Thursday, March 28, 2019

తెలంగాణ కేంద్రానికి ఇచ్చింది తీసుకున్న దానికంటే ఎక్కువే .... తెలంగాణ సమగ్ర ఆర్ధిక, అభివృద్ధి ప్రస్తానం-4


తెలంగాణ కేంద్రానికి ఇచ్చింది తీసుకున్న దానికంటే ఎక్కువే
తెలంగాణ సమగ్ర ఆర్ధిక, అభివృద్ధి ప్రస్తానం-4
జ్వాలాంతరంగం (29-03-2019)
సూర్యదినపత్రిక (29-03-2019)
లంచం ఇవ్వకుండా మున్సిపల్ అనుమతి దొరికితే చాలు, అంతకన్నా గొప్ప ప్రభుత్వం లేదని అధికారులకు ముఖ్యమంత్రి చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఈరోజు అది జరగడం లేదు. ఈ దుర్మార్గాలు, ఈ వేధింపులు ఖచ్చితంగా ప్రజలకు ఇక మీదట ఉండకూడదు. ప్రాణం పోయినా సరే, ఏది ఏమైనా సరే, రాజీపడకుండా ఈ టర్మ్ లో అన్నీ చేయాలని ప్రభుత్వ సంకల్పం. మున్సిపల్ రిఫామ్స్ గానీ, ధరణి వెబ్ సైట్ గానీ, లేదా రైతులు ఎమ్మార్వో కార్యాలయానికి గానీ లేదా రిజిస్ట్రేషన్ ఆఫీసుకిగానీ వెళ్లే పద్దతులు లేకుండా జరగబోతున్నది. విధాన రూపకల్పన జరిగింది ఈ పాటికే. వెబ్ సైట్ కూడా ఖచ్చితంగా వస్తుంది. భూ రికార్డులు, పాస్ పుస్తకాలు ప్రతి ఒక్క రైతుకూ అందుతాయి. పోడు వ్యవసాయం చేసే వారికి పోడు భూమికి సంబంధించి పాస్ పుస్తకం ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఆర్.ఓ.ఎఫ్.ఆర్. పట్టా విషయంలో కూడా పాస్ పుస్తకం ఇస్తుంది ప్రభుత్వం. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క రైతుకు ఎక్కడా ఎలాంటి గందరగోళం లేకుండా క్లియర్ గా పాస్ పుస్తకం ఈ సంవత్సరంలోనే అందివ్వడం జరుగుతుంది. దానిలో ఎటువంటి రాజీ లేదు.

         ఒక బ్రహ్మాండమైన, ఆదర్శవంతమైన పంచాయితీతాజ్ చట్టాని తెచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. గ్రామాభివృద్ధికి సర్పంచ్ ను, గ్రామ కార్యదర్శిని బాధ్యులుగా చేసింది చట్టం. నిధులకు ఎ మాత్రం కొరత వుండదు. పంచాయతీల నిధుల విషయంలో రాబోయే ఐదేళ్లలో రు.40,000 నుండి రు.50,000 కోట్లు వివిధ వనరుల ద్వారా, రూపేణా అందుబాటులోకి వస్తాయి. నరేగా నిధులు, 14వ ఆర్ధిక సంఘం సిఫార్సు చేసిన నిధులు, కలిప ఈ లెక్క వేయడం జరిగింది. నిధుల్లో పెరుగుదల కూడా తప్పకుండా ఉంటుంది. దీనికి కారణం, 15వ ఆర్థిక సంఘం ఇచ్చే నివేదికను బట్టి స్థానిక సంస్థలకు నిధులు పెంచుతారు. ఆ రకంగా రాబోయే ఐదు సంవత్సరాల కాలంలో రు.40,000 నుండి రు.50,000 కోట్ల వరకు ప్రభుత్వం ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంటుంది. 500 జనాభా ఉండే అతిచిన్న గ్రామ పంచాయతీకి కూడా నరేగా నిధులు రు.8,00,000 వస్తాయి.

నరేగా నిధుల విషయంలో ఇప్పటిదాకా చాలా అరాచకం జరిగింది. ఇష్టం వచ్చిన పద్ధతిలో నిధులు ఖర్చు పెట్టారు. ఇష్టం వచ్చిన పద్ధతిలో వ్యవహారాలు జరిగాయి. గ్రామ పంచాయతీలను నిర్లక్ష్యం చేశారు. మండల పరిషత్ లను కూడా పూర్తిగా నిర్లక్ష్యం చచేశారు. ఎవరో కొందరు వ్యక్తులు ప్రతిపాదనలు పెట్టడం, మంజూరు చేయడం చాలా గందరగోళం జరిగింది. దాన్ని సమూలంగా ప్రక్షాళన చేయాలని ప్రభుత్వం నిశ్చయించింది. ఎట్టిపరిస్థితుల్లోను నూటికి నూరుశాతం నరేగా నిధులు గ్రామ పంచాయతీల ద్వారానే ఖర్చు పెట్టించడానికి సిద్ధమైంది ప్రభుత్వం. అది కూడా సర్పంచ్ ల ద్వారానే జరుగుతుంది. నరేగా నిధులు, కేంద్ర ఆర్థికసంఘం సిఫార్సు చేసే నిధులు, రాష్ట్ర ఆర్థికసంఘం ఇచ్చే నిధులు, పంచాయతీల స్వంత ఆదాయం అన్నీ కలిపి సుమారు రు.50,000 కోట్ల రూపాయలు ఈ టర్మ్ లోనే ఖర్చు కాబోతున్నాయి. రు.50,000 కోట్లు ఖర్చయిన తర్వాత గ్రామాలు బాగా లేవు అనే మాట వినబడదు. గ్రామాలు ఎందుకు బాగుండవు? బాగా ఉండి తీరాలి. ఆ దిశగా చాలా కఠినంగా వ్యవహరిస్తుంది ప్రభుత్వం. అలా జరక్కపోతే, బాధ్యులను శిక్షిస్తుంది. రూపాయి కూడా నష్టం జరగకుండా నియంత్రణ వుంటుంది. రాబోయే రోజుల్లో ఇవన్నీ ప్రజలు ప్రత్యక్షంగా చూడబోతున్నారు. 


         కేంద్రం నుంచి నిధులు తేవడం లేదని ప్రతిపక్షాలు తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాయి కాని అది యదార్థం కాదు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా రాష్ట్రానికి వచ్చి మాట్లాడిన మాటలు ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. లక్ష కోట్లు, రెండు లక్షల కోట్లు తెలంగాణాకు ఇచ్చామని పచ్చి అబద్దాలు చెప్పారు. సీఎం కేసీఆర్ ధీటైన సమాధానం ఇచ్చారు ఆయనకు పత్రికాముఖంగా. వాస్తవానికి దేశాన్ని, సాకుతున్న ఐదారు పెద్ద రాష్ట్రాలలో  తెలంగాణ రాష్ట్రం ఒకటి. ఇన్కం టాక్స్ కానీ, సెంట్రల్ ఎక్సైజ్ ట్యాక్స్ కానీ, లేదా వివిధ కేంద్ర పన్నులు కానీ, కేంద్రానికి పన్నుల రూపంలో, రు.50,016 కోట్లు తెలంగాణ నుండి కేంద్రానికి వెళ్లాయి. కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా కానీ, డెవల్యూషన్స్ నిధులు కానీ, అన్నీ కలిపితే రాష్ట్రానికి బదులుగా వచ్చేది 24,000 కోట్ల రూపాయలు మాత్రమే. రు.26,000 కోట్ల రూపాయల తెలంగాణ సొమ్ము కేంద్ర ప్రభుత్వం వాడుతున్నదే తప్ప, కేంద్ర ప్రభుత్వానిది రాష్ట్రం వాడడం లేదు. తెలంగాణాకు కేంద్రం నిధులు తేవడానికి ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. నీతి ఆయోగ్  కూడా స్వయంగా రికమెండ్ చేసింది. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ మంచి పథకాలు. వాటికి 24,000 కోట్ల కోట్ల రూపాయలు ఇవ్వండని రికమెండ్ కూడా చేసారు. కాని 24 రూపాయలు కూడా కేంద్రం ఇవ్వలేదు. ప్రభుత్వ పరంగా  వందసార్లు దరఖాస్తులు ఇవ్వడం జరిగింది. సెక్రటరీలు, మంత్రులు వెళ్లి అడిగారు. కేసీఆర్ స్వయంగా వెళ్ళినపుడు కూడా అడిగారు. ఇరిగేషన్, డ్రింకింగ్ వాటర్, హౌజింగ్ వంటి అన్ని రంగాల గురించి వాళ్ళను తీసుకువచ్చి, స్కీములు చూపించడం జరిగింది. గ్రౌండింగ్ పనులను కూడా చాసారు వాళ్ళు. చాలా బాగుంది. బాగా పనులు జరుగుతున్నాయని పొగిడారు. కాని ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ముందుముందు ఏమి జరుగుతుందో వేచి చూడాలి. తెలంగాణ రాష్ట్ర అవసరాలు తీర్చే, ఆ రాష్ట్రం అవసరం వుండే, కేంద్ర ప్రభుత్వం రావాలని కోరుకుందాం. అప్పుడు ఆటోమేటిగ్గా నిధులు వస్తాయి. తెలంగాణ అవసరం ఉన్న ప్రభుత్వం కేంద్రంలో ఉంటే తప్పకుండా నిధుల వరద పారుతుంది. అందులో డౌట్ లేదు.

         ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ తో పాటు ఎకనామిక్ సర్వే పెట్టరు. రెండవది 31, మార్చి ఇయర్ ఎండింగ్ కాబట్టి ఎకనామిక్ సర్వే ఇప్పుడు రాదు. సమగ్ర వివరాలు అన్నీ పార్లమెంట్ ఎన్నికల తర్వాత వస్తాయి. ఇప్పుడు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ తో ముందుకు పోతే మినిమమ్ ఎక్స్ పెండీచర్ కు పర్మిషన్ తీసుకుంటే తప్పకుండా జూన్ లేదా జూలై మాసంలో పూర్తి బడ్జెట్ ను పెట్టుకోవాలనే ఉద్దేశంతో వుంది ప్రభుత్వం. ఎందుకంటే, కేంద్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందో, వాళ్ల పాలసీ ఏముందో చూసుకొని సమగ్రమైన బడ్జెట్ ను పెట్టుకుందామనే ఉద్దేశంతోనే ఓట్ ఆన్ అకౌంట్ ను పెట్టింది తప్ప, వేరే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు. ఫుల్ బడ్జెట్ అనేది కేంద్రం యొక్క ట్రెండ్స్ ను బట్టి రాష్ట్రం ఏర్పాటు చేసుకుంటుంది. అప్పుడు అన్ని వివిరాలు ఎకనామిక్ సర్వే ద్వారా కానీ, మరొకటి కానీ సభ ముందు సమగ్రంగా పెడతారు.
--సీఎం కేసీఆర్ శాసనసభలో బడ్జెట్ సమావేశాల చర్చల ప్రసంగం ఆధారంగా

1 comment:

  1. అయ్యా మీరు ప్రభుర్వోద్యోగులు. కాబట్టి ప్రభుత్వం గురించి గొప్పగ మాట్లాడక తప్పదు. అది మీకే ఆట్టే నచ్చకపోయినా సరే. కాని సోషల్ మీడియాను గవర్నమెంటుబాకాలాగా వాడుకోవటం బాగోలేదు. ఏమీ బాగోలేదు.

    ReplyDelete