Saturday, August 6, 2016

రామా చూచితి సీతను... ఆంధ్ర వాల్మీకి రామాయణంలో ఛందః ప్రయోగాలు...(మూడవ భాగం) :వనం జ్వాలా నరసింహా రావు

(Recovered and Reloaded)

రామా చూచితి సీతను...
ఆంధ్ర వాల్మీకి రామాయణంలో ఛందః ప్రయోగాలు  
       వనం జ్వాలా నరసింహా రావు
(మూడవ భాగం)
సూర్య దినపత్రిక (09-05-2016)

భరతుడు తన ఆజ్ఞ ప్రకారం తన పాదుకలను తీసుకుని అయోధ్యకు పోయిన తర్వాత అక్కడి పురజనులు తానిక్కడున్నానని తెలిసి వీలున్నప్పుడల్లా తన్ను దర్శించడానికి వచ్చే అవకాశం వుందని గ్రహిస్తాడు రాముడుదానివల్ల ఆశ్రమవాసుల తపస్సుకు భంగం కలుగుతుందని భావిస్తాడుఈ అలోచనరాగానేఇంద్రియాలను జయించిన సత్యస్వరూపుడైన రామచంద్రుడు దండకారణ్యం చేరుకుంటాడువిరాధుడిని చంపుతాడు.శరభంగుడిని దర్శిస్తాడుసుతీక్షణుడిని చూస్తాడుఅగస్త్యుడినిఆయన తమ్ముడు సుదర్శనుడిని దర్శిస్తాడుఅగస్త్యుడు చెప్తేఆయన దగ్గరున్న ధనస్సునుఖడ్గాన్నిరెండంబుల పొదలనుపదునైన అక్షయ శరాలను సంతోషంగా తీసుకుంటాడుమునీశ్వరుల దగ్గరుంటూవాళ్ల కోరిక మేరకు వారి తపస్సు భంగం చేసే రాక్షసులను సంహరిస్తానని అభయమిస్తాడు రాముడు.

పంచవటిలో సీతారామ లక్ష్మణులు తమ ఇష్టప్రకారం తిరిగే సమయంలోజన స్థానంలో నివసించే కామ రూపిణి-భయంకర రాక్షస స్త్రీ-శూర్పణఖముక్కు చెవులు కోసి వికార రూపం వచ్చేటట్లు చేస్తాడు లక్ష్మణుడుఇది తెలిసిన జన స్థానంలోని ఖర-దూషణ-త్రిషిరుడితో సహా పద్నాలుగు వేల రాక్షసులు వీరిపైకి యుద్ధానికి వస్తారులక్ష్మణుడి సహాయం లేకుండానేరణరంగంలో పరాక్రమవంతుడైన రామచంద్రమూర్తిపద్నాలుగు వేల మందినీకేవలం భుజబలంతోనే వధిస్తాడుతన బంధువుల మరణ వార్త విన్న రావణుడుకోపంతోతనకు సహాయం చేయమని మాయలమారి రాక్షసుడు మారీచుడిని ప్రార్థిస్తాడుమహా బల పరాక్రమవంతుడైన శ్రీరామచంద్రమూర్తితో యుద్ధం చేయడం కీడని రావణుడికి సలహా ఇస్తాడు మారీచుడుఆ ఆలోచన మాను కొమ్మని బోధిస్తాడుమృత్యువు ప్రేరేపిస్తుంటే,వాడిని తీసుకొని సీతారాములున్న చోటికి పోతాడు రావణుడువంచన చేసే స్వభావం కలిగిన మారీచుడు బంగారువన్నెగల జింక రూపంతో సీతకు కనిపిస్తాడుఆ జింక కావాలని సీత కోరితేదాన్ని తేవడానికి పోయిన రాముడు అస్త్రంతో వధిస్తాడుచస్తూ ’హా లక్ష్మణా’ అని అరుస్తాడు మారీచుడు.ఆ ధ్వని విన్న లక్ష్మణుడు అన్నకు సహాయం చేద్దామని వెళ్తాడుఒంటరిగా వున్న సీతను అపహరించుకుని పోతూ త్రోవలో అడ్డుపడ్డ జటాయువనే గద్దను చంపి లంకకు చేరి సీతను అశోక వనంలో వుంచుతాడు రావణుడు.

సీతను విడిపించే ప్రయత్నంలో రావణాసురుడి చేతుల్లో దెబ్బతిని,చనిపోవడానికి సిద్ధంగా వున్న జటాయువును చూసిఆయన ద్వారా తన భార్యాపహరణం గురించి విని ఎంతో బాధపడ్తాడు రాముడుతన తండ్రికి ఎలాచేయాల్నో అదే రీతిలోచనిపోయిన జటాయువుకు దహనసంస్కారాలు చేశాడు రాముడుతనవల్ల కదా జటాయువుకింత దుఃఖం కలిగిందని బాధపడి విలపిస్తాడు.

 అడవులన్నీ వెతుక్కుంటూ పోయిశ్రీరాముడు భయంకర-వికార స్వరూపుడైన కబంధుడనే రాక్షసుడిని చంపి దహనం చేసాడుశాప విముక్తుడైన కబంధుడుపంపా తీరంలో వున్న శబరిని చూసిపొమ్మని బోధించాడుఆమె శ్రేష్ఠ ధర్మమైన గురు శుశ్రూషను ఆచరించేదనీఅతిథి పూజలాంటి సకల ధర్మాలను ఎరిగినందునఆ బోయసన్యాసినిని తప్పక చూడమనీ అంటాడు.

శత్రుసంహార దక్షుడైన రాజకుమారుడు శ్రీరామచంద్రమూర్తి శబరిని కలిశాడుఆమె నిండు శ్రద్ధా భక్తులతో సమర్పించిన ఆతిథ్యాన్ని కడు ప్రీతితో స్వీకరించాడుసీతను వెతికే పనిలో తన అభీష్టం నెరవేరేందుకు శబరి చెప్పిన విధంగానే పంపా సరస్సు చేరుకుంటాడు రాముడుపంపా తీరంలోని వనంలో హనుమంతుడనే వానరుడిని చూసిఆయన మాటపై గౌరవం వుంచిసూర్య నందనుడైన సుగ్రీవుడితో స్నేహంచేసాడు రాముడుతనకథసీత వృత్తాంతం మొత్తం ఆయనకు చెప్పాడు రామచంద్రుడుచెప్పిన తర్వాతసుగ్రీవుడు రాముడితో అగ్ని సాక్షిగా స్నేహితులయ్యారు.

తనకూ-తన అన్న వాలికి విరోధం కలిగిన విధాన్ని సుగ్రీవుడు రాముడికి వివరిస్తాడువాలిని చంపుతానని రాముడు ప్రతిజ్ఞ చేస్తాడువాలి బల పరాక్రమాలు వినిపించి అంతటి బలవంతుడిని చంపగలడా రాముడని సందేహం వెలిబుచ్చుతాడు సుగ్రీవుడుతనకు నమ్మకం కలిగేలాఓ పెద్దకొండలాగున్న దుందుభి అనే రాక్షసుసుడి కళేబరాన్ని చూపించిదాన్ని చిమ్మమని రాముడిని కోరతాడు సుగ్రీవుడుఇంత చిన్న పరీక్షా అని చిరునవ్వుతోదాన్ని అలకగా కాలిబొటనవేలితోపేడును చిమ్మినట్లుపది ఆమడల దూరంలో పడే విధంగా చిమ్ముతాడు రాముడువాలికంటే రాముడు బలశాలి అనే నమ్మకం కుదిరేందుకు మరో పరీక్ష పెట్టాడు సుగ్రీవుడుసాల వృక్షాన్ని భేదించ మంటాడుఆయన కోరిక నెరవేర్చేందుకుమళ్ళీ సందేహానికి తావులేకుండా వుండేందుకుసాల వృక్షాలను ఛేదించిఅవుండే కొండను భేదించాడుఆయన బాణం రసాతలానికి పోయి తిరిగి ఆయన చేతిలోకి వచ్చిందిదాంతో సుగ్రీవుడు తృప్తిపడ్డాడుతనపగ తీరబోతుందన్న నమ్మకంతో వానర రాజ్యం లభించబోతుందన్న ఆశతోసంతుష్టి పడిన మనస్సుతోరామచంద్రమూర్తిని తీసుకొని కిష్కింధకు పోయాడు.


ఆ వెంటనే బంగారువన్నె దేహ కాంతిగల వానరేశ్వరుడు-సూర్యపుత్రుడుసుగ్రీవుడు సింహనాదం చేశాడుఆ ధ్వనిని విన్న ఇంద్రకుమారుడు వాలి సుగ్రీవుడితో యుద్ధం చేయడానికి బయల్దేరతాడు.రాముడి సహాయం సుగ్రీవుడి కుందని తార ఆయనకడ్డుపడుతుంది.తమ్ముడితో సంధిచేసుకొమ్మంటుందిఇతరులతో యుద్ధం చేస్తున్న తనను ధర్మాత్ముడైన రామచంద్రమూర్తి ఎందుకు చంపుతాడని తారను సమాధాన పరిచి సుగ్రీవుడిని యుద్ధానికి ఒప్పిస్తాడుతన మిత్రుడిని తన ఎదుటే నొప్పిస్తుంటే కళ్ళారా చూసిన రాముడుశరణాగత ఆర్తత్రాణపరాయణత్వం ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడని భావించిఒకే ఒక్క బాణంతో వాలిని నేలగూల్చుతాడువాలిని యుద్ధంలో చంపిన రాముడుసుగ్రీవుడు కోరినట్లే,వాలి పరిపాలిస్తున్న వానర రాజ్యానికిసుగ్రీవుడిని వాలి స్థానంలో ప్రభువును చేస్తాడు.

శ్రీరామచంద్రమూర్తి తన కోరిక నెరవేర్చడంతో సుగ్రీవుడు తను చేసిన ప్రతిజ్ఞ ప్రకారంమిక్కిలి బల పరాక్రమవంతులైన వానరులనుసీతాదేవిని వెదికేందుకునాలుగు వైపులకు పంపించాడువారిలో ఒకడైన హనుమంతుడికిజటాయువు సోదరుడైన సంపాతిసీతాదేవి లంకలో వుందని చెప్తాడుఆయన మాట ప్రకారంసుమారు నూరామడల సముద్రాన్ని సునాయాసంగా దాటి రావణాసురుడేలే లంకా పట్టణానికి చేరుకుంటాడు హనుమంతుడులంక ప్రవేశించిన హనుమంతుడురావణుడి అంతఃపురం దగ్గరలోవున్న అశోక వనంలో శోకిస్తూతన భర్తనే ధ్యానిస్తూతపోబలంతో-శీల సంపత్తితోనిజ వర్చస్సుతో ప్రకాశిస్తున్న సీతాదేవిని చూశాడుఅగ్నిహోత్రుడి మిత్రుడి కుమారుడైన హనుమంతుడుసీతాదేవి తనను నమ్మేందుకు,శ్రీరామచంద్రమూర్తి ఇచ్చిన రామ ముద్రికను చూపిస్తాడుదుఃఖ పడవద్దనీ,రాముడు త్వరలో వచ్చి సీతను చెరనుండి విడిపిస్తాడని అంటూ ఆమెను సమాధాన పరిచాడురామ లక్ష్మణులిరువురు సముద్రమెట్లా దాటుతారని-దాటినాఇంతటి బలశాలి రావణుడి నెట్లా జయించగలరని సందేహం వెలిబుచ్చుతుంది సీతసూర్యపుత్రుడైన సుగ్రీవుడితో రామచంద్రమూర్తికి  స్నేహం లభించిన విషయం చెప్తాడప్పుడు ఆమెకు ధైర్యం కలిగేందుకు హనుమంతుడు.

ఒక్క వానరుడే ఇంత పనిచేస్తేవానర సేనతో రామచంద్రమూర్తి వచ్చి,లంకనంతా ధ్వంసం చేయడంలో సందేహం లేదు అని రావణాసురుడనుకోవాలనీ-దాంతో సీతాదేవికి ధైర్యం కలగాలనీ భావించాడు హనుమంతుడు.  అందుకు ముందుగా రావణుడి బలమెంతో తెలుసుకునేందుకువాడిని యుద్ధానికి ఈడ్చి తన్నాలనుకుంటాడు హనుమంతుడుఅలా చేస్తే వాడికి తెలివొచ్చి సీతను అప్పగించి సమాధానపడ్తాడని తలుస్తాడువెంటనే హనుమంతుడు పరాక్రమంతో ఉపక్రమించిఅశోక వనం తలవాకిటున్న ద్వారాన్ని విరగ్గొట్టి,సేనానాయకులందరినీ-ఏడుగురు మంత్రి పుత్రులనూ చంపిఅక్షయ కుమారుడిని హతమార్చిఇంద్రజిత్తు ప్రయోగించిన బ్రహ్మాస్త్రానికి కట్టుబడతాడుబ్రహ్మ వరంతో ఆ కట్లు తెగిపోయినట్లు తెలిసినారావణుడిని చూసి వాడితో మాట్లాడాలని భావించితనను ఈడ్చుకుంటూ పోతున్న రాక్షసులను చంపక విడిచిపెట్టాడుసీతాదేవిని తప్ప తక్కిన లంకంతా భస్మం చేసిశీఘ్రంగా రామచంద్రమూర్తికి సీతాదేవి వార్త తెలపాలనిలంక విడిచి మరలి పోతాడు హనుమంతుడుధీరాగ్రగణ్యుడైన శ్రీరామచంద్రమూర్తికి ప్రదక్షిణ చేసి, ’రామా చూసితి సీతను - శీలం విడవక జీవించి వున్న దానిని ’  అని చెప్తాడు.


No comments:

Post a Comment