Sunday, February 25, 2024

పాశ్చాత్య దేశాలకు పాకిన వేదంలోని భారత వైద్య విధానం ..... అప్రాకృత కృత్రిమ సంతానం, శస్త్ర చికిత్స, అవయవాలు అతికించడం వేదకాలం నాటిదే : (ఋగ్యజుస్సామాథర్వ వేదాల సారం-13) వనం జ్వాలా నరసింహారావు

 పాశ్చాత్య దేశాలకు పాకిన వేదంలోని భారత వైద్య విధానం

అప్రాకృత కృత్రిమ సంతానం, శస్త్ర చికిత్స, అవయవాలు అతికించడం వేదకాలం నాటిదే  

ఋగ్యజుస్సామాథర్వ వేదాల సారం-13

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (26-02-2024)

‘బ్రహ్మయే బ్రహ్మను పుష్కర క్షేత్రంలో ప్రతిష్టించాడు. అలా ప్రభవించిన బ్రహ్మ చింతించాడు. సమస్త వాంఛలను, సమస్త లోకాలను, సమస్త దేవతలను, సమస్త వేదాలను, సమస్త యజ్ఞాలను, సమస్త శబ్దాలను, సమస్త వర్షాలను, స్థావర జంగమాత్మక సమస్త భూతాలను, ఒకే అక్షరంలో అనుభవించడం ఎలా? అనుకుని అతడు బ్రహ్మచర్యాన్ని ఆచరించాడు. “ఓమ్” అనే అక్షరాన్ని దర్శించాడు. అది మూడు వర్ణాలది. నాలుగు మాత్రలది. సర్వ వ్యాపి (గోపథ బ్రహ్మణం). ప్రణవంలోని మొదటి మూడు మంత్రాలతో ఋగ్యజుస్సామ వేదాలను ప్రతిపాదించి చివరకు అన్నాడు. ప్రణవపు నాల్గవ మాత్రమకారం నుంచి జలాన్ని, చంద్రుడిని, అథర్వ వేదాన్ని, స్వయాన్ని దర్శించాడు. ప్రణవపు చివరి మాత్ర అథర్వ వేదం అయినందున వేదాలలో అథర్వ వేదం నాలుగవది అయింది’.

         ‘పూర్వం స్వయంభువ బ్రహ్మ సృష్టి చేయాలనుకున్నాడు. తపస్సు ప్రారంభించాడు. తపస్సు వల్ల బ్రహ్మ రోమకూపాలన్నింటి నుంచి స్వేదం ప్రవహించింది. ఆ స్వేద జలంలో బ్రహ్మ తన నీడ చూశాడు. అప్పుడు అతడి వీర్య స్ఖలనం జరిగింది. జలంలో వీర్యం పడింది. స్వేదజల సహిత వీర్యం రెండు భాగాలు అయింది. ఒక భాగపు వీర్యం పక్వం అయింది. అది “భృగు” మహర్షి రూపం దాల్చింది. అప్పుడు బ్రహ్మ అంతర్థానం అయ్యాడు. భృగువుకు కనిపించలేదు. ఆ ఋషి బ్రహ్మను దర్శించాలనుకున్నాడు. వ్యాకుల పడ్డాడు. బాధపడ్డాడు. భృగువు బాధను ఆకాశం భరించలేక పోయింది. ఆకాశవాణి పలికింది. “అథార్వాగ్ ఏనమ్ ఏతాస్వేవాస్వ్యన్విచ్చ”, అంటే, “నువ్వు చూడాలనుకుంటున్న వానిని జలమధ్యంలో అన్వేషించు” అని చెప్పింది. ఆకాశవాణి భృగువును “అథర్వాక్” అని పిలిచింది. అందువలన భృగువు, అథర్వుడు కూడా అయ్యాడు. తరువాత మిగిలిన రేతస్సు, జలం పక్వమయ్యాయి. బ్రహ్మ నోటి నుండి వరుణ శబ్దం వెలువడింది. అతడి అవయవాల నుండి రసం ప్రవహించింది. అందులోంచి “అంగిరస” మహర్షి ఆవిర్భవించాడు. అంగములలోని రసం నుండి పుట్టాడు. అందువల్ల “అంగీరసుడు” అయ్యాడు.

         ‘ఆ విధంగా బ్రహ్మ నుంచి అయోనిజులుగా భృగు, అంగీరస మహర్షులు ఆవిర్భవించారు. పాశ్చాత్యులు భావిస్తున్నట్లు అయోనిజ జననాలు పుక్కిటి పురాణాలు కావు. సనాతన, పురాతన, మహోన్నత భారత సంస్కృతి, నాగరికత, తాత్త్వికతలను అర్థం చేసుకోలేని కుహనా మేధావులు వారు. కృత్రిమ సంతానం ఆధునిక సైన్స్ కనుగొన్నదనడం శుద్ధ పొరపాటు. భారత ఇతిహాసంలో ఏనాటి నుంచో అప్రాకృత కృత్రిమ సంతానం గురించి వివరంగా ఉన్నది. కుమారస్వామి, ద్రోణుడు, ద్రోణి, కౌరవులు వీరంతా కృత్రిమ సంతానమే! అలాగే శస్త్ర చికిత్స (సర్జరీ) భారత వైద్యంలో అనాదిగా ఉన్నది. అశ్వినులు భోజరాజు మెదడు ఆపరేషన్ చేసి చికిత్స చేసినట్లు ఉన్నది. అవయవాలు అతికించడం ఘనంగా చెప్పుకుంటుంది అలోపతి వైద్యం. దక్షుడికి మేక తల, వినాయకుడికి ఏనుగు తల శస్త్ర చికిత్స ద్వారా విజయవంతంగా అమర్చిన మహా చరిత్ర ఆయుర్వేదానిది! యువనాశ్వుడు పురుషుడు. స్త్రీ సంపర్కం లేకుండా అతడికి గర్భం కలిగించి మాంధాతను పుట్టించింది భారత వైద్య శాస్త్రం. భృగు, అంగీరసుల జన్మకు ఏదో శాస్త్రాధారం ఉండి తీరాలి’.

         ‘భారత వైద్య విధానం ఇవ్వాళ పాశ్చాత్య దేశాలకు పాకింది అంటే దాని బలం గుర్తించాలి. భారత ప్రజగా గర్వించాలి. బ్రహ్మ అథర్వ, అంగిరసులను తపస్సు చేయమన్నాడు. వారు తపస్సు చేశారు. అలా తపస్సు చేస్తున్నప్పుడు బ్రహ్మ వారికి ఒక వేదాన్ని దర్శింప చేశాడు. దాన్ని “అథర్వ అంగిరో వేదం” అన్నారు. అథర్వ, అంగిరసులు దర్శించి నందున దానికి ఆ పేరు వచ్చింది. అథర్వ వేదానికి గల ఇతర నామాలలో “అధర్వాంగిరం” ఒకటి. అథర్వ, అంగిరసుల తపః ప్రభావంతో వారు ఎకర్చ, ద్విర్చాది ఇరవై మంత్ర దళాలను దర్శించారు. అందువల్ల అథర్వ వేదంలో ఇరవై కాండలున్నాయి. ఈ వేదం తపస్సు నుంచి ఆవిర్భవించింది. బ్రహ్మ జ్ఞానుల హృదయం నుంచి సంభవించింది. కాబట్టి శ్రేష్టం. భృంగి రంగిరోవేదమే బ్రహ్మ వేదం అవుతున్నది. అంగిరస మనేది రసం. అథర్వమనేది వైద్యం. వైద్యమే అమృతం అవుతున్నది. అమృతమే బ్రహ్మ. అథర్వ వేదానికి బ్రహ్మ వేదమని కూడా పేరు. అథర్వ వేదంలో చికిత్స చెప్పబడింది. అందువల్ల అది భేషజ వేదం అన్నారు. రస ప్రధానమైనందువల్ల రస వేదం అవుతున్నది. అథర్వ మంత్రాలు లభించిన వారికి తిథి, నక్షత్ర, గ్రహ, చంద్రులతో సంబంధం లేకుండా సర్వసిద్ది కలుగుతుంది. అన్నీ లభిస్తాయి. అథర్వ వేద మంత్రాలను భక్తి శ్రద్ధలతో పఠించాలి. అప్పుడే ఆ మంత్రాల ఫలితం లభిస్తుంది’.

         ‘సాయణాచార్యుడు పూర్వ, ఉత్తర మీమాంసలను సంగ్రహంగా వ్యాఖ్యానించి, వేదాలకు అర్థం చెప్పడానికి ఉద్యమించాడు. ఆముష్మిక ఫలాలను ప్రసాదించే నాలుగవ వేదాన్ని వ్యాఖ్యానించాడు. అథర్వ వేదం వ్యాఖ్యానించే ముందర చెప్పిన శ్లోకాలలో హరిహరుడు తనను అథర్వ వేదం వ్యాఖ్యానించమని కోరడాన్ని చెప్పాడు. సాయణాచార్యుడు ఒక్కడే చతుర్వేద వ్యాఖ్యాత. అతడి వ్యాఖ్యానం లేని వేదం అర్థం కాదు. విజయనగర సామ్రాజ్య రాజుల పోషణలో సాయణాచార్యుడు వేదాలకు భాష్యం రాశాడు. ప్రాక్, పాశ్చాత్య విద్వాంసులందరూ సాయణాచార్యుడి భాష్యంతోనే వేదాన్ని అర్థం చేసుకున్నారు. సాయణాచార్యుడు వివరించిన ప్రతిదానికీ పూర్వ ప్రమాణాలు చూపించాడు.

సాయణాచార్యుడు, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం “ఆముష్మిక ఫల ప్రదములు” అన్నాడు. ఆముష్మికం అంటే పరలోక సంబంధం. వేదంలో పరలోకం అంటే స్వర్గం మాత్రమే! దుఃఖం లేని చోటు అన్నది యజుర్వేదం. వేదంలోని స్వర్గం పురాణాలలోని స్వర్గం లాంటిది కాదు. అక్కడ రంభ, ఊర్వశి, మేనక వారి పొందులు ఉండవు. ఇంద్రుడు నిరంతరం తపస్సులు చెడగొట్టడు. ప్రతిసారీ రాక్షసులు స్వర్గం మీదకు దండెత్తరు. పురాణ స్వర్గంలో ఎవరూ ఎప్పటికీ ఉండరు. సంపాదించుకున్న పుణ్యం క్షీణించగానే మానవ లోకంలోకి ప్రవేశిస్తారు. మన సనాతనులు ప్రతిదానికీ ఆధ్యాత్మిక ముద్ర వేశారు. ఆధ్యాత్మికం, ఆముష్మికం మనసుకు సంబంధించింది అనుకోవచ్చు. దేహానికి సంబంధించింది ఐహికం. ఆ దృష్టితో అథర్వ వేదంలో వైద్యం, వాస్తు లాంటి దేహ సౌఖ్యాలతో పాటు మానసిక విషయాలు చాలా ఉన్నాయి’.   

          అథర్వ వేదానికి బ్రహ్మ వేదం, భిషగ్వేదం, క్షత్రవేదం అనే పేర్లున్నాయి. అంగిరో వేదం, అథర్వ వేదం, అథర్వాంగిరో వేదాన్ని గురించి కూడా తెలుసుకున్నాం. ఋగ్వేదంలో హోతను, యజుర్వేదంలో అధ్వర్యును, సామవేదంలో ఉద్గాతను, అథర్వాంగిరో వేదంలో బ్రహ్మను ఏర్పరుచుకోవాలి. అథర్వ యజ్ఞాన్ని బ్రహ్మ అనే పురోహితుడు నిర్వహిస్తాడు. అందువల్ల అది బ్రహ్మ వేదం అయింది. ఋగ్వేదం ప్రకారం కర్మ చేసిన వారి పితరులకు పాలనదులు ప్రవహిస్తాయి. యజస్సుల మంత్రాలకు పితరులకు ఘృత నదులు ప్రవహిస్తాయి. సామవేద కర్మల పితరులకు సోమ నదులు ప్రవహిస్తాయి. అథర్వాంగిరో వేదకర్మ చేసినవారి పితరులకు మధు నదులు ప్రవహిస్తాయి. బ్రహ్మ వేదంతో కూడని యజ్ఞం భ్రష్టం అవుతుంది’.

         ‘భేషజమే బ్రహ్మ అంటారు. అథర్వణ౦ వైద్యం, చికిత్స అనీ, వైద్యమే అమృతం అనీ, అమృతమే బ్రహ్మ అనీ, ఆరోగ్యమే బ్రహ్మ! అనీ అంటారు. ఉపవేదాలు నాలుగున్నాయి. అవి వరుసగా: ఆయుర్వేదం, గంధర్వ వేదం, ధనుర్వేదం, అర్థ వేదం. ఈ నాలుగు ఉపవేదాలకు అథర్వ వేదం యోనిప్రాయంగా కనిపిస్తుంది. వేదం శాస్త్రానికి మూలం అవుతుంది. ఆధారం అవుతుంది. శాస్త్రం మాత్రమే కాదు, వేదం పురుషుడే సర్వం అవుతున్నాడు. జరిగినది, జరగనున్నది సర్వం వేదమే! అథర్వ వేదంలో అనేక చికిత్సలు ఉన్నాయి. ఇవి రెండు రకాలు. ఒకటి మూలికా చికిత్స, రెండవది అభిచారం. మూలికా చికిత్స దేహానికి సంబంధించినది. వ్యాధి ఉపశమనానికి, నివారణకు, నిర్మూలించడానికీ ఉపయోగపడుతుంది. అభిచారాదులు మనిషిగా, మానసికంగా సంతృప్తి పరచడానికి ఉపకరిస్తాయి. ఇవి కాస్త మోటుగా, క్రూరంగా కూడా ఉంటాయి’.

‘ఈ వేదంలో వీటికి బహుళ ప్రయోజనాలు కనిపిస్తాయి. యుద్ధాల్లో కూడా శత్రువును బలహీనపరిచే ప్రయోగాలున్నాయి. వైద్యంలోనూ, అభిచారంలోనూ బహు విధానాలు చెప్పడం జరిగింది. ఈ వేదంలో తొలి సూక్తమే “మేదాజన సూక్తం”. ఇది ధారణ శక్తి కోసం చెప్పిన సూక్తం. జ్ఞాపకం పెంచడానికీ, నేర్పిన దాన్ని మరవకుండడానికి చెప్పిన సూక్తం. వాత, పిత్త, కఫాదులు, శ్వాసకాస, గుండె జబ్బు, కుష్టు, గండమాల, మూత్ర కృచ్చ్రం, ఉన్మాదం, యక్ష్మ, రాజయక్ష్మ మొదలైన ఎన్నో వ్యాధుల చికిత్స ఈ వేదంలో వివరించడం జరిగింది.

కాకపోతే అందులో చెప్పిన మూలికల ప్రస్తుతపు పేర్లు, అవి అందుబాటులో ఉన్నదీ-లేనిదీ తెలియదు. క్రిములు, వాటివల్ల కలిగే రోగాలు, చికిత్స కూడా చెప్పబడింది. “కంటికి కనిపించే, కనిపించని క్రిములను నాశనం చేస్తున్నాను. రక్తమాంసాలను దూషితం చేసే అల్లమడు, శల్గనామక క్రిములను నాశనం చేస్తున్నాను. ప్రాణ, అపానములారా! ఈ దేహంలోనే ఉండండి. తొందర పడి విడిచి పోకండి. ఇతని అవయవాల పటుత్వం వార్ధక్యం దాకా ఉంచండి” అని మంత్రం ఉంది.

         ‘అథర్వ వేదంలో అనేక రాజకీయ విషయాలున్నాయి. రాజ్యం, రాజ్యాంగం, రాజకీయ వ్యవస్థ వివరంగా దర్శనం ఇస్తుంది. సమితి, సభ, విశః, రాష్ట్రం, రాజ్యం మొదలైన వివరాలున్నాయి. గ్రామాధికారులు, గ్రామ పాలన ఉన్నాయి. ప్రజా ప్రతినిధులు రాజును ఎలా ఎన్నుకోవడం, సమితిలో ప్రసంగాలు, ప్రవచనాలూ ఉన్నాయి. సేనలు, యుద్ధాలు కనిపిస్తాయి. అథర్వ వేదం అనేక విషయాలను వివరిస్తుంది. అథర్వ వేదం అధ్యయనం విశ్వాసంతోనూ, శ్రద్ధ తోనూ, చేయాలి’.

(స్వర్గీయ డాక్టర్ దాశరథి రంగాచార్య వేద సంహితల ఆధారంగా)

(ఇంతటితో ఋగ్యజుస్సామాథర్వ వేదాల సారం సమాప్తం)

 

 

Saturday, February 24, 2024

Invisible, inaccessible Hell, Abode of Terminator Yama : (South Side of ‘Ancient Indian Geography’ as depicted by Maharshi Valmiki) Vanam Jwala Narasimha Rao

 Invisible, inaccessible Hell, Abode of Terminator Yama

South Side of ‘Ancient Indian Geography’ as depicted by Maharshi Valmiki

Vanam Jwala Narasimha Rao

The Hans India (25-02-2024)

{From Mount Rishabha to the terminus of the earth the invincible beings who won heavens will be staying. After that, farther from earth, there is the most dreadful world of manes, namely the Abode of Yama, the Terminator, where none can go beyond this point. That world of manes will be encompassed with an alarming darkness, and it is the capital city of Yama, the Terminator}-Editor Comments

Maharshi Valmiki in his ‘Sanskrit Ramayana’ and Vasudasa Swamy in his verse-by-verse Telugu Transcreation, ‘Andhra Valmiki Ramayana,’ in the ‘Kishkindha Kanda’ recorded natural features in the Southern side of Universe, which for all practical purposes, was the very well scripted ‘Ancient Indian Geography’ more or less Modern Google Maps. Monkeys’ King Sugreeva enlightening Angada, Hanuman, and team of Vanaras, before leaving to search Sita abducted by Demon Ravana, gave a vivid picture and precise account of different spots in the southern side of Jambu Dwipa up to Southern Most Part of travelable regions. Beyond this, there will be the abode of Yama Dharma Raj, God of Termination, the impassable Hell.

Sequentially these locations may concisely be mentioned as, the Thousand Crested Vindhya Mountains, River Narmada coursing little southerly to that range, along with River Godavari, River Krishnaveni, Maha Nadi, River Varada, territories of Mekhala, Utkala, cities of Dasharna, kingdoms of Abravanti, Avanti, Vidarbha, Mahishaka, Vanga, Kalinga, Kaushika territories etc. Mountain Vindhya in fact refers to the branches of whole of Eastern and Western Ghats Range. Similarly, Himalayas were referred to, beginning with Kashmir Western Edge, to Bhutan Eastern Edge. So also, the Hindu Kush. This means that, Vindhya was not simply the Mountain in the River Narmada Region, but beyond.  

Maha Nadi may be the earlier Utkala or Kalinga kingdom (Orissa). Mekhala or the Yamara Kantaka, is the mountain from where the River Narmada emerges. River Varada is now called Wardha in Maharashtra. Avanti kingdom is a gateway for Arabian horses and the present-day Ujjain in Madhya Pradesh. The Vanga is the present-day Bengal which retained its epical name, but while pronouncing it becomes Banga because the Sanskrit Grammar allows to pronounce likewise. Kaushika is also read as Kashika. Kalinga is Orissa which touches Bengal at its north, and it is the Kie-ling-kia as said by Huet Tsang.

Later appear the places, Dandaka Forest, and its Mountains all over, Rivers, Caves, River Godavari passing through Dandaka, Provinces of Andhra, Pundra, Chola, Pandya, Kerala etc. Andhra is the present-day Andhra Pradesh and Telangana, Chola is the Northern Area of present Tamil Nadu, Pundra is somewhere in between Andhra and Chola. Pandya is Southern-Most area, the Kanyakumari or Kanniyakumari, also known as Cape Comorin, a city in the state of Tamil Nadu, and Kerala is the present Kerala state from Gokarna to Kanyakumari.

Then the iron-ore mines as its vast mouth, Mount Malaya, with amazing crests, motley flowered forests, and bushes of Sandalwood Trees will be seen. This Mountain is also called Agasthyamalai Biosphere Reserve, which is a unique site located in the Western Ghats in the Southern part of India from which River Thamirabarani (or Tamraparni or Porunai) emerges. Thereafter will come across divine River Kaaveri, the best river in southern peninsula of India that flows from Braham Giri Mountains in Coorg of Western India to the East draining in Bay of Bengal to where apsaras make pleasure-trips. On top of the splendid Mount Malaya, Sage Agastya sits on the top and none can cross River Tamraparni full of crocodiles, without his consent. One legend is that, Agastya led the course of this River to the ocean for twenty-seven days from its source.

Down South of the River Tamraparni it is Sinhala Desha or the present-day Sri Lanka. From there, while proceeding to the Pandya Kingdome, a fully golden castle-door bracing the compound-wall of the fortress, which is decorated with pearls and jewels, will appear. Then on reaching the Southern Ocean, proceeding further a little, one can reach the glorious Mount Mahendra. Agastya once confined this Mount’s one end in the Ocean, and the other end is only now visible. This Mountain will be completely golden with marvelous terraces and trees, and it will be steeping into ocean on the other side of land, and this mountain becomes the jumping-off point over the see into Lanka. (Mahendragiri is the mountain from which Hanuma leaps to Lanka)

Mount Mahendra is glorified with numerous kinds of flowered trees and mountaineers. Important gods, sages, yakshas and even apsaras will adore it, and it is overspread with the groups of siddhas and Charanas, and thus it will be heart-stealing for a look. And the Thousand-eyed Indra will always be visiting this Mount Mahendra on every auspicious day. There is a dazzling island on the other side of the shore of Mount Mahendra, which is breadthwise a Hundred Yojanas, and which is a closed one for humans. This island on the other shore of the ocean is Ravana's Lanka, and it is believed to be the present-day, Sri Lanka. A Female Demon Anagarika also termed as Simhika whom Hanuma tears apart in Sundara Kanda) will be there in the midst of southern ocean who eats prey by grabbing its shadow when flying overhead.

After hundred yojanas and on crossing over that island, Pushpitaka Mountain, shining forth with a glory similar to sun rays on one side and with that of moon shine on the other, is found in the Ocean, which is adored by the celestials like Siddhas and Charanas. Its lofty crests will look as if they are scribbling on the sky. One of its summit will be golden which the Sun adores, and the other will be silvery whitish which the Moon adores, and that mountain is unperceivable to the unfaithful ones, or to the unkindly ones or to unbelievers. This phenomena of ‘Tropic of Capricorn’ one of the five major circles of latitude marked on maps of Earth, contains the subsolar point and the southernmost latitude where the Sun can be seen directly overhead.

Then on going across that Sacrosanct Mountain and taking a highly treacherous route, after fourteen Yojanas from it, there is the Mountain Suryavantam. On crossing over it, there will be Mountain Vaidyuta whose trees will be all-time heart-pleasing and they yield fruits satisfying every one’s taste. Proceeding further Mountain Kunjara is there which will be pleasing both to eye and heart, on which Vishvakarma built a Mansion, the Golden Abode for Agastya, which will be decorated with numerous gemstones.

Then there is an unvanquishable city named Bhogavati, which is an Abode of Snakes. Deadly serpents with harrowing teeth and fatal venom will be protecting it, in which Vasuki, the most powerful and hazardous king of serpents, will be living. On crossing over that there will be superb Rishabha Mountain which looks like a Holy Bull, and is full with every kind of gemstone. This Mountain is full of Sandalwood Trees of ochry-yellowy, lotus-leaf-greenly, and sky-blue colors. The legend was that, Gandharvas known as Rohita will be protecting this woodland of trees. Five Gandharva kings will be residing there. It is also the dwelling place of those with unusual delicacy or refinement by their pious activities, of whom some resemble the Sun, some Moon, and some Fire by their physique.

From Mount Rishabha to the terminus of the earth the invincible beings who won heavens will be staying. After that, farther from earth there is the most dreadful world of manes, namely the Abode of Yama, the Terminator, where none can go beyond this point. That world of manes will be encompassed with an alarming darkness, and it is the capital city of Yama, the Terminator. After that there is no entry into the abode of Yama for the mortals. This is the Indian Mythological Naraka 'The Hell' and there are various sections in this Hell for various sins committed while alive or on rebirth, of course if one believes!!!

(Courtesy: Vasudasa Swamy ‘Andhra Valmiki Ramayana’

and Sri Desiraju Hanumanta Rao English Valmiki Version)

Sunday, February 18, 2024

వేదం సర్వ జనీనం, సర్వ కాలీనం, సనాతనం, పురాతనం, మహత్తమం, మానవజాతికి పరమాత్మ ప్రసాదించిన తొలి అక్షర గ్రంథం వేదం ...... ఋగ్యజుస్సామాథర్వ వేదాల సారం-12 : వనం జ్వాలా నరసింహారావు

 వేదం సర్వ జనీనం, సర్వ కాలీనం, సనాతనం, పురాతనం, మహత్తమం,

మానవజాతికి పరమాత్మ ప్రసాదించిన తొలి అక్షర గ్రంథం వేదం

ఋగ్యజుస్సామాథర్వ వేదాల సారం-12

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (19-02-2024)

‘వేదం మానవజాతికి పరమాత్మ ప్రసాదించిన తొలి అక్షర గ్రంథం. వేదం విషయంలో శ్రద్ధ కావాలి. శ్రద్ధ కలవాడికి జ్ఞానం లభిస్తుంది. వేదాద్యయనానికి విధి నిషేధాలు లేవు. తిట్టడానికీ కూడా వేదం చదవనూవచ్చు. అభ్యంతరం లేదు. వేదం రామాయణం, భారతాదుల లాంటి కథా కావ్యం కాదు. వేదం కర్మ సాహిత్యం. చదవడం కొద్దిగా కష్టం అనిపిస్తుంది. చదివినవే మళ్లీ చదవాల్సి రావచ్చును. ఒక్కొక్కసారి విసుగు కూడా కలగవచ్చును. ఇది జీవితం లాంటిది. జీవితంలో చేసిన పనులే చేసేది, అప్పుడప్పుడూ విసుగు కలుగుతుంది. వేదంలో వర్ణ వ్యవస్థను గురించిగాని, కులమతాలను గురించిన జాడలు కాని అంతగా కనిపించవు. వేదంలో ఎక్కడా వేదాధ్యయనం కొందరికి మాత్రమే పరిమితమైనట్లుగాని, కొందరిని నిషేధించినట్లు గాని, లేశ మాత్రం లేదు. అలాంటి ఆధారమే కనిపించదు. వేదం ఎండలాంటిది. వెన్నెల లాంటిది. గాలి లాంటిది. నీరు లాంటిది.’

         ‘వ్యర్తజీవి నరకం చూస్తాడు. సార్థక జీవికి అమృతం లభిస్తుంది. వేదం, జీవితం రెంటిలోనూ కష్టం తప్పక ఫలిస్తుంది. వేదం వైరాగ్యం బోధిస్తుంది అనేది కేవలం అపప్రధ. వేదం జీవిత విరాట్ స్వరూపాన్ని దర్శనం చేయిస్తుంది. జీవితం విశ్వరూపి. జీవితానిది విరాట్ స్వరూపం. దాన్ని దర్శించగలగాలి. కష్టమే మరి! వేదం దర్శనం చేయిస్తుంది. వేద, వేదాంతాలు సార్థక జీవితాన్ని ప్రభోధిస్తున్నాయి. జీవిత సుధను అందిస్తున్నాయి. వైరాగ్యం బోధించినా జీవన గమనానికే ఉపదేశిస్తున్నాయి. వేదవేదాంగాలను వయస్సు మళ్లినవారూ, చావు దగ్గర పడ్డవారూ మాత్రమే చదవాలనడం పిచ్చి మాట. వాటి నిండా జీవితం పరచుకొని ఉంది. బతకాల్సిన వాళ్లు చదవాలి. యువతీయువకులు చదవాలి. వాటిలో వాళ్లు నేర్చుకునేవి చాలా ఉన్నాయి. వయసు మళ్లినవారు నేర్చుకోవాల్సినది ఏముంటుంది? అయినా జ్ఞానతృష్ణ తీరనివారికి భారత తాత్త్వికత కల్పతరువు. వేదం ఒక పూదోట. ఇంట్లో పెట్టుకుంటే పరిమళిస్తుంది.

         ‘వేదం సనాతనము, పురాతనము, మహత్తమము, పవిత్రము, విశాలము, గహనము. ఉపమానానికి అందనిదే వేదం. వేదం అనే పదం ఒక్కటే కాని అది అనంతం. ఈ అనంత వేదాన్ని ఆరాధించిన, ఆరాధించుతున్న, ఆరాధించనున్న వారు అనేకానేకులు. ఒక్క సూర్యుడే ఒక్కొక్క పరిశొధకునికి ఒక్కొక్క రీతిగా కనిపించును, ఒక్క వేదం అనేది లెక్కకు మించిన పరిశోధకులకు లెక్కకు మించిన రీతిగా కనిపించును. వేదాన్ని పరిశీలించిన, వ్యాఖ్యానించిన, విమర్శించిన వారు అనేకులు. వీరిలో వేదాన్ని అధ్యయనం చేసి సద్విమర్శలు, దుర్విమర్షలు చేసినవారు ఉన్నారు. అధ్యయనం చేసి దుర్విమర్శ చేసినవారిని అధ్యయనమే ఖండించవచ్చును. కాని వేదాన్ని అధ్యయనం చేయకుండానే దాన్ని గురించి ఒక అభిప్రాయానికి వచ్చి దుష్ప్రచారం చేసిన వారిని ఖండించడం అసంభవం. ఎందుకంటే వారెవరో తెలియదు. వారు ఏ ఆధారంతో అపోహలు కలిగించారో అంతకంటేతెలియదు’.

         ‘వేదాన్ని గురించి అవ్యాఖ్య, కువ్యాఖ్య చేసే వారు రెండు రకాలు. ఒకరేమో, సనాతనములం అనిపించుకోవాలని అనుకునే స్వప్రయోజనపరులు. వీరు వాస్తవానికి సనాతనులు కారు. సనాతన ముసుగు వేసుకున్నవారు. వేదం వారి స్వంత ఆస్తి అని భావించువారు. వీరికి ఏమీ తెలియదు. ఇక పోతే, సర్వం వేదాల్లోనే ఉన్నదనే వారు రెండో రకం. ఆధునికులం అనిపించుకోవాలనే ఉబలాటం ఉన్నవారు వీరు. వీరు వేదాన్ని పనికిరానిది గానూ, ఏదో ఒక వర్గానికి ఉపయోగ పడేదనే వారుగానూ ఉంటారు. వేదం మానవుని మహిమాన్వితుడిగా దర్శించేది. మానవుని ఒక్కొక్కసారి దేవతలను మించినవారిగా చేసింది’.

         ‘వేదాధ్యయనం అంటే వల్లించడం మాత్రమేనా? చాలామంది ఈనాటికీ అదే అనుకుంటున్నారు! వేదానికి సంబంధించిన కొన్ని కర్మల మంత్రాలు వల్లించి వేదం చదివామంటున్నారు. వేదం చదివామన్న కొందరికి అక్షరాలు సహితం రాకున్నవి. వేదం చెప్పేవారికి ఇది శ్రుతి అనీ, చదవాల్సిన అవసరం లేదనే దురభిప్రాయం నేటికీ ఉంది. వేదం చదివి అర్థం గ్రహించినవారికి శుభాలు కలుగుతాయి. పాప విముక్తుడు అవుతాడు. జ్ఞానం కలుగుతుంది. స్వర్గం లభిస్తుంది. వేదానికి అర్థం తెలుసుకోరాదు అన్న వారున్నట్లే, అర్థం మాత్రం తెలుసుకుంటే చాలును అనే వాళ్లూ ఉన్నారు. వేదం సస్వరంగా నేర్చుకొని అర్థం తెలుసుకొన్న వాడే వాస్తవంగా వేదం చదివినవాడు. అయితే వేదం వల్లించడం దోషం కాదు. అర్థం మాత్రం తెలుసుకోవడమూ తప్పు కాదు. రెండూ కలవడం ఉత్తమం’.

‘వేదంలోనే సమస్తం ఉంది. వేదంలో లేనిది ఏదీ లేదు, ఆధునిక ఆవిష్క్రయలన్నీ వేదంలోనే ఉన్నాయని నమ్మే వర్గం ఒకటుంది. వేదంలో ఏమీ లేదు, అంతా ఛాదస్తం, అనేది ఒక వర్గం. ఒక వర్గపు ప్రయోజనాల కోసమే రచించబడింది అనేది మరొక వర్గం. విచిత్రం ఏమంటే ఈ రెండు వర్గాలవారూ వేదాన్ని చదివిన వారు కాదు. వీరు ఎవరో ఒకరి వ్యాఖ్యల మీద ఆధారపడిన వారు! అందుకే ముందు వేదం చదవాలి. తరువాతనే వ్యాఖ్యానించాలి. వేదంలో వర్ణ వ్యవస్థను గురించిగాని, కులమతాలను గురించిన జాడలు కాని అంతగా కనిపించవు. వేదం అనగానే వైరాగ్యం అనే ఒక అపార్థం అర్థంగా బహుళ ప్రచారంలోకి వచ్చింది. వాస్తవ సత్యం ఏమంటే వేదంలో జీవితం, బ్రతకడం, ఆనందించడం ఉన్నది తప్ప వైరాగ్యం అన్న పదమే కనిపించదు. వేదం సాంతం ఇహలోకాన్ని గురించే చెప్పింది. అక్కడక్కడ స్వర్గ ప్రస్తావన ఉంది.’

         ‘సకల వేదాల రసం సామము అని అంటారు. వేదాల్లో సామ వేదాన్ని, దేవతలలో ఇంద్రుడిని, ఇంద్రియాలలో మనస్సును, ప్రాణులలో చైతన్యాన్ని గొప్పగా చెప్పడం జరిగింది శ్రీమద్భగవద్గీతలో. వేదాల్లో సామవేదం, యజుర్వేదంలో శతరుద్రియం శ్రేష్టమని మహాభారతంలో ఉన్నది. ఛాందోగ్యంలో వాణి యొక్క రసం ఋక్కు అనీ, ఋక్కు యొక్క రసం సామం అనీ, సామం యొక్క రసం గానమనీ చెప్పారు. సామవేదమే వేదాలకు తలమానికమని మహర్షులు, తానే స్వయంగా సామ వేదాన్నని కృష్ణ పరమాత్మ ప్రవచించారు. నాలుగు వేదాలలో పరిమాణంలో అన్నిటికన్నా చిన్నది సామవేదం. ఋగ్వేదంలోని మంత్రాల సంఖ్య 10,580; శుక్ల యజుర్వేదంలో 1975; కృష్ణ యజుర్వేదంలో 2198; అథర్వ వేదంలో 5977 కాగా సామ వేదంలోని మంత్రాల సంఖ్య కేవలం 1875 మాత్రమే! వాటిల్లోనూ 1504 ఋగ్వేద మంత్రాలు కాగా 99 మాత్రమే కొత్తవి. 272 పునరుక్తాలున్నాయి’.

‘సామ వేదంలో రెండు భాగాలున్నాయి. ఒకటి పూర్వార్చిక, ఇంకోటి ఉత్తరార్చిక. మొదటి దాంట్లో 4 అధ్యాయాలు, రెండో దాంట్లో 21 అధ్యాయాలు ఉన్నాయి. సామవేదం పరిమాణానికి చిన్నదే కాని, ప్రభావానికి గొప్పది. సామవేదపు కూర్పు ముద్దుగానూ, ముచ్చటగానూ, అందంగానూ ఉంది. పూర్వార్చిక లోని అధ్యాయాలను దేవతల పేర్ల మీదనే విభజించడం జరిగింది. ఇది ఉపాసనకు ఎంతో సులభం. ప్రతి అధ్యాయం ఖండాలుగా విభజించడం జరిగింది. ప్రతి ఖండానికీ మంత్ర సంఖ్య నియమం లేకున్నా సాధారణంగా పది మంత్రాలుంటాయి. ఉత్తరార్చికలో 21 అధ్యాయాలున్నాయి. ప్రతి అధ్యాయానికి ఖండాలున్నాయి. ప్రతి ఖండానికి “తృ చ” లు ఉంటాయి. వీటికి మంత్ర సంఖ్యా నియమం లేదు. ఒక్కొక్కసారి “తృచ” ఒక మంత్రంతోనే ముగుస్తుంది. ఎక్కువ “తృచ” లు మూడు మంత్రాలతో ముగుస్తాయి. ఇవి ఉద్గాతలకు అనుకూలంగా, గానానికి అందంగా, సుందరంగా, మధురంగా ఉంటాయి’.

‘సామ వేదంలో యజ్ఞయాగాది క్రతు నిర్వహణ, విధి, పశుహింస లాంటివి కనిపించవు. ఇది అహింసా విధిగా, కేవలం ఉపాసనగా కనిపిస్తుంది. యజుర్వేదంలో లాగా ఒకరికి హాని కలిగించే మంత్రాలు కాని, ప్రయోగాలు కానీ కనిపించవు. సామవేద మంత్రాలు కేవలం దేవతలను స్తుతిస్తాయి. వారి గుణగణాలను వర్ణిస్తాయి. ఉపాసకులకు శాంతి సౌభాగ్యాలను అర్థిస్తాయి. కొన్ని మంత్రాలు ఫలాపేక్ష రహితాలు. కేవలం దేవతల గుణగణాల్ని స్తుతిస్తాయి. మానవునికి శాంతి, సౌభాగ్యం, సుఖం, ఆనందం కలిగించేది సామవేదం.’

‘సామవేదమే భారత సంగీత శాస్త్రానికి మూలం అవుతుంది. భారతీయ సంగీతం సామగానంతోనే మొదలైంది. వేదాన్ని స్వర రహితంగా ఉచ్చరించడం నేర్పడానికి ఒక సమగ్ర శాస్త్రం ఉంది. దానిని “శిక్ష” అంటారు. స్వర మండలంలో ఏడు స్వరాలు, మూడు గ్రామాలు, ఇరవై యొక్క మూర్ఛనలు, నలబై తొమ్మిది తానాలు ఉంటాయి. సామగానానికి పది రకాల గుణ వృత్తులు చెప్పబడ్డాయి. సామగానం నాలుగు విధాలని చెప్పడం జరిగింది. అవి వరుసగా: గ్రామగృహగానం, అరణ్యక గానం, ఊహ గానం, ఊహ్య గానం. సామ గాయకుడు ముందు ప్రణవాన్ని, తరువాత గాయత్రిని ఉచ్చరించి సామగానం ప్రారంభించాలి. అతడు అంగుళులు చాచి స్వరమండలం ఆలాపించాలని శిక్షా శాస్త్రం బోధిస్తున్నది’.

         ‘వేదం భగవంతుని వాక్కు. భగవంతుడు, పరాత్పరుడు, ఈశ్వరుడు ఒక్కడే! నా ద్వితీయం, అంటే, రెండవ వాడు లేడు. సమస్త చరాచర ప్రకృతికి, సృష్టి, స్థితి, లయకారుడు అతడే! అతని వాక్కునకు, వేదానికి జరామరణాదులు లేవు! వేదానికి దేశాల హద్దులతో, మతాలతో, వర్ణాలతో, కులాలతో ప్రమేయం లేదు. అదితి భూమి. అది అవిభాజ్యం. వేదం సమస్త మానవాళికి జీవితం, నీతి, ధర్మం నేర్పింది. వేద ధర్మమే క్రీస్తు పూర్వపు మహా నాగరికతలకు కారణం. పారిశ్రామిక విప్లవం వచ్చి మనిషిని మరగా మార్చే దాకా సమస్త ప్రపంచం గ్రామ జీవితమే! ఆ జీవితం ఏర్పరిచింది వేదమే! వేదమే! వేదం సమస్త భూమండలాన్ని గురించి చెప్పింది. వసుదైవ కుటుంబం అన్నది’.

‘ఏ ప్రాణినీ హింసించకు అంటుంది వేదం. పశుపక్ష్యాదులను, వృక్ష లతా గుల్మాదులను, క్రిమి కీటకాదులను హింసించ రాదు. పృథివి, అప్, తేజో, వాయు, ఆకాశాలు పంచ భూతాలు. భూతం అంటే ప్రాణం ఉన్నది అని అర్థం. అందువలన పంచ భూతాలను సహితం హింసించరాదు. “అమ్మా! భూమీ! నిన్ను త్రవ్వక తప్పడం లేదు. బాధ కలిగిస్తున్నాను. మన్నించు. మళ్లీ పూడుస్తాను” అని నేలను త్రవ్వుతారెవారైనా. “వృక్ష శాఖా! నిన్ను వర్షం కొరకని నరుకుతున్నాను” అని అంటారు. వేదం అందరికీ తెలియక పోవచ్చు. వేదం సంప్రదాయం మాత్రం అందరికీ తెలుసు.’

‘ఇప్పటికీ పల్లెల్లో నేల త్రవ్వేప్పుడూ, చెట్టు కొట్టేప్పుడూ మొక్కుతారు. వేదం మానవత, ప్రేమ, కరుణ, దయ, అహింసలను బోధించింది. అధ్వరం అహింసా యజ్ఞం! బుద్ధుడి అహింసకు మూలాలు వేదంలో ఉన్నాయి. క్రీస్తు, గౌతమ బుద్ధుడి అహింస, కరుణలనే అవలంభించాడు. ప్రచారం చేశాడు. క్రైస్తవం అభినవ బౌద్ధమే! అన్యం కాదు. బౌద్ధం నుంచి క్రైస్తవం వచ్చింది కాబట్టి క్రైస్తవపు మూలాలు సహితం వేదం లోనివే! ఇక ఇస్లాం అంటే శాంతి, వినయం, క్షేమం. ఇస్లాం మీద క్రైస్తవ ప్రభావం ఉన్నది కాబట్టి ఇస్లాం మూలాలు సహితం వేదం లోనివే! మహాత్ముడి శాంతి, సామరస్యం, అహింస, గ్రామ స్వరాజ్యం అన్నీ వేదం నుండి నడచి వచ్చినవే!’.

(డాక్టర్ దాశరథి రంగాచార్య వేద సంహితల ఆధారంగా)

 

 

Saturday, February 17, 2024

Imperceptible Gateway from Earth to Heaven (Eastern Side of ‘Ancient Indian Geography’ Depicted by Maharshi Valmiki) : Vanam Jwala Narasimha Rao

 Imperceptible Gateway from Earth to Heaven

Eastern Side of ‘Ancient Indian Geography’

Depicted by Maharshi Valmiki

Vanam Jwala Narasimha Rao

The Hans India (18-02-2024)

The first ever recorded chronicle of lands, oceans, islands, inhabitants etc. in the universe, is in the ‘Kishkindha Kanda’ of Maharshi Valmiki Sanskrit Ramayana and Telugu Version Vasudasa Swamy Andhra Valmiki Ramayana. This spectacular ‘Ancient Indian Geography’ was nothing short of the so-called Google Maps. The Context was, when Monkey Chiefs with Vanaras went around the earth, East, South, North-West and North sides, at the behest of King Sugreeva in search of abducted Sita by Ravana, Sugreeva enlightened them, the topography with minute details. Vinata went to East, Angada and Hanuman to South, Sushena to West, and Shatabali to North.

The East Side referred was the East of ‘Jambu Dwipa,’ the Indian subcontinent inclusive of South-East Asia, encompassing Mount Mandara, Adi Shesha, Mount Sunrise, Eastern Compass, Gateway to Heaven etc. The meridian of Saraswati Triveni, confluence of Rivers Ila, Bharati, and Saraswati, is still the Prime Meridian for Indian Astronomers. The first observatory Ujjain, the place where an Ancient River ‘Saravati’ flowed circuitously in Central India, is on this Meridian. Saravati pronounced as ‘Sharavati’ could also be a River that originates and flows within Karnataka State.

Places sequentially indicated on East Side were: Riversides of Bhagirathi or Ganga, Sarayu, Kaushiki (Coosi), Yamuna, Mount Kalinda, Rivers Saraswati, Sindhu, Shona (Shon), Kaala Mahi etc. River ‘Saraswati’ the ‘Creative Center of Man’ was once coursed during Vedic Period either disappeared or maybe coursing underground. It is believed that, this perennial river was flowing from Himalayas through Punjab, Haryana, Western Rajasthan, and through the Rann of Kutch in Gujarat, and if this could be traced, it will be an abundant source of underground water. River Sindhu and westerly Indus River are also may be different. It is believed as another easterly River called Indusa. Then come kingdoms Brahma Maala, Videha (Mithila birth place of Sita, now known as Tirhoot), Malva, Kaashi, Kosala, Magadha (Bihar), Pundra, Anga, and Koshakaara.

Then come, peak of Mount Mandara, that harbored extensive unsightly and odd physical featured beings, Unkillable, Mighty Man-Eater Tribals some of whom appear as horrific half-man half-tiger like mermaids. Going beyond by mountaineering or hopping, or boating, one will come across, the splendorous Yava (Jawa) Island with seven kingdoms. These, could be the group of islands, Jawa, Sumatra, Bali, Indonesia etc. referred as Indian ‘Chief Archipelago.’ In and around Yava islands there are Golden and Silver islands with gold-mines. Ganesha Stone Image has been found in many parts of Jawa and Bali. Mountain Shishira, which touches heaven with its peak, adored by Gods and Demons is found on crossing over Yava Island.

Reddish Watered River Shona, in appearance as a Vast Ocean, with gulfs and bays studded with an infinity of islands, deep and speedy drift, adored by Siddhas and Charanas, is found on other coast of ocean. On proceeding further Plaksha Island, where vast rivers emerge from mountains, is seen. Then the Ikshu Island and the terribly furious, tempestuous, blaring, and tide-ripped Ikshu Samudra or Salt Ocean will appear. Colossal bodied demons with everlasting hunger inhibit that ocean, which demons always capture, prey by the shadow as endued by Brahma.

Moving ahead, the disastrous Lohita Ocean or Red Ocean (Madhu Samudra or Wine Ocean) is seen, where there is an island called Shalmali Dwipa or Shalmali Island. It is named so because of Shalmali tree that stands there. Mansion, constructed by Vishvakarma, the Heavenly Architect for Vinata's son, Garuda, the Eagle-Vehicle of Vishnu, which is decorated with numerous jewels, and in shine like Mount Kailash, the abode of Shiva is seen in that Island.

Horrifying and merciless Mandeha Demons, hanging upside down from mountain peaks are seen nearby there. Mandeha demons attack the rising Sun, who overcomes them with the help of the palmfuls of water, offered by worshippers and consecrated with the Gayatri Hymn. The Sun proceeding on his way will burn them down. Mandehas regain their lives and start repeating the same obstruction of Sun's path on next morning by hanging from the peaks of mountain.

Milky Ocean (Jaloda Sea), looks like a whitish cloud and a lustrous necklace with waves swaying is seen next. White mountain ‘Rishabha,’ of colossal size, surrounded by trees the flowers of which have heavenly fragrance, is in its center. ‘Lake Sudarshana’ replete with silvery lotuses whose threads are golden in sparkle is also seen, where kingly swans are seen running about. The lake attracts Charanas, yakshas, kinnaras and hosts of apsara females, coming to play in the waters.

On crossing this, the soft-water ocean, frightening all beings is seen. Nearby exists Horse Faced dreadfully bright Fire, originated from the anger of Sage Aurasa. Yelling sounds from oceanic beings dwelling undersea are audible there. This evidently refers to the Submarine Volcanic Fire, which often changed the characteristic of Indian Archipelago and the groups of islands lying in the Pacific. On the northerly area of the ocean there is an enormous, thirteen Yojanas length, ‘Mountain Jatarupashila,’ also known as ‘Golden Rock Mountain,’ glittering like gold.

Then there is seen, the ‘Adi Shesha, the Chesterfield of Lord Vishnu, Ananta,’ the lotus-petal broad-eyed thousand-hooded Serpent God, sitting on top of that mountain holding the Universe on his hoods. It is the symbol of the sky or infinite space studded with the starry and planetary systems. The insignia or emblem of ‘Ananta,’ a Golden Pylon resembling palm tree with three branches on the peak of that mountain, radiating with golden podium appears there. This pylon of palm tree is constructed as the ‘Easterly Compass’ by Celestial Gods. Beyond this pylon, the divine ‘Majestic Udaya Mountain or Mount Sunrise’ that greatly glitters like golden will be seen. Beyond this, it is all west. Mount Sunrise, splendorous with attractively flowered and sun like glittering trees, with its Peaks of Hundred Yojanas height touching heavens, is spectacular in look.

On top of Mount Sunrise, another pinnacle ‘Saumanasa Peak’ of one Yojana width and ten Yojanas height, also completely golden one, is seen. Saumanasa Peak is to the eastern border of India near the tropic of cancer. Thill is now known as 'Somara' in Manipur. It is believed that the God Almighty, Supreme Being, and the Trivikrama, or Lord Vishnu made his first Foothold on that pinnacle Saumanasa, and the second on the pinnacle of Mount Meru to tread the Heavens. The Sun is by far visible in Jambu Dwipa when he rises on Saumanasa, after he had circled the Jambu Dwipa in a northerly route. This is an interesting reference to the physical phenomena of the apparent motion of the sun, which sets in west (America) and reappears in East (Asia).    

There the great two different groups of sages ‘Vaikhanasas and Vaalakhilyaas’ will come into view with a feel of brilliance, for those ascetics will be with the glory of the Sun. Then the ‘Sudarshana Lake’ and ‘Sudarshana Island’ will be seen, in the presence of which resplendence, the eyes of all living beings will become enlightened due to the illuminating entity of universe, the Sun, will be sojourning.

The eastern dawn sparks redly because the golden hue of Mount Sunrise overlaps the resplendence of the generous Sun. In the beginning Brahma, the Creator, ordained this Mount Sunrise to be the ‘Gateway for the Earth to Heaven,’ and even as the rising place for the Sun, as such this is verily said as the 'Eastern Quarter of the Compass.’ Beyond Mount Sunrise the eastern quarter is blocked. It will be bordered with Gods since it is the Gateway to ‘Heaven,’ and everything is imperceptible, since it will be void of both Sun and Moon.

(Courtesy: Vasudasa Swamy Andhra Valmiki Ramayana

and Desiraju Hanumanta Rao Valmiki Ramayana English Version)

Thursday, February 15, 2024

పంచవటి మనదే! ..... వనం జ్వాలా నరసింహారావు

 పంచవటి మనదే!

వనం జ్వాలా నరసింహారావు

ఆంధ్రజ్యోతి దినపత్రిక నివేదన కాలమ్ (16-02-2024)

అయోధ్యలో శ్రీరామ విగ్రహ ప్రాణప్రతిష్ఠ అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ శ్రీరామ వనవాస మార్గం గురించి వివరించారు. ఆ వివరాలకు సంస్కృత రామాయణంలో వాల్మీకి రచించిన దానికీ తేడా ఉంది. అయోధ్య నుంచి ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఉన్న భరద్వాజ ఆశ్రమానికి, మధ్యప్రదేశ్‌లోని చిత్రకూటానికి, మహారాష్ట్రలోని నాసిక్‌ దగ్గర ఉన్న పంచవటికి, ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా లేపాక్షికి, కర్ణాటకలోని కిష్కింధకు, తమిళనాడులోని రామేశ్వరానికి, అక్కడి నుంచి శ్రీలంకకు శ్రీరాముడు పయనించాడనడం సరికాదేమో! ప్రధాని తన ప్రసంగంలో లేపాక్షి, నాసిక్‌లోని పంచవటుల గురించి ప్రస్తావించారే కానీ... దక్షిణ అయోధ్యగా ప్రసిద్ధి చెందిన భధ్రాచల రామాలయం సమీపంలోని పంచవటి గురించి కానీ, అసలు ఆ ఆలయం గురించి కానీ కనీసం ప్రస్తావించలేదు. ఇది తెలుగువారిని ఒకింత నిరాశకు గురిచేసిందనాలి. అయోధ్య నుంచి లంక దాకా శ్రీరాముడి ప్రస్థానం, తిరుగు ప్రయాణంలో అయోధ్యకు వస్తూ సీతకు రాముడు చూపించిన ప్రదేశాలు వావిలికొలను సుబ్బారావు (వాసుదాసు) గారి ‘ఆంధ్ర వాల్మీకి రామాయణం’ (మందరం) వ్యాఖ్యానంలో వివరంగా ఉన్నాయి.

అరణ్యాలకు బయలుదేరిన సీతారామలక్ష్మణులు తామసా నదీ తీరం, ఉత్తరకోసల దేశం, వేదశ్రుతి నది, గోమతీ నది, దక్షిణ కోసల దేశ సరిహద్దులు దాటి... గంగానదీ తీరంలోని శృంగబేరిపురాన్ని చేరారు. గుహుడి సాయంతో గంగను దాటి, గంగా యమున సంగమ స్థలిలోని భరద్వాజ ముని ఆశ్రమానికి వెళ్ళారు. యమునను దాటి, నీలవన మార్గంలో పయనించి, మందాకినీ సరయూ నది దగ్గరలో ఉన్న చిత్రకూటం చేరారు. అక్కడ వాల్మీకిని చూశారు. చిత్రకూటంలో లక్ష్మణుడు పర్ణశాల నిర్మించాడు. భరతుడు చిత్రకూటానికి వచ్చి, వెళ్ళాక, వారు అత్రి మహాముని ఆశ్రమానికీ, అనంతరం దండకారణ్యంలో ప్రవేశించి, విరాధుణ్ణి సంహరించి, శరభంగ మహర్షి ఆశ్రమానికీ, అటు నుంచి సుకీక్ష్ణాశ్రమానికీ, మాండకర్ణి ఆశ్రమానికీ ప్రయాణించారు. అగస్త్యుణ్ణి ఆయన ఆశ్రమంలో దర్శించుకున్నారు. పంచవటి అనే నివాస యోగ్యమైన స్థలం రెండు ఆమడల దూరంలో ఉందని అగస్త్యుడు సూచించాడు. అగస్త్యుడు చెప్పిన మార్గంలో వెళ్తూ, దారిలో ఒక మర్రి చెట్టు మీద ఉన్న జటాయువును రాముడు కలిశాడు. తరువాత సీతా లక్ష్మణ సమేతుడై పంచవటిని చేరుకున్నాడు. అక్కడ పర్ణశాల నిర్మించమని లక్ష్మణుడికి చెప్పాడు. లక్ష్మణుడు కుటీరాన్ని సిద్ధం చేశాడు. అవే ఇప్పటికీ భద్రాచలానికి 30 కిలోమీటర్ల దూరంలో ఎందరో భక్తులను ఆకర్షిస్తున్న పంచవటి, పర్ణశాలలు. భద్రాచలం సమీపంలో ఉన్నది పర్ణశాల కాదనీ, అది నాసిక్‌కు దగ్గరగా ఉందనీ చెప్పడం పూర్తిగా సత్యదూరం.

పంచవటి గోదావరీ తీరంలో ఉందనేది నిర్వివాదాంశం. అక్కడ గోదావరి ఉత్తరం నుంచి దక్షిణానికి పారుతూ ఉండాలి. ఎందుకంటే సీతాపహరణం తరువాత... సీతను రావణుడు తీసుకువెళ్ళినది దక్షిణ దిక్కుగానని మృగాలు, పక్షులు సూచించిన మేరకు... రామలక్ష్మణులు గోదావరీ తీరాన మొదట నైరుతి దిశగా వెళ్ళారు. తరువాత దక్షిణంగా వెళ్ళారు. గోదావరీ తీరంలో వారు జటాయువును చూశారంటే, గోదావరి నది జటాయువు పడిన స్థలం వరకూ, దక్షిణాభిముఖంగా పారుతూ ఉండాలి. జటాయువుకు గోదావరీ జలాలతో నివాపాలు (తిలోదకాలు) విడిచారు.

అక్కడి నుంచి రామ లక్ష్మణులు తూర్పుగా వెళ్ళడానికి ఏరు అడ్డం వస్తుంది కాబట్టి, నైరుతి దిశగానే మూడు కోసుల దూరం పయనించారు. కొంత తూర్పుగా వెళ్తే కాని జటాయువు చెప్పిన దక్షిణ మార్గం కనిపించదు కాబట్టే, అక్కడి నుంచి మూడు కోసులు తూర్పుగా వెళ్ళారనుకోవాలి. అంటే అప్పుడు వారు, ఇప్పటి భద్రాచలం దగ్గర, గోదావరి నదికి దక్షిణాన ఉన్నారు. అలా వచ్చారు కాబట్టి గోదావరి దాటవలసిన పని లేదు. ఆ కారణంవల్ల పంచవటి గోదావరి నదికి పడమటి తీరాన ఉందనే విషయం స్పష్టంగా అంగీకరించాలి. తూర్పున ఉన్నట్టయితే గోదావరి దాటే ఉండాలి. ఇప్పటి పర్ణశాలే యదార్థమయిన పంచవటి అయినా కావాలి. లేని పక్షంలో ఇప్పుడు అందరూ భావిస్తున్న పర్ణశాలకు ఎదురు ఒడ్డున, చక్కటి పంచవటి ఉండేదని మాత్రం నిర్ధారణగా చెప్పవచ్చు.

నాసిక్‌ దగ్గర పంచవటి ఉన్నదనీ, అక్కడి నుంచి దక్షిణంగా రామలక్ష్మణులు వెళ్ళేరనీ చేసే వాదన రామాయణానికి విరుద్ధం. పంచవటి గోదావరీ నది పశ్చిమ తీరాన ఉందనడానికి స్థలం ఆధారంగా ఉంది. పర్ణశాలకు ఎదురుగా ఉన్న గుట్ట దగ్గర రావణాసురుడు తన రథాన్ని నిలిపాడని అంటారు. కారణం... సీతాదేవిని ఎత్తుకురాగానే రథం సిద్ధంగా ఉండాలి కాబట్టి. నదికి ఒక ఒడ్డున రథం, మరో ఒడ్డున సీత ఉంటే,  సీతాపహరణం సాధ్యమయ్యేది కాదనుకోవాలి. కాబట్టి పడమటి దిక్కున ఉన్న పంచవటి దగ్గర సీతాపహరణం జరిగి ఉండాలి. అలాగే అక్కడికి సమీపంలోనే ‘సీతగుట్టలు’ అనే పెద్ద పర్వతం ఉంది. ఖరుడు యుద్ధానికి వచ్చినప్పుడు, రామలక్ష్మణులు అక్కడ ఉన్న కారణంగా ఆ గుట్టలకు ఆ పేరు వచ్చిందంటారు.

{ పంచవటికి దగ్గరలోనే పద్మ సరస్సు ఉందని ‘వాల్మీకి రామాయణం’ చెబుతోంది. అలాంటి పెద్ద చెరువొకటి ఉండేదని అక్కడ ఉండే కోయలు చెబుతూ ఉంటారు. ఆ చెరువుకూ, గోదావరికీ మధ్య పంచవటి ఉంది.}

హంపీ... పంప ఒకటి కాదు...

ఇప్పటి హంపీయే అప్పటి పంప అనీ, అక్కడే పర్ణశాల ఉన్నదనీ అనడం కూడా సరికాదు. రామలక్ష్మణులు లంకకు వెళ్ళేటప్పుడు ఏ మార్గం నుంచి వెళ్ళినా, తిరిగి వచ్చేటప్పుడు, విమానంలో తక్కువ దూరంలో ప్రయాణించే విధంగా, లంక నుంచి సముద్రం దాటాక, రామేశ్వరం నుంచి అయోధ్యకు వెళ్ళారనేది అందరూ అంగీకరించినదే. అలాంటప్పుడు ఎడమ వైపు కిష్కింధ, కుడివైపున పంచవటి ఉండి ఉండాలి. ఆ మార్గానికీ నాసిక్‌కూ సంబంధమే లేదు. కాబట్టి పంచవటి, నాసిక్‌ కానే కాదు. కావడానికి వీల్లేదు.

సీతారామలక్ష్మణులు చిత్రకూటం నుంచి దక్షిణంగా ఋక్షవంతానికి వచ్చి, పశ్చిమాభిముఖంగా నాసిక్‌ను చేరినట్టయితే, మార్గమధ్యంలో వింధ్య పర్వతాన్ని, నర్మద, తపతీ నదులను దాటి, విదర్భ మీదుగా ప్రయాణించవలసి ఉంటుంది. వాటిని వారు దాటినట్టయితే, వాల్మీకి తప్పకుండా రాసేవాడు. రామలక్ష్మణులు దక్షిణానికి వచ్చి, ఆ తరువాత ఆగ్నేయంగా కిష్కింధకు వచ్చారనడం రామాయణానికి ప్రత్యక్ష విరుద్ధమని చెప్పాలి. నిజానికి, వారు నైరుతి మూలగా, నైరుతిగా వెళ్ళి, కంబంధుణ్ణి చంపి, పడమరగా వెళ్ళి, పంప (తుంగభద్ర) చేరి, పడమరలో ఉన్న శబరి గుహకు వెళ్ళారు. జటాయువు గుట్ట దగ్గర నుంచి నైరుతికి వస్తేనే కిష్కింధకు రాగలరు. అలాకాకుండా ఆగ్నేయ మూలగా వెళ్ళి ఉంటే, సముద్రతీరానికి చేరేవారే తప్ప కిష్కింధకు కాదు. ఆగ్నేయమూలగా వారు ప్రయాణించారని రామాయణంలో ఒక్క మాటయినా లేదు.

సీతారామలక్ష్మణుల వనవాసం చివర్లో... సీతాపహరణం కోసం రావణుడు, మారీచుడు కలిసి దండకారణ్యంలోని రామచంద్రుడి ఆశ్రమానికి చేరుకున్నారని ‘వాల్మీకి రామాయణం’లో ఉంది. పర్ణశాలకు ఉత్తరాన పర్వతాలు, తూర్పున గోదావరి, దక్షిణ, పడమర దిశల్లో అడవి ఉన్నాయి. రాముణ్ణి మారీచుడు పడమరగానే తీసుకువెళ్ళాడు. రావణుడు వెళ్ళాల్సింది దక్షిణ మార్గాన కాబట్టి, ఆ దోవలో రాముడు ఉండకూడదని మారీచుడు అలా చేశాడు. సీతను రావణుడు అపహరించుకుపోతున్నప్పుడు, పర్ణశాలకు మైలు దూరంలోని వృక్షం దగ్గర జటాయువు ఎదురయింది. రావణుడు, జటాయువు మధ్య యుద్ధం అయిదారు మైళ్ళ దూరంలోని దుమ్మగూడెం దగ్గరున్న జటాయువు గుట్ట వరకూ సాగింది. రావణుడు సీతను ఎత్తుకొని, పర్ణశాల నుంచి బయలుదేరి, కిష్కింధ మీదుగా, పర్వతాలు, తటాకాలు దాటి, సముద్రాన్ని సమీపించి, లంకకు పోయాడనుకోవాలి. ఇవన్నీ పర్ణశాల ఎక్కడుందో తెలిపే అంశాలు.

సీతాన్వేషణలో భాగంగా రామలక్ష్మణులు క్రౌంచారణ్యం, మతంగవనం, పంపానది ఒడ్డున ఉన్న ఋశ్యమూక పర్వతం మీదుగా వెళ్ళారు. అప్పటివరకూ వారు దక్షిణ దిక్కుగానే ప్రయాణం చేశారు. శబరి ఆశ్రమానికి తూర్పు దిక్కులోనే పోవాలి కాబట్టి, వారు పడమరగా వెళ్ళి, తూర్పుకు తిరగాల్సి ఉంటుంది. నాసిక్‌ దగ్గర పంచవటి ఉన్నదనే వారి వాదనకు ఇది పూర్తిగా వ్యతిరేకం. ఆ తరువాత వారు కిష్కింధ వెళ్ళారు. రావణుడితో యుద్ధానికి వెళ్ళేదాకా ప్రస్రవణ పర్వతం మీద ఉన్నారు. కిష్కింధకు ఆగ్నేయంగా ఉన్న లంకకు పోతూ మహేంద్ర పర్వతం ఎక్కారు. రావణ వధ అనంతరం సీతా సమేతంగా అయోధ్యకు పుష్పక విమానం మీద తిరుగు ప్రయాణం కావడం, వనవాసంలో భాగం. ఆ తిరుగు ప్రయాణంలో ఈ ప్రదేశాలన్నీ సీతకు రాముడు చూపించడం కొసమెరుపు.

(వాసుదాసు గారి ‘ఆంధ్రవాల్మీకి రామాయణం’ (మందరం) ఆధారంగా)

Sunday, February 11, 2024

వేదం నేర్పిన విద్వత్సభలు, చర్చలు, గోష్టులు, మీమాంసలు, తర్కాలే నేటి సెమినార్లు, శిక్షణలు, వర్క్ షాపులు ..... ఋగ్యజుస్సామాథర్వ వేదాల సారం-11 : వనం జ్వాలా నరసింహారావు

 వేదం నేర్పిన విద్వత్సభలు, చర్చలు, గోష్టులు, మీమాంసలు, తర్కాలే

నేటి సెమినార్లు, శిక్షణలు, వర్క్ షాపులు

ఋగ్యజుస్సామాథర్వ వేదాల సారం-11

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (12-02-2024)

‘దేవతలను స్తుతించేది ఋగ్వేదం. ఋగ్వేదంలోని మంత్రాలను ఋక్కులు అంటారు. యజ్ఞయాగాది క్రతువులు, వాటి విధి విధానాన్ని నిర్దేశించేది యజుర్వేదం. యజుర్వేదంలోని మంత్రాలను యజస్సులు అంటారు. యజ్ఞం ఒక బృహత్కార్యం, ఒక సత్కార్యం, ఒక సమాజ కళ్యాణ కార్యం అవుతుంది. యజ్ఞం ఒక్కడికే సాధ్యం కానిది. చాలామంది అవసరం అవుతారు. యజ్ఞం కోసం కొందరు జనులు ఏకం కావాలి. యజ్ఞం ఐకమత్యం నేర్పుతుంది. నలుగురు కలిసి చేసిన బృహత్కార్యం యజ్ఞం అవుతుంది. ఈ బృహత్కార్యానికి ఎవరో పదిమంది కలుస్తే సరిపోరు. నిపుణులు, ప్రత్యేక విద్యలో నైపుణ్యం కలవారు కలిసి పని చేస్తేనే యజ్ఞం అవుతుంది. యజ్ఞం అనగానే స్పురించేది యజ్ఞకుండం, యజ్ఞవాటిక లాంటివి. యజ్ఞకుండానికి గుంట తవ్వేవారు కావాలి. కుండ నిర్మాణానికి ఇటుకలు కావాలి. ఇటుకలు చేసేవారు, ఇటుకలు తెచ్చే బండి, బండికి కట్టిన పశువులు, బండి తోలేవాడు, ఇటుకతో కుండ నిర్మించే వాస్తు శిల్పి కావాలి. ఇప్పటికి కుండ మాత్రమే సిద్ధం అయింది. 

         ‘యజ్ఞానికి కావాల్సిన తగిన సమిధలు నిర్ణయించే శాస్త్రజ్ఞులు కావాలి. యజ్ఞం సామాజిక కార్యం. ఇది సమాజానికి ఉపకరించేది కావాలి. వేదం కొన్ని రకాల సమిధలు మాత్రమే యజ్ఞానికి విధించింది. అవే కావాలి. ఇవి తెచ్చేవారు కావాలి. సమిధలు ఇచ్చే చెట్టును ప్రార్థించే మంత్రాలు కూడా వేదంలో ఉన్నాయి. అడవుల ప్రాధాన్యతను ఎప్పుడో వేదం గుర్తించింది. సమిధలు యజ్ఞవాటికకు చేర్చడం కూడా ఒక ప్రక్రియే. అది కూడా శాస్త్రయుక్తంగా జరగాలి. యజ్ఞకుండం, సమిధలకు ఇంత పరిశ్రమ అవసరం. యజ్ఞకుండంలో అగ్ని రగిల్చాలి. ఆహుతులకు ఆవు నేయి కావాలి. అది పొందడం కూడా ఒక ప్రక్రియే. యజ్ఞం చేయడానికి హోతలు కావాలి. వారికి శిక్షణ ఇవ్వడానికి గురుకులాలు కావాలి. వేదం తెలిసిన గురువులు దొరకాలి. యజ్ఞానికి ఇంకా అనేకం కావాలి. యజ్ఞం జరిగేచోట విద్వత్సభలు, చర్చలు, గోష్టులు, మీమాంసలు, తర్కాలు నిర్వహించాలి. నేటి సెమినార్లు, శిక్షణలు, వర్క్ షాపులు వేదం నుండి నేర్చుకున్నవే!.

‘యజ్ఞం మానవ జాతికి అనేకం నేర్పింది. సంఘం, సమాజం, కలిసిమెలిసి పనిచేయడం, శ్రమ విభజన, విద్య, నైపుణ్యం, బోధన, శిక్షణ, సంపద పరిరక్షణ, ఉపయోగం, సమాజ క్షేమం, సంఘ క్షేమం, విశ్వ శ్రేయస్సు, మానవ కల్యాణం ఇలా అనేకం నేర్పింది యజ్ఞం. మనం తినే మెతుకు కోసం, తాగే నీటికోసం, ఎన్నో యజ్ఞాలు జరిగాయి. జరుగుతున్నాయి. జరుగనున్నాయి. వేదం ఇంతమంది శ్రమకు కర్త అయింది. మానవ కల్యాణం కోసం జరిగే ప్రతి బృహత్కార్యమూ యజ్ఞమే!’.

         ‘హయమేధం, అజమేధం లాంటి యజ్ఞ యాగాదులలో పశుహింస విధించబడింది. అయితే పాశ్చాత్య విద్వాంసులు, వేదంలోని మహత్తరమైన విషయాలను వదిలి, కేవలం యజ్ఞాల్లోని పశుహింస ఆధారంగా “వేదం ఆర్యుల ఆటవిక జీవనం” అని నిశ్చయించారు. కొందరు భారతీయ మేథావులు అది నమ్మారు కూడా! పాశ్చాత్య విద్వాంసులు వేదాన్ని అధ్యయనం చేశారు. కొంతమేరకు వారి పరిధిలో అర్థం చేసుకున్నారు. అర్థం చేసుకున్న దాని ఆధారంగా భారతీయ సంస్కృతి మీద దాడి చేశారు. భారత మేధావులను నమ్మించారు. వేదంలో పాశ్చాత్యులు ఈనాటికీ కనీవినీ ఎరుగని అంశాలున్నాయి. వీటన్నిటినీ విడిచి కేవలం జంతు వధ మీదనే ఆధారపడి వేదాన్ని అపఖ్యాతి పాలుచేయడం ఎందుకు? భారత ధర్మాన్నీ, భారత తాత్త్వికతనూ కించపరచడం వారి ప్రధాన ఉద్దేశం. భారతీయులు వేదకాలంలో ముమ్మాటికీ మాంసాహారులే. అనంతర కాలంలో వారు శాకాహార ప్రాశస్త్యం గుర్తించారు. పాశ్చాత్యులు ఇంకా గుర్తించాల్సి ఉంది. వేదకాలంలో స్వంతానికి కాకుండా సంఘానికి ఉపయోగపడ్డప్పుడు మాత్రమే యజ్ఞంలో పశువధ చేశారు. ఆహారం కోసం జంతువును వధించడం తప్పు కాదు. దానిని దేవతలకు అర్పించి భుజించడం ఒక విశేషం. యజ్ఞం ఆ విశిష్టతను సంతరించుకుంది’.

         ‘యజ్ఞంలో జంతువును వధించడం కాదు, బలి ఇవ్వడం జరిగింది. బలి అంటే త్యాగం. దేవతలు మనకు అనేక ఉపకారాలు చేస్తున్నారు. వారికి ప్రత్యుపకారం అసాధ్యం. లాంఛనంగా వారికి ఏదైనా అర్పించాలి అనిపిస్తుంది. ఏమి అర్పించగలం? జంతువును అర్పిస్తాం. తన ఆహారానికి చంపడానికి, దేవతకు అర్పించడానికీ, బలి ఇవ్వడానికీ చాలా అంతరం ఉంది. వధించడం తన కోసం. బలి కృతజ్ఞతా పూర్వకం! వేదంలో “స్వాహా” అనే పదం వస్తుంది. ఇది సుమారు “అంకితం,అర్పణం” అనే అర్థంలో వస్తుంది. స్వాహా అనే పదంలో “స్వ+ఆ+హా” అనే అక్షరాలున్నాయి. తనకున్న ఆసాంతం అర్పిస్తున్నాను అని దీనర్థం. అందరూ ఆత్మార్పణం చేయలేరు. అందరూ ఆత్మార్పణం చేస్తే సమాజం నిలవదు. కాబట్టి ఆత్మార్పణకు ప్రత్యామ్నాయంగా జంతుబలి ఇచ్చేవారు. సకల ప్రాణులతో మమేకం కావడం స్వాహా అవుతుంది. సకలమూ తానే అనుకోవడం,ఆత్మవత్సర్వ భూతాని స్వాహా” అవుతుంది. తనలో భగవంతుని దర్శించడం “అహం బ్రహ్మాస్మి” అనుకోవడం స్వాహా ఉటుంది. బలి ఒక్క వేదానికీ, ఒక్క భారత ధర్మానికి మాత్రం పరిమితం కాదు. భారతజాతి జంతుబలికి బదులు కొబ్బరికాయ సమర్పించుకునే ఉన్నత దశకు వచ్చింది. నారికేళంలో హింసలేదు. రక్తం బదులు నీరు ప్రవహిస్తుంది’.

         ‘రామాయణంలో అంబరీషుడి, శునశ్సేపుడి కథ చదువుతే విశ్వామిత్రుడు పశుబలి లేకుండానే యజ్ఞఫలం కలిగించిన విషయం అర్థం చేసుకోవచ్చు. విశ్వామిత్రుడు శునశ్సేపుడిని రక్షించి, నరబలినీ, పశుబలినీ మాన్పించిన ఉదంతం అవగతమౌతుంది. అదొక మహాత్కార్యంగా భావించాలి. వేదంలో అధ్వర యజ్ఞం గురించి చెప్పడం జరిగింది. ఆధ్వర యజ్ఞం అహింసా యజ్ఞం అవుతుంది. కొందరైతే యజ్ఞమే అధ్వరం అంటారు. అంటే యజ్ఞాలన్నీ అహింసాలే! వేదంలో కొన్ని పశువుల పేర్లు యజ్ఞసంబంధంగా చెప్తారు. వేదం పరోక్షవాది. దాని అంతరార్థాలు వేరు. పశువుల పేర్లు సంకేతాలు మాత్రమే! అవి వాస్తవంగా కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్యాలు. వీటిని ఆత్మజ్ఞానం అనే అగ్నిలో హవనం చేయాలని అర్థం.’

‘కర్మవాదులు ఈ అర్థాన్ని గ్రహించలేరు. వారు స్వప్రయోజనాల కోసం యజ్ఞాలు చేస్తారు. ఈ కర్మకాండను ఆచార్యులు, మహాత్ములు ఖండించారు. వారు వేదాలను నిరసించనూలేదు, ఖండించనూలేదు. వేదానికి మనిషి మీద అనంతమైన విశ్వాసం. మానవుడు నిష్కల్మష, పవిత్ర జీవనం ఏర్పరుచుకోవాలని వేదం అనేక చోట్ల ఆదేశించింది. ఒక పవిత్ర జీవి, ఒక ఆత్మార్పణం చేసిన మహానుభావుడు, ఒక లోక కల్యాణం సాధించిన మహా పురుషుడు భగవానుడు అవుతున్నాడు. వేదం మనిషిని “సమిధాసి” అన్నది. మనిషి సమిధ వంటి పవిత్రుడు అని దీనర్థం. సమిధ తాను జ్వలిస్తుంది. అన్యులకు కాంతినీ, వేడినీ ప్రసాదిస్తుంది. మానవుడు అలాంటివాడు కావాలని వేదం ఆశిస్తుంది. ఆత్మ సమర్పణయే యజ్ఞ స్వరూపం. దానితోనే లోక కల్యాణం, లోక హితం, లోక శాంతి, లోక కాంతి.         

         ‘వేదానికి తొలినుంచీ ఒక అపకారం జరిగింది. వేదం తొలుత సాహిత్యం. కర్మకాండ తరువాత చేరింది. బహుశః కర్మకాండ వల్లనే వేదం ఇంతకాలం నిలిచిందేమో! అయితే కర్మకాండ సాహిత్యానికి గ్రహణం పట్టించింది. కర్మకాండ స్వప్రయోజనపరులకు ఉపయోగపడింది. వేదం వారి చేతి కీలుబొమ్మ అయింది. వేదానికి సాహిత్యం ఉందని జనానికి తెలియకుండా పోయింది. గౌతమ బుద్ధుని దగ్గరనుంచి రామానుజునిదాకా అందరూ వేదపు శ్రేయోభిలాషులే. వారు నిరసించింది కర్మకాండనే! జగద్గురువు ఆదిశంకరుడు విసిగిపోయాడు. “అవిద్యద్విషయం కర్మ” అని ఉపనిషత్తులను ఆశ్రయించాడు. కేవలం కర్మకాండను దృష్టిలో పెట్టుకుని పాశ్చాత్య విద్వాంసులు వేద సమాజాన్ని వక్రీకరించారు. వారి వక్రభాష్యాలకు ఆధునిక వేదవ్యాఖ్యాతలు స్పందించారు. వారి వేదంలోని పదాలకు ఆధ్యాత్మిక అర్థాలు వెదకడానికి కృషి చేస్తున్నారు’.

         ‘మానవుడి మహిమను, శక్తిని, అప్రతిహిత ప్రభావాన్ని యజుర్వేదం గుర్తించింది. యజుర్వేదంలో నరుడి వ్యక్తిత్వాన్ని, సామర్థ్యాన్ని అనేక చోట్ల ప్రస్తావించి స్తుతించింది. మానవుడు పరిపూర్ణుడు కావాలి. అతడికి ఆత్మజ్ఞానం కలగాలి. అతడు సమర్థుడు. వాటిని సాధించగలడు. యజుర్వేదానికి ఆ విశ్వాసం ఉంది. అందుకే మానవుడి మహత్తును వివరిస్తుంది. మానవుడు తాను అమరుడను అనుకోవాలి. నిత్య మృత్యు భయం ఉన్నవాడు కార్యసాధకుడు కాజాలడు. అమరత్వం అంటే మృత్యువు లేకుండడం కాదు. శతశరత్తులు జీవించడం. నరుడు మృతి చెందుతాడు. తన పుత్రుడి రూపంలో జీవించుతాడు. అవిచ్చిన్నంగా కొనసాగే సంతానమే అమరత్వం. నిరంతరత్వమే అమరత్వం. నరుడు తన శక్తిని గ్రహించాలి. అతడికి ఆత్మ విశ్వాసం కలగాలి. శక్తి, ఆత్మ విశ్వాసం కలవాడు సాధించలేనిది లేదు. మనిషి తాను బాగుపడడం కాదు, లోకానికి సాయపడాలి. సమాజ జీవితానికి తోడ్పడాలి. క్రమంగా జ్ఞానం పెంచుకోవాలి. ఈ దేశం నాది నుంచి వసుధైవ కుటుంబం, లోకమే నా కుటుంబం అనే స్థితికి రావాలి’.

         ‘యజ్ఞానికి అగ్ని, ఆజ్యం, సమిధ అత్యవసరం. అగ్ని అంటే వేడి, వెలుగు. సమస్త ప్రపంచం, సమస్త ప్రాణులు అగ్ని మూలంగానే జీవిస్తున్నాయి. అగ్ని ఆరిపోయిన నాడు అంతరిస్తున్నాయి. ఈ సూత్రం గ్రహ నక్షత్రాదులకు సహితం వర్తిస్తుంది. సృష్టి సాంతం అశాశ్వతం. పరమాత్మకు తప్ప ఏ పదార్థానికీ శాశ్వతం లేదు. యజ్ఞానికి వాడే అగ్ని మానవ దేహంలో ఉంది. అది ఉన్నంత సేపే జీవిత దీపం వెలుగుతుంటుంది. ఒకరు నమ్మినా, నమ్మకున్నా, విశ్వాసం ఉన్నా, లేకున్నా, అర్థం అయినా, కాకున్నా, మానవ శరీరంలో నిత్య యజ్ఞాగ్ని కాపురం ఉంటున్నది. జ్ఞానం కలవాడు ఈ విషయం గుర్తిస్తాడు. యజ్ఞం స్వంతం కోసం మాత్రం కాదు. మానవ కల్యాణం, లోక కల్యాణం, జీవ కారుణ్యం కోసం. కాబట్టి, జ్ఞాని తన జీవితాన్ని మానవ కల్యాణానికి అప్పగిస్తాడు. అంకితం చేస్తాడు. అగ్ని నిరంతరం ప్రజ్వరిల్లుతుండాలి. అది ఆరడానికి వీల్లేదు. మానవుడి తొలి కర్తవ్యం, తొలి హక్కు జీవించడం. “శరీరమాద్యం ఖలు ధర్మసాధనం”. ధర్మం సాధించాలంటే తొలుత కావలసింది దేహం’.

         ‘అగ్ని నిత్యం జ్వలించడానికి సమిధ కావాలి. అన్నం నరుడి దేహానికి సమిధ అవుతుంది. అందుకే వేదం అన్నానికి అధిక ప్రాధాన్యం ఇచ్చింది. మానవుడు అన్నం జీవించడానికి మాత్రమే తినాలి. తినడానికి జీవించరాదు. ఈ అన్నం భగవత్ ప్రసాదం. దీనిని భగవంతుడు ప్రసాదించిన జీవితాన్ని నిలపడానికి భుజించారు. అన్నార్తులకు అన్నం పెట్టడమే యజ్ఞం అవుతుంది. మనం పెట్టిన అన్నం అన్నార్తుడు తినడాన్ని చూడడంలో ఆనందం ఉంది. ఆనందమే యజ్ఞఫలం. అన్నం జీవించడానికి, జీవితం మానవ కళ్యాణానికి అని జ్ఞాని అయినవాడు గుర్తిస్తాడు. ఆచరిస్తాడు. అన్నం అగ్నిని నిలుపడానికి మాత్రమే. అగ్నిని ప్రజ్వరిల్లచేయాలి. అందుకు ఆజ్యం అవసరం. జ్ఞానం ఆజ్యం అవుతుంది. జ్ఞానంతో అగ్ని జ్వలిస్తుంది. ప్రకాశిస్తుంది. కాంతివంతం అవుతుంది. జ్ఞానాగ్నితో ఆత్మదర్శనం కలుగుతుంది. తానెవరో అర్థం అవుతుంది. మానవ దేహంలోనే సకల దేవతలూ నివసిస్తున్నారు. ఈ దేహం దేవతల సదనం. అవయవాల అధిష్టాన దేవతలను ఉపనిషత్తులు వివరించాయి. తానెవరు? దేవతలకు నివాస గృహం. ఇంద్రాది సకల దేవతలు తనలోనే ఉన్నారు. అన్ని శక్తులు తనవే! తాను సర్వ శక్తిమంతుడు. సకలం సాధించగలడు. ఈ దేహంలో పరమాత్మ ఉన్నాడు. తన ఆత్మ పరమాత్మ స్వరూపం. ఇదే ఆత్మదర్శనం.’

         ‘తాను ఇంతటి శక్తిమంతుడు. అణు విస్ఫోటం అంతటి శక్తి తనలో ఉంది. ఈ శక్తిని దేనికి ఉపయోగించాలి? శక్తి వినాశానికీ, కళ్యాణానికీ రెంటికీ ఉపయోగ పడ్తుంది. ఈ శక్తి మానవ కళ్యాణానికి, సామాజిక కళ్యాణానికి, జగత్ కళ్యాణానికి అని గుర్తించడం ఆత్మజ్ఞానం అవుతుంది. ఆత్మదర్శనం లేని ఆత్మజ్ఞానం అసాధ్యం. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఆరు యజ్ఞాలను గురించి ప్రవచించారు. అవి వరుసగా: ద్రవ్య యజ్ఞం, తాప యజ్ఞం, స్వాధ్యాయ యజ్ఞం, యోగ యజ్ఞం, జ్ఞాన యజ్ఞం, సంశిత యజ్ఞం. పరమాత్మలో యజ్ఞాన్నీ, యజ్ఞంలో పరమాత్మనూ దర్శించడం పరమ యజ్ఞం అవుతుంది.

(డాక్టర్ దాశరథి రంగాచార్య వేద సంహితల ఆధారంగా)

Saturday, February 10, 2024

Saying ‘Panchavati’ is near Nasik is a travesty of truth (Sri Rama Sojourn in Forests, Panchavati and Parnasala) : Vanam Jwala Narasimha Rao

 Saying ‘Panchavati’ is near Nasik is a travesty of truth

(Sri Rama Sojourn in Forests, Panchavati and Parnasala)

Vanam Jwala Narasimha Rao

Hans India (11-02-2024)

            {Notwithstanding what Prime Minister Narendra Modi mentioned about the topography of ‘Panchavati,’ as the one near Nasik, a disagreement has been in circulation for some time whether it is the one near Nasik or near Bhadrachalam. ‘Valmiki Ramayana’ and Vasudasa Swamy’s ‘Andhra Valmiki Ramayana,’ unequivocally with evidence-based topographical narration, confirm that ‘Panchavati and Parnasala’ are near ‘Bhadrachalam Godavari’}-Editor Comment

Addressing devotees after the ‘Consecration Ceremony’ at Ayodhya Ram Temple, Prime Minister Narendra Modi referred to Lord Sri Rama Sojourn in Forests, slightly but strikingly in deviation with Valmiki Sanskrit Ramayana Version, and also the version in Telugu verse-by-verse Transcreation by ‘Andhra Valmiki’ Vavilikolanu Subba Rau (Vasudasa Swamy).

An unambiguous narration of Places Sri Rama sequentially sojourned, with topographical evidences is mentioned in in Andhra Valmiki Ramayana, the one and only authentic version of Valmiki Sanskrit Ramayana in Telugu. Incidentally, Vasudasa Swamy’s 162nd Birth Anniversary falls on February 13, 2023 (Magha Shuddha Chaviti).

According to Modi, Sri Rama during ‘Vana Vasa’ went first to Bharadwaj Ashramin Prayag Raj in Uttar Pradesh, ‘Chitrakoota’ in Madhya Pradesh, ‘Panchavati’ near Nasik in Maharashtra, ‘Lepakshi’ in Anantapur district of Andhra Pradesh, ‘Kishkindha’ in Karnataka, and ‘Rameshwaram’ in Tamil Nadu and to ‘Sri Lanka’ finally. He said that, ‘Panchavati’ is the place near Nasik. Conspicuously no mention is made to ‘Panchavati’ and ‘Parnasala’ which are 30 kilometers from Bhadrachalam, supposed to be the abode of Sri Rama, Sita, and Lakshmana while in forests. Though not connected to ‘Vana Vasa’ mention could have been made to world famous ‘Southern Ayodhya Bhadrachalam Sri Sita Ramachandra Swamy Temple.’ Modi’s authenticity of sources may be right in its own way.

In Sanskrit Valmiki Ramayana and in Vasudasa Swamy Andhra Valmiki Ramayana, Rama with Sita, and Lakshmana after leaving Ayodhya for forests first reached River Tamasa, travelled North, touching Northern Kosala, River Veda Shruti, turned south to cross River Gomathi and pass through southern Kosala. They then reached ‘Shrungiberipuram’ at the bank of Ganges, took help from tribal king Guha to cross River Ganges. They reached Bharadwaj Ashramat the confluence of Rivers Yamuna and Ganga, near Allahabad or Prayag Raj in Uttar Pradesh.’

From there they travelled west along the southern direction of River Yamuna flow, and at a convenient place crossed the River, where they saw the ‘Tree Shyamam.’ On further travelling two miles through ‘Nilavanam’ reached ‘Chitrakoota’ near the banks of Mandakinini-Sarayu Rivers and had an audience with Maharshi Valmiki. After Bharata came there and left, Sri Rama decided to shift from ‘Chitrakoota’ to a faraway place from Ayodhya. They went to ‘Atri Ashram,’ and later trekked from Chitrakoota Region to the massive Dandakaranya forest into the wilderness.

In Dandakaranya after killing ‘Viradha’ Sita, Rama, and Lakshmana reached ‘Sarabhanga Ashram’ twelve miles away from the spot of Viradha’s death. On his direction, travelled west, in a river flowing towards east (opposite direction) to reach ‘Suteekshna Ashram.’ They saw a wonderful Tank and ‘Manda Karni Ashram.’ There, and as well as in Ashramas of many other Sages, they stayed alternately for days, months and years, moving hither and thither, from north to south and back, east to west and back, sometimes to the same place multiple times, for over ten years. 

Later Sita Rama Lakshmana stayed for a while in ‘Suteekshna Ashram’ before travelling south for about 60-70 miles (8 Yojanas) to stay in the Ashram of ‘Sudarshana’ brother of ‘Agastya’ overnight. Next day, travelling south for about 8 miles, reached ‘Agastya Ashram’, and received from him ‘Vaishnava Weaponry’ which Sri Rama used during his war with Ravana. Agastya suggested them to proceed further, to stay in a pleasant place called ‘Panchavati,’ surrounded by flowered forests, with abundant fruits, water, and trees, 16 miles from his place, and guided them the way. While travelling towards ‘Panchavati’ they met ‘Jatayuvu,’ Dasaratha’s friend, on a Banyan Tree, and heard to his story. All together went to ‘Panchavati,’ not near Nasik Godavari but near Bhadrachalam Godavari.

On reaching ‘Panchavati’ Lakshmana built ‘Parnasala’ a spacious cozy straw cottage, giving an Ashram look, levelling, and raising the clay for raised floor of the cottage, strongly pillared with long bamboos. Thereupon on those pillars excellent beams are made, and the branches of Shamii Trees are spread out, twined firmly with twines of jute features, and with the cross-laid bamboos for thatching. Over that blades of Kusha grass, leaves are spread and well over-covered for the roof. The trio entered it after formal ritual like housewarming. This and This alone, is what, the ‘Parnasala’ in ‘Panchavati’ 30 kilometers away from Bhadrachalam, since the times of Lord Rama ‘Vana Vasa’ which even now attracts thousands of pilgrims and devotees every day, and not the one near Nasik.

Notwithstanding what PM Modi mentioned about topography of ‘Panchavati,’ as the one near Nasik, a disagreement has been in circulation, for some time, whether it is the one near Nasik or near Bhadrachalam. Valmiki Sanskrit Ramayana and Vasudasa Swamy Andhra Valmiki Ramayana, unequivocally with evidence based topographical narration confirm that ‘Panchavati and Parnasala’ are near ‘Bhadrachalam Godavari.’ Going by events that followed Sita’s abduction by Ravana, Godavari at ‘Panchavati’ shall be flowing from North to South, as we see at Bhadrachalam. This may be confirmed by the fact that, in search of Sita at the hint from forest animals and birds, Rama and Lakshmana, along the River Godavari travelled towards South-West first and then towards South.

Yet another evidence is that, they saw the place where Jatayuvu fell with serious injuries following his fight with Ravana, along the Godavari Coast, justifying that the river was flowing towards south. From there Rama and Lakshmana as suggested by Jatayuvu proceeded towards South-West for six miles, and towards east to find the southern way. This means Rama and Lakshmana then were towards South of Godavari near Bhadrachalam, suggesting that, there was no need for them to cross river. This also explicitly confirms that, ‘Panchavati’ was on the southern coast of Godavari. Had it been on the east they would have to cross the river, which in fact was not.  

Undoubtedly it is in all probabilities, either the present ‘Parnasala and Panchavati’ that was where Sita, Rama and Lakshmana stayed or somewhere few yards this way or that way. The argument that ‘Panchavati’ was the one near Nasik is travesty of truth and contrary to Essence of Ramayana Scripture. Evidences like placing Ravana’s Chariot opposite (nearby) ‘Parnasala’ at ‘Ratha Gutta’ during Sita’s abduction, to briskly take her from there immediately, prove that, ‘Panchavati’ is on the west of Godavari. Had it been placed on the other side of river, leaving the place of abduction would have been delayed.

Similarly, nearby, there is huge mountain refereed as ‘Sita Guttalu’ (Sita Mountains) supposed to be the place where Sita and Lakshmana stayed back when Rama fought with Khara at the instance of Shoorphanaka. Close by, towards west there is spacious open place, where Rama fought with fourteen thousands Rakshasas at a time. Valmiki Ramayana recorded the existence of ‘Padma Lake’ near ‘Panchavati’ and towards south of ‘Parnasala’ along River Godavari, on way to Bhadrachalam, a village known as ‘Doomagudem’ or ‘Dummagudem’ which is still there. It is said that, on the other side of this village, near a small hillock, fight between Jatayuvu and Ravana took place.

Had Sita, Rama and Lakshmana stayed in ‘Panchavati’ near Nasik, as claimed by some, they might have crossed Vindhya Mountains, Rivers Narmada and Tapati and travelled through Vidarbha, for which there is no evidence in Sanskrit Valmiki Ramayana. While searching for Sita, ‘Rama, and Lakshmana,’ touched ‘Krauncha Forest, Matanga Forest, Rushyamook Hill’ travelling south way.  Irrespective of the sojourn Sri Rama for finally reaching Sri Lanka, it shall be indisputable, that he and Sita and Lakshmana must have taken the shortest way to reach Ayodhya. They did not touch Nasik at all. These are few topographical evidences. And hence, ‘Panchavati and Parnasala’ cannot be near Nasik but only near Bhadrachalam, come what may.

(Source Vasudasa Swamy Andhra Valmiki Ramayana)