Saturday, July 25, 2020

శ్రీ మహాభాగవతము తృతీయ స్కందం:వనం జ్వాలా నరసింహారావు


శ్రీ మహాభాగవతము తృతీయ స్కందం
భగవదనుగ్రహంతో చదవడం పూర్తయింది
వనం జ్వాలా నరసింహారావు

          కంII    చదివెడిది భాగవతమిది,
                   చదివించును కృష్ణు, డమృతఝరి పోతనయున్
                   చదివినను ముక్తి కలుగును
                   చదివెద నిర్విఘ్నరీతి ‘జ్వాలా మతినై

శ్రీ మహాభాగవతం అనే ఈ మహా పురాణాన్ని సహజ పాండిత్యుడు, బమ్మెర పోతనామాత్యుడు రచించాడు. తృతీయ స్కందాన్ని విశ్వనాథం సత్యనారాయణ మూర్తి అనువదించారు. ఇది 297 పేజీలు  ఉన్నాయి. ఈ స్కందంలో  విదురుడి తీర్థయాత్ర దగ్గరనుంచి, గర్భంలో ఉన్న జీవుడు భగవంతుడిని స్తుతించడం వరకు 32 అంశాలున్నాయి. క్లుప్తంగా ఆ 32 అంశాల వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి:

విదురుడి తీర్థయాత్ర, ఉద్దవ సందర్శనం, విదురుడు ఉద్దవుడిని చూసి కృష్ణాదుల వృత్తాంతాన్ని చెప్పమని అడగడం, కౌరవ-యాదవ నిర్యాణం, శ్రీకృష్ణ నిర్వాణం, విదురుడు మైత్రేయ మహామునిని దర్శించడం, విదుర-మైత్రేయ సంవాదం, పంకజభవుడి జన్మ వృత్తాంతం, జగదుత్పత్తి లక్షణం, మహాదాదుల సంభావ ప్రకారం, మహాదాదులు, బ్రహ్మకృత నారాయణ ప్రార్థన, బ్రహ్మదేవుడి జన్మ ప్రకారం, బ్రహ్మదేవుడి తపస్సు, బ్రహ్మకు విష్ణు ప్రత్యక్షం కావడం, బ్రహ్మ దేవుడు విష్ణువును స్తుతించడం, బ్రహ్మకు నారాయణుడి కర్తవ్యోపదేశం ఉన్నాయి.


ఇంకా: కమలసంభవుడి మానస సర్గం-చతుర్ముఖుది మానస సృష్టి, పరమాణువుల జన్మం, భూలోకం, భువర్లోకం, సువర్లోకం మొదలైన వాతి విస్తారం,  బ్రహ్మ నిర్ణితమైన దశవిధ సర్గములు, దిన-మాస-సంవత్సరాది కాల లక్షణ నిరూపణ,  ఆయుః పరిమాణం, చతుర్యుగాల పరిమాణం, బ్రహ్మ దేవుడి సృష్టి భేదనం, సనక-సనందాదుల జననం, స్వాయంభువ మనువు జననం, మైత్రేయుడు విదురుడికి సృష్టి మహిమ వివరించడం, స్వాయంభువ మనువు ప్రజావృద్ది చేయడం, శ్రీహరి వరాహ అవతార ధారణ, భూమిని ఉద్ధరించడం, శ్రీ యజ్ఞవరాహావతార అభివర్ణన, శ్రీ యజ్ఞవరాహమూర్తిని బ్రహ్మాదులు స్తుతించడం ఉన్నాయి.

ఇంకా: దితి-కశ్యపుల సంవాదం, కశ్యపుడు రుద్రుడిని ప్రశంసించడం, కశ్యపుడు భార్య సంతాపం తీర్చడం, దితి గర్భధారణ, మైత్రేయ మహాముని విదురుడికి హిరణ్యాక్ష-హిరణ్యకశిపుల వృత్తాంతం తెలపడం, సనక-సనందనాదులు వైకుంఠ దర్శనం, జయ-విజయులకు సనక-సనందనాదులు శాపం ఇవ్వడం, సనక-సనందనాదులు శ్రీమన్నారాయణుడిని స్తుతించడం, మునివరులకు గోవిందుడి ఉద్బోధ, భగవంతుడికి మునివరుల వినతి, లక్ష్మీకాంతుడు జయ-విజయులను ఉరడించడం, జయ-విజయులు దితి గర్భంలో హిరణ్యాక్ష-హిరణ్యకశిపులుగా పుట్టడం, హిరణ్యాక్షుడు యజ్ఞావరాహమైన శ్రీహరితో యుద్ధం చేయడం ఉన్నాయి.

ఇవికాక: చతుర్ముఖ బ్రహ్మ చేసే యక్షాది దేవతాగణ సృష్టిని తెలపడం, కర్దమ మహాముని తపస్సు, శ్రీహరి సాక్షాత్కారం, దేవహూతిని పెళ్ళిచేసుకోమని కర్దముడికి భగవంతుడి ఆజ్ఞ, దేవహూతి కొరకు వరాన్వేషణ చేయడం, కర్దముడు దేవహూతిని వివాహమాడడం, కర్దమ ప్రజాపతి యోగ ప్రభావంతో విమానాన్ని కల్పించి భార్యతో విహరించడం, దేవహూతికి తొమ్మిదిమంది కన్యలు పుట్టడం, దేవహూతి గర్భంలో విష్ణువు కపిలాచార్యుడిగా జన్మించడం, కన్యల వివాహం, కర్ధముని తపోయాత్ర, కపిల-దేవహూతి సంవాదం, పంచాతన్మాత్రల జన్మప్రకారం, బ్రహ్మండోత్పత్తి, విరాట్పురుషుడి స్వరూపం, కర్మేంద్రియ పరమాత్మల స్వరూపం, పరకృతి-పురుష వివేకం, శ్రీహరి సర్వాంగ స్తోత్రం, దేవహూతి కొడుకైన కపిలాచార్యుడి వల్ల తత్త్వజ్ఞానాన్ని పొందడం, కపిలుడు దేవహూతికి భక్తియోగం, సాంఖ్యయోగం తెలియచేయడం, కపిలుడు దేవహూతికి పిండోత్పత్తి క్రమాన్ని వివరించడం, జీవుడి గర్భ సంభవ ప్రకారం, చంద్ర-సూర్య మార్గం, పితృ మార్గం, గర్భంలో ఉన్న జీవుడు భగవంతుడిని స్తుతించడం, దేవహూతి పరమపద ప్రాప్తి, కపిలుడి తపోవన గమనం అనేవి తృతీయ స్కందంలో ఉన్నాయి.  
మహాకవి బమ్మెర పోతనామాత్య ప్రణీత మహాభాగవతం
(రామకృష్ణ మఠం, హైదరాబాద్ ప్రచురణ)

No comments:

Post a Comment