Tuesday, August 22, 2017

అవిరళ కృషీవలుడు పీవీఆర్కే ప్రసాద్ : వనం జ్వాలా నరసింహారావు

అవిరళ కృషీవలుడు పీవీఆర్కే ప్రసాద్
వనం జ్వాలా నరసింహారావు
నమస్తే తెలంగాణ (23-08-2017)

       విశ్రాంత ..ఎస్ అధికారి, దివంగత ప్రధాని పి.వి. నరసింహారావు మీడియా సలహాదారు, డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి సంస్థ మాజీ డైరెక్టర్ జనరల్, తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ కార్య నిర్వహణ అధికారి, ఉమ్మడి అంధ్రప్రదేశ్ సమాచార కమీషనర్, మాజీ పోర్ట్ ట్రస్ట్ చైర్మన్ పివిఆర్కే. ప్రసాద్ ఆగస్ట్ 21, 2017 మరణించారన్న దుర్వార్త అనేకమందిని శోక సముద్రంలో ముంచేసింది. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ప్రచార పరిషత్ అధ్యక్షుడిగా పనిచేసిన ఆయన చనిపోయేంతవరకూ హిందూ ధర్మ పరిరక్షణ మండలి ట్రస్టీ అధ్యక్షుడిగా, టీటీడీ సలహాదారుడిగా పనిచేశారు.

ఆయన మరణవార్త తెలిసి, సోషల్ మీడియాలో, ప్రింట్-ఎలెక్ట్రానిక్ మీడియాలలో ఆయన అభిమానులు అనేకమంది ఆయన మృతికి సంతాపం తెలియచేశారు. పాలనా వ్యవస్థను సమర్ధవంతంగా నిర్వర్తించగల నిపుణత, ఆధ్యాత్మిక చింతన, మానవతకు నిలువెత్తు నిదర్శనంగా చెప్పుకోదగ్గ పివిఆర్కే, సంస్థలను, వ్యవస్థలను అభివృద్ధి పథాన నడిపించడంలో అందెవేసిన చేయిగా పేర్కోనవచ్చుఎక్కడ, ఏ హోదాలో పనిచేసినా తనదైన శైలిలో, తనదైన పనితీరును ప్రతిబింభింప జేయటంలో23 ఆయన అనుసరించిన విధానం ఒక ప్రత్యేకత సంతరించుకున్నదనాలిఅది తిరుమల తిరుపతి దేవస్థానం అయినా, మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ అయినా, మరే ఇతర సంస్థ అయినా పీవీఆర్కే గుర్తు చిరస్థాయిగా నిలిచి పోయేలా వుంటుంది.   పివిఆర్కేతో నాది ఐదు దశాబ్ధాల అనుబంధంనా సొంత జిల్లా ఖమ్మం కలెక్టర్ గా ఆయన పనిచేసే కాలంలో మొదలైన పరిచయం అనుబంధంగా మారి, సమైక్య రాష్ట్రంలోసమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ గా పనిచేస్తున్న సమయంలో మరింతగా పెరిగి, తిరుమల తిరుపతి దేవస్థాన కార్యనిర్వహణాధికారిగా ఉన్నప్పుడు ధృఢపడి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా, మర్రి చెన్నారెడ్డి  మానవ వనరుల అభివృద్ది సంస్థ డైరెక్టర్ జనరల్ గా ఆయన ఉన్నప్పుడు నేనక్కడ అదనపు డైరెక్టర్ గా ఆయనతో కలిసి పనిచేసే వరకూ కొనసాగడం జరిగింది.

ఐదేళ్ళ క్రితం కొంతమంది స్నేహితులతో కలిసి భద్రాచలంలో “అతిరాత్రం” పేరుతో పన్నెండు రోజులు బ్రహ్మాండమైన పుణ్య యజ్ఞాన్ని చేశాం. దానిని నిర్వహణ పూర్వరంగంలోనూ, నిర్వహణ జరుగుతున్నప్పుడూ స్వర్గీయ పీవీఆర్కే ప్రసాద్ గారు దానికి సంబంధించిన పూర్తి బరువు-భాద్యతలను తన భుజస్కందాల మీద వేసుకుని, లక్షలాది మంది మెచ్చేలా-నచ్చేలా యజ్ఞాన్ని పరిసమాప్తి చేయించారు. దర్శనం మాగజైన్ శర్మ గారితో సహా నేను ఆ యజ్ఞం నిర్వహణలో పాలు పంచుకోవడం మా పూర్వ జన్మ సుకృతం. అలాగే దర్శనం శర్మగారి ఆధ్వర్యంలో జరిగిన శృంగేరీ శంకరాచార్యుల వారి గురువందనం కార్యక్రమానికి కూడా ప్రసాద్ గారితో కలిసి నిర్వహణ బాధ్యతలలొ పాలుపంచుకున్నాను.

స్వర్గీయ ప్రసాద్ గారు మరణించేదాకా, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఆయన జీవితాంతం నిర్వహించిన స్వామీ రామానంద తీర్థ మెమోరియల్ ట్రస్ట్ అధ్యక్షుడిగా వున్నారు. ఆ సంస్థ అభివృద్ధికి ఎంతో కృషి చేసిన ఆయన సేవలను కొనియాడుతూ సభ్యులంతా ఆయనకు సంతాపం ప్రకటించారు.

            1998లో పివిఆర్కే మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృధ్ది సంస్థలో డైరెక్టర్ జనరల్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన మొదటి రోజే, అప్పటికే సంస్థ చేపట్టిన ఒక ప్రధాన అంశాన్ని ఆయనకు వివరించడానికి ఆయన ఛాంబర్ లోకి వెళ్లటం జరిగింది. సంస్థ చైర్మన్ గా ముఖ్యమంత్రి హోదాలో వున్న నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలకు అనుగుణంగా,  ఆప్టికల్ మార్క్ రీడర్ (.ఎం.ఆర్) పద్ధతిలో ఐదు లక్షల పైగా వున్న ప్రభుత్వ ఉద్యోగుల శిక్షణావసారాల  విశ్లేషణ మానవ వనరుల అభివృధ్ది సంస్థ చేపట్టిందిదానిని కింది స్థాయి ఉద్యోగులైన జూనియర్ అసిస్టెంట్ల నుండి, శాఖల ఉన్నతాధికారుల వరకు నిర్వర్తించాల్సి వుందిఐతే అప్పట్లో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నందున ముఖ్యమంత్రి ఆ పనిలో బిజీగా వుండడంతో సంస్థ చేపట్టిన పనిలో కాస్త జాప్యం కావటం జరిగింది.   క్షణంలోనైనా సీఎం ఈ విషయాన్ని గురించి అడిగే ఆస్కారం వున్నందున ఆ అంశాన్ని చూస్తున్న నేను వివరాలు చెప్తానన్నాను. నేను వివరించే లోపే ప్రసాద్ గారు  నాతో, తాను సంస్థలో విశ్రాంత సమయం కోసం చేరానని, తన ఆధ్యాత్మిక పనులకు వెసులబాటు కల్పించాలని కోరి మరీ పోస్టింగ్ వేయించుకున్నాననీ, విషయాలన్నీ అదనపు డైరెక్టర్ జనరల్ గా పని చేస్తున్న ఊర్మిలా సుబ్బారావు చూసుకుమ్తారానీ ఆయన అన్నారు. ఆయన ఆమాటలు అంటుండగానే ముఖ్యమంత్రి స్వయానా పివిఆర్కే కి ఫోన్ చేసి ఓఎంఆర్ పురోగతి వివరాలు తీసుకురమ్మని కోరటం జరిగింది.   తక్షణమే నానుంచి కావలసిన సమాచారం రాబట్టి నన్ను తీసుకుని ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్ళారు.   అక్కడ ఆయన ఒఎంఆర్ వివరాలను ఎంతో కాలంగా తెల్సినవాడిలా సోదాహరణంగా ముఖ్యమంత్రికి వివరించడం కళ్లారా చూసిన నాకు ఆయనకున్న విషయ పరిజ్ఞానం పట్ల ఆశ్చర్యం కలిగింది.


ఇక అప్పటి నుండి సంస్థకు సంబంధించిన అంశంలోనూ వెనుకంజ వేయకుండా ఆయన పనితీరుకు నిదర్శనంగా నిలిచే విధంగా,  ప్రపంచంలో అత్యుత్తమ శిక్షణను  అందించే ప్రతిష్టాత్మక సంస్థగా ఎం.సి.ఆర్.హెచ్.ఆర్.డి. ని ఆయన తీర్చిదిద్దారు అనటంలో అతిశయోక్తి లేదు. పివిఆర్కే తన సర్వీసులో ఎక్కువ కాలం అందించిన సేవల ఫలితంగా ఎం.సి.ఆర్.హెచ్.ఆర్.డి. సంస్థ అమోఘమైన రూపకల్పనకు దారి తీసింది అని పేర్కోనవచ్చు.  1998 నాటికి ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్” గా వ్యవహరించబడిన ఆ సంస్థ కేవలం సాంప్రదాయ బద్ధంగా నిబంధనలకు లోబడి, తరగతి గదులకు లోబడి శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడానికి మాత్రమే పరిమితమయ్యేది. ఆయన డైరెక్టర్ జనరల్ గా  పదవీ బాధ్యతలు చేపట్టిన అచిర కాలంలోనే కొత్త కొత్త పద్ధతులకు శ్రీకారం చుట్టి సంస్థను పఠిష్టపరచటంలో కొత్త-కొత్త శిక్షణా కార్యక్రమాలు చేపట్టడంలో అంతకు ముందు ఎవరూ సాధించలేని ఫలితాలను సాధించకలిగారు.

            ప్రసాద్ గారి హయాంలోనే, మర్రి చెన్నారెడ్డి మరణానంతరం, సంస్థ పేరు మార్చి, డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థగా నామకరణం చేయటం జరిగిందిరాష్ట్రంలోని భూత, భవిష్యత్, వర్తమాన మానవవనరుల అభివృద్ధికి ముందు చుపుతో వ్యవహరించి గమనాన్ని, గమ్యాన్ని మార్చి రాయగలిగిన సత్తా సామార్ద్యం వారికే సాధ్యపడిందనాలి. “ప్రభుత్వ ఉద్యోగులందరికీ శిక్షణ” అన్న నినాదంతో “రాష్ట్ర శిక్షణా చొరవ” (State Training Initiative-ఎస్టీఐ) అనే విధాన ప్రక్రియకు శ్రీకారం చుట్టిన ఘన ఆయనదే. ఉద్యోగుల పనితీరులో సామర్ద్యాన్ని  పెంపొందించి వారిని నిష్ణాతులుగా తీర్చిదిద్దడానికి, ఎస్టీఐ ద్వారా, రాష్ట్రంలోని 5 లక్షల ప్రభుత్వ ఉద్యోగులందరికీ ప్రతి ఉద్యోగికీ కనీసం సంవత్సరంలో 60 గంటల శిక్షణ (దాదాపు  రెండు వారాల పాటు) ఇచ్చే ఏర్పాటు చేశారాయన. అప్పట్లో యావత్ భారత దేశంలో అమలు చేయాలన్న జాతీయ శిక్షణా విధానాన్ని మొట్టమొదటగా అమలు చేసింది ఇక్కడే.

సంస్థకు కావలసిన మౌళిక వసతులను అబ్బురపరిచే రీతిలో సమకూర్చిన ఘనత, చరిత్ర వారి స్వంతంవారి దూరదృష్టికి నిదర్శనమే నేడు మానవ వనరుల సంస్థ భావన సముదాయం కాని, శిక్షణా పటిష్టత కాని, సిబ్బంది సామర్థ్యం కాని, మరేదైనా కాని.  అప్పట్లో అటువంటి తొట్టి తొలుత పరిపాలనా పరమైన మార్పులను తీసుకువచ్చే వ్యవస్థను తీర్చదిద్దే క్రమాన్ని అత్యంత సునాయసంగా, చాకచక్యంగా సమర్ధవంతంగా చేయటం బహుశా వారికే స్వంతం అని చెప్పవచ్చు. వ్యక్తులను ఎంపిక చేయటం, కర్తవ్యాలను నిర్దేశించటం, వ్యవస్థకు గాడిలో పెట్టటం వంటివి అనుకున్న రీతిలో చేసి చూపారుపధ్దతి ప్రకారం శిక్షణా అవసరాలను గుర్తించి వినూత్న పద్ధతులను ఎంపిక చేసి డి.వి.డి. ద్వారా, కంప్యూటర్ల ద్వారా, శాటిలైట్ నెట్ వర్క్ ద్వారాదృశ్య శ్రవణ మాధ్యమాల ద్వారా శిక్షణను అందించే పధ్దతులకు శ్రీకారం చుట్టారు.

            హెచార్డీ కాంపస్ లోనే “సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్” (సి.జి.జి) నెలకొనడం ప్రసాద్ గారి చొరవతోనే. పాలనలో అత్యుత్తమ ప్రమాణాలను ఎక్కడ రూపొందించినా, వాటిని గుర్తించి, మనకనుకూలంగా అవి అనుసరించదగ్గ పద్దతులను అభివృద్ధి చేయటంలో సిజిజి తనదైన పాత్ర పోషించడం జరుగుతున్నది. అప్పటి బ్రిటీష్ ప్రధాని టోని బ్లేయిర్ సిజిజి ప్రారంభోత్సవానికి హాజరు కావడం, చాలా సమయం వెచ్చించి సంస్థ తీరుతెన్నులను నిశితంగా పరిశీలించడంతోపాటు నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ముఖాముఖి చర్చించడానికి వెనుక పీవీఆర్కే కృషి వుంది.  ఎక్కడికక్కడ ఆయా జిల్లాలకే పరిమితమయ్యే రీతిలో జిల్లాస్థాయి శిక్షతా తరగతులు నిర్వహించడం ఆయన హయాంలోనే మొదలైంది.  ఆయా జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో వారిని నేరుగా జిల్లా శిక్షణా కమిషనర్ లుగా వ్యవహరించే బాధ్యతలు అప్పచెప్పడం కూడా జరిగిందిజాతీయ శిక్షణా విధానం నిర్దేశాలకు లోబడి, ఉద్యోగుల జీతభత్యాలకు వినియోగించే బడ్జెట్ కేటాయింపు మొత్తంలో, 1.5 శాతం మేరకు   శిక్షణా కార్యక్రమాల కోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయించే పధ్ధతి తీసుకురావటం పివిఆర్కే అవిరళ కృషికి తార్కాణం.

            పివిఆర్కే నేతృత్వంలో వారి ఆలోచనలు ఆచరణలో పెట్టి నాయకత్వం నిష్ణాతులను తీర్చిదిద్దటంలో సమర్ధనీయంగా తన కర్తవ్యాలను నిర్వర్తించిందని, దానికి  రూపకర్త, మార్గగామి పివిఆర్కే మాత్రమే అని చెప్పవచ్చుశాఖల వారీగా గవర్నింగ్ ఫర్ రిజల్ట్స్ (జి.ఎఫ్.ఆర్) కార్యక్రమాన్ని నిర్వహించటం ఇందుకు గాను మార్పుకారక నాయకులను గుర్తించడం, వారి ద్వారా అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టటం, దానికి కోర్ గ్రూప్ డెవలప్ మెంట్ ప్రోగ్రామ్స్ వంటి కార్యక్రమాలను అనుసంధానం చేయడం జరిగింది.

            బాల కార్మిక నిర్మూలన కార్యక్రమాన్ని  అంతర్జాతీయ బాలల సంస్థ, వివి గిరి జాతీయ కార్మిక సంస్థ నేతృత్వంలో నిర్వహించటంలో వినూత్న పద్ధతిలో రూపకల్పన చేసి 4100 నిష్ణాతులను రాష్ట్రవ్యాప్తంగా తీర్చిదిద్ది సామర్ధ్యాలను పెంపు చేయటంలో దోహదపడటం ఆయన వల్లే సాధ్యపడింది.

            వీటితో పాటు పివిఆర్కే సారథ్యంలో హర్వార్డ్ బిజినెస్ స్కూల్ ద్వారా కార్యక్రమాలు, యుఎన్డిపి సహాయంతో అభివృద్ధి కార్యక్రమాలు, భారత ప్రభుత్వ డిఒపిటీ సహాయంతో శిక్షణా కార్యక్రమాలునిర్వహించడానికి ప్రసాద్ గారు కీలకమైన పాత్ర పోషించారు. 1999 ఎన్నికల అనంతరం అప్పటి క్యాబినెట్ మంత్రులకు, నాటి ముఖ్యమంత్రికి కలిపి మూడు రోజుల శిక్షణ నిర్వహించడం దేశంలోనే మొదటిసారి.

            "నాహంకర్తా హరిః కర్తా", "అసలేం జరిగిందంటే", "తిరుమల లీలామృతం", "తిరుమల చరితామృతం" ప్రసాద్ గారు రాసిన పుస్తకాలు.

            దేశం ఒక సమర్ద పరిపాలనాదక్షుడిని, సంస్థల వ్యవస్థాపకుడిని-రూపకర్తను, ఆధ్యాత్మిక వాదిని, అన్నింటికీ మించి మంచి నిబద్ధత కలిగిన కర్తవ్యపరాయణుడినీ, క్రమశిక్షణా ప్రియుడ్ని, ఆదర్శనీయుడిని కోల్పోయింది.

No comments:

Post a Comment