Wednesday, November 29, 2017

కొరవడుతున్న సహకార సమాఖ్య స్ఫూర్తి : వనం జ్వాలా నరసింహారావు

కొరవడుతున్న సహకార సమాఖ్య స్ఫూర్తి
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రజ్యోతి దినపత్రిక (30-11-2017)

కేంద్రప్రభుత్వం సమస్త అధికారాలను తన గుప్పిట్లో పెట్టుకోకుండా, రాష్ట్రాలకు వికేంద్రీకరించి, సుపరిపాలనకు మార్గం సుగమం చేయాల్సిన తరుణం ఆసన్నమైంది. షెడ్యూల్డ్ కులాల, తెగల, మైనారిటీల రిజర్వేషన్లు పెంచే విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును శ్లాఘిస్తూ, ఆయన సామాజిక న్యాయం కోసం చేస్తున్న ప్రయత్నాలు గొప్పవని తమిళనాడు డీఎంకే నాయకుడు ఎంకె స్టాలిన్ పత్రికా ప్రకటన విడుదల చేయడం, దరిమిలా కేసీఆర్ ఆయనకు ఫోన్ చేసి ధన్యవాదాలు తెలపడం, హైదరాబాద్ వచ్చిన మరుక్షణం ఈ విషయాన్ని పరోక్షంగా ప్రస్తావించి  “సమాఖ్య స్ఫూర్తికి కేంద్రం కట్టుబడి వుంటుంది” అని ప్రధాని మోడీ చెప్పడం, కేంద్ర రాష్ట్ర సంబంధాలలో, సహకార సమాఖ్య మనుగడలో నూతనాధ్యాయానికి తెరదించుతుంది. పెంచిన రిజర్వేషన్లు అమలుకొరకు, రాష్ట్రాల హక్కులకొరకు, అవసరమైతే దేశంలోని ఇతర రాష్ట్రాల నాయకులను కలుపుకుని, భారత రాజధాని డిల్లీలో జంతర్-మంతర్ దగ్గర కేసీఆర్ సారధ్యంలో ధర్నా నిర్వహించే అంశం కూడా స్టాలిన తన పత్రికా ప్రకటనలో ప్రస్తావించారు. సహకార సమైఖ్య సిద్ధాంతాలప్రాతిపదికగా, విభిన్న దృక్ఫదాల రాజకీయ నాయకుల ఆలోచనాసరళులకు అవకాశం కలిగించే రీతిలో, సర్దుబాటు ధోరణిలో పనిచేసే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం. కాకపోతే ఏమేరకు ఈ సహకార సమాఖ్య విధానం ఆచరణలో పనిచేస్తున్నదనేది సమాధానం దొరకని ప్రశ్న.

రెండేళ్ళ క్రితం చైనాలో జరిగిన ప్రపంచ ఆర్ధిక సమావేశంలో మాట్లాడిన సీఎం భారత సమాఖ్య వ్యవస్థను గట్టిగా సమర్థించారు. దేశాభివృద్ధిలో రాష్ట్రాలు కీలక పాత్ర పోషిస్తున్నందున దాన్ని గుర్తించిన కేంద్రం రాష్ట్రాలకు పెద్ద మొత్తంలో నిధులు, అధికారాలు ఇవ్వనున్నట్లు ఆ సందర్భంగా సీఎం పేర్కొన్నారు. ఆ క్రమంలోనే ప్రణాలికా సంఘం స్థానంలో నీతీ ఆయోగ్ ఏర్పాటైందనీ, అందులో రాష్ట్రాల ముఖ్యమంత్రులందరూ సభ్యులనీ, ప్రధానమంత్రి దాని అధ్యక్షుడనీ, దాన్నే “టీం ఇండియా” గా పిలుస్తారనీ సీఎం చెప్పారు. ఇలా ఏర్పాటైన నీతీ ఆయోగ్ దేశాభివృద్ధికి, రాష్ట్రాల అభివృద్ధికి అవసరమైన ప్రణాలికా రచన చేస్తుంది. దీనర్థం సమాఖ్య స్ఫూర్తితో పనిచేసే భారత దేశంలో రాష్ట్రాలకు గణనీయమైన పాత్ర వుందని.     

ఇదిలా వుండగా, ఈ నెల జరిగిన రాష్ట్ర శాసనసభ సమావేశాలలో మైనారిటీ సంక్షేమంమీద జరిగిన లఘు చర్చలో పాల్గొన్న ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్రాలకు అధికారాల బదిలీ విషయం పునరుద్ఘాటిస్తూ, 70 సంవత్సరాల స్వాతంత్ర్యానంతరం, కేంద్ర-రాష్ట్రాల అదికారాలను  కూలంకషంగా సమీక్షించి, దేశాన్ని సమీకృతంగా ముందుకు తీసుకుపోవడానికి చాలా విషయాలలో అధికారాలను రాష్ట్రాలకు బదలాయించాలని అన్నారు. అధికారాలు కేంద్రీకృతం కాకూడదని ఆయన చెప్పారు. రాష్ట్రాల సోషల్ కాంపోజిషన్ మారుతున్నదనీ, స్వతంత్రం వచ్చినప్పుడున్న పరిస్థితులకూ, ఇప్పటి పరిస్థితులకూ తేడా వున్నదనీ, ప్రజల ఆశలు, డిమాండ్లు పెరుగుతున్నాయనీ, తదనుగుణంగా అధికార వికేంద్రీకరణ జరగాలని నొక్కిచెప్పారు. ఎస్సీల, ఎస్టీల, మైనారిటీల సామాజిక వెనుకబాటుదనం దృష్టిలో పెట్టుకుని, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులకు అనుగుణంగా, వారి రిజర్వేషన్ శాతం పెంచాలని అంటూ, తమిళనాడు లాగానే తమ విషయంలో కూడా దాన్ని రాజ్యాంగం తొమ్మిదో షెడ్యూల్ లొ చేర్చాలని, లేదా, కేంద్రం తిరస్కరిస్తే అత్యున్నత న్యాయస్థానం మెట్లు తొక్కుతామనీ అన్నారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణా పార్లమెంట్ సభ్యులు సభలో భయంకరమైన పోరాటం చేస్తారని కూడా ఆయన హెచ్కరించారు.

ఈ నేపధ్యంలో ఒక్కసారి భారతదేశంలో సహకార సమాఖ్య ఆవిర్భావం, పరిణామక్రమం, క్రమేణా పరిస్థితులు మారిపోయి ఆకారణలో తిరోగమనానికి దారితీయడం, ఏక కేంద్రక ప్రభుత్వం దిశగా అడుగులు వేయడం లాంటి అంశాలమీద విశ్లేషణ జరగడం అవసరమేమో! అవసరాల అనుగుణంగా, నెలకొన్న పరిస్థితుల ఆధారంగా, సమాఖ్య పద్దతిగానైనా, ఏక కేంద్రక పద్దతిగా నైనా, పనిచేసే విధంగా కేంద్రంలో ప్రభుత్వం నడవడానికి భారతరాజ్యాంగం వీలుకలిగించింది. కాలక్రమేణా, భిన్నమైన రాజకీయ పోకడల కారణంగా, ఉదాత్తమైన సహకార సమాఖ్య దిశగా కాకుండా, పటిష్టమైన ఏక కేంద్ర పోకడల దిశగా కేంద్ర ప్రభుత్వం పయనించడం గమనార్హం. నీతీఆయోగ్ ఏర్పడినప్పటికీ, ఈ విషయంలో పెద్దగా మార్పు కనపడిన దాఖలాలు అంతగా లేవు. రాష్ట్రాలను ఆదుకునే విషయంలో కానీ, ఉదారంగా నిధులు విడుదల చేసే విషయంలో కానీ, అధికారాలను వికేంద్రీకరించే విషయంలో కానీ, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతున్నట్లు కనిపించడం లేదు.


ఉదాహరణకు, నూతన రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ పారిశ్రామిక విధానాన్నే తీసుకుందాం. దీనికి అనుకున్న ప్రోత్సాహం కేంద్రం నుంచి రావడం లేదు. పేదవారి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిర్మిస్తున్న రెండు పడక గదుల పథకానికి ఉదారంగా రావాల్సిన నిధుల జాడ లేదు. మంచినీటి పథకానికి తెలంగాణ విరివిగా ఖర్చు చేస్తున్నది...సాగునీటి ప్రాజెక్టులకు భారీ నిధుల కేటాయింపున్నది...అనేక సంక్షేమ కార్యక్రమాలను, దేశంలో ఎక్కడా అమలుకాని విధంగా తెలంగాణాలో అమలవుతున్నాయి. వీటన్నిటికీ అందాల్సిన మోతాదులో, అందునా సహకార సమాఖ్య అని చెప్పుకుంటున్న నేపధ్యంలో,  కేంద్ర సహాయం అందడం లేదనేది అక్షర సత్యం.

సహకార సమాఖ్యకు చారిత్రాత్మక నేపధ్యం వుంది. రాచరిక వ్యవస్థ వేళ్లూనుకున్న రోజుల్లోనే సమాఖ్య స్ఫూర్తితో, స్థానిక స్వపరిపాలనలో రాజులు-చక్రవర్తుల జోక్యం చేసుకోలేదు. ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనా వ్యవహారాల్లో నాటి ఆంగ్లేయ ప్రభుత్వం క్రమబద్ధీకరణ-నియంత్రణ విధానాన్నే పాటించింది కాని నిరంతరం జోక్యం చేసుకోలేదు. భారత ప్రభుత్వ 1919 చట్టం కూడా “డైఆర్ఖీ” పేరుతొ సమాఖ్య భారత దేశాన్ని పేర్కొన్నది. రాష్ట్రాలతో “సహకారం, సంప్రదింపులు” అనే సిద్ధాంతాన్నే జవహర్లాల్ నెహ్రూ చెపుతుండేవారు. సంస్తానాలన్నీ భారత యూనియన్ లో అంతర్భాగం కావడం సహకార సమాఖ్య స్ఫూర్తితోనే!

స్వాతంత్ర్యం వచ్చిన తరువాత సుమారు రెండు దశాబ్దాలు ఎకచ్చత్రాదిపత్యంగా, అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రాలలోను, భారత జాతీయ కాంగ్రెస్ పాలన వుండేది. దరిమిలా కాంగ్రెసేతర పరభుత్వాలు కొన్ని రాష్ట్రాలలో ఏర్పడడంతో సమాఖ్య వైపు కొంత మళ్లడం జరిగింది. మరికొంత కాలానికి కాంగ్రెసేతర ప్రభుత్వాలే కాకుండా, అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రాలలోనూ, సంయుక్త-సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడడంతో మరికొంత మార్పు సమాఖ్య దిశగా కనిపించినా, అదే స్ఫూర్తితో, అది ఎంతో కాలం కొనసాగలేదు. రాజ్యాంగంలోని కేంద్ర ప్రభుత్వ జాబితా అంశాలు, ఉమ్మడి జాబితాలోని అంశాలు, ఇంకా ఇప్పటికీ భారత రాజ్యపాలన విధానాన్ని శాసిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ జాబితా అంశాలు వెనుకంజలోనే వున్నాయి. ఈ పధ్ధతి మారకపోతే, సరిదిద్దుంపు చర్యలు చేపట్టకపోతే, సహకార సమాఖ్య కాస్తా ప్రతిఘటన వ్యవస్థగా రూపాంతరం చెంది, రాష్ట్రాలు మరిన్ని వికేంద్రీకరనాధికారాలు కావాలని దిమాడు చేయడం తప్పదు.

రాజ్యాంగంలో మూడు రకాల ప్రభుత్వ జాబితాలున్నాయి. కేంద్ర జాబితా, రాష్ట్రాల జాబితా, ఉమ్మడి జాబితా. వాస్తవానికి అవశేష అధికారాలన్నీ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోనే వుంటాయి. కేంద్ర ప్రభుత్వ జాబితాలో వున్నా 100 అంశాలు రాజ్యాంగం ఏడవ షెడ్యూల్ లో వుంటాయి. వీటికి సంబంధించి చట్టం చేసే అధికారం సంపూర్ణంగా పార్లమెంటుది మాత్రమే. వీటిలో మిగతావాటితో పాటు, రక్షణ, విదేశాంగ వ్యవహారాలు, పౌరసత్వం, రైల్వేలు, జాతీయ రహదారులు లాంతి వాటితో పాటు రాష్ట్ర జాబితాలో, ఉమ్మడి జాబితాలో చేర్చని అన్ని అంశాలు వుంటాయి. ఇక రాష్ట్ర ప్రభుత్వ జాబితాలో 61 అంశాలున్నాయి. అయినప్పటికీ వీటికి సంబంధించిన ఎలాంటి చట్టం రాష్ట్ర చట్ట సభల్లో చేయాలన్నా, వాటి చట్టబద్ధత మాత్రం పార్లమెంట్ సర్వసత్తాక అధికారానికి లోబడే వుంటుంది ఒక విధంగా. కాకపోతే, ఉమ్మడి జాబితాలోని అంశాలకు సంబంధించి రాష్ట్ర శాసనసభ చేసిన చట్టానికి రాష్ట్రపతి ఆమోదం లభిస్తే దానికి చట్టబద్ధత వుంటుంది. రాష్ట్ర జాబితాలో పోలీసు, జైళ్ళు, స్థానిక స్వపరిపాలన, ప్రజారోగ్యం, విద్యుత్ లాంటివి వున్నాయి. అదే విధంగా ఉమ్మడి జాబితాలోని 52 అంశాలున్నాయి.  

భారత రాజ్యాంగంలో ఎక్కడాకూడా “సమాఖ్య” అన్న పదం లేదు. కాకపోతే, సమాఖ్యకు వుండాల్సిన అన్ని లక్షణాలు కనిపిస్తాయి. అవి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు; అధికారాల పంపకం; వ్రాతపూర్వక రాజ్యాంగం; రాజ్యాంగానికుందాల్సిన సంపూర్ణ ఆధిపత్యం; దృఢమైన రాజ్యాంగం; స్వతంత్ర న్యాయవ్యవస్థలు; ఉభయ సభల శాసన నిర్మాణ వ్యవస్థ. ఇన్ని ఉన్నప్పటికీ, సమాఖ్య తరహా, ఏక కేంద్రక స్ఫూర్తి వున్న భారత దేశాన్ని “రాష్ట్రాల సంయోగ వ్యవస్థ” (Union of States) అనే సంబోధిస్తారు.


కేంద్ర ప్రభుత్వ సహాయంతో అమలు కావాల్సిన అనేక పథకాల నిధుల ఉపయోగం విషయంలో పూర్తీ అధికారం రాష్ట్రాలకే బదలాయిస్తే సమాఖ్య స్ఫూరికి అర్థం వుంటుంది. అలా చేస్తే ఆ పథకాల అమలు శాస్త్రీయంగా, రాష్ట్రాల అవసరలాకు అనుగుణంగా జరిగే వీలుంది. ప్రధానమంత్రి జేఏఎస్ సదస్సు సందర్భంగా హైదరాబాద్ విమానాశ్రయంలో మాట్లాడుతూ, సహకార సమాఖ్య స్ఫూర్తికి కేంద్రం కట్టుబడి వుందని అన్నారు. అలాగే నీతీఆయోగ్ మొదటి సమావేశంలో మాట్లాడుతూ సహకార సమాఖ్య అంశాన్ని పడే-పడే ప్రస్తావించారు. రాజకీయాలకు అతీతంగా కేంద్ర ప్రభుత్వాన్ అసలు-సిసలైన సహకార సమాఖ్య స్ఫూర్తితో వ్యవహరిస్తేనే రాష్ట్రాల భివృద్ధి, తద్వారా దేశాభివృద్ధి సాధ్యపడుతుంది. 

Monday, November 27, 2017

Activate Cooperative Federalism : Vanam Jwala Narasimha Rao

Activate Cooperative Federalism
Vanam Jwala Narasimha Rao
Telangana Today (28-11-2017)

DMK leader MK Stalin’s press release applauding Telangana Chief Minister K Chandrashekhar Rao’s massive efforts to uphold social justice with reference to increasing percentage of reservations to SC, ST and Minorities and for calling a procession at Delhi’s Jantar Mantar demanding such right to the states followed by a phone call from CM KCR to Stalin thanking him will unveil a new chapter in the centre-state relations and cooperative federalism in the country. India is the world’s largest democracy with a federal structure and is supposed to accommodate numerous facets of country’s political system with great flexibility within the broad framework of cooperative federalism. Whether this is happening in its letter and spirit is a million-dollar question?

 Defending states’ role…. Chief Minister of Telangana K Chandrashekhar Rao while participating in the world economic meet in China two years ago strongly defended the federal structure of India. He said that in India states have a major role to play and realizing this aspect, the Government of India has delegated more powers and funds to the states. In place of the earlier Planning Commission an organization called NITI Ayog consisting of all the Chief Ministers of all the states with Prime Minister as its Chairman has come into existence referred as Team India. With Prime Minister as Chairman and CMs as members, all states together need to plan the development of country and the states’ development as well. In a federal structure like the one India, states shall have a major role to play.

This month, KCR while participating in a discussion on minorities’ welfare in the Legislative Assembly, however, reiterated that it was time the Centre reviewed its stand on accommodating States’ requirements. He said that for taking forward the country in an integrated manner, the Government of India must transfer to the States several of the schemes and subjects that are under its hold. Peoples’ desires, ambitions and demands are on the increase and, therefore, he called for more decentralisation. Keeping in view the social backwardness, the percentage of reservations in the State to minorities, STs and SCs must be enhanced, he said. The Union government should either accept this decision and include it in the 9th Schedule or reject it so that the doors of the Supreme Court could be knocked. The Chief Minister also hinted at agitation in the ensuing Parliament session by his MPs to secure their demand.


Towards Unitary features…. Against this background, there is a need for a fresh look at the conceptual evolution of cooperative federalism in India and pass its inoperative nature in several contexts.

Indian Constitution creates a central government which can move either on the federal or on the unitary plane, according to the needs of the situation. Over a period, because of diverse political features in our country it looks like we are moving towards extra emphasis on strong unitary features instead of moving towards liberal cooperative federalism despite the NITI Ayog presence.

For instance, the industrial Policy of Telangana, the newest and youngest 29th state of India, needs cheer from centre. The two-bedroom house scheme for the vulnerable and disadvantaged community needs full support from Government of India in all aspects including liberal funding. Telangana Government is spending lot of money on providing drinking water. It spends huge funds on irrigation projects, a plethora of welfare measures which are not implemented anywhere in the country. None of these get the support the way it is expected from the federal structured government.

Historical roots….Cooperative Federalism has historical roots. During the days of kingdoms in India we practiced federal policies with non-intervention in local affairs. Even the British Government was only regulating the work of East India Company but did not intervene in its powers. The Government of India Act 1919 also provided for a federal India called the dyarchy. Jawaharlal Nehru philosophy was “cooperation and consultation with the states”. The Princely states joining Indian Union was with the spirit of cooperative federalism.

For nearly the first two decades it was a Central Rule as the Indian National Congress was ruling in the Centre and in almost all the States. With non-congress governments coming to power in states later, the shift was towards a bit more federalism. When non-congress and coalition governments came on to the scene both at the centre and states though there was a shift towards more of a federal structure, it did not continue with the same spirit for long. Many of the Union and Concurrent list subjects continue to dominate the polity of India. If corrective measures are not initiated, cooperative federalism will turn into confrontation structure with States demanding more and more decentralised powers.

Three Lists…. The Constitution has three lists namely the Union List, State List and Concurrent List. In effect residual powers remain with the Union Government. Union List is a list of 100 items given in Seventh Schedule in the Constitution of India on which Parliament has exclusive power to legislate. These include among others; Defence of India; Foreign affairs; Citizenship; Railways; National Highways etc. and any other thing not listed in state list and concurrent list.

The state list has 61 items. Notwithstanding all this big list, none of the laws that are made by the Legislature of a state are valid if they are inacceptable to Parliament and for which Parliament is competent to enact. However, if the law made by the Legislature, of a State is connected to the Concurrent List and has received President assent, then it will prevail in that State. The state list among others consist of, Police; Prisons; Local government; Public health; liquors; Electricity etc. The concurrent list is a list of 52 items. They are among others, Criminal law; Criminal procedure; Preventive detention; Civil procedure; Drugs and poisons etc.

The term “Federation” has nowhere been used in the Constitution. However, in India it contains all the usual features of a federation, namely, two governments, division of powers, written Constitution, supremacy of Constitution, rigidity of Constitution, independent judiciary and bicameralism. Despite all this, India is described as a Union of States though it is federal in form and unitary in spirit.


For planning and implementing centrally assisted schemes such as the National Social Assistance Programme; Mahatma Gandhi National Rural Employment Guarantee Programme; Umbrella Schemes for Development of SCs, STs, Minorities and Other Vulnerable Groups; Pradhan Mantri Krishi Sinchai Yojana, Gram Sadak Yojana, Awas Yojana; National Rural Drinking Water Mission; National Health Mission; National Education Mission; National Livelihood Mission etc. powers could as well be delegated to states. When this is done the implementation will be more scientific as the states know the exact requirement of its people. This is the real spirit of cooperative federalism as propounded by PM Narendra Modi in his first speech in NITI Ayog.

Sunday, November 26, 2017

రామాయణాన్ని “సీతాయాశ్చరితమ్ మహత్” అన్న వాల్మీకి ..... ఆంధ్రవాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి? : వనం జ్వాలా నరసింహారావు

రామాయణాన్ని “సీతాయాశ్చరితమ్ మహత్” అన్న వాల్మీకి
ఆంధ్రవాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి?
వనం జ్వాలా నరసింహారావు
సూర్య దినపత్రిక (27-11-2017)
సీతాదేవి వృత్తాంతమంతా ఏకమై, అనన్యమై, భగవత్ ప్రాప్తి ఎప్పుడా-ఎప్పుడా అని ఎదురు చూస్తుండే పరమభక్తురాలి-ప్రపన్నురాలి చరిత్రే! అందుకే రామాయణాన్ని “సీతాయాశ్చరితమ్ మహత్” అంటాడు వాల్మీకి.

లంకలో స్త్రీలు నాలుగు రకాలు. ఈ లోకంలోనూ ఇలాంటి నాలుగు తెగల (రకాల) మనుష్యులే కనపడ్తారు. వారు:

పాపంలో పుట్టి, పాపంలో పెరిగి ఇంద్రియమే పరమార్ధమని నమ్మి పరలోక చింత లేనివారు.

ఉత్తమ వంశంలో పుట్టికూడా, స్వధర్మాన్ని వీడి, కామానికి దాసులై, ఇంద్రియ సుఖాలకు అలవాటు పడ్డవారు.

ఉత్తమ జన్మెత్తినప్పటికీ, సంసార సుఖంలో పడి, కామంలో ఇరుక్కుపోయి, దారీ-తెన్నూ లేక, సంసారం నుండి తప్పించుకొనే మార్గం కానరాక, రక్షించే నాధుడు లేక పరితపించే వారు.

ఏదో చిన్న పాపం చేసి, సంసారంలో పడ్డామనుకుంటూ, నిర్వేదంతో, దీన్నుండి తప్పించే వాడు భగవంతుడే తప్ప, వేరేవాడులేడని విశ్వసించి, తక్కిన ఉపాయాలన్నీ వదిలి, పరమ భక్తినీ-ప్రపత్తినీ ఆశ్రయించే వారు.

సీతాదేవి తాను చెరనుండి తప్పించుకోవటమే కాకుండా, తన లాగా   దుఃఖిస్తున్న దేవ, గంధర్వ, నాగ మొదలైన జాతుల స్త్రీలను కూడా విడిపించింది. నాలుగోరకంవారు (పైనచెప్పిన) తాము తరించి ఇతరులను తరింపచేస్తారు. సీతాచర్య నేర్పేదిదే! ఇతర ఉపాయాలను వెతక్కుండా, దేహాభిమానం, స్వాతంత్ర్యం వదిలి, స్వరక్షణాభారం భగవంతుడిమీద వేసి, "అనన్యార్హశేషత్వం, అనన్యశరణత్వం, అనన్యభోగత్వం" అనే అకారత్రయ సంపూర్తిని కలిగి, సంసారంలో వుండే తరించేటందుకు "ప్రపత్తితోనో, పరమభక్తితోనో" సాయుజ్యాన్ని పొందవచ్చని, సీతాదేవి చరిత్ర వలన తెలుసుకోవచ్చు. అంటే, భగవత్ప్రాప్తి కోరేవాడు, ఆయన అనుగ్రహం కొరకు సీతాదేవిలాగా, భగవన్నామాన్ని వుచ్చరిస్తూ, స్వధర్మాన్ని వదలకుండా వుండడం తప్ప వేరే మార్గం లేదు. సీతాదేవి ప్రతిదినమూ సంధ్యవారుస్తున్నదని చెప్పటమంటే, పరమభక్తుడైనా, ప్రపన్నుడైనా, జ్ఞాని అయినా, యావజ్జీవం నిత్యకర్మలు వదలరాదని అర్థంసీతాదేవి చర్య వలన మనం నేర్చుకున్న విషయాలను, ఆచరణలో పెట్టితే, జన్మాతరంలోనే ముక్తి లభిస్తుందనడంలో సందేహం లేదు.)


సుందరి సీతాదేవి, భువనైక సుందరుడైన శ్రీరాముని మాత్రమే చూడాలనుకుంటూ, ఎల్లవేళల మనస్సంతా ఆయన పైనేవుంచి, రాక్షస స్త్రీలను చూడనైనా చూడదు. ఫూలు, పళ్లు, మేడలు, మిద్దెలు, ఏవీ చూడదు. చూడదంటే కళ్లుమూసుకుని వుందని అర్థంకాదు. వాటివిషయమేదీ మనస్సులోకిరానీయదు. రాక్షసులు పెట్టే బాధలను లక్ష్యపెట్టేదికాదు. ప్రియమైన వాటిమీద మనస్సు పోనీయదు. ప్రియాలు, అప్రియాలు, రెండూ వదిలింది

(సీతాదేవి శ్రీరాముడినొక్కడినే చూడాలనుకుంటుంది. అంటే, ఇది, "ఏకాగ్రభక్తి, ఏకభక్తి, అనన్యత్వాన్ని" గురించి చెప్పటమే. అలానే, భక్తుడు దేవతలెందరున్నా, తన ఇష్ట దైవాన్నే నమ్మి, "ఏకభక్తి, ఏకాగ్రభక్తి" కలవాడై వుంటాడు. అలానే భక్తులు, ప్రపన్నులు, తమ కెన్ని కష్టాలొచ్చినా, విశ్వాసం వదలకుండా, భగవంతుడు రక్షించేదాకా, తమ "భక్తి-ప్రపత్తులే" తమకు రక్ష అని భావిస్తారు. పతివ్రతలు తన భర్తకంటే ధనవంతులు, విద్యావంతులు, రూపవంతులు, బలవంతులు, లోకంలో ఎందరున్నా, భర్తకంటే అధముల్లాగానే ఎంచుతుందికాని, వారిని ప్రేమించదు)

శ్రేష్టమైన ఆభరణాలెన్ని వున్నా, పతివ్రతకు మిక్కిలి శ్రేష్టమైన భూషణం, భర్తతో వుండడమే. భర్త అనే ఆ "భూషణం" దగ్గర లేకపోతే, ఆమె ఎంత గొప్పదైనా ప్రకాశించదు. వరభూశణాల కంటే  పరమ భూషణం భర్తేనట! మానవులకు భూషణాలు “భూరిమయాంగద తారహారాలు కావు. వాగ్బూషణమే సుభూషణం. భూషణాలు నశించేవే! అలాగే ఎన్ని విద్యలు నేర్చినా భగవద్భక్తి లేకపోతే అన్నీ వ్యర్ధాలే! భగవద్భక్తి  లేని పండితుడు చాకలి మూట మోసే గాడిద వంటివాడే! మర్యాదగా, జ్ఞాన భారాన్ని మోస్తున్న గార్దభం అని ఈసడించబడతారు. తుమ్మెదలలా నల్లని వెంట్రుకకొనలున్నది, తామరరేకుల్లాంటి కనులున్నది, సాముద్రిక లక్షణాలనుబట్టి ఎంతోసుఖపడాల్సింది, మధుర కంఠస్వరం కలదైన సీత కూడా దిగులు పాలైతే, జితేంద్రియుడననీ, ద్వంద్వాతీతుడననీ, గర్వమున్న తనకుకూడా, తన ఇష్టంలేకుండా దుఃఖం కలుగుతున్నదేంటా? అనుకుంటాడు హనుమంతుడు. (రామాంజనేయులిద్దరూ విజితేంద్రియులే, నిర్ద్వందులే. ఇరువురూ సీతాదేవికై దుఃఖిస్తున్నవారే. పామరత్వం కాదు కారణం. ఇతరుల దుఃఖం తన దుఃఖమనుకునే "దయ" దీనికి కారణం. బ్రహ్మచారీ, జ్ఞానీ, యోగీ, విరాగీ, కోతీ, అయిన హనుమంతుడికే, సీతాదేవితో ఇంతకు ముందెట్టి సంబంధం లేకపోయినా, దుఃఖమేస్తున్నదంటే, తనలో సగభాగమైన సీతకొరకు, శ్రీరాముడెందుకు దిగులుపడడు?)

భూదేవిలాంటి ఓర్పు, కమలాల లాంటి కళ్లు కలిగి, రామలక్ష్మణుల రక్షణలో సుఖపడాల్సిన సీత, భయంకర రాక్షస స్త్రీల బెదిరింపుల మధ్య, ఒకచెట్టు మొదట్లో ఈవిధంగా వుండడమేంటనుకుంటాడు హనుమంతుడు. భగవంతుడు దయతప్పి ప్రతికూలిస్తే ఆయనకేదసాధ్యం అని తలుస్తాడు. (రాముడు, లక్ష్మణుడు, భగవంతుడు: ఇది అనంత, గరుడ, విశ్వక్సేనాది నిత్య భాగవతులకు (నిత్యసూరిగణం) ఉపలక్షణం. చెట్టుమొదట్లో దుఃఖించడమంటే చెట్టు దేహమనీ, మొదలు హృదయమనీ, దేహానికి మూల స్థానమైన హృదయంలో ఈవిధంగా దుఃఖిస్తున్నదనీ అర్థం. ఇది భగవత్సంకల్పం)

మంచుసోకి, కాంతిహీనమైన తామరపూలలాగా దుఃఖం మీద, దుఃఖం వస్తుంటే, పరితపిస్తున్న సీత, చక్రవాకాన్ని వదిలిన చక్రవాకిలా కనిపించింది హనుమంతుడికి. (శరదృతువులో కళ-కళలాడే తామరపువ్వు కాంతి మంచుపడగానే క్షీణిస్తుంది. అలానే పన్నెండేళ్లు అయోధ్యలో సమస్త సౌఖ్యాలనుభవించిన సీత ఇప్పుడు కష్టాలు పడ్తున్నది. వసంతం రాగానే తామరపువ్వు యదావిధిగా కాంతివంతమయినట్లే, సీతకుకూడా త్వరలోనే దుఃఖం పోతుందని అర్థం. చక్రవాకానికి రాత్రివేళ భర్త వియోగం కలిగినా, ఉదయం కాగానే కలుసుకుంటానన్న ఆశవుంటుంది. అంతే ఈమె కూడా. ఆపదలు ఎప్పుడూ వుండవు. మంచికాలం వస్తుంది....భర్త తనను కలుసుకుంటాడన్న ఆశతో జీవిస్తూ, ప్రస్తుతం దుఃఖ పడుతోంది సీత.)

పూలబరువుతో అశోకవృక్షాల కొమ్మలు సువాసనలు వెదజల్లగా, వసంతకాలపు చంద్రుడి మనోహర కాంతులు విజృంభించగా, ఈమె విరహాగ్నిని మరింత ప్రజ్వరిల్ల చేసి బాధపెడ్తున్నాయని తనలో అనుకుంటూ, రాక్షసులింకా మేలుకునే వున్నారు కాబట్టి, చెట్టు మీదనే వుండిపోయాడు హనుమంతుడు. (సీతాదేవిని అశోకవృక్షం కింద వుంచడానికి ప్రత్యేక కారణం ఏదైనా వుందా? దీన్నే "సీతాశోకవృక్షన్యాయం" అని అంటారు. ఏ చెట్టుకింద వుంచినా, అక్కడెందుకున్చారన్న ప్రశ్న కలుగుతుంది. ఈమె వున్నచెట్టు సమీపంలోనే రావణుడి మేడ వుంది కాబట్టి, రావణుడు దాంట్లోనే వుంచాలనుకున్నా, సీత నిరాకరించి, సమీపంలో వున్న అశోకచెట్టు కిందకు చేరింది. చేరి అక్కడే కూర్చుంది. అదేకారణం).

Tuesday, November 21, 2017

ఆధ్వర్యం మనదే...అధ్యక్షత మనదే : వనం జ్వాలా నరసింహారావు

ఆధ్వర్యం మనదే...అధ్యక్షత మనదే
వనం జ్వాలా నరసింహారావు
నమస్తే తెలంగాణ దినపత్రిక (22-11-2017)

తెలంగాణలో జరిగే ప్రపంచ తెలుగు మహాసభలకు రంగం సిద్ధమవుతున్నది. సమావేశాలు జరగడానికి ఇంకా మూడు వారాలే మిగిలాయి. దేశం నలుమూలల నుంచీ, విదేశాలనుంచీ, మన రాష్ట్రం నుంచీ, పొరుగు తెలుగు రాష్ట్రం నుంచీ, వేలాదిమంది సాహిత్యాభిమానులు రానున్నారీ మహాసభలకు. యావత్ భారతదేశానికే గుండెకాయ లాంటి చారిత్రాత్మక హైదరాబాద్-భాగ్యనగరం ఈ సభలకు వేదిక కాబోతున్నది. తోరణాలతో, స్వాగత ద్వారాలతో పండుగ వాతావరణం చూడబోతున్నాం. రాష్ట్రప్రభుత్వ పరంగా సంపూర్ణ సహకారం ఉన్నందున అన్ని సంబంధిత శాఖల సమన్వయంతో పనులన్నీ ఏ లోటు లేకుండా చురుగ్గా జరుగుతున్నాయి. ఇదొక మర్చిపోలేని మధురానుభూతిగా వుండబోతున్నది. తెలుగు మహాసభల ముద్ర హైదరాబాద్ మీద బలంగా పడుతుందనడంలో అతిశయోక్తి లేదేమో! “భాగ్యనగరం భాసిల్లుతున్నది” అన్న అనుభూతి మిగులుతుంది.

అంగరంగ వైభోగంగా, నభూతో-నభవిష్యత్ అనే రీతిలో, రాష్ట్ర ప్రభుత్వ సాహిత్య అకాడెమీ ఆధ్వర్యంలో జరగనున్న సభల పూర్వరంగంలో బహువిధ సమీక్షా సమావేశాలు, సన్నాహక సమావేశాలు నిరంతరం జరుగుతున్నాయి. సాహిత్యాభిలాషైన రాష్ట్ర ముఖ్యమంత్రి  కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్వయంగా కొన్ని సన్నాహక సమావేశాలను నిర్వహించడం ఒక ప్రత్యేకత అనాలి. దాదాపు రోజువారీగా, సీఎం, మహాసభల ఏర్పాట్లను సమీక్షించడం అంటే, ప్రతి అంశాన్ని ఆయన కూలంకషంగా స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లుగా భావించాలి. ఎక్కడా ఏ తప్పు జరక్కుండా, ఎవరూ నిర్వాహకులను వేలెత్తి చూపకుండా, సమావేశాలకు హాజరైన వారందరూ ఎల్లకాలం గుర్తుంచుకుండేలా సభలు జరగబోతున్నాయనడానికి ఇవన్నీ తార్కాణం. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన సన్నాహక సమావేశాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న సమావేశం, నవంబర్ 20 న ప్రగతిభవన్ లో, తెలంగాణాలో తెలుగు సాహిత్యాన్ని అధ్యయనం చేసి-ఔపోసన పట్టిన ఉద్దండులైన అరవై మందికి పైగా ప్రముఖులతో జరిపిన సమావేశం అనాలి. రాష్ట్రం నలుమూలల నుంచి, తమదైన శైలిలో, ఒక్కో సాహిత్య ప్రక్రియలో నిష్ణాతులైన పలువురు, ఈ సమావేశానికి హాజరయ్యారు. ఇందులో సీఎం చెప్పిన విషయాలు అక్షరలక్షలు.

ఈ మహాసభలు జరపడానికి ప్రేరణ...సమైక్య రాష్ట్రంలో మన భాషను-యాసనూ వెక్కిరించి, హేళన చేసి, వెకిలిగా విమర్శించి, మన ప్రతిభా పాటవాలను వెలుగులోకి రాకుండా చేసిన నేపధ్యమే! ఇప్పుడు మన రాష్ట్రం మనకొచ్చింది. ఈ రాష్ట్రంలో జరిగే అనేక కార్యక్రమాల ప్రాతిపదికగా “స్వాభిమాన నిర్మాణం” జరుగుతున్న క్రమం ఇది. సాహిత్య సేవ ఏళ్ల తరబడిగా, తెలంగాణా ఎంత గొప్పగా చేస్తున్నదో ప్రపంచానికి చాటి చెప్పే అవకాశం ఇది. ఈ రాష్ట్రంలో అనాదిగా, అద్భుతమైన సాహిత్యాన్ని వెలువరించే గొప్పవాళ్లున్నారని తెలియచేయబోతున్నాం. ఈ సభలు అచ్చంగా, తెలంగాణా తెలుగులో వెల్లివిరిసిన సాహితీ సంపదను ప్రపంచానికి వివరించడానికి జరుగుతున్నాయనేది అందరికీ అర్థం కాబోతున్నది. భాష సుసంపన్నంగా పరిణామం చెందుతున్న క్రమంలో, సామాజిక పరిణామానికి అనుగుణంగా సాహిత్య పరిణామం చెందుతున్న క్రమంలో, జరుగనున్న ఈ సమావేశాలు, అన్ని రకాల సాహిత్యాన్ని పరిపుష్టంగా విశదీకరించడానికి ఒక వేదిక కానుంది.

బమ్మెర పోతన, పాల్కురికి సోమనాదుడి నుండి, నేటి వరకు, పద్య-గద్య కావ్యాల, స్వేచ్చా వచన రచనల విశిష్టత చర్చకు రానున్నది. పండితులు, అవధానులు చేసిన సుసంపన్నమైన సాహితీ ప్రక్రియలు చర్చకు వస్తాయి. ఆధునిక యుగంలో జరిగిన గేయకవితా ప్రక్రియల మీద, జనం వేనోళ్ల పాడిన పాటల మీద, సినీ గేయాల మీద, అనేకానేక సాహితీ ప్రక్రియల ఆధారంగా వెలువడిన గ్రంథాల మీద చర్చ జరుగుతుంది. తెలంగాణ వాళ్లు తెలుగు మహాసభలు చాలా ఘనంగా జరిపారన్న పేరు వచ్చి తీరుతుంది. సాహితీ పరంగా తెలంగాణ తెలుగువారి ఐక్యత ప్రపంచానికి చాటి చెప్పడానికి ఇదొక మహత్తర అవకాశం. అనేకమంది తెలంగాణ పండితుల, కవుల, రచయితల, పాత్రికేయుల, వైతాళికుల అముద్రిత గ్రంథాలను ముద్రించి, విస్మరించిన తెలంగాణ సాహిత్యాన్ని వెలికితీయడానికి మహాసభలు దోహదపడతాయి. కేవలం మహాసభలతోనే ఈ ప్రక్రియ ఆగకుండా ఇది నిరంతరం కొనసాగే ప్రక్రియ కూడా అయితే మంచిది.


ప్రపంచ తెలుగు మహాసభల పూర్వరంగంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తీసుకున్న అత్యంత ముఖ్యమైన నిర్ణయం, ప్రాధమిక తరగతి నుండి ఇంటర్మీడియేట్ (12 వ తరగతి) వరకు తెలుగు భాష అధ్యయనం విధిగా వుండాలని చేయడం. ఉర్దూ మాధ్యమం వున్న పాఠశాలల్లో కూడా ఇంటర్ వరకూ తెలుగు నేర్చుకోవడం తప్పనిసరి. తెలంగాణ వారికి తెలుగు సరీగ్గా రాదని హేళనకు గురిచేసిన వాళ్లకు ధీటైన సమాధానంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇది. మన తెలుగు సంవత్సరాల పేర్లు, పండుగల పేర్లు, మాసాల పేర్లు మర్చిపోయిన నేపధ్యంలో, నమస్కారం మన సంస్కారం అని మర్చిపోయిన నేపధ్యంలో, తెలుగు మహాసభల పుణ్యమా అని తీసుకున్న ఈ నిర్ణయం, భవిష్యత్ లో ఎంతో మేలు చేస్తుంది. పెద్ద బాలశిక్ష లాంటి పాతకాలపు పుస్తకాలకు దీటుగా అలాంటి విద్యనందించే పుస్తకాలు ఎలా వుంటే బాగుంటుందో తెలుగు మహాసభల్లో చర్చకు రావాలి. విలువల గురించి తెలుగులో విద్యాభోధన చేసే పద్ధతులను కూడా మహాసభలు చర్చించాలి.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత, ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించే బాధ్యతను నెత్తిన వేసుకుంది మొదలు తెలంగాణానే. భాషకు ఎవరూ యజమాని లేరు... నేర్చుకున్నవారే భాషాధిపతులు. తెలంగాణ తరువాత తెలుగు మాట్లాడే మరో రాష్ట్రం అంధ్రప్రదేశ్. అక్కడినుండి కూడా అనేకమంది వస్తారు. ఆ ప్రాంతం నుండి కూడా ఎందరో ప్రసిద్ధ కవులు, రచయితలూ వున్నారు. గుర్రం జాషువా, జంధ్యాల పాపయ్య శాస్త్రి లాంటి వారి రచనల మీద కూడా చర్చ జరగవచ్చు. అలా కాకుండా, తమని పిలిచి అవమానించారన్న అపవాదు రాకూడదు. కాకపొతే వాళ్ళను కూర్చోబెట్టి మన ప్రతిభ ఏంటో చెప్పాలి. సభల నిర్వహణలో ఆంధ్రావారిపట్ల సహనం కోల్పోవాల్సిన అవసరం లేదు. ఎవరెన్ని చెప్పినా, ఎవరేం మాట్లాడినా, తెలంగాణాతో పాటు ఆంధ్రావాళ్ళూ మాట్లాడేది తెలుగే! అందుకే సభల నిర్వహణలో ఒకవైపు మన సంస్కారం కోల్పోకుండా, మరో వైపు వాళ్లకు ఏ విధమైన నిర్వహణా బాధ్యతలు, ఆధిక్యత అప్పచెప్పకుండా వుండే రీతిలో వ్యవహరించాలి.  ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణా మహాసభల “ఆధ్వర్యం, ఆధ్యక్షత” మనదే అన్న రీతిలో నిర్వహణ వుండాలి. వందకు వంద శాతం తెలంగాణా ప్రాశస్త్యం మాత్రమే చాటాలి. ప్రతిభాపాటవాలు మనవే అని నిరూపించాలి. ఒకవైపు మన ప్రతిభను చాటుకుంటూనే, మరోవైపు, సంకుచిత్వం లేకుండా, సుహృద్భావం-సౌజన్యంతో వ్యవహరించి, మరెక్కడా జరగని కృషి తెలుగు నుడికారంలో తెలంగాణాలో జరిగిందని తెలియచేయాలి. పొరుగు రాష్ట్రం వారిని గౌరవించడంలో మాత్రం లోపం జరుగరాదు. అలాగే వారిపట్ల మన ఔన్నత్యం మర్యాదగా తెలియచేయాలి.

ఇదిలా వుండగా, తెలుగు సాహితీరంగాన్ని ప్రభావితం చేసిన వాటిలో, అంతో-ఇంతో పాత్ర పోషిస్తున్న సినిమారంగాన్ని గురించిన వివరమైన చర్చ కూడా మహాసభల సందర్భంగా జరగడం మంచిది. ఈ రంగం కొంచెం వివాదాస్పదమైనది అయినప్పటికీ, ప్రతిభావంతమైనదనేది నిర్వివాదాంశం. ఒకనాటి సినీరంగ కేంద్రం అయిన చెన్నైలో (నాటి మద్రాస్) అవకాశాలు బాగా లభించిన ఆంధ్రా ప్రాంతం వారు రాణించారు. అప్పట్లో తెలంగాణ వాళ్లకు ఎక్కువగా అవకాశాలు రాలేదు-రానివ్వలేదు. దరిమిలా హైదరాబాద్ కు పరిశ్రమ తరలివచ్చింది. అక్కడక్కడ తప్ప, తెలుగు సినీరంగమంతా ఆంధ్రావాళ్ళ ఆదిక్యతలోనే ఉందనాలి. ఇప్పుడిప్పుడే తెలంగాణ వాళ్లు కొంచెం పేరుతెచ్చుకుంటున్నారు. స్టూడియోల సంఖ్య, వసతుల మోతాదు పెరగడంతో, భారతదేశంలొ అత్యధికంగా సినిమాలు తీసే రాష్ట్రం తెలంగాణ అయింది. దీనికి కారణం స్టూడియోలున్న హైదరాబాద్ నగర వాతావరణం, దేశంలోని వివిధ నగరాలకు దాని సామీప్యం. అనేక కారణాల వల్ల హైదరాబాద్ నుండి సినీ పరిశ్రమను తరలించే ప్రయత్నం జరుగుతున్నది. తెలంగాణ ప్రభుత్వం కనుక పూర్తి స్థాయిలో సహకారం అందిస్తే భారతదేశానికి హైదరాబాద్ “సినీ హబ్” అవుతుంది. ఈ నేపధ్యంలో, తెలుగు సినీరంగానికి సంబంధించిన అంశాలు తెలుగు మహాసభల్లో చోటు చేసుకోవాలి. ఒక “సినీ నైట్” కాని, సినీ సంగీత విభావరి కాని ఏర్పాటు చేస్తే మంచిది. ఈ కార్యక్రమంలో ఎవర్నీ కించపరిచే విధంగా కాకుండా ఆ రంగం ప్రాముఖ్యతే ప్రధాన అంశంగా నిర్వహణ జరగాలి.


సాహితీపరమైన, సంగీతపరమైన కార్యక్రమాల సమన్వయంతో; అద్భుతమైన కళా ప్రదర్శనలతో; జనరంజకంగా వుండే సినీ గీతాల ఆలాపనలతో; తెలంగాణ చేసిన సాహితీ సృజన బయటి ప్రపంచానికి చాటి చెప్పే ప్రక్రియలతో; తెలుగుతోపాటు సంస్కృత పండితుల రచనలపై చర్చలతో.....ఇదొక భాషా-సాంస్కృతిక-సాహిత్యాల కలయికగా, కుటుంబాలకు కుటుంబాలే తరలివచ్చి ఈ పండుగలో పాల్గొనే విధంగా, ప్రపంచ తెలంగాణ తెలుగు మహాసభలు జరుగనున్నాయి. 

Sunday, November 19, 2017

World Telugu Conference, the blossoming of Telugu Language

World Telugu Conference
the blossoming of Telugu Language

The State Government decided to organize the prestigious World Telugu conference, aa a memorable event, to highlight the origin, evolution, growth and blossoming of Telugu Language and Literature in Telangana.  Telugu Language, known as the “Ajanta Literature”, has a global applause for its sounding connotations, musical language and a hoary literary inheritance.  Nicholas Conti, a noted Western Professor referred Telugu as the “Italian of the East” while Subrahmanya Bharathi, Tamil National Poet adorned it as “Beautiful Telugu”. Since times immemorial, Telangana has been a fertile ground for the Telugu Literary Treasure. Chief Minister K Chandrashekhar Rao made a statement in the Assembly to this effect.

Historical evidences prove that vocabulary of Telugu Language has been in existence in Telangana for over 2000 years.  In fact, one can witness the basic Telugu language jargon usages in King Haala’s “Gaatha Sapthasathi” belonging to the first century itself. Another epigraphical evidence could be found in the “Jina Vallabha inscriptions” of Bommalammagutta in Kurikyala village of Karimnagar District wherein the inscription contains the four lines “Kanda stanzas”, an extremely popular presentation of Telugu poetic form.  Based on this, it is evident that Telangana by 947 AD itself had seen grammatical based literature.  Telangana is also the birth place of highly native experimental songs like “Dwipada”-the two-liners.  Palkurki Somana of Palakurthy village in Jangaon district, had proudly declared to the world that he would create Telugu Literature not full of profoundness but by using simple indigenous words thus crowning the language.

Telangana stood in forefront in creating various Telugu Literary genres.  The first Telugu composition of “Basava Purana”, first ever “Vrishadhipa Sataka” and the exemplary “Basavodaharanam” are invaluable poetical works of Palkurki Somana.  The varied literary experiments of Somana in fact became empirical for Telugu Literature in due course. All these unequivocally establish the Land of Telangana as the path finder in the growth of Telugu Literature over a period.

Gona Buddha Reddy’s “Ranganatha Ramayana” is the popular “Dwipada Poetry” (metrical poetry consisting couplet/two feet) in simple Telugu which was effusive in its simple Telugu usage.  “Yayaathi Charitra” of Ponniganti Telangana of Pathancheru in Medak District was the first ever un adulterated purest form of Telugu language.  Similarly, Madiki Singana of Ramagiri of Peddapally District wrote the “Sakala Neethi Sammatham” which was the first ever Law book in Telugu.  Likewise, Koravi Goparaju of Bhimgal of Nizamabad District compiled the first ever Telugu Story Book called “Simhasana Dwatrimsika”.  Vemulawada Bhimakavi of Vemulawada was famous for his “Çhaatu Padyalu”- poetry with a hidden meaning which has great entertainment value.  Pillalamarri Pina Veerabhadrudu of Nalgonda district who wrote “Jaimini Bharatam” went ahead and declared as “vani naa raani” - language my queen.  King Sarvagna Singa Bhupaala of Rachakonda was known as literary king too apart from being a ruler.


Known as the virtuous pinnacle of Telugus “The Srimad Bhagavatham” of Bammera Pothana is known for its divine love of eternal devotion, tender composition and beautiful grammatical style which gave it an everlasting name and fame.  Bammera village today stands as a representative of rich literary heritage of Telangana.  Various other genres like as “Dwardhi, Tyardhi, Chaturardhi, Chitra, Bandha and Avadhaana”    enrich Telugu language with alliterations, simile, hyperbole, etc.  Apart from this traditional literature, Telangana is also abode to several lively folk traditions.  Telangana keeps preserving this treasure of folk songs and folk traditions which spread fragrance of language.  Linked to the various working classes, these songs of the rural folk are quite varied with those related to the agricultural activity and other aspects of the rural life that reflect the inner beauty of the mankind.  Again, the group songs like “Bathukamma-Mother Life- songs”, “Kamudii Punnama songs”, “Asoi Dhoola” etc. reflect the social and the cultural milieu of Telangana.  All these are passing on the richness of the language, literature and the usage from generation to generation down the line.  “Chirutala Ramayana”, “Harikatha”, “Yakshagaanam”, “Oggu Kathalu”, “Budiga Jangala Sarada Kathalu”, “Baala Santhula Paatalu” etc. and other explosive forms have enriched Telangana’s Telugu.


However, gloom engulfed the hoary literary tradition of Telangana in the erstwhile state.  Only a partial interpretation of the literary history was in circulation.  The works of our literary giants gathered dust and remained unknown treasure to the world.  In fact, the very nativity of the like of Vemulawada Bhima Kavi and Bammera Pothana were distorted.  At one point of time, an extremely skewed argument to paint picture that Telangana never gave birth to any poet of repute became prevalent.  It was at this juncture, that, an eminent historian and litterateur, Suravaram Pratapa Reddy published an edition of “Golkonda Poets” consisting of 354 poetical works by going around the nook and corner of Telangana. This reminds a turning point of Telangana Self Respect and victorious literary high point. 

Maha Kavi Dasaradhi-the Great Poet- who created profound metrical poetry like “Agni Dhaara” and “Rudra Veena” in an unparalleled efficacy described the land of Telangana as My Mother Telangana – “Naa Telangana Tally Kanjatavalli”. Raavella Venkata Rama Rao of Khammam District praised the greatness of Mother Telangana, its geographical features and riches and called it a precious heavenly garden. People’s poet Kaloji Narayana Rao not only propagated the greatness of Telangana language but also gave a befitting reply to those who were sarcastic of Telangana pronunciation.

It is in this backdrop that the Telangana people revolted against the discrimination in all fields to achieve the dream of separate statehood for Telangana.  The Telangana State Government has firmly resolved to spread the greatness of Telugu Language in Telangana all over the world, shaping along the lines that people dreamt of it.  It is dedicated for enriching the lives of the younger generation with the greatness of their mother tongue.  Realizing the need to ensure regular study, research, analysis, publishing and propagation of the richness of this language, the State Government has established Telangana Sahitya Academy with noted Telangana poet Nandini Sidha Reddy as its Chairman.  The Government has recently issued orders making Telugu Language compulsory study for all students from the primary level to intermediate in the State. As part of its efforts to preserve and strengthen the language further it has decided to host World Telugu Conference in a prestigious manner.

World Telugu Conference will be held under the aegis of Telangana Sahitya academy from 15 December to 19 December 2017. The celebrations would be spread over various stadia with the Lal Bahadur Stadium as a Centre Stage whereas Ravindra Bharathi, Indira Priyadarshini Auditorium and Telugu University Auditorium will be the other places of various other programs forming part of conference.  The whole city would be decorated up with arches, gates, hoardings named after the famous literary figures who enriched not only the language but also our lives.

The State Government is extending a warm welcome to all the admirers and enrichers of Telugu language, not only from Telangana State, but also those who settled in other States and abroad.  The seminars in this regard would discuss all Telugu Literary Genres threadbare. These seminars besides recalling the past glory of the language, would be analyzing the present status and will also throw light on the futuristic goals.  This would form a basis for further research.  The cultural programs that supplement and complement the conference will showcase the greatness of Telangana culture.  A new Bonhomie among the delegates who come to attend the meet from across the world, is expected to blossom and brotherhood would flourish.  These seminars would also introduce the Telangana literary tradition to the younger generation to spark a new interest among them to embrace the same.

The State Government has already sanctioned an amount of Rs. 50 crores for organizing the meet besides Rs.5 lakhs to each district for preparatory meetings.  Literary competitions to students in the fields of essay writing, debate, poetry recitation and writing in all the schools, colleges and universities in in progress.  In addition, preparatory meetings are being held in Mumbai, Delhi, Chennai and Bangalore.  In the days to come, more such meetings would take place in not only Andhra Pradesh but also in other states and countries where Telugus live in substantial number.  Several national level personalities are all set to grace the inaugural and subsequent day celebrations of the conference. 

Telangana Government is keen that all the national and international guests are provided with the best of accommodation, food and local transport facilities, wherein every aspect reflects the Telangana uniqueness. Those who are enthusiastic to take part in the conference should contact the World Telugu Conference Special Office at Ravindra Bharathi premises or register the names through the special web sites.

The elected people representatives will focus on the literature that has emanated from their area and bring its uniqueness and any special works that have not seen the light of the day to the notice of the Chairman of the Telangana Sahitya academy Nandini Sidha Reddy.  They can knock at the doors of the Academy in Ravindra Bharathi any time and they would be heartily welcomed to bring such features into light.

The Chief Minister while making a statement in the Legislative Assembly requested the Officials and the Administration along with the MLAs to treat the conduct of the conference as a matter of prestige.  CM called upon all the literary personalities and admirers of literature to enthusiastically become a part of the Telugu Festival whole heartedly and make the World Telugu Conference a huge success.

(Source: CM Statement in Assembly on 17th November 2017)

సీత-రాములిరువురూ సేవ్యులే అనుకున్న హనుమంతుడు ..... ఆంధ్రవాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి? : వనం జ్వాలా నరసింహారావు

సీత-రాములిరువురూ సేవ్యులే అనుకున్న హనుమంతుడు
ఆంధ్రవాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి?
వనం జ్వాలా నరసింహారావు
సూర్య దినపత్రిక (20-11-2017)
సకల గుణాభిరాముడైన శ్రీరాముడిని, గుణాలతో ప్రసిధ్ధికెక్కిన సీతను పొగిడి, చింతా మనస్కుడై, కన్నీళ్లు కార్చాడు ఆంజనేయుడు. ఉత్తమురాలైన సీతకు ఎటువంటి కష్ఠమొచ్చిందని తల్చుకుంటూ మరీ-మరీ ఏడుస్తాడు. ఏడుస్తూ అనుకుంటాడు:"ఈమె మహాపతివ్రత. ఈమెకిట్టి ఆపద రాకూడదు. సీత ప్రకృతికతీత. అందరిలాగా కర్మానుభవానికై పుట్టిందికాదు. అట్టి ఈమెకే దిగులు సంప్రాప్తిస్తే కాలాన్ని అతిక్రమించే వారెవరైనా వున్టారా? అదెవ్వరికీ సాధ్యం కాదు" (సర్వం కాలాధీనమనుకొని, అదే నీతిని మనస్సులో వుంచుకొని, దుఃఖ-సంతోషాల పాలుపడ కూడదు. సీతకే ఇన్ని కష్టాలొచ్చాయే, మనమెంతనుకుని, మనస్సు పరితాప పడ్డా, బుధ్ధిని వ్యాకుల పడనీయ కూడదు)

"రామచంద్రమూర్తి నిశ్చయం, లక్ష్మణుడి అభిప్రాయం ఎరిగిందికనుకనే, వర్షాకాలపు మురుగునీరు ఎంతకలిసినా మలినపడని గంగవలె, గుండెనిబ్బరంతో వుంది సీత. లేకపోతే, ఎప్పుడో గుండె పగిలి చచ్చిపోయేది. రామచంద్రమూర్తికి కాటుకకన్నుల సీత, పతివ్రత సీతకు రాముడు, వయస్సులో, స్వభావంలో, సాముద్రిక లక్షణాలలో, సద్వంశంలో పుట్టడంలో, ఒకరికొకరు సరిగ్గా సరిపోయారు" అని కూడా అనుకుంటాడు.

(వివాహకాలంలో శ్రీరాముడికి పన్నెండేళ్లు, సీతకు ఆరేళ్లు. అంటే రాముడి వయస్సులో సగం. శాస్త్రప్రకారం తగినవయస్సే. ఇప్పుడు శ్రీరామచంద్రుడి వయస్సు ముప్ఫైతొమ్మిది సంవత్సరాలు, సీతకు ముప్ఫైరెండు. వధువుకు ఎనిమిదేళ్ళు వుంటే, వరుడికి పదహారేళ్ళు వుండాలని విష్ణు స్మృతి. సీత-రాముడు వయస్సులో ఎలా ఈడూ-జోడో, శీలంలోనూ అంతే. సాముద్రికం ప్రకారం, సార్వభౌమత్వ చిహ్నాలు రాముడికున్నాయి. అట్టి వాని భార్యకల దానికే చిహ్నాలుండాలో అవన్నీ సీతకున్నాయి. సూర్యవంశంలో ప్రసిధ్ధికెక్కిన వాడి కొడుకు రాముడైతే, చంద్రవంశంలో జగత్ప్రసిధ్ధికన్న జనకుడి కూతురు జనని-జానకి. "స్మరణ మాత్ర సంతుష్టాయ" అంటే స్మరించినంత మాత్రాన సంతోషించే వాడు రాముడు. "ప్రణతి ప్రసన్న జానకి" అంటే ఒక్క నమస్కారంతో సంతోషించేది సీత. ఇట్టి అపురూప దాంపత్యం లోకంలో ఎక్కడైనా వుందానని ఆశ్చర్యపోతాడు హనుమంతుడు. భక్తులకు సీత-రాములిరువురూ సేవ్యులే. జగన్మాత "శ్రీదేవి", జగన్నాయకుడు "విష్ణువు". ఒకరున్న చోటే రెండో వారుంటారు. వీరిరువురి తోనే ప్రపంచమంతా వ్యాపించి వుంది. ఈశత్వం ఇద్దరిలో సమానమే. సర్వదా ఏకశేషులే! ఒకేమాటలో ఇరువురినీ తెలిపేదే ఏకశేషం. ఇలా "సర్వకారణత్వం, సర్వవ్యాపకత్వం, సర్వనియన్తృత్వం" లక్ష్మీనారాయణుల్లో, సీతారాముల్లో వుంది. ఇరువురిలో, "ఉపాయత్వం, ఉపేయత్వం" వున్నాయి. అందుకే సీతారాములిరువురూ సమానంగా సేవించాల్సిన వారేనని గ్రహించాడు హనుమంతుడు.)

బంగరుబొమ్మలా, ముల్లోకాలకు దేవతైన లక్ష్మీదేవిలా వున్న సీతాదేవిని చూసి, రాముడిని మనస్సులో తలచుకుంటూ అనుకుంటాడు హనుమంతుడు:" రామచంద్రమూర్తి చేసే కార్యాలన్నింటికీ ఈమేమూలకారణం కదా! రావణసమానుడైన కబంధుడి చేతులు నరికింది ఈమెకోసమేకదా! విరాధుడు చచ్చిపోయింది ఈమెకొరకేకదా! పధ్నాలుగువేల రాక్షసులను వధించింది ఈమెకొరకేకదా! ఖరుడు, త్రిశరుడు, దూషణుడు, రాముడి చేతిలో చచ్చింది ఈమె కారణాన్నేకదా! ఈమెకోసమేకదా దుర్లభమైన వానర రాజ్యసంపద నిమిషంలో సుగ్రీవుడికి లభించింది. ఈమెకోసమేకదా తాను సముద్రాన్ని దాటింది. అట్టి ఈమెకొరకై రామచంద్రమూర్తి ముల్లోకాలను దహించివేసినా దోషంలేదు"   (రామచంద్రమూర్తి చేసే కార్యాలన్నింటికీ మూలకారణం సీతాదేవే! చేసేది రాముడు...చేయించేది సీత. నిగ్రహానుగ్రహాల రెండింటిలోనూ ఇదే నియమం)

"సీతాదేవి లేకుండా ముల్లోకాలతో కూడిన ప్రభుత్వం దక్కితే మేలా, అవిలేకుండా సీత లభించడం మేలా" అని ఆలోచించిన హనుమంతుడికి, సీతను దక్కించుకోవడానికి ముల్లోకాలను భస్మం చేసినా దోషంలేదనిపిస్తుంది. ఎందుకంటే "సీతకళలలో ఒక్కటైనా ఈమూడులోకాలకు సరిపోవు. ఇలాంటిదొక్కటున్నా కోటానుకోట్ల ముల్లోకాలు లభిస్తాయి. ఆమే లేకుంటే ముల్లోకాలు కూడా దక్కవు" అనుకుంటాడు. (భగవంతుడు అనేకకోటి బ్రహ్మాండ నాయకుడు కాగా అఖిలాండ కోటి బ్రహ్మాండాలకు నాయకి లక్ష్మీదేవి. ఈ అనంత కోటి బ్రహ్మాండాలు ఆమె మూలాన్నే నామరూపాలై, స్థితిగలవై వున్నాయి. అట్టి ఈమెకు ముల్లోకాలు ఒక లెక్కకాదు. అయితే లక్ష్మీదేవి, సీతాదేవి భగవంతుడి సహధర్మచారిణిగా, భగవత్ సంకల్పానుసారంగా, తదాజ్ఞావశవర్తియై, ఆయనకు పరతంత్రంగా వుంటుందని భావన.)

"ధర్మాత్ముడు, మహితాత్ముడు, మహాత్ముడు, మిధిలానాధుడు, జనకుడి కూతురు సీత ఈమె. పరమపతివ్రతైన సీతే ఈమె. సందేహంలేదు. ఇట్టిలక్షణాలు ఆమెలో తప్ప మరొకరిలో వుండవు. అందమైన పొలాన్ని దున్నతున్న నాగటికొనకుతగిలి, భూమినుండి లక్ష్మీదేవిలా పుట్టిన సీత, ఆ భూమినే లోకానికంతా భూమిగా చేసింది. సత్యమైన శీలాన్ని, సత్యమే శీలంగా, కలిగిన జనకుడికి ముద్దుల కూతురై, లోకానికంతా "జనకుడు"అనే పేరుతెచ్చింది తన జనకుడికి. పరాజయమంటే ఏమిటో తెలియని దశరధుడి కోడలయింది. ఆత్మజ్ఞాని, కృతజ్ఞుడు, శరణాగతవత్సలుడైన శ్రీరాముడి ముద్దులరాణయింది. భర్తమీదున్న భక్తితో, కష్టపడ్తానన్న విచారమేలేక, భర్తతో అడవికెళ్లి, ఆకులలాలు తింటూ, ఇంట్లోవున్న తృప్తిని పొందుతూ, చివరకు రాక్షస స్త్రీల మధ్యలో పడిపోయింది. భక్తిపూర్వకంగా మనస్సంతా, భర్తమీదుంచింది కాబట్టి, ఆమెకు అడవిలో కష్టాలు, కష్టాల్లా కనిపించలేదు. రాతిని తొక్కినా, కంపను తొక్కినా, మనస్సు దానిపైనంటేనే కదా కష్టమనిపించేది."


    దేహం, ఆత్మ తారతమ్యాన్ని గ్రహించిన వారిని సుఖదుఃఖాలు కదిలించలేవు. దేహమే ఆత్మ అనే భ్రాంతివల్లనే బాధ కలుగుతుంటుంది. మనస్సునుండి శరీరాన్ని వేరుచేసి భావించగల ధీమంతులకు బాధ, హాయి అనే అనుభవాలుండవు. ఈ సత్యం ఇక్కడ స్ఫురిస్తున్నది)

         "సీతాదేవి సౌందర్యంచేతనే ఆదరించతగింది. కష్టాలేంటో ఎరుగకుండానే సుఖాలను అనుభవించతగింది. ఉత్తమస్త్రీ అయినందున, పరిమితచిరునవ్వుతో మాట్లాడే స్వభావం కలది. బంగరువన్నె దేహపు చాయ, పూర్ణచంద్రుడిలాంటి ముఖం కల్గి, రావణుడు పెట్టే బాధలకు గురౌతున్నది. దాహంతో వున్నవాడు చలువపందిరి దగ్గరకు పోయినట్లు, ఇటువంటిదాన్ని శ్రీరాముడు చూడాలనుకోవడంలో ఆశ్చర్యమేముంది? చూడతలచుకోకపోతే, తప్పు ఆయనదికాని ఈమెది కానేకాదు. దుఃఖమెవరికి? రాజ్యసింహాసనం పోతే, తిరిగి సంపాదించుకుని, సంతోషించే విధంగానే, ముల్లోకాలకు, జీవకోటులకు, పూజ్యురాలైన సీతను శ్రీరామచంద్రమూర్తి మళ్లీ పొందుతాడు.... సంతోషిస్తాడు".

         (పెదవులు కదిలించకుండా కళ్లతో నవ్వినా, కొద్దిగా పళ్లు కనిపిస్తూ పెదవులు తెరిచినా "హసిత" మంటారు. ఇవి ఉత్తమస్త్రీ లక్షణాలు. మధురంగా గొంతువినపడేటట్లు నవ్వితే దాన్ని "విహసిత" మంటారు. వళ్ళంతా కదిలేట్లు నవ్వితే "ఉద్దసిత" మని, "అపహసిత" మని అంటారు. ఇవిమధ్యమ స్త్రీ లక్షణాలు. కళ్లల్లో నీళ్లు కారేటట్లు నవ్వినా "అపహసిత" మనే అంటారు. వళ్ళంతా పూర్తిగా కదిలేటట్లు నవ్వితే "అతిహసిత" మంటారు. పకపకా-వికవికా నవ్వులు దీంట్లో భాగమే. ఇది అధమస్త్రీ లక్షణం. సీతాదేవిని అందుకనే కొంచెం చిరునవ్వుతో మాట్లాడేదన్నాడు హనుమంతుడు. అలాగే దాహంతో వున్నవాడు, చలువపందిరి, రాజయం, భ్రష్టరాజు, అనే ఉపమానాలు శ్రీరాముడిని గురించే. సీతను పొందాలంటే కష్టపడి, ఆమెవున్నచోటుకే వచ్చి, ఆమెను స్వీకరించాలని సూచిస్తున్నాయి ఈ వుపమానాలు. ఆవిషయంలో సీతాదేవి చేయాల్సిన ప్రయత్నమేమీలేదు)

దప్పికయినప్పుడు చలువపందిరి దగ్గరకొస్తే, అక్కడ నీళ్లులేకపోతే, ఎట్లావుంటుందో,  ఆపరితాపమేంటో తెలిసిన సీత, శ్రీరాముడు తనకోసమొస్తే, తాను చనిపోతే, ఆయనెంత సంతాపపడ్తాడో, అన్న భావానతోనే వుంటుంది. ఆయనకట్టి సంతాపం కలిగించడం ఇష్టం లేక, బంధువులందరినీ విడిచినప్పటికీ, ఇష్టసుఖాలు కోల్పోయినప్పటికీ, ఎన్ని కష్టాలు కల్గినప్పటికీ, సర్వకాల, సర్వావస్థలందు మనస్సు భర్తపైనే నిల్పి, పోతున్న ప్రాణాలను పోనియ్యకుండా బిగపట్టివుంచింది. ఆమె చేయకలిగింది ఇంతకంటే ఏముంటుందనుకుంటాడు హనుమంతుడు.