Tuesday, October 11, 2016

యువ అధికారులతో నవపాలన : వనం జ్వాలా నరసింహరావు

యువ అధికారులతో నవపాలన
వనం జ్వాలా నరసింహరావు
ఆంధ్రజ్యోతి దినపత్రిక (11-10-2016)

తెలంగాణ రాష్ట్రంలో, దసరా నాటినుంచి కొత్త, చిన్నజిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు ఏర్పాటైన నాటినుంచే పరిపాలనా కార్యక్రమాలు ప్రారంభంకావడానికి, సజావుగా సాగడానికి, రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ఎంతో కసరత్తు చేసింది. కలెక్ట్రలు, జాయింటు కలెక్టర్లు లాంటి ఉన్నత స్థాయి అధికారులకు తోడు మరో 3252 పోస్టులు అవసరం కావచ్చని ప్రాధమికంగా అంచనా వేసినట్లు అధికారికంగా వార్తలొచ్చాయి. అర్హతను బట్టి, అవసరాన్ని బట్టి పదోన్నతులు కలిగించి పోస్టులను భర్తీ చేసే అవకాశాలున్నాయి. ఇప్పుడున్న వాటికంటే అదనంగా మరో 21 జిల్లాలు ఏర్పాటు అయ్యే అవకాశాలుండడంతో, ఆ నేపధ్యంలో, పలువురు యువ ఐఏఎస్ అధికారులకు, జిల్లా కలెక్టర్లుగా, సంయుక్త కలెక్టర్లుగా, పదోన్నతులకు సాధారణంగా పట్టే సమయం కంటే కొంచెం ముందుగానే, పరిపాలనా బాధ్యతలు అప్పగించే సూచనలు కూడా ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. వీరిలో కొందరు కేంద్ర సర్వీస్ కమీషన్ ద్వారా ఐఏఎస్ లుగా ఎంపికైనవారు కాగా, మరికొందరు ఐఏఎస్ లు గా పదోన్నతులు (కన్ఫర్డ్) పొందిన వారు. గడిచిన 28 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టి అమలు పరుస్తున్న అనేక అభివృద్ధిసంక్షేమ కార్యక్రమాలను సజావుగా, పకడ్బందీగా అమలు చేసే క్రమంలోను, రాష్ట్ర రాజకీయ, సాంఘిక, ఆర్థికాభివృద్ధిలోను, ప్రజలకు మెరుగైన పరిపాలనా సౌలభ్యాలను సమకూర్చే విషయంలోను, ఆయా జిల్లాలకు నియమితులువుతున్న ఈ అధికారులు తమ నైపుణ్యాన్ని, పాలనా కౌశలాన్నీ ప్రదర్శించేందుకు ఇదో గొప్ప అవకాశం అనాలి. మొత్తం 31 జిల్లాల కలెక్టర్లు, సంయుక్త కలెక్టర్లు, జిల్లాస్థాయిలో వారికింద పనిచేసే వివిధ స్థాయిల్లోని సిబ్బంది, ఉమ్మడిగా-విడివిడిగా, ఒక సమగ్రమైన, వైవిధ్యభరితమైన పాలనా వ్యవస్థ రూపు దిద్దుకోవడానికిరాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి, ఒక కీలకమైన బృందంగా, వ్యవహరిస్తారు అనటంలో సందేహం లేదు.

            నేటికి, బహుశా ఎప్పటికీ, రాష్ట్ర పాలనా వ్యవస్థలో కలెక్టర్-జిల్లా మేజిస్ట్రేట్ పాత్ర అత్యంత కీలకమైనదిగా కొనసాగవలసిందే. మన ప్రజాస్వామ్య వ్యవస్థకు మూలమైన జిల్లాలలో మార్పుకు ప్రేరకులుగా, ప్రతినిధులుగా, ప్రధాన భూమిక వహించటంతో పాటు, సుపరిపాలనను అందించటంలో, సంక్షేమ-అభివృద్ధి కార్యక్రమాల అమలులో వీరు ఇతరులకు మార్గదర్శకులు కావాలి.  ప్రజల ఆశలు, ఆశయాలు, జీవితాలు, జీవనవిధానం అన్నీ ఆయా జిల్లా కలెక్టర్లు తీర్చిదిద్దేవిగా వుండాలి. కాలానుగుణంగా, రోజులు మారుతున్నాకొద్దీ, కలెక్టర్ల వ్యవహార శైలిలో, పాలనా విధానంలో గణనీయమైన మార్పులు నిరంతరం-నిత్యం చోటుచేసుకుంటున్నాయి. ఉత్ప్రేరకులుగా అనేక అభివృద్ధి, సంక్షేమ వ్యవహారాల అమలును పర్యవేక్షిస్తూ చక్క బెట్టాల్సిన క్రమంలో ఒక్కోసారి అవి వారి నియంత్రణాధికారాలకు భిన్నంగా వుండే అవకాశం వుంది. ఆ సందర్భంలో వారి నిర్ణయం ఆచితూచి తీసుకునే విధంగా వుండాలి. మారుతున్న పరిస్థితుల్లో, నేపధ్యంలో, అందరితో కలిసి, అందరినీ కలుపుకొని పరిపాలనా వ్యవహారాలు, పనులను చేసుకపోవాల్సిన అవసరం ఎంతయినా ఉంది. ప్రజలను సమాయత్తపరుచు కోవటంలో, వారిలో స్పూర్తిని పరిపుష్టం చేయటంలో, ఉత్తేజాన్ని పెంపొందించటంలో, వారిలో గుప్తంగా దాగి వున్న సామర్ధ్యాన్ని వెలికి తీయటంలో, చైతన్య పరచటంలో, సృజనాత్మకతకు సాన పట్టడంలో వీరు వైవిధ్యాలను ప్రదర్శించాల్సి ఉంటుంది. మానవ వనరుల సమగ్ర వినియోగం, సమగ్ర ప్రణాళిక అందుకు తగ్గ ఆలోచనలు చేయటం, ఆర్ధిక అవసరాల సక్రమ నిర్వహణ ఇలా అన్ని కలబోసి, వీటన్నింటినీ, అంతా తామై పర్యవేక్షించాల్సి ఉంటుంది. తద్వారా అనుకున్న సమయానికి నిర్వర్తించాల్సిన విధులను, చేపట్టాల్సిన చర్యలను, లక్ష్య సాధనలో తిసుకుపోవాల్సిన చర్యలను  ప్రజలకు చేరువ చేయాల్సిన సంక్షేమ అభివృద్ధి పనులను, వారికి చేరే లాగా నడచుకోవాలి. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం, దళితులకి భూ పంపిణీ, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఆసరా పించన్లు, సాగు నీటి  ప్రాజెక్టుల నిర్మాణం, గురుకుల పాటశాలలు, ఆరు కేజీల బియ్యం పంపిణీ, ఆర్ధిక బృతి అందించే కార్యక్రమాలు, ఎస్.సి., ఎస్.టి.,  బీసీ, మైనార్టీలు సంక్షేమం లాంటి వాటిపైన ప్రత్యేక శ్రద్ధ కనపరచాలి.


కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలకు ఉమ్మడిగా పనికొచ్చే విధంగా, ఒకటి కాని అంతకంటే మించి కాని అఖిల భారత సర్వీసులను ఏర్పాటు చేయడానికి, భారత రాజ్యాంగంలోని 312  ప్రకరణలో సవరణ చేసింది ప్రభుత్వం. ఆ విధంగా ఏర్పాటైందే ఇండియన్ అడ్మినిస్టేటివ్  సర్వీస్ (ఐ..ఎస్). ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (..ఎస్)ను సర్దార్ వల్లభాయ్ పటేల్ భారతదేశానికి ఉక్కు వ్యవస్థగా అభివర్ణించారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత ప్రభుత్వ నిర్ణయాలను కట్టుదిట్టంగా అమలుపర్చేందుకు, చేయూతనందించేందుకు, పటిష్టమైన పాలన యంత్రాంగం అవసరమైన నేపధ్యంలో అది ఆవిర్భవించిందిఅంతకుముందు ఆంగ్లేయుల పాలనలో పరిపాలన బాధ్యతలు నిర్వహించిన ఇండియన్ సివిల్ సర్వీస్కు విప్లవాత్మకమైన మార్పులు చేర్పులు చేసి, ఆ నమూనాలోనే ఈ వ్యవస్థను రూపొందించారుఈ సర్వీస్‍కు ఎంపికైన వ్యక్తులు పౌర పరిపాలనలోనూ, విధాన నిర్ణయాలలోనూ, ఆంతరంగిక విదేశీ సంస్కరణలను చాకచక్యంగా నివారించడంలోనూ కీలకమైన పాత్ర పోషిస్తుంటారుసాహిత్యం నుంచి వైద్యశాస్త్రం వరకు విభిన్న విద్యల్లో తమదంటూ ఒక ప్రత్యేకత ఉందని నిరూపించుకున్న తెలివైన, బాధ్యతాయుతమైన, సమర్ధులైన వ్యక్తులను ఓ పద్దతి ప్రకారం విస్తృతమైన, కఠినమైన పరీక్షా విధానం ద్వారా ఈ సర్వీసుకు ఎంపిక చేస్తారుఇలా ఎంపికైన ఐ..ఎస్ అధికారుల ఉద్యోగాలకు రాజ్యాంగపరమైన భద్రత ఉంటుందికార్య నిర్వహణ అధికారాల విషయంలో భయపడాల్సిన అవసరం కాని ఒత్తిడులకు లోను కావాల్సిన అవసరం కానీ వారికి ఎంత మాత్రంలేదుదేశ సమగ్రతకు ఈ వ్యవస్థ అత్యంత అవసరమైందని సర్దార్ పటేల్ అనేవారు. ..ఎస్ ల ఉద్యోగ వ్యవహారాలను మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్సస్-పెన్షన్ డిపార్టుమెంట్, డిపార్టుమెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ విభాగం చూసుకుంటుంది. ఈ క్యాడర్ లో ఉండాల్సిన 5000 పై చిలుకు స్థానాలు, నేరుగా కాని పదోన్నతి ద్వారా కాని భర్తీ చేస్తారు.  నేరుగా 62-2/3 శాతం మందినీ, పదోన్నతుల ద్వారా 33-1/3 శాతం మందినీ నియామకం చేస్తారు.

..ఎస్‍కు చెందిన అధికారులకు సబ్ కలెక్టర్ స్థాయినుంచి, రాష్ట్రాల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్థాయి వరకు, కేంద్రంలో కేబినెట్ సెక్రటరీ స్థాయి వరకు వివిధ శ్రేణి ఉద్యోగాల్లో పనిచేసే అవకాశం కలుగుతుందివారి వారి సామర్ధ్యాన్నిబట్టి, కార్య నిర్వహణ పద్ధతులను బట్టి వారిని వివిధ ప్రభుత్వ శాఖల అధికారులుగా నియమించడం, పదోన్నతులు కల్పించడం జరుగుతుంది. ..ఎస్‍కు ఎంపికైన వారు ఏడాదిపాటు ముస్సోరీలో, ఏడాదిపాటు వారికి కేటాయించిన రాష్ట్రంలో అసిస్టెంట్ కలెక్టర్ శిక్షణ పొందిన తరువాత లభించే మొదటి ఉద్యోగం సబ్ కలెక్టర్ఈ హోదాలో పనిచేసిన తరువాత సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ అధికారిగా, జాయింట్ కలెక్టర్‍గా పదోన్నతులు పొంది డిప్యూటీ సెక్రటరీ - జాయింట్ సెక్రటరీ స్థాయి హోదాలో (కొన్ని సందర్భాల్లో సెక్రటరీ స్థాయి) ఒక జిల్లా కలెక్టర్‍గా నియమితులవుతారుదురదృష్ట వంతులైన కొందరికి ఈ అవకాశం రాకుండాపోయిన సందర్భాలు కూడా ఉన్నాయిఈ పదవుల కుండే హోదా, మెజిస్టీరియల్ అధికారాల దృష్ట్యాప్రతి ఐ..ఎస్ అధికారీ ఈ బాధ్యతలు నిర్వహించాలనే కోరుకుంటారు. అఖిల భారత సర్వీసుల్లో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్‍కు ప్రత్యేకత ఉంటే అందులో అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్న పదవి జిల్లా కలెక్టర్. పలు అభివృద్ధి సంక్షేమ పధకాల అమలులో, పర్యవేక్షణలో కలెక్టర్ బాధ్యత అంచనాలను మించిపోతున్నది. జిల్లా స్థాయిలో లెక్కకు మించిన శాఖలకు కలెక్టరే అధిపతిసుమారు వందకు పైగా కమిటీలకు అధ్యక్షుడిగా వ్యవహరిస్తూ ఎప్పుడేపని చేస్తుండేదీ గుర్తుంచుకోలేని స్థాయికి కలెక్టర్ చేరుకున్నారు.

అలాగే వీరి విధి నిర్వహణలో భాగంగా రాష్ట్ర సచివాలయంలోగాని, వివిధ శాఖలకు ఉన్నతాధికారులుగా కానీ, పబ్లిక్ రంగ సంస్థలకు ముఖ్య అధికారులుగా కానీ నియమింపబడతారుకొందరు కేంద్రానికి డిప్యుటేషన్ మీద వెళ్లి అక్కడ కీలకమైన పదవులను నిర్వహిస్తుంటారు.  మరికొందరు ఇతర రాష్ట్రాలకు కూడా కొంతకాల్ం డిప్యుటేషన్ పై వెళ్లి పనిచేసి తిరిగి స్వరాష్ట్రానికి వస్తారు. ఐఎఎస్ నియమాకాల్లో ఉన్నతమైన స్థానం, కేంద్రంలో కేబినెట్ సెక్రటరీ పదవిని చేపట్టడం. అలాగే వారి రాష్ట్రంలో ప్రధాన కార్యదర్శి పదవిని చేపట్టడం. కేంద్రంలో తరువాత స్థానం సెక్రటరీ/ అడీషినల్ సెక్రటరీ (అదనపు కార్యదర్శి), జాయింట్ సెక్రటరీ (సంయుక్త కార్యదర్శి), డిప్యూటి సెక్రటరీ (ఉప కార్యదర్శి), అండర్ సెక్రటరీ స్థానాలు. ఈ పదవులు వారు పొందేందుకు సీనియారిటీ ప్రాతిపదిక పాటించాల్సి వుంటుంది.   ఎంపిక చేయబడిన కొందరు  కార్యదర్శులుగా, ప్రధాన కార్యదర్శులుగా ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రుల వద్ద కానీ, దేశ ప్రధాన మంత్రి వద్ద కానీ నియమింపబడతారు. కేంద్రంలో హోం, డిఫెన్స్, ఫైనాన్స్, విదేశి వ్యవహారాల విభాగాల్లో కొందరు, కీలక నిర్ణయాలు తీసుకునే స్థానాల్లో నియమింపబడతారు. మరికొందరు రాష్ట్ర ఆర్థిక, పారిశ్రామిక, వ్యవసాయ, భూ పరిపాలన విభాగాల్లో నియమింపబడతారు.


మారుతున్న ప్రపంచ తీరు తెన్నులకు అనుగుణంగా  మానవ మేధో సంపత్తి అందనంత వేగంతో  సరికొత్త పుంతలు తొక్కుతూ ముందుకు సాగుతున్నది. ఇందుకు సరైన రీతిలో ధీటైన ఆలోచనలు ఆచరణలోనికి తీసుకురావలసిన అవసరం ఎంతైనా వుంది. గతంలో మాదిరిగా వర్తమాన కాలంలోని కలెక్టర్ల పాత్ర లేదు.  మూస పద్ధతికి బహుశా ఇక తావులేదు. పాలనా పద్ధతుల్లో కొత్త పుంతలు తొక్కాలి.   అధునాతన ప్రపంచాన్ని ఆవిష్కరించాలిసృజనాత్మకతకు తావివ్వాలి.   కాలానుగుణంగా వస్తున్న మార్పులను స్వాగతిస్తూ, ప్రజల ఆశలకు, అవసరాలకు, ఆశయాలకు, కోరికలకు అనుగుణంగా పరిణతను, పరిపుష్టిని సాధించాలి. ఈ దిశగా యువ కలెక్టర్లు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ, తమకింద పనిచేసేవారిని కలుపుకుని పోతూ, ప్రజలకు చేరువు కావలసిన ఫలాలను, ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అందించటంలో తమ వంతు పాత్ర పోషించాల్సిన అవసరం ఎంతైనా వుంది. తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుతో పాటు ప్రజోపయోగమైన నూతన పాలనా విధానాలు కూడా అమల్లోకి రావాలి. చిన్న జిల్లాల ఏర్పాటుతో మన పాలనా విధానం దేశానికి మార్గదర్శకం కావాలి. End

No comments:

Post a Comment