Thursday, April 27, 2017

Muse over fifty years ago Osmania : Vanam Jwala Narasimha Rao

Muse over fifty years ago Osmania

Vanam Jwala Narasimha Rao
Chief Public Relations Officer to 
Chief Minister Telangana
After passing out Higher Secondary Certificate examination from Ricab Bazaar High School in Khammam, I joined in the Pre University Course in SR and BGNR Government Arts and Science College, affiliated to Osmania University then, during 1962-63 Academic Years to become a student of Osmania University for the first time. SR and BGNR College, under the private management, was the first college that was set up in Khammam as there were no colleges in the Telangana region except in Hyderabad in 1956. 
After entering the portals of a degree college I felt elevated. Telugu, English, General Knowledge the three compulsory subjects were taught in combined sessions. Physics and Chemistry subjects were taught commonly for both the MPC and BPC students. Mathematics was taught for only MPC students. We were enthused by the poems of William Shakespeare and William Wordsworth. I still remember the instruments like Pipette, Burette, and Common Balance which we used for chemistry practical sessions.
PUC results were out and I could not secure a seat in any Engineering College with the poor marks I got. Hence I took admission into BSc (MPC) in the same College. In those days if anyone asked as to what a degree student was studying the answer invariably was “First Year…Rest year!  As there was no public examination at the end of the first year degree, students were automatically promoted to the second year. At the end of second year university examinations in six papers for Languages and General Studies were held. In the final year there used to be examinations for the optional subjects and in all one need to appear in ten papers. There were no holidays in between two examinations (like these days) except on a Sunday. We had to memorize the three years study to appear for the final examination and for languages and general studies two years study!
After completing first year BSc I moved to Hyderabad. I took admission in New Science College in June 1964 in B Sc second year. The College was established on July 17, 1956 by Melkote and Sudarshan under the banner the New Vidya Samithi.  It had many prominent lecturers as faculty members and it is no exaggeration to say that we had the best of teaching staff, which no other college had then.
We had Andhra Mahabharata Upanyasalu as Telugu Text and Adavi Bapiraju novel Narayanarao as non-detailed besides Halikudu as the drama text.  Out English Text was a compilation edited by EF Dad and it had an essay by AG Gardner “on other people jobs”. EM Foster’s “A passage to India” was our Non-detailed Text.  For mathematics, we were to study in three parts, Algebra, Trigonometry and Coordinate Geometry. We had Organic, Inorganic and Physical parts in Chemistry (Theory). Three different lecturers used to teach these three parts. I still remember the Benzene Ring drawn by Organic Chemistry lecturer on the black board. Inorganic was taught by Principal Sudarshan himself.
While I was in Degree final year there was a clash between the Student union leaders over OU Vice Chancellor Prof DS Reddy continuance. One group was lead by K Keshava Rao, former Congress leader and now TRS Rajya Sabha member and Former Union Minister S Jaipal Reddy and the other group was lead by M Sridhar Reddy, Pulla Reddy Jansangh Narayana Das and other left wing student leaders. In 1966, the then Chief Minister K Brahmananda Reddy removed Prof DS Reddy who was VC of OU since 1957. In his place a Principal from a Guntur College was appointed. He came and could not take the charge as students were protesting. Keshava Rao and Jaipal Reddy supported the decision taken by Brahmananda Reddy. The only fault committed by Prof DS Reddy was to ask for autonomy for OU! Brahmananda Reddy tried bringing an Amendment to the Act to remove Prof DS Reddy who in turn approached the High Court and then Supreme Court and finally won the case. He continued as VC till 1969. In 1968 when Telangana agitation took birth he was the VC and later Prof Ravada Satyanarayana became the VC. When the Court ordered continuance of Prof DS Reddy as VC, the university had given grace marks to the students. Though I did not write the examinations, I got 15 Marks in all the subjects due to grace marks.
After my BSc in Hyderabad I did my MA from Nagpur and later joined in job as a Librarian. For the professional degree I again joined OU Arts College during July-Aug. 1973 in Library Science Course. Our classes were held either in Arts College or in the Library building. It was a great experience. The final examinations were held in July 1974 and I got University Second rank in August when the results were declared.
That was how my association with OU started 52 years ago came to an end 42 years ago. I fondly remember those days in OU, the college campus, student union politics, attending a talk by Ram Manohar Lohia, association with Professor Haragopal who was senior to me by two years, travelling to Arts College by bus, wonderful time spent with friends, playing Cricket…and there were many, many more memories that haunt me till date. What a wonderful time it was!
Thanks to Osmania University, starting my career as a Librarian I had the opportunity to work with a Governor (Kumud Ben Joshi), two Chief Ministers (Dr M Channa Reddy and K Chandrashekhar Rao) besides opportunities to work in various other capacities. END

Tuesday, April 25, 2017

నన్నింత వాణ్ణి చేసింది! .....వనం జ్వాలా నరసింహారావు

నన్నింత వాణ్ణి చేసింది!
వనం జ్వాలా నరసింహారావు
సీపీఆర్వో టు సీఎం తెలంగాణ
ఆంధ్రప్రభ దినపత్రిక (26-04-2017)

ఖమ్మం రికాబ్ బజార్ హైస్కూల్ విద్యార్థిగా, హయ్యర్ సెకండరీ సర్టిఫికేట్ (హెచ్.ఎస్.సీ) పరీక్షల్లో, హయ్యర్ సెకండ్ క్లాస్ లో పాసై, లెక్కల్లో, సైన్స్ సబ్జెక్టులలో మంచి మార్కులు తెచ్చుకున్న నేను, ఎం.పీ.సీ (లెక్కలు, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం) గ్రూపు తీసుకుని ఖమ్మం ఎస్.ఆర్.అండ్.బి.జి.ఎన్.ఆర్ కళాశాలలో ప్రీ-యూనివర్సిటీ (పి.యు.సి) కోర్సులో 1962-1963 అకడమిక్ సంవత్సరంలో చేరాను. ఆ విధంగా మొట్టమొదటిసారి ఉస్మానియా విశ్వ విద్యాలయం విద్యార్థినయ్యాను. ఆ మూడు సబ్జెక్టులే కాకుండా, ఇంగ్లీష్, తెలుగు, జనరల్ స్టడీస్ సబ్జెక్టులు కూడా వుండేవి అప్పట్లో. లెక్కలు, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం సబ్జెక్టులను ఐచ్చికం (ఆప్షనల్) అని, మిగతా వాటిని కంపల్‌సరీ అని పిలిచే వాళ్లం. హెచ్.ఎస్.సీ వరకు తెలుగు మీడియంలో చదువుకున్న మాకు, మొట్ట మొదటిసారిగా పి.యు.సి లో చేరగానే, ఆంగ్ల మాధ్యమంలో అభ్యసించాలంటే మొదట్లో కొంత ఇబ్బందికరంగా వుండేది. పోను-పోను అలవాటై పోయింది. భౌతిక, రసాయన శాస్త్రాలకు థియరీ క్లాసులే కాకుండా ప్రాక్టికల్స్ కూడా వుండేవి. అంతా కొత్తగా వుండేది.
ఖమ్మం పట్టణంలో మొట్ట మొదటి ప్రయివేట్ కళాశాలగా ఎస్.ఆర్.అండ్.బి.జి.ఎన్.ఆర్ కళాశాలను స్థాపించారు. నిజాం సంస్థానం నుంచి విముక్తి పొంది, భారత దేశంలో విలీనమైన హైదరాబాద్ రాష్ట్రంలో, ఒకప్పుడు, ఒక్క హైదరాబాద్‌లో తప్ప ఇంకెక్కడా కళాశాలలు లేవు. దరిమిలా, వరంగల్ జిల్లాలో వున్న ఖమ్మం ప్రాంతాన్ని వేరు చేసి, 1956 లో ఖమ్మం జిల్లాగా ఏర్పాటు చేసింది  ప్రభుత్వం. అప్పటి ముఖ్యమంత్రి స్వర్గీయ బూర్గుల రామకృష్ణారావు, ప్రతి జిల్లాలో కనీసం ఒక్క కళాశాలన్నా వుండాలని ఒక నిర్ణయం తీసుకున్నారు.
కాలేజీ విద్యార్థిగా పి.యు.సి లో చేరడంతో ఒక పెద్దరికం వచ్చిన అనుభూతి కలిగింది. బహుశా నా క్లాస్ లో వున్న వాళ్లందరిలో నేనే వయసులో చిన్నవాడిననుకుంటా. ఇంగ్లీష్, తెలుగు, జనరల్ స్టడీస్ అన్ని గ్రూపులకు అంటే-ఎం.పీ.సీ, బై పీసీ (జీవ శాస్త్రం, భౌతిక-రసాయన శాస్త్రాలు), కామర్స్ (ఎకనామిక్స్, కామర్స్, అకౌంటింగ్), సివిక్స్ (చరిత్ర, భూగోళం, సాంఘికం)-కలిపి చెప్పేవారు. భౌతిక, రసాయన శాస్త్రాల క్లాసులు ఎం.పీ.సీ, బై పీసీ గ్రూపులకు కలిపి తీసుకునేవారు. లెక్కల క్లాస్ ప్రత్యేకంగా ఎం.పీ.సీ గ్రూపుకు మాత్రమే వుండేది. ఇంగ్లీష్ సబ్జెక్ట్ ప్రోజ్, పోయెట్రీ, గ్రామర్ విభాగాలుగా వుండేవి.
నాకు గుర్తున్న కొన్ని ఇంగ్లీష్ పాఠాలలో "ఆన్ ఫర్ గెట్టింగ్", "ఆన్ సీయింగ్ పీపుల్ ఆఫ్", "ఆన్ అదర్ పీపుల్ జాబ్స్" లాంటివి చాలా ఆసక్తికరంగా వుండేవి. అలానే విలియం వర్డ్స్ వర్త్, షేక్స్ పియర్ పోయెట్రీ కూడా ఆకట్టుకునేది. ప్రాక్టికల్స్ క్లాసులను తీసుకునేవారిని ఆ రోజుల్లో "డిమాన్ స్ట్రేటర్" (లెక్చరర్ కంటే ఒక గ్రేడ్ తక్కువ) అనే వాళ్లం. ప్రాక్టికల్స్ లో ఉపయోగించే కామన్ బాలెన్స్, పిప్పెట్, బ్యూరెట్ట్ లాంటివి ఇంకా గుర్తుకొస్తున్నాయి.
పి.యు.సి పరీక్షలొచ్చాయి. ఫలితాలు నేను ఊహించినట్లే వచ్చాయి.... థర్డ్ క్లాస్ లో పాసయ్యాను. ఎం.పీ.సీ గ్రూపులో మంచి మార్కులు వచ్చినప్పటికీ, ఇంజనీరింగులో సీటు లభించే స్థాయిలో రాలేదు. బొమ్మకంటి సత్యనారాయణ గారి సిఫార్సుతో, అప్పటి కాంగ్రెస్ పార్టీ మంత్రి టి. హయగ్రీవా చారి గారి ద్వారా ఎంత ప్రయత్నించినా ఇంజనీరింగులో సీటు దొరక లేదు. బెంగుళూరు ఎమ్మెస్ రామయ్య కాలేజీలో ప్రయత్నం చేశాం కాని ఫలితం లేకపోయింది. బి. ఎస్సీ  డిగ్రీ మొదటి సంవత్సరంలో ఎం.పీ.సీ గ్రూప్ తీసుకుని ఖమ్మం కళాశాలలో చేరాను.
ఆ రోజుల్లో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదివే వాళ్లను ఏం చేస్తున్నావని అడుగుతే ఫలానా డిగ్రీ, ఫలానా ఇయర్ అని సమాధానం ఇవ్వక పోయే వాళ్లు. "ఫస్ట్ ఇయర్...రెస్ట్ ఇయర్" అని క్లుప్తంగా చెప్పే వాళ్లు. దానికి కారణం డిగ్రీ ఫస్ట్ ఇయర్లో పబ్లిక్ పరీక్షలు లేకపోవడమే. చదివినా-చదవక పోయినా రెండో సంవత్సరానికి ప్రమోట్ అయ్యే వాళ్లు. సెకండ్ ఇయర్లో లాంగ్వేజెస్ (ఇంగ్లీష్, తెలుగు), జనరల్ స్టడీస్ లో పరీక్షలుండేవి. మొత్తం ఆరు పేపర్లుండేవి. థర్డ్ ఇయర్లో ఆప్షనల్ సబ్జెక్టులలో (ఎం.పీ.సీ గ్రూప్) పరీక్షలుండేవి. భౌతిక శాస్త్రంలో మాడరన్ ఫిజిక్స్ లో నాలుగు పేపర్లతో సహా మొత్తం పది పేపర్లుండేవి. పరీక్ష-పరీక్షకు మధ్య ఇప్పటి లాగా దినం విడిచి దినమో, మధ్య మధ్య శెలవులో వుండక పోయేది. సోమవారం పరీక్ష మొదలవుతే మధ్యలో వచ్చే ఒక్క ఆదివారం మినహా వరుస వెంట పది రోజులు పరీక్షలు జరిగేవి. మూడు సంవత్సరాలు చదివింది గుర్తుంచుకుని రాయాల్సి వచ్చేది. అదే విధంగా లాంగ్వేజెస్ పేపర్లు రెండేళ్లు చెప్పింది గుర్తుంచుకుని రాయాలి.
ఖమ్మంలో బిఎస్సీ డిగ్రీ మొదటి ఏడాది చదువు పూర్తి చేసుకున్న నేను, మిగతా రెండేళ్లు హైదరాబాద్ లో కొనసాగించేందుకు ప్రయత్నాలు ప్రారంభించాను. డి. వి. ద్వారక గారు ఉస్మానియా యూనివర్సిటీలో మాథమాటిక్స్ ప్రొఫెసర్ గా పని చేస్తున్నారప్పుడు. న్యూ సైన్స్ కాలేజీలో సీటివ్వడానికి ప్రిన్సిపాల్ సి. సుదర్శన్ అంగీకరించారు. అలా బీఎస్పీ (ఎం.పీ.సీ) రెండో సంవత్సరంలో 1964 జూన్ లో న్యూ సైన్స్ కళాశాలలో చేరాను. ఆ కళాశాలను జులై 17, 1956 , నూతన విద్యా సమితి యాజమాన్యం కింద, సి. సుదర్శన్ గారు, జి.ఎస్. మెల్కోటే గారు స్థాపించారు. నారాయణగూడలో వున్న ఆ కాలేజీలో అత్యంత నైపుణ్యం కల మేధావులైన విద్యావేత్తలెందరో పని చేసేవారు. నేను చేరేటప్పటికే ఫస్ట్ ఇయర్ లో చేరిన వారి సంఖ్య 150 దాటింది. నా రోల్ నంబర్ "150 X" గా కేటాయించారు. న్యూ సైన్స్ కాలేజీ, బీ ఎస్సీ (ఎం.పీ.సీ) క్లాస్‍లో 150 మందికి పైగా విద్యార్థులుండే వారు. ఎప్పుడూ, సందడిగా, సరదాగా, గలగలా పారే సెలయేరులా వుండేది మా క్లాస్. బయటేమో ఎప్పుడూ..ఏదో ఒక నిర్మాణం జరుగుతుండేది మా కాలేజీలో. కాలేజీకి వున్న మంచి పేరు వల్ల, విద్యార్థుల తాకిడి బాగా వుండేది.


మా కాలేజీ లెక్చరర్ల విషయానికొస్తే, బహుశా, అంత నైపుణ్యం కల అధ్యాపకులు, మరే కాలేజీలోను వుండరంటే అతిశయోక్తి కాదేమో! మాకు తెలుగు పాఠ్య పుస్తకంగా "ఆంధ్ర మహాభారతోపన్యాసాలు", నాన్-డిటేల్‍గా "పురుషోత్తముడు", నాటకంగా "హాలికుడు" వుండేవి. ఇంగ్లీష్ పాఠ్య పుస్తకం-వాచకంగా ఇ.ఎఫ్. డాడ్ సంపాదకీయంలోని వ్యాసాల సంకలనం వుండేది. . జి. గార్డినర్ రాసిన వ్యాసం ఒకటుంది. . ఎం. ఫార్ స్టర్ రాసిన "పాసేజ్ టు ఇండియా" నాన్-డిటేల్ గా వుండేది. లెక్కల సబ్జెక్టులో మేం ఫైనల్ ఇయర్ పరీక్షల్లో మూడు పేపర్లు రాయాలి. ఒకటి "బీజ గణితం", రెండోది "రేఖా గణితం", మూడోది "త్రికోణమితి". బీజ గణితాన్ని "షఫీ ఉల్ హక్", రేఖా గణితాన్ని "భాస్కర రావు", త్రికోణమితిని డాక్టర్ కుప్పుస్వామి బోధించేవారు. భౌతిక శాస్త్రాన్ని "హరి లక్ష్మీపతి", "ప్రభాకర్" బోధించేవారు. భౌతిక శాస్త్రంలో "మాడరన్ ఫిజిక్స్" అనే నాలుగో పేపర్ కూడా వుండేది. రసాయన శాస్త్రం థియరీలో మూడు భాగాలుండేవి. "ఆర్గానిక్", "ఇన్-ఆర్గానిక్", "ఫిజికల్" అనే ఆ మూడింటిని ముగ్గురు లెక్చరర్లు బోధించేవారు. "వై. సూర్యనారాయణ మూర్తి" ఆర్గానిక్ సబ్జెక్టు చెప్పేవారు. ఇప్పటికీ ఆయన బోర్డు మీద వేసిన "బెంజిన్ రింగ్" కళ్లలో మెదులుతుంది. ఇన్-ఆర్గానిక్ అంశాన్ని ప్రిన్సిపాల్ సుదర్శన్ చెప్పేవారు. ఫిజికల్ కెమిస్ట్రీని కూడా వై.ఎస్.ఎన్ గారు చెప్పినట్లు గుర్తు.
నేను డిగ్రీ ఫైనల్ ఇయర్‌లో వున్నప్పుడు, ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థి నాయకుల మధ్య, ఉపకులపతి (వైస్ ఛాన్స్ లర్) డి. ఎస్. రెడ్డి వ్యవహారంలో బాగా గొడవలు జరిగాయి. ఒక గ్రూపుకు మాజీ కేంద్ర మంత్రి ఎస్. జైపాల్ రెడ్డి, కె. కేశవరావు (ఒకనాటి ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు...ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర సమితి ప్రధాన కార్యదర్శి, రాజ్య సభ సభ్యుడు) మార్గదర్శకత్వం వహించగా, మరొక గ్రూపుకు నాటి విద్యార్థి నాయకులు ఎం. శ్రీధర్ రెడ్డి, పుల్లారెడ్డి, (జన సంఘ్) నారాయణ దాస్, కమ్యూనిస్టు పార్టీ అనుబంధ విద్యార్థి సంఘ నాయకులు నాయకత్వం వహించారు. 1966 లో, నాటి రాష్ట్ర ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి, 1957 నుంచి ఉపకులపతిగా పని చేస్తున్న డి. ఎస్. రెడ్డిని పదవి నుంచి తప్పించినట్లు ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో గుంటూరు కాలేజీ ప్రిన్సిపాల్ (పేరు గుర్తుకు రావడం లేదు) ను నియమించడం కూడా జరిగింది. ఆయన ఛార్జ్ తీసుకోవడానికి రావడం, విద్యార్థుల ఆందోళన మధ్య వెనక్కు తిరిగిపోవడం నా కింకా గుర్తుంది. బ్రహ్మానందరెడ్డి తీసుకున్న చర్యకు మద్దతుగా జైపాల్ రెడ్డి, కేశవరావులు ఉద్యమించగా, వ్యతిరేకంగా విద్యార్థి నాయకులు ఉద్యమించారు. ఇంతకు, డి. ఎస్. రెడ్డి చేసిన తప్పేంటి అంటే...ఆయన ఉస్మానియా యూనివర్సిటీకి స్వయం ప్రతిపత్తి కావాలని ప్రతిపాదించడమే!
అది నచ్చని బ్రహ్మానందరెడ్డి ఉపకులపతిని తొలగించడానికి చట్టాన్ని సవరించే ప్రయత్నం కూడా చేశాడు. డి.ఎస్. రెడ్డి హైకోర్టుకు, సుప్రీం కోర్టుకు న్యాయం కోసం వెళ్లాడు. చివరికి కోర్టులో ఆయన పక్షానే తీర్పు వచ్చింది. 1969 వరకు ఆయనే వైస్ ఛాన్స్ లర్‍గా కొనసాగారు. 1968 లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమానికి అంకురార్పణ జరుగుతున్నప్పుడు ఆయనే వైస్ ఛాన్స్ లర్‍. ఉద్యమం వూపందుకునే సరికి రావాడ సత్యనారాయణ ఆయన స్థానంలో వచ్చారు. వైస్ ఛాన్స్ లర్‍గా డి.ఎస్. రెడ్డి కొనసాగించాలని న్యాయస్థానం తీర్పు ఇచ్చిన నేపధ్యంలో, డిగ్రీ విద్యార్థులకు పరీక్షల్లో "గ్రేస్ మార్కులు" ప్రకటించింది యూనివర్సిటీ. నేను పరీక్ష రాయకపోయినా, కేవలం హాజరైనందుకు నాకు అన్ని సబ్జెక్టుల్లో 15 మార్కులొచ్చాయి!     
నా డిగ్రీ ఫైనల్ ఇయర్ పరీక్షలు మార్చ్-ఏప్రిల్ 1966 లో జరిగాయి. నేను లెక్కల పేపర్ రాసిన తరువాత మంచి మార్కులు రావని భావించి, మిగతా పేపర్‌లకు కేవలం హాజరవడం (పరీక్ష పేపర్లు తెచ్చుకోవడానికి) తప్ప రాయలేదు. ఫలితాలు ఊహించినట్లే ఫెయిలయ్యాను. కాకపోతే రాసిన ఒక్క లెక్కల సబ్జెక్టులో పాసయ్యాను. ఆ తరువాత సప్లిమెంటరీ పరీక్షలు రాయలేదు. మొత్తం మీద రెండు-మూడు ప్రయత్నాల తరువాత, మార్చ్ 1968 లో లెక్కలు, భౌతిక శాస్త్రం, సెప్టెంబర్ 1968 లో రసాయన శాస్త్రం కంపార్ట్ మెంటల్ గా డిగ్రీ పాసయ్యాను. అలా నా హైదరాబాద్ చదువు-నివాసం ప్రధమ ఘట్టం పూర్తయింది.
మొదటి దశలో ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థిగా బీఎస్సీ పూర్తి చేసుకున్న నేను, నాగ్ పూర్ లో ఎం ఏ చదివిన తరువాత, లైబ్రేరియన్ గా ఉద్యోగంలో చేరడం, ప్రొఫెషనల్ డిగ్రీ  కొరకు మరోమారు ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కాలేజీలో, జులై-ఆగస్ట్ 1973లో లైబ్రరీ సైన్స్ కోర్స్ లో చేరడం జరిగింది. మా క్లాసులు కొన్ని ఆర్ట్స్ కాలేజీ ఆవరణలో, కొన్ని లైబ్రరీ భవనంలో జరిగేవి. అదో మరపురాని అనుభూతి.1974 జులై నెలాఖరులో పరీక్షలు జరిగి నాకు యూనివర్సిటీ రెండో రాంక్ ఆగస్టులో రావడం మరో విశేషం. అలా 42 ఏళ్ల క్రితం ఉస్మానియా విశ్వవిద్యాలయంతో నా అనుబంధం ముగిసింది.  
ఉస్మానియా విశ్వ విద్యాలయంలో చదివిన నాటి రోజులు, కాలేజీ ఆవరణ, అడపదడప ఆర్ట్స్ కాలేజీకి బస్సులో వెళ్లి రావడం, అక్కడి స్నేహితులతో సరదాగా గడపడం, కళాశాల గొడవలు, క్రికెట్ ఆట...ఇలా ఎన్నో...ఎన్నెన్నో ఎప్పటికీ గుర్తొస్తుంటూనే వుంటాయి. అవి మరపురాని మధురమైన రోజులు.End


మరపురాని మధురమైన రోజులు : వనం జ్వాలానరసింహారావు (ఆంధ్రజ్యోతి )

మరపురాని మధురమైన రోజులు
వనం జ్వాలానరసింహారావు
ఆంధ్రజ్యోతి దినపత్రిక (26-04-2017)

ఖమ్మంలో బీఎస్సీ డిగ్రీ మొదటి ఏడాది చదువు పూర్తి చేసుకున్న నేను, మిగతా రెండేళ్లు హైదరాబాద్‌లో కొనసాగించేందుకు ప్రయత్నాలు ప్రారంభించాను. న్యూ సైన్స్ కాలేజీలో సీటివ్వడానికి ప్రిన్సిపాల్ సి. సుదర్శన్ అంగీకరించారు. అలా బీఎస్పీ (ఎం.పీ.సీ) రెండో సంవత్సరంలో 1964 జూన్‌లో న్యూ సైన్స్ కళాశాలలో చేరాను. నారాయణగూడలో వున్న ఆ కాలేజీలో అత్యంత నైపుణ్యం కల మేధావులైన విద్యావేత్తలెందరో పని చేసేవారు. నేను డిగ్రీ ఫైనల్ ఇయర్‌లో వున్నప్పుడు, ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థి నాయకుల మధ్య, ఉపకులపతి (వైస్ ఛాన్సలర్) డి.ఎస్.రెడ్డి వ్యవహారంలో బాగా గొడవలు జరిగాయి. ఒక గ్రూపునకు మాజీ కేంద్ర మంత్రి ఎస్. జైపాల్ రెడ్డి, కె. కేశవరావు (తెలంగాణ రాష్ట్ర సమితి ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు) మార్గదర్శకత్వం వహించగా, మరొక గ్రూపుకు నాటి విద్యార్థి నాయకులు ఎం. శ్రీధర్ రెడ్డి, పుల్లారెడ్డి, (జనసంఘ్) నారాయణ దాస్, కమ్యూనిస్టు పార్టీ అనుబంధ విద్యార్థి సంఘ నాయకులు నాయకత్వం వహించారు. 1966లో నాటి రాష్ట్ర ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి, 1957 నుంచి ఉపకులపతిగా పని చేస్తున్న డి.ఎస్.రెడ్డిని పదవి నుంచి తప్పించినట్లు ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో గుంటూరు కాలేజీ ప్రిన్సిపాల్ ను నియమించడం కూడా జరిగింది. ఆయన ఛార్జ్ తీసుకోవడానికి రావడం, విద్యార్థుల ఆందోళన మధ్య వెనక్కు తిరిగిపోవడం నాకింకా గుర్తుంది.

  బ్రహ్మానందరెడ్డి చర్యకు మద్దతుగా జైపాల్ రెడ్డి, కేశవరావులు ఉద్యమించగా, వ్యతిరేకంగా విద్యార్థి నాయకులు ఉద్యమించారు. ఇంతకు, డి.ఎస్.రెడ్డి చేసిన తప్పేంటి అంటే... ఆయన ఉస్మానియా యూనివర్సిటీకి స్వయం ప్రతిపత్తి కావాలని ప్రతిపాదించడమే! అది నచ్చని బ్రహ్మానందరెడ్డి ఉపకులపతిని తొలగించడానికి చట్టాన్ని సవరించే ప్రయత్నం కూడా చేశాడు. డి.ఎస్.రెడ్డి హైకోర్టుకు, సుప్రీం కోర్టుకు న్యాయం కోసం వెళ్లాడు. చివరికి కోర్టులో ఆయన పక్షానే తీర్పువచ్చింది. 1969వరకు ఆయనే వైస్ ఛాన్సలర్‌‍గా కొనసాగారు. 1968లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమానికి అంకురార్పణ జరుగుతున్నప్పుడు ఆయనే వైస్ ఛాన్సలర్‍. ఉద్యమం వూపందుకునే సరికి రావాడ సత్యనారాయణ ఆయన స్థానంలో వచ్చారు. డి.ఎస్.రెడ్డిని కొనసాగించాలని న్యాయస్థానం తీర్పు ఇచ్చిన నేపధ్యంలో, డిగ్రీ విద్యార్థులకు పరీక్షల్లో “గ్రేస్ మార్కులు” ప్రకటించింది యూనివర్సిటీ. నేను పరీక్ష రాయకపోయినా, కేవలం హాజరైనందుకు నాకు అన్ని సబ్జెక్టుల్లో 15 మార్కులొచ్చాయి! అనంతరకాలంలో, బీఎస్సీ పూర్తి చేసుకున్న నేను, నాగ్‌పూర్‌లో ఎం.ఏ చదివి తరువాత లైబ్రేరియన్‌గా ఉద్యోగంలో చేరాను. ప్రొఫెషనల్ డిగ్రీ కొరకు మరోమారు ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కాలేజీలో, 1973లో లైబ్రరీ సైన్స్ కోర్స్ లో చేరాను. మా క్లాసులు కొన్ని ఆర్ట్స్ కాలేజీ ఆవరణలో, కొన్ని లైబ్రరీ భవనంలో జరిగేవి. 1974 జులై నెలాఖరు పరీక్షల్లో నాకు యూనివర్సిటీ రెండోరాంక్ రావడం మరో విశేషం. ఉస్మానియా విశ్వ విద్యాలయంలో చదివిన నాటి రోజులు, కాలేజీ ఆవరణ, ఆర్ట్స్ కాలేజీకి బస్సులో వెళ్లి రావడం, స్నేహితులతో సరదాగా గడపడం, కళాశాల గొడవలు, క్రికెట్ ఆట... ఇలా ఎన్నో... ఎన్నెన్నో. అవి మరపురాని మధురమైన రోజులు.

Sunday, April 23, 2017

భగవత్ ప్రాప్తికి భగవంతుడే సాధనం .... ఆంధ్ర వాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి? : వనం జ్వాలా నరసింహారావు

భగవత్ ప్రాప్తికి భగవంతుడే సాధనం
ఆంధ్ర వాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి?
 వనం జ్వాలా నరసింహారావు
సూర్య దినపత్రిక (24-04-2017)

          సీతను తన వీపు మీద ఎక్కించుకొని ఆకాశ మార్గంలో శ్రీరాముడి దగ్గరకు తీసుకు పోతాను రమ్మని ఆమెను కోరుతాడు హనుమంతుడు. "మగవాడిని-రాముడిని" తప్ప మరెవ్వరినీ తాకననీ-లక్ష్మణ, సుగ్రీవులతో కూడిన రామచంద్రమూర్తినే లంకకు తీసుకొచ్చి, రావణుడిని చంపి, తనను తీసికొని పొమ్మని, ఆయనతో చెప్పమని అంటుంది జవాబుగా. తను చెప్పిన ఈ "ఉపాయం" తప్ప తక్కినవన్నీ వదిలేయమనీ, దుఃఖంలో వున్న తనను కృతార్ధురాలిని చేయమనీ, ప్రార్ధిస్తుంది.

          హనుమంతుడు వెంట రానని సీతాదేవి చెప్పటంలో ఎంతో గూడార్ధముంది. "మగవాడిని-రాముడిని" (మగవానిని రాముని తప్ప నింకనెవ్వరిని స్పృశింప నొల్ల) తప్ప అన్యులను తాకననటంలో అర్ధం: శ్రీరామచంద్రుడొక్కడే పురుషుడని, తక్కిన వారందరూ స్త్రీలని అనుకోవాలి. "భగవంతుడు, వాసుదేవుడు" మాత్రమే పురుషుడు. తక్కిన బ్రహ్మాదులతో కూడిన ప్రపంచమంతా స్త్రీ మయమే! స్త్రీ-స్త్రీ తో కలిస్తే ఆనందం లేదు కదా! అంతే "జీవాత్మ". భగవంతుడితో సాయుజ్యం పొందితేనే ఆనందమ్ కలుగుతుందికాని, బ్రహ్మాదులతో సాయుజ్యం కల్గితే మళ్లీ పుట్టాల్సిందే...మళ్లీ దుఃఖించాల్సిందే!

          సీతాదేవి మరో అభిప్రాయంలో "ఆత్మనిక్షేపం, పారతంత్ర్యంస్పష్టంగా చెప్పడం జరిగింది. "ప్రపన్నులు" తప్ప తక్కిన "ముముక్షువు" లందరూ, భగవత్ ప్రాప్తికి, "భక్తో, కర్మయోగమో, జ్ఞాన యోగమో, అష్టాంగ యోగమో", ఏదో ఒకటి సాధనంగా స్వీకరిస్తారు. ప్రపన్నుడు ఈ సాధనాలేవీ ఆశించడు. భగవత్ ప్రాప్తికి భగవంతుడే సాధనమనీ, ఆయనే వచ్చి తనను తీసుకోపోవాలనీ భావిస్తాడు. ప్రపన్నుడు భగవంతుడిని తప్ప మరే సాధనం కోరడు. ఒకవేళ  కోరినా, భగవత్ ప్రాప్తి తప్ప మరే ఫలం కోరినా, భగవంతుడిని తప్ప మరే దేవతను ఆశ్రయించినా, ప్రపత్తి చెడుతుంది, ఫలించదు. హనుమంతుడు వెంట సీతాదేవి వెళ్లుంటే, ఆమెను రామచంద్రమూర్తి భ్రష్టురాలివైనావని స్వీకరించి ఉండడు. కాబట్టి "ప్రపన్నులు" అన్ని విధాలుగా "అనన్యు" లై వుండాలి.

            "భక్తుడికీ, ప్రపన్నుడికీ" భగవంతుడు తన పాలిట వున్నాడను కోవటానికి అనేక నిదర్శనాలు అనుభవ పూర్వకంగా తెలుస్తాయి. వాటిని బట్టి తక్కినవి ఊహించుకోవచ్చు. శ్రీరామచంద్రమూర్తి తక్కిన అందరు దేవతలకంటే గొప్పవాడని తెల్సుకోగలుగుతాడు. ఇట్టి ఉత్తమోత్తమ దేవతను సాధించే "ప్రవృత్తి"నే ఉత్తమోత్తమ "ఉపాయ"మని గ్రహించి దృఢ చిత్తంతో, అనన్యుడిగా వుండాలి. అందుకే సీత అంటుంది...తక్కిన అన్ని ఉపాయాలూ వదలమని, గుహలో వున్న భగవంతుడిని తాను వెతుక్కుంటూ పోలేను, ఆయన్నే ఇక్కడకు రప్పించమని. "శిశ్యుడు-ఆచార్యు"డిని కోరడమే యిది. హనుమంతుడు జవాబులో "ఆచార్య కృత్యం" అంటే ఏమిటో కూడా వుంది.

          హనుమంతుడుతో, శ్రీరామలక్ష్మణులకు సందేశ వార్తలను పంపుతూ సీతాదేవి, తనకు బదులుగా తన నమస్కారమని తన తరఫున రాముడికి మ్రొక్క మని అంటుంది. తనను రక్షించమని అడిగానని మాత్రం చెప్పవద్దని కోరుతుంది. ఇదివరకు తన్ను రక్షించమని కోరి మహాపరాధం చేసాననుకుంటుంది. ప్రపన్నురాలు అలాంటి కోరికలు కోరరాదు. భగవత్ కృత్యం ఆయనకు నేర్పి "దురహంకారి" నైనా ననుకుంటుంది సీత. అంటే ఆయనపై "విస్మృతి" దోషం ఆరోపిన్చినట్లే! ఆయన రక్షిస్తాడన్న విషయంలో విశ్వాసం లేనట్లే! ఆయన సొత్తు కాపాడుకున్నా, పోగొట్టుకున్నా, బలవంత పెట్టేందుకు తనెవరనుకుని, దోష నివృత్తి కొరకు, ప్రాయశ్చిత్తంగా "నమస్కరిస్తున్నా" నని మాత్రమే చెప్పమంటుంది.


            రామచంద్రమూర్తి సైన్యంతో వచ్చి, యుధ్ధంలో బల-పరాక్రమాలను ప్రదర్శించి, రావణుడిని చంపి, తనను అయోధ్యకు తీసుకొని పోతేనే "కీర్తికరం" అంటుంది సీత హనుమంతుడితో. అప్పుడే తను "వీరపత్ని"నన్న బిరుదుకు అర్హురాలినని కూడా అంటుంది. ఈ విధంగా సీత కోరరాని కోరికేమీ కోరలేదు. "పరమ భక్తులు, ప్రపన్నులు" భగవంతుడే స్వయంగా వచ్చి, తమను పిల్చుకోపోవాలని కోరుకుంటారు కాని, దూతలతో పిలిపించు కోవటానికి ఇష్తపడరు. సీత చెప్పిన "ఉపాయం" గొప్పదైనా, "ఉపేయం" కూడా గొప్పదే! ఉపేయం గొప్పదైతే, దాన్ని సాధించే ఉపాయం కూడ గొప్పగానే వుండాలి. "ఉపేయం" రామచంద్రమూర్తి....దాని సాధనోపాయం రామచంద్రమూర్తి రావడమే!

          భగవంతుడు ఎల్లవేళలా జ్ఞాపకం వుండడానికి సీతాదేవి "చూడామణి"నుంచుకున్నట్లే, ఓ పతకం కానీ, మరేదైనా చిహ్నం కానీ శరీరం పైన ధరించాలెప్పుడూ. శరీరం ధర్మసాధనం, భగవత్ సాధనం కద! దాని పని భగవంతుడి స్మరణకే! దేహం లేక పోతే భగవత్ స్మరణే లేదు. భగవంతుడిని స్మరిస్తేనే గాని భగవత్ ప్రాప్తి లేదు. భగవత్ ప్రాప్తికై దేహ ధారణ చేయాలేకాని, మనమే దేహాన్ని విడిచిపెట్ట కూడదు. దానిని "అన్య ప్రాకృత" విషయాల్లో వినియోగించ కూడదు. దేహం పోయే లోపల భగవత్ ప్రాప్తి కలిగే ఉపాయాన్ని వెతుక్కోవాలి. అట్టి దేహం మీద సీతాదేవి, సర్వాభరణాలు వదిలి "చూడామణి"ని మాత్రం ప్రాణపదంగా వుంచుకుంది. దాన్నీ రామార్పణం చేసి,హనుమంతుడికి తన గుర్తుగా యిచ్చి, "సర్వస్వ నిక్షేపం" చేసిందయింది.

          అశోక వనాన్ని పాడుచేసిన హనుమంతుడి ఘోర, భయంకర రూపాన్ని చూసిన, రాక్షస స్త్రీలు, ఆయన్ను గురించి సీతాదేవిని అడిగినప్పుడు, తనకు తెలియదని అబధ్ధం చెప్పుతుంది. అయినా అసత్య దోషం ఆమెకు తగలదు. ప్రతిమనిషి, ప్రతినిత్యం, పాటించాల్సిన "యమము" లలో ముఖ్యమయినవి అయిదు. అవి: "అహింస, సత్యం, అస్తేయం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం". చివరి నాలుగింటికి "అహింస" తల్లి. సత్యాదులు దాని బిడ్డలు. నిజం చెప్పడం వల్ల నిరపరాధికి, నిష్కారణంగా హింస జరిగితే, జరుగుతుందనుకుంటే, సత్యం చెప్ప రాదు. అసత్యమాడవచ్చు. దురుద్దేశం లేని హాస్యమాడేటప్పుడు, స్త్రీల విషయంలో, వివాహ కాలంలో, ప్రాణాపాయ సమయంలో సర్వస్వం కోల్పోయేటప్పుడు అసత్యం చెప్తే పాపం తగలదు. సత్యం చెప్తే హాని జరుగుతుందనుకుంటే, అసత్య మాడవచ్చునే కాని, ఆడాలన్న నిర్భందం మాత్రం లేదు. హనుమంతుడు, సీతాదేవికి ప్రత్యుపకారం కోరని ఉపకారి. నిరపరాధి. సత్యం చెప్తే, ఆయనకు, తనకు, ప్రాణహాని కలుగుతుందని భయపడింది సీతాదేవి.


ఇంద్రజిత్తు హనుమంతుడిని, "బ్రహ్మాస్త్రం"తో బంధించిన తర్వాత, రాక్షసులు, తాళ్లతో, పగ్గాలతో తిరిగి కట్టేయగానే, బ్రహ్మాస్త్ర బంధాలు తెగిపోయాయి. బ్రహ్మాస్త్ర బంధాలు మరో బంధాలతో కలిస్తే, ఆ బంధాలు విడిపోతాయి! దీనర్ధం:  ప్రపత్తి చేసినవాడు, దాని మీద విశ్వాసం లేక పోతే, ప్రపత్తికి సహాయ పడుతుందని వేరే సాధనాన్ని వుపయోగిస్తే, "ప్రపత్తి" చెడిపోతుంది. ప్రపత్తి లో వున్న అపాయం ఇదే! ఇతర "ఉపాయాల"ను అది సహించదు

DOUBLING OF FARMERS’ INCOME ....VIEWS OF THE GOVERNMENT OF TELANGANA : CM KCR in NITI AAYOG MEET

DOUBLING OF FARMERS’ INCOME
VIEWS OF THE GOVERNMENT OF TELANGANA
CM KCR in NITI AAYOG MEET

Chief Minister K Chandrashekhar Rao, during the Niti Aayog meeting held by PM Narendra Modi, in New Delhi on 23rd April 2017, pitched for various measures to pull the farming sector in the country out of distress.

CM said: “The Government of Telangana is taking several steps to address the agrarian distress and to revive the farm sector in the State and also to revamp the rural economy by reviving the traditional activities such as, sheep rearing, fisheries dairy, etc.  Outstanding agricultural loan of Rs.17, 000 crores was already waived in four installments, thereby benefiting more than 35 lakh farmers in the State.  In addition to this, we have recently announced an innovative scheme to provide investment assistance of Rs.4000/- per acre, in both the crop seasons, towards purchase of inputs such as, seeds, fertilizers, pesticides, labour costs, which will  benefit 55 lakh farmers cultivating over 1.50 crore acres in the State during the Kharif and Rabi seasons. This will go a long way to revive the agriculture sector and help farmers to come out of the vicious cycle of debt trap.  Government of India should support such initiatives by the State Governments to address the present agrarian distress”. 


“In order to achieve the objective of doubling farmers’ income in five years, the following concrete steps need to be taken urgently.

(1)    Entire country needs to be divided into crop colonies for specific crops, based on agro-climatic regions, so that the Minimum Support Price facility can be effectively ensured to benefit the farmers by preventing avoidable glut of certain commodities in the market.

(2)   While agriculture production has increased in the country, productivity has not increased for most of the crops.  For this purpose, continuous Research and Development is required and Government of India should support research through institutions located in different States.

(3)   Vulnerability of the farm sector has to be minimized by taking the following steps:

·           Expeditious completion of all ongoing irrigation projects by providing required support to the State Governments.
·           Supply of adequate and quality power to the farm sector at affordable rates.
·           Reforming the existing insurance schemes by removing the present operational difficulties.

(4)   A thorough review is needed on imports of food-grains, oil seeds, oil products, textile, etc. so as to ensure that the produce of the country does not have to face undue extraneous competition or market manipulation.

(5)   Agro-based industries must be encouraged pro-actively to facilitate value addition and enhancement of farmers’ income.

(6)   Activities supporting agriculture which are in the allied sector, such as dairy, sheep rearing, fisheries, poultry, farm forestry, etc. should be exempted from the purview of income-tax, as these play a significant role in providing supplemental income to the farming community.


(7)   Government of India has enacted the Compensatory Afforestation Fund Act, 2016 and notified the same as Central Act No. 38 of 2016 on 3rd August, 2016. It is understood that the Ministry of Environment, Forests & Climate Change is in the process of framing of rules and accounting procedures for effective utilization of CAMPA Funds. The process of consultation and drafting of rules is taking unduly long time, leading to inordinate delay in release and utilization of funds.

(8)   There is a hue and cry among the farmers due to the scarcity of labour force in agricultural operations. In order to make MGNREGA more useful and productive to the agricultural operations, there is an urgent need to dovetail MGNREGA to agricultural operations, by including it under the permitted activities under MGNREGA.  It is suggested that 50% of the unskilled wages may be paid under MGNREGA and 50% by the farmers concerned.  It will not only help farmers in timely agricultural operations, but also help ensure employment to the weaker sections of the society.  This may be extended to those States who opt to avail this”.


Friday, April 21, 2017

వజ్రసంకల్పాన్ని ఏవీ ఆపలేవు!....కేంద్ర, రాష్ట్ర సంబంధాల్లో కొత్త అధ్యాయం:వనం జ్వాలా నరసింహారావు

వజ్రసంకల్పాన్ని ఏవీ ఆపలేవు!
ఆంధ్రప్రభ దినపత్రిక (22-04-2017)
కేంద్ర, రాష్ట్ర సంబంధాల్లో కొత్త అధ్యాయం
నమస్తే తెలంగాణ (22-04-2017)
వనం జ్వాలా నరసింహారావు

తెలంగాణ రాష్ట్రం లోని వెనుకబడిన తరగతులుషెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు జాతుల వారికి విద్యా సంస్థల్లో, ఉద్యోగ నియమాకాల్లో, రాష్ట్రానికి చెందిన వివిధ సర్వీసుల్లోని పదవుల్లో రిజర్వేషన్ కల్పించేందుకు ఉద్దేశించిన 2017 బిల్లును, ఆదివారం, ఏప్రిల్ 16, 2017న తెలంగాణ రాష్ట్ర శాసన సభ, శాసన మండలిలో ప్రవేశ పెట్టడం, ఉభయసభల ఆమోదం పొందడంతో ఒక చారిత్రత్మాక ఘట్టానికి నాంది పలకడం జరిగింది.   ఏకకాలంలో, మరో చారిత్రాత్మక నిర్ణయానికి తెరతీస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, రాష్ట్రాలకుండాల్సిన రాజ్యాంగ హక్కులను పునరుద్ఝాటిస్తూ శాసనసభలో మాట్లాడడం, తద్వారా కేంద్ర-రాష్ట్ర సంబంధాలలో ఒక నూతనాధ్యాయానికి నాందిపలకడం కూడా జరిగింది. యాధృచ్చికమే కావచ్చు...మరేదైనా కావచ్చు...కాని యావత్భారతదేశం ఆధ్యతన భవిష్యత్ లో సుదీర్ఘంగా ఆలోచించాల్సిన, చర్చించాల్సిన, ఒక నిర్ణయానికి రావాల్సిన అంశమిది అనాలి.

     ఈ నేపథ్యంలో ఒక విషయం మననం చేసుకోవడం అవసరమేమో! నేటి భారత ప్రధాని నరేంద్ర మోడీ, గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వున్న రోజుల్లో, 2012 గణతంత్ర్య దినోత్సవ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ప్రాముఖ్యత సంతరించుకున్న విషయంగా పరిగణించాలి. "భారత సమాఖ్య నిర్మాణంలో ఒక క్రమ పద్ధతి ప్రకారం కేంద్ర ప్రభుత్వం చేస్తున్న దాడి" ఆందోళన కలిగిస్తున్నదని ఆనాడాయన అన్నట్లు వార్తలొచ్చాయి.  "రాష్ట్రాలకు న్యాయబద్ధంగా సంక్రమించాల్సిన హక్కులను వాటికి దక్కేట్లు చేయడం వల్ల కేంద్రం బలహీనపడిపోదు. రాష్ట్రాలు కూడా కేంద్ర ప్రభుత్వానికి సహాయ-సహకారాలను అందించాలే కాని, కేంద్రానికి అణగి-మణగి వుండాల్సిన అవసరం లేదు. సహకార సమాఖ్య పద్ధతి వుండాలే కాని, బలాత్కార సమాఖ్య పద్ధతి వుండరాదు" అనే భావనని మోడీ ఆనాడు స్పష్టంగా వ్యక్త పరిచారు.

     బహుశా అంతకన్నా ఇనుమడించిన గుండె ధైర్యంతో, సాహసంతో, ఉత్సాహంతో, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, ముస్లిం మైనారిటీలకు బిసి ఇ కేటగిరీ కింద, అదే విధంగా షెడ్యూల్డు తెగలకు రిజర్వేషన్ కోటా పెంచే బిల్లును ప్రవేశ పెట్తూ మాట్లాడిన పద్ధతి, బిల్లుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి పొందడానికి అవసరమైన భూమికను తయారు చేసుకుంటున్నట్లు భావించాలి. శాసనసభలో సీఎం వ్యాఖ్యలు కుండ బద్దలు కొట్టినట్లుగా తేట తెల్లంగా వున్నాయనాలి. ‘‘నేను కేంద్రాన్ని అర్థించడం లేదు. పోరాటం చేయబోతున్నాను. నీతి అయోగ్ సమావేశంలో ఈ విషయం ప్రస్తావిస్తాను. అవసరమైతే అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాను" అని ముఖ్యమంత్రి స్పష్టంగా, అరమరికలు లేకుండా చెప్పడం గమనించాల్సిన విషయం.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి, తమిళనాడుతో సహా దేశంలోని ఐదు రాష్ట్రాలలో అమల్లో వున్న రిజర్వేషన్ల విషయాన్ని ప్రస్తావిస్తూ  అక్కడ 50 శాతానికి మించి రిజర్వేషన్లు అమలవుతున్నాయని అన్నారుప్రత్యేక పరిస్థితుల్లో 50 శాతం మించి రిజర్వేషన్లు అమలు చేయడానికి సుప్రిం కోర్టు (అత్యున్నత న్యాయస్థానం) రాష్ట్రాలకు వెసులుబాటు కల్పించిందని, అలాంటి పరిస్థితులు తెలంగాణలో కూడా వున్నాయని సీఎం అన్నారురాష్ట్రాలు ఇప్పుడమల్లో వున్న రిజర్వేషన్ల శాతాన్ని పెంచడానికి, అత్యున్నత న్యాయస్థానం పేర్కొన్న"సరైన గణాంకాలు", "స్పష్ఠమైన లెక్కలు" తెలంగాణ రాష్ట్రంలో కూడా వున్నాయని సీఎం అన్నారు. శాసనసభలో వివిధ సందర్భాలలో జరిగిన చర్చలో సీఎం, "రిజర్వేషన్ల లాంటి కొన్ని కొన్ని విధాన పరమైన ముఖ్యమైన అంశాలకు సంబంధించి, రాష్ట్రాల జనాభా ప్రాతిపదికన, తదితర ప్రాధాన్యతాంశాల క్షేత్రస్థాయి వాస్థవాల ఆధారంగా, నిర్ణయాలు తీసుకునే అధికారం రాష్ట్రాలకే వుండాలి. వాటిని రాష్ట్రాలకే కేంద్రం వదిలేయాలి. పరిణితి చెందిన, సచేతనమైన మన దేశంలాంటి ప్రజాస్వామ్యంలో, రాష్ట్రాల అవసరాలకనుగుణంగా చర్యలు చేపట్టాల్సిన సౌలభ్యం కేంద్రం రాష్ట్రాలకే వదిలేయాలి. 1947 లో స్వాతంత్ర్యం సిద్ధించిన నాటి స్థితిగతులు, పరిస్థితులు నేడు లేవు. 70 సంవత్సరాలకు పూర్వం మనం మన రాజ్యాంగాన్ని రూపొందించుకున్నాం. ఇప్పుడు జనాభా పెరిగింది-పెరుగుతున్నది. ప్రజల్లో అవగాహన పెద్ద ఎత్తున పెరిగింది. అందుకు తగ్గ అవకాశాలు కల్పించాల్సిన  సమయం ఆసన్నమయింది. ప్రజలు తమతమ అవసరాలకు అనునుగుణంగా కొత్త కోరికలు కోరటం జరుగుతున్నది. దేశం అభివృద్ధి పథంలో ముందుకు సాగి పోవడానికి, పరుగులు తీయడానికి, ముందంజ వేయడానికి, రిజర్వేషన్ల అంశాన్ని ఆయా రాష్ట్రాల నిర్ణయానికి వదిలిపెట్టేయాల్సిన తరుణం ఆసన్నమయింది. తెలంగాణకు జరిగిన అన్యాయానికి, వివక్షకు, వ్యతిరేకంగా మేం పోరాటం చేసినప్పుడు మాకు లభించిన, అందించిన సహకారం, కలిసి వచ్చిన నేపథ్యం ఇప్పుడు కూడా కావాలి. భిన్నత్వంలో ఏకత్వం మన సిద్ధాంతం...మన నైజం..అదే మనకు ప్రాతిపదిక. లేని పక్షంలో విద్వేషాలు, వైషమ్యాలు పెరిగి ఉద్యమించాల్సిన పరిస్థితి తలెత్తుతుంది" అన్నారు.


ఈ సందర్బంగా షెడ్యూల్డు కులాల వర్గీకరణ అంశాన్ని ప్రస్తావిస్తూ  ఆ సందర్భంగా పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర ప్రజల సహకారం అందిందని అన్నారు. ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రంలో అదో పెద్ద విషయం కాకపోవచ్చనీ, తెలంగాణలో మాత్రం ప్రాధాన్యత చాలా వుందని సీఎం అన్నారు. కాబట్టే ఇలాంటి అంశాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునే వెసులుబాటు, సౌలభ్యం, అధికారం, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు  వుండాల్సిందే అని సీఎం అభిప్రాయపడ్డారు. కేంద్రం రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలను, ఆలోచనలను గౌరవించాల్సిన అవసరం ఉందని, కేంద్రంలో పార్టీలు మారవచ్చునేమో కానీ పఠిష్టమైన కేంద్ర వ్యవస్థ కొనసాగుతూనే వుంటుందని, అదో నిరంతర ప్రక్రియ అని ఆయన అన్నారు.  తమిళనాడు రాష్ట్రంలో యుపిఎ ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయం ఎన్డీయే కొనసాగించక తప్పలేదని ఆయన అన్నారు.

ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు కేంద్ర-రాష్ట్ర సంబంధాల విషయంలో వెలిబుచ్చిన అభిప్రాయాలు, ముస్లిం రిజర్వేషన్ల పెంపు అంశం, యావద్భారత దేశం దృష్టిని ఆకర్షించడంతో పాటు, జాతీయ స్థాయిలో  విస్తృత స్థాయి చర్చకు దారితీసే అవకాశాలున్నాయి. అవసరమైతే ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ నాయకులైన ములాయం సింగ్ యాదవ్ (సమాజ్ వాది పార్టి) బిఎస్పి కి చెందిన మాయావతి లాంటి వారిని కూడా తన ఆలోచనలకనుగుణంగా కలిసొచ్చేలా చేసుకోవచ్చు కూడా. టిఆర్ఎస్ పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యులు, తొలుత ప్రాథమిక స్థాయిలో, పలువురు జాతీయ నాయకులతో సమావేశమై, ఈ అంశాలను ప్రస్తావించి, వారి అభిప్రాయాలను సేకరించి, త్వరలో ముఖ్యమంత్రి డిల్లీ పర్యటన చేసేనాటికి పటిష్టమైన భూమికను తయారు చేయవచ్చు కూడా.

ఆశించిన విధంగా, అనుకున్నవిధంగా, అభాగ్యులను ఆదుకోవాలనే ఆశయ సాధన వున్న వ్యక్తి సీఎం కేసీఆర్. అలా చేస్తే అవాంతరాలు ఉండవన్నది ముఖ్యమంత్రి బలమైన నమ్మకంసమాజంలోని వెనుకబడిన వర్గాలను ప్రగతిపధాన నడిపించడానికి తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం నిర్విఘ్నంగా ముందుకు సాగగలదు ఆయన నమ్మకం. ఎరువుల కొనుగోలు విషయంలో ఎకరానికి 4000 సబ్సిడీ అందించడంలో, ఉచిత విద్యుత్తును అందిస్తూ వ్యవసాయ రుణాల రద్దుకు ఉపక్రమించిన క్రమంలో, ఒంటరి మహిళలకు సహాయం అందించటంలో, గర్బిణీ స్త్రీలకు 12 వేల ఆర్థిక సహాయం, కేసిఆర్ కిట్ లను అందించే ఆలోచన క్రమంలో, రిజర్వేషన్లు పెంచే ఆలోచన క్రమం వంటి చారిత్రాత్మక నిర్ణయాల నేపథ్యానికి మూలం తెలంగాణలో యావన్మంది ప్రజల మెరుగైన జీవనానికి, అభ్యున్నతికి, పురోభివృధ్దికి నాంది పలకడం మాత్రమేనన్నది నిర్వివాదాంశం.


ఆత్మ నిబ్బరం, నిబద్ధత కలిగిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం జరిగిన రాష్ట్ర శాసనసభ ప్రత్యేక సమావేశంలో స్వయంగా తానే చారిత్రాత్మక రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టి, బిసి-ఇ కేటగిరిలో 4 శాతం నుండి 12 శాశాతానికి, షెడ్యూల్డు తెగలకు 6 శాతం నుండి 10 శాతానికి రిజర్వేషన్లు పెంచారుకాంగ్రేస్, ఎంఐఎం పార్టీలుఈ ప్రతిపాదనకి అంగీకారం తెలుపగా బిజేపి వ్యతిరేకించింది. బిల్లు ప్రవేశపెట్తూ, ఎన్నికల ముందు తమ పార్టీ ప్రకటించిన ప్రధానాంశాలలో చేసిన వాగ్దానాల్లో రిజర్వేషన్ల పెంపు ఒకటని, ఆ వాగ్దానాన్ని ఇప్పడు అమలు చేస్తున్నామని సీఎం అన్నారునిబంధనలకు అనుగుణంగా, ఒక క్రమ పద్ధతిన, దీనికవసరమైన చర్యలు చేపట్టడం జరిగిందని, అమలులో కూడా అన్ని నిబంధనలను పాటిస్తామని, షెడ్యూల్డు కులాలకు సంబంధించిన రిజర్వేషన్లను కూడా 1 శాతం పెంచి, మొత్తం 16 శాతానికి చేరుస్తామని, తెలంగాణలోని షెడ్యూల్డు కులాల జనాభాను పరిగణలోకి తీసుకుని ఆ ప్రకారం పెంపుదల చర్యలు చేపడతామని, వెనుకబడిన తరగతుల వారి రిజర్వేషన్లను కూడా పెంచడానికి చర్యలు చేపట్టామనీ, అందుకు బిసి కమిషన్ సమగ్ర అధ్యయనం చేస్తున్నదని, బిసిల సామాజిక ఆర్థిక స్థితిగతుల ఆధారంగా పెంపుదల అంశం ముందుకు తీసుకువెళతామని చెప్పారు.

న్యాయపరమైన చిక్కిలన్నింటినీ అధిగమించి, సుప్రీం కోర్ట్ విధించిన 50 శాతం వున్న సీలింగ్ దాటి 62 శాతానికి పెంచిన రిజర్వేషన్లు అమలు చేస్తామని, అలా చేయగలమన్న నమ్మకం తనకున్నదని సీఎం స్పష్టం చేశారు. భువనేశ్వర్ లో జరిగిన భారతీయ జనతా పార్టీ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ప్రకటన సారంశాన్ని సీఎం శాసన మండలిలో చదివి వినిపించడంతో, రాష్ట్ర భారతీయ జనతా పార్టీ వ్యూహం పూర్తిగా దెబ్బతినిందనాలి. "చారిత్రాత్మక నిర్ణయం మీద శాసనమండలిలో చర్చ జరుగుతున్న సందర్భంలోనే, ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ అంశం మీదే వ్యాఖ్యానించడం యాధృఛ్చికమే అయినా ఆహ్వానించాల్సిన విషయం. ముస్లింలలో వెనుకబాటుదనాన్ని గురించి ప్రధాని ప్రస్తావించారు. వాళ్ల సమగ్రాభివృద్ధి గురించి కూడా పీఎం మాట్లాడారు. ఇదంతా చూస్తుంటే, కేంద్రం రిజర్వేషన్ల పెంపు బిల్లుకు ఆమోదం తెలుపుతుందన్నఆశకు బలం చేకూరుతున్నది" అని సీఎం మండలిలో అన్నారు.  ప్రధాని ప్రకటనతో ఆశయ సిద్దికి మార్గం సుగమమయిందని కనీసం ఇప్పుడైనా సహకరించాలని బిజెపి సభ్యులను కోరారు.

మొత్తం మీద, ఆదివారం జరిగిన రాష్ట్ర శాసనసభ, మండలి సమావేశాలు, ఆ సమావేశాల్లో బీసీ-ఇ, ఎస్టీ రిజర్వేషన్ల పెంపుదల బిల్లు ఆమోదం పొందడం, సీఎం కేసిఆర్ రాజకీయ విజ్ఞతకు నిదర్శనం. ప్రజలకు లాభం చేకూరే విషయంలో కేసీఆర్ ప్రదర్శించిన పట్టుదల, అందర్నీ కలుపుకుని పోవాలనే ఆలోచన, అవసరమైతే ఎంత దూరమైనా పోవాలన్న నిర్ణయం, ఆయన నాయకత్వ పటిమకు నిదర్శనం. నిజమైన నాయకుడేవరనే దానికి ఒక నిర్వచనం ఉదహరించడం జరిగింది...."నీ చర్యలు, ఇతరులను, మరిన్ని కలలు కలగనడానికి, మరింతగా చైతన్యం కావడానికి, మరి కొన్ని గొప్ప గొప్ప పనులు చేయడానికి దోహదపడగలిగితే....నువ్వే నిజమైన నాయకుడివి". ఇది బహుశా పూర్తిగా కేసీఆర్ కు వర్తిస్తుందేమో! కాపు నాయకుడు, ఆంధ్రాప్రాంతానికి చెందిన ముద్రగడ పద్మనాభం, సీఎం కేసీఆర్ కు రాసిన లేఖ, అందులో రిజర్వేషన్ల పెంపుదల విషయంలో తెలియచేసిన అభినందనలు, సీఎం ను అసలు సిసలైన నాయకుడిగా  కొనియాడడం, సందర్భోచితంగా వుందనాలి. 

Wednesday, April 19, 2017

Rights of State .... New Chapter in Center-State Relations : Vanam Jwala Narasimha Rao

Rights of State
New Chapter in Center-State Relations
Vanam Jwala Narasimha Rao
On Sunday the 16th April 2017, when the Telangana Backward Classes, Scheduled Castes and Scheduled Tribes (Reservation of Seats in Educational Institutions and of Appointments or Posts in the Services under the State) Bill, 2017, was passed in the Telangana State Legislative Assembly and Council, it was a historic moment. Simultaneously, yet another historic event has also been unfolded, by way of the firm resolve of Chief Minister K Chandrashekhar Rao asserting the rights of the State and opening up a new chapter.

It may not be out of context to recall here, the PM Narendra Modi statement while he was Gujarat CM, on the 2012 Republic Day that the Center's “systematic onslaught on the federal structure” is causing concern. He said then that, “It is high time the Center realizes that giving to the states what rightfully belongs to them will not weaken the Center. The states must co-ordinate with the Union Government and not remain subservient to it. Co-operative and not coercive federalism must be the norm in our country”.

 Perhaps it is with the same courage and fervor CM KCR confessed in more than several words his strategy towards preparing the ground work for getting the approval of the enhanced reservation quota for the Muslim Minorities in the form of BC-E category as well as that of Scheduled Tribes. During his interventions in the Assembly debate, the CM has categorically said that, “I am not going to beg! I am going to fight! I will mention it in the Niti Aayog meeting. I will approach the Apex Court if needed.”

The CM cited the examples of five states in the country, including Tamil Nadu, which are implementing more than 50% quota. He said the Supreme Court has allowed more than 50% quota under special circumstances, which, he claimed, also prevail in Telangana. The “Quantifiable” and “Impeccable” data that has been mentioned by the Apex Court in its judgment for increasing of percentage of reservations by any state is prudently applicable in case of Telangana according to CM.

The CM said, “The Center should also allow the States to take decisions on certain important policy matters like the reservations based on each state’s requirement and population as well as other ground realities. In a vibrant and matured democracy like ours, the Center should allow the State’s to take a call. The situation now prevailing in the country is vastly different from that of 1947 when the country attained independence. We have made our Constitution 70 years ago. Now there is an increase in population, more awareness and more opportunities. People are demanding more and more. If we want our country to progress and move forward, leave the reservations issue to the respective states. When we fought against injustices and discrimination meted out to Telangana everyone supported us. Unity in diversity is our principle. Decisions should be taken accordingly or else there will be clashes and movements”. 

In this context, he mentioned about the SC Categorization issue, which had broad support from the people in the Telangana State. CM said that: “It may not be an issue in UP but in Telangana it is a big issue. Such issues should be left to the each state government to take a decision. The center should respect our decision. Parties may change at the Center but the Central government is a continuous entity. Tamil Nadu Passed the Bill during the UPA regime and NDA were left with no option except to continue with it”.


This move clearly brings to the forefront perhaps CM’s desire to convert the issue of reservation hike for the Muslims into a national debate and if needed to take along with him the national leaders like Mulayam Singh Yadav of Samajwadi Party and Mayavathi of the BSP. According to Newspaper reports, midway through the Assembly debate on the bill CM closeted with available TRS Party Parliament Members and asked them to hold preliminary meetings with national leaders and prepare the ground for his meeting with them during his next visit to New Delhi. 

As they saying go, ambition should be made of unyielding substance when it comes to helping the needy. This ambition is in abundance with the CM who has taken an historical decision to come to the rescue of the poor and the neglected sectors in the society. Be it fertiliser subsidy of Rs 4000 per acre, total loan waiver and free power supply to farmers, pensions for the single women, Beedi workers, financial assistance to the pregnant women and KCR Kits to the mother and child, or enhancing the reservation quotas to the BC-E Categories and STs…. All these historical and first of its kind in the country policy decisions have one aim in common, all round happiness and prosperity in the Telangana state and its people.

Bold and commendable leader the CM is, on Sunday he himself has piloted and introduced the historic Bill in the Special Session of the Telangana state Legislature, enhancing the quota for BC-E category from 4% to 12% and ST reservation from 6% to 10%. While the Congress and MIM supported the bill, the BJP opposed it. CM in opening brief said that the quota is being enhanced to fulfill one of the major election promises that his party had made. He said due procedure was followed and would be followed to implement the enhanced quota. KCR also mentioned about the necessity to increase the quota for Scheduled Castes by 1% to take it to 16%, which would in proportionate to the SC population in Telangana. Similarly, he said the quota for the Backward Classes would also be enhanced and the BC Commission has already been assigned the task to conduct a comprehensive study on the socio-economic status of BC communities and come up with recommendations to increase the quota.

The Chief Minister expressed confidence of overcoming all legal hurdles to implement the enhanced quota, which touched 62% as against the 50% ceiling set by the Supreme Court as per judgment in Indira Sahanee’s case.

The BJP’s strategy in the Assembly went awry after the Chief Minister intervened in the Council to read out media reports of Modi’s statement made in BJP’s national executive meeting in Bhubaneswar. “It is sheer good coincidence that the PM’s remark should come when a historic debate is on in the Council. PM Modi talked about the backwardness among the Muslims and he also talked about the inclusive growth. This gives me hope that the Centre accepts out bill,” KCR said and added that the way was now clear after the Prime Minister’s observations. “At least you should support the Bill in the wake of Prime Minister’s remarks,” Rao advised BJP.

In all, the Sunday Special session of the State Legislative Assembly and Council which passed the enhanced quota bill for the BC-E and STs, proved that CM KCR has the political will to implement policies that are beneficial to the people in the State. One of the quotes for a true leader is “If your actions inspire others to dream more, learn more, do more and become more, you are a leader.” This amply defines CM KCR. What else can be a proof than a letter written by former minister, famous Kapu community leader Mudragada Padmanabham to CM KCR praising him over the passing of the enhanced quota bill and commending him as the true leader of the people? End