Tuesday, March 28, 2017

Loans and debts aimed at development : Vanam Jwala Narasimha Rao

Loans and Debts aimed at Development 
Vanam Jwala Narasimha Rao

The three week long Telangana State Legislative Assembly Budget session was adjourned sine die preceded by an extremely dignified, meaningful, efficient and effective deliberations. The House passed the Appropriation Bill, which enables the government to spend in accordance with the grants allocated in the Budget and voted by the House. The Budget Session, which started on March 10, 2017, was conducted in tune with the decisions taken in the Business Advisory Committee (BAC).
Except two minor distractions leading to suspension of two TDP members for interrupting the Governor’s Address and five BJP members for rushing towards the Podium, the entire proceedings went off normally. Prior to the four Budget Sessions held after the Telangana Government came to power, the earlier Budget sessions held under the united AP,  the demands were always guillotined since the grants were never discussed or debated. For the peaceful and meaningful conduct of the current Budget session, both the Government and the Opposition members should be congratulated. Honourable Chief Minister and leader of the House K Chandrashekhar Rao, before commencement of his reply to the debate on the Appropriation Bill mentioned as to how everyone is appreciating the way Assembly Sessions were being conducted and for this he thanked the Members. Speaker S Madhusudhanachary also congratulated and thanked the members for helping him conducting the business properly.
On one or two key issues, the House debated repeatedly. They were also raised during the debate on the motion of thanks to the Governor’s Address, during the debate on the Budget and demands as well as during the discussion on Appropriation Bill. These issues were raised by opposition members, the Chief Minister, the Finance Minister during these debates. One of these issues was on the State’s Growth Rate and other is on the so-called debts incurred and loans raised by the Government as pointed out by the Opposition.
Replying to the debate on the motion of thanks to the Governor’s Address, CM KCR said that, at one point of time when a single party was in power both at the Centre and State, the Central Government alone was in a position to lend loans to the States. CM mentioned about the injustices meted out to Telangana under the united AP, facility to spend State’s own resources for the state itself after the formation of the Telangana, the increased self confidence levels among the people after the State achieved the economic progress leading to ability to generate money, how the State proved that it has the wherewithal to mobilize its own resources, mapping of financial and human resources, etc. The CM also underlined the need to have the mindset to discriminate what is good and what is bad in a democracy.
BJP leader G Kishan Reddy participating in the discussion on motion of thanks to Governor, found fault with the government, for mentioning about improved growth rate. He accused the government of misleading the people through the Assembly. He also termed the Budget as magic of numbers. On raising the debts and loans, Kishan Reddy said this is not Bangaru Telangana (Golden Telangana) but a Bakila Telangana (Telangana of Debts). The budget figures and growth rate are inflated for enhanced FRBM limit alleged Kishan Reddy. He further alleged that the entire state is in debt trap for the last three years and common man is pushed into deep debts. He argued that the Debt servicing became a burden and that the Budget roamed in a dream world.  Leader of the Opposition K Jana Reddy also spoke on similar lines.  On whether to borrow or not, Jana Reddy said there was nothing wrong in incurring debts but the problem is that if debts exceed the assts it will lead to inflation.  He also reeled out statistics to show that under the Congress rule in the then AP assets always exceeded the debts. He also found fault with the government’s claim that the development has crossed the state borders. He said,” Budget may have crossed the seven seas but development is standstill. Budget was not based on facts but was more of creating confusion among the people.

Initiating the debate on Budget, Congress Member Uttam kumar Reddy said the Budget was jugglery of figures and that Growth was shown boosting the figures. He said there is a lot of increasing in debts and debts raised by giving government guarantees also on the increase, which was not good for the state or its economy. “What kind of signals it is showing?” he asked.
In his reply, the CM admitted that the government is certainly raising loans and incurring debts. “We are raising loans, but, utilizing them for useful purposes and repaying them in yearly installments. We have budgeted Rs 20,000 Crore this year for the debt servicing,” he said.  CM said that the fact that the state is able to raise loans is ample proof for its economic buoyancy, financial capacity and fiscal efficiency. By God's grace the state economy is intact and every year the growth rate will be 15 per cent. For the charges leveled by the Opposition that debts have increased, the CM cited the example of Nagarjuna Sagar Project.  The initial proposals for the project were only Rs 92 Crore. Now it’s worth of about Rs 92,000 Crore. The money value then and now are vastly different.  Based on the present value the quantum of debts will be more, he explained.
The CM also rebutted the observations made by Uttam Kumar Reddy that the government had boosted the figures in Budget to raise more loans. The CM explained in detail how financial and economic trend are subjected to change in tune with times and how monetary value is also changing. He said based on the ever-changing necessities the loans are raised and assets are created. World leading countries like the US and China which are dictating the universal economy also raising loans and incurring debts said CM. We have to raise loans to implement various schemes and it would be crime if we fail to spend the money even though we have to ability to do so explained CM. Eminent Economists world wide are talking about the wisdom of economy and the world over have several economic models such as the Amartya Sen’s and the US’s. CM said that among the available Economic Models, the State is adopting its own Mixed Economy Model. He also justified boosting up the figures by saying that, it only shows the ability to visualize higher goals and there is nothing wrong to be optimistic in achieving targets.

With his timely interventions as and when the issue of growth rate and debts was raised by opposition, the CM was able to send a message to the people through the House and through the members and these are useful for the development of the state. END

Monday, March 27, 2017

అభివృద్ధి కోసమే అప్పులు : వనం జ్వాలా నరసింహారావు

అభివృద్ధి కోసమే అప్పులు
వనం జ్వాలా నరసింహారావు
నమస్తే తెలంగాణ దినపత్రిక (28-03-2017)

అత్యంత హుందాగా, సమర్థవంతంగా, అర్థవంతంగా సుమారు మూడు వారాల పాటు జరిగిన తెలంగాణ రాష్ట్ర శాసన సభ బడ్జెట్ సమావేశాలు నిరవిధకంగా వాయిదాపడ్డాయి. సభ ఆమోదించిన వివిధ శాఖల పద్దుల మేరకు ప్రభుత్వం నిదులను ఉపయోగించేందుకు అవసరమైన ద్రవ్య వినియోగ బిల్లుకు ఆమోదం లభించింది. మార్చ్ పదవ తేదీన ప్రారంభమైన బడ్జెట్ సమావేశాలు బీఏసీ లో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా కొనసాగాయనే అనాలి. 

గవర్నర్ ప్రసంగం మధ్యలో బీఏసీ నిర్ణయానికి విరుద్ధంగా ప్రవర్తించారనే కారణాన ఇద్దరు తెలుగుదేశం శాసన సభ్యుల సస్పెన్షన్, చివరి రోజుల్లో పోడియంలోకి వెళ్ళిన బీజేపీ సభ్యుల సస్పెన్షన్ మినహా మిగతా కార్యకలాపాలన్నీ ఆటంకం లేకుండానే జరిగాయనాలి. తెలంగాణ ఏర్పాటైన తరువాత జరిగిన ఈ నాలుగు బడ్జెట్ సమావేశాలకు ముందు ఉమ్మడి రాష్ట్రంలో పద్దులన్నీ చివరలో గెలిటిన్ అయ్యాయే కాని, చర్చ జరిగి ఆమోదించడం జరిగిన సందర్భాలు లేవనే అనాలి. దీనికి ప్రభుత్వ, ప్రతిపక్ష సభ్యులందరినీ అభినందించాలి. ద్రవ్య వినియోగ బిల్లుపై జరిగిన చర్చకు సమాధానం ఇచ్చే ముందర, సీఎం, రాష్ట్ర శాసన సభా కార్యకాలాపాల విషయంలో ఎలా పలువురు హర్షామోదాలు తెలుపుతున్నారో చెప్పి, దానికి సభ్యులందరికీ ధన్యవాదాలు చెప్పారు. సభాపతి సహితం సభను వాయిదా వేయడానికి ముందర సభ్యులందరికీ, సభను హుందాగా నడిపినందుకు కృతజ్ఞతలు తెలియచేశారు.

          శాసన సభ కార్యకలాపాల్లో ఆద్యంతం ఒకటి రెండు విషయాల మీద అనేక పర్యాయాలు చర్చ జరిగింది. అవే అంశాలను గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే సందర్భంలోను, బడ్జెట్ పైనా-పద్దుల పైనా చర్చ జరిగే సందర్భంలోను, చివరకు ద్రవ్య వినియోగ బిల్లుకు ఆమోదం తెలపడానికి జరిగిన చర్చ సందర్భంలోను పలువురు గౌరవ సభ్యులు, ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి లేవనెత్తారు. వాటిలో ఒకటి తెలంగాణ రాష్ట్రం సాధించిన వృద్ధి రేట్ కాగా, మరోటి రాష్ట్రం చేసిందని పలువురు ప్రతిపక్ష సభ్యులు ప్రస్తావించిన ప్రభుత్వ అప్పుల సంగతి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే సందర్భంలో మాట్లాడిన సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు, ఒకానొక రోజుల్లో అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రాలలోనూ, ఒకే పార్టీ అధికారంలో వున్న సమయంలో, కేంద్ర ప్రభుత్వం మాత్రమే రాష్ట్రాలకు అప్పులిచ్చే స్తోమత వుండేదనీ, అప్పట్లో అలా ఇవ్వ గలిగే పరిస్థితులుండేవనీ అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు జరిగిన అన్యాయం, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన దరిమిలా రాష్ట్ర నిధులు రాష్ట్రమే వాడుకునే వెసలుబాటు, తెలంగాణ సాధించిన ఆర్థిక అభివృద్ధి వల్ల ప్రజల్లో పెరుగుతున్న ఆత్మ విశ్వాసం, ప్రభుత్వం తమ అవసరాలకు ఏ విధంగానైనా డబ్బు సమకూర్చుకొనగలదనే ధీమా ప్రజలకు కలగడం, గణనీయమైన గ్రోత్ సాధించడమంటే ప్రభుత్వానికి తగినంత శక్తి సామర్థ్యాలున్నాయని నిరూపణ కావడం, గతంలో లేని విధంగా రాష్ట్ర వనరుల, మానవ వనరుల మాపింగ్....లాంటి విషయాలను ప్రస్తావించారు. ప్రజాస్వామ్యంలో మంచిని మంచనీ, చెడును చెడనీ చెప్పగలిగే విచక్షణ వుండాలనే అభిప్రాయాన్ని కూడా సీఎం వ్యక్తం చేశారు.


          గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం మీద మాట్లాడిన బీజేపీ శాసన సభ సభ్యుడు కిషన్ రెడ్డి "భారీ బడ్జెట్ కాదిది...బడాయి బడ్జెట్" అంటూ వృద్ధి రేటు మెరుగైందని ప్రభుత్వం చెప్పడాన్ని తప్పుబట్టారు. శాసన సభ సాక్షిగా ప్రజలను మభ్యపెట్తున్నారని వ్యాఖ్యానించారు...అంకెల గారడీ అన్నారు...ఎఫ్.ఆర్.బీ.ఎం పరిమితి పెంచుకోవడం కోసం లెక్కలన్నీ పెంచి చూపిస్తున్నారన్నారు. అప్పుల ప్రస్తావన తెస్తూ...ఇది బంగారు తెలంగాణ కాదు...బాకీల తెలంగాణ అన్నారు. గత మూడేళ్లలో అప్పులు విపరీతంగా పెరిగాయనీ, సగటున మనిషి అప్పు పెరిగందని, వడ్డీ చెల్లింపులు కూడా పెరిగాయనీ, బడ్జెట్ అంతా ఊహాలోకంలో విహరించేదిగా వుందనీ అన్నారు కిషన్ రెడ్డి. ప్రతిపక్ష నాయకుడు జానారెడ్డి కూడా ఇదే తరహాలో విమర్శించారు. ప్రభుత్వం చేస్తున్న అప్పుల విషయం ప్రస్తావించిన జానారెడ్డి, అప్పులు చేయడం సరైందా? కాదా? అని ప్రశ్నించి, అప్పులు చేయడానికి అభ్యంతరం వుండకూడదు కాని, అప్పులు-ఆస్తులు బేరీజు వేసుకోకుండా, ఆస్తులకంటే అప్పులు అధికంగా చేయడం ద్రవ్యోల్బణానికి దారి తీస్తుందని అన్నారు. ఎలా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అప్పులకంటె ఆస్తులు ఎక్కువగా వుండేవీ, ఎలా తమ ప్రభుత్వాలు అప్పులు తీర్చుకుంటూ, ఆస్తులు పెంచుకుంటూ పోయిందీ లెక్కలతో సహా వివరించారాయన. "ఎల్లలు దాటిన అభివృద్ధిని రాష్ట్రం సాధించింది"అనడం తప్పుబట్టిన జానారెడ్డి, బడ్జెట్ సప్తసముద్రాలు దాటిందేమో కాని అభివృద్ధి ఎక్కడిదక్కడే వుందని అన్నారు. మొత్తం మీద "బడ్జెట్ గందరగోళంగా, ప్రజల్ని భ్రమించేదిగా, ఆశలపల్లకిలో ఊరేగించేదిగా వుందికాని వాస్తవాల మీద లేదు" అని వ్యాఖ్యానించారు.

            ద్రవ్య వినియోగ బిల్లు సభ ఆమోదానికి జరిగిన చర్చను ప్రారంభించిన కాంగ్రెస్ సభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మళ్లీ వృద్ధి రేట్ అంశాన్ని ప్రస్తావించారు. "గ్రోత్" ను "బూస్ట్" చేసి చూపుతున్నారని, బడ్జెట్ అంకెలు కూడా బూస్ట్ చేసారని, అంకెల గారడీ అని, రాష్ట్ర భవిష్యత్ కు ఇది మంచిది కాదని, రాష్ట్ర ప్రభుత్వ అప్పులు పెరిగిపోతున్నాయని, ప్రభుత్వం గారంటీగా వుండి చేసే అప్పులు కూడా పెరిగిపోతున్నాయని, ఇది దేనికి సంకేతం అని అడిగారు. సమాధానంగా సీఎం తమ ప్రభుత్వం అప్పులు చేస్తున్న మాట వాస్తవేమనీ, ఐతే, అప్పులు చేస్తూ, సద్వినియోగం చేసుకుంటూ, ప్రతి సంవత్సరం విడతలుగా చెల్లించుకుంటూ పోతున్నామని అన్నారు. ఈ సంవత్సరం బడ్జెట్ లో అప్పుల చెల్లింపుకు రు. 20, 000 కోట్లు కేటాయించినట్లు కూడా చెప్పారాయన. అప్పులు చేయడమంటే తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సామర్థ్యానికి, ఆర్థిక పరిపుష్టికి సంకేతమని సీఎం అన్నారు. భగవంతుడి దయవల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థి అత్యంత మెరుగ్గా వుందని, ఎట్టి పరిస్థితుల్లోనూ 15% వృద్ధి రేట్ వుండి తీరుతుందని ఆయన స్పష్టం చేశారు. గతంలో తక్కువ అప్పులుండేవనీ, ఇప్పడవి పెరిగాయనీ ప్రతిపక్షాలు చేసిన విమర్శకు సమాధానంగా, సీఎం, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఉదాహరణ చెప్పారు. ఆ ప్రాజెక్ట్ మొట్టమొదటి అంచనా కేవలం రు. 92 కోట్లేనని, ఇప్పుడు రు. 92, 000 కోట్లకంటే ఎక్కువ వుంటుందనీ, అప్పట్లో డబ్బు విలువకు, ఇప్పటి డబ్బు విలువకు చాలా వ్యత్యాసం వుందనీ, సహజంగానే ఇప్పటి విలువకు అనుగుణంగా అప్పుల మొత్తం అధికంగానే వుంటుందనీ స్పష్టం చేశారు సీఎం.

          ప్రభుత్వం బడ్జెట్ అంకెలను పెంచి చూపించి అప్పులను చేయడానికి పూనుకుంటున్నదని ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన విమర్శను కూడా సీఎం వ్యతిరేకించారు. ఆర్థిక శాస్త్రంలో, అర్థ శాస్త్రంలో, ధోరణులు ఎప్పటికప్పుడు ఎలా రూపాంతరం చెందుతున్నాయో చెప్పిన సీఎం, ధనం విలువ మారుతున్నదనీ, అవసరాలు పెరుగుతున్నాయనీ, అవసరాలకనుగుణంగా అప్పులు చేయడం, ఆ చేసిన అప్పుల ఆధారంగా ఆస్తులు సమకూర్చుకోవడం జరుగుతున్నదనీ వివరించారు. ఆర్థికంగా అభివృద్ధి చెందితేనే అప్పు పుట్తుందని అన్నారు. అత్యంత ధనిక దేశమైన అమెరికా, చైనాలతో సహా, ప్రపంచా ఆర్థిక రంగాన్ని శాసించే పలు దేశాలు అప్పులు చేస్తున్నాయని చెప్పారు. పథకాలకు అవసరమైన డబ్బు సమకూర్చుకోవడానికి అప్పు చేయాల్సి వస్తే చేయాల్సిందేనని, డబ్బు ఖర్చు పెట్టగలిగీ పెట్టకపోతే అది నేరమనీ సీఎం స్పష్టం చేశారు. ఆర్థిక విజ్ఞత, వివేచన, వైదుష్యం, వివేకం, జ్ఞానం అనే విషయాలను ప్రపంచ వ్యాప్తంగా వున్న అనేకమంది ఆర్థిక శాస్త్రవేత్తలు, వివిధ కోణాల్లో రూపకల్పన చేసారనీ, ప్రస్తుతం, అమెరికన్ ఆర్థిక నమూనా అని, అమర్త్యసేన్ ఆర్థిక నమూనా అని, ఇంకా మరికొన్ని నమూనాలున్నాయనీ, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వీటిని అన్వయించుకుంటారనీ అర్థం వచ్చే రీతిలో సీఎం మాట్లాడారు. ఒక్కో దానిలోని మంచిని సంగ్రహించి "మిశ్రమ ఆర్థిక నమూనా" ను రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా వాడుకుంటున్నామని సీఎం స్పష్టం చేసారు. లెక్కలు "బూస్ట్" చేసి చూపించారన్న విమర్శకు ధీటుగా సమాధానం ఇస్తూ, "బూస్ట్ చేసి చూపించడం మా విధానం" అనీ, ఆశావహంగా వుండాలనుకోవడం తప్పు కాదనీ, తాము నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధిస్తున్నామనీ సీఎం స్పష్టం చేశారు.


          మొత్తం మీద వృద్ధి, అప్పుల మీద పలుమార్లు ప్రస్తావన రావడం, ప్రతిసారీ సీఎం జోక్యంతో అవి రాష్ట్రానికి ఏ విధంగా ఉపయోగపడ్తాయో సభ్యులకు, సభ ద్వారా ప్రజలకు తెల్సిరావడం ఈ బడ్జెట్ సమావేశాల ప్రత్యేకత. END

హనుమ సదాచార్యుడు .... సీత ఆత్మ స్వరూపిణి ...... ఆంధ్ర వాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి? : వనం జ్వాలా నరసింహారావు

హనుమ సదాచార్యుడు .... సీత ఆత్మ స్వరూపిణి
ఆంధ్ర వాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి?
వనం జ్వాలా నరసింహారావు
సూర్య దినపత్రిక (27-03-2017)

సీతాన్వేషణలో భాగంగా, ప్రయాణ సన్నాహంలో వున్న హనుమంతుడు, గురువుకూ, ఇష్ట దేవతలకూ నమస్కరిస్తాడు. కార్యారంభంలో ఇలా విధిగా నమస్కరించడం ఆచార్య లక్షణమనీ, ఉత్తమ గుణమనీ దీనర్ధం. ఆయన సముద్రాన్ని లంఘిస్తుంటే, వాయువు చల్లగా వీచిందట. అంటే భగవత్ కైంకర్యం చేసే వారికి దేవతలు సైతం సహాయం చేస్తారనేందుకు ఇదో నిదర్శనం. అదే విధంగా భగవత్ కార్యం చేయాలన్న ఆసక్తి వుండి కూడా చేయలేని వాడు, చేస్తున్న వారిని ప్రేరేపించి, వారితో ఆ కార్యాన్ని విజయవంతంగా చేయించాలనే విషయం, సముద్రుడు, మైనాకుడు, హనుమంతుడికి చేసిన సహాయం ద్వారా బోధ పడ్తుంది.

          భగవత్ సేవకులకు దేవతలు సహాయపడ్తారు కానీ, ఒక్కోసారి, శ్రేయస్కర కార్యాలకు విఘ్నాలెక్కువ ఎదురవుతాయి. "శ్రేయాంస బహు విఘ్నాని" అని కదా ఆర్యోక్తి! సంసారాన్ని తరించేందుకు, అత్మావలోకన పరుడై యోగాభ్యాసం చేస్తున్న వ్యక్తిని చూసి, ఇతడు చెడిపోతున్నాడనే అనవసర భయం తోనో, ప్రేమ తోనో, అతడి బంధువులు తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తారు. ఇదే సముద్రుడు, మైనాకుడి ద్వారా చేయించిన పని. అయితే, ఇది విఘ్నమే! ముముక్షువైన యోగిని, భాగవతుడిని, దేవతలు పరీక్షించేందుకు విఘ్నాలు కలిగిస్తారు. ఇట్టి వాటిని లక్ష్య పెట్టక, విఘ్నాలు కలిగించే వారికి మంచి మాటలు చెప్పి, సమాధాన పర్చి, హనుమంతుడి లాగా భక్తి తోనే తప్పించు కొని పోవాలి. అదే నిష్ట దూత లక్షణం, ఆచార్య లక్షణం. రాక్షసి సింహిక లేక అంగారక హనుమంతుడికి అడ్డు పడుతుంది. దీన్నే ముముక్షువైన యోగికి దుష్ట గ్రహ భూతాలవల్ల, దుష్ట జనుల వల్ల కలిగే బాధలతో పోల్చుకోవాలి. ఇలా విరోధ భావం కల వారి మీద జాలి, దయ, గౌరవం చూపాల్సిన పని లేదు. హనుమంతుడి లాగా వాళ్లను చంపడమే సరైన మార్గం.

          మొదట్లో లంకను చూసినప్పుడు, వానర వీరుల్లో, లంకలో ప్రవేశించ గలవారు నలుగురు మాత్రమే వున్నారనుకుంటాడు  హనుమంతుడు. ఆ తర్వాత ఆ సంఖ్యను తొమ్మిదికి పెంచుతాడు. చివర్లో వానరుల్లో ప్రతివాడూ తన కంటే బలవంతుడేనంటాడు. దీనర్ధం...కార్య భారం తెలియని మూర్ఖులు మొదట్లో తమనీ, తమవారినీ ఎక్కువగా అంచనా వేసుకుంటారని, చివరకు వెల్లికిల పడ్తారనీ అర్థం. ఆలోచనాపరులు, కార్య భారం తెలిసిన వారు, కార్య దక్షులు, ఇది మనం చేస్తామా, లేదా? మనవల్ల జరుగుతుందా? అని మొదట్లో జంకు తారు. ఎలాగూ ఈపని చేయక తప్పదనుకొని కొంచెం, కొంచెం చేయడం మొదలెట్టి క్రమేపీ ధైర్యం తెచ్చుకుంటారు. కార్యాన్ని సాధిస్తారు. ఇన్ని ఆలోచనలు చేసినప్పటికీ, హనుమంతుడొక్కడే రాక్షసులందర్నీ జయించి, లంకా దహనం చేసి వచ్చాడు కదా! ఇది దూత లక్షణమే! దౌత్య నీతి హనుమంతుడి మరొక ప్రజ్ఞా వైభవం.

లంకలో ప్రవేశించే హనుమంతుడికి అలంకరించుకున్న స్త్రీ లాగా కనిపిస్తుంది రావణ పట్టణం. ఇక్కడ లంకా నగరాన్ని స్త్రీగా వర్ణించడమంటే, లంకాధి దేవత "లంకిణి" రాక సూచిండమే! లంకాధి దేవతను జయిస్తాడు. "లంక" అంటే "దేహం" అని అర్ధం. హనుమంతుడు లంకను జయించాడంటే, తనలో వున్న "ఆత్మ"ను వెతికే వాడు, మొదలు దేహ భ్రాంతిని జయించాలన్న అర్ధం స్ఫురిస్తుంది. దేహ భ్రాంతిని జయించని వాడికి "ఆత్మావలోకనం" లేదు. దేహ-ఆత్మ బేధాన్నీ, సంబంధాన్నీ అర్థం చేసుకోలేకపోవడమే మన కడకండ్లకు కారణం. దేహం వేరు, ఆత్మ వేరు అనే సత్యం అంత సులభంగా అర్థమయ్యేదికాదు. లంకిణిని జయించిన హనుమంతుడు, రాక్షస సంచారం లేని ప్రదేశం ద్వారా లంకా ప్రవేశం చేసాడు. ఇలా ప్రవేశించాలన్నది "రాజనీతి".


          ఇలా చేయడం వెనుక "ముముక్షు" వైన "యోగి" చర్య ఎలా వుండాలో సూచించ బడింది. ఆత్మావలోకన పరుడు సత్య విక్రముడై వుండాలి. "సత్యం" అంటే, అహింస... సత్యం, అస్తేయం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం అనే "యమము"లన్నింటికీ ఉప లక్షణం. ఆత్మ, సత్యం వల్ల, తపస్సు వల్ల, జ్ఞానం వల్ల, బ్రహ్మచర్యం వల్ల లభిస్తుంది. ఇవన్నీ హనుమంతుడిలో వున్నాయి. కాబట్టి సత్యం  అనేది అన్నింటికీ ఉప లక్షణం. బలహీనులకు  ఆత్మ అనుభూతి లభించదు. దేహమే ఆత్మనే భ్రాంతివల్ల ఇది జరుగుతుంది. "లంక" అనే దేహం ప్రకృతి పరిణామం. అది కామ రూపిణి. లంక శబ్దానికి "రంకుటాల" అనే అర్ధం కూడా వుంది. ఈ జీవుడిని ఈ జన్మలో అనుసరించిన దేహం, మరో జన్మలో మరో జీవుడిని ఆశ్రయిస్తుంది. అంటే ఈ దేహం రంకుటాల లాంటిది. తపస్సుతో దేహాన్ని గెలవాలే కాని సౌమ్య మార్గంలో సాధ్యం కాదు. నశించేది దేహం. దేహానికి "నవ" ద్వారాలున్నాయి. ఆత్మలో మనస్సు ప్రవేశించడానికి ఈ ద్వారాలు పనికి రావు.

          హనుమంతుడు లంకను జయించాడంటే....యోగి దేహాన్ని జయించినట్లే. దేహం వశ పడినంత మాత్రాన ఆత్మావలోకనం లభించదు. హనుమంతుడు సీత కొరకై వెతుకుతున్నప్పుడు మండోదరిని చూసి సీతని భ్రమిస్తాడు. అంటే, ఆయన అన్వేషణలో, శోధించే సమయంలో, కనిపించిన ఆత్మ తేజస్సు లాంటి తేజస్సును "ఆత్మ" అని భ్రమించ కూడదు. మున్ముందు మరింత హెచ్చరికతో, నిష్కాముడై, జితేంద్రుడై వెతకాలి. ఇలా వెతుకుతుంటే, స్వప్రయత్నం ద్వారానే కార్యం సాధ్యమౌతున్నదనే భావనుంటే, అది తొలగి పోయే వరకు, ఆత్మ దర్శనం కలగదు. ఆందుకే కార్య సిధ్ధికై, సీత-రామ-లక్ష్మణులకు, మ్రొక్కి ముందుకు సాగాడు. కాబోయే సీతా దర్శనానికీ, జరిగిన రామ దర్శనానికీ, సుగ్రీవుడే కారణం కనుక ఆయనకూ నమస్కరించాడు. హనుమంతుడు సంపాతి (జటాయువు సోదరుడు) మాటలందు నమ్మకంతో రావణుడి అంతః పురంలో సీతను వెతికినట్లే, సాధకుడు గురు వాక్యం మీద నమ్మకంతో, దేహంలో ఆత్మాన్వేషణ చేయాలి. కనపడక పోతే, ప్రయత్న లోపం జరిగిందనుకొని, నిరుత్సాహ పడకుండా, కనిపించేంత వరకూ వెతకాల్సిందే! ఆచార్యానుగ్రహం వల్లనే ఆత్మ దర్శనం కలుగుతుంది. ఇక్కడ హనుమ సదాచార్యుడు కాగా, సీత ఆత్మ స్వరూపిణి. అంటే జీవాత్మ అన్నమాట. శ్రీరాముడు "పరమ ఆత్మ" కద! ఈ జీవాత్మ-పరమాత్మలను కలిపిన ఘటికుడు హనుమంతుడు.


అలా వెతుకుతున్నప్పుడు కనిపించింది, తాను వెతుకుతున్నదేనని నిశ్చయించు కోవడానికి తగిన కారణాలనూ వెతుక్కోవాలి. సీతాదేవి విషయంలో హనుమంతుడు ఇలానే చేస్తాడు. సీతాదేవిని చూసి తనలో తానే తర్కించుకున్న హనుమంతుడు, ఆమె తపస్సు చేసుకుంటున్న స్త్రీ లాగా వుందనీ, కుదుట పడని శ్రధ్ధ ఆమెలో కనిపించిందనీ, సందేహం కలిగించే స్మృతివలె వుందనీ భావిస్తాడు. ఆమె  జితేంద్రియత్వాన్నీ, భోగవిరాగాన్నీ, కుదుట పడని శ్రధ్ధనీ, నిశ్చయ జ్ఞానాన్నీ, బుధ్ధి నిష్కల్మశాన్నీ స్ఫురిస్తున్నాయీ వర్ణనలు. సీతాత్వానికి ఏ విధమైన హాని లేదు. కానీ...ఆమె సీతే అని తెలుసుకోలేని లోపం ఆ మూడుఢిదే. ఆత్మావలోకమవడానికి ముందర, ఆత్మ జ్యోతి లాగా కనిపించిన వెలుతురుని చూసి భ్రమ పడ కూడదు. అదే ఆత్మని సంతోషిస్తే, భ్రష్టుడవుతాడు. ఆచార్య లక్షణం ఏదో శాస్త్రాలు చెప్పిన పధ్ధతిలో ఆలోచించి, స్వబుధ్ధితో తర్కించి, వూహించి, నిశ్చయించు కోవాలి. అదే చేస్తున్నాడు హనుమంతుడు.

Friday, March 24, 2017

Studying in Osmania University fifty years ago : Vanam Jwala Narasimha Rao

Studying in Osmania University fifty years ago
Vanam Jwala Narasimha Rao
As student of Ricab Bazaar High School in Khammam, and, after passing out in Higher Second Class in the HSc (Higher Secondary Certificate) examination, I enrolled myself in the PUC (Pre University Course) with Mathematics, Physics and Chemistry as optional group subjects in SR and BGNR Government Arts and Science College in Khammam, affiliated to Osmania University then, during 1962-63 Academic Years. That was how I became a student of Osmania University for the first time. There were English, Telugu languages and General Studies subjects too in the curriculum. Having studied in Telugu medium till H Sc and then switching over to English medium at PUC level was a bit difficult task for which gradually we were accustomed. SR and BGNR College, under the private management, was the first college that was set up in Khammam as there were no Colleges in the Telangana region except in Hyderabad in 1956.  The then Chief Minister Late Boorgula Ramakrishna Rao decided to have atleast one college in every district resulting in one in Khammam too.

After entering the portals of a degree college in PUC, I felt elevated. Telugu, English, General Knowledge were taught to the entire Optional groups in combined sessions irrespective of MPC, BPC, Commerce, Economics and Geography. Physics and Chemistry subjects were taught commonly for both the MPC and BPC students. Mathematics was taught for only MPC students. English subject used to have poetry, prose and Grammar. We had very interesting essays in English prose, like, “On Seeing People Off,” On Forgetting”, “On Other People’s Jobs.” We were enthused by the poems of William Shakespeare and William Wordsworth. The lecturers who taught us practical classes for the science subjects were known as “Demonstrators” and they were a bit below the Lecturer in the status. I still remember the instruments like Pipette, Burette, and Common Balance which we used for practical sessions.

PUC results were out and as expected I secured just the Third Division thanks to the extracurricular activities mostly college politics in to which I was propelled by one of my cousins. Though I got fairly good marks in Mathematics, Physics and Chemistry I could not secure required marks to get a seat in an Engineering College. Hence I took admission into BSc (MPC) in the same College.

In those days if anyone asked as to what a degree student was studying the answer invariably was that they were studying “first year” and add by saying “First Year Rest year!  As there was no public examination at the end of the first year degree, students used to take it very lightly the internal examination. First year degree students were automatically promoted to the second year. In second year there were university examinations for Languages and General Studies. There were six papers then. In the final year there used to be final examinations for the optional subjects.  There were ten papers to be cleared at a time including four in Physics, the extra being Modern Physics. There were no holidays in between two examinations except for Sunday. We had to memorize the three years study to appear for the final examination! Similarly, for Languages, we had to remember what we have studied for two years.


After completing my first year BSc, I wanted to do my second and final year degree in Hyderabad and hence made my trials. DV Dwaraka who was working as Mathematics professor in OU helped me in this.  New Science College Principal C Sudarshan admitted me in June 1964 in B Sc second year in Hyderabad. The College was established on July 17, 1956 by GS Melkote and Sudarshan under the banner the New Vidya Samithi.  The College, which was in Narayanguda, had many prominent lecturers as faculty members. Our class was always vibrant and full of activities.  Some construction work used to take place regularly for additional accommodation as the college was in high demand.

As far as the faculty was concerned it is no exaggeration to say that we had the best of teaching staff, which no other college had then. We had Andhra Mahabharata Upanyasalu as Telugu Text and Purushothammudu as non Detailed besides Halikudu as the drama text.  Out English Text was a compilation edited by EF Dad and it had one essay by AG Gardner. EM Foster’s “A passage to India” was our Non-detailed Text.  For mathematics, we were to study in three parts, Algebra, Trigonometry and Coordinate Geometry. Sahfi-ul Haq used to teach us Algebra, Bhaskar Rao Coordinate Geometry and Kuppuswamy Trigonometry.  Hari Laxmipathy and Prabhakar taught us Physics. We had Organic, Inorganic and Physical parts in Chemistry (Theory). Three different lecturers used to teach these three parts. I still remember the Benzene Ring drawn by Organic Chemistry lecturer Y Suraynarayana Murthy on the black board.  Inorganic was taught by Principal Sudarshan himself. I Think YSM taught us Physical Chemistry too.

While I was in Degree final year there was a clash between the Student union leaders over OU Vice Chancellor Prof DS Reddy. One group was lead by K Keshav Rao, former Congress leader and now TRS Rajya Sabha member and Former Union Minister S Jaipal Reddy and the other group was lead by M Sridhar Reddy, Pulla Reddy Jansangh Narayana Das and other left wing student leaders. In 1966, the then Chief Minister K Brahmananda Reddy removed Prof DS Reddy who was VC of OU since 1957. In his place a Principal from a Guntur College was appointed. He came and could not take the charge as students were protesting. Keshava Rao and Jaipal Reddy supported the decision taken by Brahmananda Reddy. The only fault committed by Prof DS Reddy was to ask for autonomy for OU! Brahmananda Reddy tried bringing an Amendment to the Act to remove Prof DS Reddy who in turn approached the High Court and then Supreme Court and finally won the case. He continued as VC till 1969. In 1968 when Telangana agitation took birth he was the VC and later Prof Ravada Satyanarayana became the VC. When the Court ordered continuance of Prof DS Reddy as VC, the university had given grace marks to the students. Though I did not write the examinations, I got 15 Marks in all the subjects due to grace marks.

My degree final year examinations took place during March-April-May 1966. I wrote mathematics examination and thought would not get good marks. Hence, though, I attended the examinations I did not practically write any.  As expected I failed in all subjects except Maths.  I did not appear for the Supplementary exams and after two three attempts in March 1968 I have cleared Maths and Physics and cleared Chemistry in September. That was how my first phase of Hyderabad life ended.

After my BSc in Hyderabad I did my MA from Nagpur and later joined in job as a Librarian. For the professional degree I again joined OU Arts College during July-Aug. 1973 in Library Science Course. Our classes were held either in Arts College or in the Library building. It was a great experience. The final examinations were held in July 1974 and I got University Second rank in August when the results were declared.

That was how my association with OU started 52 years ago came to an end 42 years ago. I fondly remember those days in OU, the college campus, travelling to Arts College by bus, wonderful time spent with friends, student politics, playing Cricket…and there were many, many more memories that haunt me till date. What a wonderful time it was!


Monday, March 20, 2017

తిరుమలేశుని దర్శనం...స్వామి ఇస్తేనే దొరికేది! .....వనం జ్వాలానరసింహారావు

తిరుమలేశుని దర్శనం...స్వామి ఇస్తేనే దొరికేది!
వనం జ్వాలానరసింహారావు
ఆంధ్రప్రభ దినపత్రిక (21-03-2017)

ప్రాప్తి ఉంటేనే ఏదైనా లభిస్తుందని పెద్దలంటారు. అలాగే తిరుమలేశుని దర్శనం కూడా.

            "వేంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన, వేంకటేశ సమోదేవో న భూతో న భవిష్యతి"… ఆ కలియుగ ప్రత్యక్ష దైవ దర్శనం ఒక్క క్షణ కాలంపాటు కలిగినా చాలని, వందల-వేల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి, లక్షలాది మంది భక్తులు, పవిత్ర పుణ్య క్షేత్రమైన తిరుమల కొండకు నిత్యం వెళుతుంటారు. స్వామిని దర్శించుకున్న సామాన్యులు కాని, అసామాన్యులు కాని, గంటల తరబడి క్యూలో నిలుచున్న వారు కాని, సరాసరి వైకుంఠ ద్వారం గుండా లోనికి వెళ్లగలిగిన వారు కాని, ఒక్క టంటే ఒక్క దర్శనం చాలనుకునేవారు కాని, వీలై నన్ని దర్శనాలు కావాలనుకున్నవారు కాని, ఒక్క రూపాయి హుండీలో వేయలేని వారు కాని, కోట్లాది రూపాయలు సమర్పించుకోగలిగే వారు కాని.....ఎవరైనా...కారణమేదైనా....ఎలా వెళ్లినా, వచ్చినా....తృప్తి తీరా, తనివితీరా దేవుడిని చూశామంటారే కాని, అసంతృప్తితో ఎవరూ వెనుదిరిగిపోరు. వెళ్తూ....వెళ్తూ, దర్శనంలో పడ్డ ఇబ్బందులేమన్నా వుంటే పూర్తిగా మరచి పోతూ, ఏ భక్తుడైనా, ఏం కోరినా-కోరకున్నా, తప్పకుండా కోరేది మాత్రం ఒకటుంటుంది.....అదే, "స్వామీ, పునర్దర్శన ప్రాప్తి కలిగించు" అని. అలా తన భక్తులను తన వద్దకు రప్పించుకుంటాడా కలియుగ దైవం!

శ్రీ మహావిష్ణువు నివాసమైన శ్రీ వైకుంఠమే తిరుమల! మహావిష్ణువిక్కడ "ఆనంద నిలయం" అనే తన "బంగారు మేడ" లో దర్శనమిస్తున్నాడు. ఆలయ ప్రవేశం చేయాలంటే "మహా ద్వారం" గుండా క్యూ లైన్లలో వెళ్లాలి భక్తులు. మహా ద్వారాన్ని "పడి కావలి" అని, "ముఖద్వారం" అని, "సింహద్వారం" అని, "పెరియ తిరువాశల్" అని కూడా అంటారు. ఈ మహా ద్వారానికి ఇరు ప్రక్కల ద్వారపాలకులుంటారు. మహా ద్వారానికి ఆనుకుని ఒక మండపం వుంటుంది. ఆ పక్కనే "అద్దాల మండపం" వుంటుంది. అక్కడా కొన్ని వుత్సవాలు జరుగుతాయి. దానికి ఎదురుగా వున్న మరో మండపంలోనే ఒకప్పుడు కళ్యాణోత్సవం జరిగేది. ఆ మండపం పక్కనే "తిరుమలరాయ మండపం" వుంటుంది. దానికీ ప్రాధాన్యత వుంది. ఆలయ ప్రాంగణంలోనే "ధ్వజస్తంభం", "బలిపీఠం", "క్షేత్రపాలక శిల" వుంటాయి. అదృష్టవంతులైన భక్తులకు ధ్వజస్తంభం పక్కనుంచి లోనికి పోయే వీలు కలుగుతుంది. అక్కడ అన్నీ విశేషాలే! "నాలుగు కాళ్ల మండపం", "విరజానది", శ్రీ వేంకటేశ్వరుడికి అనుదినం అలంకరించే పూల దండలు, బంగారు వాకిలి ఉభయ పార్శ్వాలలో నిలచి వున్న పంచలోహ మూర్తులు, "కులశేఖర పడి".....ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో...ఎన్నెన్నో....!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకుని బంగారు ఆభరణాలు సమర్పించిన సమయంలో స్వామివారిని సమీపం నుండి తనివితీరా దర్శనం చేసుకున్న వారిలో నేను కూడా వుండడం అరుదైన, అపురూపమైన అనుభవం. సీఎం సతీ సమేతంగా దేవాలయానికి చేరుకోవడానికి అర గంట ముందరే ఆయనతో దర్శనం చేసుకోవడానికి తెలంగాణ నుంచి వెళ్ళిన బృందంలోని వారందరినీ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి లోనికి తీసుకెళ్లారు దేవాలయాధికారులు. తొలుత రంగనాయక మండపంలో వుంచిన ఆభరణాలను కళ్లకద్దుకోవడం, ఆ తరువాత ముఖ్యమంత్రి వెంట దర్శనం చేసుకోవడం జరిగింది. పేరుపేరునా తన వెంట వచ్చిన ప్రతివారినీ తన సమీపంలోకి పిలుస్తూ, అందరికీ తనివితీరా దర్శనం చేయించారు సీఎం. హారతీ, తీర్థం అందరికీ లభించింది.

          సరిగ్గా 26 సంవత్సరాల క్రితం ఇదే ఫిబ్రవరి నెలలో, దాదాపు ఇవే రోజుల్లో, అప్పటి ముఖ్యమంత్రి స్వర్గీయ మర్రి చెన్నారెడ్డి దగ్గర పీఆర్వోగా పనిచేస్తున్నప్పుడు కూడా నాకిలాంటి దర్శనమే లభించింది. అప్పట్లో అమల్లో వున్న నిబంధనల ప్రకారం, సీఎం వెంట వున్న వారందరినీ ముఖద్వారం నుంచే లోనికి అనుమతించినట్లు జ్ఞాపకం. కాకపోతే అప్పుడు సీఎం తిరుమలకు వచ్చిన సందర్భం వేరు. కృష్ణా జలాల పంపకం విషయంలో నాటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి శరద్ పవార్, నాటి కర్నాటక ముఖ్యమంత్రి వీరేంద్ర పాటిల్ తో త్రైపాక్షిక చర్చలకు తిరుపతి వేదికైంది. ఆ సమావేశంలో నేను కూడా పాల్గొన్నాను. నాకింకా ఆ సమావేశానికి సంబంధించిన ఒక అంశం ఇప్పటికీ గుర్తుంది. వాస్తవానికి ముగ్గురు ముఖ్యమంత్రులు కలిసిన ఉద్దేశం కేవలం జలాల పంపిణీ విషయమే. రాజకీయాలు వారిమధ్య రాలేదు. నదీ జలాల సంబంధిత సమావేశం తరువాత, వాళ్లు, మళ్లీ తిరుపతిలో ఎక్కడా ప్రత్యేకంగా కలవలేదు కూడా. అయినప్పటికీ, ఒక ప్రముఖ పాత్రికేయుడు, అప్పట్లో జాతీయ స్థాయిలో బాగా పేరున్న "బ్లిట్జ్" ఆంగ్ల వార పత్రికలో రాస్తూ...ఈ ముగ్గురూ కలిసి రాజీవ్ గాంధీకి వ్యతిరేకంగా ఒక కూటమిని తయారు చేస్తున్నారని పేర్కొన్నాడు. ఆ పత్రికలో వచ్చిన అంశాన్ని నేను సీఎం చెన్నారెడ్డికి చూపించి, జరగని విషయం రాశారని అంటే...."ఆ మాత్రం భయం రాజీవ్ గాంధీకి వుంటే తప్పేం లేదు" అని ఆయన వ్యాఖ్యానించారు! ఎందుకో ఈ విషయం ఇప్పుడు మళ్లీ గుర్తుకొచ్చింది.

          ఇవన్నీ ఒక ఎత్తైతే...తిరుమల స్వామి దర్శనం మాటకొస్తే "దర్శనం స్వామి ఇస్తేనే దొరికేది"...అంతే కాని ఎవరూ ఇచ్చేది కాదు. అదో నమ్మకం. సీఎం కేసీఆర్ ఆభరణాలు స్వామివారికి సమర్పించిన తరువాత ఎస్వీబీసీ ఛానల్ తో మాట్లాడుతూ తన స్వానుభవం ఒకటి వివరించారు. కొన్నేళ్ల క్రితం తిరుమలకు వచ్చి కూడా, దర్శనం చేసుకోకుండా తిరిగి పోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని, స్వామి అనుజ్ఞ లేనిదే దర్శనం జరగదని, అందుకే ఆభరణాలు ఇవ్వడానికి ఇంత కాలం పట్టిందనీ, అన్నారు. ఇది నూటికి నూరు పాళ్లు వాస్తవం.

          హైదరాబాద్ నుంచి బయల్దేరి, రేణిగుంట విమానాశ్రయంలో దిగి, అక్కడి మార్పులు చూసిన తరువాత, చిన్నతనం నుంచీ తిరుమల దర్శనానికి వెళ్లొచ్చిన విషయాలు గుర్తుకు రాసాగాయి. నాకు ఊహ తెలియక ముందు, తెలిసీ-తెలియని రోజుల్లో, తెలిసినప్పటి నుంచీ తిరుమల వెళ్లి రావడంలో చాలా మార్పులు స్వయంగా చూస్తూ వస్తున్నాను.       

          ఏమిటీ కొండ మహాత్మ్యం? ఏముందీ దైవంలో? ఎందుకిన్ని ఆర్జిత సేవలు? ఒక్కో సేవకున్న ప్రత్యేకత ఏమిటి? పొరపాటునన్నా, లేదా, ఏమరుపాటునన్నా ఏనాడైనా ఏదైనా సేవ ఆగిందా? ఏ సేవ, ఎప్పుడు, ఎంతసేపు జరపాలన్న విషయంలో ఏవన్నా నియమ నిబంధనలున్నాయా? గతంలోను, ఇప్పుడు సేవల వేళల్లో కాని, పట్టే సమయాల్లోకాని, మార్పులు చేర్పులు జరిగాయా? జరగడానికి శాస్త్రీయ కారణాలే మన్నా వున్నాయా? ఆర్జిత సేవలకు అనుమతిచ్చే భక్తుల సంఖ్యలో పెంచడం-తగ్గించడం జరిగిందా?

            తిరుమల కొండలో "నిత్య కళ్యాణం-పచ్చతోరణం"…..అన్ని ఆర్జిత సేవలలోను "కళ్యాణోత్సవం" కు ఒక ప్రత్యేకత వుంది. శ్రీ వేంకటేశ్వరుడికి, శ్రీదేవి-భూదేవిలకు, అనునిత్యం తిరుమలలో, భారతీయ హిందూ సాంప్రదాయ రీతిలో, వేద మంత్రోచ్ఛారణల మధ్య, ఇరు వంశాల వంశ క్రమాన్ని-ప్రవరను పఠనం చేస్తూ, అర్చకులు మంగళ సూత్ర ధారణ చేస్తారు. కళ్యాణోత్సవం చేయించిన వారికి నేరుగా మూల విరాట్ దర్శనం చేయించే ఆనవాయితీ వుండేది ఒకప్పుడు. కాలం మారింది. కాలానుగుణంగా కళ్యాణోత్సవం చేయించేవారి సంఖ్య పదుల నుండి వందలకు-వేలకు చేరుకుంది. ఉత్సవం జరిపించే స్థలం కూడా తదనుగుణంగా మార్చవలసి వచ్చింది. సరాసరి మూల విరాట్ దర్శనం చేయించే ఆచారం మారింది. సర్వదర్శనం క్యూలో కలిపి, ఆ తోపులాటలోనే వీరికీ దర్శనం-అదీ లఘు దర్శనం చేయిస్తున్నారిప్పుడు. ఐనా, కళ్యాణోత్సవం చేయిస్తున్న వారి సంఖ్య పెరుగుతుందేకాని తగ్గడం లేదు. ఈ మార్పులకు కారణాలుండే వుండాలి. ఇవన్నీ భక్తులు తెలుసుకోవాలనుకున్నా, ఏ కొద్దిమందికో తప్ప అందరికీ వీలుండదేమో! శ్రీ వేంకటేశ్వరుడికి అను నిత్యం జరిపించే ఒక్కో సేవకు ఒక్కో ప్రాధాన్యం వుంది-విశేషముంది. ప్రతి సేవలో అనుసరించే ఒక్కో విధానానికి విశేష ప్రాముఖ్యత వుంది. ఉదాహరణకు "సన్నిధి గొల్ల" అని పిలువబడే ఒక యాదవ వ్యక్తి బంగారు వాకిళ్ల తాళాలు తీయడం. ప్రతి నిత్యం తొలి దర్శనం అతడికే కలుగుతుంది. సుప్రభాత సేవ సమయాన పొర్లు దండాలు మరో విశేషం. వాటి గురించి గత ఏబై సంవత్సరాలకు పైగా తిరుమలను దర్శించుకుంటున్న నాకు తెలిసింది చాలా తక్కువ. ఊహ తెలిసినప్పటి నుంచీ - తెలియనప్పటి నుంచి కూడా తిరుమలను అనేక మార్లు దర్శించుకున్న నాకు అప్పటికీ-ఇప్పటికీ తేడా కనిపించడం మాత్రం వాస్తవం.


          మొదటి సారి చిన్న వయసులో కుటుంబంతో కలిసి కాలినడకన నేను తిరుమల వెళ్లాను. ఆ తరువాత సుమారు అరవై ఏళ్ల క్రితం నా ఉపనయనానికి వెళ్లినప్పుడు, పాతిక మందికి పైగా ఒక జట్టుగా కలిసి వెళ్లాం. నాలుగైదు కచ్చడం (ఎద్దులు లాగే) బళ్లు, మరో నాలుగైదు (ఎద్దులు లాగే) పెద్ద బళ్లు కట్టుకుని మా స్వగ్రామం నుంచి బయల్దేరాం. ఆరేడు కిలోమీటర్ల దూరంలో వున్న చిన్న రైల్వే స్టేషన్ కు చేరుకుని, అక్కడ నుంచి పాసింజర్ రైల్లో విజయవాడ వెళ్లాం. విజయవాడలో సత్రం బస..అక్కడినుంచి మర్నాడు సాయంత్రం తిరుమలకు ప్రయాణం కట్టాం. బయల్దేరిన మూడో రోజు ఉదయం తిరుపతి రైల్వే స్టేషన్‌లో దిగాం. స్థానికంగా వున్న దేవాలయాలను దర్శించుకుని, మర్నాడు తిరుమలకు బస్సులో ప్రయాణమయ్యాం. ఆ రోజుల్లో తిరుమల-తిరుపతి దేవస్థానం వారే బస్సులు నడిపేవారు. అప్పట్లో సెక్యూరిటీ చెకింగులు అసలే లేవు. తిరుమలలో ఇప్పటి లాగా టిటిడి వారి వసతి గృహాలు ఎక్కువగా వుండేవి కావు. ఎన్నో ప్రయివేట్ సత్రాలుండేవి. వాటిలో "పెండ్యాల వారి సత్రం" చాలా పేరున్న సత్రం. అక్కడే బస చేశాం. వంటా-వార్పూ అన్నీ అక్కడే. అక్కడే నా ఉపనయనం జరిగింది. దాదాపు మూడు రోజులు అక్కడే వున్నాం. దర్శనానికి ఎన్ని సార్లు వీలుంటే అన్ని సార్లు, ఏ దర్శనం కావాలనుకుంటే ఆ దర్శనానికి, ఎవరి సహకారం లేకుండానే వెళ్లొచ్చాం. నాకు గుర్తున్నంతవరకు ప్రధాన ద్వారం గుండా సరాసరి వెళ్లొచ్చాం. కళ్యాణోత్సవం చేయించాం. గుళ్లో తిరగని ప్రదేశం లేదు. ఏ రకమైన కట్టుబాట్లు లేవు. ఇక లడ్డులకు కొదవే లేదు. కళ్యాణోత్సవం చేయించిన వారు బస చేసే చోటికి, ఆలయ నిర్వాహకులు, ఒక పెద్ద గంప నిండా పులిహోర, దద్ధోజనం, పొంగలి, పెద్ద లడ్డులు, వడలు, చిన్న లడ్డులు వచ్చేవి. శ్రీవారి దర్శనానికి ముందు వరాహ స్వామి దర్శనం చేసుకున్నాం. పక్కనే వున్న స్వామిపుష్కరణి-కోనేరులో  స్నానం చేసే వాళ్లం. అప్పట్లో అందులో నీరు శుభ్రంగా-కొబ్బరి నీళ్లలా వుండేది. తిరుమల సమీపంలోని పాప నాశనానికి తప్పనిసరిగా వెళ్లే ఆచారం వుండేది అప్పట్లో. అక్కడ నిరంతరం ధారగా నీరు పడుతుండేది. నీరు పడడానికి ఒక చైన్ గుంజాలి. అది గుంజినప్పుడు నీరు పడకపోతే పాపాలు తొలగనట్లు భావించేవారు.

          ఆ రోజుల్లో ఒక పద్దతి ప్రకారం దైవ దర్శనం చేసుకునే ఆచారం వుండేది. వరాహ స్వామి దర్శనం, వేంకటేశ్వర స్వామి దర్శనం, అల మేలు మంగ దర్శనం, గోవింద రాజ స్వామి దర్శనం, శ్రీ కాళహస్తి దర్శనం తిరుగు ప్రయాణంలో విజయవాడలో ఆగి కనకదుర్గ దర్శనం చేసుకునే వాళ్లం. సుమారు వారం-పది రోజుల యాత్ర అలా సాగేది అప్పట్లో. సత్రాలలో వుండేవాళ్లం. హాయిగా దర్శనాలు చేసుకునే వాళ్లం. ఇప్పుడేమో మధ్యాహ్నం బయల్దేరి విమానంలో వెళ్లి, మర్నాడు ఉదయం దర్శనం చేసుకుని ఇరవై నాలుగు గంటల్లో తిరిగి హైదరాబాద్ చేరుకోవచ్చు. ఒకప్పుడు ఒక్క వాయుదూత్ మాత్రమే వుండేది...ఇప్పుడు తిరుపతికి పన్నెండు విమానాలున్నాయి. సాయంత్రం తిరుమలకు చేరుకోవడం, వారి-వారి స్థాయిని బట్టి మర్నాడు ఉదయం సుప్రభాత సేవ కాని, అర్చన కాని, అభిషేకం కాని, నిజ పాద దర్శనం కాని, వీటన్నిటినీ మించి ఎల్-1, ఎల్-2,ఎల్-3 కేటగిరీ కింద బ్రేక్ దర్శనం కాని చేసుకోవడం, వీలుంటే అల మేలు మంగాపురం పోవడం, లేదా సరాసరి విమానాశ్రయానికి పోయి హైదరాబాద్, ఢిల్లీ, ఇతర మహానగరాలకు చేరుకోవడం జరుగుతోంది. సామాన్యులు ఎప్పటి లాగానే ధర్మ దర్శనం కాని, ఆన్ లైన్ దర్శనం కాని చేసుకుంటున్నారు.

            యాత్రీకుల రద్దీ పెరగడం మొదలైంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం రు. 10 టికెట్ తో ప్రారంభమైనట్లు జ్ఞాపకం. సిఫారసు ఉత్తరాల సాంప్రదాయం మొదలైంది. ఆర్జిత సేవలకు కోటా కూడా మొదలైంది. అప్పటి నుంచి వెళ్లిన ప్రతి సారి టిటిడి ఈఓ కు గాని, జెఈఓ కు గాని సిఫార్సు వుత్తరాలు తీసుకెళ్లడం ఆనవాయితీగా మారింది. అప్పట్లో అర్చనానంతర దర్శనానికి ప్రాముఖ్యత వుండేది. చాలా మంది కళ్యాణం తప్పక చేయించే వారు. ఎప్పుడైతే కళ్యాణం చేయించిన వారికి లఘు, మహా లఘు దర్శనాలు మొదలయ్యాయో ఇక అక్కడి నుంచి అవి చేయించడం మానుకుంటున్నారు చాలా మంది. అర్చన, సుప్రభాతం, అభిషేకం, కళ్యాణం లాంటివి చేయించిన మాకు "వస్త్రం" సేవ చేయించాలనే కోరిక ఐ. వి. సుబ్బారావు గారు ఎండోమెంట్ శాఖ కార్యదర్శిగా-టిటిడి బోర్డ్ సభ్యుడుగా వున్నప్పుడు తీరింది. నిజంగా అదొక అద్భుత అవకాశం. స్వామివారి ముందర గంటకు పైగా కూర్చుని చూసే అరుదైన అవకాశం అలా మొదటి సారిగా లభించింది. రమణాచారిగారు టిటిడి ఈఓ కాగానే అలాంటి అవకాశం మరో మారు కూడా లభించింది. మా అబ్బాయి ఆదిత్యకు కూడా రెండు పర్యాయాలు ఆ అవకాశం లభించింది.


            ఇదంతా నా అనుభవం మాత్రమే. నాకింత మంచిగా జరుగుతున్నది కాబట్టి అక్కడ యాత్రీకులకు ఏ ఇబ్బందీ కలగడం లేదని అనడం లేదు. కాకపోతే ఎవరి అదృష్టం వారిదే! చివరి క్షణం వరకూ దర్శనం టికెట్లు దొరుకుతాయో, లేదో అన్న అనుమానం నాకు కలిగిన సందర్భాలు లేకపోలేదు. అప్పుడొకాయన అన్నారు.... దర్శనం స్వామి ఇవ్వాల్సిందే కాని మనం తెచ్చుకోవడం కాదని! ఇప్పటికీ, దర్శనం చేసుకుంటున్నప్పుడు, క్యూలో అసహనానికి గురైన సందర్భాలు అనేకం. క్యూలో వంటి మీద చేయి వేసి తోస్తున్నప్పుడు కోపగించుకున్న సందర్భాలు అనేకం. అలానే వివిఐపి గా స్వామివారి ముందు నన్ను-నా కుటుంబ సభ్యులను నిలబెట్టిన సందర్భాలూ అనేకం. ఎప్పటికెయ్యది ప్రాప్తమో అదే జరుగుతుందని అనుకునే వాడిని. కోపమొచ్చినా అణచుకునేవాడిని. ఏదేమైనా కాలం మారింది. ఏబై-అరవై ఏళ్ల క్రితం పరిస్థితులు ఇప్పుడు లేవు. సరాసరి దైవ దర్శనానికి పోయేందుకు ఇప్పుడు వీలు లేదు. ఇప్పటి నియమనిబంధనలు పాటించక తప్పదు. భక్తులను ఇలా నియంత్రిస్తేనే అందరికీ దర్శనం దొరికే అవకాశం వుంటుంది. ఒకనాడు విఐపి లకు వున్న ప్రాముఖ్యత ఇప్పుడు లేదే! ఆ రోజుల్లో లాగా అన్నీ-అందరికీ ఇప్పుడు జరగడం లేదే! రాబోయే రోజుల్లో ఏం జరగ బోతోందో ఎవరూ ఊహించలేరేమో! End

Sunday, March 19, 2017

సకల శాస్త్రాల సంగమం సుందరకాండ మందరం ...... ఆంధ్ర వాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి? : వనం జ్వాలా నరసింహారావు

సకల శాస్త్రాల సంగమం సుందరకాండ మందరం
ఆంధ్ర వాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి?
వనం జ్వాలా నరసింహారావు
సూర్య దినపత్రిక (20-03-2017)

వాల్మీకి రామాయణాన్ని యధా తధంగా గాయత్రీ మంత్రమయం చేస్తూ, చందః యతులను ఆయా స్థానాల్లో నిలిపి తెనిగించారు వాసుదాస స్వామి. శ్లోకానికో పద్యం వ్రాసారు. ప్రతి పద్యానికి ప్రతి పదార్ధ తాత్పర్యం ఇచ్చారు. ఒక్కో పదానికున్న వివిదార్ధాలను విశదీకరించారు. భావాన్ని వివరణాత్మకంగా విపులీకరించారు. 1461 పద్యాలతో ఆయన చేసిన శ్రీరామాయణం సుందరకాండ వ్యాఖ్యానంలో "జ్ఞాన పిపాసి"కి విజ్ఞాన సర్వస్వం దర్శన మిస్తుంది. ఆయన పద్యాలలో సాధారణంగా అందరూ వ్రాసే చంపకమాలలు, ఉత్పలమాలలు, సీస పద్యాలు, ఆటవెలది-తేటగీతులు, కంద, శార్దూలాలు, మత్తేభాలు మాత్రమే కాకుండా తెలుగు ఛంధస్సులో ఉండే వృత్తా లన్నింటినీ సందర్భోచితంగా ప్రయోగిస్తారు. ఆ వృత్తాలలో ఉత్సాహం, పంచచామరం, తరలం, లయగ్రాహి, చారుమతి, మధురగతి రగడ, వృశభగతి రగడ, మానిని, సుగంధి, స్రగ్విని, మనోరంజని, మణిమంజరి, మత్తకోకిలం, తామరసం, ద్విపద, పద్మనాభ వృత్తం, అంబురుహ వృత్తం ఉన్నాయి. ఆయా సందర్భాలలో, సందర్భోచితంగా, ఆయా వృత్తాలను ఎంతో హ్రుద్యంగా మలిచారాయన. ఉదాహరణకు, రామ కార్యార్ధిగా సముద్రాన్ని లంఘించిన హనుమంతుడికి "పంచచామర" సేవ చేస్తారు కవి. లంకా తీరాన్ని చూసినప్పుడు హనుమంతుడికి కలిగిన ఉత్సాహాన్ని "ఉత్సాహ" వృత్తంలో వర్ణిస్తారు. సుందరకాండ విషయాన్నంతా సంగ్రహంగా, హనుమంతుడు వక్తగా, ఆయన లంకకు పోయి వచ్చిన విధమంతా తన వానర మిత్రులకు చెప్పడానికి ఏకంగా ఓ "దండకాన్ని" వ్రాస్తారు. సుమారు 200 పంక్తులున్న ఈ "దండకం" చదువుతే, సుందరకాండ పూర్తిగా చదివినట్లే! శ్రుత్యర్ధ రహస్యం చెప్తూ "ద్విపద" వ్రాస్తారు కవి. ఇలానే మిగిలిన వృత్తాలు కూడా.

            ఇంతకీ సుందరకాండ ఎందుకు చదవాలి? మళ్ళీ వేసుకుందాం ఈ ప్రశ్న. వాసుదాసు గారు తన తొలి పలుకుల్లోనే చెప్పారీ విషయాన్ని గురించి. సుందరకాండ పఠించేవారు ప్రత్యుత్తరం కోరి చదవ వలసిన విషయాలు: (సుందరకాండ అంతం లో కూడ ఇదే విషయం మళ్ళీ చెప్పారాయన)....బధ్ధ జీవ తారతమ్యం, జీవాత్మ-పరమాత్మల సంబంధం, జీవాత్మ తరణోపాయం, శిష్య-ఆచార్య లక్షణాలు, జీవాత్మలకు సేవ్యుడెవరు?, ఆత్మావలోకన పరుడైన యోగి లక్షణం, ఉపాయానికీ-ఉపేయానికీ భేదం, యోగికీ-ప్రపన్నుడికీ భేదం.

          ఈ ముఖ్య విషయాలన్నింటికీ ప్రత్యుత్తరం సుందరకాండలో దొరుకుతుందా? అని ప్రశ్నించు కుంటే - ఎన్ని సార్లు చదివితే అంత వివరంగా సమాధానాలు దొరుకుతాయి. వాటిని అన్వయించు కోవడమే మనం చెయ్యాల్సిన పని. సుందరకాండ ఆసాంతం, ప్రతి పద్యానికీ ప్రతి పదార్ధం ఇస్తూ, చివరిలో తాత్పర్యం చెప్తూ, అవసరమైన చోట అంతరార్ధమిస్తూ, ఉపమానాలను ఉటంకిస్తూ, వీలైనంత వరకూ ఇతర గ్రంథాల్లోని సందర్భాలను ప్రస్తావిస్తారు  కవి. ప్రత్యుత్తరం కోరి చదవాల్సిన విషయాలన్నింటికీ సోదాహరణంగా జవాబు చెప్తారు.

            చదువుకుంటూ పోతుంటే, అర్ధం చేసుకునే ప్రయత్నం చేస్తే, ఇది కేవలం సుందరకాండ కధ వృత్తాంతమే కాకుండా, సకల శాస్త్రాల సంగమం లాగా  స్ఫురిస్తుంది. ఒక చోట ధర్మ శాస్త్రం లాగ, మరోసారి రాజనీతి శాస్త్రం లాగా వేరే చోట ఇంకో విధంగాను తోస్తుంది. ఇదో భూగోళ శాస్త్రం - సాంఘిక, సామాజిక, ఆర్ధిక, సామాన్య, నైతిక శాస్త్రం - సంఖ్యా శాస్త్రం - సాముద్రిక శాస్త్రం - కామ శాస్త్రం - రతి శాస్త్రం - స్వప్న శాస్త్రం - పురాతత్వ శాస్త్రం. చదివితే, అర్ధం చేసుకుంటే ఇంకెన్నో శాస్త్రాలు గోచరిస్తాయి. అసలు-సిసలైన పరిశోధకులంటూ ఉంటే, ఒక్క సుందరాకాండ మందరం మీద పరిశోధనలు చేస్తే చాలు-ఒకటి కాదు, వంద పీహెచ్డీలు పొందవచ్చు. డాక్టరేట్ తో పాటు అద్భుతమైన రహస్యాలు అవగతమౌతాయి. కాండ లోని చివరి పద్యం ఆయన  "అంబురుహ" వృత్తం లో వ్రాసారు.  "క్ష్మా రమణీ శరజాబ్జ భవానన సార సాహిత.....సర్వ సౌఖ్య విధాయకా" అన్న ఆ పద్యానికి ప్రతిపదార్ధ తాత్పర్యం వ్రాస్తూ-అందులోని ఓ అర్ధాన్ని విలోమంగా చూస్తే, 1461 అవుతుందంటారు నిరూపణతో! దాని అర్థం-తన సుందరకాండలో 1461  పద్యాలున్నవనే. ఇందులోని ప్రతి పద్యం పైన, ఒక్కో పద్యం లోని ప్రతి పంక్తి పైనా, ఆసక్తి-చేవ ఉన్న పరిశోధకులు, పరిశోధనా వ్యాసాలు వ్రాయగలిగితే, తెలుగు సాహిత్యంలో పీహెచ్డీలకు గిరాకీ పెరుగుతుందనడం లో అతిశయోక్తి లేదు. తెలుగు విశ్వవిద్యాలయం వారు ఆలోచించాల్సిన విషయమిది.


            "త్రిజట" స్వప్న వృత్తాంతం చెప్పే సమయంలో, ఉన్నట్లుండి, సీతాదేవి ఎడమ భుజం, ఎడమ తొడ అదిరాయి. త్రిజట ముందుగా తనకు కల వచ్చిందని చెప్తుంది. ఆ తర్వాత దానికనుగుణంగా సాముద్రిక చిహ్నాలను-శుభ శకునాలను గురించి చెప్తుంది. అంతకంటే బహిరంగ శకునం చెప్పడానికి, వాసుదాసు గారు, చంపకమాలలో వ్రాసిన వృత్త ప్రతిపదార్ధ తాత్పర్యంలో ఎంతో భావం ఇమిడి వుంది. అదీ ఆయనే వివరిస్తారు. అందులోని ముఖ్య విషయం మూడు విధాలైన కావ్యాల గురించి-వాటి గుణ గణాల గురించి.

"ఉత్తమం-మధ్యమం-అధమం" అని కావ్యాలను మూడు రకాలుగా విభజించ వచ్చు. కావ్యానికి "ధ్వని" ప్రాణం. శబ్దార్ధాలు "శరీరం" లాంటివి. అంటే, వాచ్యార్ధం కంటే ధ్వన్యర్థం ఎందులో అధికంగా వుంటుందో అదే ఉత్తమ కావ్యం అనాలి. అసలు ధ్వనే లేకపోతే దాన్ని అధమ కావ్యం అంటారు. కధల పుస్తకాల్లాంటివి చిత్రకావ్యాలంటారుధ్వన్యర్ధం ఒక సారి పదానికీ, ఒక సారి వాక్యానికీ, ఇంకో సారి ప్రబంధ సమష్టి పైనా వుంటుంది. అనాదిగా భగవత్ సంబంధమున్న జీవుడు, సంసారంలో చిక్కుకొని, బాధలు పడ్తుంటే, చూడలేని ఆచార్యుడు, వాడిని ఉధ్ధరించడానికి చేసే ప్రయత్నమే సుందరకాండలోని ధ్వన్యర్థం. ఈ అర్ధాన్ని కాండ మొదట్లోనే "తరువాత రావణాసుర వరనీత ..." అనే పద్యంలో సూచించడం జరిగింది. ఇది మొదటి "సర్గ" లో వివరంగా వుంది. లంకను "దశ-ఇంద్రియ" అధిష్టితమైన "దేహం" తోనూ, రావణ-కుంభకర్ణులను "అహంకార-మమకారాల" తోనూ, ఇంద్రజిత్తు లాంటి వారిని "కామ-క్రోధాలు" తోనూ, సీతాదేవిని వీటన్నింటిలో బంధించబడ్డ "చేతనుడు" గానూ, విభీషణుడిని "వివేకం" గానూ సూచించడం జరిగిందీ కాండలో. లంకలో శ్రమపడ్తున్న సీతంటే, సంసారంలో కష్టపడ్తున్న జీవుడనీ, అట్టి జీవుడికి, భగవత్ ప్రేరణతో, జానాన్ని ఉపదేశించేందుకు వచ్చిన వాడే "ఆచార్యుడు"అనీ-అతడే హనుమంతుడనీ కూడా  సూచించబడింది.


          వరుస క్రమంలో సుందరకాండ లోని అంతరార్ధాలను పఠిస్తూ పోతే, పైన చెప్పబడిన విషయాలు వివరంగా తెలుస్తాయి. ఆ తెలుసుకోవడం లోనే సుందరకాండ ఎందుకు చదవాలనే ప్రశ్నకు జవాబు దొరుకుతుంది. ఆరంభం నుండి సుఖాంతం వరకూ సుందరకాండ మందరంలో జరిగిన కథ క్లుప్తంగా జరిగిన కథ చదువుకుంటూ పోతే మరిన్ని వివరాలు బోధపడ్తాయి.

Tuesday, March 14, 2017

Inspirational, Message Oriented Telangana Budget : Vanam Jwala Narasimha Rao

Inspirational, Message Oriented 
Telangana Budget
Vanam Jwala Narasimha Rao

With an amount of Rs.1,49,646.00 crore proposed as total expenditure consisting of an estimated committed expenditure of Rs.61,607.20 crore and an expenditure of Rs.88,038.80 crore under ‘Pragati Paddu’ or expenditure on schemes, the 2017-2018 Telangana State budget was presented to the state Assembly.

It is no exaggeration to say that the fourth consecutive Budget presented by Finance Minister Eatala Rajender is both inspirational and message oriented. The Budget has reflected the Government’s objective of reaching out to all sections of people, all those in the hereditary professions, all religions, people working in various fields, all government departments that are entrusted with the implementation of development and welfare schemes, lower income as well as middle income groups and with no exception. The Budget has truly showed the way the Budget should be incorporating the concept of justice to all! Like the earlier three years’ Budgets, this Budget too, has echoed the commitment of Honourable Chief Minister K Chandrashekhar Rao towards welfare of the poor and economic development of the State.

The Budget further reflected the practical vision of the Chief Minister, who had a four and half decades of experience of working closely with the people and knowing their pulse as well as his thinking process. This Budget has addressed itself to the weaker sections, Minorities, BCs, MBCs, STs and other vulnerable sections that have been subjected to the oppression for decades together. This Budget has given a new hope, faith and confidence among the SCs/STs/people in hereditary professions that they would be able to lead a comfortable life henceforth which was non existent in the past. This Budget has the commitment and a comprehensive action plan to develop these sections of the people. This Budget has also revealed how rural economy can be strengthened, how people in the hereditary professions like Fisherman, Yadavs, Handloom Weavers and others can become great economic resources of the State. It also shows on how there will be a qualitative change on the rural life through the hereditary professions. There is an undisputed stamp of the CM on this Budget. This Budget is a perfect reflection of the CM’s dream of making the state a Bangaru Telangana State.

This Budget has amply proved that if the rural economy is strengthened and protected then the villages in Telangana State will be self-sufficient. The government has explained in detail on how, under the then united AP, the living conditions in the Telangana region were shattered, the negligence of agriculture, how artisans and other people living on their hereditary professions had to migrate to other places for a livelihood. The Budget is made to protect and sustain their lives. The Budget has emanated confidence that only through strengthening of the rural economy that the State’s economic development can march ahead. Accordingly, schemes were formulated to strengthen the hereditary professions. This Budget also showed that there is a lot of human resource available in the state and hereditary professions are a boon to the State. The state government has taken the first step to eradicate the tragedy of the rural areas and make over them for colorful future through this Budget.



One can find the spirit of the Telangana movement in this Budget. For those who believed that their lives would be bettered if a separate Telangana state is formed this budget is an answer, that, this is how the lives are going to be bettered under the Telangana State.  There is befitting answer to the Andhra leaders, the Prophets of Doom, who predicted that if a Telangana state is formed it would be disastrous. During the movement KCR and other leaders called the Andhra leader bluff and this Budget proved that the Telangana leaders were right.

In the initial stages of the Telangana state’s formation, to be frank, there was an uncertainty looming large. There were no well laid down proposals and no hint as to how to present a Budget? The first Budget was presented with guessed estimates.  To understand the financial condition of a new State it took one year, from one April 1 to the next year 31st March, to assess the situation. An analysis was done whether the State would have a positive Budget with a growth or will have a negative growth of a Budget with deficit. The state government has done a review with lots of patience and expertise. The detailed reviews that the CM had, proved that, the State would register a phenomenal financial growth rate in 2016-17 compared to 2015-16. And the rate will be better than other States in the country. There is marginal decrease in the rate in the third quarter of last financial year due to the demonetization. All these factors have been reflected in the present Budget.

Against this background and taking all concerned things into confidence the Government presented its budget with all transparency and in accordance with the well laid norms in this regard. The basis for this year’s budget is the broad fiscal policy as defined by the Government of India. The state has to be “alike” in this context and cannot be “unlike” as there is no alternate since the states are not independent as far as the fiscal policy broadly is concerned.

As directed and as desired by the Government of India the state budget is broadly classified as Revenue and Capital expenditures instead of the Plan and Non Plan expenditure. Items like establishment that include salaries, pensions, debt service, regularly allowed increase of DA as is done in GoI, maintenance of various assets of state, new employment creation etc., are brought under one category. The second category is the welfare measures of various categories. In accounting too, both the Centre and the state are following the guidelines given by the CAG. The Telangana state has also followed these new guidelines as part of the uniform policy in the country. Welfare programmes were brought under another category. The third category of expenditure pertains to pensions under the Welfare Schemes, Fee reimbursement, supply of fine rice etc. The concept of “Governance by Finance Department” is shifted to “Governance by all departments concerned”.

The present Budget is aimed at properly managing the financial situation that was neglected under AP rule, realizing the dreams of the oppressed classes and restoring the glory of Telangana.  The Budget also show cased the CM’s road map that the administration should work with people as Center and their issues as focal points. It also reflected the CM’s commitment that the fruits of development should reach to the lowest of the low among the society. With the changes that took place in the formulation of the Budget which have a bearing on the SC/ST Sub Plan, the Budget mentioned about a Special Fund to be created based on the population figure of the SC/STs. This was recommended by the SC/ST Committee. This is an important development and it has also shown the commitment this government has on SC/ST’s welfare.


In the speech given by the Finance Minister, in the Budget details and his remarks have clearly reflected the government’s aspirations and its thinking process.  A special mention is also made on the administrative reforms initiated by the government such as small units of administration and how they help the common man, decentralization of administration, administrative effectiveness and convenience to the people.  Through these reforms how geographical uniformity, cultural unity, proper utilisation of the local resources and administration to the doorstep of common man is also mentioned in the Budget. It also mentioned about on how the government has given priority to agriculture and its allied sectors, subsidies to poly house and micro irrigation schemes, irrigating one crore acres through the irrigation projects, development of fisheries, sheep rearing, welfare of the hand-loom weavers, Women and Child welfare, Welfare of Brahmins, 2 bed Room House scheme, Health and several others issues have find their mention as per their priority in the Budget.

Overall, the Budget is, inspirational and message oriented