Monday, June 15, 2015

సెక్షన్ 8 అవినీతికి రక్షణా?

సెక్షన్ 8 అవినీతికి రక్షణా?
నమస్తే తెలంగాణ (16-06-2015)

ఏడు దశాబ్దాల ప్రజాస్వామిక పరిపాలనా చరిత్రగల భారత దేశంలో, ప్రతి ఐదేండ్లకు బ్యాలట్ ద్వారా ప్రభుత్వాలు మారే ఈ దేశంలో, ఎంత శక్తిమంతులైనా చట్టానికి అతీతులు కారు. ఎంతటి ఉన్నత స్థానంలో ఉన్నవారైనా, ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులయినా, మాజీ ప్రధాన మంత్రి కూడా న్యాయ ప్రక్రియకు బద్ధులు కావలసి వచ్చింది, ఇంటరాగేషన్‌ను ఎదుర్కోవలసి వచ్చింది. కొందరు జైలుకు కూడా వెళ్ళారు. ఎవరూ చట్టానికి అతీతులు కారు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. తాను దోషిని కాదని చెప్పుకోవడం కాదు, తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలె.
హైదరాబాద్‌లో శాంతిభద్రతలను, వ్యక్తిగత స్వేచ్ఛను, పౌరుల ఆస్తిని కాపాడడం కోసం గవర్నర్‌కు అధికారాలు ఇవ్వాలని, ఇందుకోసం ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ని ఎనిమిదవ సెక్షన్ ప్రకారం మార్గదర్శకాల ను రూపొందించాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రపతిని, ప్రధానిని కోరినట్టు వార్తలు వచ్చాయి. ఆయన ఈ అభ్యర్థన చేయడానికి ముందు తన నివాసం ముందు భద్రత కోసం ఉండే తెలంగాణ పోలీసులను తొలగించి వారి స్థానంలో ఏపీ పోలీసుల బలగాలను పెట్టుకున్నారు. ఓటుకు నోటు కుంభకోణంలో తమ పార్టీ శాసనసభ్యుడు ఒకరిని రెడ్ హాండెడ్‌గా పట్టుకొని, అరెస్టు చేసి, ఇంటరాగేషన్ చేసిన నేపథ్యంలో, తాను అరెస్టవుతాననే భయంతో నాయు డు ఈ విధంగా వ్యవహరించి ఉంటారు.
నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీవెన్సన్‌ను ప్రలోభపెట్టే క్రమంలో ఆయనతో మాట్లాడుతున్న చంద్రబాబు మాటలను పలు చానెల్స్ ప్రసారం చేశాయి. చానెల్స్‌లో ప్రసారమైన ఆడియో టేపులలోని గొంత తనది కాదని ఇప్పటి వర కు చంద్రబాబు ఖండించలేదు. అందువల్ల తాను అరెస్టు నుంచి తప్పించుకోవడానికి ఎనిమిదవ సెక్షన్ సులభమైన మార్గమని చంద్రబాబు భావించి ఉంటారు. కానీ ఏపీ పునర్విభజన చట్టంలోని ఎనిమిదవ సెక్షన్ అవినీతికి, లంచాలకు పాల్పడిన వారిని కాపాడడానికే ఉద్దేశించినదా? లేక దానిలో మరేదైనా ఇమిడి ఉన్నదా? చంద్రబాబు ఎనిమిదవ సెక్షన్ ద్వారా రక్షణ పొందడానికి ప్రయత్నిస్తూనే, తనను కాపాడుకోవడానికి తనకంటూ సొంత వాదనలు తయారు చేసుకుంటున్నారు.
అవినీతి, లంచగొండితనం వంటి విషయాలలో జోక్యం చేసుకోవాల ని పునర్విభజన చట్టం ఎనిమిదవ సెక్షన్‌లో ఎక్కడా లేదు. ఏపీ పునర్విభజన చట్టంలో హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా పేర్కొన్నప్పటికీ, అది తెలంగాణకు మాత్రమే శాశ్వత రాజధాని. ఏపీకి పదేండ్లు మించకుండా రాజధానిగా ఉంటుంది. హైదరాబాద్ తెలంగాణ భౌగోళిక, పరిపాలనా పరిధిలోనే ఉంటుంది. ఆచరణలో అన్ని విధాలా హైదరాబాద్ తెలంగాణ అంతర్భాగం, దీనిని తెలంగాణ ప్రభుత్వమే పాలిస్తుంది. ఇక్క డి పౌరుల ప్రాణాలు, భద్రత, ఆస్తులకు సంబంధించి మాత్రమే గవర్నర్‌కు ప్రత్యేక బాధ్యత ఉంటుంది. ఉమ్మడి రాజధాని ప్రాంతంలోని శాంతి భద్రతలు, ప్రాణాలు, కీలక ప్రదేశాల భద్రత, ప్రభుత్వ భవనాల కేటాయింపు, నిర్వహణలకు సంబంధించి మాత్రమే గవర్నర్ బాధ్యత విస్తరించి ఉంటుంది.
ఇందుకు సంబంధించి కూడా గవర్నర్ తెంగాణ రాష్ట్ర మంత్రి మండలిని మాత్రమే సంప్రదించాల్సి ఉంటుందే తప్ప, మరే రాష్ర్టాన్ని కాదు. లంచం, అవినీతికి సంబంధించి ఈ సెక్షన్ ఎనిమిది విస్తరించి ఉంటుందని ఎక్కడా లేదు. లంచగొండితనం శాంతిభద్రతల కిందికి, ఆంతరంగిక భద్రత, కీలక సంస్థల భద్రత కిందికి వస్తుందా? ప్రజల ప్రాణాలు, స్వేచ్ఛ, ఆస్తుల పరిరక్షణకు కిందికి లంచగొండితనం కూడా వస్తుందా? గవర్నర్ సెక్షన్ ఎనిమిది కింద జోక్యం చేసుకొని ప్రత్యే క బాధ్యతలు చేపట్టే ఘటన ఈ ఏడాది కాలంలో ఒక్కటైనా జరిగిందా? చంద్రబాబు నాయుడు ఈ మేరకు ఫిర్యాదు చేసే సందర్భం ఎప్పుడైనా వచ్చిందా? టీవీ చానెల్స్‌లో తన గొంతు గల ఆడియో ప్రసారం చేసినప్పుడు మాత్రమే చంద్రబాబుకు ఈ ఎనిమిదవ సెక్షన్ గుర్తుకు వచ్చింది.
రాజ్యాంగం ప్రకారం శాంతిభద్రతలు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటా యి. ప్రతి రాష్ర్టానికి తమ డిజిపి నేతృత్వంలోని పోలీసు బలగాలు ఉంటాయి. ఏసీబీ వంటి సంస్థలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల కింద ఉంటా యి. ప్రతి రాష్ట్రం ఆ ముఖ్యమంత్రి కింద ఉంటుంది. నగరాలు, గ్రామీణ ప్రాంతాలలో శాంతిభద్రతల నిర్వహణ బాధ్యత ఆ రాష్ట్ర పోలీసు విభాగానికి ఉంటుంది. ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రి లేదా ఇతర ప్రముఖుడు వచ్చినప్పుడు వారికి భద్రత కూర్చే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది.
ఏ ముఖ్యమంత్రి ఇతర రాష్ట్రం వెళ్ళినప్పుడు తమ వెంట సొంత రాష్ట్ర పోలీసులను, భద్రతా సిబ్బందిని తమ వెంట తీసుకపోరు. చంద్రబాబు నాయుడుకు కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. ఆయన తెలంగాణలో అంతర్భాగమైన హైదరాబాద్‌లో ఉన్నంత వరకు ఇక్కడి రాష్ట్ర పోలీసుల ద్వారా మాత్రమే భద్రత పొందాలె. సొంత రాష్ట్ర పోలీసుల ను ఏర్పాటు చేసుకోవడం రాజ్యాంగ స్వభావానికి విరుద్ధం. ఒక రాష్ట్ర పోలీసు సిబ్బంది ఇతర రాష్ట్రంలో ప్రవేశించి దర్యాప్తు చేయాలన్నా, అరెస్టు చేయాలన్నా, పోలీసు సంబంధిత ఏదైనా బాధ్యత నిర్వహించాలన్నా, ఆ రాష్ట్ర పోలీసును మొదట సంప్రదించాల్సిందే. తమ ఇష్టానుసారం శాంతిభద్రతల నిర్వహణ సాగించే వీలుండదు.

ఏడు దశాబ్దాల ప్రజాస్వామిక పరిపాలనా చరిత్రగల భారత దేశంలో, ప్రతి ఐదేండ్లకు బ్యాలట్ ద్వారా ప్రభుత్వాలు మారే ఈ దేశంలో, ఎంత శక్తిమంతులైనా చట్టానికి అతీతులు కారు. ఎంతటి ఉన్నత స్థానంలో ఉన్నవారైనా, ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులయినా, మాజీ ప్రధాన మంత్రి కూడా న్యాయ ప్రక్రియకు బద్ధులు కావలసి వచ్చింది, ఇంటరాగేషన్‌ను ఎదుర్కోవలసి వచ్చింది. కొందరు జైలుకు కూడా వెళ్ళారు. ఎవరూ చట్టానికి అతీతులు కారు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. తాను దోషిని కాదని చెప్పుకోవడం కాదు, తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలె. సమస్యను పక్కదారి పట్టించవద్దు.

3 comments:

  1. ఎవరూ చట్టానికి అతీతులు కారు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది అన్న రెండుముక్కలూ వినటానికి చాలా బాగుంటాయండి. ఈ మాటలు తరచుగా సినీమాలలోనూ నేరాలకు సంబంధించిన సీరియళ్ళలోనూ బాగా వినిపిస్తుంటాయి అందుకనే.

    నిజానికి అలా జరుగుతున్నదా అన్నది ప్రశ్న. న్యాయం జరగటమే కాదు న్యాయం జరిగినట్లు అనిపించటమూ ముఖ్యమే.

    ఎంతోమంది పలుకుబడిగల వ్యక్తులు రకరకాల నేరాలలో ఇరుక్కుని కేసులపాలవటమూ, న్యాయస్థానాల్లో ముద్దాయిలుగా బోనుల్లో నిలబడటమూ, శిక్షలుకూడా పడటమూ, అటువంటి శిక్షితుల్లో కొందరు శ్రీకృష్ణజన్మస్థానాలను అలంకరించటమూ మనదేశస్థులు ఇప్పటికే బహుపర్యాయాలు గమనించారు కూడా.

    ఐతే అలా శిక్షలుపడ్డవారు తరచుగా పైకోర్టులకు వెళ్ళి అప్పీళ్ళూ దాఖలుచేసుకోవటమూ, బెయిళ్ళు తెచ్చుకోవటమూ అపైన ప్రజల్లో దర్జాగా తిరుగుతూ ఉండటమే కాదు పెద్దపెద్దపదవులనూ అలంకరించి జనాన్ని తరింపజేయటమూ చూస్తూనే ఉన్నారు మనదేశవాసులు.

    పలుకుబడి కలవారు తమమీద ఉన్న కేసుల్ని అనంతకాలంగా సాగదీయించగలరు మన చట్ట్టాల్లో ఉన్న లొసుగులో మరొకటో అధారంగా. తత్ఫలితంగా చివరకు దశాబ్దాల అనంతరం సహజంగానే తగిన సాక్ష్హ్యాలింకా బ్రతికి లేక అటువంటి ఘనులు సగౌరవంగా పులుకడిగిన ముత్యాల్లా చిరుచిరునవ్వులతో జేజేలందుకుంటూ బయటకు వస్తున్నారు.

    అందుచేత గమనించవలసినది మన పాలనావ్యవస్థకు న్యాయవ్యవస్థను సరిగా నడవనిచ్చే చిత్త్సశుధ్ధి లేకపోవటం వలన చట్టం తరచుగా తనపని తాను చేసుకుపోలేని దుస్థితిలో ఉందన్న సంగతి.

    మీ వ్యాసంలోని ప్రథానమైన అంశాలను స్పృశించలేదు నా వ్యాఖ్యలో. మీరు తెలంగాణాపక్షపు దృక్కోణంలో బాగా వ్రాసారు. కాని కొంచెం నిష్పక్షపాతంగా ఆలోచించితే మరికొంచెం బాగా వ్రాసేవారేమో అనుకుంటాను.

    మీరు మీ వ్యాసం తెలుగులోనే వ్రాసినందుకు ధన్యవాదాలు. లేకుంటే ఇది నేను తెలుగుసేత చేసేవాడినేమో. (లోగడ మీ వ్యాసం ఒకటి శ్రీశైలజలవివాదానికి సంబంధించినది నేను అలా తెలుగులోకి అనువదించిన సంగతి మీకు గుర్తుండి ఉంటుందని ఆశిస్తున్నాను)

    ReplyDelete
  2. @శ్యామలీయం:

    నేరారోపణ ఎదురుకుంటున్న పెద్దలు అప్పీళ్ళ మీద అప్పీళ్ళు చేసుకుంటూ కాలం దాటవేయగలుగుతారన్నది వాస్తవమే. అయితే గుడ్డిలో మెల్లన్నట్టు వారిలో కొందరయినా పదవులకు (అధికారికంగా మాత్రమె అయినా) దూరం ఉండాల్సి వచ్చింది. ఉ. లాలూ ప్రసాద్ యాదవ్, జయలలిత (కొన్ని రోజులు), దిలీప్ జుదేవ్. అలాగే కొందరు (ఉ. బంగారు లక్ష్మణ్, ఓం ప్రకాష్ చౌతాలా) నేరం రుజువై కృష్ణ జన్మస్తానాన్ని పావనం చేసారు. గాలి జనార్ధన్ రెడ్డి లాంటి వారు కేసులు విచారణలో ఉన్నా చాలా కాలం చిప్పకూడు తిన్నారు.

    These examples show some (admittedly not as much as we may like) resilience in the system. Criminals can't go as totally scot free as they want.

    ReplyDelete