Thursday, December 19, 2024

Kalinga War, Atom Bomb, Artificial Intelligence : Vanam Jwala Narasimha Rao

 Kalinga War, Atom Bomb, Artificial Intelligence

Vanam Jwala Narasimha Rao

Telangana Today (20-12-2024)

{Repentance may spark transformation and guide the world towards a more responsible future. Drawing lessons from Ashoka, Oppenheimer, Hinton, and now Suchir Balaji’s experiences and warnings is certainly advantageous} – Editor Note 

Twenty-six-year-old Suchir Balaji, an ‘OpenAI Researcher-Turned-Whistleblower,’ who publicly spoken against ‘Artificial Intelligence Company OpenAI's Practices’ was found dead in San Francisco (USA). In an interview with the New York Times, Balaji revealed his growing concerns about the potential societal harm of the technology, particularly criticizing OpenAI's alleged use of copyrighted data. He said OpenAI violated the law and that technologies like ChatGPT were damaging the internet. Suchir Balaji, according to his LinkedIn profile, a computer science student at the University of California, worked with OpenAI for about 4 years, from November 2020 to August 2024. Well, this is an indication of the ‘Ill-Effects of Artificial Intelligence.’  

In the quest for ‘Authority, Domination, and Development’ intelligentsia ‘Create Forces or Systems’ which of late are characteristically labelled as ‘Artificial Intelligence (AI),’ often going beyond their control. Since the times of ‘Horrors of Kalinga War’ through the ‘Detonation of Nuclear Weapon (Atomic Bomb)’ or the ‘Unleashed Potential of AI’ the realization of the harm caused can awaken a deep sense of regret. Emperor Ashoka turned to peace after witnessing the destruction of Kalinga, Robert Oppenheimer reflected on the irreversible consequences of Atomic Bomb, and Geoffrey Everest Hinton cautioned the world about the dangers of unchecked innovation. Suchir Balaji too might have done the same.

Advancements in AI

Intelligentsia of 'Artificial Intelligence' like Geoffrey Hinton, Demis Hassabis, John M Jumper, and John Hopfield, were awarded 2024 Nobel Prizes, recognizing their innovative contributions, associated with groundbreaking advancements in AI. Demis Hassabis, John M Jumper (Google DeepMind), and Geoffrey Hinton (Distinguished Researcher at Google Brain) were associated with Google. Thus, three from Google in the same year are awarded the World’s Highest Prize. Great!   

The work of Hinton and Hopfield established AI as a field bridging ‘Computational and Physical sciences’ offering tools for both theoretical exploration and practical application. Hassabis and Jumper contributed to the development of ‘AlphaFold’ using AI system, that revolutionized ‘Protein Structure Prediction,’ that involves determining the three-dimensional arrangement of atoms in a protein based amino acid sequence, using computational methods. Their Work has profound implications for biology and medicine, enabling researchers to accelerate drug discovery, understand diseases at molecular level, and address challenges like antibiotic resistance. AI's role in protein structure prediction illustrates both its transformative potential and the ethical responsibilities accompanying its use. 

Geoffrey Everest Hinton, known as the ‘God Father of AI and Deep Learning’ together with John Hopfield pioneered the work on ‘Neural Networks’ that is made possible through ‘Backpropagation Algorithm’ to learn from errors, which laid the foundation for ‘Modern Deep Learning.’ This innovation is instrumental in diverse AI applications, from computer vision to language processing. Hinton, born in UK, in his PhD thesis from Edinburgh University, focused on ‘Error-Correcting Codes and Distributed Representations in Neural Networks.’ His foundational work shaped AI's trajectory. Notwithstanding his receiving the coveted Nobel Prize, Hinton has been consistently vocal about AI's potential risks. 

Hinton resigned from Google in 2023 to warn and express his concerns about the ‘Dangers of Unchecked AI Advancements,’ its use in misinformation, and potential threats to humanity. The recognition of Hinton and Hopfield highlights the transformative impact of AI across disciplines. Hinton and Hopfield provided the theoretical and algorithmic frameworks that made deep learning possible, while Hassabis and Jumper demonstrated AI’s capacity to tackle real-world scientific challenges. At the same time, these achievements underscore the dual-edged nature of AI. While its potential for societal benefit is immense, the ethical and existential challenges it poses remain significant.  

Need for AI

Genesis, need, concept, evolution, and effects of 'Artificial Intelligence,’ a necessary evil, are quite interesting. The term AI was coined in 1956, during the workshop known as ‘Dartmouth Conference’ or referred to as the 'Constitutional Convention of AI.' held in New Hampshire, as a result of fusing together, ‘Philosophy, Mathematics, and Computer science.’ Claude Shannon, John McCarthy, Nathaniel Rochester and Marvin Minsky, are considered as the founding fathers of AI.   

The need for AI arose from humanity’s desire to automate tasks, enhance efficiency, and address complexities that exceed human cognitive capacities, like solving mathematical problems, simulating chess games, developing expert systems in fields like medicine. Over the decades, AI’s potential grew exponentially, and gradually-from symbolic AI in its early days, which relied on logic and rule-based systems, the field shifted to data-driven methods like ‘Neural Networks.’ 

Necessary Evil

AI’s evolution has significant milestones, including the advent of conversational agents like ‘ChatGPT.’ AI deliberately transformed as a ‘Necessary Evil’ profoundly impacting every aspect of human life, that included surveillance systems, often eroding civil liberties. AI embodies promise and perils of modern innovation, and hence, balancing its transformative capabilities with safeguards against misuse remains a challenge.  

In this context, for a comparison of ‘Effects and Adverse Effects’ delving in to genesis of the ‘First Nuclear Weapon,’ to be more precise, ‘The First Atomic Bomb’ (Little Boy) detonated over a populated area, occurred on August 6, 1945 over the Japanese city of Hiroshima, while the ‘Second Atomic Bomb’ (Fat Man) detonated on August 9, 1945 over Nagasaki, may perhaps be appropriate. 

The development of nuclear weapons was part of the secret USA Government ‘Research Initiative’ during World War II, the Manhattan Project. Accordingly, the world's ‘First Nuclear Explosion’ or testing the ‘World's First-Ever Atomic Bomb’ called 'The Gadget' occurred on July 16, 1945. The device was tested successfully in Los Alamos, as approved earlier, as the site for ‘Atomic-Bomb Scientific Laboratory’ on November 25, 1942, by Brigadier General Leslie R Groves and Physicist J Robert Oppenheimer. The code name for the test was 'Trinity.' 

Robert Oppenheimer, the ‘Father of Atomic Bomb,’ after the bomb was dropped by the USA Bomber ‘Enola Gay’ causing unprecedented destruction, killing several and leaving many with effects like radiation sickness, injuries, burns, cancer, genetic damage, and psychological trauma for decades, was reported to have expressed deep repentance. He quoted ‘Bhagavad Gita,’ and said, ‘Now I am become Death, the destroyer of worlds.’ He read Gita and Megha Duta in Sanskrit. Inspired by Gita's lessons, that shaped his philosophy of life, he always kept a copy of Gita near his bedside. He opposed development of ‘Hydrogen Bomb.’ The Nuclear Non-Proliferation Treaty (NPT) had its origin in Robert Oppenheimer’s advice. 

Repentance of Emperor Ashoka, Robert Oppenheimer, and Geoffrey Everest Hinton has similarities. Ashoka waged a brutal war against Kalinga, resulting in massive loss of life. Witnessing the destruction caused, Ashoka renounced violence, gradually embraced Buddhism, dedicated himself to peace, moral governance, and the welfare of his people.

Robert Oppenheimer who played a vital role in the creation of the atomic bomb, as the ‘Scientific Director of the Manhattan Project’ experienced deep remorse over the bomb’s devastating impact. His repentance manifested in his later advocacy for arms control and his regret for having unleashed such a destructive force. 

Geoffrey Hinton, the ‘Godfather of Artificial Intelligence’ who played a pivotal role in its development to suit modern AI needs, particularly ‘Neural Networks’ which have led to significant technological advancements, has expressed concern about the unforeseen consequences of AI, particularly its potential to disrupt economies, societies, and even human autonomy. He has voiced regret about the paths AI research is taking, acknowledging the need for greater caution and ethical considerations in AI development. 

The true wisdom lies in understanding consequences of a creation. Repentance, may spark transformation, and guide the world towards a more responsible future. Drawing lessons from Ashoka, Oppenheimer, Hinton, and Suchir experiences and warnings, is certainly advantageous. This message subtly weaves together the shared human experience of reckoning with consequences of actions and potential for growth through reflection and remorse.   

(The Writer is an Independent Journalist)

Wednesday, December 18, 2024

కలికాలం! ఇది కృత్రిమ మేధ యుగం!! ....... వనం జ్వాలా నరసింహారావు

 కలికాలం! ఇది కృత్రిమ మేధ యుగం!! 

వనం జ్వాలా నరసింహారావు

ఆంధ్రజ్యోతి దినపత్రిక (19-12-2024)

{మానవ మేథో సృష్టి ఫలితాలను అవగాహన చేసుకోవడంలోనే నిజమైన విజ్ఞానం ఇమిడి ఉంటుంది. శాస్త్రవేత్తలు తమ నవ కల్పనల పర్యవసానంగా సంభవించే అనర్ధాలకు పరితాపం చెందడం, మార్పు దిశగా ఒక సంకేతమని, ప్రపంచాన్ని బాధ్యతగల భవిష్యత్తు వైపు తీసుకెళ్లగలదని భావించాలి. అశోకుడు, ఓపెన్‌హైమర్, హింటన్, లాంటివారి అనుభవాలు, ఆవేదనల నుండి, ఇటీవలే మరణించిన 26 సంవత్సరాల సుచీర్ బాలాజీ హెచ్చరిక నుండి నేర్చుకోవడం మానవాళికి శ్రేయస్కరం}-సంపాదకుడు ఆంధ్రజ్యోతి 

బీబీసీ కథనం ప్రకారం, 26 సంవత్సరాల భారత సంతతికి చెందిన సుచీర్ బాలాజీ అనే యువ శాస్త్రవేత్త, కృత్రిమ మేధస్సుకు చెందిన ‘ఓపెన్‌ఏఐ’ సంస్థ పరిశోధకుడిగా పనిచేస్తూ, ‘విజిల్ బ్లోయర్’గా మారిన నేపధ్యంలో, సాన్ ఫ్రాన్సిస్కో (అమెరికా) నగరంలో హటాన్మరణం  చెందాడని తెలుస్తోంది. ‘ఓపెన్‌ఏఐ కృత్రిమ మేధస్సు సంస్థ’ అనుసరిస్తున్న ఆక్షేపనీయ విధానాలను ఆయన బహిరంగంగా విమర్శలు చేయడం, బహుశా ఆయన ‘బలవన్మరణానికి’ దారితీసి ఉండవచ్చని బీబీసీతో సహా మీడియా వర్గాల అభిప్రాయం. కొన్నాళ్ల క్రితం, సుచీర్ తో ప్రముఖ అమెరికా దినపత్రిక, న్యూయార్క్ టైమ్స్‌ జరిపిన ఇంటర్వ్యూలో, కృత్రిమ మేధస్సుకు సంబంధించి తన అభిప్రాయాలను ఆయన వెల్లడించారు. ఈ సాంకేతికత వల్ల సమాజంపై కలిగే ప్రమాదాలపై తన ఆందోళనను బహిరంగంగా వ్యక్తపరిచారు.  

కాపీరైట్‌ చట్టం కింద పరిగణించాల్సిన సమాచారాన్ని, ‘ఓపెన్‌ఏఐ సంస్థ’ చట్టవిరుద్ధంగా, విచ్చలవిడిగా అనైతికంగా, అక్రమంగా, అసురక్షితంగా, మోసపూరితంగా, ఉపయోగించడాన్ని సుచీర్ తప్పుబడుతూ, తీవ్రంగా విమర్శించారు. ‘చాట్‌జీపీటీ’ లాంటి కృత్రిమ మేధస్సు ఏజంట్లు, అంతర్జాలాన్ని హానికరంగా మార్చివేస్తున్నాయని ఆయన సుస్పష్టం చేశారు. లింక్డ్‌ఇన్‌ ప్రొఫైల్ ప్రకారం, సుచీర్ బాలాజీ, కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ సైన్స్ చదివాడు. నవంబర్ 2020 నుండి ఆగస్టు 2024 వరకు, నాలుగేళ్లపాటు ‘ఓపెన్‌ఏఐ సంస్థ’లో పనిచేశారు. సుచీర్ బాలాజీ ధర్మాగ్రహాన్ని, వర్తమానంలో, ఆద్యతన భవిష్యత్తులో ‘కృత్రిమ మేధస్సు’ కలిగించే ‘హానికర ఫలితాల’ సంకేతమని నిస్సందేహంగా చెప్పవచ్చు.

‘అధికారం, ఆధిపత్యం, అభివృద్ధి’ అనే అసంబద్ధమైన నెపంతో, నేడు (కృత్రిమ) మేధావులు తమ శక్తి-యుక్తులు ఉపయోగించి, సృష్టించిన ఒక వికారమైన విజ్ఞానానికి ‘కృత్రిమ మేధస్సు (ఏఐ)’ అనే నాగరిక నామకరణం చేశారు. అయితే, దీని సంతానం, తరచుగా, వారికి తెలియకుండా, హద్దులు మీరి, పగ్గాలు విదిలించుకుని, వారి నియంత్రణకు అతీతంగా మారాయి, మారుతున్నాయి, భవిష్యత్తులో మారనున్నాయి. ‘కళింగ యుద్ధం లాంటి యుద్ధాల భయానకాలు, అణుబాంబు పేలుళ్ల విధ్వంసం, కృత్రిమ మేధస్సు స్వైరవిహారం’ వంటి మానవ తప్పిదాల సంఘటనల తర్వాత కలిగే అపారమైన ధన, ప్రాణ నష్టం, సాధారణంగా దాని కారకులలో దరిమిలా తీవ్ర పశ్చాత్తాపానికి దారి తీస్తుంది. 

అశోకుడు కళింగ యుద్ధం భీభత్సాన్ని చూసి శాంతి మార్గం అనుసరించాడు, బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. రాబర్ట్ ఓపెన్‌హైమర్ అణుబాంబు అనివార్య దుష్పలితాలను సహించలేకపోయాడు. కృత్రిమ మేధ సృష్టికర్తలలో ఒకరైన జెఫ్రీ ఎవరెస్ట్ హింటన్, ఆ వినూత్న సాంకేతికత అనియంత్రిత ఆవిష్కరణల ప్రమాదాలపై ప్రపంచాన్ని గట్టిగా హెచ్చరిస్తున్నారు. బహుశా యువకుడు సుచీర్ బాలాజీ కూడా అదే ప్రయత్నం చేసి మృత్యుబారిన పడ్డాడేమో? కృత్రిమ మేధస్సు రంగంలో అగ్రగామి శాస్త్రవేత్తలు జెఫ్రీ హింటన్, డెమిస్ హసాబిస్, జాన్ ఎం జంపర్, జాన్ హాప్‌ఫీల్డ్ 2024 సంవత్సరానికి గాను, నోబెల్ బహుమతులు పొందినవారిలో వున్నారు. వీరి కృత్రిమ మేథో సృజనాత్మక కృషికి గౌరవార్థంగా ఈ బహుమతి వరించింది. డెమిస్ హసాబిస్, జాన్ జంపర్ (గూగుల్ డీప్‌మైండ్), జెఫ్రీ హింటన్ (గూగుల్ బ్రెయిన్) ముగ్గురూ గూగుల్ సంస్థకు చెందిన వారు కావడం, ఒకే సంవత్సరంలో గూగుల్‌కు చెందిన ముగ్గురికి అత్యున్నత నోబెల్ పురస్కారం లభించడం గొప్ప విషయం.

హింటన్, హాప్‌ఫీల్డ్ లు తమ కృషి ద్వారా ‘గణిత, భౌతిక శాస్త్రాల’ మధ్య ఒక వంతెనగా కృత్రిమ మేధస్సును నిర్మించారు. దీని వల్ల తాత్త్విక అన్వేషణకు, వ్యావహారిక ప్రయోగాలకు, కావాల్సిన ఉపకరణాల రూపకల్పన జరిగింది. అలాగే, డెమిస్ హసాబిస్, జాన్ జంపర్ ‘ఆల్ఫాఫోల్డ్’ అనే ఏఐ వ్యవస్థ రూపకల్పన చేసి, అభివృద్ధి పరిచారు. ఇది ప్రోటీన్ నిర్మాణాలను విశ్లేషించడంలో గణనీయమైన రీతిలో, విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చింది. అమినో ఆమ్లక్రమాల ఆధారంగా ప్రోటీన్‌లో పరమాణు నిర్మాణాన్ని కనుగొనే ప్రక్రియను వేగవంతం చేసింది. ఇది జీవ, వైద్య శాస్త్రరంగాల్లో విప్లవాత్మక ఫలితాలను చూపింది. ముఖ్యంగా ఔషధాల అభివృద్ధి వేగవంతం చేయడం, రోగాలను అణు స్థాయిలో అర్థం చేసుకోవడం, యాంటీబయోటిక్ నిరోధకత వంటి సవాళ్లను ఎదుర్కోవడంలో సహాయపడింది. ప్రోటీన్ నిర్మాణ విశ్లేషణలో ఏఐ రూపాంతర సామర్థ్యాలను, దీనిని ఉపయోగించే వారు అనుసరించాల్సిన నైతిక బాధ్యతలను స్పష్టంగా దార్శనికత చూపిస్తుంది.

' ఏఐ డీప్‌లెర్నింగ్ గాడ్ ఫాదర్' గా పిలవబడే జెఫ్రీ ఎవరెస్ట్ హింటన్, జాన్ హాఫీల్డ్ తో కలసి 'న్యూరల్ నెట్‌వర్క్స్' ను రూపొందించారు. ఇది 'బ్యాక్‌ప్రొపగేషన్ ఆల్గారిథమ్' అనే విశిష్ట ప్రక్రియ ద్వారా తప్పుల నుండి నేర్చుకోవడం సాధ్యమైంది. దీని ద్వారా ఆధునిక డీప్‌లెర్నింగ్ కి బలమైన పునాది ఏర్పడింది. ఈ ఆవిష్కరణ కంప్యూటర్ విజన్ నుండి భాషా ప్రక్రియల వరకు వివిధ ఏఐ అనువర్తనాల్లో ప్రధాన పాత్ర పోషించింది. ఇంగ్లాండ్ లో జన్మించిన హింటన్, ఎడిన్బర్గ్ విశ్వవిద్యాలయానికి సమర్పించిన పీహెచ్ డి సిద్ధాంత వ్యాసంలో 'న్యూరల్ నెట్‌వర్క్స్ లో ఎర్రర్ కరెక్టింగ్ కోడ్స్, డిస్ట్రిబ్యూటెడ్ రిప్రజెంటేషన్స్' పై దృష్టి పెట్టారు. ఆయన ఆధారభూత పనితనం కృత్రిమ మేథస్సు దిశను పూర్తిగా మార్చివేసింది. నోబెల్ బహుమతి అందుకున్నప్పటికీ, హింటన్ నిరంతరం ఏఐతో సంభావ్య భావి ప్రమాదాల గురించి హెచ్చరిస్తూ వస్తున్నారు. 

2023లో గూగుల్ ను వదిలి, హింటన్ 'అనియంత్రిత కృత్రిమ మేథస్సు అభివృద్ధి' కలిగించే ప్రమాదాలు, తప్పుడు సమాచారం వ్యాప్తి, మానవాళికి కలిగే ముప్పు గురించి తన ఆందోళనలను బహిరంగంగా వ్యక్తం చేశారు. హింటన్, హాఫీల్డ్ లకు లభించిన గుర్తింపు, కృత్రిమ మేథస్సుకు సంబంధించిన పలురంగాల్లో మార్గదర్శక ప్రభావాన్ని చూపిస్తుంది. డీప్‌లెర్నింగ్ ప్రధాన భూమికలైన సిద్ధాంతపరమైన ఆల్గారిథమిక్ మౌళికాలను హింటన్, హాఫీల్డ్ లు అందించగా, హస్సాబిస్, జంపర్ లు శాస్త్రీయ సవాళ్లను పరిష్కరించగల కృత్రిమ మేథస్సు సామర్థ్యాన్ని శాస్త్రీయంగా రూఢిపరుస్తూ నిరూపించారు. ఈ విజయాలు కృత్రిమ మేథస్సు ద్వంద్వ స్వభావాన్ని కూడా పునరుద్ఘాటించాయి. సమాజానికి కలిగించే ప్రయోజనాలు చాలా ఉన్నప్పటికీ, దాని నైతిక, తదితర అస్తిత్వసంబంధ సమస్యలు గణనీయమైనవిగా మిగిలిపోతున్నాయి.  

'ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)' ఆవిర్భావం, అవసరం, సిద్దాంతం, పరిణామం, ఆరోహణ, (బహుశా) అవరోహణ, మంచి-చెడు ప్రభావాలు నిజంగా ఆసక్తికరమైనవేనని అనాలి. 1956లో, న్యూ హ్యాంప్‌షైర్ లో జరిగిన 'డార్ట్‌మౌత్ సమావేశం’ ('కృత్రిమ మేథస్సు రాజ్యాంగ సదస్సు') నిర్వహించిన వర్క్‌షాప్ లో ఈ పదం సృష్టించబడింది. క్లాడ్ షానన్, జాన్ మక్కార్తీ, నాథనియల్ రోచెస్టర్, మార్విన్ మిన్స్కీ లను (ఏఐ) 'కృత్రిమ మేథస్సు స్థాపక పితామహులుగా’ పరిగణిస్తారు.

అనేక రకాల పనులను ఆటోమేట్ చేయాలని, సామర్థ్యాన్ని పెంచాలని, మానవ మేథో సామర్థ్యాలను మించిపోయే సంక్లిష్టతలను ఎదుర్కొనాలనే మానవ జాతి ఆకాంక్ష నుండి ఆవిర్భవించినదే కృత్రిమ మేథస్సు. ఉదాహరణకు, గణిత శాస్త్ర సంబంధమైన సమస్యలను పరిష్కరించడం, చెస్ గేమ్‌లను అనుకరించడం, వైద్య రంగంలో ఉన్నత శ్రేణినిపుణుల వ్యవస్థను, వ్యాధి నిర్ధారణ ప్రక్రియను అభివృద్ధి చేయడం లాంటివి వున్నాయి. దశాబ్దాలుగా, కృత్రిమ మేథస్సు సామర్థ్యం దాదాపు సమస్త రంగాల్లో గణనీయంగా పెరిగింది. ప్రారంభ దశలో లాజిక్, నిబంధనల ఆధారిత వ్యవస్థలపై ఆధారపడిన సింబాలిక్ కృత్రిమ మేథస్సు నుండి డేటా ఆధారిత పద్ధతులు, న్యూరల్ నెట్‌వర్క్స్ దిశగా మార్పు చెందింది.

కృత్రిమ మేథస్సు పరిణామ క్రమంలో ముఖ్యమైన మైలురాళ్లున్నాయి. వాటిలో 'చాట్‌జిపిటి' వంటి సంభాషణల ఏజెంట్ల రంగప్రవేశం, కృత్రిమ మేథస్సును ఒక 'అత్యవసర దుష్టశక్తి'గా మార్చివేసి, మానవ జీవితంలోని ప్రతి అంశాన్ని ప్రభావితం చేస్తూ, మానవ మెదడు ఆలోచనా సామర్థ్యాన్ని దెబ్బతీస్తూ, పర్యవేక్షణ వ్యవస్థలలాంటి ఉపయోగంతో పౌర స్వేచ్ఛలను హరించి వేస్తోంది. ఫలితంగా, కృత్రిమ మేథస్సు, ఆధునిక ఆవిష్కరణల ప్రమాదాలను సూచిస్తుంది, కాబట్టి, దాని రూపాంతర సామర్థ్యాన్ని చెడుగా వినియోగించకుండా జాగ్రత్తలు తీసుకోవడం అనేది ఒక సవాలుగా మారింది. 'మొట్ట మొదటి అణ్వాయుధ ఆవిర్భావం, ప్రయోగం, దాని అనుకూల, ప్రతికూల ప్రభావాలు, వాటి మధ్య చోటుచేసుకున్న తేడాలను కూలంకషంగా పరిశీలించడం అవశ్యం. 

విడమర్చి చెప్పాలంటే, జపాన్ హిరోషిమా నగరంమీద 1945 ఆగస్టు 6న పేలిన 'లిటిల్ బాయ్' అనే పేరుగల మొదటి అణుబాంబు, ఆగస్టు 9న నాగసాకి నగరంమీద పేలిన 'ఫ్యాట్ మ్యాన్' అనే రెండవ అణు బాంబు గురించి, కీలకమైన అణ్వాయుధాల అభివృద్ధి గురించి ఇంకా సుదీర్ఘంగా చర్చ జరుగుతూనే వున్నది. 

రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో, అప్పటి అమెరికా ప్రభుత్వం చేపట్టిన గోప్యమైన 'మాన్‌హట్టన్ ప్రాజెక్ట్' పరిశోధనలో భాగమైంది. ఈ ప్రాజెక్ట్ కింద, ప్రపంచంలో మొదటిసారిగా ‘అణ్వాయుధ పరీక్ష’ జూలై 16, 1945న ‘ది గ్యాడ్జెట్’ పేరిట జరిగింది. ఈ పరికరాన్ని న్యూమెక్సికోలోని లాస్ ఆలమోస్‌లో విజయవంతంగా పరీక్షించారు. ఈ పరీక్ష నేపధ్యంలో, నవంబర్ 25, 1942న బ్రిగేడియర్ జనరల్ లెస్లీ ఆర్ గ్రోవ్స్, భౌతిక శాస్త్రవేత్త జె రాబర్ట్ ఓపెన్‌హైమర్ నిర్ణయం మేరకు లాస్ ఆలమోస్‌ను ‘అణ్వాయుధ శాస్త్రీయ ప్రయోగశాల’గా గుర్తించారు. ఈ పరీక్షకు ‘ట్రినిటీ’ అనే కోడ్ నామం కూడా పెట్టారు. అప్పట్లో ఇది కూడా పరోక్ష కృత్రిమ మేథస్సు ఫలితమేమో?

అమెరికా బాంబర్ ‘ఎనోలాగే’ వాయు నౌక ద్వారా పేల్చబడిన అణ్వాయుధాలు కనీ-వినీ ఎరుగని అపార విధ్వంసాన్ని కలిగించాయి. లక్షలాది మంది మరణించగా, అనేక మందికి రేడియేషన్ పీనాసం, గాయాలు, కాలిపోయిన గాయాలు, క్యాన్సర్, జన్యుమార్పిడి, మానసిక వేదన వంటి ప్రభావాలు దశాబ్దాలపాటు ఉండిపోయాయి. ఈ విధ్వంసాన్ని చూసిన ‘అణ్వాయుధ, ఆటామిక్ బాంబ్ పిత’ గా పిలువబడే రాబర్ట్ ఓపెన్‌హైమర్, తన ప్రగాఢ పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేశారు. భారతీయుల ఆరాధ్య గ్రంథమైన భగవద్గీతలోని మాటలను ఆయన పదేపదే ఉటంకిస్తూ, ‘ఇప్పుడు నేనే మరణాన్ని; ప్రపంచాలను నాశనం చేసే వాడిని అయ్యాను’ అని ఆవేదనాభరితంగా తన మనస్తాపాన్ని వ్యక్తపరిచాడు. 

సంస్కృత భాషలో వున్న భగవద్గీతను, మేఘదూతను చదివిన ఓపెన్‌హైమర్, తన జీవిత తత్వం మీద గీత పాఠాలు గాఢమైన ప్రభావం చూపించాయని అనేవారు. ఆయన గీతను ఎల్లప్పుడూ తన పక్కన, నిద్రించే మంచం మీదే ఉంచేవారు. హైడ్రోజన్ బాంబ్ తయారీని తీవ్రంగా వ్యతిరేకించాడు. అణ్వాయుధ వ్యాప్తి నియంత్రణ ఒప్పందం ఆలోచన ఓపెన్‌హైమర్ సలహా మూలంగానే జరిగిందని చెప్పవచ్చు.

మౌర్య అశోకుడిలో కలిగిన పరివర్తన, రాబర్ట్ ఓపెన్‌హైమర్ పశ్చాత్తాపం, జెఫ్రీ ఎవరెస్ట్ హింటన్ ఆవేదనలకు బహువిధ సామీప్యాలు ఉన్నాయి. కళింగ యుద్ధంలో, విధ్వంసాన్ని చూసి చలించిన అశోకుడు, హింసను త్యజించి, బౌద్ధమతాన్ని స్వీకరించారు. ప్రజల శ్రేయస్సుకు కట్టుబడి శాంతి పరిపాలనకు అంకితమయ్యారు. ఓపెన్‌హైమర్, ‘మాన్‌హట్టన్ ప్రాజెక్ట్’ శాస్త్రీయ డైరెక్టర్‌గా అణుబాంబు సృష్టిలో కీలక పాత్ర పోషించి, ఆ బాంబు ప్రభావానికి బాధపడ్డారు. ఆయుధ నియంత్రణను సమర్థిస్తూ, తన పనికి పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. అలాగే, కృత్రిమ మేథస్సు అభివృద్ధికి ‘గాడ్‌ఫాదర్‌’గా ప్రఖ్యాతిగాంచిన జెఫ్రీ ఎవరెస్ట్ హింటన్, న్యూరల్ నెట్వర్క్‌ల అభివృద్ధికి కారణమై, ఆధునిక సాంకేతిక విజ్ఞానానికి కారకుడైనప్పటికీ, కృత్రిమ మేథస్సు అనూహ్య దుష్ఫలితాల గురించి, అది ఆర్థిక వ్యవస్థలపై, సమాజాలపై, మానవ స్వయంశక్తిపై కలిగించే ప్రభావాల గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

మానవ మేథో సృష్టి ఫలితాలను అర్థం, అవగాహన చేసుకోవడంలోనే నిజమైన విజ్ఞానం ఇమిడి ఉంటుంది. శాస్త్రవేత్తల సృష్టి పర్యవసానంగా జరిగే అనర్థానికి దాని కారకులు పశ్చాత్తాపం వెల్లడి చేయడం, మార్పు దిశగా ఒక సంకేతమని, ప్రపంచాన్ని బాధ్యతగల భవిష్యత్తు వైపు తీసుకెళ్లగలదని భావించాలి. అశోకుడు, ఓపెన్‌హైమర్, హింటన్, లాంటివారి అనుభవాల నుండి, ఆవేదనల నుండి, ఇటీవలే మరణించిన 26 సంవత్సరాల సుచీర్ బాలాజీ హెచ్చరిక నుండి నేర్చుకోవడం ప్రపంచానికి, మానవాళికి ప్రయోజనకరం. 

Sunday, December 15, 2024

సత్పురుషులందరికీ సమ్మతమైన ధ్రువోపాఖ్యానం ...... శ్రీ మహాభాగవత కథ-15 : వనం జ్వాలా నరసింహారావు

 సత్పురుషులందరికీ సమ్మతమైన ధ్రువోపాఖ్యానం 

శ్రీ మహాభాగవత కథ-15

వనం జ్వాలా నరసింహారావు 

సూర్యదినపత్రిక (16-12-2024)

కంII చదివెడిది భాగవతమిది, 

చదివించును కృష్ణు, డమృతఝరి పోతనయున్

చదివినను ముక్తి కలుగును, 

చదివెద నిర్విఘ్నరీతి ‘జ్వాలా’ మతినై 

బ్రహ్మదేవుడి కుమారుడు స్వాయంభవ మనువుకు శతరూప ద్వారా ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అనే ఇద్దరు కొడుకులు కలిగారు. ఉత్తానపాదుడికి సునీతి, సురుచి అనే ఇద్దరు భార్యలున్నారు. వాళ్లలో ధ్రువుడిని కన్న సునీతి అంటే రాజుకు అంతగా ప్రేమ లేదు. సురిచి మీద విపరీతమైన ప్రేమ. ఒకనాడు సురుచి కొడుకు ఉత్తముడిని తన తొడలమీద కూచోబెట్టుకుని ముద్దులు చేస్తున్న సమయంలో దగ్గరకు వచ్చిన ధ్రువుడిని పట్టించుకోలేదు. తన కొడుకులాగా అతడిని కూడా తండ్రి ముద్దాడాలంటే, విష్ణుమూర్తి పాదాలను ఆశ్రయించాలని సవతి తల్లి చెప్పింది ధ్రువుడికి. ఇదంతా ధ్రువుడి తల్లికి తెలిసి బాధపడింది. సవతి తల్లి చెప్పిన విధంగా శ్రీహరి పాదాలను ఆశ్రయించమని చెప్పింది. వెంటనే పట్టణాన్ని వదిలి బయల్దేరాడు ధ్రువుడు.    

ఈ వృత్తాంతమంతా తన దివ్య దృష్టి ద్వారా తెలుసుకున్న నారదుడు ధ్రువుడి దగ్గరకు వచ్చాడు. శ్రీహరిని, శ్రీమహావిష్ణువును యోగీంద్రులు కూడా చూడలేక పోతున్నారనీ, అతడిని చేరే మార్గాన్ని తెలుసుకోలేక పోతున్నారనీ, అతడు ఆరాధించడానికి దుర్లభుడనీ, కాబట్టి వ్యర్థ ప్రయత్నాలు మానుకోమనీ నారదుడు ధ్రువుడికి చెప్పాడు. మోక్షం మీద కోరిక వుంటే తను చెప్పే మాటలు వినమని అన్నాడు. వాస్తవానికి ధ్రువుడిని మోక్షమార్గానికి ప్రేరేపించిన వాడు వాసుదేవుడే అని కూడా అన్నాడు. ఇలా చెప్పి, యమునా నది ఒడ్డున, శ్రీహరి సాన్నిధ్యంలో, పుణ్యమైన మధు వనానికి వెళ్లమనీ, అక్కడ అతడికి శుభం కలుగుతుందనీ అన్నాడు నారదుడు. యమునానదీ పుణ్యజలాలలో స్నానం చేసి, నిష్ఠతో నారాయణుడికి నమస్కారం చేసి, యమనియమాదులను పాటిస్తూ, ఆత్మవికాసం కొరకు సాధన చెయ్యమని సూచించాడు. పురుషోత్తముడిని ఏకాగ్రతతో ధ్యానం చేయమన్నాడు. అప్పుడు పూజలందుకున్న దేవుడు, మానవులకు కొర్కెలను ప్రసాదిస్తాడని అన్నాడు. నారదుడి మాటలు విన్న ధ్రువుడు మధువనానికి వెళ్లాడు. అక్కడ నగరంలో ధ్రువుడిని అరణ్యాలకు పంపినందుకు విచారిస్తున్న అతడి తండ్రి ఉత్తానపాదుడిని ఓదార్చి విషయమంతా చెప్పాడు నారదుడు. అతడి కుమారుడు శ్రీహరిని భజించి, ఎవరికీ సాధ్యంకాని శాశ్వతపదాన్ని పొంది, మళ్లీ తిరిగి వస్తాడనీ, అతడి కొరకై శోకించవద్దనీ చెప్పాడు.  

  మధువనాన్ని సమీపించిన ధ్రువుడు యమునానదిలో స్నానం చేశాడు. సర్వేశ్వరుడిని గురించి ధ్యానం చేయసాగాడు. మొదట్లో తన శరీర స్థితిని బట్టి మూడు రోజులకు ఒక సారి ఆహారం, తరువాత నెలలో ఆరు రోజులకోసారి, నాల్గవ నెలలో పన్నెండు రోజులకోసారి ఆహారాన్ని తీసుకున్నాడు. తరువాత ఒంటి కాలు మీద ధ్యానం చేస్తూ వాయువును మాత్రమే బక్షించాడు. మొదటి నెలలో శ్రీహరిని, రెండవ నెలలో విష్ణువును, మూడో నెలలో మాధవుడిని, నాల్గవ నెలలో పుండరీకాక్షుడిని, అయిదో నెలలో పర్మాత్మను ధ్యానం చేషాడు. ఆ తరువాత ఆ శ్రీహరి రూపాన్ని తప్ప మరి దేనినీ మనస్సులో స్మరించకుండా తన చిత్తాన్ని సమాయత్తం చేశాడు. ఆ స్థితికి ముల్లోకాలు కంపించాయి. ధ్రువుడు ఏకాగ్ర చిత్తంతో ప్రాణవాయువును నిరోధించడం వల్ల శ్రీహరి కంపించాడు. ఆయన కంపించగానే లోకాలన్నీ కంపించాయి. దీన్నుండి కాపాడమని లోకపాలకులంతా శ్రీమన్నారాయణుడిని వేడుకున్నారు. ఇదంతా ధ్రువుడి ధ్యానం వల్ల జరిగిందనీ, భయపడవద్దనీ చెప్పి శ్రీహరి తక్షణమే మధువనానికి వెళ్లాడు. ధ్రువుడు ఆయన్ను చూసి, మధురానుభూతి పొందుతూ, సాష్టాంగ నమస్కారాలు చేశాడు. ఆయన అనుగ్రహంతో, భగవంతుడిని ప్రతిపాదించే వేదమయమైన వాక్కులతో స్తుతించాడు శ్రీహరిని పరి-పరి విధాలుగా. అది విన్న భగవానుడు మనస్సులో సంతోషించి ధ్రువుడి మదిలో మెదిలే కోరిక తనకు తెలుసని అంటూ, దాన్ని ప్రసాదిస్తున్నానని అంటూ, ఈ విధంగా చెప్పాడు. 

"గ్రహాలు, నక్షత్రాలు, తారాగణాలు, జ్యోతిశ్చక్రం, నక్షత్ర రూపాలైన ధర్ముడు, అగ్ని, కశ్యపుడు, శుక్రుడు, సపర్షులు, తారకలతో కూడి నీ చుట్టూ ప్రదక్షిణం చేసినట్లు తిరుగుతారు. ఇతరులు చేరడానికి వీలుకానిది, అధిష్టించడానికి సాధ్యం కానిది, ముల్లోకాలు ప్రళయంలో నశించినా కూడా నశించకుండా ప్రకాశించే "ధ్రువక్షితి" (ధ్రువపదం) ని ఇరవై ఆరు వేల సంవత్స్రాల తరువాత నువ్వు పొందుతావు. అప్పటిదాకా నీ తండి రాజ్యాన్ని పాలించు. ఇహలోక సుఖాలను అనుభవించు. మరణకాలంలో నన్ను స్మరిస్తూ, అన్నిలోకాలు నమస్కరించేది, పునర్జన్మ లేనిదీ, సప్తర్షి మండలంకన్న పైనున్న నా పదాన్ని పొందుతావు" అని చెప్పి విష్ణుమూర్తి వైకుంఠానికి వెళ్లిపోయాడు. 

ఇదంతా జరిగిన తరువాత ధ్రువుడు తన రాజ్యానికి పయనమయ్యాడు. కొడుకు వస్తున్నాడని విన్న తండ్రి ఉత్తానపాదుడు సంతోషించాడు. ఎదురుగా వెళ్లి ప్రేమతో కౌగలించుకున్నాడు. ఆశీర్వదించాడు. ధ్రువుడు తండ్రి పాదాలకు మొక్కాడు. ఆ తరువాత తల్లులకు నమస్కరించాడు ధ్రువుడు. తల్లి చిరాయువుగా జీవించమని ఆశీర్వదించింది. పౌరులతో, బంధుజనులతో, అమాత్యులతో, స్నేహితులతో కలిసి పురంలోకి ప్రవేశించాడు. కొంతకాలానికి ఉత్తానపాదుడు ధ్రువుడికి రాజ్యాభిషేకం చేశాడు. ఆ తరువాత, శింశుమారుడు అనే ప్రజాపతి కుమార్తె భ్రమిని వివాహం చేసుకున్న ధ్రువుడికి కల్పుడు, వత్సరుడు అనే ఇద్దరు కొడుకులు కలిగారు. అలాగే, వాయుదేవుడి కుమార్తె ఇల అనే ఆమెను వివాహం చేసుకుని ఉత్కలుడు అనే కొడుకును, మరో కూతురును కన్నాడు. 

తన సోదరుడు ఉత్తముడు వేటకై పోయి యక్షుడి చేతిలో హతం కావడం పట్ల కోపంతో కుబేరానుచరులైన గుహ్యకుల మీదికి యుద్ధానికి పోయాడు ధ్రువుడు. అతడి బాణాల ధాటికి యక్షులు తట్టుకోలేక పరాజితులయ్యారు. వారు రోషంతో విజృంభించినా ప్రయోజనం లేకపోయింది. ధ్రువుడు చిటికలో వారిని జయించసాగాడు. అప్పుడు రాక్షసులు రాక్షస మాయను ప్రయోగించారు. దాని ప్రభావం వల్ల ఆయన మీద ఆయుధాలు కురిసాయి. అప్పుడు ధ్రువుడు ఆచమనం చేసి, లక్ష్మీనాథుడి పాదపద్మాలకు నమస్కరించి, స్మరించి, శత్రుభయంకరమైన నారాయణాస్త్రాన్ని సంధించాడు. వెంటనే గుహ్యకుల మాయ చెడిపోయింది. నారాయణాస్త్రం నుండి పుట్టిన వేలాది బాణాలు యక్షులను ఢీకొన్నాయి. యక్షుల పిక్కలను, తొడలను, మెడలను, చేతులను ఖండించాడు ధ్రువుడు. అప్పుడు ధ్రువుడి తాతగారైన స్వాయంభవ మనువు ఆయన దగ్గరకు వచ్చి, యుద్ధ ప్రయత్నాన్ని విరమించుకొమ్మని సలహా ఇచ్చాడు. సర్వ శుభాలకు హాని కలిగించే రోషాన్ని విడిచి పెట్టమని కూడా అన్నాడు. ధ్రువుడు తన సహోదరుడిని చంపారని భావించి, ఎంతో మంది యక్షులను చంపాడని, కుబేరుడి పట్ల అపరాధం చేశాడని, కాబట్టి అతడిని ప్రసన్నం చేసుకోమని అన్నాడు. ధ్రువుడు యుద్ధం మానాడు. వెంటనే కుబేరుడు వచ్చాడక్కడికి. ఆయనకు అంజలి ఘటించాడు ధ్రువుడు. తాను ధ్రువుడి పట్ల ప్రసన్నుడినయ్యానని చెప్పి అంతర్థానమయ్యాడు కుబేరుడు. అప్పుడు ధ్రువుడు యక్ష, కిన్నర, కింపురుషాది గణాలతో కీర్తించబడుతూ మహావైభవంగా తన నగరానికి తిరిగొచ్చాడు. 

నగరానికి తిరిగొచ్చిన ధ్రువుడు రాజ్యపాలన చేస్తూ ఈశ్వరుడిని ధ్యానిస్తూ జీవితం గడిపాడు. అలా ఇరవై ఆరువేల సంవత్స్రాలు రాజ్యపాలన చేసాడు. తరువాత తన కొడుకుకు రాజ్య పట్టం కట్టాడు. వైరాగ్య చిత్తంతో పట్టణాన్ని వదిలి, పుణ్యాలకు పుట్టినిల్లయిన బదరికాశ్రమానికి చేరుకున్నాడు. విశాలా నదీ జలాలలో స్నానం చేశాడు. పద్మాసనం వేసుకుని శ్రీహరిని నిత్యం ఆరాధించాడు ధ్రువుడు. కొన్నాళ్లకు ఆకాశం నుండి ఒక దివ్య విమానం వచ్చింది. అందులో ఇద్దరు దేవతా శ్రేష్టులున్నారు. వాళ్లు విష్ణు కింకరులు. వాళ్లు ధృవుడిని చూసి, ఆయన చేసిన మహా తపస్సు మధుసూధనుడిని సంతృప్తి పరిచిందనీ, ఆయన పంపగా తాము వచ్చామనీ, విష్ణుమూర్తి నివాసమైన పరమపదానికి ఆయన్ను తీసుకుపోతామనీ అన్నారు. విష్ణువు పంపిన దివ్య విమానం ఎక్కడానికి ఆయనకు అర్హత ఉందనీ చెప్పారు. ధ్రువుడు స్నానం చేసి వచ్చి, అక్కడున్న మునులకు మొక్కి, వారి ఆశీర్వాదాలు తీసుకుని, విమానాన్ని ఎక్కడానికై హిరణ్మయమైన తేజో రూపాన్ని ధరించాడు. అతడి విమానానికి ముందర మరో విమానంలో అతడి తల్లి కూడా వున్నదని విష్ణు కింకరులు చెప్పారు. అది చూసిన తరువాత ధ్రువుడు విమానాన్ని ఎక్కి బయల్దేరాడు. గ్రహ మండలాన్నీ, సప్తర్షి మండలాన్నీ దాటి ఆపైన విష్ణుపదాన్ని చేరుకున్నాడు.

సత్పురుషులందరికీ సమ్మతమైన ధ్రువోపాఖ్యానం జీవితానికి ధన్యత చేకూరుస్తుంది. స్వ్రర్గప్రదాయకమైనది. కీర్తికరమైనది. ఆయుష్షును కలగ చేస్తుంది. పుణ్య ప్రదాయకమైనది. శుభకరమైనది. మంచి మనస్సునిస్తుంది. ఫ్రశంసా యోగ్యమైనది. పాపాన్ని హరిస్తుంది.   

(బమ్మెర పోతన శ్రీమహాభాగవతం, రామకృష్ణ మఠం ప్రచురణ ఆధారంగా)


Saturday, December 14, 2024

‘Benchless’ Primary School to Dynamic World of Academics (Exhilarating ‘Benchmark’ of Venkat Changavalli) By Vanam Jwala Narasimha Rao

 ‘Benchless’ Primary School to Dynamic World of Academics

Exhilarating ‘Benchmark’ of Venkat Changavalli

By Vanam Jwala Narasimha Rao

The Hans India (15-12-2024)  

{Venkat Changavalli, after a long stint in the corporate world, learning ropes and building organizations, joined Emergency Management and Research Institute to give back to society. He narrates his efforts for stabilization of ‘108’ services in erstwhile AP and for its expansion to 12 states during his time as the CEO, in PPP model which he describes as a ‘Game Changer.’ In his ‘BL 2 BM’, Changavalli, the champion of management and leadership, relates his ‘Cumulative Learning Points’ at every stage of his life’s journey}-Editor’s Note

Autobiographies, Coffee-Table format or general, if they are free and frank experience sharing Books of ‘Exhilarating Life Knowledges’ coupled with intellection of the Author, similar to ‘BL 2 BM (Benchless to Benchmark)’ authored by Venkat Changavalli, then they will have a lasting value. In fact, Venkat writes in the book that, ‘the genesis of this book demanded meticulous preparation. The canvas of my journey was painted not just by corporate roles, but also by the vivid strokes of personal life-lessons from family, mentors, and cherished encounters.’ 

The ‘Inspiring Story in BL 2 BM (Benchless to Benchmark)’ of Venkat Changavalli, with whom I had the privilege of working for about four years in Emergency Management and Research Institute (EMRI), the content of which starts with the Chapter ‘Through Innocent Eyes’ and closes with ‘Family My Driving Force,’ portraying in a perfectionist manner the ‘Uncommon Journey of a Common man’ stimulates the reader in unequivocal terms. 

In his Foreword that preceded the first Chapter, Venkat Changavalli mentioned that, from ‘humble beginnings to extraordinary heights, his life has been a memorable journey of success and contentment.’ He expressed the hope that ‘his story unveils to the reader the secrets behind achieving fulfillment.’ A great message to the present-day generation.

Reminiscing his childhood, he wrote about fetching water with Kavadi, village temples, modest meals, nights’ gentle breeze, ‘Benchless Primary Schooling,’ scorpion bite, his learnings of patience, focus, humility, balancing, helpfulness, resilience etc. In conclusion, Venkat Changavalli decently revealed how his life has been ‘shaped and enriched by the unbreakable bonds’ of his family. ‘My story, while filled with personal achievements, would be incomplete without acknowledging the unwavering support, love, and inspiration that my family provided throughout this roller coaster journey’ Wrote Venkat. He enlightened about his father, mother, brothers, sisters, wife (Padma), two sons, daughters-in-law, grandchildren, and even about future family members, sincerely acknowledging his ‘family members’ constant source of strength.’

Venkat Changavalli was thrilled when he topped the entrance examination and secured admission in 6th class in Chirala Municipal School. In the chapter ‘Ignition of Knowledge from Chirala to IIM’ he paid his respects to his teachers and the way they taught him, and how he utilized playground, as well as about his friends. Interestingly he did not hesitate to mention about absence of toilets in the school despite its enormous infrastructure. Securing third rank in SSLC in his school, was his pride instant. 

At the age of 15, Venkat joined in ‘Andhra Loyola College, Vijayawada’ which he credited with creating successful Engineers and Doctors and where despite the rigorous schedule, his college life was enjoyable. He made a special mention to his Telugu Teacher there. However, on getting admission in REC Warangal, Venkat joined there in 5-year Chemical Engineering Course. In addition to the help from the ‘faculty and his peers in shaping his character,’ by mingling with students with different mother tongues, and coming from different cultures, Venkat learnt to ‘adapt to various situations’ an essential quality for ‘Leader in Making.’ He says, he imbibed the ‘Core Values, Empathy, Simple Communication and Warmth’ in REC.

Venkat acknowledged that the opportunity he got to pursue PG in management at IIM-A and the resulting experience laid a solid foundation for his future endeavors. In fact, he was in ‘Transient State’ during the night, not willing to believe that he got admission there. He narrated about the courses and about the eminent professors there, as well as different forms of teaching. His specialization was Finance and Marketing. His summer internship was with ‘New India Assurance Company,’ for two months, in Mumbai. 

On completion of Course at IIM-A, Venkat was in a dilemma, at the time of his placement, in deciding his career, whether to choose a ‘PSU with more salary or Startup Company with less salary’ but on his father’s ‘Right and Timely Advise’ he chose the latter, which became a ‘Bedrock for the coming Milestones, that he achieved in life.’ Venkat humbly mentioned here that, ‘IIM-A taught me Analytical Skills, Being Systematic, Challenging the Status Quo, Discipline, Evidence-Based Decision Making, Focus, Infective Enthusiasm, Innovation, and Interpersonal Relations.’

Venkat’s ’Career-Climbing the Corporate Ladder’ began with ‘Lupin’ a Pharmaceutical Company with Rs 1000 Salary in 1977, as a Management Trainee, soon to be confirmed as Assistant Manager. He continued his connection with it even after he left in 1980. Next, he joined ‘Patel Road Ways’ as Zonal Manager. Working there had enriched him to ‘Develop Business Focus, Customer Centricity, People Orientation, Metrics, and Bottom-Line Mindset.’ He mentioned that ‘Success stems not merely from business degrees, but from unwavering commitment and business acumen.’  

Venkat’s next assignment was with ‘Star Industrial and Textile Enterprises’ as Manager Corporate Finance, in which capacity he had the ‘freedom to explore, and also had the opportunity to thrive in the realm of his job.’ During his stint of 21 months there, he ventured in to the ‘world of numbers and strategies, with significant accomplishments in several areas’ which he listed proudly. From there he moved to ‘Swiss Giant, CIBA-GEIGY’ as Assistant Manager Planning, where he learnt that, ‘Planning is Conscious, Futuristic, and Visioning Exercise.’ He acknowledged that his experience there was one of ‘Growth, Friendship, and Learning.’ He later moved to the domain of Marketing in the same organization. 

His next role was in ‘Drachem Specialty Chemicals’ where his ‘Initial Boss proved to be Cocktail of Incompetence and unprofessionalism’ from which experience he carved a roadmap of what not to do when at the helm. When he was shown the door, Venkat was welcomed as Senior General Manager in ‘Roffe Construction Chemicals,’ and as he stepped in there, a ‘Journey of Transformation’ awaited. On invitation, soon he stepped in to ‘Symrise (DRAGOCO India)’ as Inaugural CEO, and his success there was an ‘Orchestra of Strategy, Dedication, and Exceptional Teamwork.’ After over a decade, as CEO in that ‘German Multi National Company’ Venkat ‘Closed the chapter there carrying with him lessons in Leadership, Growth, and the Art of Creating a Lasting Symphony’ to join the first ever Successful Public Private Partnership (PPP) Model, EMRI founded by world famous Satyam Computers Chairman Ramalinga Raju. 

Destiny had something best stored for him. During a Management Event in Chennai, Chief Guest Ramalinga Raju instantaneously recognized the potential of Venkat’s Leadership Qualities, abilities, and extended an offer to be CEO of EMRI. His offer led to a momentous decision by Venkat to ‘Relinquish his Lavish Lifestyle and Substantial Salary in favor of the opportunity to give back to society.’ He recalled that ‘Raju and I worked Synchronously, each contributing our unique strengths to a shared Vision of saving a Million Lives Each Year.’ Then he narrated his efforts for stabilization of 108 services in erstwhile AP and for expansion to 12 states during his time as CEO, in PPP model, which he described as a ‘Game Changer.’ After serving for six years, he had to quit the job. 

On his 60th Birthday he honored 60 extraordinary Souls who enriched his life, primarily Jagadguru Shankaracharya of Sringeri. ‘In the Realm of Public Service my journey took a new direction as I ventured in to the dynamic world of Academics, Board Directorships, Consultancy and Advisory Roles, Leadership Development etc.’ revealed Venkat. Besides being Advisor to Six State Governments, namely, UP, Haryana, Meghalaya, Telangana, AP, and Assam; MD of AP Government Brahmin Welfare Corporation, and Member of various committees of IRDAI, Venkat lent his expertise, to about ten organizations in Corporate Sector.  

‘BL 2 BM’ by Venkat Changavalli, Champion of Management and Leadership, and his ‘Cumulative Learning Points’ at every stage of his life’s journey is ‘Simply The Best’! Hearty Congratulations Venkat Changavalli. 

(Writer was Venkat Changavalli’s Colleague in EMRI)

Sunday, December 8, 2024

దక్షుడి యాగాన్ని ధ్వంసం చేసిన రుద్రుడి చరిత్ర '...... శ్రీ మహాభాగవత కథ-14 : వనం జ్వాలా నరసింహారావు

దక్షుడి యాగాన్ని ధ్వంసం చేసిన రుద్రుడి చరిత్ర 

శ్రీ మహాభాగవత కథ-14

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (09-12-2024)

కంII చదివెడిది భాగవతమిది, 

చదివించును కృష్ణు, డమృతఝరి పోతనయున్

చదివినను ముక్తి కలుగును, 

చదివెద నిర్విఘ్నరీతి ‘జ్వాలా’ మతినై 

బ్రహ్మజ్ఞాన సంపన్నులైన బ్రహ్మలు చేసిన సత్ర యాగంలో శివుడిని దక్షుడు, అతడి మార్గాన్ని అనుసరించే బ్రాహ్మణులను నందీశ్వరుడు, ఆ నందీశ్వరుడిని భృగుమహర్షి ఒకరినొకరు శపించుకుని ఎక్కడివారక్కడికి వెళ్ళిపోయారు. దక్షుడికి, ఈశ్వరుడికి మధ్య పరస్పర విరోధం చాలాకాలం కొనసాగింది. ఈ వైరం నేపధ్యంలో ప్రజాపతులందరి మీద అధినాయకత్వాన్ని వహించాడు దక్షుడు. రుద్రహీనమైన ‘వాజపేయం’ అనే యజ్ఞాన్ని చేశాడు. ఆ తరువాత ‘బృహస్పతి సవనం’ అనే యజ్ఞం చేయడానికి ఉపక్రమించాడు. ఆ యజ్ఞాన్ని చూడడానికి మునులు, ప్రజాపతులు, దేవతలు, మహర్షులు సతీసమేతంగా వచ్చారు. వారంతా తమ దీవెనలిచ్చి, ఆయన చేసిన పూజలను అందుకున్నారు. ఇదంతా దక్షుడి కూతురు, ఈశ్వరుడి భార్య సతీదేవి దృష్టికి వచ్చింది. దంపతులు-దంపతులుగా దేవ, గంధర్వ, కిన్నర, కింపురుషులు ఆకాశమార్గాన అక్కడికి పోవడం చూసింది ఆమె. 

ఈ విషయాన్ని భర్తకు చెప్పి అక్కడకు తాము ఇద్దరం వెళ్దామని అన్నది సతీదేవి. తండ్రి, గురువు, స్నేహితుడు, ప్రభువు అయిన వారి గృహాలకు పిలవకుండానే సజ్జనులు వెళ్తారు కదా! అన్నది. సత్రయాగంలో జరిగిన విషయాన్ని గుర్తు చేస్తూ శివుడు, కుటిలులైన దుర్జనులున్న ఇంటికి బంధుత్వాన్ని పాటించి వెళ్లడం వినయ సంపన్నులకు అనుచితం అన్నాడు సతీదేవితో. ఇష్టమైన బంధువులు మనస్సుకు తగిలేట్లు దుర్భాషలాడితే అవి బాధ కలిగిస్తాయని కూడా అన్నాడు. ఆమె దక్షుడి ప్రియ పుత్రిక అయినప్పటికీ, తన భార్య అయిన కారణాన, ఆమె తండ్రి గౌరవాన్ని పొందలేదని చెప్పాడు. తన మాటలు అతిక్రమించి ఒకవేళ ఆమె అక్కడికి వెళ్లితే, ఆమెకు పరాభవం కలుగుతుందని హెచ్చరించాడు. 

భర్త ఇంత చెప్పినప్పటికీ, తండ్రిని చూడాలన్న కోరికతో సతీదేవి పుట్టింటికి వెళ్లింది. ఆమె వెంట వేలాది రుద్రుడి అనుచర గణం కూడా వెళ్లింది. నందీశ్వరుడు ముందు నడిచాడు. అంతా కలిసి యజ్ఞం జరిగే ప్రదేశం దిక్కుగా ప్రయాణించారు. యజ్ఞశాలను సమీపించింది సతీదేవి. ఆమెను అక్కడ తల్లి, తోబుట్టువులు తప్ప మిగిలిన వారెవ్వరూ పలకరించలేదు. తల్లి, పినతల్లి ఆమెను కౌగలించుకుని క్షేమ సమాచారాలు అడిగారు. తండ్రి పలకరించనందుకు మౌనంగా వుండిపోయిందామె. తండ్రి అనాదరణకు గురైన ఆమె బాధను చూసి, కోపంతో, భూత గణాలు ఆవేశపడ్డాయి. దక్షుడిని హతమారుస్తామంటూ లేచిన గణాలను సతీదేవి వారించింది. తన రోషాన్ని వ్యక్తం చేస్తూ, తండ్రి ఈశ్వరుడి పట్ల పాపబుద్ధితో దోషాన్ని ఆపాదించాడనీ, ఆయన లాంటి వారు మహాత్ములను నిందించడం ఆశ్చర్యం కాదనీ, బ్రహ్మాది దేవతలు ఆయన పాదపద్మాలను ఆశ్రయిస్తారనీ, దుష్టబుద్ధితో ఈశ్వరుడిని నిందించిన ఆయన కూతురునని అనిపించుకోవాలని లేదనీ, ఆయన వల్ల సంప్రాప్తించిన శరీరాన్ని విడిచి పరిశుద్ధురాలినవుతాననీ అన్నది. 

ఈ విధంగా మాట్లాడి యజ్ఞసభా మధ్యలో నిలబడి, శరీర త్యాగం చెయ్యాలని భావించి, దేహాన్ని విడిచి పెట్టాలనే ఆలోచనతో యోగాగ్నిని రగుల్కొలిపింది. యోగ సమాధిలో జన్మించిన అగ్నిలో ఆ క్షణమే దగ్ధమైపోయింది సతీదేవి. ఇది చూసిన రుద్రుడి అనుచరులు దక్షుడిని చంపడానికి పూనుకున్నారు. అప్పుడు అక్కడే వున్న భృగుమహర్షి హోమం చేసి, ఋభులనే వేలాది దేవతలను సృష్టించగా, వారు, రుద్ర గణాలను పారద్రోలారు. జరిగిన విషయమంతా వివరంగా శివుడికి చెప్పాడు నారదుడు. 

శివుడికి పట్టరాని కోపం వచ్చింది. జటాజూటం నుండి ఒక జడను పెరికి భూమ్మీద విసిరికొట్టాడు. అందులోనుండి లోక భయంకరుడైన వీరభద్రుడు రుద్రుడి ప్రతిబింబంలాగా ఉద్భవించాడు. తానేంచెయ్యాలో ఆజ్ఞాపించమని అడిగిన వీరభద్రుడిని, దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేసి, దక్షుడిని సంహరించమని చెప్పాడు శివుడు. ఆయన యజ్ఞవాటికకు చేరుతుంటే, భయంకరమైన కారుచీకటి కమ్మింది. దూళి పుట్టింది. ప్రభంజనం వీచింది. అప్పుడు అక్కడున్న వారంతా దక్షుడితో సహా భయపడ్డారు. సతీదేవికి కీడుచేసిన దక్షుడి పాపకృత్యపు ఫలమే ఈ చీకటి అని అక్కడి స్త్రీలన్నారు. అనవసరంగా రుద్రుడికి కోపాన్ని కలిగించాడు దక్షుడని అన్నారు. అదే సమయంలో రుద్రుడి అనుచరగణం యజ్ఞవాటికను తారుమారు చేశారు. అంతా విధ్వంసం కలిగించారు. యజ్ఞ సదస్సులోని దేవతలను, ఋత్విక్కులను నానారకాలుగా బాధ పెట్టారు. భగుమహర్షి కళ్ళుపీకాడు నందీశ్వరుడు. భృగుమహర్షి మీసాలు పెరికాడు వీరభద్రుడు. అంతటితో ఆగకుండా, వీరభద్రుడు సాటిలేని మహాదర్పంతో చెలరేగి దక్షుడిని పడతోసి, కంఠాన్ని నులిమి, శిరస్సును తుంచి, మహాకోపంతో దక్షిణాగ్నిలో హోమం చేశాడు. ఇలా వీరభద్రుడు శివుడి ఆజ్ఞానుసారం దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేసి కైలాసానికి వెళ్లిపోయాడు.

ఇదంతా దేవతలు బ్రహ్మదేవుడికి చెప్పి ఆయనకు మొరపెట్టుకున్నారు. వారు పరమేశ్వరుడి విషయంలో చేసిన తప్పును ఎత్తి చూపిస్తూ, బ్రహ్మదేవుడు, వారిని వెల్లి ఆ శివుడినే కలిసి, ప్రార్థించమని సలహా ఇచ్చాడు. బ్రహ్మ కూడా వాళ్లతో కలిసి వస్తాననన్నాడు. అలా, వారంతా కైలాసాన్ని దర్శించారు. అక్కడ వారు శత యోజనాల పొడవు, డబ్బైఅయిదు యోజనాల వెడల్పున్న ఒక వట వృక్షాన్ని చూశారు. అక్కడే ధర్భాసనం మీద కూర్చున్న ఈశ్వరుడిని చూశారు. బ్రహ్మాది దేవతలు ఆయన్ను చూడగానే, దక్షిణామూర్తి రూపుడైన ఆయన్ను స్తుతించారు. స్తుతించి ఇలా అన్నారు:

‘యజ్ఞభాగాన్ని పొందే అర్హతగల నీకు యజ్ఞాభగాన్ని సమర్పించక పోవడం వల్ల, నీవల్ల ధ్వంసం చేయబడి, అసంపూర్ణంగా మిగిలిపోయిన ఈ దక్షుడి యాగాన్ని మళ్లీ ఉద్ధరించి, దక్షుడిని పునఃజీవితుడిని చెయ్యాలని ప్రార్థన. భగుడికి నేత్రాలు, భృగుమహర్షికి మీసాలు, పూషుడికి దంతాలు ప్రసాదించు. అవయవాలు కోల్పోయిన దేవతలను అనుగ్రహించు. మిగిలిన యజ్ఞాన్ని పరిపూర్తి చేసి ఈ యాగాన్ని నీ యజ్ఞ భాగంగా స్వీకరించు’.

బ్రహ్మాది దేవతలు కోరిన విధంగానే శివుడు చేశాడు. ఆ తరువాత ఇంద్రాది దేవతలు, ఋషులు వెంటరాగా బ్రహ్మ దేవుడు రుద్రుడిని తీసుకుని దక్షయజ్ఞ వాటికకు వచ్చాడు. దక్షుడిని గోర్రెతల వాడిగా చేయడంతో, అతడు నిద్ర నుండి లేచినవాడిలాగా లేచి సంతోషించాడు. రుద్రుడిని ద్వేషించడం వల్ల కలిగిన పాపాల నుండి విముక్తి పొందాడు. అప్పుడు తన కూతురు సతీదేవి గుర్తుకు వచ్చింది. శివుడిని స్తుతించాడు. తనను క్షమించమని వేడుకున్నాడు. ఆ తరువాత యజ్ఞకార్యాన్ని నిర్వహించడానికి సిద్ధమయ్యాడు. యజ్ఞపరిసమాప్తి అవుతుంటే, సర్వేశ్వరుడైన శ్రీమన్నారాయణుడు ప్రసన్నుడయ్యాడు. అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఆయన్ను చూసి బ్రహ్మ, ఇంద్రుడు, శివుడు, దేవతలు, అగ్నిదేవుడు, గంధర్వులు, విద్యాధరులు, బ్రాహ్మణులు మొదలైనవారంతా భక్తితో నమస్కారం చేశారు. స్తోత్రం చేశారు. ఋత్విక్కులు స్తుతించారు. దక్షుడి భార్యైన ప్రసూతి రక్షించమని వేడుకుంది. లోకపాలకులు స్తుతించారు.     

ఇలా సమస్త జనులు హరిని కీర్తిస్తుంటే, రుద్రుడు ఆటంకపరచిన దక్షుడి యజ్ఞాన్ని శ్రీహరి పూర్తి చేశాడు. దక్షుడిని చూసి తాను తృప్తి చెందానని అన్నాడు. ఆ తరువాత దక్షుడు శ్రీహరిని పూజించాడు. యజ్ఞానికి అంగభూతమైన మరికొన్ని యాగాలను చేశాడు. దేవతలను, రుద్రుడిని పూజించాడు. ఆ తరువాత శ్రీమహావిష్ణువు, శివుడు తమ-తమ నివాసాలకు వెళ్లిపోయారు. 

దక్షుడి కుమార్తె సతీదేవి పూర్వదేహాన్ని వదిలి, హిమవంతుడి పుత్రికగా మేనకకు జన్మించి, ఈశ్వరుడిని వరించింది. ఇది దక్షుడి యాగాన్ని ధ్వంసం చేసిన రుద్రుడి చరిత్ర.          

(బమ్మెర పోతన శ్రీమహాభాగవతం, రామకృష్ణ మఠం ప్రచురణ ఆధారంగా) 

 

Saturday, December 7, 2024

CREATE LITERARY AND CULTURAL REPOSITORY OF TELANGANA : By Vanam Jwala Narasimha Rao

 CREATE LITERARY AND CULTURAL 

REPOSITORY OF TELANGANA

By Vanam Jwala Narasimha Rao

The Hans India (08-12-2024) 

{Announcement of KTR is a clarion call to writers, poets, artists, and intellectuals to vividly document Telangana’s history and analyze its development to ensure its legacy dynamic. ‘Initiating a Literary and Cultural Repository’ serves as a beacon of Telangana’s identity for generations to come} – Editor’s Synoptic Note

An exhibition with ‘Diligently Showcased Books’ on Kalvakuntla Chandrashekhar Rao (KCR), was inaugurated by former minister, MLA from Sircilla, and BRS Working President KT Rama Rao (KTR) On December 4, 2024. ‘Transformative Power of Books’ in disseminating ‘Telangana’s Ideology, Cultural Identity and Unparalleled Development’ was the essence of Exhibition. Later, in a brief meeting presided over by former Telangana Sahitya Academy President, Juluru Gowri Shankar, KTR elaborated on various milestones surpassed during Telangana’s Success Story, through an insightful and engaging manner.

KTR highlighted, Telangana State’s achievements, during the first decade post-state formation, when KCR was CM, in preserving and celebrating its rich cultural and linguistic pride. Formal recognition of Bathukamma, Bonalu etc. as state festivals and efforts to honor Telangana’s History by naming universities, newly created districts, irrigation projects etc. after Telangana Movement Leaders, Eminent Personalities, and Regional Deities of significance. In sensitizing this, in a way, every book displayed in the exhibition, reverberated Telangana in its Multiple Dimensions. KCR's philosophy that ‘Power is not permanent, but Telangana is eternal, and equally its history’ echoed in KTR words. 

Gowri Shankar, himself a popular writer and poet, and a former Chairman for over ten years of ‘Hyderabad Book Fair’ known for his dedication to writing, publishing, and promoting various books related to Telangana’s Identity was the Organizer of Exhibition. Treating it as a ‘Personal Responsibility and Mission’ he conducted this work enduring countless challenges in the process. I know firsthand the effort he invested in ‘Curating this Exhibition’ going beyond his personal collection to borrow books from others. Juluru invited me too, displaying some of my books in the exhibition. For him this ‘Task was more a Passion’ and hence needs to be fully applauded. He and former MLA Rasamai Balakishan, with a witty analogy, described the literature emerging out of Telangana’s Comprehensive Development, as akin to the ‘Weapons Pandavas Safeguarded atop a Jammi Tree’ to be effectively retrieved to utilize when needed.

The time I spent in Telangana Bhavan, where book exhibition was organized, was abuzz with presence of poets, writers, artists, enthusiasts, journalists, political, non-political personalities, and others was stimulating. Many shared with deep emotion their experiences with Telangana Statehood Movement, ‘Decade of Astonishing Development,’ personal touch, and acquaintance with KCR. Each individual had a unique story, thought, and sensitivity. These varied narratives were captured in their books also. The common concern emerged was, the deliberate distortion of Telangana’s History and attempts to erase its identity. This observation resonated powerfully among everyone present in varied quantum.

Speakers articulated these issues succinctly, leaving the audience emotionally charged. Many reflected on what they, as citizens, poets, writers, and artists of Telangana, achieved from June 2, 2014 to December 3, 2024, what they had contributed to propagating Telangana’s ideology, and what they had lost or losing since the last one year. These reflections were often a mix of joy, grief, and anxiety, not to speak of expressing utmost apprehension, with a feel that, remaining silent is no longer an option. Popular poet, singer, and MLC Deshapathi Srinivas, and KTR interestingly quoted that, ‘If Tigers fail to tell their history, the hunter’s tales remain as truth.’ 

Deshapathi Srinivas highlighted about KCR’s unwavering commitment to Telangana, irrespective of ‘In or Out of Power’ as noble, and described him as ‘Three Letters Etched in Time, A Ray of Sunlight, Figurative of filled Rivers and Reservoirs’ Etc. He proposed to observe November 29 (Deeksha Day), December 9 (Victory Day), and June 2 (State Formation Day), as days of remembrance.

Journalist Anjayya, Energy Expert Tuljaram Singh, Poet Wanaparthy Subbayya, former Chairman State Library Council, Ayachitam Sridhar etc. voiced concerns over attempts to distort Telangana’s history including suppressing achievements of KCR’s Governance. Former VC Satavahana University Professor Mallesham, advocated to establish a research center. Economist Papa Rao applauded KCR’s ability to connect street struggles with parliamentary democratic spirit. 

People’s poet and MLC Gorati Venkanna described KCR as a leader who integrated Telangana’s ethos into his actions, and was responsible for progress in Telangana villages. Rasamayi Balakishan credited KCR as the creator of ‘Dhoom Dham,’ the cultural movement. Former Minister and MLA G Jagadish Reddy expressed dissatisfaction over the inability to fully articulate KCR’s greatness, and surprised as to why, intellectuals who glorify figures like Marx and Lenin hesitate to document KCR’s contributions. Reddy noted that every single day of KCR’s 14-year struggle would form as a Chapter if not a book. For KCR, December 9, 2009, was the day Telangana realized, said Jagadish Reddy. 

I shared briefly, my experience of serving two formidable leaders of Telangana’s first and second phases of agitation, Dr Marri Channa Reddy (as PRO), and Kalvakuntla Chandrashekar Rao (as CPRO). Recounting my journey from a librarian, to CM Office, I emphasized on the transformative power of books in my growth. 

My decade-long tenure as KCR’s CPRO, enabled me to closely observe his ‘Good Governance with a Difference,’ his leadership qualities and ‘Statesman Approach.’ One significant attribute of KCR that influenced my writing was his unparalleled ability to summarize hours-long review meetings into precise conclusions within the final half-hour, akin to the skill of a scholar (AVADHANI) with photographic memory. I vividly recall June 17, 2014, when I heard KCR unveiling his vision and comprehensive roadmap for Telangana. My books reflected these. Any merit in them stems from KCR’s greatness, not my own. 

KTR announced plans to preserve and promote the invaluable ideas embedded in Telangana’s cultural consciousness. He said that, From next year, the period between Deeksha Day (November 29) and Vijay Day (December 9) will be dedicated to literary activities focusing on the movement’s history and the first decade of state development. He proposed forming two committees comprising writers, poets, artists, and literary figures to take responsibility for bringing movement-related books into the limelight, and to further initiative for Telangana’s reinvention and reconstruction. KTR’s commitment to this cause is commendable and deserves acknowledgement. 

The Monumental Message that stems from ‘Exhibition and Concerns thereby’ is that, ‘Books are Powerful Conduits of History, Culture, and Vision’ serving as timeless bridges between the past, present, and future, and especially In the context of Telangana, they hold even greater significance. Saga of Telangana from merger (With AP) to formation, through two phases of agitation, the final led by KCR, is not merely a chapter in history, but a reflection of determination, sacrifice, and transformative leadership, eventually culminating in formation of separate State, bringing pride and identity to the people of Telangana.

Books and literary exhibitions are vital tools to ensure that this monumental journey is preserved, protected, and passed on to future generations. KCR’s leadership, challenges he encountered, formation of state, ‘Welfare and Development Nowhere in India’ when he was Chief Minister for two terms, is the ‘Concurrent Telangana History and Ethos.’ Knowledge of this is not just an intellectual exercise but a way to imbibe the values of courage, resilience, and collective effort that define Telangana’s spirit. Exhibiting such literature fosters awareness and encourages dialogue, inspiring every individual to connect with their roots and take pride in their identity. 

Announcement of KTR is a clarion call to writers, poets, artists, and intellectuals to vividly document Telangana’s history and analyze its development to ensure its legacy dynamic. ‘Initiating a Literary and Cultural Repository’ serves as a beacon of Telangana’s Identity for Generations to come. Here, if it is not out of context, I quote from TRS 2014 Manifesto, regarding setting up a ‘State Advisory Council, comprising Editors, Subject matter Experts, Educationalists, and Domain Experts, to advise and enrich the Government’ which never took off, maybe for obvious reasons, despite concerted exercise. Had it been constituted, the story would have been different. Every Commitment has the Sanctity, if only it is adhered in letter and spirit. 

Monday, December 2, 2024

కర్దమ, దక్ష ప్రజాపతుల సంతతి ....... శ్రీ మహాభాగవత కథ-13 : వనం జ్వాలా నరసింహారావు

 కర్దమ, దక్ష ప్రజాపతుల సంతతి

శ్రీ మహాభాగవత కథ-13

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (02-12-2024)  

కంII చదివెడిది భాగవతమిది, 

చదివించును కృష్ణు, డమృతఝరి పోతనయున్

చదివినను ముక్తి కలుగును, 

చదివెద నిర్విఘ్నరీతి ‘జ్వాలా’ మతినై 

స్వాయంభవ మనువు తన మూడవ కూతురైన ప్రసూతిని దక్ష ప్రజాపతికి ఇచ్చి వివాహం చేశాడు. వీరి సంతానంతో ముల్లోకాలు నిండిపోయాయి. (మనువు రెండవ కూతురు) దేవహూతి, కర్దమ దంపతుల పుత్రికలందరూ బ్రహ్మర్షుల భార్యలు. అందులో మరీచుడి, కర్దమ కూతురైన కళ అనే భార్య వల్ల, కశ్యపుడు అనే కొడుకు, పూర్ణిమ అనే కూతురు పుట్టారు. వారి సంతానంతో భువనాలన్నీ నిండిపోయాయి. అత్రి మహామునికి సతి అనసూయాదేవి వల్ల బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల అంశతో ముగ్గురు కొడుకులు పుట్టారు. ఆ దంపతులకు బ్రహ్మ అంశతో చంద్రుడు, విష్ణుమూర్తి అంశతో దత్తాత్రేయుడు, ఈశ్వరుడి అంశతో దుర్వాసుడు జన్మించారు. అంగిరసుడనే మునికి తన భార్యైన శ్రద్ధ యందు నలుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు జన్మించారు. పులస్త్య ప్రజాపతికి, ఆయన భార్య హవిర్భుక్కు అనే ఆవిడకు అగస్త్యుడు పుట్టాడు. పులస్త్యుడికి విశ్రవసుడు అనే మరొక కొడుకు కూడా కలిగాడు. అతడికి, ఇలబిలకి కలిగిన సంతానమే కుబేరుడు. అలాగే అతడికి, కైకసికి జన్మించారు రావణ, కుంభకర్ణ, విభీషణులు. 

కర్దమ ప్రజాపతి కూతురు గతికి, పులహుడికి ముగ్గురు కొడుకులు పుట్టారు. మరొక కుమార్తె క్రియకు వాలఖిల్యులు అనే పేరుగల అరవై వేలమంది మహర్షులు పుట్టారు. వశిష్టుడికి తన భార్య ఊర్జ యందు ఒక సప్తర్షి బృందం పుట్టింది. మరొక భార్యకు శక్తి మొదలైన సంతానం కలిగారు. అధర్వుడికి, చిత్తికి దధ్వంచుడు పుట్టాడు. భృగు మహర్షికి, ఖ్యాతికి దాత, విధాత అనే ఇద్దరు కొడుకులు, శ్రీ అనే కూతురు పుట్టారు. భృగు పరంపరలోనే మార్కండేయుడు పుట్టాడు. ఇలా కర్దముడి కుమార్తెల వల్ల కలిగిన సంతాన పరంపరతో అన్ని లోకాలు నిండిపోయాయి. 

దక్ష ప్రజాపతికి, స్వాయంభవ మనువు కూతురైన ప్రసూతికి పదహారు మంది కూతుళ్లు పుట్టారు. వారిలో పదమూడు మందిని ధర్ముడు అనే రాజుకిచ్చి వివాహం చేశాడు దక్షుడు. అలాగే అగ్నిదేవుడికి ఒక కుమార్తెను, పితృదేవతలకు ఒక కుమార్తెను, ఈశ్వరుడికి ఒక కుమార్తెను ఇచ్చి వివాహం చేశాడు, ధర్ముడి భార్యలలో ఆయనకు మూర్తి అనే ఆమె వల్ల “నరనారాయణులు” అనే ఇద్దరు ఋషులు జన్మించారు. వారు పుట్టిన సమయంలో విశ్వమంతా ప్రకాశించింది. బ్రహ్మాది దేవతలు నరనారాయణుల దగ్గరికి వచ్చి స్తుతించారు. ఆ తరువాత వారందరిని దీవించి, నరనారాయణులు గంధమాదన పర్వతానికి వెళ్లిపోయారు. భూమాత భారాన్ని తొలగించడం కోసం నరనారాయణులే అర్జునుడు, కృష్ణుడు అనే పేర్లతో జన్మించారు. 

ఇదిలా ఉండగా, పూర్వం బ్రహ్మజ్ఞాన సంపన్నులైన బ్రహ్మలు చేసే సత్రయాగాన్ని చూడడానికి బ్రహ్మ, యోగులు, సర్వ దేవతలు, మునీంద్రులు, అగ్నిహోత్రుడు, ఋషులు, ప్రజాపతులు వచ్చారు. అక్కడికి దక్షుడు కూడా వచ్చాడు. ఆయన రాకను గమనించిన సభాసదులందరూ వెంటనే మర్యాద పూర్వకంగా లేచి నిల్చున్నారు. బ్రహ్మ, మహేశ్వరులు మాత్రం లేవలేదు. వచ్చిన దక్షుడు తనకు తండ్రైన బ్రహ్మకు నమస్కరించాడు. తనకు కేటాయించిన ఉచితాసనం మీద కూర్చున్నాడు. తనను చూసి సభ్యులంతా లేచి నిల్చున్నప్పటికీ, ఆసనం మీద నుండి దిగని శివుడి వైపు కోపంగా చూస్తూ, అక్కడున్న దేవతలను, ఇతరులను ఉద్దేశించి ఇలా అన్నాడు. 

‘ఈ శివుడు దిక్పాలకుల కీర్తికి హాని కలిగించేవాడు. ఇతడి వల్ల సజ్జనులు నడిచే మార్గం చెడిపోతుంది. సిగ్గులేని ఈ శివుడు నా కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. అందువల్ల గొప్పవాడయ్యాడు. ఇతడు నాకు ఎదురుగా వచ్చి నమస్కారం చేసి గౌరవించ వద్దా? నన్ను చూసి కనీసం నోటితో పలకరిస్తే ఆయన గౌరవానికి ఏం లోపం వస్తుంది?’ అని అంటూ శివుడిని పరిపరి విధాల దూషించాడు. అభిమానహీనుడనీ, మర్యాదలేనివాడనీ, మత్తెక్కి తిరుగుతాడనీ, దిగంబరుడనీ, భూతప్రేత గణాలతో ఉంటాడనీ, బూడిద పూసుకుంటాడనీ, శుచిలేని వాడనీ, దుష్ట హృదయుడనీ, శ్మశానంలో కాపురం ఉంటాడనీ అని శివుడికి వ్యతిరేకంగా మాట్లాడుతూ, అతడిని శపిస్తానని జలాన్ని స్వీకరించాడు. “ఈ శివుడు ఇంద్రుడు, విష్ణువు మొదలైన దేవతలతో పాటు యజ్ఞ సమయంలో హవిర్భాగాన్ని పొందకుండు గాక” అని శపించాడు. 

రుద్రుడికి శాపం ఇచ్చినందుకు సభలోని వాళ్లు అతడిని తప్పు చేశావని నిందించారు. అప్పుడు, కోపం పెరిగి దక్షుడు తన నివాసానికి వెళ్ళిపోయాడు. ఇదంతా గమనిస్తున్న నందికేశ్వరుడు, దక్షుడిని విమర్శించి, త్వరలోనే అతడు “గొర్రె తలవాడు” అవుతాడు అని శపించాడు. దక్షుడి మార్గాన్ని అనుసరించే బ్రాహ్మణుల మనస్సు క్షోభపడుతుంది అని అక్కడి బ్రాహ్మణులను శపించాడు. ఈ శాప వాక్కులను విన్న భృగు మహాముని మళ్లీ ఇలా శపించాడు. “ఎవరైతే శివ దీక్ష వహించి శివ దీక్షా పరాయణులవుతారో, వారిని ఎవరైతే అనుసరిస్తారో, వాళ్లు వేదశాస్త్ర విరోధులై పాషండులైపోదురు గాక!”. 

ఈ విధంగా నందీశ్వరుడు, భృగుమహర్షి పరస్పరం శపించుకున్నారు. ఇవన్నీ చూస్తున్న శివుడు దేనిమీదా మనస్సు పెట్టకుండా అనుచరులతో కలసి వెళ్ళిపోయాడు. అలా దక్షుడికి, ఆయన అల్లుడైన ఈశ్వరుడికీ పరస్పర విరోధం పెరుగుతుండగా చాలాకాలం గడిచింది.             

(బమ్మెర పోతన శ్రీమహాభాగవతం, రామకృష్ణ మఠం ప్రచురణ ఆధారంగా) 


Saturday, November 30, 2024

NO TELANGANA BUT FOR Dr MARRI CHANNA REDDY : VANAM JWALA NARASIMHA RAO

 NO TELANGANA BUT FOR Dr MARRI CHANNA REDDY

VANAM JWALA NARASIMHA RAO

The Hans India (01-12-2024) 

{Dr Marri Channa Reddy, as ‘The Great Leader from Telangana’ who took the 1969 agitation to its zenith, paving way for second phase of agitation. Recalling his family association, especially that of his paternal uncle Ranga Rao, KCR revealed in one of his conversations, when I was working as his CPRO that, ‘The Spirit of Passion and Commitment to Telangana demonstrated by Channa Reddy, influenced me in leading the second phase of Telangana Agitation and eventually succeeded.’} – Editor’s Synoptic Note 

Telangana First Chief Minister, K Chandrashekhar Rao, ‘Credited with achieving the State,’ described Dr Marri Channa Reddy, as ‘The Great Leader from Telangana’ who took the 1969 agitation to its zenith, paving way for second phase of agitation, and in realizing the state. He revealed that, despite TPS (Telangana Praja Samithi) Landslide in 1971 Lok Sabha Elections, on the advice of CPI leader SA Dange, Indira Gandhi deferred Telangana formation. Dr Reddy settled with safe guards (6-Point Formula), and merged TPS with Congress. Adversaries in Telangana conspired with Andhra Congress leaders to blame him.  

Channa Reddy was ‘The First Telangana Ardent Votary, and Staunch Protagonist for the Cause of Telangana.’ When he was invited to the Amritsar Congress Working Committee (CWC) Meeting to elicit his views on Telangana, ahead of creation of Andhra State in 1953, he did so with a foresight. Jawaharlal Nehru while agreeing with him, confessed that, he inclined with the idea of Linguistic Reorganization of States. Maulana Azad, present there, snapped at Nehru in Urdu, that, his ‘Zameer’ (Conscience) had become ‘Philphila’ (diluted). 

Prior to his nomination to Provisional Parliament in 1950 and appointment as Congress Parliamentary Party (CPP) Whip, Channa Reddy practiced medicine for three years. In 1952, he was elected to Hyderabad State Assembly and became Minister in Burgula Ramakrishna Rao Government. His ‘Grow More Slogan’ then, subsequently transformed as ‘Green Revolution’ enabling self-reliance in foodgrains.    

When AP was formed in 1956, Chief Minister Neelam Sanjiva Reddy, debunking the popular saying that ‘Never keep VB Raju in’ and ‘Channa Reddy out’ of the Cabinet, did the opposite. Channa Reddy who walked out of the Congress, joined later, and became Minister in Kasu Brahmananda Reddy Cabinet. After the 1967 General Election, when Brahmananda Reddy preferred to continue as CM, despite Indira Gandhi sounding him to join her Cabinet, Channa Reddy Seized the opportunity, and became Union Minister for Steel and Mines. He was elected to the Rajya Sabha In April 1967. When the Apex Court disqualified him from holding elective posts for a period of six years, he resigned in 1968, and returned to Hyderabad. It was Channa Reddy who prepared the Blueprint of Vizag Steel Plant, as Union Minister, which Indira Gandhi announced in April 1970. 

Channa Reddy shared some of his political anecdotes and experiences which were motivating, fascinating and enthralling, with me and my Journalist friend Venkat Parsa, who introduced me to him in 1988. Together we were frequent visitors to his Tarnaka Residence. Budding politicians must know them. I had the opportunity of working as his PRO during his second term as CM (1989-90). I observed him from close quarters then, as well as before and after he was made APCCI President. My early imprints were that, he as a senior leader, sincerely grappled with issues and dealt with people. They were ‘Indelible Letters’ and ‘Learning Lessons in My Life.’ His rich, varied, vast experience, political sagacity, strategy, statesmanship, crisis management, and dealing in difficult situations are unparalleled. 

A Madan Mohan, who started the ‘Telangana Praja Samithi (TPS)’ to lead the Mulki Movement, handed over the reins to Channa Reddy, which proved to be the major turning point for him to demonstrate his innate capacity and ‘Charismatic Leadership Abilities’ to register series of ‘Electoral Landslides’ like the 1971 Lok Sabha, 1978 Assembly, 1980 Lok Sabha, and 1989 Lok Sabha plus Assembly Elections. 

Madan Mohan was fielded as TPS Candidate by Channa Reddy for Siddipet Assembly by-elections in November 1970. Being aware of the importance of victory there, and to ensure that, he camped in the constituency for nearly two months. Then, Channa Reddy dined and even stayed few times at the residence of KCR. Recalling his family association, especially that of his paternal uncle Ranga Rao, KCR revealed in one of his conversations, when I was working as his CPRO that, ‘The Spirit of Passion and Commitment to Telangana demonstrated by Channa Reddy, influenced me in leading the second phase of Telangana Agitation and eventually succeeded.’ Madan Mohan won with 20000 majority votes.

On expiry of his six-year disqualification period in 1974, Indira Gandhi handpicked Channa Reddy to manage her home State of Uttar Pradesh (UP), where HN Bahuguna was giving headaches. Bahuguna was replaced by ND Tiwari. With the AP State Assembly Elections due in February, 1978, to seize the opportunity, he resigned and returned to Hyderabad in October 1977. He visited Puttaparthi and sought blessings of Sathya Sai Baba.  

Meanwhile, Congress was split at the national level. Indira Gandhi was elected as President on January 1, 1978. Channa Reddy was appointed as APCC(I) President. When Brahmananda Reddy managed to get ‘Cow and Calf’ Symbol for Congress headed by him, Channa Reddy played key role in obtaining ‘Hand Symbol’ for Indira Congress. In the Elections Channa Reddy led Indira Congress, trounced Brahmananda Reddy Congress, and the nascent Janata Party. He became the First Congress (I) CM in March 78. Despite contributing 41 out of 42 MPs from the State in the Midterm Elections in 1980, that brought back Indira Gandhi to power, the Congress High Command replaced him with Anjaiah!!!  

In 1982, Channa Reddy was appointed as Punjab Governor. He resigned in February, 1983, following differences with CM Darbara Singh. He quit Congress, floated the National Democratic Party of India (NDPI), and unsuccessfully contested the Lok Sabha elections from Karimnagar. He largely confined to his residence, till he returned to Congress Fold, in response to an appeal by AICC General Secretary G K Moopanar in 1986. After his reentry, couple of events organized by him were big hit, and caught the attention of High Command. 

The Congress High Command was tossing with the idea of replacing Janardhan Reddy as APCCI Chief.  Dr YS Rajashekhar Reddy, Jalagam Vengal Rao and N Janardhan Reddy were tried by High Command, to outwit NT Rama Rao but the plan apparently was not working well. Rajiv Gandhi was in search of a ‘Right Person’ to lead Congress in 1989 Elections. KN Singh, a ‘Protege of Channa Reddy’ when he was UP Governor, became the AICC General Secretary in charge of AP affairs in February 1989 with elections fast approaching. 

Though Channa Reddy’s chances to head APCCI bettered, he required support from leaders like Vengal Rao, Dronamraju Satyanarayana, HKL Bhagat, Kumud ben Joshi etc. to replace Janardhan Reddy. I and Venkat while witnessing all these, as part of our little contribution, organized a meeting between Senior Journalist Adiraju Venkateshwara Rao and Channa Reddy. They met after a gap of ten years. Adiraju, who wielded significant influence in Delhi Congress Circles, extended his helping hand to ‘Doctor Saab’ the way he used to reverentially address Channa Reddy, forgetting past differences with him. He played an important role together with Dronamraju in lobbying in Delhi. 

The strategy clicked. Satya Saibaba Blessings worked well. Invite came from KN Singh, to Channa Reddy in the third week of April, 1989, to reach Delhi for consultations, at the instance of Rajiv Gandhi. He shrewdly prepared for the crucial meeting, including the prospective list of APCC Office-Bearers. At the Begumpet Airport, when he was leaving for Delhi, just five persons were present, including me to see him off. Dr Reddy stayed at a friend’s residence for about three weeks. Eventually, on May 1, 1989, Channa Reddy was appointed as APCC(I) President. He returned to a tumultuous welcome at the Begumpet Airport on May 3, 1989. Protocol was extended to him which normally reserved for CM. The open-top jeep was allowed up to the tarmac. 

Under the aegis of ‘National Information Service (NIS)’ I organized a meeting on ‘Jawhar Rozgar-Panchayat Raj: Strengthening grassroots democracy’ on June 3, 1989, in Hyderabad, presided by Channa Reddy and addressed by CV Narasimhan ICS, CPI Leader Mohit Sen, Madan Mohan and Uma Gajapathi Raju etc. Organizing ‘One Crore Signatures’ against NTR Government and the ‘Jail Bharo’ in which Channa Reddy was arrested, galvanized the entire Congress party in the State, giving confidence of winning elections.

Congress swept back to power, winning 181 of the 294 seats. Though he ‘Richly Deserved’ it was not easy for him to become the Leader of CLP and CM. It was believed in political circles then that, Channa Reddy sought intervention of Governor Kumud Ben Joshi in his favor, and it worked. Eventually, Channa Reddy sworn in as the Chief Minister on December 3, 1989, and was in office till December 17, 1990. As promised by him, in a casual talk, before elections, he warmly called me to his residence, and appointed me as his PRO, a great turning point in my life. 

The emergence of great leaders like Dr Marri Chenna Reddy in politics is a rare blessing. His guidance, leadership skills, and deep connection with the people during the Telangana movement ‘Distinguished Channa Reddy as an Extraordinary Leader.’ With his political acumen, progressive vision, and unwavering commitment to public service, he rendered invaluable contributions. His role in achieving Telangana statehood is unparalleled and remarkable, beyond dispute.

Channa Reddy's spirit continues to resonate in the success story of present-day Telangana. There is so much we can and must learn from his values and visionary ideas. ‘Telangana would not be what it is today without Channa Reddy.’ On December 2, 2024, marking his 28th Death Anniversary, as an ardent admirer, I pay my genuine tributes to this towering personality. What a ‘Great Leader from Telangana’ Dr Marri Channa Reddy was!!! 

And undoubtedly, NO TELANGANA BUT FOR Dr MARRI CHANNA REDDY.

(Inputs from Venkat Parsa)

{28th Death Anniversary of Dr M Channa Reddy on December 2, 2024}


ప్రజానాడి తెలిసిన పాలనాదక్షుడు {డాక్టర్ మర్రి చెన్నారెడ్డి లేకుండా తెలంగాణ ఉండేది కాదు} : వనం జ్వాలా నరసింహారావు

 ప్రజానాడి తెలిసిన పాలనాదక్షుడు

{డాక్టర్ మర్రి చెన్నారెడ్డి లేకుండా తెలంగాణ ఉండేది కాదు}

వనం జ్వాలా నరసింహారావు

ఆంధ్రజ్యోతి దినపత్రిక (30-11-2024) 

{తెలంగాణ ఉద్యమానికి ఆయన దిశానిర్దేశం, నాయకత్వ నైపుణ్యం, ప్రజలతో సన్నిహితంగా మమేకం కావడం వంటి ప్రత్యేకతలు ఆయనను అసాధారణ నేతగా నిలిపాయి. రాజకీయ చతురతతోనూ, ప్రగతిశీల ఆలోచనలతోనూ, అత్యున్నత ప్రజాసేవా దృక్పథంతోనూ ఆయన తన సేవలను అందించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన పాత్ర అపూర్వం, అపురూపం. దీనిని తర్కించలేము. వర్తమాన తెలంగాణ విజయగాథలో చెన్నారెడ్డి స్ఫూర్తి ప్రతిబింబిస్తున్నది. ఆయన విలువలు, ఆలోచనల నుంచి మనం ఎన్నో, ఎన్నెన్నో పాఠాలు నేర్చుకోవాలి. మర్రి చెన్నారెడ్డి లేకుండా తెలంగాణ ఉండేది కాదు.} -సంపాదకుడి వ్యాఖ్య 

తెలంగాణ రాష్ట్ర సాధనకు కారణభూతుడు, పది సంవత్సరాలు తొలి ముఖ్యమంత్రిగా అధికారంలో వున్న కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, డాక్టర్ మర్రి చెన్నారెడ్డిని ‘తెలంగాణ మహానాయకుడు’ గా కొనియాడేవారు. 1969 ఉద్యమాన్ని పతాక స్థాయికి చేర్చిన చెన్నారెడ్డి, మలిదశ ఉద్యమానికి మార్గం సుగమం చేసి, రాష్ట్ర సాధనకు కారకుడయ్యాడని కేసీఆర్ అనేవారు. 1971 లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ ప్రజా సమితి (టీపీఎస్) అఖండ విజయం సాధించినప్పటికీ, సీపీఐ నేత ఎస్‌ఏ డాంగే సలహాతో ఇందిరాగాంధీ రాష్ట్ర ఏర్పాటుకు నిరాకరించారని కేసీఆర్ అనేవారు. కొన్ని రక్షణలను హామీగా పొందడంతో సరిపెట్టుకొని, చెన్నారెడ్డి టీపీఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేశారు. తెలంగాణలోని ఆయన ప్రత్యర్థులు ఆంధ్ర కాంగ్రెస్ నేతలతో కుమ్ముక్కై ఆయనను విమర్శించేవారు.

చెన్నారెడ్డి, ‘తెలంగాణ అభిమాని, నిర్ద్వందంగా తెలంగాణ వాది.’ 1953 లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుకు ముందుగానే, అమృతసర్‌ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యుసి) సమావేశానికి, తెలంగాణ అంశంపై అభిప్రాయం వెల్లడించడానికి ఆయనను ఆహ్వానించారు. ఆ సమావేశంలో, దూరదృష్టితో, సాక్ష్యాధారాలతో ఆయన అభిప్రాయం తెలిపిన వెంటనే, వాటితో తాను ఏకీభవిస్తూనే, భాషా ప్రాతిపదికన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణకు తాను అనుకూలమని జవహర్‌లాల్ నెహ్రూ స్పష్టం చేశారు. అప్పుడు అక్కడే వున్న మౌలానా అజాద్, నెహ్రూతో, ‘మీ జమీర్ (మనస్సు) ఫిల్ఫిలా (నీరసంగా) అయిందని’ చమత్కరించారు.

పాత్రికేయ మిత్రుడు వెంకట్ పార్సా ద్వారా, డాక్టర్ చెన్నారెడ్డితో 1988లో పరిచయం, తరచూ కలిసే అవకాశం కలిగింది. మేమిద్దరం తరచు చెన్నారెడ్డి తార్నాకా నివాసానికి వెళ్లేవాళ్లం. ఆయన తన అనుభవాలను, అరుదైన రాజకీయ జ్ఞాపకాలను పంచుకునేవారు. అవి ఎంతో ప్రేరణాత్మకంగా, ఆసక్తికరంగా, ఉల్లాసంగా ఉండేవి. రాజకీయాలలో ఎదుగుతున్న, ఎదగాలనుకున్న యువ నాయకులు, వీటిని తెలుసుకోవడం ఎంతో అవసరం.

1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు, నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ‘వీబీ రాజును లోపల పెట్టవద్దు-డాక్టర్ చెన్నారెడ్డిని బయట పెట్టవద్దు’ అనే నానుడిని విస్మరించి, దానికి భిన్నంగా వ్యవహరించడంతో, చెన్నారెడ్డి కాంగ్రెస్‌ను విడిచి, కొద్దికాలం తరువాత చేరి, కాసు బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు.

చెన్నారెడ్డి రెండవసారి (1989-90) ముఖ్యమంత్రి అయినప్పుడు, ఆయన పీఆర్వోగా పనిచేసే అవకాశం కలిగింది నాకు. అప్పుడూ, అంతకుముందు ఆయన్ను ఏపీసీసీ అధ్యక్షుడిగా నియమించబడటానికి ముందు, తరువాత, నేను ఆయనను దగ్గరగా పరిశీలించే వీలు కలిగింది. ఒక సీనియర్ నాయకుడిగా, సమస్యలను నిజాయితీగా, నిబద్ధతతో ఎదుర్కొని, ప్రజలతో మమేకమై వ్యవహరించడంలో ఆయనకు ప్రత్యేక నైపుణ్యం ఉన్నదన్న అభిప్రాయం నా మొదటి పరిచయంలోనే ఏర్పడింది. ఆయనతో అనుభవాలు జీవితంలో చెరగని అక్షరాలుగా, స్ఫూర్తిని అందించే పాఠాలుగా నిలిచాయి. డాక్టర్ చెన్నారెడ్డికి వున్న రాజకీయ పరిజ్ఞానం, నేతృత్వ లక్షణాలు, సంక్షోభ నిర్వహణలో నైపుణ్యత, క్లిష్టమైన రాజకీయ పరిస్థితుల్లో వ్యూహాత్మకంగా వ్యవహరించే తీరు ఇతరులలో అరుదుగా కనిపిస్తుంది. 

1950లో ప్రొవిజనల్ పార్లమెంట్‌కు నామినేట్ కావడం, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ విప్‌గా నియమితులవడం కాక ముందు, చెన్నారెడ్డి మూడు సంవత్సరాలు వైద్యవృత్తిలో వున్నారు. 1952లో, హైదరాబాద్ రాష్ట్ర అసెంబ్లీలో ఎన్నికై, బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. అప్పటి ఆయన ‘అధిక దిగుబడి’ నినాదం, భవిష్యత్తులో ‘హరిత విప్లవం’ రూపుదిద్దుకుని, దేశం ఆహార ధాన్యాల విషయంలో స్వయంసమృద్ధిని సాధించడానికి దోహదపడింది. 1967 సాధారణ ఎన్నికల తరువాత, ఇందిరాగాంధీ కేంద్ర కేబినెట్‌లో చేరమని సూచించినప్పటికీ, ముఖ్యమంత్రిగా కొనసాగడానికే మోగ్గుచూపిన బ్రహ్మానందరెడ్డి తనకు బదులుగా చెన్నారెడ్డి పేరును ప్రతిపాదించారు.

అందివచ్చిన అవకాశాన్ని దక్కించుకుని, ఉక్కు-గనుల శాఖ  కేంద్ర మంత్రిగా చేరడం, రాజ్యసభ సభ్యుడిగా (1967) ఎన్నిక కావడం ఆయన రాజకీయ జీవితంలో కీలక మలుపులు. అత్యున్నత న్యాయస్థానం ఆయన శాసనసభ ఎన్నికను రద్దు చేసి, ఆరు సంవత్సరాల పాటు ఎన్నికల పదవులు చేపట్టకుండా అనర్హత విధించడం వల్ల, 1968లో కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేసి హైదరాబాద్‌కు వచ్చారు. ఇందిరాగాంధీ 1970లో ప్రకటించిన విశాఖ ఉక్కు కర్మాగారం బ్లూప్రింట్‌ను కేంద్రమంత్రిగా తయారు చేసిన ఘనత చెన్నారెడ్డిదే.

ముల్కీ ఉద్యమాన్ని నడిపేందుకు ‘తెలంగాణ ప్రజా సమితి’ (టీపీఎస్)ను స్థాపించిన ఏ మదన్ మోహన్, తన అధ్యక్ష స్థానాన్ని చెన్నారెడ్డికి అప్పగించారు. ఇది చెన్నారెడ్డి నేతృత్వ సామర్థ్యాలను, నాయకత్వ పటిమను ప్రజలు తెలుసుకోవడానికి, తరువాత జరిగిన 1971 లోక్‌సభ, 1978 అసెంబ్లీ, 1980 లోక్‌సభ, 1989 లోక్‌సభ-అసెంబ్లీ ఎన్నికలలో ‘భారీ విజయాలు’ సాధించడానికి మార్గం సుగమం చేసింది. ఈ విజయాల వల్ల చెన్నారెడ్డి ‘అద్భుతమైన నాయకత్వ నైపుణ్యం’ ఉన్న వ్యక్తిగా నిరూపితమయ్యారు.

ఈ విజయ పరంపరకు మూలాలు 1970 నవంబర్‌లో జరిగిన సిద్ధిపేట అసెంబ్లీ ఉపఎన్నిక. టీపీఎస్ అభ్యర్థిగా మదన్ మోహన్‌ను రంగంలోకి దించిన చెన్నారెడ్డి, ఆ ఎన్నిక ప్రాముఖ్యత దృష్ట్యా, దాని ఫలితం తెలంగాణ సాధన ప్రక్రియకు ముందడుగు కావడం దృష్ట్యా, ఆయన విజయాన్ని ఖాయం చేసేందుకు సుమారు రెండు నెలల పాటు సిద్ధిపేటలోనే మకాం వేశారు. అదే రోజుల్లో ఆయన కేసీఆర్ నివాసంలో భోజనం చేసి, అక్కడే ఒకటి-రెండు సార్లు బస కూడా చేశారని కేసీఆర్ చెప్పారు. పెద్దనాన్న రంగారావుతో పాటు చెన్నారెడ్డితో తమ కుటుంబ అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ, కేసీఆర్, తన నేతృత్వంలో తెలంగాణ మలి ఉద్యమం విజయవంతం కావడానికి, చెన్నారెడ్డి దీక్ష, పట్టుదల, ఆకాంక్షల స్ఫూర్తి ప్రభావం వున్నదని చెప్పేవారు. ‘చెన్నారెడ్డి ఆత్మ నాలో ప్రవేశించింది’ అనేవారు. మదన్ మోహన్ 20,000 మెజారిటీతో గెలిచారు.

ఆరు సంవత్సరాల అనర్హత కాలం 1974లో ముగియగానే, తన స్వరాష్ట్రం ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా వున్న హేమవతి నందన్ బహుగుణ కాంగ్రెస్ అధిష్ఠానానికి తలనొప్పిగా మారిన నేపధ్యంలో, అక్కడి రాజకీయ సమస్యలను చక్కదిద్దడానికి, చెన్నారెడ్డిని ఆ రాష్ట్ర గవర్నర్ గా నియమించింది ఇందిరాగాంధీ. దరిమిలా, బహుగుణ స్థానంలో నారాయణ దత్ తివారీని రావడం జరిగింది. చెన్నారెడ్డి ఉత్తరప్రదేశ్ గవర్నర్‌గా ఉండగా రెండు సార్లు అక్కడ రాష్ట్రపతి పాలన విధించారు. 1977లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న పూర్వరంగంలో, చెన్నారెడ్డి గవర్నర్ పదవికి రాజీనామా చేసి హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు. పుట్టపర్తి వెళ్లి సత్యసాయి బాబా ఆశీర్వాదం తీసుకున్నారు.

ఇదిలా వుండగా, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ చీలిపోయింది. 1978 జనవరిలో ఇందిరాగాంధీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎన్నికవగా, చెన్నారెడ్డి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఐ) అధ్యక్షుడిగా నియమితులయ్యారు. బ్రహ్మానందరెడ్డి కాంగ్రెస్‌కు ఆవుదూడ గుర్తు లభించడంతో, ఇందిరాగాంధీ కాంగ్రెస్‌కు చెన్నారెడ్డి చొరవతో చేతి గుర్తును లభించింది. అసెంబ్లీ ఎన్నికలలో, చెన్నారెడ్డి నేతృత్వంలోని ఇందిరా కాంగ్రెస్, బ్రహ్మానందరెడ్డి కాంగ్రెస్‌ను, అలాగే మొగ్గలో వున్న జనతా పార్టీని ఓడించి ఘన విజయం సాధించింది. 1978 మార్చి నెలలో ఆయన మొదటి కాంగ్రెస్ (ఐ) ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. 1980 లోక్‌సభ మధ్యంతర ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ నుండి 42 స్థానాలలో 41 స్థానాలను గెలిపించి, ఇందిరాగాంధీ తిరిగి ప్రధాని కావడానికి దోహద పడినప్పటికీ, చెన్నారెడ్డిని తొలగించి ఆయన స్థానంలో అంజయ్యను సీఎం చేసింది అధిష్టానం. 

1982లో పంజాబ్ గవర్నర్‌గా నియామకమైనప్పటికీ, ముఖ్యమంత్రి దర్బారా సింగ్‌తో విభేదాల కారణంగా, 1983 ఫిబ్రవరిలో గవర్నర్ పదవికి  రాజీనామా చేసిన తర్వాత, హైదరాబాద్‌కు తిరిగివచ్చి కాంగ్రెస్ పార్టీని వీడారు చెన్నారెడ్డి. నేషనల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎన్డీపేఐ) స్థాపించి, 1984 లోక్‌సభ ఎన్నికల్లో కరీంనగర్ నుండి పోటీ చేసి ఓటమి పొందారు. కొంతకాలం ఇంటికే  పరిమితమైన ఆయన, 1986 అక్టోబర్‌లో, ఎఐసిసి ప్రధాన కార్యదర్శి జికే మూపనార్ విజ్ఞప్తికి స్పందించి, కాంగ్రెస్ పార్టీలో పునఃప్రవేశించారు. 

1986లో కాంగ్రెస్‌లో తిరిగి చేరిన తర్వాత, డాక్టర్ చెన్నారెడ్డి నిర్వహించిన రెండు ప్రధాన కార్యక్రమాల పర్యవసానంగా మరోమారు కాంగ్రెస్ అధిష్టానం ఆయన సేవలు ఉపయోగమని అభిప్రాయపడింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జలగం వెంగళరావు, ఎన్ జనార్ధన్ రెడ్డి ఏపీసీసీ అధ్యక్షులుగా తమ ప్రభావం చూపించేందుకు ప్రయత్నించినప్పటికీ, ఎన్టీ రామారావు ప్రభావాన్ని ధీటుగా అధిగమించడానికీ, 1989 ఎన్నికలలో కాంగ్రెస్‌ పార్టీకి విజయం చేకూర్చడానికి చాలరని భావించింది. పటిష్టమైన నాయకుడిని రాజీవ్ గాంధీ  అన్వేషిస్తున్న సమయంలో, డాక్టర్ చెన్నారెడ్డి ఆ స్థానానికి రావడానికి మార్గం సుగమం అయింది. 

అయినప్పటి అప్పుడున్న ఏపీసీసీ అధ్యక్షుడు జనార్ధన్ రెడ్డిని తొలగించాలంటే, చెన్నారెడ్డికి, జలగం వెంగళరావు, ద్రోణంరాజు సత్యనారాయణ, హెచ్‌కేఎల్ భగత్, (గవర్నర్) కుముద్ బెన్ జోషి వంటి వారి బలమైన మద్దతు కావాల్సి వచ్చింది. వారి సహకారాన్ని ఆయన ప్రత్యక్షంగా, పరోక్షంగా కోరారు. అసమాన ప్రతిభా పాటవాలు, అద్భుతమైన పరిచయాలున్న పాత్రికేయుడు ఆదిరాజు వెంకటేశ్వరరావు, గత సంగతులు మర్చిపోయి, ఢిల్లీలోని కాంగ్రెస్‌ వర్గాల్లో, ముఖ్యంగా రాజీవ్ గాంధీ లాంటి పెద్దల వద్ద తనదైన శైలిలో ఇతరులకు అనుమానం రాకుండా ద్రోణంరాజు సత్యనారాయణతో కలిసి చెన్నారెడ్డికి అనుకూలంగా లాబీయింగ్ చేశారు. పదేళ్ల విరామం తరువాత ఆదిరాజును, చెన్నారెడ్డిని కలపడానికి  నేను, వెంకట్ పార్సా చొరవ తీసుకున్నాం. 

ఏదేమైతేనేం, వ్యూహం ఫలించింది. సత్య సాయిబాబా ఆశీర్వాదాలు పనిచేశాయి. 1989 ఏప్రిల్ మూడవ వారంలో, రాజీవ్ గాంధీ సూచనల మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, అంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్, కేఎన్ సింగ్, చెన్నారెడ్డిని ఢిల్లీకి రమ్మని ఆహ్వానించారు. యూపీ గవర్నర్ గా వున్నప్పుడు, కేఎన్ సింగ్ నాయకుడిగా ఎదగడానికి చెన్నారెడ్డి తోడ్పడం అనుకూలమైంది. ఆ కీలక సమావేశానికి చెన్నారెడ్డి చాలా జాగ్రత్తగా, భవిష్యత్ రాష్ట్ర కాంగ్రెస్ కార్యవర్గ సభ్యుల జాబితాతొ సహా (ఈ విషయాలు ఆయనే స్వయంగా చెప్పారు) అన్నీ సిద్ధం చేసుకుని మరీ వెళ్లారు. ఢిల్లీకి వెళ్లే ముందు, బేగంపేట విమానాశ్రయంలో చెన్నారెడ్డికి వీడ్కోలు చెప్పేందుకు నాతో సహా కేవలం ఐదుగురు మాత్రమే హాజరయ్యారు, ఢిల్లీలో ఆయన సుమారు మూడు వారాలు స్నేహితుల ఇంట్లో గడిపారు. ప్రతిరోజూ పరిస్థితిని నాకు వివరించేవారు.

కథ సుఖాంతం. 1989 మే 1న, చెన్నారెడ్డిని ఏపీసీసీ(ఐ) అధ్యక్షుడిగా నియమించారు. ఢిల్లీకి వెళ్లేనాటి పరిస్థితికి పూర్తి భిన్నంగా, మే 3న ఆయన హైదరాబాద్‌ చేరుకున్న సమయంలో, బేగంపేట విమానాశ్రయం కిక్కిరిసి పోయింది. ఇసుక వేస్తే రాలనంతమంది జనం. చెన్నారెడ్డికి ప్రొటోకాల్‌ తో సమానంగా, టాప్ లేని జీప్‌ను విమానం దగ్గరికి పోవడానికి అనుమతివ్వడం జరిగింది. 

ఒక నెల తర్వాత, జూన్ 3, 1989న, ‘జవహర్ రోజ్గార్-పంచాయత్ రాజ్: గ్రామ స్థాయిలో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడం’ అనే అంశంపై ‘నేషనల్ ఇన్ఫర్మేషన్ సర్వీస్’ ఆధ్వర్యంలో, బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో చెన్నారెడ్డి అధ్యక్షత నేను ఏర్పాటు చేసిన సమావేశంలో, సివి నరసింహన్ (ఐసీఎస్), మోహిత్ సేన్ (సీపీఐ నాయకుడు), మదన్ మోహన్, ఉమా గజపతి రాజు తదితరులు ఘాటుగా ప్రసంగించారు. ఎన్టీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ, జైలు భరో కార్యక్రమం ఆద్భుతంగా ఆయన నిర్వహించడంతో రాష్ట్ర కాంగ్రెస్‌ను ఉత్తేజపరిచాయి. 1989 అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ 294 సీట్లలో 181 సీట్లు గెలుచుకుంది.  

సీఎల్పీ నేతగా చెన్నారెడ్డి ఎంపిక సులభంగా జరగలేదు. గవర్నర్ కుముద్ బెన్ జోషిని చెన్నారెడ్డి కలిసి తనకు మద్దతు కోరారని అప్పట్లో కథనాలు వినిపించాయి. చివరికి, కాంగ్రెస్ హైకమాండ్ పరిశీలకుల రాకతో, అధిష్టానం ఆశీస్సులతో చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఎంపికయ్యారు. ఎన్నికల ముందు ఒక సందర్భంలో మాటవరసకు అన్న ప్రకారం, చెన్నారెడ్డి నన్ను తన నివాసానికి పిలిచి, పీఆర్వోగా గా నియమించారు. 

మర్రి చెన్నా రెడ్డి వంటి మహానేతలు రాజకీయాల్లోకి రావడం అనేది అరుదైన భాగ్యం. తెలంగాణ ఉద్యమానికి ఆయన దిశానిర్దేశం, నాయకత్వ నైపుణ్యం, ప్రజలతో సన్నిహితంగా మమేకం కావడం వంటి ప్రత్యేకతలు ఆయనను అసాధారణ నేతగా నిలిపాయి. రాజకీయ చతురతతోనూ, ప్రగతిశీల ఆలోచనలతోనూ, అత్యున్నత ప్రజాసేవా దృక్పథంతోనూ ఆయన తన సేవలను అందించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన పాత్ర అపూర్వం, అపురూపం. దీనిని తర్కించలేము. వర్తమాన తెలంగాణ విజయగాథలో చెన్నారెడ్డి స్ఫూర్తి ప్రతిబింబిస్తున్నది. ఆయన విలువలు, ఆలోచనల నుంచి మనం ఎన్నో, ఎన్నెన్నో పాఠాలు నేర్చుకోవాలి. మర్రి చెన్నారెడ్డి లేకుండా తెలంగాణ ఉండేది కాదు.

డిసెంబర్ 2, 2024 న చెన్నారెడ్డి 28వ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులు.

(వెంకట్ పార్సా సహకారంతో)

(డిసెంబర్ 2, 2024 న చెన్నారెడ్డి 28వ వర్ధంతి)