Saturday, April 20, 2013

నాలుగు శతాబ్దాల హైదరాబాద్-2: కుతుబ్‌షాహీ రాజులు: వనం జ్వాలా నరసింహారావు


నాలుగు శతాబ్దాల హైదరాబాద్-2
కుతుబ్‌షాహీ రాజులు
వనం జ్వాలా నరసింహారావు
ప్రశ్నలు: జవాబులు

1.    ఒకటవ కుతుబ్‌షాహీ సుల్తాన్ కులీ కుతుబ్-ఉల్-ముల్క్ పుట్టిన, అధికారంలోకి వచ్చిన, చనిపోయిన సంవత్సరాలు ఏవి? (1445, 1518, 1543)

2.   కుతుబ్‌షాహీల వంశంలో ఐదవ రాజుకు కూతురు, ఆరవ రాజుకు భార్య, ఏడవ రాజుకు తల్లి అయిన వ్యక్తి ఎవరు? ("మా సాహెబా" గా పిలువబడే హయత్ బక్షీ బేగం)

3.   సుల్తాన్ కులీ ఎన్ని సంవత్సరాలు పరిపాలించారు? గవర్నర్‍గా, గోలకొండ సుల్తాన్‌గా ఎన్నేళ్లు వ్యవహరించారాయన? (48, 23, 25)

4.   చారిత్రాత్మక బన్నిహట్టి యుద్ధం ఎవరెవరి మధ్యన, ఎప్పుడు, ఎవరి పాలనా కాలంలో జరిగింది? (ఇబ్రహీం కులీ కుతుబ్ షా కాలంలో; గోలకొండ, బీజాపూర్, అహ్మద్ నగర్ ల సంయుక్త రాజ్య కూటమికి, విజయనగర సామ్రాజ్యానికి మధ్యన జరిగింది)

5.   ఇబ్రహీం కులీ కుతుబ్ షా కాలంలో ఆవిర్భవించి, దరిమిలా ఉర్దూ భాషగా ప్రసిద్ధికెక్కిన జాతీయాన్ని ఏమని పిలిచేవారు? (దఖని జాతీయం)

6.   కులీ కుతుబ్ షా 1589 లో నిర్మించిన హాల్ ఆఫ్ జస్టిస్ లేక న్యాయస్థానపు విశాలమైన గదిని ఏమని పిలిచేవారు? (దాద్ మహల్)


7.   సెప్టెంబర్ 21, 1687 న మొగలాయిల చేతిలో ఓటమి పొందిన గోలకొండ సుల్తాన్ కుతుబ్ షాహీ అబుల్ హసన్ తానాషాను ఎక్కడ బందీగా వుంచారు? (దౌలతాబాద్ లోని కాలా మహల్ రాజ ప్రాసాదంలో)

8.   హైదరాబాద్ నగర శంఖు స్థాపన సందర్భంగా కులీ కుతుబ్ షా భగవంతుడిని ఏమని ప్రార్థించారు? (నదిలో చేపలు వృద్ధి పొందే రీతిలో హైదరాబాద్ నగర జనాభా పెరగాలని ఆయన ప్రార్థించారు)

9.   కుతుబ్ షాహీ సుల్తానులు నిర్మించిన ఐదు రకాలైన చారిత్రాత్మక కట్టడాలను ఏమని పిలిచేవారు? (కోట, సమాధులు, మస్జీదులు, రాజప్రాసాదాలు, ప్రజోపకర భవన సముదాయాలు)

10. కుతుబ్ షాహీ వంశీయుల ఆద్యుడైన సుల్తాన్ కులీ కుతుబ్-ఉల్-ముల్క్ 1518 లో నిర్మించిన ఏకైక మస్జీద్ పేరేమిటి? (మస్జీద్-ఇ-సఫా లేక జామి మస్జీద్. ఇది గోలకొండ కోటకు చెందిన బాల హిసార్ దర్వాజాకు కొద్దిగా ఆవలి భాగాన వుంది)

11.  ముబారిజ్ ఖాన్, నిజాం ఉల్ ముల్క్ ల మధ్య సెప్టెంబర్ 30, 1724 న జరిగిన ఘోరమైన యుద్ధంలో ముబారిజ్ ఖాన్ మరణానికి దారి తీసిన స్థలం పేరేమిటి? తరువాతి కాలంలో దాని పేరు ఏమని మార్చారు? (షకర్ కేడా, ఫతే కేడా)

12. అశూర్ ఖానా బాద్ షాహీ అంటే ఏమిటి? (హైదరాబాద్ నగర నిర్మాత కులీ కుతుబ్ షా 1592 లో నిర్మించిన ఓ భవనం. రెండవ ఆసఫ్ జాహీ నిజాం అలీఖాన్ దీనిని ఆధునీకరించారు)

13. 1463 లో దక్కన్ అల్లర్లను అణచివేయడానికి పంపి, ఆ తరువాత 1495 లో తెలంగాణకు సుబేదారుగా నియమించబడిన బహమనీ టర్క్ ఉన్నత సైనికాధికారి ఎవరు? (1518-1687 మధ్య కాలంలో కుతుబ్ షాహీల వ్యవస్థాపక రాజు కులీ కుతుబ్-ఉల్-ముల్క్)

14. కుతుబ్ షాహీల పాలన అంతమైన తదుపరి "సుబేదారు" బిరుదుతో హైదరాబాద్ కు నియమించబడిన అనేక మంది గవర్నర్లలో మొగలు చక్రవర్తి నియమించిన మొదటి వ్యక్తి ఎవరు? (జాన్ సాగర్ ఖాన్)

No comments:

Post a Comment