Sunday, April 29, 2018

హనుమ ద్వారా రామలక్ష్మణుల చిహ్నాలను తెలుసుకుంటున్న సీత ..... ఆంధ్రవాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి? : వనం జ్వాలా నరసింహారావు


హనుమ ద్వారా రామలక్ష్మణుల చిహ్నాలను తెలుసుకుంటున్న సీత
ఆంధ్రవాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి?
వనం జ్వాలా నరసింహారావు
సూర్య దినపత్రిక (30-04-2018)
"తేజస్సు, యశస్సు, శ్రీ అనే మూడింటివల్ల వ్యాపించిన వాడు శ్రీరామచంద్రుడు. ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలలో ధర్మార్ధకామాలను ఆలోచించి చేస్తాడు. కళ్లు, దంతాలు తెల్లగా వుంటాయి. పరిశుధ్ధమైన మాతా, పితృ వంశాలున్నవాడు. సత్యం వీడనివాడు. స్వధర్మమందు విశేషమైన ప్రీతిగలవాడు. ధనార్జనలోనూ, దానం చేయడంలోనూ మిక్కిలి అసమానుడు. శ్రీతో నిత్యయోగం కలవాడు. రామచంద్రమూర్తి సవతి తల్లి కొడుకైనప్పటికీ, సొంత సోదరుడిలాగా వుండే లక్ష్మణుడు యుధ్ధమందు అజేయుడు. సద్గుణంలొ, రూపంలో, ప్రేమలో, రాముడిలాంటివాడే. వారిరువురూ నీకోసమై భూమంతా వెతుక్కుంటూ, మేమున్న చోటుకు వచ్చారు".

(రాముడిని గురించి చెప్పిన హనుమంతుడు, అతడు "బ్రహ్మచర్యనిష్ట" కలవాడంటాడు. బ్రహ్మచర్యం రెండువిధాలయింది. మొదటిది గృహస్థుడు రుతుకాలంలో మాత్రమే తన భార్యతో సంగమించి, తక్కిన రోజుల్లో స్త్రీ సాంగత్యాన్నే మానడం. రెండోది స్త్రీ సంభోగాన్నే పూర్తిగా మానడం. స్త్రీకి రజోదర్శనమైన నాటినుండి పదహారు రోజులు రుతుకాలమంటారు. వీటిలో మొదటి నాలుగు రోజులు నిశిద్ధం. పదకొండు, పదమూడు రాత్రిళ్లుకూడా పనికిరావు. తక్కిన పదిరోజుల్లో: ఏకాదశి, అమావాస్య, పౌర్ణమి పితృదినాలు కాబట్టి వదిలిపెట్టాలి. మిగిలిన రోజులు ప్రశస్తమైనవి. రుతుకాలంలో భార్యాభర్తలు ఆరోగ్యంగా వుండి, వీర్యాన్ని వ్యర్థం చేస్తే, భ్రూణహత్యా దోషం వస్తుంది. ఇదిముగ్గురు కొడుకులు కలిగేవరకేకాని ఆ తర్వాత ఈ నియమం లేదు. ఆ తర్వాత భార్యనుకూడా చెల్లెలి లాగానే చూడాలి. పరస్త్రీలను తల్లుల్లాగా చూడాలి. సరిదినాలందు కలిస్తే పుత్రులు, బేసిదినాలయితే పుత్రికలు కలుగుతారు. పదిహేనోరోజు రాత్రి పురుషుని కలిసిన స్త్రీకి, రాజపత్ని, పతివ్రత, శ్రేష్టులైన పుత్రులను కనే కూతురు కలుగుతుంది. పదహారోరోజైతే, విద్యాలక్షణ సంపన్నుడు, సత్యవాది, జితేంద్రియుడు, సర్వభూతాశ్రితుడగు కొడుకు పుడుతాడు.

ఇక స్త్రీ సంభోగమే మానడం రెండోరకమైన బ్రహ్మచర్యం. ప్రేమ, అభిలాష, రాగం, స్నేహం, ప్రేమం, రతి, శృంగారం, అనే ఏడురకాలైన సంభోగాలున్నాయి. అందగత్తెలను చూడాలన్న కోరికను "ప్రేమ" అంటారు. ఆ విషయమైన చింతే "అభిలాష". అలాంటివారితో సంగమించాలన్న బుధ్ధిని, "రాగ"మనీ, దానిపైనే మనస్సు వుంచడం "స్నేహ"మనీ, అట్టివారిని విడిచి వుండలేకపోవడం "ప్రేమం" అనీ అంటారు. వారితో కలిసి-మెలిసి తిరగడం, "రతి", క్రీడించడం, " శృంగారం ". ఈ ఏడింటినీ సంభోగమనే అన్టారు.

స్త్రీలతో ఒంటరిగా మాట్లాడడం, వారితో తల దువ్వించుకోడం, తలంటి పోయించుకోవడం, స్పృసించడం, నిశిద్దం. స్త్రీలు తల దువ్వుకుంటున్నప్పుడు, పడుకున్నప్పుడు, స్నానం చేసేటప్పుడు చూడరాదు. వయస్సున్న స్త్రీలను, పీనుగుల్లాగానన్నా చూడాలి  లేదా, ఐదారేళ్ల పిల్లవాడిలాగానన్నా వుండాలి. ఈ బ్రహ్మచర్య గుణాలన్నీ శ్రీరాముడిలో వున్నాయని హనుమంతుడు చెప్పాడు.

(హనుమంతుడు మొదలు, శ్రీరాముడి ఆత్మ గుణాలను వర్ణించి, తర్వాత దేహ గుణాలను వర్ణిస్తాడు. "తేజస్సు-యశస్సు-శ్రీ" ల వల్ల వ్యాపించినవాడంటాడు. బ్రహ్మచర్య నిష్ట గలవాడంటాడు. రాముడిని వర్ణించిన హనుమంతుడు, ఆయన్ని గురించి చాలా నిగూడంగా చెప్తాడు. స్పష్టంగా చెప్పి వుండేవాడే కాని, అలా చెప్తే చెప్పడం తెలియని వాడని, అడవి మనిషని, సీత అనుకొని వుండేది. "లింగం, వృషణం" గురించి కూడా చెప్పాడు. ఔచిత్యం పాటించక పోతే, " ఇటువంటివాడు రామ దూతగా వుండజాలడు " అని సీతాదేవి తీర్మానించేదే! అసలామె ప్రశ్న వేసింది కూడా హనుమంతుడెలా చెప్తాడని తెలుసుకునేందుకే! జరిగిన విషయాన్ని రామలక్ష్మణుల శుభ లక్షణాలను విలక్షణంగా వర్ణించిన హనుమంతుడు ఎక్కడా తన ఔన్నత్యాన్ని చెప్పుకోలేదు. ఆత్మస్తుతి చేసుకోలేదు. ఇంత ఘనకార్యంవర్ణించి చేసికూడా ఇదంతా రాముడి చలవే అని తలవంచి సవినయంగా విన్నవించగల నిరుపమ వినయశీలి హనుమంతుడు.)


శ్రీరామ సుగ్రీవులెలా కల్సుకున్నారో సీతాదేవికి చెప్పిన హనుమంతుడు
"సీతకొరకై వెతుకుతున్న శ్రీరామలక్ష్మణులు మేమున్నచోటుకు వచ్చారు. అన్నరాజ్యంలోంచి వెళ్లగొట్టబడి, ఋశ్యమూకాద్రిపై మేమందరం సేవిస్తుండగా, భయపడుతూ నివసిస్తున్న సుగ్రీవుడు, నారచీరెలు ధరించి, చేతులో బాణాలలతో వస్తున్న వారిని చూసాడు. చూసి భయపడి వారెవరో తెలిసికొనిరమ్మని నన్ను పంపాడు. నాకంటికి వారు మహాత్ముల్లాగా కనపడినందున, వినయంగా, చేతులు జోడించి, వారిదగ్గరకు పోయాను. నన్నాదరించి, గౌరవించిన వారిద్దరినీ, తీసుకునివచ్చి సుగ్రీవుడి ఎదుట నిలిపాను". (నేను-నేను, అను ఉత్తమ పురుష లక్షణం చెప్పడం అహంకారంతో కాదు. రామ, సుగ్రీవుల కలయికలో, తనకున్న సంబంధాన్ని, తాను లక్ష్మణుడిని ఎలా ఎరుగుదునన్న ప్రశ్నకు సమాధానంగా చెప్పడానికే అలా అన్నాడని అనుకోవాలి)

"కలిసిన రామ, సుగ్రీవులు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ, ఒకరినొకరు నమ్మారు. ఒకరి దుఃఖం ఇంకొకరికి చెప్పుకుని, సమాధాన పరుచుకున్నారు. తనభార్యను అపహరించాలనుకున్న ఆయన అన్న వాలి, సుగ్రీవుడిని వెళ్లగొట్టాడు. ఆ అవమానాన్ని సహించలేని సుగ్రీవుడిని నీ మగడు సమాధానపర్చాడు. వాలి, సుగ్రీవుల కలహకారణం ఇదే. నీ ఎడబాటుతో దుఃఖిస్తున్న శ్రీరాముడి చరిత్రను లక్ష్మణుడు సుగ్రీవుడికి చెప్పాడు. ఆ సంగతి విన్న సుగ్రీవుడు తేజోవిహీనుడయ్యాడు. గతంలో రావణాసురుడు, ఆకాశమార్గాన నిన్ను ఎత్తుకుని వెళ్తున్నప్పుడు, నువ్వు, భూమిమీద పడేసిన ఆభరణాలను నేను భద్రపరిచాను. వాటిని సుగ్రీవుడు రామచంద్రమూర్తికి చూపాడు. కాని, ఆయన మనస్సు సంతోషపడటానికి, నీ జాడ మాత్రం చెప్పలేకపోయాం. నీ ఆభరణాలను వళ్లో వుంచుకున్న రాముడు, శోకాగ్నితో కాలిన వాడిలాగా, వెక్కి, వెక్కి ఏడుస్తుంటే, స్మృతి తప్పినప్పుడు, నేనే, మూర్ఛపోకుండా చేసి ఓదార్చాను".

Saturday, April 28, 2018

వాల్మీకి అసమాన కవితా చాతురి వర్ణనాతీతం....శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-6: వనం జ్వాలా నరసింహారావు


శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-6
వాల్మీకి అసమాన కవితా చాతురి వర్ణనాతీతం
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రభూమి దినపత్రిక (29-04-2018)
లక్ష్మణుడు రాముడితో అరణ్యాలకు వెళ్లే ముందర తల్లికి నమస్కారం చేసినప్పుడు, సుమిత్రా దేవి కుమారుడికి చేసిన బోధనను తెలియచేసే శ్లోకానికి పండితులు అనేక అర్థాలను చెప్పారు. అందులో సార్వజనీన సమ్మతమైనవి-ప్రధానమైనవి మూడర్థాలు. సంగ్రహంగా అవి:

మొదటిది: "ఇదివరకు నీవు రాముడికి కుడిచేతిలా, వెలుపల ప్రాణంలా వుండేవాడివి. ఆ భక్తితోనే ఇప్పుడు ఆయన వెంట అడవులకు పోతున్నావు. ఇదివరకు రాముడు మహారాజ కుమారుడు. పట్టణంలో అనేక భోగాలను అనుభవిస్తుండే వాడు. నువ్వూ అలానే సుఖానికి హాని లేకుండా అన్నను కొలుస్తుండే వాడివి. ఇక మీద అలా కాదు. చేయబోయేది సకల దుఃఖ నిలయ కాననవాసం. అదికూడా ఒక రోజు కాదు. 14సంవత్సరాలు. పరివారంతో కాదు-ఒంటరిగా. నువ్వే పరిచారకుడవు. అలాంటి కష్ట కాలంలో నీకు విసుగు కలగవచ్చు. జ్ఞాత వెంట నేనెందుకు కష్టాల పాలు కావాలని అనుకుంటావేమో. అలా భావించ వద్దు. అడవిలో వున్నా, పట్టణంలో వున్నా, ధనికుడైనా, దరిద్రుడైనా తండ్రి ఎలా పూజనీయుడో, పితృసమానుడైన రాముడలానే. తండ్రిమీద ఎలాంటి గౌరవం వుంచాలో అలాంటిదే శ్రీరాముడి మీదుంచు. అలానే, నామీద నీకెలాంటి గౌరవం వుందో అలాంటిదే సీత మీదుంచు. అడవిని దుఃఖాలయంగా భావించ వద్దు. సుఖమైన అయోధ్యగా భావించు. సుఖ దుఃఖాలు మనఃకల్పితాలు. నీ మనస్సు నీ వశంలో వుంటే ఎక్కడున్నా నీకు సుఖ దుఃఖాలు సమానమే".

రెండోది: అదే "రాముడ యెరుంగుమీ దశరథుడు నిజము" అన్న సుమిత్ర మాటలకు మరో అర్థం రాముడు అడవులకు పోయిన తర్వాత ఆయన తండ్రి జీవించడని-అది నిజమని. "నీ తండ్రి ఎప్పుడు మరణించునో అప్పుడు నా గతేంటి? ఇక్కడే మో కైక ప్రభుత్వం. ఆమెకు నా మీద ద్వేషమన్న సంగతి నీకు తెలిసిందే. నీ తండ్రి లేకుండా, రాముడు లేకుండా, నువ్వూ లేకుండా నన్ను కైక ఇక్కడ వుండనిస్తుందా? కాబట్టి నేను పుట్టిల్లు చేరాల్సినదాన్నే. అక్కడ నాకు ప్రతిష్టేముంటుంది? దశరథుడి భార్య అన్న గౌరవం నశించింది. అక్కడివారు మన రాజు కూతురు పుట్టింటికి వచ్చిందని నన్ను-నా తండ్రిని చులకనగా అంటారు. అలాంటప్పుడు అయోధ్య గతి ఏమందువా? అయోధ్యే అడవి కాగలదు".

మూడోది: "కుమారా-నేనెందుకు జ్ఞాతైన రాముడి వెంట అడవికి పోయి ప్రాణాపాయానికి లోనుకావాలనీ, నన్నెవ్వరు పొమ్మన్నారనీ, నాకై నేను చెట్టు కొట్టి మీద వేసుకొనడమెందుకనీ, నేను పోతే కలిగే లాభమేమిటనీ, పోకపోతే నష్టమేంటనీ సందేహిస్తున్నావేమో ! అలాంటి ఆలోచనలు చేయవద్దు. లక్ష్మీనారాయణులుండే స్థలమే వైకుంఠం. అడవియే వైకుంఠం. అలాంటి ఏకాంత సేవ దొరకడం దుర్లభం. కాబట్టి-నాయనా, తదేక ధ్యానంతో భగవత్ సేవను అరణ్యంలో చేసుకో" అని బోధించెను.

ఇలా నానార్థాల పద్యాలను అన్వయించేందుకు ఆంధ్ర వ్యాకరణ సూత్రాలను సమయోచితంగా అనుసంధానం చేసుకోవాలి.


అలంకార శాస్త్రంలో ఎన్ని అలంకారాలు చెప్పబడ్డాయో, అవన్నీ వాల్మీకి (ఆంధ్ర వాల్మీకి) రామాయణంలో వున్నాయి. వాల్మీకి అసమాన కవితా చాతురి వర్ణనాతీతం. మరొక్క ఉదాహరణ చిత్రాలంకార ఉపయోగం. రావణుడు సీతాదేవిని అపహరించిన తర్వాత, శ్రీరాముడు ప్రియా వియోగానికి దుఃఖిస్తూ, అడవిలో జనులెవ్వరూ వుండకపోవడంతో, కళ్లకు కనిపించే పక్షి-వృక్ష-మృగాలను సంబోధించుకుంటూ పోతూ-పోతూ, రావణుడు జటాయువుతో యుద్ధం చేసిన స్థలానికి సమీపంలో వున్న ప్రస్రవణగిరిని చూస్తాడు. చూసి " ఓ పర్వత రాజా ! నా వల్ల ఒంటరిగా, రమ్యమైన ప్రదేశంలో విడువబడిన సర్వాంగ సుందరైన సీత నీ చేత చూడబడెనా" అన్న ప్రశ్న వేసిన శ్లోకం (పద్యం) చక్కటి చిత్రాలంకారం. వృక్షాలకు-నదులకు వలె కాకుండా, కొండలకు ప్రతిధ్వని ఇచ్చే గుణం వుంది. దీన్ని మనస్సులో పెట్టుకున్న కవి ఈ శ్లోకాన్ని (పద్యాన్ని) రచించారు. ప్రతిధ్వనిలో మనం అన్న మాటలే మనకు తిరిగి వినపడ్తాయి. "నీవు చూశావా?" అంటే "నీవు చూశావా?" అని ప్రతిధ్వని వస్తుంది. అలా వినబడిందని రాస్తే సారస్యం లేదనుకున్న వాల్మీకి ప్రతిధ్వనిగా వినపడిన శ్లోకాన్ని " ఓ రాజ శ్రేష్టుడా ! రమ్యవనదేశమందు నీ చేత ఒంటరిగా విడువబడిన సర్వాంగ సుందరి నా చేత చూడబడె" అని అర్థం వచ్చే ట్లు రాశారు. ఇలా ప్రశ్న-జవాబు ఒక్క వాక్యంగానే వుంటే చిత్రాలంకారం అవుతుంది. ఇంత దీర్ఘంగా ఊహించి రాసిన కవి ఇంతవరకూ ఒక్క వాల్మీకే. అలంకారాల వరకెందుకు? సాధారణ విషయాన్ని చెప్పాల్సి వచ్చినప్పుడు కూడా ఏదో ఒక చమత్కారాన్ని కనబరిచేవాడు.

వాల్మీకి రామాయణంలోని పాత్రలు-పాత్రధారుల వాక్కులు, ఆయా పాత్రల చిత్త వృత్తి గుణాలను తెలియచేసేవిగా, సందర్భోచితంగా, వారున్న అప్పటి స్థితికి అర్హమైనవిగా వుంటాయి. దశరథుడి మృతి గురించి కైక భరతుడికి చెప్తూ, "ఎల్ల భూతములకు నెయ్యదిగతి నీదు తండ్రి యట్టిగతికి దనయ యరిగె" అని అంటుంది. తానేదో ఘనకార్యం సాధించినట్లు కైక చెప్పిన పద్ధతిలో, తన భర్త చావు గురించి, తన కుమారుడితో ఏ తల్లైనా చెప్తుందా? ఇదే వాల్మీకిలోని ప్రత్యేకత. ఇదే వార్తను భరతుడు శ్రీరాముడితో మరోలా చెప్తాడు. "నిను దలంచియ యేడ్చుచున్.... ..... నీదు దర్శన కాంక్షియై..... ..... జనకు డక్కట యస్తమించెను జాల నిన్నె స్మరించుచున్" అని దీనోక్తిగా అంటాడు. వినాశ కాలానికి నోటినుంచి విపరీత వాక్యాలే వస్తాయి. శుభ వాక్యాలు, అశుభ వాక్యాలుగా అవుతాయి.

మరో సందర్భంలో, మొట్టమొదట వానరుల మీదకు యుద్ధానికి పొమ్మని ధూమ్రాక్షుడుని ఆజ్ఞాపించాడు రావణాసురుడు. ఆజ్ఞాపిస్తూ, "నీవు వధార్థమై మదవ నేచరయుక్తుడు రాముమీదికిన్"  అంటాడు. రావణుడి కోరిక రామాదులను చంపటానికే అయినా, "నువ్వు చావడానికి" అన్న విపరీతార్థం వచ్చింది ఆయన మాటల్లో. శ్రీరామచంద్రుడు ఎలా "ఆత్మవంతుడో" అలానే కుంభకర్ణుడు "వపుష్మంతుడు". అతడిది సహజ శక్తి. వరబలం కాదు. కేవలం దేహం మీదే దృష్టి నిలిపేవాడి కుండే పెద్దదేహముందతడికి. బలం, తాగుబోతు దనం, నిద్దురబోతుదనం, తిండిబోతుదనం లాంటి గుణాలన్నీ పరిపక్వదశకొచ్చి వాడిలో నిలిచాయి. ఇలాంటి వాడు, తను రాముడి మీదకు యుద్ధానికి పోతానని రావణుడితో అంటాడు. ఆయన చెప్పిన మాటల్లోనూ విపరీతార్థం స్పష్టంగా స్ఫురిస్తుంది. ".... బోదు హతుడుగాగ, రామవిభు డక్షయంబుగ రమణి సీత బొంద గలుగును..." అని  కుంభకర్ణుడుతో అనిపించాడు వాల్మీకి.

Thursday, April 26, 2018

TRS set for key role in Central Government post polls : Vanam Jwala Narasimha Rao


TRS set for key role in Central Government post polls
Vanam Jwala Narasimha Rao
The Hans India (27-04-2018)

Media is abuzz with reports that the General elections will be held in the next September or December. Even if they are held on schedule it will be four months after December. It is certainly no cakewalk for Modi to come back to power. There is every possibility that a non-NDA, non-UPA coalition of aligned or non-aligned regional parties may come to power at the center in which TRS would probably play key role. The announcement by Telangana Chief Minister K Chandrashekhar Rao, that, he would lead a non-BJP, non-Congress Indian National People Front, which would be a consortium of regional parties further adds strength for an alternate political force coming to power at the centre after 2019 elections. 

Following 2014 Lok Sabha Elections ten small and marginal parties in addition to Shiv Sena (18 members) and TDP (16) supported the BJP which has a strength of 280 on its own. There are however 32 namesake parties in the NDA. In the Opposition, the Congress has 46 MPs, AIADMK 37, Trinamool Congress 33, BJD 20 and TRS 12. Prime Minister Modi has proudly declared that the BJP is in power in 19 States, which is higher than the Congress in 18 States during the Prime Ministership of Indira Gandhi. 

While this is the present scenario, in the next general elections, there is every possibility of a non-NDA, non-UPA coalition government of regional parties at the Centre. The regional political parties would prefer a Prime Minister candidate of their choice from among themselves than supporting the candidature of someone either from the BJP or Congress. Everyone is busy drafting their own strategies. The BJP and Congress parties would like to contest on their own, win as many seats as they can and then think of alliance after the polls.

The reason for this as far as the BJP is concerned is to safeguard itself against the anti-incumbency factor. Due to its policies of demonetization and GST the BJP having bought the wrath of the people is pushed to the corner of defeat. Hence the BJP think tank believes that it should contest the polls on its own and try for an alliance after the polls leaving the alliance partners try their luck independent of BJP. NDA allies are also of the same view and they want to be away from the BJP shadow. If the polls are held either in 2019 or before the schedule in advance as is being reported in the press, regional parties have their way is what the political analysts opine. Telugu Desam has already left NDA and has become a bitter enemy of Modi.

Several pertinent changes took place in the election scenario during the last seven decades, since the first general elections. These need to be viewed from different angles. One major development that is perceptibly noticed is the progression of regional parties over a period gradually and they are literally ruling the roost. The regional parties, which were having their presence in a state or two in the beginning, have virtually spread over majority of the states and are able to win large number of Parliament seats too.  The percentage of votes polled by the regional parties is far more than that of the national parties. As against the deteriorating national parties influence at the national level the regional parties are gaining ground and influence. To comprehend the impact of this phenomenon on the forthcoming elections it needs a deep-rooted analysis considering certain elementary issues.

whilst from one side the national parties are weakening day-by-day and from the other side the regional parties are gaining strong hold, it may not be possible for the national parties to secure majority seats to form government at the Centre on their own. They cannot even reach the magic figure. Hence there is no option left for the national parties to have alliance with the regional parties. In which case the question is, would the alliances be before or after the election? In 2009 elections, the alliance took place after the polls. If the alliance is before the poll the survival of the alliance is better than if it’s done later since it will be subjected to threats, black mail etc.Both NDA’s government from 1999 to 2004 and the UPA government from 2004 to 2014 survived full term despite frequent threats of instability. In 2009 the UPA government had to face the political uncertainty due to problems created by the regional parties. In 2014, since BJP got the required majority on its won it had no problem in Lok Sabha but had to face a tough time in Rajya Sabha and must depend on others where it is not in majority.

In seven decades of Indian Political history when regional parties started dominating over national parties, the election scenario had undergone drastic transformation. Election after election the number of political parties has been on the increase. In 1952 General Elections, only 55 political parties were in the fray whereas the number went up to 370 by 2009. In 1957 only 19 parties were in fray and it was the highest in 2009 polls and the number may grow further in the next elections. Among the 55 parties that were in the fray in the first general elections, 18 were state level parties, 29 registered and just 8 were national parties. The number of national parties contested in 2004 elections was reduced to a meagre 6 out of a total of 230 and at the same time there were 36 regional and 188 registered parties in the fight. This means while the number of regional parties is on the increase that of national parties is on the decrease. 22 parties had representation in the first Lok Sabha whereas the number had gone up to 37 parties after the 2009 elections.

The regional parties who took birth fighting against the national parties in the State Assemblies have now grown to a level where they can dictate terms to the national parties. In States like Tamil Nadu, the fight is between the two regional parties and the national parties have no role to play. The percentage of votes polled for the national parties is much less than that of the regional parties which is visible more from 1996 onwards. The BJP, which secured majority in 2014 could poll just 31 percent of votes and with its allies it is only 38 percent. The Congress polled 19.3 percent on its own and together with its allies it is 23 percent. Both the BJP and Congress together got only 50 percent of votes while the rest is that of the regional parties.

Regional parties which could secure 11.2 percent in 1984 improved to 28.4 percent by 2009 and 50 percent by 2014. This goes without saying that in the next polls, the national parties will not get more than 250 seats. The voters feel that regional parties are better, and not only the states should be ruled by them but also should have enough strength to dominate the national scenario at the center.

This proves that in the next general elections, regional parties will rule the roost and will leave no stone unturned to form government at the center on their own. The regional parties or the consortium of parties put together may win more than 250 seats and if they form into a separate front, the national parties will get into problems. The government at the Centre after the next general elections will be a non-BJP, non-Congress coalition of a consortium of regional parties and the TRS will play a key and crucial role in its formation and survival. Already as a prelude to this several political leaders like Mamata Banerjee, Stalin, Hemanth Soren, Biju Patnaik, Ajit Jogi, Deve Gouda and many more have expressed their solidarity with the idea of KCR’s National Political alternative of non-Congress, non-BJP parties.  

Wednesday, April 25, 2018

వైద్య సేవల వినూత్న విధాత : వనం జ్వాలా నరసింహారావు


వైద్య సేవల వినూత్న విధాత
(డాక్టర్ అయితరాజు పాండురంగారావు)
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రజ్యోతి దినపత్రిక (26-04-2018)
      నాలుగు సంవత్సరాలపాటు లండన్ తో సహా ఇంగ్లాండ్ దేశంలోని పలు మహానగరాల ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసి, గైనకాలజీ, ట్రాపికల్ మెడిసిన్, చైల్డ్ హెల్త్, అనస్తీషియా లలో నాలుగు డిగ్రీలు పొంది, భారతదేశానికి తిరిగొచ్చిన ఏ డాక్టరైనా కోరుకునేది హైదరాబాద్, వరంగల్ లాంటి పట్టణాలలో ఉద్యోగం. అలా ఇవ్వడానికి అలనాటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా కూడా వుంది. దానికి విరుద్ధంగా ఒక యువకుడు, హైదరాబాద్ నగరంలోని ఉమ్మడి రాష్ట్ర  వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ ను కలిసి, తనను గిరిజన ప్రాంతమైన భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో మెడికల్ అధికారిగా నియమించామని కోరడంతో డైరెక్టర్ ఆశ్చర్యపోయి, అలా మారుమూల ప్రాంతంలో పనిచేయడానికి ఒకరు ముందుకొచ్చినందుకు సంతోషించి, ఆ యువకుడు కోరినట్లుగానే పోస్టింగ్ ఇచ్చాడు. ఆ యువకుడే ఇటీవల ఏప్రియల్ 15 న మరణించిన డాక్టర్ అయితరాజు పాండురంగారావు. ఆయనే 108, 104 అంబులెన్స్ సహాయ సేవల రూప శిల్పి, వ్యూహకర్త.

  1957 సంవత్సరంలో ఖమ్మం కళాశాల నుండి పీయూసీ లో అత్యున్నత శ్రేణిలో ఉత్తీర్ణుడై, వైద్య విద్య అభ్యసించాలని లేకున్నా తండ్రి కోరిక మీద హైదరాబాద్ గాంధీ మెడికల్ కాలేజీలో చేరి ఎంబీబీఎస్ డిగ్రీ సంపాదించి కొన్నాళ్ళు ఖమ్మంలో, కొన్నాళ్ళు గిరిజన ప్రాంతమైన బూర్గుంపాడులో డాక్టర్ గా ఉద్యోగం చేసి పై చదువుల కొరకు, సమాంతరంగా ఉద్యోగం చేయడానికి ఇంగ్లాండ్ వెళ్ళారు డాక్టర్ రంగారావు. ఇంగ్లాండ్ లో వున్నప్పుడు, పామ్టీఫ్రాక్ట్, పార్క్ ఆసుపత్రి, నాటింగ్ హాం, చెల్మ్స్ ఫోర్డ్, త్రేద్గేర్, మాంచెస్టర్ లాంటి పలు ఆసుపత్రుల్లో పనిచేసారు.

డాక్టర్ అయితరాజు పాండురంగారావు బహుళ ప్రత్యేకతలు కలిగిన వ్యక్తిగా, బహుముఖ సేవలందించిన వైద్యుడిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెడ్ క్రాస్ సొసైటీ కార్యదర్శిగా, ఏపీ వికలాంగుల కార్పోరేషన్ మేనేజింగ్  డైరెక్టర్ గా, భారత దేశ శాంతభద్రతల పరిరక్షణ (ఐపీకేఎఫ్) ప్రతినిధిగా శ్రీలంకకు వెళ్లిన బృంద సభ్యుడిగా, 108-104 ఆరోగ్య వైద్య అంబులెన్స్ సేవలను తెలుగు రాష్ట్రాలతో పాటు, భారత దేశంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించడంలో వ్యూహకర్తగా,  పలు వైద్య ఆరోగ్య సంబంధిత అంశాల పట్ల ఔపోసన పట్టి, ఎన్నో సంస్థలకు సలహాదారుగా నిలిచి, వైద్య రంగంలో ఆసియా ఖండంలోనే హైదరాబాద్ ను మెడికల్ హబ్ గా రూపుదిద్దుకునేందుకు తనదైన పాత్ర పోషించిన వ్యక్తిగా ఆబాలగోపాలానికి చిరపరిచితులు. ఏప్రిల్ 15,2018 హైదరాబాద్ లో వారు స్వర్గస్తులయ్యారు.  తెలంగాణలోని ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వల్లభి గ్రామ వాస్తవ్యులైన డాక్టర్ రంగారావు సెప్టెంబర్ 20,1942లో  నాటి ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా ఖంబంపాడు (బ్రిటిష్ పాలనరోజుల్లో మద్రాసు ప్రెసిడెన్సిగా పిలవబడేది) అనే చిన్న గ్రామంలో మాతామహుల ఇంట్లో జన్మించారు. ఒక కుగ్రామంలో జన్మించిన ఆయన అంతర్జాతీయంగా పేరుగాంచిన వైద్య ఆరోగ్య సలహాదారుగా ఎదిగారు.
  
“దైవం మానుషరూపేణ” అన్న చందాన ఆయన సమాజానికి చేసిన సేవలు అజరామరం. కుటుంబానికి పెద్ద దిక్కుగా నిలుస్తూ ఒక పెద్ద ఉమ్మడి కుటుంబంలో అందరి ఆలనాపాలనా చూస్తూ, స్వంత కోరికలను, అవసరాలను పక్కన పెట్తూ జీవిక సాగించారు. తనవద్దకు అవసరం నిమిత్తం వచ్చే ప్రతీ ఒక్కరికి ఆయన మానవీయతను, దాతృత్వాన్ని పంచారు. ఆయన మాటల నుండి అందరూ ఒకరకమైన విజ్ఞతను పెంచుకునే వారు. ఆయన చేతలనుండి వినయం, ఆయన అందించే సేవలనుండి  కరుణ గ్రహించారు. ఆయనను అభిమానించే వారికి, అనుసరించే వారికి రంగారావు, మండే ఎండలో చల్లని నీడగా,  వణికించే చలికి వెచ్చని తోడుగా వుండేవారు.   75 సంవత్సరాల జీవణ గమనంలో రంగారావు ఎన్నో కష్ట సుఖాలను, ఒడిదుడుకులను ఎదురీది మేరునగ దీరుడిగా నిలిచి, సాదించాల్సిన దానిపై దృష్టి పెట్టి సమాజంలో తాను పొందాల్సిన దానికి మించి అందించారు. 

     “కదలాడే జ్ఞాపకాలు” (హాపింగ్ మెమోరీస్) పేరిట ఆంగ్లంలో వెలువడనున్న ఆయన ఆత్మకథలో డాక్టర్ రంగారావు తన జీవిత గమనాన్ని, కంభంపాడు నుండి హైదరాబాద్ వరకు సాగిన జీవన ప్రస్తానంలో చెరగని ముద్రలను, జ్ఞాపకాలను ఆవిష్కరించారు.  తన చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ  రంగారావు మాటల్లో... ‘‘వేయించిన కాఫి గింజల సువాసన, తిరగలి చేసే వింత శబ్ధం, గుప్పున వదిలే బీడి పొగల సుడులు, ఎర్రగా మండుతున్న కట్టెల పొయి... వంటి జీవిత పార్శ్వాలు అన్నీ సునిశిత పరిశీలనలో భాగాలు.... చూరు గుంజకు కట్టిన బట్ట ఉయ్యాలలో జీవితాంతం ఓలలాడలని తపన వెంటాడం, చిన్నప్పుడు నెలకొసారి బలవంతంగా పట్టించే ఆముదం, తద్వారా కడుపు శుద్ధి కావటం అన్న అంతర్లీన ఆరోగ్య సూత్రం, అందుకు వారిస్తున్న నోరు తెరిచి  రెక్కలు విరిచి తాగించే వైనం, అన్నీ మధుర జ్ఞాపకాలే’’ అంటారు.   గతాన్ని సృషించే నేపథ్యంలో... ‘‘ఉదయం లేవగానే ఆరగించే అల్పాహారం తినడానికి 10మంది పిల్లలకు పెద్దలు, రాత్రి మిగిలిన చద్ధన్నంలో పెరుగు  కలిపి ఆవకాయ నంజుకు పెట్టి అందరికీ ముద్దలు తినిపించటం, అమృత ప్రాయంగా ఆరగించటం’’ అనే వైనాన్ని వివరించారు. 


     ప్రభుత్వ ఉద్యోగంలొ తలమునకలుగా పదవీ కాలాన్ని నిర్వర్తించినప్పటికీ, ఉద్యమ కార్యకర్తగా, అనేక జాతీయ-అంతర్జాతీయ ప్రాజెక్టులకు సలహాదారుగా రంగారావు సేవలందించేవారు.   రాజకీయాలలో క్రీయాశీలకంగా వున్నప్పటికీ రాజకీయ పార్టీలతో మాత్రం సంబంధం పెట్టుకోలేదు.  ఒకానొక సందర్భంలో, నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రేస్ పార్టీ అధ్యక్ష పదవికి నాటి ప్రధాని, స్వర్గీయ రాజీవ్ గాంధీ ఆయన పేరు ప్రతిపాదించారు. ఇది చాలామందికి తెలియని విషయం. సున్నితంగా దాన్ని ఆయన తిరస్కరించారు.

     ప్రభుత్వ సర్వీసులో 1966లో చేరిన ఎపి. రంగారావు ఆ రంగంలో విజయవంతంగా విధులు నిర్వర్తించటంతో పాటుగా వృత్తిని, సంఘ సేవ చేయటమనే ప్రవృత్తిని జోడించి ఆ క్రమంలో విజయం సాధించారు.  ఇందుకు చక్కని ఉదాహరణలు జైపూర్ ఫుట్ సృష్టికర్త డా. సేథీ సాంగత్యం  కావచ్చు, కుష్టు వ్యాధి నివారణలో తన పాత్ర పోషించటం కావచ్చు, వైద్య రంగంలో నూతన ఆవిష్కరణలు చేపట్టటంలో  కావచ్చు,  రెడ్ క్రాస్ సంస్థతో అనుబంధం కావచ్చు,  చేతన అనే ప్రభుత్వేతర సంస్థతో అనుబంధం కావచ్చు, అప్పటి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీమతి కుముద్ బెన్ జోషీ స్థాపించిన నేషనల్ ఇన్సిట్యూట్ ఆఫ్  సోషల్ యాక్షన్ కావచ్చు,  ఈ విధంగా నిరంతర  సేవల ద్వారా ప్రవృత్తి  రీత్యా ప్రజలకు ఆయన చేరువ  కావటం జరిగింది.  

     రంగారావు తన ఆత్మకథలో వివరించిన విధంగా  రెడ్ క్రాస్ తో తన అనుబంధం, శ్రీలంక జాఫ్నా రక్తసిక్త యుద్ధ వాతావరణం, ఐపికెఎఫ్, ఎల్టీటిఇల మధ్య యుద్ధం సాగిన తీరు, గగుర్పాటుకు గురిచేస్తాయి.  ప్రతీ అంశాన్ని దృశ్య రచన కావింపబడిన తీరు యుద్ధంతో కూడుకున్న సినిమాను  మరిపిస్తుంది.   భయానక పరిస్థితుల్లోనూ నిశ్చల  మనస్సుతో ఆయన వ్యవహరించిన తీరుతెన్నులు అతని వివరణకు దర్పణంగా నిలుస్తాయి. రంగారావు ఎటువంటి భయానక పరిస్థితుల్లోను తన చెరగని చిరునవ్వును విస్మరించి ఉండకపోవచ్చు అనే సత్యం అందరూ గ్రహిస్తారు.  ఇన్నివిజయాలను సాధించిన రంగారావు నేతృత్వంలో ప్రజలకు ఉపయోగపడిన అనేక కార్యక్రమాల్లో 108 అంబులెన్స్ సేవలు అతి ఉన్నతంగా పేర్కొనాలి.  దేశానికే తలమానికంగా ఇది రూపకల్పన చేయబడింది.  లక్షలాది మందికి  ఆశాజ్యోతిగా 108 సేవలు ఆపద సమయాన నిలిచాయి. దేశ వైద్య రంగంలో ఎందరో ఆపన్నుల తలరాతలు మార్చగలిగిన ఏకైక సేవగా ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో అందించబడ్డాయి.  ఆలాగే డాక్టర్ రంగారావు కృషికి 104 సర్వీసులు, నిర్దిష్ట రోజుల ఆరోగ్య సేవలు, దూర వైద్య సేవలు కూడా తలమానికంగా నిలుస్తాయి. 

     అంతేకాకుండా డాక్టర్ రంగారావు కృషికి, అత్యవసర వైద్య సేవలు (ఇ.ఎమ్.ఎస్), జాతీయ సమాచార సేవలు (ఎన్.ఐ.ఎస్) ప్రభల నిదర్శనంగా నిలుస్తాయి. ఇ.ఎమ్.ఎస్ ద్వారా అత్యవసర వైద్యాన్ని ఉద్యోగ స్వామ్యంలోని సామాన్యుడికి, మధ్యతరగతి వారికి అందుబాటులోకి తేవడంతో పాటుగా స్వయాన రంగారావు పర్యవేక్షణలో రోజూవారి కార్యక్రమాల నిర్వహణ చేపట్టటం జరిగింది. అత్యంత ఖరీదైన వైద్యాన్ని మధ్య తరగతి వారికి చేరువ చేయటం అన్నది అతన చొరవకు, దార్శనికతకు అద్ధం పడతాయి. ఎన్.ఐ.ఎస్ వార్తా సంస్థ ద్వారా ఎన్నెన్నో వార్తా కథనాలు, విశ్లేషణలు అనేక వార్తా పత్రికల్లో ప్రచూరించటం జరిగింది. ఆంగ్ల తెలుగు భాషలలో అనేక పుస్తకాలు ఎన్.ఐ.ఎస్. ప్రచురించింది.

     రంగారావు “కదలాడే జ్ఞాపకాలు” నుంచి సమాజంలోని ఎన్నో కోణాలను, ఆనందాలను, బాధలను, దుఖాలను, విజయాలను, చిన్న చిన్న క్షమాపణలను, అద్బుత మానవ సంబంధాలను, కుటుంబంలో సఖ్యతను, సమాజంలో మెసిలే తీరును ఇలా ఎన్నో ఎన్నెన్నో పార్శ్వాలను పేర్కొనడం జరిగింది.  కేవలం ఆత్మకథగానే కాకుండా గొప్ప అనుభవాలను, సంఘటనలను, ముచ్చట్లను, కరుణ, ప్రేమ, మానవత్వం, సేవ వంటి మార్గాలను చూపుతూ....చక్కటి అర్ధవంతమైన పరిపూర్ణ జీవణానికి దిశానిర్దేశం చేస్తుంది.  విద్యావేత్తలకు, చరిత్ర కారులకు, పత్రికా విలేఖరులకు, సాంఘిక వేత్తలకు ఇలా మానవ విలువలను విశ్వసించే ప్రతీ  ఒక్కరికీ ఈ పుస్తకం ఉపయుక్తంగా వుంటుంది. 

(సంతాప సభ, పుస్తకావిష్కరణ, 27-04-2018 న సోమాజిగూడ లోని హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో సాయంత్రం 6-00 గంటలకు).

Monday, April 23, 2018

Exodus into TRS is an inevitability : Vanam Jwala Narasimha Rao


Exodus into TRS is an inevitability
Vanam Jwala Narasimha Rao
The Hans India (24-04-2018)

Thousands of persons belonging to different political parties, organizations, elected representatives and different sections of the society are joining the Telangana Rashtra Samithi. This is an out-and-out inevitability of political reunion and polarization. At a time when a new state has emerged thanks to decades of people’s struggle and movement led by KCR and at a time when a strong foundation is laid for achieving the dream of Golden Telangana, it is but natural, that persons elected on different party tickets joining the TRS.  For those who call it unethical, it simply means, that they do not understand the basic principles and essence of political reunion and polarization.  The reason for switching over allegiances to TRS stems from the fact that they are being fascinated to the government, to the Chief Minister, to his welfare and development schemes and the way CM is guiding the State towards the path of Golden Telangana. Another factor is that, the political parties of those elected representatives joining TRS, have failed miserably to play the role of true opposition required in a democratic set-up. And hence, these leaders have no option but leave the party.

Chief Minister K Chandrashekhar Rao repeatedly says, that, there were conspiracies and plots to break the formation of separate Telangana state all through the Telangana Statehood movements. Even after formation of the state, there were conspiracies too, to destabilize the newly formed state and hence there is a need for polarization and reunion of political process. Conspiracies were hatched against Telangana right from the 1969 movement spearheaded by Dr Marri Channa Reddy to 2014 when the state was formed following the second stage movement led by K Chandrashekhar Rao. If one studies the background and context of these movements, it would be clearly understood that switching of loyalties is not for mere political necessity but for a political polarization and reunion of political forces from a cross section. The strategy is to rebuild and stabilize the State.

In 2001, KCR all alone begun his movement with the sole aim of achieving the Telangana State. Later, some friends and likeminded joined him. KCR had held discussions with everyone on the strategy to take forward the movement. He also elicited the opinion of those who participated in the Telangana struggle in 1969 and they shared their experiences with him. He had explained to them his strategy of realizing the State through peaceful, democratic and political actions. But they disagreed with him and felt that with such a strategy Telangana State cannot be achieved. They wanted 1969 type of aggressive agitation, which KCR opposed. He asked them a simple question, “Do you want State fight or street fight” and told them in no uncertain terms that he preferred State fight but not the street fight. He also made it clear to them that by mere Jai Telangana slogan shouting, state will not be formed. It is possible only through diplomatic and strategic line of action said KCR. He had clarified then to them that the Telangana movement led by him was not against Andhra people as such and there will not be slogans like “Andhra Go Back” in this movement. He said, “we need a separate State for our share of waters, funds and employment opportunities but not against anybody.” He held thousands of hours discussions and brain storming sessions and told them Telangana State would be achieved through conviction and it will also be based on how the entire movement is conducted. He said if the entire Telangana society is pulled at one side, the state’s formation is possible. Finally, they understood the strategy of KCR and rallied behind him.

When Telangana Statehood movement picked up momentum, the then AP CM Chandrababu Naidu and some sections among Andhras have tried their best to water down the movement. They tried several methods and conspiracies and adapted a four-pronged strategy. Towards the strategy of divide and rule, they tried to divide the Telangana society. They resorted to character assassination of the leader leading the movement thereby trying to infringe at his credibility among the people. Then they spread falsehoods through the media. Lastly, they tried to crush the movement with the power that they had being in the government.


After 2004 elections KCR became the union minister and spent a lot of time in Delhi talking to all the political parties and convincing them for a separate state. He managed to get support for the Telangana formation from 36 political parties. He had meetings with CPI’s AB Bardhan and with BSP’s Mayawati. He had circulated a CD cut depicting the injustices meted out to the Telangana region, its agony to all the leaders in New Delhi. The CDs were sent to each MP, each political party. Everyone understood the agony of Telangana but were not sure about its formation due to the past experiences.

Late Dr Marri Channa Reddy who led the 1969 movement was a great leader from Telangana and he had taken the movement to its zenith. His movement became an inspiration to the second movement launched by KCR. Indira Gandhi became a mass leader in 1970-71. As Prime Minister she visited 30 to 40 countries and explained to them how she wants to liberate the then East Pakistan and later Bangladesh was formed. In the next election, Indira Gandhi swept the polls in the country except in Telangana where the Telangana Praja Samithi contested against the Congress and won 11 MP seats. Dr Channa Reddy went with these MPs to Indira and requested for conceding the separate State.

Indira Gandhi who sought the opinion of veteran CPI leader Late SA Dange was advised against giving way separate Telangana state as it would lead some other regions in the country demanding the same. When separate Telangana state became impossible there was pressure on the TPS leadership and several of them wanted to join the Congress. But Dr Channa Reddy sought some safe guards from Indira Gandhi and merged the TPS with the Congress. To label Dr Channa Reddy as Telangana traitor was again part of the conspiracy hatched by certain Andhra leaders and their media organizations.

Conspiracies by Andhras have been continuing since Dr Channa Reddy’s time till date. They wanted to destabilize the newly formed State after June 2,2014 and predicted that the new state would fail. Futile attempts were made to impose the President’s rule. When AIMIM declared its support, the TRS support grew to 70 members in the legislative Assembly and several others came forward with their support and continuing to extend their support. Now TRS strength has reached 90 in the House providing political stability. TRS party and its government strengthened from those joining it from other parties. Telangana should be benefitted from all quarters. People are not allowed to join for the silly political reasons. Under the present circumstances, all those sections seeking development of the State should come together and work for the welfare of the state. Telangana State has now achieved political and economic stability. This process should go on. Hence polarization is an out-and-out inevitability and the need of the hour.

Sunday, April 22, 2018

శ్రీరామ లక్ష్మణుల చిహ్నాలను సీతకు వివరించిన హనుమంతుడు ..... ఆంధ్రవాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి? : వనం జ్వాలా నరసింహారావు


శ్రీరామ లక్ష్మణుల చిహ్నాలను సీతకు వివరించిన హనుమంతుడు
ఆంధ్రవాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి?
వనం జ్వాలా నరసింహారావు
సూర్య దినపత్రిక (23-04-2018)

జవాబుగా హనుమంతుడు: "దేవీ! నా అదృష్టం కొద్దీ, నేను రావణుడను కానని నమ్మి, మౌనం చాలించి, నీభర్త గుర్తులు, లక్ష్మణుడి చిహ్నాలు, యోగ్యంగా, వాస్తవంగా చెప్పమని అడిగావు. చెపుతావిను. రామచంద్రమూర్తి కమలపత్రాక్షుడు. సర్వసత్వ మనోహరుడు. సమస్తజంతువుల మనస్సు హరించే గుణమున్నది. సౌందర్య, దాక్షిణ్యాలతో పరిపూర్ణుడై పుట్టాడు. తేజస్సులో సూర్యుడికి, ఓర్పులో భూదేవికి, బుధ్ధిలో బృహస్పతికి, సమానుడు. కీర్తికి ఇంద్రుడి లాంటివాడు. తనకులవృత్తి ధర్మాన్నేకాకుండా, లోకమందున్న వారందరి కులవృత్తి ధర్మాలను రక్షించేవాడు. మానవులకు ఏదిమంచో తెలుసుకుని, దాన్ని తాను అనుసరించి, తర్వాత లోకులకు ఇట్లా చేయమని చెప్పే గుణమున్నవాడు. రామచంద్రుడిలో కేవలం చెప్పే పాండిత్యమే కాకుండా, చేసే సామర్ధ్యం కూడా వుంది. కాంతికలవాడు, సాధుపూజితుడు, తీవ్రమైన బ్రహ్మచర్య నిష్ఠ వున్నవాడు, సాధువులకు ప్రీతిపాత్రుడు, వైదిక కర్మ విధాన్నంతా ఆసాంతం పూర్తిగా తెలిసినవాడు, రాజ్యవిద్యలందు కడుసమర్ధుడు, సదాచార సంపత్తికలవాడు, అందరి ఎడలా నీతిగా ప్రవర్తించేవాడు. ఋగ్వేద  సామవేద,  అధర్వణవేదాలూ, వేదాంగాలైన శిక్ష, వ్యాకరణం, చందస్సు, నిరుక్తం, జ్యోతిష్యం, కల్పాలూ, యజుర్వేద, ధనుర్వేదాలూ నిపుణంగా తెలిసినవాడు".

ఇంతవరకూ చెప్పినవన్నీ ఆత్మగుణాలనీ, దేహగుణాలను కూడా చెప్తాననీ ఇలా వర్ణిస్తాడు: "వెడల్పైన మూపులున్నాయి, పొడవైన చేతులతో ప్రకాశిస్తుంటాడు, శంఖం లాంటి కంఠంముంది, పూర్ణచంద్రుడితో సమానమైన ముఖముంది, ఎర్రటికళ్లు, గంభీర ధ్వని, బలిష్టమైన అవయవ సౌష్టవం, మెరిసే దేహకాంతి, మేఘవర్ణంలాంటి దేహవర్చస్సూ వుంది. ఏ అవయవం ఎంత పరిమాణంలో వుండాల్నో, అంతమాత్రమే వున్నవాడు. మరోవిధంగావున్నట్లు తెలియనివాడు. హెచ్చు తగ్గులు లేని శరీర కొలతలున్నవాడు. ఎర్రటి కనుకొనలు, గోళ్లు, అరచేతులు, అరికాళ్లున్నాయి. కనుబొమ్మలు, చేతులు, వృషణాలు, పొడుగ్గా వుంటాయి. రొమ్ము, మడికట్టు, పిడికిలి, స్థిరంగా వుంటాయి. పొత్తికడుపు, బొడ్డు, రొమ్ము ఎత్తుగా వుంటాయి. పాదరేఖలు, తలవెంట్రుకలు, లింగం, నున్నగా వున్నవాడు. గంభీర కంఠధ్వని, నడక, లోతైన బొడ్డు కలవాడు. కంఠంపైన మూడు రేఖలున్నాయి. తలవెంట్రుకల కొనలు, వృషణాలు, మోకాళ్లు, సమానంగా వుంటాయి. చనుమొనలు, స్తనముల రేఖలు పల్లంగా వున్నాయి. సమంగా, గుండ్రంగా, విశాలంగా వున్న శిరస్సుకలవాడు. బొటనవేలు కింద మూడు వేదాలను సూచించే గీతలున్నాయి. నొసట నాలుగు రేఖలున్నాయి. అరికాలిలో, అరచేతిలో, ధ్వజం, వజ్రం, అంకుశం, శంఖం లాంటి నాలుగు రేఖలున్నవాడు. చేతులు, మోకాళ్లు, పిక్కలు, తొడలు, సమంగా వున్న బలశాలి. తొంభై ఆరంగుళాల ఎత్తుంటాడు. దొండపండులాంటి పెదవి, బలసిన చెక్కిళ్లు, పొడుగ్గా, నిక్కపొడిచిన ముక్కున్నవాడు. కనుబొమలు, ముక్కుపుటాలు, కళ్లు  చెవులు, పెదవులు, చనుముక్కులు, మోచేతులు, మణికట్టు,  మోకాళ్లు, వృషణాలు, కటిప్రదేశాలు  చేతులు,  కాళ్లు, పిరుదులు, సమానంగా వుంటాయి. వీటన్నింటికీ తగిన చిహ్నాలున్న స్త్రీవి నీవొక్కతవే ఎట్లున్నావో, లోకంలో నీకు తగ్గట్టి ఇట్టి చిహ్నాలున్న పురుషుడు ఆయనొక్కడే!"


"నాలుగు ప్రక్కలా దంష్ట్రలు (పైపళ్ల వరుసలో రెండుప్రక్కలా, దిగువ పళ్ల వరుసలో రెండు ప్రక్కలా చేరి నాలుగు ప్రక్కలుంటాయి. అందులో ఒక్కొక్క దాంట్లో నాలుగేసి కోరల్లాంటి పళ్లున్నాయని అర్థం. ఈరెండు వరుసలలోనూ, మధ్యనున్న నాలుగు పళ్లకు, రెండుప్రక్కలా ఒక్కొక్క "పన్ను" వుంటుంది. దాన్ని "దంష్ట్ర" అంటారు. ఇలాంటివి నాలుగు ప్రక్కలా నాలుగున్నాయని అర్థం) కలవాడు. సింహం, ఏనుగు, శార్దూలామ్, వృషభం లాగా నడుస్తాడు. వీపు, దేహం, చేతుల, కాళ్ల వ్రేళ్లు, చేతులు, ముక్కు, కళ్లు, చెవులు, లింగం నిడుపులుగా వున్నవాడు. చేతులు, వ్రేళ్లు, తొడలు, పిక్కలు, ఎనిమిది నిడుపులగు వాడు. కళ్లు, దంతాలు, చర్మం, పాదాలు, వెంట్రుకలు, మెరుస్తుంటాయి. ముఖం, కళ్లు, నోరు, నాలుక, పెదవులు, దవడలు, చన్నులు, గోళ్లు, చేతులు, కాళ్లు, పద్మాలవలె గుండ్రంగా వుంటాయి. శిరం, నొసలు, చెవులు, కంఠం, రొమ్ము, హృదయమ, కడుపు, చేతులు, కాళ్లు, పిరుదులు, పెద్దవిగా వున్నవాడు. వ్రేళ్ల గణుపులు, తలవెంట్రుకలు, శరీరంపై వెంట్రుకలు, చర్మం, లింగం, మీసంలోని వెంట్రుకలు, సూక్ష్మ బుధ్ధి, సూక్ష్మ దృష్టి, సూక్ష్మంగావున్నవాడు".

(సీతమ్మ రాముడి తొడలు ఎలా వుంటాయనీ, లక్ష్మణుడి తొడలు ఎలా వుంటాయనీ అడగటమేమిటి? తప్పుకద! అలా అనిపించడం సహజం. విశేషించి పరపురుషుడిని, అందునా పరిచయం లేనివాడిని అడగటమంటే, ఇదొక పరీక్ష హనుమంతుడికి. ఆమెకు రామలక్ష్మణుల స్వరూపం తెలుసు. కాబట్టి అడిగింది. హనుమంతుడు చెప్పేదానిలో ఆ వివరాలు సరిపోతే ఆమె నమ్మగలుగుతుంది. అది అలా వుంచుదాం. కంటికి కనిపించే అవయవాలను వర్ణించి చెప్పవచ్చు. కంటికి కనిపించని మర్మావయవాలను ఎలా వర్ణించగలం? తెలిసే అవకాశం లేదే! ఒకవేళ చూడడం సంభవించినా, స్త్రీ ముందు వివరించి చెప్పడం ఔచిత్యం కాదుకద! హనుమంతుడు బుద్ధిమంతులలో శ్రేష్టుడు. సాముద్రిక శాస్త్రవేత్త. ఆ శాస్త్రం వ్యక్తుల రూపురేఖా విలాసాలను చెప్పి, వాటి ఫలితాలను వివరిస్తుంది. ఏ ఏ జాతులవారు ఎలావుంటారో, సర్వావయవ పరిమాణాలను బట్టి విశ్లేశిస్తుంది. సాముద్రిక శాస్త్ర జ్ఞాని హనుమంతుడు అయినందున, కంటికి కనిపించే అవయవాల పరిమాణాలను బట్టి, పొందికను బట్టి, కంటికి కనిపించని [మర్మ] అవయవాలను వర్ణించగలుగుతాడు. సీతమ్మ ఉద్దేశ్యం కూడా అదేనేమో! రామలక్ష్మణుల ముఖాలనూ, బాహువులనూ, వక్షస్థలాలనూ గమనించిన వాడు, మిగిలిన వాటిని చెప్పగలడా? లేడా? అని. అంటే, ఈ దూత చూసినదే వల్లిస్తాడా? లేక చూసిన దానిని బట్టి, ఇంగిత జ్ఞానంతో, తదుపరి ఆలోచన చేయగలడా? లేదా? అని గ్రహించటానికే. హనుమంతుడు జయశీలుడు. పరీక్ష నెగ్గాడు. సీతకు విశ్వాస పాత్రుడైనాడు)

Saturday, April 21, 2018

శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-5 .... శృంగారం లాంటి నవ రసాలున్నాయి రామాయణంలో : వనం జ్వాలా నరసింహారావు


శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-5
శృంగారం లాంటి నవ రసాలున్నాయి రామాయణంలో
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రభూమి దినపత్రిక (22-04-2018)
రామాయణంలో శృంగారం లాంటి నవ రసాలున్నాయి. అందులో శృంగార రసం "సంభోగ శృంగారం". సీతారాముల కల్యాణం తర్వాత అయోధ్యలో వారు అనేక ఋతువులు ప్రియంగా గడిపిన వర్ణన ఉదాహరణగా తీసుకోవచ్చు. భార్యా భర్తల పరస్పర అనురాగం ఇంతకన్నా మించి వర్ణించడం ఎవరితరం కాదు. వాల్మీకి శ్లోకాల (ఆంధ్ర వాల్మీకి పద్యాల) భావం మాత్రమే కాకుండా, అందులోని కొన్ని పదాలు ఎంత అర్థ గాంభీర్యం గలవిగా-రసవంతంగా వుంటాయో చెప్పలేము. వాల్మీకి వాక్యామృత రసాన్ని నిరంతరం ఆస్వాదన చేసిన భవభూతి వర్ణించినట్లు ఇందులో హాస్యం (శూర్పణఖ-త్రిజటల వృత్తాంతం), కరుణ (ఇష్ట వియోగం వల్ల అనిష్ట సంభవం, దశరథుడి చావు), వీర (లక్ష్మణుడి వృత్తాంతం), రౌద్రం (రావణుడి వృత్తాంతం), భయానక (మారీచాది వృత్తాంతం), బీభత్సం (కబంధ-విరాధుల వర్ణన), అద్భుతం (రావణ యుద్ధంలో), శాంతం (శబరి వృత్తాంతం) రసాలను కనుగొన వచ్చు.

ఇక అలంకారాల విషయానికొస్తే, శబ్దాలంకారాలని, అర్థాలంకారాలని రెండు రకాలున్నాయి. రామాయణంలో శబ్దాలంకారాలు తరచుగా కనబడవు. అంత్యానుప్రాసలు కొన్ని చోట్ల వున్నాయి. శ్రీమద్రామాయణం స్వభావోక్త్యలంకారాలకు పుట్టిల్లు. స్వభావోక్తులు దేశకాలవక్తృ స్వభావాలను అనుసరించి చెప్పబడ్డాయి. వర్షాన్ని వర్ణన చేసిన సందర్భంలో మన ఎదుట వర్షం కురుస్తున్నట్లే వుంటుంది. హేమంతాన్ని వర్ణిస్తుంటే, మనకు మంచులో తడుస్తున్నామా అనిపిస్తుంది. అడవులలో జరిగినవి, మనమెప్పుడూ చూడనివి-విననివి చదువుతుంటే, మన కళ్లకు కట్టినట్లే వుంటుంది. తన వర్ణనా చాతుర్యంతో వాల్మీకి, పాఠకులను, తన చేతిలో బొమ్మలా చేసి, ఇష్టమొచ్చినట్లు ఆడుకుంటాడు. ఆయన ఏ విషయాన్ని వర్ణించినా అది మన కళ్ల ఎదుట జరిగిన భావం కలుగుతుంది. ఇక ఉపమాన అలంకారాల విషయానికొస్తే, వాల్మీకి కాళిదాసుకే గురువనిపిస్తాడు. రావణ వధానంతరం రాముడు సీతతో అన్న మాటలకు అర్థం వెతుకుతే, ఆ ఉపమానంలో, సీత నిర్దోషురాలనీ-శంక అనే దోషంతో బాధ పడినవాడు రాముడనీ స్పష్టంగా తెలుస్తుంది. అలానే, రావణుడు సీతను అపహరిస్తున్నప్పుడు రాసిన శ్లోకం కూడా. దానర్థం: సీత లోకమాత అయినందున ఆమెను రావణుడు పట్టుకోవడం తల్లిని పట్టుకోవడమంత మహా ఘోరమైన కార్యమని. ఇంద్రజిత్తు మరణం తర్వాత వాడి సేనలకు పట్టిన గతిని వర్ణిస్తూ రాసిన శ్లోకం మరో చక్కటి ఉదాహరణ.


వాల్మీకి మరో ప్రత్యేకత "ఉత్ప్రేక్ష". లంకలో- అశోక వనంలో ఒక "వంక" పారుతుంటుంది. దాని తీరంలో వున్న చెట్ల కొమ్మలు నీళ్లలో వేలాడుతుండడం వల్ల, నీరు వెనక్కు పోతుంటుంది. ఈ సామాన్య విషయాన్ని వాల్మీకి (ఆంధ్ర వాల్మీకి) ఎలా ఉత్ప్రేక్షించినాడో చదివి తీరాల్సిందే. "ఆ పర్వతం పైనుండి కిందకు పారుతున్న సెలయేరు, చూడడానికి, మగడి తొడపై నుండి కోపంతో దిగిపోతున్న స్త్రీలా వుంది. వేలాడుతున్న కొమ్మలు ప్రవాహాన్ని అడ్డగించడంతో, వెనుదిరుగుతున్న నీటి కదలిక సన్నివేశం, బంధువుల బుజ్జగింపులకు సమాధానపడి-శాంతించి, మగడి వద్దకు మరలిపోతున్న ఆడదానిలా వుంది" అన్న అర్థం వస్తుంది ఆ శ్లోకానికి-పద్యానికి. అలానే ఆయన వాడిన శ్లేషాలంకారాలు.

శ్లేషాలంకారానికి చక్కటి ఉదాహరణ వాల్మీకి నోట వెలువడిన ప్రథమ శ్లోకం.
"మానిషాద ప్రతిష్ఠాం త్వ! మగ మ శ్శాశ్వతీ స్సమాః
యత్క్రౌంచ మిథునాదేక! మవధీః కామమోహితం"

వేదాన్య విషయంలో కలిగిన ఈ ఆదిమ శ్లోకానికే నిషాద పరంగా ఒక అర్థం, భగవత్ పరంగా రెండో అర్థం వున్నాయి. ఆంధ్ర వాల్మీకంలో దీన్ని ఇలా పద్యంగా మలిచారు కవి.

"తెలియు మా నిషాదుండ ప్రతిష్ఠ నీక
ప్రాప్తమయ్యెడు శాశ్వతహాయనముల
గ్రౌంచ మిథునంబునందు నొక్కండు నీవు
కామమోహిత ముం జంపు కారణమున"

ఒక బోయవాడు క్రౌంచ మిథునంలో వున్న మగ పక్షిని చంపడం, ఆడ పక్షి అది చూసి దుఃఖించడం, పరమ దయామయుడైన వాల్మీకి అది చూసి, బోయవాడు చేసిన అధర్మ కార్యానికి కోపగించి అతడిని ఈ శ్లోకంలో శపించడం జరిగింది. ఇదే రామాయణ ఉత్పత్తికి కారణమైన శ్లోకం కావడంతో నాంది శ్లోకం అయింది. కాబట్టి దీనికి భగవత్ పరంగా ఒక అర్థం వుంది. రామాయణంలోని ఏడు కాండల అర్థం-కథ ఇందులో సూక్ష్మంగా సమర్థించబడింది.