Thursday, October 31, 2019

నాగుల చవితి, ధర్మాంగద చరిత్ర, పాముపాట : వనం జ్వాలా నరసింహారావు

నాగుల చవితి, ధర్మాంగద చరిత్ర, పాముపాట
వనం జ్వాలా నరసింహారావు

నాగుల చవితి సందర్భంగా (గురువారం, అక్టోబర్ 31 న) మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ ప్రాంగణంలో వున్న పాము పుట్టలో మా శ్రీమతి విజయలక్ష్మి, కూతురు ప్రేమ మాలినితో సహా ఆ ఆవిడ బంధువులు, స్నేహితులు (శారద, విమల, రేణు, మాధవి) కలిసి ప్రతి ఏడాదిలాగా ఈ సంవత్సరం కూడా పాలు పోశారు. దీపావళి అమావాస్య తరువాత వచ్చే కార్తీక శుద్ధ చవితిని నాగులచవితి అని అంటారు. మన పూర్వీకులు చెట్టును, పుట్టను, గుట్టను, రాతిని, ఆమాటకొస్తే సమస్త ప్రాణికోటిని ఆరాధించడం మనకు నేర్పారు. ఇది మన భారతీయ సంస్కృతీ సాంప్రదాయం. బహుశా అందులో భాగంగానే నాగుపామును కూడా ఒక దేవతగా పూజించే ఆచారం అనాదిగా వచ్చి వుంటుంది. నాగుపాముకు పుట్టలో పాలుపోసిన తరువాత అంతా కలిసి ఒక ఇంట్లో కూర్చుని పాడుకునేదే పాముపాట. దాన్నే ధర్మాంగద చరిత్ర అని కూడా అంటారు. పాముపాట చదవడానికి పూర్వరంగంలో, దేవతా ప్రార్థన, కవిస్తుతి, శ్రీరామమూర్తి ప్రార్థన లాంటివి చేస్తారు. వివరాల్లోకి పోతే....

ఒకానొక రోజుల్లో అప్పటి కాశ్మీర దేశంలోని కనకాపురంలో సంగీత, సాహిత్య, సరస విద్యల్లో ఆరితేరి, వేదాలను అలవోకగా వల్లించగల బ్రాహ్మణులు అనేకమంది వుండేవారు. అలాగే రకరకాల వృత్తులవారు కూడా అక్కడ వుండేవారు. ఆ దేశం అప్పుడు ధనధాన్యాదులతో అలరారుతుండేది. ఆ దేశం రాజు పేరు ధర్మాంగదుడు. ధరణిలో ప్రఖ్యాతికన్నవాడు. ఆ రాజు భార్య పేరు అర్మిలీ దేవి. వారిద్దరూ ఆదర్శ దంపతులు. సకలభాగ్యాలున్న ఆ దంపతులకు సంతానం లేదనే చింత బాధిస్తుండేది. పుత్రులు లేకుంటే పుణ్యం లేదని, సుతుడు లేకుంటే గతులు లేవని తానిప్పుడు ఏంచేయాలని ఆ ధర్మాంగదుడు ఒకనాడు తన మంత్రుల సలహా అడిగాడు. దైవ ప్రార్థన చేయమని వారంతా సూచించారు. సంతానం కొరకు ఆయన అలాగే వారు చెప్పినట్లు చేయడంతో, దైవయోగాన ఆయన భార్య అర్మిలి గర్భం దాల్చింది. రాజుగారికి అ ఆవిషయం తెలిసి సంతోషమయింది. గర్భిణీగా వున్న స్త్రీలకు చేయాల్సిన వేడుకలన్నీ ఆమెకు చేశారు భందుమిత్రులు.

ఇదిలా వుండగా గర్భం దాల్చిన అర్మిలీదేవి నెలలు నిండగానే రెండు నాల్కలతో నిండు పడగను కలిగి, చిర్రుబుర్రుమనే శేషుడు పుట్టాడు. ఈ విషయాన్ని చెలికత్తెల ద్వారా తెలుసుకున్న ధర్మాంగదుడు మూర్ఛపోయాడు. తరువాత తెప్పరిల్లి, ఏంచేయాలని మంత్రులను అడిగాడు. కొడుకు పుట్టాడని నగరంలో చాటిద్దాం అని, లేకపోతే, మనం చులకనైపోతామని వారు చెప్పారు. పుత్రుడు పుట్టినందుకు దానాలు కూడా చేద్దామన్నారు. అర్మిలీదేవికి కూడా ఆ సలహా నచ్చింది ఆ క్షణాన. తన పాముకొడుక్కు మామూలుగానే సపర్యలు చేయాలని చెప్పింది చెలికత్తెలకు. ఒక పెట్టె తెప్పించి అందులో దాన్ని వుంచి, పాలు పోసి పెంచసాగారు. ధర్మాంగదుడికి నిజంగా కొడుకే పుట్టాడని భావించిన పొరుగు రాజులు ఆయనతో వియ్యమందాలని నిర్ణయించుకున్నారు. తమ కోరికను ఉత్తరాల ద్వారా ధర్మాంగదుడికి తెలియచేయగానే ఆయన సిగ్గుపడ్డాడు బయటికి చెప్పుకోలేక. వారికి ఏమని జవాబు రాయాలో అర్థం కాలేదు రాజుకు. ఒక అందమైన అమ్మాయిని చూసి పాముకు పెళ్లి చేయాలని సలాహా ఇచ్చారు మంత్రులు.

పెళ్లికూతురును చూడడానికి బ్రాహ్మణులను పంపాలని నిర్ణయం జరిగింది. తక్షణమే పురోహితులను పిలిచారు. దేశదేశాలు తిరిగి, ఒక చక్కటి అమ్మాయిని వెతికి, ఆమె జాతకం పరిశీలించి, ఆయుర్దాయం చూసి, అయిదవతనం చూసి, తల్లిదండ్రుల నేపధ్యం విచారించి రమ్మని వారిని పురమాయించాడు రాజు ధర్మాంగదుడు. వారు ఆయన ఆజ్ఞానుసారం అంగ, వంగ, కళింగ, బంగాళ, నేపాల లాంటి దేశదేశాలు తిరిగారు. ఎక్కడా వారికి అనుకూలమైన అమ్మాయి కనిపించలేదు. రాజుకు ఈ విషయం ఎలా చెప్పాలి అని వారు మధనపడుతుండగా దారిలో వారికొక బ్రాహ్మణుడు కలిసి, సౌరాష్ట్ర దేశంలో మాణిక్యపురం పాలించే రత్నాంగుడు అనే రాజుకు త్రైలోక్య సుందరి అనే కూతురుంది అక్కడికి వెళ్లమని సలహా ఇచ్చాడు. వారలాగే అక్కడికి వెళ్లి రాజు రత్నాంగుడిని కలిసి తాము వచ్చిన పని చెప్పి అమ్మాయిని చూపించమని అడిగారు. ఆయన ఆ అమ్మాయిని సభకు రప్పించి చూపించాడు. ఆమెను చూడగానే ఆ బ్రాహ్మణులు, ధర్మాంగదుడి కొడుక్కు, రత్నాంగుడి కూతురు సరిగ్గా సరిపోతుందని నిర్ణయించారు. జాతకాన్ని కూడా చూసి సంతోషించారు. రత్నాంగదుడి కూతురును తమరాజు కొడుక్కు ఇవ్వమని అడిగారు.

రత్నాంగ రాజు తన పురోహితులను కనకాపురానికి పంపాడు. రాజు కొడుకును చూసి రమ్మన్నాడు. ఎవరిని చూపించాలని ధర్మాంగదుడు మధనపడ్డాడు. అప్పుడొక మంత్రి తన కొడుకును చూపిస్తానన్నాడు. రత్నాంగ రాజు పంపిన బ్రాహ్మణులకు మంత్రి తన రాజుకు చెప్పినట్లే తన కొడుక్కు ముస్తాబు చేసి చూపించాడు. ఆ బాలుడి హస్తరేఖలు చూసి ఆ బ్రాహ్మణులు సంతృప్తి చెందారు. ధర్మాంగదుడి వంశంలో ఒక ఆచారం వున్నదనీ, ఆయన కొడుకును అంటే పెళ్లికొడుకును పరదేశానికి పంపరనీ, కత్తికి బాసికం కట్టి తరలి వస్తారనీ, కత్తికి, కాంతకి పెళ్లి జరగాలనీ ఆయన మంత్రులు రత్నాంగుడి బ్రాహ్మణులకు చెప్పారు. వారా విషయాన్ని తమ రాజుకు చెప్పి ఒప్పించారు. పెళ్ళికి తిథి, వార నక్షత్రాలు నిర్ణయించారు. ఇద్దరు రాజులు పెళ్లిపత్రికలు రాసుకున్నారు. పెళ్లిప్రయత్నాలలో వున్నారు. శుభలేఖలు రాసుకున్నారు. మంత్రి తన నేర్పంతా చూపించి కోడలిని తీసుకురావాలని ధర్మాంగదుడు అన్నాడు.


ధర్మాంగద రాజు అనుకున్న ముహూర్తానికి పాముకు బదులుగా కత్తిని తరలించాడు. మాణిక్యపురంలోని స్త్రీలంతా పెళ్లికొడుకును చూద్దామని వచ్చారు. చివరకు వారికి కత్తి తప్ప ఇంకేమీ కనబడలేదు. ఇదేం వింత అని వారంతా ఒకరి ముఖాలు ఇంకొకరు చూసుకున్నారు. అంగరంగ వైభోగంగా పెళ్లి తతంగం జరిగింది. కత్తినే పెళ్లి పీటలమీద వుంచారు. పెళ్లికూతురుతో ఆ కత్తికే తలంబ్రాలు పోయించారు. ఐదురోజుల పెళ్లి జరిగింది. నాగవల్లి కూడా జరిగింది. ఐదురోజుల తరువాత ధర్మాంగదుడు తిరుగు ప్రయాణమయ్యాడు. రత్నాంగుడు తన రాజసానికి అనుగుణంగా తన కూతురు త్రైలోక్య సుందరితో పాటు అనేక రకాల బహుమానాలు ఇచ్చాడు మగ పెళ్లివారికి. అత్తగారింట్లో ఎలా మెసలుకోవాలో అనేకరకాలుగా చెప్పి పంపించారు కూతురును రత్నాంగుడి దంపతులు. ఆ అమ్మాయి కూడా అత్తగారింట్లో అలాగే వుంది. మంచి పేరు తెచ్చుకుంది. చివరకు తన భర్త పాము అన్న విషయం తెలుసుకుంది. ధర్మాంగదుడిని నిలదీసింది.

కోడలికి నచ్చచెప్పే ప్రయత్నం చేసాడు ధర్మాంగదుడు. ఇదంతా తమ కర్మ ఫలం అన్నాడు. భర్తలేకపోతే తన గతేంటి అని అడుగుతుంది సుందరి. ఇలా ఎలా జరిగింది అని అడుగుతుంది. తన భర్త నాగారాజుతో కలిసి దివ్యతిరుపతులన్నీ తిరిగి వస్తానని అంటుంది. నూటొక్క తిరుపతులు సూటిగా తిరుగుతానంటుంది. ఒక పెట్టెలో పామునుంచి తీర్థయాత్రలకు బయల్దేరుతుంది. తనకు ఏ ఆభరణాలు వద్దని రుద్రాక్షలు కావాలని అంటూ బైరాగి వేషాన్ని ధరిస్తుంది త్రైలోక్య సుందరి. అందరి దగ్గర సెలవు తీసుకుని తీర్థయాత్రలకు బయల్దేరింది. తీర్థయాత్రలో భాగంగా దేశదేశాలలో వున్న గుళ్లు, గోపురాలు, ఆశ్రమాలు, నదులూ, పుణ్య తీర్థాలూ....ఇలా అనేక ప్రదేశాలకు భర్త నాగరాజును తీసుకుని పోతుంది. చివరకు నైమిశారణ్యం చేరుతుంది. అక్కడ దైవ ఘటనవల్ల కొందరు మునులు ఆమెకు తారసిల్లారు. మాండవ్య, కౌశిక, కౌండిన్య, మౌద్గల, గాంగేయ, కపిలుడు, కౌశికుడు, వాసిష్ట, ఆత్రేయ, వాల్మీకి, జమదగ్ని మొదలైన మునులను ఆమె దర్శించింది. తనకు పతిదానం ఇప్పించమని వారిని వేడుకుంది. తాను తిరిగిన ప్రదేశాల వివరాలు చెప్పింది.

మునులప్పుడు కరుణతో సుందరితో ఇలా అన్నారు. “దివ్యదృష్టితో అంతా చూశాం. నీ పతిసంగతి నీకు చెప్తాం. పూర్వజన్మలో యితడు పుడమికి రాజు. ఏడు దీవులను ఏకచ్చత్రాదిపత్యంగా ఎదురు లేకుండా పాలించేవాడు. కొంతకాలం తరువాత యితడు బ్రాహ్మణ భూములను పండనివ్వకుండా పడావు పెట్టించాడు. ఆ పాప ఫలం ఇప్పుడు అనుభవిస్తున్నాడు. నీ పుణ్యఫలాన ఇతడెలాగైనా మళ్లీ రాజవుతాడు. సృష్టిలో మీ దంపతులు సుఖంగా వర్ధిల్లుతారు. పుత్ర-పౌత్రులను పొందుతారు. ఎన్నో తిరుపతులు తిరిగావు. పడమట దిశగా తిన్నగా పోయి బ్రహ్మ గుండంలో పాముపెట్టేతో సహా నువ్వు స్నానం చేస్తే ఈ పాము నరనాథుడవుతాడు. శీఘ్రంగా వెళ్లు”. ఆ మాటలు విన్నదే తడవుగా సుందరి వారికి సాష్టాంగ దండం చేసి పాముపెట్టెను ఎత్తుకుని అతివేగంగా వారు చెప్పిన దిక్కుకు పోయింది. పోయి బ్రహ్మగుండం దగ్గరకు చేరి తల్లి తండ్రులకు, పెద్దలకు, దేవుడికి నమస్కారం చేసింది. అప్పుడు ఆకాశవాణి ఆమెను త్వరగా ఆ గుండంలో మునగమని ప్రోత్సహిస్తుంది. ఆమె అలాగే ముమ్మారు పాముతో సహా బ్రహ్మగుండంలో మునిగింది.

అలా మునిగిన మరుక్షణమే ఫణిరాజు తన ఎదుట నాధుడై నిలిచాడు. తాను ఆయన ఇల్లాలినని సుందరి ఆయనకు చెప్పింది. తనను రక్షించమని వేడుకుంది. అప్పుడతడు ఆమె వివరాలు అడిగి తెలుసుకున్నాడు. జరిగిన విషయమంతా పూసగుచ్చినట్లు చెప్తుంది. ఇంకా అతడు సందేహిస్తుంటే ఆకాశవాణి ఆ బాలిక చెప్పినదంతా నిజమేనని పలుకుతుంది. దంపతులిద్దరూ సుఖంగా వుండాలని దీవించింది. వారిద్దరూ తిరిగి తీర్థయాత్రలు చేసి కాశ్మీర దేశానికి, కనకాపురానికి తిరిగి వస్తారు. ఆకాశవాణి, మనిషిగా చిత్రంగా మారిన నాగరాజుకు, చిత్రాంగదుడు అని పేరు పెట్టింది. చిత్రాంగదుడికి, త్రైలోక్య సుందరికి మళ్లీ శాస్త్రోక్తంగా వివాహం జరుగుతుంది.

(పాముపాట అనే దీన్ని నాగులచవితి రోజున చదువుతే పుణ్యం అని అంటారు)          

Saturday, October 26, 2019

“వాచం హృదయ హారిణీమ్” .... శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం...కిష్కింధాకాండ-1 : వనం జ్వాలా నరసింహారావు


“వాచం హృదయ హారిణీమ్”
శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం...కిష్కింధాకాండ-1
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రభూమి ఆదివారం సంచిక (27-10-2019)
చిలకపాటి విజయ రాఘవాచార్యులు గారి ఉపోద్ఘాతం: శ్రీరామ జయరామ కోదండరామ! కళ్యాణగుణధామ! సీతారామ! సురవైరిగణభీమ! పట్టాభిరామ! శ్రీరామ జయరామ జయజయరామ!!

ఇది మన శ్రీ జ్వాలా నరసింహరాయల వారి మందరమకరంద ‘మందర’ రామాయణానికి అనువచనం. ఇప్పటికే బాల, అయోధ్య, అరణ్య, సుందరకాండలను రుచి చూపించే ‘వాచవి’ గా, ‘అనువక్త’ గా ‘వాసుదాస’ స్వామివారి ‘మందరా’న్ని అందంగా చక్కని చిక్కని సంభాషణాశైలిలో, సంక్షిప్తసుందరంగా తెలుగువారికి అందించిన మాధుర్యవచో విలసన్మణి ఆయన. ఇప్పుడు కిష్కింధాకాండను మనకు విన్పిస్తున్న ‘కల్యాణమిత్రుడు’. భారతీయులకు శ్రీరామాయణం–భాగవతం పవిత్రపారాయణ గ్రంథాలు. భారతం ఇతిహాసం, కాలక్షేప గ్రంథం. పురాణ పరిమళం. ఇవి సనాతన ధార్మిక త్రివేణి స్థావరాలు. వాల్మీక, వ్యాసాదులు అనుగ్రహించిన వరాలు. దారి దీపాలు. భారతీయ ఆధ్యాత్మిక ఔన్నత్యానికి దివ్య జ్యోతులు. ఇందులో వాల్మీకి రామాయణాన్ని’ఆదికావ్యం’ అంటారు. మహర్షి వాల్మీకిని ‘ఆదికవి’ అంటారు. వారి అనుగ్రహప్రసాదమే ఈ వేళ కోట్లాది భారతీయులకు శ్రీ రామాయణం ఆజీవనపారాయణమైంది. భారత జాతి సమైక్యతకు మూలకందమైంది. సామాజిక జీవన సౌందర్యానికి ‘కౌముది’ అయింది. అక్షర సంపద గలవారికి ‘శ్రీ రామాయణం’ కల్పవృక్షమైంది. జ్ఞానపీఠమైంది.

     మహర్షి వాల్మీకి విశ్వ వాజ్ఞయానికి అందించిన సంస్కృత రామాయణం ‘ఆంధ్ర వాల్మీకి రామాయణం’గా, ఆంధ్ర తాత్పర్య విశేషాలతో ‘అపర వాల్మీకి’ గా, ‘ఆంధ్ర వాల్మీకి’ గా పండిత పామరులచే సంభావించబడిన శ్రీ వైకుంఠవాసులైన వావిలికొలను సుబ్బారావు గారి చేత ‘మందరం’ గా మలచబడి, అశేష ఆంధ్రలోకం చే సమాదరించబడి, నిత్యపారాయణ గ్రంథంగా ఆరాధించబడుతోంది. ఆ మహా మహానుభావులు సప్తకాండ సంశోభితమైన వాల్మీకంలోని 24 వేల శ్లోకాలకు 24 వేల పద్యాలతో తెలుగు అనువాదం యధాతధంగా చేశారు. శ్రీరామానుగ్రహప్రేరణతో తాము వ్రాసిన 24 వేల పద్యాలకు ‘మందరం అనే పేరుతో విశిష్ట విశేష విపుల వ్యాఖ్యానాన్ని అందించారు. మందరం 9 సంపుటాలలో ఆవిష్కరించబడింది. (వారి అవతార సమయం 23-01-1863 నుండి 01-07-1936). తమ 68 వ ఏట, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూనే మందరాన్ని ప్రారంభించారు. ‘ఆంధ్రవాల్మీకి’ రామాయణం 1904 లో ప్రారంభించి 1908 నాటికి పూర్తి చేశారు. రోజుకు 24 గంటలు శ్రమించారు. శ్రీవారి ‘మందరా’ నికి సంక్షిప్త రూపమే మన వనం జ్వాలా నరసింహారావు గారి ‘మందర మకరందం!

         జ్వాలా నరసింహారావు గారే మొదట వారి ‘మాట గా చెప్పారు ఇందులో ఈ గ్రంథ నేపధ్యం గురించి. విశేషమేమంటే ‘మందరం’ జ్ఞానపిపాసికి విజ్ఞానసర్వస్వం. వాసుదాసస్వామి వారు ప్రయోగించిన ఛందోవృత్తాలు సాహితీ పిపాసికి ‘వసంతకుసుమాకారాలు’, ‘పూర్ణచంద్రోదయాలు. జ్వాలాగారు ఈ వృత్తాలను సైతం అవలోడనం చేసి, వేరొక ఆవిష్కరణ చేశారు. భక్తకవి పోతన్నగారు వాసుదాసస్వామి వారికి స్ఫూర్తిమూర్తి. అందువల్లే వాసుదాసస్వామి వారు వాల్మీకాన్ని 108 సార్లు పారాయణం చేయడం ఒక విశేషమైతే, శ్రీరామాయణంలో శ్రీ సీతారాములకు ఏ విధంగా మహా సామ్రాజ్య పట్టాభిషేకం చేయబడినదో, అదే విధంగా, యథాతథంగా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి సన్నిధిలో 500 నదీజలాలను తెప్పించి పట్టాభిషేకం చేయడం అపూర్వమైన విశేషం.

ఆ విధంగా ఈ వేళ ఒంటిమిట్టలో-అంటే ఏకశిలానగరం- శిలాఫలకం మనకు సాక్షాత్కరిస్తోంది. మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో ఆంధ్రశాఖాధ్యక్షులుగా, ఆచార్యులుగా ఉద్యోగించి (1904-20), ఆ సమయంలో భార్యావియోగం పొంది, పదవీ విరమణానంతరం ఎన్నో మహా గ్రంథాలను రచించారు. శ్రీ కుమారాభ్యుదయం, కౌసల్యా పరిణయం, సుభద్రా విజయం, పోతరాజు విజయం, ఆంధ్ర విజయం ప్రభంధాలు కాగా, వివిధ హితచర్యలు, ఆర్య కథానిధులు, పోతన్న నికేతన చర్చ, సులభ వ్యాకరణం వంటి ఇతర గ్రంథాలెన్నో ప్రచురించబడినాయి. వారు ప్రారంభించిన ‘భక్తిసంజీవని’ ‘భక్తి, జ్ఞాన, కర్మ యోగములు తెలుపు మాస పత్రిక-యథాతథంగా 81 సంవత్సరాలుగా అవిచ్చిన్నంగా గుంటూరు జిల్లా, తెనాలి దగ్గర అంగలకుదురు “శ్రీ కోదండరామసేవక ధర్మసమాజం పేరిట చక్కగా ప్రచురించబడుతోంది. ఆ పత్రిక చివరి కవరు పేజీ తప్పక చూచి, చదివితీరవలసినదే! వివేకముగల ఆర్తులు! ఇవన్నీ ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే-మన వాసుదాసస్వామి వారి వైభవాన్ని గురించిగానీ, వారి ‘మందారాన్ని గురించిగానీ, మా జ్వాలా నరసింహారావు గారికంటే పరిచయం చేయగలవారు మరొకరు కన్పించడంలేదు శ్రీవారి శిష్యులు తప్ప! అంత పరిశోధన చేసిన వ్యక్తి ‘జ్వాలా గారు. నిష్కర్షగా చెప్పాలంటే-శ్రీ వాసుదాసస్వామి వారు ‘జ్ఞానపీఠా’నికి, మరొక జాతీయ స్థాయి పురస్కారానికో-‘పద్మ పురస్కారానికో పూర్తిగా అర్హులు మరణానంతరమైనా!

పరిశోధన చేయగలవారికి ‘మందరం’ మహా జ్ఞాన పుష్కరిణి. శ్రీ వాసుదాస స్వామి వారు ‘పరిశోధనా లక్ష్యం’ గా ఎంతైనా పరిశోధన చేయవచ్చు. జ్వాలా గారు చేసిన, చేస్తోన్న కృషికి సైతం ‘డాక్టరేట్’ చక్కగా ఇవ్వదగునని నేను భావిస్తున్నాను.

     ఇక ప్రస్తుత గ్రంథం విషయానికి వస్తే–ఇది కిష్కింధాకాండ. శ్రీ రామాయణంలో  ఏమున్నదో, ఎందుకు చదవాలో వాసుదాస స్వామి వారి పీఠికతో బాటు తనదైన నిరుపమాన శైలిలో జ్వాలాగారు చక్కగా వివరించారు. శాబ్దిక విశేషాలనూ, శ్రీరామావతార వైభవాన్నీ, వైలక్ష్యాన్ని తెలియజేశారు. కావ్య ‘అంతర ధ్వని’ ని విగ్గడించారు. ‘అవతారిక’ లో అరణ్యకాండను కిష్కింధాకాండతో సందర్భాన్ని సూచిస్తూ అనుసంధించారు. కిష్కింధకాండ ప్రధానంగా ద్వయమంత్రమందలి ‘చరణౌ’ పదానికి వివరణమని పెద్దల నిష్కర్య. ఇది జ్ఞానకాండ. అరణ్యకాండ దీన సంరక్షణమనే ధర్మాన్ని శ్రీ రామచంద్రమూర్తి ఏ విధంగా అనుష్ఠించారో వివరిస్తుంది. మిత్రరక్షణమనే ధర్మాన్ని ఆవిష్కరిస్తుంది. శ్రీ రామచంద్రమూర్తి అసంఖ్యేయ కల్యాణ గుణాలను చక్కగా వివరిస్తుంది.

సరిగ్గా కాండ ప్రారంభంలోనే మహాద్భుతమైన, తాత్త్వికశబ్ద, అర్ధ్రసంభరితమైన ‘పంపా’ వర్ణనతో మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. బుద్ధిమతాంవరిష్ఠుడైన ఆంజనేయస్వామి పరివ్రాజక రూపురేఖా విలాసాలతో దర్శనమిస్తాడు. కొందరు మహానుభావులు కిష్కింధాకాండను ‘హనుమ’ కాండ అనవచ్చునంటారు. ఈ కాండలో వర్ణనలు విశేశంగా కన్పిస్తాయి. వర్షఋతు వర్ణనము (28 సర్గ), నాలుగు దిక్కులలో ఉన్న భౌగోళిక ప్రదేశ వర్ణనలు (40–44 సర్గలు), భాషా ప్రియులకు, ఆలోచనామృతాన్ని అందిస్తాయి. శ్రీ రామ-సుగ్రీవ మైత్రి, వాలివధ విషయమై ‘ధర్మ’ చర్చ, సుగ్రీవునికి మొదటి యుద్ధములో వాలి వల్ల పరాభవం, తార ధర్మ, లౌకిక ధర్మ వివరణం, లక్ష్మణ స్వామి భ్రాతృ భక్తి–ఇలాంటివెన్నో ధర్మ సముచ్ఛయాలు కిష్కింధాకాండలో గ్రహిస్తాము.


వదినె గారి పట్ల మరిది ఎలా ప్రవర్తించాలో లక్ష్మణస్వామి పలికిన మాటలు మనస్సును ఆర్థ్రం చేస్తాయి. సీతమ్మ గిరిపై పడవేసిన నగల మూటను చూచి, ఇవి మీ వదినెవేమో చూడమన్న రాములవారితో లక్ష్మణ స్వామి అన్న మాటలు.

శ్లో ׀׀ నా హం జానామి కేయూరే నా హం జానామి కుండలే ׀
    నూపురేత్వభి జానామి నిత్యం పాదాభివందనాత్ ׀׀

సనాతన ధర్మ ప్రతిపాదితమైన భారతీయ సంస్కృతికి, సంప్రదాయాలకు ఇది మణిద్వీపం.
‘అన్నా! ఈ కేయూరాలను, కుండలాలను నేను ఎరుగను. కానీ నిత్యమూ మా వదినెమ్మకు పాదాభివాదనం చేస్తాను గనుక, ఈ కాలి అందెలు వదినెమ్మవే అని చెప్పగలను.

     ఈ వేళ జాతీయ స్థాయి పరిపాలక శిక్షణ సంస్థలలో సైతం శ్రీ రామాయణాన్ని సోదాహరణంగా వివిధ సందర్భాలను, సన్నివేశాలను శిక్షణాంశాలుగా స్వీకరిస్తున్నారు. అందులో ప్రధానంగా సున్నితమైన నైపుణ్యాలను (soft skills) శ్రీ రామాయణం నుంచే సేకరించి, శిక్షణాంశాలుగా బోధిస్తున్నారు. శ్రీ ఆంజనేయస్వామి వారిని ‘సంభాషణా కౌశలాలు’ అనే శిక్షణాంశానికీ (communication skills), శ్రీ రామచంద్రస్వామిని ‘జట్టుకట్టడం’ (Team building) అనే అంశానికీ, ‘ఇరువర్గాల మధ్య సయోధ్య’ (Negotiation Technique) కూ, జాంబవంతుని ‘ప్రేరణ’ (motivation) కూ, ‘ధర్మమీమాంస-మానవీయ విలువలు’ (Ethics & Human values) కూ–ఇలా ఎన్నో శిక్షణాంశాలకు కిష్కింధా, సుందరకాండలు అద్భుతమైన శిక్షణ సామాగ్రిని అందిస్తున్నాయి. జ్వాలా నరసింహారావు గారు మొదట శిక్షణవేత్తగా (Trainer) రాణించిన వ్యక్తి కావడం వల్ల కిష్కింధాకాండలో ఆయా సందర్భాలలో ఈ శిక్షణాంశాలను చక్కగా వివరించడం జరిగింది.

కిష్కింధాకాండలో ప్రస్తావించబడిన ధర్మ సూక్ష్మాలు ఈనాటి సమాజానికి ఎంతో ప్రయోజనకరం. వావి వరుసలు, సభ్యతా, సంస్కారాలు క్షీణించిపోతున్న కాలంలో చక్కని శైలిలో పామరులకు సైతం హాయిగా చదువుకునేందుకు దీనిని మలిచారు జ్వాలా గారు. ఉదాహరణకు వాలిని ఎందుకు చెట్టు చాటున నుండి వధించాల్సి వచ్చిందో శ్రీరామచంద్రస్వామి వాలికి వివరిస్తాడు.

శ్లోII ఔరసీం భగినీం చాపి భార్యాం వాస్యమ జస్యయః !
      ప్రచరేత నరః కామాత్ తస్య  దండో వధః స్మృతః !!

(ఎవడు కూతురు, చెల్లెలు, తమ్ముని భార్య మొదలైన వారిపట్ల కాముకుడై ప్రవర్తిస్తాడో వానిని వధించడమే సరైన దండన అని ధర్మశాస్త్ర వచనం). వాలి అంగీకరిస్తాడు. క్షమించమంటాడు. అలాగే వాలి తన చరమదశలో తన ప్రియపుత్రుడైన అంగదుడితో ఇలా అంటాడు.

శ్లోII నచాతి ప్రణయః కార్యః కర్తవ్యో  ప్రణయశ్చతే !
     ఉభయం హి మహాన్ దోషః తస్మాదంతర దృర్చవ II

(నాయనా ఎవ్వరినీ ఎక్కువగా ప్రేమించకు. ఎవ్వరిపైనా ద్వేషం పెంచుకోకు. ప్రేమద్వేషం రెండూ పెద్ద దోషాలే ! కాబట్టి అంతర్ముఖుడవై జాగ్రత్తగా ప్రవర్తించు)

తప్పు చేసినవారు చివరకు ఎలా అధోగతిపాలై అప మృత్యువాత పడిపోయారే, మిగిలిన అలాంటి వారు జాగ్రత్తగా ప్రవర్తించాలి. ఈ విషయమై సుగ్రీవుడితో అన్నమాటగా లక్ష్మణస్వామి చేసిన హెచ్చరిక.

శ్లోII నచ సంకుచితః పంధాః  యేన వాలీ హతో గతః I
     సమయే తిష్ఠ సుగ్రీవ I మా వాలి వధ మన్వగాః I

(సుగ్రీవా ! మీ అన్న వాలి వెళ్లిన ద్వారం ఇంకా మూతపడలేదు. అన్నమాట నిలుపుకో !  మీ అన్న వాలి పోయిన త్రోవనే ప్రయాణం చెయ్యకు!) సీతాన్వేషణ కర్తవ్యాన్ని మరచి భోగలాలసుడవై వుండదలిస్తే నీకూ చావు తప్పదని అంతర ధ్వని !)

అనేకానేక ధర్మ మర్మాలను, లౌకిక వ్యవహారాలను, మహా విషయాలను, మహామంత్ర అంతరార్థాలను నింపుకున్న కిష్కింధాకాండ జ్వాలా పాలిట ‘కలకండ’ గా మారి మనకు అందిస్తోంది. చాలా కష్టమైన పదాలతో నడిచే కాండ ఇది. వాసుదాస స్వామివారు ‘గోవింద రాజీయ’ వ్యాఖ్యానాన్ని అనుసరించి, దానిని మరింత పరిమళభరితంగా తెలుగుభాషలో మనకు తెలియపరిచారు. తొమ్మిది సంపుటాలలో విస్తరించిన విశేష వ్యాఖ్యానాన్ని క్లుప్త సుందరంగా మనకు రుచికరంగా వివరించారు జ్వాలా నరసింహరావు గారు. వారన్నట్లు వారి పితృపాదులు, పరమపదవాసులు శ్రీనివాసరావుగారు తనవలెనే కుమారుడు కూడా శ్రీరామాయణ పారాయణ పూర్వక ప్రవచన రచనను చేసినందున ‘పితేవ పరితుష్యతి’ అస్తు! 

డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో (హైదరాబాదు) వారు అదనపు సంచాలకులుగా, నేను ప్రొఫెసర్ గా సహవ్రతులం, ఇరుగు పొరుగులం, సహ పాఠకులం, సహోద్యోగులం కావడం అనే భాగ్య విశేషం వల్ల, ‘శ్రీరామాయణం మాకు నిత్య సంభాషణం’ కావడం వల్ల నాలుగు వాక్యాలు విన్నవించే సౌభాగ్యం నాకు కల్పించినందుకు, నా అయోగ్యతను విస్మరించి, నన్ను ఈ విధంగా సంభావించినందుకు కృతజ్ఞతలు తెల్పుకుంటున్నాను.

శ్లోII కృతం హి ప్రియమస్మాకం రాఘవేణ మహాత్మనా I
      తస్య చేత్ ప్రతికారోస్తి జీవితం సఫలం భవేత్ II (కిష్కింధా)

Friday, October 25, 2019

ఛందస్సు, అవధానం, మానవ పరిణిత మేధా సృష్టి : వనం జ్వాలా నరసింహారావు


ఛందస్సు, అవధానం, మానవ పరిణిత మేధా సృష్టి
వనం జ్వాలా నరసింహారావు
సూర్య దినపత్రిక (25-10-2019)
"శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, జ్యోతిషము, కల్పము, నిరుక్తము"...ఈ ఆరు షట్ శాస్త్రాలు. ఇవి అధ్యయనం చేసిన వాడే పండితుడు. షట్ శాస్త్రాలలో "ఛందస్సు" వేదాలను నడిపించేది. "ఛందౌపాదౌతు వేదశ్చ" అని శాస్త్రం. శరీరానికి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఎలాంటివో వాజ్మయ శరీరానికి గురు-లఘువులు అలాంటివి. చాలా సందర్భాలలో ఛందో రహితమైన కావ్య శరీరం శ్వాసించదు. పాఠకులను శాసించదు.

         ఛందస్సు ప్రాచీన మానవ పరిణిత మేధా సృష్టి!

         ఛందశ్శాస్త్రానికి ఒక గురు పరంపర ఉంది. "లయ" కారకుడైన మహాశివుడు ఆది శాస్త్రజ్ఞుడు. ఆయన బృహస్పతికి - గుహునికి చెప్పాడు. బృహస్పతి - ఇంద్రునికి, ఇంద్రుడు - శుక్రునికి, శుక్రుడు - మాండవ్యునికి, మాండవ్యుడు - సైతవునికి, సైతవుడు - యాస్కునికి, యాస్కుడు - పింగళునికి, పింగళుడు - గరుత్మంతునికి, ఛందస్సు బోధించినట్లు ఒక గురు పరంపర!

         ఇక గుహుని ద్వారా సనత్కుమారుడు, సనత్కుమారుని ద్వారా మళ్లీ బృహస్పతి, ఇంద్రుడు, వారి నుండి మళ్లీ పతంజలి, పతంజలి నుండి పింగళుడు, తద్వారా గరుత్మంతుడు...ఇదొక పరంపర! ఇలాంటి 30 రకాల ఛందో గురుపరంపరలున్నాయి! ఈ విషయమంతా "యుధిష్టిరమీమాంస" లో ఉన్నాయి. ఎంతో మేథా మథనం జరిగింతర్వాత పింగళుని దగ్గర సర్వ ఛందశ్శాస్త్రం నిక్షిప్తమైందని తెలుస్తోంది.

వేదాంగాల్లో పద్య లక్షణాలను తెలియచేసే ఛందస్సు ఒక భాగం. పద్యం ఎలా రాయాలి, ఏ ఏ లక్షణాలతో ఎటువంటి పద్యాలుంటాయి, ఆ పద్యాలు రాయడంలో పాటించాల్సిన నియమాలేంటి వివరించేది ఛందశ్సాస్త్రం. పద్యాలతో కవిత్వం చెప్పదల్చుకున్న రచయిత మదిలో పుట్టిన భావాలతో కూడిన అనేక వాక్యాలు ఒక విలక్షణమైన నిర్మాణాన్ని పొంది, ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఒక లయలాగా సాగడాన్ని ఛందస్సు అనవచ్చు. పద్యం ఒక నియమానుసారం "పాదాలు" గా విభజించబడతాయి. ఆ పాదాలు "గణాల" మీద ఆధారపడతాయి. గణాలు వాటి స్వభావాన్ని బట్టి-స్వరూపాన్ని బట్టి రకరకాలుగా నియంత్రించ బడ్డాయి. గణాల కలయిక వల్ల ఏర్పడిన పాదాలన్నీ కలిసి పద్యంగా ఏర్పడుతుంది. భాషలో వున్న అక్షరాల స్వరూప-స్వభావాలను బట్టి ఛందశ్సాస్త్రంలో "గురువు"-"లఘువు" లని వ్యవహరించబడతాయి. గురు-లఘువుల కూడికే గణాలు అంటారు. గురువు-లఘువు ఎలా ఏర్పడతాయో, ఏ ఏ అక్షరాలు గురువు-లఘువులుగా గుర్తించ వచ్చో ఛందస్సుతో కవిత్వం రాసే వారందరికీ తెలుసు. అలానే సూర్య గణాలనీ, ఇంద్ర గణాలనీ, చంద్ర గణాలనీ కూడా వుంటాయి.

         పద్య లక్షణాలలో ముఖ్యమయినవి "యతి-ప్రాసలు. పద్యపాదంలోని మొదటి అక్షరాన్ని యతి అంటారు. దీన్ని ప్రతి పద్యానికి దాని స్వభావాన్ని బట్టి, ప్రతిపాదానికి ఏర్పాటుచేయడం జరుగుతుంది. ప్రతిపాదానికి మొదటి అక్షరమైన యతి, తిరిగి ఆయా పద్యాల్లో పేర్కొన్న స్థలాల్లో చెప్పాలని ఛందస్సు శాస్త్రం చెప్తుంది. యతికి పర్యాయ పదాలు కూడా వున్నాయి. పద్యపాదంలో మొదటి అక్షరం యతి అవుతే, రెండవ అక్షరం ప్రాస అవుతుంది. యతి-ప్రాసలకు వున్న నియమాలన్నీ పద్యకవిత్వం చెప్పేవారు తప్పనిసరిగా పాటించి తీరాల్సిందే. పద్యంలో వున్న మొదటి అక్షరంతో (యతి) సమానమైన అక్షరాన్ని నియమించిన స్థానంలో నిలపడం కుదరనప్పుడు, ప్రాసగా వున్న రెండవ అక్షరాన్ని యతి స్థానం పక్కన వచ్చే విధంగా చేస్తే దాన్ని "ప్రాస యతి" అంటారు. ప్రాస యతిని వాడేటప్పుడు కూడా నియమ-నిబంధనలుంటాయి.


         ఇలా గణాలను, యతి-ప్రాసలను, ప్రాస యతులను నియమబద్ధంగా వాడుతూ పద్యకవిత్వం చెపుతారు కవులు. పద్యాల్లో వృత్తాలని, జాతులని, ఉప జాతులని వుంటాయి. అక్షర గణాలతో ఏర్పడేవి వృత్తాలు. మనందరికీ బాగా తెలిసిన ఉత్పలమాల, చంపకమాల, మత్తేభం, శార్దూలం వంటివి వృత్తాలు. తెలియనివీ, విననివీ ఎన్నో వున్నాయి. వృత్తాల్లో కూడా భేదాలున్నాయి. జాతులంటే కందం, ద్విపద, మంజరీ ద్విపద, తరువోజ, ఉత్సాహం, అక్కరలు, రగడలు లాంటివి. ఇందులో అందరికి తెలిసింది కందం. ఉప జాతుల్లో తేటగీతి, ఆటవెలది, సీసం లాంటి పద్యాలున్నాయి.

ఛందస్సును విరివిగా ప్రచారంలోకి తీసుకొచ్చిన ప్రక్రియల్లో మొదటిగా పేర్కొనాల్సింది అవధానం. కాగితం మీద కలం పెట్టి, ఆలోచిస్తూ, ఛందోబద్ధమైన కవిత్వం చెప్పేవారు కొందరైతే, అలవోకగా, ఆశువుగా, శ్రోతలను ఆకట్టుకుంటూ అవధానం చేస్తూ ఛందోబద్ధమైన పద్యాలను ధారణ చేసేవారు మరి కొందరు. అవధానం చేయాలంటే పూర్వజన్మ సుకృతం వుండాలి. సరస్వతి నాలుకమీద నిలవాలి. అందరికీ అది సాధ్యం కాదు. మాడుగుల నాగ ఫణిశర్మ, నరాల రామిరెడ్డి, జీఎం రామశర్మ, మేడసాని మోహన్, గరికపాటి నరసింహారావు, మలుగ అంజయ్య అవధాని లాంటి అతి కొద్దిమంది మాత్రమే వర్తమాన కాలంలో అవధానాలు చేయగలుగుతున్నారు. ఇటీవల రవీంద్ర భారతిలో అమెరికాకు చెందిన 18 సంవత్సరాల ఆదిత్య స్వయంగా, సొంతంగా ఆన్ లైన్లో శిక్షణ పొంది ద్విభాషావధానం అద్వితీయంగా చేశారు.

అవధానం అనేది తెలుగు సాహిత్యంలో ఒక విశిష్ట ప్రక్రియ. సంస్కృతం, తెలుగు కాకుండా వేరే ఏ భాషలోనూ ఈ ప్రక్రియ ఉన్నట్లు కనపడదు. క్లిష్టమైన సాహితీ సమస్యలను అలవోకగా పరిష్కరిస్తూ, చమత్కార పూరణలను అవలీలగా పూరిస్తూ, అసంబధ్ధ, అసందర్భ ప్రశ్నలను సమర్ధంగా ఎదుర్కొంటూ, ఆశువుగా పద్యాలు చెప్తూ - వీటన్నిటినీ ఏక కాలంలో - అవధాని చేసే సాహితీ విన్యాసమే అవధానం. కవి యొక్క ఆశుకవిత్వ గరిమకు, సాహితీ పటిమకు, ధారణా శక్తికి, పాండితీ ప్రకర్షకు అవధానం అత్యున్నత పరీక్ష. అవధానంలో అనేక అంశాలు ఉంటాయి. ఒక్కొక్క అంశాన్ని ఒక్కొక్క పండితుడు నిర్వహిస్తాడు. అతడిని పృచ్ఛకుడు అని అంటారు. అవధాని పాండిత్యాన్ని, సమయస్ఫూర్తినీ పరీక్షిస్తూ తగు ప్రశ్నలను సంధిస్తూ ఉంటారు పృచ్ఛకులు. వీటిలో నిషిద్ధాక్షరి, నిర్దిష్టాక్షరి, దత్తపది, సమస్యా పూరణం, వర్ణన, ఆశువు, పురాణ పఠనం, అప్రస్తుత ప్రసంగం, వ్యస్తాక్షరి, ఛందోభాషణం లాంటివి వుంటాయి. ఇవన్నీ అయిపోయిన తరువాత ఆ పద్యాలన్నిటినీ ధారణ చేసి అదే క్రమంలో ఏక ధాటిగా వాటిని అప్పగించడం మరో ఎత్తు.

ఈ యావత్ ప్రక్రియ ముందే చెప్పుకున్నట్లు కొందరికి భగవత్ దత్తం అయితే, కొందరికి అభ్యాసం ద్వారా సిద్ధిస్తుంది. నేర్చుకుంటే రానిదేదీ లేదంటారు. కాకపొతే నేర్పేవారు వుండాలి. కాలం గడిసిపోతున్న కొద్దీ అవధానాలు చేసేవారు తగ్గిపోతున్నారు. ఆస్వాదించేవారూ తగ్గిపోతున్నారు. దాదాపు వేళ్లమీద లెక్కించగలంత మందే ప్రస్తుతం అవధానాలు చేస్తున్నారు. వేల యేండ్ల చరిత్ర గల ఈ ఛందశ్శాస్త్రం, అవధాన ప్రక్రియ ఈనాడు సుప్త చేతనావస్త-హైబర్నేషన్లో ఉంది. దీన్ని వెలికి తీసి ప్రచారం చెయ్యక పోవడం దేశ ద్రోహం కన్నా పెద్ద నేరం! ఈ విద్య అంతరించి పోకూడదు. ఎవరైనా దీనికి నడుం బిగించాలి. సరిగ్గా ఇదే జరిగిందిప్పుడు. బ్రహ్మశ్రీ మాడుగుల నాగ ఫణిశర్మ దీనికి పూనుకున్నారు. అంతరించి పోతున్న ఈ విద్యకు పునరుత్తేజం కలిగించడానికి ఒక బృహత్తర శిక్షణా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు సాక్షాత్ సరస్వతీ మూర్తులు బ్రహ్మశ్రీ నాగఫణి శర్మ. పారిజాత తరువైన అవధాన విద్యకు పునరుత్తేజం కలిగిస్తున్నారు.

అవధాన సరస్వతీ పీఠం ఆధ్వర్యంలో “అవధాన విద్యారక్షణ-వ్యాప్తి, అవధాన బోధనకై పాఠ్యప్రణాళిక” అనే అంశాలపై మాడుగుల నాగఫణి శర్మ అధ్యక్షతన ఇటీవల ఒక ఆదివారంనాడు ఒక గోష్ఠి నిర్వహించి శర్మ పలువురు విద్వాంసుల సూచనలు సలహాలు తీసుకున్నారు. అవధాన బోధన పాఠ్యప్రణాళిను మూడు భాగాలుగా చేశారు శర్మ. మొదటి ఆరునెలలు ప్రాథమిక శిక్షణ, తరువాత ఆరు నెలలు ప్రవేశిక సర్టిఫికేట్ కొరకు మరో ఆరు నెలల శిక్షణ, చివరిగా ఒక సంవత్సరం పాటు డిప్లొమా పొందడానికి శిక్షణ అవధాన బోధనలో వుంటాయి. శిక్షణలో అంశాలుగా, గణ విభజన, ఛందోబోధన, పద్య సాధన, ఉచ్చారణా సౌష్ఠవం, శతక బోధన, భారత-భాగవతాలలోని పద్య అద్యయనం, ఛందోదర్పణం, పలువురు పురాతన-ఆధునిక కవుల రచనల అధ్యయనం, కావ్య ప్రకాశం, ధ్వన్యాలోకం, కావ్యాదర్శం, శ్రీనాధుడి లాంటి మహాకవుల రచనల అధ్యయనం, బాలవ్యాకరణం, ప్రబంధకావ్యాల అద్యయనం లాంటివి దిగ్దర్శనంగా తెలుసుకోవాలి విద్యార్థి. అవధాన బోధనను విజయవంతంగా పూర్తిచేసిన విద్యార్థులకు అవధాన సరస్వతీ పీఠం పక్షాన ప్రజాబాహుళ్యంలో వారు నేర్చుకున్న విద్యను ప్రదర్శించబడి, ఆ సభలో “అష్టావధాని”, “శతావధాని” యోగ్యతా ప్రమానపత్రం ఇవ్వడం జరుగుతుంది.

మాడుగుల నాగఫణి శర్మ అనధికారికంగా అవధాన విద్యాబోధన ఎప్పటి నుండో చేస్తున్నప్పటికీ దానికొక సాధికారికత కల్పించి, ఒక పూర్తిస్థాయి బోధన చేపట్టడం గొప్ప విషయం. అవధానులందరికీ సహజంగా పూర్వజన్మ సుకృతం, దైవానుగ్రహం వుంటుంది. వారిలాగే శర్మగారి దగ్గర నేర్చుకోబోతున్న విద్యార్థులకూ దైవ కృప, ముఖ్యంగా సరస్వతీ దేవి కృప కలగడానికి బోధనలో పాఠ్యాంశ౦గా ఏదైనా అమ్మవారి పూజ, మంత్రం, ఉపదేశం లాంటి అనుగ్రహం కలిగిస్తే బాగుంటుంది. ఆద్యతన భవిష్యత్ లో మాడుగుల ఆధ్వర్యంలో ఇదొక విశ్వవిద్యాలయంగా రూపుదిద్దుకోవడంలో సందేహం లేదు. తెలంగాణ రాష్ట్రానికే ఇదొక మణిమకుటం కావాలి. అవధానం, పద్యవిద్య సార్వజనీనం కావాలి. పద్యం సాధారణ మానవుడినీ కదిలించాలి. ఈ అవధాన పరంపర నిర్విరామంగా, ఆచంద్రతారార్కం కొనసాగాలి. అవధాన పండుగలు నిర్వహించుకునే రోజులు మళ్లీ-మళ్లీ రావాలి.   

Tuesday, October 22, 2019

అశోక్ నగర్ మా తోడల్లుడు ఇంట్లో .... జ్ఞాపకాల అనుభవాలు-అనుభవాల జ్ఞాపకాలు-12 : వనం జ్వాలా నరసింహారావు


అశోక్ నగర్ మా తోడల్లుడు ఇంట్లో
జ్ఞాపకాల అనుభవాలు-అనుభవాల జ్ఞాపకాలు-12
వనం జ్వాలా నరసింహారావు
మా చెల్లెలు పెళ్లి అయిన కొన్నాళ్లకు స్కూల్ సెలవులు అయిపోవడంతో నేను ఉద్యోగంలో చేరడానికి హైదరాబాద్ వచ్చేశాను. అప్పట్లో మా ఇంటి సామాను చాలా తక్కువ. మల్లికార్జునరావు గారింట్లో వున్నప్పుడు అప్పట్లో రు.200 ఖరీదు చేసే ఒక “సోఫా కం బెడ్” కొన్నాం. అది కాకుండా, బెండులతో చేసిన రెండు మోడాలు, రెండు కుర్చీలు వుండేవి. ఎవరొచ్చినా వాటిమీద కూర్చోవాల్సిందే. అందరి ఇళ్లలోలాగా డబుల కాట్ మంచాలు లేవు. డైనింగ్ టేబుల్ కూడా లేదు. రెండు నవారు మంచాలుండేవి. మేం వాటిమీద, మా ఇంట్లోనే వుంటున్న బావమరది వెంకన్న సోఫా కం బెడ్ మీద పడుకునే వాళ్ళం. బందువులు (ఎప్పుడూ ఎవరో ఒకరు వచ్చేవారు) వస్తే సర్దుకు పోవాల్సిందే. అదనంగా సౌకర్యాలు కలిగించేవాళ్లం కాదు. ఇవి కాకుండా మా ఆవిడ అన్నగారు డాక్టర్ రంగారావు ఇంగ్లాండ్ నుండి తెచ్చిన ఒక పెద్ద ట్రంక్ పెట్టె కూడా వుండేది. దాన్ని కూడా పైన ఒక మెత్తటి గుడ్డ పరిచి ఆసనంలాగా ఉపయోగించే వాళ్లం. వేసవి సెలవులకు ఇంటికి పోయేటప్పుడు మాకున్న కొద్దిపాటి సామాను ఈ పెట్టెలో సదిరి, ఇల్లు ఖాళీ చేసి, వాటిని మా తోడల్లుడు ఇంట్లో పెట్టి పోయాం.

         మల్లిఖార్జునరావు గారిల్లు ఖాళీ చేసిన తరువాత సెలవులనుండి తిరిగి వచ్చాక, సమీపంలోనే అశోకనగర్లో, పీపుల్స్ హై స్కూల్ పక్కనున్న గల్లీలోని మా తోడల్లుడు జూపూడి హనుమత్ ప్రసాద్ ఇంట్లోకి మారాం. ఆ ఇంటికి ఆ సందులోంచి కూడా మొత్త వుంది. ఇంట్లోకి అంటే, ఇంట్లోకి కాదు వాస్తవానికి. వాళ్ళది చాలా పెద్ద ఇల్లు. ప్రసాద్ నాన్నగారికి ఆరోగ్యం బాగాలేని ఒకానొక సందర్భంలో హైదరాబాద్ లో వుండాల్సిన అవసరం కలిగినప్పుడు ఆ ఇల్లు కొన్నారు. ఆ ఇంట్లో అప్పట్లో ఒక పోర్షన్లో నాటి విద్యారణ్య స్కూల్ ప్రిన్సిపాల్ (ఒక ఆంగ్లో ఇండియన్), మరో పోర్షన్లో ఉస్మానియా యూనివర్సిటీ రాజకీయశాస్త్రం ఆచార్యుడు ప్రొఫెసర్ సుభాష్ చందర్ రెడ్డి కుటుంబం అద్దెకుండేవారు. వెనుకవైపు గరాజ్ ద్వారా లోపలికి వస్తే ఒక హాలు, కిచెన్ వుంది. అందులోకి చేరాం మేం అద్దె తక్కువని. అందులో సుమారు ఏడాదిపాటు, అంటే 1976 వేసవి సెలవుల వరకూ వున్నాం. మా తోడల్లుడు ఆ ఇంటిని ఆ తరువాత సుమారు పదిహేనేళ్ళకు అమ్మారు.

         ఆ ఇంట్లో వున్నప్పుడే మొట్టమొదటిసారి మాకు హైదరాబాద్ నగరంలో ఫోన్ వాడకం అలవాటైంది. మెయిన్ పోర్షన్లో వున్న సుభాష్ చందర్ రెడ్డి గారింట్లో ఫోన్ వుంది. ఆ నంబరే మేం మాకు బాగా తెల్సిన వాళ్లకు ఇచ్చాం. సుభాష్ చందర్ రెడ్డి గారు కాని, ఆయన కుటుంబ సభ్యులు కాని విసుక్కోకుండా మమ్మల్ని మాకు ఫోన్ వచ్చినప్పుడల్లా పిలిచేవారు. మేం ఎప్పుడన్నా అత్యవసరంగా ఎవరికైనా ఫోన్ చేయాలంటే అభ్యంతరం చెప్పక పోయేవాళ్ళు.

         1975 వేసవి సెలవులు అయిపోయిన తరువాత నేనైతే హైదరాబాద్ వచ్చాను కాని మా ఆవిడ ఖమ్మంలోనే ఉండిపోయింది. కొన్నాళ్లు మా ఇంట్లో, కొన్నాళ్లు వాళ్ల అమ్మగారి ఇంట్లో వున్నది. బహుశా ఐదో నెల గర్భిణీగా వున్నప్పుడు, ఆగస్ట్ నెలలో హైదరాబాద్ వచ్చినట్లు గుర్తు. ఇంగ్లాండులో వున్న మాఆవిడ రెండో అన్నయ్య మనోహర్ రావు అదే సంవత్సరం స్వదేశానికి తిరిగొచ్చాడు. చిక్కడపల్లిలోనే అద్దెకు చిన్న పోర్షన్ తీసుకునే ముందర కొన్నాళ్లు మేం వున్న ఆ చిన్న ఇంట్లోనే మాతోపాటు ఆయన కుటుంబం కూడా వుంది.


అదే సంవత్సరం, జూన్-జులై నెలల్లో మాఆవిడ రెండో మేనమామ భండారు రామచంద్ర రావు గారు (భార్య విమలాదేవి-నలుగురు పిల్లలు) హైదరాబాద్ వచ్చి అశోక్ నగర్లోనే చమన్ దగ్గర ఇల్లు అద్దెకు తీసుకుని వున్నారు. ఆయన స్టేట్ బాంక్ ఆఫ్ ఇండియాలో డైరెక్ట్ రిక్రూట్ ప్రొబేషనరీ ఆఫీసర్. చీఫ్ జనరల్ మానేజర్ గా రిటైర్ అయ్యారు. ఆయన ఇంటికి సమీపంలోనే వున్న మాకు దాదాపు ప్రతి ఆదివారం వాళ్ళింటినుండి ఏదో ఒక కూరో-పచ్చడో తెచ్చి ఇస్తుండేవారాయన. రామచంద్ర రావుగారు వచ్చిన కొన్నాళ్లకు ఆయన తమ్ముడు, మాఆవిడ చిన్న మేనమామ, నాకు స్కూల్ క్లాస్మేట్ భండారు శ్రీనివాసరావు (భార్య నిర్మల-ఇద్దరు పిల్లలు) కూడా ఉద్యోగ రీత్యా హైదరాబాద్ కు వచ్చాడు. హైదరాబాద్ ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగంలో భండారు శ్రీనివాసరావుకు విలేఖరిగా ఉద్యోగం వచ్చింది. ఆయన దూరదర్శన్ హైదరాబాద్ కేంద్రంలో వార్తావిభాగం ఎడిటర్ గా పదవీ విరమణ చేశాడు. శ్రీనివాసరావు కూడా రామచంద్రరావు గారింట్లోనే ముందు భాగంలో వుండేవాడు కొద్దికాలం. ఆ తరువాత మరో ఇంటికి మారారు.

మేం మా తోడల్లుడు ఇంట్లో, ఆచిన్న పోర్షన్లో వున్నప్పుడే ఇద్దరు ఐఏఎస్ అధికారులు, ఒకరు, అప్పట్లో నిజామాబాద్ లో జాయింట్ కలెక్టర్ గా పనిచేస్తున్న జంధ్యాల హరినారాయణ్ (ఆయన ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రిటైర్ అయ్యారు), ఇంకొకరు, భద్రాచలంలో సబ్-కలెక్టర్ గా పనిచేస్తున్న జయేందర్ సింగ్ (ఆయన కేంద్ర ప్రభుత్వ కార్యదర్శిగా పదవీ విరమణ చేశారు) అక్కడికి వచ్చి మా ఆతిధ్యం (మా మోడాలమీదే ప్లేట్లు పెట్టుకుని, బెండు కుర్చీల మీద కూర్చుని) స్వీకరించారు. అలా ఎంతో మంది, మాకున్నదాంట్లోనే, మాతో కలిసి భోజనం చేశారు ఆ ఇంట్లో వున్నప్పుడు.

ఒకరోజు సాయంత్రం మొదటి ఆట సినిమా చూసొచ్చి నేను, మా ఆవిడ అన్నయ్యలు ఇద్దరు, భండారు అన్నదమ్ములిద్దరూ, ఐఏఎస్ అధికారి జయేందర్ సింగ్, అప్పట్లో డీఎస్పీ గా పనిచేస్తున్న బొమ్మకంటి శంకర్ రావు, మేమున్న ఇంటి ముందు రోడ్డు మీద మా ఇంటికి ఆనుకుని ఇసుక పోసి వుంటే దానిమీద కూర్చుని రాత్రి పొద్దుపోయేదాకా కబుర్లు చెప్పుకుంటూ వున్నాం. బహుశా రాత్రి పన్నెండు అయిందనుకుంటా. ఆ సమయంలో ఒక పోలీసు అధికారి (బహుశా ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి కావచ్చు) అటువైపుగా వచ్చి, మమ్మల్ని చూసి ఇంగ్లీష్ లో “Gentlemen neither this is time nor the place to sit and chitchat. It’s disturbing neighbors. Please get into the house” అని చెప్పాడు. మేమంతా ఆయన మాటలకు క్రమశిక్షణ కలవారిగా లేచి ఎవరింటికి వాళ్లం పోయాం.

ఆ ఇంట్లో వుండగానే 1975 సంవత్సరం క్రిస్మస్ సెలవుల్లో ఖమ్మం పోయాం. మాఆవిడ కొన్నాళ్ళ క్రితమే వెళ్లింది. క్రిస్మస్ కు ఒకరోజు ముందర డిసెంబర్ 24 న ఆ ఆదిత్య ఖమ్మం ఆంధ్రజ్యోతి ఆసుపత్రిలో పుట్టాడు.

Sunday, October 20, 2019

Why Citizen Charters are a must : Vanam Jwala Narasimha Rao


Why Citizen Charters are a must
Vanam Jwala Narasimha Rao
Telangana Today (21-10-2019)

For any Civil Society Intelligentsia Team or to that matter for their vociferous supporters across the nation it should be of utmost priority to see that Citizen Charters in all government departments and public sector undertakings are in place as an effective redress mechanism. In fact, the importance of these was discussed more than two decades ago itself in the Chief Ministers’ Conference presided over by the then Prime Minister IK Gujral held on May 24, 1997 on the threshold of 50 years of Independence.

A plan for drafting them on a priority was also prominently included in the Nine Point Action Plan of CMs Conference. It was made mandatory for all government departments-Center and State-formulating Citizens’ Charters and initiating Effective and Speedy Public Grievance Redress System.

In fact, when a feedback was taken 15 years later in January 2011, 24 state Governments and Union Territories were in the process of formulation of charters by then. VK Agnihotri, former Indian Administrative Service Officer of AP cadre and in later days Rajya Sabha Secretary General was responsible for monitoring the implementation of Charters as well as redress mechanism at that time as Secretary to Government of India in the department of Administrative Reforms.

Formulation of Charters
Soon after the CMs meet of 1997, formulation of Citizens' Charters commenced in the departments and offices, to begin with those which had a large public interface. The methodology was based on a consultation process, involving different stakeholders, specifying standards of service and time limits that the public can reasonably expect. This considerably helped in improving the quality of administration and providing a responsive interface between the citizen and the public services from the Government. The process also placed the citizen at the center of administration instead of making him a passive recipient of services rendered indifferently with no concern for quality, timeliness or cost.

The citizen’s charter is a document prepared by the service provider in a clear and precise manner about the quality and method of delivery of services to the users (Citizens) of the service. The purpose of the citizen’s charter is to: Improve the quality of service to the public, give people more choice, tell people what kind of service to expect from the government departments and make sure people know what to do if something goes wrong in the process of service delivery.

The six Principles of citizen’s charters are: Published Standards, Openness and Information, Choice and Consultation, Courtesy and Helpfulness, Redress when things go wrong and Value for Money. Provision for independent scrutiny of actual implementation with the involvement of citizen groups is the basic character of Charters. Though the charter is not proposed to be made justifiable it would carry a moral commitment of the government and would provide a framework under which public services could be evaluated.

Values and MIndset
Implementation of Charters by the respective organizations is a major task, covering vast distances and manpower. It, therefore, needs a monumental and sustained effort at training, orientation, publicity and awareness building, as well as regular and honest evaluation, to transform the Charter from a significant piece of paper into an instrument for changing long-entrenched values and mind-set. Creating a platform of interests between the service provider and its users is the first step, balancing the strengths and constraints of the former against the reasonable expectations of the later is the next.


In the then united Andhra Pradesh, for a while, remarkable work was done in this regard. Formulation of Charters and Grievance Redress Mechanism was a priority item. Dr MCR HRD Institute, the premier training center for capacity and capability building of state government employees was the platform and coordinator to formulate charters to begin with.

Dr MCR HRD Institute was entrusted with the work of conducting departmental workshops in the Institute for select departments to familiarize with the Principals and modalities in preparing the Citizens Charter. That was purely the personal initiative of the then Director General PVRK Prasad, a senior IAS officer to put the plan in to Action.

The Government considered the draft charters prepared in the Institute and an informal consultation process started by the concerned minister, secretary and Head of Department with the stake holders. A follow up workshop was organized in HRD Institute within a fortnight where in the minister concerned along with his senior officials interacted formally with representatives of stake holders.

Keeping in view the deliberations in the follow up workshop, the department firmed up the draft within the next one week. At this stage the concerned department issued a public notification through print and electronic media indicating the contents of the proposed citizen’s charter and inviting suggestions from the general public on the specific points to be covered in the charter.

Plans in place
Simultaneously the department (coinciding with the publication for suggestions from public) informally started implementing the contents of the charter to get a feedback on any practical problems faced in the implementation. Keeping in view the suggestions from General Public and the feedback in the trial run of the charter final draft was prepared, approved and issued by the Government, within three months of the original notification calling for suggestions from public.

Citizens Charters were rolled out in several departments to begin with. Among them the Road Transport Authority, the Department of Employment and Training, the Hyderabad Metro Water Supply and Sewerage Board, the TRANSO and 4 DISCOMS, the Department of Registration and Stamps, the Municipal Administration Department, the Commercial Taxes Department and the Municipal Corporation of Hyderabad implemented them in total initially. The Center for Good Governance (CGG) was helping departments in preparing a road map for implementation of the Charters and was building awareness among user groups. It’s better if the process is begun again and charters are in place in all the government departments and public sector undertakings in the state.

The real issue is the need to bring about a total change in the attitude of public servants towards redress of public grievance at all levels and to pinpoint responsibility for action on grievance of the people. This is dependent internally on measures to improve their levels of motivation and morale through rewards for good work and punishment for deliberate negligence. The senior officers should constantly supervise the staff at the cutting-edge level to improve their performance consistently.

 (Jwala Narasimha Rao was associated with formulation of Charters in Dr MCR HRD Institute. He was also one of the two members of the sub-group of the Core-Group constituted by Government of India in March 2002 to evaluate the progress of Charters in various States and Union Territories as part of the Status of Administrative Reforms in India).