Friday, May 24, 2019

లౌకికవాద గుబాళింపు : వనం జ్వాలా నరసింహారావు


లౌకికవాద గుబాళింపు
వనం జ్వాలా నరసింహారావు
సూర్యదినపత్రిక (24-05-2019)
హైదరాబాదు, రాజస్థాన్ లోని ఆల్వార్ ప్రాంత మూలాలతో భారత స్వాతంత్ర్యానికి ముందు తరువాత శాస్త్రవేత్తలుగా కీర్తిగాంచిన, చురుకైన ఒక హిందూ – ముస్లిం జంట వంశ వృక్షం చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. వారెవరో కాదు డాక్టర్ ఎంఎస్ అయ్యంగార్. దేశంలో వారి తొలి ఉద్యోగం శాస్త్రీయ మరియు పరిశ్రమల పరిశోధనా మండలి, హైదరాబాదు ప్రాంతీయ పరిశోధనా ప్రయోగ శాలలో ప్రారంభమైంది. తరువాత బీహార్ లోని ధనబాద్ సమీపంలోని ఘరియాలో ఉన్న సిఎస్ఐఆర్ సెంట్రల్ ఫ్యూయల్ రిసర్చ్ ఇనిస్టిట్యూట్ లో వారికి పోస్టింగ్ ఇచ్చారు. దివంగత కృష్ణమీనన్ రక్షణ మంత్రిగా వున్న సమయంలో రక్షణ మంత్రిత్వశాఖలో డైరెక్టర్ మరియు స్పెషల్ డ్యూటీ అధికారిగా డిప్యుటేషన్ మీద ఎంఎస్ అయ్యంగారిని నియమించారు.

         2019 మే 15వ తేదీన సత్యం కంప్యూటర్స్ మాజీ నేత డాక్టర్ ఊట్ల బాలాజీ దంపతులు, స్వచ్చంద సంస్థకు చెందిన శశి దంపతులు ఆయన సోదరుడు రవి మరియు రవి కుమార్తె, అమెరికాలోని మసాచుసెట్స్ నుంచి ఆంగ్ల సాహిత్యంలో రెండు పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీలు కలిగిని కుమారి అనూష, హైదరాబాదు శ్రీనగర్ కాలనీలోని శశి గృహంలో ఒక చిన్న ఆత్మీయ సమావేశంలో కలుసుకున్నాము. అక్కడ న్యూఢిల్లీకి చెందిన పాతస్నేహితుడు వినోద్ అసాద్ అయ్యంగార్ ఆయన సతీమణి అభాను కలుసుకున్నాము. 108 మరియు 104 సేవలు అందించే వ్యవస్థల ముఖ్య రూపకర్తలైన దివంగత ఏపి రంగారావు మరియు డాక్టర్ బాలాజీ వారిని దాదాపు పది సంవత్సరాల క్రితం నాకు పరిచయం చేశారు. ఆరోగ్య యాజమాన్య మరియు పరిశోధనా సంస్థలో నేను కన్సల్టెంగా పని చేసిన సమయంలో సంస్థ అసోసియేట్ గా తప్ప ఎంతో ఆసక్తి కలిగించే వారి వ్యక్తిగత కుటుంబ నేపథ్యం, ఆయన కుటుంబ మూలాలు హైదరాబాదులో వున్నాయని, జవహర్ లాల్ నెహ్రూ ఇంట్లో దివంగత సంజయ్ గాంధీతో చిన్నప్పుడు ఆడుకున్న అనుభవాల మీదకు మళ్లింది.

         వినోద్ తల్లి దివంగత డాక్టర్ సుల్తానా జుల్ఫికర్ ఆలీ డాక్టర్ శ్రీమతి ఎస్ అయ్యంగార్ గా అందరికీ తెలుసు. అనేక తరాలకు ముందు వారి కుటుంబం పర్షియా నుంచి హైదరాబాదుకు వలస వచ్చింది. ఆమె ఇక్కడే పుట్టి పెరిగారు. ఆమె తండ్రి సయ్యద్ జుల్ఫికర్ అలీ రాజస్థాన్ లోని ఆల్వార్ రాజు సైనిక ప్రధాన అధికారి. కల్నల్ సయ్యద్ జుల్ఫికర్ అలీని అధికారికంగా ఆల్వార్ మహారాజ్ బిరుదుతో పాటు రాజు గౌరవ కల్నల్ సర్ జై సింగ్ ప్రభాకర్ బహదూర్ కాంప్ కమాండర్ గా నియమించారు. సుల్తానా జుల్ఫికర్ అలీ వైపు నుంచి చూస్తే ఎన్ని తరాల క్రితం ఆ కుటుంబం భారత్ కు వలస వచ్చిందో ఎంతో ఆసక్తి కలుగుతుంది. వినోద్ కుటుంబ స్నేహితుల సమాచారం ప్రకారం మొఘల్స్ కాలంలోనే ఆ కుటుంబం భారత్ కు వచ్చింది. బహుశా హుమాయున్ లేదా అక్బర్ కాలంలో అయి ఉండవచ్చు. కొన్ని తీవ్రమైన యుద్ధాల తరువాత వారి సైన్యంలో ఉన్న వినోద్ ముత్తాతలకు ఆల్వార్ సమీపంలో పెద్ద విస్థీర్ణంలో భూమిని బహుమతిగా ఇచ్చారు. దాన్ని పహారీగా పిలుస్తారు. ప్రస్తుతం ఆల్వార్ జిల్లాలో ఉంది. సుల్తానా జుల్ఫికర్ అలీ కుటుంబం ఆల్వార్ కు చెందినట్లుగా దీన్ని బట్టి తెలుస్తోంది.

         ఢిల్లీకి దక్షిణంగా 150 కిలోమీటర్ల దూరంలో జైపూర్ కు ఉత్తరంగా 150 కిలోమీటర్ల దూరంలో ఆల్వార్ వుంది. దేశ రాజధాని ప్రాంతంలో ఉండటమే గాక రాజస్థాన్ లో అల్వార్ జిల్లా కేంద్రంగా కూడా ఉందీ పట్టణం. అనేక కోటలు, సరస్సులు, పురాతన హవేలీలు, సహజ జలాశయాలతో ఒక విహార కేంద్రంగా వుంది. పహారీ గ్రామం జైపూర్ డివిజన్ లోని ఆల్వార్ జిల్లాకు చెందినది. ఆల్వార్ రాజు కాంగ్రెస్ పార్టీకి నిదులు అందజేస్తున్నారని బ్రిటీష్ పాలకులు గమనించి సైన్యాన్ని రద్దు చేయాలని వత్తిడి చేసిన తరువాత సయ్యద్ జుల్ఫికర్ అలీ కుటుంబం ఆల్వార్ నుంచి హైదరాబాదుకు వచ్చింది.


       అక్ర‌మ పాల‌న సాగిస్తున్నార‌ని బ్రిటీష్ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించ‌టంతో 1930 ద‌శ‌కం ప్రారంభంలో జైసింగ్ మ‌హారాజు ప్ర‌వాసంలోకి వెళ్లారు.(1937లో ప్రాన్స్‌లో 54 సంవ‌త్స‌రాల వ‌య‌స్సులో మ‌ర‌ణించారు.) వ‌ల‌స‌వాద వ్య‌తిరేక‌త‌కు తాము మారుపేరు అని వినోద్ చెప్పారు.(స్వాతంత్య్ర ఉద్య‌మానికి మ‌హ‌రాజు నిధులు అందచేయట‌మే అస‌లు కార‌ణం అని చెప్పారు) త‌రువాత దూర‌పు బంధువైన స‌ర్‌తేజ్ సింగ్ ప్ర‌భాక‌ర్‌ను బ్రిటీష్ వారు రాజుగా నియ‌మించారు. అత‌ను ఒక హిందూ జాతీయ‌వాది మ‌రియు 1947 వ‌ర‌కు అఖిల హిందూ మ‌హాస‌భ‌కు అధ్యక్షుడిగా వున్నారు. అయితే దేశ స్వాతంత్య్రానికి కొద్దిగా ముందుగా త‌ప్ప అత‌నికి బ్రిటీష్ వారు నిజ‌మైన అధికారాన్ని ఇవ్వ‌లేదు.

         వినోద్ తండ్రి దివంగ‌త డాక్ట‌ర్ ఎంఎస్ అయ్యం గార్‌. వినోద్ త‌ల్లి దండ్రులు లీడ్స్ విశ్వ‌విద్యాల‌యంలో విద్య‌స‌భ్య‌సించారు. రెండ‌వ ప్ర‌పంచ యుద్దం ముగిసిన త‌రువాత ఎన్‌జిఓ శ‌శి త‌ల్లి, మేన‌త్త స‌రోజా అచార్య ద్వారా వారు ఇంగ్లండ్‌లో క‌లు సుకున్నారు. ఒకే కాబిన్‌లో వున్నారు. ఎంఎస్ అయ్యం గార్, సుల్తానా జుల్ఫిక‌ర్ అలీ ఇంగ్లండ్‌లో ప్రేమ‌లో ప‌డి వారు భార‌త్‌కు తిరిగి వ‌చ్చిన త‌రువాత 1951లో ముంబైలోని హాగింగ్ గార్డెన్స్‌లో వివాహం చేసుకున్నారు.

      1960లో ఎంఎస్ అయ్యంగార్ ర‌క్ష‌ణ శాఖ‌లో డెప్యుటేష‌న్ మీద డైరెక‌ర్ట‌ర్ మ‌రియు ప్ర‌త్యేక విధి నిర్వ‌హ‌ణ అధికారిగా నియ‌మితుల‌య్యారు, త‌రువాత నాటి ర‌క్ష‌ణ మంత్రి వికే కృష్ణ మీన‌న్ అధ్వ‌ర్యంలో న్యూఢిల్లీలో ప‌ని చేశారు. ప్ర‌స్తుతం డిఆర్‌డిఓగా పిలుస్తున్న ర‌క్ష‌ణ‌శాఖ ప్ర‌యోగ‌శాల‌లో ప‌ని చేసేంద‌కు సుల్తానా జుల్ఫిక‌ర్ అలీని కూడా డెవ్యుటేష‌న్ మీద న్యూఢిల్లిలో నియ‌మించారు. చైనాతో యుద్దం త‌రువా కృష్ణ మీన‌న్ రాజీనామా చేసిన త‌రువాత వినోద్ త‌లిదండ్రులు సిఎస్ఐఆర్‌కు తిరిగి వ‌చ్చారు. 1966లో తండ్రి ఎంఎస్ అయ్యంగార్ అస్సాంలోని జోర్హాట్‌లో వున్న ప్రాంతీయ ప‌రిశోద‌నా కేంద్రం డైరెక్ట‌ర్‌గా నియ‌మితుల‌య్యారు. త‌ల్లి సుల్తానాను న్యూఢిల్లీలోని నేష‌న‌ల్ ఫిజిక‌ల్ లాబ‌రేట‌రీలో నియ‌మించారు. అమే అక్క‌డే 1982లో డిప్యూటీ డైరెక్ట‌ర్‌గా ఉద్యోగ విర‌మ‌ణ చేశారు. ఎంఎస్ అయ్యంగార్ 2008లో, సుల్తానా జుల్ఫిక‌ర్ అలీ 2012లో దివంగ‌తుల‌య్యారు.

          వినోద్ త‌ల్లి బంధువుల వ‌ద్ద గ‌డిపేందుకు లాహోర్ వెళ్లినపుడు అయ‌న అక్క‌డే జ‌న్మించారు. వినోద్ అస‌ద్ అయ్యంగార్ అని పేరు పెట్టారు. అయ‌న‌కు ఏడు సంవ‌త్స‌రాల వ‌య‌స‌ప్పుడు నెహ్రూ, కృష్ణ‌మీన‌న్ భేటీ సంద‌ర్భంగా క‌లవాల‌ని పిల‌వ‌టంతో అయ్యంగార్‌తో పాటు వినోద్ కూడా వెళ్లారు. పొద్దుపోయిన త‌రువాత లేదా తెల్ల‌వారు ఝామున త‌లి దండ్రులు బ‌య‌ట‌కు  వెళుతుండేవారు. ఆరోజుల్లో కృష్ణ మీన‌న్ దాదాపు ప్ర‌తిరోజు నెహ్రూ ఇంటికి వెళ్లేవారు, ఆయ‌న నెహ్రూతో అంత స‌న్నిహితంగా ఉండేవారు. వినోద్‌ను చూసేందుకు ఒక ప్యూన్ లేదా సంర‌క్ష‌కుడిని నియ‌మించే వారు, అడుకొనేందుకు బొమ్మ‌లు ఇచ్చేవారు. సంజ‌య గాంధీ బొమ్మ‌ల‌తో త‌రచూ అడుకున్న రోజుల‌ను వినోద్ ఇప్ప‌టికీ గుర్తుపెట్టుకున్నారు. త‌న బొమ్మ‌ల‌తో అడుకున్నందుకు సంజ‌య్‌కు త‌ర‌కూ కోపం వ‌చ్చేద‌ట‌. ఒక రోజు సంజ‌య్ గాంధీ బొమ్మ‌కారుతో అడుకుంటున్న స‌మ‌యంలో వారి మ‌ధ్య వివాదం వ‌చ్చింది.

          వినోద్ అయ్యంగార్‌కు ఇద్ద‌రు పిల్లలు రాధిక మ‌రియు అదిల్‌. అయ‌న భార్య అభా.( అంత‌ర్జాతీయ ప్ర‌చుర‌ణ‌లు పొందిన ర‌చ‌యిత్రి మురియు క‌వ‌యిత్రి) కుమారుడు అర్కిటెక్ట్‌గా ప‌ని చేస్తున్నారు. కుమార్తె రాధిక న్యూయ‌ర్క్‌లోని కొలంబియా విశ్వ‌విద్యాలయంలో జ‌ర్న‌లిజంలో మాస్ట‌ర్ డిగ్రీ పొంది ప్ర‌స్తుతం హిందూస్ధాన్ టైమ్స్ గ్రూప్‌కు చెందిన మింట్ ప‌త్రిలో ఆర్ట్స  సంపాద‌కురాలిగా పని చేస్తున్నారు. ఇద్ద‌రూ న్యూఢిల్లీలోనే వుంటారు. వినోద్ సోద‌రి అజ్ర అమెరికా వెళ్లి చాలాకాలం క్రితం అక్క‌డే మ‌ర‌ణించారు. వినోద్ థ‌ణ కుటుంబంతో ఢిల్లీలోనే ఉంటూ త‌న స్సేహితుల‌ను క‌లుసుకొనేందుకు త‌ర‌చూ హైద‌రాబాద్ వ‌స్తుంటారు. త‌న త‌లిదండ్రుల మూలాల గురించి మ‌రిన్ని వివ‌రాలు, తొలి రోజుల్లో హైద‌రాబాదులో గ‌డిపిన వివ‌రాల‌ను సేక‌రించే ప్ర‌య‌త్నాల్లో ఉన్నారు. అంతా శుభం క‌ల‌గాల‌ని కోరుకుందాం.

1 comment:

  1. హిందువులు బొందువులు అని వాగడం ఏ విధమైన లౌకికవాదమో చెప్పు జ్వాలా. అహంకారం తో ఎంతటి వారికైనా పతనం ఖాయం.

    ReplyDelete