Tuesday, May 7, 2013

పార్లమెంటు ఆవరణలో విగ్రహాల ఏర్పాటులోనూ తెలంగాణపై వివక్ష: వనం జ్వాలా నరసింహారావు


పార్లమెంటు ఆవరణలో 
విగ్రహాల ఏర్పాటులోనూ తెలంగాణపై వివక్ష

వనం జ్వాలా నరసింహారావు

పార్లమెంటులో విగ్రహాల ఏర్పాటులోనూ తెలంగాణపై వివక్ష కనిపిస్తూనే ఉంది. ఆచార్య ఎన్‌జీ రంగా, టంగుటూరి ప్రకాశం పంతులు, నిన్నటి ఎన్టీ రామారావును కలుపుకొంటే ముగ్గురు రాష్ట్ర నేతల విగ్రహాలు పార్లమెంటులో ఏర్పాటు చేశారు. దేశానికి ప్రధానులుగా పని చేసిన వారందరి విగ్రహాలు, చిత్రపటాలు ఉన్నా.. తెలంగాణ బిడ్డ పీవీ నరసింహారావు విగ్రహం ఏర్పాటు చేయకపోవడం శోచనీయం. ఉత్తరాది వారు, నెహ్రూ గాంధీ కుటుంబీకులూ మాత్రమే ప్రధానులుగా ఎంపికవుతున్న సంప్రదాయాన్ని బద్దలు కొట్టి.. దక్షిణాది నుంచి-అదీ ఆంధ్ర ప్రదేశ్ నుంచి ప్రధాని పదవి చేపట్టి, ఐదేళ్లూ మైనార్టీ ప్రభుత్వాన్ని నిరాటకంగా నడిపిన అపర రాజకీయ చాణక్యుడు పీవీ నరసింహారావు ఎవరికీ తీసిపోని మహానేత. తెలంగాణపరంగానే కాకుండా.. ప్రపంచంలోనే ఎన్నదగిన ఆర్థికవేత్తల్లో ఒకరిగా పేరుగాంచిన పీవీ విగ్రహాన్ని ఇప్పటికైనా ఏర్పాటు చేయాలని పలువురు కోరుకుంటున్నారు.

 ఇదిలా వుండగా, పార్లమెంటు ఆవరణలో, సెంట్రల్‌హాల్‌లో ఉన్న వివిధ నేతల విగ్రహాలు, చిత్రపటాల వివరాలు ఇలా ఉన్నాయి.


1. చంద్రప్తు మౌర్య, 2. పండిట్ మోతీలాల్ నెహ్రూ, 3. గోపాల కృష్ణ గోఖలే, 4. డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్, 5. అరబిందో ఘోష్, 6. మహాత్మా గాంధీ, 7. వైబీ చవాన్, 8. పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ, 9. పండిట్ గోవింద్ వల్లభ్ పంత్, 10. బాబూ జగ్జీవన్‌రామ్, 11. పండిట్ రవిశంకర్ శుక్లా, 12. ఇందిరాగాంధీ, 13. మౌలానా అబుల్ కలాం ఆజాద్, 14. నేతాజీ సుభాష్ చంద్రబోస్, 15. కే కామరాజ్ నాడార్, 16. ఆచార్య ఎన్‌జీ రంగా, 17. సర్దార్ వల్లభాయ్ పటేల్, 18. బిర్సా ముండా, 19. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం, 20. లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్, 21. ఎస్ సత్యమూర్తి, 22. సీఎన్ అన్నాదురై, 23. గోపీనాథ్ బొర్డొలోయ్, 24. పీ ముత్తురామలింగ థేవర్, 25. ఛత్రపతి శివాజీ మహరాజ్, 26. మహాత్మా బసవేశ్వర, 27. మహారాజా రంజిత్ సింగ్, 28. షహీద్ హేము కలానీ, 29. సీహెచ్ దేవీలాల్, 30. మహాత్మా జ్యోతిరావు పూలే, 31. ఎన్టీ రామారావు.

పార్లమెంటు సెంట్రల్‌హాల్‌లోని నేతల చిత్ర పటాలు

1. మదన్ మోహన్ మాలవీయ, 2. దాదాభాయ్ నౌరోజీ, 3. లోకమాన్య బాల గంగాధర తిలక్, 4. లాలా లజపత్ రాయ్, 5. మోతీలాల్ నెహ్రూ, 6. సర్దార్ వల్లభాయ్ పటేల్, 7. దేశబంధు చిత్తరంజన్ దాస్, 8.రవీంద్రనాథ్ ఠాగూర్, 9. సరోజినీ నాయుడు, 10. మౌలానా అబుల్ కలాం ఆజాద్, 11. డాక్టర్ రాజేంద్రప్రసాద్, 12. జవహర్‌లాల్ నెహ్రూ, 13. సుభాస్ చంద్రబోస్, 14. సీ రాజగోపాలచారి, 15. ఇందిరాగాంధీ, 16. డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్, 17. రామ్‌మనోహర్ లోహియా, 18. శ్యాంప్రసాద్ ముఖర్జీ, 19. రాజీవ్‌గాంధీ, 20. లాల్ బహదూర్ శాస్త్రి, 21. సీహెచ్ చరణ్‌సింగ్, 22. మొరార్జీ దేశాయ్, 23. వీడీ సావార్కర్.

14 comments:

  1. శ్రీ పి.వి.నరసింహారావుగారిని తెలంగాణా వాడని చెప్పి యెందుకు సంకుచిత పరుస్తారు?
    ఆయన యావదాంద్రప్రజానీకానికీ చెందినవాడు కదా?
    ఇలా ప్రాంతీయతను ఆపాదించుకుంటూ చివరికి మనలో‌మనమే జిల్లాలు గ్రామాల దాకా కుంచించుకుని పోవాలా?

    ReplyDelete
  2. పి వి గారిని దయచేసి 2.5 కొట్ల మందికి మాత్రమే పరిమితం చేయకండి. ఈ దేశానికి దిశా నిర్దేశం చేసిన మహనీయుడు. ఆయన నంద్యాలలో పోతీచేసినపుడు ఎంటీఅర్ కూడా గౌరవించి పోటీకి నిలపలేదు. కానీ భాజపా బంగారు లక్ష్మన్ ను నిలిపింది.

    మీ లాంటి మేధావులు కూడా పి వి గారికి ప్రాంతాన్ని అంటకడుతున్నారు, దురద్రుష్టం.

    ReplyDelete
  3. PV rocks. don't attribute stupid things to him

    ReplyDelete
  4. NTR కి తెలిసినంతగా PV ని గౌరవించడం కాంగ్రెస్ పార్టీకి తెలియదు.
    వాళ్ళకి కావలిసింది కుటుంబ భజన చేసేవాళ్ళు.
    PV, దేవీలాల్, చరణ్ సింగ్‌ల కంటే తీసిపోయాడా?
    PV దేశ చరిత్రని మలుపు తిప్పిన మేధావి. ఆయనని ఒక ప్రాంతానికి పరిమితం చెయ్యకండి.

    ReplyDelete

  5. ఔను.పీ.వీ.నరసిమ్హారావుగారిని ఒక ప్రాంతానికి పరిమితం చెయ్యకండి.ఆయనను తెలంగాణా వాళ్ళే ఎన్నుకోకపోతే ,ఒకసారి మహారాష్ట్రనుంచి,మరొకసారి నంద్యాలనుంచి ఎన్నికయారు.సోనియాగాంధీకి ఆయనంటే పడదు.అంచేత కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడకపోవచ్చును.మరి తె.రా.స.వాళ్ళెందుకు అడగరు?మొత్తం తెలుగువాళ్ళందరూ కలసి పార్లమెంట్లో ఆయన విగ్రహప్రతిష్ఠాపన చెసేవరకు పోరాడాలి.అంతేకాని,మీలాగ ప్రాంతీయభేదాలని రెచ్చగొట్టకూడదు.ఏప్రాంతంవాళ్ళయినా తెలుగువాళ్ళెవరూ దీనిని వ్యతిరేకించడం లేదు.

    ReplyDelete
  6. Dont act too innocent to forget that Jai Andhra movement was staged to kick down PV Narasimha Rao from CM seat. He was the only CM who did implement mulki rules in favour of Telangana.

    ReplyDelete
  7. Imka nayam, meeru PVni nijaayitee gala samaikyavaadi ani analeadu!

    ReplyDelete

  8. సారీ,మీరు సరిగా అర్థం చేసుకోలేదు.నేను ప్రత్యేకాంధ్ర ఉద్యమానికి కూడా వ్యతిరేకుడనే.ఏ ప్రాంతంకూడా విడిపోకుండా అంధ్రప్రదేశంతా కలిసి అభివృద్ధి చెందాలని నాకోరిక,అప్పుడు వచ్చిన ప్రత్యేకాంధ్ర ఉద్యమం కూడా కొందరు స్వార్థపరులు లేవదీసింది అని నాకు తెలుసు.ఆ విషయాల్ని అలా ఉంచితే ప్రస్తుతం పార్లమెంటులో శ్రీ. పి.వి.గారి విగ్రహ ప్రతిష్ఠాపనన కోరడానికి ముఖ్య కారణాలు/1,ఆయనమన తెలుగు వాడు కావడం.2.ఆయన 5 సం;'భారతప్రధానమంత్రిగా పనిచేయడం.3.దేశపురోగతినే మార్చివేసిన అద్భుతమైన ఆర్థికసంస్కరణలు తీసుకొని రావడం.

    ReplyDelete
  9. "Separate Andhra" movement was just a parody movement but not a real separatist movement. So, Undavilli Arun Kumar, one of the participants in Jai Andhra movement is now supporting United Andhra movement.

    ReplyDelete
  10. intaki p.v. vigraham gurinchi mana kaaryaacharana eamiti..adi cheppandi mundu..topik ni divert cheayadam ...enduku.....?

    ReplyDelete
  11. టాపిక్ ని డైవర్టు చేసింది కేవలం బ్లాగు ఓనరు నరసిమ్హా రావు గారు. తెలంగాణా తోక తగిలియ్యకుండా పి వి గారి విగ్రహాన్ని ప్రతిష్తించాలి అంటే ఏ గొడవ వుండేది కాదు. ఇలాంటి అనిక్యత ధిల్లీ పెద్దలకు తెలుసు కాబట్టె, వారు మన డిమాండును పెద్ద పట్టించుకోరు

    ReplyDelete
  12. PV was the only CM who implemented mulki rules. How can United Andhra supporters tolerate the demand to install his statue?

    ReplyDelete

  13. People like us are not involved in these politics.Even though we may support united Andhrapradesh ,at the same time we want SriP.V's statue to be installed in Delhi because he was a great man ,a great scholar.Other considerations are irrelevant in this matter.











    ReplyDelete
  14. Kachada kundi garu... Turehbaz Khan maa TelanganavaaDu ani Telangana prajalu ante vaallu Telangana peru cheppukunnaaru kanuka Turehbaz Khan ki vigraham peTTakkaraledu anea kadaa antaaru. PV vishayamloa donga edupu enduku? PV pradhana mantri ayyaadu. amduke kada PV vishayamlo over action chestunnadi. Over action cheyyadamea kaakundaa Telangana prajalu PV peru cheppukovadam valle ayanaki vigraham ledu ani vadimchadam enduku?

    ReplyDelete