Saturday, August 31, 2019

మరిన్ని శాంతివచనాలు చెప్పిన లక్ష్మణుడు ..... శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-76 : వనం జ్వాలా నరసింహారావు


మరిన్ని శాంతివచనాలు చెప్పిన లక్ష్మణుడు
శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-76
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రభూమి ఆదివారం సంచిక (01-09-2019)
          శ్రీరాముడిని శాంతింప చేసే ప్రయత్నంలో లక్ష్మణుడు అన్నగారితో మరిన్ని విషయాలను చెప్తాడు. ఆయన పాదాలమీద పడి నమస్కరించి, ఇలా అంటాడు. “అన్నా! పూర్వజన్మలోనే కాకుండా ఈ జన్మలోనూ విస్తారంగా తపస్సు చేసి, ఎన్నో అశ్వమేధయాగాలను చేసి, మరెన్నో గొప్ప పుణ్యకార్యాలను చేసి, మన తండ్రి అతి కష్టంతో దేవతలు అమృతాన్ని సంపాదించినట్లు నిన్ను కన్నాడు”.

(శ్రీరామచంద్రమూర్తిని అమృతంతో పోల్చడం అంటే, అమృతం వల్ల దానికేమీ లాభం లేదు కాని, దాన్ని అనుభవించిన దేవతలకే లాభమని అర్థం. అలాగే శ్రీరాముడు దేవతలకు, లోకులకు భోగ్యుడై వారికి మేలు చేయడానికి పుట్టాడని అర్థం. లోకాన్ని ఉద్ధరించడానికి పుట్టిన శ్రీరాముడు లోకాలను నాశనం చేయడం తగదని లక్ష్మణుడు అంటున్నాడు. అలాగే, అమృతాన్ని సంపాదించడం కోసం ముప్పైమూడు కోట్ల దేవతలు కష్టబడ్డారు కానీ, రాముదికోరకు ఒక్క దశరథుడే కష్టపడ్డాడని భావన. అమృతం ఎలా రాక్షసుల వినాశనానికి కారణమైందో అలాగే రాముడు కూడా రాక్షస సంహారం చేయాలని చెపుతున్నాడు లక్ష్మణుడు. అందుకే, దేవతలమీద, ఇతర భూతాల మీద కోపం చూపకుండా, అమృతంలాగా ఎల్లప్పుడూ నిర్మలంగా వుండాలని సూచన ఇచ్చాడు లక్ష్మణుడు).

లక్ష్మణుడు ఇంకా ఇలా చెప్పాడు రాముడికి. “నీలో తప్ప ఇతరుల్లో లేని నీ కళ్యాణగుణాలకు సంతోషించి మన తండ్రి నిన్ను ఎడబాసిన కారణాన మరణించాడని భరతుడు చెప్పాడు కదా? అలాంటి కళ్యాణగుణాలను వదిలి ఇలాంటి హేయగుణాన్ని చేపట్టి, లోకానికి ఉపద్రవం కలిగిస్తే, మన తండ్రి నీవిషయంలో ఏమని భావిస్తాడు? రాముడు సౌమ్యుడు, సాధువు, జితేంద్రియుడు, శాంతుడు అనుకున్నానే? ఇంతటి క్రూరుడా, అని అనుకోడా? నువ్వు చేయాలనుకున్న లోకోపద్రవం తండ్రికి కూడా చేసినట్లే కదా? తన నాశనానికా తండ్రి నిన్ను కన్నది? కకుత్థ్సుడి వంశంలో పుట్టిన వాళ్లలో శ్రేష్టుడివైన నువ్వు, మహాశుద్ధసత్త్వం కల నువ్వు, అప్రాకృతుడవైన నువ్వు, కకుత్థ్సుడిలాగా దేవతలను, లోకులను రక్షించాల్సిన నువ్వు, శోకంతో సహించలేని విధంగా పరితపిస్తుంటే, ప్రకృతిబద్ధులైన ఇతరులందరూ దుఃఖం సహించగలరా? అలాంటి వారిలోనే దుఃఖం అణచుకునేవారు  కనిపిస్తుంటే నువ్వు దుఃఖపడడం శోచనీయం.

జగాలను పుట్టించే భారం బ్రహ్మదేవుడిది. సంహరించే భారం రుద్రుడిది. రక్షించే భారం నీది. అలాంటి నువ్వు ధర్మాన్ని వదిలి లోకులను సంహరించాలనుకుంటే భూప్రజలకు రక్షకుడెవరు దొరుకుతారు? పైరును రక్షించడానికి వేసే కంచే పైరును మేయడానికి సిద్ధపడితే ఇక దాన్ని రక్షించే ఉపాయం ఏమిటి? లోకంలో నువ్వొక్కడివే దుఃఖమనుభవించుతున్నానని అనుకోవద్దు. నీకున్నంత దుఃఖం ఎవరికీ లేదనుకోవద్దు. ఇంద్రుడుగా వున్నా నహుషుడి కొడుకు స్వర్గానికి పోయికూడా, అవివేకం వల్ల, అహంకారం వల్ల, మళ్లీ భూమ్మీదకు రాలేదా? మన పురోహితుడైన వశిష్టుడి కొడుకులు వందమంది ఒకేసారి నశించలేదా? సమస్త భూతాలను సర్వాడా మోసే భూదేవి ఒక్కోసారి గడ-గడలాడ లేదా? లోకాలకు కళ్లలాంటి సూర్యచంద్రులు రాహుకేతు గ్రహాల వాత బడలేదా? ఎంత మహాత్ములైనా, దేవతా శ్రేష్టులైనా, దైవ సంకల్పాన్ని దాటగలరా? ఎవరైనా కష్టాలను ఎదుర్కోకుండా కాలమంతా సుఖంగా గడుపుతారా? లేరుకదా? కాబట్టి ప్రాణులకు మేలు-కీడు స్వభాసిద్ధంగా వస్తాయి”.


“సీతాదేవి రాక్షసుల చేతిలో చచ్చినా కూడా అందుకోసం నువ్వు గుండెలు పగిలేలా ఏడవవద్దు. అది జ్ఞానంలేనివాడు చేయాల్సిన పని. ఏడ్వడం వల్ల రాగల లాభం ఏమిటి? నువ్విలా ఏడుస్తుంటే సీతాదేవి వస్తుందా? ఏడ్వడం వల్ల దేహం, మనస్సు చెడడమే తప్ప మరేం లాభం లేదు. జ్ఞానంకలవాడు దేనికీ దుఃఖపడడు. అనఘా! జీవకోటుల యథార్థస్థితి అయిన జననమరణాలు, సుఖదుఃఖాలు, శోకసంతోషాలు, సంయోగవియోగాలు లాంటివి నిత్యం జరిగేవి కావు. రావడం, పోవడం వాతి స్వభావగుణాలు.  కాబట్టి వాటికి పరితాపపడడం మంచిదికాదు. నీచమైన హృదయ దౌర్బల్యం వదిలి, గొప్ప మనస్సు చేసుకుని, ఇలా వ్యసనపడడం నీకు తగునేమో ఆలోచించు. జ్ఞానం కలవారు స్వభావసిద్ధమైన బుద్ధిబలంతో మేలు-కీడులను పరీక్షిస్తారు”.

“పూర్వం చేసిన పుణ్యపాపకర్మల గుణాలు కానీ, దోషాలు కానీ, మనం ఇప్పుడు ప్రత్యక్షంగా చూడలేం. మనం ఈ కర్మ చేశాం....మనకీ ఫలం కలుగుతుంది....అని నిశ్చయంగా చెప్పడం ఎవరికీ సాధ్యపడదు. ఈ కర్మ ఈ విధంగా చేయడం వల్ల ఈ ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నాం అని కర్మ చేసిన విధం చెప్పడం కూడా సాధ్యపడదు. కాని, కారణం లేకుండా ఏదీ జరగదు. ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నాం కాబట్టి, దీనికి కారణమైన కర్మ ఎదో, ఎప్పుడో చేశాం అని మాత్రం చెప్పగలం. అలాంటి కర్మ చేయడం వల్లే ఈ ఫలం కలిగిందని చెప్పవచ్చు. మనకు కారణం తెలిసినా, తెలియకున్నా, అనుభవించడం తప్పదు. కాబట్టి సుఖం అనుభవానికి వచ్చినప్పుడు మనం చేసిన పుణ్యం వల్లే ఇది కలిగిందని కాని, దుఃఖం కలిగినప్పుడు మనం పూర్వం ఏదో పాపం చేశామని అందుకే ఇది కలిగిందని భావించరాదు. సుఖం కలిగినందువల్ల పుణ్యమే చేయాలని కాని, దుఃఖం కలగడం వల్ల పాపం చేయరాదని అనుకుని మనస్సు ధృడ పరచుకోవాలి. సంతోషానికి పొంగక, దుఃఖానికి బాధపడక వుండాలి”.

“రామచంద్రా! నువ్వు మూర్ఖుడివి కాదు. కార్యాకార్య, ధర్మాధర్మ విషయంలో నీకుకల స్థిరజ్ఞానం దేవతలకు కూడా లేదు. అయినప్పటికీ దుఃఖాతిశయం వల్ల నీ జ్ఞానం నివురుగప్పిన నిప్పులాగా నిద్రబోతున్నది. మనుష్యులను చూద్దామా, వాళ్ళు నీదగ్గరకు వచ్చి తమ మీద కోపం ఎందుకని అడిగే సాహసం కూడా చేయలేరు. దేవతలేమో నీమూలాన బాగుపడేవారు. కాబట్టి నీకు అపరాధం చేయరు. కాబట్టి వాళ్ళను ఎందుకు బాధించాలి? వ్యర్థ కోపం వల్ల, వ్యర్థ శోకం వల్ల ఏ పనీ కాదు. మనకపకారం చేసినవాడు ఎవడో కనిపెట్టి శూరుడివైన నువ్వు వాడిని దండించు. దానివల్ల నీకు సీత మళ్లీ లభిస్తుంది. కీర్తీ కలుగుతుంది”.

CM KCR unveils action plan for Telangana villages : Vanam Jwala Narasimha Rao

CM KCR unveils action plan for Telangana villages
Vanam Jwala Narasimha Rao
Hans India (01-09-2019)

In a meeting at Pragathi Bhavan held on August 30, 2019 with Several Ministers, Collectors, DPOs, CEOs, MPDOs representing three districts and senior officers Honorable Chief Minister K Chandrashekhar Rao announced to implement the 30-day Special Action Plan in all the villages from Sept 6, for all-round development of villages.

To provide a comprehensive understanding for effective and proper implementation of the Special Action Plan, CM KCR is addressing the broad-based and extended meeting with all concerned Panchayat Raj officers in the State at the Telangana Academy of Rural Development in Hyderabad on third September. Ministers, State level Officers, Collectors, DFOs, ZP CEOs, MPDOs, DPOs, DLOs, MPOs are participating in the meeting. This will be followed by another meeting at the district level for concerned district panchayat officers by Collector to sensitize them on the Action Plan. 

CM announced hike in the wages of 36,000 Safari Karmacharees in the villages, from meagre amounts to Rs 8,500 per month. The CM also announced release Rs 339 Crore per month from out of the Central Planning Commission funds and the State funds to the village panchayats prior to the commencement of the Special Action Plan.

The CM directed the District Collectors to depute one Mandal level officer in each village as in-charge to monitor the Special Action Plan implementation for all the 30 days. The CM also decided to finalise duties and responsibilities of the Mandal and Zilla Parishads after receiving recommendation in this regard from the Collectors to make the local bodies more pro-active.

The CM gave a call that all the concerned should work with dedication, determination and commitment to change the topography of villages for better, with full of greenery and cleanliness, with the planned based development, better utilisation of the funds with prudence and participation of the people with democratic spirit. He said that the 30-days Special Action Plan should pave way to achieve the expected goal of changing the situation in all villages.

The CM said though, initially, it was decided to implement the Special Action Plan for 60 days, but based on feedback from the officials it was changed to 30 days CM said that this effort to develop the villages in a comprehensive manner would be a regular and continuous feature. Based on deliberations in the meeting, CM announced activities to be undertaken and tasks to be fulfilled in the 30-days Special Action Plan.

On the first day, Gram Sabha will be convened, where the participants will be explained in detail about the idea behind, the need, objectives and the importance of the 30-days Special Action Plan as well as process of implementation. People’s participation in the Special Action Plan with the spirit of democracy will be emphasized in the Gram Sabha.

On the second day, Co-option members will be nominated and also formation of Village Standing Committees. Sarpanches’ family members are not eligible to become Co-Option members.


Subsequently, Village Plan will be prepared based on the needs and resources available. It comprises of annual plan and plan for five years. These plans should have the approval of Gram Sabha.

As part of Managing Sanitation removal of dilapidated houses, animal sheds and debris will be taken-up. All the unused borewells will be covered. filling-up and leveling low-lying areas so that water is not stagnated and do not become a breeding place for mosquitoes. All the government buildings, like Schools and Anganwadis, office complexes etc. will be cleaned. Weeding out of wild and unwanted vegetation and plants will be done. Cleaning of roads, repairing drains, cleaning drainages, removal of waste from the drains, bleaching the un-hygienic places, removal of stagnant water, cleaning of market places will be taken-up one after the other.

Villagers are to be encouraged and motivated to participate in Sramadan at least twice a month. Tractors with trollies and tankers to be provided for transport of saplings, removal of the garbage and watering plants.  Space to be identified in all villages for dumping yards and crematoriums which could be either a government land or by way of purchase from Panchayati funds. Cent per cent toilets in the village to be planned.

Telangana ku Haritaharam to be a treated as top priority item. Nurseries to be established in every village for which suitable land to be identified. Technical help to run these nurseries to be obtained from concerned Forest Range Officer. Identification of saplings with the help of the Agriculture Extension officers needed for the Villagers to be done. Gram Panchayat should organize indents for the supply of fruit bearing and flower plants to the households. Gram Panchayat should also identify lands within the gram Panchayat, on the village borders and either side of the roads. Based on these inputs, the gram panchayat should prepare a Green Plan (Haritha Plan) in consultation with the district and mandal green committees. Gram Panchayats besides planting the saplings should also take responsibility for their protection.

As part of Power Week, seven days should exclusively be utilized under the 30-day programme for the electricity related issues. Power usage for street lights in the village to be estimated. A third line for street light to be put-up. Use of LED bulbs to be made obligatory.  The twisted electricity poles are to be rectified and the hanging electricity wires are to be removed. Wood and iron poles are to be replaced with cement poles. Gram Panchayat should ensure that streetlights are off during the daytime and switched on Street lights should be on during nights.

Utilization of funds is very important aspect. Village Panchayats all put together will be provided with funds to a tune of Rs 339 crores per month from both releases of Central Finance Commission and state budget. Besides these the Gram Panchayat will have its own income. 10 Per cent of the funds should be utilized for the greenery component. Funds utilization should be strictly based on one year and five-year plans. Debts if any, salaries booked against village panchayat funds, electricity bills etc. are to be included in charged accounts.  

Chief Minister in the August 30 meeting said that, “Situation in the villages did not improve much despite attaining independence 72 years ago. Despite spending thousands of crores of rupees, in different forms the results are not visible. Village problems are still there. Nobody is taking responsibility for this. Improving conditions in the villages with the people’s participation in true democratic spirit is the need of hour. There should be a qualitative change. This is the reason why we brought in a new Panchayat Raj Act. We have identified clear-cut roles, duties and responsibilities for officials and public representatives. We have also defined as to who should attend to what work. We have given adequate powers to collectors. We have allocated necessary funds in the Budget. Government is committed to implement the Act in true letter and spirit.  Let each villager become the real hero of the village.  30-day action plan is the first step towards this.”

KCR thus unveiled the action plan for development of villages.

Friday, August 30, 2019

Combating Corruption, need of the hour : Vanam Jwala Narasimha Rao


Combating Corruption, need of the hour
Vanam Jwala Narasimha Rao
Hans India (31-08-2019)
Millennium Post, New Delhi (31-08-2019)

Certain things can’t be set right completely in politics, Corruption for one. It needs real guts and strong will power for any leader to put an end to the prevalent evil. In a country like India, where politics and bureaucracy have been largely accursed by corruption, it is refreshing to see someone who is hell-bent to fight corruption tooth and nail.

Telangana Chief Minister K Chandrashekhar Rao, in his Independence Day address this year mentioned about good governance and the need to put an end to corruption. Referring to impressive economic and financial growth of the Telangana during the past five years, KCR said that, this was possible due to fiscal discipline that gave no scope for corruption. Referring to administrative reforms, Panchayati Raj and Municipal Acts as well as the proposed Revenue Act KCR said that the existing Acts will not be sufficient to offer good governance. His proposal to revamp and reform the Revenue Department in order to curb corruption has drawn favourable reaction from several sections of the people.

In this context, where CM made an honest confession about the prevalence of corruption in certain quarters of administration, like the revenue department, it may be worthwhile to recall the proceedings of conference of Chief Ministers held on 24th May 1997, presided by then Prime Minister Inder Kumar Gujral.

The conference recognized that, as the country completed 50 years of independence by then, and as the people were assailed by growing doubts about the accountability, effectiveness and moral standards of administration, Central and State Governments should move together to justify the trust of faith of the people in the Government by taking up the implementation of an Action Plan endorsed by the conference.

That was considered to be a major step towards Reform Initiative in Administration in the country with specific reference to effective and responsive administration. It was agreed that each state would work for the implementation of the Action Plan, making appropriate allowance for variation on local circumstances.


            The broad structure and framework that was envisaged then was, that, the Central and State governments would work together to concretize the Action Plan dealing with, Accountable and citizen-friendly Government, Transparency and Right to Information and Improving the performance and integrity of the public service. In the conference it was agreed that immediate corrective steps must be taken to restore the faith of the people in the fairness, integrity and responsiveness of the administration.

Inaugurating the CM’s conference, Gujral drew attention to the urgent need to come up with ideas and strategies for responsive and effective administration, which could rebuild the credibility of the Government. He referred to Pandit Jawaharlal Nehru’s statement that “belief in fair play and integrity” was the basis of a good administration. The PM felt that unrest and tension in some areas of the country is an expression of the people’s frustration with administration. Some Governments had set good examples of taking administration to the people, which could be emulated by others.

The Chief Ministers and several Central Ministers attending the conference strongly endorsed the need for ensuring responsive, accountable, transparent and people friendly administration at all levels and agreed that necessary corrective steps must be taken to arrest the drift in the management of public services. The conference urged that measures should be taken to restore the faith of the people, particularly the weaker sections of the society, in the fairness and capacity of administration. Unfortunately, very little had happened during the last 22 years.

It was recognized that responsive administration depends on reforms in public service at all levels, adherence to ethical standards, and basic principles of the constitution and a clear understanding of the relationship regulating the civil servants and the politicians. It has to be clearly appreciated that the political executive should concentrate on policy formulation while implementation is left to public services at various levels for which their commitment is very crucial.


         The approach to the elimination of corruption in the public service needs to address prevention, surveillance and deterrent prosecution, and deal ruthlessly with the nexus with criminals and unscrupulous elements. It requires the concerted efforts of politicians, public services and all stakeholders in civic society. It is necessary to remove the scope for any interference in the prompt prosecution and punishment of corrupt officials.

          The various service and conduct rules should be reviewed in order to arrange for the review of the integrity and efficiency of officers at any stage during the career, and the compulsory retirement of officers of doubtful integrity. Simultaneous with the above, the preventive steps would include not only regulatory reforms to reduce the scope for discretion and secrecy at all levels, but would make public disclosure mandatory for all developmental schemes and approvals.

The Government of India and State Governments should draw up a charter of ethics and public service code for the public service which is based on the fundamental principles of the Indian Constitution such as secularism, equality, impartiality, social justice, attention to the needs of the weaker sections, rule of law etc. It should be agreed that the loyalty of public servants should be only to the service for the public and the rule of law.

             There is an urgent need to tackle corruption and the increasing erosion of moral values in public life. It is not an exaggeration to talk about corruption in terms of a crisis or a cancer endangering India’s society, polity and economy. Corruption is rampant in certain quarters of administration like the revenue department, and several other sectors where people come into contact daily with administration. Corruption at lower levels takes the form of speed money for expediting approvals or providing legitimate services, or bribes for twisting rules. That is why there is a strong demand by the public for effective punitive and corrective measures to tackle the problem.

Elimination of corruption in public services should address preventive, surveillance and deterrent punishment, and deal ruthlessly. Rules and legal provisions should be amended to enable immediate and exemplary prosecution and removal of corrupt officials without resource to any political protection. There should be no scope in the rules for any interference in prompt prosecution and punishment of corrupt public servants, and permission for such prosecution should be given within a prescribed period to investigating agencies. At the same time clear norms should be laid down to prevent demoralization of public servants on account of frivolous complaints or inquiries.

The investigating agencies and vigilance machinery should be strengthened. The preventive aspect of corruption in government or the public sector depends on an independent and well-staffed vigilance set up. Amendments should be formulated to the relevant rules for the premature retirement of officials at a reasonably early stage of employees’ careers to weed out elements which are either inefficient or of doubtful integrity. It is further necessary to amend the relevant service rules to enable the review of integrity and efficiency of officials at any stage during their career in public interest.

Against this background CM KCR proposal to revamp revenue administration and do away with corruption is a welcome change.

Thursday, August 29, 2019

ఆణి ముత్యాల లాంటి వైఎస్ ఆర్ సూచనలు, సలహాలు, ఆదేశాలు : వనం జ్వాలా నరసింహారావు


ఆణి ముత్యాల లాంటి వైఎస్ ఆర్ సూచనలు, సలహాలు, ఆదేశాలు
వనం జ్వాలా నరసింహారావు
సూర్యదినపత్రిక (30-08-2019)
రెండో విడత అధికారం చేపట్టి, మంత్రివర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా జరిపించిన మర్నాడు-మే నెల 26, 2009, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఇజ్రాయిల్ పర్యటనకు బయల్దేరడానికి ముందర, ఆ ఉదయం మమ్మల్ని అత్యవసర సహాయ సేవల సంగతి తెలుసుకునేందుకు రమ్మన్నారు. ఇక్కడొక విషయం చెప్పాలి. అంతకు నాలుగైదు రోజుల క్రితం ముఖ్యమంత్రికి సీఇఓ వెంకట్ గారు ఒక లేఖ రాశారు. మే నెల 5, 2008 న ఇ.ఎం.ఆర్.ఐ ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్తూనే, సంస్థ అప్పట్లో ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంలో, ప్రభుత్వ పరంగా సంస్థకు అదనపు నిధుల ఆవశ్యకతను వివరిస్తూ రాసిన లేఖ అది. ఆ రోజు వరకు అత్యవసర సహాయ సేవల ద్వారా 26 లక్షల మంది లబ్ది పొందారని, సుమారు 47 వేల ప్రాణాలు కాపాడ కలిగామని, ప్రభుత్వ సహాయంతో 752 అంబులెన్సులను నిర్వహిస్తూ ప్రతి రోజూ సుమారు సగటున 5420 ఎమర్జెన్సీలకు స్పందిస్తున్నామని-ఆసుపత్రులకు చేరుస్తున్నామని లేఖలో వివరించారు.

రాజు గారు సంస్థ చైర్మన్ గా రాజీనామా చేసిన అనంతరం, జనవరి 8, 2009 న జరిగిన సమీక్షా సమావేశంలో, సరాసరి నిర్వహణ వ్యయంలో, అవసరమైతే 95% కు బదులు నూటికి 100% ప్రభుత్వమే భరిస్తుందని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని లేఖలో గుర్తు చేశారు వెంకట్. అయితే అసలు-సిసలైన ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్య ప్రక్రియలో విశ్వాసం వున్న ఇ.ఎం.ఆర్.ఐ యాజమాన్యం (రాజు గారు చైర్మన్ గా తొలిగానా) తమ వంతు వ్యయం చేయాల్సిన 5% నిర్వహణా పరమైన నిధులను-ఇతర యాజమాన్య పరమైన ఖర్చులను సమకూర్చే దాతల అన్వేషణ కొరకు నాలుగు నెలల వ్యవధి కోరిన విషయం కూడా లేఖలో గుర్తు చేశారు వెంకట్.

దురదృష్ట వశాత్తు తామెన్ని ప్రయత్నాలు చేసినా అంతవరకు అవి ఫలించలేదన్నారు. ఆ కారణాన తమ వంతు వాటాగా 2008-2009 ఆర్థిక సంవత్సరంలో ఖర్చు చేయాల్సిన 5% (సుమారు రు. 5 కోట్ల నిర్వహణ ఖర్చులు) నిధులను కూడా ప్రభుత్వం విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. నిర్వహణ వ్యయం కింద అప్పటి వరకు 2008-2009 ఆర్థిక సంవత్సరంలో ఐన రు. 90 కోట్ల వ్యయంలో రు. 85 కోట్లు మాత్రమే ప్రభుత్వం విడుదల చేసిందని, మిగతా రు. 5 కోట్ల విడుదలకు ఆదేశాలివ్వాలని కోరారాయన. అదనంగా యాజమాన్య జీత-భత్యాల కొరకు మరో రు. 4 కోట్ల 8 లక్షలు ఖర్చయ్యాయని వివరించారు. ఆ వ్యయాన్ని తమ వంతు వాటాగా భావించాలని కూడా కోరారు.

అప్పట్లో సంస్థ ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా, ఆ ఐదు కోట్లను-అదనంగా మూల వ్యయం కొరకు మరో మూడు కోట్లను, మొత్తం ఎనిమిది కోట్ల రూపాయలను ప్రభుత్వం మంజూరు చేసి-విడుదల చేసేందుకు ఉత్తర్వులివ్వాల్సిందిగా  వెంకట్ ముఖ్యమంత్రిని తన లేఖలో అభ్యర్థించారు. అందులోనే పిరమల్ ఫౌండేషన్ ప్రయివేట్ భాగస్వామిగా, ఇ.ఎం.ఆర్.ఐ బాధ్యతలు స్వీకరించడానికి ఆసక్తి కనబరిచిన విషయం-త్వరలోనే అది సఫలం కానున్న విషయం కూడా వివరించారు వెంకట్. కాకపోతే ఆ లేఖ పంపిన మర్నాడే, పిరమల్ ఫౌండేషన్ నిరాసక్తిని వ్యక్తపరుస్తూ వెంకట్ కు సందేశం ఇవ్వడం, ఆయన నిరాశకు గురి కావడం, ముఖ్యమంత్రితో సమావేశం జరుగు తే మంచిదని భావించడం, ఆయన కోరుకున్న విధంగానే-ఆయన అడగకుండానే ముఖ్యమంత్రి దగ్గర నుంచి మే నెల 26, 2009 ఉదయం సమావేశం గురించి పిలుపు రావడం భగవదేఛ్చ అనుకోవాలి. లేదా వెంకట్ సంకల్ప బలం అనుకోవాలి !

ఆ ఉదయం సమావేశం జరిగిన తీరు "మరవలేని మరో అద్భుత సన్నివేశం". సమావేశం ఆరంభమవుతూనే వెంకట్ గారిని ఉద్దేశించి, తమ పార్టీ విజయానికి 108-అత్యవసర సహాయ సేవల అంబులెన్సుల పథకం ఎంతగానో తోడ్పడిందని అన్నారు (దివంగత) ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి. ఇంతకు ముందే రాసినట్లు, ఇ.ఎం.ఆర్.ఐ సంస్థకు ప్రయివేట్ భాగస్వామ్య పరంగా నిధులను సమకూర్చే విషయంలో స్వయంగా జోక్యం చేసుకుని, అధికార బలాన్ని కాకుండా-వ్యక్తిగత ఆకర్షణ, పలుకుబడిని ఉపయోగించే పద్ధతిలో, జీ.వి.కె అధిపతి డాక్టర్. జీ. వి. కృష్ణారెడ్డి తో ఫోన్లో మాట్లాడి, బరువు-బాధ్యతలను ఆయన స్వీకరించేందుకు ఒప్పించారు రాజశేఖర రెడ్డి గారు. అయితే ఆ నిర్ణయం పూర్వ-ఉత్తర రంగాల్లో అత్యవసర సహాయ సేవల విషయంలో విలువైన సూచనలు చేశారు. అందులో ఎన్ని అమలుకు నోచుకున్నయో-ఎన్ని నోచుకోలేదో అన్న విషయం ప్రశ్నార్థకం?

రాజీవ్ ఆరోగ్య శ్రీ గొడుగు కింద పనిచేస్తున్న 108, 104, ఆరోగ్య శ్రీ పథకాలకు సంబంధించి నిరంతర ప్రభుత్వ మానిటరింగ్ జరగాలని, ఇవన్నీ ఒకే శాఖాధిపతి కింద వుండే వీలు గురించి పరిశీలన జరగాలని ఆ రోజున ముఖ్యమంత్రి సూచించారు. ఇ.ఎం.ఆర్.ఐ, హెచ్.ఎం.ఆర్.ఐ, ఆరోగ్య శ్రీ లకు కలిపి ఒక ప్రత్యేకమైన "ట్రస్ట్" ఎందుకు ఏర్పాటు చేయకూడదని ప్రశ్నించారు. అలా చేస్తే సేవలందించడంలో నైపుణ్యం, సామర్థ్యం, వృత్తి పరమైన దక్షత పెరిగే అవకాశం వుందన్నారు. వీటి సాధ్య-అసాధ్యాలకు సంబంధించి మేధ మథనం జరుగు తే మంచిదని కూడా సూచించారాయన. అయితే సంస్థల ప్రత్యేకత, ఆనవాలు-గుర్తింపు (ఐడెంటిటీ) కు భంగం కలగని విధంగా చర్యలు చేపట్టాలని, నియంత్రణల విషయంలో జాగ్రత్తలు పాటించాలని, ఆరోగ్య-వైద్య శాఖలకు చెందిన ఒక ప్రభుత్వాధికారిని ఇ.ఎం.ఆర్.ఐ గవర్నింగ్ బోర్డు సభ్యుడిగా చేయాలని కూడా ముఖ్యమంత్రి అభిప్రాయం వెలిబుచ్చారు. ఆర్థిక పరమైన యాజమాన్య వ్యవహారాలను, వ్యయ నియంత్రణలను, నిర్వహణ సమస్యలను, ప్రభుత్వంతో సమన్వయం-సంఘటితం విషయాలను, సంస్థాగత నిర్మాణాన్ని, అధికారాలను, విధులను, బాధ్యతలను, పారదర్శకతను, జవాబుదారీ తనాన్ని, సంబంధిత ఇతర విషయాలను పర్యవేక్షించేందుకు ఎలాంటి కమిటీ వుంటే బాగుంటుందో పరిశీలించమని అధికారులను-ఇ.ఎం.ఆర్.ఐ యాజమాన్యాన్ని ఆదేశించారు. ఆ కమిటీ రూపు-రేఖలు ఎలా వుండాలో ఆలోచన చేయమని కోరారు ముఖ్యమంత్రి.


ఒక వేళ "రాజీవ్ ఆరోగ్య శ్రీ ట్రస్ట్" కు ఆ బాధ్యతలు అప్పగిస్తే, దరిమిలా ఆవిర్భవించనున్న "సంఘటిత (Integrated) పథకం" అమలు విషయంలో కుటుంబ సంక్షేమ శాఖ పాత్ర ఎలా వుండాలో నిర్ణయించాలని సూచించారాయన. ప్రభుత్వ పరంగా నిధులను సమకూర్చడంలో ఒక్కో ఏడాది గడిచినా కొద్దీ భారం పెరుగుతుంది కాబట్టి, అత్యవసర పరిస్థితి నుంచి ఆసుపత్రికి వైద్య సహాయం అందించే వరకు ప్రభుత్వ పరంగా-ఇ.ఎం.ఆర్.ఐ పరంగా సేవల ఉపయోగం విషయంలోను, మంచి-మంచి పద్ధతులను పంచుకోవడం విషయంలోను, మాన్యత (వాలిడేషన్) విషయంలోను, నిధుల సేకరణ విషయంలోను, కమ్యూనికేషన్ విషయంలోను, చేసిన తప్పులు సరి దిద్దుకునే విషయంలోను జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి. ఆయన ఆనాడు చెప్పిన "ఆణి ముత్యాల లాంటి సూచనలు, సలహాలు, ఆదేశాలు" ఆ తర్వాత రూపొందించిన సమావేశ వివరణ పత్రం (మినిట్స్) లో కొన్ని మాత్రమే చోటు చేసుకున్నాయి. ఆ వివరాలు:

·      మే నెల 5, 2008 న ప్రభుత్వంతో ఇ.ఎం.ఆర్.ఐ కుదుర్చుకున్న ఎంఓయు గడువు ముగిసినందున, దాని అమలును, తగు సవరణలతో అవసరమైనంత కాలవ్యవధి వరకు పొడిగించాలి. ఎంఓయు అమలు కాలంలో సంభవించిన పరిణామాలను సవరణలు రూపొందించేటప్పుడు దృష్టిలో పెట్టుకోవాలి.
·      నిర్వహణ వ్యయం భరించే విషయంలో ప్రభుత్వ-ప్రయివేట్ భాగస్వామ్యం సిద్ధాంత ప్రక్రియకు అనుగుణంగా, ప్రభుత్వం-ఇ.ఎం.ఆర్.ఐ తమ-తమ వంతు వాటాగా 95%-5% నిష్పత్తి విధానాన్ని పాటించాలి. కాకపోతే, యాజమాన్య పరమైన వ్యయం కింద ఇ.ఎం.ఆర్.ఐ పెటుతున్న ఖర్చును సంస్థ సమకూర్చాల్సిన 5% వాటాగా పరిగణించాలి. ఇలా పరిగణించేటప్పుడు కింది నిబంధనలను పాటించాలి:
·      ఆంధ్ర ప్రదేశ్ ఆపరేషన్సుకు సంబంధించి ఇ.ఎం.ఆర్.ఐ చేస్తున్న ఖర్చును స్పష్టంగా నమోదు చేసి ప్రభుత్వానికి తెలియచేయాలి.
·      ఇతర రాష్ట్రాలలో కూడా  .ఎం.ఆర్.ఐ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నది కాబట్టి, ఆంధ్ర ప్రదేశ్ కు సంబంధించిన యాజమాన్య పరమైన వ్యయాన్ని, తగు నిష్పత్తిలో నమోదు చేయాలి.
·      .ఎం.ఆర్.ఐ యాజమాన్య నిర్వహణ బాధ్యతలు స్వీకరించబోయే భావి సంస్థల-వ్యక్తుల నుంచి, లోగడ ఇ.ఎం.ఆర్.ఐ కున్న రుణాల మొత్తాన్ని తీర్చేందుకు తగు ఆర్థిక సహాయాన్ని పొందే ఏర్పాటు చేసుకోవాలి.
·      అత్యవసర సహాయ సేవల నిర్వహణకు నియమించబడిన ఆపరేషన్స్ సిబ్బంది జీతభత్యాలు, ప్రతి నెల మొదటి తేదీన చెల్లించే విధంగా, ప్రభుత్వం అంగీకరించిన నిధులను విడుదల చేస్తుంది. 2009-2010 సంవత్సరానికి బడ్జెట్ తయారు చేసేటప్పుడు, ప్రభుత్వం తన బాధ్యతగా అంగీకరించిన నిధులను సమకూర్చే పద్ధతిలో, తగు ఏర్పాటు చేస్తుంది.
·      పారదర్శకతను మరింత స్పష్టంగా పాటించడానికి ఇ.ఎం.ఆర్.ఐ చొరవ తీసుకోవాల్సిన అంశాలు:
·      108-అత్యవసర సహాయ సేవల లబ్దిదారులకు ముఖ్యమంత్రి సంతకంతో ఉత్తరాలు పంపాలి. ఆరోగ్య శ్రీ పథకం లబ్దిదారుల నుండి  ఎలా "ఫీడ్ బాక్" తీసుకుంటున్నారో అలాంటి పద్ధతి ఇ.ఎం.ఆర్.ఐ కూడా అమలు పరచాలి.
·      పారదర్శకతను పెంపొందించేందుకు, ప్రజలందరు చూడడానికి అనువుగా "వెబ్ సైట్" ను రూపొందించి, అందులో ప్రతి ట్రిప్పుకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు పొందుపరచాలి.
·      జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ 108-అత్యవసర సహాయ సేవలకు సమకూరుస్తున్న నిధులను తగ్గించే ప్రయత్నం చేయకుండా-లోగడ మాదిరిగానే బడ్జెట్ కేటాయింపులు జరగాలని విజ్ఞప్తి చేస్తూ, ముఖ్యమంత్రి సంతకంతో ప్రధాన మంత్రికి లేఖ వెళ్లాలి.

మినిట్స్ లో పొందుపరిచిన వాటిలోని అంశాలు, పొందు పరచకపోయినా ముఖ్యమంత్రి చేసిన సూచనలు, అమలుకు ఎంతవరకు నోచుకున్నాయో అన్న విషయాన్ని ధృవీకరించాల్సింది అటు ప్రభుత్వం-ఇటు ఇ.ఎం.ఆర్.ఐ యాజమాన్యం. ప్రభుత్వం నియమించిన కమిటీ ఈ అంశాలపై ఎంతవరకు దృష్టి పెట్టిందో? ఈ అంశాలన్నీ అమలు జరిగుంటే ఇప్పుడు 108 సేవలు ఎదుర్కుంటున్న కొన్ని ఒడిదుడుకులకు ఆస్కారం వుండకపోయేదేమో !
(దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి
108-అత్యవసర సహాయ సేవలపై నిర్వహించిన చిట్టచివరి సమీక్ష)
(సెప్టెంబర్ 2, 2019 న వైఎస్ఆర్ 10 వ వర్ధంతి)

Monday, August 26, 2019

నిబద్ద నైపుణ్య సేవల కోసం... : వనం జ్వాలా నరసింహారావు


నిబద్ద నైపుణ్య సేవల కోసం...
వనం జ్వాలా నరసింహారావు
(హెచార్డీ ఇన్స్టిట్యూట్ మాజీ అదనపు సంచాలకుడు)
నమస్తే తెలంగాణ దినపత్రిక (27-08-2019)
గుర్తించబడిన ఒక ప్రాదాన్యాత అంశంగా ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రజాప్రతినిధులకు క్రమం తప్పకుండా శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుని, తదనుగుణంగా వినూత్నపద్ధతిలో స్టేట్ ట్రైనింగ్ ఇనిషియేటివ్ కు శ్రీకారం చుట్టితే బాగుంటుందేమో! ఇలా చేయడం ద్వారా శిక్షణ పొందినవారి వ్యక్తిగత, సామూహిక, సంస్థాగత పనితీరులో మెరుగుదల-పెరుగుదల ప్రస్ఫుటంగా కనిపించడంతో పాటు వారి సామర్థ్యం కూడా వృద్ధి చెందుతుంది. దీనికొరకు శిక్షణా కార్యక్రమాన్ని జిల్లాల కలెక్టర్ల, శాఖాధిపతుల ముఖ్యమైన బాధ్యతల్లో ఒకటిగా చేసి, వారి-వారి స్థాయిల్లో వారిని ట్రైనింగ్ కమీషనర్లుగా నామినేట్ చేయాలి. ట్రైనింగ్ కమీషనర్లుగా వీరి బాధ్యతల నిర్వహణలో చేదోడువాదోడుగా వుండడానికి ప్రతి జిల్లాలో, రాష్ట్ర స్థాయి ప్రభుత్వ శాఖలో శిక్షణా కార్యక్రమాల అమలుకు ట్రైనింగ్ కోఆర్డినేటర్లను నియమించాలి.

ప్రభుత్వం చేపట్టబోయే ఈ క్రమబద్ద శాస్త్రీయ శిక్షణా కార్యక్రమంలో భాగంగా ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి ఏడాదిలో కనీసం ఒక్కసారైనా ప్రభుత్వ అభివృద్ధి-సంక్షేమ కార్యక్రమాల పైనా, ప్రభుత్వ పథకాలపైనా అవగాహన పరిపూర్ణంగా కలిగే రీతిలో, వారి పనితీరులో సామర్థ్య పెంపుదల దిశగా శిక్షణా డిజైన్ తయారుకావాలి. శిక్షణ పూర్వరంగంలో శిక్షణకు హాజరయ్యేవారి పనికి సంబంధించి, ఉద్యోగానికి సంబంధించి, ఒక గ్రూప్ గా వారు నిర్వహించాల్సిన విధుల గురించి, వారు పనిచేస్తున్న శాఖల అవసరాల గురించి, అభ్యర్థుల శిక్షణావసారాలు గుర్తించాలి.

ఈ యావత్ ప్రక్రియలో భాగంగా మొదటిగా, సచివాలయ స్థాయిలో, ప్రభుత్వ శాఖల స్థాయిలో, జిల్లా స్థాయిలో కార్యదర్శులుగా, హెచ్ఓడీలుగా, జిల్లా కలెక్టర్లుగా పనిచేస్తున్న అఖిలభారత సర్వీసు (ఐఏఎస్, ఐఎఫెస్, ఐపీఎస్) అధికారులకు ట్రైనింగ్ ద్వారా సామర్థ్యం పెంపుదలకు తీసుకుంటున్న చర్యలపై అవగాహన కలిగించడానికి మూడురోజుల ఓఎంఓటీ (ఓరియంటేషన్ టు మానేజ్మెంట్ ఆఫ్ ట్రైనింగ్) గోష్టి శిబిరం నిర్వహిస్తే మంచిది. ఈ శిబిరాలలో పాల్గొనే ఈ అధికారులకు వినూత్నపద్ధతిలో ప్రభుత్వం తలపెట్టిన స్టేట్ ట్రైనింగ్ ఇనిషియేటివ్ కు సంబంధించి చర్చించే అవకాశంతో పాటు, విజయవంతంగా శిక్షణా కార్యక్రమాలు కొనసాగడానికి వారి పాత్ర ఏమిటో, ఎలా ఉండాలో అవగాహన కూడా కలుగుతుంది. ట్రైనింగ్ విషయంలో ఉన్నత స్థాయి అధికారుల నిబద్ధత, అంకితభావం అవసరం ఎంతైనా వుంది కాబట్టి దానికి సంబంధించిన అంశాలు చర్చించే వీలు కూడా ఈ గోష్టిలో కలుగుతుంది. వీరికి చేదోడుగా పనిచేయాల్సిన ట్రైనింగ్ కోఆర్డినేటర్లకు మేనేజ్మెంట్ ఆఫ్ ట్రైనింగ్ లో శిక్షణ ఇవ్వాలి.

శిక్షణా విధానం కేవలం అందులో పాల్గొంటున్న వారి విజ్ఞానం, నైపుణ్యం మెరుగుపరచడమే కాకుండా వారి కార్య ధోరణిలో, వైఖరిలో (attitude) గణనీయమైన మార్పు చోటు చేసుకుని, తద్వారా పౌరులకు, ప్రజా బాహుళ్యానికి మరింత సమర్ధవంతమైన, పటిష్టమైన సేవలు అందించడానికి దోహదపడాలి. ప్రభుత్వ పరంగా చేపట్టిన యావత్ శిక్షణా కార్యాచరణకు దార్శనికత చూపడానికి, స్థూల స్థాయిలో పర్యవేక్షించడానికి, సమీక్షించడానికి ఒక విధమైన రాష్ట్ర స్థాయి శిక్షణా మండలిని అవసరమనుకుంటే ముఖ్యమంత్రి అధ్యక్షతన ఏర్పాటు చేసి, ఆ మండలిలో క్షేత్ర స్థాయి, ఉన్నత స్థాయి శిక్షణా యాజమాన్య నిపుణులను భాగస్వాములను చేస్తే బాగుంటుంది. వ్యక్తిగతంగా, శాఖాపరంగా, హెచ్హోడీ అవసరాలకు అనుగుణంగా శిక్షణావసరాలను గుర్తించాలి. శిక్షణావసారాల ఆధారంగా చక్కటి శిక్షణాడిజైన్ తయారు చేసి నిర్ణీత కాల వ్యవధిలో తగు శిక్షణ ఇప్పించాలి.


బడ్జెట్ అంచనాలతో సహా వారి-వారి శాఖలకు కావాల్సిన వార్షిక శిక్షణా కార్యాచరణ పథకాల రూపకల్పన బాధ్యతను సంబంధిత హెచ్హోడీలకు అప్పగించాలి. ఈ యావత్ ప్రక్రియకు ప్రధాన సమన్వయ సంస్థగా మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థను నియమించి, రాష్ట్రంలోని ఇతర శిక్షణా సంస్థల, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీ లాంటి ప్రముఖ సంస్థల సేవలను ఉపయోగించుకోవాలి. ప్రభుత్వోద్యోగ, ప్రజా ప్రతినిధులను శిక్షణ నిమిత్తమై, వారి-వారి భాద్యతలకు అనుగుణంగా నాలుగు భాగాలుగా విభజించవచ్చు. అవి: మొదటిది విధాన స్థాయి (Policy), రెండవది పరిపాలనా స్థాయి (Administrative), మూడవది అమలుపరిచే స్థాయి (Implementation), నాల్గవది పై మూడు స్తాయిల వారికి మద్దతుగా పనిచేసే కింది స్థాయి (Support) సిబ్బంది.

పాలిసీ స్థాయి వారిలో మంత్రులు, ఎమ్మెల్యేలు, (కార్యదర్శి, అంతకంటే కంటే పై స్థాయి) అఖిల భారత సర్వీస్ సీనియర్ అధికారులు వుంటారు. వీరికి సంస్థాగత ప్రవర్తనకు సంబంధించిన (Organizational Behavior) శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి. అడ్మినిస్ట్రేటివ్ స్థాయి అధికారులలో హెచ్హోడీలు, కార్యదర్శి స్థాయి కంటే కింది అఖిలభారత సర్వీసు అధికారులు వుంటారు. ఎగజేక్యూటివ్ లేదా అమలుపరిచే స్థాయి వారిలో మండల స్థాయి వరకూ క్రియాశీలక పాత్ర పోషించే క్షేత్ర స్థాయి అధికారులుంటారు. మిగిలిన వారంతా కింది స్థాయి లేదా క్లరికల్, పర్యవేక్షక కేటిగరీకి,  చెందిన ఉద్యోగులు. రాష్ట్రం మొత్తం మీద అన్ని విభాగాలలో కలిపి సుమారు 5000-10000 మంది వ్యూహాత్మక బాధ్యతలు నిర్వర్తించే ప్రభుత్వోద్యోగులను, ప్రజా ప్రతినిధులను గుర్తించి, వారికి ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహించి, ప్రభుత్వ కార్యక్రమాల, పథకాల అమలు పట్ల వారి నిబద్ధత, అంకిత భావం, కార్యనిర్వహణ పెంపొందేలా, మెరుగుపడేలా చేయాలి.

ఈ మొత్తం శిక్షణా వ్యవహారం విజయవంతం కావడానికి, సత్ఫలితాలు ఇవ్వడానికి తెలంగాణ రాష్ట్ర ఎపెక్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ డాక్టర్ మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ సేవలను ఉపయోగించుకోవడం మంచిదేమో. అప్పటి కేంద్ర ప్రభుత్వ సిఫార్సుల మేరకు మొదట్లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ (ఐఓఏ) గా మార్చ్ 1976 లో స్థాపితమైన ఈ సంస్థ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ శిక్షణావసరాలు చూసేది. అంచెలంచలుగా ఎదిగిన హెచార్డీ ఇన్స్టిట్యూట్ ఈనాడు ప్రపంచంలోని అత్యుత్తమ శిక్షణాసంస్థలలో ఒకటిగా చెప్పుకోవచ్చు. పబ్లిక్ మేనేజ్మెంట్ అవసరాలకు ఉపయోగపడే అత్యుత్తమ శిక్షణాసంస్థ (Institute of Excellence) కూడా ఇది.       

ఎంసీఆర్ హెచార్డీ ఇన్స్టిట్యూట్ లో విజ్ఞాన పరమైన అర్హతలు కల, అనుభవుజ్ఞులైన, కష్టపడి పని చేసే, నిబద్ధతకల నిపుణుల ఫాకల్టీ బృందం వుంది. వీరిలో అఖిలభారత సర్వీసు అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, ఉన్నత విద్యా సంస్థలకు చెందిన నిపుణులు కూడా వున్నారు. వీరిలో కొందరు విజిటింగ్ ఫాకల్టీ కాగా కొందరు శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగులు. ఇటీవలే సంస్థ 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సంస్థతో దీర్ఘకాలం సంబంధం ఉన్నవారిని జ్ఞప్తి చేసుకుని కొందరిని సత్కరించింది. ఏటా దేశ వ్యాప్త అఖిలభారత సర్వీసు అధికారులతో సహా, కేంద్ర స్థాయి అధికారులతో సహా, సుమారు 15,000 మంది వివిధ స్థాయి ఉద్యోగులు ఈ సంస్థలో శిక్షణ పొందుతున్నారు.

       హెచార్డీ ఇన్స్టిట్యూట్ ఏర్పాటైనప్పుడు దాని బాధ్యతలలో ప్రధానమైనవి, రాష్ట్ర-కేంద్ర పబ్లిక్ సర్వీసు కమీషన్ల ద్వారా నేరుగా నియామకం అయినవారికి, ఐఏఎస్ అధికారులతో సహా, ఫౌండేషన్ శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడం; ఉద్యోగాలలో వున్న వివిధ స్థాయి అధికారులకు రాష్ట్ర ప్రభుత్వ విధానాల మీద, పథకాలమీద, కార్యక్రమాలమీద పునశ్చరణ శిక్షణా కార్యక్రమాలు (Refresher Courses) నిర్వహించడం; కొన్ని రకాల ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడం; శాఖాపరమైన అవసరాల నిమిత్తం శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం వున్నాయి. ఇప్పటికీ ఈ కార్యక్రమాలు ఒక మోతాదులో సంస్థ నిర్వహిస్తున్నప్పటికీ అందరికీ ఇవి అందుబాటులో తప్పనిసరిగా లేవు. అందరికీ శిక్షణ అన్న నినాదానికి అనుగుణంగా లేవు.     

ఒకానొక సందర్భంలో హెచార్డీ ఇన్స్టిట్యూట్ అభ్యర్ధన మేరకు రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య, ప్రత్యేక ప్రధాన, ఇతర కార్యదర్శులు, హెచ్వోడీలు, ఇతర శిక్షణా సంస్థల అధిపతులు సుదీర్ఘమైన చర్చలు జరిపి ప్రతి డిపార్ట్మెంటులో, జిల్లాలో ట్రైనింగ్ కోఆర్డినేటర్లను నియమించాలని, వారికి ఆయా డిపార్ట్మెంట్ల, జిల్లాల శిక్షణావసరాలకు సంబంధించిన బాధ్యతలను ప్రత్యేకంగా అప్పగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ విధంగా నియామకమైన జిల్లా, డిపార్ట్మెంట్ ట్రైనింగ్ కోఆర్డినేటర్లు ప్రస్తుతానికి ఏ మేరకు పని చేస్తున్నారో తెలియదు కాని, వుండనైతే వున్నారు. వారి సేవలను పునర్ నిర్వచించి ఉపయోగించుకోవచ్చు. గతంలో నిర్వచించిన ప్రకారం వారి బాధ్యతల్లో ప్రధానమైనవి, శిక్షణావసరాలు శాస్త్రీయంగా గుర్తించడం, తదనుగుణంగా ఏ మోతాదులో శిక్షణ ఇవ్వాలో నిర్ణయించడం, శాఖాపరమైన, జిల్లాల పరమైన శిక్షణా ప్రణాలికలు రూపొందించడం, బడ్జెట్ అవసరాలు గుణించడం, హెచార్డీ ఇన్స్టిట్యూట్ తో శిక్షణా పరమైన విషయాలలో సమన్వయం చేసుకోవడం వున్నాయి.

ఈ నేపధ్యంలో 1996 సంవత్సరంలో కేంద్రప్రభుత్వం జాతీయ శిక్షణా విధానాన్ని (National Training Policy) విడుదల చేసింది. దాన్నే తిరిగి 2012 లో ఆధునీకరించారు. జాతీయ విధానాన్ని దృష్టిలో వుంచుకుని ఆ మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రతి రాష్ట్ర ప్రభుత్వం తమ-తమ రాష్ట్ర శిక్షణా విధానాలను తయారు చేసుకోవాలని కేంద్రం సూచించింది. ఆ దిశగా, తొలుత మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ 1997 లో పలు మూడురోజుల వ్యవధి వర్క్ షాపులు నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న వివిధ స్థాయి ఉద్యోగుల శిక్షణావసరాలను గుర్తించింది. హెచార్డీ ఇన్స్టిట్యూట్ మిషన్ స్టేట్మెంట్ కూడా రూపొందించి, దాంట్లో, తమ సంస్థ, ఉద్యోగులందరికీ ప్రభుత్వ అవసరాలకు అనుగుణంగా తాజా-తాజా శిక్షణ ఇవ్వడానికి అంకితమై వుందని పేర్కొంది.

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్లను జిల్లా ట్రైనింగ్ కమీషనర్లుగా నియామకం చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. బహుశా ఇప్పటికీ అవి అమల్లోనే వుంది వుండాలి. లేకపోతె మళ్లీ అవసరమొస్తే పునర్ నిర్వచించి జారీ చేయవచ్చు. ఈ నేపధ్యంలో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ సేవలను ఉపయోగించుకుని ఒక క్రమ పద్ధతిలో ప్రభుత్వోద్యోగులందరికీ, ప్రజా ప్రతినిధులందరికీ వారి-వారి అవసరాలకు తగ్గ విధంగా శిక్షణా కార్యక్రమాలు అమలు చేయవచ్చేమో!