Saturday, April 6, 2019

రాబోయేది ఫెడరల్ ఫ్రంటే : వనం జ్వాలా నరసింహారావు


రాబోయేది ఫెడరల్ ఫ్రంటే
వనం జ్వాలా నరసింహారావు
నమస్తే తెలంగాణ దినపత్రిక (07-04-2019)
          ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఏం జరగబోతుందో ఇప్పుడిప్పుడే స్పష్టంగా ఊహించడం కొంత సాహసమే అయినప్పటికీ, ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకోనున్నవనేది తధ్యమే అనాలి. పరిస్థితి తప్పకుండా మారుతుంది. మోడీ మళ్లీ అధికారంలోకి రావడం అంత తేలికైన విషయం కాకపోవచ్చుకూడా! అందులో సందేహం లేదు. లోతుగా విశ్లేషిస్తే....

2014 లోక్ సభ ఎన్నికల అనంతరం ఏర్పాటైన ఎన్డీయే ప్రభుత్వంలోభాగస్వామ్య పక్షాలుగా శివసేన, టీడీపీ లతో పాటు చిన్నా-చితకా పార్టీలు పది దాకా వున్నాయి. వీటిలో శివసేన (18)- టీడీపీ (16) లదే  చెప్పుకోదగ్గ సంఖ్యా బలం వున్న పార్టీలు. మిగతావాటి సంఖ్యా బలం ఒకటి నుండి ఆరు వరకు మాత్రమే. పేరుకైతే ఎన్డీయేలో 32 పార్టీలున్నాయి. ప్రతిపక్ష పార్టీలలో అధిక సంఖ్యలో భారత జాతీయ కాంగ్రెస్ (46) వుండగా, ఏఐడీఎంకె (37), తృణమూల్ కాంగ్రెస్ (33), బీజేడీ (20), టీఆరెస్ (12) ఆ తరువాతి స్థానాల్లో వున్నాయి. ఇక బీజేపీకి స్వయానా 280 మంది సభ్యులతో స్వయంగా మెజారిటీ వుంది. 2014 ఎన్నికల్లో బిజెపికి మిత్రపక్షంగా ఉండి, కలిసి పోటీ చేసిన తెలుగుదేశం లాంటి కొన్ని పార్టీలు ఇప్పుడా పార్టీకి దూరమయ్యాయి.

ఈ నేపధ్యంలోఇప్పుడు జరుగుతున్న ఎన్నికల అనంతరం, ప్రాంతీయ పార్టీల సారధ్యంలో, అండదండలతో(బీజేపీయేతర) ఎన్డీయేతర, (కాంగ్రెసేతర) యూపీయేతర ఫెడరల్ ఫ్రంట్ సంకీర్ణ ప్రభుత్వం రావడానికి అవకాశాలు మెండుగా, దండిగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం వున్న ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు కొన్ని, యూపీఏ భాగస్వామ్య పక్షాలు కొన్ని ఎన్నికలయ్యేంతవరకు బీజేపీతో, కాంగ్రెస్ తో కలిసి వున్నా, ఆ తరువాత స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నాయి. ఎప్పటికీ అటు కాంగ్రెస్ వారినో, లేదా బీజేపీ వారినో ఎందుకు ప్రధాని చేయాలి? తమలోనే ఒకరు కాకూడదా అనే అభిప్రాయానికి (వాళ్ళతో అంటకాగిన) ప్రాంతీయ పార్టీలు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక బీజేపీ "యాంటీ ఇన్‍కంబెన్సీనితట్టుకోవాల్సిన పరిస్థితిలో లేదు! డీమోనిటైజేషణ్, జీఎస్టే నేపధ్యంలో ప్రజల్లో పెల్లుబికిన ఆగ్రహం ఆ పార్టీని ఓటమి దిశగా తీసుకుపోయే ప్రమాదం స్పష్టంగా పొంచి వుంది. అలా అని చెప్పి పరిణితిలేని రాహుల్ గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ కు అధికారం అప్పగించడానికి ప్రజలు సిద్ధంగా లేరు.  

భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటినుంచినేటిదాకాగత ఏడు దశాబ్దాల కాలంలోరాజకీయాలలో గణనీయమైన మార్పులు వచ్చాయిఆ మార్పులను వివిధ కోణాలనుంచి పరిశీలన చేయవచ్చుఆ మార్పులలో ప్రధానంగా గమనించాల్సిన విషయంప్రాంతీయ పార్టీల ప్రాముఖ్యత పెరగడంఒకప్పుడు ఏ ఒకటో-రెండో రాష్ట్రాలకే పరిమితమైన ప్రాంతీయ పార్టీలు ఇప్పుడు దాదాపు ప్రతి రాష్ట్రంలోనూ వేళ్ల్లూనుకు పోయిపార్లమెంటులో తమ బలాన్ని చాటుకుంటున్నాయిగత రెండు-మూడు సార్వత్రిక ఎన్నికలలో ప్రాంతీయ పార్టీలకు వచ్చిన ఓట్ల శాతాన్ని గమనిస్తేజాతీయ పార్టీలకంటే అవి అధికంగా, దాదాపు ఎబి శాతం పైగా వున్నాయిఅంటే జాతీయ పార్టీల ప్రాముఖ్యత జాతీయ స్థాయిలో తగ్గుకుంటూ పోతుంటేప్రాంతీయ పార్టీల ప్రాధాన్యత పెరుక్కుంటూ పోతోందిభారత దేశ రాజకీయ రంగంలో చోటుచేసుకుంటున్న మరో ప్రధానాంశంవోటు వేసే వారిలో అధిక శాతం మంది బలహీన వర్గాలకుఅణగారిన వర్గాలకు చెందిన వారు కావడంమహిళలు కూడా పెద్ద ఎత్తున పురుషులకంటే అధికంగా ఓటింగ్‌లో పాల్గొనడం విశేషంఈ నేపధ్యంలో ఇక్కడ కొన్ని మౌలికాంశాలను పరిగణలోకి తీసుకోవాలి.

ఒకవైపు ప్రాంతీయ పార్టీలు బలంగా పాతుకు పోతుంటేమరొక వైపుజాతీయ పార్టీలు బలహీన పడిపోవడంతోపార్లమెంటులో మెజారిటీ స్థానాలను సంపాదించుకోవడం ఏ ఒక్క జాతీయ పార్టీకి సాధ్యపడదుమెజారిటీకి దగ్గరగా రావడం కూడా కష్టమేఎప్పుడైతేఏ ఒక్క జాతీయ పార్టీ మెజారిటీ స్థానాలను సంపాదించుకోలేదోఇప్పటి లాగేప్రాంతీయ పార్టీలతో కలిసి కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయడం మినహా గత్యంతరం లేదు

ఆరు దశాబ్దాల భారతదేశ రాజకీయ రంగంలో గణనీయమైన మార్పులు రావడంతోనుప్రాంతీయ పార్టీలు అధికసంఖ్యలో ఆవిర్భవించడంతోనుఎన్నికల ముఖ చిత్రమే పూర్తిగా మారిపోయిందిఒక్కో ఎన్నిక జరిగే కొద్దీపోటీలో వుండే పార్టీల సంఖ్య పెరగ సాగింది. 1952 లోక్ సభ ఎన్నికలలో కేవలం 55 పార్టీలు మాత్రమే రంగంలో వుంటే, 2009 ఎన్నికల కల్లా వాటి సంఖ్య 370 కి చేరుకుందిఇంతవరకు జరిగిన అన్ని ఎన్నికలను పరిగణలోకి తీసుకుంటే, 1957 లో మాత్రమే అతి తక్కువగా కేవలం 16 పార్టీలు మాత్రమే పోటీలో వుండగాఅత్యంత అధిక సంఖ్యలో 2009 లో పోటీకి దిగాయివీటి సంఖ్య రాబోయే ఎన్నికలలో ఇంకా పెరగొచ్చుమొదటి ఎన్నికలలో పోటీ చేసిన 55 పార్టీలలో, 18 రాష్ట్ర స్థాయి పార్టీలు, 29 రిజిస్టర్డ్ పార్టీలు కాగా జాతీయ పార్టీల సంఖ్య కేవలం 8 మాత్రమేవాటి సంఖ్య 2004 లో 6 కు పడి పోయిందికాగా అదే ఎన్నికలలో పోటీలో వున్న 230 పార్టీలలో, 36 ప్రాంతీయ పార్టీలు, 188 రిజిస్టర్డ్ పార్టీలు వున్నాయిదానర్థం ఒకవైపు ప్రాంతీయ-రిజిస్టర్డ్ పార్టీల సంఖ్య పెరుగుతూ పోతుంటేజాతీయ పార్టీల సంఖ్య తగ్గుకుంటూ పోతోందిఅదే విధంగా 1952 లోక్ సభ ఎన్నికల అనంతరం పార్లమెంటులో 22 పార్టీలకు ప్రాతినిధ్యం లభించగా, 2009 ఎన్నికల అనంతరం 37 పార్టీలకు ప్రాతినిధ్యం లభించిందిఅత్యంత తక్కువగా కేవలం 12 పార్టీలకు మాత్రమే ప్రాతినిధ్యం లభించింది 1957 ఎన్నికల అనంతరంఏ విధంగా పార్టీల సంఖ్యఅవి పార్లమెంటులో ప్రాతినిధ్యం వహించే వాటి సంఖ్య పెరుగుకుంటూ పోతుందో ఈ లెక్కలు తెలియచేస్తాయి.

ప్రాంతీయ పార్టీల సంఖ్య పెరగడమంటేరాజకీయ పోటీ తత్వంలో మార్పుల రావడమేమొదట్లోరాష్ట్ర శాసన సభలలో జాతీయ పార్టీలకు పోటీగా వున్న ప్రాంతీయ పార్టీలు దరిమిలా పార్లమెంటులో జాతీయ పార్టీలను శాసించే స్థాయికి చేరుకున్నాయిఒక్కో రాష్ట్రంలోఒక్కో ప్రాంతీయ పార్టీకి ప్రజల మద్దతు-ఓటర్ల మద్దతు లభిస్తున్న తీరుతెన్నులను పరిశీలిస్తేవారు పూర్తిగా జాతీయ పార్టీలను మరిచిపోతున్నారేమో అనిపిస్తోందికొన్ని రాష్ట్రాలలో ప్రధాన పోటీ ఒక ప్రాంతీయ పార్టీకిఏదో ఒక జాతీయ పార్టీకి మధ్యన వుంటేతమిళనాడు లాంటి రాష్ట్రాలలో ఆ పోటీ ఒక ప్రాంతీయ పార్టీకిమరో ప్రాంతీయ పార్టీకి మధ్యనే వుంటోందిఎన్నికల రంగంలో ఆ రాష్ట్రాలలో జాతీయ పార్టీలు మూడు-నాలుగు స్థానానికి పరిమితమై పోవడం కూడా కష్టమవుతోందిప్రాంతీయ పార్టీలతో పోల్చి చూస్తేదేశం మొత్తం మీద జాతీయ పార్టీలకు పోలైన ఓట్ల శాతం తగ్గుకుంటూ వస్తోందిప్రధానంగా 1996 ఎన్నికల తరువాత ఈ పరిస్థితి ప్రస్ఫుటంగా కనిపిస్తోందిఒకవైపు గెలిచిన స్థానాల సంఖ్యను పెంచుకుంటూ పోతున్న ప్రాంతీయ పార్టీలుమరో పక్క ఓటింగ్ శాతాన్ని కూడా పెంచుకుంటున్నాయి. 2014 సార్వత్రిక ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధించిన బీజేపీ ఓటింగ్ శాతం కేవలం 31 మాత్రమే. భాగస్వామ్య పక్షాలతో కలిపితే 38.5%, అలాగే కాంగ్రెస్ ఓటింగ్ శాతం 19.3. భాగస్వామ్య పక్షాలతో కలిపితే 23%. ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీజేపీకి, ప్రతిపక్షంలో వున్న కాంగ్రెస్ కు కలిపి వచ్చిన ఓట్లు కేవలం 50% మాత్రమే. అంటే మిగిలిన ఓట్లన్నీ ప్రాంతీయ పార్టీలవే!

1984 లో ప్రాంతీయ పార్టీలన్నిటికీ కలిపి 11.2% ఓట్లు రాగా, 2009 ఎన్నికల నాటికి 28.4% కి పెరిగింది2014 లో సుమారు 50% కి చేరుకుంది.  దానర్థం ఈ ఎన్నికల్లో జాతీయ పార్టీలకు (బీజేపీ, కాంగ్రెస్ రెంటికీ కలిపి) రెండు వందల నుంచి రెండువందల ఏబై స్థానాలకు మించి రావు. రావడం కష్టమే!  ఎక్కువమంది ఓటర్లలో జాతీయ పార్టీలకంటే ప్రాంతీయ పార్టీలే మంచివన్న అభిప్రాయం వుందిరాష్ట్రాల పాలన ప్రాంతీయ పార్టీల చేతుల్లో వుండాలని కోరుకోవడంతో పాటురాష్ట్ర ప్రభుత్వాల అవసరాలకు అనుగుణంగా కేంద్రం నడుచుకోవాలంటేపార్లమెంటులో కూడా వాటికి గణనీయమైన స్థానాలను గెలిపించాలని ఓటర్లు భావిస్తున్నారు.

జాతీయ పార్టీలకు, ప్రాంతీయ పార్టీలకు విజయావకాశాలు ఎలా ఉంటాయి? వాటి పాత్ర ఎలా ఉండబోతుంది? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న అయినప్పటికీ, సమాధానం లేకపోలేదు. స్పష్టమైన సమాధానమే ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొద్దికాలం క్రితం దేశ ప్రజలకిచ్చిన “ప్రస్తుత రాజకీయ వ్యవస్థలో గుణాత్మక మార్పు” కోసం ప్రయత్నమనే పిలుపు ఈ సందర్భంగా గమనంలోకి తీసుకోవాల్సిన అంశం. దేశంలో క్రమేపీ చోటు చేసుకున్న పరిణామాలు గుణాత్మక మార్పు రావాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పాయి. ఈ దేశానికి ఏమి కావాలి? వ్యవస్థలో ఎలాంటి మార్పు తేవాలి? అనే విషయాలపై అటు అధికార పక్షంలోని బిజెపి, దాని మిత్రులకు గానీ, ప్రతిపక్షంలోని  కాంగ్రెస్, దాని మిత్రులకు గానీ స్పష్టత లేదు. నరేంద్రమోడీ ఎన్నికల ప్రసంగాలను నిశితంగా గమనిస్తే అసలాయన దేశానికి ఇంతకాలం చేసింది ఏమిటి, చేయదల్చుకున్నది ఏమిటి అనే విషయంలో స్పష్టత లోపించినట్లు అవగతమౌతుంది. రాహుల్ గాంధీ విషయం చెప్పక్కర లేదు.

స్వాతంత్ర్యం వచ్చి 70 ఏండ్లు పూర్తయినా దేశంలో ప్రజలు ఇంకా కనీస అవసరాల కోసం పోరాడుతూనే ఉన్నారు. మౌలిక సదుపాయాలే సమకూరలేదు. ఈ అంశాలను, ఇటు మోడీ కానీ కానీ అటు రాహుల్ కానీ ప్రస్తావించలేకపోతున్నారు. చైనా, జపాన్, దక్షిణ కొరియా, సింగపూర్, తైవాన్, మలేసియా, ఇండోనేసియా, థాయిలాండ్, వియత్నాం, ఫిలిప్పీన్స్ తదితర ఎన్నో దేశాలు అభివృద్ధిలో దూసుకుపోతుంటే, భారతదేశం ఎందుకు వెనుకబడిపోతుందో, ఈ దేశానికున్న అవరోధాలేంటో ఇప్పటిదాకా ఈ దేశాన్నేలిన కాంగ్రెస్, బిజెపిలు చెప్పలేకపోయాయి. చెప్పలేని పరిస్థితిలో వుండడం దురదృష్టం.

భారతదేశం అనుకున్నంత వేగంగా అభివృద్ధి చెందకపోవడానికి కారణమైన ఈ రెండు జాతీయ పార్టీల్లో ఎవరూ కూడా దేశానికి కావాల్సినందేంటో, తేవాల్సిన సంస్కరణలేంటో విడమరిచి చెప్పలేకపోతున్నారు. దేశ సంపదను ఎలా పెంచుకోవాలో, రాష్ట్రాలు ఎలా శక్తివంతం కావాలో, పేదరికాన్ని ఎలా తరిమికొట్టాలో, దేశాభివృద్ధి నమూనాను ఎలా రూపొందించాలో రెండు జాతీయ పార్టీలూ చెప్పడంలేదు. కాంగ్రెస్ కానీ, బిజెపి కానీ తమ మెదళ్లకు పదును పెట్టి, ఈ సమయానికి దేశానికి ఏమి కావాలనే విషయంలో వినూత్నంగా ఆలోచించే ప్రయత్నం చేయలేదు. ఒకరిని ఒకరు నిందించుకోవడానికే తమ శక్తినంతా ఉపయోగించుకున్నారు. దేశాన్ని శక్తివంతం చేయడం, ఆర్థిక సంస్కరణలు, రాజ్యాంగపరమైన సంస్కరణలు, ఎన్నికల సంస్కరణలు, న్యాయవ్యవస్థలో సంస్కరణలు, పరిపాలన సంస్కరణలు తదితర అంశాలపై ఏమాత్రం చర్చ జరగలేదు. ఈ విషయాలను జాతీయ రాజకీయ పార్టీలు ప్రస్తావించలేదు. గుణాత్మక మార్పు కోసం జాతీయ ఎజెండా రూపొందిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పైన పేర్కొన్న అంశాలన్నింటినీ ఎప్పటికప్పుడు ఎన్నికల సభల్లో ప్రేక్షకుల హర్షధ్వానాల మధ్య ప్రస్తావిస్తూ వచ్చారు.

ప్రస్తుత పరిస్థితిని పరిశీలిస్తే, మోడీ ప్రభుత్వం మళ్లీ వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయిదాదాపు మృగ్యమే. గణాంకాలు కూడా అదే విషయం స్పష్టం చేస్తున్నాయి. దేశ వ్యాప్తంగా ఏ రాష్ట్రంలో ఏ పార్టీ బలంగా ఉందనే విషయం పరిగణలోకి తీసుకుని, అవి గెలిచే లోక్ సభ స్థానాలు అంచనా వేస్తే కాంగ్రెస్ కానీ, బిజెపి కానీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఏ మాత్రం కనిపించడం లేదు.

దక్షిణాది రాష్ట్రాలైన కేరళ, తమిళనాడు, పాండిచ్చేరి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తో పాటు పశ్చిమబెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో మొత్తం 165 లోక్ సభ స్థానాలున్నాయి. వాటిలో బిజెపి ఒక్క సీటు కూడా గెలిచే అవకాశం లేదు. ఇక మిగిలిన 378 స్థానాల్లోనే బిజెపి 273 స్థానాలు గెలుచుకోవాలి. ఇది అంత సులభం కాదు. ఎన్.డి.ఏ. కూటమిగా కూడా అధికారంలోకి రావడం కష్టమే అనిపిస్తుంది. ఈ పరిస్థితుల్లో 38 స్థానాలున్న ఈశాన్య రాష్ట్రాలు, కేంద్ర పాలిత రాష్ట్రాలు, జమ్మూ కాశ్మీర్, గోవా లాంటి రాష్ట్రాల్లో మాత్రమె బిజెపి చాకచక్యంగా వ్యవహరించితే, లబ్ది పొందే అవకాశాలు కొంతమేరకున్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో కూడా పరిస్థితి రోజు-రోజుకూ మారుతున్నది.

ఉత్తరఖండ్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, చత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో 100 సీట్లున్నాయి. ఈ రాష్ట్రాల్లో ప్రస్తుతం బిజెపికన్నా కాంగ్రెస్ పరిస్థితే మెరుగ్గా ఉంది. 182 సీట్లున్న ఉత్తర ప్రదేశ్, బీహార్, జార్ఖండ్, మహారాష్ట్రలో కాంగ్రెస్ ఒంటిరిగా పోటీ చేయాల్సి ఉంది. ఈ రాష్ట్రాల్లో ఎక్కువ సీట్లు పొందే అవకాశం కాంగ్రెస్ పార్టీకి లేదు. ఈ రాష్ట్రాల్లో బిజెపి కూడా అంత బలంగా ఏమీ లేదు. కాంగ్రెస్ పార్టీకి ఎటొచ్చీ 101 స్థానాలున్న కేరళ, కర్ణాటక, పంజాబ్, హర్యానా, ఈశాన్య రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎక్కువ సీట్లు గెలుచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 100 సీట్లున్న మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్, రాజస్థాన్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరఖండ్ రాష్ట్రాల్లో మాత్రమే ప్రాంతీయ పార్టీలు బలంగా లేవు. 425 స్థానాలున్న ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, ఒడిస్సా, తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, మహారాష్ట్ర, జార్ఖండ్, అస్సాం, పంజాబ్, బీహార్, జమ్ము కాశ్మీర్, హర్యానా, కేరళ రాష్ట్రాల్లో కాంగ్రెస్, బిజెపితో సంబంధం లేకుండానే ప్రాంతీయ పార్టీలు దాదాపు 275 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. ప్రభుత్వం ఏర్పాటుచేయడానికి ఇది మ్యాజిక్ ఫిగర్ కంటే ఎక్కువ. మొత్తంగా తేలేదేమిటంటే, వచ్చే ఎన్నికల్లో బిజెపి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయ శక్తిగా కనిపించడం అసలే లేదు. ఈ పరిస్థితుల్లో చాలా రాష్ట్రాల్లో బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలే ఎక్కువ సీట్లు గెలుచుకుని కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. అదే జరిగితే, కేసీఆర్ ప్రతిపాదిస్తున్న జాతీయ ఎజెండా అమలయ్యేందుకు మార్గం సుగమం అవుతుంది. ఇతర ప్రాంతీయ పార్టీలతో కలిసి, కేసీఆర్ జాతీయ స్థాయిలో ఫెడరల్ ఫ్రంట్ ప్రత్యామ్నాయ కూటమిని నడిపించే అవకాశాలు కూడా పుష్కలంగా కనిపిస్తున్నాయి.

అంటే, ఇప్పుడు జరుగుతున్న లోక్ సభ ఎన్నికలలో ప్రాంతీయ పార్టీలదే హవా కానుంది. 250 కి పైగా స్థానాలు గెల్చుకునే ప్రాంతీయ పార్టీలన్నీ ఫెడరల్ ఫ్రంట్‌గా ఏర్పడితే జాతీయ పార్టీల పరిస్థితి డోలాయమానంలో పడినట్లేఅందుకే రాబోయే ది ప్రాంతీయ పార్టీల సంకీర్ణ ఫెడరల్ ఫ్రంట్ కేంద్ర ప్రభుత్వంఅదే బీజేపీయేతర, కాంగ్రెసేతర ఫెడరల్ ఫ్రంట్ ఫ్రభుత్వం. అందులో టీఅరేస్, దాని అధినేత కేసీఆర్ కీలకపాత్ర పోషించడం తధ్యం. ఇక భారతదేశ గమ్యం, గమనం మారడం కూడా తధ్యమే! జాతీయ పార్టీలూ తస్మాత్ జాగ్రత్త!

3 comments:

 1. దూరదృష్టి లోపం!

  "250 కి పైగా స్థానాలు గెల్చుకునే ప్రాంతీయ పార్టీలన్నీ ఫెడరల్ ఫ్రంట్‌గా ఏర్పడితే జాతీయ పార్టీల పరిస్థితి డోలాయమానంలో పడినట్లే!"
  నిజానికి మొదట డోలాయమానంలో పడేది అలా ఏర్పడే సంకీర్ణప్రభుత్వం. ఈలాంటి కలగూరగంప ఎన్నాళ్ళు ఒక్కట్రాటిపై నిలుస్తుంది? పెద్దపెద్ద వ్యాసాలు దంచే మీకు తెలియదా, ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడల్లా లోగడ ఏమి జరిగిందో?

  "అందులో టీఅరేస్, దాని అధినేత కేసీఆర్ కీలకపాత్ర పోషించడం తధ్యం"
  అదేమరి! ఇప్పటినుండే ప్రతి పార్టీ అధినేతా తానే చక్రం తిప్పా లనుకుంటున్నా డన్నమాట. ఇక చక్రం తిరగటం మాట అటుంచి, విరగటం తధ్యం!

  "జాతీయ పార్టీలూ తస్మాత్ జాగ్రత్త!"
  భారతప్రజానీకమా తస్మాత్ జాగ్రత జాగ్రత. ఇలాంటి ఆశపోతు పార్టీల చేతుల్లో దేశభవిష్యత్తును పెట్టే అమాయకపు ఆలోచన చేయకండి.

  ReplyDelete
 2. Fedaral front- After 2019 elections- Imaginary picture.
  KCR is promoting a third front after the results declared. The following is an imaginary picture.
  After the parliamentary elections the following are the results declared and no party gaining a majority of its own.
  Congress 120
  BJP 120
  As they are not in position to form a Govt. KCR made an attempt to form a Govt. of regional parties to make stable Govt at center. The seats gained in parliament by the regional parties irrespective of their affiliations.
  Mamata 35
  Maya 35
  Akhilesh 35
  Lalu 15
  JDU 15
  Kejrival 2
  Pavar 15
  Siva Sena 15
  BJD 15
  JDS 5
  CBN 8
  Jagan 16
  Pavan 1
  TRS 16
  MIM 1
  AIADMK 20
  DMK 20
  CPM 10
  Total 250 It is still short of magic figure of 272. How the federal front will form a Govt is to be seen.
  Others 50
  Grad total 300+243+543
  Now a grand alliance meeting was called for by KCR and the following attended the meeting. Mamata,Maya,Akhilesh,Kejrival,Tejasvi, Nitish, CBN,Jagan, AIADMK,Stalin, Seetaram Yecuri,Devegowda, Sharadpavar and from Siva sena.

  Imaginary meeting to be continued

  ReplyDelete
 3. It is assumed that the regional parties will participate in federal front irrespective of their affiliations.

  ReplyDelete