Sunday, September 16, 2018

ఆధునిక వాల్మీకి వనం జ్వాలా నరసింహారావు By SRI Murali Mohana Rao Ilapavuluri

POSTED IN FACEBOOK BY
SRI Murali Mohana Rao Ilapavuluri 
ఆధునిక వాల్మీకి వనం జ్వాలా నరసింహారావు
@@@
రామాయణం వంటి రసమయ ఇతిహాసాన్ని ఎన్ని సార్లు చదివినా, ఎన్ని సార్లు విన్నా, తనివితీరదు. రామాయణాన్ని మించిన కావ్యం భూగోళంలో లేదు. అందుకే రామాయణ గాధ నాటి వాల్మీకి నుంచి నేటి ఆధునిక కవుల వరకు భక్తిసుగంధాలు విరజిమ్ముతూనే ఉన్నది.
ఆంధ్ర వాల్మీకి వావికొలను సుబ్బారావు గారి గూర్చి వినని సాహితీప్రియులు ఉండరు. ఇరవై నాలుగు వేల శ్లోకాలతో విరాజిల్లుతున్న వాల్మీకి విరచిత శ్రీ మదాంధ్ర రామాయణాన్ని వావికొలనువారు సుమారు ఎనభై ఏళ్ళక్రితం ఆంధ్రీకరించారు. అయితే అది పండితులకే తప్ప పామరులకు కొరుకుడు పడదు. ఆ మహాకావ్యాన్ని సరళమైన శైలిలో సుప్రసిద్ధ రచయిత, పాత్రికేయులు శ్రీ వనం జ్వాలా నరసింహారావు గారు మూల గ్రంధాన్ని ఏమాత్రం చెడగొట్టకుండా, సులభంగా చదువుకునే విధంగా మనోహరంగా రచించి తెలుగు పాఠకులకు ఒక వరంగా అందించారు.
ఓ మై గాడ్ అనే వాక్యాన్ని తెలుగులో ఏమంటారో నాకు తెలియదు కానీ, ఈ మహోద్గ్రంధాలను చూస్తే "అయ్యారే" అనేక తప్పదు. చదువుతుంటే సమయం తెలియదు. నిద్ర రాదు. ఈ అనువాదాన్ని వనం వారు గత పుష్కర కాలంగా "దర్శనం" అనే ఆధ్యాత్మిక మాసపత్రికలో సీరియల్ గా రాస్తున్నారు. దానిని ఇప్పుడు పుస్తకం రూపంలో విందుభోజనంలా అందించి తరించారు ఆయన.


ఈ పుస్తకం గూర్చి లోతులకు పొతే దానికి నా జీవితకాలం సరిపోదు. దీన్ని అనుభవైకవేద్యంగా చదివి ఆనందించాల్సిందే. త్రిదండి రామానుజ చిన జియ్యరు స్వామి వారు, బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణి శర్మ, స్వర్గీయ పీ వీ ఆర్ కె ప్రసాద్ గారు ఈ మధురకావ్యాలకు పీఠికలు వ్రాసి వన్నెలు అధికం చేశారు.
రామాయణం ఇంత సులభంగా చదువుకునే రీతిలో ఆయన ఎలా రాసారో అంతుబట్టని రహస్యం. "పలికించెడువాడు రామభద్రుండు" అనుకోవాలి తప్ప ఇది వ్యక్తులకు సాధ్యం అయ్యే పనికాదు. ఒక మానవాతీతశక్తి మన దేహంలో ప్రవేశించినపుడు మాత్రమే ఇలాంటి దైవకార్యాలు సాధ్యం అవుతాయి.
ఇంత విలువైన సాహిత్యసంపదను అభిరుచి గలిగిన..స్తోమతు లేని పాఠకులకు ఉచితంగా అందించాలని సంకల్పించారు వనం వారు. వారి వద్ద కేవలం 150 కాపీలు మాత్రమే ఉన్నాయట. కనుక వారికి ఒక లేఖ ద్వారానో, మరో విధంగానో మీ ఆసక్తి తెలియజేస్తే మీకు ఈ పవిత్ర గ్రంధాలు మీ ఇంటికి వస్తాయి. కొరియర్ చార్జీలు మీరు భరిస్తే మరీ సంతోషం.
శ్రీ వనం వారు ధన్యజీవులు.
రచయిత చిరునామా
502 , Vasavi Bhuvana Apartment ,
Srinagar Colony , behind Nikhil Hospital
HYDERABAD

No comments:

Post a Comment