Sunday, January 31, 2016

బాలకాండ మందరమకరందం సర్గ-38 : సగర చక్రవర్తి వృత్తాంతం : వనం జ్వాలా నరసింహారావు

బాలకాండ మందరమకరందం
సర్గ-38
సగర చక్రవర్తి వృత్తాంతం
వనం జ్వాలా నరసింహారావు

ఇంతవరకిలా చెప్పిన విశ్వామిత్రుడు, అంటున్నాడీవిధంగా: " పూర్వ కాలంలో మిక్కిలిశూరుడు-సత్కార్యాలుచేయడంలో ఆసక్తున్నవాడు-ప్రజలను పాలించడానికి సంతోషించేవాడు -కీర్తిమంతుడైన సగరుడు, అయోధ్యకు చక్రవర్తిగా వుండేవాడు. తనకు కొడుకుల్లేరని చింతించిన సగరుడు, పవిత్ర నడవడిగలిగిన-మంచిగుణాలున్న ఒక్క కొడుకైనా పుట్టలేదేనని బాధపడుతుండే వాడు. మహా తేజోవంతుడైన ఆ సగరుడికి ఇద్దరు భార్యలు. పుణ్యకార్యాలందు ఆసక్తిగలది-నిత్య సత్రవ్రతైన విదర్భ రాజు కూతురు కేశిని సగరుడి పెద్ద భార్య. మిక్కిలి చక్కనైన అరిష్టనేమి కూతురు సుమతి ఆయన చిన్నభార్య. సౌందర్యంలో అశ్వినీ సుతులతో సమానమైన సగరుడు భృగు ప్రస్రవణమనే పెరున్న పర్వతంపైన వందేళ్లు తపస్సు చేశాడు. విష్ణు తేజమున్న ఆయన కప్పుడు భృగుడు ప్రత్యక్షమై, ఆనందభాష్పాలు రాలుస్తూ తన్నే చూస్తున్న సగరుడికి రెండు వరాలిచ్చాడు. ఆయనకు ఎంతోమంది కుమారులు కలుగుతారని, ఆయన కీర్తికూడా లోకమంతా వ్యాపిస్తుందని, ఇద్దరుభార్యలలో ఒకామెకు వంశోద్ధారకుడైన ఒక్కడేకొడుకు పుట్తాడని,ఇంకొకామెకు అరవైవేలమంది జన్మిస్తారని చెప్పాడు భృగుడు. తమలో ఒక్కకొడుకెవరికి పుడ్తాడనీ-అరవేలమంది ఎవరికి పుడ్తారనీ ప్రశ్నించిన ఆయన భార్యలతో, ఎవరెట్లా కోరుకుంటే అలానే జరుగుతుందని జవాబిస్తాడు భృగుడు. ఎవరికేవిధంగా కావాల్నో అడగమనికూడా అంటాడాయన వారితో. వంశ ప్రతిష్ఠాపకుడైన ఒక్క కొడుకే తనకు కావాలని కేశిని కోరగా, బహు పుత్రులు కావాలని సుమతి కోరింది. అలా వరాలు పొందిన సగరుడు భార్యలతో అయోధ్యకు పోయాడు. కొంతకాలం తర్వాత ఆయన భార్యలు గర్భం ధరించారు".


"కమలాలలాంటి కళ్లున్న కేశిని ఒక కుమారుడిని కనగా, రెండో భార్య సుమతి గుండ్రని గర్భ పిండం పగలతీసుకుని అరవైవేలమంది శిశువులు జన్మించారు. కేశిని తన కుమారుడికి ’అసమంజుడు’ అనే పేరుపెట్టింది.పిల్లలందరికి యవ్వనంవచ్చి,అందంగా విహరించే వారయ్యేంతవరకు, ఒక్కొక్కరిని ఒక్కొక్క నేతి కుండలో వుంచి దాదులు నేర్పుతో చాలాకాలం పెంచారు. పెద్దభార్య కొడుకైన అసమంజుడు ఊళ్లోవున్న పిల్లల్ని చంపడం అలవాటుగా చేసుకున్నాడు. సాహసవంతుడైన అసమంజుడు వాళ్లను తీసుకునిపోయి, సరయూనది ప్రవాహంలోపడేసి, వాళ్లు నీళ్లల్లో మునుగుతూ-తేలుతూ కొట్టుకుంటుంటే, ఒడ్డుపైనుండి నవ్వుతూ వేడుక చూస్తుండేవాడు. పాప కార్యమనుకోకుండా వాడలా సుజనులకు కీడు చేయడాన్ని సహించని సగరుడు, జనాల మేలుకోరి, ధర్మంగా, దాక్షిణ్యం చూపకుండా, అసమంజుడిని అడవులకు వెళ్లగొట్టాడు. అసమంజుడి కొడుకు అంశుమంతుడు న్యాయవాదై-సమస్త ప్రజల మేలుకోరే వాడయ్యాడు. ఆ సమయంలో యజ్ఞం చేయాలన్న సంకల్పం కలిగింది సగరుడికి".

(తనకు జ్యేష్ఠ భార్యవలన కలిగిన జ్యేష్ఠ పుత్రుడైన అసమంజుడిని అడవులకు పంపడం ఎంతవరకు సమంజసమన్న ధర్మ సందేహం కలగొచ్చు. ఇది శాస్త్ర సమ్మతమేనా-కాదా అన్న సందేహమూ కలగొచ్చు. పున్నామ నరకాన్నుండి కాపాడేవాడు పుత్రుడే కదా ! ఒకడికి నలుగురు కొడుకులుంటే ఆ పని చేసేవాడెవరు? నిస్సందేహంగా జ్యేష్ఠ పుత్రుడే. పెద్దకొడుకు పుట్టగానే మనిషి పుత్రవంతుడు అని పిలువబడతాడు. దాంతో పితృల ఋణం తీరిపోతుంది. తనకూ పున్నామ నరక బాధ తప్పుతుంది. ఏ జ్యేష్ఠ పుత్రుడు పుట్టగానే మనిషి పితృల ఋణాన్నుండి ముక్తుడవుతాడో-ఏ జ్యేష్ఠ పుత్రుడి వల్ల మోక్షం పొందుతాడో, వాడొక్కడే ధర్మ శాస్త్రం ప్రకారం పుట్టిన పుత్రుడు. మిగిలిన వారందరినీ ’కామజులు’ అంటారని మునులు చెప్తారు. దీని ప్రకారం సగరుడు పెద్ద కొడుకైన అసమంజుడిని అడవులకు పంపకూడదు. అయితే రామాయణంలో, జ్యేష్ఠ పుత్రుడు గుణవంతుడైతేనే పుత్ర గౌరవానికి యోగ్యుడవుతాడుగాని, కాకపోతే అయోగ్యుడేనని చెప్పబడింది. సాక్షాత్తు శ్రీరామచంద్రుడే అయోధ్య కాండలో ఒకానొక చోట ఈ విషయాన్ని తెలియచేస్తాడు. బ్రాహ్మణుడు బ్రాహ్మణ కర్మను, క్షత్రియుడు క్షత్రియ కర్మను, వైశ్యుడు వైశ్య కర్మను నెరవేర్చకపోతే పతితుడవితాడని గౌతముడంటాడు. తల్లి తప్ప పతితులైన వారందరూ వదలాల్సిన వారే-గురువైనా, పుత్రుడైనా, సోదరులైనా, సఖుడైనా, సంబంధులైనా, చుట్టాలైనా, శిశ్యులైనా, సేవకులైనా- వదలాల్సిన వారే. అలా చేయకపోతే మహా దోషం వస్తుందని శాస్త్రం చెప్తుంది. రాజుకు ముఖ్య ధర్మం ప్రజా పాలన-సగరుడదే చేశాడు. ఇదంతా ఇలా వుంటే, సగరుడు వెళ్లగొట్టిన అసమంజుడు, మనదేశం వదిలి, ఈజిప్ట్ వెళ్లి ఆ దేశానికి ప్రభువయ్యాడని చరిత్ర కారుడు బి. దాస్ తన "Indo-Egyptian History" అనే పుస్తకంలో రాసాడు).

DEVELOPMENT WITH A DIFFERENCE : Vanam Jwala Narasimha Rao

DEVELOPMENT WITH A DIFFERENCE
Vanam Jwala Narasimha Rao
Metro India News Paper (01-02-2016)

            Stage is all set for polling for Greater Hyderabad Municipal Corporation Elections. During the campaign political parties that were in power until a year and half ago both at the state level as well as GHMC level claimed credit for development of the twin cities. Leaders of TRS countered this and assured the voters that they would develop the city into a world class making it universal in the next five years which could not be done by opposition while in power for over 50 years. In support of their argument they gave examples of what has been done by TRS Government during the last year and half quoting schemes taken-up and implemented supported by statistical data. Seldom is this argument effectively countered by either TDP-BJP combine or Congress or to that matter any other party that matters.

            What exactly is development? It is only when a scheme is defined, designed and delivered with a time bound action oriented plan and that too in accordance with the aspirations and needs of people it can be referred as development. In this entire process, the aspirations include the social, economical, cultural, conventional and accepted subjects and they are to be necessarily taken in to consideration. In tune with this only the state government during the last year and half have initiated and implemented a variety of programs at the state level in general and at the GHMC level in particular. The basic reason and the driving force for achieving this success are the statesmanship, vision, leadership qualities and commitment, decision making process through consensus, consultation and quality review methodology of Chief Minister K Chandrashekhar Rao. All these resulted in conceptualization and implementation of people oriented, welfare oriented and development oriented schemes in the state and in the GHMC area. Above all it is the Statesman like Leadership that is causing development. Here we need to refer to Jim Collins who authored a book on leadership titled "Good to Great" where he deals extensively with the qualities and success of level five leadership.

According to Jim Collins "Good-to-Great" leaders embody a paradoxical mix of personal humility and professional will. Good” is The Enemy of “Great”. Level Five Leadership does not happen overnight. It refers to the highest level in a hierarchy of executive capabilities. Leaders of this type are those who combine extreme personal humility with intense professional will; shun the attention of celebrity, channeling their ambition toward the goal of building a great system. They provide new vision, strategy and direction, around which institution gains people’s commitment. The transformation from Good to Great has a process that includes building first level five leadership, deciding on first who and then what, confronting the brutal facts, transcending the curse of competence, inculcating culture of discipline for breakthrough results and technology accelerators. Collins also differentiates between the levels of leadership and elaborates the other four levels in support of level five leader.


Level five leader rises to that level against a background of his rich experience in various fields of activity, individual discipline, ups and downs in the life, colleagues support and many more most of which are success stories. Level one in the hierarchy is a highly capable individual who makes productive contributions through talent, knowledge, skills and good work habits. Level two is a member who contributes individual capabilities to the achievement of group objectives and works effectively with others in a group setting. Level three is a competent manager and capable of organizing people and resources towards the effective and efficient pursuit of predetermined objectives. Level four is an effective leader who catalyzes commitment to and vigorous pursuit of stimulating higher performance standards. Level five the highest in the Hierarchy builds enduring greatness through paradoxical blend of personal humility and professional will. The greatness of level five leader lies in choosing the other four levels for successful accomplishment.

            Professional will of level five leadership creates superb results, demonstrates resolve to produce the best long term results, no matter how difficult, sets standard of building institution and will settle for nothing less. He looks in the mirror, not out the window, to apportion responsibility for poor results, never blaming other people, external factors or bad luck. He is never boastful, acts with quiet calm relying on inspired standards, channels ambition into the institution and looks out the window, not in the mirror to apportion credit for the success. He chooses the right people for right work and lets them into his vehicle of performance and achieving results and only with them forms a superior executive team. The wrong people are off the vehicle and when and why is the tactical choice of level five leader. For him Great vision without Great people is irrelevant.

            When we talk of governance and politics the level five leader is basically a Statesman like qualities person. We heard of Governance and later Good Governance. But today people want Great Governance and Governance with a difference. It is just not enough to attend to mere current needs of people and call it as a development. Long term planning along with short term and medium term are essential. This is what has been happening in the state during the last year and half and with this leadership would happen in the coming days and months. The schemes conceived in the state and in the GHMC area are all keeping the long terms needs of people in mind. All these are examples of statesmanship of Chief Minister Chandrashekhar Rao. To quote few among them:

            Drinking water has been a perennial problem of people living in GHMC limits and no scientific thought was given to solve it till now. To overcome this forever and ever, in addition to bringing Krishna and Godavari River water to the city, CM designed a plan to build two dedicated reservoirs on either side of city in the outskirts with 30-40 TMC capacity which none had thought earlier. Quality power, that too uninterrupted is being supplied in the city which never ever happened during the last five-six decades. For added quality supply in future steps have been initiated for more power production. Two bed room houses that have come-up in IDH colony will be a best example for many more such houses not only in Hyderabad but also elsewhere in the state. This too is an unique scheme unheard earlier. This enhanced the self respect of poor.

            The real development of twin cities has begun only after TRS Government came to power. To enhance its brand image and cosmopolitan culture several steps have been initiated including Kalabharathi. Aasara pensions, insurance facility for workers of different trades, health cards for journalists, fine rice food for hostel boarders etc are few more in that direction.

            Effective maintenance of law order is another priority item including formation of SHE teams, plan for a command control system and quality vehicles for policing. Chanchalguda Jail and racecourse are proposed to be shifted for establishing residential schools for minorities’ girls. For provision of seamless traffic system, strategic Road Development Plan, infrastructure facilities like model markets, multipurpose halls, sanitary system, burial grounds, night shelters to attendants of patients, new bus terminals, pharma city, film city, health city etc are some more initiatives. Kalyanalaxmi and Shadimubarak schemes benefited many and government plans to extend the scheme to all below poverty line. Many more may be quoted in this order.


            It is not just “Governance” or “Good Governance” that is seen and felt now……it is a “Great Governance” with a “Difference” headed by a Statesman Chief Minister Chandrashekhar Rao. End 

అద్భుత నగరం ఆవిష్కరిస్తాం : తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు

అద్భుత నగరం ఆవిష్కరిస్తాం 
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు

          ఏదైనా మొక్క పెట్టే ముందే ఆలోచించాలి. పండ్ల మొక్క పెడితే పండ్ల చెట్టు వస్తది.. ముండ్ల మొక్క పెడితే ముండ్ల చెట్టు వస్తది. ఏ చెట్టు పెట్టాలనేది బాగా ఆలోచించాలి. ఒక బండికి ఒకవైపు కోడె దూడను కట్టి.. ఇంకోవైపు దున్నపోతును కడితే ఆ బండి సరిగా ముందుకుపోదు. రెండు వైపులా మంచి కోడె దూడలను కడితే బండి సజావుగా ముందుకుపోతది. అందుకే విజ్ఞులైన జంట నగరాల ఓటర్లు ఓటు వేసే ముందు ఆలోచించండి.. అని టీఆర్ఎస్ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఓటర్లను కోరారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా తొలిసారి ఈ-ప్రచారానికి శ్రీకారం చుట్టిన ఆయన.. గురువారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు.

          హైదరాబాద్‌ను విశ్వ నగరం చేయడం అనే అంశం ప్రధాన ఎజెండాగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగం కొనసాగింది. ముఖ్యంగా 40 ఏండ్ల కాంగ్రెస్ పాలన, పదిహేడున్నర సంవత్సరాల టీడీపీ, మధ్యలో కొంతకాలం మజ్లిస్ హయాంలో ఈ నగర దుస్థితి ఎలా మారిందో.. పర్యవసానంగా గ్రేటర్ ప్రజలు ఇప్పుడు ఎన్ని అవస్థలు పడుతున్నారో కేసీఆర్ వివరించారు. అంతేకాదు.. విశ్వ నగరానికి ఎలాంటి ప్రణాళికలు రూపొందించారు, గ్రేటర్ పగ్గాలను టీఆర్ఎస్ పార్టీకి అప్పగిస్తే ప్రణాళిక అమలు ఎలా ఉంటుందనేది అంశాలవారీగా ప్రజల ముందు ఉంచారు. ఇప్పటికే ఆ దిశగా వేసిన అడుగులు, నిధుల సమీకరణ తీరును వెల్లడించారు.

          గత 30 ఏండ్లుగా నగరవాసులు పడుతున్న గోసను కేవలం ఐదారు సంవత్సరాల్లోనే దూరం చేయడంతోపాటు హైదరాబాద్‌కు గ్లోబల్ హంగులు తీసుకువస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వ అధినేతగా, ముఖ్యమంత్రి హోదాలో గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు ఇది తాను ఇస్తున్న హామీ అని చెప్పారు. హైదరాబాద్ ఓటర్లు పోలింగ్‌లో తక్కువగా పాల్గొంటారనే అపవాదును తుడిచేలా ఈ గ్రేటర్ ఎన్నికల్లో భారీ పోలింగ్‌ను నమోదు చేసి ప్రజాస్వామ్యం పరిఢవిల్లేలా చేయాలంటూ ఓటర్లలో చైతన్యం నింపిన ముఖ్యమంత్రి, టిఆర్ఎస్‌ను గెలిపిస్తే హైదరాబాద్‌ను అద్భుతంగా ఆవిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..

          గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేస్తే ప్రజలకు అసౌకర్యం కలుగుతుందనే ఉద్దేశంతో జంట నగరాల్లో ఈ-ప్రచారానికి శ్రీకారం చుట్టినం. ఎన్నికలు వచ్చాయంటే సహజంగా రాజకీయ పార్టీలు ప్రజల వద్దకు వచ్చి హంగామా సృష్టిస్తాయి. ఇప్పుడు కూడా కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్, మజ్లిస్, బీజేపీలు ప్రధానంగా పోటీలో ఉన్నాయి. దీంట్లో కొత్తవాళ్లు ఎవ్వరూ కూడా లేరు. ఎన్నికల సందర్భంగా సృష్టించే రణగొణ ధ్వనుల్లో కొట్టుకుని పోకుండా ప్రజలు ఓటేసే ముందు నిదానంగా కుదురుగా ఆలోచించాల్సిన అవసరముంది. జంట నగరాల్లోని మేధావులు, విజ్ఞులు చాలా మందికి నా విజ్ఞప్తి ఏందంటే.. ఇపుడున్న పార్టీల్లో ఏ పార్టీని గెలిపిస్తే మంచిదో ఆలోచించి మరీ ఓటు వేయాలని కోరుతున్నా. గతంలోని కాంగ్రెస్, టీడీపీ, మజ్లిస్ పాలనలో ఏం జరిగిందో, ప్రజలకు ఏ మేలు జరిగిందో మీ గమనంలో ఉన్నది.

          ఒక్క విద్యుత్ రంగాన్ని తీసుకుంటే వీరిద్దరి పాలనలో జంట నగరాలు, యావత్తు తెలంగాణ కూడా 30 ఏండ్లు గోస పడింది. ఆనాటి స్టెబిలైజర్లు, కన్వర్టర్లు, ఇన్వర్టర్లు, జనరేటర్లు ఇప్పుడు లేవు. ఇప్పుడు జంట నగరాల్లో ఈ కన్వర్టర్లు, ఇన్వర్టర్లు, జనరేటర్ల షాపులు మూతపడ్డాయి. తెలంగాణ ఏర్పడ బోయే క్రమంలో తెలంగాణ అంధకారమవుతుందని, చిమ్మచీకట్లు కమ్ముకుంటాయని చాలా వాదనలు మనం చూశాం. కానీ ఐదారు నెలల్లోనే అద్భుతమైన పవర్ సప్లై అందుతున్నది. జంట నగరాలకు రెప్పపాటు కరెంటు పోకుండా సరఫరా జరుగుతున్నది. పరిశ్రమలకూ 24 గంటలు పవర్ సప్లై ఇస్తున్నాం".        ఈరోజు పరిశుభ్రమైన మంచినీరు పట్టణమంతటికీ వచ్చే పరిస్థితి లేదు. దీనికి బాధ్యులు ఎవరు? 60 ఏండ్లు పనిచేసిన వాళ్లా? లేక 18నెలలు పనిచేసిన వాళ్లా? ఒకప్పుడు అద్భుతమైన, పరిశుభ్ర నీటితో పరవశించి పారే మూసీని ఈరోజు మురికి కూపంగా మార్చిన ఘనత ఎవరిది? హుస్సేన్‌సాగర్ ఒకప్పటి మంచినీటి సరస్సు. దాన్ని ఒక కాలుష్య కాసారంగా, కంపు కొట్టేలా చేసిందెవరు? ఎవరు దీనికి బాధ్యులో ప్రజలు ఆలోచించాలి. ఇపుడు పోటీలో ఉన్నవి కొత్త పార్టీలు కావు. వీళ్లందరి చరిత్రలు మీకు తెలుసు. కాంగ్రెస్‌ గానీ, టీడీపీ గానీ వాళ్లు పనిచేసిన టైమ్‌లో జరిగినటువంటి భూకబ్జాలు, నాలాల కబ్జాలు, సరస్సులు మాయం కావడం.. ఇలాంటి దుర్మార్గాలన్నింటికీ తెరలేపింది ఈ రెండు పార్టీలే. మళ్లీ ఈరోజు అవే పార్టీలు వచ్చి మేం మళ్లీ చేస్తామని చెప్తున్నాయి. దీన్ని జంట నగరాల ప్రజలు విశ్లేషించాలి. ఓటేసే ముందు పార్టీ, నాయకుల నిబద్ధత, ప్రతిబద్ధతను ప్రజలు పరిగణనలోనికి తీసుకోవాలి. సరైన పౌర సేవలు అందాలన్నా.. ఈ విషయంపై ప్రజలు తప్పకుండా దృష్టిపెట్టాలి. సరైనటువంటి తీర్పును ఇవ్వాల్సిన అవసరముంది.


          టిఆర్ఎస్‌ను 2001లో ప్రారంభించిన సందర్భంలో ఒకే ఒక్క మాట చెప్పిన. నేను నా జీవిత లక్ష్యంగా తెలంగాణ రాష్ట్రం సాధించాలని బయల్దేరిన. ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని అవాంతరాలు, ఆటంకాలు ఎదురైనా ఉద్యమ మార్గం వీడేదిలేదు. ఒకవేళ వీడితే నన్ను రాళ్లతో కొట్టి చంపండని చెప్పిన. అనేక అవమానాలు, అనేక అవరోధాలు, అనేక ప్రతిబంధకాలు ఎదురైనప్పటికీ 15 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసి, ఈ రోజు తెలంగాణ సాధించుకోగలిగినం. రాష్ట్రంలో ప్రతి ఇంటికీ నల్లా ద్వారా కృష్ణా, గోదావరి నీళ్లు తెచ్చి అద్భుతంగా మిషన్ భగీరథతో ఈ టర్మ్‌లోనే మంచి నీళ్లు అందిస్తాం. మంచి నీళ్లు కొనుక్కునే దుస్థితి తప్పిస్తాం. ఒకవేళ మంచి నీళ్లు అందించకపోతే వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటు అడగదని ముఖ్యమంత్రి హోదాలో నేను శాసనసభలో చెప్పిన. ఇట్ల చెప్పిన పార్టీగానీ, ప్రభుత్వం గానీ, నాయకుడు గానీ 67 ఏండ్ల స్వతంత్ర దేశంలో ఎవరూ లేరు. లక్ష్య సిద్ధి, చిత్తశుద్ధి, ఆత్మవిశ్వాసం ఉంటే ఏదైనా సాధ్యమవుతుంది. ఒక పార్టీ, అందులోని నాయకులందరి భవిష్యత్తును పణంగా పెట్టి చెప్పిన టీఆర్ఎస్ దృక్పథాన్ని ఓటర్లు గమనించాలి.

          హైదరాబాద్లో అనేక విషయాలు ఉండాల్సిన స్థాయిలో లేవు. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా స్వచ్ఛ హైదరాబాద్ నిర్వహించినం. గవర్నర్, ముఖ్యమంత్రితో సహా సిఎస్, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు జంట నగరాలను 400 భాగాలుగా విడదీసి.. గల్లీ గల్లీలో వారం పాటు తిరిగినం. తిరగడమే కాకుండా అక్కడి నుంచి విజ్ఞప్తులు తీసుకొని రూ.200 కోట్లతో వందల వేల పనులు చేపట్టినం. పార్టీలు, రాజకీయాలకతీతంగా జంట నగరాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలతో కమిటీలు ఏర్పాటు చేసి ఢిల్లీ, నాగపూర్‌కు పంపి, అక్కడి పరిస్థితులపై అధ్యయనం చేయించినం. 2500 మందికి ఆటోట్రాలీలు ఇచ్చినం. 44 లక్షల డస్ట్ బిన్స్ పంపిణీ చేసినం. ఇది ఒక అడుగు. హైదరాబాద్ అంతా కంచన్ బాగ్, కుందన్ బాగ్ లాగా ఉండేది. బస్తీలను ఉద్యానవనాలుగా పిలుచుకునే వాళ్లు. ఇప్పుడవి కనుమరుగైపోయినయ్. ఒకప్పుడు సిటీ ఆఫ్ పెర్ల్స్, సిటీ ఆఫ్ లేక్స్ అని హైదరాబాద్ కు పేరుండె. 11 వేల పైచిలుకు చెరువులుండే నగరంలో ఈరోజు 118 మాత్రమే ఉన్నాయి. ఎవరి హయాంలో మాయం అయ్యాయో ప్రజలు గమనించాలని కోరుతావున్నా. స్ట్రాటజిక్ రోడ్డు డెవలప్‌మెంట్ ప్లాన్ కింద రూ.30 వేల కోట్లతో రోడ్లను నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నం. చైనాకు వెళ్లినప్పుడు బ్రిక్స్ బ్యాంక్ చైర్మన్, మన భారతీయుడు కామత్‌ను కలిసిన. హైదరాబాద్‌లో ట్రాఫిక్ అవస్థలు చెప్పి.. రూ.25వేల కోట్లు కావాలని అడిగిన. ట్రాఫిక్ బాధల నుంచి విముక్తికి స్కైవేలు నిర్మించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పిన. పీవీ నరసింహారావు స్కైవే లెక్క నాలుగు వైపులా స్కైవేలు రావాలి. ఉప్పల్‌నుంచి ఘట్‌ కేసర్, ప్యారడైజ్‌నుంచి తూంకుంట, బొల్లారంనుంచి కొంపల్లి ఇలా స్కైవేలు రావాలి. వరంగల్‌ వాళ్లు ఉప్పల్‌ వరకు రావడానికి గంటంబావు పడితే.. నగరంలోకి వచ్చేందుకు గంటన్నర పడుతున్నది. ఈ ఇబ్బందులు పోయేందుకు స్కైవేలు ఏర్పాటు చేయాల్సివుంది".

          నేను 2014 జూన్ రెండున ప్రమాణ స్వీకారం చేస్తే.. ఆరో తేదీన జీహెచ్‌ఎంసీ అధికారులతో సమావేశం పెట్టిన. వర్షాకాలం సిటీ మొత్తం జలమయం అవుతుంటే వాటిపై చర్చించినం. సీఎం క్యాంపు ఆఫీసు, అసెంబ్లీ, రాజ్‌భవన్ ముందు మోకాల్లోతు, కార్లలోతు నీళ్లు నిలుస్తున్నాయి. దీని బాగు చేయలేరా? అని అడిగిన. ఏం చేయలేం సార్.. అని అధికారులు అన్నరు. కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాల పుణ్యమా అని రెయిన్ వాటర్ డ్రెయిన్స్ అన్నీ కబ్జా అయిపోయినయి. రూ.11-12వేల కోట్లు ఖర్చు పెట్టడమే కాదు మూడేండ్లు సమయం ఇస్తే తప్ప బాగు చేయలేమన్నరు. మురుగునీరు, మంచినీటి వ్యవస్థ కావచ్చు.. పౌర సేవలకు కావాల్సిన వసతులు కావాలంటే 30వేల కోట్లు ఖర్చు పెట్టాలి. త్వరలో బ్రిక్స్ బ్యాంక్‌తో మాట్లాడి రూ.25వేల కోట్లు తెస్తం.

          హైదరాబాద్‌ను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దుతాం. గతంలో తెలంగాణ తెస్తా అని ఎట్ల చెప్పిన్నో.. అదే నిబద్ధత, చిత్తశుద్ధితో హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దే అవకాశం టిఆర్ఎస్‌కు ఇవ్వండి. జంట నగరాల ప్రజలమీద ఒక బాధ్యత ఉంది. సరైన వారిని గెలిపించి సరైన వారికి అధికారం కట్టబెట్టాలి. జంట నగరాల వాసులు ఓటింగ్‌లో సరిగా పాల్గొనరనే అపవాదు ఉంది. ఇది తొలగిపోవాలంటే ఓటింగ్ శాతాన్ని పెంచాలి. పెద్దవాళ్లు ఎవరైనా ఉంటే మందుగానే వచ్చి ఓటేయండి. లేకపోతే సాయంత్రం వేయండి. పెద్ద ఎత్తున పోలింగ్‌లో పాల్గొని ప్రజాస్వామ్య స్ఫూర్తిని, విజ్ఞతను చాటాలని కోరుతున్నా. కొందరు పెద్దలు ఫ్రస్టేషన్‌లో వాగ్దానాలు చేస్తున్నరు. అన్నింటికీ టాక్స్‌లున్నాయిగానీ... టాక్స్ లేనిది వాగ్దానాలకే. ఫ్రీగా మంచి నీళ్లు ఇస్తామని కాంగ్రెసోళ్లు పరిపక్వత లేకుండా వాగ్దానాలు చేస్తున్నరు. జీహెచ్‌ఎంసీకి, జల మండలికి సంబంధమే లేదు. జల మండలి చైర్మన్ సీఎం. మరి జీహెచ్‌ఎంసీలో గెలిస్తే ఉచిత నీళ్లు ఎట్ల ఇస్తరు? అడ్డగోలు వాగ్దానాలు.. పరిణతి చెందిన పార్టీ అంటరు. పేలవంగా మాట్లాడుతున్నరు. వారి విజ్ఞతకే వదిలేస్తున్నా.

          టిఆర్ఎస్‌కు ఓటేసేందుకు రాష్ట్రం మొత్తానికి, హైదరాబాద్‌కు కరెంటును ఇస్తున్నదనే విషయం ఒక్కటి చాలు. ముంబైకి ఐలాండ్ తరహా పవర్ సైప్లె ఉంది. అందుకే ముంబైని నెవర్ స్లీప్ సిటీ అంటరు. హైదరాబాద్‌కు కూడా త్వరలోనే ఐలాండ్ తరహా పవర్ సైప్లె చేయబోతున్నాం. అన్ని జనరేటింగ్ స్టేషన్లను హైదరాబాద్‌కు అనుసంధానించి.. రెప్పపాటు కూడా హైదరాబాద్‌ల కరెంటు పోకుండా ఏర్పాట్లు చేస్తున్నం.

          జంట నగరాల్లో కూరగాయలు, మాంసం, చేపల మార్కెట్లు జనాభాకు అనుగుణంగా లేవు. 200 మార్కెట్లు ఉండాలి. ఏడు మాత్రమే ఉన్నాయి. ఇది సిగ్గు చేటు. ఇది ఎవరి నిర్లక్ష్యానికి నిదర్శనం? ప్రభుత్వ స్థలాల్లో ఈ 200 మార్కెట్లు నిర్మించేందుకు చర్యలు తీసుకున్నం. ఇంత పెద్ద నగరంలో 500 పబ్లిక్ టాయిలెట్స్ ఉండాలె. అన్నీ కలిపి 150 కూడా లేవు. ఉన్నా సమగ్రంగా లేవు. ముఖ్యంగా మహిళలు.. వారి బాధ వర్ణనాతీతం. అందుకే 250 టాయిలెట్లు నిర్మిస్తున్నాం. క్రైస్తవ, మహ్మదీయ, హిందూ సోదరులకు కావాల్సిన దహన, ఖనన వాటికల ఏర్పాటుకు మున్సిపల్ అధికారులకు ఆదేశాలిచ్చాం. డంపింగ్ యార్డ్స్ కూడా క్రమ పద్ధతిలో లేవు. జవహర్‌ నగర్‌లోని డంపింగ్‌యార్డు ప్రజల జీవితాలను కలుషితం చేసేలా ఉంది. నగరానికి నాలుగు వైపుల నాలుగు డంపింగ్ యార్డులుండాలని నిర్ణయించాం. అక్కడ విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నం. దవాఖానల వద్ద నైట్‌ షెల్టర్లు ఏర్పాటు చేస్తున్నం. వీటిని వందల సంఖ్యలో నిర్మిస్తాం. నగరంలో 50మల్టీపర్పస్ కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి ఆదేశించాం. 3800 సిటీ బస్సులు తిరిగే నగరం మనది. 45 లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తున్నరు. బస్‌బేలు సరిగా లేవు. అధునాతన పద్ధతిలో వీటిని నిర్మించేందుకు చర్యలు తీసుకున్నం. మిషన్ కాకతీయద్వారా జంట నగరాల్లోని 1069 చెరువుల పునరుద్ధరణ చేపట్టినం. రెండు బస్టాండ్లు సరిపోవు. ఇంక నాలుగు బస్ టర్మినల్స్ అవసరమన్నాయి. రైల్వే స్టేషన్లు కూడా మూడే ఉన్నాయి. ఢిల్లీ మాదిరిగా రెండు వైపులా కొత్త రైల్వే టర్మినల్స్ కావాలని చెప్పాం. చర్లపల్లి వద్ద కొత్త రైల్వే టర్మినల్ కోసం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నాం. 12 మిలియన్ల మంది ప్రయాణికులు ఉంటే రెండో రన్‌వే ఏర్పాటు చేయాలి. శంషాబాద్ విమానాశ్రయం సామర్థ్యం 10 మిలియన్లు దాటిపోయింది. ఎయిర్ ట్రాఫిక్ ఇబ్బంది ఉండకుండా సెకండ్ రన్‌వే కూడా ఏర్పాటు చేయాల్సి ఉంది. జీఎం ఆర్‌తో మాట్లాడాం. ఒప్పందంలో ఉన్నందున దాన్ని చేపట్టాలని చెప్పినం. ఇది చారిత్రక నగరం. సిస్మలాజికల్ కండిషన్లు కావొచ్చు.. పర్యావరణ సమతుల్యత కావొచ్చు దేశంలో ఏ నగరానికీ లేని హంగులు హైదరాబాద్‌కు ఉన్నాయి. మాస్టర్‌ప్లాన్ ఏ విధంగా ఉండాలో అలా రూపొందించాలని హెచ్‌ఎండీఏకు ఆదేశాలిచ్చినం. రీ ఇంజినీరింగ్ జరిగింది. త్వరలోనే ప్రజల ముందుకు రానుంది. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోని విధంగా రూ.40వేల కోట్లతో సంక్షేమ పంథాలో పోతున్నం. పేదవాడు ఆత్మగౌరవంతో బతకాలనేది టీఆర్ఎస్ నినాదం. డబుల్ బెడ్‌ రూం ఇండ్ల పథకం చేపట్టినం. వెయ్యి రూపాయల పింఛను ఇచ్చినం. బియ్యం ఆరు కిలోలు ఇస్తున్నం. 40 లక్షల మంది హాస్టల్ విద్యార్థులకు సన్న బియ్యం ఇస్తున్నం. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌తో పేదలకు ఊరటనిస్తున్నం. రైతులకు రుణాలు మాఫీ చేసినం”.

గత ప్రభుత్వ హయాంలో బుల్‌డోజర్లతో పేదల గుడిసెలను కూలగొట్టేవారు. కానీ చరిత్రలో మొదటిసారిగా లక్షల మంది పేదలకు పట్టాలిచ్చినం. డబుల్ బెడ్‌ రూం ఇండ్లు కూడా కట్టిస్తం. మైనారిటీలకు రూ.1100 కోట్లు బడ్జెట్‌లో పెట్టినం. వచ్చే సంవత్సరంనుంచి వారికి 60 రెసిడెన్షియల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నం. అంగన్‌వాడీల జీతాలు పెంచినం. ఆటో రిక్షాలకు టాక్స్ రద్దు చేసి రూ.70 కోట్లు మాఫీ చేసినం. 10 లక్షల ఆటో డ్రైవర్లు, 15 లక్షల భవన నిర్మాణ కార్మికులకు రూ.5 లక్షల బీమా కల్పించినం. నగరంలో 14% క్రైం రేటు తగ్గిందని అధికారులు చెప్తున్నరు. మహిళల రక్షణకు షీ టీమ్స్ ఏర్పాటు మీ అందరి గమనంలో ఉన్నది. పోలీసులకు అధునాతన వాహనాలు కల్పించినం. కృష్ణా, గోదావరి నదుల నుంచి వందల కిలోమీటర్ల నుంచి పైపు లైన్లతో నీళ్లు తీసుకువస్తున్నం. మధ్యలో ఓ పది రోజులు నీటి సరఫరా ఆగిపోతే హైదరాబాద్ పరిస్థితి ఏంది? గతంలోని పాలకులు ఎవరూ దీని గురించి ఆలోచించలె. అందుకే నగరానికి రెండు వైపులా 20 టీఎంసీల చొప్పున రెండు డెడికేటెడ్ జలాశయాలు నిర్మిస్తున్నం. సిటీ బస్సుల్లో సెపరేటర్స్ పెట్టించినం. టీఆర్ఎస్ పార్టీని 2001లో ప్రారంభించిన సందర్భంలో ఒకేఒకమాట నేను ప్రజలకు చెప్పిన. నేను నా జీవిత లక్ష్యంగా తెలంగాణ రాష్ట్రం సాధించాలని బయలుదేరిన.. ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని అవాంతరాలు, ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఉద్యమ మార్గం వీడేదిలేదు. ఒకవేళ వీడితే నన్ను రాళ్లతో కొట్టి చంపండని ఆనాడు చెప్పిన. అనేక అవమానాలు, అనేక అవరోధాలు, అనేక ప్రతిబంధకాలు ఎదురైనప్పటికీ పదిహేను సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసి ఈ రోజు తెలంగాణ సాధించుకోగలిగినం”.

          హైదరాబాద్‌ను విశ్వ నగరంగా తీర్చిదిద్దడమే అజెండా.. అందులో ఏమాత్రం రాజీ లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రజలను మభ్యపెట్టే వాగ్దానాలు తాము చేయబోమని, నగరాభివృద్ధి ప్రణాళికల అమలుకు ఐదారేండ్ల సమయం పడుతుందని స్పష్టం చేశారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల అనంతరం సచివాలయం నిర్మాణానికి శంకుస్థాపన ఉంటుందని చెప్పారు. హుస్సేన్‌సాగర్, మూసీ ప్రక్షాళణకు ఆస్ట్రియా బృందానికి పనులు అప్పగించామని తెలిపారు. నగరంలో నాలుగైదు కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. జీహెచ్‌ఎంసీపై గులాబీ జెండా ఇప్పటికే ఖాయమైందని స్పష్టం చేశారు. తమ ప్రణాళికలకు నిధులు ఎక్కడినుంచి సేకరిస్తున్నదీ మొదలుకొని జీహెచ్‌ఎంసీ మేయర్ పీఠాన్ని ఎలా కైవసం చేసుకోబుతున్నదీ గణాంకాలతో సహా వివరించారు. పొలిటికల్ టెర్రరిజం ఎవరిదని ప్రశ్నించిన కేసీఆర్.. ఇతర రాజకీయ పార్టీల నాయకులు టిఆర్ఎస్‌లో చేరుతున్నారు. దానిని తెలంగాణ శక్తుల పునరేకీకరణ గా భావిస్తున్నా మన్నారు. ఈ ఎన్నికల్లో తమకు ప్రత్యర్థి అంటూ పలానా పార్టీ అని చెప్పే పరిస్థితి లేదన్నారు.

          అసలు చంద్రబాబు ఇక్కడికి రావటమే అసంబద్ధం. ఆయనకు ఇక్కడేం పని? ఊడ్చుకోవడానికి ఆయనకు హిందూపురం నుంచి ఇచ్చాపురం వరకు ఉంది. తిరుపతి, గుంటూరు, వైజాగ్ ఇలా అనేక పట్టణాలున్నాయి. అవన్నీ డెవలప్ అయిపోయినయి.. ఇగ చేసేదేంలేదని ఇక్కడికి వస్తున్నడా? అవన్నీ వదిలేసి హైదరాబాద్ రోడ్లు ఊడుస్తుమంటే ఎవరు నమ్ముతరు? 17 సంవత్సరాల సుదీర్ఘ టీడీపీ పాలనలో ఆయన మామ, ఆయనే ఉన్నారు. హైదరాబాద్‌కు చేసిందేం లేదు. ఎవరూ నమ్మే పరిస్థితిలో లేరు. ఫలితం కూడా అదే విధంగా ఉండబోతోంది. జీహెచ్‌ఎంసీ పై గులాబీ జెండా ఎగరడం ఖాయం. దానిని ఎవరూ అపలేరు. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీఆర్ఎస్ ఆవిర్భవిస్తుంది. ప్రతిపక్షాల సర్వేల్లోనూ ఇదే తేలింది. ఎక్స్ అఫీషియో మెంబర్లు మాకే ఎక్కువ ఉంటారు. ఇక మజ్లిస్ మాకు మిత్రపక్షమే. ఎట్ల లెక్క చూసినా మాదే మేయర్ పీఠం. మొన్న నమస్తే తెలంగాణ వాళ్ళు కూడా రాశారు. లెక్క ఉంది.. తేలాల్సింది సీట్ల లెక్కనే. మజ్లిస్ పార్టీ ఫ్లోర్ లీడరే అసెంబ్లీలో టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఫ్రెండ్లీగా ఉంటామని ప్రకటించారు. వాళ్లది ఏ తత్వమైనా రాజకీయంగా మాకు మిత్రపక్షమే. వారి బ్లడ్ గ్రూప్ ఏంది.. బీజేపీ బ్లడ్ గ్రూప్ ఏంది అనేది మాకు సంబంధం లేదు. బీఫ్ మీద కూడా మాట్లాడటం రాజకీయ దౌర్బల్యం. ఎవరు ఏం తింటేంది? ప్రపంచవ్యాప్తంగా బీఫ్ తింటరు. చైనాలో పాములు, కప్పలను కూడా తింటరు. పాతబస్తీలో టిఆర్ఎస్‌ను బ్రహ్మాండంగా హర్షిస్తున్నారు. సర్వేల్లోనూ అక్కడ మజ్లిస్, టీఆర్ఎస్ రెండు పార్టీలకే ఓట్లు పడతాయని అంటున్నారు. ముందుగానే మేయర్ అభ్యర్థిని ప్రకటించడం సాధ్యం కాదు. మేయర్ అభ్యర్థిని గెలిచిన తరువాత అందరూ కూర్చుని నిర్ణయిస్తారు.

          డబుల్‌ బెడ్ ఇండ్లకు నిధులెక్కడివి అంటున్నారు. అనేక పథకాలనుంచి సమీకరిస్తున్నాం. కేంద్ర పథకాల్లో అర్బన్ హౌసింగ్ స్కీములున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ నిధులకు కేంద్ర పథకాల నిధులు కలిపి నిర్మించి ఇస్తాం. కేసీఆర్ నిబద్ధతతో ఉన్నాడు. హడ్కో నుంచి , రాష్ట్ర ప్రభుత్వం నుంచి పెడతాం. హైదరాబాద్‌లో భూములు అమ్మితే వచ్చేవి కూడా ఇండ్లకు పెడతాం. ప్రభుత్వం తరపున నగరంలో వెయ్యి ఎకరాలు సేకరించినం. ఎక్కువ భాగం స్థలాలకే ఖర్చు ఉంటుంది. ఈ స్థలాల్లో వచ్చే యేడాది కల్లా లక్ష డబుల్ బెడ్ రూం ఇండ్లను నిర్మించబోతున్నాం. రాష్ట్ర ఆదాయంలో ఈ సంవత్సరం 15 శాతం పెరుగుదల ఉంది. కేవలం ప్లాన్డ్ ఎక్స్‌పెండిచరే రూ. 60 వేల కోట్ల పైచిలుకు ఉంది. చైనాలో కూడా 15 శాతం లేదు. ఏడాదికి రూ. 6 లక్షల ఆదాయం ఉన్న మధ్య తరగతి వర్గాలకు కూడా క్రెడిట్ లింకే జీ స్కీం కింద డబుల్ బెడ్‌ రూం ఇండ్లు కట్టిస్తాం. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తరువాత మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల నిబద్ధతతో లబ్ధిదారుల ఎంపికలో రాజకీయాలు ఉండొద్దని అనుకున్నాం. ఎమ్మెల్యే కేవలం తన నియోజకవర్గంలో ఇండ్లు నిర్మించే గ్రామాన్ని మాత్రమే ఎంపిక చేస్తారు. లబ్ధిదారుల ఎంపిక అంతా అధికారులదే. చిన్న తప్పు జరిగినా ఉద్యోగం ఊడదీస్తామని హెచ్చరించాం. హైదరాబాద్‌లో డబుల్ బెడ్ రూం ఇండ్ల దరఖాస్తులను వంద శాతం రెవెన్యూ అధికారులతో కలెక్ట్ చేయిస్తాం. కట్‌ ఆఫ్ డేట్, అన్ని వివరాలు ప్రకటిస్తాం.

          కొత్త సెక్రటేరియట్‌కు జీహెచ్‌ఎంసీ ఎన్నికల తరువాత నేనే శంకుస్థాపన చేయబోతున్నా. ఉస్మానియా ఆసుపత్రి టవర్స్‌కూడా రూపకల్పన పూర్తయింది. ఉన్న భవనం వెనుక కొత్త భవనాలను నిర్మిస్తాం. చెస్ట్ ఆసుపత్రి ఆటోమేటిక్‌గా తరలిపోతుంది. హుస్సేన్ సాగర్ భగవంతుడు ఇచ్చిన గొప్ప వరం. సమైక్య రాష్ట్రంలో కుళ్ళిపోయి సర్వనాశనం అయ్యింది. కెమికల్స్ దాంట్లో కలవకుండా మళ్లించే పనులు చేపట్టాం. దానిని వివాదం చేశారు. ఆస్ట్రియా బృందం వద్ద కొత్త టెక్నాలజీ ఉంది. మూసీ, హుస్సేన్‌సాగర్ పనులను వాళ్ళకు అప్పగించాం. కేసీఆర్‌గా హామీ ఇస్తున్నా.. వాటిని ప్రక్షాళన చేసి ఆచరణలో చూపెడతాం. రేస్ కోర్స్‌ను తరలిస్తాం. చర్లపల్లి జైలు వద్ద 90 ఎకరాల ఓపెన్ స్పేస్ ఉంది. చంచల్‌గూడ జైలును తరలిస్తే పాతబస్తీలో 170 ఎకరాల జాగా ఉంటది. హిందూ, ముస్లిం, క్రిస్టియన్లు అందరికీ సంబంధించి విద్యాలయాలను ఏర్పాటు చేస్తాం. బస్‌బేలు, మార్కెట్ల వంటి మౌలిక వసతుల కోసం కొంత స్థలాన్ని వినియోగిస్తాం”.

          హైదరాబాద్‌కు ఉత్తర భాగంలో గానీ, తూర్పు బాగంలో కానీ ఇంకో ఎయిర్‌పోర్టు రావాలి. ప్రభుత్వం వద్ద 700ఎకరాల భూమి ఉంది. కేంద్రంతో మాట్లాడుతున్నాం. సివిల్ ఎయిర్‌పోర్టు కింద ఇది పనిచేస్తుంది. ఔటర్ రింగు రోడ్డుపై క్రాసింగ్స్, రేడియల్ రోడ్లు సంపూర్ణం కాలే. హెచ్‌ఎండీఏ మాస్ట్‌ర్‌ప్లాన్‌లో అవన్నీ కూడా ఉంటాయి. లీడ్ సంస్థతో ఓఆర్‌ఆర్‌ను ఇంటిగ్రేట్ చేస్తూ క్రాస్‌ ఓవర్ లేకుండా చేస్తున్నాం. జర్నలిస్టులకు డబుల్‌బెడ్‌రూం కంటే మంచి సదుపాయం కల్పిస్తాం. 580 చదరపు అడుగులు కాకుండా 800 చదరపు అడుగుల్లో నిర్మించి ఇస్తాం. కమిటీ వేసి అందరికీ డబుల్‌ బెడ్ రూం ఇండ్లు నిర్మించి ఇస్తాం. నేను ఫౌండేషన్ స్టోన్ వేస్తా. సంవత్సరం లోపు ప్రారంభించుకుందాం.

కేంద్ర ప్రభుత్వం దేశంలో 20 నగరాలను స్మార్ట్ సిటీలుగా ప్రకటిస్తే తెలంగాణకు ఒక్కటీ లేదు. ఏపీలో కాకినాడ, వైజాగ్‌లు ఉన్నాయి. మరి తెలంగాణ కాకి ఎత్తుకుపోయిందా? కేంద్రం తీరు హర్ట్ చేసే విధంగా ఉంది. అప్పట్లో పెట్టుబడిదారులకు అనుకూల ప్రదేశాల్లో తెలంగాణను ప్రకటించలేదు. టీఎస్‌ఐపాస్ కింద ఏర్పాటుచేసిన ఇంక్యుబేటర్ సెంటర్‌ను సత్యనాదెళ్ళ, రతన్‌ టాటా, సుందర్‌పిచాయ్‌లు అభినందించారు. కేంద్రం మాత్రం అభినందించలేదు. ఏదో చిల్లర ప్రచారం కోసం టీఆర్ఎస్, కేసీఆర్‌పై అప్పర్ హ్యాండ్ సాధిస్తామంటే అది సాధ్యం కాదు. వ్యవసాయ శాఖ మంత్రి వస్తారు. తెలంగాణ కరువు నివేదిక ఇయ్యలేదని బీజేపీ వాళ్ళు చెప్పిస్తారు. ప్రభుత్వానికేమో అక్టోబర్ 30 వరకు ఇవ్వాలని అధికారికంగా లేఖ రాస్తారు. కేంద్రం, రాష్ట్రం మధ్య రాజ్యాంగ సంబంధం ఉండాలి. వెంకయ్యనాయుడు ప్యాకేజీ, లీకేజీ అంటే.. ప్యాకేజీ ఎక్కడిది.. లీకేజీ ఎక్కడిది. ఆయన ప్రాస అందరికీ తెలిసిందే. నాక్కూడా అద్భుతమైన తెలుగు వస్తది.

          వ్యవసాయానికి వాడకపోవడం వల్లనే నగరంలో 24 గంటల కరెంట్ ఇచ్చారనేది అవాస్తవం. గతంలోకంటే 5 నుంచి 10 వేల మిలియన్ యూనిట్ల వాడకం పెరిగింది. ఆ వివరాలన్నీ ఆన్‌లైన్‌లో ఉంటాయి. పాఠశాల ఫీజులపై ఒక నియంత్రణ చేపట్టాల్సి ఉంది. రానున్న క్యాబినెట్‌లో ఈ అంశంపై విధాన నిర్ణయం తీసుకోనున్నాం. రూ. 500కోట్ల నుంచి రూ. 1000 కోట్ల లోపు వచ్చే అసెంబ్లీలో బీసీ సబ్‌ ప్లాన్‌ను ప్రవేశపెడతాం. బీసీ క్రీమీలేయర్ అనేది సుప్రీంకోర్టు ఆదేశం. కేంద్రం, రాష్ర్టాలు ఖచ్చితంగా అమలు చేయాల్సిందే. చేయమని చెప్పే ఆస్కారమే లేదు.

          తెలంగాణ ప్రభుత్వం ఉగ్రవాదులు, తీవ్రవాదులు, అసాంఘిక శక్తులపై ఉక్కుపాదంతో వ్యవహరిస్తుంది. అసాంఘిక శక్తులను అణచివేస్తాం. సంఘ వ్యతిరేక శక్తుల ఆటలు సాగనివ్వం శాంతి భద్రతలు సామరస్యంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం.. ఇదే టాప్ ప్రయారిటీ. ఎక్కడా రాజీపడం. ఉగ్రవాదాన్ని ఉపేక్షించే పరిస్థితే లేదు. ప్రైవేటు మనీ లెండర్స్ అంశంపై కఠినమైన చట్టాలు తేవాల్సి ఉంది. ఇప్పటివరకు బ్లాక్‌ మనీ, వైట్ మనీ చూసినం. కానీ ఇప్పుడు కొత్తగా ఈ కాల్‌ మనీ వచ్చింది. ఆంధ్రలో కాల్‌ మనీ సృష్టికర్తలే ఇప్పుడు హైదరాబాద్‌కు వచ్చి ఓట్లు అడుగుతున్నారు. అందుకే హైదరాబాద్ ఓటర్లు తస్మాత్ జాగ్రత్త.

          ఎల్లంపల్లి నుంచి గోదావరి జలాల్ని తరలించే పనులు కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టిందనేది వాస్తవం. కానీ మా ప్రభుత్వం అన్ని ఆటంకాలు, అవరోధాల్ని తొలగించి, వేగంగా పూర్తి చేశామని చెబుతున్నం. లేకపోతే ఇంకా మూడేండ్లకు కూడా పూర్తి కాకపోయేది. రైల్వే సహాయనిరాకరణ వల్ల ఒక్కచోట రెండేండ్లనుంచి పెండింగ్‌లో ఉంది. నేను రైల్వే జీఎం శ్రీవాత్సవ ఉన్నపుడు ఆయనకు ఫోన్ చేసి... మీ రైల్వే వాళ్లు 200 బోర్లు వేసుకోండి.. మీకు బల్క్‌గా నీళ్లివ్వటం మావల్ల కాదు. మాకే నీళ్లు లేవు అని అంటే, అదేంది సార్... గుస్సా అవుతున్నరు అని ఒక్క రోజులో పర్మిషన్ ఇచ్చిండు. డిఫెన్స్ భూములకు సంబంధించి.. కంటోన్మెంట్‌కు కూడా అదే చెప్పినం. వెంటనే అనుమతులిచ్చినరు. నిరంతరం పర్యవేక్షణతో ఎఫెక్టివ్‌గా స్టెప్స్ తీసుకున్నం. వర్షాభావంతో సింగూరు ఎండిపోయినా నగరంలో నీటి కొరత రాకుండా చూసినమని ప్రజలకు చెప్పినం.

          దురాశతో కాంగ్రెస్ నాయకులు వీ హెచ్, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆంధ్రా వాళ్లను మీరు రాక్షసులన్నారు అంటూ విమర్శిస్తున్నారు. ఆనాడు తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్న వారందరినీ మేము రాక్షసులు అన్నమాట నిజమే. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆనాటి సమైక్య పాలకులకు మడుగులొత్తితే.. వాళ్లను కూడా దద్దమ్మలు, చవటలు, సన్నాసులు అనికూడా అన్నాం. ఉద్యమ నాయకుడిగా ఆరోజు అది నా కర్తవ్యం. అప్పుడు టీఆర్ఎస్ ఫక్తు ఉద్యమ పార్టీ. ఆ రీతిగానే ఉన్నం. తెలంగాణ సాధించుకున్నం. 2014 జూన్ 2 తరువాత టీఆర్ఎస్ రాజకీయ పార్టీగా మారింది. హైదరాబాద్‌లో ఉన్న కన్నడిగులు, మళయాళీలు, గుజరాతీలు సహా అందరూ మావారే. హైదరాబాద్‌లో ఉన్న వాళ్లంతా గర్వంగా హైదరాబాదీయులుగా చెప్పుకోవాలని సభల్లో కూడా చెప్పాను. 18 నెలల్లో చీమన్నా చిటుక్కుమన్నదా? చంద్రబాబు హైదరాబాద్‌లో సెక్షన్ 8 ను అమలు చేయాలని అన్నారు. ప్రాంతాల మధ్య కక్షలు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. అయినా సింగిల్ కంప్లైంట్‌కూడా లేదు. చిల్లర రాజకీయాల కోసం, వచ్చే నాలుగు ఓట్ల కోసం కక్కుర్తి పడి హైదరాబాద్ ప్రశాంతతకు భంగం కలిగించకండి. ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు. చాలా కాలనీల్లో టిఆర్ఎస్‌కు ఓటేస్తామని ముందుకు వస్తున్నారు.

          నగరాభివృద్ధికి నిధులెక్కడివని కొందరు అడుగుతున్నారు. ఐఎల్‌ఎఫ్‌ఎస్ సంస్థ రూ. 7500 కోట్లు ఇస్తానంది. హడ్కో రూ. 2 వేల కోట్ల రుణం ఇచ్చింది. మొత్తం రూ. 9500 కోట్లకు టై అప్ జరిగిపోయింది. బ్రిక్స్ బ్యాంకుతో మాట్లాడాల్సి ఉంది. రూ. 20 నుంచి రూ. 25 వేల కోట్ల రుణానికి వారు ఎస్ అనగానే కార్యాచరణ మొదలవుతుంది. జీహెచ్‌ఎంసీ నిధులు, బీపీఎస్, ఎల్‌ఆర్‌ఎస్ మొత్తం, భూములు అమ్మగా వచ్చిన మొత్తాన్ని కలిపి హైదరాబాద్ నగరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతాం. అయితే సమస్యలు ఓవర్ నైట్‌లో పరిష్కారం కావు. నేను మాయమాటలు చెప్పను. నగరంలో మురుగు నీటి వ్యవస్థ, వాన నీటి కాలువలు బాగు చేయాలంటే మూడు నాలుగు సంవత్సరాలు పడుతుంది. కబ్జాలు తొలగించాలి. కోర్టుల్లో కేసులు ఉంటాయి. పరిపాలనా పరమైన సౌలభ్యం ఉండాలని రంగారెడ్డి జిల్లాను అలాగే ఉంచి ఇబ్రహీంపట్నం, మేడ్చెల్ వంటి ప్రాంతాలను కలుపుకొని గ్రేటర్ హైదరాబాద్‌ను 4-5 జిల్లాలుగా చేస్తాం.

          చంద్రబాబు హైదరాబాద్‌కు కేంద్రం నిధులు తెస్తడా? ఆయన అమరావతికే దిక్కులేదు. పీఎం వచ్చి నీళ్లు, మట్టి ఇచ్చిపోయిండు. రెండు కుండలు తెస్తే ఇదేందిరా? అని పరేషాన్ అయిన. వెంకయ్యనాయుడుని అడిగిన ఏమన్న ఇస్తున్నరా అని. ఏంలేదని చెప్పిండు. వాస్తవానికి అమరావతి పోకముందు అక్కడ ఏదైనా సాయం ప్రకటించాలని అనుకున్నం. కాని ప్రధానమంత్రే మట్టి, నీళ్లు ఇచ్చినపుడు నేను ఏదైనా సాయం ప్రకటిస్తే బిడ్డా నాకంటే గొప్పోనివి అయిపోయినవా? అనుకుంటారని ప్రకటించలేదు. ఈ విషయాన్ని యనమలతో, చంద్రబాబుతో కూడా చెప్పిన.
    28-01-2016                   (నమస్తే తెలంగాణ సౌజన్యంతో)Saturday, January 30, 2016

బాలకాండ మందరమకరందం సర్గ-37 : కుమారస్వామి జన్మ చరిత్ర : వనం జ్వాలా నరసింహారావు

బాలకాండ మందరమకరందం
సర్గ-37
కుమారస్వామి జన్మ చరిత్ర
వనం జ్వాలా నరసింహారావు

          "పార్వతితో శివుడు తపస్సు చేసేందుకు హిమవత్పర్వతానికి పోవడంతో దేవతలందరూ ఋషీశ్వరులతో కలిసి, బ్రహ్మ దగ్గరకు పోయి, తమకాయన పూర్వం సేనానాయకుడిగా ఇచ్చిన శివుడు ఆ పని వదలి తపస్సు చేసుకుంటున్నాడని అంటారు. జగత్తును రక్షించేందుకు-ప్రజల మేలు కోరి ఏదైనా చేసేందుకు తామేం చేయాలనీ, రాక్షసులేమో జగత్తును పీడిస్తున్నారని, వారితో ప్రతిదినం పోరేననీ, యుద్ధం చేసేందుకు తగిన బలవంతుడైన సేనానాయకుడు లేకపోతే తామేమీ చేయలేమనీ మొర పెట్టుకుంటారు. ఒకవైపు పార్వతి శాపంతో ఏడ్వాలో-మరోవైపు రాక్షసుల తన్నులకు ఏడ్వాలో అర్థం కావడం లేదని, తమను రక్షించుకునే విధానాన్ని ఆలోచించమని ప్రార్థించారు వారంతా. పార్వతి శాపాన్నుంచి దేవతలు తప్పించుకోలేరని, అది యదార్థమవుతుందని, దానికిప్పుడు వారి చింతించి ప్రయోజనం లేదని, వారి భార్యలయందు వాళ్లకు సంతానం కలగదని, ఆ విషయాన్ని ప్రస్తుతానికి పక్కన పెట్టమని సలహా ఇస్తాడు. సేనానాయకుడు ‍లేరన్న విషయాన్ని ప్రస్తావించి, గంగ ద్వారా అగ్నిహోత్రుడికి ఒక కుమారుడు కలగనున్నాడని, వాడు దేవతలకు సేనానాయకుడై వాళ్లను రక్షిస్తాడని చెప్తాడు. గంగకు పుట్టిన కొడుకును ఆమెవలనే, పార్వతికూడా తన కుమారుడిగానే అంగీకరిస్తుందని, ఆ విషయంలో సందేహం లేదని అన్న బ్రహ్మను స్తుతించి కైలాసానికి పోయి అగ్నిదేవుడిని కలిసారు దేవతలు. అగ్నిదేవుడిని ప్రపంచ రక్షణకు ఆసక్తిగలవాడని పొగిడి, ఆయన ధరించిన ఈశ్వర తేజాన్ని గంగలో విడిచి కుమారుడిని కనమని-లోకాలకెల్ల ఇది హితమైన కార్యమని వేడుకుంటారు. అంగీకరించిన అగ్ని గంగను చేరగా, ఆమెకూడా అయన కోరికను ఒప్పుకుంటుంది. గంగ సౌందర్యవంతమైన రూపాన్ని ధరించి ఆయన్ను సమీపించగా, అగ్నిహోత్రుడు తన సర్వావయాలనుండి తనలో వున్న తేజస్సును ఆమెలో విడిచాడు. దాంతో గంగా ప్రవాహమంతా మిక్కిలి తేజస్సుతో ప్రకాశించింది".

"తానీ గర్భ వేదనను సహించలేక పోతున్నాననీ, తేజస్సును భరించలేక పోతున్నాననీ, అవయవాలు దుర్బలమై తెగిపోతున్నాయని, మండిపోతున్నాయని నిట్టూర్పులిడిచింది గంగ. దిగాలుపడిన గంగను చూసిన అగ్నిహోత్రుడు, ఆమె తన గర్భాన్ని హిమవంతం కిందిభాగంలోని నేలపై విడవమని చెప్పాడు. ఆ ప్రకారమే గంగ దాన్ని శుక్ల శోణితాల్లో విడిచింది. ఆ ప్రదేశం వెండి-బంగారం అయింది. దానివేడిగాలికి బూడిదైన ప్రదేశం రాగి-ఇనుము అయింది. మలినం నిలిచిన ప్రదేశం సీసం-తగరం అయింది. అది ప్రవహించిన ప్రదేశంలో అనేక ధాతువులు ఏర్పడ్డాయి. ప్రత్యక్షంగా ఎక్కడైతే గర్భం నిలిచిందో అదంతా బంగారు మయమయింది. అది వ్యాపించిన ప్రాంతంలోని చెట్లు-తీగలు-పొదలు-పచ్చిక బంగారమయింది. అప్పటినుంచి బంగారం అగ్ని వర్ణంలో వుండడంతో జాత రూపం అనే పేరొచ్చింది".


(శివరేతస్సును పాదరసం అంటారు. రసవాదులు పాదరసం నుండి వెండీ-బంగారాలు చేస్తారు. ఈ ఘట్టంలో ఆ ప్రక్రియను గుప్తంగా చెప్పడం జరిగింది. తొలుత భూస్థాపనం-తదుపరి అగ్నిపుటం-ఆ తదుపరి నీళ్లలో వేయడం ఈ క్రియాంగాలు. ’నాగరస గంథకం-హేమరస మర్ధనం-బాలరవి చుంబనం-హేమకరో హేమకరో’ అనేవి బంగారం చెసే విధానం. వాల్మీకి ఇక్కడ రాసిన శ్లోకం అర్థం సరిగ్గా తెలుసుకున్నవారెవరైనా బంగారం తయారుచేయవచ్చునేమో ! బహుశా లోహాలన్నీ పాదరసం నుండే ఉత్పత్తి అవుతాయన్న విషయాన్ని పూర్వీకులెప్పుడో చెప్పారనుకోవాలి. పూర్వులు రహస్య విషయాలను తెలిపే మార్గం ఇదయ్యుండవచ్చు-ప్రత్యక్షంగా చెప్పకపోవచ్చు).

కుమారస్వామి జననం


"శరవణంలో పుట్టిన కొడుకును చూసిన ఇంద్రాది దేవతలు, ఆయన తమ సేనాపతి అవుతాడని బ్రహ్మ చెప్పడంవల్ల, బాలుడికి చనుపాలివ్వమని కృత్తికలనే స్త్రీలను ప్రేరేపించారు. వారూ సంతోషించి, ఆ బాలుడిని తమ కొడుకుగా దేవతలంగీకరిస్తే వారు కోరినట్లే పాలిస్తామంటారు. సమ్మతించిన దేవతలు, వారిపేరుమీద ఆ బాలుడు, కృత్తికానందనుడు-కార్తికేయుడు అని పేరొందుతాడంటారు. సంతోషంతో బాలుడికి ఆ ఆరుగురు స్త్రీలు, తమ బిడ్డగా భావించి, పాలిచ్చి-నీళ్లు పోసేవారు. గర్భం జారినందువల్ల పుట్టిన ఆ బాలుడికి స్కందుడు అన్న పేరుకూడా తగునని దేవతలు ఆ పేరు పెట్టారు. మనుష్యులు ఆ పేరుతోనే ఆయనకు పూజలు చేస్తుంటారు. ఆ బాలుడు ఆరుగురు కృత్తికా స్త్రీలకు ఆరు ముఖాలతో కనిపించి ఆరుగురి చను బాలను ఒక్కసారే తాగడంతో, ఒక్క పూటకే వృద్ధికాసాగాడు. తన బల సంపదతో ఘోరమైన యుద్ధంలో, రాక్షస సేనా సమూహాల గర్వం అణచడంవల్ల, దేవతలు ఆయనను తమ సేనలకు నాయకుడిగా అభిషేకం చేశారు" అని విశ్వామిత్రుడు గంగాదేవి చరిత్రమంతా రామ లక్ష్మణులకు చెప్పి, పుణ్యాత్ముడైన కుమారస్వామి చరిత్రను వినినందున ఆయనకెప్పుడు శుభాలు కలుగుతాయని అంటాడు.

Friday, January 29, 2016

బాలకాండ మందరమకరందం సర్గ-36 : శ్రీరాముడికి గంగ "త్రిపథగ" అయిన వృత్తాంతాన్ని చెప్పిన విశ్వామిత్రుడు : వనం జ్వాలా నరసింహారావు

బాలకాండ మందరమకరందం
సర్గ-36
శ్రీరాముడికి గంగ "త్రిపథగ" అయిన వృత్తాంతాన్ని
 చెప్పిన విశ్వామిత్రుడు
వనం జ్వాలా నరసింహారావు

గంగ వృత్తాంతాన్ని సంపూర్ణంగా వినాలన్న కోరికతో శ్రీరామ లక్ష్మణులు, పాప రహితమైన గంగ దేవలోకంలో-మనుష్యలోకంలో ఎలా సంచరించిందని విశ్వామిత్రుడిని అడుగుతారు. ఆమెకంత కీర్తి రావడానికి కారణమేంటని, ఏ పని చేయడంవల్ల ఆమె నదులన్నిటిలో ఉత్తమమైందిగా పిలువబడిందని అడుగుతారు. జవాబుగా, ఋషులందరు వినే విధంగా, రామచంద్రా అని సంబోధిస్తూ గంగా చరిత్రను చెప్పాడు విశ్వామిత్రుడు. "పూర్వకాలంలో శివుడు పార్వతిని పెళ్లి చేసుకుని, సంతోషంగా ఆమెతో నూరు దివ్య సంవత్సరాలు గడిపాడు. అయినా కొడుకు పుట్టలేదు. రేతస్ఖ్సలనం కాలేదు. ఇంతకాలం రేతస్ఖ్సలనం కాకపోతే-అయినప్పుడు ఎంత బలిష్ఠమైనవాడు పుడతాడోననీ, వాడెలాంటివాడవుతాడోననీ, వాడిని భరించడమెట్లాననీ దేవతలు భయపడి, తమ బాధను బ్రహ్మతో చెప్పుకుంటారు. అందరూ వెళ్లి శివుడిని కలిసి, నమస్కరించి, తమ మ్రొక్కులను గ్రహించి తమననుగ్రహించమని వేడుకుంటూ, ఆయన తేజస్సుతో పుట్టబోయే కుమారుడిని లోకాలెన్ని కలిసినా భరించలేవని విన్నవించుకుంటారు. మన్మథ విరోధైన శివుడిని-పార్వతిని, వేదోక్తంగా ఘోర తపస్సు చేయమని కోరుతూ, ఆయన నుండి వెలువడే కాంతి పూరితమైన తన రేతస్సును పార్వతిలో విడువకుండా తనలోనే వుంచుకొమ్మని ప్రార్థిస్తారు. అలా చేస్తే లోకాలన్ని సంతోషిస్తాయని, లోకాలకు అకాల ప్రళయం రాకుండా రక్షించమని స్తోత్రం చేస్తూ ప్రార్థించారు".

(దీన్నే "మహా మైథునం" అని వాడుకలో పిలుస్తారు. పంచమ కారులైన శాక్తేయులకు ఇది పరమ పవిత్రమైన వ్రతం).


"ఇలా ప్రార్థించిన దేవతలను ప్రేమతో చూసిన శివుడు, వారి కోరినట్లే చేస్తానంటాడు. తను వీర్యాన్ని, పార్వతి శోణితాన్ని తమలోనే ధరించెదమని-రెంటినీ కలవనీయమని-వేర్వేరుగా వుంచుతామని అంటూ, మనుష్యులు, దేవతలు సుఖంగా వుండమని చెప్తాడు. ఇలా శివుడు తన గౌరవం అతిశయించే విధంగా చెప్పగా, ఆయన తేజం జారితే, దాన్ని భూదేవి ధరిస్తుందని దేవతలంటారు. అప్పుడు శివుడు దాన్ని వెలుపలకి వదిలాడు. అది, అడవులు-కొండలు తో సహా భూమంతా వ్యాపించే విధం చూసిన దేవతలకు భయమేసింది. వారప్పుడు ఆ శివ తేజస్సును భూమి భరించలేకపోతున్నదని భావించి, అగ్నిహోత్రుడిని-వాయుదేవుడిని సంయుక్తంగా భరించమని కోరగా, అగ్నిహోత్రుడందులో ప్రవేశించాడు. ఆకారణాన అదొక పెద్ద మంచు కొండలాగా యింది. సూర్యాగ్నుల సంపూర్ణ కాంతితో మనోహరంగా లోకసమ్మతమయింది. కాలక్రమంలో అది శరవణం అయింది. దానిలో పుట్టినందున కుమారస్వామి అగ్నిపుత్రుడయ్యాడు. ఆయనే కృత్తికల పుత్రుడై కార్తికేయుడయ్యాడు".

దేవతలను శపించిన పార్వతి


"ఇదంతా జరిగినందున దేవతలపై పగబట్టిన పార్వతి, వారుచేసిన పాప ఫలం అనుభవించమని నిష్ఠురాలాడింది. దోసిట్లో నీళ్లు తీసుకుని, కళ్లల్లో కోపం కనపడుతుంటే, తనకు కొడుకు కనాలన్న కోరికని విఘ్న పరిచిన దేవతల భార్యలు బిడ్డలను కనరని-వారు గొడ్రాళ్లవుతారని శపించింది పార్వతి. ఆ తర్వాత భూమిపైనా కోపించింది పార్వతి. తను బిడ్డలను కనడం సహించలేకపోయిన భూదేవి, అనేక మందికి భార్యగా-అనేక రూపాలుగలిగుండి, ప్రీతితో బిడ్డల్ని కనే సంతోషం లేకుండా పోవాలని శపించింది పార్వతి. అందుకే, భూపుత్రి-సీత-నరకాసురుడు భూ పుత్రులైనా రేతస్సువల్ల గర్భం ధరించి కనే సుఖాన్ని భూమికి కలిగించలేదు. ఇలా పార్వతీదేవి అహంకార-రోషాలతో శపించడంతో దేవతలు సిగ్గుతో తలలు వంచుకుని దుఃఖించారు. వారి దుఃఖం చూడలేక శివుడు పార్వతితో కలిసి హిమవత్పర్వతం ఉత్తర శిఖరానికి తపస్సు చేసేందుకు పోయాడు" ఇలా పార్వతి చరిత్రను ఉపోద్ఘాతంగా చెప్పిన విశ్వామిత్రుడు తదుపరి గంగ చరిత్ర చెప్పసాగాడు.

Thursday, January 28, 2016

బాలకాండ మందరమకరందం సర్గ-35 : విశ్వామిత్రుడిని గంగానదీ వృత్తాంతాన్ని అడిగిన శ్రీరాముడు : వనం జ్వాలా నరసింహారావు

బాలకాండ మందరమకరందం
సర్గ-35
విశ్వామిత్రుడిని గంగానదీ 
వృత్తాంతాన్ని అడిగిన శ్రీరాముడు
వనం జ్వాలా నరసింహారావు

ఆ విధంగా మిగిలిన రాత్రంతా మునీంద్రుల సమూహంతో, శోణ నదీతీరంలో హాయిగా నిద్రించిన "ముని సింహం"-విశ్వామిత్రుడు, తూరుపు తెల్లవారగా మేల్కొని, ఆ సమయంలో చేయాల్సిన స్నాన-సంధ్యావందనాది కార్యక్రమాల నన్నిటినీ పూర్తి చేసుకుని, మిక్కిలి ప్రీతితో-గౌరవంతో-శుభకరమైన మంచి మాటలతో, రామ లక్ష్మణులను మేలుకొలిపాడు. రామ లక్ష్మణులు బ్రహ్మచారులే కనుక, వారికి స్నానం-సంధ్య తప్ప వేరే కృత్యాలు ఉదయాన లేవు. కాబట్టి, తన కార్యక్రమాలన్ని నెరవేర్చుకుని వాళ్లను నిదురలేపుతూ: " నాయనా, రామచంద్రా ! తూర్పు తెల్లవారడం ప్రారంభమయింది. ప్రాతస్సంధ్య సమీపించింది. కమలాక్షా ! సూర్యుడు ఉదయించిన తర్వాత, కమలాలు ముకుళించి వుండవుకదా-కాబట్టి నిద్ర లే. మీరు సంతోషంతో ప్రయాణం చేయాలి-అలా ప్రయాణం చేసేందుకు మీకు మేలు కలగాలి" అని విశ్వామిత్రుడు అనడంతో, వారు నిద్రలేచి, స్నాన-సంధ్యావందనం చేసి, ప్రయాణానికి సిద్ధమయ్యారు. నిర్మలమై-శుభప్రదమై-శుభ్రమైన నీటినిగలదై-ఇసుక దిబ్బలతో సుందరమై-ఎంతో లోతుగా వున్న శోణ నదిని ఎలా దాటాలి అని మునిని అడుగుతాడు శ్రీరాముడు. మునిశ్రేష్ఠులందరు ఎలా దాటుతారో, మనమూ అలానే వెళ్దామని ఆయన జవాబివ్వడం, ఋషేశ్వరులందరూ సంతోషంతో నదిని దాటి, వనంలో ప్రవేశించి, దారి వెంటబడి నడుచుకుంటూ పోయి, మధ్యాహ్నం కల్లా హంసలు-చక్రవాకాలున్న గంగా తీరానికి చేరారు.మనస్సుకింపైన గంగానదీ తీరంలో ఒక పెద్ద ఇసుక దిబ్బపై విశ్వామిత్రుడి చుట్టూ చేరి కూర్చున్నారందరు. ఆ సమయంలో గంగానదిని చూపిస్తూ, అదెలా మూడు మార్గాల్లో సముద్రాన్ని చేరడానికి కారణమేంటని రాముడు ఆయన్ను ప్రశ్నిస్తాడు. దశరథుడి ముద్దుల కొడుకైన రామచంద్రమూర్తి వేసిన ప్రశ్నకు సంతోషించిన విశ్వామిత్రుడు గంగానదీ వృత్తాంతాన్ని చెప్పసాగాడు. " అనేక రత్నాలను కూడిన శిఖరాలతో ఆకాశాన్నంటుతూ, నానా ధాతు వర్ణాలతో ప్రకాశిస్తూ, మిక్కిలి చల్ల గాలి వీచడంవల్ల అసమానమైనదిగా ప్రసిద్ధిగాంచిన హిమవత్పర్వతం గురించి తెలియనివారు లేరు. ఆ హిమవంతుడు మేరుపర్వతం కూతురైన మేనకనే మనోరమను పెళ్లి చేసుకుని, ఇద్దరు కూతుళ్లను కన్నాడు. వారిలో పెద్దది ’గంగ” , చిన్నది ’ఉమ’. వారిద్దరూ పెరిగి పెద్దవారైతున్నప్పుడు, దేవతలు ఆయన్ను కలిసి, తమ కొరకు గంగను మూడు మార్గాల్లో ప్రవహింపచేసి, అందులో ఒక మార్గాన్ని తమకిమ్మని వేడుకున్నారు. దేహి అని అడిగితే కాదనకూడదనుకున్న హిమవంతుడు, మూడు లోకాలను పావనం చేసేదై-స్వేఛ్చగా చరించేదై-ఆకాశ మార్గంలో పోగలిగేదైన గంగను, వారికి వెంటనే ఇవ్వడంతో వారామెను తమ లోకానికి తీసుకుపోయారు. ఇక రెండో కూతురైన ఉమా దేవి, ఆకులలాలు కూడా తినకుండా, అపర్ణగా, ఘోరమైన తపస్సు చేసింది. హిమవంతుడామెను సమస్త లోకాలు మ్రొక్కే శివుడికిచ్చి పెళ్లి చేశాడు. ఇలా పర్వతరాజు ప్రియపుత్రికలిద్దరు కీర్తిమంతులై ప్రకాశించారు" అని మొట్టమొదట పర్వతరాజు కూతురైన గంగ ఏ విధంగా జన్మించి ఆకాశానికి పోయిందో తెలియచెప్పాడు శ్రీరాముడికి విశ్వామిత్రుడు. 

Wednesday, January 27, 2016

ఓటింగ్ విధానాన్ని మెరుగుపరచలేమా? : వనం జ్వాలా నరసింహారావు

ఓటింగ్ విధానాన్ని మెరుగుపరచలేమా?
ఆంధ్రజ్యోతి దినపత్రిక (28-01-2016)
వనం జ్వాలా నరసింహారావు

            జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఏర్పాట్లు సాగుతున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ దరిమిలా నామినేషన్ల ఘట్టం-ఉప సంహరణ ఘట్టం పూర్తయింది. పోటీలో వున్న అభ్యర్థుల తుది జాబితా విడుదలైంది. గ్రేటర్ పరిధిలో సుమారు 80 లక్షల మంది ఓటర్లుండవచ్చని, వీరికొరకు 7800 పోలింగ్ స్టేషన్లు, పోలింగ్ కేంద్రాల పర్యవేక్షణకు సుమారు 3500 వెబ్ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు సంబంధిత అధికారులు పేర్కొన్నారు కూడా. వీటన్నింటికీ అయ్యే వ్యయం కూడా కోట్లల్లోనే వుండవచ్చు. పోటీ చేస్తున్న అభ్యర్థుల అధికారిక-అనధికారిక వ్యయంకూడా కోట్లలోనే వుండే అవకాశాలు కాదనలేం. నల్ల ధనం ఎంత ఖర్చు కానున్నదనేది ఎవరికీ అంతు చిక్కని విషయందీనిని కట్టడి చేయడానికి ఎంత పకడ్బందీగా చర్యలు తీసుకున్నా, గత అనుభవాల నేపధ్యంలో పూర్తిగా నివారించడం కష్టమే. ఇందులో అన్ని రాజకీయ పార్టీలకు అంతో-ఇంతో పాత్ర వుంది. ఎవరినీ తప్పు పట్టడానికి వీల్లేని పరిస్థితి. దీనికంతటికీ ప్రధాన కారణం "సుధీర్ఘ ఎన్నికల ప్రక్రియ". ఈ  సుధీర్ఘ ప్రక్రియ లేకుండా ఎన్నికలు జరిపించే ప్రయత్నాలు అప్పుడప్పుడు జరిగినా అవి ఫలించలేదు. ఇప్పుడు జరుగుతున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల విషయంలో కూడా సుదీర్ఘ ప్రక్రియను కుదించే సంస్కరణ దిశగా ప్రభుత్వం కొంత ప్రయత్నం చేసింది కాని, న్యాయస్థానాలు అంగీకరించకపోవడంతో యధా ప్రకారం పాత పద్ధతినే అవలంబించాల్సి వచ్చింది. ప్రజాస్వామ్యం బలపడాలంటే, ఎన్నికలలో అవినీతి తొలగిపోవాలంటే, నల్ల ధనం ఖర్చు తగ్గాలంటే, ఎప్పుడో ఒకప్పుడు ఈ పద్ధతి మారక తప్పదు. సుదీర్ఘ ప్రక్రియను కుదించక తప్పదు.    

            సాధారణ ఎన్నికలకైనా, రాష్ట్ర శాసనసభ ఎన్నికలకైనా, స్థానిక సంస్థల ఎన్నికలకైనా, సంబంధిత ఎన్నికల అధికారి ఎన్నికల తేదీలు ప్రకటించడంతో మొత్తం ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఓటర్ల జాబితా ప్రకటించడం ఎన్నికల ప్రక్రియలో మరో ప్రధాన ఘట్టం. తేదీల ప్రకటనతోనే "మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్" అమల్లోకి వస్తుంది. ఈ బూచిని సాకుగా చూపించి, ప్రభుత్వం ప్రకటించి, అమలు చేయాలనుకున్న పలు అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆటంకం కలిగించడం మొదలవుతుంది. ఫలానా పార్టీ కోడ్ ఉల్లంఘించిందని ప్రత్యర్థులు పిర్యాదు చేయడం నిత్య కృత్యమై పోతుంది. ఇలా చేయడం ఎంతవరకు భావ్యమో అనే విషయాన్ని నిశితంగా అధ్యయనం చేయాల్సిన అవసరం వుంది. రాష్ట్రంలో ఎక్కడ ఎన్నిక జరిగినా ఏదో ఒక రకమైన మోడల్ కోడ్ అమల్లోకి తెస్తున్నారు ఇటీవల. ఆ మాటకొస్తే, దేశంలో ఎక్కడో ఒక చోట ఎన్నిక జరుగుతే మోడల్ కోడ్ కేంద్ర ప్రభుత్వానికి కూడా అమలు చేయాల్సి వస్తుందేమో! రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించడం, నామినేషన్ల ఘట్టం, బీ ఫారాలు రిటర్నింగ్ అధికారులకు అందచేయడం, స్క్రూటినీ, ఉపసంహరణ, ప్రచార పర్వం, ఓటింగ్, ఓట్ల లెక్కింపు, గెలిచిన అభ్యర్థుల పేర్ల ప్రకటన....ఇవన్నీ ఎన్నికల సుదీర్ఘ ప్రక్రియలో భాగమే. ఇంత సుదీర్ఘ ప్రక్రియ వల్లనే అభ్యర్థుల ఎన్నికల ఖర్చు కూడా ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతుంది. సీలింగ్ అనేది నామ మాత్రంగా మిగిలిపోయింది. ఈ పరిస్థితి మారాలి. ఓటింగ్ విధానంలో కూడా ప్రస్తుతం అనుసరిస్తున్న పోలింగ్ బూత్‌లకు వెళ్లి, క్యూలో నిలబడి, గంటల తరబడి వేచి చూసి, ఓట్ వేసే పద్ధతి మారాలి. ప్రచారానికి ఎక్కువ సమయం ఇచ్చి, ఓటింగ్ కు కొన్ని గంటల సమయం-అదీ కూడా ఫలానా బూత్ కే పోయి ఓట్ వేయాలన్న నిబంధనలో మార్పు రావాలి. దీని వల్ల వ్యయం తగ్గడమే కాకుండా, ఓటింగ్ పూర్తైన వెంటనే ఫలితం ప్రకటించే అవకాశం వుంటుంది. రీ పోలింగ్ కు అవకాశమే రాదు. ప్రచారానికి తక్కువ సమయం, ఓటింగ్ కు ఎక్కువ సమయం ఇచ్చే రోజులు రావాలి.  అప్పుడే అందరూ ఓటు వేసే వీలుకూడా కలుగుతుంది. పోలింగ్ వంద శాతం వర కొచ్చినా ఆశ్చర్య పడక్కర లేదు.

ప్రపంచంలో అతిపెద్ద పార్లమెంటరీ ప్రజాస్వామ్య దేశమన్న పేరుంది భారతదేశానికిసామ్రాజ్యవాద, వలస వాద దేశాల పాలన నుండి గడచిన ఆరేడు దశాబ్దాల కాలంలో విముక్తి పొంది స్వాతంత్య్రం పొందిన దేశాలెన్ని ఉన్నప్పటికీ, ప్రజాస్వామ్య ఎన్నికల ప్రక్రియ ద్వారా ఐదేళ్లకోసారి అధికార మార్పిడి శాంతియుతంగా జరుగుతున్న దేశం బహుశా భారతదేశ మొక్కటేనేమోఅలానే స్థానిక సంస్థలకు కూడా ఐదేళ్లకో సారి, సాధ్యమైనంత మేరకు ఎన్నికలు జరుగుతుంటాయి అనేక రాష్ట్రాలలో. అయినప్పటికీ, మన ప్రజాస్వామ్యం మీద, ఎన్నికల ప్రక్రియమీద, ఎన్నికల్లో చోటుచేసుకుంటున్న అక్రమాల మీద అన్నీ సందేహాలే, అన్నీ అనుమానాలేవివిధ కారణాల వల్ల, మనదేశంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల వల్ల, ఇప్పుడున్న రాజకీయ పార్టీలకు కానీ, ప్రజా ప్రాతినిధ్య చట్టానికి కానీ ప్రత్యమ్నాయాలంత తేలిగ్గా లభించవనేది వాస్తవం


కేంద్రంలో, కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం దొరకడానికి మనదేశంలో ముప్ఫైఏళ్ళు పట్టిందిఆ తరువాత మళ్ళీ కాంగెస్సో, దాని సారధ్యంలోని కూటమో ప్రత్యామ్నాయమైంది కాని మరోటి కాలేకపోయింది. ప్రస్తుతం కేంద్రంలో వున్న ప్రభుత్వం కూడా దాని కాల పరిమితి తీరిన తరువాత అధికారంలోకి వస్తుందా? రాదా? అనేది చెప్పడం కష్టం! ఆ లెక్కన మళ్లీ కాంగ్రెస్ కూటమే వస్తుందా? చెప్పలేం. బహుశా ఇది మరికొంత కాలం కొనసాగవచ్చు. అదే పరిస్థితి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో కూడా కొనసాగింది. కాంగ్రెస్ పార్టీని గద్దె దింపిన తెలుగు దేశం మళ్లీ కాంగ్రెస్ చేతుల్లో అధికారాన్ని పెట్టింది. ఇక తెలంగాణ విషయానికొస్తే అటు తెలుగు దేశానికి, ఇటు కాంగ్రెస్ పార్టీకి, ఏకైక ప్రత్యామ్నాయంగా తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించడమే కాకుండా, అది చేపట్టి అమలు పరుస్తున్న అనేక సంక్షేమ-అభివృద్ధి పథకాల ద్వారా తన ప్రభుత్వాన్ని అంచలంచలుగా బలపర్చుకుంటూ ముందుకు సాగుతోంది. రాష్ట్ర ఆవిర్భావం, టీఆరెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం తరువాత జరిగిన అన్ని ఉపఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి క్లీన్ స్వీప్ చేసింది. ఓటరుకు ప్రత్యామ్నాయాల ఎంపికలో పూర్తి స్వేచ్ఛ వుంటే ఇలాంటివి సాధ్యపడతాయి. అందుకే, సగటు ఓటరు, ఓటు వేసే విషయంలో, అవినీతికి, అక్రమాలకు తావులేకుండా, ఎవరి ఓటును వారే వేసుకునే అసలు సిసలైన మార్గాల అన్వేషణ జరగాలని సంస్కరణాభిషుల అభిప్రాయంవాస్తవానికి ఎన్నికల ప్రక్రియను కుదించే ప్రయత్నం సంస్కరణ దిశగా ఒక అడుగు అనాలి.

ఓటరును ఎవరెంతగా మభ్య పెట్టినా, ఎన్ని రాజకీయ పార్టీలు, అభ్యర్ధులు ఎంత డబ్బు కుమ్మరించినా, కులం అనో, మతం అనో ఎన్ని అపోహలు కలిగించినా, ఎన్ని బలీయమైన శక్తులు ఏ కొందరో అధికారంలో ఉండాలనో, లేకుండా పోవాలనో కోరుకున్నా, అదే ఓటరు, అవసరమని భావించినప్పుడు దిగ్గజాలను ఓడించిన సందర్భాలూ, ఏ అండదండా లేనివారిని గెలిపించిన సందర్భాలూ, మన దేశంలో కోకొల్లలునిజంగా ఓటరుకు ప్రభుత్వం, ఎన్నికల సంఘం గనుక పూర్తి మద్దతు ఇచ్చే పరిస్థితులే ఉంటే, అధిక శాతం మంది నిర్భయంగా ఓటింగులో పాల్గొంటారనడంలో సందేహం లేదు. భారతదేశంలో ఎన్నికల రాజకీయాలకొక ప్రత్యేకత ఉందినియంత్రణలకు, నియమావళులకు అతీతంగా, పాలకు-ప్రతిపక్షాల అదుపాజ్ఞల్లో-కనుసన్నలలో-అంచనాలకు అందనంత వేగంగా, దూరంగా మనుగడ సాగిస్తుంటాయి. ఎన్నికల రాజకీయాలకు, సాధారణ రాజకీయాలకు పొంతనే ఉండదుఎత్తులు, జిత్తులు, జిమ్మిక్కులు, నిజాలలా అనిపించే అబద్ధాలు, స్నేహితుల్లా కనిపించే శత్రువులు, నమ్మించి మోసం చేసే నాయకులు-అనుచరులు, ఆఖరి క్షణంలో అనూహ్యమైన మార్పులు-చేర్పులు, ఇలా ఎన్నో, ఎన్నెన్నో ఎన్నికల రాజకీయాల్లో గతంలో చోటు చేసుకున్నాయి. భవిష్యత్‍లో చోటుచేసుకోనున్నాయి. ఎన్నికల్లో అక్రమాలు జరగడానికి, జరగకుండా నిరోధించడానికి, ప్రత్యక్షంగానో-పరోక్షంగానో బాధ్యత వహించాల్సింది రాజకీయ పార్టీలు, ఎన్నికల కమీషన్. ఎన్నికల్లో అక్రమాలు రాజకీయ పార్టీల టికెట్ల పంపిణీ నుండి ఆరంభమవుతుందిఎన్నికల కమిషన్ ఎన్నికలకే పరిమితమవడంతో రాజకీయ పార్టీల అవినీతికి వారి నిర్లిప్తత ఆజ్యం పోసినట్లవుతున్నదిఎన్నికల కమిషన్ పనిచేయడమనేది ఒక నిరంతర ప్రక్రియ కావాలి

ఎన్నికల తేదీని ప్రకటించిన తర్వాత, ఓ వారం రోజుల లోపుగా ప్రతి పార్టీ ఎన్నికల ప్రణాళికను ప్రకటించడం జరిగి పోవాలిఆ తర్వాత మూడు-నాలుగు రోజుల వ్యవధిలో పోటీ చేసే అభ్యర్ధుల పేర్లను ప్రకటించి, నామినేషన్‌తో పాటే బీ-ఫారం సమర్పించే నిబంధనను విధించాలిమరో నాలుగు-ఐదు రోజుల వ్యవధిలో రోజుల తరబడి ప్రచారం లేకుండా ఎన్నికలు జరిపించాలిడబ్బిచ్చి పార్టీ టికెట్ కొనుగోలుచేసే వ్యవధి కూడా ఉండకూడదుఎన్నికల్లో గెలిచేందుకు డబ్బు వెదజల్లే అవకాశం కానీ, అవసరం కానీ ఎవరికీ లేకుండా చేయాలిడబ్బు ఖర్చు చేయనప్పుడు ఆ పెట్టుబడిని రాబట్టుకొనే ప్రయత్నం తగ్గే అవకాశముందిఓటు హక్కును వినియోగించడం ఓ రెండు-మూడు రోజుల పాటు జరిగినా ఇబ్బంది లేదు

"శాశ్వత సామాజిక భద్రతా సంఖ్య కార్డును డిజైన్ చేసి, ప్రతి ఒక్క ఓటరు, కేవలం అతనో, ఆమో ఉపయోగించుకొనగల్గేలా ప్రోగ్రాం చేయాలి. ఎన్నికల బూత్‌ల లాగానే జనరల్ ఎన్నికలకు దేశ వ్యాప్తంగా, ఇతర ఎన్నికలకు సంబంధిత ప్రాంతమంతా, ఎన్నికల మిషన్లను బహిరంగంగా ఏర్పాటు చేయాలిభద్రతా చర్యలు ఏర్పాటు చేయాలిఏ ఓటరైనా, ఎక్కడైనా ఆ రెండు-మూడు రోజుల్లో ఇరవై నాలుగు గంటలపాటు ఎప్పుడైనా ఓటు వేసుకునే ఏర్పాటు ఉండాలిఓటరు ఓటును తన నియోజకవర్గ-లేదా వార్డులో పోటీ చేసే అభ్యర్థులలో ఎవరో ఒకరికి వేసే వీలుకలుగేలా కార్డును ప్రోగ్రాం చేయవచ్చుఓటరుకు తప్ప ఇతరులకు ఆ కార్డును ఉపయోగించుకునే వీలుపడరాదుఒకసారి ఉపయోగించిన తర్వాత మరో మూడు-నాలుగు నెలల వరకు ఓటింగ్‌కు ఆ కార్డు పనికిరాని విధంగా ప్రోగ్రాం చేయాలిఒకప్పుడు ఒక్కో అభ్యర్థికి ఒక్కో డబ్బా కేటాయించేవారు. ఆ తరువాత కామన్ డబ్బాలొచ్చాయి. దరిమిలా ఏవీఎంలు వచ్చాయి. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్‌ను అర్ధం చేసుకోగలిగిన ఓటరుకు, "శాశ్వత సామాజిక భద్రతా సంఖ్య కార్డును ఉపయోగించి ఓట్ చేయడం  పెద్ద కష్టం కాదుఓటరు దేశంలో ఎక్కడ కార్డును వాడినా అతని నియోజకవర్గంలో పోటీలో ఉన్న అభ్యర్ధుల జాబితాయే ఓటింగ్ మిషన్‌పై కనిపించే వీలు కలిగేలా ప్రోగ్రాం తయారుచేయాలి. ఇదే జీహెచ్‌ఎంసీ లాంటి ఎన్నికలలోనైతే, గ్రేటర్ పరిధిలో ఎక్కడైనా-ఎప్పుడైనా ఎన్నికల మిషన్లలో ఓటు వేసే అవకాశం కలిగించవచ్చు.

క్యూలో నిలబడే అవసరం లేకుండా ఎప్పుడైనా, ఎక్కడినుంచైనా ఆదాయపు పన్ను రిటర్నను సమర్పించే సదుపాయం ఉండగా లేనిది, ప్రపంచ వ్యాప్తంగా ఏటీఎం కార్డులు, డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు ఉపయోగించి డబ్బులు విత్‌డ్రా చేసుకునే వీలుండగాలేనిది, ఒకే మిషన్ నుంచి ఏ బ్యాంక్ కార్డునైనా ఉపయోగించుకునే అవకాశం ఉండగా లేనిది, ఇలాంటి పద్ధతినే ఓటింగుకు కూడా ప్రవేశ పెట్టే ఆలోచన ఎందుకు చేయకూడదు? ఇంతవరకూ ప్రపంచంలో ఏ దేశంలో ఈ సౌకర్యం లేనంత మాత్రాన మన దేశంలోనూ-మన రాష్ట్రంలోనూ ఉండకూడదన్న నిబంధనేమీ లేదు కదాఆన్‌లైన్ ఓటింగుకు శ్రీకారంచుట్టి ప్రపంచాన్నే అబ్బుర పరచలేవా ఈనాటి కేంద్ర-రాష్ట్రాల ప్రభుత్వాలు? ఈ రకమైన కార్డును సార్వత్రిక ఎన్నికలకే కాకుండా శాసనమండలి ఎన్నికలలాంటి వాటికీ ఉపయోగించవచ్చుస్థానిక సంస్థల ఎన్నికలకూ వాడవచ్చుఅన్నింటికీ ఒకటే కార్డు చాలుఎన్నికల బూత్‌లోకి ఓటరు తప్ప ఎవరూ ప్రవేశించే వీలులేని విధంగా సాంకేతికంగా దీన్ని ప్రోగ్రామింగ్ చేయడమంత కష్టమేమీ కాదని నిపుణులు చెప్తున్నారుఓటర్లను దాచి పెట్టడం, క్యాంపులు నడపడంలాంటి వాటిని అరికట్టవచ్చు ఈ కార్డు ప్రవేశ పెడితే.

"శాశ్వత సామాజిక భద్రతా సంఖ్య కార్డు”  పౌరుడు ఒక్క ఓటింగుకే కాకుండా, విదేశాల్లో లాగా, బహుళ ప్రయోజనాలకు వాడుకునే విధంగా ఉండాలితలచుకుంటే ఇదేమంత కష్టసాధ్యమైన పనేమీకాదుచేయాలన్న తలంపు, పట్టుదలే ఉంటే, పోటీచేస్తున్న అభ్యర్థుల ఎన్నికల ఖర్చు కూడా భరిస్తామని చెప్తున్న ఎన్నికల కమిషన్ బహుశా ఒక్క ఎన్నికల కయ్యే ఖర్చును ఈ కార్డు ప్రవేశపెట్టడానికి వినియోగిస్తే చాలు….చరిత్రలో భారతదేశం ప్రపంచ ప్రజాస్వామ్య వ్యవస్థకే ఓ సరికొత్త రూపునిచ్చినట్లవుతుందికంప్యూటర్ యుగంలో ఇవి రూపొందించడానికి పెద్ద తెలివితేటలు కూడా అక్కరలేదుఅందులో ప్రవేశమున్న ఎవరైనా చేయగలరు ఈ పనిని. భవిష్యత్‍లో నైనా దీనిని గురించి ఆలోచన చేయడం మంచిదేమో!. End