Saturday, April 13, 2019

ఆంధ్ర వాల్మీకి రామాయణంలో సీతాకళ్యాణ ఘట్టం : వనం జ్వాలా నరసింహారావు


ఆంధ్ర వాల్మీకి రామాయణంలో సీతాకళ్యాణ ఘట్టం
వనం జ్వాలా నరసింహారావు
మనతెలంగాణ దినపత్రిక (14-04-2019)
విశ్వామిత్రుడు తన యాగ రక్షణకై దశరథ కుమారులైన రామలక్ష్మణులను వెంట తీసుకుపోయితన కార్యం నెరవేర్చుకున్న అనంతరంవారికి కళ్యాణం జరిపించాలన్న ఆలోచనతోతన వెంట మిథిలా నగరానికి తీసుకుని వెళ్తాడు. వారిని జనక మహారాజుకు పరిచయం చేసితన దగ్గర వున్న శివ ధనుస్సును చూపించమంటాడు. దాన్ని చూపించే ముందు సీత జన్మ వృత్తాంతం చెప్పాడు జనకుడు. తనకు నాగేటి చాలులో దొరికిన సీత వీర్యశుల్కనీశక్తి ప్రదర్శన చేయడమే అమెకివ్వదగిన శుల్కమనీఎటువంటి వస్త్రవాహనాది అలంకారాలు ఇవ్వాల్సిన పనిలేదనీతన దగ్గరున్న ధనుస్సును ఎక్కుపెట్టగలవాడికే కూతురు సీతను ఇస్తానని అంటాడుఇంతవరకు తన దగ్గరకు వచ్చిన వారిలో ఎవరు కూడా వింటిని ఎక్కుపెట్టడం మాట అటుంచిఅల్లెతాడును ఎక్కించడం గానికనీసం వింటిని ఎత్తడం గాని చేయలేకపోయారని అంటాడు. అలా ధనుస్సు వృత్తాంతం చెప్పి దానిని శ్రీరామ లక్ష్మణులకు చూపించాడు. శ్రీరామచంద్రమూర్తి విల్లెక్కుపెట్టగలిగితే తాను అదృష్టవంతుడిననిఅయోనిజైన సీతను ఆయన కిస్తాననిఅంటాడు.

          శ్రీరాముడుధనుస్సుండే పెట్టె దగ్గరికిపోయిదాని మూత తెరిచితాను వింటిని చూసాననితాకానని చెప్పిఆయన ఆజ్ఞాపిస్తే బయటకు తీస్తానని అంటాడువింటిని బయటకు తీసి ఎక్కుపెడతానని కూడా అంటాడుఅలానే చేయమని జనకుడువిశ్వామిత్రుడు చెప్పారు రాముడితోఅవలీలగా వింటిని అరచేత్తో పట్టుకొనిబయటకు తీసిరాజులందరు చూస్తుండగా రాముడు అల్లెతాటిని బిగువుగా లాగుతుంటేనేవిల్లు ఫెల్లుమని రెండుగా విరిగిపోయిందిరామచంద్రమూర్తి భుజబలం చూసాననిసీత రామచంద్రమూర్తిని మగడిగా గ్రహించడమంటే అది తన అదృష్టమనితాను ధన్యుడనయ్యాననిఅంటాడు జనకుడుతన ముద్దుల కూతురు సీత దశరథ కుమారుడు శ్రీరామచంద్రుడిని భర్తగా పొందడంవల్ల తమ జనక కులానికి కీర్తి సంపాదించిపెట్టినట్లయిందని కూడా అంటాడు జనకుడు విశ్వామిత్రుడితో.

       ఆ తరువాత జరగాల్సిన కార్యక్రమం జరిపించడానికి దశరథ మహారాజుకు కబురు చేయడంఆయన మందీ మార్బలంతో మిథిలా నగరానికి రావడం జరిగింది. సీతా రాముల కళ్యాణానికి ముందు ఇరు వంశాల వారు వంశ క్రమాలను గురించి అడిగి తెలుసుకుంటారు.కన్యను ఇచ్చుకొనేటప్పుడుపుచ్చుకొనేటప్పుడుఅధమ పక్షం మూడు తరాల వంశ జ్ఞానం ప్రధానంగా తెలుసుకోవాలికులం తెలుసుకోకుండా కన్యను ఇవ్వకూడదు-తీసుకొననూ కూడదువివాహంలో వధూవరుల కుల జ్ఞానం అవశ్యంగా తెలియాలితొలుత తల్లి కులంతండ్రి కులం పరీక్షించాలిధన ధాన్యాలు ఎంత సమృద్ధిగా వున్నప్పటికీవివాహ విషయంలో పది రకాల వంశం వారిని వదలాలని శాస్త్రం చెపుతున్నదిజాతకర్మాది క్రియలు లేనిపురుష సంతానంలేనివిద్యా శూన్యమైమిగిలి దీర్ఘ రోగాలు కలదైమూల రోగాలు కలదైక్షయ-అజీర్ణం-అపస్మారం-బొల్లి-కుష్ఠు రోగాలు కలదైన వంశాలతో వివాహ సంబంధం చేయరాదుతోడబుట్టినవాడు లేని పిల్లనుతండ్రెవరో తెలియని దానిని వివాహం చేసుకోకూడదుఇక ఆ తరువాత సీతా కళ్యాణ ఘట్టం మొదలవుతుంది.

"సీతను సర్వాభరణోపేతను దా నిలిపి నగ్ని కెదురుగ గౌస
ల్యా తనయున  కభిముఖముగ,  క్ష్మాతలనాథుండు రామచంద్రున కనియెన్ "

          అన్ని విధాలైన అలంకారాలతో ప్రకాశిస్తున్న సీతనుఅగ్నికి ఎదురుగా-శ్రీరామచంద్రమూర్తికి అభిముఖంగానిలువబెట్టిజనక మహారాజు శ్రీరామచంద్రమూర్తితో:

ఈ సీత నాదుకూతురునీ సహధర్మచరి దీని నిం గై కొనుమా
కౌసల్యాసుతనీకును భాసురశుభ మగు గ్రహింపు పాణిం బాణిన్ "

కౌసల్యా కుమారాఈ సీత నా కూతురునీ సహధర్మచారిణి.ఈమెను పాణి గ్రహణం చేసుకోనీకు జగత్ ప్రసిద్ధమైన మేలు కలుగుతుందినీకు శుభం కలుగుతుందిమంత్రపూర్వకంగా ఈమె చేతిని నీ చేత్తో పట్టుకోరామచంద్రాపతివ్రత-మహా భాగ్యవతి అయిన నీ సీతనీ నీడలా ఒక్కసారైనా నిన్ను విడిచి వుండదుఅని అంటూమంత్రోచ్ఛారణతో పవిత్రవంతములైన జలధారలను రామచంద్రమూర్తి చేతుల్లో జనక మహారాజు ధారపోశాడుదేవతలుఋషులు మేలు-మేలనీభళీ అనీ శ్లాఘించారుసంతోషాతిశయంతో దేవతలు పూల వాన కురిపించారుదేవదుందుబులను చాలా సేపు మోగించారువాసవుడు మొదలైన పలువురు,తమ శోకత్వాన్ని-దీనత్వాన్ని తమ మనస్సులనుండి తొలగించుకున్నారు.


ఈవిధంగా మంత్రించిన జలాలను ధారపోసి భూపుత్రి సీతను శ్రీరామచంద్రమూర్తికిచ్చి వివాహం చేసానని జనక మహారాజు సంతోషిస్తూ లక్ష్మణుడివైపు చూసి, "లక్ష్మణా ఇటు రాదానంగా ఊర్మిళను స్వీకరించుప్రీతిపూర్వకంగా ఇస్తున్నానుఈమె చేతిని ప్రేమతో గ్రహించుమని కోరాడుఊర్మిళను లక్ష్మణుడికిచ్చిన తర్వాతభరతుడిని మాండవి చేతినిశత్రుఘ్నుడిని శ్రుతకీర్తి చేతిని గ్రహించమని ప్రేమతో పలికాడు జనకుడుఇలా నలుగురు కన్యలను దశరథుడి నలుగురు కొడుకులకు ధారపోసిజనకుడు రాజకుమారులతోదోష రహితమైన మనసున్న వారందరు సుందరులైన భార్యలతో కలిసిసౌమ్య గుణంగలవారిగానూ-సదాచార సంపన్నులుగానూ కమ్మని అంటాడుజనక మహారాజు మాటలను విన్న దశరథుడి కుమారులు-రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులుతండ్రి అనుమతితో భార్యల చేతులను తమ చేతుల్లో వుంచుకొనిసంతోషాతిశయంతోమలినం లేని భక్తితోఅగ్నికి-వేదికి-మౌనీశ్వరులందరికి-రాజులకు భార్యలతో కలిసి ప్రదక్షిణ చేసారువివాహం శాస్త్ర ప్రకారం ప్రసిద్ధంగా జరిగిందిపూల వాన కురిసింది.ఆకాశంలో దేవ దుందుభులు ధ్వనించాయిదేవతా స్త్రీలు నాట్యం చేసారుగంధర్వ కాంతలు పాడారురావణాసురుడి భయం వీడిసందుల్లో-గొందుల్లో దాక్కున్న వారందరు నిర్భయంగా-గుంపులుగుంపులుగా ఆకాశంలో నిలిచారుమంగళ వాద్యాలు మోగుతుంటేరామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు అగ్నికి మూడుసార్లు ప్రదక్షిణ చేయడంతో పెళ్లి తంతు ముగిసిందితమ భార్యలతో దశరథ కుమారులు విడిది ఇళ్లకు పోవడంతోవారివెంట దశరథుడువశిష్ట విశ్వామిత్రాది మునీశ్వరులతోబందువులతో విడిదికి పోయారు.

సీతా కల్యాణ ఘట్టం చదివినవారికి శ్రీ సీతా వివాహ విషయ చర్చకు సంబంధించి ఆసక్తి కలగడం సహజంకన్యాదానం చేస్తూ జనకుడు రాముడిని "కౌసల్యా సుతఅని సంబోధించాడుఎందుకు జనకుడు కౌసల్యా కుమారా అని పిలవాలిస్త్రీ పేరుతో పిలవకుండావాడుక పేరైన "రామాఅని పిలవచ్చు కదాదశరథ కుమారా అనకూడదాఆ రెండూ ఇప్పుడు సరిపోవని అర్థం చేసుకోవాలికేవలం రామా అని పిలిస్తే ఆ పేరుకలవారు మరొకరుండవచ్చు కదాదశరథ కుమారా అని పిలవడానికి ఆయనకు నలుగురు కొడుకుల్లో వేరొకరు కావచ్చు కదాకౌసల్యా కుమార అంటే ఏవిధమైన సందేహానికి తావుండదు. "ఈ సీతఅంటాడు రాముడితోసీతసిగ్గుతో తన చేయి పట్టుకొమ్మనితనంతట తానే రాముడిని అడగదురామచంద్రమూర్తి తనకు తానే సీత చేయి పట్టుకుంటేపెళ్లికాక ముందే ఎందుకలా స్వతంత్రించి కాముకుడిలా ప్రవర్తించాడని సీత అనుకోవచ్చు-లోకులూ భావించవచ్చుఅందుకే జనకుడు తానే సీతచేతిని రామచంద్రమూర్తికి చూపి "ఈ సీతఅని చెప్పాడుఅలంకరించబడిన కల్యాణమంటపంలోనలు వైపులా నిలువుటద్దాలు వేసి వుండడంతోఅన్నిటిలోనూ సీత రూపమే కనిపించసాగిందిఅద్దంలో సీతేదో-నిజమైన సీతేదో తెలుసుకోలేక నలుదిక్కులు చూస్తున్న రాముడి భ్రమపోయేట్లుచేయి చూపి "ఈ సీతఅని చెప్పాడు జనకుడు.

"ఈ సీతఅంటే, అతి రూపవతైన సీతనిసౌందర్య-సౌకుమార్య-లావణ్యాదులలో స్త్రీలందరినీ అతిశయించిందని అర్థంకూడా వస్తుంది. "ఈ సీతఅంటే, "ఈ యగు సీతఅనే అర్థం కూడా వుందిరాముడెప్పుడైతే శివుడి విల్లు విరిచాడోఅప్పుడే అతడు శివుడికంటే గొప్పవాడైన విష్ణువని జనకుడు గ్రహించాడుఅలాంటి ఆమెకు సాక్షాత్తు లక్ష్మీదేవైన సీతను ఇస్తున్నాననే అర్థమొచ్చే విధంగా "ఈ సీతఅన్నాడురాముడెంత మహా సౌందర్య పురుషుడని పేరుందోఅంతకంటే తక్కువ కాని సౌందర్యం ఆమె కుందని చెప్పదల్చుకున్నాడు జనకుడుసీత అంటే కేవలం నాగటి చాలనే కాదనినాగటి చాలు భూమిని ఛేదించుకొని రూపంకలదిగా ఎలా అవుతుందోఅలానే భూమిని ఛేదించుకొని రావడంవల్ల సీత అనే పేరు ఆమెకు ప్రఖ్యాతమయిందిదీనివల్ల ఆమె ఆభిజాత్యం తెలుస్తున్నదిసీత-నాగటి చాలు-అంటే కాపువాడి కృషి ఫలింపచేసివాడికి ఫలం కలిగించేదిఅలానే రాముడు చేయబోయే కార్యాలన్నీసీత వలనే ఫలవంతమవుతాయనీఆమె సహాయం లేకుండా రాముడి కృషి వ్యర్థమనిప్రతిఫలాపేక్ష లేకుండా అతడికి సహాయపడుతుందని జనకుడి మనస్సులోని ఆలోచన.

          ఆకాశ గంగానది శాఖైన సీత ఏవిధంగా ఒకసారి తనను సేవించినవారి పాపాలను ధ్వంసం చేస్తుందోఅలానే "ఈ సీతతనకొక్కసారి నమస్కారం చేసిన వారి పాపాలను ధ్వంసంచేస్తుందికౌసల్యా సుతుడైన రాముడు యోనిజుడనిసీత అయోనిజనికాబట్టి ఆభిజాత్యంలో రాముడికంటే తక్కువైందేమీ కాదని జనకుడి భావనసీత నాగటి చాలులో దొరికినప్పటికీ జనకుడు సగర్వంగా, "నాదుకూతురు"-తన కూతురని చెప్పాడుఅలాంటి తనకూతురునుఎలా ప్రేమించాలో అలానే ప్రేమించమని సూచించాడుసీతంటే జన్మపరిశుద్ధి అనీ, "నాదుకూతురుఅంటే నానా సపరిశుద్ధి అనీ తెలుపబడింది. "నీ సహధర్మచరిఅనడమంటేరాముడి విషయంలో ఎలా వుంటుందోనని ఆలోచించాల్సిన పనిలేదనే అర్థం స్ఫురిస్తుందిరాముడేది ధర్మమని భావిస్తాడోఆ ధర్మమందే ఆమె ఆయనకు తోడుగా వుండి ఆ కార్యాన్ని నిర్వహిస్తుందిరాముడు తండ్రి వాక్యాన్ని ఎలా పాలించాడోఅలానే ఆయన వాక్యాన్ని సీత పాలిస్తుందని అర్థంసీతే లక్ష్మీదేవి అయినందువల్లవిష్ణువు అవతారమైన రాముడి కైంకర్యమే ఆమె స్వరూపంసృష్టిలోరక్షణలోసంహారంలో ఆమె ఆయనకు సర్వకాల సర్వావస్థలందు తోడుగా వుంటుందివివాహ లీల కేవలం లోక విడంబనార్థమేననిఆయన సొత్తును ఆయనే తీసుకొమ్మని కూడా అర్థం.

No comments:

Post a Comment