Monday, March 29, 2010

HMRI services in Telemedicine Sector- Recognition by EDELGIVE FOUNDATION: Vanam Jwala Narasimha Rao

Celebrity Celebration to Dr AP Ranga Rao
Vanam Jwala Narasimha Rao

Sixteenth March, 2010 evening shall remain as the day filled with sweetest memories, for many relatives and friends of Dr AITHARAJU PANDU RANGA RAO, currently Advisor to HMRI (Health Management Research Institute), set up by former Chairman of Satyam computers Ramalinga Raju. It was a rarest of rare events organized in a simple way on the terrace in front of my rented penthouse to which I happened to be a privileged partner. The idea floated by three Idiots -my daughter Bunti, her cousins Shamanth and Bharat- was to celebrate the Global Recognition to HMRI and recognition of HMRI services in Telemedicine Sector by EDELGIVE FOUNDATION. Well, Dr Ranga Rao as the leading team member happened to be instrumental in conceiving, developing and implementing the center jointly established by Aitharaju Foundation and HMRI in his native village Vallabhi in Khammam District.

It was equally meant to appreciate and congratulate Ranga Rao for his envious work benefiting thousands of people and pave way for similar centers elsewhere. He has been guiding almost all members of well-knit family besides several others.

Dr AP Ranga Rao, developed ‘Health for All’ concept and ensured its effective implementation with the cooperation of state government as well as a Corporate giant in the form of 108 and 104 services in Andhra Pradesh. These services not only hailed by Union government, but also recognized as the ‘role model’ for other states to replicate.

No sooner I returned from USA, my daughter informed me about her uncle Dr Rao’s HMRI getting the award, I was delighted equally. She was quick to take up the responsibility of making a video clip on Dr Rao’s career with the help of her uncle Bhandaru Srinivasa Rao, who takes care of HMRI’s Public Private Partnership function and part of the team. Her two cousins were quick to chip in to support her in organizing a get together of not only our well-knit family members, but also of HMRI staff as well as well-wishers.

Equally supportive was Dr. Balaji Utla, the Chief Executive Officer of HMRI, under whose over all leadership HMRI was recognized for the Tele Medicine Award. Initiating the celebrity celebration mood of the evening Dr Balaji introduced Dr Ranga Rao to all those present on the occasion and know him well. But that was a different introduction. The multi-dimensional approach of Dr Ranga Rao, to conceive, initiate, develop, implement and sustain a variety of health related programs benefiting lakhs of people was elaborated in detail by Dr. Balaji. He also explained about the Tele Medicine Project and its uniqueness. Later his Colleague Dr Dayakar gave few more details including about Dr Ranga Rao. EMRI CEO Venkat Changavalli recollected his association with Dr Ranga Rao and how as the conceiver of 108 project initially guided him enabling EMRI to grow and move to 10 states.


But, Dr Rao is a hard nut to crack as he opposes to felicitations. How to convince him? How to capture some of his visuals and make him speak on the concepts he had developed? Really a tough job to do! But, another relative of mine, who happens to be a professional journalist, had not only quick remedy but knew the knack to make people talk. Perhaps, that was basic need of his profession. He too joined my daughter to help execute her plan. It was Bhandaru Srinivasa Rao who with the help an award winning Camera Man shot the film.

Dr Ranga Rao born in a remote village Vallabhi in Khammam District obtained his M.B.B.S. in 1965 from Gandhi Medical College Osmania University. After working as Medical Officer in Government Hospital, Burgampad in Khammam District Tribal Area he moved to United Kingdom for higher studies. While serving in the UK National Health Services, in Orthopedics, Anesthesia, Obstetrics, Pediatrics and Geriatrics, he obtained three diplomas- DA, DRCOG and DTM&H from London and Liverpool. On his return from UK he preferred a posting as Medical Officer in Bhadrachalam Tribal Area Hospital to work for more than six years before moving to Hyderabad. The thirty Years of his stay in Hyderabad converted the capital as the Hub of Medial and Health reforms for the entire Asia.

Well, if one has to recollect his contributions, it may not be possible. However we may mention few and the list would be certainly not exhaustive.

Dr Ranga Rao among others either planned and implemented or monitored or led the team or organized number of programs like: Family Welfare Program, Immunization Program, Pulse Polio program, Population Project, Child Health Project, Urban Health Project, Monsoon Shelters, Fund Rising for flood victims, for Red Cross, IPKF Operations, Technical Manuals development, Doctors Training, bringing Jaipur Foot to Hyderabad, Foot Care by Foot Wear program, disability prevention, and so on.

Dr Ranga Rao was active in voluntary field and held several important positions like General Secretary Doctors Association, Secretary National Institute of Social Action, Indian Delegate to "Disaster Management Workshop" South Asia and Pacific Region, Secretary National Information Services etc.,

He has been the Advisor to EMRI which established a call centre 108 for the state of AP, engaged in providing advice, free emergency transport, and pre hospital care and accessing patient to health facility in emergency in golden hour for stabilization and treatment. His role included providing concept, Architecture, design, algorithms, processes, monitoring tools and advocacy with Government. He is also Advisor to Satyam Foundation for Urban Health. He Developed models for “Integrated Urban health centers for providing comprehensive care for slum population”.

Friends, Relatives and Admirers of Dr. AP Ranga Rao on the evening of that memorable event heartily Welcomed him and said the welcome was not just for the recent achievement but for all those life-long, life-time, continuous achievements. They all wished him to continue to achieve every day, every minute. “We all love you and like you-but can we ever become LIKE YOU?” conclude the brothers, sisters, niece, nephews and all the friends.

Among those who attended were former Vigilance Commissioner and Senior retired IAS Officer RC Samal, former Chairman Press Academy Devulapalli Amar, former Director DD News RVV Krishan Rao, former legal Advisor to DGP M Ramakishan Rao, former IG Police R Seetaaram Rao, Cardiologist Dr Dayasagara Rao, former Superintendents of Gandhi Hospital Dr Nagabhushanam and Dr. Parimala, veteran Journalist Adiraju, HMRI and EMRI CEO s Dr Balaji and Venkat etc. Minister for Civil Supplies JK Rao presented a memento to the HMRI Team. Dr Ranga Rao who is normally against any type of felicitation was a different person that day and unlike in normal occasions responded to the celebration with a ten minute memorable speech.

Bunti and her team of “three idiots” supported by the elderly Bhandaru Srinivasa Rao have exhibited “how we can make a difference” in organizing events. Well Done!

Wednesday, March 24, 2010

బి. ఎన్. రెడ్డి జాతీయ అవార్డ్ గ్రహీత కె. బి. తిలక్ : వనం జ్వాలానరసింహారావు

బి. ఎన్. రెడ్డి జాతీయ అవార్డ్ గ్రహీత కె. బి. తిలక్
వనం జ్వాలానరసింహారావు
Please Click Here to Read in SUJANARANJANI
(అంగరంగ వైభోగంగా జరుపుకునే "నంది" బహుమతుల ప్రదానోత్సవంలో, ఉగాది పర్వదినాన, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రప్రధమంగా ఏర్పాటుచేసిన "బి. ఎన్. రెడ్డి జాతీయ అవార్డ్" ను, ప్రముఖ సినీ దర్శక నిర్మాత-మానవతావాది-సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా గళం విప్పే 84సంవత్సరాల "అనుపమ చలన చిత్ర వ్యవస్థాపకుడు" శ్రీ కె. బి. తిలక్ కు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రోశయ్య గారి చేతులమీదుగా అందచేసింది. ఆయన జ్ఞాపకాలను పుస్తకరూపంలో తెచ్చిన రచయితగా ఈ వ్యాసం)

తెల్లటి ఖద్దరు దుస్తులు మాత్రమే వేసుకునే ఆయన్ను చూసి కాంగ్రెస్ పార్టీ వాడను కుంటారు. స్వాతంత్ర్యోద్యమ రోజుల్లో ఆయన పాత్ర తెలిసినవారు మాత్రం ఆయన్ను కమ్యూనిస్ట్ అంటారు. అబ్బే...ఇవన్నీ కాదు..ఆయన ఒక సినిమా మనిషేనంటారు మరికొందరు. నిజానికి ఇవన్నీ ఆయనకు వర్తిస్తాయి. సీదా-సాదాగా తిరుగుతూ, అందరినీ పలకరిస్తూ, చిన్నల్లో - చిన్నగా, పెద్దల్లో-పెద్దగా అందరితో కలుపుగోలుగా తిరిగే ఆ మంచి మనిషే "కొర్లిపర బాలగంగాధర తిలక్" - కె. బి. తిలక్. ఆయనో మానవతావాది. ఎక్కడ సాంఘిక దురాచారాలున్నాయో... అక్కడ వాటికి వ్యతిరేకంగా, ఏ మాత్రం ప్రచారం లేకుండా, పోరాడేవారిలో ఆయన ముందుంటారు. సినీ కార్మికుల బాధా మయ గాధలకు ఆయన స్పందించి చేసిన అవిశ్రాంత కృషే అందుకు ఒక చక్కటి ఉదాహరణ. ఆరు దశాబ్దాలకు పైగా తెలుగు-హిందీ వెండి తెరతో సంబంధమున్న తిలక్ గారిని, కనీసం, ఎనభై నాలుగేళ్ల వయసు వచ్చిన తర్వాతైనా ప్రభుత్వం గుర్తించ గలగడం అదృష్టమే !

పశ్చిమ గోదావరి జిల్లాలోని దెందులూరులో 1926లో జన్మించిన తిలక్ పిన్న వయస్సులోనే చదువుకు స్వస్తిచెప్పి1939లోనే స్వాతంత్ర్య సంగ్రామంలో చురుగ్గా పాల్గొని, 1942నాటి క్విట్ ఇండియా ఉద్యమంలో రాజమడ్రి జైలుకెళ్లారు. స్వతంత్ర భారతావనిలో, సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా, కేవలం అలాంటి ఇతివృత్తాలే కథా వస్తువుగా అనేక చిత్రాలను నిర్మించారు-దర్శకత్వం వహించారు. ముద్దుబిడ్డ, ఎం.ఎల్.ఏ, ఉయ్యాల జంపాల, భూమికోసం, కొల్లేటి కాపురం, ఛోటిబహు, కంగన్ లాంటి చిత్రాల రూపకర్త ఆయన. సుమారు పాతిక సంవత్సరాల క్రితం, గవర్నర్ కుముద్ బెన్ జోషి ఆధ్యక్ష్యతనున్న "చేతన" స్వచ్చంద సంస్థకు నేను ప్రాజెక్ట్ ఆఫీసర్గాత పనిచేస్తున్న రోజుల్లో తొలిసారి తిలక్ గారితో పరిచయమయింది. సినిమాలంతగా చూసే అలవాటులేని నాకు ఆయన్ను గురించి అప్పుడు తెలవకపోయినా, అతి కొద్ది రోజుల్లోనే ఆయనలోని అరుదైన వ్యక్తిత్వం, పట్టుదల, ఏకాగ్రత అర్థం కాసాగాయి. ఇందిరాగాంధి హత్యా మరణం తర్వాత, ఆయన రూపొందించి, హైదరాబాద్ తో సహా పలు నగరాల్లో ప్రదర్శించబడిన "భారతరత్న ఇందిరమ్మ" రూప వాణి కార్యక్రమంలో ఆయన చేసిన "మేథా పరమైన కృషి” ని ప్రత్యక్షంగా గమనించిన నాకు ఆయనొక అసామాన్యుడనిపించింది. క్రమేపీ ఆయనతో సాన్నిహిత్య సంబంధం ఏర్పడడంతో, చాలామందికి సుపరిచితుడైన ఆయన్ను గురించి తెలిసిన వారికి-తెలియని వారికి, మరింత తెలియచేయాలన్న కోరిక కలిగింది. ఒకరోజు మార్నింగ్ వాక్లోి మా ఇంటికి వచ్చిన తిలక్ గారిని ఒప్పించి, ఆయన స్వయంగా వెల్లడించిన ఆయన జ్ఞాపకాలను వారం-వారం "ప్రజాతంత్ర" పాఠకులకు సుమారు పది నెలల పాటు అందించాను. 2006లో, తిలక్ గారి "అనుపమ" సంస్థ ఏభై ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంలో, విలక్షణమైన వ్యక్తిత్వం కలిగిన తిలక్ జ్ఞాపకాలను, "అనుపమ గీతాల తిలక్" పేరుతో హాసం ప్రచురణలు పుస్తక రూపంలో తీసుకొచ్చారు. తిలక్ గారికి అవార్డ్ వచ్చిన సందర్భంగా ఆయన్ను గురించి కొద్ది విషయాలను పాఠకులతో పంచుకోదలిచాను.

రాజమండ్రి జైలునుండి విడుదలైన తిలక్ "ఉషా మెహతా" స్వతంత్ర రేడియో ఉద్యమంలో పాల్గొని, అతివాద భావాల ప్రజానాట్యమండలి వైపు ఆకర్షితుడై నారు. తన జీవిత గమనానికి తానే బాధ్యుడని అప్పటికీ-ఇప్పటికీ నమ్మే తిలక్, తన పూర్వీకుల ఆస్తితో తనకు సంబంధం లేదని స్టాంప్ పేపర్ మీద సంతకం పెట్టిచ్చి, మేనమామ ఎల్.వీ. ప్రసాద్ గారి వద్దకు, మేనత్త వెంట బొంబాయికి చేరుకున్నారు. వెళ్లేటప్పుడు, కమ్యూనిస్ట్ యోధుడు చండ్ర రాజేశ్వరరావు నుంచి శ్రీపాద అమృత డాంగేకు తనను పరిచయం చేస్తూ రాసిన వుత్తరం పట్టుకెళ్లారు ముందు చూపుగా. సినీ పరిశ్రమలో అడుగిడేందుకు ప్రయత్నం చేస్తూనే, "పీపుల్ థియేటర్" ప్రముఖులైన బాలరాజ్ సహానీ, రొమేష్ థాపర్ లతో సాన్నిహిత్యం చేసుకున్నారు తిలక్. ఒపేరా హౌజ్ సినిమా టాకీసులో ప్రజానాట్యమండలి సమావేశాలకు హాజరయ్యేవారు. అలా తన స్వాతంత్ర్య సమరాభిలాషను కొనసాగించా రక్కడ. నేపధ్య గాయకుడు "డబ్ల్యు. ఎం. ఖాన్" తో, సింధీ కమెడియన్ "గోపి" తో పరిచయం చేసుకున్నాడు. ఆ పరిచయాలే ఆయన్ను సినీరంగంలోకి తెచ్చాయి. తన కాళ్లమీద తాను నిలబడేందుకు ఎల్వీ. ప్రసాద్ గారి "బాతు గుడ్ల" ను కూడా అమ్మారు. కమ్యూనిస్ట్ పార్టీ ప్రచురణ "పీపుల్స్ వార్" పత్రికకు పేపర్ బోయ్ గా పనిచేశారు. కె.ఎల్.ఎన్. ప్రసాద్ గారి సోదరుడి సినీ పంపిణీ సంస్థలో సేల్స్ బోయ్ గా కూడా పనిచేశారు. నర్సాపూర్ లేస్ ను అమ్ముకుంటూ కొంత సంపాదించుకునేవారు. ఇవన్నీ కలిపి ఆయన జీవించడానికి పనికొస్తే, వుండడానికి మేనమామ ఇల్లుండేది. ఒకరిపై ఆధారపడడం ఆయన సిద్ధాంతానికి వ్యతిరేకం.

ఎల్వీ. ప్రసాద్ గారు మద్రాసుకు వెళ్లడంతో తిలక్ కూడా అక్కడకు మకాం మార్చారు. ఎల్వీ సన్నిహితుడైన సినీ ఎడిటర్ ఎం. వీ. రాజన్ తో పరిచయం చేసుకున్నారు. ఎడిటింగ్ లైన్ లో ప్రావీణ్యం పొంద సాగారు. కమ్యూనిస్ట్ పార్టీపై నిషేధం విధించడంతో, దాని ప్రభావం ప్రజానాట్యమండలి కార్యకలాపాలపై పడి, దానికి చెందిన ప్రముఖులు ఒక్కొక్కరు మద్రాసు చేరుకున్నారప్పట్లో. వారిలో "భవిష్యత్ సినీరంగ దిగ్గజాలు" అందరూ వున్నారు. కె. ఎస్. ప్రకాశరావు, తిలక్ గార్ల ద్వారా ఎల్వీ. ప్రసాద్ గారు వారందరికీ మద్రాసులో ఆధారం కలిపించారు. అప్పట్లో కొంతకాలం ఎల్వీ గారు కూడా ప్రజానాట్యమండలి అధ్యక్షుడిగా వున్నారు. ఎడిటింగ్ లైన్లో ప్రవేశించిన తిలక్, రాజన్ కాంబినేషన్ తో , "శ్రీమతి", "అంతామనవాళ్ళే", "రోజులు మారాయి", "మంత్రదండం" , "సువర్ణమాల", "రాధిక", "ధర్మాంగద", "జ్యోతి" లాంటి సినిమాలకు ఎడిటర్ గా పనిచేశారు. "శ్రీమతి" చిత్రానికి నూతన ఆర్టిస్టులను ఎంపికచేసే ప్రక్రియలో భాగంగా, రాజన్-తిలక్ లతో డైరెక్టర్ ఎల్వీ. ప్రసాద్ మూవీ టెస్ట్, స్టిల్ల్ టెస్ట్, మేకప్ టెస్ట్ చేయించిన వారిలో, దశాబ్దాలపాటు సినీరంగాన్ని, దశాబ్దంపైగా రాజకీయ రంగాన్ని శాసించిన స్వర్గీయ నందమూరి తారకరామారావు ఒకరు.

తిలక్ గారి సినీ జీవితంలో మైలురాయి నవయుగ బ్యానర్ కింద నిర్మించిన "జ్యోతి" చిత్రం. ప్రజానాట్యమండలికి చెందిన పలువురు కళాకారులతో సహా ఈ చిత్రంలో జి. వరలక్ష్మి కూడా నటించారు. సినీ దర్శకుడుగా వున్న శ్రీధర్ కు, నిర్మాతకు అభిప్రాయ భేదాలొచ్చాయి. దర్శకత్వం భాధ్యత తిలక్ మీద పడింది. ఎడిటర్ గా తనకున్న అనుభవాన్ని మేళవించి, దర్శకత్వానికి వన్నె తెచ్చారాయన ఆ చిత్రంలో. నిరక్షరాస్యతను సామాజిక సమస్యగా వర్ణిస్తూ కొండేపూడి పాటకు అభినయించిన నాటి బాలనటి జోగమాంబగారు, నేటి మేటి నటి, ఎమ్మెల్యే జయసుధగారి తల్లి-నిడదవోలు వెంకటరావు గారి కూతురు. పెండ్యాల ఆ సినిమాకు సంగీత దర్శకుడు. ఆ సినిమాతో తిలక్ దర్శకుడిగా స్థిరపడిపోయారు. శకుంతల గారిని "ఆదర్శ వివాహం" చేసుకుని మద్రాసులో కాపురం పెట్టారు. ఇటీవలే ఆమె మరణించారు. బహుశా తిలక్ గారిని సరిగ్గా అర్థం చేసుకున్నది ఆయన శ్రీమతి ఒక్కరేనేమో ! తిలక్ గారికి పిల్లలు లేరు. లోకేశ్ ను పెంచుకున్నారు. కాలిఫోర్నియాలో సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు లోకేశ్.

అనుపమ ఫిలిమ్స్ స్థాపించి, శరత్ నవల ఆధారంగా ఆరుద్ర రూపొందించిన స్క్రిప్ట్ తో, స్వీయ దర్శకత్వంలో, తన తొలి ప్రయత్నంగా 55సంవత్సరాల క్రితం, " ముద్దుబిడ్డ" సినిమా తీశారు తిలక్. సినిమా తీసే ప్రయత్నం చేస్తున్నప్పుడు నవలా రచయిత గోపీచంద్, ఆకాశవాణిలో పనిచేస్తున్న కొంగర జగ్గయ్యను తిలక్ కు పరిచయం చేశారు. జగ్గయ్యతో పాటు ఆ సినిమాలో ప్రధాన భూమికకు "గర్వం"-"స్వాభిమానం" సమపాళ్లలో నటించగల జమునను ఎంపికచేశారు తిలక్. ఆ పాత్ర కావాలని ఆశపడ్డ జి. వరలక్ష్మిని (రిలీజ్ చేయని మొదటి ఎనిమిది రీళ్లలో నటించిన) జమున వదిన పాత్రకు ఎంపికచేశారు. జమున కళాకారిణిగా స్థిరపడి పోయేందుకు ముద్దుబిడ్డ సినిమా కారణమనాలి. తాపీ ధర్మారావు, ఆరుద్ర గార్ల "కలెక్టివ్ స్పిరిట్" తో సినిమా డైలాగులు రూపుదిద్దుకున్నాయని చెప్పారు తిలక్. ఆరుద్ర పాటలకు పెండ్యాల దర్శకత్వం వహించారు. ముద్దుబిడ్డలో తిలక్ పరిచయం చేసిన నూతన డాన్సర్ జ్యోతి ఇప్పటి పాపుల హీరో సాయికుమార్ కు, అయ్యప్ప శర్మకు తల్లి గారు. "బాంబే మీనాక్షి" ని కూడా డాన్సర్ గా పరిచయం చేశారు. ఈ సినిమాతో ప్రారంభమైన తిలక్, ఆరుద్ర, పెండ్యాల కాంబినేషన్ "అనుపమ" కు హాల్ మార్క్ అయింది.

ఆరుద్ర, తాపీ ధర్మారావు, తిలక్ లు భూసంస్కరణలు-దున్నేవాడికే భూమి లాంటి నినాదాలకు ఆకర్షితులై-ప్రభావితులైన వారిలో వున్నారు. ముద్దుబిడ్డ తర్వాత తిలక్ దర్శకత్వంలో రూపు దిద్దుకున్న సమస్యాత్మక చిత్రం "ఎమ్మెల్యే". అనేక నూతన ప్రయోగాలకు ఉదాహరణగా చెప్పుకోవాల్సిన సినిమా ఇది. "బ్యాక్ సీట్ డ్రైవింగ్, బంతి వడ్డన రాజకీయాలు" ఎమ్మెల్యే సినిమా కథాంశం. జమీందారులు, భూస్వాములు, ధనికులు స్వయంగా చట్టసభలకు పోటీ చేయకుండా, ప్రజల నాడికి అనుగుణంగా వుండేవారిని తమ పలుకుబడితో గెలిపించి, తమ పనులను వారిద్వారా చక్కబెట్టుకునే దోపిడీ విధానాన్ని ఎద్దేవా చేసే సినిమా ఇది. సినిమా చిత్రీకరణ చాలావరకు ఔట్ డోర్‌లోనే జరిగింది. తిలక్ ఈ సినిమాలో రమణమూర్తిని నటుడిగా పరిచయం చేశారు. నేపధ్య గాయనిగా "జానకి" ని కూడా పరిచయం చేసిన ఘనత తిలక్ గారిదే. ఘంటసాల-జానకి జంటగా పాడిన "నీ యాశ అడియాస... చేజారే మణిపూస... లంబాడోళ్ల రాందాసా" విననివారు లేరు. ఆంధ్ర ప్రదేశ్ లో భూసంస్కరణల చట్టం తేవాలన్న ఆలోచన ప్రభుత్వానికి రావడానికి స్ఫూర్తి ఎమ్మెల్యే సినిమానే అనాలి. సెప్టెంబర్ 19, 1957న ఎమ్మెల్యే సినిమా రిలీజ్ అయిన తర్వాత 1958లో లాండ్ సీలింగ్ చట్టం నామమాత్రంగా రూపొందించినప్పటికీ, వాస్తవానికి 1961లో మాత్రమే చట్టంగా వచ్చింది. హైదరాబాద్ మెహందీలో నివసిస్తున్న "చోటీ ఖుర్షీద్" అనే అందమైన అమ్మాయితో సినిమాలో కవ్వాలీ నాట్యం చేయించారు. మనమంతా ఇప్పడు రుచిగా తింటున్న "ఎమ్మెల్యే పెసరట్టు" తిలక్ సృష్టే !

ఎమ్మెల్యే తర్వాత కుటుంబ పరమైన మరో సమస్యాత్మక చిత్రం "అత్తా ఒకింటి కోడలే" తీశారు. ఆ చిత్రానికి, ఆరుద్ర "ద్విపద" రచనకు బాపు వేసిన "బొమ్మల కథ" తో వెలువడిన ప్రచార కార్టూన్లు మరో నూతన ఒరవడి. ఎప్పుడు-ఏ సినిమాకు-ఎవరూ చేయని తరహాలో "అత్తా ఒకింటి కోడలే" చిత్రానికి పబ్లిసిటీ చేయాలని భావించారు తిలక్. ఆంధ్ర పత్రికలో పనిచేస్తున్న రమణ గారు, ఆరుద్ర రాసిన ద్విపదకు బొమ్మలు వేసేందుకు, అప్పట్లో "వాటర్ థాంప్సన్" కంపెనీలో పనిచేస్తున్న మితృడు బాపు గారిని ఒప్పించారు. అందరు కలిసి సినిమా వీక్షించారు. చూస్తూనే బాపు ఓ కాగితం మీద బొమ్మలు గీసి చూపించారు. అందరికీ నచ్చాయి. వెంటనే "అనుపమ చిత్రం అత్తా ఒకింటి కోడలే బొమ్మల కథ" రూపుదిద్దుకుంది. వారం వారం ఆరుద్ర సామెతలు రాయడం, బాపు ఇల్లస్ట్రేషన్ వేయడం, ఆంధ్ర పత్రికలో ప్రింట్ కావడం జరిగేది. ఆర్టిస్ట్-రచయితలుగా ఖ్యాతి తెచ్చుకున్న బాపు-రమణలు సినీ పరిశ్రమకు పరిచయమయింది "అత్తా ఒకింటి కోడలే బొమ్మల కథ" ద్వారానే అంటారు తిలక్. స్టూవర్ట్ పురం సెటిల్మెంట్ థీమ్ తో చిట్టి తమ్ముడు సినిమా తీశారు. అందులో ఒకనాటి మేటి నటి "విజయ లలిత" బాల నటిగా సినీరంగానికి పరిచయం చేశారు. జయలలిత తల్లిగారు సంధ్య చిట్టి తమ్ముడి సినిమాలో రమణారెడ్డి భార్యగా నటించింది. ఆ సినిమాలో సుశీల పాడిన "ఏస్కో నా రాజ ఏస్కో... అకేస్కో, వక్కేస్కో.. అ పైన చూస్కో" బహుళ ప్రచారం పొందింది. సామాజిక స్పృహకు ఉదాహరణగా తీసిన మరో చిత్రం "ఈడూ జోడూ". తెలుగు చలనచిత్ర రంగానికి తను తీసిన ప్రతి సినిమాలో ఒకరకమైన కొత్తదనాన్ని అందించిన తిలక్ అన్ని సినిమాలలాగానే, ఈడూజోడూ కూడా ఆర్థికంగా విజయం సాధించ లేకపోయినా అందరి మన్ననలు-ప్రశంసలు పొందింది.

మృదుమధురమైన పాటల ఆసరాతో, ఆబాలగోపాలం మన్ననలందుకున్న అపురూప చిత్రం తిలక్ గారి "ఉయ్యాల జంపాల". "ఓ పోయే పోయే చినదానా...", "ఉంగరాల జుట్టు వాడు...", కొండగాలి తిరిగిందీ-గుండె వూసులాడిందీ...", "అందాల రాముడు ఇందివర శ్యాముడు.." అప్పటికీ-ఇప్పటికీ-ఎప్పటికీ మరిచిపోలేని "అనుపమ మధుర గీతాలు". అప్పటికే సినీరంగాన్ని వదిలి రాజకీయాల్లో చురుగ్గా వున్న కోన ప్రభాకర రావుతో తిలక్ ఇందులో మళ్లీ వేషం వేయించారు. అట్లతద్దినాడు "ఇస్తినమ్మా వాయినం-పుచ్చుకుంటినమ్మా వాయినం" అనే డైలాగులతో వాయినాలిచ్చే సన్నివేశం వుందిందులో. పెద్దాపురం మేజువాణి తరహా ప్రక్రియైన మరాఠీ "తమాషాల" పై తిలక్ గారికి కలిగిన ఆసక్తి పర్యవసానమే "పంతాలు పట్టింపులు" సినిమా. మరాఠీ మేటి నటిగా పేరు తెచ్చుకున్న లీలా గాంధీ ఇందులో నటించింది. సినిమాలో పాటలన్నీ ప్రశ్న-జవాబులో, అర్థవంతంగా-భావగర్భితంగా-తమాషాగా-పొడుపుకథల్లా వుంటాయి. శ్రీ శ్రీ - కొసరాజు పాటలకు సంగీత దర్శకత్వం వహించిన పెండ్యాల కు ఇది మ్యూజికల్ హిట్ పిక్చర్. ఆయనకు అఖిలభారత స్థాయిలో అవార్డ్ తెచ్చిపెట్టిన సినిమా ఇది. తిలక్ "ముద్దుబిడ్డ" హిందీ వర్షన్ "ఛోటీబహు" రాజేషఖన్నా-షర్మిలాటాగూర్ కాంబినేషన్ లో తీసారు. తెలుగులో లాగానే కొన్ని కారణాలవల్ల హిందీలోనూ రీ షూటింగ్ తప్పలేదు తిలక్ గారికి. "ఛోటీబహు" లో ముద్దుబిడ్డ పాత్రను పోషించిన ’బేబీ సారిక’ కమల్‌హాసన్ ను వివాహం చేసుకుంది. "ఛోటీబహు" తిలక్ కు హిందీలో ఒక బ్రేక్. తర్వాత ఈడూజోడూ హిందీ వర్షన్ "కంగన్" ను మాలా సిన్హా, సంజీవకుమార్, అశోక కుమార్, మహమూద్ లతో తీసారు. రెండు హిందీ సినిమాలు విజయవంతంగా తీసిన తిలక్ కు హిందీ సినిమాలకు దర్శకత్వం వహించమని ఎన్నో ఆఫర్స్ వచ్చినా, ఒప్పుకోకుండా బాంబేకు గుడ్ బై చెప్పి హైదరాబాద్ చేరుకున్నారు.

తిలక్ గారి తమ్ముడు రామ నరసింహారావుకు సామాజికన్యాయం సాధించాలన్న పట్టుదల వుండేది. ఆ క్రమంలోనే నక్సలైట్ ఉద్యమానికి ఆది పురుషుడైన చారు మజుందార్ తో పరిచయం చేసుకున్నాడు. హఠాత్తుగా జనజీవన స్రవంతినుంచి అజ్ఞాతంలోకి వెళ్ళిన ఆయన ఎన్‌కౌంటర్లో చనిపోయిన సంగతి తెలుసుకున్నారు తిలక్. తమ్ముడు చనిపోయిన తర్వాత వామపక్షాలన్నీ ఐకమత్యం కావాలన్న థీమ్ తో తీశారు "భూమికోసం" సినిమాను 1974లో తీశారు తిలక్. తమ్ముడికే అంకితం చేశారు దాన్ని. "భూమికోసం, భుక్తికోసం సాగే రైతుల పోరాటం, అనంత జీవిత సంగ్రామం" అని నమ్మిన తిలక్, ఆ సుదీర్ఘ పోరాటానికి "ఆరంభమే కాని అంతం వుండదు" అని తెలియచేసే విధంగా తీసిన విప్లవాత్మక-సామాజిక దృక్ఫద చిత్రమే "భూమికోసం". ఇందులో ఆయన వామపక్ష ధోరణి ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. సినిమా టైటిల్స్ చూపిస్తూ, కన్నెగంటి హనుమంతు, గన్నమ్మ, మునగాల రైతుల చిత్రాలను ప్రేక్షకులకు పరిచయం చేస్తూ గొప్ప వ్యాఖ్యానం పెట్టారు. శ్రీ శ్రీ రచించిన అపురూప విప్లవ గేయం నేపధ్యంలో కనిపిస్తాయి టైటిల్స్ ఆసాంతం. మేటి నటీమణి, ప్రస్తుతం పార్లమెంట్ సభ్యురాలు జయప్రదను "కాబోయే కథానాయిక - కుమారి జయప్రద" గా భూమికోసం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు తిలక్. "చెల్లి చంద్రమ్మ" పాత్ర పోషించారు జయప్రద. సినిమాలో ఆమె పాడిన పాటను ప్రముఖ నక్సలైట్ నాయకుడు సత్యమూర్తి రచించారు. తెలుగులో మొట్ట మొదటిసారి ప్రఖ్యాత హిందీ నటుడు అశోక్ కుమార్ భూమికోసం లో పాత్రను పోషించారు. సినిమాలో శ్రీ శ్రీ రాసిన "తూర్పు దిక్కున వీచే గాలి" అనే పాటను గురించి సినిమా చూసిన రష్యన్ బృందం ప్రస్తావిస్తూ, అది చైనాను దృష్టిలో పెట్టుకుని రాశారా అని అడిగారు తిలక్ ను. చిత్రం ఆరంభంలోనే "దున్నేవాడిదే భూమి హక్కు" అన్న నినాదాలు వినిపిస్తాయి.

కొల్లేటి ప్రాంతంలోని పరిస్థితులను గమనించిన తిలక్, పలువురి అభిమానాన్ని చూరగొన్న "కొల్లేటి కాపురం" సినిమా తీశారు. బాహ్య ప్రపంచంలోని "జమీందారీ" వ్యవస్థ లాంటి కొల్లేటి ప్రాంత "ఇంజన్ దార్" వ్యవస్థ దోపిడీ విధానాన్ని కళ్లకు కట్టినట్లు చిత్రీకరించారు. సినిమా తీసే ప్రయత్నంలో "కొల్లేటి పడవల" లో తిరిగి స్క్రిప్ట్ తయారు చేశారు తిలక్. ఈ సినిమాలో ’సుగుంబాబు’ ను గేయరచయితగా పరిచయం చేశారు. ఆయన్ను తిలక్ కు పరిచయం చేసింది శ్రీ శ్రీ. కొత్తదనానికి కొల్లేటి కాపురం సినిమా ఒక మచ్చుతునక. ప్రముఖ గజల్ సింగర్ పూర్ణచంద్ర రావు గారిని నేపధ్య గాయకుడిగా పరిచయం చేశారిందులో. సినిమాలోని ప్రతి పాట, మాట ఆ ప్రాంతానికి-సంస్కృతికి-జీవన విధానానికి సంబంధించినవే. అనుపమ చలనచిత్ర బ్యానర్ కింద కాకుండా నిర్మించిన "ధర్మ వడ్డీ" సినిమాకు కూడా తిలక్ దర్శకత్వం వహించారు.

Monday, March 1, 2010

అమెరికాలో నేనుండగా... ....: "జ్ఞాపకాల అనుభవాలు-అనుభవాల జ్ఞాపకాలు": వనం జ్వాలా నరసింహారావు

అమెరికాలో నేనుండగా... ....
"జ్ఞాపకాల అనుభవాలు-అనుభవాల జ్ఞాపకాలు"
వనం జ్వాలా నరసింహారావు
(Please Click For Full Book)
అమెరికాలో శాంతా క్లారా వాలీ, మోంటిరే బే అక్వేరియం
మాలిబు బీచ్, డిస్నీ లాండ్, ఫెర్నాండో లోయ
హాలీవుడ్ స్టూడియోలు, బే వంతెన, గోల్డెన్‌గేట్ బ్రిడ్జ్
షుగర్ లాండ్, అష్టలక్ష్మి దేవాలయం, నాసా


శాన్ ఫ్రాన్సిస్కో నగరంలో అంతర్జాతీయ ప్రాముఖ్యత సంతరించుకున్న గూగుల్ సంస్థలో పనిచేస్తున్న మా అబ్బాయి ఆదిత్య - కోడలు పారుల్ రమ్మంటే సెప్టెంబర్, 2009 మూడో వారంలో అమెరికా దేశానికొచ్చాం-మూడోసారి. ఇక్కడుండగా రాయదల్చుకున్నవి, అన్నీ ఒక చోట చేర్చడం మొదలు పెట్టాను. ఆ క్రమంలోనే "జ్ఞాపకాల అనుభవాలు-అనుభవాల జ్ఞాపకాలు" పేరుతో వర్తమాన విషయాల మీద రాయడం కూడా ప్రారంభించాను. ఐదున్నర నెలల నా అమెరికా అనుభవాలతో పాటు, వాటితో ప్రత్యక్షంగానో-పరోక్షంగానో సంబంధమున్న మరికొన్ని కూడా రాసుకుంటూ పోయాను.

"శాంతా క్లారా వాలీ"

అమెరికా-ఉత్తర కాలిఫోర్నియాలోని "శాన్ ఫ్రాన్ సిస్కో" సాగర తీరానికి దక్షిణ భాగాన వున్న అందమైన లోయ ప్రదేశమే మా అబ్బాయి ఆదిత్య వుంటున్న "శాంతా క్లారా వాలీ". శాంతా క్లారా కౌంటీ లోని ఎక్కువ భాగంతో సహా శానోజె నగరం కూడా ఈ లోయలోనే వున్నాయి. "హృదయాలను పులకరించే మధురమైన లోయ" గా ఒకప్పుడు కవులచే అభివర్ణించబడిన ఈ లోయ ప్రాంతమంతా, ఇప్పటికీ మైళ్ల పర్యంతం, అందమైన వృక్షాలు-పూల పొదలు-పళ్ల చెట్లు-కూరగాయల తోటలు, వ్యాపించి వుంటాయి. 1960 సంవత్సరం వరకు, ప్రపంచంలోనే అతి పెద్ద పళ్ల ఉత్పత్తి ప్రాంతంగా ప్రసిద్ధికెక్కిందీ లోయ. చుట్టుపక్కలంతా సారవంతమైన భూమి వుండడంతో, వ్యవసాయ ప్రాధాన్యమైన ప్రాంతంగా ఒకప్పుడుండే శాంతా క్లారాలోని చాలా భాగం, క్రమేణ నగరంగా మారిపోయినప్పటికీ, ఇంకా గ్రామీణ ఛాయలు పరిసరాల్లో-ముఖ్యంగా లాస్ ఏంజల్స్ దిక్కుగా పోతుంటే ప్రస్ఫుటంగా దర్శనమిస్తాయి. వాస్తవానికి, "శాంతా క్లారా వాలీ", ఈనాడు ప్రపంచ ప్రసిద్ధిగాంచిన "సిలికాన్ వాలీ", ఒకదానిలో ఇంకోటి అంతర్భాగమే.

శాంతా క్లారా వాలీ ఉత్తర కొనే, శాన్ ఫ్రాన్ సిస్కో సాగర తీరానికి దక్షిణాన చివరి ముక్క. లోయకు నైరుతీ భాగాన అందమైన "శాంతా క్రజ్ పర్వత సముదాయం", ఈశాన్య భాగాన "డైబ్లో కనుమలు" వ్యాపించి వుంటాయి. శాంతా క్లారా నగర ప్రాంతంలోని లిక్ మిల్ రోడ్ లోని కారిలైల్ భవన సముదాయం (అపార్ట్ మెంట్స్) లో మా అబ్బాయి ఆదిత్య వుండే ఫ్లాట్ వుంది. శాంతా క్లారా చేరుకోవడానికి, హైదరాబాద్ శంషాబాద్ నుంచి బయలుదేరిన మే మెక్కిన లుఫ్తాన్సా ఎయిర్ లైన్స్ విమానం, శాన్ ఫ్రాన్ సిస్కో విమానాశ్రయంలో లాండ్ అవుతుంటే అదో అద్భుత దృశ్యంలాగా వుంటుంది. సరాసరి సముద్రం మీదనుంచి, అందులో పడబోతోందా అన్న భయం కలిగే విధంగా, పక్కనే నిర్మించిన అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగుతుంది. ఈ ఒక్కటే కాదు: చుట్టుపక్కలున్న, ఓక్ లాండ్, శాంతా క్లారా, సానోజ్ విమానాశ్రయాలు కూడా అలానే వుంటాయిక్కడ. చుట్టూ సముద్రం-మధ్యలో ఒక ద్వీప కల్పం లాగా విమానాశ్రయం.

"మోంటిరే బే అక్వేరియం"

శాన్ ఫ్రాన్ సిస్కో వచ్చిన మూడో రోజున పసిఫిక్ మహాసముద్రం ఒడ్డు నున్న సహజ సిద్ధమైన బ్రహ్మాండమైన "మోంటిరే బే అక్వేరియం" కు వెళ్లాం. కాలిఫోర్నియా రాష్ట్రంలో 1984లో నెలకొల్పబడిన ఈ అక్వేరియంకు ప్రతి సంవత్సరం సుమారు రెండు కోట్ల మంది దర్శకులు వచ్చిపోతుంటారు. ఇక్కడ 623 జాతులకు చెందిన 35,000 కు పైగా మొక్కలు, జలచరాలున్నాయి. మోంటిరే బే నుండి, గొట్టాల ద్వారా సముద్ర జలాలను అక్వేరియంలోకి నిరంతరం ప్రవహింప చేసే విధంగా శాస్త్రీయ పద్ధతిలో ఏర్పాట్లు చేశారు నిర్వాహకులు. 33 అడుగుల ఎత్తున వుండి, 13 లక్షల లీటర్ల నీటిని నిల్వ చేయగల సామర్థ్యమున్న నిలువెత్తు వాటర్ టాంక్-దాని గుండా యావత్ సాగర జలచరాలను వీక్షించే ఏర్పాటు, మోంటిరే బే అక్వేరియంలోని ప్రధాన ఆకర్షణ. ప్రపంచం మొత్తంలోనే ఎక్కడా దొరకని అరుదైన కాలిఫోర్నియా "జైంట్ కెల్ప్" (ఎరువులాగా ఉపయోగపడే ఒక రకమైన గడ్డి మొక్క) ను, ఈ వాటర్ టాంక్ లో, జలచరాల నిత్యావసరాలను తీర్చేందుకు పెంచుతుంటారు. ఇలా పెంచడం కూడా ప్రపంచంలో మరెక్కడా జరగదు.

"మోంటిరే బే అక్వేరియం" డిజైన్ లోనే ఒక ప్రత్యేకతుంది. నిమిషానికి 2000 గాలన్ల సముద్ర జలాలను, రాత్రింబగళ్లు, వందకు పైబడి టాంకుల ద్వారా అక్వేరియంలోకి ప్రవహించే ఏర్పాటు చూడ ముచ్చటగా వుంటుంది. సందర్శకులు రకరకాల చేపలను నీటిపైనా-కిందా, స్పష్టంగా వీక్షించే వీలుగా వడబోసిన పరిశుద్ధమైన జలాలను పగటి సమయంలో ప్రవహింపచేస్తారు. రాత్రివేళల్లో యధా విధి సముద్ర జలాలు, సహజసిద్ధమైన సాగర ఆహారాన్ని దాని వెంట వచ్చే విధంగా, అక్వేరియం టాంకుల్లో ప్రవహిస్తుంటాయి. చెత్త నీరంతా తిరిగి సముద్రంలోకి విడువబడే విధంగా ఏర్పాట్లున్నాయి.

శాంతా క్లారా నుండి లాస్ ఏంజల్స్ కు

శాంతా క్లారా నుండి సుమారు 350 మైళ్ల దూరంలో వున్న లాస్ ఏంజల్స్ కు కారులో వెళ్లాం. సుమారు ఐదున్నర గంటల ప్రయాణం. శాంతా క్లారా-లాస్ ఏంజల్స్ మధ్య కారు ప్రయాణం చేస్తుంటే విస్తారమైన పంట భూములు, ట్రాక్టర్ల సహాయంతో వ్యవసాయం చేస్తున్న అమెరికన్లు, లారీలలో నింపుకొని తీసుకెళ్తున్న టొమాటోలు-బంగాళ దుంపలు, దారి పొడుగూ కనిపించే రోడ్ పక్కనున్న పంటపొలాల్లో ఏర్పాటు చేసిన కూరగాయల-పళ్ల అమ్మకం దుకాణాలు, సాగునీరు-తాగు నీరు సరఫరాకు సంబంధించిన చెరువులు-నదులు, వాటిపై నిర్మించిన ఆనకట్టలు-రిజర్వాయర్లు, అనేకం దర్శనమిస్తాయి. మన దేశంలో ప్రయాణం చేస్తున్నట్లే అనిపిస్తుంది మధ్య-మధ్యలో. ఆ సుందర దృశ్యాలను ఆస్వాదించుకుంటూ ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో బయలుదేరిన వాళ్లం, సాయంత్రం అయిదింటికల్లా మేముండాల్సిన బంధువుల ఫ్లాట్ కు చేరుకున్నాం. అమెరికాలో ఎవరినీ అడ్రెస్ అడగక్కరలేదు. జీ.పి.ఎస్ సహాయంతో సరాసరి ఇంటి ముందు వాలొచ్చు. వెళ్తూనే కాళ్లు-చేతులు కడుక్కొని, చీకటి పడగానే, అందరం సమీపంలోని "మాలిబు బీచ్" చూడ్డానికి వెళ్లాం.

"మాలిబు"

కాలిఫోర్నియా-పశ్చిమ లాస్ ఏంజల్స్ కౌంటీలో, సుమారు 20 మైళ్ల నిడివున్నపసిఫిక్ సముద్ర తీర ప్రాంతమే "మాలిబు" అని పిలువబడే చిన్న పట్టణం. పూనా-ముంబై మధ్యలో హిందీ సినిమా యాక్టర్లు కట్టుకున్నట్లే, హాలీవుడ్ కు చెందిన ఎందరో సినీ తారలు మాలిబు పరిసరాల్లో ఆకాశ హర్మ్యాలను నిర్మించుకున్నారు. దక్షిణ ప్రాంత కాలిఫోర్నియాకు చెందిన ధనవంతులైన పారిశ్రామిక వేత్తల ఇళ్లు కూడా మాలిబు బీచ్ ప్రాంతంలోనే వుంటాయి. మర్నాడు ఉదయమే డిస్నీ లాండ్ ప్రోగ్రాం వుంది కనుక ఆలశ్యం చేయకుండా, మాలిబు బీచినుంచి బయటపడి త్వరగా ఇల్లు చేరుకున్నాం.

“డిస్నీ లాండ్”

లాస్ ఏంజల్స్ లో మేమున్న ఫ్లాట్ నుంచి కాలిఫోర్నియా డిస్నీ లాండ్ పార్క్ వున్న "అనా హిమ్" ప్రదేశం సుమారు 40 మైళ్ల దూరంలో వుంటుంది. గంట సేపు ప్రయాణం. అనా హిమ్, కాలిఫోర్నియా (అమెరికా) లోని "థీమ్ పార్క్” తో సహా, డిస్నీ లాండ్ పేరు మీద పారిస్, టోక్యో, హాంగ్ కాంగ్ లో కూడా థీమ్ పార్కులున్నాయి. రిసార్ట్స్ పేరు మీద, కాలిఫోర్నియా, పారిస్, హాంగ్ కాంగ్, అమెరికా-ఫ్లారిడాలోని ఆర్ లాండ్, జపాన్-టోక్యోకు సమీపంలోని ఉరయసులో వున్నాయి. 2014 లో షాంగాయిలో ఇలాంటిదే ఒకటి ప్రారంభించేందుకు సన్నాహాలు సాగుతున్నాయి చురుగ్గా. అద్భుతమైన థీమ్ పార్కుల్లో, అత్యంత పరమాద్భుతమైంది కాలిఫోర్నియాలోని అనా హిమ్ డిస్నీ లాండ్ థీమ్ పార్క్. అమెరికా వెళ్లిన వారెవరైనా, ఏ మాత్రం వీలున్నా, ఇక్కడకు కాని-ఆర్ లాండ్ కు కాని పోకుండా వుండరు.

వాల్ట్ డిస్నీ ప్రత్యక్ష పర్యవేక్షణ కింద రూపు దిద్దుకొని-నిర్మించబడిన ఈ ఏకైక డిస్నీ లాండ్ జులై 17, 1955న పాత్రికేయుల ప్రివ్యూగా మొదలై, మర్నాటినుంచి పర్యాటకుల సందర్శన కొరకు ఆరంభమయింది. దేశాధ్యక్షులు, అధినేతలు, ప్రధాన మంత్రులు, ముఖ్యాతి ముఖ్యులతో సహా సుమారు పదికోట్లకు పైగా సందర్శకులు థీమ్ పార్కుకొచ్చారిప్పటివరకు. సెప్టెంబర్ 1959 లో సోవియట్ రష్యా ప్రధాని నికితా కృశ్చేవ్ అమెరికాకు వచ్చినప్పుడు, డిస్నీ లాండ్ కు వెళ్లాలని చేసిన అభ్యర్థనకు అమెరికా అధికారులు భద్రతా కారణాల దృష్ట్యా సానుకూలంగా స్పందించలేదు.

"మెయిన్ స్ట్రీట్-యు. ఎస్. ఏ", "అడ్వంచర్స్ లాండ్", "ఫ్రాంటియర్ లాండ్", "ఫాంటసీ లాండ్", "టుమారో లాండ్" లకు తోడుగా దరిమిలా ఏర్పాటుచేసిన "హాలిడే లాండ్", "న్యూ ఆర్లియన్స్ స్క్వేర్", " క్రిట్టర్ కౌంటీ", "మిక్కీస్ టూన్ టౌన్" లు ఇక్కడి థీమ్ పార్క్ లోని ఆకర్షణలు. మెయిన్ స్ట్రీట్ లో రైలు స్టేషన్, టౌన్ స్క్వేర్, సినిమా హాలు, సిటీ హాలు, ఎంపోరియం, దుకాణాలు, డబుల్ డెక్కర్ బస్ లాంటివి కనిపిస్తాయి. "అడ్వంచర్స్ లాండ్" లో "జంగిల్ క్రూజ్", "ఇండియానా జోన్స్ అడ్వంచర్", "టార్జాన్స్ ట్రీ హౌజ్" లున్నాయి. "జంగిల్ క్రూజ్" లో ఒక పడవలో ఎక్కించి సహజ సిద్ధంగా ఉన్న నదుల్లోంచి తీసుకెళ్తుంటే, నీళ్లల్లో-నీళ్ల పక్కన ఒడ్డుపైన, పాము, వినాయకుడి బొమ్మ, ఏనుగు, కోతి, ఎలుగుబంటులు, జిరాఫీ, సింహాలు, పులులు, రైనో, మొసలి, గిరిజన నృత్యం, మునులు --- ఇలా ఎన్నో కనిపిస్తాయి. ఒక చోట పక్కనున్న గోడమీద ఉర్దూలో కూడా ఏదో రాసి వుంటుంది.

"ఇండియానా జోన్స్ అడ్వంచర్" భయంకరంగా అనిపించినా ఆహ్లాదకరంగా వుంటుంది. ఇండియానా జోన్స్ సినిమా ఆధారంగా రూపొందించారు దీన్ని. ఒక ఓపెన్ జీప్ లో కూర్చొబెట్టి, చీకటి గుహలగుండా, అత్యంత వేగంగా, బహుశా కంప్యూటర్ సహాయంతో తీసుకెళ్తారు. ఆసాంతం వ్యాఖ్యానం కొనసాగుతూనే వుంటుంది. జీపు అంతులేనన్ని కుదుపులుతో కదులుతుంటుంది. ఒక్కో చోట సరాసరి గుహను ఢీ కొట్టుకుంటున్నదా అనిపిస్తుంటుంది. అన్నింటికన్నా ప్రధాన ఆకర్షణ "జలాంతర్గామి" లో ప్రయాణం. సగ భాగం నీటిలో-సగ భాగం నీటిపైనా ప్రయాణించే పడవలో సుమారు పావుగంట సాగిన ప్రయాణంలో సముద్ర గర్భంలో జరిగే అద్భుతాలెన్నో తిలకించే ఏర్పాట్లు చేసారు. మరో ప్రదేశంలో వున్న "మిక్కీస్ టూన్ టౌన్" లో "మిక్కీ మౌస్" ను కలిసి ఫొటోలు దిగాం. చీకటి పడుతుంటే, నీటి మధ్యలో ప్రదర్శకులు, పడవపై ఆహ్లాదకరమైన నృత్యం చేసుకుంటూ సందర్శకులకు కను విందు కలించే "ఫాంటాస్మిక్"ను చూశాం. ఇదవుతూనే చివరిగా, ఆకాశంలో దీపావళి పండుగను మైమరిపించే బాణాసంచా మధురానిభూతిని కలిగిస్తాయి.

“ఫెర్నాండో లోయ”

లాస్ ఏంజల్స్ ఉడ్ లాండ్ హిల్స్ నుంచి సుమారు 10 మైళ్ల దూరంలోని యూనివర్సల్ స్టూడియోలు, అందమైన “ఫెర్నాండో లోయ” లో వున్నాయి. సుమారు 250 చదరపు మైళ్ల విస్తీర్ణంలో, వాయువ్యాన శాంత సుజనా కొండలు-పశ్చిమాన సిమి కొండలు-దక్షిణాన శాంత మోనికా కొండలు-తూర్పున వెర్డుగో కొండలు-ఈశాన్యంలో సాన్ గాబ్రియల్ కొండలతో వ్యాపించి వుంటుంది ఫెర్నాండో లోయ. లాస్ ఏంజల్స్ నది సమీపంలోనే ప్రవహిస్తుంటుంది. శాంత మోనికా కొండల పక్కనుంచి పోయే “ముల్హోలాండ్ డ్రైవ్”, ఫెర్నాండో లోయకు-హాలీవుడ్ కు మధ్య సరిహద్దని చెప్పుకోవచ్చు. యూనివర్సల్ సిటీ ప్రాంతంలో, 36 అంతస్థుల భవనంతో సహా పది సిటీ ప్లాజాలు, హాలీ వుడ్ స్టూడియో-థీమ్ పార్క్, వాణిజ్య-వినోద కేంద్రమైన యూనివర్సల్ సిటీ వాక్, యూనివర్సల్ సెట్టింగుల లాంటివి అనేకం వున్నాయి. 36 అంతస్థుల భవనంలోనే యూనివర్సల్ స్టూడియోలున్నాయి. అమెరికాలోని ఆరు భారీ సినీ స్టూడియోలలో ఒకటైన వీటిని, సుమారు 100 సంవత్సరాల క్రితం, 1912లో, జర్మనీ నుంచి వలస వచ్చిన జ్యూ స్థాపించాడు.

"హాలీవుడ్ యూనివర్సల్ స్టూడియోలు"

నెల రోజులు కలియ తిరిగినా, ఇంకా-ఇంకా చూడాలని పించే ఆహ్లాద భరితమైన విహార స్థలం "లాస్ ఏంజల్స్ ఎంటర్ టైన్ మెంట్ రాజధాని" గా పేర్కొన బడే "హాలీవుడ్ యూనివర్సల్ స్టూడియోలు". మొదలు చూసింది, "సైమన్ జె స్మిత్" దర్శకత్వంలో నిర్మించిన పదహారు నిమిషాల నిడివిగల "ష్రెక్-4-డి" లఘు చిత్రం. సినిమా ఆసాంతం, చూస్తున్నంతసేపు, మనమీదకు అందులోని పాత్రలు ఉరికొస్తున్న ఫీలింగ్‌కలిగేలా వుంటుంది. కూర్చున్న కుర్చీలు, కదలాల్సిన సీన్ వచ్చినప్పుడల్లా, దడ-దడ శబ్దం చేస్తూ, గగుర్పొడిచే విధంగా ముందుకూ-వెనక్కూ కదుల్తుండే ఏర్పాటు ఆటోమాటిక్ గా చేసుంటుంది థియేటర్ లో. "రివెంజ్ ఆఫ్ ది మమ్మీ"-భయంకరమైన అనుభూతినిచ్చే ఒక అడ్వంచర్స్ రైడ్. "జురాసిక్ పార్క్ రైడ్ అడ్వంచర్", నీళ్లలో కలిగించే మరో అనుభూతి. "అడ్వంచర్స్ ఆఫ్ క్యూరి యస్ గైడ్", "టెర్మినేటర్", "వాటర్ వరల్డ్", "హౌజ్ ఆఫ్ హారర్స్" లాంటివి మరికొన్ని చూశాం.

అన్నింటిలోకి అద్భుతమైన అనుభూతి “స్టూడియో టూర్”. సినిమాలు తీసేటప్పుడు ఉపయోగించే సాంకేతికపరమైన ట్రిక్కులు-టెక్నిక్కులు ప్రయోగాత్మకంగా దారి పొడుగూ ప్రదర్శించి చూపారు. సినిమాల్లో జలపాతాలను ఎలా సృష్టించేది, అగ్నిప్రమాదాలు ఎలా సంభవించేది, భూకంపాలు ఎలా చోటుచేసుకుంటాయి చూసి, సాంకేతిక పరంగా "సినిమా తీయడానికి కాదే దీ అనర్హం" అనిపించింది. ఎక్కడా అసహజంగా ఏదీ అనిపించదు. వర్షం కురిపించి-వరదలు-వాగులు సృష్టించి-అందులో కొట్టుకుపోతున్న వారిని చూసి క్షణం పాటు నివ్వెరపడి పోయాం. సినిమాల్లో ప్రమాదాలకు కార్లు గురైనప్పుడు అవి కింద-మీదా పడి ఎగురుతుంటే, బాంబు దాడుల్లో తునా-తునకలై పోతుంటే-అగ్ని ప్రమాదంలో మాడి-మసై పోతుంటే, ఇదంతా నిజంగా జరిగి నిర్మాతలకు నష్టం జరుగుతుందని బాధ పడతాం. అదంతా ఉట్టిట్టిదేనని స్టూడియో టూర్ లో తేలిపోయింది. అంతా సాంకేతికంగా జరిగే వ్యవహారమే. అలానే వంతెన మీద రైలో-బస్సో పోతుంటే, కూలినప్పుడు అందులో వున్న మనకు కలిగే భయబ్రాంతులను, భూకంపం వచ్చినప్పుడు మన మందులో ఇరుక్కొని పోతే ఎలా వుంటుంది కళ్లకు కట్టినట్లు చూడవచ్చు-అనుభూతి పొందవచ్చు. భారీ విమాన ప్రమాదం జరిగిన దుర్ఘటనలో చోటుచేసుకున్న పరిణామాలను దగ్గరగా చూడవచ్చు.

అమెరికా దేశంలోని రహదారులు

శాన్ ఫ్రాన్ సిస్కో, శాంతా క్లారా లోయ, డిస్నీ లాండ్, యూనివర్సల్ స్టూడియోలు, సిలికాన్ లోయ, ఆరెకిల్, గూగుల్ సంస్థలున్న కాలిఫోర్నియా రాష్ట్రానికి ప్రత్యేకతుంది. ఆశ్చర్యం కలిగించే "బే వంతెన", "గోల్డెన్ గేట్ వంతెన" సముద్రం మీద కట్టబడింది ఇక్కడే. ఆహ్లాదం కలిగించే విహార స్థలాలెన్నో వున్నాయి. సమీపంలోని లాస్ వేగాస్ వెళ్లి "గాంబ్లింగ్" పత్తాల ఆట ఆడేందుకు దేశ-విదేశాల నుంచి పర్యాటకులొస్తుంటారు. న్యూ ఇయర్స్ డేకు వారి సంఖ్య అధికంగా వుంటుంది. శాన్ ఫ్రాన్ సిస్కో లోని డౌన్ టౌన్ రోడ్ మీద ప్రయాణం, అక్కడకు పోవడానికి సముద్రం పక్కనుంచి-దాదాపు సాగర జలాల అంచునుంచి చేరుకోవడం బలే సరదాగా వుంటుంది.

అలానే క్రుకెడ్ రోడ్. రోడ్డంతా, నేరుగా, ఒంపులు-వంకర టింకరలు లేకుండా, సుదూరంలో ఆకాశం నేలను తాకుతున్నట్లు, అద్భుతమైన సుందర దృశ్యం లా కనిపిస్తుంటుంది. ఆ రహదారి మీద కారులో పోతుంటే భయం కూడా వేస్తుంది. కొంత ఎత్తుకు వెళ్లిన తర్వాత వెనుక-ముందు ఎటు చూసినా-వళ్లు గగుర్పొడుస్తుంది. రోడ్డుకు ఇరు పక్కలా, ఇళ్లు-కారు పార్కింగులుంటాయి. మేం ఆ దారిగుండా వెళ్తున్నప్పుడు, మధ్యలో గుర్రపు స్వారీమీద గుజరాతీ పెళ్లి బృందం కనిపించింది. కారు నడిపేవాడి నైపుణ్యం మీదే అంతా ఆధారపడి వుంటుంది. లేదా దైవాధీనం. ప్రమాదాలకు నిలయమైనట్లున్నా, ఒక్క ప్రమాదం కూడా మాకంట కనపడలేదు. కొన్ని సంవత్సరాల క్రితం సంభవించిన భారీ భూకంపం తాలూకు గుర్తు లింకా కొన్ని అక్కడక్కడా ఆ ప్రాంతంలో కనిపిస్తాయి.

అమెరికా దేశంలోని నలు మూలల నుంచి వందల మైళ్ల దూరం అనాయాసంగా-సునాయాసంగా సొంత కార్లలో, స్వయంగా నడుపుకుంటూ ప్రయాణం చేసి ఇక్కడి ప్రదేశాలు చూసి పోగలగడానికి ప్రధాన కారణం దేశమంతా శాస్త్రీయ పద్ధతిలో నిర్మించిన రహదారులు-అమల్లో వున్న డ్రైవింగ్ నిబంధనలు-చిత్త శుద్ధిగా వాటిని ఆచరణలో పెట్తున్న వాహనదారులు. అహర్నిశలూ అలసటొచ్చే దాకా పనిచేసే అమెరికన్లు, వారాంతపు శెలవులు గడపడానికి, ఇతర ప్రదేశాలకు వెళ్లాల్సి వచ్చినప్పుడు, వందల మైళ్ల వేగంతో వాహనాలు నడిపినా, వారి అంతిమ లక్ష్యమైన సుఖప్రదమైన జీవితం గడిపేందుకు, గిరిగీసుకున్నట్లుగా, కొన్ని నియమ నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తారు. ప్రభుత్వం అజమాయిషీ చేస్తుందా-లేదా అని గమనించకుండా, పౌరులందరూ వాటిని పాటిస్తుంటారు. అందులో రహదారి నియమ నిబంధనలు ఒకటి. ఉదాహరణకు "కార్ పూల్ మార్గం". వేగంగా వెళ్లడానికి అనువుగా వుండే ఈ మార్గంలో ప్రయాణం చేయాలంటే, కారులో, ఇద్దరికంటే ఎక్కువ మంది వుండాలి. అలా లేని కారు నడిపే వ్యక్తి, ఎవరు గమనించినా-గమనించకున్నా, "కార్ పూల్ మార్గం" లోకి వచ్చే ధైర్యం చెయ్యడు.

ఇరువైపుల నుంచి, అంతర్ రాష్ట్ర రహదారుల్లో కనీసం రెండో-మూడో "చానల్స్" లేదా "పాస్ వేస్" (లేన్లు) ఏర్పాటుంటుంది. వాహనం నడిపేవారు, వారి-వారి వేగానికనుకూలంగా, సరిపడే విధంగా, ఒక లేన్లో ప్రయాణిస్తుంటారు. "ఎల్లప్పుడూ కుడి వైపునే నడపండి-లేన్ మారటానికి మాత్రమే ఎడమ వైపుకు తీసుకోండి" అన్న బోర్డులుంటాయి ప్రతి చోటా. ముందున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయాలంటే, అందుబాటులో ఎడమ వైపున వున్న లేన్ లోకి మారి, వాహనం నడపాలి. వెనుకా-ముందు పోతున్న ఏ వాహనానికి-అది నడుపుతున్న వారికి, ఏ మాత్రం ఇబ్బంది కలిగించకుండా, హారన్ మోగించ కుండా, లేన్లు మారాలి. అదే పనిగా హారన్ మోగించుకుంటూ, ఇతరులకు వీలైనంత అసౌకర్యం కలిగించుకుంటూ, వాహనాలు నడిపే వారెవరూ వుండరు. బధ్రతా కారణాల దృష్ట్యా, వాహనం నడిపే వ్యక్తి-ముందు సీట్లో నడిపే వారి పక్కన కూర్చొన్న వ్యక్తి, విధిగా "సీట్ బెల్ట్" కట్టుకోవాలి. కొన్ని రాష్ట్రాల నిబంధనల ప్రకారం వెనుక సీట్లో కూచున్న వారు కూడా సీటు బెల్ట్ ధరించాలి. సీట్ బెల్ట్ పెట్టుకోకుండా పట్టుబడితే, ఆ బాధ్యత, కారు నడుపుతున్న వాడిపైన వేస్తారు పోలీసులు.

ప్రపంచ ప్రఖ్యాత "బే వంతెన"

డిస్నీ లాండ్, యూనివర్సల్ హాలీవుడ్ స్టూడియోల తర్వాత చూసిన వాటిలో, ప్రపంచ ప్రఖ్యాత "బే వంతెన" గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. విశేషం ఏంటంటే, సుమారు 80 సంవత్సరాల క్రితం నిర్మించబడ్డ ఈ వంతెనపై, ఇంతవరకు, ఏ విఘ్నం లేకుండా కొనసాగుతున్న వాహనాల రాకపోకలకు, ప్రప్రధమంగా, మేం వెళ్లొచ్చిన మర్నాటినుంచి, అంతరాయం ఏర్పడింది. యాదృచ్చికమే కావచ్చు గాని, తాత్కాలికంగా చేపట్టిన రిపేర్ల సందర్భంగా, ఏర్పడిన అంతరాయం వల్ల వారం రోజుల వరకు దీన్ని మూసి వుంచారు.

శాన్ ఫ్రాన్ సిస్కో, ఓక్ లాండ్ లు పక్క-పక్కనే వున్న రెండు ప్రదేశాలు. దాదాపు జంట నగరాలని పిలవచ్చు. ఈ రెంటి మధ్య - రెంటినీ వేరు చేస్తూ, సముద్రముంటుంది. 1870 నుంచే రెంటిని కలుపుతూ, సముద్రం మీద వంతెన నిర్మించాలని భావించినప్పటికీ, 1930 లో-అప్పటి అమెరికా అధ్యక్షుడు, హెర్బర్ట్ హూవర్, ఆ ప్రతిపాదనకు అంగీకరించి, పూర్తి మద్దతు ప్రకటించిన తర్వాతే, ఆ కల నెరవేరింది. ప్రపంచంలోని అతిపెద్ద నిడివిగల వంతెనల్లో ఒకటైన బే బ్రిడ్జ్ పై, ప్రతి రోజు, దాదాపు మూడు లక్షల వాహనాలు అటు-ఇటు వచ్చి పోతుంటాయి. 1848–1855 నాటి "గోల్డ్ రష్" నేపధ్యంలో లక్షన్నర మంది ఇతర ప్రాంత అమెరికన్లు-లక్షన్నర మంది విదేశీయులు, మొత్తం మూడు లక్షలకు పైగా స్త్రీ-పురుష భేదం లేకుండా-పిల్లా జెల్లాతో సహా, భూ మార్గం-సాగర మార్గం-ఇతర మార్గాల ద్వారా కాలిఫోర్నియాకు చేరుకున్నారు. సరిగ్గా అప్పుడే ఒక టోల్ బ్రిడ్జ్ సముద్రం మీద నిర్మించాలన్న ఆలోచన జరిగింది. అదే కార్యరూపం దాల్చి, 1933 కల్లా నిర్మాణం మొదలయింది. నవంబర్ 12, 1936 న, "గోల్డెన్‌గేట్" ప్రారంభానికి ఆర్నెల్ల ముందర, వాహనాల రాకపోకలు దానిమీద మొదలయ్యాయి.

"గోల్డెన్‌ గేట్ బ్రిడ్జ్"

ఇంద్ర ధనుస్సును తలదన్నే శోభాయమాన రంగులతో-వీనులకు విందైన ధ్వనులతో-అందంగా అలరారే వింత వింత కాంతులతో రంజిల్లుతూ, అద్భుతమైన భారీ శిఖరాలు-కేబుల్లు కలిగి, చాలా పొడుగ్గా వుండే, శాన్ ఫ్రాన్ సిస్కో "గోల్డెన్‌ గేట్ బ్రిడ్జ్" ప్రపంచంలోని అత్యంత సుందరమైన వంతెనల్లో అగ్రస్థానంలో వుంటుందంటారు.

సముద్ర గర్భం నుండి ఆవిర్భవించి, ఆకాశాన్ని తాకుతున్నదా అన్న చందాన కనిపించే ఈ పసిఫిక్ మహా సముద్రం పైన కట్టిన "వారధి" ని తనివితీరా చూసేందుకు, సంవత్సరం పొడుగూ-ముఖ్యంగా వేసవి రోజుల్లో, సుమారు కోటి మంది పర్యాటకులు వస్తుంటారని అంచనా. అద్భుతమైన ఆ వంతెన వరకు వెళ్లి, దాని మీదుగా ప్రయాణం చేసి, ఆ పక్కకు చేరుకుని, అలా నిలబడి ఎన్ని గంటలు గడిపినా తనివి తీరదనే అనాలి. ఇక దానిపై నడవడం గాని, సైకిల్ మీద తిరగడం గాని చేయడమంటే, ఏదో అడ్వంచర్ చేస్తున్న అనుభూతి కలుగుతుంది. "బే బ్రిడ్జ్" లాగా, ఇది కూడా శాన్ ఫ్రాన్ సిస్కో, ఓక్ లాండ్ లను కలిపి, రెండు ప్రాంతాల మధ్య, రవాణా సౌకర్యం సులభ తరం-వేగవంతం చేస్తుంది. అమెరికా ఉత్తర-దక్షిణ అంతర్ రాష్ట్ర రహదారి-హైవే లో, పసిఫిక్ మహా సముద్రం మీద నిర్మించిన "గోల్డెన్‌ గేట్ బ్రిడ్జ్", ఓక్ లాండ్ తో సహా, శాన్ ఫ్రాన్ సిస్కో - ఉత్తర దిశగా వున్న అమెరికన్ కౌంటీలకు మధ్య కీలకమైన వారధిగా రాక పోకడలకు ఉపయోగ పడుతున్నది.

అమెరికాలో వార్తా పత్రికలు చదువుతారా?

అమెరికా వచ్చినప్పటి నుంచి, "న్యూ యార్క్ టైమ్స్" దినపత్రికకు చందా కట్టి ఇంటికి తెప్పించుకునే ఏర్పాటు చేసుకున్నాను. అమెరికాలో సర్వ సాధారణంగా ఎవరు పత్రికలకు చందా కట్టి తెప్పించుకునే అలవాటుండదు. ఆన్ లైన్‌లోనే చదువుతారు. చందా కట్టకపోయినా, వారంలో కొన్ని రోజులు పత్రికల వాళ్లు ఉచితంగానే వేసి పోతూంటారు. తెల్లవారక ముందే, ఎప్పుడు వేస్తాడో-ఎవరు వేస్తాడో తెలియదు గాని, లేచేసరికి ఇంటి ముందర, చక్కటి ప్లాస్టిక్ కవర్లో, వర్షం కురిసినా తడవకుండా వుండే విధంగా పెట్టి, ఇంటి ముందర వేసి పోతారు. నాలాంటి వాళ్లు వచ్చినప్పుడు తప్ప వాటి జోలికి సాధారణంగా పోరు ఇక్కడుండే మనవాళ్లు గాని, అమెరికన్లు గాని. యధా ప్రకారం "ట్రాష్" లోకన్నా పోతుంది-లేదా-ఇంట్లోకి తేబడి తెరవకుండా "ట్రాష్” లోకన్నా పోతుంది. ఒకవేళ తెరవడమంటూ జరుగుతే, అందులో వుండే "కూపన్లు" చించు కోవడానికి మాత్రమే పరిమితం చేసి, మిగతాది ట్రాష్ లోకి చేరుస్తారు.

షుగర్ లాండ్

నవంబర్ 9, 2009న హ్యూస్టన్ లో వుంటున్న మా అమ్మాయి కిన్నెర దగ్గరకు వెళ్లాం. శాన్ ఫ్రాన్ సిస్కోకు, హ్యూస్టన్ కు, టైమింగ్స్ లో తేడా వుంటుంది. హ్యూస్టన్లో రెండు గంటలు ముందుంటుంది. మేం ఈ తేడాలు పాటించకుండా మా ఏర్పాటు మేం చేసుకున్నాం. మా గడియారాల్లో ఇండియా టైమ్ ను మార్చకుండా, ఏ ప్రదేశంలో వున్నా, అక్కడి పగలును రాత్రిగా, రాత్రిని పగలుగా, అదే టైమ్ ను చూసుకుండే వాళ్ళం. ఉదాహరణకు, శాన్ ఫ్రాన్ సిస్కోలో వున్నప్పుడు (అక్టోబర్ వరకు) ఉదయం ఏడు గంటలవుతే, హైదరాబాద్ లో సాయంత్రం ఏడున్నర గంటలయ్యేది. మా దృష్టిలో శాన్ ఫ్రాన్ సిస్కోలో అప్పుడు ఉదయం ఏడున్నర గంటలయినట్లుగా భావించేవాళ్లం. అలానే హ్యూస్టన్లో అప్పుడు (మేం వచ్చేసరికల్లా) ఉదయం ఏడు గంటలవుతే, ఇండియాలో సాయంత్రం ఆరున్నర గంటలయ్యేది. మా వరకు మాకు, హ్యూస్టన్లో ఉదయం ఆరున్నర గంటల కింద లెక్కే. ఇండియాలో ఉదయాన్ని సాయంత్రం లాగా, సాయంత్రాన్ని ఉదయం టైమ్ లాగా చూసుకున్నాం కనుకనే జెట్ లాగుల లాంటివి మమ్మల్ని భాదించలేదు. గడియారంలో టైమ్ కూడా మార్చలేదు. తిన్నా-తాగినా-నిద్ర పోయినా-పొద్దున లేచినా, అవే టైమ్స్ పాటించాం.

కిన్నెర వాళ్లుంటున్న షుగర్ లాండ్ ప్రాంతంలో, పక్క-పక్కనే వున్న, "న్యూ టెరిటరీ", "టెల్ ఫెయిర్‌" ప్రాంతాలలో నివసిస్తున్న వారిలో చాలా మంది భారతీయులే. అందులోను ఎక్కువమంది తెలుగు వారే. ఎనభై వేలకు పైగా జనాభా వున్న షుగర్ లాండ్ సిటీ టెక్సాస్ రాష్ట్రంలో-ఫోర్ట్ బెండ్ కౌంటీలో వుంది. హ్యూస్టన్-షుగర్ లాండ్-బే టౌన్ మెట్రోపాలిటన్ ప్రాంతంలో ఇదొక ముఖ్యమైన ప్రాంతం. టెక్సాస్ రాష్ట్రంలో అతి తొందరగా అభివృద్ధి చెందిన నగరాల్లో ఇదొకటని అంటుంటారు. టెక్సాస్ రాష్ట్రంలోని ప్రధాన చక్కెర ఉత్పత్తి-మార్కెటింగ్ సంస్థగా గుర్తింపు పొందిన "ఇంపీరియల్ షుగర్" కేంద్ర కార్యాలయం షుగర్ లాండ్ లోనే వుంది. ఫోర్ట్ బెండ్ కౌంటీ లో, మాస్టర్ ప్రణాళిక ఆధారంగా నిర్మాణాలు జరిగిన ప్రదేశాల్లో షుగర్ లాండ్ ను మించింది లేదు. ఫస్ట్ కౌంటీ, షుగర్ క్రీక్, రివర్ స్టోన్, న్యూ టెరిటరీ, టెల్ ఫెయిర్‌, గ్రేట్ వుడ్ లాంటి ఎన్నో మాస్టర్ ప్రణాళికల కమ్యూనిటీ కాలనీలతో అలరారే అందమైన అమెరికన్ "ఛండీగఢ్" నగరం షుగర్ లాండ్. హ్యూస్టన్ పరిసరాల్లో ఎక్కడ తిరుగుతున్నా, భారతదేశంలోని ఏ హైదరాబాద్ లోనో తిరుగుతున్నట్లు వుంటుంది. వాతావరణం కూడా దాదాపు అలానే వుంటుంది. అలానే గుళ్లు-గోపురాలు, పెళ్లిళ్లు-పేరంటాలు, సాయంకాల సమావేశాలు, వీకెండ్ పార్టీలు, విందులు-వినోదాలు, అన్నీ అచ్చు హైదరాబాద్ లో మాదిరి అనుభూతే కలిగింది. స్నేహితులు, బంధువులు ఒకరి కష్ట సుఖాలు మరొకరు తెలుసుకుంటూ, అహర్నిశలు అండ-దండగా వుంటుంటారు. నిజంగా ఇక్కడ వీళ్లని చూసి, కలివిడిగా వుండే విధానం నేర్చుకోవాలనిపించింది.

“అష్టలక్ష్మి దేవాలయం"-"గోదా దేవి కల్యాణం"

షుగర్ లాండ్ లో “అష్టలక్ష్మి దేవాలయం" త్రిదండి చిన జీయర్ స్వామి ఆలోచనా సరళిని అనుసరించి వుంటుంది. హ్యూస్టన్లో, ఆ మాటకొస్తే అమెరికాలోని అన్ని ప్రధాన నగరాల్లో (చిన్న చిన్న ప్రదేశాల్లో కూడా) హిందు సంస్కృతి-సాంప్రదాయాలకు నిలయమైన అనేక దేవాలయాలు నెలకొల్పారు మన తెలుగు వారు. పిట్స్ బర్గ్ శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయాన్ని సాక్షాత్తు తిరుమల దేవాలయంతో పోల్చడం అందరికి తెలిసిన విషయమే. దరిమిలా అమెరికాలోని పలు ప్రాంతాల్లో పిట్స్ బర్గ్ కు ధీటుగా దేవాలయాలు వెలిశాయి. సిన్స్ నాటిలో, డేటన్ లో వున్న దేవాలయాలను చూశాం. పిట్స్ బర్గ్ కు వెళ్లినప్పుడు, అక్కడున్న సాయిబాబా గుడిని కూడా చూశాం. అవి ఏవీ కూడా మన దేశంలోని పురాతన దేవాలయాలకు తీసిపోవు. పూజా-పునస్కారాలు కూడా శాస్త్రోక్తంగా, పాండిత్యం తెలిసిన అర్చకులే నిర్వహిస్తుంటారు. అన్నింటికన్నా విశేషం, మన మతాన్ని గౌరవిస్తూ, మన దేవాలయాల నిర్మాణానికి ఎటువంటి ఆటంకాలు కలగకుండా అమెరికన్ ప్రభుత్వం రక్షణ కలిగించడం. సెక్యులరిజం అనేది మనదేశంలో ఎంతవరకు పాటిస్తున్నామో చెప్పలేం కాని, ఇక్కడ మాత్రం మన భావాలను గౌరవిస్తున్నారు. ఇక్కడ దేవాలయాల్లో అర్చకులుగా వచ్చేవారికి, రెలిజియస్ కోటా కింద వీసాలు జారీ అవుతాయి. కొందరు పూజారులు, తమ లాంటి వారిని ఇండియా నుంచి పిలిపించి, వారికి జీవనోపాధి కలిగిస్తున్నారు.

శ్రీ శ్రీ శ్రీ త్రి దండి రామానుజ చిన జీయర్ స్వామి బోధనలకనుగుణంగా, వైదిక సాంప్రదాయాన్ని-వేదాల్లోని విజ్ఞానాన్ని, నేటి తరం-భావి తరాల వాళ్ళకు అందించడమనే ప్రధాన ధ్యేయంగా ఈ దేవాలయం వివిధ కార్యక్రమాలను చేపడ్తుంది. పాంచరాత్ర ఆగమ సూత్రాలను తు. చ తప్పకుండా పాటిస్తూ స్థాపించబడిన అష్ట లక్ష్మి దేవాలయం, నిర్వహణలోనూ అవే అనుసరిస్తుంటుంది. చిన జీయర్ స్వామి, పెద జీయర్ స్వామి నిలువెత్తు ఫొటోలు, ఆళ్వార్ల ఫొటోలు, గోదా దేవి ఫొటోలు అక్కడ ఏర్పాటు చేశారు నిర్వాహకులు. లక్ష్మి నారాయణ స్వామిని, ఆయన సరసన ఆది లక్ష్మి, ధాన్య లక్ష్మి, ధైర్య లక్ష్మి, గజ లక్ష్మి, సంతాన లక్ష్మి, విజయ లక్ష్మి, విద్యా లక్ష్మి, ధన లక్ష్మి విగ్రహాలు దర్శనమిస్తాయిక్కడ.

హ్యూస్టన్లో వుంటున్న తెలుగు వారు (ప్రధానంగా), ఇతర భారతీయులు తరచుగా కలుసుకునే పుణ్యం-పురుషార్థం కలుగజేసే "సాంప్రదాయ-సాహితీ సంగమం" అష్ట లక్ష్మి దేవాలయం.

ప్రతి సంక్రాంతి ముందర వచ్చే భోగి పండుగ నాడు చిన జీయర్ స్వామి ఆధ్వర్యంలో నిర్వహించే "గోదా దేవి కల్యాణం" ఉత్సవానికి హాజరవడం శ్రీమతికి అలవాటు. ముత్తారం దేవాలయంలో చేయించడం కూడా అలవాటుగా మారింది. గత సంవత్సరం, జీయర్ స్వామి ఆశ్రమం వెళ్లి, అక్కడ వేలాది మంది భక్తుల సరసన కూర్చొని, గోదా దేవి కల్యాణంలో పాల్గొన్నాం. ఈ సారి ఎలా అనుకుంటుంటే, భగవంతుడే ఆ ముచ్చట తీర్చాడు. చిన జీయర్ స్వామి చేయించిన రీతిలోనే, దాదాపు వేయి మందికి పైగా హాజరయిన భక్తుల సమక్షంలో, అష్టలక్ష్మి దేవాలయంలో వైభవంగా జరిగిన గోదా దేవి కల్యాణ మహోత్సవంలో 51 డాలర్లు చెల్లించి, అందులో పాల్గొన్నాం.

శాన్ ఫ్రాన్ సిస్కోలో వున్నప్పుడు కూడా మూడు దేవాలయాలను చూశాం. వాటిల్లో కాలిఫోర్నియా సాగర తీరంలో నివస్తున్న హిందువులందరికొరకు 1985 లో నిర్మించిన ఫ్రీమాంట్ దేవాలయం ఒకటి. మరో ప్రాముఖ్యత సంతరించుకున్న గుడి స్ప్రింగ్ టౌన్ లో వున్న "లివర్ మోర్ శివ-విష్ణు దేవాలయం". దీన్నే "హిందువుల సంస్కృతీ కేంద్రం" అని కూడా పిలిస్తారు. మొదట్లో తాత్కాలిమైన నిర్మాణం మాత్రమే వున్న గుడికి శాశ్వతమైన భారీ దేవాలయంగా నిర్మించ తలపెట్టినప్పుడు పునాది రాయిని వేసింది నాటి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు. దేవాలయ నిర్మాణ శిల్పులు, ఆగమ పండితులు భారత దేశం నుండి వచ్చారు. సాంస్కృతిక కేంద్రానికి సంబంధించిన ఉత్సవాలను పండిట్ రవిశంకర్, ఉస్తాద్ అలీ అక్బర్ ఖాన్ జరిపించారు. విశాలమైన ఆవరనలో వున్న ఈ గుడికి వేల సంఖ్యలో భక్తులొస్తుంటారు. పండుగ దినాల్లో పదివేలకు పైగా భక్తులు దైవ దర్శనానికి వస్తారు. వైకుంఠ ఏకాదశి పర్వదినం నాడు ఆ దేవాలయం వెళ్లి ఉత్తర (వైకుంఠ) ద్వారం గుండా విష్ణుమూర్తి దర్శనం చేసుకున్నాం. మా మనుమరాలు కనక్ తో కూడా అక్కడకు వెళ్ళాం ఒక సారి.

"లిండన్ బి జాన్సన్ స్పేస్ సెంటర్"

వారాంతపు శెలవు దినాన ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన, హ్యూస్టన్ "నాసా" కేంద్రానికి వెళ్లొచ్చాం. 1957లో, అలనాటి సోవియట్ యూనియన్, కృత్రిమ అంతరిక్ష నౌకను మొదటిసారిగా ప్రయోగించడంతో, స్పందించిన అప్పటి అమెరికా అధ్యక్షుడు డ్వైట్ ఐసెన్హోవర్, ఏడాది తిరక్కుండానే, 1958 లో "నేషనల్ ఎయిరో నాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్"-"నాసా" ను, స్థాపించాడు. హ్యూస్టన్ నగరంలో, 1961 లో "ప్రయాణీకుల అంతరిక్ష నౌకా కేంద్రం" గా అప్పటి అమెరికా అధ్యక్షుడు లిండన్ జాన్సన్ రూపకల్పన చేసి నెలకొల్పిన ఇక్కడి "నాసా" కార్యాలయం పేరును, జాన్సన్ మరణానంతరం, ఆయన స్మృతి చిహ్నంగా, "లిండన్ బి జాన్సన్ స్పేస్ సెంటర్" గా మార్చారు. గత నాలుగైదు దశాబ్దాలుగా మానవ అంతరిక్ష యానానికి సంబంధించిన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి-విజయవంతంగా అమలుకు రంగం సిద్ధం చేసిన సంస్థల్లో, ప్రపంచంలో అగ్రగామిగా పేరు తెచ్చుకుంది.

చంద్రుడిపై కాలుమోపే కార్యక్రమం విజయవంతంగా ముగిసి, వ్యోమగాములు సురక్షితంగా భూమి పైకి తిరిగొస్తుంటే, ప్రపంచం కళ్లన్నీ హ్యూస్టన్ మీదనే కేంద్రీకృతమయ్యాయి. జులై 20, 1969 రోజున చంద్రమండలం మీద కాలిడిన నీల్ ఆర్మ్ స్ట్రాంగ్, అక్కడ నుంచే, "హ్యూస్టన్, ఈగిల్ లాండయింది" అనడం, కొన్ని గంటల్లోనే, అపోలో నౌక "లూనార్ మాడ్యూల్‌" నుంచి ఆయన సహచర వ్యోమగాములు, నిచ్చెన ద్వారా దిగి అంతరిక్షంలో పాదం పెట్టి, "మానవుడికి ఇదొక చిన్న అడుగే కాని, మానవాళి మనుగడ దిశగా వేసిన పెద్ద అడుగు" అని ప్రకటించడం, ఇక్కడి వారికి మరపు రాని సంఘటన. ఇంతవరకు జరిపిన అంతరిక్ష ప్రయాణాలకు సంబంధించిన అలనాటి "ప్రత్యక్ష ప్రసారాలు", వ్యోమగాముల శిక్షణా వివరాలు, మిషన్ కంట్రోల్ కేంద్రం, చంద్ర మండలం నుంచి తెచ్చిన శిలలు, "నాసా" వాహనంలో పర్యటన, అంతరిక్షంలో నౌకను పంపే సమయంలో అడుగడుగునా చోటు చేసుకునే సంఘటనలు, వినోద కార్య క్రమాల కూడలి హ్యూస్టన్లోని "నాసా" కేంద్రం.

"నెలనెలా తెలుగు వెన్నెల"-"సాహిత్యం-మానవ విలువలు"

హ్యూస్టన్ కు వచ్చిన రెండువారాలకు నవంబర్ 21న, అక్కడి తెలుగువారు ప్రతినెలా నిర్వహించుకునే "నెలనెలా తెలుగు వెన్నెల" కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించి, "హిందూత్వం-మార్క్సిజం-రామాయణం-మానవ విలువలు" గురించి మాట్లాడమన్నారు. ఆ సంస్థ ముఖ్య నిర్వాహకుల్లో ఒకరైన శ్రీ పిల్లుట్ల సుదేష్, నేను శాన్ ఫ్రాన్ సిస్కోలో వుండగానే, హ్యూస్టన్ వచ్చినప్పుడు తమ సంస్థ కార్యక్రమానికి నన్ను రమ్మని ఆహ్వానించారు. నా కంటె ముందు-నా తర్వాత ఆ సంస్థ ఆహ్వానించిన గౌరవ-ముఖ్య అతిథుల్లో అక్కిరాజు సుందర రామకృష్ణ గారు, "కళాప్రపూర్ణ శ్రీమతి ఎ. అనసూయాదేవి గారు, హనుమాన్ స్వామి ఆచార్యులు గారు, కళానాధభట్ట వీరభద్ర శాస్త్రి గారు, రామ్మోహన్ గారు, వెన్నెలకంటి మాణిక్యం గారు, వేదాంతం రాఘవ గారు, ఆచార్య పాడూర్ జగదీశ్వరన్ గారు, సరోజ శ్రీ శ్రీ గారు, ఆర్టిస్ట్ చంద్ర గారు, పప్పు నరసింహమూర్తి గారి లాంటి ప్రముఖులున్నారు.

శ్రీ సుదేష్ గారు నాకు మా అమ్మాయి కిన్నెర ద్వారా హ్యూస్టన్ లో పరిచయమైన "మంచి సాహితీ మిత్రుడు". ఎక్కడో వేల మైళ్ల దూరం వచ్చి తెలు తల్లికి సేవచేస్తున్న మంచి మనసున్న కుటుంబం వారిది. శంకరాభరణం శంకరశాస్త్రి గారింట్లో పాదం మోపితే "సరిగమలు" వినిపిస్తాయని సినిమాలో చూసినట్లే, వీళ్ళింట్లోకి వెళ్తే, మరచిపోతున్న మన సంస్కృతీ-సాంప్రదాయాలు కళ్ల ముంద సాక్షాత్కరిస్తాయి. హిందువుల సాంప్రదాయ పండుగలకైనా, ఇండిపెండెంట్ డే, రిపబ్లిక్ డే లాంటి సందర్భంలోనైనా, న్యూ ఇయర్స్ డే కైనా, ఆయన-కుటుంబ సభ్యులు శ్రద్ధతీసుకుని చేసే ఏర్పాట్లు చూస్తుంటే చాలా ఆనందం కలిగింది. హ్యూస్టన్ కు వచ్చిన తర్వాత మధ్యలో పదిరోజుల పాటు మా కనక్ బారసాలకు శాన్ ఫ్రాన్ సిస్కో వెళ్లి, డిసెంబర్ 30 న తిరిగి వచ్చాం. అలా రావడంవల్ల న్యూ ఇయర్స్ డే సందర్భంగా, డిసెంబర్ 31 రాత్రి, నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ, సుదేష్ కుటుంబ సభ్యులు ఏర్పాటుచేసిన విందు-వినోద కార్యక్రమం మా అమెరికా పర్యటనలో ఒక మరపురాని సంఘటనగా మిగిలిపోతుందనాలి. చిన్న పిల్లలు, చిన్న పిల్లల్లా పెద్దలు, ఆడా-మగ తేడా లేకుండా, కలసి-మెలసి ఆనందంగా, తూరుపు-పడమరల సంగమంగా ఎంతో వేడుకగా జరుపుకొని, అర్థరాత్రి పన్నెండవుతూనే "హేపీ న్యూ ఇయర్ టు యూ" అంటూ కేరింతలు వేశారందరూ. అలానే సంక్రాంతి సంబరాలు జరిపించారు.

అమెరికాలో సొంత ఇల్లు

ఇక్కడివారు చాలామంది, గృహప్రవేశం కావాలంటే తిథి-వార-నక్షత్రాలతో సహా ఇల్లు కొనేటప్పుడు వాస్తుకూడా చూస్తుంటారు. భారతదేశంలో-ఆంధ్ర ప్రదేశ్ లో, ఎవరైనా-ఏ విధంగా శాస్త్రం చెప్పిన పద్ధతిలో గృహప్రవేశం చేస్తుంటారో, అదే విధంగా ఆవగింజ తేడా లేకుండా, ప్రతి విషయంలోనూ శ్రద్ధగా కార్యక్రమాలు చేస్తారు. ద్వారం ముందు గడప వద్ద మంచి గుమ్మడికాయ పగల గొట్టడం, బూడిద గుమ్మడికాయ ఇంటి ముందరుంచడం, దేవుడిని ఈశాన్యంలో ఏర్పాటుచేయడం, పుణ్యాహవాచన, పాలు పొంగించడం, గణపతి పూజ లాంటి కార్యక్రమాలన్నీ యధా విధిగా జరిపించుతారిక్కడి బ్రాహ్మణుడు.

అమెరికాలో ఇల్లు కొనడమనేది కొంచెం కష్టం అనిపించినా, వేసే ప్రతి అడుగు జాగ్రత్తగా వేసుకుంటూ పోతే, ఇంటి తాళం చేతులు చేతికందుకోవడానికి నాలుగైదు నెలల కంటే ఎక్కువ పట్టదు. ఇల్లు కొనాలనుకునేవారి ఆదాయ వనరులు-అసలు ఆదాయం, దాని ఆధారంగా ఎంత ఋణ సౌకర్యం పొందే వీలుంది, నెలసరి ఖర్చెంత, దాచుకున్న డబ్బునుంచి కట్టగలిగేదెంత, తీసుకోదల్చిన ఋణం మీద చెల్లించే స్తోమతున్న వడ్డీ రేటు లాంటి విషయాల ప్రాతిపదికగా, అందులో అనుభవమున్న స్నేహితుల-నిపుణుల సలహా సంప్రదింపులతో ఆరంభించడం మంచిది.

అమెరికా-హ్యూస్టన్ నగరంలోని షుగర్ లాండ్ లో, మా అమ్మాయి కట్టుకున్న ఇంట్లో గృహ ప్రవేశానికి అర్థరాత్రి వచ్చిన వారిలో చాలామంది, హడావిడిగా వెళ్లడానికి సిద్ధమౌతుంటే, కారణమేంటని అడిగాను కొందరిని. అప్పటికే ఆలశ్యమైందని అంటూ, మరికొన్ని గంటల్లో "బ్లాక్ ఫ్రైడే" అమ్మకాలు మొదలైతాయనీ, వీలైనంత త్వరగా మాల్స్ దగ్గరికెళ్లి క్యూలో నిలబడాలనీ వెళ్లిపోయారు వాళ్లు. ఆ తర్వాత మా అమ్మాయి చెప్పింది-బహుశా గృహప్రవేశంతో బిజీగా లేనట్లైతే, తనుకూడా, వెళ్లేదానినేమోనని. అమెరికా దేశమంతా అత్యంత ఆహ్లాదంగా-ఆడంబరంగా ప్రతిఏటా జరుపుకునే "కృతజ్ఞతలు తెలుపుకునే రోజు"-థేంక్స్ గివింగ్ డే, ఈ సంవత్సరం, గురువారం (నవంబర్ 26, 2009) నాడు, జన్మతః అమెరికన్లతో సహా, ప్రవాస భారతీయులు-ఆంధ్రులు కూడా జల్సాగా జరుపుకున్నారు. వారిలో కొందరైతే అమెరికన్ల సాంప్రదాయ వంటకమైన "టర్కీ" ని కూడా తయారు చేసుకొని, భందు మిత్రులతో కలిసి భోంచేశారు. ఇంకొందరు సహచర అమెరికన్ మిత్రులతో గడిపారు. థేంక్స్ గివింగ్ డే ఒక పండగైతే, మరుసటి రోజు వచ్చే బ్లాక్ ఫ్రైడే ను మరింత ఆర్భాటంగా ఎంజాయి చేస్తారు అమెరికన్లు-అమెరికాలో స్థిరపడ్డ అమెరికనేతరులు. వాస్తవానికి ఈ రెండు రోజులకొరకు అమెరికాలో వున్న వారంతా ఎన్నాళ్ల నుంచో ఎదురు చూస్తుంటారు. ఉద్యోగస్థులకు-విద్యార్థులకు పెద్ద ఆట విడుపిది. లాంగ్ హాలీడే గా, అయిదారు రోజుల ముందునుంచే శెలవు వాతావరణం సర్వత్రా నెలకొని వుంటుంది.

పదేళ్ల క్రితం అమెరికాకు ఇప్పటి అమెరికాకు పోలికే లేదు

ఆరంకెల డాలర్ల నెలసరి ఆదాయం-ఆరు గదుల అందమైన ఇల్లు కోల్పోయి, తినడానికి తిండి -ఉండడానికి ఇల్లు లేక, గంపెడు కుటుంబంతో, కేవలం ప్రభుత్వ సహాయంతో జీవించే అమెరికన్ల సంఖ్య రోజు-రోజుకు పెరిగిపోతుంది. కనీ-వినీ ఎరుగని ఆర్థిక మాంద్యం నేపధ్యంలో ఉపాధి కోల్పోయిన పలువురు, ఉద్యోగాలకు దరఖాస్తులు పంపడం-అవన్నీ బుట్ట దాఖలా కావడం సర్వసాధారణ విషయమై పోయిందిప్పుడు అమెరికాలో. నిరుద్యోగ సమస్య వృద్ధి రేట్ నానాటికి పెరుగుతూ 10% దాటిందిప్పుడు. పది సంవత్సరాల క్రితం జులై 1999లో మొదటిసారి నేనొచ్చిన అమెరికాకు ఇప్పటి అమెరికాకు పోలికే లేదు. అప్పుడదో "భూతల స్వర్గం-భోగ భూమి". భారతదేశమంటే అక్కడ నుండి ఇక్కడ కొచ్చి స్థిరపడినవారికి కూడా కేవలం "కర్మ భూమి" మాత్రమే ! రెండో పర్యాయం మార్చ్ 2003లో వచ్చినప్పుడు అమెరికా ఇరాక్ తో భీకర సంగ్రామంలో కూరుకుపోయింది. "భవిష్యత్ ప్రకంపనలు" అమెరికా విమానాశ్రయంలో అడుగుపెట్టిన మరుక్షణం నుంచే కొట్టొచ్చినట్లు కనబడ్డాయప్పటికే. అనుకున్నంతా అయిందనిపిస్తోదిప్పుడు. రాజకీయాలనుంచి, సామాజిక జీవన శైలి వరకు-దైనందిన జీవనశైలి తో సహా, ప్రతి విషయంలోను వైరుధ్యం స్పష్టంగా గోచరిస్తున్నది. ప్రతివారిలో ఏదో అ భద్రతా భావం, ఏదో కోల్పోతున్నా మన్న తపన, ఎలా అంతో-ఇంతో వెనకేసుకోవాలన్న ఆలోచన కనిపిస్తుందిప్పుడు. ఈ విషయంలో అమెరికన్లకు, వలస వచ్చి స్థిరపడిన ఇతర దేశీయులకు తేడా ఏ మాత్రం లేదనాలి.

అమెరికా 44వ అధ్యక్షుడుగా, ఆఫ్రికన్-అమెరికన్ నల్ల జాతీయుడైన బారక్ హుస్సేన్ ఒబామా జనవరి 20, 2009న అధికారం చేపట్టాడు. ఒక వైపు అంతర్జాతీయ ఉగ్రవాదం, మరో వైపు తీవ్ర ఆర్థిక మాంద్యం దేశాన్ని కుదిపేస్తున్న క్లిష్ట తరుణంలో అధ్యక్షుడయ్యాడు ఒబామా. ఆయన పదవీకాలమంతా లోటు బడ్జెట్ తోనే గడపాల్సి వస్తుందని ఆర్థిక నిపుణుల అంచనా. ఇరాక్, అఫ్గానిస్థాన్‌ సమస్యలతో సహా ఆర్థిక పరమైన విషయాలన్నిటికి సంబంధించి మొదటి సంవత్సరం తాను చేయాలనుకుంటున్న కార్యాచరణ ప్రణాళికను అధికారం చేపట్టడానికంటే ముందే సిద్ధం చేసుకున్నాడు ఒబామా.

అధ్యక్షుడు నల్లజాతివాడైనా, జాతి వివక్షత పూర్తిగా సమసి పోయినట్లు లేదింకా. ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాల నుంచి పట్టాలు పొందినప్పటికీ, ఆఫ్రికన్-అమెరికన్ నల్ల జాతి వారికి ఉద్యోగాలు దొరకడం కష్టమై పోతున్నది. నల్ల వారినుండి ఎంత వ్యతిరేకత వచ్చినా రాజకీయంగా తనకు ఎటువంటి నష్టం కలగదని ఒబామా భావిస్తున్నట్లు విశ్లేషకుల అభిప్రాయం. వాస్తవానికి, అమెరికాలోని నల్ల జాతి ఓటర్లందరూ ఓటింగ్ లో పాల్గొన కుండా ఇళ్లలో కూరుచున్నా, ఒబామా గెలిచేవాడు. తెల్ల వారిలో అధిక సంఖ్యాకులకు ఆమోదయోగ్యమైన వ్యక్తిగా, నల్లజాతివారి పక్షాన పక్షపాత దృష్టితో వ్యవహరించనివాడిలా పేరు తెచ్చుకుంటున్నాడు ఒబామా.

ఒబామా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆరోగ్య సంస్కరణల చట్టం దిగువ సభ ఆమోదం పొంది, సెనేట్ ఆమోదం కొరకు ఎదురుచూస్తున్నది. చట్టంగా రూపు దిద్దుకునే సమయానికి దాని రూపురేఖలెలా వుంటాయనేది ఇంకా ప్రశ్నార్థకమే. అయితే గుడ్డిలో మెల్ల లాగా, 2009 డిసెంబర్ నెల నుంచి ఆర్థిక పరిస్థితి మెరుగవుతున్నదని, ఆర్థిక మాంద్యంలో వెసులుబాటు కలుగుతున్నదని ఆర్థిక నిపుణులు భావిస్తున్నట్లు మీడియా కథనాలొస్తున్నాయి. అదెంతవరకు వాస్తవమో కాలమే తేల్చాలి. ఇవన్నీ ఇలా వుండగా, అక్టోబర్ 9, 2009న, ఒబామాకు నోబెల్ శాంతి బహుమానం ప్రకటించడం-దాన్ని ఆయన ఆస్లో నగరంలో నిరసన ధ్వనుల మధ్య అందుకోవడం జరిగింది.అంతర్జాతీయ సమస్యలు, ఆర్థిక మాంద్యం, నిరుద్యోగ సమస్య తీవ్రత, జాతి వివక్షత, అమెరికాపై పెరిగిపోతున్న ఉగ్రవాద ప్రభావం, స్వపక్ష-విపక్షాలనుండి ఎదురవుతున్న విమర్శలతో ఏడాది పాలన పూర్తి చేసుకున్న ఒబామా భవిష్యత్ లో మిగిలున్న మూడేళ్ల కాలాన్ని ఎలా పూర్తిచేసుకుంటాడోననేది ఆసక్తికరమైన విషయమే.

శ్రీ పప్పు లక్ష్మీ నరసింహమూర్తి చెప్పిన "హిందూ సాంప్రదాయ వివాహ వేడుక: పెళ్లి చూపులు-నిశ్చితార్థం-స్నాతకం-అంకురార్పణ-గౌరీ, వరపూజలు-గోత్రం, ప్రవరలు-కన్యాదానం-మాంగల్య ధారణ-తలంబ్రాలు-సప్తపది-అప్పగింతలు-గృహప్రవేశం: వనం జ్వాలా నరసింహారావు

"వివాహం"

ధర్మార్థ కామ మోక్షాలనే నాలుగు పురుషార్థాలలో ఒకటైన కామాన్ని, ధర్మ బద్ధం చేయడానికి పెద్దలు, ఋషులు ఎంచుకున్న ఏకైక మార్గం వివాహం. ధర్మం ప్రాతిపదికగా, అర్థం-కామం సాధించడానికి భారతీయ హిందూ సాంప్రదాయ మూల సూత్రంగా రూపొందించిన విధానం "వివాహం". వివాహ ప్రక్రియతో స్త్రీ పురుషుల కర్తవ్య నిర్వహణ మార్గం సుగమం చేయబడింది. ఈ ప్రక్రియ భవిష్యత్ జీవిత ప్రణాళికకు మార్గదర్శిగా పనిచేస్తుంది. ఇక ఆ ప్రణాళికే అతి పవిత్రమై, సమాజానికి మేలు చేసే దిశగా అనుక్షణం దంపతుల కర్తవ్యాన్ని గుర్తుచేస్తుంటుంది. వివాహానికి మరో పేరు "పరిణయం". దీనిని అసలు "పరిణయనం" - "పరి-నయనం" అనికూడా అంటారు. వధూవరులిద్దరు ఒకరి దృష్టిలో మరొకరు పడి, భవిష్యత్ దంపతులుగా, కష్ట-సుఖాలను సమంగా పంచుకుంటూ, జీవితాంతం కలిసి-మెలిసి వుందామని-వుంటామని కంటి సైగల ద్వారా తెలియపర్చుకోవడమే పరిణయం.

"పెళ్ళి చూపుల" సాంప్రదాయం

పెళ్ళి చూపులతో వివాహ ప్రక్రియ మొదలవడానికి పూర్వ రంగంలో, ఇరు పక్షాలకు చెందిన-ఇరువురికీ కావాల్సిన "పెళ్లి పెద్దలు" సంధాన కర్తలుగా వ్యవహరించి, కాబోయే వియ్యంకుల మధ్య రాయభారాలు చేసి, ఒప్పించి, కార్యక్రమానికి నాంది పలుకుతారు. సాంప్రదాయం ప్రకారం అబ్బాయికి చెందిన వారు బంధు-మిత్ర-సపరివార సమేతంగా అమ్మాయి ఇంటికి వెళ్ళి, అమ్మాయిని చూస్తారు. వధూవరులు పరస్పరం నచ్చాక, ఇరువురి ముఖ్య బంధువులు వరుడి ఇంట్లో సమావేశమవుతారు. పరస్పర సంప్రదాయాలు-కుటుంబ పద్ధతులు-ఆచార వ్యవహారాలు చర్చించుకుంటారు. వరకట్న నిషేధం లాంటివి అమల్లో వున్నప్పటికీ, సాంప్రదాయ బద్ధంగా, వధూవరుల తలిదండ్రులు కట్న కానుకలు, ఇచ్చి-పుచ్చుకోవడాలు, లాంఛనాలు, ఆభరణాలు లాంటివి మాట్లాడుకున్న తరువాత, అన్నీ కుదిరాక, నిశ్చితార్థపు తేదీ నిర్ణయించుకుంటారు.

"పెళ్ళి చూపుల" సాంప్రదాయం ప్రకారం అబ్బాయి బంధు-మిత్ర-సపరివార సమేతంగా కాబోయే మా మామ గారింటికి వెళ్ళి, అమ్మాయిని చూడాలి. ఆ తర్వాత జరగాల్సింది ఇరువురి ముఖ్య బంధువులు వరుడి ఇంట్లో సమావేశమవడం. పరస్పర సంప్రదాయాలు-కుటుంబ పద్ధతులు-ఆచార వ్యవహారాలు చర్చించుకోవడం. వరకట్న నిషేధం అమల్లో వున్నప్పటికీ, సాంప్రదాయ బద్ధంగా, వధూవరుల తలిదండ్రుల మధ్యన ఇచ్చి-పుచ్చుకోవడాలు, లాంఛనాలు, ఆభరణాలు లాంటివి మాట్లాడుకున్న తరువాత, అన్నీ కుదిరాక, నిశ్చితార్థపు తేదీ నిర్ణయించుకోవాలి.

నిశ్చితార్థం

వివాహంలో ముఖ్యమైన ఘట్టాలలో మొదటిది వాగ్ధానం. అంటే: పెళ్ళి ఖాయపరచుకోవడం (నిశ్చితార్థం) తర్వాత వర-వరణం. అంటే: వరుడిని లాంఛనప్రాయంగా అంగీకరించడం. నిశ్చితార్థానికే మరోపేరు "నిశ్చయ తాంబూలం". వైదిక మంత్రాల మధ్య వివాహ ప్రక్రియకు పెద్దల ఆశీస్సులు తీసుకోవడానికే ఈ కార్యక్రమం. అందరికీ ఆమోదయోగ్యమైన శుభ ముహూర్తంలో పురోహితుడు బంధుమిత్రుల సమక్షంలో పెళ్ళి ముహూర్తాన్ని లగ్న పత్రికగా రాయించిన తదుపరి, వధూవరుల తల్లి-తండ్రులు లగ్న పత్రికలు, తాంబూలాలు మార్చుకుంటారు. పెళ్ళి ఒప్పందం లాంటి ఈ వేడుక వధువు ఇంటిలోగాని, వారేర్పాటుచేసుకున్న వసతి గృహంలోగాని జరుగుతుంది. దీన్నే ఇప్పుడు "ఎంగేజ్ మెంట్" అంటున్నారు. కొందరు ఇటీవలి కాలంలో ఈ తంతును పెళ్లికంటే ఘనంగా జరుపుకుంటున్నారు. నిశ్చితార్థం రోజున అమ్మాయి, అబ్బాయి ఉంగరాలు మార్చుకోవటంతో సగం పెళ్ళి జరిగినట్టు గానే భావిస్తారు.

సాంప్రదాయ బద్ధంగా, వధూవరుల తలిదండ్రుల మధ్యన ఇచ్చి-పుచ్చుకోవడాలు అందరి ఇళ్లల్లో ఒకే రకంగా వుంటాయి. తాహతును బట్టి కొంచెం మార్పులు-చేర్పులు వుండొచ్చు. ఇరుపక్షాల వాళ్ళు మరిచిపోవడానికి ఆస్కారం లేకుండా, అరమరికలు లేకుండా, ఒక కాగితం మీద ఇచ్చి-పుచ్చుకోవడాలకు సంబంధించిన వివరాలన్నీ రాసుకోవడం కూడా సంప్రదాయమే.

ఆడ పెళ్లివారిచ్చేవి- మగ పెళ్లివారిచ్చేవి

సాధారణంగా ఆడ పెళ్లివారిచ్చేవి-విధిగా ఇవ్వాల్సినవి: స్నాతక ద్రవ్యాలు, వరుడి ధోవతులు, మధు-పర్కాలు (వరుడుకి ఇవ్వాల్సిన బట్టలు), ఉత్తర జంధ్యాలు, భటువు, కాళ్లుగడిగే పళ్లెం-బిందెలు, కల్యాణ వేదికపై వరుడిని కూచోబెట్టే చిన్న బల్ల, వివాహంలో వివిధ సందర్భాలలో (స్థాళీపాకం, నాగవల్లి, సదశ్యం, అప్పగింపులు, మేజువాణి లాంటివి) వరుడికి పెట్టాల్సిన బట్టలు (ధోవతులు, పట్టు బట్టలు, సూట్, పాంట్-షర్ట్ లు లాంటివి), వరుడివైపు బంధువులకు పెట్టాల్సిన బట్టలు, అప్పగింతల బట్టలు, పెళ్ళైన తర్వాత మగ పెళ్ళివారింట్లో గృహప్రవేశం సందర్భంగా-సత్యనారాయణ వ్రతమప్పుడు వధూ-వరులకు పెట్టవలసిన బట్టలు, ఆడ బిడ్డలకు-అత్తగారికి ఇవ్వదల్చుకున్న లాంఛనాలు, పెళ్ళి కూతురుకు ఇచ్చే సారె (సారె పెట్టెలో పెట్టాల్సిన వస్తువులు-ఏభై ఒక్క కొబ్బరి చిప్పలు, ఐదు రవికె గుడ్డలు, రెండుంపావు కిలోల శనగ-సున్నిపిండి, కిలోంబావు పసుపు-అందులో సగం కుంకుమ, చీరె-ధోవతులు, ఐదు రకాల తీపి పదార్థాలు) ముఖ్యమైనవి.

సాధారణంగా మగ పెళ్లివారిచ్చేవి-విధిగా ఇవ్వాల్సినవి: స్నాతకంలో బావమరిదికి పెట్టాల్సిన బట్టలు, పెళ్ళి కూతురుకు పెట్టాల్సిన పట్టు చీరెలు-ఇతర చీరెలు, నగలు-ఆభరణాలు, నల్లపూసలు, పుస్తె (ఒకటి పుట్టింటి వారు, ఇంకొకటి అత్తగారింటి వారు ఇవ్వాలి), మెట్టెలు, ముత్తవుతల్లి (వధువు అమ్మమ్మ) కిచ్చే కట్నం, వధువు తల్లి కడుపు చీరె-తండ్రికి బట్టలు, ప్రధానపు వుంగరం లాంటివి.

ముహూర్త నిశ్చయం

వధూవరుల తారా బలం-చంద్ర బలం చూసి ముహూర్తం నిశ్చయిస్తారు. "పెళ్లినాటి ప్రమాణాలు" భవిష్యత్ లో దంపతులు తు. చ తప్పకుండా అమలు చేయాలంటే "ముహూర్త బలం" ముఖ్యమని హిందువుల నమ్మకం. నిశ్చితార్థంలో ప్రధానంగా విఘ్నేశ్వరుడి పూజ వుంటుంది. వివాహ ప్రక్రియ ఆసాంతం విఘ్నాలు లేకుండా చూడమని ఆయన్ను పూజించడం ఆనవాయితి. నిశ్చితార్థానికి ముందు బంధువుల సమక్షంలో-పరోక్షంలో వధూవరుల తల్లి-తండ్రుల మధ్య కుదిరిన ఇచ్చి-పుచ్చుకునే ప్రతి చిన్న అంశం ఒక కాగితం మీద రాసుకోవడం కూడా సాంప్రదాయంలో భాగమే. ఇదంతా "ఆచారం-పద్ధతి".

పెళ్ళి ముహూర్తం దగ్గర పడుతోంటే పెళ్లి సరంజామా కొనడం అనేది ఇరు పక్షాల వారికి కూడా పెద్దపని. పట్టుచీరలు, బంగారు ఆభరణాలు, నూతన వస్తువులు.. .. ఎన్నో కొంటారు.

నిర్ణయించబడిన ముహూర్తానికి వరుని తరపువారూ, వధువు తరపువారూ వారి వారి కులాచారానుసారం "శుభ లేఖలు"గా పిలువబడే ఆహ్వానపత్రికలు ముద్రించుకుంటారు. మంగళ సూచకంగా లేఖకు నాలుగు వైపులా పసుపు పూస్తారు. బంధుగణాన్ని పిలుచు కోవడం పెళ్లిళ్లలో సర్వ సాధారణం. ఎక్కడెక్కడో ఉంటూ, అరుదుగా కలిసే చుట్టపక్కాలతో సహా బంధువులందరూ కలుసుకోగలిగే "సామాజిక ఏర్పాటు" పెళ్ళిళ్లు. ఆ కలయికలకు వేదికగా పెళ్ళి వారి ఇల్లు (కల్యాణ మంటపం) మారిపోతుంది. ఎంత శ్రద్ధ తీసుకుని, అందరికీ "శుభ లేఖలు" పంపించే ఏర్పాటుచేసినప్పటికీ, ఆఖరు నిమిషంలో, ఒక్కోసారి ముఖ్యమైన వారితో సహా కొందరిని మరిచిపోవడం సహజంగా జరుగుతుంది. వాళ్లకు కోప-తాపాలు కూడా వస్తాయి. కాకపోతే వచ్చినంత త్వరగా తగ్గిపోతాయి కూడ. ఇవన్నీ సర్వసాధారణంగా ప్రతి పెళ్లిలోనూ-ప్రతివారింటిలోనూ జరిగే మామూలు విషయాలే. ఆ చిరు కోపాలు రాకుంటే పెళ్ళి శోభ రానట్లే.

"స్నాతకం"

పెళ్లిరోజుకు ఒకరోజు ముందర "స్నాతకం" అనే ముఖ్యమైన కార్యక్రమం జరుపుకోవడం ఆచారం. పెళ్ళి కుమారుడి ఇంటిలో గాని, కళ్యాణ మండపంలో గాని లేదా విడిదిలో గాని పురోహితులు స్నాతక కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. విఘ్నేశ్వర పూజతో మొదలుపెట్టి, అన్ని ప్రాయశ్చిత్తాల కోసం, శరీర శుద్ది కోసం బ్రాహ్మణులు వరుడితో గోత్ర ప్రవరలు చేయిస్తారు. స్నాతకం అనే ఈ "సంస్కారం", ప్రధానంగా, వరుడిని "బ్రహ్మచర్యం" నుండి "గృహస్థాశ్రమం" స్వీకరించడానికి సిద్ధంచేస్తున్న కార్యక్రమం. గురువు (ఇక్కడ పురోహితుడు) ఆదేశంతో-అంగీకారంతో "గృహస్థాశ్రమం" స్వీకరించే ఏర్పాటిది. ఆ సమయంలో గురువు చేయాల్సిన హిత బోధ తైత్తిరీయోపనిషత్తులోని "సత్యాన్న..." అన్న ఒక శ్లోక రూపంలో వుంటుంది.

"సత్యం విషయంలోను, ధర్మం విషయంలోను, తెలివితేటల విషయంలోను, పొరపాటు పడవద్దు" అన్న ఆదేశం అది. తల్లిని, తండ్రిని, అతిథిని దేవుడులా భావించాలని చెప్తారు. సమాజ శ్రేయస్సే ధ్యేయంగా జీవించమని, దానం చేసేటప్పుడు శ్రద్ధగా చేయమని, తాహతుకు మించి దానం చేయొద్దనీ-ఇంతకంటె ఎక్కువ దానం చేయలేకపోతున్నందుకు సిగ్గుపడుతున్నానని భావించమనీ బోధిస్తాడు పురోహితుడు. పెద్దవారి నుంచి ధర్మ సూక్ష్మాలను తెలుసుకొని-వారనుసరించిన మార్గాన్ని ఎంచుకోమని అంటూ, "వరుడికి శుభం కలుగుగాక" అని ఆశీర్వదించి గురువు వరుడిని గృహస్థాశ్రమానికి సిద్ధం చేస్తాడు. హిందూ వివాహ సంప్రదాయ పద్ధతిలో భారతీయ ఆలోచనా విధానాన్ని తెలియచేశాడు పురోహితుడిక్కడ.

స్నాతకానికి "సమా వర్తనం" అన్న పేరు కూడా వుంది. సమా వర్తనమంటే, తిరిగి రావడమని అర్థం. విద్యాభ్యాసం పూర్తి చేసుకొని, గురువు హిత బోధతో పాదయాత్ర చేస్తూ తిరిగి రావడాన్నే సమా వర్తనం అంటారు. కాశీ యాత్ర, హోమ కార్యాలు నిర్వర్తించి, దండాన్ని ధరించి, గొడుగు పట్టుకొని కాశీ యాత్రకు బయలుదేరే ఘట్టం సాంప్రదాయంలో మరో ముఖ్యమైన ఆచారం. కాశీ ప్రయాణం - బాజా భజంత్రీల మద్య వరుడు గొడుగు పట్టుకొని, చేత్తో కర్ర పుచ్చుకొని, కాళ్లకు పావు కోళ్లు ధరించి, మెడలో పసుపు బట్టను వేసుకొని, సన్యాసం స్వీకరించేందుకు, కాశీకి పోతున్నానని చెప్పి బయలు దేరుతాడు. వధువు సోదరుడు వచ్చి "అయ్యా, బ్రహ్మచారిగారూ! మీ కాశీ ప్రయాణం విరమించుకోండి. మా సోదరిని వివాహం చేసుకొని గృహస్థుగా జీవించండి" అని చెప్పి బొట్టు పెట్టి,బెల్లం (తీపి పదార్థం) నోటికి రుచి చూపించి, నూతన వస్త్రాలను ఇచ్చి వెనుకకు తీసుకొని వస్తాడు.

కాశీ యాత్ర

కాశీ యాత్ర ఘట్టం స్నాతకంలో చాలా సరదాగా జరిగే కార్యక్రమం. తన శేష జీవితం ఇక కాశీలో గడపాలని భావిస్తున్నానని, దానికి బంధు-మిత్రుల అనుజ్ఞ కావాలని వరుడు కోరతాడు. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం సరైందికాదని, గృహస్థాశ్రమం స్వీకరించి, ధర్మ భద్ధంగా ఇంద్రియ సుఖాలను అనుభవించి, పరిపూర్ణమైన వైరాగ్యం కలిగిన తర్వాతనే భార్యా సమేతంగా వానప్రస్థాశ్రమంలో ప్రవేశించాల్సిందిగా పురోహితుడు (గురువు) హితవు పలుకుతాడు. ఇక పెళ్ళి కూతురు వైపునుంచి వచ్చిన వారు (బావ మరిది-మేన మామ-తాత గారు లాంటి వారు) "బంగారు ఆభరణాలతో అలంకరించబడిన వారి "అమ్మాయి" నిచ్చి వివాహం చేద్దామనుకుంటున్నామని, అగ్ని సాక్షిగా అమెను వివాహమాడమని, ముందుగా తమ ఇంటికి వచ్చి ఆతిధ్యం స్వీకరించమని వరుడికి నచ్చచెప్పి, కాశీ యాత్ర ఆలోచనను విరమింపచేసే ఘట్టం ఇది. చాలా కోలాహలంగా పెళ్ళికి "తరలి పోయే ముందర" జరిగే సరదా కార్యక్రమం ఇది. ఇలా స్నాతకం వ్రతాన్ని పూర్తి చేసుకొని, వరుడి బంధు-మిత్రులందరు వధువు గృహానికి (వసతి గృహానికి) బయలుదేరుతారు. బయలుదేరే ముందు, మంగళ స్నానాలు చేయడం, అలంకరించు కోవడం, పల్లకి లాంటి వాహనాలు సిద్ధం చేసుకోవడం మామూలే. బయలుదేరే ముందర, శుభకార్యానికి బయలుదేరుతున్నామని, వెనక్కు పిలవడం – నిందించడం - దగ్గడం, తుమ్మడం లాంటివి లేకుండా వుండాలన్న అర్థం వచ్చే మంత్రాన్ని చదువుతారు.

పెళ్ళికొడుకును-పెళ్ళికూతురును చేయడం

పెళ్ళికి ముందర ఒక మంచి రోజున గానీ, స్నాతకం-అంకురార్పణల రోజున గానీ పెళ్ళికొడుకును-పెళ్ళికూతురును చేయడం ఆచారం. మంగళ స్నానాలతో ఆ ఉదయం కార్యక్రమం మొదలవుతుంది. వధూ-వరుల ఇళ్లలో, ఉదయం తెల-తెలవారుతుండగానే, మంగళ వాయిద్యాల మధ్య ఇంటి ముందర మామిడి ఆకులతో తోరణం కట్టే కార్యక్రమం ముందుగా జరుగుతుంది. వధువుకు, కన్యా దాత దంపతులకు, తోటి పెళ్ళి కూతురుకు (వధువు సొంత చెల్లెలు గాని, వరుసకు చెల్లెలు గాని), తెల్లవారక ముందే, ముత్తైదువలు బొట్టు పెట్టి, మాడుపై నూనె అద్ది, హారతిచ్చి, మంగళ స్నానాలకు సిద్ధం చేస్తారు. అలానే వరుడికి, తల్లి-తండ్రులకు, తోటి పెళ్ళికొడుకుకు (వరుడి సొంత తమ్ముడు గాని, వరుసకు తమ్ముడు గాని) కూడా జరుగుతుంది. స్నాతకం చేసుకున్న నాడే, లాంఛనంగా అక్కడ కన్యా దాత ఇంట్లో, వధువుని "పెళ్ళికూతురు" చేసే కార్యక్రమం కూడా జరుగుతుంది. ముందు-వెనుకల కూడా జరగొచ్చు. అంకురార్పణగా పిలిచే ఆ వేడుకకు కన్యా దాత దగ్గరి బంధువులందరూ వస్తారు. నవ ధాన్యాలను మట్టి మూకుళ్లలో పుట్ట మన్నులో కలిపి మొలకెత్తే విధంగా అమర్చడాన్ని "అంకురార్పణ" లో చేస్తారు.

స్నాతకం చేసుకున్న రోజునే మగ పెళ్లివారు ఆడ పెళ్ళివారి వూరికి తరలి పోతారు. ఒక్కోసారి అక్కడకు పోయి స్నాతకం చేసుకుంటారు.

విడిది మర్యాదలు

మగ పెళ్ళి వారు విడిదికి చేరుకోగానే, అప్పటికే వారికొరకు ఎదురు చూస్తున్న ఆడ పెళ్లి వారు, "ఎదురు కోలు" పలికే ఆచారం సరదాగా-సందడిగా జరుపుకునే మరో వేడుక. విడిదిలో ఏర్పాట్లన్నీ పూర్తి చేసి (సబ్బులు, పేస్టులు, బకెట్లు, తుండు గుడ్డలు, వేడి నీళ్లు లాంటివి) ముందు (హాలులో) భాగంలో పెద్ద తివాచీ లాంటిది పరిచి ఎదురు చూస్తుంటారు ఆడ పెళ్ళి వారు. మేళ-తాళాలతో ఆహ్వానించి కాబోయే అత్తగారు, మామ గారు, వారి సమీప బంధువులు ఎదురుకోలలో భాగంగా, విడిదిలోకి ప్రవేశించే ముందర కాళ్లు కడుక్కోవడానికి మగ పెళ్ళి వారందరికీ నీళ్లిస్తారు. పెళ్ళికొడుకు ఆ పనిని బావమరిదితో చేయిస్తారు. ఈ కాళ్లు కడగడమనేది రెండు-మూడు పర్యాయాలు జరిపే వ్యవహారం. ఆ తర్వాత అందరికీ కాఫీ-పలహారాలిచ్చి మర్యాదలు చేసి, స్నానాలు ముగించుకొని సిద్ధంగా వుంటే, భోజనాలకు తీసుకెళ్తామంటారు. లేదా అక్కడే ఏర్పాటు చేస్తారు.

వివాహం ముహూర్తం నాడు పెళ్లికి ముందు-పెళ్ళిలో-పెళ్లైన తర్వాత చేయాల్సిన కార్యక్రమాలెన్నో వున్నాయి. తెలుగు వారి పెళ్ళిళ్లలో ఉండే సందడి, సంతోషం ఎంత మోతాదులో వుంటుందో ఎవరూ చెప్పలేరు. సకుటుంబ పరివార సమేతంగా, బాజా భజంత్రీల నడుమ, సంతోషంగా జరిగే ఆ కళ్యాణ మహోత్సవం అందరి జీవితాలలో ఒక మరవలేని సంఘటన. కొందరు కల్యాణ మండపాలను వాడితే మరికొందరు వాడరు. సాధారణంగా పల్లెటూర్లలో కొబ్బరి ఆకుల పందిరి వేయడం వలన మండపం ఆవశ్యకత తగ్గింది. పట్టణాలలో టిప్ టాప్ పందిరి మండపాలు తప్పని సరిగా వాడటం జరుగుతుంది.

గౌరీ పూజ-వర పూజ- మధు పర్కం

ఒక వైపు వధువు గౌరీ పూజ, మరో వైపు వరుడున్న విడిదిలో వర పూజకు సన్నాహాలు మొదలవుతాయి. హిందూ సంప్రదాయం ప్రకారం వధువుని "లక్ష్మి,పార్వతి,సరస్వతి"ల ఉమ్మడి రూపంగా భావిస్తారు. పచ్చదనంతో లోకాన్ని చైతన్యపరిచే ప్రకృతి ప్రతిరూపంగా వధువుని అలంకరిస్తారు. ఇక వరుడిని త్రిమూర్తుల దివ్యస్వరూపంగా, విధాత చూపిన విజయోన్ముఖ పథంలో విజ్ఞతతో నడిచేందుకు సిద్ధమైన సిద్ధ పురుషుడుగా భావిస్తారు.

వధువుకు నలుగు స్నానం చేయించి, పెళ్ళికూతురుగా అలంకరించి, కళ్యాణం బొట్టు దిద్ది, పాదాలకు పారాణిని పూసి, పూల జడ వేసి, నూతన వస్త్రాలను కట్టించి (పట్టు చీరె) "గౌరీ పూజ" కు తీసుకెళ్తారు. గౌరీ పూజకు వధువుని సిద్ధం చేస్తూనే, వర పూజ కొరకు విడిదికి వెళ్తారు ఆడ పెళ్ళి వారు. కన్యా దాత మేళ తాళాలతో, పానకం బిందెలతో, కొత్త బట్టలతో వచ్చి మగ పెళ్ళి వారికి స్వాగతం పలికే వేడుక ఇది. పానకం వరుడికి ఇచ్చి రుచి చూపించి తరువాత బంధువులందరికీ ఇస్తారు. వరపూజలో భాగంగా, ఆడ పెళ్ళి వారు-వారి వైపు బంధువులు వచ్చి, వివాహం చేసుకోవడానికి రమ్మని మగ పెళ్ళివారిని ఆహ్వాని్స్తారు. వరపూజలోనే ఇరువైపువారు, ఒకరినొకరు లాంఛనంగా ఆహ్వానించు కోవడానికి "శుభలేఖలు" మార్చుకుంటారు. వరపూజ కార్యక్రమం జరుగుతుండగానే, కన్యా దాత ఇంట్లో, వధువు గౌరీ పూజ సమాంతరంగా కొనసాగుతుంటుంది.

మగ పెళ్లివారందరు కన్యా దాత ఇంటికి చేరుకునే సమయానికి, వధువు గౌరీ పూజ ఇంకా కొనసాగుతూనే వుంది. ఇది ఆచారం-సాంప్రదాయం. బ్రహ్మచర్యాన్ని వదిలి గృహస్థాశ్రమాన్ని పొందేందుకు కన్యా వరణానికి వచ్చే వరుడికి ఎదురేగి "నాయనా నా కుమార్తెను భార్యగా స్వీకరించి కలకాలం వర్ధిల్ల” మని కన్యా దాత దీవించే కార్యక్రమంతో వివాహ మండపం వద్ద జరగబోయే వేడుక మొదలవుతుంది. హిందూ వివాహ సంప్రదాయం ప్రకారం, "నారాయణ స్వరూపుడైన వరుడికి" పాద ప్రక్షాళన లాంటివి జరిపించి, కన్యా దాత ఆతిధ్యం ఇస్తారు. దీనినే "మధు పర్కం" అని పిలుస్తారు. మధుపర్కం: మధువు అంటే తేనె. కుమార్తెకు భర్తగా వరుడి ఎంపిక తరువాత అతను వధువు తల్లి-తండ్రికి సంప్రదాయాన్ననుసరించి పుత్ర సమానుడౌతాడు. వివాహానంతరం "మధుపర్కం" అంటే తీయటి పానీయం అని అర్ధం. మధు పర్కాలుగా ఇచ్చిన నూతన వస్త్రాలను ధరించి వరుడు వివాహ వేదిక మీద జరగాల్సిన వేడుకకై వేచి వుంటాడు. వరుడు ఆ పనిలో వున్నప్పుడు, తర్వాత కార్యక్రమం జరిపించడానికి, కన్యా దాత వరుడు నాన్న గారిని తీసుకొని వధువు గౌరీ పూజ చేస్తున్న చోటుకెళ్తారు.

గోత్రం-ప్రవర

గౌరీ పూజ జరిగే చోట ఒక్క సారి, లాంఛనంగా, ఇరు పక్షాల వారి గోత్రం-ప్రవర చెప్పే కార్యక్రమం, పురోహితుల చాతుర్యాన్ని బట్టి అత్యంత ఆసక్తికరంగా-విన సొంపుగా వుంటుంది. "గోత్రం" అంటే వంశం, "ప్రవర" అంటే ఆ వంశం మూల పురుషుల సమాచారం. మీ అమ్మాయిని, మా అబ్బాయికి ఇచ్చి వివాహం జరిపించమని వరుడి తండ్రి, కన్యా దాతను కోరడమే ఈ వేడుక ముఖ్య ఉద్దేశం. "చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శ్శుభం భవతు-వశిష్ట, శక్తి, పరాశర త్రయార్షేయ ప్రవరాన్విత యజుర్వేదినే, తైత్తిరీయ శాఖాధ్యాయినే, ఆపస్తంబ సూత్రిణే, ….. …. శర్మణో నప్త్రే, …. … శర్మణ పౌత్రాయ, … …. శర్మణ పుత్రాయ, .. … శర్మణే వరాయ, భవదీయాం కన్యాం ప్రజాసహత్వ కర్మభ్యో వ్రణీమహే" ("మూడు ఋషులున్న పరాశరుడితో సమానమైన గోత్రం కలవాడూ, యజుర్వేదాన్ని అభ్యసించినవాడూ, ఆ వేదం ప్రకారం తన ఇంటి కార్యక్రమాలను నడిపించేవాడూ, తైత్తరీయ శాఖను-ఆపస్తంబ సూత్రాన్ని అభ్యసించి అనుసరించేవాడూ, … మునిమనుమడూ, …. మనుమడూ, …. పుత్రుడూ అయిన … అనే వరుడికి మీ కూతురునిచ్చి వివాహం చేయమని అడగడానికి వచ్చాం") అని అడుగుతాడు. ఇలా వంశం వివరాలు చెప్పడం వల్ల కన్యా దాత చివరివరకూ ఆలోచించుకునే అవకాశం వుందింకా. ఇవేవీ తెలియకపోతే (అందరి సమక్షంలో), ఫలానావారి పిల్లవాడిని చేసుకున్నాం-ఇప్పుడు అనుభవిస్తున్నాం అని భవిష్యత్‌లో అనవచ్చు.

కన్యా దాత, వరుడి వివరాలు ముత్తాత తరం దగ్గర నుండి విన్న తర్వాత, ఆ సంబంధం తనకి ఇష్టమైతే, వెంటనే తన వధువు (కూతురు) వివరాలు కూడా చెప్పి అబ్బాయి తన కూతురుని చేసుకోమని అడుగుతాడు.

గంపలో వధువు-కాళ్లు కడగడం

గౌరీ పూజ దగ్గర గోత్రం-ప్రవరల వేడుక ముగిసిన పిదప, వధువు మేనమామలు పెళ్ళి కూతురిని గంపలో కూర్చొబెట్టి వివాహ వేదిక పైకి తీసుకొచ్చే కార్యక్రమం కూడా చాలా సరదాగా వుంటుంది. ఇందులోనూ ఒకరకమైన సామాజిక స్పృహ కనిపిస్తుంది. తల్లి తర్వాత మేనమామలు ముఖ్యమని తెలియచేయడమే దీని అర్థం. గంపలో ధాన్యం కూడా పోస్తారు. కొబ్బరి బోండా మానసిక స్వచ్ఛతకు చిహ్నం. అలానే, అందులోని పీచులాగా, ఎల్లవేళలా ఇరువురు విడిపోకుండా, అల్లుకు పోయి జీవిస్తామని-సత్ సంతానం కలవారమవుతామని సంకేతం కూడ ఈ వేడుకలో వుందంటారు పెద్దలు.

కళ్యాణ వేదిక పైన వున్న వరుడి కాళ్లు కడిగే కార్యక్రమం, వివాహంలో, అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్న మరో ముఖ్యమైన ఘట్టం. కన్యాదాతేమో వయసులో పెద్ద-వరుడేమో చిన్నవాడు. అయినా కాళ్లు కడిగే ప్రక్రియ వుందంటే దానికి సాంప్రదాయ బద్ధమైన అర్థం వుండి తీరాలి. కన్యా దాత వరుడి కాళ్ళు కడుగుతున్నప్పుడు ఆయన తేజస్సు తరిగి పోకుండా పురోహితుడు ఒక మంత్రాన్ని చెప్పుతాడు. "నా లోని తేజస్సు, శక్తి, కీర్తి, బలం సుస్థిరంగా వుండుగాక" అన్న అర్థం వచ్చే మంత్రం అది. అది కన్యా దాత ఉచ్చరిస్తూ, ఇచ్చిన "అర్ఘ్యాన్ని" (మంచి నీరు) స్వీకరిస్తాడు వరుడు. కన్యా దాత వరుడి కాళ్ళు కడిగి నందువల్ల, చిన్నవాడైన వరుడు, తనలోని కాంతి తరిగిపోకుండా వుండేందుకు, ఆచమనం చేసి, దానికి తగ్గ మంత్రాన్ని చదివిస్తారు. ఆచమనం చేస్తూ, వరుడితో, " ఓ ఉదకములారా, మీరు నాకు గొప్ప కీర్తిని-పాడి పంటలను ఇచ్చి, అందరు ఇష్టపడేవాడిని చేసి, రక్షించండి" అని చెప్పిస్తారు. వధువుని గంపలోనే వుంచి మహా సంకల్పంతో ఆరంభించి, తర్వాత జరగాల్సిన వేడుక మొదలు పెట్తారు పురోహితులు.

వధూవరులు సాక్షాత్తు "లక్ష్మీ-నారాయణ స్వరూపులు" గా భావించుతారు కాబట్టి, ఆ విధంగానే "లక్ష్మీ నారాయణుల కల్యాణం" లా జరిపించుతారు. "మహా సంకల్పం" చెప్పడం, సృష్టి క్రమంతో మొదలుపెట్టి, పరమేశ్వరుడి శక్తి-సామర్థ్యాలు అనంతమని-అచింత్యాలని, ఆయన అనుగ్రహంతోనే యావత్ సృష్టి జరిగిందని కొనసాగింది. మానవుడి మేథస్సు ఊహించనలవికాని పరిమాణంలో వున్న ఈ జగత్తు, పరమేశ్వరుడి ఆద్యంతాలు లేని రూపంలో ఒక అతి చిన్నదైందని పురోహితుడంటాడు. అఖిలాండ బ్రహ్మాండంలో, అనేకానేక చిన్న-చిన్న గోళాలున్న ఖగోళంలోని అత్యంత సూక్ష్మమైన భూగోళంలో, భరత ఖండంలో, మారు మూలనున్న మానవుడు, అణు పరిమాణంలో వున్న చిన్న భాగమని తెలియచేసే దే మహా సంకల్పం. ఇది చెప్పడం ద్వారా, పరమాత్మ స్వరూపాన్ని ఎరుక పరిచి, మానవుడి అహంకారాన్ని తగ్గించుకోమని, వినయ సంపదను పెంచుకోమని సూచించడం జరుగుతుంది.

మహా సంకల్పం

మహా సంకల్పం విశ్వ స్వరూపాన్ని, ఖగోళ స్థితిని చక్కగా వివరిస్తుంది. భూమండలాన్ని పరిపాలించిన షోడశ మహారాజులు, షట్చక్రవర్తులు, సప్త ద్వీపాలు, నవ వర్షాలు, నవ ఖండాలు, దశారణ్యాలు, యాభై కోట్ల విస్తీర్ణం గల జంబూ ద్వీపం, అందులో భరత వర్షం-భరత ఖండం, దానిలో ఈ కన్యాదానం ఎక్కడ చేస్తున్నది కన్యా దాత పేర్కొంటాడు. అలాగే బ్రహ్మ కాలమాన ప్రకారం యాభై సంవత్సరాలు పూర్వార్థం గడవగా, యాభై ఒకటవ సంవత్సరంలో, మొదటి మాసంలో, మొదటి పక్షంలో, మొదటి పగటిలో బ్రహ్మకు ప్రాణాయామ కాలం ప్రస్తుతం జరుగుతున్నట్లు చెప్పి తొమ్మిది కల్పాలలోని శ్వేత వరాహ కల్పంలో, పద్నాలుగు మన్వంతరాలలో ఏడవదైన వైవస్వత మన్వంతరంలో-శాలివాహన శకంలో-ఇరవై ఎనిమిదవ మహా యుగంలో-కలియుగంలో-ఫలానా సంవత్సరంలో-ఫలానా మాసంలో-ఫలానా తిది రోజున, ఈ సుముహూర్త సమయంలో శ్రీ లక్ష్మీనారాయణ ప్ర్రీతి కోసం సర్వాలంకార భూషితైన ఈ కన్యను దానం చేస్తున్నాను అని కన్యా దాత చెప్పే సంకల్పం ఇది. ఈ కన్యాదానం వల్ల తనకు బ్రహ్మ లోకంలో నివసించే యోగ్యత సిద్ధించాలని, అగ్ని,స్తోమ, వాజపేయాది యాగాలు చేసిన పుణ్య ఫలం లభించాలని, తనకు వెనుక- ముందు పది తరాల వాళ్ళు బ్రహ్మ లోకంలో నివసించాలని కన్యా దాత సంకల్పం చేస్తాడు.

కన్యాదానం

ఇక ఆ తర్వాత, "కన్యా దానం" తంతు, అంటే, ముహూర్తం సమయం దగ్గరపడుతున్నదని అర్థం. "కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం! దాస్వామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోక జగీషియా" !! అన్న వాక్యాలు పురోహితుడి నోటి వెంట వస్తాయి. దీని అర్ధం-"ఈమె బంగారం వంటి మనస్సు కలది. కనకం వంటి శరీర చాయ కలది. శరీరమంతా ఆభరణాలు కలిగినది. నా పిత్రాదులు సంసారంలో విజయం పొంది శాశ్వత ప్రాప్తి పొందినట్టు శృతి వలన విన్నాను. నేనూ ఆ శాశ్వత బ్రహ్మలోకప్రాప్తి పొందేందుకు విష్ణురూపుడైన నీకు నా పుత్రికను కన్యాదానం చేస్తున్నాను" అని కన్యా దాత అంటారు. ఇంకా ఇలా చెప్పారు కన్యా దాత: " సమస్త ప్రపంచాన్ని, అఖిలాండ బ్రహ్మాండాలను భరించే శ్రీ మహావిష్ణువు-పంచభూతాల-సర్వ దేవతల సాక్షిగా, పితృదేవతలను తరింపచేసేందుకు, ఈ కన్యను దానం చేస్తున్నాను. సౌశీల్యం కలిగి, బుద్ధిమంతుడి వైన నీకు, ధర్మార్థ కామాలు సిద్ధించేందుకు, సాలంకృత సాధ్వియైన ఈ కన్యను సమర్పించుకుంటున్నాను". ఇలా అంటూ, మామ గారు (కన్యా దాత) (వరుడి) చేతిలో నీళ్లు పోసి మరో మాటంటారు. "నీకు దానం చేసినప్పటికీ, ఈ కన్య నా కుమార్తే సుమా!" అని. ఇలా అంటూనే, "ధర్మేచ, అర్థేచ, కామేచ, ఏషా నాతి చరితవ్యా" అని ప్రతిజ్ఞ చేయిస్తారు కన్యా దాత వరుడితో. దీనికి సమాధానంగా, "నాతి చ రామి" అని వరుడితో చెప్పించారు. సుముహూర్తం వచ్చేస్తున్నదనె దీనర్థం.

"జీల కర్ర- బెల్లం"

వధూ-వరులను కళ్యాణ వేదికపై, తూర్పు-పడమర ముఖంగా కూచోబెట్టి, మధ్య ఉత్తర-దక్షిణ ముఖంగా తెరను అడ్డం పెట్టి, ఇరువురి చేతికి "జీల కర్ర- బెల్లం" కలిపిన ముద్దను ఇస్తాడు పురోహితుడు. పెళ్ళిచూపుల కార్యక్రమం పూర్తి అయిన పిదప, అమ్మాయి-అబ్బాయిల జాతకాల ననుసరించి జ్యోతిష్యంలో అనుభవమున్న పండితులతో పెళ్ళికి తగిన ముహూర్తం నిర్ణయించ బడుతుంది. వారు నిర్ణయించిన ముహూర్తానికి వరుడు-వధువు ఒకరి తలపై ఇంకొకరు "జీలకర్ర-బెల్లం" పెట్టడం జరుగుతుంది. నిజానికిదే సుముహూర్తం (జీల కర్ర-బెల్లం శిరస్సుపై వుంచడం). మంగళ వాయిద్యాలు మోగిస్తుంటే, పురోహితుడు మంత్రాలు చదువుతుంటే, గౌరీ దేవిని ధ్యానించుకుంటూ వధువు, వరుడు ఏక కాలంలో నిర్ణయించిన ముహూర్తానికి ఒకరి శిరస్సు మీద మరొకరం (బ్రహ్మ రంధ్రం మీద) జీల కర్ర-బెల్లం కలిపిన ముద్దను వుంచుకుంటారు. సుముహూర్త కాలంలో పెద్దల ఆశీర్వాదాన్ని పొందుతారు. పురోహితుడి తర్వాత, తల్లి-తండ్రులతో మొదలయ్యి, పెద్దలందరూ అక్షితలు చల్లుతారు దంపతులు మీద.

జీల కర్ర-బెల్లం ముద్దను వధూవరులు పెట్టుతున్న సమయంలో, పురోహితుడు చదివిన మంత్రానికి, "వరుణుడు, బృహస్పతి, మీకు శాశ్వతమైన స్థానాన్ని ఇచ్చెదరు గాక ! అగ్ని దేవతలు మిమ్ములను దీవించెదరు గాక ! పంచభూతాలు స్థిరంగా వుండు గాక ! ఈ సుముహూర్తం మీకు శుభ ముహూర్తం అగుగాక !" అని అర్థం వస్తుంది. జీల కర్ర-బెల్లం మిశ్రమంలో పరస్పరాకర్షణ వుంటుందని మన పెద్దలు చెప్పడమే కాకుండా, శాస్త్రజ్ఞులు కూడా అంగీకరించారు. ఇక వధూవరులమైన మేమిద్దరం, ఆ తర్వాత, సకల దేవతలకు నమస్కరించి, "నూతన దంపతులమైన మా ఇరువురి ప్రేమానుబంధం చాలా గొప్పది. మా బంధాన్ని పితృదేవతలు కూడా ఆశీర్వదించారు. వారి ఆశీస్సులతోనే మేం భార్యా-భర్తలం అయ్యాం. ఈ శుభ సమయంలో బంధువులైన మీరందరూ ఆనందంగా వుండండి. వధువు బంధువులు కొద్దిగా మానసిక ఆందోళనకు గురికావడం సహజమే" అని మంత్రాల ద్వారా పురోహితుడు అనిపిస్తాడు. ఇక ఇక్కడినుంచి మాంగల్య ధారణ తంతు మొదలవుతుంది.

మాంగల్య ధారణ-తలంబ్రాలు

వివాహం అయినప్పటి నుంచీ, మహిళలు "మంగళ సూత్రం" ధరించడం భారతీయ సంప్రదాయం-హిందువుల ఆచారం. ఈ ఆచారం ఈనాటిది కాదు. పెళ్ళి నాడు వరుడు వధువుకు తాళికట్టే సాంప్రదాయం అనాదిగా వస్తున్నది. మంగళ సూత్రం అనే శబ్దం సంసృతం నుండి పుట్టింది. సంసృతంలో 'మంగళ' అంటే శోభాయమానం అని, శుభప్రదం అనీ అర్ధాలున్నాయి. సూత్రం అంటే తాడు ఆధారమైందని అని అర్థం. సాధారణంగా మంగళసూత్రాన్ని సన్నని పోగులు, దారాలు కలిపి దానికి పసుపు రాసి తయారు చేస్తారు. ఇలా కలపబడిన తొమ్మిది లేదా పదకొండు దారాలతో (లేదా ఎవరెవరి ఆచారం ప్రకారం వారి పద్ధతిలో) తాళిని తయారు చేస్తారు. మంగళ సూత్ర ధారణకు ముందు, మేనమామ గారు పెట్టిన "మధు పర్కం చీరె" ను, వధువుతో ధరింపచేస్తారు. వధూవరులు ఇద్దరూ మధుపర్క ధారణతో మంగళ సూత్ర ధారణ కార్య క్రమానికి సిద్ధమవడం ఆచారం.

సమస్త శుభాలకు, మంగళ ప్రదమైన కర్మలకు నిలయమైంది కాబట్టి, దీనికి, మంగళ సూత్రం అని పేరొచ్చింది. మంగళ సూత్రాలకు గౌరీ దేవి అనుష్టాన దేవత. దీన్నే "శత మానములు" అని కూడా అంటారు. బంగారంతో చేయబడ్తాయివి. రెండు సూత్రాలలో (శత మానములు) ఒకటి అత్తింటి వారు, ఇంకోటి పుట్టింటి వారు చేయించడం ఆచారం. మంగళ వాయిద్యాలు మారుమోగుతుంటే, పురోహితుడు ""మాంగల్యం తంతునానేనా మమజీవన హేతునా ! కంఠే మిద్నామి సుభగే త్వం జీవ శరదాం శతం !!"" అని చదువుతుంటే, వరుడితో మంగళ సూత్రాన్ని, వధువు మెడలో ధారణ చేయించుతారు, పురోహితుడు మూడు ముళ్లు వేయమంటారు. మూడు ముళ్లంటే, మూడు లోకాలకు, త్రిమూర్తులకు, సత్వ-రజ-తమో గుణాలకు సంకేతం. చదివిన మంత్రానికీ అర్థముంది-"ఓ సుందరీ ! ఈ మంగళ సూత్రాన్ని, నీ మెడలో కడుతున్నాను. ఇది సౌభాగ్యాన్ని కలిగిస్తుంది. నా జీవితం దీనిపైనే ఆధారపడి వుంది. నీవు శతాయుర్ధాయం కలదానివిగా వుండు" అని. మంగళ సూత్ర ధారణ అవుతూనే వేద పండితులు ఆశీర్వదించుతారు."శతమానం భవతి, శతాయుః పురుష !" అనే మంత్రాన్నీ చదువుతారు. అందుకే, వీటికి "శత మానములు" అని పేరొచ్చింది.

పుట్టినింటికి, మెట్టినింటికి గౌరవ మర్యాదలు-పరువు ప్రతిష్టలు స్త్రీల వలనే లభిస్తాయి. పుట్టింట్లో పెరిగి, అత్తగారింటికి చేరి, బరువు-బాధ్యతలు స్వీకరించిన స్త్రీకి పుట్టిల్లు-అత్త గారిల్లు రెండు కళ్ల లాంటివి. ఉభయ వంశాలకు మంచి కీర్తిని చేకూర్చి పెట్టగలను అని తెలియ చేసేందుకే రెండు సూత్రాలను మహర్షులు నిర్ణయించారని హిందువుల నమ్మకం. భర్త సుఖ దుఃఖాలు తనవేనని, పుట్టింటి-అత్తింటి వారి మంచి-చెడులు తనవేనని, ధర్మ మోక్షాలు-అర్థ కామాలు తన సంబంధం ద్వారా భర్తకు లభింప చేయనున్నానని, సంపదకు-సంతానానికి తనే కారణమవుతాననే విషయాలు ఎల్లవేళలా గుర్తుండే విధంగా ప్రవర్తించడానికి మంగళ సూత్రాలను వధువు ధరిస్తుందని హిందువుల నమ్మకం.

మాంగల్య ధారణ అనంతరం అత్యంత కోలాహలంగా-ఇరువైపు బంధుమిత్రుల మధ్య పోటీలాగా జరిగే తంతు వధూ-వరులు "తలంబ్రాలు" పోసుకోవడం. ఎందుకంటే, వధూవరులుతో పాటు, బంధుమిత్రులకు కూడా చక్కటి వినోదాన్ని-ఆనందాన్ని కలిగించే కార్యక్రమం ఇది. మంగళ సూత్ర ధారణ పూర్తైన తరువాత తలంబ్రాల అక్షతలు తల మీదుగా పోసుకోవడం హిందూ సాంప్రదాయం. దీనిని అక్షతా రోహణం అని కూడా అంటారు కొందరు. 'క్షత' అంటే విరుగునది-'అక్షత' అంటే విరగనిది. అంటే, "వివాహ బంధం" విడదీయరాని బంధం కావాలని భావం. "తలన్+బ్రాలు" అంటే తల నుండి క్రిందికి జారేవి అని కూడా అర్థం. అర్థాలు ఏవైనా, ఇదొక ఆనంద ప్రదమైన ఆచారం. వధూవరుల గృహస్థా శ్రమ జీవితం శుభప్రదంగా, మంగళ ప్రదంగా వుండాలని "మంగళ ద్రవ్యాలతో" చేయించే పవిత్రమైన వైదిక ప్రక్రియ ఇది. పసుపు-బియ్యం-నెయ్యి-ఆవు పాలు అనే మంగళ ద్రవ్యాలతో ఈ తంతు జరిపిస్తారు.

కన్యను దానం చేస్తున్నానని పలికేవాడు అగ్ని. తథాస్తు అనే వాడు వాయువు. దంపతులు చాలా బాగున్నారని అనే వాడు చంద్రుడు. ఇవన్నీ నిజమే అని వంత పలికే వాడు-ఆనందించే వాడు సూర్యుడు. ఇవన్నీ అర్థం వచ్చే రీతిలో పురోహితుడు చెపుతున్న మంత్రాల మధ్య, వరుడి చేతితో కొబ్బరి చిప్పలో తీయించిన తలంబ్రాలు వధువు తలపైన మొదలు పోయిస్తారు. "నీవలన నాకు సంతానం అభివృద్ధి చెందుగాక" అని వరుడితో అనిపించుతారు. దానికి వధువు సమాధానం చెప్పకుండా, అంగీకార సూచకంగా, పురోహితుడు చెప్పిన పద్ధతిలో, వరుడి లాగనే తలంబ్రాలు తీసుకొని, వరుడి శిరస్సుపై పోస్తుంది. మొదటిసారి అలా పోస్తున్నప్పుడు, "పుట్టబోయే సంతానానికి పాల కొరకు" అన్న అర్థం వచ్చే రీతిలో, "నా పశు సంపద అభివృద్ధి చెందుగాక" అని వధువుతో అనిపించుతారు. దీనికి అంగీకార సూచకంగా వరుడు తలంబ్రాలు పోయాలి. ఇలా మూడు పర్యాయాలు ఇలాంటి అర్థస్ఫూర్తిగల మంత్రాల చదువుతుంటే, వధూవరులు తలంబ్రాలు పోసుకుంటారు. చివరికి అదొక పోటీలాగా ఒకరి శిరస్సుపై మరొకరు పోసుకోవడం ఇటీవలి కాలంలో ఆచారంగా మారింది. తలంబ్రాల పళ్లెం ఎత్తి శిరస్సుపై కుమ్మరించడం కూడా పరిపాటై పోయింది. ఈ తంతు ముగిసిన తర్వాత, "బ్రహ్మ ముడి" వేడుక జరుగుతుంది. వధువు చీరె కొంగు అంచును, వరుడి ఉత్తరీయం అంచుకు కలిపి ముడివేస్తారు. బ్రాహ్మణుల ఆశీర్వచనాలను దంపతుల కొంగులలో ముడి వేయడం అనే భావన వుందిందులో. ఇకనుంచి, ఇరువురు కలిసి-మెలిసి అన్ని కార్యక్రమాలు నిర్వహించాలని, "ఇంటి యజమానురాలు" గా అన్ని బాధ్యతలు స్వీకరించి, నీ ఇంటిని నువ్వే చక్కదిద్దు కోవడానికి రమ్మని, వేద మంత్రాల ద్వారా వధువుని కోరుతాడు వరుడు.

స్థాళీపాకం-సప్తపది-నాగవల్లి-సదశ్యం

తలంబ్రాల కార్య క్రమం, బ్రహ్మ ముడి వేయడంతో ఇక వధూవరులను వివాహ వేదిక పైనుంచి కిందికి దింపుతారు. సాధారణంగా గౌరీ పూజ జరిపించిన చోటనో, లేకుంటే మరో అనువైన స్థలంలోనో, హోమం ఏర్పాటు చేసి స్థాళీపాకం వేడుక జరిపిస్తాడు పురోహితుడు. ఇందులో భాగంగా హోమం దగ్గర అన్నం వండించే పని, ఆ తర్వాత సప్తపది వుంటుంది.

వివాహంలో సప్తపది అతి ముఖ్యమైన ఘట్టం. పరమ పావన మూర్తి అగ్నిహోత్రుడి సాక్షిగా, అగ్నిహోత్రుడి చుట్టూ, పాణి గ్రహణం తర్వాత వధూవరులిద్దరు, వధువు కుడి కాలి అడుగుతో ఆరంభించి, ఏడు అడుగులు వేయిస్తారు. దీనిని సప్తపది అని అంటారు. వధువుతో కలిసి ఏడడుగులు వేస్తూ వరుడు, ఏడు కోరికలను వివరిస్తాడు. అనంతరం వధువు తన అంగీకారాన్ని తెలియ పరుస్తుంది. ఇది గృహస్థా శ్రమ స్వీకారానికి పరమావధి. సప్తపది పూర్తైన తర్వాతనే, వధువు గోత్రం-ప్రవర-ఇంటి పేరు, వరుడి గోత్రం-ప్రవర-ఇంటి పేరు గా మారుతుంది. వధూవరులు కలిసి అడుగులు వేస్తున్నప్పుడు, భారతీయ-హిందూ సాంప్రదాయ వివాహ విధానాన్ని, అందులోని గొప్పదనాన్ని విశదపరిచే మంత్రాన్ని చదువుతారు. అందులో, "ఓ చిన్నదానా ! నీవు నన్ను అనుసరించి నడువు. నీవు నడిచేటప్పుడు శ్రీ మహా విష్ణువు, మొదటి అడుగులో అన్నాన్ని-ఐశ్వర్యాన్ని, రెండవ అడుగులో శారీరక-మానసిక బలాన్ని, మూడవ అడుగులో మంచి పనులు చేయాలన్న సంకల్పాన్ని-ఉత్తమ కర్మనూ-శ్రద్ధనూ, నాలుగవ అడుగులో కర్మ ఫలాన్నీ-సుఖాన్నీ-ఆనందాన్నీ, ఐదవ అడుగులో పశు సమృద్ధినీ-ధన ధాన్యాలనూ, ఆరవ అడుగులో మంచి సంతానాన్నీ, ఏడవ అడుగులో ఇద్దరి ఆధ్యాత్మిక చింతనకు తగు రక్షణను మనకు కలిగించుగాక" అన్న అర్థం స్ఫురిస్తుంది.

వధువును అగ్నికి తూర్పునకుగానీ, ఉత్తరం నకుగానీ, ఏడు మంత్రాలతో, ఏడు అడుగులు నడిపించుతున్న వరుడితో జపం-హోమం చేయించుతారు. ఇక్కడే చెప్పిన మరో మంత్రంద్వారా వధూవరులిద్దరు, ఇకనుంచి స్నేహితులం అన్న అర్థం కూడా వుంటుంది. "మన ఇద్దరం స్నేహితులం. నీవు నాతో ఏడడుగులు నడవడంతో మన ఉభయులకు మైత్రి కలిగింది. నీ చేతిని నేనెప్పుడూ విడవను-నన్ను నీవు కూడా విడవవద్దు. మంచి మనస్సుతో అన్నోదకాలను స్వీకరించి ఆరోగ్యంగా ఐశ్వర్యాన్ని అనుభవించుదాం. పరస్పరం చర్చించుకొని కుటుంబ పనులను నెరవేరుద్దాం. అనుకూల దంపతులమై సంసార యాత్ర కొనసాగించుదాం. నువ్వు భూమివి-నేను ఆకాశాన్ని. నువ్వు వాక్కువు-నేను మనస్సును. నేను చేసే ధర్మ కార్యాలకు నీ సహకారం కావాలి. యోగ్యమైన సంతానాన్ని-సంపదను మనం ఇద్దరం కలిసి అనుభవించుదాం" అని దానర్థం. " రాత్రి గాని, పగలు గాని, ఎల్ల వేళలా సుఖ సంతోషాలతో నువ్వుండాలి నీకు ఎటువంటి ఇబ్బందీ కలగరాదు. సుమంగళివై-సత్ సంతానంతో గృహలక్ష్మివై, అభివృద్ధి చెందాలి" అని రక రకాలుగా అనునయించే మాటలివి.

సప్తపది తర్వాత మరో ముఖ్యమైన వివాహ వేడుకలు, నాగవల్లి-సదశ్యం. ఆ తర్వాత అప్పగింతల కార్యక్రమం. సదశ్యంలో బ్రాహ్మణులకు కానుకలు, వధూవరులకు బట్టలు పెట్టే కార్యక్రమం వుంటుంది. నాగవల్లిలో పెళ్లి కూతురుకు భర్తతో కాలి మెట్టెలు తొడిగించే కార్యక్రమం, గుచ్చిన నల్లపూసల తాడును వధువు మెడలో కట్టించే కార్యక్రమం జరిపించుతారు. నల్ల పూసలతాడును కూడా మూడు ముళ్లు వేయించుతారు. ఇక వధూవరులతో కలిసి సమీప బంధుమితృల కోలాహలం మధ్య "భుజం బంతి భోజనాల" హడావిడి వుంటుంది. వధూవరులిద్దరిని పక్క-పక్కన కూచోబెట్టి, వెండి కంచాలలో ఇరువురికీ భోజనాలు వడ్డించి, వరుసకు బావా-మరదళ్లలాంటి వారి వేళా-కోళాల మధ్య భోజన చేయడం ఆరంభించుతారు అందరూ. మధ్యలో పాటలు, వధూవరులు ఒకరి కంచంలోది మరొకరి కంచంలో వుంచడం, పక్క వారందరూ తినమని బలవంతం చేయడం అక్కడ జరిగే వేడుక.

ఉంగరాలు తీయడమనే "ప్రధానాంగుళీయకం" వేడుకలో మూత కురుచగా ఉండే చిన్న బిందెలో పాలూ, నీళ్ళూ పోసి, దానిలో మెట్టెలు, ఒక బంగారు ఉంగరాన్ని వేసి పురోహితుడు చెప్పగానే గభాలున దానిని తీయడానికి వధూవరులు ప్రయత్నించే తంతుంటుంది. వుంగరం దొరికిన వారు వేరొకరికి తొడుగుతారు. చూడటానికి సరదాగా కన్పించే ఇది కేవలం అప్పటిదాకా పరిచయం లేని వదూవరులకు స్పర్శ తాలూకు సాన్నిహిత్యాన్ని తెలియచేయడానికి ఉద్దేశించబడిన కార్యక్రమం. ఇక్కడా బంధుమితృల కోలాహలం చోటుచేసుకుంటుంది. ఆ కాసేపు అది ఇరు పక్షాల వారి మధ్య ఒక నిజమైన పోటీలా జరుగుతుంది.

అప్పగింతలు-గృహ ప్రవేశం

కన్యా దాత ఇంట్లో జరిగే వేడుకల్లో "అప్పగింతలు" కార్యక్రమం అన్నింటిలోకి చివరిది-ఉద్వేగ భరితమైంది. సాధారణంగా పెళ్లి జరిగిన రోజున అర్థరాత్రి దాటింతర్వాత అప్పగింతల మంత్రంతో మొదలవుతుంది కార్యక్రమం. అయితే ఇటీవలి కాలంలో, వసతి గృహాల్లో పెళ్ళిళ్లు జరుపుకోవాల్సిన పరిస్థితుల్లో, వాళ్లిచ్చిన వేళకు మించి అక్కడ వుండడం కుదరనందున, అన్నీ ఆ టైంలోపల జరిపిస్తున్నారు. వధూవరులకు చూపాల్సిన "అరుంధతి" నక్షత్రాన్ని కూడా పట్ట పగలు చూపించి "కనబడిందా?" అని అడుగుతున్నాడు పురోహితుడు. కనబడిందని జవాబిస్తున్నారు వధూవరులు.

భజంత్రీలు అప్పగింతల పాట పాడుతుంటే, పెళ్ళి పీటపై వధువును మధ్యలో కూర్చుండ బెట్టి, పాలలో చేతిని ముంచిన తర్వాత అప్పగింతల తంతు జరుగుతుంది. అప్పగించిన పెద్దలందరికీ బట్టలు పెట్టే తంతుంటుంది. వధువు రెండు చేతులను పాలలో ముంచి వరుని చేతిలో పెట్టి అప్పగించాలి. అప్పగించుతూ: "అష్టవర్షాభవేత్ కన్యా, పుత్రవత్ పాలితా మయా, ఇదానీం తవ దాస్యామి, దత్తా స్నేహేన పాలయా" అంటాడు కన్యా దాత. అంటే, "పుత్రుడితో సమానంగా పెంచిన ఎనిమిది సంవత్సరాల వయసున్న ఈ కన్యను నీకిస్తున్నాను. నీవు ఈమెను ప్రేమాభిమానాలతో కాపాడు." అని దాని అర్థం. అదే మంత్రం చదువుతుంటే, అదే అర్థం వచ్చేలా, అత్తమామలు వరుడి ప్రక్కన కూర్చుని వుంటే, వారికి కూడా వధువు రెండు చేతులు పాలలో ముంచి వారి చేతులో అద్ది, "మీ పుత్రిక వలె కాపాడాలి" అని అప్పగిస్తారు. బహుశా అప్పగింతల ద్వారా, పెళ్లికూతురును అత్తవారింటి వైపు బంధువులందరికీ పరిచయం చేయడం కొరకు, ఈ వేడుకను జరిపిస్తుండవచ్చు.

అప్పగింతల ముందర "వడి కట్టు" వధువుకు కట్టు తారు. వడి కట్టులో శేరుంబావు బియ్యం, వెండి గిన్నె, కొబ్బరి చిప్ప వుంచుతారు. అప్పగింతల కార్యక్రమంలో వధువును అప్పగించే ముందర, "బొమ్మ"ను అప్పగించడమనే, చిన్న వేడుక జరిపారు. ఒక మంచం మీద జంఫఖానా పరిచి, జాకెట్ గుడ్డతో ఊయలలాగా చేసి, అందులో ఈ చెక్క బొమ్మను నిదురిస్తున్న భంగిమలో వుంచుతారు. వధూవరుల కొంగులను కలిపి, అందులో ఎర్ర నీరు ఊయలలోంచి పడే విధంగా పోస్తారు. వధువుతో వరుడికి ఆ బొమ్మనిప్పించి, తాను పనిమీద వున్నాననీ, బొమ్మ రూపంలో వున్న వాళ్ల పాప-బాబును జాగ్రత్తగా చూస్తుండమనీ అనిపిస్తారు. అలా మూడు సార్లనిపించిన తర్వాత, ఆడబిడ్డకు ఆ పనిని అప్పగించుతారు. ఆడ బిడ్డకు బొట్టు పెట్టి, చీరె ఇచ్చి, బొమ్మను చేతిలో వుంచుతారు. ఇదయిన పిదప, అయిదుగురు దంపతులకు వధూవరులతో, (దంపత) తాంబూలాలు ఇప్పించుతారు. పెద్దలందరికీ వీరిరువురితో దండాలు పెట్టిస్తారు.

ఈ అప్పగింతలు చేసేవారికి, చూసే వారిలో చాలామందికి కంట తడిపెట్టిస్తుందనడంలో అతిశయోక్తి కాదు. ఇన్నాళ్లుగా పెంచి పోషించిన కూతురు తమను విడిచి అత్త వారింటికి వెళుతుందని ఆమెను వదలి వుండాలే అనే బాధ కన్నవారికి కలగడం సహజం. అప్పగింతల కార్యక్రమం అనంతరం, పెళ్ళికూతురును లోపటికి తీసుకునిపోయి, పెరుగు అన్నం పెట్టి, దేవుడికి దండం పెట్టించి, బయట ఇంటి సింహద్వారం దగ్గర తల్లి కడుపుపై మజ్జిగతో అద్దించి, గడపకు చేతులతో కొట్టించుతారు. ఇవన్నీఅయ్యాక విడిది గృహ ప్రవేశానికి పంపుతారు. ఇక అంతటితో కన్యా దాత ఇంటినుంచి ముందు జరగాల్సిన వేడుక, విడిదికి-అక్కడినుంచి పెళ్లికొడుకు ఇంటికి మారుతుంది.

హిందూ వివాహం ఆధునిక అర్థంలో చెప్పుకునే సామాజిక వ్యవస్థ మాత్రమే కాదు. మతపరంగా కూడా ఎంతో పవిత్రమైన వ్యవస్థ. పెళ్ళయాక భార్యాభర్తల మధ్య కనిపించని మూడో అనుసంధాన కర్త కూడా ఉంటుంది. అదే దాంపత్య ధర్మం అనే బాధ్యత. అందుకే పెళ్ళి అనేది విడదీయరాని బంధం. దంపతుల మధ్య ఏమైనా పొరపొచ్చాలు వచ్చినా ఆ ధర్మమే వారిని ఒకటిగా కలిపి ఉంచుతుంది.