Monday, January 9, 2017

లంకాదహనం ప్రక్రియను వివరించిన హనుమ ......ఆంధ్ర వాల్మీకి రామాయణంలో ఛందః ప్రయోగాలు 26 వ భాగం - సుందర కాండ : వనం జ్వాలా నరసింహా రావు

లంకాదహనం ప్రక్రియను వివరించిన హనుమ
ఆంధ్ర వాల్మీకి రామాయణంలో ఛందః ప్రయోగాలు
26 వ భాగం - సుందర కాండ
వనం జ్వాలా నరసింహా రావు
సూర్య దినపత్రిక (09-1-2017)

క్రోతి యొక్కండు యుష్మన్నహాశూరతాజ్ఞాని దుష్టాత్ముఁ డై తోఁ టయెల్లన్ సపాటంబుగా నేలతో పాటు గావించె, నా క్రించు రప్పించి ఖండింపుమీ, యన్న నా రాక్షసుం డుగ్రులంగింక రాఖ్యాతశూలాయుధాశీతిసాహస్ర సఖ్యాకులం బంచె, నే లౌడిచేఁ  ద్రుంచితిన్ వారలం జావగా, దక్కియున్నట్టి దైత్యుల్ వెసంబారిదేవారితోఁ జెప్పి, రే నింతలో నూర కేలుండగా నంచుఁ దోఁ పంగ నాచైత్య ప్రాసాదమున్ ధ్వస్తముం జేసి యచ్చోటిరక్షస్తతిన్ స్తంభఘాతంబులం గూల్చితిన్ నూర్వురన్, వచ్చెఁ  దా నంతలోనం బ్రహస్తాత్మసంభూతుఁ డౌ జంబుమాల్యాఖ్య విఖ్యాత శూరుండు ఘోరాసురవ్యూహసం యుక్తుఁ డై, వాని సేనాసమేతంబుగా లౌణిచేఁ  జంపితిం, బిమ్మటం బంచె నాపై మహామాత్ర పుత్రాష్టకం బేను నద్దాననే వారిఁ గాలాలయావాసులం జేసితిం, బంచసంఖ్యాకసేనాను లుద్దండత న్వెండి పై రా విదారించితిన్ సేనతో, వెన్క  నప్పంక్తి కంఠాత్మజుం డక్షుఁ డన్వాఁ డు సైన్యంబుతో వచ్చె, నే నా కుమారున్ మహావీరు మందోదరీసూనునిన్ మింటికిన్వాఁ డు లంఘించుచోఁ గాళ్ళు లీలన్ బిగంబట్టి గి ర్గిఱ్ఱునన్ నూఱు మాఱుల్ వడిం ద్రిప్పి పెన్ముద్దగా జేసి ధాత్రీస్థలి న్మోఁ దితిన్, వానిపా టా దశాస్యుండు నాలించి వేరొడు పుత్రున్ మహాగాత్రునిన్, శక్రజిం బంపె; నవ్వాని నవ్వాహినిం గూడఁ  దేజం బఱంజేసి మోదించితిన్, వాడు నన్గెల్చున న్నమ్మకం బూనిరక్షోవిభుం డంపె, నన్నెట్టులుం గెల్వరాదంచు నూహించి వాఁ డంత బ్రహ్మాస్త్రపాశంబులన్ నన్ను బంధించె, రక్షోవరుల్ త్రాళ్లతో నన్ను బంధించి కొంపోయి దైత్యేశు మ్రోలన్ నిలంబెట్ట వాఁ డుగ్రుఁ డై యేలరా వచ్చితీలంక! కీ వేలరా చంపితా సోఁ కులం? జెప్పరా యన్న సీతార్ధ మై సర్వముం జేసితిన్, నిన్నుఁ జూడంగ నీయింటికిన్ వచ్చితిన్ రాక్షసేంద్రా! హనూమంతు డన్వాఁ డ, నేఁ బావమానిన్ రఘూత్తంసుఁ డౌ రామదూతుండ, సుగ్రీవు మంత్రిన్, ననుంబంప రాముండు నీయొద్దకు న్వచ్చితిన్ దూతనై, సూర్యపుత్రుండు నీ సేమముం ప్రశ్న గావించె, ధర్మార్ధకామానుషక్తంబు పథ్యంబు వాక్యంబు నీకున్ వచించెంజుమీ, ఋశ్యమూకంబునన్ రాముతో మైత్రిఁ  గావించి యున్నాఁ డు, తద్వీరు వాక్యంబు లాలింపుమా, రామదేవుండు దేవారి నా నారినిన్ మ్రుచ్చిలించెన్ వనీభూమి, నీవిందు సాహాయ్యముం జేయుమా, యంచు నన్వేఁ డ నే నట్టులే చేయుదుంగాని యవ్వాలినిం జంపఁ గా బాసఁ  గావింపు మీ యంటి, సూర్యాన్వయుండట్లు గావించి యవ్వాలినిన్ బాణమొక్కంటనే చంపి కీశాధిపత్యంబు నా కిచ్చె, నే హవ్యభుక్సాక్షికంబైన స్నేహంబు గావించితిన్, రామసాహాయ్య మే నెట్టులుం జేయుదున్, జానకీదేవి శ్రీరామభూనేత కి మ్మీయకున్నంత వీరుల్ వనాటుల్ భవచ్ఛౌర్య నిర్మూలనం బెట్లుఁ  గావింతు, రెవ్వారు! మావారి శౌర్యంబు లోకంబునం గానరో? పోవరో మున్ను దేవాళికిం దోడుగా? నంచు నీతో వచింపన్ ననుం బంచె నన్నన్ రుషాశోణితం బైన నేత్రంబులం జూఁ డున ట్లుగ్రతం జూచి నా విక్రమం బా దురాత్ముం డవిజ్ఞాతుడై యంత నన్ జంప నాజ్ఞప్తి గావింపగా వానితమ్ముండు ధీశాలి రక్షోవరు న్నానిమిత్తంబుగా వేఁ డె నో సోఁ కు ఱేఁ డా! కనన్ రాజశాస్త్రవ్యపేతంబు నీ యాజ్ఞ శాస్త్రంబునం దూత వధ్యుండుగాఁ , డిచ్చమైఁ  దథ్యముం బథ్యముం బల్కు వాఁ డెట్టి నేరంబు  గావించినన్ రూపుమార్పన్ వికారంబుగాఁ  జెల్లుగా, కెప్పుడుం జంపగా రా దనం, దోఁ కఁ గాల్పంగఁ  బంచెన్ దశాస్యుండు, రక్షోవరుల్ వాల్క వారంబులన్ జీర్ణ కార్పాసవస్త్రంబులం దోఁ కకుం జుట్టి నన్ గట్టెలం గొట్టుచున్, గింకచే దిట్టుచున్, బైపయిన్ ఱొప్పుచుం, వీథులం ద్రిప్పుచున్, బోవ సంక్షిప్తగాత్రుండనైతట్టులండుల్చి నే వెండియున్ ఘోరరూపంబుఁ  గైకొంచుఁ  బెన్ లౌడిచే వారలం జంప ద్వారంబునన్ జేరి లంకాపురిం గొంప లన్నింటికిం జిచ్చు సంధించి యామంటలో సీతయుం ద్రుంగెనో? పోయెఁ గా పట్టనం బంతయుం బాడుగాఁ, దన్విమాత్రంబు దా నెట్లు జీవించెడిన్? రామకార్యంబు నిర్మూలముం జేసితిన్ బుధ్ధిహీనుండనై యంచు శోకించుచున్ సీత భద్రంబ యం చంభ్రమార్గంబునం జారణుల్ పల్కనాలించి భావించి సర్వంబునుం గాల్చు నా యాశ్రయాశుండు నాతోఁ క గాల్పండ, నా చిత్తమా సంప్రహృష్టంబు, సౌరభ్య సంభారుఁ డై గంధవాహుండు నున్ వీచె, సీతామహాదేవి నావీతిహోత్రుండు దాఁ  గాల్పఁ గానోపు? నంచాత్మ మోదించి యా యించుబోణిన్ మఱిం గాంచి నే నామెకుం జెప్పి తత్రస్థమౌ నా యరిష్టంబుపై నెక్కి మిమ్మెల్ల దర్శించు పెన్మక్కువన్ గ్రక్కునన్ వారిధిం దాఁ టి చంద్రార్కసంసేవితంబైన మార్గంబునన్ వచ్చితిన్, మిమ్ముఁ గన్గొంటి, శ్రీరామచంద్ర ప్రభావంబునన్ యుష్మదీయోరుతేజంబునన్ నేను సుగ్రీవు కార్యంబు నీమట్టు గావించితిన్ లంకలో, నింకఁ  గాఁ గల్గు కార్యం బవార్యంబుగాఁ  జేయ మీరెల్లరున్నారుగా.

(హనుమంతుడు సముద్రం దాటి లంకకు పోయి సీతను చూసి, సంభాషించి, మరలి వచ్చే ముందర లంకాదహనం చేసి, తిరిగి వచ్చి తన వానర మిత్రులను కలిసేంత వరకూ జరిగిన సుందరకాండ వృత్తాంతం ఇది. ఇంతవరకూ జరిగిన సుందరకాండంతా ఇందులో వుంది. ఇందులోని విషయమంతా హనుమంతుడు వక్తగా, సంగ్రహంగా వానర మిత్రులకు చెప్పాడు. ఇది చదివి ఇక ముందుకు సాగితే సుందరకాండ అంతా చదివినట్లే కద! మహాద్భుతమైన, రసరమ్య రంజితమైన శ్రీవాసుదాసస్వామి శ్రీ లేఖిని నుండి జాలువారిన ఈ దండకం సర్వదోషహారం. సర్వ క్లేశ నివారణం. శ్రీరామానుగ్రహ ప్రసాద కారణం)

ఛందస్సు:      ఈ దండకంలో అన్నీ "త" గణాలే. వేరే గణాలు లేవు. చివరకు ఒక "గురువు".

లంకకు పోయి వచ్చిన వృత్తాంతం అంతా వివరించిన తరువాత, హనుమంతుడు కపులతో సీతాదేవిని తమ వెంట తీసుకొచ్చిన అనంతరమే శ్రీరాముడిని దర్శించడం మంచిదని తన అభిప్రాయంగా చెపుతాడు. సీతాదేవి దుస్థితిని  కూడా వివరించాడు. అంగదుడు సీతాదేవిని తాను తీసుకువస్తానని అంటాడు. కపులు కిష్కింధకు పోయే మార్గంలో మధు వనాన్ని చూస్తారు. సీతాన్వేషణలో విజయం సాధించామన్న ఆనందంతో మధు వనంలో జొరబడి ఇష్టం వచ్చినట్లు విహరిస్తారు. దదిముఖుడు వారించినా వినిపించుకోరు. మధు వనంలో సంతోషంతో వళ్లు మరిచి తేనె తాగుతూ, వనాన్ని చిందరవందర గావించే సందర్భాన్ని పురస్కరించుకుని "మానిని" వృత్తంలో చక్కటి పద్యాన్ని రాశారు కవి ఇలా:

మానిని:
          ఆడెడివారును వేఁ డెడివారును     హాయిగఁ బాడెడివారును నై
        వీడెడివారును గూడెడివారును  వేడుక లాఁ గులు వేసెడి వా
        రోడెడివారును గూలెడువారును నూఁ గెడి వారును మీసములన్
        దీడెడివారును దాఁ టెడి వారును దేఁ కెడివారును నైరికపుల్-115
ఛందస్సు:      మానినికి ఏడూ "భ" గణాలు, ఒక గురువు. పదమూడో ఇంట యతి.

సుందరకాండాంత పద్యాలలో ఒకదానిని "పద్మనాభ" వృత్తంలోను, మరొకటి "అంబురుహ" వృత్తంలోను రాశారు. 

No comments:

Post a Comment