Monday, October 24, 2011

ఏకాభిప్రాయం ఎన్నటికి సాధ్యం?: వనం జ్వాలా నరసింహా రావు

ఏకాభిప్రాయం ఎన్నటికి సాధ్యం?

(నమస్తే తెలంగాణ: 25-10-2011)

వనం జ్వాలా నరసింహా రావు

తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావంతో, నూతనోత్సాహంతో ప్రారంభమైన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం, నాటి నుంచి నేటి వరకు, పూర్తిగా అహింసాయుత మార్గంలో, ఆబాలగోపాలం తెలంగాణ ప్రజల భాగస్వామ్యంతో అంచలంచలుగా ఉదృతమై, ఊపందుకుంటున్నప్పటికీ, కేంద్ర-రాష్ట్ర పాలక పక్షాలు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించడం బహుశా ప్రపంచ చరిత్రలో ఏ ప్రజాస్వామ్య దేశంలోనూ, ఆ మాటకొస్తే ఏ నియంతృత్వ దేశంలోనూ జరిగుండదు. తెలంగాణ రాష్ట్ర సమితికి ప్రాంతంలోని ప్రజల-ఓటర్ల మద్దతు అన్ని రాజకీయ పార్టీలకంటే ఎక్కువ వున్నప్పటికీ, ఆ పార్టీ అధినేత చంద్రశేఖర రావు, తెలంగాణకు మద్దతిచ్చే నాయకులను కలుపుకు పోవాలన్న వ్యూహంతో, 2004 ఎన్నికలలో రాష్ట్ర ఏర్పాటును తప్పక వ్యతిరేకిస్తాడని తెలిసి కూడా రాజశేఖర రెడ్డి నాయకత్వాన (రాష్ట్రంలో) వున్న కాంగ్రెస్ పార్టీతో ఉమ్మడిగా ఎన్నికల బరిలోకి దిగారు. సోనియా గాంధీని, కాంగ్రెస్ అధిష్టానాన్ని నమ్మారు. కేంద్రంలో మంత్రి పదవిని అంగీకరించారు. నమ్మక ద్రోహం జరిగిందాకా పదవిలో కొనసాగారు. తాను పదవీ త్యాగం చేశారు. తన ఎమ్మెల్యేలతోను, రాష్ట్ర మంత్రులతోను రాజీనామాలు చేయించారు. ఇటు తెలంగాణ ప్రజలకు, అటు కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలను ఏలుతున్న కాంగ్రెస్ అధిష్టానానికి తన, తన పార్టీ వాళ్ల నిబద్ధతను ఎరుక పరిచారు. ఏం చేసినా ఆయననుకున్న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సాధించలేక పోయారు. ఆయన ఎంపీ పదవికి ఎన్నిసార్లు రాజీనామా చేసి, మళ్లీ గెలిచినా, ఎవరికీ కనువిప్పు కాలేదు. తెలంగాణ ఏర్పాటు కాలేదు.

మళ్లీ ఎన్నిక లొచ్చే దాకా, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ, కాశీ-రామేశ్వరం మజిలీ కథలాగా కాసేపు, ఎక్కడేసిన గొంగళి అక్కడే అన్న చందాన మరి కాసేపు సాగింది. తెలంగాణ వచ్చినా, రాకపోయినా, కనీసం కాంగ్రెస్ లోని తెలంగాణ వాదులకు కనువిప్పు కలగడానికి కెసిఆర్ వ్యూహం ఫలించిందనవచ్చు. 2009 ఎన్నికలలో, తెలుగు దేశంతో (మహా కూటమితో) మరో రకమైన వ్యూహాత్మకంగా చేతులు కలిపారు కెసిఆర్. సీట్లెన్ని వచ్చాయి అన్న విషయం పక్కన పెడితే, ఈ సారి, తెలంగాణ తెలుగుదేశం వారిలో చలనం కలిగింది. పైకి చంద్రబాబు నాయుడి మాటలకు వంతపాడినా, టిడిపి తెలంగాణ వాదుల్లో కొంతలో కొంతైనా జ్ఞానోదయం కలిగిందనక తప్పదు. ఎన్నికలలో అటు కేంద్రంలోను, ఇటు రాష్ట్రంలోను కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకొచ్చింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మళ్లీ కనుమరుగైంది. మరో ఉద్యమానికి తెర లేపక తప్పని పరిస్థితులు దరిమిలా కలిగాయి.

టిడిపి లోని తెలంగాణ మద్దతు దారులతో సహా, బిజెపి, సిపిఐ, న్యూ డెమోక్రసీ పార్టీలు కూడా ఉద్యమంలో దూకాయి. మరికొన్ని భావ సారూప్యతగల పార్టీలూ పుట్టుకొచ్చాయి. ఉద్యమించాయి. ఐనా తెలంగాణ రాలేదు. కెసిఆర్ ప్రయత్నాలు, ఆయనదైన శైలితో ఉద్యమం కొనసాగుతూనే వుంది. ఇంతలో రాజశేఖర రెడ్డి దుర్మరణం పాలయ్యారు. ఆయన స్థానంలో పైకి తటస్థంగా, లోపల సమైక్యానికి అనుకూలంగా, దేని కీ ఇదమిద్ధంగా మద్దతు తెలియ చేయలేని రోశయ్య ముఖ్య మంత్రి అయ్యారు. మళ్లీ తెలంగాణ కథ మొదటికొచ్చింది. అస్థిర ప్రభుత్వం పాలనలో, కెసిఆర్ తన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించారు. నవంబర్ 2009 లో ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. కేంద్రం దిగి రాక తప్పని పరిస్థితులొచ్చాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియకు శ్రీకారం చుట్టుతున్నట్లు చిదంబరంతో (కపట) ప్రకటన చేయించింది కేంద్ర ప్రభుత్వం. దీక్ష విరమించారు కెసిఆర్. సీమాంధ్ర ప్రజా ప్రతినిధుల బెదిరింపు రాజీనామాలు మొదలయ్యాయి. (అన్ని పార్టీలకు చెందిన) తెలంగాణ ప్రజా ప్రతినిధులు కూడా రాజీనామాలు చేశారు. మళ్లీ చిదంబరం మరో ప్రకటన. కేవలం తెలంగాణ రాష్ట్ర సమితి (ఇద్దరు మినహా) ఎమ్మెల్యేల రాజీనామాలు మాత్రమే అంగీకరించబడ్డాయి. మరో ఆలశ్య ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటుతో, వస్తుందనుకున్న తెలంగాణ, ఎప్పుడో ఒకప్పుడు రాకపోతోందా అన్న మజిలీకి చేరుకుంది. ఓపికతో కమిటీ ప్రక్రియను స్వాగతించారు తెలంగాణ కోరుకునేవారు కూడా. మొత్తం మీద తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాలేదు.

తెలంగాణాకు అనుకూలంగా తీర్పు ఇస్తుందనుకున్న శ్రీకృష్ణ కమిటీ, గోడమీద పిల్లి వాటంగా, ఏమీ చెప్పకుండా దాటవేసింది. అది సేకరించిన సాక్ష్యాధారాలు నిబద్ధతతో పరిశీలించినట్లయితే, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేయాల్సిందేనని చెప్పి వుండేది. శ్రీకృష్ణ కమిటీ నివేదికతో కూడా తెలంగాణ రాలేదు. వస్తుందన్న నమ్మకం కలిగే విధంగా కేంద్రంలో ఈ వ్యవహారాన్ని ఒక "పార్ట్ టైమ్ జాబ్" లాగా చూస్తున్న చిదంబరం, అఖిల పక్షం సమావేశం అంటూ కుంటి సాకులు చెప్తూ కాలయాపన చేయసాగాడు. ఎన్నడో వేసిన ప్రణబ్ ముఖర్జీ కమిటీ అసలా సంగతే మర్చిపోయింది. మధ్యలో కాంగ్రెస్ అధిష్టానం ఆలోచనా ధోరణిలో వచ్చిన మార్పు పర్యవసానంగా, రోశయ్య స్థానంలో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్య మంత్రి పీఠాన్ని అలంకరించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కను చూపు మేరలో లేకుండా పోయింది. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జ్ కూడా మారారు. కిరణ్ కుమార్ రెడ్డి వచ్చిన కొత్తలో తెలంగాణ ప్రాంత ప్రభుత్వోద్యోగులు సమ్మె చేశారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం. ఏవో కొన్ని హామీలు ఇచ్చి అప్పట్లో సమ్మెను విరమింప చేసింది ప్రభుత్వం. మిల్లీనియం మార్చ్ కూడా రాష్ట్ర సాధన దిశగా ఫలితం కలగలేదు. ఉస్మానియా విద్యార్థుల ఆందోళన, ఆత్మ హత్యలు, ఉద్రిక్తతలు ఎన్ని చోటుచేసుకున్నా తెలంగాణ రాలేదు.

కాంగ్రెస్ అధినేత్రి మౌనంగా జరుగుతున్న పరిణామాలను నిస్సహాయంగా-బింకంగా-మొండి ధైర్యంతో గమనిస్తోందే కాని, నిర్ణయం తీసుకోవడంలో మాత్రం పురోగతి కనిపించలేదు. రాష్ట్ర శాసన సభలోని మూడింట రెండు వంతుల మంది శాసన సభ సభ్యులు తమ సభ్యత్వానికి రాజీనామా సమర్పించారు. రాజ్యసభ సభ్యుడు కేశవ రావు, తెలంగాణ ప్రాంతం నుంచి ఎన్నికైన లోక్ సభ సభ్యులలో ముగ్గురు మినహా అందరూ రాజీనామా చేశారు. పదిహేను మందికి పైగా ఎమ్మెల్సీలు సహితం వీరి బాటలోనే నడిచారు. పార్టీలకు అతీతంగా-లాయల్టీలకు అతీతంగా, రాజీనామా చేసిన వారున్నారు. కాంగ్రెస్ వారిలో, అందరి కంటే ముందే రాజీనామా చేసింది జగన్ వర్గానికి చెందిన కొండా సురేఖ. ప్రత్యక్షంగానో, పరోక్షంగా నో, రాజకీయ-రాజ్యాంగ సంక్షోభం చోటు చేసుకునే దిశగా, వేగంగా పరిణామాలు చోటు చేసుకున్నాయి. స్పీకర్ ఫార్మాట్లో రాజీనామాలున్నందు వల్ల, వాటి ఆమోదం అంత కష్టం కాకూడదనుకున్న ఎమ్మెల్యేలకు ఆశాభంగమే మిగిలింది. రాజీనామాలతో రాజకీయ సంక్షోభం రాలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాలేదు.

సమష్ఠి బాధ్యతా రాహిత్యం, సమన్వయ లోపం, అసమర్థ నాయకత్వంతో, పీకల లోతుకు మునిగి పోయిన యునైటెడ్ ప్రోగ్రెసివ్‌ అలయెన్స్ ప్రభుత్వం దాని సారధి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ, ఏ విషయంలోను ఒక విధానం అంటూ లేకుండా, ఒక నిర్ణయం అంటూ తీసుకోలేకుండా ఇలా ఎంత కాలం కొనసాగుతుందో ఎవరికీ అర్థం కాని పరిస్థితి. కేంద్ర ప్రభుత్వ-రాష్ట్ర ప్రభుత్వ అసమర్థ నాయకత్వానికి, విధాన పరంగా నిర్ణయాలు తీసుకోలేని స్థితికి, కీలకమైన విషయాలలో తమ విధానం ఇదంటూ పాలక పార్టీ ప్రకటించ లేక పోవడానికి, ప్రతి పక్ష పార్టీల సూచనలు-సలహాలు పాటించక పోవడానికి, వందల ఉదాహరణలు పేర్కొనవచ్చు. మధ్యలో ఏకాభిప్రాయమంటూ మరో వాదన లేవదీసింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ సమస్యను, తన రాజకీయ అవసరాల కొరకు, చంద్రబాబు నాయుడి ఆధిపత్యాన్ని, పలుకుబడిని ఎదుర్కొని, ఎన్నికలలో విజయం సాధించడానికి, 2004 ఎన్నికల్లో, తెలంగాణ రాష్ట్ర సమితితో పొత్తు పెట్టుకుంది. ఆ విషయాన్ని గులాం నబీ ఆజాదులు, చిదంబరాలు, ప్రణబ్ ముఖర్జీలు, వారి అధినేత్రి సోనియా గాంధీ ఎందుకు మరిచిపోయారో? ఎన్నికల ప్రణాళికలో, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ సుముఖంగా వున్న అభిప్రాయం కలిగించారు ఇటువంటి చిదంబరాలు, ఆజాదులు. ఆనాడు ఏకాభిప్రాయంతోనే ఆ పని చేశారా? ఆ నాడు సీమాంధ్ర నాయకులను సంప్రదించే ఆ పని చేశాడా చిదంబరం, ఆజాద్? అప్పుడు గుర్తుకురాని ఏకాభిప్రాయం ఇప్పుడెందుకు గుర్తుకు రావాలి? తెలంగాణ ఇవ్వడం-ఇవ్వక పోవడం కాదిక్కడ ముఖ్యం. మాట మార్చే అలవాటే చిదంబరం నైజం అనడం ఇక్కడ ప్రధానం.

పోనీ, యుపిఎ ప్రభుత్వం రాష్ట్రపతి ప్రసంగంలో తెలంగాణ అంశం ప్రస్తావించినప్పుడు ఏకాభిప్రాయం గుర్తుకు రాలేదా చిదంబరానికి? డిసెంబర్ తొమ్మిదిన ప్రకటన చేయడానికి ముందర కాని, దరిమిలా చేసిన ప్రకటనప్పుడు కాని ఏకాభిప్రాయం మంచిదన్న భావనే కలగలేదా? వాస్తవానికి, డిసెంబర్ తొమ్మిది ప్రకటనకు ముందు జరిగింది అన్ని పార్టీల ఏకాభిప్రాయం కాదా? ఒకనాడు శాసన సభలో చేసిన తీర్మానం ఏకాభిప్రాయం కాదా? ఒక రాష్ట్రంలోని ఒకటికి మించిన ప్రాంతాల ప్రజలు-ప్రజా ప్రతినిధులు నిలువుగా-అడ్డంగా-ఏటవాలు గా చీలిపోయినప్పుడు, ఎవరి సిద్ధాంతంతో వారు పట్టుదలగా వున్నప్పుడు, ఏకాభిప్రాయం నెపంతో, వారి మధ్య వైషమ్యాలు పెంపొందించడం కేవలం మాట మార్చేవారికి మాత్రమే సాధ్యపడుతుందని అనక తప్పదు. దొంగ... ఎదుటివారిని "దొంగ..దొంగా" అని అరిచి, తన దొంగతనం కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసినట్లే, తన పార్టీ మధ్యనే ఏకాభిప్రాయం సాధించలేని చిదంబరం, తెలుగుదేశం పార్టీని, దాని నాయకుడు చంద్రబాబు నాయుడునీ తప్పుబట్టడం మరీ హాస్యాస్పదం. ముందు తన తప్పు ఒప్పుకుని, ఇతరులు తప్పు చేశారంటే అర్థముంటుంది కాని, ఇతరులది తప్పు-తనది ఒప్పు అనడం ఎంతవరకు భావ్యం? ఇరు ప్రాంతాల వారికి వీలై నన్ని తక్కువ అభ్యంతరాలతో సమస్యను పరిష్కరించాలి తప్ప, ఏకాభిప్రాయం పేరుతో, దీర్ఘకాలికంగా వాయిదా వేసుకుంటూ పోతే, దొరికే ది పరిష్కారం కాదు కదా...మరిన్ని సమస్యల తోరణాలు మాత్రమే!

ఈ నేపధ్యంలో సకల జనుల సమ్మెతో నన్నా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాదా అన్న ధీమాతో, ప్రపంచ చరిత్రలో ఎవరూ కనీ-వినీ ఊహించని రీతిలో, ఉద్యమించారు తెలంగాణ ప్రజలు. ఆర్టీసీ, సింగరేణి కార్మికుల సమ్మెతో ప్రభుత్వానికి దిమ్మ తిరిగిందే కాని అసలు సమస్యను పరిష్కరించాలన్న ఇంగిత జ్ఞానం మాత్రం కలగలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాలేదు. ఏ సకల (తెలంగాణ) జనులకొరకు తాము ఇబ్బందులకు గురైనా సమ్మెకు దిగారో, ఆ సకల జనులే ఇబ్బందుల పాలవుతుంటే, ఆర్టీసీ, సింగరేణి కార్మికులు, పాఠశాలల-కాలేజీల సిబ్బంది సమ్మెను విరమించుకున్నారు (వాయిదా వేసుకున్నారు). రైలు రోకోలు, సార్వత్రిక బందులు ఏవీ కూడా ప్రభుత్వంలో చలనం తెప్పించలేక పోతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు అన్నీ అడ్డంకులే! అందరూ అడ్డు తగిలే వారే! ఈ నేపధ్యంలో, 2009 డిసెంబర్ 9 ప్రకటనను అమలు చేయించుకోవడానికి తెరాస అధినేత కేసీఆర్, మరో పర్యాయం ఆమరణ నిరాహారదీక్షకు దిగవచ్చనే వార్తలు కూడా వచ్చాయి.

ఇంకేం చేస్తే తెలంగాణ వస్తుంది? తెలంగాణ ప్రజలంతా ప్రతిరోజూ, ఏదో ఒక నిర్ణీత సమయాన, ఎవరింటి ముందర వారు వీధుల్లోకి వచ్చి ముక్త కంఠంతో ఢిల్లీ దాకా వినిపించేటట్లు తెలంగాణ ఏర్పాటు కావాలని నినాదాలు చేయాల్నా? ప్రతి తెలంగాణ వాది తన వంతు విరాళంగా నెలకు కనీసం ఒక్క రూపాయన్నా ఇచ్చి నెలకింత అని (నాలుగైదు కోట్ల రూపాయలు?) తెలంగాణ ఇచ్చిందాకా అధిష్టానానికి అధికారికంగా "ముడుపు" చెల్లించాల్నా? ప్రతివారం కనీసం కొన్ని లక్షల సంఖ్యలో ఒక్కో తెలంగాణ వాది దగ్గర నుంచి ఓ కార్డు ముక్క సోనియా గాంధీకి పోస్టు చేద్దామా? పోనీ ఇలాంటివే ఇంకేమన్నా మార్గాలు వెదుకుదామా?

కాదూ కూడదంటే సీమాంధ్ర ప్రభుత్వాన్ని బహిష్కరించి మన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుందాం. మనల్ని మనం ఏలు కుందాం.

47 comments:

  1. శ్రీక్రిష్ణ కమిట్టీ సేకరించిన సాక్షాలని నిబద్ధతతో గమనిస్తే తెలంగాణా ఇచ్చి తీరాల్సిందేనని చెప్పుండేదా. అవునా?

    2004 లో అన్నిటికన్నా ఎక్కువ ప్రజాదరణ గల పార్టీ ఐనా పెద్దమనసుతో టీఆర్ యెస్ కాంగ్రెస్స్ తో కల్సిందా?

    అబ్బా! ఏమి చెప్పారండి!. ఇన్నేళ్ళ మీ జర్నలిస్ట్ జీవితంలోఇంకా ఇలాంటి పచ్చి నిజాలని ఇంకెన్ని వండి వార్చారో విని తరించాలనుంది. కానివ్వండి. మీ బ్లాగు మీ ఇష్టం.

    ReplyDelete
  2. గుజరాత్ విభజనకి వ్యతిరేకంగా మహారాష్ట్రలో హింస జరిగినా గుజరాత్ రాష్ట్రాని విభజించింది కాంగ్రెస్ ప్రభుత్వం. తెలంగాణా విషయంలోనే ఏకాభిప్రాయం అంటూ అడ్డమైన సాకులు చెపుతున్నారు కాంగ్రెస్‌వాళ్ళు.

    ReplyDelete
  3. శ్రీకృష్ణ కమిటి నివేదిక నిజంగా ప్రామాణికం అని నువ్వు నమ్ముతున్నావా? తెలంగాణా ఏర్పడితే మత ఘర్షణలు జరుగుతాయని వ్రాసిన పుటలని ప్రభుత్వం ఎందుకు దాచింది? అవి కావాలని వ్రాసిన అబద్దాలు అని ప్రభుత్వానికి తెలుసు కాబట్టే కదా ఆ పుటలని దాచిపెట్టారు.

    ReplyDelete
  4. దేశంలోని ముస్లింలలో 90% మంది కాంగ్రెస్‌కే అనుకూలం. రాష్ట్రంలోనూ అంతే. కనుక మతం పేరు చెపితే సోనియా తెలంగాణా ఇవ్వకుండా ఉంటుందని సమైక్యవాదులు శ్రీకృష్ణ కమిటీ నివేదికలో తెలంగాణా ఇస్తే మత ఘర్షణలు జరుగుతాయని వ్రాయించారు. తెలంగాణాకి అనుకూలమైన ముస్లిం జె‌ఎసి అనేది ఒకటుందనే విషయం శ్రీకృష్ణ కమిటీ కావాలని మర్చిపోయింది. ముస్లిం జె‌ఎసి గోడల మీద వ్రాసిన వ్రాతలు పాత బస్తీలోనే కాకుండా నాంపల్లిలోనూ కనిపిస్తాయి. ఈ విషయం తెలిసినా శ్రీకృష్ణ కమిటీ కావాలని ముస్లిం జె‌ఎసి గురించి వ్రాయలేదు.

    ReplyDelete
  5. /ఏకాభిప్రాయం ఎన్నటికి సాధ్యం?/

    తెలంగాణా మాత్రు బాష(బూతులు) మానేసి..మనుషుల బాషలో మాట్లాడడం మొదలు పెట్టి..అప్పుడు వప్పించడానికి ట్రై చేస్తే ఎమైనా use ఉండొచ్చు.

    ReplyDelete
  6. ఈ బూతు కవిత వ్రాసింది నువ్వే కదా ouuncles.blogspot.com/2011/04/blog-post_12.html ఈ కవిత గురించి సమాధానం చెప్పిన తరువాత నీ ఫేవరిట్ హాలిడీ రిసార్ట్ పెద్దాపురంలో జల్సా చెయ్యొచ్చు.

    ReplyDelete
  7. 1. LOLOLOL ...ఏకాభిప్రాయం నాకు అవసరంలేదు.

    /పెద్దాపురంలో జల్సా చెయ్యొచ్చు. /

    2. Exactly I am talking about the same. "తెలంగాణా మాత్రు బాష(బూతులు) "
    And you did exactly the same. LOLOLOLOLOL

    ReplyDelete
  8. నువ్వు వ్రాసిన బూతు కవిత గురించి సమాధానం చెప్పు. తరువాత తెలంగాణావాదుల్ని విమర్శించొచ్చు.

    ReplyDelete
  9. LOL...I dont need your permission to criticize some one.

    ReplyDelete
  10. if all persons are accepted this then It will possible

    http://www.youtube.com/watch?v=0YPtaX1fguo

    ReplyDelete
  11. శ్రీరంగ నీతులు చెపుతూ, బోగం గుడిసెల్లో దూరే నీలాంటివాళ్ళకి ఒకరి అనుమతి అవసరమా?

    ReplyDelete
  12. /ఏకాభిప్రాయం ఎన్నటికి సాధ్యం?/

    ఏకాభిప్రాయం నీకు అవసరం కాబట్టి నీ భాష సరిగ ఉండాలి. కానీ రజాకర్ల వారసత్వం...మీ భాష మారదు.

    /బోగం గుడిసెల్లో దూరే నీలాంటివాళ్ళకి/

    మీ ఇంటికి రానులే ఇక..

    ReplyDelete
  13. సకల జనుల సమ్మె పూర్తిగా విఫలం అని చెప్పలేము. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పీఠం కూల్చలేకపోయినా కదిలించగలగడం సామాన్య విషయం కాదు.

    సకల జనుల సమ్మె విరమణ (లేదా విరామం) వాళ్ళ నేర్చుకోవాల్సిన పాఠాలేంటి?

    1. ఒకే ఒక వర్గం (ఉద్యోగులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు) పోరాడితే తెలంగాణ రాదు.
    2. సామాన్య ప్రజానీకాన్ని సంఘటించాలంటే రాజకీయ నాయకులు ముందుకు రావాలి (పదవీ కాంక్ష సహజంగానే ఎక్కువైనా వీరు ముందుకు వస్తారా? వాళ్ళను అధినాయకత్వం రానిస్తుందా? తెలంగాణ వ్యతిరేకు అధినాయకుల నీడ దాటే ధైర్యం వీరికుందా? ఈ ప్రశ్నలను ఇప్పటికి వదిలేద్దాం.
    3. అన్ని అస్త్రాలను ఒకే సారి ప్రయోగించకూడదు. Stamina is as important as strength in a long battle.
    4. ఉద్యమ స్వరూపాలు, భాగస్వాములు, వ్యూహాలు తరుచూ మారాలి. ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ కొత్త ప్రయోగాలు చేయాలి. We should use surprise as a weapon.
    5. అన్నిటి కంటే ముఖ్యంగా నిరాశకు దూరంగా ఉండాలి. నిర్భందనలు, వెన్నుపోటులు, ఎద్దేవాలు, ప్రలోభాలు ఎంత పెరిగినా నిస్పృహకు లొంగకూడదు. ఉద్యమం యొక్క బలంగానే వీటిని గుర్తించాలి.

    ఇక తక్షణ కార్యక్రమానికొస్తే, మనముందు మూడు ముఖ్యమయిన తేదీలు వస్తున్నాయి. నవంబర్ 1 విద్రోహ దినం, డిసెంబర్ 9 అందరికీ తెలిసినవే. కాగా డిసెంబర్ 15 నాటికి ప్రస్తుత శాసనసభ ఆఖరి సమావేశం నుండి ఆరు నెలలు నిండుతాయి. అప్పటి వరకు మరో సమావేశం జరగకపొతే ఈ సభ గడువు ముగిసిపోతుంది, రద్దు చేయాల్సిన పరిస్తితి ఏర్పడుతుంది. రాజ్యాంగ (లేదా రాజకీయ) సంక్షోభం ద్వారా తెలంగాణ సాధించడానికి ఇదో చక్కని అవకాశం.

    కలిసి వచ్చిన ప్రజా ప్రతినిధులందరితో "ప్రజా శాసనసభ" ఏర్పాటు చేసి సీమంధ్ర సర్కారును బహిష్కరించడం (derecognize) ఒక మంచి వ్యూహమని నాకు తోస్తుంది. ఇలాంటి వినూత్నమయిన ప్రయోగం ముందెన్నడూ జరగలేదు.

    ReplyDelete
  14. బాగుంది, సమైక్యవాదులకి భాషా సంస్కారం అవసరం లేదు కానీ తెలంగాణావాదులకే భాషా సంస్కారం అవసరం అంటారు. మీ పెద్దాపురం జమీందార్లు కూడా 1765 వరకు నిజాం పాలన కిందే పని చేశారు. 1765లో నిజాం ఉత్తర సర్కార్ జిల్లాలని బ్రిటిష్‌వాళ్ళకి ఇచ్చిన తరువాతే వాళ్ళు బ్రిటిష్‌వాళ్ళ మోచేతి నీళ్ళు తాగారు.

    ReplyDelete
  15. అయ్య, శ్రీక్రిష్ట్న కమిటీని వేసింది తెలంగాణా ఇవ్వడానికి కాదు. అన్యాయమైపోయామో అని అబద్దాలు చెబుతున్న తెలబానుల వాదనలు నిజమా లేక అబద్దాలా అని తేల్చడానికి వేసిన కమిటీ అది.దేశ ప్రజలకు,కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యంగా తెలంగాణా ప్రజలకి వాస్తవాలని తెలియపరచడం కోసం వేసిన కమిటీని పట్టుకుని శ్రీ కృష్ట్న కమిటీ కూడా తెలంగాణా ఇవ్వలేదు అని మీరు బాధపడిపోతున్నారు. అసలు తెలంగాణా ఇవ్వడానికి వేసిన కమిటీ అది అని తమరికి ఎలా తోచింది.అసలు తెలంగాణా ఇచ్చే ఉద్దేశం ఉంటే ఇక కమిటీలు ఎందుకు వేస్తారు, ప్రతి సంధర్భములో,ప్రతిచొట,ప్రతి నిమిషం మీకు అబద్దాలు చెప్పడం, అబద్దాలనే నిజమనుకునే వింత మనస్తత్వం,పామరుల నుండి పండితులదాకా ఒకే గొర్రెదాటు మనస్తత్వాలు. మీ అనుభవం,వివేచణ,తార్కిక జ్ఞానం ఎమైపోయాయి. మీరు కూడా అతి సామాన్య తెరాసా కార్యకర్తలాగా అలోచిస్తూ ఇలా బ్లాగులు రాస్తుంటే మిమ్ములని చూసి మిగతా ప్రాంతం వారు ఎంత చులకనగా చూస్తారో మీరు ఎప్పుడయినా ఆత్మ పరిశీలన చేసుకోరా? ఇలా అబద్దాలు చెప్పి చెప్పి, సెలైన్ సీసాలతో, ఆసుపత్రులలో దగుల్బాజీ దీక్షలు చేసి వికట మోసపూరిత రాజకీయ ప్రకటన పొందిన 24 గంటలలో తిరిగి వాస్తవ పరిస్తులలో కేంద్రం ఇంకో ప్రకటన చేయవలసివచ్చింది. కొందరిని కొంతకాలం మోసం చేయవచ్చు కాని అందరిని ఎల్లకాలం మోసం చేయలేరు. ఈ బ్లాక్మైల్ బెదిరింపులు సాగవు అని తెలిసి కూడా ఇంకా ఆత్మవంచన, పరనిందలు.
    సీమాంద్రుల ప్రభుత్వాన్ని వ్యతిరేకించి మీ స్వంత ప్రభుత్వం ఏర్పరచుకుంటారా. మిమ్ములని మీరు పరిపాలించుకుంటారా. మార్‌క్షిస్టులతో కలిసా లేక తాలిబానుతో కలిసా లేక ఆల్‌ఖైదాతో కలిసా లేక ఉమ్మడి ప్రభుత్వమా కొంచెం వివరణ ఇవ్వగలరు. ఈ రాష్ట్రాని దేవుడే కాపాడాలి. మీరెప్పుడు తెరాసాలో చేరారు జ్వాలా గారు!

    ReplyDelete
  16. ఇలా ప్రాంతీయవాద ఎజెండాల పుణ్యమా అని దేశంలో ఒకనాటికి కొన్నివందల రాష్ట్రాలు యేర్పాటు చేసుకుంటామా? అప్పుడు ఇంచక్కా చిన్న చిన్న రా్ష్ట్రాలు పరస్పరకలహాల్లో ములిగి, భారతదేశం మరొకసారి పరాయిదేశాల పాలనలోకి పోతుందా? కాలమే చెప్పాలి. ఈ రోజు తెలంగాణా అనే ప్రాంతంలో వాళ్ళంతా అడిగారని చీల్చి వేరే రాష్ట్రం యిస్తే, మాటవరసకి, రేపు అదే తెలంగాణాలో వరంగల్లు నగరంలో నూటికి నూరుమందీ హఠం చేస్తే, ప్రత్యేక వరంగల్ రాష్ట్రం యివ్వడానికి యెలా నిరాకరిస్తారు? ముక్కలు చెక్కలు కావటమేనా అభివృధ్ధికి దారి?

    ReplyDelete
  17. నేనెందుకు ప్రతిమారు మీ అనుభవం విజ్ఞత గురించి ప్రస్తావిస్తానంటే మీరుకూడా ఎందుకు ఈ మూక మనస్తత్వం పిడివాదములో పడికొట్టుకుపోతున్నారు.ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎవరో విదేశీయులు పరిపాలిస్తున్నట్లు అందులో తెలంగాణా వారేదొ ప్రత్యేక జాతి అయినట్లు వీరికి విదేశీయుల పాలన నచ్చదన్నట్లు ఎందుకు ఇంకా చరిత్ర చెప్పుకుంటూ వెర్రి భ్రమలలో బ్రతుకుతుంటారు. ఎప్పుడూ ఎదుటివారి తప్పులెదుకుతారు తప్ప తమ తప్పులు తెలుసుకోరు.తమ నాయకుల తప్పులని నిలదీయరు. ఎందుకు సకల జనుల సమ్మె చేసారు? ఏమి సాధించారని విరమించారు? అసలు ఒక దిశ నిర్దేశం లేని ఈ మూర్ఖపు సమ్మె వల్ల సాధించింది ఏమిటి? ముందు మీ నాయకులని నిలదీయండి ఎందుకు రాజీనామాలు చేయమంటున్నారు? చేయని వారిని ద్రోహులంటున్నారు.తిరిగి ఉప ఎన్నికలలో నిల్చుంటున్నారు ఎన్నికవుతున్నారు??? అర్థం ఉందా? పోచారం తిరిగి రాజీనామా చేయాలని ఎవరూ ఎందుకు డిమాండ్ చేయరు? ఇప్పుడు ఆయన"తెరాస" శాసన సభ్యుడు కాబట్టా? మీరెందుకు టీవి చానెళ్ళలో,పత్రికలలో,మీ బ్లాగులో విశ్లెషణాత్మకంగా చెప్పరు,వ్రాయరు. ముందు మీ నాయకులని నిలదీయండి!తిట్టండి!తన్నండి!!!వెలి వేయండి!!! అప్పుడు అన్ని సర్దుకుంటాయి. గుడ్డిగా "మా తెలంగాణా మాగ్గావాలె" అని వాదించకండి.అడుక్కొకండి. సీమాంద్రకంటే(గుజరాత్ కంటే) తెలంగాణా అభివృద్ది చేయడానికి కష్టపడి,విజయాలు సాధించండి,పోటీ పడండి!బాగా చదవండి!సరిగ్గా సీమాంద్రులు ఎలా అభివృద్ది చెందారనుకుంటున్నారో(?) అలాగే మీరు కూడా చేయండి. ఓ పది సంవత్సరాల తరువాత మీరు విపరీతంగా అభివృద్ది చెందితే అప్పుడు ఈ సీమాంద్రులే అసూయతో మాకు "ప్రత్యేక ఆంధ్రా" కావాలి అని ఉద్యమాలు చేస్తారు. మీ సమస్య తీరుతుంది :)

    ReplyDelete
  18. సూటిగా గారు, శ్రీకృష్ణ కమిటీ వేసినది తెలంగాణా ఇవ్వాలా, వద్దా అని చెప్పడానికి కాకపోతే ప్రాంతీయ అస్తిత్వంతో సంబంధం లేని మతం పేరు చెప్పి నివేదికలో అబద్దాలు ఎందుకు వ్రాసినట్టు? తెలంగాణా వస్తే హైదరాబాద్‌తో పాటు కరీంనగర్, సిరిసిల్లా లాంటి పట్టణాలలో కూడా మత ఘర్షణలు జరుగుతాయని నివేదికలో ఎందుకు వ్రాసినట్టు? నేను నాలుగేళ్ళు కరీంనగర్‌లో ఉన్నాను. అక్కడ మత ఘర్షణలు సృష్టించేంత ఎక్కువ సంఖ్యలో ముస్లింలు లేరు అని చెప్పగలను.

    ReplyDelete
  19. ఒక అబద్దాన్ని జస్టిఫై చెయ్యడానికి వంద అబద్దాలు చెప్పడం హిట్లర్ స్టైల్. శ్రీకృష్ణ కమిటీ పది అబద్దాలు చెప్పింది. అదే హిట్లర్‌కీ, శ్రీకృష్ణకీ మధ్య ఉన్న తేడా. మజ్లిస్ నాయకులు నిజాం ఒస్మాన్ అలీ ఖాన్ బంధువులు కావడం వల్లే తెలంగాణాని వ్యతిరేకిస్తున్నారనే నిజం కూడా నివేదికలో వ్రాయలేదు. శ్రీకృష్ణ కమిటీ అబద్దాలు వ్రాయడంతో పాటు నిజాలని తొక్కిపెట్టడం కూడా జరిగింది. మజ్లిస్ పార్టీ చీలిక వర్గమైన MBT తెలంగాణా డిమాండ్‌ని సమర్థించింది. MBT నాయకులలో ఒకడైనా శ్రీకృష్ణ కమిటీని కలిసి ఉంటాడు. అయినా శ్రీకృష్ణ కమిటీ ముస్లింలు తెలంగాణాకి వ్యతిరేకం అని నివేదికలో వ్రాసింది. ఈ అబద్దాల నివేదిక ప్రామాణికం అని సమైక్యవాదులు నమ్ముతారు. ఎందుకంటే సమైక్యవాద ఉద్యమమే అబద్దాల పునాదుల పై కట్టిన కోట.

    ReplyDelete
  20. "తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు అన్నీ అడ్డంకులే! అందరూ అడ్డు తగిలే వారే!"
    -’అందరూ తెలంగాణకు అడ్డు తగిలేవారే’ అనే వాస్తవం దాకా వచ్చారు గానీ, ఇంకొక్క అడుగు ముందుకేసి, ’ఎందుకలా?’ అనేదాని గురించి ఆలోచించట్లేదు. మనలోను, మన కోరికలోను తప్పేమైనా ఉందేమో చూసుకుందాం అనే లోచూపు ఎవరూ ప్రదర్శించలేదు. ఇకముందు ఎవరైనా ప్రదర్శిస్తారేమో చూడాలి. పాత్రికేయులు, విశ్లేషకులూ కూడా తెరాస భాషే వాడుతున్న ఈ రోజుల్లో అది అత్యాశ అవుతుందనుకోండి.

    ReplyDelete
  21. నిజాం పేరు చెప్పి తెలంగాణావాదులని విమర్శిస్తారు కానీ నిజాం వారసత్వాన్ని కోరుకుంటున్నది సమైక్యవాదులే. నిజాం హైదరాబాద్ రాష్ట్రాన్ని అభివృద్ధి చెయ్యకుండా కేవలం హైదరాబాద్ నగరాన్ని మాత్రమే అభివృద్ధి చేశాడు. ఇప్పుడు సమైక్యాంధ్ర పాలకులు చేస్తున్నది అదే. బ్రిటిష్ ఇండియాలో అక్షరాస్యత పన్నెండు శాతం ఉంటే హైదరాబాద్ రాష్ట్రంలోని అతి పెద్ద జిల్లా అయిన వరంగల్ జిల్లాలో కేవలం నాలుగు శాతం ఉండేది. హైదరాబాద్ అభివృద్ధి కోసం రాష్ట్రాన్ని అంత వెనుకబడేలా చేశాడు నిజాం. ఇప్పుడు మాత్రం ఏమి అభివృద్ధి జరిగింది? నిజాం హైదరాబాద్ బయట స్థాపించిన ఒకటి రెండు పరిశ్రమలని కూడా ప్రైవేట్‌వాళ్ళకి అమ్మేశారు. ఉదాహరణకి వరంగల్ ఆజంజాహీ మిల్ & బోధన్ చక్కెర ఫాక్టరీ.

    ఇక్కడ ఎవరో సమైక్యవాదుల భాష తెరాస భాష కంటే మెరుగ్గా ఉందని వ్రాసారు. పయ్యావుల కేశవ్ భాష ఎలా ఉంటుందో తెలియదా? ఇప్పుడు కూడా సమైక్యాంధ్ర కోసం హింస చేస్తానంటూ కేశవ్ బహిరంగంగా ప్రకటిస్తున్నాడు.

    ReplyDelete
  22. అయ్యా ప్రవీణ్ శర్మ గారు, తమరికి హైదరాబాదు సమస్య తప్ప ఇక ఏ సమస్య లేదు అనుకుంటా.ప్రతిచోట హైదరాబాద్ కోసమే ఈ సమైక్య వాదన చేస్తున్నారు అని అసలు తెలబానీయులకంటే తమరి కామెంటుడు ఎక్కువైంది. అవును మాకు హైదరాబాద్ కావాలి ఇందులో ఏమిటి తప్పు. ఆంధ్రా శాసన సభ్యుల+తెలంగాణా శాసన్ సభ్యుల ఉమ్మడి అంగీకారముతోనే ఈ విశాలాంధ్ర యేర్పడింది.ఇక్కడ ఎవరిని ఎక్కడికి పొమ్మనే అధికారం లేదు. ఎప్పుడూ నిజాం జమానాల గురించి మాట్లాడుతున్నరంటే వర్తమానములో జీవించకుండా చరిత్ర చెప్పుకుంటూ తిరిగే నిరుద్యోగులై ఉంటారు లేక చేతకానివారై ఉంటారు లేదా దౌర్జన్యకారులై ఉంటారు.

    అసలు రెండేల్ల క్రిందటి వరకు కేసవ్,సమ్యూల్,లగడపాటి,కావూరి,రాయపాటి,సోమిరెడ్డి లాంటి వాళ్ళు ఎప్పుడయినా ఎవరినైనా తిట్టారా. మొదట తిట్టింది ఎవరో తరువాత తిట్టింది ఎవరో బుర్ర ఉన్న అందరికీ తెలుసు, ఒక్క తమరికి తప్ప. నీ మానసిక ఆరోగ్యం సరిగా ఉన్నట్లు లేదు ఒకమారు డాక్టరికి చూపించుకో.

    ReplyDelete
  23. అప్పట్లో పెద్ద మనుషుల ఒప్పందం అనే బూటకపు ఒప్పందం జరిగిందనే విషయం మర్చిపోతున్నారు. ప్రజల కోసం కాకుండా కేవలం హైదరాబాద్ కోసమే విలీనం జరిగింది కదా. రాష్ట్రం అంటే హైదరాబాద్ ఒక్కటే కాదు, కోట్లాది మంది ప్రజలు అనే విషయం గుర్తుంచుకోండి. 1901 జనాభా లెక్కల ప్రకారం మద్రాస్ రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే పట్టణాలలో కాకినాడ అతి పెద్ద పట్టణంగా ఉండేది, మచిలీపట్నం రెండో అతిపెద్ద పట్టణంగా ఉండేది, విశాఖపట్నం మూడో అతి పెద్ద పట్టణంగా ఉండేది, విజయనగరం నాలుగో అతి పెద్ద పట్టణంగా ఉండేది. అప్పట్లో నాలుగు లక్షల జనాభా ఉన్న హైదరాబాద్‌తో పోలిస్తే నలభై ఎనిమిది వేలు జనాభా ఉన్న కాకినాడ చాలా చిన్న పట్టణమే. కానీ అప్పట్లో హైదరాబాద్ నిజాం పాలనలో ఉండడం వల్ల ఆంధ్ర రాష్ట్రానికి హైదరాబాద్‌ని రాజధాని చెయ్యాలనే ఆలోచన రాలేదు. ఆంధ్ర రాష్ట్రం డిమాండ్ కూడా 1900 నుంచే ఉండేది. 1950 తరువాత అది బలపడింది. 1953లో కర్నూల్ రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తరువాత హైదరాబాద్ మీద ఆశ పెరిగి పెద్ద మనుషుల ఒప్పందం ముసుగులో హైదరాబాద్ రాష్ట్రాన్ని ఆంధ్ర రాష్ట్రంలో విలీనం చెయ్యించడం జరిగింది.

    ReplyDelete
  24. 1763 నుంచి హైదరాబాద్ నిజాం రాజధానిగా ఉండడం వల్లే అభివృద్ధి చెందింది. లేకపోతే అది విజయనగరంలాగో, శ్రీకాకుళంలాగో, బరంపురంలాగో ఉండేది. ఔరంగాబాద్‌ని మరాఠాలు ఆక్రమించుకున్న తరువాత నిజాం నవాబులు హైదరాబాద్‌ని కాకుండా విజయనగరాన్నో, శ్రీకాకుళాన్నో (అప్పటికి ఉత్తర సర్కార్ జిల్లాలని బ్రిటిష్‌వాళ్ళు ఇంకా స్వాధీనం చేసుకోలేదు) రాజధానిగా చేసుకుని ఉంటే ఇప్పటి పరిస్థితి ఎలా ఉండేది? గోదావరి, కృష్ణా డెల్టాలలో బాగా సంపాదించిన భూస్వాములు పశ్చిమం వైపు కాకుండా ఉత్తరం వైపు వెళ్ళేవాళ్ళు కదా.

    ReplyDelete
  25. /బాగుంది, సమైక్యవాదులకి భాషా సంస్కారం అవసరం లేదు కానీ తెలంగాణావాదులకే భాషా సంస్కారం అవసరం అంటారు. /

    Saudi price or Rahul Gandhi for that matter doesn't need to take up a 9 to 5 job. But many need such jobs.

    Same way..you need 'ఏకాభిప్రాయం' but we care a shit about it. So, YOU need to take care of your 'foul' language. You use your 'matru basha'(bootulu) and you expect us to agree with your demands ?! LOLOL

    Alas..! this advice is going to deaf ears and dumb minds.

    ReplyDelete
  26. సమైక్యవాదం అనేది సమైక్యవాదుల అవసరమే కానీ మా అవసరం కాదు అని తెలంగాణావాదులు అంటారు. బూతులు మాట్లాడకుండా తమ నిజాయితీని నిరూపించుకోవలసిన బాధ్యత సమైక్యవాదులదేనని అంటారు. కనుక భాషా సంస్కారం తెలంగాణావాదులకి మాత్రమే వర్తిస్తుందనుకుంటే అది మీ అమాయకత్వమే.

    ReplyDelete
  27. మీ లాంటి సమైక్యవాద కమీడియన్ ఒకడున్నాడు. ఆయన గారి బ్లాగ్ చదవండి: http://kommineni.info

    ReplyDelete
  28. అయ్యా జ్వాలా గారు.......నిజాలకు నిర్లజ్జగా సమాధి కట్టి కట్టి విషపు అబద్దాలను అందంగా ప్రజల మెదళ్ళ లోకి ప్రవేశపెట్టి ఇప్పటికి ఇంకా ఆ అక్షర హననం సాగించాలనే మీ అనన్య సామాన్యమైన పట్టుదలకు జోహార్లు. ఏమన్నారు ఏమన్నారు.....ఆబాలగోపాలం భాగస్వామ్యంతో అనా? అయితే మరి నిలబడ్డవాటిలో సగం సీట్లు పోయఎందుకు సారూ? నమ్మక ద్రోహం జరిగిందాకా పదవిలో ఉన్నారా? ఆహా? మరి ఉన్నన్నాళ్ళు ఏమి చేసారు? తెలంగాణా బీడీ కార్మికులగురించి ఒక్కరోజు పట్టించుకొన్న పాపాన పోలేదు కదా అది మీ పాత్రికేయ దృష్టికి ఎందుకు రాలేదండి? ఓహో.....అబద్దాలను వండడమే కదా మీ పాత్రికేయుల లక్షణం....అందుకే కాబోలు ఈ నిజం మీకు చేదుగా ఉంది ఉంటుంది.మరి ఇరవై ఆరు మంది గెలిచారు కదా పదహారు మంది రాజీనామా చేస్తే ఏడుగురే గెలిచారు సారూ.....అంటే ఆబాలగోపాలం ఓటు వెయ్యలేదనేకదా అర్థం. రెండువేలతోమ్మిదిలో మరీ నికృష్టంగా పది అంటే పడే సీట్లు వచ్చాయికదా అపుడేమైంది సారూ. అన్ని పార్టీలు ఉద్యమంలోకి దూకాయా? ఆవకాయ పచ్చడేమీకాదా? రెండు తోక పార్టీలు ఒక బూటకపు పార్టీతో జతకట్టి తొడకొట్టి....వాచిన తొడకు మందు కూడా రాణి సంఖ్యలో గెలిచారు. 2009 దీక్ష లో బ్రహ్మాస్త్రమా? బ్రతుకుతెరువు అస్త్రమా అనేది మెడకాయమీద తలకాయ ఉన్న ప్రతీవాడికి తెలుసు మీ మాటలమైకంలో ఉన్న అమాయకంగా ఆహుతి అవుతున్న ఆవేశపరులకు తప్ప. కేంద్రప్రభుత్వం గతిలేక ప్రకటన చెయ్యలేదు ....ఇలాగే ఇద్దరు ప్రబుద్దులు చెప్పిన అబద్దాలను నమ్మి కుక్కను సింహం అనుకొంది అధిష్టానం. దానికి స్క్రీన్ప్లే దర్శకత్వం ఎవరు వహించారో వాళ్ళు తరువాతే ఏ ఏ అగచాట్లు పడ్డారో అందరికీ అవగతమే. ఇక్కడ సమైఖ్యాంధ్ర ఉద్యమం గురించి మీ అబద్దాల అక్షయ తూణీరాలు వెయ్యకుండా వదిలేసినందుకు ధన్యవాదాలు. ఎనిమిది సంవత్సరాలు కాదు కాదు పది సంవత్సరాల అలుపెరగని అబద్దాల వంటకం వాళ్ళ వచ్చిన ఉద్యమం మీది. ప్రజల గుండెల్ల్లోనుండి పుట్టిన ఒక భావన సమైఖ్య ఉద్యమానిది అందుకే పన్నెండు గంటల్లోనే అది ఒక మహోద్యమంగా రూపుదిద్దుకొంది. కేంద్రాన్ని తప్పుదిద్దుకోమంది. శ్రీ కృష్ణ కమిటీ మీ అబద్దాలకు మహాజరు వేస్తె అయన చాలా గోప్పవాడైపోయేవాడు. కానీ అయన చేసిన తప్పు వివరాలలోకి వెళ్లడం సత్యాన్ని బ్రతికిన్చాలనే తపనతో గణాంకాలతో సహా ఉన్నది ఉన్నట్లు చెప్పడం. విద్యార్ధుల ఆత్మ హత్యల విషయానికి వస్తే అమరులైనవారంతా పేద బడుగువర్గాల వారే కదా ఒక్క కోటీశ్వరుడి కొడకూ లేక ఒక్క రాజకీయనాయకుని బంధువూ చావలేదేన్డుకని? ఇంకా అసమర్ధ ప్రభుత్వం గురించి ఎంత తక్కువ మాట్లాడుకొంటే అంటేఆ మంచడి ఎందుకంటే ఒక అన్యాయ ఉన్ద్యమాన్ని ఇన్నాళ్ళు భరిస్తున్న ప్రభుత్వం ఈ వ్యవస్థ అసమర్థమైనవి కాక మరేమిటి? నిజమేమిటో తెలిసి కూడా మీ అబద్దాలకు అడ్డుకట్ట వేయని ఈ పత్రికా ప్రపంచం నిస్క్రియాత్మకత ఏమిటి?
    భళి భళి ఏలుకోండి...మీ ప్రభుత్వాన్ని మీరే ఏలుకోండి. ఎవరు వద్దన్నారు? కనీసం అపుడైనా తెలుస్తుంది మీ పచ్చకల్ల ప్రజలకి మీ నిజస్వరూపం.

    ReplyDelete
  29. అసలు ఏదైనా సంస్కారం ఉంటే కదా వేర్పాటువాదులకు భాషా సంస్కారం ఉండడానికి. నిజాంని పొగిడింది ఎవరో మీరు మర్చిపోయి సమైఖ్య వాదులే నిజాం వారసులను సమర్తిస్తున్న్నారు. అవును అక్బరును సమర్తిస్తే ఔరంగజేబునుకూడా సమర్దిన్చమనిలేదు. కాని మీరు ప్రజాకంతకుడైన నిజాంను సమర్ధిస్తూ ప్రజస్వమ్యవాడులైన అయన వారసులని వ్యతిరేకిస్తున్నారు. ఎంతైనా మీరు ప్రత్యేకం/వేర్పాటు వాదులు కదా. మరోకవిషయం హైదరాబాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని కాబట్టి అంతా వచ్చారు కాని మీ సంపదను కొల్లగోట్టదానికో, మీ చేత బూతులు మాట్లాడిన్చుకోవడానికో కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా ఏ కుగ్రామాన్ని చేసినా ఈసారికి అది హైదరాబాద్ స్తాయికి వచ్చి ఉండేది ప్రజలకు ఈ తలనొప్పి తగ్గేది.

    ReplyDelete
  30. /సంస్కారం తెలంగాణావాదులకి మాత్రమే వర్తిస్తుందనుకుంటే అది మీ అమాయకత్వమే. /

    ఔ ...గట్లనే అనుకో..నాదేం పాయే..

    ReplyDelete
  31. ఈ బూతు కవిత వ్రాసింది నువ్వే కదా ouuncles.blogspot.com/2011/04/blog-post_12.html ఈ కవిత గురించి సమాధానం చెప్పిన తరువాత నీ ఫేవరిట్ హాలిడీ రిసార్ట్ పెద్దాపురంలో జల్సా చెయ్యొచ్చు.

    first answer below boothu comment from you ..later we can discuss about him..24 hours boothu prapancham lo brathike nuvvu inkokariki neethulu cheppadama...

    సమైక్య రాష్ట్రం కోసం వాళ్ళు అమ్మని గులాం నబీ ఆజాద్ పక్కన పడుకోబెట్టమన్నా పెట్టేస్తారు

    ReplyDelete
  32. సమైక్యవాదులకి హైదరాబాద్ నగరం ఒక్కటే కావాలట, వాళ్ళకి మనుషులు అవసరం లేదట! మనుషులకి విలువ ఇవ్వలని వాళ్ళని బూతులు తిట్టడం తప్పు ఎకా అవుతుంది?

    ReplyDelete
  33. హైదరాబాద్ నగరం అనేది ఒక మేడి పండు. ఆ మేడి పండు మీద ఆశ ముందు సిగ్గు, అభిమానం అనేవి ఏమాత్రం పని చెయ్యవు. అందుకే సమైక్యవాదులు తెలంగాణా ఏర్పడితే మత ఘర్షణలు జరుగుతాయని పచ్చిగా అబద్దాలు చెపుతున్నారు.

    ReplyDelete
  34. Thank You All. All opinions need not be similar. Hence I respect all views. Regards, Jwala

    ReplyDelete
  35. చిదంబరం ప్రకటనకి ముందు అన్ని పార్టీల కోస్తా నాయకులూ తాము తెలంగాణాకి అనుకాలమే అని చెప్పుకున్నారు. అదే ఏకాభిప్రాయం. అభిప్రాయాన్ని అవసరానికొకలాగ మార్చుకోవడం అవకాశవాదం కదా.

    ReplyDelete
  36. praveen గాడిది, మావో బుద్ది చూపావు చరిత్రను వక్రీకరించే వక్ర బుద్ది హైదరాబాద్ కోసం విలీనం జరిగిందా ? అన్నం తింటున్నావా అసుధ్ధం తింటున్నావా?

    ReplyDelete
  37. బ్రిటిష్‌వాళ్ళ కాలంలోనూ హైదరాబాద్ దేశంలోని ఐదో అతి పెద్ద నగరమే నాయనా. అప్పట్లో హైదరాబాద్ జనాభా నాలుగు లక్షలు ఉండేది. 1901 జనాభా లెక్కల ప్రకారమే ఇక్కడ సర్కార్ జిల్లాలలో అతి పెద్ద పట్టణమైన కాకినాడ జనాభా 48,000 దాటలేదు. మేడి పండు లాంటి హైదరాబాద్ ఉండగా కాకినాడనో, విశాఖపట్నాన్నో మనవాళ్ళు ఎందుకు కోరుకుంటారు?

    ReplyDelete
  38. హైదరాబాద్ ఒక మేడి పండు, సమైక్యవాదం రాచపుండు, ఒక నగరానికి తప్ప మనుషులకి విలువలేని వాదమే సమైక్యవాదం.

    ReplyDelete
  39. Good. Please continue for few more facts and facts interpreted. Regards, Jwala

    ReplyDelete
  40. సమైక్యవాదుల డికోరమే అలాంటిదని మీ భాషే చెపుతోంది కదా. నువ్వు అసభ్య భాష ఉపయోగించడం మంచిదేలే.

    ReplyDelete
  41. రక్తచరిత్ర....నీవు వేయి చెప్పు, లచ్చ చెప్పు. మా చదువుకున్నమావో, కమ్యునిస్ట్ వేర్పాటు గాడిదల సంఘానికి పోలవరం వసూళ్ళ అవినీతి పరులు పిచ్చ పిచ్చగా నచ్చుతారు. మేం ఓటేసి, వాడి సంపద పెంచుతామని ప్రతిజ్ఞ చేస్తున్నం.
    :- ఇట్లు మావో ముక్కన్న వేర్పాటు వెర్రి గోర్రేలం..
    http://www.youtube.com/watch?v=7_iTOajYRuY

    ReplyDelete
  42. మీలాంటి మావో వేర్పాటు యదవలకి నచ్చుతోంది కాబట్టే వాళ్ళు వేర్పాటు ముసుగులో పోలవరం లాంటి ప్రాజెక్ట్స్ ముడుపులుగా సాధించి అవినీతి చేస్తున్నా మంటున్నారు. మీలాంటోళ్ళను సూడాన్ దేశానికి పంపి ఆటవికులతో గంగాళంలో నిల్చోబెట్టి సూప్ చేయించి, కుక్కలకూ నక్కలకూ విందు చేయాలి..

    ReplyDelete
  43. రక్త చరిత్ర, పందులపాకల్లో ఉండాల్సినవాళ్ళు మనుషుల మధ్య ఉంటే నీ లాంటి భాషే మనుషులకి వస్తుంది.

    ReplyDelete
  44. ఓ పులి .. ఏ జంతువుని
    చంపనని ప్రతిఙ్ఞ చేసిందట..

    ఓ నక్క ... ఏ గోవుని
    మాయం చేయనని శపథం చేసిందట..

    ఓ ముక్కోడు ...తెలంగాణా సాక్షిగా
    తల నరుక్కొంటానని శపథం చేసాడంట..

    కానీ...పోలవరం సాక్షిగా ...
    వేర్పాటు గొర్రెలింక పుర్రెలూపుతూనే వున్నాయి..
    పాపం చచ్చిన prof.జయశంకర్ ఏ లొకాన వున్నాడో.

    ReplyDelete
  45. praveen,
    you dont have any right to abuse raktha charitra.. you are a big boothu man than him... you have great history of abusing your own mother..so, dont tell neethulu to anybody

    ReplyDelete
  46. నంబర్ ఒన్ సమైక్యవాద కెలుకుడు బేచ్‌వాళ్ళు కన్నతల్లిని స్నేహితుల చేత తిట్టించుకోలేదా? againstcastemania.blogspot.com/2011/06/blog-post.html మీ కెలుకుడుగాళ్ళు పక్కా సమైక్యవాదులని అందరికీ తెలుసు. కమ్యూనిజం పేరు చెప్పి, తెలంగాణా పేరు చెప్పి నా మీద పడి ఏడుస్తుంటారని కూడా అందరికీ తెలుసు. మీరు శ్రీరంగ నీతులు చెపితే బోగం గుడిసెల్లో దూరేవాళ్ళు సామెత గుర్తొస్తుంది.

    ReplyDelete
  47. బతికున్న మనుషులనే బూతులు తిట్టే రక్త చరిత్ర లాంటివాళ్ళకి చనిపోయిన జయశంకర్ లాంటివాళ్ళతో పనేమిటి?

    ReplyDelete