Sunday, April 13, 2025

ఖగోళ విషయ విస్తారం (శ్రీ మహాభాగవత కథ-31) : వనం జ్వాలా నరసింహారావు

 శ్రీ మహాభాగవత కథ-31 : ఖగోళ విషయ విస్తారం

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (14-04-2025)

కంII చదివెడిది భాగవతమిది, 

చదివించును కృష్ణు, డమృతఝరి పోతనయున్

చదివినను ముక్తి కలుగును, 

చదివెద నిర్విఘ్నరీతి ‘జ్వాలా’ మతినై 

బ్రహ్మాండమధ్యంలో ఉన్న సూర్యుడు ముల్లోకాలను తన తేజస్సుతో నింపి తపింప చేస్తూ, కామ్తిమంతం చేస్తున్నాడు. సూర్యుడికి ఏడాది సాగే నడకలో ఉత్తరాయణం దక్షిణాయనం, విషువం అనే మూడు గమనాలున్నాయి. ఉత్తరాయణంలో మీదికి వెళ్తాడు. దక్షిణాయనంలో కిందకు వెళ్తాడు. ఉత్తరాయణంలో మెల్లగా నడుస్తాడు కాబట్టి పగళ్లు ఎక్కువ, రాత్రుళ్లు తక్కువ. దక్షిణాయనంలో వేగంగా నడుస్తాడు కాబట్టి పగళ్లు తక్కువ, రాత్రుళ్లు ఎక్కువ. విషువంలో సమానం. రాత్రింబగళ్లు ఎక్కువ-తక్కువలు ఉండవు. సూర్యుడు మేషరాశిలోను, తులారాశిలోను ప్రవేశించినప్పుడు పగలు, రాత్రి సమానంగా ఉంటాయి. మేషంలోకి వచ్చినప్పటి మర్నాటి నుండి రోజు-రోజుకు పగలెక్కువ, రాత్రి తక్కువ అవుతుంటుంది. సూర్యుడు వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య రాశుల్లో ప్రవేశించేటప్పుడు నెలకు ఒక్కొక్క ఘడియ పగటిపూట పెరుగుదల, రాత్రిపూట తరుగుదల ఉంటాయి. అలాగే, సూర్యుడు వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం రాశుల్లోకి ప్రవేశించినప్పుడు నెలకు ఒక్కొక్క ఘడియ పగటిపూటలో తరుగుదల, రాత్రిపూటలో పెరుగుదల ఉంటాయి.

ఇలా దినాలు, ఉత్తరాయణం, దక్షిణాయనం, పెరగడం, తరగడం ఏర్పడుతున్నాయి. సూర్యుడు తన రథం మీద మానసోత్తర పర్వతం చుట్టూ తిరగడానికి ఒక పగలు, ఒక రాత్రి పూర్తవుతాయి. ఆ పర్వతం చుట్టు కొలత తొమ్మిది కోట్ల ఏభై ఒక్క లక్షల యోజనాలు. మానసోత్తర పర్వతానికి తూర్పు దిక్కున ఇంద్రుడి పట్టణం ఉన్నది. దాని పేరు దేవధాని. దక్షిణ దిక్కున యముడి పట్టణం ఉన్నది. దాని పేరు సంయమని. పడమటి వైపు వరుణుడి పట్టణం నిమ్లోచని ఉన్నది. ఉత్తరం వైపున చంద్రుడి పట్టణం విభావరి ఉన్నది. జ్యోతిశ్చక్రం భ్రమించడం వల్ల భూమిలో సూర్యుడు కనిపించడం ఉదయం, ఆకాశంలో కనిపించడం మధ్యాహ్నం, భూమిలోకి చొచ్చినట్లు కనిపించడం అస్తమయం, దూరంగా ఉండడం రాత్రి. ఈ ఉదయాస్తమయాదులు జీవుల ప్రవృత్తి, నివృత్తులకు హేతువులై ఉంటాయి. 

సూర్యుడు ఇంద్రపురం నుండి యమపురానికి వెళ్లేటప్పుడు పదిహేను గడియలలో రెండు కోట్ల ముప్పై ఏడు లక్షల డెబ్బై అయుదు వేల (2,37,75,000) యోజనాల దూరం దాటి వెళ్తాడు. యమపురి నుండి వరుణపురి, అట్నుంచి సోమపురి ఇలా పోతుంటాడు. ఇలా చంద్రగ్రహనక్షద్రాదులతో కూడి తిరుగుతూ వున్న సూర్యుడి రథచక్రానికి పన్నెండు అంచులు, ఆరు కమ్ములు, మూడు నాభులు ఉంటాయి. ఆ చక్రానికి సంవత్సరం అని పేరు. సూర్యుడి రథానికి ఒకటే చక్రం. ఈ ఏకచక్ర రథం ఒక్క ముహూర్త కాలంలో ముప్పై నాలుగు లక్షల ఎనిమిది వెల యోజనాల మేర సంచరిస్తుంది. 

సూర్యుడి రథానికి ఉన్న ఇరుసు మేరు శిఖరం మొదలు మానసోత్తర పర్వతం వరకు వ్యాపించి ఉంటుంది. దీని పొడవు ఒక కోటి ఏభై ఏడులక్షల ఏభై వెల యోజనాలు. ఈ ఇరుసుకు గానుగ చక్రంలాగా, చక్రం అమర్చబడి, మానసోత్తర పర్వతం మీద సూర్యరథం తిరుగుతుంటుంది. ఇరుసు ఒకటి ఉత్తర ధ్రువం వైపు, ఇంకొకటి దక్షిణ ధ్రువం కింది దాకా ఉంటుంది. ఈ ఇరిసులు రెండింటి మీద ఈ చక్రం ధ్రువాల లో బిగించబడి ఉంటుంది. భూ పరిభ్రమణం వల్ల ఉత్తర-దక్షిణ ద్రువాలలో గాలి సుడిగుండాలు ఏర్పడుతాయి. అవే తాళ్లుగా ఆ తాళ్లతో ఇరుసులు ద్రువాలకు బిగించబడి ఉంటాయి. అ రథంలో సారథి కూర్చోడానికి అనువైన చోటు ముప్పైఆరు లక్షల యోజనాల పొడవు, తొమ్మిది లక్షల యోజనాల వెడల్పు కలిగినది. ఆ రథానికి కాడి కూడా ముప్పైఆరు లక్షల యోజనాల విస్తృతి కలిగి ఉంటుంది.          

సూర్య రథానికి గాయత్రి మొదలైన ఏడు ఛందస్సులు (గాయత్రి, ఉష్ణిక్, త్రిష్ణువ్, అనుష్టుప్, జగతి, పంక్తి, బృహతి) గుర్రాలై ఉంటాయి. సూర్యుడికి ముందు అరుణుడు రథసారథిగా ఉంటాడు. వాలఖిల్యుడు మొదలైన 60 వేలమంది ఋషిశ్రేష్ఠులు సూర్యుడి ముందర సౌరసూక్తాన్ని స్తుతిస్తూ ఉంటారు. ఈ ఋషులు బొటన వేలు పైభాగం ఎంత ఉంటుందో అంతే శరీరం కలవారై ఉంటారు. ఇంకా ఎందరో మునులు, గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు, నాగులు, అప్సరసలు, పతంగులు మొదలైన వారంతా నెలనెలా వరుస క్రమంలో సూర్యుడిని సేవిస్తూ ఉంటారు. ఇంతమంది ఇలా సేవిస్తూ ఉంటే, సూర్యుడు తొంభై కోట్ల ఏభై ఒక్క లక్షల యోజనాల పరిమాణం ఉన్న భూమండలాన్ని అంతటినీ ఒక్క పగలు, రాత్రిలో సంచరించి వస్తూ ఉంటాడు. అంటే ఒక్క క్షణానికి రెండువేల యోజనాలు సంచరిస్తాడు. 

మేరువుకు, ధ్రువానికి సూర్యుడు ప్రదక్షిణ చేయడం, రాశి చక్రం మీద సంచరించడం ఎలా కుదురుతుందన్న సందేహం కలగవచ్చు. అంటే, ఉత్తర ధ్రువం ఉండేది ఉత్తర దిశలో కదా, రాశి చక్రం ఉండేది భూమధ్య రేఖ మీద కదా, అలాంటప్పుడు, ఉత్తర ధ్రువానికి ప్రదక్షిణం, రాశి చక్రం మీద సంచరించడం ఏక కాలంలో ఎలా అన్నది అసలు సందేహం. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఒక్కటి ఉంది. అదే, సకలం భగవత్సృష్టి విలాసం అనే విషయం. ఇలాంటి సందేహాలను పూర్తిగా తీర్చగలగడం ఒక్క సర్వేశ్వరుడికే చేతనవుతుంది. 

నక్షత్రాలతో, రాశులతో కూడిన కాలచక్రం ధ్రువానికి మేరువుకు ప్రదక్షిణం చేసేటప్పుడు, ఆ కాలచక్రం వెంట సంచరించే సూర్యాది గ్రహాలకు నక్షత్రాలతోను, రాశులతోను, ఉనికి ఉండడంతో చక్రగతి వల్ల, వాటంతట వాటికి ఉన్న గతుల వల్ల, రెండు గతులు ఉంటూ ఉంటాయి. ఆదిపురుషుడైన భగవానుడే, ఆ నారాయణుడే, లోకాలకు యోగ క్షేమాలను కూర్చడానికై సూర్యుడి రూపంలో మనకు దర్శనం ఇస్తున్నాడు. సూర్యుడు మూడు వేదాల స్వరూపం. నారాయణుడే సూర్యుడిగా ప్రకాశిస్తున్నాడు. ఆ పరమపురుషుడే తనను పన్నెండు విధాలుగా విభజించుకుని వసంతం మొదలైన ఆరు ఋతువులను ఆయా కాలాలలో జరిగే విశేషాల్ని బట్టి ఏర్పాటు చేశాడు. ఆ పరమపురుషుడు జ్యోతిశ్చక్రం లోపల ప్రవర్తిస్తూ తనదైన తేజస్సుతో సకల జ్యోతిర్గణాలను దీవింప చేస్తున్నాడు. మేషాది పన్నెండు రాశులలోను ఒక్కో మాసం వంతున ఒక సంవత్సరం సంచరిస్తాడు. ఆయన గమనంలోని విశేషమైన కాలాన్ని అయనాలుగా, ఋతువులుగా, మాసాలుగా, పక్షాలుగా, తిథులుగా వ్యవహరిస్తారు. రాశులలో ఆరవ అంశం ఆయన సంచరించినప్పుడు దానిని ఋతువు (అంటే సంవత్సరంలో ఆరవ వంతు, రెండు మాసాల కాలం) అని అంటారు. కాలచక్రంలో సూర్యుడు సగభాగం, అంటే, ఆరు రాశులలో సంచరించే కాలాన్ని అయనం అంటారు. 

పూర్తిగా సూర్యుడు పన్నెండు రాశులలో సంచరించిన కాలం ఒక సంవత్సరం. ఈ సమగ్ర సంచారంలో శీఘ్రగతి, మందగతి, సమగతి అని మూడు గతి విశేషాలున్నాయి. ఈ గతి విశేషాలవల్ల తేడా కనిపించే సంవత్సరాన్ని సంవత్సరం, పరిసంవత్సరం, ఇళాసంవత్సరం, అనువత్సరం, ఇద్వత్సరం అని అయుదు విధాలుగా చెపుతారు. చంద్రుడు సూర్యకిరణాల కంటే లక్ష యోజనాలకు పైగా శీఘ్రంగా సంచరిస్తాడు. పక్షం, రాశి, నక్షత్రం, వీటి శేషాన్ని గ్రహిస్తూ ముందుకు సంచరిస్తూ చంద్రుడు పెరుగుతూ, తరుగుతూ ఉంటాడు. తద్వారా పగలు, రాత్రి కలగ చేస్తున్నాడు. చంద్రుడు ఒక నక్షత్రంలో 30 ఘడియలు ఉంటాడు. పదహారు కళలతో ఉంటాడు. చంద్రుడిని ‘సర్వసముడు’ అంటారు. చంద్రుడికి పైన లక్ష యోజనాల ఎత్తులో తారకలు గుమిగూడి మేరు శైలానికి ప్రదక్షిణంగా తిరిగి వస్తూ ఉంటాయి. అభిజిత్తు అనే నక్షత్రం కూడా ఈ తారా చక్రంలో ఉంది తిరుగుతూ ఉంటుంది. అశ్విని నుండి రేవతి వరకు 27 నక్షత్రాలే అని అనుకుంటాం. ఉత్తరాషాఢ, శ్రవణా నక్షత్రాల మధ్యలో అభిజిత్తు అనే నక్షత్రం ఒకటి ఉంది. దీనితో కలిసి నక్షత్రాలు 28. 

తారలన్నింటికి రెండు లక్షల యోజనాల పైన శుక్రుడు ఉంటాడు. శుక్రుడు, సూర్యుడు ఉండే రాశికి ముందు రాశిలోకాని, వెనుక రాశిలోకాని, అతడితో సమంగా కాని సంచరిస్తూ ఉంటాడు. జనులకు అనుకూలుడై వర్షాన్ని ఇచ్చేవాడు శుక్రుడు. వర్షానికి ఆటంకం ఏర్పరిచే శక్తుల్ని తొలగించి శుభాలను ఇస్తాడు. అటుపైన రెండు లక్షల యోజనాల పైన బుధుడు చరిస్తున్నాడు. బుధుడు ఎప్పుడూ సూర్యుడికి దగ్గరగానే ఉంటాడు కాబట్టి కనపడడు. సూర్యుడితో దూరం ఎక్కువై ఎప్పుడైనా బుధుడు మన కంటికి కనిపిస్తే అతడి సాటిలేని మహిమ వల్ల ప్రజలకు పెనుగాలులు, క్షామం, దోపిడీలు మొదలైన భయాలు కలుగుతాయి. బుధుడు చంద్రుడి కొడుకు.    

బుధుడికి పైన రెండు లక్షల యోజనాల దూరంలో భూమికి పుత్రుడైన అంగారకుడు చరిస్తున్నాడు. యితడు ఒక్కొక్క రాశి దాటడానికి మూడు పక్షాల సమయం పడుతుంది. ఇలా పన్నెండు రాశులను దాటుతాడు. ఒక్కోసారి వెనక్కు వచ్చి మళ్లీ ముందుకు వెళ్తూ ఉంటాడు. వక్రగాతిలోనూ, శుభగ్రహయోగం లేనప్పుడూ అంగారకుడు (కుజుడు) ప్రజలకు పీడల్ని కలిగిస్తాడు. కుజుడికి రెండు లక్షల యోజనాల పైన బృహస్పతి చరిస్తాడు. ఇతడు ప్రతి రాశిలోను ఒక్కో సంవత్సరం ఉంటాడు. యితడు దేవతల గురువు. వక్రగాతిలో లేనప్పుడు బ్రాహ్మణులకు అనుకూలుడై ఉంటాడు. సూర్యుడి కొడుకు శని. యితడు బృహస్పతికి రెండు లక్షల యోజనాల పైన చరిస్తూ ఉంటాడు. ఒక్కో రాశిలో 30 నెలలు సంచారం చేస్తాడు. లోకాలకు పీడా కలిగిస్తాడు. శనికి పైన 11 లక్షల యోజనాల దూరంలో సపర్షి మండలం ఉన్నది. వీరు బ్రాహ్మణులకు సకల లోకాలకు మేలు చేస్తారు. సప్తర్షి మండలానికి పైన 13 లక్షల యోజనాల దూరంలో శింశుమార చక్రం ఉంది. ఇది అన్నింటికంటే పైన ఉంటుంది. 

విష్ణువు పదం శింశుమార చక్రం. భక్తుడైన ధ్రువుడు ఇంద్రుడు, అగ్ని, కశ్యప ప్రజాపతి మొదలైన ప్రముఖులతో నిత్యమూ ప్రదక్షిణం చేస్తూ ఉంటాడు. అన్ని జ్యోతిర్గ్రహ నక్షత్ర మండలాలకు నిశ్చలమైన ఆధారంగా భగవానుడు ధ్రువుడిని స్థిరంగా నిలిపాడు. నక్షత్రాలు, సూర్యాది గ్రహాలూ, మేధి స్తంబంలా ఉన్న ధ్రువుడికి దగ్గరగా కొన్ని, దూరంగా కొన్ని, బాగా వెలుపలగా కొన్ని, ఉండేట్లు వాయువు ప్రేరణ వల్ల కల్పాంతం వరకు పరిభ్రమిస్తూ ఉంటాయి. అంతరిక్షంలో గ్రహాలన్నీ ప్రకృతి పురుష సంయోగం వల్ల ఏర్పడిన ఒక విచిత్రమైన కర్మగతి నడిపిస్తూ ఉంటే నేలమీద పడకుండా సంచరిస్తున్నాయి. 

‘శింశుమార చక్రం’ సకల దేవతలతో నిండి వున్న వాసుదేవుడి దివ్యదేహం. వలయాకార సర్పంలాగా ఉన్న ఈ శింశుమార చక్రం తోక చివరన ముందుభాగంలో ప్రజాపతి, అగ్ని, ఇంద్రుడు, ధర్ముడు ఉంటారు. తోకకు మూలంలో ధాత, విధాత ఉంటారు. కటి ప్రదేశంలో సప్తర్షులు ఉంటారు. కుడువైపున సుడిగా తిరిగి ఈ శింశుమారం ఉంటుంది. అలా దక్షిణావర్తంగా వలయాకారంగా ఉన్న శరీరం కల శింశుమారానికి దక్షిణం వైపు ఉత్తరాయణ నక్షత్రాలు అంటే అభిజిత్తు నుండి పునర్వసు వరకు (14) ఉంటాయి. ఎడమవైపు దక్షిణాయన నక్షత్రాలు పుష్యమి నుండి ఉత్తరాషాఢ వరకు ఉంటాయి. వీపు వైపున దేవా, మైన, అజవీథి (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రాల సమూహం), కడుపున ఆకాశగంగ, ఉత్తర భాగంలో పునర్వసు, పుష్యమి నక్షత్రాలు (కుడు-ఎడమ తుంట్ల లాగా) ఉంటాయి. ఔనర్వాసు నక్షత్రం ఉత్తరాయణానికి చివరది. పుష్యమి దక్షిణాయానానికి మొదటి నక్షత్రం. 

ఆర్ద్ర, ఆశ్లేషలు కుడి-ఎడమ పాదాల వెనక భాగంలో ఉంటాయి. కుడి పాదంలో ఆర్ద్ర, ఎడమ పాదంలో ఆశ్లేష ఉంటాయి. ముక్కుకు కుడివైపు కన్నంలో అభిజిత్తు, ఎడమవైపు కన్నంలో ఉత్తరాషాఢ ఉంటాయి. కుడి కంటిలో శ్రవణం, ఎడమ కంటిలో పూర్వాషాఢ ఉంటాయి. కుడి-ఎడమ చెవుల్లో ధనిష్టా, మూలలు ఉంటాయి. మఖ నుండి అనూరాధ వరకు ఉన్న ఎనిమిది దక్షిణాయన సంబంధమైన నక్షత్రాలు ఎడమ పక్కనున్న ఎముకల్లోను, కుడి పక్కనున్న ఎముకలలో మృగశీర్ష నుండి ప్రతిలోమ క్రమంలో పూర్వాభాద్ర వరకు గల ఉత్తరాయణ సంబంధమియన్ ఎనిమిది నక్షత్రాలు ఉంటాయి. 

కుడి భుజంలో జ్యేష్ఠ, ఎడమ భుజంలో శతభిషం ఉంటాయి. ఉత్తరపు దౌడలో అగస్త్యుడు, దక్షిణపు దౌడలో యముడు ఉంటారు. ముఖంలో అంగారకుడు, గుహ్యంలో శని, మెడ వెనుక భాగంలో గురుడు, రొమ్ములో రవి, నాభిలో శుక్రుడు, మనస్సులో చంద్రుడు, వక్షోజాలలో అశ్వినీ దేవతలు, ప్రాణాపానాలలో బుధుడు, గళంలో రాహువు, శరీరంలోని అన్ని భాగాలలోను కేతువు, రోమాలలో అన్ని తారకలు, హృదయంలో నారాయణుడు ఉంటారు. ఇది సర్వ దేవతామయుడైన పుండరీకాక్షుడి దివ్య దేహం. ఈ శింశుమార చక్రం ఎంతో పవిత్రమైనది. ఈ జ్యోతిస్స్వరూపంలో వెలుగొందే శింశుమార విగ్రహాన్ని “వందనం, వందనం” అని నుతించాలి. 

సూర్యుడికి కింద వైపున పదివేల యోజనాల దూరంలో రాహు గ్రహం అపసవ్య మార్గంలో ఉంటుంది. రాహువు రాక్షసాధముడు, అమరత్వానికి అర్హుడు కాడు. సూర్యమండలం వ్యాసం పదివేల యోజనాల విస్తృతి కలది. చంద్ర మండలం వ్యాసం పన్నెండువేల యోజనాలు. పర్వకాలాలలో రాహువు సూర్య మండలాన్ని కాని, చంద్ర మండలాన్ని కాని పూర్తిగా కప్పుతాడు. దాన్ని చూసి భూమ్మీద వుండే జనులు గ్రహణం పట్టిందని అంటారు. విష్ణువు సుదర్శన చక్రం వస్తుందేమో అన్న భయంతో ఐదారు గడియల లోపు రాహువు గ్రహణాన్ని విడిచి వెళ్తాడు. రాహువుకు పదివేల యోజనాల కింద పిశాచాలు, రాక్షసులు సేవిస్తుంటే, యక్షులు, భూతప్రేతాలు చరిస్తూ ఉంటారు. యక్ష, భూత, ప్రేతాలు చరించే అంతరిక్షానికి కింద మేఘ మండలం ఉన్నది. ఇది గాలికి చరిస్తూ ఉంటుంది. మేఘ మండలానికి కింద భూమండలం ఉన్నది. 

                      (బమ్మెర పోతన శ్రీమహాభాగవతం, రామకృష్ణ మఠం ప్రచురణ ఆధారంగా) 

Saturday, April 12, 2025

RAMAYANA ABOUNDS IN SYMBOLISM, HISTORY, SPIRITUAL RESONANCE (BHADRACHALA SRI SITA-RAMA CELESTIAL WEDDING AND SRIRAMA CORONATION) : By Vanam Jwala Narasimha Rao

 RAMAYANA ABOUNDS IN SYMBOLISM, 

HISTORY, SPIRITUAL RESONANCE

(BHADRACHALA SRI SITA-RAMA CELESTIAL WEDDING 

AND SRIRAMA CORONATION) 

By Vanam Jwala Narasimha Rao

Published in ‘The Hans India’ (13-02-2025)

SITARAMA Kalyanam and Pattabhishekam at Bhadrachalam, held on Viśvāvasu Nama Samvatsara Chaitra Shukla Paksha Navami and Dashami (April 6–7, 2025), could have unfolded as divine spectacles, vividly bringing to life the grandeur of Valmiki and Andhra Valmiki Ramayana. Several details from these two richly deserve a mention in the language of audience, during the ceremonies in Bhadrachalam.

Sage, Philosopher, Poetic Genius, and Reformer, Maharshi Valmiki, authored the 24,000 shlokas Sanskrit Ramayana. It is truly the ‘Spiritual Ocean of Wisdom.’ The name RAMA, a sacred blend of RA and MA, derived from Ashtakshari and Panchakshari Mantras respectively, was divinely given by Sage Vasishta, and has become an eternal Taraka Mantra. Valmiki Ramayana has endured through the ages. 

For Telugu readers unfamiliar with Sanskrit, Vavilikolanu Subbarao, revered as Andhra Valmiki, rendered it into melodious Telugu poetry and prose around 120 years ago, aligning each Sanskrit Shloka with a corresponding Telugu Stanza, and titling it Mandaram. 

Kalyanam (Divine Wedding) of Srirama and Sitadevi, and Pattabhishekam (Coronation) of Rama are among the most moving episodes in Ramayana. Sri Rama was born on Chaitra Shukla Navami during the Vilambinama Samvatsara, in the Punarvasu Nakshatra, under the Karkataka Lagna, with significant planetary alignments. His naming ceremony was on Chaitra Bahula Panchami, and his Upanayana was performed at age nine, in the Parabhava year. 

Vishwamitra took Rama and Lakshmana to Mithila. King Janaka narrated Sita’s birth as Ayonija and introduced Lord Shiva’s mighty bow. Rama effortlessly lifted, strung, and broke the bow with thunderous sound. Overjoyed, Janaka declared that he would wed Sita to Rama. Subsequently, Dasharatha arrived at Mithila for the event. 

Sage Vasishta then introduced the illustrious Ikshvaku lineage to Janaka, tracing from Brahma to Dasharatha. The genealogy included illustrious Marichi, Kashyapa, Vivasvan, Manu, Ikshvaku, and kings like Sagara, Bhagiratha, Raghu, Aja, and finally, Dasharatha. In return, Janaka detailed his descent from King Nimi to his father Hraswaroma. 

The wedding took place when Rama was twelve and Sita six years old, on Phalguna Shukla Thrayodashi, under Uttara Phalguni Nakshatra in the Saumya Nama Samvatsara, but not on Chaitra Shukla Navami, as commonly believed and traditionally performed. During the wedding, Janaka declared, ‘Kausalya Kumara (O son of Kausalya), this Sita is my daughter. She is your Saha Dharma Charini (Partner in Dharma). Take her hand in marriage. You will gain worldwide fame and auspiciousness. Hold her hand with sacred mantras.’ 

Janaka poured sacred water into Rama’s hands. The phrase ‘Iyam Sita’ (This Sita) signifies reverence and pride. Out of modesty, Sita does not step forward, prompting Janaka to say ‘This Sita’ while handing her over to Rama. Though born of the earth, Janaka considers Sita as his own daughter (Mama Suta).

Now, to the coronation phases: Dasharatha had planned Rama’s Coronation on Chaitra Shukla Panchami in the Dundubhi Nama Samvatsara, which eventually marked the beginning of his exile. Fourteen years later, on his return to Ayodhya, his Pattabhishekam was conducted on Chaitra Shukla Saptami under Punarvasu Nakshatra, in the Dhata Nama Samvatsara, and not on Dashami. From the divine wedding to coronation, every aspect in (Andhra) Valmiki Ramayana abounds in symbolism, history, and spiritual resonance. 

After exile, on Hanuman’s information, Bharata placed Rama’s Padukas (Sandals) on his head and went to welcome Rama at the Pushpak Flight’s alighting spot. He returned the Golden Sandals to Rama with reverence. Rama with Bharata traveled to Nandigrama, where Bharata returned the kingdom. Rama and Lakshmana shed forest attire, adorned with royal garments, ornaments, and boarded a chariot piloted by Bharata towards Ayodhya. Shatrughna held the royal umbrella, Lakshmana stood beside Rama, fanning him with the fly-whisk and holding a parasol.

Meanwhile, Ministers Ashoka, Sumantra, and Vijaya, in consultation with Sage Vasishta, made coronation arrangements. Entering the palace, Rama bowed to his three mothers. Hanuman, Vega Darshi, Jambavantha, and Rishabha swiftly fetched sacred water in divine pots. Others brought water from 500 rivers. From the four seas came Sushena (East), Rishabha (South), Gavaya (West), and Nala (North), carrying ocean water in golden vessels. 

Sage Vasishta seated Rama and Sita on a jeweled throne. Eight eminent Brahmin priests, Vasishta, Katyayana, Jabali, Kashyapa, Vijaya, Gautama, Vamadeva, and Suyajna, poured sacred water over the divine couple. Rithviks, Brahmins, Ministers, Warriors, and Traders, in the presence of Celestial Beings, conducted the Grand Coronation using divine herbs and blessings. The crown, crafted by Brahma adorned with dazzling, priceless gems, and inherited through the Surya Dynasty since Manu’s time, was placed on Rama’s head.

Against this Backdrop of Valmiki Ramayana, three grand annual rituals, Sitarama Kalyanam (divine wedding of Rama and Sita Utsav Vigrahas), Pattabhishekam (Coronation of Rama), and Edurukolu (welcoming the groom), were held on April 5, 6, and 7, 2025, in Bhadrachalam, (Last two at Mithila Stadium) sparked scholarly and ritualistic interest. As in recent years, the celebrations began as divine rituals of Sita-Rama Kalyanam, but evolved into a theatrical epic, complete with fictional flourishes, marked by modern myth-blending, creative liberties, and scholarly one-upmanship. 

Highly learned priests conducted the rituals, under the notable guidance of Sthanacharyulu KE Sthalasai. However, they might have better resonated with contextual references from Valmiki’s Ramayana. During the Sankalpam and Punyahavachana, it was announced as Proxy Icons of ‘Bhadrachalam Sri Ramachandra adorned with Sita and Lakshmana’ were brought onto Mithila Stadium. However, during Kanyavaranam, the pivotal wedding moment, Ramachandramurthy and Sitadevi were abruptly replaced by ‘Ramanarayana’ and ‘Sita Mahalakshmi.’ 

The learned priests chanted the Pravara and Gotra of Ramanarayana and Sita Mahalakshmi, as Achyuta and Soubhagya, instead of Vasishta (Aja, Raghu, Dasharatha) and Gautama (Nimi, Videha, Janaka), respectively, which are of Rama and Sita. This substitution marked shift from Kshatriya lineage to Brahmin, distorting traditions upheld since Bhakta Ramadas’ time, and contrary to Valmiki Ramayana. If it is Ramanarayana-Mahalakshmi Kalyanam, why should it be performed on Srirama Navami and why not on Vaikuntha Ekadashi or on the day they got married!!!

During Edurukolu, two Distinguished Archaka Scholars representing Lord Rama and Sitadevi engaged in an intense verbal duel. With due respect, the scholars, obviously in their effort to excel, turned the sacred narrative into rhetorical contest, leaving the audience dazed. Consequently, the original Valmiki Portrayal overlooked. Descriptions of Sita and Rama should be based on truth and limited to events preceding the wedding. Instead, scholars referenced post-wedding episodes. Notably, engaging elements from Valmiki’s Coronation Chapter were given little prominence. 

These three Rituals in Bhadrachalam reminded me Chinese writer and philosopher Lin Yutang, known for his works on Eastern and Western thought, who often discussed about knowledge, wisdom, and the pursuit of learning in his famous book 'The Wisdom of China and India.' He quoted Euclid, the ancient Greek Mathematician on knowledge as: 'There is no royal road to geometry' which emphasizes that, gaining knowledge requires effort and cannot be achieved through shortcuts.

Edurukolu, Kalyanam, and Pattabhishekam Rituals may be narrated in simple, graceful Telugu, without overwhelming the audience attending the sacred wedding of Sitarama. GODS may forgive creative liberties, but MORTALS remain confused, struggling to connect. Choosing simplicity over spectacle, grace over grandeur, and humility over scholarly pride may help audience behold Sitarama Kalyanam as envisioned by Valmiki and Andhra Valmiki and extolled by Bhakta Ramadas, not the embellished ‘Ramanarayana–Mahalakshmi Kalyanam.’ Temple Authorities, True Spiritual Scholarship, and a Conscientious Government must lead the way in restoring the sanctity of the Sitarama Kalyanam at Bhadrachalam. Please Preserve Essence and not embellishment.

Telangana Government in accordance with High Court Directions, constituted a five-member experts committee, well versed with the Spiritual Customs, Traditions, and also Bhadrachalam Temple to study and submit a report on this aspect.  When once this is completed, the Honorable Court would take a view. And hence let us wait for Justice. 

{The writer is Secretary, Center for Brahmin Excellence}

చైతన్యఝరి ఓయూ పై ఆంక్షలొద్దు ! (చర్చలకు, చైతన్యానికి కేంద్రం ఉస్మానియా విశ్వవిద్యాలయం) : వనం జ్వాలా నరసింహారావు

 చైతన్యఝరి ఓయూ పై ఆంక్షలొద్దు !

చర్చలకు, చైతన్యానికి కేంద్రం ఉస్మానియా విశ్వవిద్యాలయం

వనం జ్వాలా నరసింహారావు

ఆంధ్రజ్యోతి దినపత్రిక (12-04-2025) 

{{ఉస్మానియా విశ్వవిద్యాలయం చరిత్రలో విద్యార్థి ఉద్యమాలు, మేధావుల చర్చలు, రాజకీయ నేతల ఆవిర్భావం కేంద్ర బిందువుగా నిలిచాయి. నేటి ఆంక్షల వాతావరణంలో ఆ గౌరవనీయ వారసత్వాన్ని పరిరక్షించాలన్న అవసరం ఎక్కువైంది. మేధో చర్చలు, రాజకీయ వాదనలు, న్యాయ సంరక్షణకు జరిపిన పోరాటాలు కాలాన్ని దాటి తరతరాలకు గుర్తుండే వారసత్వంగా మారతాయి. వాటిని హ్రస్వ దృష్టితో వీక్షించవద్దు. అలా చేస్తే సమాజం నష్టపోతుంది. ఉస్మానియాలో విద్యార్థి హక్కులను అణచివేసే నేటి ప్రయత్నాలు మాని, చరిత్ర నుంచి పాఠాలను నేర్చుకోవాలి.}} – 

ఇటీవల ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అన్ని రకాల ఆందోళనలను నిషేధించిన అధికారులు, ఆ చర్యకు వ్యతిరేకంగా వెల్లువెత్తిన నిరసనలను ఏమాత్రం పరిగణన లోకి తీసుకోకుండా, మరొక్క అడుగు ముందుకు వేసి, ఇకముందు కాంపస్ పరిధిలో నిర్వహించ తలపెట్టిన సదస్సులకు అతిథులుగా ఆహ్వానం అందుకునే వారి విషయంలోను, ఆ కార్యక్రమ సమయపాలన విషయం లోను, వాటి పత్రికా ప్రకటనలపై పోస్టర్లపై ముద్రించే పేర్ల విషయంలోను కొన్ని అసంబద్ధమైన ఆంక్షలు విధించడం దురదృష్టం.

ఓయూ కాంపస్ పరిధిలో ఇలా ధర్నాలు, ప్రదర్శనలు, నినాదాలు తదితర రాజకీయ కార్యకలాపాలను నిషేధించడం, సదస్సుల నిర్వహణపై ఆంక్షలు విధించడం, బహుశా శతాబ్దకాలంపాటు పైగా విద్యా, వికాస, చైతన్య కేంద్రంగా ఎదిగి, అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయానికి సరైనదికాదు. విద్యార్థి ఉద్యమాలకూ, సాంస్కృతిక-రాజకీయ చర్చలకు ప్రాణం పోసిన ఓయూ చరిత్రను తిరోగమనం దిశగా మళ్ళించే దుశ్చర్య ఇది.

ఉస్మానియా యూనివర్శిటీ భారత విద్యా, రాజకీయ చరిత్రలో చెరగని ముద్రవేసిన విద్యా వ్యవస్థ. ఇక్కడి విద్యార్థి ఉద్యమాలు, మేధో చర్చలు, ప్రజాస్వామ్య స్ఫూర్తితో నడిచిన సంఘటనలు ఎందరో నాయకుల ఆవిర్భావానికి, అభివృద్ధికి దారితీశాయి. ఇక్కడ నుండి ఉద్భవించిన విద్యార్థి నాయకులు నాయకత్వంలో లెక్కలేనన్ని విద్యార్థి ఉద్యమాలు రూపుదిద్దుకున్నాయి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం తొలి, మలి దశల్లో ఓయూ కీలక పాత్ర పోషించింది. అధ్యయనానికి, ఉద్యమాలకు, విప్లవ ఆలోచనలకు ఈ ప్రాంగణం ఏకకాలంలో ప్రముఖ వేదికగా నిలిచింది. 

1918లో ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ స్థాపించిన ఈ విశ్వవిద్యాలయం, చిన్న స్థాయిలో ప్రారంభమై, అంచెలంచెలుగా ఎదిగి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొంది, చైతన్యదీప్తిగా, ఉద్యమాల  కేంద్రంగా సాగుతున్నది. విద్యార్థి రాజకీయ చైతన్యానికి నాంది పలికిన వేదిక ఓయూ కాంపస్. ప్రగతిశీల ఆలోచనలకు, అతివాద-మితవాద ఉద్యమాలకు మార్గదర్శిగా నిలిచింది. వేలమంది విద్యార్థి నాయకుల నాయకత్వంలో విద్యార్థి ఉద్యమాలు రూపుదిద్దుకున్నాయి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం తొలి, మలి దశల్లో ఓయూ కీలక పాత్ర పోషించి, రాష్ట్ర ఏర్పాటుకు దోహదపడింది. నిషేధాలు, ఆంక్షలు విధిస్తే చైతన్య స్ఫూర్తి దిశ మారాలా?

ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల అంటేనే, ఒక ఘనమైన చరిత్ర, ఒక నిత్య చైతన్యం, ఒక దీర్ఘ చింతన అనాలి. యూనివర్శిటీ ఆర్ట్స్ కళాశాల భవనం పురాతన, అధునాతన సంస్కృతుల సమ్మేళనాన్ని ప్రతిబింబిస్తుంది. కళాశాల గదుల్లో కూర్చున్నప్పుడు, ప్రాంగణంలో నడుస్తున్నప్పుడు గర్వభావన, అనిర్వచనీయమైన అనుభూతి కలుగుతుంది. ఇది కేవలం సిలబస్ విద్య నేర్చుకోవడానికి మాత్రమే కాదు; సమకాలీన సాంస్కృతిక, రాజకీయ, సామాజిక చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలిచిన పవిత్ర ఆలయ ప్రాంగణం. దీని గోడలలో ప్రతిధ్వనించిన, ప్రతిధ్వనిస్తున్న వాదనలు, నినాదాలు, ఉద్యమాలకు వేదిక అయిన ఆర్ట్స్ కళాశాల ముందున్న ఆవరణ, ఎంతో మంది నాయకులను, ఆలోచనాపరులను, మేథావులను తీర్చిదిద్దాయి. అతివాద వామపక్షం నుండి మితవాద రాజకీయ పక్షాల వరకు విభిన్న సిద్ధాంతాలకు ఊపిరులు ఊదింది.

ఆర్ట్స్‌ కళాశాలలోని 57 నంబర్ గదికి ఓయూ చరిత్రలో ఓ ప్రత్యేక అధ్యాయం ఉంటుంది. ఎందరో రచయితలు, కవులు, సామాజిక–సాంస్కృతిక మేధావులు విద్యార్థులతో అనుభవాలను పంచుకుని మమేకమయ్యారు. వివిధ సిద్ధాంతాలలో నిష్ణాతులైన మేధావుల ఉపన్యాసాలకు, తదనంతర మేధో చర్చలకు కేంద్రంగా పేరుగాంచింది ఈ గది.

ప్రముఖ విద్యావేత్తలు, రాజకీయ ప్రముఖులు, తత్త్వవేత్తలు, ఆలోచనాపరులు, భాషావేత్తలు తదితరులు తమ సిద్ధాంతాలను–ధోరణులను ఎలాంటి ఆంక్షలూ లేకుండా విద్యార్థులతో పంచుకున్నారు. పీవీనరసింహరావు, కుష్వంత్ సింగ్, జార్జ్ ఫెర్నాండెజ్, రామ్ మనోహర్ లోహియా వంటి మహనీయులు వారిలో కొందరు. 57 నంబర్‌ గది కేవలం తరగతి గది మాత్రమే కాదు; అది సామాజిక రాజకీయ అంశాలకు, సాహిత్యానికి, తాత్విక చర్చలకు వేదికగా మారిన ఫోరం. ఓయూలోని ఈ ప్రత్యేక గది కాలానుగుణంగా మార్పులను స్వీకరిస్తూనే, సమాజాన్ని సంస్కరించే ఉద్యమాలకు పునాది వేసిన చరిత్రకే ఓ ప్రత్యక్ష నిదర్శనం.

ఇక్కడ జరిగిన చర్చలు, చైతన్య ప్రసంగాలు విద్యార్థుల్లో కొత్త దిశలను మలిచాయి. 

1960ల మధ్యకాలంలో న్యూ సైన్స్ కళాశాలలో బీఎస్సీ, 1970ల ప్రారంభంలో ఓయూ క్యాంపస్‌లో లైబ్రరీ సైన్స్ చదివేటప్పుడు నేను తరచుగా ఓయూ బి–హాస్టల్‌కు వెళ్ళేవాడిని. ఈ హాస్టల్ గురించి నెహ్రూ ఒకప్పడు ఎంతో ఆసక్తికరంగా ప్రస్తావించారు. విద్యార్థుల ఉత్సాహాన్ని అభినందిస్తూ, భవిష్యత్ భారత నాయకులు ఇక్కడ నుంచే తయారవుతారని చెప్పారు. బి–హాస్టల్‌ను బ్రిటన్‌లోని హౌస్ ఆఫ్ లార్డ్స్‌తో పోల్చారు. ఓయూ ఎ–హాస్టల్ కూడా సామాజిక–రాజకీయ చర్చలకు కీలక వేదికగా నిలిచింది. తొలి, మలి దశ ప్రత్యేక తెలంగాణ ఉద్యమాలతో పాటు, జాతీయ స్థాయిలో జరిగిన అనేక ఉద్యమాల్లో ఇక్కడి విద్యార్థులు చురుకుగా పాల్గొన్నారు. 

విద్యార్థి నాయకత్వం, ఉద్యమాలు, ప్రగతిశీల ఆలోచనల కేంద్రంగా మారిన ఈ హాస్టల్ ప్రాంతీయ, జాతీయ రాజకీయాలపై దీర్ఘకాల ప్రభావం చూపింది. ఈ రెండు హాస్టళ్లలో వెల్లువెత్తిన వామపక్ష, అతివాద, మితవాద, మధ్యేవాద రాజకీయ సిద్ధాంతాలు విద్యార్థి సంఘాల ఎన్నికలను ప్రభావితం చేశాయి. ఓయూ హాస్టళ్లలో విద్యార్థి చైతన్యం ఉవ్వెత్తున పెల్లుబికింది. ఈ ప్రాంగణంలో జరిగిన చర్చలు, ఉద్యమాలు, ఆధునిక భారత విద్యార్థి రాజకీయ చరిత్రలో చిరస్థాయిగా నిలిచాయి.

విశ్వవిద్యాలయ విద్యార్థి రాజకీయాలు సిద్ధాంతాల ప్రాతిపదికగా, మేధోపరంగా తీవ్రంగా సాగేవి. వామపక్ష కమ్యూనిస్టు (ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ) విద్యార్థి సంఘాలు సమాజవాద సిద్ధాంతాలతో అనుసంధానమై సామాజిక న్యాయం, విద్యార్థి హక్కులు, సామ్రాజ్యవాద వ్యతిరేకత వంటి అంశాలను ముందుకు తెచ్చేవి. మరోవైపు ఏబీవీపీ (అఖిల భారతీయ విద్యార్థి పరిషత్) అనుబంధ మితవాద విద్యార్థి సంఘం జాతీయవాదం, సాంస్కృతిక పరంపర తదితర విలువలకు మద్దతుగా ఉండేది. విద్యార్థి సంఘాల ఎన్నికలు తరచుగా ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ – ఏబీవీపీ మధ్య తీవ్ర పోటీతో సాగేవి. అలనాటి ‘మేధో పోరాటం’కు నిదర్శనంగా, భవిష్యత్ రాజకీయ నాయకత్వం ఆవిర్భవించిన విషయం అందరికీ తెలిసిందే. ఇవి కేవలం క్యాంపస్ పరిధిలో మాత్రమే కాకుండా, దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ పోరాటాల ప్రతిబింబంగా ఉండేవి. 

ఓయూలో ప్రతిభావంతమైన విద్యార్థి నాయకుడిగా వెలుగొందిన ఎస్ జైపాల్ రెడ్డి సూక్ష్మ రాజకీయ అవగాహన, ఆకర్షణీయమైన ప్రసంగశైలి ద్వారా విద్యార్థి రాజకీయాల్లో గొప్ప శక్తిగా మారాడు. ఆ తర్వాత భారత రాజకీయాల్లో అగ్రస్థాయికి ఎదిగి కేంద్ర మంత్రిగా, పార్లమెంటరీ ప్రజాస్వామ్య పునాదుల పరిరక్షకుడిగా గుర్తింపు పొందాడు. కె కేశవరావు ఇక్కడి నుంచే మరో ప్రభావశీల విద్యార్థి నాయకుడిగా వెలుగొందాడు. ఆయన రాజకీయ నైపుణ్యం, నాయకత్వ లక్షణాలు విద్యార్థి దశలోనే స్పష్టమయ్యాయి. సామాజిక, రాజకీయ ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్న ఆయన, భారత జాతీయ కాంగ్రెస్‌లో కీలక వ్యూహకర్తగా ఎదిగి, అనంతరం బీఆర్‌ఎస్‌లో ముఖ్య నేతగా మారాడు. రాజ్యసభ సభ్యుడిగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించాడు. ఓయూ విద్యార్థి ఉద్యమస్ఫూర్తి, మేధోసామర్థ్యం రాజకీయాల్లో ఎలా ప్రభావం చూపిస్తుందో వీరి ఎదుగుదల స్పష్టంగా చూపిస్తోంది. 

ఇక జార్జ్ రెడ్డి ఉస్మానియా యూనివర్శిటీ విప్లవాత్మక చరిత్రలో ఒక సువర్ణాక్షరం. సామాజిక న్యాయంపై ప్రగాఢమైన నమ్మకంతో ఆయన విద్యార్థులను సాధికారత వైపుగా, అసమానతలు, కుల వివక్షలకు వ్యతిరేకంగా ఐక్యం చేశారు. అయితే, ఆయన విప్లవ భావజాలం, విద్యార్థుల్లో పెరిగిన ఆదరణ మితవాద విద్యార్థి సంఘాలకు నచ్చలేదు. ఈ నేపథ్యంలో, 1972 ఏప్రిల్ 14న ఓయూ క్యాంపస్‌లో ఆయన దారుణ హత్యకు గురయ్యాడు. మరో మేధావి నేతగా నిలిచిన వూటుకూరి వరప్రసాద్ ఒకప్పటి ఆర్ట్స్ కాలేజ్ అధ్యక్షుడిగా విద్యార్థి ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్నారు. యువజన నాయకత్వం ఎదుగుదలలో విశేషంగా దోహదపడ్డారు. 86 ఏళ్ల వయసులో ఆధ్యాత్మికవేత్తగా శేషజీవితాన్ని నిరాడంబరంగా గడుపుతున్నారు. 

ఓయూ రూపొందించిన గౌరవనీయ వ్యక్తుల్లో ప్రొఫెసర్ జి హరగోపాల్, ప్రొఫెసర్ రాఘవేంద్రరావు, వాసిరెడ్డి శివలింగ ప్రసాద్, డాక్టర్ ఎం శ్రీధర్ రెడ్డి తదితరులు తమ రంగాల్లో విశేష కృషి చేశారు. ముఖ్యంగా హరగోపాల్ నిస్వార్థ నాయకత్వంతో, నిబద్ధతతో పౌరహక్కుల ఉద్యమంలో ఎంతో ఎత్తుకు ఎదిగారు. సామాజిక-రాజకీయ సమస్యలపైన లోతైన అవగాహన, చర్చల్లో చూపిన లోతైన విశ్లేషణలు, సమానత్వం, న్యాయంపై చూపిన ఆసక్తి ఆయన్ని ప్రగతిశీల భావజాల మార్గదర్శిగా నిలబెట్టాయి. ప్రొఫెసర్ రాఘవేంద్రరావు సామాజిక శాస్త్రాలలో విశేష ప్రతిభ కలిగిన మేధావిగా (విద్యార్థిగా, అధ్యాపకుడిగా) విశ్వవిద్యాలయంలో ప్రముఖ స్థానాన్ని సంపాదించారు.

ప్రొఫెసర్ విఎస్ ప్రసాద్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్, పీహెచ్‌డీ పూర్తిచేసి సమాజ శాస్త్రవేత్తగా తన విద్యా జీవితం ప్రారంభించారు. నాలుగు దశాబ్దాలకు పైగా విద్యా రంగంలో వివిధ హోదాల్లో సేవలందించారు. ప్రొఫెసర్‌గా, విద్యా పరిపాలనాధికారిగా, చివరికి వైస్ ఛాన్సలర్ హోదాలో ఆయన విద్యా వ్యవస్థకు విశేషంగా తోడ్పడ్డారు. తెలంగాణ చరిత్రలో ఓ కీలక సమయంలో డాక్టర్ ఎం. శ్రీధర్ రెడ్డి ఆశాజ్యోతిగా నిలిచారు. ఓయూలో విద్యార్థి నాయకుడిగా, ప్రత్యేక తెలంగాణ ఉద్యమం తొలి దశకు నాంది పలికిన ఘనత ఆయన సొంతం. ఓయూ ఎ–హాస్టల్ నుంచి ఆందోళన జ్వాలలు రేగినప్పుడు, ఆయన ఉద్యమాన్ని ముందుండి నడిపారు. అదే సమయంలో, ఓయూ విద్యార్థి సంఘం ప్రధాన కార్యదర్శిగా ఉన్న మల్లికార్జున్ కూడా తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. తర్వాత ఆయన కేంద్ర మంత్రిగా ఎదిగారు. 

విద్యార్థులలో మరెంతోమంది ‘కానరాని భాస్కరుల’ కృషి, వారు నిబద్ధతతో నెలకొల్పిన భావజాలం, విద్యార్థి రాజకీయాల నుంచి సమసమాజానికి అందించిన మార్గదర్శకత్వం, ఓయూ విద్యార్థి ఉద్యమ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కాలేజీ క్యాంటీన్ (కేఫేటీరియా) ఒక సాంస్కృతిక, రాజకీయ చైతన్య, సైద్ధాంతిక కేంద్రంగా వుండేది. ఇక్కడ పురుడుపోసుకున్న సామాజిక-విప్లవాత్మక ఆలోచనలు రాష్ట్రం, దేశంలోని మారుమూల ప్రదేశాలకూ విస్తరించాయి. విద్యార్థి ఉద్యమాల ద్వారా ఎందరో మహానుభావులు సమాజంలో తమ ముద్ర వేసుకున్నారు. వీరిలో కొందరు జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదిగి, హరగోపాల్ లాగా మానవహక్కుల, పౌరస్వేచ్ఛ కోసం నిరంతరం పోరాడారు- పోరాడుతూనే వున్నారు. విద్యార్థిదశలోని బహుముఖ చర్చలు కార్యరూపందాల్చి సమాజంపై స్థిరమైన ప్రభావాన్ని చూపాయి.

విద్యార్థి రాజకీయాలు, నిరసన కార్యక్రమాలు, వాదప్రతివాదాలు నేటి యువతకు, భవిష్యత్ యువతకు అమూల్యమైన పాఠాలను అందిస్తాయి. ఓయూలో ఈ తరతరాల చరిత్ర వ్యక్తిగత, సామాజిక, మేధో విప్లవాలుగా మారిన తీరు స్పష్టమైన సందేశాన్ని అందిస్తోంది. ఇది అనుబంధం, వ్యక్తిత్వ వికాసం, సామాజిక ఉద్యమం, విలువల పరిరక్షణ కలగలిసిన గాథ. విమర్శనాత్మక ఆలోచనలను ప్రోత్సహించడం, పరస్పర గౌరవంతో మనవ సంబంధాలను నిర్మించడం, సమాజ హితానికి కృషి చేయడం అత్యవసరం. మేధో చర్చలు, రాజకీయ వాదనలు, న్యాయ సంరక్షణకు జరిపిన పోరాటాలు కాలాన్ని దాటి తరతరాలకు గుర్తుండే వారసత్వంగా మారతాయి. వాటిని హ్రస్వ దృష్టితో వీక్షించవద్దు. అలా చేస్తే సమాజం నష్టపోతుంది. 

ఓయూ క్యాంపస్‌లో ధర్నాలు, నిరసనలు, నినాదాలను నిషేధించడం విద్యార్థి నాయకత్వం ఎదగకుండా చేసే దురాఆలోచన. ‘విద్యార్థి నాయకత్వ స్పూర్తికి విఘాతం కలిగించడం ఆత్మహత్యాసదృశ చర్య.’ ఓయూ ప్రగతిశీల ప్రస్తానం భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా నిలవాలి. ఉస్మానియా విశ్వ విద్యాలయంలో చదివిన నాటి రోజులు ఒక మధురానుభూతి. ఉస్మానియాలో విద్యార్థి హక్కులను అణచివేసే నేటి ప్రయత్నాలు మాని, చరిత్ర నుంచి పాఠాలను నేర్చుకోవాలి.

Monday, April 7, 2025

జంబూద్వీపంలో భారతవర్షం కర్మభూమి (శ్రీ మహాభాగవత కథ-30) : వనం జ్వాలా నరసింహారావు

 జంబూద్వీపంలో భారతవర్షం కర్మభూమి (శ్రీ మహాభాగవత కథ-30)

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (07-04-2025)

కంII చదివెడిది భాగవతమిది, 

చదివించును కృష్ణు, డమృతఝరి పోతనయున్

చదివినను ముక్తి కలుగును, 

చదివెద నిర్విఘ్నరీతి ‘జ్వాలా’ మతినై 

వర్షాలన్నింటిలోను భారత వర్షమే కర్మక్షేత్రం. ఏ వర్షంలో ఎవరు ఎలాంటి సుఖదుఃఖాలను అనుభవించినా దానికి కారణాలైన పుణ్యకర్మలనీ, పాప కర్మలనీ ఆచరించే స్థలం భారత వర్షం. మిగతా ఎనిమిది వర్షాలు పుణ్యకర్మలను అనుభవించే స్థానాలు. పుణ్యకర్మలను అనుభవించే స్థానానికి స్వర్గం అని పేరు. ఆ కర్మలో కొంతమేరకు కర్మఫలాన్ని అనుభవించి, మిగులు ఉండగా జీవులు భూమిని చేరుతూ ఉంటారు. అలా చేరి, మిగిలి ఉన్న పుణ్యఫలాలను అనుభవిస్తారు. వాటిని భౌమ స్వర్గాలని అంటారు. అలాంటి భౌమ స్వర్గాలు ఎనిమిది వర్షాలు. దానికి మూలమైన పుణ్యాన్ని ఆచరించే స్థానం భారత వర్షం. ఇక శ్రేష్టమైన భారత వర్షం కథ ఏమిటంటే: 

స్వాయంభవ మనువుకు ప్రియవ్రతుడు అనే కొడుకు జన్మించాడు. అతడికి అగ్నీధ్రుడు అనే కుమారుడు పుట్టాడు. అతడికి నాభి అనే వాడు పుట్టి బాలి చక్రవర్తితో స్నేహం చేశాడు. సమస్త భూమండలాన్ని పాలించాడు నాభి. అతడికి ఋషభుడు అనే సద్గుణవంతుడైన కొడుకు పుట్టాడు. అతడి కొడుకుల్లో పెద్దవాడైన భరతుడు ఘోరమైన తపస్సు చేసి, మనస్సును సంసార బంధాల నుండి మళ్లించి చివరకు వాసుదేవుడిని చేరుకున్నాడు. ఆ పుణ్యాత్ముడు ఏలిన భూమండలానికి అతడి పేరుమీద ‘భారతవర్షం’ అని ఏర్పడి, క్రమేపీ జగత్ప్రసిద్ధం అయింది.

ఇలావృతం మొదలుగా గల తొమ్మిది వర్షాలలోనూ భగవానుడైన నారాయణుడు అవతరించి, నిత్యం లోకాలను అనుగ్రహిస్తూ, లోకులందరికీ జ్ఞానం ఇస్తాడు. ఇలావృత వర్షానికి అధిపతి త్రిపురాలను హరించిన రుద్రుడు. భద్రాశ్వ వర్షానికి అధిపతి భద్రశ్రవుడు. హరి వర్షానికి అధిపతి నరసింహస్వామి. కేతుమాల వర్షంలో భగవానుడు కామదేవుడు (ఈయన్నే ప్రద్యుమ్నుడు అని అంటారు) అనే పేరుతో లక్ష్మీదేవికి ప్రీతి కలిగిస్తూ ఉంటాడు. ఈ వర్షానికి అధిపతులు ప్రజాపతైన సంవత్సురిడి కుమార్తెలు, కుమారులు. కొడుకులు పగళ్లు, కూతుర్లు రాత్రులు. రమ్యక వర్షానికి అధిదేవత మత్స్యరూపంలో ఉంటాడు. అతడు హరే! ఈ వర్షాధిపతి మనువు. ఇతడు మత్స్యమూర్తిని ఆరాధిస్తుంటాడు. ఇక హిరణ్మయ వర్షం అధినేత కూర్మావతార రూపుడైన పద్మగర్భుడు శ్రీమహావిష్ణువు. పితృదేవతల అధిపతైన అర్యముడు హిరణ్మయవర్ష పాలకుడు. ఉత్తర కురు భూములకు వరాహదేవుడు అధిపతి. భూదేవి అతడికి పూజ చేస్తుంటుంది. కింపురుష వర్షానికి సీతాలక్ష్మణ సమేతుడైన శ్రీరామభద్రుడు అధిపతి. భారత వర్షానికి అధిపతి నారాయణుడు. బదరికాశ్రమంలో నరుడితో కలిసి తపస్సు చేశాడు. భారత వర్షంలో ఎన్నో పుణ్యశైలాలు, గంబీరంగా ప్రవహించే అనేక నదులు ఉన్నాయి. అవి....

పుణ్యశైలాలు: మలయ పర్వతం, మంగళ ప్రస్థం, మైనాకం, ఋషభం, కూతకం, కొల్లకం, సహయం, వేదగిరి, ఋష్యమూకం, శ్రీశైలం, వేంకటాద్రి, మహేంద్రం, వారిధరం, వింధ్యపర్వతం, శుక్తిమత్పర్వతం, ఋక్షగిరి, పారియాత్రం, ద్రోణపర్వతం, చిత్రకూటం, రైవతకం, కుకుభం, నీలగిరి, గోకాముఖం, ఇంద్రకీలం, రామగిరి మొదలైనవి. 

పవిత్ర నదులు: పైన చెప్పిన పర్వతాలకు పుత్రికలైన పుణ్యనదులు: చంద్రపట, తామ్రపర్ణి, కృతమాల, వైహాయాసి, కావేరి, వేణి, పయస్విని, పయోద, శర్కరావర్త, తుంగభద్ర, కృష్ణవేణి, భీమరథి, గోదావరి, నిర్వింధ్య, పయోష్ణి, తాపి, రెవ, సురస, చర్మణవతి, వేదస్మృతి, ఋషికుల్వ, త్రిసోమ, కౌశికి, మందాకిని, యమునా, సరస్వతి, దృషద్వతి, గోమతి, సరయువు, భోగవతి, సుషోమ, శతద్రువు, చంద్రభాగ, మరుద్వరుథ, వితస్త, అసిక్ని, విశ్వ అనే మహానదులు. నర్మదానది, సింధువు, శోణ అనే నదాలు భారత వర్షంలో ప్రవహిస్తున్న మహా ప్రవాహాలు. వీటిల్లో పవిత్రంగా స్నానాలు చేస్తే మానవులు ముక్తిని పొందుతారు. 

భారత వర్షం ఎంతో ఉత్తమమైనదని మహాపురుషులు స్తుతిస్తారు. భారత వర్షంలో జన్మించిన వారి భాగ్యాన్ని వర్ణించి చెప్పడం సాధ్యం కాదు. భారత వర్షంలో శ్రీహరి ఎన్నో అవతారాలను ఎత్తి, జీవులకు తత్త్వం ఉపదేశించాడు. అందువల్ల భారత వర్షంలోని జనులకు సాధ్యం కానిదేదీ లేదు. నారాయణుడిని స్మరించడం వల్ల సకల పాపాలు నశిస్తాయి. భారత వర్షంలో ఒక్క క్షణకాలం మనఃపూర్వకంగా సర్వ సంగ పరిత్యాగం చేస్తే, అతడు పురుష శ్రేష్టుడు అవుతాడు. ఒక్కమాటలో చెప్పాలంటే, భారత వర్షం మోక్షాన్ని పొందడానికి అనువైన కర్మ భూమి, యజ్ఞాభూమి. 

ఏడు వర్షాల ప్లక్ష ద్వీపం 

జంబూ ద్వీపానికి చుట్టూ లక్ష యోజనాల మేర ఉప్పు సముద్రం చుట్టి ఉన్నది. ప్లక్ష ద్వీపానికిచుట్టూ చెరకు రసం నిండిన సముద్రం ఉన్నది. అది రెండు లక్షల యోజనాల మేర చుట్టి ఉన్నది. ద్వీప మధ్య భాగంలో ప్లక్షం అనే జువ్వి చెట్టు ఉన్నది కాబట్టి ఈ ద్వీపానికి ప్లక్ష ద్వీపం అన్న పేరు వచ్చింది. అగ్నిదేవుడు దీనికి అధిపతి. (ప్రియవ్రతుడి కొడుకు ఇధ్మజిహ్వుడు దీని పాలకుడు). ఈ ప్లక్ష ద్వీపాన్ని ఏడు వర్శాలుగా విభజించడం జరిగింది. అవి శివ, యశస్య, సుభద్ర, శాంత, క్షేమ, అమృత, అభయ అనేవి. 

ఈ సప్త వర్షాలకు సప్త కుల పర్వతాలున్నాయి. వాటి పేర్లు: మణికూటం, వజ్రకూటం, ఇంద్రసేనం, జ్యోతిష్మంతం, ధూమ్రవర్ణం, హిరణ్యగ్రీవం, మేఘమాలం. ఈ వర్షాలకు సప్త మహానదులున్నాయి. అవి: అరుణ, నృమ్ణ, అంగిరసి, సావిత్రి, సుప్రభాత, ఋతంబర, సత్యంభర అనేవి. ప్లక్ష ద్వీపానికి ముందు, జంబూద్వీపానికి మధ్య లవణ సముద్రం ఉన్నట్లే, ప్లక్ష శాల్మలీ ద్వీపాలకు మధ్యలో ఇక్షురస జలంతో నిండిన ఇక్షురస సముద్రం ఉన్నది. ఇది రెండు లక్షల యోజనాల విస్తీర్ణం కలిగి ఉంటుంది. ఇక్షురస సముద్రానికి రెట్టింపు వైశాల్యం కలిగినది శాల్మలీ ద్వీపం. 

శాల్మలీ ద్వీపంలో శాల్మలీ వృక్షం (బూరుగు చెట్టు) విస్తీర్ణం ప్లక్ష ద్వీపం విస్తీర్ణమంత ఉంటుంది. ఈ వృక్షం వల్లనే ఆ ద్వీపానికి శాల్మలీ అన్న పేరొచ్చింది. ఈ వృక్షం మూలంలో, వేదాలే అవయవాలుగా ఉన్న పతత్రి రాజు-పక్షిరాజు గరుత్మంతుడు నివసిస్తూ ఉంటాడు. శాల్మలీ ద్వీపానికి యజ్ఞబాహువు పాలకుడు. ఇతడు ప్రియవ్రతుడి కొడుకు. యజ్ఞబాహువు తన ఏడుగురు కొడుకుల పేర్లతో ఏడువర్షాలను విభజించి వారికిచ్చాడు. అవి: సురోచనం, సామనస్యం, రమణకం, దేవబర్హం, పారిభద్ర, అప్యాయనం, అభిజ్ఞాతం అనేవి. ఈ వర్షాలలో సరిహద్దు పర్వతాలు ఏడు ఉన్నాయి. అవి: సురస, శతశృంగ, వామదేవ, కుంద, ముకుంద, పుష్పవర్ష, శతశ్రుతులు అనేవి. ఏడునదులు అక్కడ ప్రవహిస్తున్నాయి. అవి: అనుమతి, సినీవాలి, సరస్వతి, కుహువు, రజని, నంద, రాకలు అనేవి. 

శాల్మలీ ద్వీపానికి చుట్టూ సురా సముద్రం ఉంది. దాని విస్తీర్ణం నాలుగు లక్షల యోజనాలు. సురా సముద్రానికి చుట్టూ కుశ ద్వీపం ఉన్నది. దాని విస్తీర్ణం ఎనిమిది లక్షల యోజనాలు. కుశ ద్వీపం చుట్టూ ఘృత సముద్రం ఉన్నది. ఆ ద్వీపంలో దేవతలు నిర్మించిన కుశస్తంబం ఉన్నది. ఆ స్తంబం ఉండబట్టే దాని పేరు కుశ ద్వీపం అని వచ్చింది. కుశ ద్వీపానికి ప్రియవ్రతుడి కొడుకు హిరణ్యరేతసుడు అధిపతి. యితడు తన కొడుకుల పేర్లతో వర్షాల్ని విభజించి ఏర్పాటు చేశాడు. కుశ (ద్వీప) వర్షం లో బభ్రువు, చతుశ్సృ౦గం, కపిల, చిత్రకూటం, దేవానీకం, ఉర్ధ్వరోమం, ద్రవిణం అనే ఏడు పర్వతాలున్నాయి. రసకుల్య, మధుకుల్య, శ్రుతవింద, మిత్రవింద, దేవగర్భ, ఘృతచ్యుత, మంత్రమాల అనే ఏడు మహానదులు ఉన్నాయి. 

కుశ ద్వీపానికి చుట్టుకుని ఘృతసముద్రం ఉన్నది. దాని వైశాల్యం ఎనిమిది లక్షల యోజనాలు. దానికి అవతల పదహారు లక్షల యోజనాల విస్తీర్ణంతో క్రౌంచ ద్వీపం ఉంది. దాని మధ్యలో క్రౌంచం అనే ఒక పర్వతం ఉంది. దీని మూలంగానే ఆ ద్వీపానికి ఆ పేరొచ్చింది. ఈ ద్వీపానికి అధిపతికూడా ప్రియవ్రతుడి మరో కొడుకు ఘృతవృష్టుడు. తనకొడుకులైన ఆమోద, మధువహ, మేఘవృష్ణ, సుధామ, ఋషిజ్య, లోహితార్ణ, వనస్పతులానే వారి పెళ మీద వర్షాలను ఏర్పాటు చేశాడు. ఆ వర్షం (క్రౌంచ ద్వీపం) లో శుక్ల, వర్ధమాన, భోజన, ఉపబర్హణ, నంద, నందన, సర్వతోభద్రము అనే ఏడు పర్వతాలు; అభయ, అమృతౌఘ, ఆర్యక, తీర్థవతి, తృప్తిరూప, పవిత్రవతి, శుక్ల అనే ఏడు నదులున్నాయి. 

క్రౌంచ ద్వీపాన్ని చుట్టుకుని పాల సముద్రం ఉన్నది. దాని విస్తీర్ణం పదహారు లక్షల యోజనాలు. దానిలో శాక ద్వీపం ఉన్నది. ఇది 32 లక్షల యోజనాల విస్తీర్ణంతో ఉన్నది. ఆ ప్రదేశమంతా శాక వృక్ష సుగంధంతో నిండి ఉండడం వల్ల ఆ ద్వీపానికి శాక ద్వీపం అన్న పేరొచ్చింది. ప్రియవ్రతుడి కొడుకైన మేధాతిథి ఈ శాక ద్వీపానికి అధిపతి. ఇతడి ఏడుగురు కొడుకుల పేర్ల మీద వర్షాలను విభజించి పట్టం కట్టాడు. అవి: పురోజన, పవమాన, ధూమ్రానీక, చిత్రరథ, బహురూప, విశ్వాధార. ఈ శాక ద్వీపానికి ఏడు సరిహద్దు పర్వతాలున్నాయి. అవి: ఈశాన, ఉరుశృంగ, బలభద్ర, శతకేసర, సహస్ర స్రోత, దేవపాల, మహానస అనేవి. ఈ ద్వీపంలో అనఘ, ఆయుర్ద, ఉభయసృష్టి, అపరాజిత, పంచనది, సహస్రసృతి, నిజధృతి అనే సప్త మహానదులున్నాయి. 

శాక ద్వీపాన్ని ఒరుసుకుంటూ చుట్టూ పెరుగు సముద్రం ఉన్నది. దాంట్లో పుష్కర ద్వీపం ఉన్నది. దీని విస్తీర్ణం 64 లక్షల యోజనాలు. ఇది మహాద్వీపం. దీంట్లో పదివేల బంగారు రేకులతో పద్మం ఉన్నది. ఇది బ్రహ్మదేవుడి పీఠం. పుష్కర ద్వీపం మధ్యన మానసోత్తరం అనే పర్వతం ఉన్నది. ఇది వర్షాల మధ్య సరిహద్దు గిరిలాగా ఉంటుంది. మానసోత్తర పర్వతం ఎత్తు పదివేల యోజనాలు. వైశాల్యం కూడా అంతే. దీనికి చుట్టూ నాలుగు పురాలున్నాయి. అవి: ఇంద్ర, అగ్ని, వరుణ, కుబేరు లోకపాలకుల పురాలు. ఈ పర్వతానికి పైన సంవత్సరాత్మకమై సూర్యరథ చక్రం మేరు ప్రదక్షిణం చేస్తూ ఉంటుంది. అది ఒకసారి ప్రదక్షిణం చేసే కాలమే అహోరాత్రం అనబడుతుంది. ప్రియవ్రతుడి కొడుకు వీతిహోత్రుడు పుష్కర ద్వీపానికి అధిపతి. అతడి ఇద్దరి కొడుకుల పేర్లమీద రమణక, దాతక అనే రెండు వర్షాలుగా ఈ ద్వీపాన్ని విభజించడం జరిగింది. 

ఇదీ, శుద్ధోదక సముద్రం వరకు ఉండే సప్తద్వీప రూపంగా ఉన్న భూమండల వర్ణన. 

పుష్కర ద్వీపాన్ని చుట్టుకుని 64 లక్షల యోజనాల విస్తీర్ణంతో శుద్ధోదక సముద్రం ఉన్నది. ఈ సముద్రానికి అవతల లోకాలోకం అనే పర్వతం ఉన్నది. ఇది వెలుగుకు, చీకటికి మద్యన ఉండడం వల్ల దీనికి లోకాలోకం అన్న పేరు వచ్చింది. శుద్ధోదక సముద్రానికి, లోకాలోక పర్వతానికి మధ్యలో ఎనిమిది కోట్ల ముప్పై తొమ్మిది లక్షల యోజనాలకు విస్తరించి బంగారు రంగులో అద్దంలాగా ఒక ప్రదేశం ఉన్నది. అది దేవతలు ఉండడానికి వీలుగా ఉంటుంది. అక్కడ నేలమీద పెట్టిన ఏ వస్తువైనా తిరిగి తీసుకోవడం కుదరని పని. అక్కడి నుండి లోకాలోక పర్వతం ఎనిమిది కోట్ల యోజనాలు. సూర్యుడు మొదలుకుని ధ్రువుడి వరకు ఉండే జ్యోతిర్మండలం కిరణాలకు (లోకాలకు) సరిహద్దుగా ఉన్నందున, ఆ తరువాత మొత్తం ఆలోకం (చీకటి) ఉన్నందున, దానికి లోకాలోక పరవటం అన్న పేరొచ్చింది. 

సప్త ద్వీపాలతో కూడిన భూమండలం మొత్తం విస్తీర్ణం ఏభై కోట్ల యోజనాలు. దాంట్లో నాల్గవ వంతు లోకాలోక పర్వతం ప్రమాణం. దీంట్లో సకల జగద్గురువైన బ్రహ్మ అంతర్యామిగా ఉంటాడు. బ్రహ్మదేవుడు, ఋషభం, పుష్కరచూడం, వామనం, అపరాజితం అనే పేర్లుకల నాలుగు దిగ్గజాలను లోకాలను రక్షించడానికి అక్కడ నిలిపి ఉంచాడు. భగవంతుడు సకల లోకాలను రక్షించడానికి లోకాలోక పర్వతం మీద కల్పాంతం వరకు వేచి ఉంటాడు. 

వివిధాలైన ఈ లోకయాత్రలన్నీ భగవంతుడి చిఛ్చక్తిస్వరూపిణి అయిన యోగమాయా విరచితాలే! ఇలా అనేక మంత్ర రహస్యాలతో ఆ లోకాలోక పర్వత శిఖరం మీద ఉన్న భగవంతుడికి తప్ప ఆ పర్వతానికి ఆవల వైపు ఇతరులెవ్వరికీ సంచరించడానికి వీలుపడదు. సూర్యుడు బ్రహ్మాండమధ్యంలో ఉన్నాడు. సూర్యుడి నుండి అండగోళం అంచులు రెండింటికి 25 కోట్ల యోజనాల మేర ఉన్నది. ఇలా ఉన్న సూర్యుడి వల్లనే దిక్కులు, స్వర్గం, మోక్షం, నరకం మొదలైనవన్నీ ఏర్పడుతున్నాయి. దేవతలకు, జంతువులకు, మనుష్యులకు, నాగులకు, పక్షులకు, గడ్డికి, లతలకు, పొదలకు, భూమి నుండి మొలిచే సర్వ జీవ సమూహానికీ సూర్యుడే ఆత్మగా ఉన్నాడు. 

(బమ్మెర పోతన శ్రీమహాభాగవతం, రామకృష్ణ మఠం ప్రచురణ ఆధారంగా)

Saturday, April 5, 2025

Improper Educational Policies Stymie Professional Faculties : Vanam Jwala Narasimha Rao

 Improper Educational Policies 

Stymie Professional Faculties

Vanam Jwala Narasimha Rao

The Hans India (06-04-2025)

{At present, there is a fundamental flaw in the structure of education, training, and job preparedness. A significant disconnect exists between professional education and the actual execution of skill-related roles in engineering, medicine, and civil services. Concerns expressed by Parliamentary Committee, Sonia Gandhi, and Revanth Reddy are significantly genuine. The NEP-2020 largely aims to address these gaps by introducing experiential learning, vocational training, and industry partnerships to improve professional competence. It emphasizes multidisciplinary education, problem-solving, and early exposure to technical skills. However, implementation remains inconsistent, with educational institutions still relying heavily on rote learning. Experts have pointed out that the success of NEP depends on effective implementation, infrastructure, and industry collaboration} – Editor’s Synoptic Note

A Parliamentary Committee emphasized the need to enhance higher education options, research infrastructure, a unified long-term approach to retain and recover its human capital and to avoid Brain Drain. Congress Leader Sonia Gandhi in an article, criticized the National Education Policy (NEP) alleging that the 3Cs ‘Centralization, Commercialization, and Communalization’ haunt Indian Public Education System today, and this ‘Carnage’ must end. Sonia criticized that, the Central Advisory Board of Education (CABE) comprising Union and States’ Ministers for Education has not been convened since September 2019. Telangana Chief Minister Revanth Reddy, during a review meeting with the Education Commission preferred to introduce ‘Revolutionary Reforms in the Education System’ and unveil a ‘Comprehensive Policy Document’ aimed at establishing the best possible education system, considering field-level realities and adopt a practical, results-oriented approach, through quality primary (With Strong Foundation) and higher education. These recent interpretations by Parliamentary Committee, Sonia Gandhi, and Revanth Reddy are noteworthy. 

In the rapidly evolving landscape of professional competence, despite advancements in technology and infrastructure, inadequacies continue to undermine effective service delivery, the main reason being, gap that exists between theoretical knowledge and practical execution. This disconnect is evident in critical fields like Engineering, Medicine, and Civil Services, where reliance on ground-level skilled personnel remains alarmingly high. The root of this problem lies not only just in ‘Outdated Educational Frameworks’ but also in the structural deficiencies of professional training and preparedness. Analyzing Causes, Manifestations, and Potential Solutions to this deep-seated issue, focusing on aligning professional education with real-world demands, is essential. Real-world demands must drive education reforms. 

For instance, as an example, for resolving technical and infrastructure-related issues, such as rectification of power failures, quite often skilled ground staff do better than senior professionals. Higher-level professionals often limit themselves to routine administrative, supervisory, and managerial functions, lacking hands-on expertise, including inability to handle advanced tools. Engineering, Medicine, Information Technology, and other professional graduates, despite holding advanced degrees and years of experience, become increasingly dependent on ground-level Industrial Training Institutes’ (ITI) personnel or self-taught skilled expertise for operational tasks. Professional Independence requires real-world technical competence.

India has demonstrated professional excellence, accomplishing global recognition and serving as ‘Role Model’ for other countries in key fields such as space technology, nuclear research, healthcare, information technology, and financial sector. This success is largely due to well-structured hierarchical coordination and continuous knowledge updates. Space technology thrives under a defined three-tier structure where scientists, engineers, and operational staff coordinate seamlessly from testing to launch and ground station monitoring. Nuclear technology benefits from a ‘National Atomic Energy Agency’ guiding research, development, and operational implementation through cross-functional teams. This structured coordination and continuous learning in few selected areas, is typically missing in other fields. A significant disconnect exists between professional education and the actual execution of skill-related roles in engineering, medicine, and civil services. 

Professionals with prestigious degrees, thanks to umpteen inadequacies, often struggle with practical challenges, relying heavily on lower-level staff for troubleshooting. There is a fundamental flaw in the structure of education, training, and job preparedness. For example, electrical engineers in government service frequently rely on electricians to repair simple wiring issues, and those working in a power plant might understand the theoretical aspects of voltage regulation and circuit design but struggles to diagnose a transformer or any other failure without the help of an experienced electrician. 

Civil engineers working on infrastructure projects depend on masons and carpenters to execute construction work accurately. Mechanical engineers often need support from experienced mechanics to diagnose and repair machinery failures. Computer Science Graduates require additional training to handle complex coding problems or software deployment. MBBS doctors often struggle with patient care and diagnosis without the assistance of nurses and technicians. Specialist doctors are unable to interpret basic diagnostic reports without guidance from radiologists or lab technicians. Civil servants rely heavily on clerical staff and subordinates for a simple note preparation. Operational efficiency entirely depends on skilled support staff.

Professional education system prioritizes theoretical knowledge over practical application. Engineering and medical curricula are outdated, focusing on examinations rather than real-world problem-solving. Internship opportunities are limited, leaving graduates unprepared for field challenges. Consequently, ITI-trained electricians, plumbers, and machine operators often outperform specialist engineers in practical settings, while nurses and medical technicians demonstrate better patient care capabilities than newly graduated doctors and even specialist. Constables and Upper Division Clerks handle basic-level operations better than senior or junior IPS-IAS officers. A better field training than the existing one strengthens administrative problem-solving skills.

Introducing mandatory internships and hands-on training in engineering and medical education; Focus on skill-based training rather than rote learning; Encouraging collaboration between educational institutions and industries for real-world exposure; Encouraging professional certification and evaluation beyond academic degrees; Introducing skill-based hiring criteria in public and private sectors etc. maybe an answer to the maladies. The deep-rooted disconnect between professional education and practical execution needs to be done away with.

The NEP-2020 to a great extent aims to address these gaps by introducing experiential learning, vocational training, and industry partnerships to improve professional competence. It emphasizes multidisciplinary education, problem-solving, and early exposure to technical skills. However, implementation remains inconsistent, with educational institutions still relying heavily on rote learning. Experts have pointed out that the success of NEP depends on effective implementation, infrastructure, and industry collaboration. The National Training Policy (NTP) underscores the importance of continuous learning, structured training modules, and competency-based evaluations for professionals and civil servants. It proposes mid-career training programs and practical exposure to improve decision-making and operational competence. Bureaucratic inertia and ineffective monitoring which hamper execution continues to be a flaw.

Over the years, experts have long highlighted this growing disconnect between academic learning and professional competence. Professional education still tends to focus on examinations rather than skill-building, and producing graduates who excel only in theory. Engineering education often fails to develop coding and technical skills, while medical training leaves MBBS graduates ill-equipped to handle critical cases independently. Administrative training remains focused on procedural knowledge rather than field-level realities, and understanding.

One easy way to comprehend on Imperatives, implications, and challenges of implementation in seriatim are: Curriculum Overhaul with a focus on practical application, Skill-Based Learning, Industry-Academia Collaboration for real-world exposure, Competency-Based Training, and Continuous Learning (Imperatives); Improved Professional Competence, Reduced Dependency on lower-skilled workers, Enhanced Public Trust and service delivery, Competent professionals improving service delivery, boosting public confidence (Implications); and Resistance to Change from existing systems, Resource and infrastructure Constraints, Coordination Issues, and Scalability (Challenges of Implementation) etc. 

Bridging the gap between education and professional competence is essential for not only India’s, but also many developing and fairly good number of developed countries. Practical training, industry collaboration, and competency-based learning will empower professionals to perform effectively. The success of reforms under the National Education and Training Policies depends on consistent execution, adequate resources, and a mindset shift toward skill-based education. Connecting the gap between theoretical knowledge and practical competence is not just a policy imperative, it is a national necessity. The success of India's professional excellence in fields like space and nuclear technology demonstrates the potential of structured hierarchical coordination and continuous learning. However, this success remains confined to select sectors, leaving significant gaps in professional execution across engineering, medicine, and civil services. 

The National Education Policy-2020 and the National Training Policy may provide a roadmap for addressing these shortcomings, but the real challenge lies in effective implementation. A paradigm shift towards skill-based learning, industry-academia collaboration, and continuous professional development is essential. Only by aligning educational objectives with practical demands India can transform its workforce from theoretically proficient to operationally competent, ensuring that professionals at higher governance levels are not just administrators but effective problem solvers and innovators. And hence, concerns expressed by Parliamentary Committee, Sonia Gandhi, and Revanth Reddy are significantly genuine. Hope they will become practical.

శ్రీరామరాజ్యం : వనం జ్వాలా నరసింహారావు

 శ్రీరామరాజ్యం

వనం జ్వాలా నరసింహారావు

భక్తి మాసపత్రిక (ఏప్రియల్, 2025) 

శ్రీరామాయణాన్ని దీర్ఘశరణాగతి అని అంటారు. రామాయణంలో కనిపించే పరతత్వం శ్రీరామచంద్రమూర్తిగా అవతరించిన విష్ణువే. అయినా మానవుడిగానే నడుసుకున్నాడు. ఆ శ్రీరామచంద్రుడే మానవ విలువలకు అద్భుతమైన ఉదాహరణ. ఎవ్వరికీ వెరువని శ్రీరాముడు, ఏనాడూ తన కర్తవ్యాన్ని వీడలేదు. ‘మానవులు’గా వుండాలనుకునేవారు తప్పక శ్రీరాముడిని ఆదర్శంగా తీసుకోవాలి. ఎన్నో గొప్ప సుగుణాలు, ధర్మాలు, కలగలిసిన రామరాజ్యాన్ని మించినది ఏ లోకంలోనూ మరోటి లేదు.  

ఇవన్నీ వివరంగా తెలుసుకోవాలంటే సంస్కృతంలోని వాల్మీకి శ్రీరామాయణాన్ని, లేదా, తెలుగులో వున్న ఆంద్రవాల్మీకి రామాయణం మందరాన్ని చదవాల్సిందే. కావ్యాలలో అగ్రస్థానంలో నిలిచి, ప్రబంధ వైలక్షణ్యాన్ని తెలియచేసే వాల్మీకి విరచిత శ్రీమద్రామాయణం (‘సీతాయా శ్చరితం మహత్’) ఆసాంతం ప్రణవార్థాన్నే తెలియచేస్తుంది. ఇందులో నాయిక, నాయకులు సాక్షాత్తు శ్రీదేవైన సీతాదేవి, మహావిష్ణువైన శ్రీరామచంద్రమూర్తి. శ్రీరామాయణానికి మొట్ట మొదలు బీజ రూపంలో వాల్మీకి నోట వెలువడ్డ శ్లోకం: ‘మానిషాద ప్రతిష్ఠాం త్వ! మగ మ శ్శాశ్వతీ స్సమాః ; యత్క్రౌంచ మిథునాదేక! మవధీః కామమోహితం.’ ఆంధ్రవాల్మీకి వాసుదాసుగారు దీనిని ‘తెలియు మా నిషాదుండ ప్రతిష్ఠ నీక ప్రాప్తమయ్యెడు శాశ్వతహాయనముల; గ్రౌంచ మిథునంబునందు నొక్కండు నీవు కామమోహిత ముం జంపు కారణమున’ అని తెనిగించారు: ఆ శ్లోకం శాపంకాదని, శ్రీరామచంద్రుడి మంగళాశాసనమని అంటారు. వాల్మీకి నోట అలా శ్లోకం రావడానికి కారణం వివరించాడు చతుర్ముఖ బ్రహ్మ.  

రామాయణం ప్రారంభంలో వాల్మీకి మహర్షి, తన ఆశ్రమానికి వచ్చిన నారదుడిని, పదహారు ప్రశ్నలు వేశాడు. నిజానికి ఆ పదహారూ కలిపి ఒక్కటే ప్రశ్న. వరుసగా పదహారు గుణాలు చెప్పి, ఈ గుణాలన్నీ కలిగినవాడు ఒక్కడైనా ఉన్నాడా? అనేది వాల్మీకి వెలిబుచ్చిన సందేహం. ఆ గుణాలేమిటంటే... ‘గుణవంతుడు, అతివీర్యవంతుడు, ధర్మజ్ఞుడు, కృతజ్ఞుడు, సత్యశీలుడు, సమర్థుడు, నిశ్చలసంకల్పుడు, సదాచారం మీరనివాడు, సమస్త ప్రాణులకు మేలు చేయాలన్న కోరికున్నవాడు, విద్వాంసుడు, ప్రియదర్శనుడు, ఆత్మవంతుడు, కోపాన్ని స్వాధీనంలో వుంచుకున్నవాడు, ఆశ్చర్యకరమైన కాంతిగల వాడు, అసూయ లేనివాడు, రణరంగంలో దేవదానవులను గడ-గడలాడించ గలవాడు’ ఎవరైనా వున్నారా ఈ భూలోకంలో?’ ఇలా వాల్మీకి వేసిన ప్రశ్న భగవంతుడి గురించే కాబట్టి, నారదుడు అదే రీతిలో సమాధానం ఇచ్చాడు. 

ఆ గుణాలున్న వ్యక్తి రామచంద్రమూర్తి ఒక్కడే అని చెప్పాడు నారదుడు. రాముడు, అతివీర్యవంతుడని, అసమానమైన శక్తిగలవాడని, స్వయంప్రకాశి అని, అతిశయంలేని ఆనందం కలవాడని, ఇంద్రియాలను వశపర్చుకున్నవాడని, సర్వజ్ఞుడని, ధర్మజ్ఞానంగలవాడని, బ్రహ్మజ్ఞాన సంపన్నుడని, నీతిమంతుడని, పరులకు హితవచనాలను చెప్తాడని, ఋజుస్వభావం గలవాడని, ఎవరిపై శత్రుభావం లేనివాడని, చేసిన ప్రతిజ్ఞ తప్పనివాడని, సమస్త భూజనులకు మేలైన కార్యాలనే చేసేవాడని, ఆత్మతత్వం ఎరిగినవాడని, దానధర్మాలు విరివిగా చేసేవాడని, ఆశ్రిత రక్షకుడని, స్వాశ్రితరక్షణ వల్ల లభించిన యశస్సు, శత్రువులను అణచినందున వచ్చిన కీర్తిగలవాడని, ఆశ్రితులకు, మాత-పిత-ఆచార్యులకు-వృద్ధులకు వశ పడినవాడని, విష్ణువుతో సమానుడని, లోకాలను పాలించ సమర్థుడని నారదుడు జవాబిచ్చాడు. 

శ్రీరాముడు ధర్మాన్ని తానాచరిస్తూ, ఇతరులతో ఆచరింపచేసేవాడని,  స్వధర్మ పరిపాలకుడని,  స్వజనరక్షకుడని, వేదవేదాంగాలను రహస్యార్థాలతో ఎరిగినవాడని, కోదండ దీక్షాపరుడని, సర్వ శాస్త్రాల అర్థాన్ని నిర్ణయించగల నేర్పరని, జ్ఞాపకశక్తిగలవాడని, విశేషప్రతిభగలవాడని, సమస్త ప్రపంచానికి ప్రియం చేసేవాడని, సాధువని, గంభీర ప్రకృతిగలవాడని, సమస్త విషయాలను చక్కగా బోధించగలవాడని, మనోహరంగా ప్రజలకు  ఎల్లప్పుడూ దర్శనమిచ్చేవాడని, సమస్తభూతకోటికి పూజ్యుడని, అన్నింటా గుణ శ్రేష్ఠుడని,  కౌసల్యా నందనుడని పేరు తెచ్చుకున్నాడని నారదుడు చెప్పాడు. శ్రీరాముడు ధర్మానికి మారుపేరని, అతడిలాంటి పురుషోత్తముడికి సరితూగేవారు లోకంలో ఎవరూ లేరని నారదుడు అంటాడు. 


సీతాయా:చరితం మహత్ 

కౌసల్యా గర్భసంభూతుడు రాముడు. అయోనిజ సీతను పెళ్లాడాడు. వివాహానంతరం సర్వసుఖాలు అనుభవించి, భార్యాభర్తల అన్యోన్యత, అనురాగం ఎలా ఉండాలో ప్రపంచానికి తెలియచేసి, పితృవాక్య పాలన చేసి, అరణ్యాలకు పోయి, సత్యవ్రతుడై, రావణాది దుష్టులను సంహరించి, కర్మయోగిగా, స్వధర్మ నిష్ఠయే అందరికీ శ్రేయస్కరమని తన నడవడిద్వారా శ్రీరాముడు బోధించాడు. అందుకే శ్రీరామావతారం అనుష్టానావతారం. పితృవాక్య పాలనకు శ్రీరాముడు అడవులకు వెళ్తే, పతిభక్తితో, ఎండకన్నెరుగని సుకుమారి సీత భర్త వెంట పోయింది. స్వతంత్రుడై, శక్తుడై, తోడున్నవాడై, దుఃఖం అనుభవించాడు రాముడు. రాక్షసుడికి బందీగా, ప్రాణ భయంతో, నిరాహారిగా, అశక్తిగా, ఒంటరిగా దుఃఖపడింది సీత. భక్తుల దోషాలను క్షమిస్తానన్నాడు రాముడు. భక్తుల్లో దోషాలే లేవన్నది సీత. కాకాసురుడికి శిక్ష విధించి క్షమించాడు రాముడు. తనను బాధించిన రాక్షస స్త్రీలను క్షమించింది సీత. లోకపిత రాముడైతే, లోకమాత సీత. తన చరిత్రకంటే సీతాదేవి చరిత్రే శ్రేష్ఠమైందని రామచంద్రమూర్తే స్వయంగా అంటాడొకసారి. అందుకే వాల్మీకి కూడా ‘ప్రణతి ప్రసన్న జానకి ..... స్మరణ మాత్ర సంతుష్టాయ రామ’ అని చెప్పాడు. 

కళ్యాణ గుణాభిరాముడు 

శ్రీరామచంద్రమూర్తిలోని వాత్సల్యాది సకల కల్యాణగుణాలను (స్వామిత్వ, సౌశీల్య, సౌలభ్య, సర్వజ్ఞత్వ, సర్వశక్తిత్వ, సర్వసంకల్పత్వ, పరమకారుణికత్వ, కృతజ్ఞత్వ, స్థిరత్వ, పరిపూర్ణత్వ, పరమోదారత్వలు) శ్రీరామాయణంలో వాల్మీకి వర్ణించాడు. జ్ఞాన వృద్ధులైన సజ్జనులు, వయోవృద్ధులైన సజ్జనులు, సదాచార సంపన్నులైన సజ్జనులు, జ్ఞానశీల వయోవృద్ధులు, శీలజ్ఞాన వృద్ధులు, శ్రీ రాముడి దగ్గరకు, ఆయన ఎలాంటి పనిలో నిమగ్నమై వున్నప్పుడు వచ్చినప్పటికీ, తనపని తాను చేసుకుంటూనే, వారి సందేహాలను తీర్చే గుణవంతుడు. వచ్చేవాడు శత్రువైనప్పటికీ, తీయని మాటలతో ప్రియంగా మాట్లాడతాడు. అసత్యం పలుకడు. పరుల దుఃఖాన్ని తన దుఃఖంగా భావించేవాడు. సామాన్య ధర్మంలోను, విశేష ధర్మంలోను సరిసమానమైన ప్రీతికలవాడు. శరణాగత రక్షణనే తన నియమాన్ని ఎప్పుడూ ఉల్లంఘించలేదు. ధర్మ విరుద్ధమైన కథలను వినడంలో కూడా ఆసక్తి కనబర్చేవాడు కాదు. 

వేదాధ్యయనాన్ని, పరిపూర్ణంగాచేసి స్నాతకుడైనాడు. వేదాలను అంగాలతో సహా చదివాడు. శస్త్రాస్త్ర ప్రయోగజ్ఞానంలో తండ్రిని మించిన తనయుడనిపించుకున్నాడు. తండ్రి వంశాన్ని, తల్లి వంశాన్ని, లోకంలో ప్రసిద్ధి పొందేవిధంగా చేశాడు. దోషరహితుడు. ఎలాంటి సంకట సమయంలోను క్షోభ చెందనివాడు. సత్యసంధుడు. ఋజువర్తనుడు. ధర్మార విషయాలు బాగా తెలిసినవాడు. ఎప్పటికప్పుడు వికసించే ప్రజ్ఞకలవాడు. లౌకికాచారాలను, సమయాచారాలను సంస్థాపనములతో ఆచరించగల సమర్ధుడు. వినయవంతుడు. మిత్ర సహాయ సంపత్తికలవాడు. తలపెట్టిన కార్యాన్ని సాధించేంతవరకు తన ఆలోచనలను బహిర్గతం చేయకుండా దాచిపెట్టగల నేర్పరి. ఆర్జించే విధానం, వ్యయం చేసే విధానం తెలిసిన బుద్ధిమంతుడు. 

క్రోధాన్ని జయించినవాడు 

శ్రీ రామచంద్రుడికి గురుదేవులయందు దృఢమైన భక్తి వుండి. ఆ భక్తిలోను చలనం లేని స్థిర బుద్ధి కలవాడు. పరుష వాక్యాలను నాలుకమీదకు కూడా రానీయడు. చెడ్డవారి విషయంలోను, చెడ్డ పనులలోను ఎంతమాత్రం ఆసక్తి కనబర్చడు. శాస్త్రాధ్యయనంలో, దానికి అనుగుణంగా పనులు చేయడంలో నేర్పరి. తన దోషాలను, ఎదుటివారి దోషాలను కనుక్కొనగలిగే తెలివిమంతుడు. ముఖం చూడగానే ఎవరు దుష్టుడో, ఎవరు శిష్టుడో తెలుసు కొనగలిగే సామర్ధ్యం కలవాడు. ధర్మశాస్త్రానికి అనుగుణంగానే మిత్రులను ఎంపిక చేసుకుంటాడు. ఏ పని ఎప్పుడు ఎలా చేయాలో ఆ విధంగానే చేయగల సమర్ధుడు. 

శాస్త్ర పద్ధతిలో సంపాదన, వ్యయం చేయగల నేర్పరి. ఆదాయంలో నాలుగవ భాగమో, మూడవ భాగమో, ఆరవ భాగమో ఖర్చు చేస్తాడు. తర్క-న్యాయ-మీమాంసాలలో, నాటక విద్యలో, చిత్ర రచనలో శ్రేష్టుడు. ధర్మాన్ని, అర్థాన్ని అనుసరించి సుఖపడాలనుకుంటాడేకాని, కామాన్ని కోరడు. ధనాన్ని ఐదు భాగాలుగా ఎలా విభజించాల్నో తెలిసినవాడు. దుష్టులను సాదువులుగా మార్చగలడు. ధనుర్వేదాన్ని సమర్మముగా తెలిసిన గొప్పవాడు. అతిరథులకందరికీ పూజ్యుడు. శత్రువును వాడివద్దకే పోయి అణచగల సమర్ధుడు. సేనలను నడిపించడంలోనూ కడు నేర్పరి. దేవదానవులు కలిసి వచ్చినా ఓడించగల శక్తిమంతుడు. 

శ్రీ రాముడిలో అసూయ లేదు. ఆయన రమ్మంటేనే కోపం వస్తుంది. పొగరంటే ఏమిటో అసలే ఎరుగడు. తానెంత బలవంతుడైనప్పటికీ, అసాధ్య కార్యాలను చేయగల వాడైనప్పటికీ, ఎవరిని, దేనిని అవమానంగా చూడడు. శుద్ధసత్త్వ స్వరూపుడై, ప్రకృతి గుణాలకు, కాలమునకు లోబడి వుండేవాడు కాడు. ఇతరులు అభివృద్ధి చెందుతుంటే సంతోషపడేవాడు. ద్వేషించడు. బుద్ధిలో బృహస్పతితో, వీర్యంలో ఇంద్రుడితో, ఓర్పులో భూమితో పోల్చదగినవాడు. ముల్లోకాలను సంతోషపెట్టగల వాడు. సూర్యవంశంలో పుట్టి, సూర్యుడిలా అన్ని లోకాలవారిచే పూజించబడేవాడు. 

దశరథుడు చెప్పిన మాట 

శ్రీరాముడిని అడవులకు పంపమని కైక భర్తను కోరినప్పుడు, రాముడు అడవులకు పోదగిన వాడు కాదని తెలపడానికి ఆయన గుణాలను వర్ణించాడు ఇలా దశరథుడు. ‘శ్రీరాముడు మిక్కిలి కోమలమైన దేహం కలవాడు. నీతికి స్థానమైన వాడు. ప్రజల మేలు కోరే విషయంలో ప్రీతి కలవాడు. ధర్మ స్వరూప స్వభావుడు. ఒకరు కన్న తల్లి అని, మరొకరు సవతి తల్లి అని భేద బుద్ధి లేకుండా అందరినీ సమానంగా గౌరవిస్తాడు. తన బలంతో ఇతరులను లోబర్చుకోడు. నిర్మలమైన, కలుషితం లేని మనసుతో, తాను కష్టపడ్డప్పటికీ, మంచిమాటలతో వారు కోరిన కోరికలు తీర్చుకుంటూ, తన త్యాగగుణం వల్ల ఇతరులను వశపర్చుకుంటాడు. సత్యంతో పద్నాలుగు లోకాలను, దానబలంతో పేదవారిని, శుశ్రూషతో మెప్పించి, తల్లి, దండ్రి, ఆచార్యులను, వింటిని చూపుతూ, యుద్ధంలో శత్రువులను రాముడు వశపరుచుకుంటాడు. శ్రీరాముడిలో నిర్వ్యాజ సత్యం, దానం, గొప్ప తపస్సు, శుచిత్వం, మైత్రి, అర్జవం, గురు శుశ్రూష, జ్ఞానం, త్యాగం అనే గుణాలు సర్వకాలాలలో స్థిరంగా నెలకొని కాపురం చేస్తున్నాయి. రుజు గుణమే సంపదగా కలవాడు, నిగ్రహానుగ్రహ శక్తి కలవాడు.’ 

అడవులకు పోవాలని కైక ద్వారా తండ్రి ఆజ్ఞాపించినప్పుడు, శ్రీరాముడికి సర్వ సుఖాలు పోతున్నప్పటికీ, రాజ్య భోగాలకు దూరమవుతున్నప్పటికీ, అయన ముఖంలో కాంతి చెదిరిపోలేదు. అరణ్యవాసాన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడిన కౌసల్యా లక్ష్మణులను ఓదార్చిన శ్రీరాముడు పితృవాక్య పాలన గురించి చెప్తాడు. ‘తండ్రి మాట జవదాటగల శక్తి నాకు లేదు. తండ్రి ఆజ్ఞ పరమ ధర్మం. దేవతలతో సమానమైన ఎందరో మహానుభావులు, తండ్రి వాక్యాన్ని పాలించి, కీర్తి సంపాదించుకున్నారు. ధర్మ శాస్త్రం ఇలా చెప్తుంటే, తండ్రి ఆజ్ఞ నెరవేరచకుండా ఎలా వుంటాను? పూర్వీకులు నడిచిన మార్గాన్నే నేను ఎంచుకున్నాను. వేరే తోవలో పోవడం లేదు. తండ్రి ఆజ్ఞా పాలించడమే తగిన పని. తండ్రి మాట వినకుంటె పాపం కలుగుతుంది. కాబట్టి నిశ్చయంగా అడవులకే పోతాను’ అని  అంటాడు. రామరాజ్యం అంటే, ఇలాంటి మరెన్నో సుగుణాల రాజు రాజ్యమే!

{వావిలికొలను సుబ్బారావు గారి ఆంధ్రవాల్మీకి రామాయణం మందరం ఆధారంగా}  

Monday, March 31, 2025

శ్రీ మహాభాగవత కథ-29 .... భూమి నైసర్గిక స్వరూపం : వనం జ్వాలా నరసింహారావు

 శ్రీ మహాభాగవత కథ-29

భూమి నైసర్గిక స్వరూపం

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (31-03-2025)

కంII చదివెడిది భాగవతమిది, 

చదివించును కృష్ణు, డమృతఝరి పోతనయున్

చదివినను ముక్తి కలుగును, 

చదివెద నిర్విఘ్నరీతి ‘జ్వాలా’ మతినై 

శుకయోగి పరీక్షిన్మహారాజుకు భూనైసర్గిక స్వరూపాన్ని వివరిస్తూ ఇలా చెప్పాడు. 

ఈ భూమి ఒక పద్మం. దానికి మధ్యన జంబూద్వీపం ఉన్నది. దీని పొడుగు లక్ష యోజనాలు. వెడల్పు లక్ష యోజనాలు. ఇది తామర ఆకులాగా గుండ్రంగా ఉంటుంది. ఈ ద్వీపంలో వర్షాలు అనే విభాగాలున్నాయి. ఇవి తొమ్మిది. ఒక్కొక్క వర్షానికి వైశాల్యం తొమ్మిది వేల యోజనాలు. ఈ వర్షాలను విభజిస్తూ ఎనిమిది పర్వతాలు సరిహద్దులుగా ఉన్నాయి. తొమ్మిది వర్షాలలో మధ్యదాని పేరు ‘ఇలావృతం’. దీనికి మధ్యభాగంలో బంగారు రంగుతో ‘మేరు పర్వతం’ ఉంది. భూమి అనే పద్మానికి నడుమ మేరు పర్వతం ప్రకాశిస్తూ ఉంటుంది. అది పద్మానికి మధ్యన ఉండే బొడ్డులాగా శోభిస్తూ ఉంటుంది. మేరువు కులపర్వతాలకు రాజు లాంటిది. దాని స్థితి దేవతలకే అర్థంకాకుండా, అంతుపట్టకుండా, విడ్డూరం కోల్పుతూ ఉంటుంది. (ఇలావృతం అంటే భూమి చేత ఆవరించబడ్డదని. భూగోళానికి నడిమి భాగం నాభి. ఇది భూగర్భానికి, భూమధ్యరేఖకు సూటిగా లోపాలు వైపున ఉంటుంది. మేరువు అంటే ఇరుసు, అంటే భూపరిభ్రమణానికి కేంద్రం, అని అర్థం. దేవతలు కూడా మేరువు మహిమకు ఆశ్చర్యపడతారంటే, భూపరిభ్రమణం ఎలా జరుగుతుందో ఎవ్వరికీ అంతుచిక్కని పరమేశ్వరుడి లీల!).

మేరు పర్వతం ఎత్తు లక్ష యోజనాలు. దాని శిఖరం ఎత్తు పదహారువేల యోజనాలు. ఈ శిఖరం భూమిలోకి కూడా పదహారువేల యోజనాల లోతుకు చొచ్చుకుని ఉంటుంది. ఈ శిఖరం వైశాల్యం 32 వేల యోజనాలు. మేరువుకు ఉత్తరం వైపు నీలం, శ్వేతం, శృంగవత్తు అనే పర్వతాలు ఆకాశాన్ని తాకుతుంటాయి. ఇవి రెండు వేలయోజనాల విస్తీర్ణం ఉంటాయి. ఇవి తూర్పు పడమరలకు, దక్షిణ ఉత్తరాలకు విస్తరించి ఉన్నాయి, ఇదొక రమ్యమైన దృశ్యం! ఈ ‘నీలశ్వేతశృంగవత్తు’ పర్వతాలనే సరిహద్దు పర్వాతలని కూడా అంటారు. వీటికి తూర్పున, పడమరన, చిట్టచివర, ఉప్పు సముద్రాలు తాకుతూ ఉంటాయి. అంటే, తూర్పు పశ్చిమాలవైపు ఉప్పు సముద్రాలు తాకేవరకు ఈ పర్వతాలు విస్తరించి ఉన్నాయన్నమాట. ఇవి ఉత్తరం వైపు ఒకదానికంటే మరొకటి పదవ వంతు పొడుగు తగ్గుతూ ఉంటాయి. వీటి మధ్య ప్రదేశంలో రంయకం, హిరణ్మయం, కురు అనే పెర్లుకల వర్షాలున్నాయి. అవి తొమ్మిదివేల యోజనాల మేర విస్తరించి ఉన్నాయి. ఉప్పు సముద్రాల దాకా ఇవి వ్యాపించి ఉన్నాయి. ‘నీలశ్వేతశృంగవత్తు’ పర్వతాల మధ్యనున్న కొలతలలో సరిపడి ఉంటుంది ఈ వర్షాల విస్తీర్ణం. 

ఇలావృత వర్షానికి దక్షిణం వైపున నిషధం, హేమకూటం, హిమవంతం అనే పర్వతాలున్నాయి. అవి సరిహద్దు పర్వతాలు. తూర్పునుండి పడమరకు పొడవుగాను, ఉత్తరంనుండి దక్షిణానికి వెడల్పుగాను నీలాది పర్వతాల మాదిరిగానే ఇవీ నెలకొని ఉంటాయి. ఈ పర్వతాల మధ్య ప్రదేశంలో మూడు వర్షాలున్నాయి. కింపురుష వర్షం, హరి వర్షం, భారత వర్షం ఆ మూడిటి పేర్లు.  ఇలావృత వర్షానికి పడమట మాల్యవంత పర్వతం, తూర్పున గంధమాదన పర్వతం సరిహద్దు గిరులు. ఈ పర్వతాలు రెండూ, ఉత్తరం వైపు నీలం, దక్షిణం వైపు నిషధం అనే పర్వతాల వరకు పొడవుగా ఉంది, రెండువేల యోజనాల విస్తీర్ణం కలిగి ఉన్నాయి. ఆ మాల్యవంత, గంధమాదన గిరులు కేతుమాల వర్షానికి, భద్రాశ్వ వర్షానికి హద్దును నిర్దేశిస్తున్నాయి. 

మేరు పర్వతానికి నాలుగు దిక్కులలో నాలుగు పర్వతాలున్నాయి. అవి: తూర్పున మందర పర్వతం, దక్షిణాన మేరుమందర పర్వతం, పశ్చిమంలో సుపార్శ్వ పర్వతం, ఉత్తరంలో కుముద పర్వతం. ఇవి ఒక్కొక్కటి పదివేలయోజనాల ఎత్తు, పదివేలయోజనాల వైశాల్యం కలిగి ఉన్నాయి. ఇవి మధ్యలో ఉన్నతంగా, స్తంబంలా ఉన్న మేరువుకు చుట్టూ నాలుగు చిన్న స్తంబాలలో ఉంటాయి. ఈ నాలుగు పర్వతాలలో (మందరం) మామిడి, (మేరువు) నేరేడు, (సుపార్శ్వం) కదంబ, (కుముదం) మర్రి చెట్లు బాగా ఎత్తుగా పెరిగి పతాకాలలా ఉంటాయి. ఈ చెట్లు పదకొండు యోజనాల ఎత్తు, అంటే వైశాల్యంతో ఉంటాయి. ఈ పర్వతాల శిఖరాలమీద నాలుగు మడుగులున్నాయి. మందర పర్వత శిఖరం మీద పాలతో నిండిన మడుగు, మేరువులో తేనె నిండిన మడుగు, సుపార్శ్వంలో చెరకు రసం నిండిన మడుగు, కుముదంలో మంచినీళ్లు నిండిన మడుగు ఉన్నాయి. వాటిల్లో నిష్టగా స్నానం చేసినవారు సహజమైన సిద్ధుల వైభవాన్ని పొంది ఉంటారు. ఈ పర్వత శిఖరాల మీద నాలుగు ఉద్యానవనాలున్నాయి. ఇవి దేవోద్యానాలు. నందనం, చైత్రరథం, వైభ్రాజికం, సర్వతోభద్రం అని ఆ వనాల పేర్లు. వీటిలో దేవతా శ్రేష్ఠులు అప్సరసలతో కలిసి, గంధర్వ గానాన్ని వింటూ విహరిస్తారు.

మందర పర్వతం చివరనున్న మామిడి చెట్ల పళ్ళు కొండమీద రాలి, చితికి, వాటి రసం అద్భుతమైన నదీ ప్రవాహంగా మారింది.దాని పేరు అరుణోదం లేదా అరుణోనది. ఆ నదిలో పార్వతీదేవికి అనుచరులైన పుణ్యస్త్రీలు స్నానం చేస్తారు. మేరు పర్వతాల మీద ఉన్న నేరేడు చెట్ల జంబూఫలాలు మగ్గి వాటంతట అవే రాలిపోయి, చిట్లి, ఆ రసం అమృత ప్రవాహంలాగా పారుతుంది. ఆ జంబూ ఫలాల రస ప్రవాహమే జంబూ నది. ఇది ఇలావృత వర్షానికి దక్షిణాన భూముల్లో ప్రవహిస్తుంది. ఆ నదీజలాల ఇసుక జంబూ నదీ రసంతో తడపబడి సూర్య కిరణాలకు, గాలికి బంగారంగా మారుతుంది. అందుకే స్వచ్చమైన బంగారానికి ‘జాంబూనదం’ అన్న పేరు వచ్చింది. దేవతలలో ముఖ్యులు ఈ జాంబూనదాన్ని ఆభరణాలుగా ధరిస్తారు. ఈ బంగారం మంచి వన్నె కలది. సుపార్శ్వ పరవటం పైకొన నుండి ఐదు తేనె ధారలు ప్రవహిస్తూ ఉంటాయి. ఐదు ముఖాలుగా ఆ ప్రవాహం సాగుతుంది. ఈ ధారలు ఇలావృత వర్షం పడమటి భాగాన్ని తడుపుతూ వుంటాయి. కుముద పర్వత శిఖరం మీద పుట్టిన ఒక పెద్ద మర్రిచెట్టు (శతవల్మ) కొమ్మల నుండి పాలు, పెరుగు, నేయి, తేనె, బెల్లం, విశిష్టమైన అన్నం కిందకు ఇలావృత వర్షం మీదకు జారుతాయి. అలాగే మానవుల కోర్కెలు తీర్చడానికి, బట్టలు, మంచాలు, ఆసనాలు, నగలు మొదలైన వస్తువులు ఇలావృత వర్షం మీద కుముద పర్వతం నుంచి వచ్చి పడతాయి.       

మేరు పర్వతానికి చుట్టూ కురంగ, కురర, కుసుంభ, వైకంకత, త్రికూట, శిశిర, పతంగ, రుచక, నిషధ, శితివాస, కపిల, శంఖ (వైడూర్య చారుధి హంస విహంగా ఋషభ నాగ కాలంజర నారదాది) పర్వతాలుంటాయి. తూర్పు వైపున జఠరం, దేవకూటం అనే పర్వతాలున్నాయి. పశ్చిమాన పవన, పారియాత్రాలనే పర్వతాలున్నాయి. ఇవి ఒకదానికొకటి పద్దెనిమిది వేల యోజనాలు దక్షిణం నుండి ఉత్తరానికి పొడవుగా వ్యాపించి ఉంటాయి. తూర్పు నుండి పశ్చిమానికి రెండువేల యోజనాల వెడల్పు కలిగి ఉంటాయి. మేరువుకు దక్షిణ భాగంలో కైలాస, కరవీర పర్వతాలున్నాయి. ఉత్తర భాగంలో త్రిసృంగ, మకర పర్వతాలున్నాయి. వీటి పొడవు వెడల్పులు కూడా పై పర్వతాల ప్రమాణంలోనే ఉంటాయి. మేరునగానికి ఇలా ఎనిమిది పర్వతాలూ ప్రదక్షిణ చేస్తున్నట్లుగా ఉంటాయి. మేరు శిఖిరంలో మధ్య భాగాన పదివేల యోజనాల వెడల్పు, అంతే ప్రమాణం పొడవు ఉండి (సమచతురస్రంగా) బంగారుమయమైన ఒక పట్టణం ఉంది. దాని పేరు బ్రహ్మ పురం లేదా శాతకౌంభి. ఈ బ్రహ్మ పురానికి ఎనిమిది దిక్కుల్లోనూ 280 వేల యోజనాల లోకపాలకుల పురాలున్నాయి. వాటి పేర్లు: అమరావతి, తేజోవతి, సంజ్ఞమణి, కృష్టాంగన, శబ్దావతి, గంధవతి, మహోదయ, యశోమతి.      

బ్రహ్మ పట్టణంలో పూర్వం హరి వామనావతారం ఎత్తి ఎదిగినప్పుడు ఆ త్రివిక్రముడి కాలిగోటి దెబ్బకు ఉర్ధ్వాండం పగిలిపోయింది. ఇలా అపగిలిన బ్రహ్మాండం పై భాగంలో కన్నం పడి నీటిధార అండంలోకి ప్రవేశించింది. ఆ జలదార శ్రీహరి కాలిని తాకడం వల్ల సకల జనుల పాపాల్ని నశింప చేస్తూ, ‘భగవత్పది’ (విష్ణుపది) అనే పేరుతో ప్రసిద్ధికెక్కింది. ఆ పుణ్యధార చాలాకాలం స్వర్గంలో విహరించింది. అదే విష్ణుపదం (ఇది ద్యులోకం). ఉత్తానపాదుడి కొడుకు ధ్రువుడు ఉండే మండలం అదే. భగవత్పది ధ్రువమండలం చేరి కొన్ని యుగాలయింది. ధ్రువమండలానికి కింద సప్తర్షిమండలం ఉంది. సప్తర్షులూ ఆకాశగంగను తమతమ జటాజూటాలలో ధరిస్తూ ఉంటారు. ఆ నది ఆక్కడ నుండి అసంఖ్యాకమైన విమానాలు ఆవరించి, కిక్కిరిసి ఉన్న మార్గాల గుండా వచ్చి, విశాలమైన దేవయాగ మార్గం ద్వారా చంద్ర మండలాన్ని చుట్టి, తడిపి, మేరు పర్వత శిఖరమందున్న బ్రహ్మలోకం మీద పడుతోంది. అక్కడ నాలుగు ద్వారాలలోనూ నాలుగింటిగా విడిపోతుంది. విష్ణుపదికి ఇక్కడా నాలుగు పేర్లు. అవి: సీత, అలకనంద, చక్షువు, భద్ర. ఈ నాలుగు నదులూ దీర్ఘంగా ప్రవహించి ఉప్పు సముద్రంలో కలుస్తాయి. ఇలా ప్రవహిస్తోంది విష్ణుపది. 

నాలుగింటిగా విడిపోయి ప్రవహిస్తున్న ఈ నది పాయలలో సీతానది తూర్పు వైపు ప్రవహిస్తుంది. బ్రహ్మసదనం నుండి కేసర పర్వత శిఖరాలమీద పడి కిందకు పారి, గంధమాదన పరవటం శిఖరాల పైభాగంలో పడి భద్రాశ్వవర్షాన్ని ఏలుతూ తూర్పున ఉప్పు సముద్రంలో ప్రవేశిస్తోంది. చక్షువు అన్న పేరుతో ప్రసిద్ధి పొందిన నది పశ్చిమ ద్వారం నుండి వచ్చి మాల్యవత్పర్వతం మీద పడి, అటునుండి కేతుమాల వర్షాన్ని పవిత్రం చేస్తోంది. అలా వచ్చి పడమటి లవణ సాగరంలో కలుస్తుంది. భద్ర నది తన సాటిలేని ప్రవాహంతో ఉత్తరద్వారం నుండి వచ్చి కుముద, నీల శ్వేతాఖ్య పర్వత శిఖరాల మీద క్రమంగా ప్రవహించి, శృంగపర్వతానికి వచ్చి, మానసోత్తరాలైన కురు భూములను పవిత్రం చేస్తోంది. అల అవచ్చి ఉత్తరపు ఉప్పు సముద్రంలో లీనమవుతున్నది. అలకనంద నది బ్రహ్మ సదనం నుండి దక్షిణంగా ప్రవహిస్తోంది. వెళ్లడానికి అసాధ్యమైన పర్వతాల మీదకు పోతుంది. హేమకూట, హిమకూట పర్వత శిఖరాలను త్రుళ్ళి పడుతూ తాకి, మహావేగంతో కర్మ క్షేత్రమైన భారత వర్షాన్ని పవిత్రం చేస్తోంది. అలా వచ్చి దక్షిణపు లవణ సముద్రంలో కలుస్తున్నది. అలా లోకంలో మేరువు మొదలైన పర్వతాలకు పుత్రికలై జన్మించిన పుణ్యతీర్థాలు (నదులు) వేలాదిగా ఉన్నాయి. 

                      (బమ్మెర పోతన శ్రీమహాభాగవతం, రామకృష్ణ మఠం ప్రచురణ ఆధారంగా)

Saturday, March 29, 2025

Osmania University - A crucible of intellectual and political discourse ...... A Saga of Learning, Intellect and Leadership : Vanam Jwala Narasimha Rao

 Osmania University 

A crucible of intellectual and political discourse

A Saga of Learning, Intellect and Leadership

Vanam Jwala Narasimha Rao

The Hans India (30-03-2025)

{Intellectual curiosity, political awareness, and social responsibility are timeless virtues. Student politics, civil disobedience movements, and debates offer rich lessons for today’s youth. Those who began their journeys at OU went on to become national and international figures, some advocating for human rights and civil liberties. It is a tale of camaraderie, personal growth, socio-political activism, and enduring values. The once-vibrant intellectual discussions matured into action, leaving a lasting impact on society. The current ban on dharnas, demonstrations, sloganeering, and other restrictions on the OU campus is a sad reflection of current realities} - Editor's Synoptic Note

Prohibiting dharnas, demonstrations, sloganeering, and other restriction on the Osmania University (OU) campus is a blow to this century-old educational hub of excellence known for its historical role as a crucible of intellectual and political discourse. 

Established in 1918 by Mir Osman Ali Khan, the VII Nizam, OU blends modern Western education with the rich cultural heritage of the East. From humble beginnings OU and its vibrant campus evolved into global seat of learning.  OU Campus has always been a hub of intense political activity and a breeding ground for flamboyant student politics especially of progressive thought. Prominent student leaders and movements led by them from time to time, played pivotal roles in shaping the socio-political discourse in Telangana, including first and second phases of Separate Telangana Movements.

The Iconic Arts College Building represents a synthesis of old and new. Walking through its corridors and halls gives a sense of pride. It is not only a place of academic pursuit but also a witness to contemporary history. It has stood tall as a symbol of resilience and revolution. The sparkling debates in its lecture halls and the activism on its lawns contributed to an environment that shaped leaders and thinkers, and as a testimony to shaping of several ideologies, from Left to Right to Nationalist. 

Arts College Room Number 57 holds a special place and a historical landmark in OU journey. Famous writers, celebrated poets and cultural icons frequented to interact with students. Known for its vibrant intellectual environment, it hosted lectures by prominent personalities, academics, and thought leaders over the decades. Many recall Room 57 as a center of inspiration and a vibrant place for dialogue from influential figures like PV Narasimha Rao, Khushwant Singh, George Fernandez, Ram Manohar Lohia and numerous ideologues of various hues who were on the platform of the Room to sensitize and revolutionize the society and who left a lasting impact. They passed on their philosophies to the next generations. It was not just a classroom but a forum for lively discussions on socio-political issues, literature, and philosophy.  

While studying BSc (Mid 1960s) in New Science College and BLibSc (Early 1970s) on the campus I was a frequent visitor to OU B-hostel, which place Nehru once acknowledged as the vibrant student culture. He referred to the students as future Indian leaders and humorously compared B-hostel to the House of Lords. Nehru’s recognition and his remark has since been quoted to emphasize the hostel’s prominence as a place where future leaders and intellectuals engaged in deep political and academic debates. 

OU A-Hostel also served as a meeting place for students and thinkers who actively engaged in socio-political discussions, contributing to movements such as the Separate Telangana Agitation and other national issues. It became synonymous with student leadership, activism, and progressive thought, influencing regional and national politics over decades. At these two Osmania University hostels, both leftist and rightist political ideologies have actively influenced university student union elections. 

The leftist groups, often aligned with communist (AISF and SFI) and socialist ideologies, focused on issues like social justice, student rights, and anti-imperialism. In contrast, the rightist groups, backed by ABVP (Akhil Bharatiya Vidyarthi Parishad), promoted nationalism, cultural pride, and conservative values. Student union elections frequently saw contests between SFI and ABVP, often reflecting a microcosm of broader political struggles, with intense debates and campaigns shaping student leadership at the university. It was an era of ‘Intellectual Struggle for Supremacy’ and emergence of leadership at the state and national levels.

S Jaipal Reddy was an articulate and ideologically strong student leader at OU who with his sharp intellect and oratory skills became a formidable force in student politics. He later became a stalwart in Indian politics, serving as Union Minister and gaining respect as a champion of parliamentary democracy. K Keshav Rao was another influential student leader at OU, known for his political acumen and leadership abilities, who actively engaged in socio-political movements. He became a key strategist in the Indian National Congress and later in the Bharat Rashtra Samithi. As a Rajya Sabha MP, he played a crucial role in shaping policies, particularly in Telangana’s statehood movement. Both exemplify how OU’s vibrant political culture nurtured individuals.

Student Leader George Reddy was a revolutionary figure at OU whose activism was rooted in a deep sense of social justice. He became a key figure in mobilizing students against oppression, inequality, and caste-based discrimination. George’s rise was marked by his intellectual prowess, charismatic leadership, and commitment to leftist ideologies, which resonated with many students on campus. His radical views and influence made him a target of opposing right-wing student organizations. On April 14, 1972, he was murdered on campus by a group of assailants. His legacy, remains significant in the history of student politics at OU.

Vootukur Vara Prasad, who was a onetime Arts College President, was actively involved in student movements and was part of the broader wave of youth leadership. OU Products, Professor G Hara Gopal, Professor Raghavendra Rao, Vasireddy Shivalinga Prasad, Dr M. Sridhar Reddy etc. made a difference in society by excelling in their respective fields. Hara Gopal’s leadership qualities positioned him as a future torchbearer for civil rights, characterized by his courage, compassion, and unwavering dedication. His intellectual rigor was evident in his passion for justice, equity, and the rights of the underprivileged. His keen understanding of socio-political issues exhibited through thoughtful discussions. 

Professor Raghavendra Rao was an intellectual and a distinguished figure in the field of sociology, both as a student and later as a professor. Professor VS Prasad, a social scientist by training, after obtaining his Master’s and PhD in Public Administration from OU, started his academic career as a lecturer in Public Administration. Over more than four decades, he held several academic and educational leadership positions, including that of Vice-Chancellor.

Dr M Sridhar Reddy emerged as a beacon of hope during a pivotal time in the history of Telangana. As a passionate student leader at OU, he was at the forefront of spearheading the first phase of the Separate Telangana Movement, which originated in the A-hostel of Osmania University. Mallikarjun, who was then the General Secretary of the Osmania University Student Union, was also actively involved in this movement, who later became a Union Minister.

Osmania University’s Arts College cafeteria served as a hub for exchanging revolutionary ideas. Intellectual rigor and leadership were woven into the fabric of everyday life. Many of the individuals mentioned above and countless others made a difference in society later, thanks to the campus activism at OU. Those who began their journeys at OU have gone on to become national and international figures, some advocating for human rights and civil liberties. The once-vibrant intellectual discussions matured into action, leaving a lasting impact on society.

The essence of this narrative is a powerful reminder that intellectual curiosity, political awareness, and social responsibility are timeless virtues. Student politics, civil disobedience movements, and debates offer rich lessons for today’s youth. For future generations, this reflection on OU serves as a powerful message about the transformations in personal, social, and intellectual life over decades. It is a tale of camaraderie, personal growth, socio-political activism, and enduring values.

It is crucial to nurture critical thinking, build relationships grounded in mutual respect, and contribute to the collective good of society. The seeds sown in intellectual discussions, political debates, and the courage to fight for justice can grow into legacies that endure for generations to come. Prohibiting dharnas, demonstrations, and sloganeering on the OU campus is an attempt to stifle student leadership, contrary to Jawaharlal Nehru’s reference to OU students as the future leaders of India. Any attempt to ‘Annihilate the Zeal of Student Leadership’ is suicidal.