Sunday, March 22, 2026

సాల్వుడిని, దంతవక్త్రుడిని వధించిన శ్రీకృష్ణుడు>>>>> శ్రీ మహాభాగవత కథ-78 : వనం జ్వాలా నరసింహారావు

 సాల్వుడిని, దంతవక్త్రుడిని వధించిన శ్రీకృష్ణుడు

శ్రీ మహాభాగవత కథ-78

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (మార్చ్ 23, 2026)

కంII              చదివెడిది భాగవతమిది,

చదివించును కృష్ణు, డమృతఝరి పోతనయున్

                               చదివినను ముక్తి కలుగును,

చదివెద నిర్విఘ్నరీతి ‘జ్వాలా మతినై

శ్రీకృష్ణుడు రుక్మిణీదేవిని పరిణయమాడడానికి తీసుకుని వస్తున్నప్పుడు, శిశుపాలుడికి సహాయంగా వచ్చి ఓడించబడిన సాల్వమహీపాలుడు కృష్ణుడి మీద పగబూనాడు. యాదవుడనేవాడు లేకుండా చేస్తానని భీషణ ప్రతిజ్ఞ చేసి అది నెరవేర్చుకోవడానికి శివుడి గురించి ఘోరమైన తపస్సు చేశాడు. అతడి భక్తికి మెచ్చిన శివుడు ప్రత్యక్షమై సాల్వుడిని వరం కోరుకొమ్మన్నాడు. తాను ఆకాశమార్గంలో కోరిన విధంగా సంచరించడానికి ఒక గొప్ప వాహనాన్ని ప్రసాదించమని అడిగాడు సాల్వుడు. తగిన విమానాన్ని నిర్మించి సాల్వుడికి ఇవ్వమని శివుడు మయుడికి చెప్పాడు. మయుడు శివుడు చెప్పినట్లే ‘సౌభకం అనే పేరుగల విమానాన్ని నిర్మించి సాల్వుడికి ఇచ్చాడు. ఆ విమానాన్ని ఎక్కి ద్వారకానగారానికి పోయి ఆ పురవాసులను నిర్బంధించసాగాడు సాల్వుడు.

ద్వారకానగారాన్ని అల్లకల్లోలం చేశాడు సాల్వుడు. విమానంలో కూచుని ఆకాశం నుండి చెట్లను, రాళ్లను యాదవులమీద కురిపించేవాడు. సాల్వుడి చేతిలో ద్వారకానగరం నాశనం కాబడింది. ఇదంతా ప్రద్యుమ్నుడు గమనించాడు. రథాన్ని అధిరోహించి సాల్వుడితో యుద్ధానికి వెళ్లాడు. ఆయన వెంట యాదవ శ్రేష్ఠులు కూడా వెళ్లారు. యాదవ-సాల్వ సైన్యాల యుద్ధం దేవ-దానవ యుద్ధాన్ని తలపింప చేసింది. సాల్వుడి మాయలని ప్రద్యుమ్నుడు చేధించాడు. మహాపరాక్రమంతో యుద్ధం చేశాడు. సాంబుడు కూడా సాల్వుడిని ఎదుర్కున్నాడు. సౌభక విమానం మీద బాణాలు వేశాడు. సాత్యకి అదే పని చేశాడు. ఇలా ఒక్కొక్క యదువీరుడు వారి-వారి పరాక్రమానికి అనుగుణంగా యుద్ధం చేశారు. సాల్వుడికి అమితమైన కోపం వచ్చింది. అతడి విమానం తన అమోఘమైన మాయలను చూప సాగింది. భీభత్సంగా తన మాయలన్నీ ప్రదర్శిస్తూ యాదవుల గుండెలు కలతపడేట్లు రెచ్చిపోయింది. దీంతో సాల్వుడికి ఎక్కడలేని ధైర్యం వచ్చింది. మరింత భీకరంగా పోరాడాడు. యాదవ సైన్యం కూడా వెనక్కు తగ్గలేదు.

ప్రద్యుమ్నుడికి, సాల్వుడి మంత్రి ద్యుముడికి మధ్య జరిగిన యుద్ధంలో ద్యుముడిని చంపాడు ప్రద్యుమ్నుడు. యుద్ధరంగం మొత్తం భీభత్సంగా తయారైంది. ఎవరూ తగ్గకుండా 27 రోజులపాటు రెండు సైన్యాలూ యుద్ధం చేశాయి. ఇంద్రప్రస్థపురం నుండి ద్వారకకు వస్తున్న శ్రీకృష్ణుడు శత్రువులతో యుద్ధం చేస్తున్న యాదవ వీరులను, ఆకాశవీధిలో వున్న సౌభక విమానాన్ని, అందులో వున్న సాల్వుడిని చూశాడు. తన రథాన్ని సౌభకం దగ్గరికి పోనిమ్మన్నాడు సారథిని. ఇది గమనించి సాల్వుడు పరాక్రమంతో ఒక్కసారి ముందుకు దూకాడు. శక్తి ఆయుధాన్ని శ్రీకృష్ణుడి సారథి దారుకుడి మీద ప్రయోగించాడు. దాన్ని శ్రీకృష్ణుడు పొడి చేసి నేలకూల్చాడు. తన బాణాలతో కృష్ణుడు సాల్వుడిని బాధించాడు. మాటల యుద్ధానికి దిగిన సాల్వుడు, తన స్నేహితుడు శిశుపాలుడిని శ్రీకృష్ణుడు సంహరించినందుకు, రుక్మిణిని ధర్మం తప్పి వరించినందుకు నిందించాడు. శ్రీకృష్ణుడు అప్పుడు విసిరిన గద దెబ్బకు సౌభక విమానంతో సహా పారిపోయాడు సాల్వుడు.

ఇదిలా వుండగా ఒక వ్యక్తి ఆకాశం నుండి శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చి, ఆయన తండ్రైన వసుదేవుడిని సాల్వుడు పట్టి బంధించి తీసుకుపోయాడని చెప్పాడు. శ్రీకృష్ణుడు కొంతసేపు చింతించాడు. ఇంతలో సాల్వుడు తన మాయా బలంతో మళ్లీ కృష్ణుడి ముందుకు వచ్చాడు. మాయా వసుదేవుడిని చూపిస్తూ, సాల్వుడు, అతడి శిరస్సును ఖండిస్తానని బెదిరించాడు. మాయా వసుదేవుడి తల నరికి సౌభక విమానంలో వెళ్లిపోయాడు. జరిగినదంతా మిధ్య అని యాదవ వీరులు కృష్ణుడికి చెప్పారు. అప్పుడు శ్రీకృష్ణుడు సాల్వుడిని చంపి తీరాలని నిశ్చయించుకున్నాడు. తీవ్ర బాణ వర్షంతో ఆకాశమంతా కప్పేశాడు. సాల్వుడి కిరీటాన్ని, ధనుస్సును, కవచాన్ని ముక్కలు ముక్కలు చేశాడు. గద విసరి విమానాన్ని పొడి పొడి చేశాడు. అది నేల కూలింది. దాన్ని సముద్ర మధ్యలో పడేట్లు చేశాడు కృష్ణుడు.

సాల్వుడు పౌరుషంతో గదను ధరించి శ్రీకృష్ణుడి మీదికి వచ్చాడు. గదను పట్టుకున్న వాడి చేతిని ఖండించాడు కృష్ణుడు. సుదర్శన చక్రాన్ని ప్రయోగించి సాల్వమహీపాలుడి శిరస్సును ఖండించాడు. ఇది చూసిన శిశుపాలుడి తమ్ముడు దంతవక్త్రుడు శ్రీకృష్ణుడి మీదికి వచ్చాడు. గద ధరించి శ్రీకృష్ణుడు వాడికెదురుగా వెళ్ళాడు. దంతవక్త్రుడు పెద్ద గద తీసుకుని కృష్ణుడి తలమీద కొట్టాడు. ఆగ్రహంతో కృష్ణుడు ఎదురు దెబ్బ తీశాడు. కృష్ణుడి గదాఘాతానికి దంతవక్త్రుడు ప్రాణాలు విడిచాడు. అతడి శరీరం నుండి వచ్చిన తేజస్సు శ్రీకృష్ణుడిలో లీనమైంది. దంతవక్త్రుడి తమ్ముడు విదూరథుడు కూడా శ్రీకృష్ణుడి మీదికి యుద్ధానికి వచ్చి చచ్చాడు.

శ్రీకృష్ణుడి విజయాన్ని చూసి యాదవులు అమితానందంతో ఆయన్ను కీర్తించారు. యుద్ధరంగం నుండి శ్రీకృష్ణుడు ద్వారకానగరంలోకి ప్రవేశించాడు. ఆ తరువాత తన అంతఃపురంలోకి వెళ్లాడు.

       (బమ్మెర పోతన శ్రీమహాభాగవతం, రామకృష్ణ మఠం ప్రచురణ ఆధారంగా)

FIRST ANNIVERSARY CELEBRATION of CENTER FOR BRAHMIN EXCELLENCE (CBE)>>>>>Vanam Jwala Narasimha Rao

CENTER FOR BRAHMIN EXCELLENCE (CBE)

FIRST ANNIVERSARY CELEBRATION

Hyderabad: March, 22, 2026

Vanam Jwala Narasimha Rao

The First Anniversary Celebration of the Center for Brahmin Excellence (CBE) was marked by an inspiring and forward-looking address by one of its members, N Ramchander Rao (President Telangana State BJP President), who underscored that the development of the Brahmin Community is intrinsically linked with nation building. He emphasized that a community known for its commitment to knowledge, values, and service must move forward with confidence, unity, and a renewed sense of purpose to contribute meaningfully to national progress.

Drawing inspiration from the leadership of Narendra Modi and the guiding principle of inclusive development, he called upon members to serve as role models for future generations, while also highlighting the importance of women empowerment, and their greater participation in civil services, and the need to expand outreach with structured training and engagement.

A comprehensive articulation of the organization’s journey, its priorities, and direction was detailed by the CBE President, who reflected on the purposeful beginnings of the institution, the clarity of its intent, and the significance of the first year as a foundation for long-term impact. He emphasized that CBE was not created for recognition or visibility, but to build a meaningful platform rooted in Dharma and driven by action.

He also said that the achievements of the first year, including structured initiatives, institutional credibility, and national-level engagement, were a testament to what a committed collective can accomplish. He called upon every member to recognize that participation in CBE is a responsibility, not a formality, and that the future of the organization depends on active contribution, shared ownership, and sustained engagement.

K Aravinda Rao briefly presented the gist of the book ‘Brahmin Genocide’ by Mahalingam Balaji (pen name Asi), a Tamil Nadu based professional with extensive global corporate experience and association with a Veda Gurukulam at Kumbhakonam. He highlighted the author’s perspectives on incidents of discrimination, micro-aggressions, and the broader civilizational context, including the stages and patterns through which such tendencies evolve. He recommended this thought-provoking book as a worthwhile read for awareness.

The deliberations were further enriched by the insights, suggestions, and perspectives of Executive Committee members and general members, reflecting a wide spectrum of experience and thought. There was a strong emphasis on expanding the scope of activities beyond current initiatives, with particular focus on student empowerment at multiple levels, strengthening economic foundations through entrepreneurship, improving internal networking and collaboration, and enhancing visibility and outreach. Members highlighted the need for distributed governance, data-driven approaches such as creating structured databases, and systematic planning for greater impact.

Issues relating to social perception, cultural awareness, and value-based living were also discussed, along with the importance of promoting confidence in identity while remaining inclusive and forward-looking. The collective sentiment was one of constructive introspection, with a clear resolve to build on the first year’s foundation and move towards more structured, scalable, and impactful interventions.

The completion of one year of the Center for Brahmin Excellence (CBE) marks not merely a milestone in time, but the consolidation of a purposeful and evolving institutional effort rooted in Dharma, guided by constitutional values, and oriented towards meaningful societal contribution. Conceived in the backdrop of rapidly changing socio-economic realities and the gradual disconnect between traditional knowledge systems and contemporary opportunities, CBE emerged as a structured response to ensure that a community historically associated with knowledge, values, and service is enabled to rediscover its relevance through dignity, self-reliance, and constructive participation in nation-building.

It is important to reiterate that this initiative was not born out of grievance or exclusion, but from a principled recognition that evolving forms of vulnerability, economic, educational, and representational, which require thoughtful, organized, and forward-looking interventions that align with the constitutional guarantee of equality before law and equal protection to all.

Within a short span of one year, CBE has moved beyond intent to action, establishing credibility, structure, and direction. The foundational phase focused on building a committed collective, ensuring regulatory compliance, and defining clear areas of engagement, but what stands out more significantly is the transition into purposeful initiatives that combine tradition with modern aspiration. Among these, the Civil Services Mentoring Initiative has emerged as a flagship effort, reflecting both the need and the opportunity to rebuild value-based participation in governance.

By identifying, mentoring, and supporting aspirants through structured processes involving experienced administrators and domain experts, CBE has sought to create not merely candidates, but individuals equipped with clarity, competence, and commitment to public service. This initiative is not symbolic, but it represents a long-term investment in nation-building through ethical leadership. At the same time, CBE has demonstrated that community development must be multidimensional. Support extended to traditional institutions, encouragement to emerging talent at national and international platforms, and the conceptualization of integrating classical knowledge with modern domains such as technology and entrepreneurship indicate a balanced approach.

The emphasis has consistently been on empowerment rather than assistance, on direction rather than dependency, and on excellence rather than entitlement. The organization has also taken steps towards structured functioning through sub-committees, enabling distributed leadership and deeper engagement, thereby reinforcing the principle that institutional strength lies in collective participation.

A defining dimension of CBE’s first year has been its engagement with issues of larger constitutional and policy significance. The decision to approach the Honorable Supreme Court in the context of the UGC Regulations 2026 reflects a mature and principled stance that transcends narrow community considerations. The core argument advanced was, discrimination must be recognized and addressed based on impact and not limited by identity, places CBE within a broader discourse on equality, fairness, and institutional balance.

This intervention was neither oppositional nor ideological, but it was an affirmation of the need for regulatory frameworks to remain inclusive, coherent, and consistent with Article 14, ensuring that no section becomes invisible within policy design. In doing so, CBE has positioned itself as a responsible stakeholder engaging with constitutional processes through dialogue, scrutiny, and reasoned representation.

The first anniversary General Body meeting of CBE provided an opportunity not only to reflect on these developments but, more importantly, to recalibrate priorities for the future. The deliberations revealed a clear and collective understanding that while the first year laid a strong foundation, the expectations from CBE are significantly higher going forward. There was broad consensus on the need to expand outreach, enhance visibility, and move towards more structured and measurable interventions.

Particular emphasis was placed on student empowerment across levels, with a recognition that challenges are not confined to civil services aspirants alone but extend to school, college, and early career stages. Equally important was the focus on women empowerment, not as a separate agenda but as an integral dimension of overall community progress. However, all not in one go, but phase-wise. The discussions also brought into sharp focus the need for economic strengthening as a foundational priority. It was widely acknowledged that sustainable empowerment must be anchored in financial stability, entrepreneurial growth, and skill development. In this context, the encouragement of entrepreneurship, support for community-based enterprises, and facilitation of professional networking assume critical importance.

The idea of building a structured database of youth, improving internal connectivity, and fostering collaboration across professions reflects a shift towards data-driven and system-oriented functioning. The emphasis is clearly on moving from informal goodwill to organized capacity. Another important strand that emerged is the need to address perceptional and narrative challenges. Members underscored that cultural identity and traditional practices must be articulated with clarity, confidence, and where necessary, with scientific and rational explanation.

The objective is not defensive assertion, but informed awareness that strengthens self-belief while remaining inclusive and respectful of the broader societal fabric. In parallel, the importance of value-based living, rooted in knowledge of Shastras, traditions, and ethical frameworks, was reiterated as a distinguishing strength that must be preserved even as the community adapts to modern demands.

Institutionally, there is a clear movement towards participative governance. The idea that membership in CBE is a responsibility rather than a status symbol found strong resonance. The need to avoid over-centralization, encourage initiative at all levels, and ensure accountability through defined roles and sub-committee structures was emphasized. Regular interactions, continuous engagement, and collective decision-making are being seen as essential to maintain momentum and coherence.

The underlying message is unambiguous, that the success of CBE will depend not on a few individuals, but on the active contribution of all its members. Looking ahead, the direction for CBE is both clear and demanding. The coming phase requires scaling up of initiatives without diluting quality, strengthening institutional processes, and expanding impact across multiple domains.

Civil Services mentoring shall continue as a core initiative, but it will be complemented by broader educational support systems, skill development programs aligned with emerging sectors such as artificial intelligence, and initiatives that promote entrepreneurship and economic resilience. At the same time, continued engagement with policy and governance issues will remain important, ensuring that CBE contributes constructively to debates on equality, fairness, and institutional design.

Above all, the emphasis will remain on building a community that is confident yet responsible, rooted yet progressive, and internally cohesive while externally contributive. The vision is not narrow-minded, but it is aligned with the larger national objective of inclusive development where every section participates with dignity. The articulation made during the anniversary that, the development of the Brahmin community is a key partner in nation building, captures this alignment succinctly. It reflects an understanding that community advancement and national progress are not competing goals, but complementary processes.

As CBE steps into its second year, the moment calls for renewed commitment, deeper engagement, and a more structured pursuit of excellence. The journey so far has demonstrated what is possible when intent is matched with action. The journey ahead will test the ability to sustain that momentum, expand its scope, and translate vision into measurable outcomes. With a strong foundation, a committed collective, and a clear sense of direction, CBE is well-positioned to evolve from an emerging initiative into a lasting institution that contributes meaningfully to society while staying true to its core values.

As aptly recalled at the conclusion of meeting, the journey ahead reminds the enduring words, ‘Miles and miles to go...’ signifying both humility in achievement and determination in purpose. The well attended meeting comprising among others: President Vijay Oddiraju, Secretary Jwala Narasimha Rao, Treasurer Sesha Prasad, Vice-President SV Rao, Joint Secretary MVR Sharma, EC Members LV Subrahmanyam, GR Ravi, and members K Aravinda Rao, Surya Mohan Surampudi, Vinod Achanta, Prasad Mavuduri, MLN Acharyulu, Harkara Srinivasa Rao, Mukku Srinivas, Saye Sekhar, PV Prabhakara Rao, Narendra Kamaraju, N Ramchander Rao, Surabhi Vani Devi, and Sekhar Maramraj etc. through their participation reflected the strength, depth, and commitment that define CBE, for the need to preserve, nurture, and contemporize a community that silently slipped into economic obscurity, despite vast intellectual capital. 

Saturday, March 21, 2026

Preserving Valmiki’s Symbolism at Bhadrachalam’s Sri Sita Ramachandra Swamy Devasthanam >>>>> (On Parabhava Nama Sri Rama Navami Celebration) : Vanam Jwala Narasimha Rao

 Preserving Valmiki’s Symbolism at Bhadrachalam’s

Sri Sita Ramachandra Swamy Devasthanam

(On Parabhava Nama Sri Rama Navami Celebration)

Vanam Jwala Narasimha Rao

The Hans India (march 22, 2026)

{{It may perhaps be inappropriate, for the highly learned and scholarly priests to cause confusion among the invitees (in recent times) through the marriage rituals performed on the Mithila Kalyana Mandapam under the auspices of the Bhadrachalam Sri Sita Ramachandra Swamy Devasthanam}}-Editor’s Synoptic Brief Note

Frequently I become inquisitive and question Spiritual Experts and Mythical Exponents, to elicit clarification on Marriages of the ‘Trimurti’ whether they were performed in accordance with the Vedic Marriage Procedure, and their begetting children as progenitor.

Vedic Marriage Ritual (Vivaha Samskara) as described in Asvalayana, Paraskara, Baudhayana Grihya Sutras, and Rig Veda Vivaha Sukta which includes, Vara-Aagamana (Groom’s Arrival), Kanya Dana, Panigrahana (Holding of Hands), Saptapadi (Seven Steps), Homa (Sacred Fire), Mangala Sutra Mantras etc. seldom observed for them.

My inquisitiveness is not without reason or rationale. At Bhadrachalam Sri Sitarama Swamy Temple, atypical situation prevails. The Annual Majestic Ritual of Sri Sita Rama Kalyanam, or the divine marriage of Rama and Sita (Human Incarnations), to the Proxy Icons (Utsav Vigrahas), has been transformed as Ramanarayana, Laxmi Kalyanam. Initially referring to the Bride and Groom as Sita and Rama, few minutes before actual Muhurta, they are being transformed as, Laxmi and Ramanarayana in their place. Their ancestral lineage (Pravara and Gotra) is also being changed altering them to Brahmins from Kshatriyas.

The original Puranic account of Laksmi choosing Vishnu (Not to speak of Ramanarayana) does not describe such a ritual ceremony, yet temple tradition follows this. Kalayanotsavam is not a historical repetition of an original Vedic Wedding of the deity. It is a ritual embodiment of Puranic Myth within temple culture. No attempt has ever been made to explain, in the language understandable to scholars and to common individuals, at least few interesting aspects from Valmiki’s Sanskrit Ramayana or Andhra Valmiki Vasudasu’s Ramayana Mandaram.

The Valmiki Sanskrit Ramayana, the Adi Kavya, and ‘Dhvani Kavya’ (Suggestive Poetry) consisting of 24000 Shlokas (verses), is a collection of Seed Syllables (Beeja Aksharas) composed by the Vedantin, Philosopher, Ascetic, Social Reformer, and Maharishi Valmiki.

According to Valmiki Ramayana, Sri Rama’s birth took place in the Vaivasvata Manvantara, Tretha Yuga, in the Lunar Vilambi Year, on the Navami Tithi of the Shukla Paksha in the month of Chaitra, under the Punarvasu Nakshatra on a Wednesday. Sri Rama’s Upanayana took place in Parabhava, when he was nine years old.

Vishwamitra took Sri Rama and Lakshmana to the city of Mithila, introduced to Janaka and asked him to show the Shiva Dhanush (Bow of Shiva) to Rama. Before showing, Janaka narrated the story of Sita’s birth. He stated that Sita was Virya Shulka (Valor) and that he would give the Ayonija (not born from a womb) Sita in marriage only to the one who could string the Shiva Dhanush, which no one was able to accomplish until then. Rama opened its lid, effortlessly held the bow with his palm, lifted it out, and as he pulled the bowstring tight, it broke with a thunderous sound.

Janaka said that he would give Sita in marriage to him. Subsequently, King Dasharatha arrived at the city of Mithila. While giving or taking a bride in marriage, one must know the family tree, background, and Pravara (lineage) of the bride and groom. Vashistha, explained the Surya dynasty's lineage, starting from the birth of Marichi to the four-faced Brahma, including Kashyapa, Vivasvan, Manu, Ikshvaku, as well as Sagara, Bhagiratha, Raghu, Aja, and up to Dasharatha. Janaka explained his lineage from Nimi down to his father Hrashvaroma.

When Sri Rama was twelve years and Sita was six years old, their Kalyanam (marriage) took place in the Saumya Lunar Year, on Phalguna Shuddha Shukla Trayodashi, under the Uttara Phalguni Constellation. It was not, however, on Chaitra Shukla Paksha Navami. Then the Sita’s wedding begins, which was described in Valmiki’s Sanskrit Ramayana and Andhra Valmiki’s Telugu Ramayana beautifully rather superbly.  Rama’s Pattabhishekam (coronation) took place in the year Dhata, on Chaitra Shuddha Saptami, Thursday, under the Pushyami constellation.

During the marriages of Ramanarayana (not Rama) and Lakshmi Devi (Not Sitadevi) in Bhadrachalam, held in the recent past, the Edurukolu, Kalyanam, and Pattabhishekam festivities were being conducted differently. It may perhaps be inappropriate, for the highly learned and scholarly priests to cause confusion among the invitees (in recent times) through the marriage rituals performed on the Mithila Kalyana Mandapam under the auspices of the Bhadrachalam Sri Sita Ramachandra Swamy Devasthanam.

By chanting ‘Achyuta Gotrodbhavaya’ they brought Ramanarayana Swamy in place of Sri Ramachandra. By birth a Kshatriya, Sri Rama, was instantly changed into a Brahmin with the ‘Achyuta Gotram.’ In place of Sita Devi, they brought Sita Mahalakshmi and changed the Pravara by assigning the Saubhagya Gotram. where Sri Rama’s Vasistha Gotra and Sita Devi’s Gautami Gotra vanished!

The scriptural origin (Birth) of Lord Maha Vishnu, as recorded in most Vaishnava Traditions is ‘Beginningless and Eternal.’ Bhagavata Purana describes Mahavishnu lying on the causal ocean. Thus, Vishnu is not born, but became the source of creation. Vishnu is not considered one who was born in the ordinary sense, but is instead regarded as the embodiment of the Supreme Truth, the great noble being who descended as the primary cause of all creation. In that case, how can he be one born of the Achyuta Gotra?

Divine marriages including Vishnu and Lakshmi were broadly ‘Theological Union’ and not a narrated Vedic Ritual Marriage. Nowhere, there is an explicit description of Vedic Rites and mention of Kanyadan. The union is portrayed as a cosmic divine reunion, an eternal philosophical pairing. Similarly, Goddess Lakshmi emerged during the churning of the ocean (Samudra Manthana). After being adorned by the devas, Lakshmi chose Lord Visnu as her eternal consort.

Since then, she resides eternally with Vishnu in Vaikuntha. No mention of marriage with Vishnu. In that case, how did she become one born of the Saubhagya Gotra? Beyond the facts of Lakshmi Devi’s emergence, her choosing Vishnu of her own accord, the garlanding, and thereafter being in an eternal relationship with him, there was no clear evidence in the Shastras (to the extent of my limited knowledge) to say that their marriage took place according to Vedic Procedures. There is also no mention anywhere regarding details such as the Varna, Pravara, or Gotra of those two.

That being so, what is the authority behind the ‘Achyuta’ and ‘Saubhagya’ Gotras? It is all incomprehensible. What is noteworthy is that during the Edurukolu, it felt as if the ‘two prominent Acharyas of Vasistha’s stature’ representing the sides of Sita Devi and Sri Rama engaged in a verbal duel of words. When describing the qualities and greatness of Sita and Rama, it should be close to reality. Only matters prior to their marriage should be mentioned, but not that would happen in the future. Pattabhishekam completely deviates Valmiki Ramayana.

Chinese philosopher Lin Yutang in his monumental work, The Wisdom of China and India, wrote that the ancient Greek mathematician Euclid proclaimed, ‘There is no royal road to learning.’ This means that to understand knowledge or a specific subject, hard work is inevitable, and no kind of education is possible without effort. Perhaps this philosophy applies to the grand festivities conducted in Bhadrachalam.

Even the greatest of scholars who studied the Vedas and Vedangas absolutely have no choice but to engage in further, continuous study!!!

At least in this Parabhava Lunar year, the Sri Rama Navami festival to be held on Friday, the March 27, 2026, in the most sacred shrine of Bhadrachalam, the Southern Ayodhya, should be conducted as 'Sri Sitarama Kalyanam’ and certainly not as the ‘Ramanarayana and Mahalakshmi’ Kalyanam. And it shall be in accordance with the Bhakta Ramadas Tradition, Valmiki Ramayana composition, and the faithful Telugu translation by Andhra Valmiki.

It should be explained in simple Telugu language to all the audience for the Sitarama Kalyanam. Humility should be preserved over adornments and ego, as well as inner sanctity and purity over outward display. Even if God forgives self-concocted liberties, mere mortals cannot digest them.

 రామాయణ, భారత నాయకత్వ లక్షణాలు 

సమాజానికి మార్గదర్శకం

వనం జ్వాలా నరసింహారావు

ప్రజాతంత్ర దినపత్రిక (మార్చ్ 22, 2026)

భారతీయ సంస్కృతిలో నాయకత్వం (Leadership) అనే భావన కొత్తది కాదు. వేల సంవత్సరాల క్రితం రచించబడిన వాల్మీకి రామాయణం మరియు వ్యాస మహాభారతం వంటి ఇతిహాసాలు కేవలం ఆధ్యాత్మిక, నైతిక గ్రంథాలు మాత్రమే కాకుండా, సమాజ పరిపాలన, ధర్మం, నాయకత్వ లక్షణాలు వంటి అంశాలపై లోతైన మార్గదర్శకత్వాన్ని అందించిన మహత్తర గ్రంథాలు. ఈ ఇతిహాసాలలో కనిపించే కొన్ని సందర్భాలు, అసలుసిసలైన నాయకుడు ఉన్నప్పుడు సమాజం ఎలా వికసిస్తుందో, నాయకుడు లేకపోయినా, వున్ననాయకుడు సరైనవాడు కాకపోయినా, ఎలా సంక్షోభంలో పడుతుందో స్పష్టంగా తెలియజేస్తాయి.

శ్రీరామాయణం అయోధ్య కాండలో దశరథ మహారాజు మరణించిన తరువాత అయోధ్యలో నెలకొన్న పరిస్థితిని వర్ణిస్తూ, రాజ్యానికి నాయకుడు లేకపోతే సమాజం ఎదుర్కొనే సమస్యలను మహర్షులు వివరించిన తీరు నాయకత్వ ప్రాముఖ్యతను స్పష్టంగా తెలియజేస్తుంది. రాజు లేకపోతే ప్రకృతి సైతం సహకరించదని, వ్యవసాయం సరిగ్గా జరగదని, ప్రజలు భయభ్రాంతులకు గురవుతారని, రైతులు పంటలు వేయడానికి సంకోచిస్తారని, వ్యాపారులు దూర ప్రయాణాలు చేయడానికి భయపడతారని, ప్రజల్లో నమ్మకం తగ్గిపోతుందని, చట్టం న్యాయం బలహీనపడి, సమాజంలో అవినీతి, అన్యాయం, అస్థిరత పెరుగుతాయని వారు హెచ్చరించారు.

రాజ్యాన్ని కాపాడే బాధ్యత గల నాయకుడు లేకపోతే ప్రజల దైనందిన జీవితం సైతం ప్రభావితం అవుతుంది. స్త్రీలు భయంతో సింగారించుకోవడం మానేస్తారు. ప్రజలు సాయంకాలం సంతోషంగా విహరించలేరు. పండుగలు, ఉత్సవాలు, యాత్రలు నిలిచిపోతాయి. అధికారులు న్యాయం చేయకుండా లంచాలకు లోనయ్యే ప్రమాదం ఉంటుంది. ఇలా నాయకత్వం లేని పరిస్థితి క్రమంగా ఒక సమాజాన్ని అస్తవ్యస్తానికి నెట్టేస్తుందని వివరిస్తారు.

ఈ ఆలోచనలను మరింత స్పష్టంగా తెలియజేసే మరో సందర్భం భరతుడు అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు కనిపిస్తుంది. అతడు నగరంలోని నిశ్శబ్దాన్ని చూసి ఆశ్చర్యపోతాడు. ఒకప్పుడు జీవంతో కళకళలాడిన అయోధ్య ఇప్పుడు వెలవెలబోతుంది. ప్రజల ముఖాల్లో ఆనందం కనిపించదు. దేవాలయాల్లో పూజలు లేవు, ఇళ్లలో వంటల వాసన లేదు, తోటలు నిర్జీవంగా కనిపిస్తాయి. ఈ వర్ణన ఒక నాయకుడి లేకపోవడం సమాజపు మానసిక స్థితిని కూడా ఎంతగా ప్రభావితం చేస్తుందో తెలియజేస్తుంది.

ఇదే భావన మహాభారతంలోని విరాటపర్వంలో కూడా కనిపిస్తుంది. అజ్ఞాతవాసంలో వున్న పాండవుల ఉనికి తెలుసుకోవడానికి, వారిని వెతుకుతున్న సందర్భంలో భీష్ముడు ధర్మరాజు గుణగణాలను వివరించేటప్పుడు, ఒక నిజమైన నాయకుడు ఎక్కడ ఉంటాడో అక్కడి ప్రజల స్వభావం ఎలా మారుతుందో చెప్పాడు. ధర్మరాజు ఉన్న చోట ప్రజలు సత్యవంతులు, దయాశీలులు, న్యాయపరులు అవుతారు. వారు మంచి పనులు చేస్తారు, శాస్త్రాలను గౌరవిస్తారు, ఇతరులకు సహాయం చేస్తారు. సమాజంలో నైతిక విలువలు పెరుగుతాయి. భీష్ముడు చెప్పిన ప్రకారం ఒక నాయకుడి వ్యక్తిత్వం సమాజంపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. మంచి నాయకుడు ఉంటే వ్యవసాయం అభివృద్ధి చెందుతుంది, పశుసంపద పెరుగుతుంది, ప్రజలు సంతోషంగా జీవిస్తారు. ప్రజల ప్రవర్తనలో కూడా నాయకుడి గుణగణాల ప్రతిబింబం కనిపిస్తుంది. ఇది నాయకత్వం కేవలం అధికారంతో సంబంధం ఉన్న విషయం కాదని, అది ఒక నైతిక శక్తి (Moral Force) అని తెలియజేస్తుంది.

ఈ ఇతిహాసాల సందేశం ఆధునిక ప్రజాస్వామ్య వ్యవస్థలకు కూడా ఎంతో ప్రాసంగికం. ఈరోజు మనం రాజ్యాల కాలంలో లేము. ప్రజాస్వామ్య ప్రక్రియ ద్వారా ఎన్నికల ద్వారా ఏర్పడే ప్రభుత్వ వ్యవస్థీకృత పాలనలో జీవిస్తున్నాము. అయినప్పటికీ సమాజం స్థిరంగా ఉండాలంటే బాధ్యతాయుతమైన, స్పందించే, దూరదృష్టి గల నాయకత్వం అవసరం. ప్రజాస్వామ్యంలో పదవి మాత్రమే నాయకత్వాన్ని నిర్ధారించదు. ఆ పదవిని నిర్వహించే వ్యక్తి ధర్మబద్ధంగా వ్యవహరించడమే అసలు నాయకత్వం.

రాజా దశరథుడు మరణించిన తరువాత అయోధ్య రాజసభలో జరిగిన చర్చలను వర్ణిస్తూ వాల్మీకి రామాయణం మనకు అందించే సందేశం, సమాజాన్ని నిలబెట్టే నాయకత్వ ప్రాముఖ్యతపై శాశ్వతమైన ఆలోచనలకు దారి తీస్తుంది. రాజ్యానికి నాయకత్వం లేకపోతే, లేదా అధికారంలో ఖాళీ ఏర్పడితే సమాజంపై దాని ప్రభావం ఎంత తీవ్రమవుతుందో అయోధ్యలో కలిసిన విజ్ఞానవంతులైన మహర్షులు గంభీరంగా హెచ్చరిస్తారు. అధికార (నాయకత్త్వ) శూన్యత ఎక్కువకాలం కొనసాగలేదని, అది సమాజంలో అస్థిరతకు, భయానికి, అవ్యవస్థకు కారణమవుతుందని స్పష్టం చేశారు. సమాజ శ్రేయస్సు, ప్రజల విశ్వాసం, పరిపాలనా స్థిరత్వం అన్నీ సమర్థవంతమైన నాయకత్వంపై ఆధారపడి ఉంటాయని వారి ఆలోచనలు తెలియజేస్తాయి.

వాల్మీకి రామాయణంలో ఈ ఆలోచనలు రాజ్యపాలన సందర్భంలో వ్యక్తమైనప్పటికీ, వాటి అంతర్భావం రాజరిక వ్యవస్థను దాటి విస్తృతమైన నాయకత్వ సూత్రాన్ని సూచిస్తుంది. ఆధునిక ప్రజాస్వామ్య వ్యవస్థలలో కూడా సమాజ స్థిరత్వాన్ని కాపాడటానికి సమర్థమైన, బాధ్యతాయుతమైన, ప్రజల కష్టాలకు స్పందించే, అప్రమత్తంగా వ్యవహరించే నాయకత్వం అత్యవసరం. భారతీయ ప్రజాస్వామ్య నేపథ్యంలో, ఎన్నికల ప్రక్రియ మాత్రమే కాకుండా సమాజాన్ని సమగ్రంగా నడిపించే నైతిక శక్తి నాయకత్వంలో ఉండాలి. నాయకుడి వ్యక్తిత్వం సమాజ నైతిక వాతావరణాన్ని ప్రభావితం చేస్తుందనే భావన మహాభారతంలోని విరాటపర్వంలో కూడా స్పష్టంగా ప్రతిధ్వనిస్తుంది.

రామాయణంలోని ఈ సందేశం మరో ముఖ్యమైన ప్రమాదాన్ని కూడా సూచిస్తుంది. నాయకత్వం రూపంలో మాత్రమే ఉండి, ఆత్మలో లేకపోవడం. పాలకులు అధికారంలో ఉన్నప్పటికీ వారు న్యాయాన్ని కాపాడటంలో, సమాజాన్ని రక్షించటంలో విఫలమైతే, ఆ పరిస్థితి పాలన లేకపోవడానికే సమానమవుతుంది. అధికార స్థానాలు నిండి ఉన్నప్పటికీ పరిపాలనా ధర్మం లేకపోతే సమాజంలో నమ్మకం తగ్గిపోతుంది. అటువంటి పరిస్థితిలో నాయకత్వం ఉన్నట్టే కనిపించినా, వాస్తవానికి అది సమాజానికి దిశ చూపలేని బలహీన స్థితిలోకి జారిపోతుంది.

ప్రజాస్వామ్య వ్యవస్థల్లో నాయకత్వ నిర్లక్ష్యం మరో రూపంలో కనిపించవచ్చు. నాయకులు ప్రజల అవసరాలను పట్టించుకోకపోయినప్పుడు, అన్యాయంపై స్పందించడంలో విఫలమైనప్పుడు, లేదా సమాజంలో ఉన్న అసమానతలను నిర్లక్ష్యం చేసినప్పుడు ఆ నిర్లిప్తత స్పష్టమవుతుంది. ప్రజాసేవకులు తమ బాధ్యతా భావాన్ని కోల్పోతే పరిపాలనకు ఉన్న నైతిక ఆధిక్యం క్రమంగా తగ్గిపోతుంది. అప్పుడు ప్రజలకు ప్రభుత్వ సంస్థలు సమాజ హితానికి కాకుండా కొద్దిమంది ప్రయోజనాలకే పనిచేస్తున్నాయన్న అనుమానం కలుగుతుంది. ఈ పరిస్థితి ప్రజల విశ్వాసాన్ని బలహీనపరచి, ప్రజాస్వామ్య వ్యవస్థ యొక్క ప్రాణశక్తినే దెబ్బతీయగలదు.

అయోధ్యలో మహర్షులు వ్యక్తం చేసిన ఆలోచన, ధర్మబద్ధమైన అధికారం లేకపోతే అవినీతి విస్తరిస్తుందని, అధికారులు న్యాయం చేయడం కంటే లంచాలు స్వీకరించే పరిస్థితి ఏర్పడవచ్చని చేసిన హెచ్చరిక, నేటి పరిపాలనలో కనిపిస్తున్న అవినీతి, అధికార దుర్వినియోగం వంటి సమస్యలను స్పష్టంగా గుర్తు చేస్తుంది. ప్రజాస్వామ్యం బలమంతా కేవలం ఎన్నికలలోనే లేదని, ప్రజల సంక్షేమం పట్ల నైతిక నిబద్ధతలో ఉందని ఈ సందేశం తెలియజేస్తుంది. అధికారంలో ఉన్నవారికి శక్తి ఉన్నప్పటికీ దాన్ని సమర్థంగా వినియోగించే సామర్థ్యం, వివేకం, ధైర్యం లేకపోతే పరిపాలన సున్నితంగా, అస్థిరంగా మారుతుంది.

వాల్మీకి రామాయణంలో పేర్కొన్న ఉదాహరణలు ఒక ముఖ్యమైన సత్యాన్ని వెల్లడిస్తాయి: నాయకత్వం అనేది కేవలం అధికార స్థానం కాదు. సామర్థ్యం, బాధ్యతల సమ్మేళనం. అయోధ్య సభలో జరిగిన చర్చలలో గోచరించిన అత్యంత లోతైన భావన, మంచి నాయకత్వం సమాజానికి కనిపించని ఒక భరోసాను అందిస్తుంది. పరిపాలన స్థిరంగా, న్యాయంగా ఉన్నప్పుడు ప్రజలు భయభ్రాంతులు లేకుండా తమ జీవనోపాధులను కొనసాగిస్తారు. పండుగలు జరుపుకుంటారు. ప్రయాణాలు చేస్తారు. విద్యాభ్యాసం కొనసాగిస్తారు. వ్యాపార కార్యకలాపాలు విస్తరిస్తాయి. సాధారణ జీవనం వికసించడానికి అవసరమైన ఆ నిశ్శబ్ద భద్రతే నిజమైన నాయకత్వం కలిగించే మహత్తర ఫలితం.

మహాభారతంలోని విరాటపర్వ ఘట్టం ఒక గంభీరమైన సూత్రాన్ని వెల్లడిస్తుంది. నాయకత్వం అనేది కేవలం అధికారాన్ని వినియోగించడం మాత్రమే కాదు. అది సమాజ స్వభావాన్ని మలిచే ఒక నైతిక శక్తి. నాయకత్వం లేకపోతే సమాజంలో అవ్యవస్థ పెరుగుతుంది. అదే సద్గుణాలతో కూడిన నాయకత్వం ఉన్నప్పుడు సమాజ నైతిక వాతావరణం మరింత ఉన్నత స్థాయికి ఎదుగుతుంది. పాలకుని వ్యక్తిత్వం ప్రజల ప్రవర్తనలో ప్రతిఫలిస్తుంది. నాయకుడి ధర్మబద్ధమైన స్వభావం ప్రజల జీవనశైలిని, సమాజ శ్రేయస్సును, దేశాభివృద్ధిని ప్రభావితం చేస్తుంది. నాయకుడి గుణగణాలు సమాజం మొత్తం మీద ప్రతిధ్వనించే శక్తిగా మారుతాయి.

రామాయణం, మహాభారతం అందించే ఈ రెండు దృక్కోణాలను కలిపి పరిశీలిస్తే, పరిపాలనకు సంబంధించిన ఒక శాశ్వత సూత్రం స్పష్టమవుతుంది. నాయకత్వాన్ని కేవలం అధికార స్థానం ఆధారంగా కాకుండా, న్యాయాన్ని కాపాడగల సామర్థ్యం, ప్రజల్లో విశ్వాసం కలిగించే శక్తి, సామూహిక సంక్షేమాన్ని ప్రోత్సహించే నిబద్ధత ఆధారంగా అంచనా వేయాలి. అయోధ్యలోని మహర్షులు ఒక దేశ స్థిరత్వం తెలివైన, ధర్మనిష్ఠ గల నాయకులు సమయానికి ముందుకు రావడంపై ఆధారపడి ఉంటుందని గుర్తించారు. పరిపాలన అనేది కేవలం రాజకీయ వ్యవస్థ కాదనీ, అది సమాజాన్ని దారితీసే వ్యక్తులపై నిక్షిప్తమైన ఒక నైతిక బాధ్యతనీ వారి ఆలోచనలు మనకు గుర్తు చేస్తాయి.

ఈ కారణంగా రామాయణంలో కనిపించే ఆ కథనం నేటి ప్రజాస్వామ్య నాయకత్వంపై జరుగుతున్న చర్చలకు కూడా వెలుగు నింపుతుంది. మంచి పరిపాలనను నిలబెట్టే గుణగణాల గురించి ఆలోచించడానికి ప్రేరేపిస్తుంది. నిజాయితీ, అప్రమత్తత, కరుణ, సామర్థ్యం, ప్రజల సంక్షేమం పట్ల నిజమైన నిబద్ధత వంటి విలువలు మంచి నాయకత్వానికి ఆధారం కావాలి. నాయకుడి వ్యక్తిగత స్వభావం కేవలం పరిపాలనా నిర్ణయాలపై మాత్రమే కాకుండా, అతడు పాలించే సమాజంలోని నైతిక వాతావరణంపైన కూడా గాఢమైన ప్రభావం చూపుతుంది.

అయోధ్య మహర్షుల ఆలోచనలు మరో ముఖ్యమైన విషయాన్ని కూడా తెలియజేస్తాయి. నాయకత్వం అనేది కేవలం ఒక పాలకుడు అధికారంలో ఉండడమే కాదు. ఆధునిక ప్రజాస్వామ్య వ్యవస్థల్లో ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి వంటి పదవులు ఎల్లప్పుడూ ఎవరో ఒకరు నిర్వహిస్తూనే ఉంటారు. కానీ అసలు ప్రశ్న పదవి నిండుతనంతో కూడి వున్నదా, లేదా అనేదే. ఆ పదవిలో ఉన్న వ్యక్తి నిజమైన, సమర్థమైన, బాధ్యతాయుతమైన నాయకత్వాన్ని అందిస్తున్నాడా అనే విషయమే ముఖ్యమైనది. ప్రజాస్వామ్యంలో నాయకత్వ మార్పులు ఎన్నికల ద్వారా గానీ, రాజ్యాంగ ప్రక్రియల ద్వారా గానీ, రాజకీయ పార్టీల అంతరంగిక పరిణామాల ద్వారా గానీ జరుగుతుంటాయి.

కొన్నిసార్లు ఈ మార్పులు ఒక పార్టీ నుండి మరొక పార్టీ అధికారంలోకి రావడంతో సాఫీగా జరుగుతాయి. మరికొన్నిసార్లు అంతర్గత పోటీలు, వ్యూహాత్మక కదలికలు, రాజకీయ లెక్కలు వంటి కారణాల వల్ల రూపుదిద్దుకుంటాయి. అలాంటి సమయంలో ఒక దేశానికి ప్రభుత్వం ఉన్నట్టే కనిపించినా, నాయకత్వ స్ఫూర్తి బలహీనంగా లేదా అనిశ్చితంగా కనిపించే పరిస్థితి ఏర్పడవచ్చు. అటువంటి సందర్భాల్లో కేవలం అధికార పదవులు ఉండడం మాత్రమే పరిపాలనలో స్పష్టత, నిర్ణయాత్మకత లేదా నైతిక ఆధిక్యాన్ని హామీ ఇవ్వదు. నాయకత్వం సంస్థలకు దిశ చూపాలి, ప్రజలకు ధైర్యం కలిగించాలి, అనిశ్చిత పరిస్థితుల్లో సమాజాన్ని నడిపించాలి. అలా చేయకపోతే ప్రజల విశ్వాసం తగ్గిపోవడం ప్రారంభమవుతుంది. సంస్థల ప్రభావశీలత కూడా క్రమంగా క్షీణిస్తుంది.

ఈ లోతైన సత్యాన్ని అయోధ్య మహర్షులు సహజంగా గ్రహించారు. రాజ్యంలో శాంతి, స్థిరత్వం నిలవాలంటే చురుకైన, బాధ్యతాయుతమైన, ధర్మబద్ధమైన నాయకత్వం అవసరమని వారి ఆందోళన సూచించింది. ఈ భావన నేటి ప్రజాస్వామ్య సమాజాల్లో కూడా సమానంగా ప్రాసంగికమే. నాయకత్వానికి నిజమైన చట్టబద్ధత కేవలం పదవిని ఆక్రమించడం వల్ల కాకుండా, ఆ పదవికి సంబంధించిన బాధ్యతలను నిబద్ధతతో నిర్వర్తించడం వల్లే లభిస్తుంది. అందువల్ల భారతీయ ఇతిహాసాలు సమాజానికి గుర్తు చేస్తున్న సందేశం: నాయకత్వాన్ని పదవి ఆధారంగా కాకుండా, సమాజ స్థిరత్వాన్ని కాపాడగల శక్తి, న్యాయాన్ని నిలబెట్టే ధర్మబద్ధత, ప్రజల సామూహిక శ్రేయస్సుకు సేవచేసే నిబద్ధత ఆధారంగా అర్థం చేసుకోవాలి.

అందుకే ప్రజాస్వామ్య పరిపాలనలో, అయోధ్య సభలో ఉన్న మహర్షుల మాదిరిగా, అనుభవజ్ఞులైన రాజనీతిజ్ఞుల, పండితుల, న్యాయవేత్తల, పరిపాలనారంగ సలహాదారుల, నిర్ణయ ప్రక్రియకు దోహదపడే పాత్రకు ప్రాధాన్యం ఇవ్వాలి. రాజకీయ వ్యవస్థలు శతాబ్దాల పాటు మారుతూ వచ్చినా, పరిపాలనకు సంబంధించిన మౌలిక సూత్రాలు మాత్రం స్థిరత్వాన్ని కోల్పోలేదు. రామాయణం, మహాభారతం అందించే సందేశం ఆధునిక ప్రజాస్వామ్యాలకు ఒక స్పష్టమైన పాఠం. సమాజ సంక్షేమాన్ని లక్ష్యంగా పెట్టుకున్న నైతిక, బాధ్యతాయుత, జ్ఞానవంతమైన నాయకత్వం ఉన్నప్పుడే స్థిరమైన పరిపాలన సాధ్యమవుతుందన్న మార్గదర్శకత్వం. ఇతిహాసాల ఆలోచనలు భారతీయ నాగరికతలో నాయకత్వంపై లోతైన, నిరంతరమైన భావ పరంపర.

ఆధునిక ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక ప్రమాదం ఉంది. ప్రభుత్వం ఉండవచ్చు, కానీ నాయకత్వం, ఆత్మ లేకపోవచ్చు. అధికారంలో ఉన్నవారు ప్రజల అవసరాలను పట్టించుకోకపోతే, అన్యాయాన్ని ఎదుర్కొనే ధైర్యం లేకపోతే, పరిపాలనలో నైతికత తగ్గిపోతుంది. అప్పుడు ప్రజలు ప్రభుత్వంపై నమ్మకం కోల్పోతారు. సంస్థలు ప్రజల కోసం కాకుండా కొందరి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నాయన్న భావన కలుగుతుంది.

Friday, March 20, 2026

The Fifth Friday Evening at Press Club Hyderabad >>>>> Firewood Stove, Memory, and the Turning Wheel : Vanam Jwala Narasimha Rao

 The Fifth Friday Evening at Press Club Hyderabad

Firewood Stove, Memory, and the Turning Wheel

Vanam Jwala Narasimha Rao

(Friday, March 20, 2026)

If the first Friday evening gathering planted a seed, and the second nurtured it into a living dialogue, the fifth meeting, held today, offered a quiet reminder that continuity itself is becoming the strength of this evolving initiative.

The setting remained unchanged: the familiar space at the Press Club, the unhurried hours, and the absence of formal structure. Yet, each meeting seems to bring with it a new layer of experience, almost as if memory itself is choosing its moments to surface.

This evening, however, began with something more elemental, the fire.

A modest arrangement of food prepared on a traditional wood-burning earthen stove drew immediate attention. In an age of LPG cylinders, induction stoves, and urban convenience, the sight, and more so the taste of food cooked over firewood carried an unexpected resonance.

The Mirchi Bajji, simple in form yet rich in flavour, became more than a snack. It became a conversation starter.

There was, inevitably, a passing remark, half in joke, half in reflection, about how global events, such as tensions in distant regions like Iran, and the resulting uncertainties in fuel supplies, often have a way of quietly reshaping local habits. Whether or not LPG shortages truly dictate such returns to tradition is secondary.

What mattered was the thought it triggered: culture, like fortune, moves in cycles. What we move away from in the name of progress often returns, not as regression, but as rediscovery.

The wheel turns. Practices once considered outdated reappear with renewed relevance. Firewood, it seemed, had made a dignified, if symbolic, comeback for the evening.

Present at the gathering were Bhandaru Srinivasa Rao, GK Murthy, Subba Rao, and myself. The conversation, as has now become characteristic, unfolded without agenda. It moved gently across time, touching upon earlier Door Darshan assignments, the evolving nature of journalistic work, and a reflective comparison between the core value of the journalism profession and the diversions offered by deputation assignments.

There was no attempt to arrive at conclusions. Instead, there was a shared willingness to examine, to recall, and to place experiences side by side. In these moments, what emerges is not debate, but perspective.

An important thread that surfaced once again was the need to expand the circle. These gatherings, while intimate, are not intended to remain exclusive. The idea is not to preserve memory within a closed group, but to gradually widen participation by inviting more professionals, more voices, and more lived experiences into the fold. The coming Fridays may well see a more deliberate effort in this direction.

Hindustan Times Bureau Chief Srinivasa Rao Apparasu, accompanied by his friend, joined the table briefly. Their presence, even for a short while, added fresh strands of experience to the ongoing conversation, reinforcing the idea that each participant, however briefly present, contributes to the collective narrative.

Press Club Secretary Ramesh, in his characteristic style of quiet courtesy, spent considerable time with the group, engaging with ease and without formality. Manager Ramachandar, attentive as always, ensured that comfort remained unobtrusive yet constant. Such gestures, though seemingly routine, form the understated framework within which these conversations thrive.

What is becoming increasingly evident across these meetings is a subtle methodological shift. Without formally stating it, the gatherings are evolving into spaces where experiences are not merely shared, but gently elicited. There is a conscious, though unspoken, effort to draw out memories from each participant, without pressure, without hierarchy, and most importantly, without inhibition.

No single voice dominates. No narrative is imposed. Instead, recollections emerge in fragments, are picked up by others, and gradually shape themselves into collective memory. In this process, hesitation gives way to ease, and ease to openness.

If earlier meetings established the possibility of such an initiative, and subsequent ones strengthened its rhythm, this fifth gathering suggests that a certain maturity is setting in.

The conversations are becoming more natural, yet more meaningful. The structure remains informal, yet the intent is steadily sharpening. What lies ahead is not expansion for its own sake, but enrichment through inclusion. More participants, more perspectives, and more systematic documentation of lived experiences may gradually transform these evenings into something larger than their modest format suggests.

In a time when immediacy often overshadows reflection, and information travels faster than understanding, these Friday evenings continue to offer a counterpoint: a space where time slows down just enough for memory to speak.

The formula, though simple, continues to evolve in spirit:

Meet. Reflect. Document. Continue.

And perhaps now, with the turning of the wheel:

Rediscover. Reconnect. Renew.

Thursday, March 19, 2026

ఈ కల్యాణం సీతారాములకేనా? >>>>> అయ్యో.. రామచంద్రా..! గోత్రాలు, ప్రవర మార్చేశారు! >>>>> వనం జ్వాలా నరసింహారావు

 ఈ కల్యాణం సీతారాములకేనా?

అయ్యో.. రామచంద్రా..! గోత్రాలు, ప్రవర మార్చేశారు!

(ఏదీ భద్రాచల శ్రీరామ నవమికి వాల్మీకి ప్రతీక, చరిత్ర, ఆధ్యాత్మికత)?

వనం జ్వాలా నరసింహారావు

ఆంధ్రజ్యోతి దినపత్రిక నవ్యపేజీ

(అంధ్రప్రదేశ్, తెలంగాణ ఎడిషన్లు: మార్చ్ 20, 2026)

ఆధ్యాత్మికవేత్తలను, శాస్త్రవ్యాఖ్యాతలను, పండిత ప్రవచనకర్తలను ఆశ్రయించి, త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల వివాహాలు, వేదాలలో పేర్కొన్న సంప్రదాయ ప్రక్రియ ప్రకారమే జరిగాయా, వారి పిల్లలు గర్భస్థ సంతానమేనా అన్న విషయంలో స్పష్టత కోరాను. వేదసంస్కారాలలో ప్రధానమైన వివాహం గురించి అశ్వలాయన, పరాస్కర, బోధాయన గృహ్యసూత్రాలు, ఋగ్వేదంలోని వివాహ సూక్తాలకు అనుగుణంగా వివాహాలు జరిగాయా అన్నదే సందేహం. వరాగమనం (వరుడి ఆగమనం), కన్యాదానం, పాణిగ్రహణం (వధువు చేయి పట్టుకోవడం), సప్తపది (ఏడు అడుగులు), హోమం (పవిత్ర అగ్ని సాక్షిగా క్రతువు), మంగళసూత్ర మంత్రాలు మొదలైన ప్రధాన కర్మలు సూచించబడ్డాయి. ఈ విధమైన సంపూర్ణ వేదోక్త వివాహ విధానం త్రిమూర్తుల వివాహాలలో ఆచరించబడినట్లు శాస్త్రాల్లో లేదేమోనన్న భావన నా మనసులో ప్రశ్నగా మిగిగిలింది.

ఈ ఆలోచన కలగడానికి ప్రధాన కారణం, ఈ పరాభవనామ సంవత్సరం పవిత్ర శ్రీరామనవమినాడు భద్రాచలంలో జరగబోయేది త్రిమూర్తులలో ఒకరైన రామనారాయణ (విష్ణుమూర్తి) లక్ష్మీదేవిల వివాహమా? లేక, ఆబాలగోపాలం ఎదురుచూస్తున్న విష్ణుమూర్తి అవతారమైన శ్రీరామచంద్రమూర్తికి, అయోనిజ సీతాదేవితో కళ్యాణమా?  గత విశ్వావసునామ సంవత్సర చైత్ర శుక్ల పక్ష నవమి-దశమిన, (ఏప్రియల్ 6-7, 2025) దక్షిణ అయోధ్య భద్రాచలంలో, ఉద్దండ పండితుల, వేదవేదాంగ పారంగతుల, ఘనాపాఠీల ఆధ్వర్యంలో అంగరంగ వైభోఘంగా జరిగిన శ్రీ సీతారామ (రామనారాయణ?) కల్యాణం, శ్రీరామ పట్టాభిషేక మహోత్సవాలలో ఆసాంతం అర్చక మహాశయుల దృష్టంతా ఎన్నిసార్లు, ఏవిధంగా రాముడిని రామనారాయణుడుగా, సీతాదేవిని మహాలక్ష్మిగా ఆహుతులకు పరిచయం చేయాలన్న తపనే తప్ప ఆధ్యాత్మిక వైభోగమే కనపడలేదు. వాల్మీకి సంస్కృత రామాయణంలో, ఆంధ్రవాల్మీకి వాసుదాసు రామాయణం మందరంలోని కనీసం కొన్ని ఆసక్తికరమైన విషయాలనైనా, పండిత-పామరులకు అర్థమయ్యే భాషలో విశదీకరించే ప్రయత్నం జరగలేదు.

వేదాంతి, దార్శనికుడు, తపస్వి, సామాజిక సంస్కర్త, మహర్షి వాల్మీకి కూర్చిన బీజాక్షరాల సమాహారమే 24 వేల శ్లోకాల ‘ధ్వని కావ్యమైన’ సంస్కృత రామాయణం. అష్టాక్షరీ మంత్రంలోని ‘రా’ శబ్దం, పంచాక్షరీ మంత్రంలోని ‘’ శబ్దం కలిపి వశిష్ఠ మహర్షి ఏ పుణ్య ముహూర్తంలో ‘రామ’ నామాన్ని నిర్ణయించారో కాని, యుగయుగాలకు, అది తారక మంత్రమై, అజరామరమైంది. వాల్మీకి మహర్షి ఆదికావ్యం రామాయణంలో వేదార్థం, వేదం స్వరూపం విస్తరించి చెప్పడం జరిగింది. కావ్యంలో అనృతం కొంచెమైనా వుండదని బ్రహ్మ వరం. ఇలాంటి యోగ్యత, మహాత్మ్యం, గాయత్రీ ప్రణవ మంత్రాది సంపుటీకరణ ఇతర గ్రంథాలలో లేవు.  

'మానిషాద ప్రతిష్టాం త్వ...' శ్లోకం నుంచి ప్రారంభించిన వాల్మీకి రామాయణం అవశ్య పఠనీయం. సంస్కృతం రానివారికోసం, ఆంధ్రవాల్మీకిగా, వాసుదాసుగా ప్రసిద్ధికెక్కిన శ్రీమాన్ వావిలికొలను సుబ్బారావు (1863-1939) నూట ఏబై సంవత్సరాలకు పూర్వం, యథావాల్మీకంగా, పూర్వ కాండలతో సహా ఉత్తర కాండను కలిపి 24 వేల శ్లోకాలకు 24 వేల పద్యాలతో, సులభమైన వ్యాఖ్యానంతో, ‘తెలియు మా నిషాదుండ ప్రతిష్ఠ నీక ...’ పద్యంతో ప్రారంభించి, మందరం అనే పేరుతో అద్భుతంగా, రసరమ్యంగా తెనిగించారు. అలాంటి వాల్మీకి రామాయణం అత్యద్భుతమైన ఘట్టాలలో ‘శ్రీ సీతారాముల కల్యాణం, శ్రీరామ పట్టాభిషేకం’ ప్రధానమైనవి.

వాల్మీకి, ఆంధ్ర వాల్మీకుల వ్యాఖ్యానం ప్రకారం: వైవస్వత మన్వంతరం, త్రేతాయుగం, విలంబినామ సంవత్సరం, చైత్ర మాసం శుక్ల పక్ష నవమి తిథి నాడు, పునర్వసువు నక్షత్రంలో బుధవారం నాడు శ్రీరామజననం. జనన కాలంలో గురువు, చంద్రుడు, కర్కాటక లగ్నంలో వున్నారు. జన్మ లగ్నం కర్కాటకం. మేషంలో రవి, బుధులు, తులలో శని, మకరంలో కుజుడు, మీనంలో శుక్రుడు వున్నారు. చైత్ర బహుళ పంచమి నాడు నామకరణం, పరాభవ సంవత్సరంలో తొమ్మిదో ఏట శ్రీరాముడికి ఉపనయనం జరిగింది.

శ్రీరామలక్ష్మణులను విశ్వామిత్రుడు మిథిలా నగరానికి తీసుకుని వెళ్లాడు. జనక మహారాజుకు పరిచయం చేసి, శివ ధనుస్సును చూపించమన్నాడు. జనకుడు దాన్ని చూపించే ముందు సీత జన్మ వృత్తాంతం చెప్పాడు. సీత వీర్యశుల్కనీ, ఇంతవరకు ఎవరు కూడా ఎక్కుపెట్టని శివ ధనుస్సును ఎక్కుపెట్టగల వాడికే అయోనిజైన సీతను ఇచ్చి వివాహం చేస్తానని అన్నాడు. ధనుస్సును చూపించగానే, రాముడు  పెట్టె దగ్గరికిపోయి, దాని మూత తెరిచి, విశ్వామిత్రుడి అనుమతితో అవలీలగా వింటిని అరచేత్తో పట్టుకొని, బయటకు తీసి, అల్లెతాటిని బిగువుగా లాగుతుంటేనే, విల్లు ఫెల్లుమని రెండుగా విరిగిపోయింది.

రామచంద్రమూర్తి భుజబలం చూసానని, సీతనిచ్చి వివాహం చేస్తానని జనకుడు అన్నాడు. దరిమిలా దశరథ మహారాజు మిథిలా నగరానికి రావడం జరిగింది. కన్యను ఇచ్చి, పుచ్చుకొనేటప్పుడు, అధమపక్షం మూడుతరాల వంశజ్ఞానం తెలుసుకోవాలి. అలాకాకుండా కన్యను ఇవ్వకూడదని ఒక నమ్మకం, తీసుకొననూ కూడదు అనేది సనాతన ఆచారం. వివాహంలో వధూవరుల వంశవృక్షం, నేపధ్యం, ప్రవర అవశ్యంగా తెలియాలి. ధన ధాన్యాలు ఎంత సమృద్ధిగా వున్నప్పటికీ, వివాహ విషయంలో ఇది ప్రధానమని శాస్త్రం చెపుతున్నది.

తదనుగుణంగా, ఇక్ష్వాకువంశానికి కులగురువైన వశిష్ఠుడు సూర్యవంశక్రమాన్ని వివరిస్తూ, చతుర్ముఖ బ్రహ్మకు మరీచి జన్మించడం నుండి మొదలుపెట్టి, కశ్యపుడు, వివస్వంతుడు, మనువు, ఇక్ష్వాకుడుతో సహా సగరుడు, భగీరథుడు, రఘుడు, అజుడు, దశరథుడు దాకా చెప్పాడు. జనక మహారాజు తనవంశక్రమాన్ని నిమి నుండి తన తండ్రి హ్రస్వరోముడు దాకా వివరించాడు. శ్రీరాముడికి పన్నెండు సంవత్సరాల వయసున్నప్పుడు, సీతకు ఆరేళ్ళ వయసులో, సౌమ్యనామ సంవత్సరం ఫాల్గున శుద్ధ శుక్ల త్రయోదశి ఉత్తర ఫల్గుణీ నక్షత్రంలో, సీతారాముల కల్యాణం జరిగింది. అంతేకాని, చైత్ర శుక్ల పక్ష నవమి నాడు కాదు. అది వేరే సంగతి.

తరువాత సీతా కళ్యాణ ఘట్టం మొదలవుతుంది. దానిని వాల్మీకి సంస్కృత రామాయణంలో ఇలా వర్ణించడం జరిగింది. ‘తతస్సీతాం సమానీయ సర్వాభరణభూషితామ్; సమక్షమగ్నే స్సంస్థాప్య రాఘవాభిముఖే తదా; అబ్రవీజ్జనకో రాజా కౌసల్యానన్దవర్ధనమ్. ఆంధ్రవాల్మీకి రామాయణం మందరంలో వాసుదాసుగారు ఇలా తెనిగించారు. ‘సీతను సర్వాభరణో, పేతను దా నిలిపి నగ్ని కెదురుగ గౌసల్యా తనయున కభిముఖముగ, క్ష్మాతలనాథుండు రామచంద్రున కనియెన్.’ అలంకారాలతో ప్రకాశిస్తున్న సీతను, అగ్నికి ఎదురుగా, శ్రీరామచంద్రమూర్తికి అభిముఖంగా, నిలువబెట్టి, జనక మహారాజు శ్రీరామచంద్రమూర్తితో ఇలా అన్నాడు.

‘ఇయం సీతా మమ సుతా సహధర్మచరీ తవ; ప్రతీచ్ఛ చైనాం భద్రం తే పాణిం గృహ్ణీష్వ పాణినా’ (వాల్మీకి సంస్కృత రామాయణం)....’ఈ సీత నాదుకూతురు, నీ సహధర్మచరి దీని నిం గై కొనుమా కౌసల్యాసుత, నీకును భాసురశుభ మగు గ్రహింపు పాణిం బాణిన్’  (ఆంధ్రవాల్మీకి రామాయణం మందరం). దీనర్థం: ‘కౌసల్యా కుమారా, ఈ సీత నా కూతురు. నీ సహధర్మచారిణి. ఈమెను పాణి గ్రహణం చేసుకో. నీకు జగత్ ప్రసిద్ధమైన మేలు కలుగుతుంది. నీకు శుభం కలుగుతుంది. మంత్రపూర్వకంగా ఈమె చేతిని నీ చేత్తో పట్టుకో. రామచంద్రా, పతివ్రత, మహా భాగ్యవతి అయిన నీ సీత, నీ నీడలా ఒక్కసారైనా నిన్ను విడిచి వుండదు’. అని అంటూ, మంత్రోచ్ఛారణతో పవిత్ర జలధారలను రామచంద్రమూర్తి చేతుల్లో జనక మహారాజు ధారపోశాడు.

వివాహం శాస్త్ర ప్రకారం వైభవంగా జరిగింది. కన్యాదానం చేస్తూ జనకుడు రాముడిని ‘కౌసల్యా సుత’ అని సంబోధించడం ఆసక్తికరమైన విషయం. అలాగే, ఈ సీత’ (ఇయం సీతా) అంటాడు జనకుడు రాముడితో. సిగ్గుతో సీత తన చేయి పట్టుకొమ్మని, తనంతట తానే రాముడిని అడగదు. అందుకే జనకుడు సాక్షాత్తు లక్ష్మీదేవైన సీతను రాముడికి ఇస్తున్నాననే అర్థమొచ్చే విధంగా 'ఈ సీత' అన్నాడు. సీత నాగటి చాలులో దొరికినప్పటికీ జనకుడు సగర్వంగా, 'నాదుకూతురు' (మమ సుతా) అని చెప్పాడు. నీ ‘సహధర్మచరి(సహధర్మచరీ తవ) అనడమంటే, రాముడేది ధర్మమని భావిస్తాడో, దానిలోనే ఆమె ఆయనకు తోడుగా ఆ కార్యాన్ని నిర్వహిస్తుందని అర్థం.  రామ పట్టాభిషేకం ధాత నామ సంవత్సరం, చైత్ర శుద్ధ సప్తమి గురువారం పుష్యమి నక్షత్రంలో జరిగింది.

ఈ నేపధ్యంలో, భద్రాచలంలో గత ఏడాదితో సహా ఇటీవల కాలంలో జరుగుతున్న రామనారాయణ, లక్ష్మీదేవిల కల్యాణం సందర్భంగా, ఎదురుకోలు, కల్యాణం, పట్టాభిషేకం ఉత్సవాలు విశేషంగా జరుగుతున్నాయి. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో, మిథిలా కళ్యాణ మండపంమీద జరిపిన వివాహ తంతు ద్వారా, విజ్ఞానవంతులైన అర్చక పండిత మహాశయులు, ఆహుతులను గందరగోళానికి (ఇటీవలి కాలంలో) గురిచేయడం బహుశా భావ్యం కాదేమో. ‘అచ్యుత గోత్రోద్భావయా’ అని రామనారాయణ స్వామిని శ్రీరామచంద్రుడి స్థానంలోకి తెచ్చారు. క్షత్రియుడైన శ్రీరాముడు ‘అచ్యుత గోత్రం’ తో బ్రాహ్మణుడిగా క్షణంలో మార్చివేశారు. సీతాదేవి స్థానంలో సీతామహాలక్ష్మిని తెచ్చి, ప్రవర మార్చారు. సౌభాగ్య గోత్రం ఇచ్చేశారు. శ్రీరాముడి వశిష్ట, సీతాదేవి గౌతమి గోత్రాలు ఎలా, ఎందుకు, ఎక్కడికి మాయమైపోయా తెలియదు.

వైష్ణవ సంప్రదాయాల ప్రకారం మహావిష్ణువు శాస్త్రోక్త ఆవిర్భావం ఆది మధ్యాంత రహితుడైన నిత్యస్వరూపం’గా పేర్కొనడం జరిగింది. శ్రీమహావిష్ణువు కారణజలధిపై యోగనిద్రలో విరాజిల్లుతూ ఉంటారని భాగవత పురాణం వివరిస్తుంది. విష్ణువు సాధారణార్థంలో జన్మించినవాడిగా కాక, సర్వసృష్టికి మూలకారకుడిగా అవతరించిన పరతత్త్వస్వరూపుడిగా, మహామహానుభావుడిగా భావించబడతాడు. అలాంటప్పుడు ఆయన అచ్యుత గోత్రోద్భవుడు ఎలా అవుతాడు? త్రిమూర్తుల వివాహాలు సహితం సాధారణ వేదోక్త వివాహక్రియల రూపంలో జరిగినవి కాకుండా, ఒక తాత్విక-ఆధ్యాత్మిక సంఘటన (Theological Union) భావించాలి.

విష్ణు పురాణం, భాగవత పురాణం, మహాభారతం మొదలైన గ్రంథాల ప్రకారం క్షీరసాగర మథనం (సముద్ర మథనం) సమయంలో లక్ష్మీదేవి ఆవిర్భవించింది. ఆ సమయంలో ఆమె స్వయంగా మహావిష్ణువును తన నిత్య సహచరుడిగా (భర్తగా) ఎంచుకుంది. అప్పటి నుండి ఆమె వైకుంఠంలో విష్ణువుతో నిత్యసహవాసం, నిత్యనివాసం చేస్తూ ఉన్నదని వైష్ణవ సంప్రదాయం ప్రత్యక్షంగాను, పరోక్షంగాను వివరిస్తుంది. అలాంటప్పుడు ఆమె సౌభాగ్య గోత్రోద్భవి ఎలా అయింది? లక్ష్మీదేవి ఆవిర్భావం, స్వయంగా విష్ణువును వరించటం, మాల్యధారణ చేయటం, అనంతరం ఆయనతో నిత్యసంబంధంగా ఉండటం లాంటి విషయాలకతీతంగా, వారి వివాహం వేదవిధాన ప్రకారం జరిగిందని చెప్పే స్పష్టమైన దాఖలాలు (నా పరిమిత జ్ఞానం మేరకు) శాస్త్రాలలో కనిపించదు. అంతేకాక, వారిద్దరి వర్ణం, ప్రవర, గోత్రం మొదలైన వివరాల గురించి కూడా ఎక్కడా ప్రస్తావన లభించదు. అలాంటప్పుడు ‘అచ్యుత, సౌభాగ్య’ గోత్రాల సాధికారత ఏమిటి? అంతా అగమ్య గోచరం!!!

విశేషమేమిటంటే, ఎదుర్కోలులో సీతాదేవి, శ్రీరాముడి పక్షం వహించిన ‘ఇరువురు విశిష్ట వశిష్టుల స్థాయి ఆచార్యవర్యులు’ మాటల ద్వందయుద్ధం చేశారేమో అనిపించింది. సీతారాముల గుణగణాల, గొప్పదనాల వర్ణన చేసేటప్పుడు, వాస్తవానికి దగ్గరగా వుండాలి. వారి-వారి వివాహాత్పూర్వ విషయాలనే చెప్పాలికాని భవిష్యత్తులో జరగబోయేవెలా చెప్తారు? రామాయణాన్ని తమదైన శైలిలో అన్వయించుకుంటూ, వివాహానంతర కాండలలో వున్న విషయాలను ప్రస్తావించడం భావ్యమా? పట్టాభిషేకం వీక్షిస్తున్నప్పుడు, వాల్మీకి రామాయణంలో వర్ణించిన ఘట్టాన్ని అన్వయించలేదేమో (క్షమించాలి) అన్న సందేహం కలిగేలా కొనసాగింది.

భద్రాచలంలో (అంగరంగ వైభోగంగా) నిర్వహించిన ఎదురుకోలు, కల్యాణం, పట్టాభిషేకం మహోత్సవాలు వీక్షించిన నాకు, చైనా తత్త్వవేత్త లిన్ యుటాంగ్ గుర్తుకొచ్చాడు. ప్రాక్పశ్చిమ తత్త్వాలు, జ్ఞానం, వివేకం, అభ్యాసం వంటి అంశాలపై ఆయన రచనలు చేశారు. ‘ది విజ్డమ్ ఆఫ్ చైనా అండ్ ఇండియా’ అనే బృహత్గ్రంథంలో, ప్రాచీన గ్రీకు గణిత శాస్త్రవేత్త  యూక్లిడ్ ప్రవచించిన ‘జ్ఞానార్జనకు రాజమార్గం లేదు’ అని రాశారు. అంటే, జ్ఞానాన్ని, లేదా నిర్దిష్ట విషయాన్ని అర్థం చేసుకోవాలంటే, శ్రమ తప్పదని చెప్పడమే. ఎలాంటి విద్య అయినా కష్టపడకుండా సాధ్యం కాదని కూడా భావన. భద్రాచలంలో నిర్వహించిన మహోత్సవాలకు ఈ తత్త్వం సరిపోతుందేమో. వేదవేదాంగాలు చదివిన మహామహా పండిత శ్రేష్టులైనా మరింత, నిరంతర అధ్యయనం చేయక తప్పదేమో!!!

కనీసం ఈ పరాభవనామ సంవత్సరంలోనైనా మార్చ్ 27, 2026 పవిత్ర శుక్రవారంనాడు, అత్యంత పవిత్రమైన, దక్షిణ అయోధ్య భద్రాచల క్షేత్రంలో జరగనున్న్న శ్రీరామనవమి ఉత్సవం, భక్త రామదాసు భావాలకు, వాల్మీకి మహర్షి సంస్కృత రామాయణ రచనకు, ఆంధ్ర వాల్మీకి యధాతథ తెలుగు అనువాదానికి అనుగుణంగా 'రామనారాయణ, మహాలక్ష్మీల కల్యాణం' గా కాకుండా, 'శ్రీసీతారాముల కల్యాణం' గా జరిపించాలి. సీతారాముల కల్యాణానికి వచ్చే ఆహుతులకు, టీవీ వీక్షకులకు అర్ధమయ్యేలా, తప్పుదారిన మళ్లించకుండా, సరలమైన తెలుగు భాషలో చెప్పాలి. ఎదుర్కోలు, పట్టాభిషేకం గురించిన వివరాలు కూడా అలాగే చెప్పాలి. అలంకారాల, అహంకారాల కన్నా వినమ్రతను, బాహ్య ప్రదర్శన కన్నా అంతర్లీనమైన పవిత్రతను, శుద్ధతను కాపాడాలి. స్వకపోలకల్పిత స్వేచ్ఛలను దేవుడు మన్నించినా, మానవమాత్రులు జీర్ణించుకోలేరు.

(బహుశా స్థలాభావం వల్ల ఆంధ్రజ్యోతి ప్రచిరించలేకపోయిన అంశాలతో సహా నా పూర్తివ్యాసం ఇది)