వనం జ్వాలా నరసింహారావు
మూసుకున్న ఢిల్లీ కాంగ్రెస్-యుపిఎ సారధ్య నాయకుల (నాయకీమణుల) కళ్లు ఇప్పుడిప్పుడే తెరుచుకుంటున్నాయి. అవును మరి! ఇంకా కొద్ది రోజులు మూసుకునే వుంటే, వారింక ఎప్పటికీ తెరవలేమోనన్న భయం పట్టుకుంది. అప్పుడో మాట, ఇప్పుడో మాట - అక్కడో మాట, ఇక్కడో మాట - అమ్మ ముందో మాట, వెనుకో మాట - సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులతో ఒక మాట, తెలంగాణ వారితో మరొక మాట - తమ పార్టీ రాష్ట్ర నాయకులతో చెప్పేదొకటి, ఇతర పార్టీల వారితో చెప్పేదొకటి - ఇలా ఎప్పటికప్పుడు పబ్బం గడుపుకుంటూ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మార్చిన ఢిల్లీ (కాంగ్రెస్ అధిష్టానం బృందగానం ఆలాపించే) నాయకులకు సకల జనుల సమ్మె వేడి నపాళానికెక్కింది. మింగలేక, కక్క లేక, అధినేత్రి సోనియాకు మొర పెట్టుకుని వుండవచ్చు. జ్ఞానోదయం కలగడం ఆమె దగ్గర నుంచి ఆరంభమైందా? లేక ఆమె సూచనతో బృందగాన భజన పరులకు స్వయానా కలిగిందా? అర్థం చేసుకోవడం కష్టమే! కాని, రాదనుకున్న కదలిక కనపడడం (కనీసం వినపడడం) మాత్రం మొదలైంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటవడం తధ్యమనే విషయం, దాంతో పాటే, మూడు వారాలకు పైగా రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్న సకల జనుల సమ్మె ప్రభావం నుండి బయటపడే అవకాశాలు మటుకు ప్రస్ఫుటంగా కనపడుతున్నాయి. అలా జరగకపోతే, ముఖ్యమంత్రి మొదట్లో చెప్పినట్లు, సమ్మె ప్రభావం ఒక్క తెలంగాణ ప్రాంతం పైనే కాకుండా, యావత్ ఆంధ్ర ప్రదేశ్ తో సహా, భారత దేశంలోని పలు రాష్ట్రాలపై పడే అవకాశాలున్నాయనే సంగతి కేంద్రం ఈ పాటికే గ్రహించి వుండాలి.
అరవై ఏళ్లుగా - పోనీ నలభై ఏళ్ళుగా - కనీసం గత పదకొండేళ్లు గా నన్నా - అధమ పక్షం రెండేళ్లకు పైగా - ఇవేవీ కాకపోయినా ఇటీవల మూడు వారాలకు పైగా జరుగుతున్న సకల జనుల సమ్మె ప్రభావం నేపధ్యంలోనైనా, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను కళ్ళున్న కబోదుల మాదిరిగా, చూసీ చూడనట్లు -అంటీ ముంటనట్లుగా వ్యవహరించిన అఖిల భారత కాంగ్రెస్ పార్టీ (నాటి నుంచి నేటి వరకున్న) అధిష్ఠానం, ఆ పార్టీ ఈ నాటి అధినేత్రి, ఆమె భజన బృందం, కనీసం ఇప్పటికైనా తెలంగాణ సమస్యపై సముచిత స్థాయిలో దృష్టి పెట్టడం ఆహ్వానించ దగ్గ పరిణామం. దాని పర్యవసానమే, బహుశా, తమలో తాము విస్తృతంగా చర్చించుకోవడం, రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ను ఢిల్లీకి రమ్మనడం - ప్రదాన మంత్రితో భేటీకి పిలవడం, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజ నరసింహను, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను, మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్ ను కూడా రమ్మనడం కావచ్చు. కోర్ కమిటీలు, మినీ కోర్ కమిటీలు ఎడతెరిపి లేకుండా సమావేశమవుతున్నాయి. ఏం జరుగబోతుందోనన్న అంశం ఇంకా అస్పష్టంగా వున్నప్పటికీ, ఏదో జరుగడం ఖాయం అన్న విషయంలో మాత్రం స్పష్టమైన సంకేతాలు వస్తున్నాయి. ఎవరి (కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీ) నోటి నుండి తెలంగాణ విషయంలో ఒక అసంబద్ధమైన మాటలు రెండు రోజుల క్రితమే వెలువడ్డాయో, ఆ వ్యక్తికే కీలకమైన నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యతను అధినేత్రి సోనియా గాంధి అప్ప చెప్పడం విశేషం. దసరా పండుగ (తెలంగాణ ప్రాంతానికి చెందిన ఏ ఒక్కరూ కూడా మనస్ఫూర్తిగా ఈ ఏడాది జరుపుకోని పండుగ!) పూర్తయిన వెంటనే కాంగ్రెస్ అధిష్ఠానం తెలంగాణపై దృష్టి సారించడమంటే, కనీసం దీపావళి కానుకగా నన్నా, ఆంధ్ర తెలంగాణ ప్రాంతాలను భౌగోళికంగా విడదీసి - రాబోయే తర తరాల తెలుగు వారు కలిసి మెలిసి సహజీవనం సాగించే విధంగా, చారిత్రాత్మక నిర్ణయం ప్రకటించవచ్చన్న ఆశలు ఇరు ప్రాంతాలలో చిగురిస్తున్నాయనవచ్చు.
తెలంగాణ సమస్యకు పరిష్కారం అంత సులభమైంది కాదని, ఐనా అందుకు తామందరం యత్నిస్తున్నామని, ఎప్పటి లోపు సమస్య తేలుతుందోనని, అసలు ఏ దిశగా అది పరిష్కరించబడుతోందని, చూద్దాం - చేద్దాం అని, క్లిష్టమైన సమస్యను మరింత సంక్లిష్టంగా - భూతద్దంలో చూపించే ప్రయత్నం "రాజనీతిజ్ఞుడు" అని అందరూ భావించే ప్రణబ్ ముఖర్జీ కూడా చేశాడంటే, ఏదో జరుగబోతుందోనన్న సంకేతం ఇచ్చినట్లే! భారతదేశంలో, రాష్ట్రాల ఏర్పాటులో, ఒక పద్ధతిని అనుసరించలేదని, అలా అలవోకగా చరిత్ర -భూగోళం కలిపి కలగాపులగంగా ఓ ప్రైవేట్ చానల్ ఇంటర్వ్యూలో, ప్రణబ్ ఏదేదో మాట్లాడడం వెనుక అనేకానేక గూడార్థాలుండే వుండాలి. యాదృచ్చికంగానే జరిగిందో? లేదో? కాని, సరిగ్గా అదే సమయంలో ప్రధాని మన్మోహన్ సింగ్ కు ఇచ్చిన జవాబులో (ఆయన రాసిన లేఖకు ప్రతిగా) తెలంగాణ అనే సంక్లిష్టమైన, సమస్యాత్మకమైన అంశంపై ఏకాభిప్రాయం సాధించేందుకు ప్రభుత్వం చేయ దగ్గ కృషి అంతా చేస్తున్నది అని సంజాయిషీ ఇచ్చుకున్నారు. ప్రధాని ఈ విషయాన్ని తెలంగాణ విషయంలో ఏ అభిప్రాయం చెప్పని ఒక పార్టీ నాయకుడికే ఎందుకు రాశారో అర్థం కాని అంశం.
తెలంగాణ అంశం సున్నితమైనదని, సంక్లిష్టమైనదని, దాన్ని నిర్దిష్ట కాల పరిమితిలో పరిష్కరించలేమంటూ ప్రణబ్ ముఖర్జీ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో ఒక్కసారిగా కలకలం రేపాయి. కాంగ్రెస్‌లోని తెలంగాణ నేతలు అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. ఐనా, ఆ వ్యాఖ్యలలో తప్పేమీ లేదని సర్దుకుపోయారు. తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు ప్రణబ్ వ్యాఖ్యలలో తెలంగాణ అనుకూలమైన అర్థాలను వెతికే ప్రయత్నమే చేశారు. దీంతో.. అసలు ఆ వ్యాఖ్యలు కావాలని చేసినవా? లేక నోరు జారి చేసినవా? అన్న సంశయం కూడా కలిగింది. ప్రణబ్ వ్యాఖ్యలను ఆషామాషీగా తీసుకోలేమని ఇదంతా వ్యూహాత్మకమేనని మెజారిటీ నేతలు అంటున్నారు. తెలంగాణ అంశంపై త్వరలో నిర్ణయం వెలువడుతుందంటూ కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారాన్ని కట్టడి చేసే వ్యూహంలో భాగంగానే ప్రణబ్ ఇలా మాట్లాడి ఉంటారని కొందరు విశ్లేషకులు భావిస్తుంటే, మరి కొందరు తెలంగాణ ఏర్పాటు కొరకే ఆయన ఈ వ్యాఖ్యలు చేసారని ఘంటాపథంగా చెప్తున్నారు. ఏదేమైనా, ఆ వ్యాఖ్యలు చేసిన అతి కొద్ది సమయంలోనే ఢిల్లీలో చర్చల ప్రక్రియకు శ్రీకారం చుట్టడం శుభపరిణామాలకు దారితీయవచ్చని అందరి ఆశగా చెప్పుకోవచ్చు. తెలంగాణ ఇవ్వడం - ఇవ్వకపోవడం కాదు సమస్య. సకల జనుల సమ్మె ప్రభావంగా దినదినం దుర్భరమవుతున్న సామాన్య-అసామాన్య పౌరుల జీవనం ఒకింత కుదుట బడే వీలుంటుందన్న నమ్మకం కలుగుతోంది.
ఈ నేపధ్యంలో గత వారం రోజులుగా ఢిల్లీలో నాటకీయంగా జరిగిన పరిణామాలు రాజకీయ విశ్లేషకులకు, రాజకీయాలలో వున్న నాయకులకు, రాజకీయం చేసే వారికి, ఆసక్తి కలిగించినప్పటికీ, చిత్తశుద్ధితో తెలంగాణ సమస్యకు పరిష్కారం త్వరలో లభించాలని కోరుకుంటున్న ప్రజానీకానికి మాత్రం అసహ్యంగా, అతి జుగుప్సాకరంగా వున్నాయనక తప్పదు. సమస్య పరిష్కారానికి ఇంకా కొంత సమయం ఎందుకు కావాలి? ఎవరి కొరకు కావాలి? ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతున్నందున సకల జనుల సమ్మెను విరమించమని అడిగే వారికి వారెందుకు సమ్మె చేస్తున్నారో అర్థం కావడం లేదా? సమస్యకు పరిష్కారం కావాలంటే ఇచ్చిపుచ్చుకొనే ధోరణితో వ్యవహరించాలంటున్న వారి ఉద్దేశం ఒక ప్రాంతం వారికే ఈ సూత్రం వర్తిస్తుందా? ఎప్పటికీ ఒకరే ఇచ్చుకోవాల్నా? పుచ్చుకోవాల్నా? ఎవరూ నష్టపోని రీతిలో విన్-విన్ సిచ్యువేషన్ పరిస్థితి వుండాలనడం ఎంతవరకు సమంజసం? "విన్" అంటే ఒకరి "విన్నా"? ఇద్దరి "విన్నా"? భాగస్వాములందరూ కలిసి నిర్ణయం తీసుకోవాలంటున్నారు. తెలంగాణ విషయంలో "భాగస్వాములు" (స్టేక్ హోల్డర్స్) అంటే ఆ ప్రాంతంలో వుండే ప్రజలు -ప్రజా ప్రతినిధులు - రాజకీయ పార్టీల నాయకులు - పౌర సమాజం నాయకులు - ప్రభుత్వ, ప్రభుత్వేతర సిబ్బంది, సిబ్బంది నాయకులే కాని, ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు ససేమిరా ఇష్టపడని పొరుగు వారు, పొరుగు రాష్ట్రాల వారు, ఈ ప్రక్రియలో పాలుపంచుకునేందుకు ఎలా అర్హులవుతారు? ఇంకా నయం...సరిహద్దు దేశాల వారిని, ఐక్య రాజ్య సమితి సభ్యులను కూడా "స్టేక్ హోల్డర్స్" చేద్దామని అనడం లేదు!
అన్నింటికన్నా వింతైన వార్తలను గత వారం కొన్ని పత్రికలు ప్రచురించాయి. వాటిలో నిజా-నిజాలెంతవరకో కాని, అందులో ఏ మాత్రం వాస్తవం వున్నా, పరిస్థితి గందరగోళం అనక తప్పదు. తెలంగాణ సమస్యను వేగంగా పరిష్కరించమని, లేకపోతే, తాము తమ-తమ నియోజక వర్గాల్లో తిరగడం కష్టమని, తమ మనుగడ - కాంగ్రెస్ పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మిగిలిపోతుందని, మొర పెట్టుకోవడానికి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ దగ్గరకు వెళ్లిన తెలంగాణ కాంగ్రెస్ నేతలకు-ప్రజా ప్రతినిధులకు, మన్మోహనే తన మొర వినిపించాడట. అదో వింత అనుభవం అంటున్నారు కాంగ్రెస్ నాయకులు కొందరు. తానూ-తన సంకీర్ణ కేంద్ర ప్రభుత్వం మనుగడ సాగడం ఇబ్బందికరంగా వుందని, ప్రధాని వ్యాఖ్యానించినట్లు సమాచారం. కాకపోతే, తన మొర ఎలా వున్నా, తెలంగాణ నాయకుల మొరను అధినేత్రి సోనియా దృష్టికి, కోర్ కమిటీ దృష్టికి తీసుకెళ్తానని మంచి మనసుతో అన్నారు పాపం ప్రధాని! తాను, తన పార్టీ కేంద్ర స్థాయి నాయకులు, తన సారధ్యంలో నడుస్తున్న కేంద్ర ప్రభుత్వంలోని మంత్రులు, తెలంగాణ ఏర్పాటు విషయంలో తీసుకుంటున్న చొరవకు సంబంధించిన అన్ని సంగతులు వివరించారట ప్రధాని.
హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ఎలా వచ్చారో, అలానే తిరుగు ప్రయాణం కట్టారు కేసీఆర్ అని కొందరనడం హాస్యాస్పదం. ఆయన వెళ్లి వచ్చిన తర్వాతే ఈ తతంగం అంతా జరుగుతుందంటే, ఆయన ప్రమేయం ఏదీ లేకుండా ఎలా వుంటుంది? తెలంగాణ ఏర్పాటుకు అనుకూలమైన నిర్ణయం రాని పక్షంలో, రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి నాయకులు, కాంగ్రెస్ తెలంగాణ నాయకులు, తెలుగుదేశం తో సహా ఇతర పార్టీ నాయకులు ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని ప్రకటించారు. ఈ నేపధ్యంలో, కారణాలేవైనా, తెలంగాణ సమస్యకు ఒక పరిష్కారం కనుగొనక తప్పదని కాంగ్రెస్ అధిష్ఠానం ఓ స్పష్టమైన అంచనాకు వచ్చిందనేది స్పష్టం. ఇక ఎంతమాత్రం నాన్చడం మంచిది కాదని నిర్ణయించుకుంది. రాష్ట్రంలో పరిస్థితి రోజురోజుకు తీవ్రంగా మారుతోందని అర్థమవుతోంది కాంగ్రెస్ అధిష్టానానికి. కళ్లున్న కబోదులకు, మూసిన కళ్లను తెరవక తప్పలేదు. ఒకరి వెంట మరొకరిని ఢిల్లీకి రమ్మని కబురు పెట్టారు. గవర్నర్ నరసింహన్ ప్రధానిని, రక్షణ మంత్రి ఆంటోనీని కల్సినట్లు సమాచారం. మరోపక్క, ముఖ్యమంత్రి కిరణ్, ఉపముఖ్యమంత్రి రాజనర్సింహ, ఇతర నాయకులు ఆజాద్ ను, ఇతర ప్రముఖులను కలుస్తున్నారు. ఉక్కు పిడికిలితో ప్రజాభిప్రాయాన్ని అణచి వేయడం అసాధ్యం అనే సంగతి స్పష్టమైంది. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ మొదలైందనాల్సిందే. ఆటకు ముగింపు రానున్నది.
//అరవై ఏళ్లుగా - పోనీ నలభై ఏళ్ళుగా - కనీసం గత పదకొండేళ్లు గా నన్నా - అధమ పక్షం రెండేళ్లకు పైగా - ఇవేవీ కాకపోయినా ఇటీవల మూడు వారాలకు పైగా జరుగుతున్న //
ReplyDeleteఎన్నేళ్ళో కూడా "స్పష్ట" లేదు. ఏన్నేళ్ళనుంచి పోరాటం చేస్తున్నరో అన్న విషయం మీద చెన్నారెడ్డి గారి దగ్గర ఏళ్ళకొద్దీ పనిచేసిన అనుభవమున్నవాళ్ళకే 'స్పష్టత" లేదు, ఇతమిద్ధంగా చెప్పలేక పోతున్నారు.
"స్పష్టత" లేదండి జ్వాలా గారు. మనకు కావాల్సిన "స్పష్టత" అర్థంచేసుకోకుంటే ఎలా?!
//హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ఎలా వచ్చారో, అలానే తిరుగు ప్రయాణం కట్టారు కేసీఆర్ అని కొందరనడం హాస్యాస్పదం. ఆయన వెళ్లి వచ్చిన తర్వాతే ఈ తతంగం అంతా జరుగుతుందంటే,//
ReplyDeleteఇదేమన్నా మొదటిసారా!!? హాస్యాస్పదం ఏమో గాని నిర్లజ్జాస్పదం.
Very shameful article from you Mr.Jwala.
ReplyDeleteకాంగ్రెస్ నాయకులందరినీ పట్టుకుని పంచెలు ఊడదీసి తంతే అప్పుడైనా సోనియమ్మ గుడ్డి కళ్ళు తెరుచుకుంటాయేమో. కళ్ళున్నా గుడ్డివాళ్ళలాగ నటిస్తున్నారు గుడ్డి సన్నాసులు.
ReplyDeleteకేంద్రం ఇంకా చర్చలతోనె కాలం గడపటానికి చూస్తున్నట్టు అనిపిస్తుంది కాని, త్వరగా నిర్ణయం తీసుకుంటుంది అని అనుకోలేమండి... ఎందుకంటే యే విషయంలోనైనా కాంగ్రేస్ నాయకులకి చర్చలు అని చెప్పి సాగతీయటమె తెలుసు కాని సమస్య పరిష్కారానికి ఏం చెయలో తెలియదు
ReplyDeleteమాస్ హిస్టీరియా పట్టుకున్నవాళ్ళలో తమరొకరన్నమాట. బ్లాక్‌మెయిల్ తో బలవంతంగా జరుపుతున్న ఈ వికలజనుల సమ్మెకు మూర్ఖంగా మీ మద్దతు చూస్తుంటే మీ ప్రొఫైల్‌లో మీరు ఘనంగా ప్రకటించుకున్న మీ అనుభవం,విచక్షనా జ్ఞానం ఎందుకూ పనికిరావడం లేదని అర్థం అవుతుంది. ఏమిటి రాష్ట్రంలో ఇతరప్రాంతంవారి,రాష్ట్రాలవారి అభిప్రాయం అవసరంలేదా? అంతా ఒకప్రాంతంవారి ఇష్టమే? ఇంకేమి "ప్రత్యేక తెలంగాణ" ఏమి ఖర్మ ప్రత్యేక దేశమే కావలని నిరవధికంగా సమ్మె చేయమని మీరు వెళ్ళి ఉద్భొదించండి. ప్రత్యేక జెండా,కరెన్సి,ప్రధాని,రాష్ట్రపతి,సుప్రీం కోర్టు వస్తాయి. అప్పుడు భవిశ్యత్తులో మీరు ప్రధానమంత్రి "కచరా" గారికి పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ అవొచ్చు. రేపు ఇదే వాదాలు బయలుదేరినా(ప్రత్యేక తెలంగాణా) నేనైతే పెద్ద ఆశ్త్చర్యపోను! ఎందుకంటే మీకు మిగతా వారి అభిప్రాయాలు అవసరం లేదు కదా! మీది ప్రత్యేకమైన జాతికదా !!! :)
ReplyDelete|ఆంధ్ర తెలంగాణ ప్రాంతాలను భౌగోళికంగా విడదీసి - రాబోయే తర తరాల తెలుగు వారు కలిసి మెలిసి సహజీవనం సాగించే విధంగా.....|
ReplyDeleteబహుశా ఈ మిలీనియములో ఇదే అతిపెద్ద పగటికల కావచ్చు. ఇప్పటివరకూ జరుగుతున్నవి కేవలం సమర సన్నాహాలే! అసలు సమరం ముందున్నది. అంతదాకా మీరిలా కలలు కంటూనే ఉండండి.
మధ్య ప్రదేశ్, చత్తీస్‌గఢ్ విడిపోయినా ఆ రెండు రాష్ట్రాలకీ ఒకే ప్రాంతీయ ప్రైవేట్ టివి చానెళ్ళు ఉన్నాయని మీకు తెలిసినట్టు లేదు. మధ్య ప్రదేశ్ చానెళ్ళలో చత్తీస్‌గఢ్ వార్తలు వస్తాయి, చత్తీస్‌గఢ్ చానెళ్ళలో మధ్య ప్రదేశ్ వార్తలు వస్తాయి. రాష్ట్ర విభజన అనేది రాజకీయ విభజన మాత్రమే కానీ ప్రజా జీవన విభజన కాదు.
ReplyDelete...జ్వాలా గారు, ఆ కాస్త ముసుగు కూడ తీసి సిసలైన తెలబాన్ లాగా దర్సనమిచ్చారు. సంతోషమండీ. కోస్తా-సీమ వాళ్ళు స్టేక్ హోల్డర్స్ కాదా? భేష్!
ReplyDeleteకేవలం తెలంగాణాప్రజలు మాత్రమే ముఖ్యమా. మరైతే 1969 లోనె తేలిపోయింది కదండీ? 1972 లోఇంకో సారి తేలిపోయింది కదా కలిసే ఉండాలని. ఈ రోజువరకు సమైక్యవాద ప్రభుత్వాలనే గెలిపిస్తూ వచ్చారు కదండీ, ఆ ప్రజలే. ఒహో వారు మనసు మార్చుకున్నప్పుడల్లా అలా కలుపుతూ విడగొడుతూ పోవాలన్నమాట.
నాకు మా ఖమ్మం జిల్లాని రాష్ట్రంగా చేసి,ఖమ్మాన్ని రాజధానిగా, పెడితే నా కిష్టమేనండి. ఖమ్మం ప్రజలు ఒప్పుకుంటారు. ఇచ్చేదామా?
అన్నట్టు హైదరాబాదు మాక్కావాలని కరీమ్నగర్ వాళ్ళు పట్టుబట్టట మేంటండి? అది హైద్రాబాద్ వాళ్ళు కదా తేల్చుకోవాల్సింది.
మా ఉద్యోగాలన్నీ ఆంధ్రోళ్ళు ఎత్తుకో పోయారని నానా యాగీ చేశారుగా. ఇప్పుడు వాళ్ళంతా సమ్మె చేస్తున్నారా? బలవంతంగా చెయ్యిస్తున్నారా? లేకా తెలబాన్లు అంతే చెప్తారు పట్టించుకుంటారా, అని అడుగుతారా?
మీ కింకో దుర్వార్త..ప్రజలు తిరగ పడుతున్నారండి. ఆర్టీసి సమ్మె కూడా ముగిసేట్టుంది.రైల్ రోకో కూడా మునపటిలాగా ఉండకపోవచ్చు.
ఇదంతా ఆంధ్రోళ్ళ కుట్రంటూ మీర్రాయబోయే తెలబాన్ వ్యాసం గురించి ఎదురు చూస్తుంటా.
Very disgraceful, narrow, selfish article from you.
1972లో జరిగిన జై ఆంధ్ర ఉద్యమం కేవలం ముల్కీ నిబంధనలకి వ్యతిరేకంగా జరిగింది. అదేమీ విభజనవాద ఉద్యమం కాదు. ముల్కీ నిబంధనలనీ, పెద్ద మనుషుల ఒప్పందాన్నీ రద్దు చేసిన తరువాత జై ఆంధ్రవాదులు హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. ఎందుకంటే జై ఆంధ్రవాదులకి కావలసినది అదే కదా.
ReplyDeleteవనం గారు ఎన్నడూ ముసుగు వేసుకోలేదే. ఆయన మొదటి నుంచి తెలంగాణావాదే కదా.
ReplyDelete72 లో ఉద్యమం ఎందుకు జరిగిందో ఎవడడిగాడ్రా..అసలు టాపిక్ మీద క్షణం నిలబడవు.
ReplyDeleteమనుషులంతా స్వార్థ పరులే.గుర్తుంచుకో! దానికి ప్రాంతీయ భేధాలుండవు. అందుకే అడిగే వాళ్ళని బట్టి, అడిగే తీరును బట్టి వరాలివ్వరు. అడిగిన దాంట్లో నిజమింత,కల్పితమెంత, కట్టుకథలెన్ని,కష్టాలేమిటి,ఇది తీర్చే సంస్యేమిటీ,కొత్తగ పుట్టుకొచ్చే సమస్యలేమిటీ ..లాంటి వాటిని బట్టే నిర్ణయాలుంటాయి.అలాగే ఉండాలి కూడా.ఒకేగొడుగు కింద ఉంటూ నా దారి నాదీ,దొబ్బెయ్ అంటే ఊరుకొరమ్మా..తెల్సుకో.
ఏమిటో కెంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవు అని తెగ ఫీలై పోతున్నారు? వీల్లు గాధేయ వాదంతో ఉద్యమం చేస్తుంటే ప్రభుత్వాలు కూడా గాంధేయ వాదంతోనే ఉద్యమాన్ని ఎదుర్కుంటున్నాయి. ప్రభుత్వం నిజంగా స్పందించాలంటే ముందుగా ఈ అరాచక వాదులని అరెస్టు చేసి ప్రజలకి ఇబ్బంది కలగకుండా చెయ్యటం దగ్గర నుండి మొదలు పెట్టాలి. ప్రభుత్వ స్పందన కావాలా?
ReplyDelete1972 ఉద్యమం గురించి మొదట మాట్లాడింది పావనిగాడే.
ReplyDeleteమీ సమైక్యవాదులు నన్ను రా అన్నారు కాబట్టి మీ సమైక్యవాదిని గాడు అన్నాను. గాడు అన్నందుకు గార్ధబాలు ఫీలవ్వనక్కరలేదులే.
ReplyDeleteఒకవేళ మనుషులందరూ స్వార్థపరులైతే నాగరిక సమాజం ఎందుకు? జెంఘిస్ ఖాన్‌లాగ ఒకరినొకరు చంపుకుందాం, ఒకరి సంపదనొకరు కొల్లగొట్టుకు తిందాం. ఎవడు గెలిస్తే వాడే రాజు. ఎవడి స్వార్థం వాడికే ముఖ్యం అనుకుంటే ఇంకొకడి మీద దయ ఎందుకు?
ReplyDeleteAgreed to disagree...Thank you all for evincing keen interest and in the process for offering valuable comments. Regards to all. Jwala
ReplyDeleteమీకు విశ్లేషనాత్మకంగా విమర్శనాత్మకంగా ఉండే కామెంట్లని ప్రచురించే దైర్యం లేకుంటే దయచేసి "కామెంట్ల" ఆప్షనుని డెసేబుల్ చేయండి. నాకింత అనుభవం ఉంది అని చాంతాడంత "ప్రొఫైల్" పెట్టుకోవడం కాదండి, అందుకు తగ్గ విచక్షణ,సంస్కారముండాలి.
ReplyDeleteఅవును "పావని గారి"అభిప్రాయమే నాదికూడా! మీ సమాధానం.
@జ్వాలా గారు, అవునండీ.We can 'respectfully' agree to disagree and still live together.Thats how things work all over.
ReplyDelete@సూటిగా..:)
"సూటిగా" gaaroo...I am not responsible for your comment going in to Spam. After I saw your latest comment I checked and Undone Spam. When every other comment (including criticisms) are seen here, why do you think that I deleted yours? You have every right to offer your comment, though your (even mine and every one else's)right, if you agree needs to be limited to using parliamentary language. I agree with all your comments and I have no protest at all. Please go ahead and offer whatever you want to. Regards,
ReplyDeleteJwala
సమైక్యవాదం అంటే ఏమిటో ఈ బూతు కవిత చదివితే తెలుస్తుంది http://telanganasolidarity.in/76706348 సమైక్యాంధ్ర జెఎసి నాయకుడు శామ్యూల్ గారి మానస పుత్రుడు ఒస్మానియా అంకుల్స్ అనే పేరుతో బ్లాగ్ పెట్టి జాన్ అనే నకిలీ క్రైస్తవ పేరు పెట్టుకుని వ్రాసిన బూతు కవిత.
ReplyDelete@Praveen Sarma
ReplyDeleteevado ooru peru leni vadu oka pani cheste andariki aapadinchatam correct kadu. Kani telangana valla kavithalu, matalu chadivi untav...ooru peru leni kavulu kadu..peru mosina rajakiya nakaulu...maha peru gadinchina kavi siromanulu...first vallani vimarshinchi..taruvatha ee topic ki raa. Tanu rasindi kuda telabans ni uddesinchi..not all telangana people.
Nuvvu entha tala tikka vadanalu chestavante...eppudo 1966 lo oka train engine ni evaro kalcharanta so andhra vallu tagalabettaru ani rastava..tikkakina oka limit undoddu? america lo civil war (after indepence) vachinappudu vela mandi champukunnaru...adi charitra..alage anni countries lo ..so ippudu unna countries lo andaru rakshasulu andama? appudu nuvvokkadive devudivi...ikkada neekem pani? inkosari tikka vadanalu cheyali....
I don't definitely support such writings but I support the caption...evadabba sommani kulustaru?
Dayachesi telabans antha separate country kavali ani protest cheyandi...memu kuda support chestam. Please..please ..please