Sunday, September 17, 2023

హింసా రూపమైన యజ్ఞం కంటే, అహింసా రూపమైన యజ్ఞం గొప్పదని చెప్పే సక్తుప్రస్థుడి చరిత్ర .... ఆస్వాదన-138 : వనం జ్వాలా నరసింహారావు

 హింసా రూపమైన యజ్ఞం కంటే,

అహింసా రూపమైన యజ్ఞం గొప్పదని చెప్పే సక్తుప్రస్థుడి చరిత్ర

ఆస్వాదన-138

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (18-09-2023)

ధర్మరాజు చేసిన అశ్వమేధయాగం లోకాతీతంగా నడిచింది. సమస్త జనులూ ఆశ్చర్యపడ్డారు. సరిగ్గా అదే సమయంలో ఒకానొక ముంగిస ఒక కన్నం నుండి బయటికి వచ్చి, బ్రాహ్మణుల మధ్యనుండి “ఈ అశ్వమేధయాగం వీసమంత కూడా సక్తుప్రస్థుడి మహాధర్మాన్ని పోలదు” అని బహిరంగంగా అన్నది. ఏ కారణాన అలా అంటున్నావని బ్రాహ్మణులు ఆ ముంగిసను అడిగారు. తమకు అర్థం అయ్యేట్లు చెప్పమని కోరారు. సమాదానంగా ఆ ముంగిస ఇలా చెప్పింది.

‘కురుక్షేత్రంలో తపస్సు సంపదగా కలిగిన ఒక గొప్ప బ్రాహ్మణుడు (మునీశ్వరుడు) వున్నాడు. అతడి పేరు సక్తుప్రస్థుడు. కోపతాపాలు, కోరికలు లేని ఆ బ్రాహ్మణుడు పొలాలలో రాలిన గింజలు ఏరుకొని తినేవాడు. అతడికి భార్య, కొడుకు, కోడలు వున్నారు. ఇలా వుండగా ఒక పర్యాయం వానలు కురవలేదు. పంటలు పండలేదు. బ్రాహ్మణుడికి తిండి దొరకడం అసాధ్యమైంది. కుటుంబ సభ్యులంతా కలిసి నివ్వరిధాన్యం కొంచెం ఏరుకొని తెచ్చుకొని ఆకలి తీర్చుకుంటున్నారు. ఒకనాడు వారలా తృణధాన్యం వెదకి తెచ్చుకున్నారు. అది నాలుగు మానికల పేలపిండి అయింది. నలుగురూ తలా మానికడు సమానంగా పంచుకొని తినడానికి సిద్ధంగా వున్నారు. అదే సమయానికి ఒక బాటసారి బ్రాహ్మణుడు ఆకలితో వారింటికి వచ్చాడు. ఆయనకు అతిథి మర్యాదలు చేశారు వీరు’.

‘ముందుగా ఇంటి యజమానైన బ్రాహ్మణుడు (మునీశ్వరుడు) తన వంతు పేలపిండిని బాటసారి బ్రాహ్మణుడికి ఇచ్చి అతడి ఆకలి తీర్చుకొమ్మన్నాడు. బాటసారి తిన్నాడు కాని తృప్తి కలగలేదు. అప్పుడు యజమాని బ్రాహ్మణుడి భార్య ఇది గమనించి తనవంతు పేలపిండి బాటసారికి సమర్పించమని భర్తను కోరింది. భార్యవంతు పేలపిండి ఇచ్చిన తరువాత దాన్ని కూడా తిన్న బాటసారి బ్రాహ్మణుడు తృప్తి పడలేదు. సక్తుప్రస్థుడి కొడుకు అప్పుడు తన వంతు పేలపిండి ఇవ్వడానికి సిద్ధ పడ్డాడు. కొడుకు వంతు పేలపిండిని కూడా అతిథికి సమర్పించాడు, అతిథి దాన్ని తిన్నాడు కాని అతడి ఆకలి ఇంకా తీరలేదు. అప్పుడు కోడలు తనవంతు పేలపిండిని మామగారి ముందు పెట్టింది. కోడలి వాటా పేలపిండిని కూడా అతిథికి సమర్పించాడు బ్రాహ్మణుడు. అతిథి సంతోషంతో దాన్ని తీసుకొని వేడుకతో తిన్నాడు. అతడికి అప్పుడు తృప్తి కలిగింది. అప్పుడు బాటసారి బ్రాహ్మణుడు తాను “యముడు” నని, ఆయన సదాచార ప్రకృతిని చూసి మెచ్చుకున్నానని హృదయపూర్వకంగా అన్నాడు. భక్తి, వినయం, శ్రద్ధ, ఓర్పు, మర్యాద, దయ, అతిథి మీద ప్రేమ మునీశ్వరుడిలో నిలకడగా వున్నాయని అన్నాడు’.

‘యముడు ఇలా అంటున్నప్పుడు ఆకాశంలో ఇదంతా గుంపులు కట్టి చూస్తున్న దేవతలు, యక్షులు, సిద్ధులు బ్రాహ్మణుడు చేసిన దానానికి పూలవాన కురిపించారు. సప్తర్షుల మనస్సులు సక్తుప్రస్థుడిని చూడడానికి కుతూహలంగా వున్నాయని, ఆయన భార్యతో, కొడుకు-కోడలుతో సహా స్వర్గానికి రమ్మని అన్నాడు యముడు. ఆయన కొరకు తొందరలోనే బ్రహ్మ విమానం పంపుతాడని, బ్రహ్మ సభకు రావాలని చెప్పాడు. అనేక దానాలు, ప్రఖ్యాత యజ్ఞాలు, ధర్మబద్ధమైన ప్రశంసకు తగినవి కావని, సన్మార్గంలో సంపాదించి కూడబెట్టిందే శ్రేష్టమని, యోగ్యుడైనవాడికి తగిన సమయంలో అల్పవస్తువైనా దానం చేయగలగడం ఉత్తమమని అన్నాడు యముడు. ఇలా అంటూ ఆయన తన నిజస్వరూపం చూపించాడు. ఇంతలో ఆకాశమార్గాన సువర్ణమణి నిర్మితమైన విమానం కనపడింది. అది నిమ్మదిగా భూమ్మీదకు దిగింది. అందరినీ ఆ విమానం ఎక్కమని, బ్రహ్మ సభకు వెళ్లాలని అన్నాడు యముడు. అప్పుడు సక్తుప్రస్థుడు సకుటుంబంగా తనవారితో పాటు విమానం ఎక్కి వెళ్లిపోయాడు’.

ఇదంతా చెప్పిన ముంగిస ఇంకా ఇలా చెప్పింది. ‘సక్తుప్రస్థుడి దగ్గర జరిగినదంతా నేను గమనిస్తున్నాను. కన్నం నుండి వెలుపలికి రాగానే నా శరీరం మీద పేలపిండి సువాసన వ్యాపించి, అతిథి కాళ్లు కడిగిన నీటి తడి అంటుకొని సక్తుప్రస్థుడు చేసిన దానం మహిమ వల్ల నా తలా, శరీరం ఒకవైపున బంగారం అయ్యాయి. ఆనాటి నుండి నేను దానకార్యాలు జరిగే చోట్లకు, యజ్ఞాలు చేసే ప్రదేశాలకు వెళ్తున్నప్పటికీ రెండోవైపు బంగారం కాలేదు. ధర్మరాజు అశ్వమేధయాగం చేస్తుంటే విని ఇక్కడికి వచ్చినా నాకేమీ విశేషం కనపడలేదు. అందువల్ల పొలాల్లో రాలిన గింజలను ఏరుకొని తిని బతికిన ఆ బ్రాహ్మణుడి ధర్మంతో ఈ యజ్ఞం సాటికాదు అని అన్నాను’.

ఈ విధంగా పలికిన ముంగిస తాను ఎక్కడికి వెళ్లేది ఎవరికీ తెలియకుండా అదృశ్యమైపోయింది. పశు హింసా రూపమైన యజ్ఞం కంటే, అహింసా రూపమైన యజ్ఞం గొప్పదని ముంగిస చెప్పింది. అది కారణం వివరించకుండా చెప్పలేదు. తన తల, శరీరంలోని సగభాగం బంగారం కావడానికి కారణం చెప్పింది కాబట్టి దాని మాటలు అంగీకారయోగ్యమే. హింసలేని యజ్ఞం మన్నించ తగినది. ఉంఛవృత్తి అయిన బ్రాహ్మణోత్తముడు ప్రాణరక్షణార్థం సమకూర్చుకున్న పేలపిండిని అతిథికి సమర్పించాడు కాబట్టి అది గొప్ప విషయం.

ఇంతకీ ఈ ముంగిస ఎవరన్న సందేహం కలగవచ్చు. జమదగ్ని మహర్షి ఒకసారి శ్రాద్ధం చేయడానికి సంకల్పించాడు. అందమైన కొత్త కుండలో హోమధేనువు పాలు పిండి అనుకూల ప్రదేశంలో దాన్ని జాగ్రత్తగా వుంచాడు. అతడి మనస్సు పరీక్షించాలని క్రోధభూతం నిశ్చయించి పాలకుండను పడతోసింది. జమదగ్ని అది చూసి కూడా కోప్పడలేదు. తాను ఓడిపోయానని అంటూ ఆ భూతం తన తప్పు మన్నించమని జమదగ్నిని వేడుకుంది. భూతం ఏ తప్పూ చేయలేదని, వెళ్లమని అన్నాడు జమదగ్ని. పితృదేవతలు మాత్రం కోపగించి జమదగ్నిని ముంగిసై పుట్టామని శపించారు. శాపవిముక్తిని కూడా వారే చెప్పారు. ఏనాడైతే ముంగిస మహాధరాన్ని అధర్మంగా నిరూపిస్తుందో ఆనాడే శాప విముక్తి అన్నారు. ముంగిస సక్తుప్రస్థుడి కథ చెప్పి ధర్మరాజు అశ్వమేధయాగాన్ని ఆక్షేపించి, శాప విముక్తి పొందింది.  

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, అశ్వమేధపర్వం, చతుర్థాశ్వాసం

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)

Saturday, September 16, 2023

Preventing Extinction of Hereditary Professions (And Preparing them to Challenge Big Business) : Vanam Jwala Narasimha Rao

 Preventing Extinction of Hereditary Professions

(And Preparing them to Challenge Big Business) 

Vanam Jwala Narasimha Rao

The Hans India (17-09-2023) 

(It is sad reality of the times that despite liberal help from governments, such as those of Telangana, hereditary professions are being gobbled up by Big Business. Perhaps, it is time to make it mandatory by law to employ them, directly or indirectly by big business, both in their production centers and also in marketing outlets for gainful employment-Editor Hans India observations)

Gold, and Silver Shops, are now predominantly owned by Big Businessmen, instead of ‘Goldsmiths’ (Kamsali), a caste, traditionally engaged in working with gold, silver, and other precious metals by making ornaments since ages. Some Goldsmiths, work either directly or indirectly with these businessmen for trivial wages, while others, small in number, make inadequate livelihood on this. About 60-70 years ago, during our childhood, almost in every village, there lived a Goldsmith, Carpenter, Provisions Selling Vysya, Brahmin Pujari, Weaver, Blacksmith, Potter, Mochi, Bangle Seller etc. whose primary livelihood was hereditary vocation and by and large, satisfying needs of majority of villagers in their own way and with respect.   

It is a well-known fact that, Telangana Chief Minister K Chandrashekhar Rao has been implementing schemes for the welfare and upliftment of every section of society and economically weaker sections engaged in hereditary professions. For instance, Sheep distribution and large-scale assistance to weaving and Fish breeding sector form part of this. However, with passage of times, despite numerous financial assistance schemes of TS Government to hereditary professions, there exists gap and good number of artisans are unable to make both ends meet by depending on their vocations. This is resulting in migration to nearby towns and cities.  

For getting a Foot Finger Ring (Known as Mette) and Anklets repaired and help in wearing, when my wife approached a silver shop in Ameerpet (Hyderabad), shop owner entrusted the job to a person sitting in front of his shop, with required smithery equipment before him on a small table. In no time he did the job skillfully and helped in wearing them. He charged just hundred and fifty rupees. On enquiry he said with passion and proud on his face that he is a ‘GOLDSMITH,’ reminding the Telugu Proverb ‘KULAVRUTTIKI SATI LEDU GUVVALA CHENNAA’!!! (There is no equivalent to hereditary vocation or profession).

Rationale of the division into ‘Four Categories’ of occupations said to have been created in Ancient Vedic days, according to individual’s qualities and activities, supposed to be not according to birth, not static forever, and ever dynamic, is contentious, controversial, and debatable in modern days context. However, the purpose for which division was done, was successful in meeting the then existing social need and responsibility, which however is no more the case now.

Times have changed. No profession is monopoly now. Learning and reciting of Vedas is no more limited to Brahmin Community and whoever has passion, interest, eligibility, and ability may learn and even teach Vedas irrespective of caste. There is no restriction for any caste to opt for defense services or be in administration or management, in addition to Kshatriyas. Agriculture or business is no more the domain of a particular caste. In other words, to say, knowledge is nobody’s monopoly or domain now-all professions for all, irrespective of caste and class these days. 

However, diversification of trades in this fashion, implicitly affected adversely the Hereditary Professions and Few Backward Classes who mainly practiced and depended on them. In spite of enormous help by TS Government, preventing them from shifting to other professions for better livelihood has become a bit difficult. In a way times and socio-economic scenario also demand it. Purchaser of a product is also put to loss, since, affordability became expensive.

Years ago, there were not as many gold and silver shops as we see today. Goldsmiths living in villages, towns, and cities generally and also during auspicious occasions like marriages, were making ornaments, skillfully and with cent percent quality. For instance, the ‘Mangala Sutra’ and ‘Foot Finger Rings’ after making was over, the custom was to retain them with Goldsmith who would handover only few hours before marriage. Now everything is mechanized and unnaturalized. It is doubtful whether ornaments are handiwork of a Goldsmith or a machine made one!!! Equally doubtful is, to what extent Goldsmiths are engaged in making these now-a-days.

This is not the case with just goldsmiths. The village carpenter (Vadrangi) whose skill in making variety of agricultural implements like harvesters, drag, disc harrows, cultivators, seed drills, harrows, spades, ploughs etc. and also various parts of a bullock cart and the way they were assembled, especially the wheels made with Wood with iron rims, is a bygone history. Now for every agriculture related activity, from sowing to harvesting mechanization is in place, with machinery like Combine Harvester, Rotavator, Rototiller, Tractor Trailer, Power Harrow, Leveler, water bowser, ripper machine, disc harrow etc. have come. This resulted in most carpenters migrating to urban areas in search of alternative trades, except handful, whose data is not available.

In this context an acquaintance narrating his personal experience said, that, after he failed tenth class examination in 1977, took up his Hereditary Profession Carpentry with pride, in his native village, and soon established a ‘Khar Khana’ (Known as Dayi) from out of the income of making agriculture implements. He even performed marriages of his two sisters besides buying four acres of land. With the advent of first tractor in his village, he gradually lost his income and in no time propelled to move with family to Hyderabad with starving stomach. Competition from carpenters of other states in Hyderabad prevented him in securing gainful employment.

During our childhood, there used to be invariably a ‘Sale’ caste family in villages. Their traditional occupation was that of weaving. Most of the wear of locals, as well as bed sheets and a unique ‘Seven Cubits Blankets’ in pure white, which protected from sun and cold were their products. These have vanished now and except in few belts, mostly they moved to urban areas. TS Government did its best by setting textile hubs and marketing assistance for their products on a large scale besides subsidies in several forms. Every village had a ‘Darji’ (Tailor) who lost their occupation, due to advent of readymade cloths and exorbitant costs of tailoring material. These days to find a ‘Darji’ is a herculean task. Few highly skilled among them are employed by tailoring cum sales shops on a meagre salaries. No data seems to be available for these skilled persons also.    

 ‘Mochi’ who was traditionally making footwear to meet the needs of villagers, too, lost livelihood, as a result of Big Business, who took over their profession and do not even respectfully engage them. Hereditary profession of ‘Nayi Brahmins,’ who are engaged in barber work, has been calculatedly taken over by others on the stylish and attractive names such as beauty parlors, saloons, massage centers etc. with pure commercial objective. Despite Telangana Government’s support in various ways to saloons in villages, like free electricity, barbers too are migrating to urban areas. ‘Horse Shoe Making and Girding’ occupation, once profitable, is now languished.

The entire scenario, aptly recaps Great Indian Telangana Poet and Singer known for his works in Telugu literature, and National Sahitya Academy Awardee, MLC Gorati Venkanna’s song ‘Palle Kanneru Pedutundo’ (Village Sheds Tears) word by word, where he painfully describes the plight of Hereditary Professions of Goldsmith, carpenter, weaver, tailor, black smith etc. and their tools, not to speak of losing their livelihood and migrating to urban areas for diversification.

‘Alas! Big Business Reins where Traditional Hereditary Vocations Languish.’ Hereditary Professions are magnificently rejuvenated by TS Government, which no state has done. But, may be, an extra care of these is needed. Artisans’ skills need to be upgraded and multiskilled to suit the current needs and tastes of customers and to ‘Prepare to Challenge Big business.’ It may also be a good idea to make it mandatory by law to employ them, directly or indirectly by big business, both in their production centers and also in marketing outlets for gainful employment.

(The writer is Chief Public Relations Officer to the Chief Minister, Telangana)

 

Monday, September 11, 2023

సజీవ వాహిని సనాతన ధర్మం : వనం జ్వాలా నరసింహారావు

 సజీవ వాహిని సనాతన ధర్మం

వనం జ్వాలా నరసింహారావు

ఆంధ్రజ్యోతి దినపత్రిక (12-09-2023)

(సమస్త ప్రపంచంలో ప్రత్యేకత సంతరించుకున్న ఒక జీవన విధానమైన భారతీయ, హైందవ, వైదిక సంస్కృతిని మించిన ఉత్తమోత్తమమైన సనాతన ధర్మబద్ధమైన సంస్కృతి మరొకటి లేనే లేదు. ప్రపంచ సామాజిక వ్యవస్థలలో హిందూ వైదిక వ్యవస్థ ఒక ఉదాత్తమైన వ్యవస్థ. సార్వకాలికమై, శాశ్వతమై, స్థిరమై, యుగ, యుగాలుగా వర్ధిల్లుతూ, ఎన్ని సాంఘిక విప్లవాలొచ్చినా చెక్కు చెదరకుండా, నిశ్చలంగా, సజీవంగా వుంది. వేదకాలంనాటి నాస్తికుల నుండి, ఆధునిక కాలంనాటి అజ్ఞానుల వరకూ ఎందరు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని విధాలుగా సనాతన ధర్మాన్ని కించపరిచినా ఫలితం శూన్యమే, తాత్కాలికమే!-సంపాదకుడి వ్యాఖ్యానం)

సనాతన ధర్మంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ అజ్ఞానంతో, లేదా, మిడిమిడి జ్ఞానంతో చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా దుమారం, కలకలం రేగింది. పలు విమర్శలకు, ప్రతివిమర్శలకు దారితీసింది. సనాతన ధర్మాన్ని విషజ్వరాలతో పోలుస్తూ, దాన్ని నిర్మూలించాలని ఎంత అవివేకంతో, కుర్రతనంతో ఉదయనిధి వ్యాఖ్యలు చేశాడో, అదే మోతాదులో ఆయన్ను దుయ్యబడుతూ పలువురు మేధావులతో సహా ఎందరో ఆధ్యాత్మికవేత్తలు ప్రకటనలు ఇచ్చారు కాని, సనాతన ధర్మం పూర్వాపరాలు కాని, ఆద్యంతం లేని తత్సంబంధిత విషయాల ప్రస్తావన కానీ శాస్త్రీయంగా చేసే ప్రయత్నం జరగలేదేమో! ఉదయనిధి సౌమ్యంగా మాట్లాడారని ఆయనకు కితాబు ఇస్తూ, ఆయన పార్టీ ఎంపీ రాజా ఒక అడుగు ముందుకు వేసి, ఆయనకంటే అతి జుగుప్సాకరమైన వ్యాఖ్యలు సనాతన ధర్మాన్ని ఉద్దేశించి చేశారు. చివరకు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సహితం వారికి మద్దతుగా నిలిచారు. వ్యూహాత్మకంగా సనాతన ధర్మాన్ని అవహేళన చేస్తున్నట్లు అనుమానం కలుగుతున్నది.

సముద్రాల్లో అగాధాలు తెలుసుకోవడం ఎంత కష్టమో, వేదాలలో, ఉపనిషత్తులలో, అష్టాదశ పురాణాలలో, సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి, భీష్మాచార్యులు ధర్మరాజుకి, విశ్వామిత్రుడు శ్రీరాముడికి ప్రవచించిన ధర్మబోధనల్లో, మనుస్మృతిలో, ఇంకా ఇంకా అనేకానేక పౌరాణిక, ఇతిహాస గ్రంథాలలో, పలు సందర్భాలలో ప్రస్తావించిన సనాతన ధర్మాన్ని అర్థం చేసుకోవడం అంతకంటే ఎన్నో రెట్లు ఎక్కువ కష్టం. వ్యాఖ్యలు చేసిన ఉదయనిధి కాని, ఆయన్ను విమర్శిస్తున్న పలువురు కాని ఇది తెలుసుకోవాలి. ధర్మం సనాతనమైనా, అధునాతనమైనా, అర్థమైతే అది ధర్మమే! సనాతన ధర్మానికి, వేల సంవత్సరాలనాటి హైందవ ధర్మానికి, మనుధర్మానికి వ్యతిరేకం అని మాట్లాడుతున్న ఇలాంటి వ్యక్తులకు, సనాతన వైదిక ధర్మం అనాదిగా పరిమళిస్తున్న ఆధ్యాత్మిక సౌరభం అనే విషయం తెలియదు.

ఇలాంటి వారు ధర్మం, అధర్మం, పుణ్యం, పాపం, స్వర్గం, నరకం, జీవుడు, దేవుడు, బంధం, మోక్షం లాంటి ఎన్నో అలౌకిక విషయాలను తెలుసుకోవాలంటే మూర్ఖం వీడి, వేదంపై దృష్టి సారించాలి. చదివి, ఆసాంతం అర్థం చేసుకునే ప్రయత్నం చేసి, ఒక్కొక్క అంశం మీద అభిప్రాయం చెప్పాలికాని, గుడ్డ కాల్చి వేసినట్లు హిందువుల, భారతీయుల విశ్వాసాన్ని కించపరిచే విధంగా మాట్లాడడం సవ్యం, భావ్యం కాదు. వాస్తవానికి అన్ని ధర్మాలకు మూలం వేదం. అన్ని ఆచారాలకు అదే ప్రమాణం. అలాటి వేద నిబద్ధమైన ధర్మాన్నే, హిందూ సమాజానికి ప్రామాణికమైన గ్రంథాల ఆధారంగా, పవిత్ర సనాతన ధర్మంగా పలువురు విజ్ఞానులు విశదీకరించడం జరిగింది. దురదృష్టం ఏమిటంటే, హైందవ–వైదిక సంస్కృతిని, ఔన్నత్యాన్ని పరదేశీయులు గుర్తించినప్పటికీ, మన దేశంలో వున్న కుహనా విమర్శకులు వాటిని తూలనాడడం.

సదాచారం అంటే ఏమిటి? సమాజ శ్రేయస్సంటే ఏమిటి? ఉత్తమోత్తమమైన ధర్మమంటే ఏమిటి? ఎవరెవరు ఏ విధంగా తమ విధ్యుక్త ధర్మాలను త్రికరణ శుద్ధిగా ఆచరించాలి? క్షమాగుణం అంటే ఏమిటి? మనోనిగ్రహం ఎలాంటిది? శాస్త్ర విజ్ఞానం అంటే ఏమిటి? ఆత్మజ్ఞానం ఎలాంటిది? కాలానుగుణంగా స్త్రీ పురుష ధర్మాలు ఎలా మారుతాయి? వైవాహిక ధర్మం అంటే ఏమిటి? దాంపత్య ధర్మం ఎలా వుండాలి? తల్లిదండ్రులను, పెద్దవారిని, గురువులను ఎలా గౌరవించాలి? ఇలాంటివన్నీ సనాతన ధర్మంలో భాగాలే. ఇందులో విమర్శకులకు ఏ విధంగా తప్పు కనిపిస్తుందో తెలియదు.

వేదకాలం నాటి నుండీ యావత్ ప్రపంచంలో ప్రత్యేకత సంతరించుకున్న ఒక జీవన విధానమైన భారతీయ, హైందవ, వైదిక సంస్కృతిని మించిన ఉత్తమోత్తమమైన సనాతన ధర్మబద్ధమైన సంస్కృతి మరొకటి లేనే లేదు. ప్రపంచ సామాజిక వ్యవస్థలలో హిందూ వైదిక వ్యవస్థ ఒక ఉదాత్తమైన వ్యవస్థ. సార్వకాలికమై, శాశ్వతమై, స్థిరమై, యుగ, యుగాలుగా వర్ధిల్లుతూ, ఎన్ని సాంఘిక విప్లవాలొచ్చినా చెక్కు చెదరకుండా, నిశ్చలంగా, సజీవంగా వుంది. వేదకాలంనాటి నాస్తికుల నుండి, ఆధునిక కాలంనాటి అజ్ఞానుల వరకూ ఎందరు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని విధాలుగా సనాతన ధర్మాన్ని కించపరిచినా ఫలితం శూన్యమే, తాత్కాలికమే! దీనికి కారణం, దాని మూలాలు వేదాలలో సజీవంగా, అజరామరంగా, ఆచంద్రతారార్కంగా వుండడమే. ఆదిమధ్యాంతాలు లేనిదే వేదం, అందులో చెప్పిన సనాతన ధర్మం.

ఏది ఆర్య ధర్మమో, ఏది ఆర్ష ధర్మమో, ఏది సనాతన ధర్మమో, వీటిల్లో కానిదేదో నిర్ణయించే అర్హత ఎంతవరకుందో వీటిని గుడ్డిగా వ్యతిరేకించేవారు విజ్ఞతతో ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవడం మంచిదేమో! ఉదాహరణకు సృష్టి రహస్యం పరిపూర్ణంగా సమగ్రంగా విప్పగలవారెవరైనా వున్నారా? పోనీ తమకు తెలుసని ఇంతవరకు ఎవరైనా అనగలిగారా? విజ్ఞాన శాస్త్రం ఎంతగానో అభివృద్ధి చెందింది కదా? అయినప్పటికీ రోబోలను తయారుచేయగలిగారే కాని మానవ శరీర నిర్మాణానికి అసలు సిసలు నమూనా ఎవరైనా చేయగలిగారా? టెస్ట్ ట్యూబ్ బేబిని పుట్టించగలిగారు కాని, మానవ వీర్యం, అండం కలయిక లేకుండా దానిని సాధించగలిగారా? సృష్టి ఆదినుంచీ కొన్ని నియమాలు, నిబంధనలు, పద్ధతులు, ఆచరణలు, మంచీ, చెడులు, ఇలా ఎన్నో సనాతన సంప్రదాయాలు, ధర్మాలూ చోటుచేసుకుంటూ వస్తున్నాయి. వాటిలోంచి ఈకకు ఈక, తోకకు తోకా లాగి, లేని పాండిత్య ప్రదర్శన చేసి, సనాతన ధర్మాన్ని, సంస్కృతీ సంప్రదాయాలను, ఈసడించడం సమంజసం కాదేమో ఆలోచించుకోవడం మంచిది.

అనాదిగా సంస్కృతీ సంప్రదాయాలకు నిలయమైన భారతావనిలో ఎవరెవరు ఎటువంటి ధర్మాలను ఆచరించారనేదే ప్రధానం. వాటిని భావితరాల వారు ఎలా అర్థం చేసుకోవాలనేది ముఖ్యం. మన ఇతిహాసాలు, పురాణాలు, కావ్యాలు, వేదకాలంనాటి ధర్మశాస్త్రాలు చెప్పినదంతా బూటకం అని వాదించేకన్న అందులోని ధర్మాలను, అధర్మాలను అవగాహన చేసుకోవడం ముఖ్యం. ఉదాహరణకు, చాతుర్వర్ణ వ్యవస్థ తీసుకుందాం. దాని ప్రకారం బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే నాలుగు వర్ణాలు వాడుకలో వున్నాయి. దాని హేతుబద్ధత చర్చనీయాంశమైనప్పటికీ, సమాజం అభివృద్ధి చెందిన నేడు కూడా, సామాజిక అవసరాల దృష్ట్యా, నాలుగు కాదు, నలబై నాలుగుకు పైగా తరగతులుగా సమాజం విభజించబడి, విధులను నిర్వహించడం లేదా? ఏదేమైనప్పటికీ, చాతుర్వర్ణ వ్యవస్థను ఎవరు, ఎప్పుడు సృష్టించినప్పటికీ, అది ఎలా రూపాంతరం చెందినప్పటికీ, అది ఒకనాటి సామాజిక అవసరాన్ని, బాధ్యతను ఆ కాలంనాటి అవసరాలకు అనుగుణంగా నిర్వహించింది. ఇప్పుడు అది రూపాంతరం చెందింది.

ఒక ఆసక్తికరమైన విషయం, అయోధ్య వివాదంపై సెప్టెంబర్ 30, 2010 న వెలువడిన అలహాబాద్ హైకోర్ట్ సెక్యులర్ తీర్పు. సుదీర్ఘమైన ఆ తీర్పులో న్యాయమూర్తులు ఋగ్వేదం, కార్ల మార్క్స్, ఖురాన్, ఇక్బాల్, ప్రొఫెట్ మహమ్మద్, డార్విన్ లాంటి అనేక సనాతన, అధునాతన పుస్తకాల్లోని మహనీయుల మాటలను ఉటంకించారు. జస్టిస్ సుధీర్ అగర్వాల్ తన తీర్పు పాఠాన్ని ఋగ్వేదంలోని సంస్కృత శ్లోకాలతో ఆరంభించారు ఇలా: ‘ప్రళయావస్థలో శూన్యం తప్ప ఏమీ లేదు. కేవలం పంచ భూతాలు మాత్రమే వుండేవి. ఏ లోకమూ లేదు. భూమ్యాకాశాలూ లేవు. అలాంటప్పుడు ఎవరు ఎవరిని కదిలించారు? ఎలా కదిలించారు? అంతా అనిశ్చిత స్థితే!’ అని మొదలవుతుందా శ్లోకం.

అలా కొనసాగిస్తూ, జస్టిస్ సుధీర్ అగర్వాల్, చావు పుట్టుకలు అప్పుడు తెలియదని, సూర్యచంద్రులు వున్నారో, లేరో తెలియనందున రాత్రి, పగలు తేడా లేదని అంటూ, ఆ సమయంలో ఎవరికీ అంతుచిక్కని ఒక పర బ్రహ్మ స్వరూపం, తన శక్తితో సృష్టి ప్రక్రియను ప్రారంభించాడని, ఆ శక్తికి అతీతమైంది మరేదీ లేదని పేర్కొన్నారు. ‘సృష్టికి పూర్వం అంతా శూన్యమే. అంతా చీకటిమయం. అంతటా జలమయం. సృష్టి ఎలా, ఎప్పుడు ప్రారంభమైందో ఎవరికీ తెలియదు. అన్నీ తెలిసిన పండితులకు, మేధావులకు కూడా తెలిసే అవకాశం లేదు-ఎందుకంటే వారంతా సృష్టి తర్వాతే పుట్టారు కనుక. సృష్టికి కారకుడైన ఆ శక్తే సృష్టిని కొనసాగిస్తున్నదా, లేక, మరెవరన్నా చేస్తున్నారా? అనేదీ అంతుచిక్కని విషయమే. అసలా శక్తికి కూడా తెలుసో, లేదో?’ అని ఆరంభించి, వివాదం విషయం ప్రస్తావిస్తారు న్యాయమూర్తి అగర్వాల్.

హిందూత్వ, వైదిక, సనాతనధర్మ వేదాంతం ప్రకారం, ఈ సకల చరాచర ప్రపంచమంతటికీ, భూతకాలంలో జరిగిన దానికీ, వర్తమానంలో జరుగుతున్న దానికీ, భవిష్యత్‌లో జరగబోయే దానికీ, కర్త, కర్మ, క్రియ ఒక్కడేనని, ఏ పనిని, ఎప్పుడు, ఎలా, ఎవరి ద్వారా జరిపించాలో, జరిగినదాని పర్యవసానం ఏమిటో, లాభ నష్టాలేంటోనన్న విషయాలను నిర్ణయించే అధికారం ఒకే ఒక్కరికి వుందని అర్థం చేసుకోవాలి. సృష్టించేది బ్రహ్మనీ, సంహరించేది రుద్రుడనీ, కాపాడుతుండేది విష్ణుమూర్తనీ చెప్పినప్పటికీ, బహుశా అనంత కోటి బ్రహ్మాండానికి ‘పరబ్రహ్మం’ ఒక్కరే అయుండాలి. ఆ ఒక్కరికి సమానులు గానీ, అధికులు గానీ ఎవరూ వుండరు. గడ్డిపోచ కదలాలన్నా ఆ ఒక్కరే కారణం. ఆ ఒక్కరే, మిగతా ఇద్దరినీ నియమించాడు. బ్రహ్మ, రుద్రులు నిమిత్తమాత్రులే.

ఎవరికీ అర్థం కాని, చేసుకోలేని, ‘జగన్నాటక సూత్రధారి’ స్వయంగా రచించి, నిర్మించి, దర్శకత్వం వహించిన భారీ సెట్టింగుల నిడివిలేని అద్భుతమైన నాటకంలో, సకల చరాచర ప్రపంచంలోని జీవ, నిర్జీవ రాసులన్నీ తమవంతు పాత్ర పోషించాయి. ఆ ఒక్కరు ఎవరికి ఏ పాత్ర ఇస్తే, దాన్ని వారు ఆయన దర్శకత్వం మేరకే పోషించి, ఆగమన్నప్పుడు ఆగి, జీవితం చాలించాలి. ఆ తర్వాత ఏం జరుగుతుందనేది మళ్లీ ఆయన నిర్ణయానికే వదలాలి. ఉదాహరణకు బ్రహ్మనే తీసుకుందాం. బ్రహ్మ ప్రతి కల్పంలో మళ్లీ, మళ్లీ సూర్యచంద్రులను సృష్టిస్తుంటాడు. ఒక కల్పంలో జరిగినట్లే, ఇంచుమించు కొంచెం తేడాతో ప్రతి కల్పంలో జరుగుతుంది. ప్రకృతి స్థితిగతులన్నీ ఒకే విధంగా వున్నా, జీవులు మాత్రం మారుతుంటారు. గతించిన కల్పంలోని సూర్యచంద్రుల వలెనే ఆకారాలు కలిగి, అవే పనులను చేస్తుంటారు. ఆ కల్పంలోని సూర్యుడి జీవాత్మ తర్వాత కల్పంలోని సూర్యుడి జీవాత్మ ఒకటి కాదు. ఆ జీవాత్మకు ఉన్నతమైన స్థానం దొరికి, ఆ స్థానంలోకి అర్హులైన మరొకరు వస్తారు. సనాతన ధర్మం అర్థం చేసుకుంటే ఈ ఏర్పాటు అర్థం అవుతుంది.

హైందవ మతాన్ని ‘ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా’ (బ్రిటానికా విజ్ఞాన సర్వస్వం) వివరిస్తూ ఈ మతం ప్రపంచంలోనే ప్రముఖమైన మతం అని పేర్కొంటూ, ఇది భారత ఉపఖండంలో ఉద్భవించిందని ఉద్ఘాటించింది. ప్రపంచంలోనే ఇది అతి ప్రాచీనమైన మతంగా పేర్కొంది. సంస్కృతంలో, ఇంకా అనేక ప్రాంతీయ భాషలలో హైందవానికి సంబంధించి చాలా పవిత్ర గ్రంథాలు ఉన్నాయని పేర్కొంటూ, అవి ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు హైందవ మత ప్రచారానికి ఎంతో దోహదం చేశాయని ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా వివరించింది. ఈ ప్రచారంలో ఆచారాలు, దృశ్య, లలిత కళలు కూడా ప్రముఖ పాత్ర పోషించాయని పేర్కొంది. హైందవ మతాన్ని ప్రపంచవ్యాప్తంగా వంద కోట్ల మంది ఆచరిస్తున్నారని, భారత జనాభాలో 80 శాతం మంది ఈ మతానికి చెందినవారే అని చెబుతోంది. ప్రపంచవ్యాప్తంగా విస్తరించినా, ప్రాంతీయ ప్రామాణికతల ఆధారంగానే ఈ మతం గురించి మరింత అవగాహన ఏర్పడుతుందని పేర్కొన్నది. ఇదీ సనాతన ధర్మానికి అరుదైన గుర్తింపు. విమర్శకులకు ఎందుకు అర్థం కాదో? ఏదేమైనా ధర్మం సనాతమైనా, అధునాతనమైనా, అర్థమైతే అది ధర్మమే!

Sunday, September 10, 2023

వేదోక్తంగా, శాస్త్రోక్తంగా ధర్మరాజు అశ్వమేధయాగం నిర్వహించిన వేదవ్యాస మహర్షి ..... ఆస్వాదన-137 : వనం జ్వాలా నరసింహారావు

 వేదోక్తంగా, శాస్త్రోక్తంగా

ధర్మరాజు అశ్వమేధయాగం నిర్వహించిన వేదవ్యాస మహర్షి

ఆస్వాదన-137

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (11-09-2023)

అశ్వమేధయాగానికి సర్వ సన్నద్ధమైన ధర్మరాజు దీక్ష చేపట్టాల్సిన రోజు రానే వచ్చింది. దైవజ్ఞులు నిర్ణయించిన శుభ ముహూర్తంలో వ్యాసుడు మొదలైన ఋత్విజులు వేదోక్తంగా ధర్మరాజును యజ్ఞదీక్షితుడిగా చేశారు. పట్టుబట్టా, నల్లయిర్రితోలు ధరించి ధర్మరాజు యజ్ఞదండాన్ని చేపట్టాడు. ఆ తరువాత వేదవ్యాసుడు శాస్త్రోక్తంగా వదిలిపెట్టిన ఉత్తమాశ్వం బయల్దేరింది.

(ఈ సందర్భంగా అశ్వమేధయాగాన్ని గురించి నాగళ్ల గురుప్రసాదరావు గారు చాలా చక్కగా, ఇలా వివరించారు. గుర్రాన్ని బలి పశువుగా చేసి సార్వభౌముడు చేసే యజ్ఞ విశేషం అశ్వమేధం. దీన్ని చైత్రమాసంలో పూర్ణిమనాడు ఆరంభించాలి. యజ్ఞం ఆరంభమయ్యే మొదటి సంవత్సరంలో చైత్ర పూర్ణిమనాడు సార్వభౌముడు సాంగ్రహణం అనే ఒక యజ్ఞాన్ని జరిపించి, మరునాడు బ్రహ్మౌదనం మొదలైన కర్మలు చేసి, గుర్రాన్ని వదలాలి. ఆ యజ్ఞాశ్వం స్వేఛ్చగా తిరుగుతుంటే రాజపుత్రులు మొదలైనవారు దానిని వెంబడించాలి. వదిలిన సంవత్సరంలో పదకొండు నెలలు గడిచిన తరువాత అశ్వాన్ని తోలుకొని వచ్చి రావిచెట్ల తోపులో బంధించాలి. పన్నెండో నెలలో యజ్ఞ సామాగ్రిని సంపాదించి ఫాల్గునమాసంలో అమావాస్యనాడు సార్వభౌముడు ఋత్విజులతో కూడి యజ్ఞశాలలో ప్రవేశించాలి. రెండో సంవత్సరం మొదటి పాడ్యమి మొదలు అశ్వమేధయాగం ఆరంభించి, ఏడు రోజులు హోమం చేసి పూర్ణాహుతి చేయాలి. గుర్రాన్ని రథకారుడి గృహంలో బంధించి బ్రహ్మ మొదలైన ఋత్విజులు నలుగురూ మంత్రాలు చెప్పి హోమం చేస్తారు. తరువాత సోమలతకు కొన్ని క్రియలు జరిపి సోమపానం చేస్తారు).

అర్జునుడు వేదోక్తంగా ధర్మరాజు వీడ్కోలు పొంది గాండీవాన్ని ధరించి గుర్రాన్ని అనుసరించాడు. యాజ్ఞవల్క్య శిష్యుడు మార్గమధ్యంలో అవసరమైన పనులు నిర్వహించేందుకు బ్రాహ్మణులతో కలిసి అర్జునుడి వెంట వెళ్లాడు. యాగాశ్వం ఉత్తర దిక్కుగా పోతూ, త్రిగర్త దేశంలో ప్రవేశించింది. త్రిగర్త దేశాధిపతి కుమారులు, మనుమలు గుర్రాన్ని బంధించడానికి వచ్చారు. అర్జునుడు వారికి నచ్చ చెప్పే ప్రయత్నం చేశాడు. ధర్మరాజు చెప్పినట్లే యుద్ధం తప్పిపోయే విధంగా వారితో మాట్లాడాడు. వారు సూర్యవర్మ అనే రాకుమారుడిని సేనాపతిగా చేసుకున్నారు. అతడు, అతడి తమ్ములు కేతువర్మ, ధృతవర్మ అర్జునుడి మాటలు వినకుండా బాణాలు ప్రయోగించారు. అర్జునుడి పిడికిలి పట్టుతప్పి గాండీవం భూమ్మీద పడింది ఒక సమయంలో. అదే అదనుగా త్రిగర్త సైన్యం అర్జునుడికి ఒక్కసారి ఎదుర్కొన్నారు. భూమ్మీద పడిన గాండీవాన్ని పైకి తీసుకొని అర్జునుడు ఒక్కసారిగా విజృంభించాడు. త్రిగర్త సేనలు చెల్లాచెదరై పారిపోయాయి. అర్జునుడి శరణు కోరారు. వారిని బుద్ధిగా వుండమని చెప్పి అర్జునుడు యజ్ఞాశ్వాన్ని వెంబడించాడు.

అశ్వం ప్రాగ్జ్యోతిషపురం వచ్చింది. ఆ సమాచారం విన్న భగదత్తుడి కుమారుడు వజ్రదత్తుడు గుర్రాన్ని తీసుకొనిపోయాడు. అర్జునుడికి, వజ్రదత్తుడికి నాలుగురోజులకు పైగా యుద్ధం జరిగింది. అర్జునుడు వజ్రాయుధంతో సమానమైన బాణాన్ని భీకరంగా ప్రయోగించి వజ్రదత్తుడిని ఓటమి పాల్చేశాడు. ధర్మరాజు ఆజ్ఞానుసారం రాజకుమారుడిని అశ్వమేధయాగానికి రమ్మని ఆహ్వానించి అక్కడి నుండి యజ్ఞాశ్వాన్ని వెంబడిస్తూ బయల్దేరాడు అర్జునుడు. యజ్ఞాశ్వం సింధుదేశంలో సంచరిస్తున్నప్పుడు ఆదేశ వీరుల కుమారులు పూర్వ వైరాన్ని తలచుకొని అర్జునుడి మీద దండెత్తారు. అర్జునుడు విజృంభించి పోరాడాడు. సింధురాజపుత్ర సైన్య వీరులు దురవస్థలపాలై నలుదిక్కులకు పారిపోయారు. అప్పుడు దుశ్శల మనుమడితో పాటు అర్జునుడిని చూడడానికి వచ్చింది అక్కడికి. బాలుడిని కాపాడమని అర్జునుడిని వేడుకొన్నది. తన భర్త సైంధవుడు చేసిన అపకారం మరచిపోమ్మన్నది. అర్జునుడు అభయమివ్వగా దుశ్శల సైన్యాలను వెంటబెట్టుకొని వెళ్లిపోయింది.

అర్జునుడు అక్కడినుండి బయల్దేరి యజ్ఞాశ్వం వెంట తిరుగుతూ మణిపురం అనే పట్టణం చేరుకున్నాడు. ఆ నగరాదిపతైన బభ్రువాహనుడు తన తండ్రి రాకను విని సవినయంగా వచ్చి అర్జునుడి కాళ్లకు మొక్కాడు. అయితే అర్జునుడు బభ్రువాహనుడిని ఆదరించలేదు. ‘పౌరుష గుణహీనా’ అని సంబోధిస్తూ, యజ్ఞాశ్వాన్ని ఎందుకు బంధించలేకపోయావని ప్రశ్నించాడు. చేతకాని తనంతో రాజధర్మానికి తిలోదకాలిచ్చావని నిందించాడు. అదే సమయంలో నాగలోకం నుండి వచ్చిన బభ్రువాహనుడి తల్లి ఉలూపి, తండ్రి ఆనతి ప్రకారం అతడితో యుద్ధం చేయమని ఆదేశించింది. బభ్రువాహనుడు రాజలాంఛనాలతో తల్లిని తన మేడమీదికి పంపి, గుర్రానికి అడ్డుపడి, అర్జునుడితో యుద్ధానికి తలపడ్డాడు. ఇద్దరికీ ఘోర యుద్ధం జరిగింది. బభ్రువాహనుడు ప్రయోగించిన బాణం అర్జునుడి హృదయంలో నిలవక అతడి వీపునుండి దూసుకొని పోయింది. అర్జునుడు భూమ్మీద పడిపోయాడు. అర్జునుడి బాణాల దెబ్బలకు బభ్రువాహనుడు కూడా నేలకూలాడు.

తన భర్త, కుమారుడు నేలకూలారన్న వార్త విని చిత్రాంగద దుఃఖంలో మునిగి పోయింది. వెంటనే ఉలూపి కూడా అక్కడికి వచ్చి భర్తను, కుమారుడిని చూసి మూర్ఛపోయింది. తరువాత తేరుకుంది. అలా జరిగినందుకు ఉలూపిని నిందించి, భర్తను బతికించమని ప్రార్థించింది చిత్రాంగద. ఇంతలో బభ్రువాహనుడు తేరుకొని లేచి జరిగినదానికి విలపించాడు. ప్రాయోపవేశం చేయడానికి సిద్ధమయ్యాడు. అతడికప్పుడు యాజ్ఞవల్క్య శిష్యుడు కనిపించాడు. ఇంతలో ఉలూపి ఆర్జునుడిని బతికించడానికి సంజీవన మణిని స్మరించింది. వెంటనే ఆ మణి ఉలూపి అరచేతిలో నిలిచింది. అప్పుడామె బభ్రువాహనుడిని చూసి అతడి శక్తి పరీక్షించడానికే తాను ఇదంతా కావాలని చేశానని, అర్జునుడు మూర్ఛపోయే విధంగా మాయా ప్రయోగం చేశానని, తన చేతిలోని మణిని అర్జునుడి హృదయస్థానం మీద పెట్టమని అతడికి చెప్పింది. బభ్రువాహనుడు ఆమె చెప్పినట్లే చేయగా అర్జునుడు బతికి లేచి కూచున్నాడు. బభ్రువాహనుడు జరిగినదంతా వివరించాడు. బభ్రువాహనుడిని తల్లులు ఉలూపి, చిత్రాంగదలతో సహా అశ్వమేధయాగానికి రమ్మని ఆహ్వానించాడు అర్జునుడు.

ఆ తరువాత అర్జునుడు యజ్ఞాశ్వాన్ని వెంబడిస్తూ పోసాగాడు. గుర్రం రాజగృహం చేరింది. ఇది తెలిసి ఆ నగరాధిపతైన జరాసంధుడి మనుమడు మేఘసంది అర్జునుడిని యుద్ధానికి ఆహ్వానించాడు. మేఘసంది ఓటమి దిశగా పోతున్నప్పుడు, అర్జునుడు తన అన్నగారైన ధర్మరాజు చెప్పిన మాటలు మేఘసందికి చెప్పాడు. ఎవరి ప్రాణాలకూ ధర్మరాజు మాట ప్రకారం హాని చేయనని, ఇక యుద్ధం చాలించమని సలహా ఇచ్చాడు. అర్జునుడు చెప్పిన ఆ మాటలు అంగీకరించిన మేఘసంది, అతడి పాదాలకు మొక్కాడు. అందరిని ఆహ్వానించినట్లే మేఘసంధిని కూడా అశ్వమేధయాగానికి రమ్మని పిలిచాడు.

యజ్ఞాశ్వం చేదిదేశం ప్రవేశించినప్పుడు శిశుపాలుడి కుమారుడు శరభుడు మొదలు యుద్ధం చేసినప్పటికీ, తరువాత అర్జునుడిని ఆశ్రయించి పూజలు చేశాడు. అర్జునుడు ఆ తరువాత వరుసగా టెంకణాదిపతి కిరాతరాజును, కోసల దేశీయులను, కాకదేశవాసులను, దశార్ణదేశాధిపతిని, నిశాదరాజును, పౌండ్ర, ఆంధ్ర, ద్రావిడ, కేరళ, కర్ణాట రాజులను గెలిచాడు. గుర్రం ద్వారకకు చేరినప్పుడు యాదవులు అర్జునుడిని పూజించారు. ఆ తరువాత యజ్ఞాశ్వం పశ్చిమ సముద్ర తీర దేశాలలో సంచరించి పాంచాల దేశం మీదుగా గాంధార దేశం ప్రవేశించింది. అక్కడి రాజైన శకుని కుమారుడు యుద్ధం చేసి ఓటమి పాలయ్యాడు.

ఆ తరువాత అర్జునుడు అనుసరిస్తున్న యజ్ఞాశ్వం హస్తినాపురం వైపు వెళ్లడం మొదలు పెట్టింది. ఆయన రాక గూఢచారుల ద్వారా విన్న ధర్మరాజు, ధర్మప్రకారంగా అర్జునుడు ఆశ్వరక్షణ చేసినందుకు పరమానందం పొందాడు. ఆ రోజు మాఘమాసంలోని పూర్ణిమ. తమ్ములను పిలిపించి ధర్మరాజు అర్జునుడి రాక తెలియచేశాడు వారికి. చైత్ర మాసం సమీపిస్తున్నందున అన్ని రకాల సదుపాయాలను ఏర్పాటు చేయించమని భీముడిని ఆజ్ఞాపించాడు. భూమండలంలోని రాజులందరినీ ఆహ్వానించమని చెప్పాడు. ఆహ్వానాన్ని అందుకొని బ్రాహ్మణులు, రాజులు, మునులు హస్తినాపురం చేరుకున్నారు. అందరికీ అన్ని రకాల సదుపాయాలను ఏర్పాటు చేశారు ధర్మరాజాదులు. యజ్ఞశాల నిర్మాణం లాంటి పనులు చకచకా జరిగాయి. అప్పుడే శ్రీకృష్ణుడు సాత్యకి, బలరామాది యాదవులతో కూడి వచ్చాడు. అర్జునుడు ఆహ్వానించిన రాజులంతా రాసాగారు. ఇంతలో ఒక దూత వచ్చి ధర్మరాజుకు నమస్కారం చేసి, అర్జునుడు నగరానికి దగ్గరలో వున్నాడని, మర్నాటికల్లా హస్తినకు చేరుకుంటాడని చెప్పాడు. అర్జునుడు యజ్ఞాశ్వాన్ని వెంబడిస్తూ అనుకున్న విధంగానే పట్టణానికి వచ్చాడు.

అర్జునుడి రాకను నగరమంతా చాటింపు వేసి చెప్పారు. పౌరజనులు ఆర్జునుడిని పొగడసాగారు. వారి మాటలకు అర్జునుడి మనస్సు సంతోషించింది. ముందు గుర్రం నడుస్తుండగా యజ్ఞశాలకు వచ్చాడు. ఆ తరువాత యజ్ఞయోగ్యమైన రోజు వచ్చింది. వ్యాసుడు వచ్చి ధర్మరాజుతో యజ్ఞం చేయడానికి పూనుకొమ్మని చెప్పాడు. అతడికి సమస్త శుభాలు కలుగుతాయని అన్నాడు. ధర్మారాజు దీక్ష వహించాడు. ఋత్విజులు శాస్త్రోక్తంగా యజ్ఞకార్యకలాపాన్ని నడిపారు. యజ్ఞం ప్రకాశించింది. ఋత్విజులు ప్రవర్గ్యమనే యజ్ఞాంగాన్ని చేశారు. మంత్రపూతంగా సోమరసం పిండారు. సవన కర్మం ఆచరించారు. వేదశాసనం ప్రకారం సమస్తం నిర్వర్తించారు. భీముడి పర్వవేక్షణలో, ఆయన కనుసన్నల్లో, వచ్చిన వారికి ఎవ్వరికీ ఏలోపం కలగకుండా ఏర్పాట్లన్నీ జరిగాయి.

ఋత్విజులు బంగారు ఇటుకలతో నాలుగు వరసలు పేర్చి, గద్ద ఆకారంలో యజ్ఞవేదిని నిర్మించారు. యూప ప్రతిష్ట చేశారు. యూపాలకు బలిపశువులను కట్టారు. యజ్ఞాశ్వాన్ని ఉత్తమ యూపానికి కట్టారు. దాని చుట్టూ పశు సమూహాన్ని నిలిపారు. అశ్వమేధ కర్మకాండ చేసే ఋత్విజుల బృందానికి వేదవ్యాసుడి శిష్య సమూహం నాయకత్వం వహించింది. ఋత్విజులు యజ్ఞాశ్వంతో సహా సర్వ జంతువులను చంపి వండారు. ద్రౌపదితో కూడా హోమం చేయించారు. అలా వేదవ్యాసుడు సకల లోకాలకు శ్రేయస్సు సమకూరేట్లు ధర్మరాజు అశ్వమేధయాగాన్ని నిర్వహించి, ఉదాత్త స్వరంతో యజమానిని దీవించాడు. దేవర్షులంతా ధర్మరాజును ఆశీర్వదించారు. ధర్మరాజు సదస్యులకు వేయికోట్ల టంకాలు దక్షిణలుగా ఇచ్చాడు.

బ్రహ్మజ్ఞాన మహాత్త్వంతో ప్రకాశించే వేదవ్యాస మహర్షికి తన భూమండల సామ్రాజ్యాన్నంతా సమర్పించాడు ధర్మరాజు. భూమిని స్వీకరించిన వ్యాసుడు ధర్మరాజుతో, బ్రాహ్మణ ప్రకృతి కలిగిన తాము బంగారాన్ని కోరుతామని, కాబట్టి భూమికి వెలగా దాన్నే ఇవ్వడం శ్రేయస్కరమని చెప్పాడు. బ్రహ్మస్వాన్ని తిరిగి ఎలా తీసుకొంటానని ప్రశ్నించాడు ధర్మరాజు. ఆ మాటలకు ఆకాశవాణి ఆయన్ను ప్రశంసించింది. తాము భూమిని అమ్ముతామని, ధర్మరాజు దానం ఇచ్చి కొనడం సమంజసమైన పద్ధతే అవుతుందని, దాంట్లో తప్పు లేదని, బ్రాహ్మణుల కోరిక నెరవేర్చి సంతోషంగా పంపమని వ్యాసుడు సమాధానం ఇచ్చాడు. వ్యాసుడు చెప్పినట్లే చేయమని కృష్ణుడు కూడా చెప్పాడు. కోటికోట్ల టంకాలు భూమి వెలగా నిర్ణయించారు. ఆ ధనరాశిని ఋత్విజుల బృందానికి పంచాడు వ్యాసుడు. బంగారంతో చేసిన యజ్ఞశాల తదితర సామగ్రిని బ్రాహ్మణులకు సమర్పించాడు ధర్మరాజు. ఆ తరువాత క్షత్రియులకు, వైశ్యులకు, శూద్రులకు కూడా సువర్ణ దానం చేశాడు. వేదవ్యాసుడు తన భాగమైన బంగారాన్ని కుంతికివ్వగా ఆమె ధర్మకార్యాలకు ఉపయోగించింది.  

ధర్మరాజు బంధువులతో, రాజులతో కలిసి యజ్ఞాంత స్నానం చేశాడు. వ్యాసుడికి సాష్టాంగ నమస్కారం చేశాడు. ఆ తరువాత మహర్షి శిష్యులతో సహా అదృశ్యుడయ్యాడు. వచ్చిన రాజులందరికీ ధర్మరాజు నగలూ, నాణ్యాలూ, బహుమానాలూ ఇచ్చాడు. ధర్మరాజు ఆవిధంగా రాజులందరినీ సంతోషపెట్టి వీడ్కోలు పలికాడు. కృష్ణుడికి ఉత్తమోత్తమ కానుకలిచ్చి పూజించాడు. బలరాముడని, సాత్యకిని సముచితంగా గౌరవించాడు. వారంతా ద్వారకకు వెళ్లిపోయారు. ఆ తరువాత ధర్మరాజు స్వగృహం చేరుకున్నాడు.

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, అశ్వమేధపర్వం, చతుర్థాశ్వాసం

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)

Saturday, September 9, 2023

IN THE MIDDLE OF NOWHERE ..... Parties pay lip service, do little for middle class : Vanam Jwala Narasimha Rao

 IN THE MIDDLE OF NOWHERE

Parties pay lip service, do little for middle class

Vanam Jwala Narasimha Rao

The Hans India (10-09-2023)

(Manifestoes of most parties, by a striking coincidence, advocate prosperous economy, better deal for young and old people, unemployed youth, farmers, women, and in a nutshell equal opportunities for all etc. but, in letter and spirit do not cater to Middle Class. This is contrary to principle of equal opportunity, equitable distribution of wealth, basic economic, social insurance, and social security to all citizens, adversely affecting 60% and above Middle Class-Editor, Hans India observation)

Since First General Elections held in 1951-52, when Elections to most state legislatures also took place simultaneously, many Governments, both at the Center and States, representing National and Regional Parties ruled ‘India, that is Bharat.’ These Governments at times included coalition of either pre poll or post poll alliances, with namesake Common Minimum Program and with no profound ideology. Voters were swayed and mislead with impracticable and unattainable promises by Political Parties in their Manifestoes, barring few, and blindly believing them, they were voted to power, often, successively for more than one term.

Obviously, this is the beauty of the ‘Largest Parliamentary Democracy,’ that is India. However, lately, conscious voters are choosy and demanding in their choice of preference, in critically assessing poll promises, and electing their representatives. They are no more taken for granted!!  

Modi Government recently has constituted a Committee, unpredictably and with no such precedent, headed by former President Ram Nath Kovind, to explore possibility of ‘One Nation, One Election,’ ahead of a Special Session of Parliament from September 18 to 22. Assembly polls are due in five states in November-December 2023 followed by Lok Sabha Elections in May-June 2024. Possibility of combining General Elections and 9-12 States’ Polls, which are scheduled either before or after Lok Sabha Elections, that includes Telangana, cannot be ruled out, as it appears now, notwithstanding merits, demerits, and vociferous objections from opposition parties in doing so. Political Analysts view this as piloting Modi’s Master Stroke Plan of ‘One Nation, One Election’ of holding simultaneous elections for Lok Sabha and State Assemblies across the country.

Meanwhile, amid uproar over this, Chief Election Commissioner (CEC) Rajiv Kumar said in Bhopal, that, the Election Commission of India is ready to conduct elections as per legal provisions, that mandates it to do so. Rajiv Kumar said Commission’s duty is to hold elections before the term as per Constitutional Provisions and Representation of the People Act, which also authorizes to hold them 6 months earlier. This holds good for State Assemblies also, said CEC. This reiterates possibility of holding elections at the earliest, for which one needs to wait for announcement of modalities.

Either way, the process of drafting Manifestoes by Political Parties will commence. Any Scientific Need Analysis, even by the recently sprouting and apparent Political Strategists, has not been done as to what exactly to be included in Pol Manifesto. The moral system founded by English Philosopher Jeremy Bentham and encapsulated in the Principle of 'The Greatest Good for the Greatest Number.' was seldom adhered. These ‘Cut and Paste’ self-styled strategists, comprising of highly paid team, posing themselves as Professionals and Intellectuals, without having even basic knowledge of pulse of voter, geographical area, historical and current background of the state, for which they draft ‘Political Strategy,’ often mislead even the best of the experienced and saucerful political bigwigs. Harsh Reality is, success in elections is not based on their advice, but hundred percent to the credit of leader who led his or her party to victory.  

Despite 75 years of Independence, daily Essential Needs of Middle Class, not to speak of even BPL families, are hardly met. What people by and large and Middle Class in particular, need is, a ‘Safety Net’ of meeting their requirements of Minimum Essential Commodities, in an ‘Accessible, Affordable, and Acceptable’ Way. No concerted effort was made to include this aspect in Poll Manifestoes. Some Political Parties like BRS, however, presented ‘Best of the Manifestoes’ of its kind, with umpteen Welfare and Development Schemes, and besides implementing them, gone beyond implementing extra schemes, not included in Manifesto, a rare exception. This credibility among voters enabled it to win elections successively. The case with other parties, is the other way round, who just end up making false promises in manifestoes and still win elections. A Dichotomy!!! And that is Indian Politics and Democracy!!!

The question is, what could be the basic minimum needs of Middle Class in the changed and ever-changing socio-economic scenario and how to make these needs available and accessible in a manner acceptable to majority. Some of these may sound funny, trivial, and even ridiculous, but they form part of daily life as Minimum Essential Commodities, without which living becomes difficult, and which are highly expensive and not beyond reach of a common man, particularly the Lower Middle Class, Middle Class and Upper Middle-Class Public, whose percentage is more than 60 according to rough estimates. 

For instance, beginning with the day, the ‘Tooth Brush and Paste’ even of an ordinary quality is expensive and not affordable. For having a cup of coffee or tea, cost of milk and coffee or tea powder is expensive and not affordable. Raw material to make any item for breakfast is very expensive and not affordable. Rice, wheat, eggs, vegetables, oil, ghee, and every other ingredient required for lunch or dinner is very expensive and not affordable. For a change If anyone prefers to go to even an ordinary hotel, it is more expensive and not affordable.

Drinking water, coconut oil, soap, handwash, gas cylinder, lifesaving medicines etc. etc. are highly expensive and not affordable. Expenditure on Education and Health is exorbitant. The list is inexhaustive and these are the ‘Essential Needs’ to be included in manifesto to provide them easily accessible and available at affordable prices in Government Run Fair Price Shops. This would go a long way in benefiting Middle Class and also the BPL. By and large, in addition to these, every need connected to Health, Education, Food, Shelter, and Clothing etc. of Middle Class is equally important and to be Essentially Prioritized in Manifestoes.

For generations Indian Middle Class, a catalyst in the society, fashioned and nurtured by Colonial British Raj, remained as a Holy, sacred, and ill-fed Cow! Manifestos since first General Elections never gave priority to Middle Class. Welfare Measures for poor and BPL families and number of sops through financial institutions to rich was later development. Political Parties, Leaders, Civil Society Organizations and even Courts stand for marginalized people safeguarding their interests. Rich Corporates are also taken care of because of their wealth. But none voice for Middle Class and there is none to speak or plead on behalf of them barring for voting!!!

The biggest problem for Middle Class since ages has been the limbo in which they are stuck forever. They are neither rich nor poor. They do not have access to subsidies that poor get. They do not have adequate income to meet their daily basic minimum needs. Middle Class pays most tax, and yet, are the ones that receive least amount of benefits. They have to put in large hours of work so that they can give their family comparatively a good life. Their social status too has been static for centuries.

Manifestoes of most parties, by a striking coincidence, advocate prosperous economy, better deal for young and old people, unemployed youth, farmers, women, and in a nutshell equal opportunities for all etc. but, in letter and spirit do not cater to Middle Class. This is contrary to principle of equal opportunity, equitable distribution of wealth, basic economic, social insurance, and social security to all citizens, adversely affecting 60% and above Middle Class. Election Manifesto, a written platform, assertive design, plan, strategy, approach, and philosophy of a political party, outlining its aims, objectives, ideology, intentions, views, policies, programs etc. shall reflect interests of Middle Class as an ‘Essentially High Precedence.’ Hence, in Poll Manifestos in Future, Middle Class Welfare to be Essentially Prioritized.

(The writer is Chief Public Relations Officer to Chief Minister Telangana)