Sunday, August 7, 2016

స్వధర్మానుష్ఠానమే మోక్షకారణం...ఆంధ్ర వాల్మీకి రామాయణంలో ఛందః ప్రయోగాలు...(నాల్గవ భాగం): వనం జ్వాలా నరసింహా రావు

(Recovered and Reloaded)

స్వధర్మానుష్ఠానమే మోక్షకారణం

ఆంధ్ర వాల్మీకి రామాయణంలో ఛందః ప్రయోగాలు  
       వనం జ్వాలా నరసింహా రావు
(నాల్గవ భాగం)

సూర్య దినపత్రిక (16-05-2016)

సూర్యవంశంలో జన్మించిన శ్రీరామచంద్రుడుసూర్యుడి కొడుకైన సుగ్రీవుడితో-అతడి సైన్యంతోదక్షిణసముద్రపు తీరం చేరిదాటేందుకు దారిమ్మని సముద్రుడిని ప్రార్తిస్తాడుదారివ్వని సముద్రుడిపై కోపించిన రాముడుసూర్యుడితో సమానమైన బాణాలను వేసి సముద్రాన్ని అల్లకల్లోలం చేస్తాడుఆ క్షోభకు గురైన సముద్రుడుతన భార్యలైన నదులతో సహా నిజ స్వరూపంతో వచ్చిరామచంద్రమూర్తి పాదాలపై పడిక్షమించమని వేడుకుని,నలుడితో సేతువు కట్టించమని ఉపాయం చెప్తాడుఅదే ప్రకారం చేసిదానిపై సేనలతో నడచిపోయిలంకలో నిర్భయంగా ప్రవేశించియుద్ధభూమిలో రావణుడిని చంపిసీతాదేవిని చూసిఇన్నాళ్ళూ పగవాడింట్లో వున్న ఆడదానిని ఎట్లా స్వీకరించాలా అని సిగ్గుపడిసీతాదేవిని కఠినోక్తులాడుతాడు.పతివ్రతైన సీతతన పాతివ్రత్య మహిమను లోకానికంతా తెలపాలని తలచి,లక్ష్మణుడు పేర్చిన చితిలో మండుటెండలో ప్రవేశిస్తుందిఅప్పుడు అగ్నిహోత్రుడు సీతను బిడ్డలాగా ఎత్తు కొచ్చిసీతాదేవి వంటి పతివ్రతలు లోకంలో లేరనీఆమెలో ఎట్టి లోపంలేదనీఆమెను గ్రహించమని శ్రీరామచంద్రమూర్తికి అప్పగిస్తాడుశ్రీరాముడామెను మరల స్వీకరించిబ్రహ్మ రుద్రాదిదేవతలందరు మెచ్చుకుంటుంటే సంతోషిస్తాడు.

దేవతా సమూహాల గౌరవం పొందిన శ్రీరామచంద్రమూర్తితను చేసిన పనిలోకోపకారం-లోక సమ్మతమైన పనైనందునసంతోషపడ్తాడు.రావణాసుర వధనే ఆ మహాకార్యాన్ని చూసిన దేవతలు-మునులుముల్లోకవాసులురావణుడి బాధ తొలిగిందికదా అని సంబరపడ్డారుతదనంతరం విభీషణుడిని లంకా రాజ్యానికి ప్రభువుగా చేసివీరుడైకృతకృత్యుడైమనో దుఃఖం లేనివాడయ్యాడు శ్రీరాముడు.
ఇంద్రాది దేవతల వరాలు పొందిఆ వర బలంతో యుద్ధంలో మరణించిన వానరులకు ప్రాణం పోసి బ్రతికించిమిత్రులైన సుగ్రీవ విభీషణులతో కలిసి సార్థక నామధేయమైన అయోధ్యకు పుష్పక విమానంలో బయల్దేరి పోతాడు శ్రీరాముడుత్రోవలో భరద్వాజుడి ఆశ్రమంలో దిగితనరాక విషయం భరతుడికి చెప్పాల్సిందిగా ముందు హనుమంతుడిని ఆయన వద్దకు పంపుతాడుతర్వాత పుష్పక మెక్కి అయోధ్యకు పోతూదారిలో గతంలో జరిగిన వృత్తాంతమంతా సుగ్రీవుడికి చెప్తాడుసాధుచరిత్రుడైన భరతుడుండే నందిగ్రామంలో దిగితమ్ములతో సహా జడలు తీసేస్తాడు.

"సీతామహాలక్ష్మి తోడుండగాసూర్యతేజుడైన శ్రీరామచంద్రమూర్తి రాజ్యలక్ష్మిని తిరిగి యదార్థంగా పొందడంతో ముల్లోకాలు మిక్కిలి సంతోషించాయిశ్రీరామచంద్రుడు రాజ్యం చేసేటప్పుడు లోకాలన్నీ సంతోషించాయిసంతోషాతిశయంతో కలిగిన గగుర్పాటుతో సాదువులు,ధర్మాత్ములు బలపడ్డారుశ్రీరామరాజ్యంలో సాదువులు చేసే శ్రీరామ సేవకు విరోధమైన మనోవేదనలుకానిరోగబాధలుకానియీతిబాధలుకాని లేవు.పుత్రశోకం ఏ తల్లితండ్రులకు కలగలేదుస్త్రీలు పాతివ్రత్యాన్ని విడవలేదు.వారికి వైధవ్య దుఃఖం లేదుఎక్కడా అగ్నిభయంలేదుశ్రీరామరాజ్యంలో నీళ్లలో పడి చనిపోయినవారు లేరుపెద్దగాడ్పులతో ప్రజలు పీడించబడలేదు.దొంగలు లేరుఆకలికి-జ్వరానికి తపించినవారు లేరునగరాలలో,గ్రామాలలోనివసించే జనులు ధన-ధాన్యాలు విస్తారంగా కలిగిభోగభాగ్యాలతో కృతయుగంలో లాగా మిక్కిలి సుఖమనుభవించారుశ్రీరాముడు అనేక అశ్వమేధ యాగాలనుయజ్ఞాలను చేసిబ్రాహ్మణులకు లెక్కపెట్టలేనన్ని ఆవులనుధనాన్ని దానమిచ్చితనసుఖాన్ని వదులుకోనైనా ప్రజలకు సుఖం కలిగేటట్లు ధర్మ పద్ధతిలో రాజ్యపాలన గావించివైకుంఠ లోకానికి పోయాడు.శ్రీరామచంద్రమూర్తిరాజ్య హీనులై నానా దేశాలలో తిరుగుతున్న పూర్వ రాజుల వంశాల వారిని పిలిపించివారి పెద్దల రాజ్యాన్ని వారికిచ్చివారంతా స్వధర్మాన్ని వీడకుండా కాపాడాడుబ్రాహ్మణ-క్షత్రియ-వైశ్య-శూద్రులనే నాలుగు వర్ణాల వారిని చక్కగా పరిపాలించాడుస్వధర్మానుష్ఠానమే మోక్షకారణమనీపరధర్మానుష్ఠానం పతనకారణమనీ తెలియచేశాడు.శ్రీరామచంద్రమూర్తి పదకొండువేల సంవత్సరాలు ఇలా రాజ్యాన్ని పాలించి విష్ణు లోకానికి చేరుకుంటాడు.

          ఇదే సంక్షిప్త  రామాయణం. దీనిని బాల రామాయణం అని కూడా అంటారుఇదే సంస్కృతంలో వాల్మీకి రాసిన రామాయణంలో ప్రధమ సర్గఈ సర్గ మొదటి శ్లోకంలోమొదటి అక్షరం "కారం తో మొదలవుతుందిఇది గాయత్రి మంత్రంలోని మొదటి అక్షరంకడపటి శ్లోకంలోని కడపటి అక్షరం"యాత్". గాయత్రి మంత్రం లోని కడపటి అక్షరమూ ఇదేగాయత్రిలోని ఆద్యంతక్షరాలు చెప్పడంతో ఈ సర్గ గాయత్రి సంపుటితమని తెలుస్తున్నదిఈ నియమం ప్రకారమే వాల్మీకి వేయి గ్రంథాలకు మొదట ఒక్కొక్క గాయత్రి అక్షరాన్ని వుంచడంతో 24,000 గ్రంథమయింది. 24,000 గ్రంథమంటే 24,000శ్లోకాలని అర్థంకాదు. 32 అక్షరాల సముదాయానికి గ్రంథమని పేరు. "గ్రంథోధనే వాక్సందర్భే ద్వాత్రింశ ద్వర్లసంహతౌఅన్న శ్లోకంలో ఇది విశదమవుతుంది.


ఒక శ్లోకంలో 32 అక్షరాల కంటే ఎక్కువ వుంటే, 32 అక్షరాలు మాత్రమే గ్రంథంగా భావించాలి. ప్రధమ సర్గలో ఆద్యంతక్షరాల మధ్యభాగంలో,తక్కిన అక్షరాలుండవచ్చేమోనన్న సందేహంతో, వాసుదాసుగారు, ఆ దిశగా శోధించినా కానరాలేదు. ఈ విషయాన్ని తెలియచేస్తూ ఆయన, ఎరిగిన విజ్ఞులు ఎవరైనా వుంటే, మరింత వివరంగా దీనికి సంబంధించిన అంశాలను వెల్లడిచేస్తే,వారికి సవినయంగా నమస్కరిస్తానని, తన అంధ్ర వాల్మీకి రామాయణంలోని బాల కాండ మందరంలో రాసారు. ఒకవేళ తక్కిన అక్షరాలు కనిపించకపోయినా లోపంలేదనీ, ఆద్యంతాక్షరాలు గ్రహించడంతో సర్వం గ్రహించినట్లేనని అంటారు వాసుదాసుగారు. ఏదేమైనా శ్రీమద్రామాయణం "గాయత్రి సంపుటితం" అనడం నిర్వివాదాంశం. యతిని అనుసరించే, ఆంధ్ర వాల్మీకి రామాయణంలోని కడపటి శబ్దం "అరయన్" య కారంతో ముగించబడింది. తెలుగులో "త్" శబ్దం కడపట రాకూడదు-దానికి ముందున్న "" కారాన్నిగ్రహించాలంటారు వాసుదాసుగారు.


No comments:

Post a Comment