Wednesday, December 25, 2013

కవిగా మావో:వనం జ్వాలా నరసింహారావు

కవిగా మావో
వనం జ్వాలా నరసింహారావు


          నవ చైనా జాతి పిత మావో 120వ జయంతిని (డిసెంబర్ 26) ఘనంగా జరుపుకునేందుకు కమ్యూనిస్టు చైనా సిద్ధమవుతోంది. వంద కోట్ల రూపాయల వ్యయంతో, ధగధగలాడే (యాబై కిలోలకు పైగా ఉన్న) మావో బంగారు విగ్రహంను ఇప్పటికీ షెంజెన్ పట్టణంలో ఆవిష్కరించారు. వాస్తవానికి వంద అడుగుల నిడివిగల మావో సేటుంగ్ భారీ విగ్రహాన్ని కూడా, ఆయన 120 వ జయంతిని పురస్కరించుకుని, నేడు (డిసెంబర్ 26, 2013 న), ఆ మహా నాయకుని స్వస్థలమైన ఛాంగ్ షాలో ప్రతిష్ఠ చేయనున్నారు. మావో 32 వ ఏట ఎలా వుండే వాడో, అచ్చు అలానే, అది కూడా ఛాంగ్ షా గురించి ఆయన తనదైన శైలిలో ఒక చక్కటి వచన కవిత రాసినప్పుడు ఏ విధంగా కూచుని వున్నాడో, అలాగే తీర్చిదిద్దారా విగ్రహాన్ని. ఆ కవిత ఇలా సాగుతుంది.

          "వణికించే చలిలో ఏకాంతంగా….ఉత్తరాన పారే నదిని వీక్షించగా….నారింజ వర్ణ ద్వీపమ్ సమీపాన.. గులాబి పర్వతాల పక్కన….అడవి లోని ఎర్రని ఆకుల నందుకునిఆ  వుద్రేకపూరితమైన నీళ్లలో ఎలా వెళ్లామో….నాతో వచ్చిన వందలాది నేస్తాలు నీకు గుర్తున్నారా?....భయానక మైన ఉప్పెన లో….మన నావలు చిక్కుకున్న తీరు….నీటి అలజడి సృష్టిస్తున్న హోరు….మనమంతా అల్లల్లాడిన వైనంచేసేది లేక వెనుతిరగాలనుకున్న తరుణం….నీకు గుర్తున్నదా?"

          ఉత్తర దిక్కుగా ప్రవహించి, టుంగ్ టింగ్ నదిలో కలుస్తుండే ప్రదేశంలో, షియాంగ్ నదికి తూర్పు తీరాన వుంటుంది ఛాంగ్ షా నగరం. నారింజ వర్ణ ద్వీపంగా ఆయన పేర్కొన్న ప్రాంతం పడమర దిశగా వుండగా, మరింత పడమటగా వెళ్తే, పర్వతాల సముదాయం కనిపిస్తుంది. మావో రాసిన వచన కవితల్లో కల్లా దానికొక ప్రత్యేకత వుందంటారు. ఆయన వర్ణించిన భూభాగం, మావో జ్ఞాపకాలను ప్రతిబింబిస్తాయి. అలాంటిదే మరో వచన కవిత...అక్టోబర్ 11, 1929 న రాశారాయన. ఆంగ్ల సంవత్సరాదిలోని తొమ్మిదో నెల, తొమ్మిదో తేదీని వర్ణించుతూ రాసిందది. ఆనందంతో పొంగిపోయే రోజుగా, ఆహ్లాదంగా పండుగ జరుపుకునే రోజుగా మావో వర్ణించాడు. చైనీస్ భాషలో మావో రాసిన వచన కవితలను మైఖేల్ బుల్లక్, జెరోమ్ చెన్ ఇంగ్లీష్ లోకి అనువదించారు. తొమ్మిదో నెల, తొమ్మిదో తేదీ గురించి మావో రాసిన కవిత ఇలా సాగుతుంది.

          "వయసు పైబడేది స్వర్గానికి కాదు...మనిషికి…..నవ మాసంలో వచ్చే నవ్యమైన పండగఏటా వచ్చే పండగ….ఏటేటా వస్తూనే వుంటుంది….యుద్ధభూమిలో మాత్రం పసుపు పుష్పాలు….సువాసనలు వెదజల్లుతూనే వున్నాయిఏడాదికి ఒక సారి వచ్చే శీతాకాలంఈ ఏడు భారంగా వచ్చి నవ్విందిఎప్పటి లాగ కాక నిస్సారమైన రంగు పులుముకుంది….గతం కన్న మిన్నగా….చల్లని ఆకాశంలో ఆ నీటిలో…..లెక్క లేనన్ని ఆకులు పలకరిస్తున్నాయి".

1949 లో మావో సేటుంగ్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాను నెలకొల్పారు. 1921 లో చైనా కమ్యూనిస్ట్ పార్టీని స్థాపించిన వారిలో మావో ఒకరు. మార్క్సియన్ కమ్యూనిజం సిద్ధాంతాలను నేల నాలుగు చెరగులా ప్రచారం చేసిన వారిలో మార్క్స్, లెనిన్ సరసన మావో కూడా వున్నారు. అభివృద్ధి దిశగా, సామ్యవాదం-కమ్యూనిజం స్థాయిలలో వర్గ పోరాటం ఎలా కొనసాగుతుందో అనే దానికి సైద్ధాంతిక స్వరూపం ఇచ్చిన ఘనత ఒక మార్క్సిస్ట్ ఆలోచనాపరుడిగా మావోకు మాత్రమే దక్కుతుంది. గ్రామీణ రైతాంగానికి, నిరుపేదలకు, భూమి పంపకం ఒక్క అవసరాన్ని-ప్రాధాన్యతను నొక్కి వక్కాణించిన వ్యక్తిగా మావో చరిత్ర ప్రసిద్ధికెక్కాడు. ఆయన సిద్ధాంతాలు పారిశ్రామికంగా అభివృద్ధి చెందని మూడో ప్రపంచ దేశాలను ప్రభావితం చేశాయి.


ఒక రాజకీయ, సైనిక నాయకుడిగా, విప్లవకారుడిగా, తిరుగుబాటు దారుడిగా మావో సేటుంగ్ ప్రపంచ వ్యాప్తంగా అందరికీ తెలిసినవాడే. బహుశా అంతగా అందరికీ తెలియకపోయినా, మావో, ఒక గొప్ప రచయిత, వచన కవి, సాహితీవేత్త. చరిత్ర గమనానికి, మార్పులకు మావో చేసిన సేవ ప్రపంచ చరిత్ర మార్పుకే దారి తీసింది. చైనా దేశానికి ఒక స్థిరత్వాన్ని, ప్రజల ప్రజాస్వామ్యాన్ని, అందించిన వ్యక్తిగా, అలనాటి చైనాను సంకెళ్ల నుండి విముక్తి చేయించిన వ్యక్తిగా, పీపుల్స్ రిపబ్లిక్ స్థాపనకు ముఖ్య కారకుడిగా మావో సేటుంగ్ చిరస్మరణీయుడు. ఆయన మాటల్లో చేతల్లో కనిపించే నిజాయితీ, ప్రజల సమస్యలను అవగాహన చేసుకుని వాటికి పరిష్కార మార్గాలను అన్వేషించడంలో ఆయన చూపిన చొరవ బహుశా అతికొద్ది మందిలో మాత్రమే కనిపిస్తుంది. కష్ట కాలంలో చైనా కమ్యూనిస్ట్ పార్టీని ఏకతాటిపై నడిపించడానికి, అందులో భాగంగా ఆయన రాసిన ఉద్రేక పూరితమైన వచన కవిత్వం, ఆయనలోని స్నేహ కోణాన్ని ఆవిష్కరించేలా వుంటాయి. తనను, తన ఆలోచనలను, సిద్ధాంతాలను వ్యతిరేకించిన వారికి వ్యతిరేకంగా మావో చేసిన పోరాటాలను విశ్లేషిస్తే, ఆయనలోని పోరాట పటిమ, శత్రువులను ఆయన అణచివేసిన విధానం స్పష్టంగా గోచరిస్తుంది. కేవలం 26 సంవత్సరాల వయసులోనే, 1919 లో మార్క్సిజం వైపు ఆకర్షితుడైన మావో, ఒక తిరుగుబాటు దారుడిగా, విప్లవకారుడిగా మారి, ఆయుధాలు పట్టుకుని అధికార వర్గాలకు వ్యతిరేకంగా పోరాడడానికి మరో ఎనిమిది సంవత్సరాలు, అంటే, 1927 వరకు పట్టలేదు. 1934-35 లో ఓటమి తో సహా, లాంగ్ మార్చ్, యునైటెడ్ ఫ్రంట్, అంతర్యుద్ధం...ఇవన్నీ దాటుకుంటూ అంతిమ విజయం సాధించడానికి మావోకు సుమారు 22 సంవత్సరాలు పట్టింది. అంతకాలం ఆయన నిరంతర పోరాటం సాగిస్తూనే వున్నారు.

చైనా దేశపు ఇతర నాయకులకు మావోకు చాలా తేడా వుంది. చైనా పరిస్థితులకు అనుగుణంగా, మార్క్సిజం-లెనినిజం సిద్ధాంతాలను అన్వయించుకుంటూ, ఒక బలీయమైన  దేశంగా చైనాను తీర్చిదిద్దాలన్నదే మావో అభిప్రాయం. నగరాలలో, పట్టణాలలో నివసించే కార్మికులు, గ్రామీణ ప్రాంతాలలో వుండే కర్షకులు, వారిలోనూ ప్రత్యేకించి ఆయుధాలు ధరించిన రైతాంగం మద్దతుతో పనిచేసే మార్క్సిస్ట్ పార్టీ ఒక్కటే చైనాలో గణనీయమైన మార్పు తేగలుగుతుందని మావో విశ్వాసం. ఆయన మనసా-వాచా-కర్మణా మార్క్సిస్ట్ అయినందున ఇతర విప్లవకారులతో కొన్ని విషయాలలో బాగా విభేదించేవారు. సైనిక విప్లవంగా పేర్కొనదగిన ఆయన విధానాలు కొన్ని, సంస్కృతీ పరమైన ప్రభావాన్ని కూడా చూపేవి. మావో మహిళా పక్షపాతి కూడా. స్త్రీ-పురుషులిద్దరూ సమానులని, స్త్రీలు సమానులమనే భావనతోనే వుండాలని ఆయన భావించేవారు. అలానే, సైన్స్ అన్నా, సాహిత్యమన్నా, కళలన్నా కేవలం ఎనలేని అభిమానమే కాకుండా, అవి ప్రజలకు ఉపయోగపడే విధంగా వుండాలని, ముఖ్యంగా కార్మిక-కర్షక ప్రజానీకానికి మేలు చేయాలని అనేవారు.

గ్రామీణ వాతావరణ నేపధ్యంలో, చైనా-జపాన్ యుద్ధం జరగడానికి ఒక ఏడాది ముందర డిసెంబర్ 26, 1893 , జన్మించిన మావో, వరుసగా చోటుచేసుకున్న సంస్కరణల పర్వాన్ని, ఆటుపోట్లను, విప్లవాలను, అంతర్ యుద్ధాలను, గమనించుకుంటూ వచ్చి, వాటి ప్రభావానికి లోనయ్యాడు. చైనా దేశం పొరుగునున్న దేశాలలో సంభవిస్తున్న పరిణామాలను, అక్కడి ప్రజల జయాపజయాలను ఆకళింపు చేసుకున్నారు. మావో తండ్రి నూటికి నూరుపాళ్లు రైతు. కాకపోతే బీదరికంలోను, అప్పుల బాధలోను జీవించేవాడు మొదట్లో. దరిమిలా ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చుకున్నాడు. తల్లికి నైతిక విలువలంటే అమితమైన గౌరవం. ఎప్పుడూ ఎవరికో ఒకరికి సాయపడాలనే మనస్తత్వం ఆమెది. దైవమంటే భక్తి ప్రపత్తులు మెండుగా వుండేవి. చిన్నతనం నుంచే మావోకు, తాను చేసే ప్రతి పనిలోను ఒక రకమైన స్పష్టత వుండేది. చిన్నతనంలో-ఏడేళ్ల వయసులో, చదువుకొరకు మాస్టారు దగ్గరకు పంపడంతో, పుస్తకాల మీద అభిమానం, శ్రద్ధ పెరిగింది. జనరల్  నాలెడ్జ్ పుస్తకాలు చదవడం ప్రారంభం కావడంతో, ఒక కొత్త ప్రపంచం మొదలైందన్న భావన కలిగింది ఆ చిన్నారి మనసులో. పుస్తక పఠనం మీద ఆసక్తి పెరగసాగింది. చదువుతో పాటు, తండ్రి వ్యవసాయ క్షేత్రంలో కూడా పనిచేస్తుండేవాడు మావో. కొన్నాళ్లకు, 1907 లో, తన కంటే నాలుగేళ్లు పెద్దయిన అమ్మాయిని వివాహం చేసుకోవాల్సి వచ్చింది. ఇక ఆ తరువాత చరిత్ర, మావో విప్లవోద్యమం, చైనాకు ఆయన తిరుగులేని నాయకుడిగా మరణించేంతవరకు వ్యవహరించడం, అందరికీ తెలిసిన చరిత్రే.

విప్లవ యోధుడైన మావో సేటుంగ్ ఒక కవిగా, రచయితగా, సాహిత్యాభిలాషిగా కూడా ఆ దేశ ప్రజలకు సుపరిచితుడే. బహుశా, ఆయన రాజకీయ-విప్లవ నేపధ్యం, దేశ నాయకుడిగా ఆయనకున్న పేరు ప్రతిష్టలు, ఆయనకు ఒక రచయితగా కూడా పేరు తెచ్చి పెట్టి వుండవచ్చు. అయితే, ఆయనకు రాజకీయ నేపధ్యం లేకపోయినా కూడా, సాహితీ వేత్తగా, వచన కవిగా, ఆయన శక్తి సామర్ధ్యాలు, అంచనాకు మించే వున్నాయనాలి. సమకాలీన చైనా సాహిత్యంలో ఆయన రాజకీయ జీవితంతో ముడిపెట్టకుండా, మావోకు మంచి పేరు వచ్చేది. మావో వచన కవితల రచనా శైలి, కూర్పు, భావన, సాహితీ విలువలు, దాదాపు పూర్తిగా ఆయన అనుభవాల ఆధారంగానో, లేదా, ఒక విప్లవ కమ్యూనిస్ట్ యోధుడి ఆలోచనా ధోరణికి అనుగుణంగానో వున్నాయని సమకాలీన రచయితల అభిప్రాయం.

ఒకటి రెండు సందర్భాలలో తప్ప, మహిళలు, ప్రేమ అనే పదాలు అరుదుగా ఆయన కవిత్వంలో కనిపిస్తాయి. మానవ నైజం, మానవ విలువలు, సమాజం, చైనా దేశం, ప్రపంచం...సంబంధించిన అంశాలే మావో కవితల కథా వస్తువు. పాఠశాల విద్యార్థిగా వుండగానే, సాహిత్యంపై అభిలాష కలగడం, కవితలు అల్లడం మొదలెట్టాడు. వచన రచన అంటే మావోకు చాలా ఇష్టం. ఆయన వచన కవిత్వానికి, గేయ కవిత్వానికి పోలికలు వున్నాయి. గ్రామీణ నేపధ్యం, ప్రకృతి అందచందాలు మావో కవితల ప్రత్యేకత.

మావో రాసిన మరో కవిత ఇలా సాగుతుంది.

ఆ శ్వేత మేరు పర్వతాల పైన….మబ్బులు వెలిశాయి…..అదే తెల్లని కొండల కిందవేదన ఉబికింది….ఎండిపోయిన అడవులు వృక్షాలు సైతం….యుద్ధానికి సై అన్నాయి….తుపాకిల మోత మోగింది….ఫిరంగుల వాన కురిసింది….ఆకాశం నుండి ఊడిపడ్డట్టు….సైన్యం ముందుకు దూసుకొచ్చింది..పదిహేను రోజుల్లో రెండు వందల మైళ్లు….సైనికుల దండు కదిలింది….ఫ్యూకేన్ పర్వతాల మీదుగా….కన్ నదికి చేరువగా….శత్రు సైన్యాన్ని తుదముట్టించే దిశగా….వేలాదిగా సేన కదిలింది విజయం వైపు….కాని..మెల్లగా ముందుకొచ్చిన తీరుని….ఆలశ్యంగా పన్నిన పన్నాగాన్ని….జీర్ణించుకోలేని మనసు ఒకటి….మౌనంగా కన్నీరు పెట్టింది.


ఇతర చైనా ప్రముఖ రచయితల లాగానే, మావో కూడా, అపారమైన సాహితీ సంపదను తన కవిత్వం ద్వారా ఆ దేశానికి అందించాడు. ఆయన రచనలు చాలా వరకు ఆంగ్లంలోకి అనువదించబడ్డాయి. బహుశా ఇతర భాషలలో కూడా వచ్చి వుండవచ్చు. ప్రాచీన-ఆధునిక ప్రపంచం పోకడలను ప్రతిబింబిస్తాయి మావో రచనలు. End

ఆంధ్ర వాల్మీకి (వాసుదాస స్వామి) రామాయణంలో ఛందః ప్రయోగాలు-అయోధ్యా కాండ -6: వనం జ్వాలా నరసింహారావు

ఆంధ్ర వాల్మీకి (వాసుదాస స్వామి
రామాయణంలో ఛందః ప్రయోగాలు
అయోధ్యా కాండ -6
వనం జ్వాలా నరసింహారావు

అడవులకు పోవాలనుకున్న కొడుకు నిశ్చయాన్ని, తండ్రి ఆజ్ఞ శ్రీరాముడు జవదాటడనే విషయాన్ని గ్రహించిన కౌసల్య కొడుకును ఆదరించి, దయతో దీవించాలనుకుని ఆశీర్వదించే ఘట్టంలో, శ్రీరాముడితో అన్న మాటలను ఒకచోట "మత్తకోకిలము" వృత్తంలో పద్యంగా మలుస్తారు కవి ఇలా:



మత్తకోకిలము:                   దేవతాయతనంబులన్ రుచి  దేఋ చైత్యములందు నీ
                        చే వరం బగు మ్రొక్కు లందుచుఁ జెన్ను మీరినయామహా
                        దేవతల్  ఋషియుక్తులై  వనిఁ ద్రిమ్మరం జనుచుండు  ని
                        న్వేవిధంబులఁ గాచుచుందురు  నిర్మలం బగుసత్కృపన్ - 25

ఛందస్సు:      మత్తకోకిలము వృత్తానికి ర----- గణాలు. పదకొండో అక్షరం యతి.


తాత్పర్యం:     దేవాలయాల్లో, నాలుగు బాటలు కలిసేచోట, నీచే (రాముడు) మొక్కులుగొంటున్న ఆ మహాదేవతలు, ఋషులతో సహా, అడవిలో తిరుగుతుండే నిన్ను వేయివిధాలుగా రక్షించుదురుగాక.

Friday, December 20, 2013

ఆంధ్ర వాల్మీకి (వాసుదాస స్వామి) రామాయణంలో ఛందః ప్రయోగాలు-అయోధ్యా కాండ -5: వనం జ్వాలా నరసింహారావు

ఆంధ్ర వాల్మీకి (వాసుదాస స్వామి
రామాయణంలో ఛందః ప్రయోగాలు
అయోధ్యా కాండ -5
వనం జ్వాలా నరసింహారావు

భాతృ భక్తితో లక్ష్మణుడు చెప్పిన మాటలు విన్న కౌసల్య, శ్రీరాముడిని ఉద్దేశించి తమ్ముడు చెప్పిన విషయాలను గుర్తుచేసి, అతడికేది ధర్మమని తోస్తే అదే చేయమని సలహా ఇస్తుంది. అడవులకు పోవడమే మంచిదనుకుంటే అలానే చేయమని అంటూ కౌసల్య తన మనసులోని మాటలను చెప్పడానికి ఒక పద్యాన్ని"కవిరాజవిరాజితము" లోను, రెండు పద్యాలను "మత్తకోకిలము" వృత్తంలోను రాసారు కావి ఈ విధంగా:



కవిరాజవిరాజితము:
మనమున నాసవతాలు వచించిన మాటను బట్టి గృహంబున న
న్న నయము దుఃఖములందు మునుంగు మ టంటయు నీకును ధర్మమొకో ?
ఘనమతి ! ధర్మము సల్పఁ గ నీయెదఁ గల్గినచోఁ బరిచర్యల నన్
దనుపఁ గ రాదొకొ, తల్లిని గొల్చుట ధర్మము గాదె తనూజులకున్ ? -22

ఛందస్సు:      "నగణము నారు జగణములు వగణము గలది కవిరాజ విరాజితము".

మత్తకోకిలము:     నిండుబక్తి భజించి తల్లిని నిల్చి యింటనె మున్ను  వి
                        ప్రుండు కాశ్యపుఁ డన్మునీశుఁ డు  పొందఁ డే  సురలోకమున్,
                        దండిగౌరవమందు రేనికిఁ దక్కు  వౌనొకొ తల్లి ? నీ
                        వుండు మిందుఁ , బ్రవాసి  వౌటకు నొల్ల నాజ్ఞనొసంగగన్ -23

మత్తకోకిలము:      నిన్నుఁ  బాసి  వసింపఁ గల్గిన నిశ్చయం బిది పుత్రకా !
                        యన్న  మేటికి  నీర  మేటికిఁ బ్రాణ  మేటికి  సౌఖ్య మం
                        చెన్న  నేటికి ? నీవు గల్గిన నిన్ని యున్నటు  దోఁ చుఁ గా,
                        తిన్న చో నునుఁ బచ్చికైన మదిం  బ్రియం బొనరించురా ! -24

ఛందస్సు:      మత్తకోకిలము వృత్తానికి ర----- గణాలు. పదకొండో అక్షరం యతి.


తాత్పర్యం:     నిన్ను (రాముడిని) ఆజ్ఞాపించినవాడు తండ్రిగాడు. నాకు (కౌసల్యకు) సహజవిరోధైన నా సవతి చెప్పిన మాటను మనస్సున నిలిపి, కన్న తల్లినైన నన్ను శాశ్వత దుఃఖంలో మునగమనడం నీకు ధర్మమా ?. అర్థం నాకు పరమార్థం కాదు. ధర్మమే అంటావా, రాజ్యం లేకపోయినా నాకు శుశ్రూష చేసుకుంటూ నా ఇంట్లో వుండు. కొడుకులకు మాతృసేవ ధర్మమేకదా ! పూర్వకాలంలో, కశ్యపు వంశంలో పుట్టిన ఒక బ్రాహ్మణుడు, అందరిలాగా అడవులకు పోయి, ఏ తపస్సు చేయకుండా, ఇంట్లోనే వుండి, మాతృ శుశ్రూషచేసి, తపస్సుచేసి సాధించే స్వర్గసుఖాన్ని సాదించాడు. విశేష గౌరవంలో రాజుకంటే-తండ్రికంటే తల్లి తక్కువవుతుందా ? కాబట్టి నీ తండ్రి ఆజ్ఞకంటె నా ఆజ్ఞ తకువైందేమీకాదు. నువ్వింట్లోనే వుండమని నేను ఆజ్ఞాపిస్తున్నాను. వూరు విడిచి పోయేందుకు నేను అనుజ్ఞనీయను. నిన్నొదలి నేను ఇంట్లో వుండడమే జరుగుతే, ఒకటి మాత్రం నిశ్చయం కుమారా ! నాకు అన్నమెందుకు ? నీళ్లెందుకు? చివరకు ప్రాణమెందుకు ? ఇక సుఖపడడం గురించి చెప్పాల్సిన పనేలేదు. రామచంద్రా, నువ్వు నాదగ్గరుంటే, ఇవన్నీ లేకున్నా వున్నట్లే. ప్రాణం సంతోషిస్తుంది-పచ్చిక తిన్నా నాకు సంతోషమే.

Wednesday, December 18, 2013

ఆంధ్ర వాల్మీకి (వాసుదాస స్వామి) రామాయణంలో ఛందః ప్రయోగాలు-అయోధ్యా కాండ -4: వనం జ్వాలా నరసింహారావు

ఆంధ్ర వాల్మీకి (వాసుదాస స్వామి
రామాయణంలో ఛందః ప్రయోగాలు
అయోధ్యా కాండ -4
వనం జ్వాలా నరసింహారావు

కైక కోరిన విధంగా శ్రీరాముడు తండ్రి ఇచ్చిన మాట నెరవేర్చడానికి అడవులకు పోయేందుకు నిశ్చయించుకుంటాడు. తాను అడవులకు వెళ్తున్న సంగతిని తల్లి కౌసల్యకు తెలియచేస్తాడు. పట్టాభిషేకం గురించి చెప్పడానికి వచ్చాడని భావించిన కొసల్య ప్రియంగా-హితంగా ఇచ్చిన దీవెనలను అందుకున్నాడు రాముడు. మెల్లగా భయంకరమైన వార్తను తెలిపాడామెకు. భరతుడికి యౌవరాజ్యమిచ్చే విషయాన్నీ చెప్పాడు. ఆ విషయాన్ని విన్న కౌసల్య దుఃఖిస్తుంది. ఆ సమయంలో, లక్ష్మణుడు కౌసల్యతో, శ్రీరాముడు అరణ్యానికి పోరాదని చెప్పే క్రమంలో, ఆయన గుణగణాలను వర్ణించడానికి-లక్ష్మణుడితో చెప్పించడానికి "మత్తకోకిలము" వృత్తాన్ని ఎంచుకున్నారు వాసు దాసుగారీవిధంగా:


మత్తకోకిలము:           దేవకల్పు ఋజున్ సుదాంతుని దేవి ! శత్రుల  నైన స
                 ద్భావుఁ డై  దయఁ జూచు  వాని నితాంతపుణ్యునిఁ బూజ్యునిన్
                 భూవరుం  డొకతప్పు  లేక  యుఁ బుత్రు  నెట్టిస్వధర్మ  సం
                 భావనం  బురిఁ బాసి  పొ మ్మనెబ్రాజ్ఞు  లియ్యది  మెత్తురే ? – 21

ఛందస్సు:      మత్తకోకిలము వృత్తానికి ర----- గణాలు. పదకొండో అక్షరం యతి.


తాత్పర్యం:     పరదైవంతో సమానుడై, చక్కటి నడవడిగలవాడై, ఇంద్రియ నిగ్రహం గలవాడై, శత్రువులనైన మంచి అభిప్రాయంతో దయతో చూసేవాడిని, మిక్కిలి పుణ్యవంతుడిని, ఎల్లవారికి పూజించేందుకు యోగ్యుడైనవాడిని, జ్యేష్ఠ పుత్రుడిని, ఒక్క తప్పైన చేయనివాడిని, మనుష్య మాత్రుడు-వక్రవర్తనుడు-ఇంద్రియ లోలుడు-నిష్కారణంగా భార్య కొరకై దండించేందుకు సిద్ధపడినవాడైన వాడు ఏ రాజధర్మాన్ని అనుసరించి నగరాన్ని విడిచి అడవులకు పొమ్మన్నాడు ? వివేకంగలవారు దీన్ని మెచ్చుకుంటారా ?

Sunday, December 15, 2013

ఆంధ్ర వాల్మీకి (వాసుదాస స్వామి) రామాయణంలో ఛందః ప్రయోగాలు - అయోధ్యా కాండ -3: వనం జ్వాలా నరసింహారావు

ఆంధ్ర వాల్మీకి (వాసుదాస స్వామి
రామాయణంలో ఛందః ప్రయోగాలు
అయోధ్యా కాండ -3
వనం జ్వాలా నరసింహారావు

శ్రీరాముడికి దశరథుడు జరిపించదల్చుకున్న పట్టాభిషేకం గురించి తెలుసుకున్న కైకేయి ఆ ప్రయత్నాన్ని అడ్డుకుంటుంది. ఆమె కోరిన వరాలకు పరితపించిన దశరథుడు కైకను దూషించాడు-శ్రీరాముడి గుణాలను వర్ణించాడు-కైకను వేడుకున్నాడు. చివరకు న్యాయ నిష్ఠూరాలాడాడు. రాముడిని అడవులకు పంపి జీవించ లేనన్నాడు. ఇలా కాదనుకొని మరొక్కసారి మెత్తని మాటలతో వేడుకోవడాన్ని"తరలము" వృత్తంలో చక్కగా రాసారీవిధంగా:

తరలము:వనజలోచన ! కాననంబుల  పాలుగాఁ గ సుతుండు  నే
                మనుటె  కల్ల నిజంబు, సౌఖ్యము  మాట  యేటికె  చెప్పగా ?
                మనితిఁ బో పని యేమి నీవు ? సు మాళి  నౌదునె ? విప్రియం
                బును  ఘటింపకు  నీదు  కాళ్లకు  మ్రొక్కెదన్ మరి మ్రొక్కెదన్ - 20

ఛందస్సు: ------గణాలు. పన్నెండో స్థానంలో యతి.


తాత్పర్యం:     (ముఖ ప్రీతిమాటగా "కమలముల వంటి కన్నుల దానా-వనజలోచన" అని దశరథుడితో అనిపించాడు కవి). కోపం పట్టలేక తిట్టిన దశరథుడు, తిట్టడంవలన కార్యసాధన కాదని భావించి, మెత్తటి మాటలతో చెప్తున్నాడు. కమలాక్షీ ! నా కొడుకు అడవులకు పోతే, నేను జీవించడం అసత్యం. అలాంటప్పుడు నీతో ఎలా సుఖపడతాను ? ఒకవేళ బతికినా, శోకంలో మునిగి వుండేవాడినేగాని, సంతోషంతో వుండలేనుకదా ! అప్పుడు నీతో నాకేంపని ? కాబట్టి నాకు అప్రియమైన పని చేయకు. నీ కాళ్లకు మొక్కుతాను-మరీ, మరీ మొక్కుతాను.

Wednesday, December 11, 2013

Key to Telangana is Article 3

Key to Telangana: Article 3

The authors of Indian constitution, unlike the current generation of Indians, did not believe that the states, districts and mandals within India are static, unchanging, and permanent.  They had the maturity to accept that states would evolve and change, and hence made provisions for creation of new states in Indian Union.

Article 3 of Indian Constitution addresses the topic of ‘Formation of new States and alteration of areas, boundaries or names of existing States’.  It says: Parliament may by law...

(a) Form a new State by separation of territory from any State or by uniting two or more States or parts of States or by uniting any territory to a part of any State;
(b) Increase the area of any State;
(c) Diminish the area of any State;
(d) Alter the boundaries of any State;
(e) alter the name of any State; Provided that no Bill for the purpose shall be introduced in either House of Parliament except on the recommendation of the President and unless, where the proposal contained in the Bill affects the area, boundaries or name of any of the States, the Bill has been referred by the President to the Legislature of that State for expressing its views thereon within such period as may be specified in the reference or within such further period as the President may allow and the period so specified or allowed has expired Explanation I In this article, in clauses (a) to (e), State includes a Union territory, but in the proviso, State does not include a Union territory Explanation II The power conferred on Parliament by clause (a) includes the power to form a new State or Union territory by uniting a part of any State or Union territory to any other State or Union territory.


The steps for creating a new state are as follows: A bill on a new state has to be recommended by the President.  The Cabinet requests the President to do that.  Article 3 makes it clear that the Parliament is the sole authority on making a decision on a new state.  President refers the bill to the State Assembly for its views giving it a certain period of time.   Parliament is not obligated to follow on the views of State Assembly.  If the State Assembly does not express its opinion within the specified period of time, the bill could be introduced in the Parliament after the expiry of the specified period.  

Why did the authors of the constitution put complete responsibility of creating new states ONLY with the Parliament?  Why did they not provide a bigger role for a State Assembly other than expressing ‘its views’ on the topic? 

This interpretation of Article 3 prevailed over creation of many new states in modern India thereby nearly doubling the number of states in the last fifty years.  If not for this interpretation, Andhra State would never have formed.  If India had not honored the ‘will of the people of a region to form a separate state’, there wouldn’t have been states like Mizoram, Nagaland, and Tripura, some of them composed of only two districts.

A constitutional democracy also refers to legal verdicts which decide on the interpretation and set a precedent on applicability of a certain clause from Indian constitution. 
Back in 1960 a Bill was introduced in the Indian Parliament proposing the formation of Maharashtra and Gujarat. This Bill was referred by the President to the State Assembly to obtain their views.  Upon receiving the views, the Bill was passed in the Parliament.  A petition was filed against this in High Court of Bombay.

The contention was that the said Act was passed in contravention of the provisions of Art. 3 of the Constitution, since the Legislature of Bombay had not been given an opportunity of expressing its views on the formation of the composite State.  The High Court dismissed the petition.

The period within which the State Legislature must express its views has to be specified by the President; but the President may extend the period so specified. If, however, the period specified or extended expires and no views of the State Legislature are received, the second condition laid down in the proviso is fulfilled in spite of the fact that the views of the State Legislature have not been expressed.

The intention seems to be to give an opportunity to the State Legislature to express its views within the time allowed; if the State Legislature fails to avail itself of that opportunity, such failure does not invalidate the introduction of the Bill.

Clearly, Indian Constitution envisioned a situation where a state may refuse to provide its view or provide negative views about a formation of a new state, and therefore gave full powers to Indian Parliament to go ahead with its decisions irrespective of opposition from the State Assembly. 

Now, President of India would refer the Bill to Andhra Pradesh State Assembly for its views clearly specifying a deadline.  If the State of Andhra Pradesh fails to comply or even votes negatively on the Bill, the President of India would still go ahead and introduce it in the Parliament understanding that Article 3 was created to protect the will of smaller region from being suppressed by majority region. 

(Source E=mc^2: sujaiblog.blogspot.com)

తెలంగాణ ఏర్పాటు రాజకీయ వైకుంఠపాళి:వనం జ్వాలా నరసింహారావు

తెలంగాణ ఏర్పాటు రాజకీయ వైకుంఠపాళి
వనం జ్వాలా నరసింహారావు

నమస్తే తెలంగాణ (14-12-2013)

సరిగ్గా కాబినెట్ ముందుకు తెలంగాణ ముసాయిదా బిల్లు ఆమోదం కొరకు రావడానికి రెండు-మూడు రోజుల ముందు నుంచీ, రాయల తెలంగాణ ప్రతిపాదనకు సంబంధించిన వార్తలు మీడియాలో రావడం మొదలయ్యాయి. రాయల తెలంగాణాకు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం అని తెలిసి కూడా సోనియా గాంధీ, ఆమె బృందం ఆ ప్రతిపాదనతో ముందుకు పోయి, పార్లమెంటులో బిల్లు పెడితే అది ఓడిపోవడం ఖాయమే కదా! అలా జరగడానికి వీలు లేదని తెలిసి కూడా, ఆ అబద్ధపు ప్రచారాన్ని అభినవ సైంధవులు యధేఛ్చగా చేశారు. కేంద్ర కాబినెట్ ఐదో తేదీన తీసుకున్న నిర్ణయంతో, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగినట్లేగా? ఇంకా అనుమానాలు ఎవరికైనా వున్నాయా? ఇంకా మభ్య పెట్టేవారిని ఏమనాలి? అయినా ఏదో మినుకు-మినుకు మంటున్న ఆశ.

పార్టీ అధిష్ఠానం తాము చెప్పిన మాట జవదాటదని, తాము గీచిన గీటు అధిష్టానం పెద్దలకు సరిహద్దని బీరాలు పలుకుతూ, మొదట్నుంచీ తెలంగాణా ఏర్పడే సమస్యే లేదని, చెప్పుకొస్తున్న సీమాంధ్ర కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఒకటి వెంట మరొక ఝలక్ ఇచ్చుకుంటూ పోయింది అదే అధిష్ఠానం. అసలు అభిప్రాయమే చెప్పదన్న పార్టీ అన్ని పార్టీలను బుట్టలో వేసుకుని, వారితోనే తెలంగాణకు అనుకూలం చెప్పించి, చివరిగా తన మనసులో మాట బయట పెట్టింది. వర్కింగ్ కమిటీ, తర్వాత యుపిఎ ప్రభుత్వం, యాంటోనీ కమిటీ, కాబినెట్, గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్....చివరకు కేంద్ర కాబినెట్...అందరూ తెలంగాణకు...అదీ పది జిల్లాల తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది జీర్ణించుకోలేక పోయారు సీమాంధ్ర పెద్దలు. అధిష్టానం తమ మాటే వింటుందనుకున్న ఆ పెద్దలు, ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి వుంటామని ప్రతిజ్ఞలు కూడా చేశారు. సీన్ ఎదురు తిరిగింది. "అనుకున్నదొకటి-అయిందొకటి-బోల్తా పడ్డావులే బుల్ బుల్ పిట్టా" అన్న చందాన నిర్ణయం జరిగిపోయింది. అయినా....ఇంకా...ఇది చేస్తాం-అది చేస్తాం, ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటాం, అవిశ్వాసం పెట్తాం....ఇలా రకరకాలుగా ఉత్తర కుమార ప్రజ్ఞలు చేశారు-చేస్తూనే వున్నారు. సాధ్యం అయ్యేది ఏంటి, కానిది ఏంటి అనే అలోచన కూడా చేయడం లేదు. ఇప్పటికైనా యదార్థాన్ని గ్రహించడం మంచిది. తాము కలిసుంటాం...వెళ్లం...అని మలేసియా పెద్దలతో మొర పెట్టుకున్నా, ఆగస్ట్ 1965 లో వెళ్లగొట్టబడిన సింగపూర్, ప్రపంచంలోనే, ఏకైక సర్వ సత్తాక గణతంత్ర నగర-రాజ్యంగా, ద్వీప దేశంగా ఏర్పడింది. ఇప్పుడు ప్రపంచంలో ఒక ఆర్థిక అగ్ర రాజ్యంగా పరిణితి చెందింది. రేపు తెలంగాణా అదే కాబోతుంది. తన నుంచి విడిపోయిన తమ్ముడు గొప్పవాడు కాబోతున్నాడని సంతోషించాలి కాని, శాపనార్థాలు పెడితే ఎలా?

రాష్ట్ర శాసన సభ

ఈ నేపధ్యంలో, విజయవాడ సభలో కిరణ్ కుమార్ రెడ్డి చాలా గమ్మత్తుగా మాట్లాడారు....తిరుగుబాటు బావుటాను ఎగురవేశారు. రాష్ట్ర విభజన దేశ విభజన లాంటిదని సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఆయన అనడం హాస్యాస్పదం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నక్సలిజం, మత తత్వం, ఉగ్రవాదం ప్రబలుతుందని ఆయన మరో ఉవాచ ఇచ్చారు. ఈ రాష్ట్రం ప్రజలు చేసిన పాపమల్లా కాంగ్రెస్ పార్టీని గెలిపించడమే అని కూడా ఆయన మరో అంశం లేవనెత్తారు. అసలు సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు అన్యాయమే జరగలేదట! ఈ ప్రపంచంలో ఎవరూ శాశ్వతం కాదని, భారత దేశం, ఆంధ్ర ప్రదేశ్ మాత్రమే శాశ్వతమని చెప్పారు. రాష్ట్రం విడిపోతే తాను ఒప్పుకోనని ముఖ్యమంత్రి బల్ల గుద్ది మరీ చెప్పారు! ఏమీ అయన ధైర్యం! సమైక్యాంధ్ర అంత పెద్ద ఉద్యమం ఆయన జీవితంలో భారత దేశంలో ఎప్పుడూ-ఎక్కడా చూడ లేదట! అదో ప్రజా ఉద్యమమనీ, అదెందుకు కేంద్ర ప్రభుత్వానికి కనబడలేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా కేంద్రం తాను తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకోమని మరీ-మరీ కోరారు ఆయన. శాసన సభలో విభజన బిల్లును ఓడిస్తాం అంటున్నారీ పెద్ద మనిషి! అసలు ఓటింగుకే  పెట్టకపోతే ఓడించే ప్రసక్తి ఎక్కడిది? కెసిఆర్ అడగడం వల్ల, జగన్ అడగడం వల్ల విభజన జరిగిందని ఆయన మరో కొత్త కోణం తీసి వాపోయారు. శాసన సభలో ఓడిన బిల్లును పార్లమెంటులో ఎలా గెలిపిస్తుందో చూస్తామని భీకర ప్రతిన పూనారు. ఆయన్నే మనాలి? కిరణ్ కుమార్ రెడ్డిగారు ఇప్పటికైనా దూకుడు మానితే మంచిదేమో!

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే, నక్సలిజం, ఉగ్రవాదం, మత తత్వం పెల్లుబుకుతుందని ముఖ్యమంత్రి అంటున్నాడు. పాపం తాను చాలా విషయాలు చెప్పాననుకుని వుంటాడు ముఖ్యమంత్రి. 1956 నుండి ఈ రాష్ట్రంలో జరిగిన దాడులు ఎవరికి తెలియదు? ఒక ముఖ్యమంత్రి మీద అలిపిరి వద్ద జరిగిన దాడితో సహా, ఇద్దరు-ముగ్గురు మంత్రుల మీద నక్సల్స్ దాడి చేసి వాళ్లను చంపింది, యం.యల్.ఏల మీద, మండలాధ్యక్షుల మీద, నక్సల్స్ దాడులు జరిగింది, మందుపాతరలు పెట్టింది సమైక్యం రాష్ట్రంలోనే కదా! గుర్తేడులో ఒకేసారి 7 గురు ఐ..యస్ అధికారులను నక్సల్స్ కిడ్నాప్ చేసింది సమైక్య రాష్ట్రంలోనే అన్న విషయం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి జ్ఞాపకం లేదా? సమైక్య రాష్ట్రంలోనే కదా గోకుల్ చాట్, లుంబినీ పార్క్ , మక్కా మసీదు, దిలుషుక్ నగర్ లలో తీవ్రవాదుల దాడులు జరిగింది? హైదరాబాద్‌లో, సమైక్యం రాష్ట్రంలోనే కదా మతతత్వం పెచ్చు మీరిపోయి, అనేకమంది అమాయకుల ప్రాణాలను బలి తీసుకొంది? స్వయంగా చెన్నారెడ్డిని పదవి నుండి దించటానికి విజయవాడ నుండి రౌడీలను తీసుకొని వచ్చి హైదరాబాద్‌లో మారణ కాండ సృష్టించింది సమైక్య రాష్ట్రంలోనే కదా? తిరుమల వెళుతున్న చంద్రబాబు నాయుడు మీదనే కాదు, తిరుపతి వెళుతున్న నేదురుమల్లి జనార్ధనరెడ్డిపై కూడా తీవ్రవాద దాడులు జరిగింది రాయలసీమలోనే-సమైక్య రాష్ట్రం లోనే! వారికి ఇదీ గుర్తులేదేమో! ఇవన్నీ సామాన్యులమైన మనలాంటి వారికే గుర్తుంటే ముఖ్యమంత్రికి గుర్తు లేక అలా మాట్లాడడం ఏంటి?

విభజిస్తే నీటి యుద్ధాలు వస్తాయంటున్నాడు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి. ఇప్పుడు, ఇరుగు-పొరుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలు లేవా? వాటి పరిష్కారానికి మార్గాలు లేవా? మార్గాలున్నా వివాదాలు పూర్తిగా సమసిపోయాయా? ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా సీఎం మాట్లాడడం విడ్డూరంగా వుంది. ఒక ముఖ్యమంత్రి స్థానంలో వున్న వ్యక్తి ప్రజలను మభ్యపెడుతూ, ఇలా, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సమంజసమేనా? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆపడం ఆయన చేతిలో కాని, ఆయనను సమర్థిస్తున్న కొందరు సీమాంధ్ర నాయకుల చేతుల్లో కాని లేదనే విషయం అందరికీ తెలుసు. ముఖ్యమంత్రికీ తెలుసు. జల వివాదాల విషయంలో కిరణ్ కుమార్ రెడ్డి చెప్పేది ఒక విధంగా నిజం అనిపిస్తోంది! రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలంగాణా రాష్ట్రం తన హక్కుల కోసం విధిగా పోరాడి తీరుతుంది. అప్పుడు ఆంధ్రకు నష్టం జరిగే అవకాశం లేకపోలేదు. మరో విధంగా చెప్పాలంటే ఇప్పటిదాకా ఆంధ్ర ప్రాంతం తెలంగాణాకు చేస్తున్న అన్యాయాలు కొనసాగడం రాష్ట్ర విభజన తర్వాత సాధ్యం కాదు. అంతర్ రాష్ట్ర జల వివాదాలు పరిష్కరించడానికి రాజ్యాంగంలో ఏర్పాట్లు వున్నాయి కాని ఒక రాష్ట్రం లోనే ఒక ప్రాంతం మరో ప్రాంతానికి అన్యాయం చేస్తే ఎలా పరిష్కరించాలి అన్న దానికి రాజ్యాంగంలో కాని మరే ఇతర చట్టంలో కాని ఎలాంటి మార్గం లేదు. రాష్ట్ర విభజన కారణంగా తలెత్తేవి జల యుద్ధాలు కాదు - నదీ జలాల పంపిణీలో న్యాయం. ఈ న్యాయం జరగకుండా వుండాలంటే రాష్ట్రం విడిపోకూడదు. అదే కిరణ్ కుమార్ రెడ్డి కోరుకుంటున్నాడు. తన మదిలో మాట మరో విధంగా బయట పెడుతున్నాడు.

ఇంతలో, "రాష్ట్ర విభజన బిల్లుపై న్యాయ సలహా కోరిన రాష్ట్రపతి" అని వార్తలొచ్చాయి. ఇంకేం...సీమాంధ్ర నాయకులు ఆశించినట్లే జరుగుతున్నది కదా! అనుకున్నారందరు. న్యాయ సలహా అనుకూలంగా వచ్చినా-ప్రతికూలంగా వచ్చినా కట్టుబడి వుంటాం అని అంటే బాగుండేదేమో! ఏం జరగ బోతోందో అనుకుండే లోపలే, తెలంగాణ బిల్లును పరిశీలించిన రాష్ట్రపతి రాష్ట్ర శాసన సభ పరిశీలనకు దానిని పంపుతున్నారని, టీవీలు ప్రసారం చేశాయి. అంటే, విభజన దిశగా, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దిశగా, మరో అడుగు ముందుకన్న మాట!

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అరడజన్‌కు పైగా కాంగ్రెస్ ఎంపీలు, తెలుగు దేశం ఎంపీలు, వైఎస్సార్ సీపీ ఎంపీలు, కలిసిగట్టుగానో-విడి విడిగానో కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం నోటీసు  ఇచ్చారు. యుపిఎ ప్రభుత్వం పదేళ్ల క్రితం ఏర్పడిన దరిమిలా, హేమా-హేమాలైన ప్రతిపక్షాలు, కాంగ్రెస్ సారధ్యంలోని సంకీర్ణ ప్రభుత్వాన్ని అవిశ్వాసం పేరుతోనో, మరే పేరుతోనో ఇరకాటంలో పెట్టే ప్రయత్నాలు చాలా సార్లు చేశాయి. అది వామ పక్షాల సారధ్యంలో జరిగాయి...బిజెపి సారధ్యంలో జరిగాయి...ఎస్పీ లాంటి ప్రాంతీయ పార్టీల సారధ్యంలోనూ జరిగాయి. మమత   బెదిరింపులు ఎన్ని మార్లో! కరుణానిధి సరేసరి! ఇంతవరకు, ఒక్క సారంటే-ఒక్క సారైనా ప్రభుత్వం వెనుకంజ వేసిన దాఖలాలున్నాయా? ఏ బిల్లయినా ఓడి పోయిందా? వెనక్కు తీసుకుందా? ఇక, ఇప్పుడు, తెలంగాణా నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తే అది కనీసం పరిశీలన దశకన్నా చేరుతుందా? ఏదేమైతేనేం! సమైక్య వాదాన్ని బలంగానే వినిపించారన్న క్రెడిట్ దక్కించుకోవడం మాత్రం వారికి దక్కిందనే అనాలి. "లెట్ అజ్ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్". సీమాంధ్ర కాంగ్రెస్ ఎం. పిలు స్వపక్షం మీదనే అవిశ్వాసం నోటీసు ఇచ్చారు.. దివాకర్ రెడ్డి మరొక అడుగు ముందుకు వేసి సోనియా దిగిపోవాలని ప్రకటించాడు ..ఇవన్నీ వేటికి నిదర్శనాలు.


సొంత పార్టీ ఎంపీలే ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇవ్వడం, సొంత పార్టీ సీఎం తిరుగుబాటు బావుటాను ఎగురవేయడం, సొంత స్పీకర్ మీదే నమ్ముకున్న బీజేపీ అవిశ్వాసం ప్రకటించడం...ఏమిటో అంతా గందరగోళంగా వుంది. ఇదేదో పులి జూదం ఆటలాగా, పరమపద సోపాన పటం ఆటలాగా, ఎక్కువలో ఎక్కువ చదరంగం ఆటలాగా వుంది కాని, రాజకీయ చతురత ఎక్కడా కనిపించడం లేదు. మధ్యలో  శరద్ పవార్...."బేగానా షాదీ మే" లాగా బుడతకీచు చందాన ఏదో అంటుంటాడు. దిగ్విజయ్ సింగ్ మాట్లాడే దానికి అసలు అర్థమే వుండదు. చివరకు కాంగ్రెస్ అధిష్టానం (మైనస్ సోనియా, రాహుల్) అంతా కలిసి సోనియానే మన్నా ఇరకాటంలో పెట్టే ప్రయత్నంలో వున్నారా? అదే జరిగితే ఆట రసకందాయంలో పడ్డట్టే!

Monday, December 9, 2013

Rajagopalachari opposed linguistic states:Vanam Jwala Narasimha Rao

Remembering Rajaji on his 135th 
Birth Anniversary-10th December 2013

Rajagopalachari opposed linguistic states
Vanam Jwala Narasimha Rao


Chakravarthi Rajagopalachari, more popular as Rajaji, was a very well-known lawyer, writer, administrator, politician and statesman of India. He was the one and only Indian to be appointed as Governor General of India. As the staunch follower of Mahatma Gandhi since 1919, he became General-Secretary of the Indian National Congress in 1921. Rajaji, thus, got acquainted with leaders like Jawaharlal Nehru, Vallabhbhai Patel, Maulana Azad, Rajendra Prasad and others. Once regarded as Gandhi’s successor and was described by him as the "keeper of my conscience", Rajaji shared close kinship with Jawaharlal Nehru and Sardar Patel despite differences.

Though Rajaji was one of the top Congress leaders for about half a century, he could not become All India Congress Committee president even once. He was however a member of its Working Committee many times. Rajaji was born on December 10, 1878. While he was a child, an astrologer told his parents that he would have the "fortunes of a king, a guru, an exile and an outcaste. The people will worship him; they will also reject him. He will sit on an emperor's throne; he will live in a poor man's hut." The prediction came true. Apart from occupying the seat of Governor General, Rajaji served in various capacities as Premier of the Madras Presidency, Governor of West Bengal, Minister for Home Affairs of the Indian Union and Chief Minister of Madras state besides Governor General. He founded the Swatantra Party which stood against the Congress in the 1962, 1967 and 1972 elections. Rajagopalachari was instrumental in setting up a united anti-Congress front in Madras state under C. N. Annadurai, which swept the 1967 elections.

Rajaji and Nehru

Rajagopalachari's interest in public affairs and politics began when he commenced his legal practice in Salem in 1900. He participated in the Non-Cooperation movement and gave up his law practice. While Gandhi was in prison, Rajagopalachari led the group of "No-Changers", individuals against contesting elections for the Imperial Legislative Council and other provincial legislative councils, in opposition to the "Pro-changers" who advocated council entry. The motion was put to vote and the "No-changers" won by 1,748 to 890 votes. This resulted in the resignation of important Congress leaders including Motilal Nehru and C. R. Das, the President of the Indian National Congress. When Gandhi organized the Dandi march in 1930, Rajagopalachari broke the salt laws and was imprisoned by the British. Following enactment of the Government of India Act in 1935, Rajagopalachari was instrumental in getting the Indian National Congress to participate in the 1937 general elections. Indian National Congress came to power in the Madras Presidency and Rajagopalachari was the first Premier from the Congress party.

Madras under Rajagopalachari was still considered by political historians as the best administered province in British India. At the outbreak of the Second World War Rajagopalachari immediately resigned as Premier in protest at the declaration of war by the Viceroy of India. Rajagopalachari was arrested in December 1940. He opposed the Quit India Movement and also advocated dialogue with the Muslim League, which was demanding the partition of India. During the last years of the war, Rajagopalachari was instrumental in initiating negotiations between Gandhi and Jinnah. From 1946 to 1947, Rajagopalachari served as the Minister for Industry, Supply, Education and Finance in the Interim Government headed by Jawaharlal Nehru. When India attained independence on 15 August 1947, Rajagopalachari was appointed first Governor of West Bengal.

From 10 until 24 November 1947, Rajagopalachari served as Acting Governor-General of India in the absence of Governor-General Lord Mountbatten, who was on leave in England to attend the marriage of Princess Elizabeth to Mountbatten's nephew Prince Philip. Rajji led a very simple life in the viceregal palace, washing his own clothes and polishing his own shoes. Impressed with his abilities, Mountbatten made Rajagopalachari his second choice to succeed him after Vallabhbhai Patel, when he was to leave India in June 1948. Rajagopalachari was eventually chosen as the Governor-General when Nehru disagreed with Mountbatten's first choice, as did Patel himself. He was initially hesitant but accepted when Nehru wrote to him. Rajagopalachari then served as Governor-General of India from June 1948 until 26 January 1950, and was not only the last Governor-General of India, but the only Indian national ever to hold the office.


By the end of 1949, an assumption was made that Rajagopalachari, already Governor-General, would continue as president. Backed by Nehru, Rajagopalachari wanted to contest for the presidential election but later withdrew, due to the opposition of a section of the Indian National Congress mostly made up of North Indians. At Nehru's invitation, in 1950 Rajagopalachari joined the Union Cabinet as Minister without Portfolio where he served as a buffer between Nehru and Home Minister Sardar Patel and on occasion offered to mediate between the two. Following Patel's death on 15 December 1950, Rajagopalachari was finally made Home Affairs Minister and went on to serve for nearly 10 months. As Home Minister he expressed concern over demands for new linguistically based states, arguing that they would generate differences amongst the people.

By the end of 1951, the differences between Nehru and Rajagopalachari came to the fore. While Nehru perceived the Hindu Mahasabha to be the greatest threat to the nascent republic, Rajagopalachari held the opinion that the Communists posed the greatest danger. He also adamantly opposed Nehru's decision to commute the death sentences passed on those involved in the Telangana armed struggle and his strong pro-Soviet leanings. Tired of being persistently over-ruled by Nehru with regard to critical decisions, Rajagopalachari submitted his resignation on the "grounds of ill-health" and returned to Madras.

In the 1952 Madras elections, the Indian National Congress was reduced to a minority in the state assembly with a coalition led by the Communist Party of India winning most of the seats. Madras governor Sri Prakasa appointed Rajagopalachari Chief Minister after nominating him to the Madras Legislative Council without consulting either the Prime Minister Nehru or the ministers in the Madras state cabinet. Rajagopalachari was then able to prove that he had a majority in the assembly by luring MLAs from opposition parties to join the Indian National Congress. Nehru was furious. Rajagopalachari remained an as unelected member of the legislative council and did not context election.

During Rajagopalachari's tenure as CM, a powerful movement for a separate Andhra State gained a foothold. Potti Sriramulu embarked on a hunger strike reiterating the demands of the separatists and calling for the inclusion of Madras city within the proposed state. Rajagopalachari remained unmoved by Sriramulu's action and refused to intervene. Sriramulu eventually died on 15 December 1952. Both Rajagopalachari and Prime Minister Nehru were against the creation of linguistically demarcated states but as the law and order situation in the state deteriorated, both were forced to accept the demands. Andhra State was thus created on 1 October 1953 from the Telugu-speaking districts of Madras, with its capital at Kurnool. Rajagopalachari refused to allow Andhra State to have Madras as capital even for a day. Rajagopalachari resigned as Chief Minister on 13 April 1954, attributing the decision to poor health.

Following his resignation as Chief Minister, Rajagopalachari took a temporary break from active politics and instead devoted his time to literary pursuits. He was an accomplished writer who made lasting contributions to Indian English literature. He wrote a Tamil re-telling of the Sanskrit epic Ramayana which appeared as a serial in the Tamil magazine Kalki. The episodes were later collected and published as “Chakravarthi Thirumagan”, a book which won Rajagopalachari the 1958 Sahitya Academy award in Tamil language. In 1951, he wrote an abridged retelling of the Mahabharata in English, followed by one of the Ramayana in 1957. Earlier, in 1961, he had translated Kambar's Tamil Ramayana into English. In 1965, he translated the Thirukkural into English and also wrote books on the Bhagavad Gita and the Upanishads in English. On Republic Day 1955, Rajagopalachari was honored with India's highest civilian award, the Bharat Ratna.


By November 1972, Rajagopalachari's health had begun to decline and on 17 December the same year, a week after his 94th birthday, he was admitted to the Government Hospital, Madras where he died on 25 December 1972 at the age of 94. End

Saturday, December 7, 2013

ధర్మవరపు సుబ్రహ్మణ్యం చనిపోయారు:వనం జ్వాలా నరసింహారావు

ధర్మవరపు సుబ్రహ్మణ్యం చనిపోయారు

వనం జ్వాలా నరసింహారావు


ధర్మవరపు సుబ్రహ్మణ్యం హఠాన్మరణాన్ని సింగపూర్‌లో వున్న నేను ఈ ఉదయం పత్రికల్లో చదివి దిగ్భ్రాంతికి గురయ్యాను. బహుశా నేను సింగపూర్ బయల్దేరడానికి రెండు-మూడు రోజుల ముందనుకుంటా...ఏదో పని మీద ఫోన్‌లో చాలా సేపు మాట్లాడాడు. నేను సింగపూర్ నుంచి తిరిగి వచ్చిన తరువాత మా ఇంట్లో ఆయన, నేను, మరి కొందరం స్నేహితులం కలిసే ఏర్పాటు కూడా చేసుకున్నాం. విధి బలీయం. ఆయనిక లేరు. రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థలో నేను పనిచేస్తున్నప్పుడు, 1992 ప్రాంతంలో అనుకుంటా, సంస్థ ఛైర్మన్ మిరియాల వెంకట్రావు గారి ద్వారా ఆయన నాకు పరిచయమయ్యారు. పరిచయ సంధాన కర్త ప్రముఖ వైఎస్సార్సీపి (ప్రస్తుత) పార్టీ నాయకుడు అంబటి రాంబాబు. అతి త్వరలోనే మా పరిచయం స్నేహంలాగా మారింది. నేను పనిచేస్తున్న హస్తకళల అభివృద్ధి సంస్థకు, హస్త కళాఖండాలకు ప్రాచుర్యం లభించేందుకు ఆయన అంబటి రాంబాబుతో కలిసి రెండు-మూడు ప్రచార లఘు చిత్రాలను తయారు కూడా చేశారు. నేను పంజాగుట్ట దుర్గ గుడి పక్క సందులో నివాసం వుంటున్నప్పుడు, ధర్మవరపు, అంబటి, భండారు శ్రీనివాస రావు, డాక్టర్ ఎపి రంగారావు, మరి కొందరు అడపదడప కలుస్తుండే వాళ్లం. అప్పట్లో ధర్మవరపు మద్యం సేవించేవాడు మాతోపాటు. మా మధ్య సంభాషణ చాలా భాగం హాస్యం మీద, సినీ పాటల మీద, నాటకరంగం పద్యాల మీద, వర్తమాన రాజకీయాల మీద సాగేది. 


ధర్మవరపు మాట్లాడుతుంటే సినిమాలో మాట్లాడినట్లే వుండేది. సహజమైన తన వాక్చాతుర్యాన్ని సినిమాలలో కూడా చూపేవారాయన. పాటలు మధురంగా పాడేవారు. పద్యాలను బ్రహ్మాండంగా చదివేవారు. పాండవ-ఉద్యోగ విజయాల నుంచి రాయభారం పద్యాలు విన సొంపుగా చదివి విడమర్చి అర్థం చెప్పేవారు. మా ఉమ్మడి "సిట్టింగులు" తరచుగా మా ఇంట్లోనే ఐనప్పటికీ, మధ్య-మధ్య భండారు ఇంట్లో, ఒకటి-రెండు పర్యాయాలు డాక్టర్ రంగారావు ఇంట్లో, వీలున్నప్పుడల్లా ధర్మవరపు సుబ్రహ్మణ్యం ఇంట్లో చోటుచేసుకునేది. ఒకసారి ఆయన, నేను, జంధ్యాల, సోమయాజులు, ఎంవిజి సుబ్రహ్మణ్యం, డాక్టర్ రంగారావు, భండారు శ్రీనివాస రావు, కాసేపు ఎంవిజి ఇంట్లో, తరువాత గ్రీన్ పార్క్ హోటల్లో కూచుని మద్యం సేవిస్తూ దాదాపు తెల్లవార్లూ గడిపాం. అలనే జంధ్యాల చనిపోవడానికంటే కొద్ది రోజుల ముందర ప్రెస్ క్లబ్‌లో కలిశాం. యాక్సిడెంట్ అయిన తరువాత ఆయన మద్యం పూర్తిగా మానేశారు. ఐనా కంపెనీ ఇవ్వడంలో ఎన్నడూ వెనకాడ లేదు. నేను మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో పనిచేస్తున్నప్పుడు, పౌర సంబంధాల ప్రక్రియ మీద ఒక డివిడి ఫిల్మ్ చేసి పెట్తారు సంస్థకు. అలానే నేను ఇ.ఎం.ఆర్.ఐ (108) సంస్థలో పని చేస్తున్నప్పుడు అత్యవసర సహాయ సేవలు అందించే అంశంపై నాలుగు లఘు చిత్రాలను నిర్మించారు. ఎప్పుడు ఏది అడిగినా కాదనే సహృదయం ధర్మవరపు సుభ్రహ్మణ్యంది. మా ఇద్దరమ్మాయిల పెళ్లిళ్లకు ఆర్థిక సహాయం చేసాడు నాకు అడక్కుండానే. ధర్మవరపు ఇంట్లో, ఆయన కుటుంబ సభ్యులతో కూడా నేను సన్నిహితంగా వుండేవాడిని. ఆయన మరణానికి నా హృదయపూర్వక సంతాపం...ఆయన కుటుంబ సభ్యులకు నా సంతాపం.