Tuesday, January 29, 2019

Bringing Peace and Prosperity....KCR’s five-day worship : Vanam Jwala Narasimha Rao



Bringing Peace and Prosperity 
KCR’s five-day worship
Vanam Jwala Narasimha Rao
Telangana Today (03-02-2019)
Millennium Post, New Delhi (30-01-2019)

For universal peace and prosperity Chief Minister K Chandrashekhar Rao performed the five-day Sahasra Maha Chandiyaga on a grand scale from January 21 to January 25 at his Errvalli Agriculture farm. Even those Chief Ministers who claim to be hardcore and staunch activists of Hinduism could not perform such a Yagam as did by CM KCR. Nor even PM Narendra Modi could do it. The ultimate objective of this Sahasra Maha Chandiyaga is essentially for the all-round well-being of the farmer, the worker, the laborer, the employee, the businessman and to that matter one and all.

Wherever the Mother Goddess Chandika Parameswari is worshiped that entire area turns fertile and blossoms. Neither drought nor sorrow come anywhere near to that area. “Kalow Chandi Vinayakow” is known as the Arctic Sentence. Worshipping Chandi and Ganesh together in the ongoing Kali Yuga produces excellent results. Mother Goddess Chandi is the personification of all Gods and Goddesses and mother of mothers. The Chandi Jagajjanani has been acclaimed in Vedas and related literature as Brahmi responsible for creation, as Vaishnavi responsible for bequeathing people with happy and prosperity and as Shankari responsible for ensuring health and wealth to one and all. The Sahasra Chandi Yaga that was performed by CM KCR was nothing but a genuine effort to placate the Goddess aiming at achieving the best of everything to each habitation, town, city, district, state, country and universe that includes peace and tranquility, health and wealth etc.

Recitation of the Saptha Shati-700 Shlokas-as recorded in Markandeya Purana ensures the reader and listener the best of the happiness. The belief is that the Sahasra Maha Chandi Yaga in which the Saptha Shati is recited thousand times spanning over four days in accordance with the devout guidelines enunciated by Sringeri Jagadgurus Sri Sri Sri Bharathi Tirtha Maha Swamy and Sri Sri Sri Vidhushekhara Bharathi Maha Swamy produces great results to the mankind. Several prominent people from different walks of life attended the five-day Yagam.


There are different kinds of Chandi Yaga namely the Nava (Nine times) Chandi yaga, Shata (Hundred times) Chandi Yaga, Sahasra (Thousand Times) Chandi Yaga, Ayutha (Ten Thousands) Chandi yaga and Laksha (One Lakh times) Chandi yaga. All these are performed wherein the Maha Kali, Maha Saraswathi and Maha Lakshmi are invoked. 

The Sahasra Chandi yaga is performed for five days continuously. There will be 100 Ritwiks-priests. On the first day they together recite the Saptha Shati-700 Shlokas each 100 times. They second day it would be 200 times, the third day 300 times and on the fourth day it would be 400 times, and all put together it will be 1000 times. On all these days in addition to this recitation, there would be the Navavarana prayer, the Chatashashti Yogini Gods prayer, the Kalpokta prayer, the Kumkum Archana etc. will also take place. The Avadharas too happen. On the fifth and final day, duly generating fire, the Ajya Homam will be presented to Chandi along with other deities. The Maha Porrnahuthi will be performed finally. Every day all the four Vedas-the Rigveda, the Yajurveda, the Samaveda and the Atharvaveda-as well as the Shukla Yajurveda will be recited. 


The Sahasra Maha Chandi yaga performed by CM KCR began on 21 January morning amidst Vedic Chanting. Accompanied by his family members and under the guidance of Vishakha pontiff Swaroopanandendra Swami and blessings from Sringeri Pontiff Bharathi Thirtha Swami CM KCR and his wife offered prayers at different Mantapas. These include Ganesh Pooja, Punya Havachanam, Ritwik Varnam, Chaturveda Parayana, yaga Sala Pradakshina, Go Puja, Guru Puja, Navagraha Puja followed by Rajasyamala Yaga. This continued on all the five days.

On the concluding fifth day the Taddasaamsha Homa Tarpana to the recitations and prayers done during the first four days was offered. The Shodopachara Seva, Chatashashti Yogini Bali, Mangala Nirajana Seva were done. By generating fire and transferring it into all the ten fire pots the Agnihoma was conducted. And in the process the Maha Porrnahuthi was performed followed by Maha Mangala Harathi.

From time immemorial and from the days of creation of universe the human beings in accordance with the prevailing situations and the places where they lived have been following certain traditions, customs, beliefs etc. For some if Sriram is God for others it may be Sri Krishna and for some others it could be Lord Shiva. With the passage of times and with the evolution of several religions and structures the human being also subjected to severe metamorphosis. While some strictly and methodically observe orthodox customs and traditions, others turned from atheist to theist or vice-versa.

Everybody is entitled to adhere to his or her own beliefs. Its however not desirable to discard others’ beliefs and say that their belief itself is great.  Performing rituals like Yagnas and Yagas is a belief to some. They may believe that it is for universal well-being. In India, as well as all over the world, there are number of religions, beliefs and even blind beliefs that are in vogue. In a communist country like China also there is equal importance to Mao and Buddha. The largest Hindu Temple known as Angkor wat is in Cambodia. In Bangkok the names of most of roads are named after Lord Rama.

Performing Yagnas and Yagas has been a part of our custom and tradition. Even in most parts of the world they are performed. The Vedas have extensively quoted them. In fact it is the Yagna-Yagas which safeguard the human being always. Its again the same Yagna-Yagas that are responsible for origin of human lifestyle. It is also said that the creation of human beings is in consonance with Yagna. The Yagna is literally the quintessence of God.  As was done in ancient times and later, even now also those who feel that some thing good must be done have been performing Yagna-Yagas. Among them are Rudra Yagas, Surya Yagas, Ganesh Yagas, Chandi Yagas, Shanti Yagas etc.

Scientific research has proved the impact of Vedic chanting and Yaga and its implications on several aspects. Chandi Yaga is held for universal harmony, peace and spiritual enlightenment. This will bring peace, tranquillity and ecological balance besides all-round development in the state. This Holy Ritual is attributed to the definite impact on the thinking processes of the individuals, who participate in the Yagam and those who reside in that State bestowing positive thoughts, bringing about harmony amongst people, while contributing to their overall prosperity and well-being.

Writing about ancient rituals, Sanskrit Scholar, Prof Johan Frederik Staal of University of California who specialised in Vedic rituals and Mantras mentioned that, “temples, cathedrals, and skyscrapers were built and fell into decay, languages and religions have come and went, and innumerable wars were fought, the Vedas and their ritual continued to be transmitted by word of mouth, from teacher to pupil, and from father to son. What a triumph of human spirit over the limitations of matter and the physical body!”.

Saturday, January 26, 2019

శ్రీరాముడి బలపరాక్రమాలు రావణుడికి చెప్పిన మారీచుడు .....శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-45 : వనం జ్వాలా నరసింహారావు


శ్రీరాముడి బలపరాక్రమాలు రావణుడికి చెప్పిన మారీచుడు
శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-45
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రభూమి ఆదివారం సంచిక (27-01-2019)
         మారీచుడు రావణుడితో భయపడుతూ ఇలా అంటాడు: “రావణా! లోకంలో, స్వార్థలాభంతో వినడానికి ఇంపైన ఇచ్చకాయల మాటలు చెప్పేవారు చాలా సులువుగా దొరుకుతారు. అలాంటివారిని వెతికి తెచ్చుకోవాల్సిన శ్రమ అవసరంలేదు. ఆపత్కాలంలో కూడా వినడానికి కటువైన, ప్రియంకాకున్నా హితంగా, భవిష్యత్ లో మేలు చేసే మాటలు చెప్పేవారు-వినేవారు దొరకడం దుర్లభం. ఒకవేళ ఎదుటివారి మేలుకోరి చెప్పేవాడు దొరికినా, వినేవాడు దొరకడు. కాబట్టి నేను చెప్పబోయే మాటలు వినడానికి అప్రియమైనా, రాబోయే రోజుల్లో మేలుచేస్తాయి కనుక వాటిని ఉపేక్షించవద్దు. రావణా! రామచంద్రుడితో విరోధం వద్దని మొన్ననే నేను చెప్పాను. సరే అని అంగీకరించి పోయావు. ఇంతలో మనస్సు మార్చుకొని మళ్లీ వచ్చావు. ఇలాంటి చపలచిత్తుడు నేనేం చెప్పినా ఎలా వినగలడు? లాభపడగలడు? అయినా నీ మేలు కోరేవాడిని కాబట్టి నీకు లాభం చేకూరే మాటలనే చెప్తా”.

         “నీకు లోకంలో ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతుందో వెంటవెంట తెలియచేసే వేగులవాళ్ళు లేరు. అందువల్ల, గొప్ప పరాక్రమవంతుడు, సుగుణ సంపత్తితో అధికుడు, వరుణుడితో, ఇంద్రుడితో బలంలో సమానుడైన రాముడి వృత్తాంతాన్ని నీవెరుగవు. నువ్వు రామచంద్రుడికి కోపం కలిగించే పనులు చేయొద్దు. ఆయనకే కోపం వస్తే లోకంలో రాక్షస జాతి అనేది పేరుకుకూడా వుండదు. లోకంలో సాధారణంగా ప్రాణులు నేలమీద పది ప్రాణాలు విడుస్తారు. నీకు అంత అవకాశం కూడా ఇవ్వకుండా, నిలుచున్నవాడి ప్రాణాలు నిలిచి వుండగానే తీయడానికి సీతాదేవి పుట్టిందో?ఏమో? నీ గతి ఎలాగైతే అలాగే కావచ్చు. చేసేవాడివి అనుభవిస్తావు. ఆమె పేరుతో నాకేం కీడు కలగకుండా చూడు. కామమే శీలంగాకల నువ్వు రాజైనందువల్ల లంకాపురం కష్టాల పాలు కాకుండా వుంటుందా? ఎట్లాగూ అవుతుంది. మనసుకు ఏదిష్టమైతే అదే చేసే నీలాంటివారి బంధువులందరూ నాశనమై పోరా? నీ లాంటి చెడు బుద్ధికలవాడు, కఠినస్వభావం కలవాడు, పాపపు ఆలోచనలు కలవాడు, ప్రభువై చెప్పినా తెలుసుకోలేనివాడు, స్వాపస్వాపరాథం వల్ల తాను చెడడమే కాకుండా రాజ్యంలోని ప్రజలందరినీ చెరుస్తాడు”.


         “రావణా! రామచంద్రమూర్తిలో నువ్వు ఆరోపించిన దోషాలు ఒక్కటైనా లేవు. ఆయన నీచ క్షత్రియుడు కాదు. కుత్సిత స్వభావం కలవాడు కానే కాదు. లోభి కాడు. ధర్మగుణ సమూహం లేనివాడు కాదు. తీక్ష్ణుడు కాదు. భూతాలకు సహితం కీడు చేయడయ్యా...చేయడు. తండ్రి కోపంతో పొమ్మంటే అడవికి రాలేదు...స్వయంగా ఆయనే పితృ వాక్య పాలన కోసం వచ్చాడు. నీకెవరు అలా చెప్పారో కాని అవన్నీ అసత్యాలే. రామచంద్రమూర్తి కఠినచిత్తుడు కాదు. విద్యలేనివాడు కాదు. ఇతరుల ఇష్టప్రకారం మసలుకుంటాడు. ఇది నిజం. ఎందుకు లేనివి కల్పించి వున్నవి తారుమారుగ చెప్తావు నాయనా? ఇక రామచంద్రమూర్తిని గురించి వాస్తవం చెప్తా విను. రామచంద్రమూర్తి ఆకారంగొన్న గొప్ప ధర్మం. యుద్ధంలో పరాజయం లేనివాడు. సత్యమైన శౌర్యం కలవాడు. మోసపు యుద్ధాలు ఆయన చేయడు. దేవతలకు ఇంద్రుడు ఎలాగో, సమస్త జగాలకు ఆయన ఆవిధంగా ప్రభువు. మంచి మనస్సు కలవాడు. సూర్యుడి కాంతిని అపహరించే విధంగా రాముడి నుండి సీతను వేరు చేద్దామని చూస్తున్నావా? ఇది నీకు సాధ్యమా? రామచంద్రమూర్తి వల్ల ఆమె రక్షించబడుతున్నది. రాముడి నుండి వేరు చేస్తే రక్షకుడు లేనందువల్ల నువ్వు చెప్పినట్లు వింటుందని అనుకుంటున్నావు. ఆమె తన పాతివ్రత్యంతో తనను తానూ కాపాడుకుంటున్నది. తన రక్షాభారం ఇతరుల మీద వేయలేదు. కాబట్టి నువ్వు అపహరించినా ఆమె నీకు లోబడుతుందని భావించకు. తమను తాము కాపాడుకోలేని వారేకదా పరరక్షణ కోరేది? కాబట్టి నీ ఉద్దేశం కొనసాగదు”.

         “సీతాదేవిని నువ్వు అపహరించాలని చూస్తున్నావు. ఆమె సమీపంలోకి నువ్వు పోగలిగితే కదా....నువ్వు ఆమెను అపహరించడం? ఆమెను రాముడనే అగ్నిహోత్రం చుట్టుకొని రక్షిస్తున్నది. ఆ అగ్ని ఎలాంటిదంటావా? దానికి బాణాలే జ్వాలలు. దూరంగా వుండగానే దహిస్తాయి. ఇక దగ్గరికి పోయి బతికేదెలా? ఆ అగ్నిని ప్రజ్వలించేది ధనస్సు. ఇలాంటి అగ్ని నివురు కప్పి వున్నదని అనుకుంటున్నావేమో? అది భగ-భగ మండుతూనే వుంది. ఇలాంటి అగ్నిలో మిడుతలాగా పోయి ఎందుకు చావాలనుకుంటున్నావు? తండ్రీ! విల్లనే మండుతున్న నోరు కలవాడిని, గొప్ప అస్త్రం అనే శిఖలు కలవాడిని, సీతను నువ్వు అపహరించాలనుకున్నందున కోప్పడ్డవాడిని, ప్రకాశించే పాశం ధరించినవాడిని, శత్రుసమూహాలను సంహరించే వాడిని, సీతాపతి అనే యముడిని సమీపించడానికి, సుఖం, రాచకార్యం, ప్రాణాలు అన్నీ వదిలి, నాయనా ఎందుకు పోతావు?

         “జనకాత్మజ సంబంధమున రాముం డప్రమేయ పురుతేజుం డయ్యెను....సీతాదేవి సంబంధమున చేసి రాముడు ఛేదింపరాని గొప్ప తేజం కలవాడయ్యాడు. అలాంటి రాముడి విల్లు రక్షిస్తుంటే సీతను తేవడం నీకు సాధ్యమా? సింహం రొమ్ములాంటి విశాల వక్షస్థలం కలవాడు, పురుష శ్రేష్టుడైన శ్రీరాముడి భార్యను, సత్యశీల సంపన్నను, పాపచరిత్ర లేనిదాన్ని సమీపించవద్దు. నీ మేలుకోరి చెప్తున్నాను. రావణా! నువ్వు రాక్షస సింహుడివి. ఆయన నరసింహుడు. హిరణ్యకశిపుడు అంతటివాడు నరసింహుడి బారినపడి ఏమయ్యాడో తెల్సుకదా? అలాంటివాడు రక్షించే దాన్ని, కొంచెమైనా పాపం అనేది లేనిదాన్ని నువ్వు సమీపించవద్దు. నువ్వు రాముడికి కోపం వచ్చినా చెడుతావు....సీతకు కోపం వచ్చినా చెడుతావు. ఇక, ఇరువురికీ కోపం వస్తే నీ గతేంటి? ఆలోచించి ఆ వైపుకు వెళ్లు”.

         “సీతంటే ఏమనుకుంటున్నావు? రామచంద్రమూర్తి ఆమెను తన ప్రాణం కంటే ప్రియమైనదిగానూ, హితమైనదిగానూ, రక్షిస్తున్నాడు. అలాంటి సీతను నువ్వు అజ్ఞానివై, వలచి, గ్రహించాలనుకోవడం కార్చిచ్చు నెత్తిన పెట్టుకోవడమే. నీ ప్రయత్నం నీకు మరణాంతకం అవుతుందే కాని మానదు. అలా పోకపోతే నీకు క్షేమం కలుగుతుంది. వారంతట వారు నీమీదకు రారు. కాబట్టి నీకా భయం లేదు. రాక్షసరాజా! రామచంద్రమూర్తితో విరోధిస్తే నీ కోరికలు, రాజ్య భోగాలు, సుఖాలు, ప్రాణం, వీటిలో ఒక్కటైనా మిగలదు. కాబట్టి నీకింకా కొంతకాలం సుఖపడాలనుకుంటే, రామచంద్రమూర్తి మనస్సు నొచ్చుకునే పనేమీ చేయొద్దు. నిన్ను నేను ప్రార్థిస్తున్నాను. నువ్వు లంకకు వెళ్లిపో. అక్కడ నీ మేలుకోరే విభీషణుడులాంటివారిని రహస్యంగా కాకుండా నిండు సభలో చూడు. నువ్వు అనుకున్న పనిలో గుణమెంతో వాళ్లు చెప్తే విను. దాంట్లో ఏది బలమో, ఏది దుర్బలమో, నీ బలమెంతో, రాముడి బలమెంతో నిశ్చయం చేసుకో. ఆ తరువాత ఇది మనకు మేలనీ, ఇది మనకు కీడనీ తేల్చుకుని ముందుకుపో. నాకు తోచింది నేను చెప్పాను. రామచంద్రుడిని నువ్వు యుద్ధరంగంలో సమీపించవద్దు. నా మాట విను. నీకు మేలు కలుగుతుంది”.

ప్రియాంక ఆగమనం నెహ్రూ-గాంధీ వారసత్వం కొనసాగింపే:వనం జ్వాలా నరసింహారావు


ప్రియాంక ఆగమనం నెహ్రూ-గాంధీ వారసత్వం కొనసాగింపే!
వనం జ్వాలా నరసింహారావు
సూర్యదినపత్రిక (25-01-2019)
వారసత్వ రాజకీయాల కొన సాగింపుకు మరో మారు రంగం సిద్ధమౌతోందిఅఖిలభారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడుగా వున్న సోనియా తనయుడునెహ్రూ-గాంధీ కుటుంబ వారసత్వ పరంపరలో ఐదోతరంవాడైన రాహుల్ గాంధీ, పార్టీలోకి తన చెల్లెలును ఒక బాధ్యతాయుతమైన పదవిలోకి తీసుకున్నారు. ప్రధానకార్యదర్శి పదవిని ఆమెకు కట్టబెట్టాడు...అదీ...ఎక్కడో అమెరికాలో వున్న ఆమెను ఒప్పించి మరి అప్పగించాడు. ఇలా ఆమెకు పదవి ఇచ్చారో, లేదో, కాని ఆమెకు మరింత కీలక బాధ్యతలు, నిర్ణయాత్మకమైన బాధ్యతలు అప్పగించాలని ఆ పార్టీ సీనియర్ నేతలు క్యూ కట్టుకుని మరీ డిమాండు చేస్తున్నారువారిలో కొందరు నేతలు మరొక్క అడుగు ముందుకు వేసి, 2019 ఎన్నికలలో ఆమెను  ప్రధాన మంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని అన్నా ఆశ్చర్యం లేదు.

ఏదేమైనా నెహ్రూ-గాంధీ వారసత్వాన్ని పదిలంగా వుంచే ప్రయత్నాలు కొనసాగుతూనే వున్నాయి. 'రావాలి... రావాలి...రావాలి...' అని అందరూ ఆహ్వానిస్తుంటే ఎందుకు రాకూడదని అనుకున్నదేమో ఏమో కానివచ్చేస్తున్నానంటూ బదులు పలకనే పలికింది ప్రియాంక. పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించడానికి తాను సిద్ధం అని ఆమె అన్నట్లే లెక్క. 1999 లో ఏ విధంగానైతేపార్టీ అవసరాల దృష్ట్యా సోనియా గాంధీకి మొదలు సభ్యత్వంఆ తరువాత అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి కట్టబెట్టారోఅదే తరహాలోఆమె వారసుడిగా మొదలు రాహుల్ గాంధీ ఎంపిక, ఇప్పుడు ప్రియాంక గాంధీ ఎంపిక జరిగందనాలి.  నెహ్రూ-గాంధీ వారసత్వ రాజకీయాలు భారత దేశానికి కొత్తేమీ కాదు.

రాజకీయాలలో వారసత్వంగా ఎదగ గలిగిన వారు అనేకమంది వున్నారు. దానికి కారణాలు అనేకంఎన్.టీ రామారావు లాంటి వారు పటేల్-పట్వారీ వ్యవస్థనైతే రద్దు చేయగలిగారు కానివారసత్వంగా ఎదుగుతున్న రాజకీయ పటేల్-పట్వారీలను ఆపు చేయలేకపోయారు.ఇదేదో ఒకరిద్దరి విషయంలోనో-లేక కాంగ్రెస్ పార్టీకి చెందిన వారి విషయంలోనో జరుగుతే ఆశ్చర్యపడాల్నేమో కానిభారత దేశ రాజకీయాల్లో సర్వ సాధారణ విషయమై పోయిప్రజాస్వామ్యానికే పెను సవాలుగా మారుతుంటే ఆశ్చర్యపడక తప్పదురాజకీయాల్లో కీలకమైన పదవులను పొందిఉన్నత స్థాయికి చేరుకున్న వారి బంధుగణం అతి పిన్న వయసులోనేరాజకీయ ప్రవేశం చేసిచకచకా ఎదగడం సంప్రదాయంగా మారుతోంది

అసలు ప్రజాస్వామ్యమే వారసత్వంగా మారుతున్నదా?ఔననక తప్పదునెహ్రూ-గాంధీ కుటుంబం జాతీయ స్థాయిలో(మంచికో-చెడుకోఈ ప్రక్రియకు బీజాలు నాటితేదేశవ్యాప్తంగా వాటి మొక్కలు పెరిగిభారీ వట వృక్షాలుగా వూడలు పెంచిపెకలించడానికి సాధ్యపడని స్థితికి చేరుకుంది. "వారసత్వం జన్మ హక్కుఅని వాదించే స్థాయికి చేరుకుందిసుమారు తొంబై సంవత్సరాల క్రితం బ్రిటీష్ ఇండియాలోన్యూఢిల్లీ నుంచి "సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ"కి ఆ కుటుంబం మొదటి తరం నాయకుడు మోతీలాల్ నెహ్రూ ఎన్నికైన తర్వాతఆ కుటుంబానికి సంబంధించిన దాదాపు అందరూ చట్ట సభల్లో అడుగు పెట్టారుకాకపోతేఅందులో పలువురు వారి-వారి సామర్థ్యాన్ని బట్టే ఆ పదవులకు చేరుకుని వుండవచ్చు. కుటుంబ నేపధ్యం తప్పక ఉపయోగపడిందనాలి.

ఒక తరం నుంచి మరో తరానికి రాజకీయాధికారం బదిలీ అవుతోందిలా. వారసత్వ రాజకీయాలు-కుటుంబ రాజకీయాలు దేశ భవిష్యత్ ను శాసించే దిశగా కదులుతున్నాయిరాచరిక వ్యవస్థకు సంబంధించిన రాజకీయాలకు అలవాటు బడిన భారతీయులకుఅనాదిగారాజులు-మహారాజులు-చక్రవర్తులు తమ తమ కొడుకులను-కూతుళ్లను తమ తదనంతరం సింహాసనం అధిష్టింప చేసేందుకు పన్నే వ్యూహాల గురించిన కథలను విన్నారుప్రజాస్వామ్య మౌలిక సిద్ధాంతాలను ఇంకా సరిగ్గా అవగాహన చేసుకోలేని అమాయక భారతీయులుబహుశా వర్తమాన రాజకీయాలలోనూవారసత్వంగాతమ సంతానం నాయకత్వం చేపట్టడంలో తప్పులేదని భావిస్తుండవచ్చుఅలా మొదటి తరం నాయకులు తమ వారసులుగా సంతానాన్ని తేవడంలో అ నైతికం లేదనే వారి భావన కావచ్చుఅందుకేస్థానిక సంస్థల నుంచిప్రధాన మంత్రి స్థాయి వరకువంశ పారంపర్యంగా కొన్ని కుటుంబాలకు చెందిన వారికే రాజకీయాధికారం లభిస్తోంది


ఒక్క సారి అధికారంలోకి రావడంతోనేతమ సర్వ శక్తులను ఒడ్డిబయట వారెవరినీ రాకుండాతమ వారినే తమ వారసులుగా చేసే ప్రజాస్వామ్య రాచరిక వ్యవస్థ వేళ్లూనుకోసాగిందిదీని పర్యవసానం ఏంటనేది ఎవరికీ అంతు చిక్కడం లేదుదీనికి అడ్డు కట్ట వేయడం సాధ్యమేనాభారత దేశంలోని రాజకీయ పార్టీలన్నీఅవినీతిని ఉత్పత్తిచేసేవంశపారంపర్య కుటుంబ వ్యవస్థలువీటిని పెంచి పోషించే వ్యక్తులుతమ కుటుంబీకులను తప్పవెలుపల వారిని,తమ గుప్పిట్లో వుంచుకున్న పార్టీలోకి అడుగుబెట్టనివ్వరులోపలున్న వారి గొంతు నొక్కేసిఅసమ్మతి రాగాన్ని వినిపించకుండా జాగ్రత్త పడతారుఫలితంగా అవాంఛనీయ పరిణామాలు చోటుచేసుకోవడం,ధన బలం-కండ బలం-కులమత బలం ఎన్నికల ప్రక్రియలో కీలక పాత్ర పోషించడం జరుగుతుందిప్రజ్ఞా పాటవాలు-శక్తి సామర్థ్యాలున్న సాటి-తోటి పౌరులుసమాజానికి ఎంతో సేవ చేయాలని వున్నాదానికి కావాల్సిన రాజకీయ కుటుంబ నేపధ్యం లేకపోవడంతోఎన్నికల్లో పోటీ చేయలేక పోవడంచేసినాగెలిచి చట్ట సభల్లో ప్రవేశించలేక పోవడం కష్టమై పోతోందిఈ పరిస్థితి ఇలా కొనసాగితేభారత ప్రజాస్వామ్యంప్రజల భాగస్వామ్యం లేనిది గాను-ప్రజల సాధికారత కొరవడేదిగాను కావడం తథ్యంప్రతి రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీల సారధ్యంలో ఆయా రాజకీయ నాయకుల కుటుంబ పాలన కొనసాగి, "ప్రజాస్వామ్య సంస్థానాలుఆవిర్భవించే ప్రమాదం పొంచి వుంది.

          ఈ ప్రమాదానికివారసత్వ సంస్కృతికి కారకులెవరంటే,జవాబుగా కాంగ్రెస్ పార్టీ అని ఎవరైనా వెంటనే చెప్తారుతండ్రి మోతీలాల్ నుంచి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిని వారసత్వంగా పొందిన జవహర్లాల్ నెహ్రూవ్యూహాత్మకంగా-పకడ్బందీగా కుటుంబ వారసత్వ పాలనకుఆయన ప్రధానిగా వున్న కాలంలోనే పునాదులు వేశారుకూతురు ఇందిర ప్రధాని కావాలని నెహ్రూ భావించారుఆయన కోరిక నెరవేరిందిఇందిరా గాంధీ కూడా తండ్రి-తాత బాటలోనే పయనించిందిమొదట సంజయ్ గాంధీని,తర్వాత రాజీవ్ గాంధీని తెర పైకి తెచ్చింది తన వారసుడిగా. ఎమర్జెన్సీ ముందరతర్వాత సంజయ్ గాంధీ ప్రభావం ఇందిరపై బాగా పనిచేసిందివిమాన ప్రమాదంలో సంజయ్ దుర్మరణం తర్వాత చరిత్ర అందరికీ తెలిసిందే

సంజయ్ వస్తాడనుకున్న స్థానాన్ని రాజీవ్ఇందిర మరణం తర్వాత భర్తీ చేశాడుఆ తర్వాతమకుటం లేని మహారాణిగాసోనియా వారసత్వం స్వీకరించారుఇక ముందుంది రాహుల్, ప్రియాంకాగాంధీల పర్వంఇదంతా ఒక పథకం ప్రకారం జరిగింది కాదాఏమోరాచరికంలో లేని వారసత్వం ప్రజాస్వామ్యంలో సుసాధ్యం చేసిన ఘనత మనదేప్రజాస్వామ్యాన్ని మించిన పాలనా విధానం లేనే లేదుఅధికారంలో తమ వాళ్ళే వుండిపోవాలన్న కాంక్షతోకొందరు వ్యక్తులు "ప్రజాస్వామ్యాన్ని" "వారసత్వ స్వామ్యంగా మలిచేశారుప్రజాస్వామ్యాన్ని-రాజకీయ వ్యవస్థను గేలి చేసిహాస్యాస్పదం చేశారుప్రపంచంలో మనను చిన్న చూపు చూసే పరిస్థితి కలిగించారుఈ పాపంలో అన్ని రాజకీయ పార్టీలకు-నాయకులకు అంతోఇంతో భాగం వుందివారసత్వంగా ఎదిగిన-ఎదుగుతున్న వారిలో ఏ కొద్ది మందో తప్పచాలా మంది అలా ఎదగడానికి కేవలం రాజకీయ-కుటుంబ నేపధ్యమే కారణం అనక తప్పదుప్రజాస్వామ్య మనుగడే ప్రశ్నార్థకంగా మారిపోయిందీ కారణాన.

Sunday, January 20, 2019

జనస్థాన వృత్తాంతం మారీచుడికి చెప్పి సహాయం కోరిన రావణుడు ..... శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-44 : వనం జ్వాలా నరసింహారావు


జనస్థాన వృత్తాంతం మారీచుడికి చెప్పి సహాయం కోరిన రావణుడు
శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-44
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రభూమి ఆదివారం సంచిక (20-01-2018)
         దేహాన్ని గగుర్పాటు కలిగించే భయోత్పాదకములైన శూర్ఫనఖ మాటలు విన్న రావణుడు, మంత్రులతో ఆలోచించి, కార్యం ఎలా చేయాలో నిర్ణయించుకొని, వాళ్లను పొమ్మని పంపి, ఎలా ముందుకుపోవాలో ఆలోచన చేశాడు. రాముడు చేసిన రెండు పనులకు-శూర్ఫనఖను విరూపను చేయడం, ఖరాదులను చంపడం-ప్రతీకారం తీసుకోకుండా వూరికే వుంటే, తనను పౌరుషహీనుడని, బలహీనుడని, లోకులు దేవతలు నవ్వుతారనీ, మానవంతుడికి మరణం కంటే అపకీర్తి చెడ్డదనీ అనుకుంటాడు.

         (రావణుడిలా అనుకుంటాడు: “ప్రాణం పోగొట్టుకొనైనా మానం రక్షించుకోవాలి. కాబట్టి వూరుకోవడం మానహానికరం. అపకీర్తికరం. ప్రతీకారం చేయాలంటే ఏం చేయాలి? ఎలా చేయాలి? బహిరంగంగా యుద్ధానికి పోవాలా? అలా చేస్తే...పదనాలు వేలమంది మహాబలశాలులను ఒక్కడే కాళ్లమీద నిలబడి మూడు గడియల్లో చంపాడే? అలాంటివాడు సామాన్యుడు కాడే? ఇలాంటి వాడిని యుద్ధంలో నేనే జయిస్తానని నమ్మకం ఏంటి? కాబట్టి ఇది అపాయం. వంచన చేసి సీతను అపహరించి తెస్తే....ఎక్కడో వున్న వాళ్లను ఇంటిమీదకు నేనే తెచ్చినట్లు అవుతుంది. వారిక్కడికి వస్తే వూరికే పోరు. మరో విధంగా ఆలోచిస్తే, రామలక్ష్మణులు నా గురించి తెలుసుకొనడం, తెలిసినా సముద్రాన్ని దాటడం, లంకకు రావడం, యుద్ధంలో గెలవడం, ఇరువురు మనుష్యులకు అసంభవం. ఒకలా వేళ అలా కాకపోతే, భార్యను కోల్పోయిన బాధతో, అవమానంతో, చావనే చస్తే మరీ మంచిది. సీతను వశపర్చుకుంటే నాకే భయం లేదు. ఆ విషయం వాళ్లకు తెలియగానే చస్తారు).

         ఇలా నిశ్చయించుకొని, మనస్సు దృడం చేసుకొని, గుర్రాలుండే చోటుకు పోయి, రహస్యంగా రథాన్ని సిద్ధం చేసి తీసుకొని రమ్మని సారతికి చెప్తే వాడలాగే చేశాడు. ఆయన అనుకున్న విధంగా పోగలిగే ఆ రథం మీద, పది తలల, ఇరవై చేతుల రావణుడు, ఆకాశ మార్గంలో మేఘంలాగా పోయాడు. మార్గమధ్యంలో అనేకానేక సుందర స్థలాలను, వృక్షాలను, మునులను, పక్షులను, అప్సరసలను, గంధర్వులను, దేవతలను, పుణ్యలోకాలను జయించినవారిని, ఔషధులను, అగరు చెట్లను, వనాలను చూసాడు. అందమైన ప్రకాశించే ధనధాన్య సమృద్ధికల సుందరమైన సముద్ర తీరాన్ని చూశాడు. ఆ ప్రదేశంలో మేఘాలతో సమానమైన, నూరామడల పొడవుకల, కొమ్మలున్న పెద్ద మర్రిచెట్టును చూశాడు. పూర్వం గరుత్మంతుడు స్వర్గానికి పోతూ, తనకు ఆహారంగా గజకచ్చపాలను తన గోళ్లలో ఇరికించుకుని తటాలున ఆ మర్రిచెట్టు కొమ్మమీద వాలగా, ఆ భారాన్ని సహించలేక, కొమ్మ విరిగింది. ఆ కొమ్మను పట్టుకొని వాలఖిల్యాదులు ఆ సమయంలో తపస్సు చేస్తున్నారు. వాళ్లు తమ తపస్సు విఘ్నమైందని తనను శపిస్తారని భయపడ్డ గరుత్మంతుడు, ఆ కొమ్మను ముక్కుతో పట్టుకొని త్వరగా  పోయాడు. పోతూ, మాంసాన్ని భుజించి, మునులను క్షమించమని ప్రార్థించాడు. వాళ్ళు పోయిన తరువాత బోయపల్లెను నాశనం చేశాడు. ఆ సంతోషంతో రెండింతల బలంతో ఆకాశానికి ఎగిరి, ఇనుప కమ్ముల కిటికీలు పగలగొట్టి, రాల్చి, మణులతో నిండిన ఇంద్రుడి ఇంట్లోకి పోయి, గరుత్మంతుడు అమృతాన్ని హరించాడు. అలాంటి గరుత్మంతుడి గుర్తుకల, సుభద్రమనే పేరున్న మర్రి చెట్టును కూడా చూసి, రావణాసురుడు సముద్రాన్ని దాటాడు.

         ఆ వనంలో ఒక ప్రదేశంలో, నిర్మలమైన స్థలంలో, మితాహారుడై, చలించని ఇంద్రియ నిగ్రహంతో, జింక చర్మం ధరించి, జడలతో, నారవస్త్రాలు కట్టుకుని తపస్సు చేస్తున్న మారీచుడి దగ్గరకు పోయాడు రావణుడు. మారీచుడు అతడిని తగు విధంగా మర్యాదలు చేశాడు. మళ్లీ ఎందుకు వచ్చావని అడిగాడు రావణుడిని మారీచుడు.


         మారీచుడి ప్రశ్నకు జవాబుగా అనునయంగా ఇలా చెప్పాడు రావణుడు. “తండ్రీ! విశదంగా, వివరంగా చెప్తా విను. ఆర్తుడనై వచ్చాను. మహాత్మా! నా ఆర్తి పోగొట్టడానికి నువ్వు తప్ప నాకు వేరే గతి లేదు. నిశాచరశ్రేష్టుడా! నా ఆజ్ఞ మేరకు నా తమ్ములు ఖరుడు, దూషణుడు, ముద్దుల చెల్లి శూర్ఫనఖ, అతి శూరుడైన త్రిశిరుడు, పద్నాలుగు వేలమంది రాక్షసులు జనస్థానంలో వుంటూ, ధర్మాత్ములైన వారిని బాధలు పెట్టడం నీకు తెలిసిన విషయమే. వారంతా రాముడి మీద కోపంతో ఆయనమీదికి యుద్ధానికి పోగా, అతడు వారందరినీ ఒంటికాలిమీద నిలబడి చంపాడు. అంతే కాకుండా మునులంతా దండకారణ్యంలో భయం లేకుండా తిరగొచ్చని చెప్పాడు. తండ్రి వెళ్ళగొట్టితే భార్యతో అడవుల్లో దుఃఖించే నీచ క్షత్రియుడు, కుచ్చితపు నడవడి కలవాడు, కోప గుణం కలవాడు, ఇంద్రియ జయం లేనివాడు, కరుణా శూన్యుడు, జీవకోటికి కీడు చేయాలన్న ఆశ కలవాడు, ధర్మాన్ని వదిలినవాడు, వివేకం లేనివాడు, రాముడు నాతో విరోధం లేకున్నా నిష్కారణంగా నా చెల్లెలి ముక్కు-చెవులు బలగర్వంతో కోశాడు”.

         రాముడు ఇలాంటివాడు కాబట్టే, దేవతాస్త్రీతో సమానమైన సౌందర్యం కల అతడి భార్య జానకిని తీసుకురావడానికి తాను శీఘ్రంగా పోతున్నాననీ, మారీచుడు తనకు తోడుగా రావాలనీ, తన తమ్ములు, మారీచుడు, తనకు సహాయంగా వుంటే యుద్ధంలో దేవతలనైనా గడ్డిపోచలాగా చూస్తాననీ, ఇది తన నిశ్చయం అనీ, అంటాడు రావణుడు మారీచుడితో. “ఇది నా అభిప్రాయం కాబట్టి నువ్వు నాకు సహాయపడు. శౌర్యంలో, బలంలో, మంచి ఉపాయం చేయడంలో నీకు సమానమైన వారు లేరు. యుద్ధంలో నువ్వు పన్నని మాయలు లేవు. నువ్వు ఇలాంటివాడివని తెలిసేకదా నిన్ను చూడడానికి ఇంతదూరం వచ్చాను. నువ్వేం సహాయం చేయగలనంటావా? నువ్వు చేయాల్సిన పని చెప్తా విను. బంగారు వన్నె విచిత్రపు చుక్కలు కల జింకవై, రాముడు, సీత వున్నా చోటుకు పోయి ఆ ప్రదేశంలో సంచరించు. నిన్ను పట్టుకోవడానికి సీత, రామలక్ష్మణులను పంపుతుంది. అప్పుడు నేను ఒంటరిగా వున్న జానకిని (రాహువు చంద్రకాంతిని హరించినట్లు) అపహరిస్తాను”. అని అంటాడు రావణుడు.

         (రాహువు చంద్రకాంతిని హరించినట్లు అనడమంటే, రాహువు ఏ విధంగానైతే కొంచెం కాలం లోకానికి కాంతి కానరాకుండా చేస్తాడో, అలాగే, రావణుడు కొంతకాలమే సీత లోకానికి కానరాకుండా చేయగలడని భావం. రాహువు చంద్ర బింబాన్ని ఏమీ చేయలేనట్లు రావణుడు కూడా సీతను ఏమీ చేయజాలడని భావం. లోకంలోని చీకటి చంద్రకాంతి తగులగానే దాని స్వరూపం లేకుండా పోతుంది. అలాగే సీత సాన్నిధ్యం దొరికనివారు తమ అజ్ఞానం పోగొట్టుకుని, బాగుపడతారు. రావణుడు సీత సాన్నిధ్యం లభించినా తన అజ్ఞానాన్ని పోగొట్టుకో లేకపోతాడని భావన).

         మారీచుడితో ఇంకా ఇలా అంటాడు రావణుడు: “భార్య లేకపోవడంతో కృశించి, దుఃఖించే రామచంద్రుడిని వధించి సుఖంగా, నిర్విచారంగా వుంటాను. మా తండ్రీ! ఈ మాత్రం సహాయం చేయి”.

         రావణుడు చెప్పిన రాముడి వృత్తాంతాన్ని ఆసాంతం విన్న మారీచుడు, రామచంద్రమూర్తి శౌర్యం తెలిసనవాడైనందున, తన ప్రాణానికే ముప్పు వచ్చిందికదా! అని గుండెలు ఝల్లన భయపడ్డాడు. నిశ్చేష్టుడయ్యాడు. తెప్పరిల్లి, వణకుతూ, నోట తడిలేకపోవడంతో పెదవులు నాకుతూ, ధైర్యం చెడి శవంతో సమానమై పోయి, రావణుడిని చూస్తూ భయంతో, రెండు చేతులూ జోడించి, తనకు క్షేమకరమైన విధంగా ఇలా అంటాడు.     

Wednesday, January 16, 2019

A big leap of progress and Yet another Historical day dawns : Vanam Jwala Narasimha Rao


A big leap of progress and
Yet another Historical day dawns
Vanam Jwala Narasimha Rao
The Millennium Post, New Delhi
The Hans India (17-01-2018)

                 Yet another historical day dawns on Telangana today with the commencement of newly elected Assembly sessions after the earlier KCR Government voted to power for a second term with a thumping majority. This is preceded by swearing in of Protem Speaker in Raj Bhavan by Governor yesterday. The four day session will witness oath taking of newly elected MLAs by Protem Speaker, new Speaker election, Governor’s address to joint session of legislature and motion of thanks to Governor’s address. 

                 During the four and a half years of KCR and his team’s first term an unprecedented progress and development was registered in the state, attracting the attention of the entire country. The Government with its capacity of governance and strategic approach heralded the state towards progress on developmental trajectory.

              The KCR Government all through its first term gave top priority for comprehensive welfare measures. Livelihood and security has been provided to over 40 lakh poor through Aasara Pensions which is done nowhere in India. As promised in the election manifesto the government will be enhancing all types of Aasara pensions from Rs 1000 to Rs 2016. The pensions of differently abled persons would be enhanced from Rs 1500 to Rs 3016. In addition unemployment allowance of Rs 3016 will be given to unemployed youth. All these may probably come into effect from the next financial year.

Kalyana Laxmi and Shaadi Mubarak schemes which have been initiated and implemented by KCR Government to financially help the families of those who sink in severe debts due to marriage of their girl child, continue to yield excellent results.

With a view to protect and enable poor to live with dignity and self-respect, KCR Government initiated and implementing the construction of two-bed room houses. As promised in the election manifesto, KCR government while continuing the construction of double bed room houses as per the existing norms, will in future may provide financial assistance to those poor persons who have own plot and desirous of constructing a house on their own.


              Several steps that were initiated by KCR Government to restore and revitalize agriculture sector which was totally subjected to destruction during the erstwhile rule yielded very good results. All the farmers experienced great relief. The Rythu Bandhu Scheme introduced by KCR Government aimed at investment support for each farmer for agriculture received praise from all over the world. The farmers are happy as they are getting Rs 8000 per acre for two crops, at the rate of Rs 4000 per acre per crop. The investment support of Rs 8000 per acre will now be increased to Rs 10000 per acre from next financial year in accordance with election manifesto. The Rythu Bhima Life Insurance Scheme comes to the rescue of the farmer’s family in the event of his death, for whatever reason it might be. Under this scheme, the farmer’s family gets Rs 5 Lakhs from LIC within 10 days of his death. Rythu Samanvaya Samithis (Farmer Coordination Committees) have been formed to bring farmer into an organized sector. The Government as promised in the election manifesto will pay honorarium to its members.

              Inclusion of Rythu Bandhu and Rythu Bhima Schemes in the list of ten great unique schemes of United Nations is indeed a rare international appreciation to Telangana State and KCR government. Several states are preparing themselves to adopt this scheme besides a loud thought even at the national level. It a matter of pride that several agricultural experts and economists keep saying that Rythu Bandhu Scheme is a unique one that alone can prevent a farmer from any distress.

            The rectification and purification of land records is a great reform in the country which KCR government did successfully. With this a clarity regarding the ownership of land could be arrived at. The Government has issued high security enabled Pattaadar Pass Book cum title deed to the farmers.


              The Telangana State in a very short time could overcome the power crisis. As one and only state that provides power to all sectors including agriculture round the clock 24 hours, it created several records of sorts. To convert Telangana as a power surplus state and to bring 28000 Megawatts of installed capacity of power, KCR government is constructing new power plants. Telangana established a record in percapita power consumption which is an indication of development index.

              For provision of irrigated water to one crore acres of land, KCR Government has constructed on war footing Palamoor-Rangareddy, Kaleshwaram, Seetarama, Dindi etc. Projects. Parallelly, all the pending projects were expedited on fast track and they are providing irrigated water for 12 lakh acres of fresh ayacut. Thousands of chain of Tanks were rejuvenated as part of Mission Kakatiya. To permanently solve the drinking water problem, the Government is committed to complete the ambitious project of Mission Bhagiratha by end of March 2019. The Mission Bhagiratha scheme has become a role model to other states.

              As part of revitalization and strengthening of rural economy sheep distribution on a large scale to Yadavas and Kurumas has been going on to strengthen them financially and also to register self-sufficiency in meat production. To enhance the livelihood opportunities of fishermen, the Government has taken-up large scale fish seeding in all water bodies in the state and the rights on fishing there have been given to fishermen. To help and assist the handloom workers, they are provided with continuous work, besides subsidizing on wool and chemicals.

              663 New Residential Schools have been established in the state as part of KG to PG free and compulsory education policy. The students receiving education in these institutions have been achieving tremendous results and success in many areas. From next academic year Government proposes to start 119 more Residential Schools at the rate of one for each constituency.

              The Government has significantly developed the Public Health Organization. KCR Kits scheme has been introduced. Kanti-Velugu program is being organized successfully, to bring eye screening facility to each and every one suffering from eye related problems. On the lines of Kanti-Velugu large scale health camps are planned to be organized across the state for rest of diagnostic tests like ear, nose, throat and dental. The health profile of every individual, as well as that of state will be developed.

            The TS IPass Act popularly known as “single window without grills” has been brought. This act enables to establish new industries by investors in a hassle-free manner for which the required clearances are given within 15 days of application. Telangana today is an attractive destination for industrial investment. The services sector has become the main growth engine of the State economy in the recent decades. There has been a spurt in the number of IT/ITES units in the State.

Every scheme implemented in the state yielded tremendous results. They are directly helping the people. Every scheme that is under implementation is leaving a rich experience among people. All these schemes have the blessings of all the people. The Telangana State holds its head high with pride before the whole world as a progressive state and with KCR again becoming Chief Minister of state would bring a great beginning. 

తెలంగాణ ప్ర‌గ‌తిని చూపిన జ్వాలా వ్యాసాలు : నియోగి (ఆంధ్రప్రభ-జనవరి 14, 2019)


తెలంగాణ ప్ర‌గ‌తిని చూపిన జ్వాలా వ్యాసాలు
నియోగి (ఆంధ్రప్రభ-జనవరి 14, 2019)

వనం జ్వాలా నరసింహారావు ఈ పేరు సుపరిచితమైనది. ఆయన రచయితగా ఇంగ్లీషు, తెలుగు భాషల్లో అనేక గ్రంథాలను అందించారు. ఆయన రచనలు అందరికీ ఎంతో ఉపయోగకరమైనవి. నిత్య అధ్యయన శీలి ఆయన. జ్వాలా నరసింహారావు ఏది రాసినా ఒక పరిశోధనతో, సునిశిత పరిశీలనతో రాస్తారు. హైదరాబాద్‌, చెన్నై, గోవా, ఎసింక్రోనస్‌ హిస్టరీ, స్క్రాప్‌ బుక్‌, యాన్‌ ఎజెండా ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ ఏపి, గవర్నెస్‌ విత్‌ డిఫరెన్స్‌ వంటి ఇంగ్లీషు గ్రంథాలను, తిలక్‌ జ్ఞాపకాలు, అనుభవాలే అధ్యాయాలుగా, సుందరకాండ మందార మకరందం, బాలకాండ మందార మక రందం, అయోధ్యకాండ మందార మకరందం, ధర్మధ్వజం వంటి తెలుగు గ్రంథా లను అందించి ప్రతిభ చాటుకున్నారాయన. జ్వాలా నరసింహారావు ప్రతిభను గుర్తించి నాటి ముఖ్యమంత్రి డాక్టర్‌ మర్రి చెన్నారెడ్డి తన వద్ద పౌరసంబంధాల అధికారిగా నియమించుకున్నారు. మళ్లి 25 సంవత్సరాల తర్వాత నేటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సీ.పీ.ఆర్వోగా జ్వాలా నరసింహారావును తీసుకున్నారు. ఇద్దరు ముఖ్యమంత్రుల పరిపాలనా తీరును, వారు ప్రవేశపెట్టిన పథకాలను, వాటి అమలుకు వారు చూపిన శ్రద్ధను అతి దగ్గరగా గమనించే అవకాశం ఆయనకు కలి గింది. ముఖ్యంగా కే.సి.ఆర్‌. పరిపాలనకు సంబంధించి, ఆయన సాధించిన విజయా లను గురించి ఒక రచయితగా ఆయన అత్యంత శ్రద్ధతో ఇదీ సుపరిపాలన (51 నెలల కేసిఆర్‌ ప్రభుత్వం) పేరుతో ఒక గ్రంథాన్ని వెలువరించారు.

కేసిఆర్‌ పరిపాలన ప్రారంభించిన నాటి నుండి 2018 సెప్టెంబర్‌ వరకు జ్వాలా నరసింహారావు వివిధ పత్రికల్లో రాసిన వందకు పై చిలుకు వ్యాసాలు ఈ గ్రంథంలో ఉన్నాయి. ప్రతి వ్యాసంలోనూ కే.సి.ఆర్‌ చేపట్టిన ఒక్కో అంశాన్ని విపులంగా చర్చిం చారు. అయితే ఆయన ఈ వ్యాసాల్లో భజన చేసినట్లుగాక ఒక శాస్త్రీయ అవగాహనతో విపులంగా చర్చిస్తూ కే.సి.ఆర్‌ పాలనను సమర్థించారు. సుపరిపాలన ఎలా ఉండాలో తెలియజేశారు. ఈ గ్రంథం ద్వారా మనకు తెలియని అనేకాంశాలు తెలుసుకోవచ్చు. ఒక పరిణతి చెందిన రచయితగా ఆయన అందించిన ప్రతి వ్యాసమూ మనల్ని ఆలో చింపజేస్తుంది. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలాంటి వ్యాసాలు రాయా లంటే ఒకవిధంగా కత్తిమీద సాములాంటిదే. ఏమాత్రం అజాగ్రత్తగా రాసినా అది ఎటు పోతుందో తెలియదు. అతి జాగ్రత్తగా, పూర్తి అవగాహనతో పాలనలో కే.సి.ఆర్‌ మార్క్‌ను బలంగా ఈ వ్యాసాలలో నరసింహారావు చూపించటంలో వందకు వందశాతం సఫలీకృతమయ్యారని ఘంటాపథంగా చెప్పవచ్చు.

దీని ద్వారా హైదరాబాద్‌ పూర్వ చరిత్ర, ఉద్యమ నేపథ్యాలు, వర్తమాన చరిత్ర, హైదరాబాద్‌ విశ్వనగరంగా రూపుదిద్దుకుంటున్న దశను కూడా మనం తెలుసుకోగ లుగుతాము. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అభివృద్ధి దిశగా ఎలా శరవేగంగా పరుగులు పెడుతుందో ఈ వ్యాసాల ద్వారా సంపూర్ణంగా అవగాహన చేసుకోవచ్చు. కే.సి.ఆర్‌ దార్శనికత ఎలాంటిదో కూడా ఈగ్రంథం ద్వారా తెలుసుకోవచ్చు. కే.సి.ఆర్‌ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలుచేసే దిశగా సాగించిన ప్రయాణం గురించి రెండు వ్యాసాలు ఈ గ్రంథం మొదట్లో కనిపిస్తాయి. దూరదృష్టి అనేది తెలంగాణ సి.ఎం. కున్న అత్యంత ముఖ్య లక్షణాల్లో ఒకటి. ఇచ్చిన మాటకు ఆయన కట్టుబడతారు. చెప్పింది తప్పకుండా చేస్తారు. ఆయన ప్రారంభించిన ప్రతీ పథకంలోనూ, చేసిన ప్రతి వాగ్దానంలోనూ దీన్ని మనం చూడవచ్చునంటారు జ్వాలావారు ''నవ్య తెలంగాణ పథనిర్దేశకుడు కే.సి.ఆర్‌ అన్న వ్యాసంలో. ఓటుకు నోటు కుంభ కోణంలో తమ పార్టీ శాసనసభ్యుడు ఒకరిని రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకుని, అరెస్టు చేసి, ఇంటరాగేషన్‌ చేసిన నేపథ్యంలో, తాను అరెస్టు అవుతాననే భయంతో చంద్రబాబు నాయుడు ఏపి పోలీసులతో రక్షణ ఏర్పాటు చేసుకున్న విషయాన్ని ''సెక్షన్‌ 8 అవినీతికి రక్షణా?'' అన్న వ్యాసంలో కూలకుషంగా చర్చించా రాయన.

ఏడాది పాలనలో బంగారు తెలంగాణకు బలమైన పునాది వేసిన నేపథ్యాన్ని ఒక వ్యాసంలో చర్చించారాయన. కే.సి.ఆర్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందరెందరో దేశవిదేశాలకు చెందిన వారు ఆయన్ను కలుసుకుని అభినందించారు. తమ వంతు కృషిని అందిస్తామని కే.సి.ఆర్‌ తెలియజేశారు. ఇలాంటి విషయాలు ఈ గ్రంథంలో దొరుకుతాయి. గోదావరి పుష్క రాల సందర్భంలో కే.సి.ఆర్‌ చేసిన ఏర్పాట్ల గురించి, పుష్కరాల ప్రాచీనత గురించి, దాని ప్రాముఖ్యత గురించి జ్వాలావారు ఒక వ్యాసంలో చర్చించారు. తెలంగాణ హరితహారం గురించి ఒక వ్యాసంలో చూడ వచ్చు. ఇది కే.సి.ఆర్‌ చేపట్టిన మరో ప్రజాయజ్ఞంగా ఆయన వర్ణించారొక వ్యాసంలో.

''రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గవర్నరుకు, రాష్ట్రపతికి పాదాభి వందనం చేయడాన్ని వక్రీకరించి భాష్యం చెప్పిన సామాజిక శాస్త్రవేత్త కంచ ఐలయ్య ఇలా రాయడం (ఆంధ్రజ్యోతి ఎడిట్‌ పేజి 5-7-2015) మాట్లాడటం కొత్తేమీ కాదు. తన వ్యాసాలలో, పుస్తకాలలో అనునిత్యం బ్రాహ్మణ్యాన్ని, బ్రాహ్మణులను 'బాపనోడు' అనే పదాలతో కించపరిచే వ్యాఖ్యలు చేయడం, అది తప్పని చెప్పినవారితో వాగ్వా దానికి దిగడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. హిందూ మతాన్ని అర్థంపర్థం లేని వ్యాఖ్యలతో విమర్శించడం కూడా ఆయనకు నిత్యకృత్యం అంటూ భారతీయ సంస్కృతిలో పెద్దలకు, జ్ఞానవంతులకు, దైవత్వాలకు ఇచ్చే గౌరవం పాదవందనం అంటూ వివరిస్తారు ''ఒక సామాజిక వేత్త అర్థరాహిత్యం'' అనే వ్యాసంలో జ్వాలా నరసింహారావు. ''విశ్వ నగరంగా భాగ్యనగరం అన్న'' వ్యాసంలో హైదరాబాద్‌ గత చరిత్రను తెలియజేస్తా రాయన.

''అనర్హత విషయంలో నిర్ణయాధికారం పూర్తిగా సభాపతిదే. పదవ షెడ్యూల్‌ కింద పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టానికి సంబంధించి, సభాపతి ఎటువంటి నిర్ణయమైనా, న్యాయస్థానాల తీర్పు పరిధిలోకి రావు. పదవ షెడ్యూల్‌ నిబంధనలను అమలు పరిచే విషయంలో తదనుగుణమైన విధి, విధానాలను రూపొందించుకునే అధికారం సభాపతికి ఉంది అంటూ వివరిస్తారు జ్వాలా నరసింహారావు ఒక వ్యాసం లో. ప్రజల భాగస్వామ్యంతో గ్రామజ్యోతి, నాటిరోజుల్లో గ్రామీణ జన జీవనం, వ్యయంలేని వ్యవసాయం కావాలి, అందరికీ విద్య దిశగా అడుగులు వంటి వ్యాసాలు ఆలోచింపదగినవిగా ఈ గ్రంథంలో ఉన్నాయి. ముఖ్యమంత్రి చైనా పర్య టనకు సంబంధించిన విశేషాలతో కూడిన వ్యాసమొకటి ఈ గ్రంథంలో లభి స్తుంది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తలపెట్టిన ''ఆయుత చండీయాగం'' పై కొందరు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని విమర్శి స్తారు జ్వాలా ఒక వ్యాసం లో.


క్రీమీలేయర్‌, భావన, చరిత్ర అన్న వ్యాసం లో బీ.సీ.రిజర్వేషన్ల అమలు ప్రక్రియకు సంబంధించిన అంశాలను లోతుగా చర్చించారాయన. గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలకు సంబంధించిన విషయా లను సంపూర్ణంగా రెండు వ్యాసాల్లో జ్వాలా చర్చించారు. ఖమ్మం జిల్లా సాగునీటి అవసరాలకు సంబంధించిన ప్రాజెక్టుల రూపకల్పన గురించి, అలాగే ఖమ్మం జిల్లా చరిత్ర గురించి సవివరంగా వివరించారు ''అధునాతన పట్టణం ఖమ్మం'' అనే వ్యాసంలో నరసింహా రావు. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ భూములకు సంబంధిం చిన పూర్వ చరిత్రను ఈ గ్రంథం ద్వారా తెలుసుకోవచ్చు. కే.సీఆర్‌ ప్రభుత్వం బ్రాహ్మణులకు అందిస్తున్న ఆసరా గురించి ఒక వ్యాసంలో ఆయన వివరించారు. సంక్షేమానికి వారూవీరూ అనే తార తమ్యం చూపించ కుండా, పేదవారెవరైనా సరే, ఆదుకోవాల్సిందే అన్న దృక్పథంతో సరికొత్త సామ్యవాద భావనతో, బ్రాహ్మణుల సంక్షేమానికి నిధిని ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుగారు అభినందనీయులు''అంటారాయన ఒక వ్యాసంలో.

తెలంగాణలో కోటి ఎకరాలకు సాగునీరు అందించ డానికి కేసిఆర్‌ చేస్తున్న కృషిని సంపూర్ణంగా వివరించారాయన ఒక వ్యాసంలో. అలాగే కే.సి.ఆర్‌ 3-13-2016న శాసనసభలో సాగునీటి ప్రాజెక్టుల గురించి చేసిన ప్రసంగపాఠం ఈ గ్రంథంలో లభిస్తుంది. గవర్నరు ప్రసంగంపై గొడవ అనుచితం అనే వ్యాసాన్ని కొత్త జిల్లాల ఏర్పాటు గురించిన వ్యాసాన్ని ఇందులో చూడవచ్చు. అలాగే జిల్లాల గత చరిత్ర కూడా ఇందులో లభిస్తుంది. ''సంక్షేమ రాష్ట్రం అంటే ఇది!'' అన్న వ్యాసంలో కే.సి.ఆర్‌ ప్రవేశపెట్టిన అనేక పథకాల గురించి వివరిస్తారు జ్వాలా. భూపరిపాలనలో సంస్కరణలు, పర్యావరణం కన్నా అభివృద్ధే మిన్న, నిర్వాసితులపై రాద్ధాంతం వద్దు!: బహుళ ప్రయోజనకారి...మల్లన్న సాగర్‌ రిజర్వాయర్‌. అంతరాష్ట్ర జల ఒప్పం దాలలో నూతన ఒరవడి, అన్యాయానికి సజీవ సాక్ష్యం నాగార్జున సాగర్‌, బ్రాహ్మణ సంక్షేమం..ఈశ్వరుడికి సంతోషం, నాటి నగదు రహిత లావాదేవీలు, మొక్కులు ప్రభుత్వ పక్షానే...తప్పేంటీ?, అభివృద్ధి కోసమే అప్పులు, తెలుగు మహాసభలు! అప్పుడు, ఇప్పుడూ వంటి వ్యాసాలు ఈ గ్రంథంలో లభిస్తాయి. ఈ వ్యాసాలలోనూ ఆయా అంశాలపై ఆలోచనాత్మకంగా జ్వాలా చర్చించారు.

రుణమాఫీ నుంచి పెట్టుబడిదాకా, సంక్షేమానికి ప్రాధాన్యం, దేశానికి ఆదర్శం. రాహుల్‌జీ, ఇవీ నిజాలు వంటి వ్యాసాలు ఈ గ్రంథంలో లభిస్తాయి. క్రైస్తవ సోదరులు విశ్వసించే ఏసు ప్రభువును ''గుడ్‌షెపర్డ్‌''గా ఆరాధిస్తుంటారు. అదేవిధంగా రానున్న రోజుల్లో ఇన్ని వెసులుబాట్ల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కే.సి.ఆర్‌ను యాదవులు, కురుములు సమిష్టిగా తమ పాలిట ''గుడ్‌షెపర్డ్‌''గా కీర్తిస్తారు అనటంలో అతిశయోక్తి లేదంటారు జ్వాలా, యాదవులకు, కురుమలకు గొర్రెల పంపిణీ గురించి వివరించిన వ్యాసంలో. కొత్త భూసంస్కరణలకు నాంది, సమస్యలు లేని వ్యవస్థ కే.సి.ఆర్‌ ఆకాంక్ష, పీవి పుణ్యమే చిన్న కమతాలు, పాదనమస్కారం భారతీయ సంస్కారం, ఆర్థికంలో అగ్రగామి, ప్రపంచ తెలుగు మహాసభలకు చెందిన మూడు వ్యాసాలు ఈ గ్రంథంలో లభిస్తాయి. సుస్థిరత కోసమే చెరికలు, ప్రాంతీయ పార్టీలదే హవా, నిరంతర విద్యుత్‌ గురించి ఇందులో పూర్తి వివరాలు లభిస్తాయి.

నా కుటుంబం అంటేనే తెలంగాణ, ప్రతి తెలంగాణ వ్యక్తి నా కుటుంబంలోని వ్యక్తే'' అంటారు ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కే.సి.ఆర్‌. ఆ ఇంటర్వ్యూ పూర్తిగా ఈ గ్రంథంలో లభిస్తుంది. తెలంగాణ రాష్ట్రశాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించిన తీర్మానం ద్వారా కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఇద్దరు శాసన సభ్యుల సభ్యత్వం రద్దు చేసిన అంశంపై ఒక వ్యాసంలో జ్వాలా చర్చించారు. ''నాలుగేళ్ల నవ నవ్యపాలన'' అనే పేరుతో ఆరుభాగాలుగా ఉన్న సుదీర్ఘ వ్యాసంలో ఆయన అనేక విషయాలను చర్చిం చారు. శాసనసభలో జరిగినట్లుగా, న్యాయస్థానంలో ఎవరైనా న్యాయమూర్తి మీదకు ఏదైనా వస్తువును విసిరేస్తే తత్పరిణామం ఏవిధంగా ఉండేది? అని ప్రశ్నిస్తూనే జ్వాలా గవర్నర్‌ పైకి మైకులు విసిరేసిన కాంగ్రెస్‌ శాసనసభ్యుల బహిష్కరణ కన్నా మరీ ఎక్కువ శిక్షపడేది. అందువల్ల నియంత్రణలు, సమతుల్యతలపై జాతీయస్థాయి చర్చ అవసరమంటారు ఒక వ్యాసంలో. అభివృద్ధిలో తెలంగాణ నమూనా, దేశానికి ఉత్తేజ పూరిత నూతన మార్గదర్శకత్వం కావాలి, కొంగరకలాన్‌ నుంచి కేసిఆర్‌ విస్పష్ట సందేశం,ఆపద్ధర్మం కాదు..ధర్మబద్దమే, మానిఫెస్టోలతో తస్మాత్‌ జాగ్రత్త, అతిగా మాట్లాడిన అమిత్‌షా, ఎన్నికల వేళ రాజకీయ విచిత్రాలు..వ్యూహమే విజయ సోపానం, ఓటు నమోదు బాధ్యత ఓటరుదే, పథకాల అమలు విశ్వసనీయతే తెరాసకు శ్రీరామరక్ష వంటి వ్యాసాలలో అనేక విషయాలను జ్వాలా నరసింహారావు వివరిం చారు. చివరన ప్రభుత్వ ప్రగతి నివేదిక ఇచ్చారు. కే.సి.ఆర్‌ అధికారం చేపట్టిన నాటి నుండి ప్రభుత్వ రద్దు చేసేంతవరకు సాధించిన ప్రగతి నాసాంతం ఇచ్చారాయన. ఏది ఏమైనా ఒక సంపూర్ణ అవగాహనతో కే.సి.ఆర్‌ ప్రభుత్వం చేసిన ప్రతి పనిని, నిర్ణ యాలను, సాధించిన విజయాలను సంపూర్ణంగా ఈ గ్రంథంలోని వ్యాసాలలో జ్వాలానరసింహారావు వివరించారు.