అదఃపతనమవుతున్న సమయంలో భారతజాతిని ఉద్ధరించడానికి, దేశ సమగ్రతను కాపాడడానికి, భారత జాతి సంస్కృతీ సభ్యతలను, ఆచార వ్యవహారాలను పరిరక్షించడానికి దండయాత్రలు చేసి మహాస్మారాజ్య నిర్మాణం చేసిన ఘనుడు.

సముద్రగుప్తుడి మరణం తరువాత అతడి జ్యేష్ట కుమారుడు రామగుప్తుడు మగథరాజ్య పీఠాన్ని క్రీస్తుశకం 375 లో అలంకరించాడు. అతడు పిరికివాడు. రాజ్యపాలనా విషయ పరిజ్ఞాని కాదు. శకరాజుల ప్రాబల్యానికి లోబడినవాడు. అతడెక్కువ రోజులు పాలించలేదు. క్రీస్తుశకం 375 లోనే సముద్రగుప్తుడి రెండవ కుమారుడు రెండవ చంద్రగుప్తుడు (చంద్రగుప్త విక్రమాదిత్యుడు) మగథరాజ్య సింహాసనం అధిష్టించాడు. భారతదేశ చరిత్రలో అసలు సిసలు స్వర్ణయుగం చంద్రగుప్తుడి కాలంలోనే అని చరిత్రకారులు అంటారు. చంద్రగుప్తుడు విద్యావైదుష్యాలు కలవాడు. ధర్మశాస్త్రజ్ఞుడు. వీరాధివీరుడు. చంద్రగుప్తుడు కాశ్మీర దేశాన్ని జయించాడు. ఇతడు బలవంతులైన రాజులతో సంబంధ బాంధవ్యాలు ఏర్పరచుకుని తన రాజనీతిజ్ఞతను ప్రకటించుకున్నాడు. ఇతడు మగథ రాజ్యాన్ని 38 సంవత్సరాలు (క్రీస్తుశకం 375-413) పాలించాడు.

చంద్రగుప్త విక్రమాదిత్యుడి రెండవ రాణి ద్రువాదేవికి జన్మించిన మొదటి కుమార గుప్తుడు యువరాజుగా వుండి తండ్రి మరణానంతరం గుప్త సామ్రాజ్యాధినేత అయ్యాడు. తాత, తండ్రులు ఆర్జించి ఇచ్చిన సామ్రాజ్యాన్ని అన్యాక్రాంతం కాకుండా మొదటి కుమారగుప్తుడు జీవిత చరమ దశ దాకా పాలించాడు. సముద్రగుప్తుడి లాగానే ఇతడు అశ్వమేధ యాగం చేశాడు. కుమారగుప్తుడి అవసాన దశలో పుష్యమిత్ర జాతులవారు మగథ రాజ్యం మీద దండెత్తారు. మగథ సైన్యం ఓటమి చవి చూసింది. ఓడిపోయే సమయంలో ఆ ఆటవిక సైన్యాన్ని కుమారగుప్తుడి కుమారుడు, యువరాజైన స్కందగుప్తుడు ఎదిరించి పోరాడి వారిమీద విజయం సాధించాడు. ఆ విధంగా గుప్త వంశీయుల గౌరవాన్ని కాపాడాడు. కుమారగుప్తుడు విశాల మగథ సామ్రాజ్యాన్ని 42 సంవత్సరాలు (క్రీస్తుశకం 413-455) పాలించాడు.

మొదటి కుమారగుప్తుడి మరణానంతరం అతని కుమారుడు స్కందగుప్తుడు రాజయ్యాడు. స్కందగుప్తుడు సమర వ్యూహ రచనా నిపుణుడు. స్కందగుప్తుడి పాలనారంభ కాలంలో అతడు హూణుల మీద సాధించిన విజయం దేశంలో శాంతి భద్రతలు నెలకొల్పడానికి తోడ్పడింది. కాని, క్రీస్తుశకం 465 లో హూణుల దండయాత్రలు తిరిగి మొదలయ్యాయి. గుప్తసామ్రాజ్యంలో అనేక భూభాగాలను జయించారు వారు. మగథ సైన్యం హూణులను ఎదిరించి ఓడిపోయింది. రాజ్య భాగాలను హూణుల పరం చేయాల్సి వచ్చింది. ఈ యుద్ధం వల్ల గుప్త సామ్రాజ్యం ఆర్థికంగా క్షీణించింది. స్కందగుప్తుడి సవతి సోదరుడు పూరుగుప్తుడు  తిరుగుబాటు చేశాడు. ఇంతలో హూణులతో జరిగిన యుద్ధంలో స్కందగుప్తుడు మరణించాడు. ఇతడి పాలనాకాలం 18 సంవత్సరాలు (క్రీస్తుశకం 455-473).

స్కందగుప్తుడి తరువాత పూరుగుప్తుడు గుప్త సామ్రాజ్యాధిపతి అయ్యాడు. ఇతడు మూడు సంవత్సరాలు మాత్రమే (క్రీస్తుశకం 473-476) పాలించగలిగాడు. వాస్తవానికి స్కందగుప్తుడి తరువాత గుప్తరాజుల చరిత్ర సమగ్రంగా లేదు. పూరుగుప్తుడి కాలం నుండి గుప్తవంశం రెండు శాఖలుగా చీలిందని కొందరు చారిత్రకారులు అంటారు కాని అది వాస్తవం కాదు. పూరుగుప్తుడి కుమారుడు బుధగుప్తుడు తండ్రి తరువాత రాజయ్యాడు. ఇతడు సుమారు 19 సంవత్సరాలు (క్రీస్తుశకం 476-495) రాజ్యం ఏలాడు. బుధగుప్తుడు నామ మాత్రపు రాజు మాత్రమే. బుధగుప్తుడి తరువాత వైశ్యగుప్తుడు, భానుగుప్తుడు నరసింహగుప్త బాలాదిత్యుడు పాలించారు.

ఆ తరువాత మిహిరకులుడు, మూడవ కుమారగుప్తుడు, యశోధర్మ విక్రమాదిత్యుడు, మాతృగుప్తుడు, ప్రవరసేనుడు రాజులయ్యారు. మూడవ కుమారగుప్తుడి తనయుడు దామోదరగుప్తుడు రాజ్యానికి వచ్చిన కొద్ది కాలానికే మౌఖరి ఈశానవర్మ సంతతివారితో సంభవించిన యుద్ధంలో మరణించాడు. ఇంతటితో గుప్తవంశం సమూలంగా నిర్మూలించబడింది.

(స్వర్గీయ బిఎన్ శాస్త్రి గారి బ్రాహ్మణ రాజ్య సర్వస్వం ఆధారంగా)