Saturday, July 27, 2019

ఉన్మత్తుడి మాదిరి దుఃఖిస్తూ సీతను తలచుకున్న రాముడు .... శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-71 : వనం జ్వాలా నరసింహారావు


ఉన్మత్తుడి మాదిరి దుఃఖిస్తూ సీతను తలచుకున్న రాముడు
శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-71
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రభూమి దినపత్రిక (28-07-2019)
          వాస్తవానికి సీతాదేవి తన ఎదురుగా లేకపోయినా, మన్మథతాపం వల్ల కళ్లకు కట్టినట్లు దగ్గరే వున్నట్లు భావించిన శ్రీరాముడు, ఆ సీతను గురించి గద్గద స్వరంతో, మాట కూడా సరిగ్గా రాకుండా, తన బాధ ఇలాంటిదని చెప్పనలవి కాకుండా, విచారంతో చాలా-చాలా అన్నాడు, తనలో అనుకున్నాడు.

“జానకీ! కొత్త పూలమీద నీకున్న ప్రేమ వల్ల అశోకవృక్షం కొమ్మ పూల చాటున దాగావులే! తెలుసుకున్నాను. నేను కనుగొన్న తరువాత కూడా దాక్కోవడం ఎందుకు? లీలావతీ! నీ అందమైన తొడలు అరటి బోదెలలాంటివి కదా? అందువల్ల, కదలీ వృక్షాల మధ్యన వున్నా నువ్వు అందంగా ఉన్నందున అవి నాకు కనపడుతున్నాయి. దాచిపెట్టడం నీకు సాధ్యమా? విశాలమైన, దీర్ఘమైన కళ్ళుకలదానా! కొండగోగు పూలకని కొండగోగు వనానికి పోయి నవ్వులాటకు నన్ను పరిహాసం చేయడం నీకు ధర్మమా? నిన్ను చూడలేక బాధపడుతున్నానే? సీతా! నువ్వు పరిహాసప్రియవని నాకు తెలుసు. అయితే, ఇది పరిహాసానికి సమయమా? తిరిగి-తిరిగి, ఏడిచి-ఏడిచి, చాలా అలసిపోయాను. ఇలాంటి ఆపద సమయంలో నాతొ ఎగతాళి ఎందుకు?

         “అన్నా! లక్ష్మణా! నేనింతగా పిలుస్తున్నానే? ఒకవేళ వుంటే, ‘ఓ’...అనుకుంటూ పలికి రాకపోయేదా? శత్రువులు మింగారో? ఎత్తుకునే పోయారో? రెంటిలో ఒకటి జరక్కపోతే సీత కనపడకుండా వుండదు. ఈ మృగాలు కన్నీళ్లు కారుస్తూ సీతను రాక్షసులు తిన్నారని దుఃఖపడుతున్నాయి. ఎక్కడికి పోయావే సీతా? ఎక్కడున్నావే? నీ కారణాన, కైక నన్ను చంపదల్చుకున్న కోరిక నెరవేరుతుందా? జానకితో అరణ్యానికి వచ్చి, జానకిని పోగొట్టుకుని, గడువు తీరగానే నేనేమని అంతఃపురానికి పోతాను? పోయినా, లోకులేమంటారు? రాముడు అసమర్థుడనీ, చూపు గుర్రమేకాని సత్తువలేదనీ, సత్తువ వున్నా జానకి మీద దయలేనివాడనీ, అందుకే ఆమెను దక్కించుకోలేక పోయాడనీ, అనరా? ఒకరన్నా, అనకపోయినా, సీతలేకపోతే నాకు సుఖం ఎక్కడిది? ఎకపత్నీవ్రతుడను కదా! భార్యలేనివాడి బతుకు పాడేకడా? శిఖం ఎక్కడినుండి వస్తుంది?

         “అరణ్యంలో మనం కాపురం చేయాల్సిన గడువు త్వరగా తీర్చి అయోధ్యకు పోగానే, కూతురు, అల్లుడు చాలాకాలానికి తిరిగి వచ్చారని జనకుడు చూడడానికి వచ్చి, సంతోషంతో, ‘అల్లుడా! అందరూ క్షేమమా?’ అని అంటే నేనేమని చెప్పాలి? ‘మీకూతురు తప్ప అని చెప్పాల్నా? చెప్పడం సరే...ఆయన ముఖం నేనెలా చూడాలి? జానకి లేదనే వార్తా ఆయన చెవుల పడిందా, కడుపు దుఃఖాన తన బిడ్డను తలచి-తలచి శోకంతో తపించి-తపించి, సగం చచ్చిపోతాడు కదా? నేను ఇంటికి పోగానే, మా అమ్మ కౌసల్యాదేవి ఎదురుగా వచ్చి, ‘కుమారా! నాకోడలు ఏదిరా?’ అని అడిగితే నేనేమని చెప్పాలి? ఆ తరువాత మీ అమ్మ వచ్చి, ‘రామచంద్రా! ఏదిరా జానకి?’ అంటుందే? ఏమని చెప్పడానికి నోరెలా వస్తుంది? ఆ తరువాత కైకమ్మ కల్లబొల్లి చిరునవ్వుతో పరిహాసంగా ‘సీతను అడవికి దారబోసి వచ్చావా అంటుందే? నేనేమని అబద్ధం చెప్పాలి? భరతశత్రుఘ్నులు వచ్చి ‘అన్నా! మా వదినె రాలేదా ఏమి?’ అని ప్రశ్నిస్తారు కదా! ఏమని జవాబివ్వాలి? సీత రాలేదు, రాముడు ఒక ఆడదాన్ని కాపాడలేక పెళ్లాన్ని రాక్షసుల పాల్చేసి తాను మాత్రం వచ్చాడని పలచగా మాట్లాడేవాళ్ళ నోళ్లు ఎలా మూయించాలి? లక్ష్మణా! నేనేం చేయాలి? ఇప్పుడు నేను చెప్పినదంతా పోనివ్వు. భరతుడి పురానికి రాను. స్వర్గానికి పోతాననుకో. సీత లేని కారణాన అదికూడా శ్మశానంలా శూన్యంగా కనపడుతుంది”.


         “లక్ష్మణా! నువ్విక్కడ ఇంకా ఆలశ్యం చేయకుండా అయోధ్యకు పో. భరతుడిని గట్టిగా కౌగలించుకుని, నేను చెప్పానని, నా మాటలుగా ఇలా చెప్పు: ‘భరతా! నువ్వు శాశ్వతంగా రాజువై రాజ్యాన్ని పాలించు. ఇది రామాజ్ఞ’ అని చెప్పు. ఇంత కార్యం చేసిన మా తల్లి కైకకు, మీ అమ్మకు, కౌసల్యకు, నా ఆజ్ఞగా నమస్కారం చేయి. మా అమ్మను చాలా-చాలా అడిగానని చెప్పు. సీత పోయిన వ్యవహారం, నా చావు గురించి కూడా చెప్పు. అన్నివిధాలా నువ్వు ఆమెను జాగ్రత్తగా చూసుకో. నాయనా! ఇక పోయిరా. నీకు మేలు కలుగుగాక. నాయనా! నేను లేకుండా నువ్వు అడవుల్లో తిరగాల్సిన పనిలేదు. సీతాదేవి లేకుండా దేహంలో ప్రాణాలుండవు”.

         ఇలా వెల-వెలబోతూ, అతిశయించిన బాధతో రాముడు సీతాదేని తలచుకుంటూ మాట్లాడుతుంటే, దుఃఖపడుతుంటే, లక్ష్మణుడు చలించిన మనస్సుతో కలవరపడ్డాడు.

Friday, July 26, 2019

ప్రగతిపథంలో దూసుకెళ్తున్న ఓపెన్ వర్సిటీ : వనం జ్వాలా నరసింహారావు


ప్రగతిపథంలో దూసుకెళ్తున్న ఓపెన్ వర్సిటీ
వనం జ్వాలా నరసింహారావు
సూర్య దినపత్రిక (26-07-2019)
దేశంలో మారుమూల ప్రాంతాల్లో ఓపెన్ డిస్టెన్స్ ల‌ర్నింగ్‌, స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్‌, కెరియ‌ర్ ప్లానింగ్ కేంద్రం ఏర్పాటు, స్ట‌డీ మెటీరియ‌ల్ డిజిటైజేష‌న్ ఏర్పాటు.

డాక్టర్‌. బి.ఆర్‌, అంబేద్కర్‌ అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ (బిఆర్‌ఏఓయూ) తెలంగాణ ఓపెన్‌ యూనివర్సిటీగా ప్రసిద్ది. గతంలో ఆంధ్రప్రదేశ్‌ ఓపెన్‌ యూనివర్సిటి. హైదరాబాద్‌ మహానగరంలో ప్రజా యూనివర్సిటీగా సేవలు అందిస్తున్నది. 2016 జూలై 25న వైస్‌ ఛాన్సిలర్‌గా ఈ యూని ' వర్సిటీ బాధ్యతలు చేపట్టిన తరువాత శ్రీ' కుసుంబ సీతారామారావు గత మూడేళ్లుగా ఉన్నత స్థాయిలో నాణ్యమైన విద్యా విషయాల కల్పనతో పాటు అధ్యయనాలకు తోడ్పడే సేవల కల్పనపై దృష్టి పెట్టారు.

యూనివర్సిటీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రెండు రాష్ట్రాలలో విస్తరించిన ప్రాంతీయ సమన్వయ కేంద్రాలు, స్టడీ సెంటర్ల వ్యవస్థ ద్వారా మారు మూల ప్రాంతాల ప్రజలకు పెద్దఎత్తున తమ సేవలను అందిస్తున్నది. దూర విద్య కల్పనలో ప్రధాన సంస్థగా ఆవిర్భవించిన ఈ విశ్వవిద్యాలయం దేశంలోనే మారుమూల ప్రాంతాలలో కూడా విద్యా పరమైన వసతుల కల్పన(ఓపెన్‌ డిస్టెన్స్‌ లర్నింగ్‌... ఓడిఎల్‌)లో ప్రముఖ పాత్ర వహించింది.

భారతదేశంలోనే ఏర్పడిన తొలి ఓపెన్‌ యూనివర్సిటీగా ఖ్యాతి పొందిన బీఆర్‌ అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ 2017-18 విద్యా నంవత్సరం నుంచి విద్యార్థుల అధ్యయనపరమైన ఆశలకు అనుగుణంగా ఛాయిస్‌ బేస్ట్‌ క్రెడిట్‌ సిస్టమ్‌ (సిబిసిఎస్‌) సరళిని అమలు చేయడం ద్వారా యుజి స్థాయి కార్యక్రమాలలో పాఠ్యాంశాలు మరియు సిలబస్‌లకు మొదటి అవకాశం కల్పించింది. ఇప్పటివరకూ రెండు విద్యా సంవత్సరాలలో నాలుగు సెమిస్టర్‌లను విజయవంతంగా పూర్తి చేసుకున్న విద్యార్థులు 2019-20 విద్యా సంవత్సరంలో ఫస్ట్‌ బ్యాచ్‌ గ్రాడ్యుయేట్‌లుగా యూనివర్సిటీ నుంచి బాహ్య ప్రపంచంలోకి అడుగు పెట్టబోతున్నారు. తొలిసారిగా యూనివర్సిటీ మూడు వార్షిక స్నాతకోత్సవాలను - 21, 22, 23వ - వరుసగా నిర్వహించుకుంటున్నది. ఫలితంగా 2017, 2018, 2019 బ్యాచ్‌ల విద్యార్థులు ప్రయోజనం పొందగలరు.

సీబీసీఎస్‌ పద్ధతిలో భాగంగా విద్యాపరమైన కొత్త అంశాలు. స్టాటిస్టిక్స్‌, కంప్యూటర్‌ సెన్స్‌ అండ్ అప్లికేషన్స్‌, జియోగ్రఫీ వంటివి అంశాలను ప్రవేశ పెట్టడంతో పాటు అండర్‌ గ్రాడ్యుయేషన్‌ స్థాయిలో నిర్దుష్టమైన తప్పని సరి కోర్సులను కూడా ప్రవేశపెట్టారు. ఓపెన్‌ డిస్టెన్స్‌ లర్నింగ్‌ విధానం ద్వారా నాణ్యత, నిపుణత విస్తరణకు స్కిల్‌ డెవలప్‌ మెంట్‌, కెరియర్‌ ప్లానింగ్‌ కేంద్రంను ఏర్పాటు చేశారు. ఎన్‌ఎస్‌ డిసి, ఇతర స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సంస్థల మార్గదర్శిక సూత్రాల ప్రాతిపదికన స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ కోర్సుల( సర్టిఫికెట్‌ డిప్లమా స్థాయి) బోధనా కేంద్రంగా ఈ కేంద్రం గుర్తింపు పొందుతుంది. ఇందుకోసం యూనివర్సిటీ ఆర్మి ఆర్డినెన్స్‌ కార్టర్స్‌(ఏఓసీ) సికింద్రాబాద్‌, మహారాష్ట నాలెడ్డ్‌ కార్పొరేషన్‌ లిమిడెడ్‌(ఎంకెసిఎల్‌) పుణే, నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌ (ఎన్‌ఏసీ) హైదరాబాద్‌తో అవగాహన ఒప్పందాలు (ఎంఓయూ) కుదుర్చుకుంది. ఫలితంగా అండర్‌ (గ్రాడ్యుయేషన్‌ కార్యక్రమాలలో విద్యార్థులు స్కిల్‌ ఎడ్యుకేషన్‌ పొందగలరు. ఈ స్కిల్స్‌ ప్రాతిపదికన మూడేళ్ల జనరల్‌ అండర్‌ గ్రాడ్యుయేషన్‌ కార్యక్రమంతో పాటు ఓరియెండెట్‌ సర్టిఫికెట్‌, డిప్లమా కార్యక్రమాలలోనూ ప్రతిభలను అభివృద్ధి చేసుకుంటారు.

కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ, యూజీసీ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌లో చేపట్టిన నేషనల్‌ డిజిటల్‌ కార్యక్రమం కింద ఈ యూనివర్సిటీ ఆన్‌లైన్‌ లర్నర్ సపోర్ట్‌ సర్వీసెస్‌, మల్టిపుల్‌ గేట్‌ వేస్‌ ఆఫ్‌ పేమెంట్‌ సర్వీసెస్‌ లను పటిష్టం చేసింది. అలాగే ఆధునీకరించి అప్‌ గ్రేడ్‌ చేసిన యూనివర్సిటీ వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. ఉద్యోగుల సమయపాలన,  క్రమబద్ధమైన హాజరును ప్రోత్సహించేందుకు బయో- మెట్రిక్‌ అటెందెన్స్‌ విధానాన్ని ప్రవేశపెట్టడంతో పాటు, యూనివర్సిటీ భవనాలు, మొత్తం క్యాంపస్‌ లో క్లోజ్డ్‌ సర్కూయట్‌ ఎలక్ష్ఞానిక్‌ పర్యవేక్షణ విధానాన్ని ప్రవేశ పెట్టింది.


యూనివర్సిటీ వ్యవస్థీకృత ఓపెన్‌ ఎడ్యుకేషనల్‌ రిసోర్సెస్‌ (ఓఇఆర్‌) విధానానికి రూపకల్పన చేయడంతో పాటు బీఆర్‌ఏఓయు విద్యా జ్ఞాని (ఓపెన్‌ ఎడ్యుకేషనల్‌ రిసోర్సెస్‌ రిపోజిటరీ)ని ఏర్పాటు చేస్తున్నది. అవసరమైన విద్యారులకు విద్యాపరమైన పాఠ్యాంశాలకు సంబంధించి సాఫ్ట్‌ కాపీలను కల్పించేందుకు అండర్‌ గ్రాడ్యుయేషన్‌ కార్యక్రమాలకు సంబంధించిన స్టడీ మెటీరియల్‌ డిజిటైజేషన్‌ కార్యక్రమం కూడా ఇప్పటికే ఆరంభమైంది. వెట్‌ రేడియో ద్వారా, యూ ట్యూబ్‌ ద్వారా మల్టీ మీడియా (ఆడియో- వీడియా) సహాయంతో పాఠాలను కల్పిస్తున్నారు. అన్ని అండర్‌ గ్రాడ్యుయేషన్‌, పీజీ పరీక్షలలోనూ జవాబు పత్రాల పరిశీలన, మూల్యాంకనంలను సమర్థంగా, ఎలాంటి లోటు పాట్లు లేకుండా నిర్వహించడంతో పాటు ప్రశాంతంగా ఫలితాలను ప్రకటించేందుకు వీలుగా డిజిటల్‌ ఆన్‌ స్ర్కీన్ ఎవల్యూషన్‌ సిస్టమ్‌ (డిఓఎస్‌ ఇఎస్‌)ను యూనివర్సిటీ ప్రవేశ పెట్టింది. వ్యవస్థాపరమైన ఐటీ విధానం రూప కల్పనకు, సమర్థవంతంగా లర్నింగ్‌ మేనేజిమెంట్‌ సిస్టమ్‌ (ఎల్‌ఎంఎస్‌) కల్పనకు వీలుగా ఈ లర్నింగ్‌ పోర్టల్‌ ఏర్పాటు చేసేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేశారు. విద్యార్థుల ప్రయోజనం దృష్ట్యా అవార్డులు, సర్టిఫికెట్స్‌ డిజిటల్‌ స్టోరేజి పర్యవేక్షణ కోసం ఎంహెచ్‌ ఆర్‌డి( మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ) యూజీసీల నేషనల్‌ అకడమిక్‌ డిపోజిషన్‌ (ఎన్‌ఏడి) విధానంలో భాగంగా యూనివర్సిటీ సిడిఎస్‌ఎల్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌ అనే సంస్థతో ఓ ఒప్పందాన్ని కుదుర్చుకుని అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది.

వివిధ విద్యాపరమైన, మౌలిక వసతుల అభివృద్ధి కార్యక్రమాల అమలుకోసం యూనివర్సిటీ పలు చర్చా కార్యక్రమాలను, గోష్టులను, స్మారకోపన్యాసాలను, వర్క్‌ షాప్‌లనూ, సెమినార్‌లను ఏర్పాటు చేస్తున్నది. అంతే కాదు, తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి, తెలంగాణ ప్రభుత్వం సహకారంతో, కామన్వెల్త్‌ ఆఫ్ లర్నింగ్‌ (సిఓఎల్) సహకారంతో అంతర్జాతీయ స్థాయి కాన్ఫరెన్స్‌ లను,  పలు కీలక అంశాలపై సమావేశాలను నిర్వహించింది. ఓపెన్‌ డిజిటల్‌ లర్నింగ్‌ విధానాన్ని నిరంతరం సమర్థంగా నిర్వహించే అంశంపై చర్చించేందుకు, ఓ అంతర్జాతీయ సమావేశంతో పాటు, ఆలిండియా ఓపెన్‌ యూసివర్సిటీల వైస్‌ ఛాన్స్‌లర్ల రౌండ్‌ టేబుల్‌ సమావేశాన్ని(ఆర్టీఎం) అంబేద్మర్‌ ఓపెన్‌‌ యూనివర్సిటీ సమర్థంగా నిర్వహించింది.

యూనివర్సిటీ వైస్‌ ఛాన్సిలర్‌ తన పదవీ కాలంలో విద్యాపరమైన పలు కార్యక్రమాలను, అంతర్జాతీయ స్థాయి సమావేశాలు గోష్టులను చురుగ్గా నిర్వహించడమే కాదు. టొరంటో, కౌలాలంపూర్‌, న్యూఢిల్లీలో జరిగిన ఓపెన్‌ యూనివర్సిటీ  వైస్‌ ఛాన్సిలర్‌ ల అంతర్జాతీయ రౌండ్‌ టేబుల్‌ సమావేశాల్లోనూ చురుగ్గా పాల్గొన్నారు. అలాగే పుణే సింబియోసిస్‌ యూనివర్సిటీ, అసోం గువాహటిలోని కెకెహెచ్‌ఎస్‌ ఓయూ నిర్వహించిన అంతర్జాతీయ సమావేశాల్లో విజయవంతంగా పాల్గొన్నారు.

దేశంలో ఓపెన్‌ యూనివర్సిటీల ఏర్పాటు, రెగ్యులర్‌ యూనివర్సిటీలలో ఓపెన్‌ డిజిటల్‌ లర్నింగ్‌కు సంబంధించిన నాణ్యతా ప్రమాణాలు, మౌలిక సౌకర్యాల నిర్దారణ, అంచనా, వాటికి అవసరమైన అక్రిడేషన్‌ విధానం రూపకల్పన కోనం యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూసీజీ)కి చెందిన నేషనల్‌ టాస్క్‌ ఫోర్స్‌ కమిటీలోనూ నేషనల్‌ ఎక్రిడేషన్‌ అండ్‌ అసైస్మెంట్‌ కమిటీ(ఎన్‌ఏఏసీ) నభ్యుడుగా అంబేద్యర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ వైస్‌ ఛాన్సిలర్‌ బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం వైస్‌ ఛాన్సిలర్‌ సీతారామరావు యూజీసీ ఓడిఎల్‌, అన్‌లైన్‌ విద్య క్రమబద్ధీకరణ, అమలుకు నంబంధించిన యూజీసీ నేషనల్‌ వర్మింగ్‌ గ్రూప్‌ (ఎన్‌ డబ్య్యూజి) సభ్యులుగా ఉన్నారు. యూజీసీ జాతీయ స్టాయి వైస్‌ ఛాన్సిలర్‌ల కమిటీ నభ్యుడేగా, విజిటింగ్‌ టీమ్‌ చైర్మన్‌, సభ్యులుగా. ముంబై యూనివర్సిటీ, మేవార్‌ యూనివర్సిటీ,(చిత్తోర్‌ గఢ్‌, రాజస్టాన్‌)లను  సందర్శించి ఈ రెగ్యులర్‌ యూనివర్సిటీలలో ఓపెన్‌ డిజిటల్‌ లర్షింగ్‌ వ్యవస్థల పనితిరును, వాటి స్థాయిలను అంచనా వేసే కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు.

అంబేద్మర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ తెలంగాణ ప్రభుత్వం మౌలిక వసతుల కల్పనకు మంజూరు చేసిన రూ. 20 కోట్ల ఏకమొత్తం గ్రాంట్‌ను సమర్థంగా వినియోగించుకోవడంతో పాటు యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్‌ భవనం పైకప్పుపై 300 కిలోవాట్ల సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ ఏర్పాటుతో పాటు చాలా మౌలిక సౌకర్యాల అభివృద్ధి పనులను చేపడుతున్నది.

విద్యారంగంలో పరిశోధన పరమైన నాణ్యత మెరుగుపరచడంతో పాటు, స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ పనులను ప్రవేశపెట్టడం, విస్తరణ చేపట్టడం, స్టడీ  కేంద్రాల పునర్వ్యవస్థీకరణ, ఆడియో- వీడియా పాఠాల అభివృద్ధి ప్రోత్సాహం, వ్య స్థకృత ఐటీ విధాన రూపకల్పన, ఓపెన్‌ డిజిటల్‌ లర్నింగ్‌ కార్యక్రమాల అంతర్జాతీయకరణ వంటి పలు కార్యక్రమాలు బీఆర్‌ఏఓయూ చేపట్టిన భవిష్యత్‌ ప్రణాళికలలో ఉన్నాయి. డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ గత మూడేళ్లుగా చేపట్టిన విద్యాపరమైన, అభివృద్ధి పరమైన కార్యక్రమాలు బహుశా ఇటువంటి ఏ యూనివర్సిటీ కూడా చేపట్టలేదంటే అతిశయోక్తి కాబోదు. ఈ ఘనత అంత వైస్‌ ఛాన్సిలర్‌ కుసుంబ సీతారామారావు గారికే దక్కుతుంది. అసాధారణ విద్యా వేత్త, అనుభవశాలి అయిన ఆయన ఆధ్వర్యంలో యూనివర్సిటీ బహుముఖ రంగాల్లో అభివృద్ధి చెందడమే కాక, దూరవిద్యలో ప్రపంచ స్థాయిలోనే ప్రతిష్టాత్మక ఇనిస్టిట్యూషన్‌గా ఎదిగి, ప్రశంసలు అందు కుంటున్నది. యూనివర్సిటీని ఈస్థాయికి చేర్చడంలో తనకు ముందు పనిచేసిన వైస్‌ ఛాన్సిలర్లు, ఇతరులకు వైస్‌ ఛాన్స్‌లర్‌ వినమ్ర పూర్వకంగా ధన్యవాదాలు తెలుపడం ఆయన ఔదార్యతకు అద్దం పడుతున్నది.

Thursday, July 25, 2019

A futuristic Urban Policy for TS : Vanam Jwala Narasimha Rao


A futuristic Urban Policy for TS
Vanam Jwala Narasimha Rao
Telangana Today (26-07-2019)

Working in tandem with the new Municipal Act, the Urban Policy will address complex challenges and enable better citizen services

Telangana Urban Policy is a paradigm shift in Urban planning with a citizen friendly futuristic vision. The fast urbanization is resulting in more than half of the world’s population either continue to live in cities and towns or migrating there. With this pace, it is projected that, by 2050, nearly 70 per cent of the people will be living in urban areas. This would lead to significant economic growth with the cities becoming the engines propelling it.

A key reason why large cities tend to have productivity advantages is their capacity to catalyse agglomeration and networking externalities, facilitating scale economies. But this pervasive phenomenon will certainly increase the demand of urban infrastructure making the task of planning, finance and governance inherently challenging. This leads to exorbitant land and housing prices, shortage of civic amenities, traffic congestion, pollution, sprawl, slums, inequality, crime, etc.

Neglected Subject
Urban Planning is a crucial tool to manage cities but it is often a neglected subject in India. Unfortunately, the Indian planning system has forgotten that urban and town planning is critical for a growing country like India.

The Government of India has carved out National Urban Policy Framework (NUPF) in 2018. The policy outlines ten philosophical principles focusing majorly in the ten functional areas of urban space and management. However, in accordance with provisions of 7th Schedule of Indian Constitution, Urban Development and Urban Policy is a state subject.  

Telangana has done very well in urban innovations. The youngest State of India has taken up several initiatives to develop cities and towns in the state. Telangana is the 5th most urbanized state in the country with urbanisation at 42 percent, much higher than the national average at 31 percent and it is likely to become 50% within next 5 years.

The State has 141 Urban Local Bodies (ULBs) with 1.45 crore population. Urban population in the State had witnessed fastest increase in the decade 2001-2011 as compared with the previous decades. Hyderabad, the capital city of Telangana has created a unique mark in global competitiveness and progressed at several fronts. Cities like Warangal, Karimnagar, Nizamabad and Khammam are being developed by promoting economic linkages with their surrounding areas. Recently, the Government has constituted seven new Municipal Corporations in addition to present six.  Initiatives are on to develop master plans for all towns and cities in the state to promote orderly development of urban areas.

Junking Outdated Policies
In the context of large-scale urbanisation, it’s of utmost important to do away with outdated urban development Acts, especially Telangana Municipalities Act 1965, and Telangana Town Planning Act 1920. Despite the large-scale reforms, the outdated Acts which are in force have constantly failed the urban system in the State to keep pace with socio-economic and cultural dynamism. The State development is miserably hindered by development challenges like multiplicity of organisations, lack of coordination, weak finances, unprecedented urban sprawl, uneconomic extension of infrastructure, slums, environmental degradation, and segregation between the rich and the poor.


Further, there are subjectivities under these existing Acts, providing an opaque system wherein too much power and discretion is vested in the hands of municipal employees and this is the primary reason for citizen pain points resulting in delays, corruption and harassment.


There is thus an urgent need to shelve old archaic laws and come out afresh with emphasis on use of technology, transparency and self-certification. The ultimate idea is to make things easy for citizens so far as interaction with municipalities and services are concerned. And hence the new Municipal Act has been brought by Telangana Government.

Planning in Telangana
Harnessing the synergy between land, transport and urban economics and spatial planning to avail the opportunities unleashed by the Urban Revolution is important. Urban Planning must be brought to the fore to resolve complex urban challenges. Hence the Telangana State Urban Policy (TSUP) is essential for an integrated and coherent approach towards the future of urban planning. The TSUP shall facilitate the State Urban Development in building interactions between land-use, transport and housing within cities, and then choosing the optimum solution based on specified goals.

The three core elements that TSUP should focus on are planning, Governance and urban finance and infrastructure development. These three elements shall be aimed to build economically efficient, socially inclusive, environmentally sustainable and financially viable cities and towns that will drive the State to prosperity.

In the three functional areas, the broad recommendations focussed by TSUP shall be as follows:

Planning: Instead of land-use led planning Transport-led; Promoting public transport and Intelligent Transportation Systems (ITS) with proper provision for pedestrian and street infrastructure; Expansion of cities and towns prioritising high density mixed land use with compulsory land allocation for public transport stops and depots; Ensuring last mile connectivity for all modes of transport; Revisiting Master Plan-Preparation, Implementation and Monitoring Framework; Integrated approaches to poverty alleviation; Affordable Housing Policy; Local Area and Neighbourhood Plans; Land Pooling Scheme (LPS); Access to water and sanitation for all; Clean and Healthy Environment; Adequate Investment in skilled labour and local economic development; Focus on renewable energy; Comprehensive Land Policy to keep a check on uncontrolled agricultural to non-agricultural conversions, urban sprawl and Integrated Building and Zonal Regulations.

Governance: Getting rid of old archaic Acts, Rules with an updated state of the art Legislation which meets the changing urban needs; Empowering and strengthening the role for ULBs in economic development; Fostering Public Participation in Planning Process Administrative Reforms to improve infrastructure delivery; Simplified procedures related to municipal citizen services; Integrate planning organisations and processes; Building capacity across all levels; Establishing Urban Centre of Excellence towards professionalising urban management, rendering support to Urban Local Bodies and Government Departments; Making the elected representatives and municipal authorities more accountable, accessible and deal with 100% transparency; and Increased role of District Collector in ensuring efficient service delivery of municipal services.

Finance and improved infrastructure: Innovative Financing Techniques, Value Capture Financing, Actionable Development Rights, etc.; Adequate Investment in skilled labour and local economic development; Raising own sources of municipal revenues– property tax reform; Reforms to financially empower ULBs; Credit rating of ULBs; All ULBs to have master plan; All ULBs to have underground drainage and proper solid and liquid waste management plan; Expansion and protection of green lung spaces in the cities and Robust planned infrastructure.

Wednesday, July 24, 2019

BRAOU: Surging ahead towards greater heights .... Vanam Jwala Narasimha Rao


BRAOU: Surging ahead towards greater heights
 Vanam Jwala Narasimha Rao
Hans India (25-07-2019)

At a time when detractors cry foul over falling standards of education and regular degree holders look down upon those who graduate on distance learning mode, an open university is going great guns, much to the amusement of students and academician as well.

Dr. B.R. Ambedkar Open University (BRAOU), also known as Telangana Open University, formerly Andhra Pradesh Open University, is a public university in the city of Hyderabad. Of late, the University has been drawing wide attention for its excellent services and high standards of education. Undisputedly, the man behind the present success of the university is none other than its present vice-chancellor Kusumba Seetharama Rao.

Rao, who took charge as vice-chancellor of this university three years ago on 25th July 2016, focused on providing high-quality materials and learning support services. A network of Regional Coordination Centres and Study centres spread across the two states of Telangana and Andhra Pradesh is in the domain of providing delivery services to reach out to the unreached. This university as a premier institution of distance education played a significant role to bring legitimacy to the Open Distance Learning (ODL) system in the country.

To its credit, BRAOU is the first established Open University in India, which has taken prime initiative to implement Choice Based Credit System (CBCS) Pattern, to claim first chance of curriculum and syllabus at UG level programmes from the academic year 2017-18 onwards. So far two academic years or four semesters have been successfully completed and students of 2019-20 academic year are going to be the first batch of graduates coming out from the University. For the first time in the annals of the University three Convocations- the 21st, 22nd, and 23rd -were conducted consecutively benefiting students of 2017, 2018 and 2019 batches respectively.

New disciplines like Statistics, Computer Science and Applications and Geography were introduced as one of the disciplines and specific compulsory courses at Under Graduate level as part of CBCS pattern. To expand skill education through ODL Mode Skill Development and Career Planning Centre has been established. This Centre has identified various skill development courses (at Certificate and Diploma Levels) basing on the Guidelines of NSDC and other skill development institutions.

As a result, the University has entered MOU, with Army Ordnance Corps (AOC) Centre Secunderabad, Maharashtra Knowledge Corporation Limited (MKCL) Pune and National Academy of Construction (NAC) Hyderabad to impart skill education to the students of UG Programmes. These skills based and oriented Certificate and Diploma Programmes add value to their three-year general Undergraduate Programme.

As part of National Digital Initiatives in higher education by Union Ministry of Human Resource Development and UGC this University has strengthened online learner support services and multiple gateways of payment services. A new modernised and upgraded University website has been launched. In order to maintain the punctuality and promptness of the employees and safety and security of the properties and persons, administration has introduced bio-metric attendance system for employees and closed-circuit electronic surveillance system in the buildings and entire campus.

The University has evolved its institutional Open Educational Resources (OER) Policy and launched ‘BRAOU Vidya Ghani an OER Repository. Digitisation of study material of UG programmes has already been started to provide soft copies of study material for the needy. Multimedia (audio-video) form supporting lessons are being provided through web radio and You Tube. Digital Onscreen Evaluation System (DOSES) has been introduced in all UG and PG Examinations in order to make evaluation and assessment process cost effective, fool proof and with required pace for announcing results.

A Committee has been constituted to establish e-learning portal with effective Learning Management System (LMS), and to evolve institutional IT policy. The University has entered into an agreement and signed MoU with CDSL Ventures Ltd as part of the national Academic Deposition (NAD) Policy of MHRD and UGC for the benefit and interests of students.


Apart from implementing various academic and infrastructure development programmes, the University has organised numerous Extension Lectures, Workshops, Seminars and Symposiums.  Besides organising an International Conference in collaboration with Commonwealth of learning (COL), Telangana State Council of Higher Education (TSCHE) and Government of Telangana on “Current ODL Issues”, the University was able to organise All India Open Universities Vice-Chancellors Round-Table Meet (RTM) as part of this International Conference, to discuss on infinite potency of ODL system in the present context.

The Vice-Chancellor of the University during his tenure not only active in organising different kinds of academic programmes and events of International repute, but also actively participated in International RTMs of Vice-Chancellors of Open Universities at Toronto, Kaulalampur and New Delhi and in a few International Conferences organised at Symbiosis University, Pune and KKHSOU, Guwahati, Assam. The Vice-Chancellor has an opportunity to be a member of National Task Force (NTF) Committee of University Grants Commission (UGC) and National Accreditation and Assessment Council (NAAC) which finalised assessment and accreditation policy frame and criteria for Open Universities and ODL Institutions of regular Universities.

At present the Vice-Chancellor Seetharama Rao is a Member of the UGC National Working Group (NWG) on implementation UGC ODL and Online Education Regulations. Being a member of this UGC National level Committee Vice-Chancellor has visited, as Visiting Team Chairman and Member, Mumbai University, and Mewar University, Chittorgarh, Rajasthan to assess the status and functioning ODL institutions of these regular Universities.

This University has effectively utilised the one-time infrastructure grant to the tune of Rs 20 crores sanctioned by the Government of Telangana besides developing lot of infrastructural facilities that includes 300 kw roof top solar power plant over the terrace of Administrative Block.

improving Quality of Research Programmes, Introduction and expansion of Skill development, Reorganization of Study centers, Promoting and developing Audio-Video lessons, Evolving Institutional IT Policy, Internationalization of ODL programmes etc. are some of the future proposed initiatives of BRAOU.  

The Academic and Development Programmes of the Dr BR Ambedkar Open University during the past three years, are perhaps worth emulating by any other such academic institution. The credit for all this should go to the Vice-Chancellor Kusumba Seetharama Rao who possesses an excellent academic qualifications and experience. Despite the tremendous growth under his stewardship, the VC humbly expresses his sincere thanks to all his predecessors under whose leadership this university was nurtured, fostered and developed to be able to emerge itself as one of the prestigious institutions of distance education in the world.

Monday, July 22, 2019

ప్రజలే కేంద్రంగా కొత్త పురపాలన : వనం జ్వాలా నరసింహారావు


ప్రజలే కేంద్రంగా కొత్త పురపాలన
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రజ్యోతి దినపత్రిక (23-07-2019)
           1965 నాటి తెలంగాణ పురపాలక చట్టం, 1994 నాటి మునిసిపల్ కార్పోరేషన్ చట్టం స్థానంలో నూతనంగా 2019 తెలంగాణ పురపాలక చట్టం బిల్లుకు శుక్రవారం (19 జులై) నాడు రాష్ట్ర శాసనసభ, శాసన మండలి ఆమోదం తెలిపాయి. లాంచనంగా గవర్నర్ ఆమోదముద్ర పడి అది చట్టం అయింది. గెజెట్ నోటిఫికేషన్ కూడా విడుదలైంది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్వయంగా చొరవ తీసుకుని ప్రతి అంశం క్షుణ్ణంగా పరిశీలించి, అధికారులతో, నిపుణులతో సుదీర్ఘంగా చర్చించిన నేపధ్యంలో, ఆయన స్వీయ పర్యవేక్షణలో, మేధోమథనంతో, ప్రజలే కేంద్రబిందువుగా రూపుదిద్దుకున్నది ఈ చట్టం.    

         భారత దేశం మొత్తంలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజియన్ కు ఒక ప్రాధాన్యం వుంది. త్వరితగతిన వృద్ధి చెందుతున్న పట్టణ సమ్మేళనాలలో అన్నిటికన్నా అతివేగంగా అభివృద్ధి జరుగుతున్నది ఇక్కడే. ఔటర్ రింగ్ రోడ్ లోపల వున్న 97 రెవెన్యూ గ్రామాలు కాలం గడిచే కొద్దీ, పట్టణ లక్షణాలు సంతరించుకుని 2028 లో 26 మునిసిపాలిటీలుగా మారాయి. వీటిలో బడంగ్పేట్, బండ్లగూడా జాగీర్, బోడుప్పల్, పీర్జాదిగూడా, జవహర్ నగర్, నిజాంపేట, మీర్పేటలు మునిసిపల్ కార్పోరేషన్లుగా మారుతున్నాయి. ఇవి, వీటితో పాటు ఔటర్ రింగ్ రోడ్ లోపల వున్న హైదరాబాద్ మహానగర మునిసిపల్ కార్పొరేషన్ పైనా, హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ పైనా, ఒక ప్రత్యేకమైన దృష్టి సారించాల్సి వుంటుంది. ఇక మీద రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ తో సహా, మొత్తం 13 మునిసిపల్ కార్పొరేషన్లు వుండబోతున్నాయి.

            కొత్తగా ఏర్పాటు కాబోతున్న 7 మునిసిపల్ కార్పొరేషన్లను కలుపుకుని 2018 లో రాష్ట్ర ప్రభుత్వం 68 పట్టణ స్థానిక సంస్థలను (అర్బన్ లోకల్ బాడీస్-యుఎల్బీలు) ఏర్పాటు చేసింది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా 13 మునిసిపల్ కార్పోరేషన్లను, 128 యుఎల్బీలను కలుపుకుని మొత్తం 141పట్టణ స్థానిక సంస్థలున్నాయి. వీటిలో ప్రస్తుతం 122 పట్టణ స్థానిక సంస్థలకు, 10 మునిసిపల్ కార్పొరేషన్లకు (కొత్తవి 7 కాకుండా కరీంనగర్, రామగుండం, నిజామాబాద్) ఎన్నికలు జరగాల్సి వుంది. గతంలోగా కాకుండా ఎన్నికల తేదీలను ప్రకటించే అధికారం ప్రభుత్వానికే వుండేలా చట్టం నిబంధనలు విధించింది.

         ఇప్పుడు తెచ్చిన నూతన చట్టం రాక ముందు తెలంగాణ రాష్ట్రంలో ఐదు రకాల పురపాలక చట్టాలుండేవి. ఈ చట్టాలలోని పలు నిబంధనలు పురాతనమైనవిగానూ, ఔచిత్యం కోల్పోయినవిగానూ ప్రభుత్వం భావించి, వాటిని మెరుగుపరచడానికి కొత్త చట్టం తేవాల్సిన అవసరాన్ని గుర్తించింది. పాత చట్టం నేపధ్యంలో పట్టణ ప్రాంతంలోని ప్రజలు అనేక రకాల కష్ట-నష్టాలకు, ఇబ్బందులకు గురి కావడం, అవినీతి విచ్చలవిడిగా పెరిగి పోవడం, ఏ పని కూడా లంచం ఇవ్వకుండా జరగక పోవడం ప్రభుత్వం గుర్తించి, ప్రత్యామ్నాయం దిశగా అడుగులు వేసింది. తత్పర్యవసానమే నూతన పురపాలక చట్టం, నూతన పట్టణ విధానం.

         సున్నా స్థాయి అవినీతి సహనం, పూర్తి స్థాయి పారదర్శకత, సాంకేతిక సహాయంతో నిర్ణీత కాలంలో పౌర సేవల లభ్యం, ఆ క్రమంలో మునిసిపల్ సిబ్బందితో ముఖాముఖి పరస్పర సంబందాల తగ్గింపు, పౌరుల మీద అధిక మోతాదులో నమ్మకం ప్రాతిపదికగా, చట్ట రూపేణా ఒక సంస్థాగత విధానం రూపుదిద్దుకోవడానికి ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన ప్రభుత్వం సంకల్పించింది. ఈ దిశగా, స్వీయ ధృవీకరణ పద్ధతిని ప్రవేశపెట్టి, తప్పుడు ధృవీకరణ ఉద్దేశపూరకంగా ఇచ్చినవారికి కఠినమైన శిక్ష పడేలా చట్టంలో జాగ్రత్త పడింది ప్రభుత్వం. గతంలో చట్టాల లొసుగుల ఆధారంగా జరిగే ఆస్కారం వున్న అనేక అవినీతికి ఆధారమైన అంశాలను ఒక రకమైన సస్త్రచికిత్సా విధానం పద్ధతిలో ఈ చట్టంలో లేకుండా జాగ్రత్త పడ్డది ప్రభుత్వం. ఇవన్నీ చట్టంలో పొందుపర్చడం కూడా జరిగింది. కొత్త పురపాలక చట్టం తెచ్చినప్పటికీ, 1955 నాటి జీహేచెంసీ, 2008 నాటి హేచేమ్డీయే చట్టాన్ని ప్రస్తుతానికి యధావిధంగా కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నూతన పురపాలక చట్టంలోని నియమ-నిబంధనలు ఆసక్తికరంగా, ఆకట్టుకునే రీతిలో వున్నాయి.       

         నూతన చట్టం మీద అవగాహన కల్పించడానికి చైర్ పర్సన్లకు, వార్డ్ సభ్యులకు, ఒక క్రమ పద్ధతిలో, అప్పుడప్పుడూ శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తారు. దీనికొరకై “అర్బన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్” ను ఏర్పాటు చేసి, దానిద్వారా శిక్షణ ఇవ్వడంతో పాటు, అన్నిరకాల పట్టణ రంగ ఆవిష్కరణలను చేపట్టే విధంగా ఈ సెంటర్ ను తీర్చిదిద్దుతుంది ప్రభుత్వం. వాస్తవానికి ఎన్నికల్లో పోటీచేయాలనుకుంటున్న వారందరూ, మునిసిపాలిటీలలో పనిచేస్తున్న వారంతా ఈ చట్టాన్ని క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకుంటే మంచిది.


         పురపాలక సంఘాల అభివృద్ధి క్రమంలో ప్రజల భాగస్వామ్యాన్ని నిర్ధారించడానికి ప్రతి వార్డులో నాలుగు వార్డ్ కమిటీలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ కమిటీలలో స్వయం సహాయక బృందాల సభ్యులతో, నివాసదారుల సంక్షేమ సంఘాల సభ్యులతో కూడిన యువకులకు, మహిళలకు, సీనియర్ సిటిజన్లకు, ఇతరులకు ప్రాతినిధ్యం వుంటుంది. వార్డుకు సంబంధించిన అనేక అంశాలలో ఈ కమిటీ మునిసిపాలిటీకి సూచనలు, సలహాలు ఇవ్వడంతోపాటు, పారిశుద్ధ్య, హరితహారం కార్యక్రమాలను కూడా సునిశితంగా పర్యవేక్షిస్తుంది.

         జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సామాజిక అడవుల అంశం చూసే డివిజనల్ ఫారెస్ట్ అధికారి, సంబంధిత మునిసిపల్ కమీషనర్ సభ్యులుగా ఏర్పాటయ్యే ఒక కమిటీ ప్రతి పురపాలక సంఘానికి గ్రీన్ కార్యాచరణ ప్రణాళికను తయారు చేస్తుంది. మొత్తం మునిసిపల్ బడ్జెట్లో గ్రీన్ బడ్జెట్ పదిశాతానికి తగ్గకుండా వుండాలని చట్టం చెప్తున్నది. ఈ విధంగా హరితహారం లక్ష్యాలను నేరవేరుస్తున్నది ఈ చట్టం. వార్డు మెంబర్లకు, సంబంధిత అధికార్లకు నాటిన మొక్కలను బతికించే బాద్య అప్పచెప్తూనే, లా జరగకపోతే వారి పదవులు, ఉద్యోగాలు పోయేలా కతినమైన నిబంధనలను పొందుపర్చడం జరిగింది చట్టంలో.  
    
         పురపాలక సంఘాల ఉన్నతాధికారైన మునిసిపల్ కమీషనర్ కు ఒక నిర్దుష్టమైన జాబ్ చార్ట్ వుంటుంది. పౌరసదుపాయాల కల్పన బాధ్యత ఆయనదే. అందులో ప్రధానంగా, రహదారుల, మురుగునీటి కాల్వల, మౌలిక సదుపాయాల నిర్మాణం, నిర్వహణ; మంచినీటి సరఫరా నిర్ధారణ: పారిశుద్ధ్య పనుల నిర్ధారణ; ఘన, ద్రవ వ్యర్థ పదార్థాల నిర్వహణ; ఇంటింటికీ పోయి చెత్త సేకరణ పనుల నిర్ధారణ; క్రమం తప్పకుండా వీధుల స్వీపింగ్; వ్యర్థపదార్థాల సురక్షిత రవాణా; మురికివాడల అభివృద్ధి; పట్టణ నిరాశ్రయులకు రాత్రి ఆశ్రయం (నైట్ షెల్టర్) నిర్వహణ; బస్ షెల్టర్ల ఏర్పాటు; శ్మశానవాటికల, వైకుంఠధామాల, విద్యుత్ శ్మశాన వాటికల నిర్వహణ; వీధి దీపాల నిర్వహణ; పార్కింగ్ స్థలాల ఏర్పాటు, నిర్వహణ; రహదారుల మధ్య డివైడర్ల ఏర్పాటు, నిర్వహణ; కబేళాల నియంత్రణ-నిర్వహణ, పబ్లిక్ టాయిలెట్ల ఏర్పాటు-నిర్వహణ, తదితర అంశాలున్నాయి. జిల్లా కలెక్టర్ ప్రత్యక్ష నియంత్రణ, పర్యవేక్షణలో మునిసిపల్ కమీషనర్, ఇతర సిబ్బంది పనిచేస్తారు.

         ఆస్తి పన్ను విధింపు దగ్గరనుండి చెల్లింపుల వరకూ పారదర్శకంగా, జవాబుదారీతనంగా వుండడానికి, పౌరులకు లావాదేవీల సౌలభ్యం కలిగించడానికి, యూనిట్ ప్రాతిపదికగా ఆస్తిపన్ను లెక్క చేయడం జరుగుతుంది. స్వీయ ధృవీకరణ పద్ధతిలో, ఆన్లైన్లో, వారి-వారి ఫ్లాట్ల విస్తీర్ణం ఆధారంగా, దాని ఉపయోగం ఆధారంగా, పౌరులు ఎంత ఆస్తిపన్ను చెల్లించాలో దరఖాస్తు చేసుకోలి. తదనుగుణంగా ఆస్తిపన్ను విధించడం జరుగుతుంది. పట్టణాలలోని నిరుపేదలు, ఇండ్ల నిర్మాణం చేసుకోవడానికి ఆసరాగా వుండీ చట్టం. ఒకవైపున ప్రభుత్వం తన పౌరుల మీద ప్రబలమైన నమ్మకం వుంచుతూనే, మరో వైపున నియంత్రణా విధానం ద్వారా, ఉద్దేశపూర్వకంగా తప్పుడు స్వీయ ధృవపత్రాలు ఇచ్చినవారి విషయంలో కఠినంగా వ్యవహరిస్తుంది. వారికి భారీ మొత్తంలో పెనాల్టీ విధించడం కూడా జరుగుతుంది. ఎట్టిపరిస్థితుల్లోనూ చట్టాన్ని దుర్వినియోగం కాకుండా చర్యలున్నాయీ చట్టంలో. జనన, మరణ ధృవీకరణ పత్రాలు, భూమి ఉపయోగ ధృవీకరణ పత్రాలు, ధృవీకరణ పత్రాలలో తప్పొప్పుల సరిదిద్దడం, ఇతర రకాలైన మునిసిపాలిటీలు జారీ చేయాల్సిన ధృవీకరణ పత్రాలు అన్నీ కూడా ఒక నిర్దుష్టమైన కాలపరిమితిలో, దరఖాస్తుదారుడి స్వీయ ధృవీకరణ పత్రాల ఆధారంగా, దాంతోపాటు అవసరమైన డాక్యుమెంట్లు సమర్పించిన వెంటనే, ఆన్లైన్లో ఇవ్వడం జరుగుతుంది. ఇంటి నంబర్ల విషయంలో కూడా నూతన పద్ధతిని అవలంభించాలని చట్టంలో వుంది.

         మునిసిపాలిటీల సమతుల్యమైన, ఆరోగ్యకరమైన అభివృద్దే ధ్యేయంగా, అది చేపట్టి అమలుచేయాల్సిన అభివృద్ధి పనుల తప్పనిసరి అవసరాలకు అనుగుణంగా, క్రమబద్ధమైన పద్ధతిలో సక్రమమైన, ప్రణాలికా బద్ధమైన బడ్జెట్ ను ప్రతి మునిసిపాలిటీకి రూపొందించడం జరుగుతుంది. మునిసిపాలిటీ బడ్జెట్ రూపకల్పనలో జిల్లా కలెక్టర్ ప్రధానమైన పాత్ర పోషిస్తాడు. మునిసిపాలిటీ సొంత వనరులకు అదనంగా, ఆర్ధిక సంఘం డివోల్యూషన్ కింద లభించే నిధులకు మాచింగ్ గ్రాంటుగా రాష్ట్ర ప్రభుత్వ నిదులుంటాయి. మాచింగ్ గ్రాంట్ కింద ఏదైనా లోటు వుంటే మరుసటి సంవత్సరానికి బదలాయించడం జరుగుతుంది.

         మునిసిపల్ కార్యాలయానికి వెళ్లే అవసరం లేకుండా, మునిసిపల్ అధికారులతో పరస్పరం ముఖాముఖిగా కలిసే అవసరం లేకుండా, ఇంతవరకూ ఇబ్బందులకు లోనవుతూ పొందుతున్న భవన నిర్మాణ అనుమతులు, ఇక నుండి, ఈ చట్టం పుణ్యమా అని, అవినీతికి, అడ్డంకులకు ఆస్కారం ఏమాత్రం లేకుండా పౌరులు పొందే వీలు కలిగింది. ఏరియా ఆధారంగా ఒక్కొక్క రకమైన భవనానికి ఒక్కొక్క నిర్దుష్టమైన పధ్ధతిలో నిర్మాణ అనుమతులు పొందే వీలు వున్నదీ చట్టంలో. అనుమతుల్లేని లే-ఔట్ల విషయంలో, అనుమతుల్లేని నిర్మాణాల విషయంలో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వుండి, పర్యవేక్షణ చేసి, తగురకమైన కఠిన చర్యలు చట్టం పరిధిలో చేపట్టడానికి జిల్లా స్థాయిలో, జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో, ఆయన అధ్యక్షతన, ఒక ప్రత్యేకమైన టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేయడానికి చట్టం వీలు కలిగిస్తుంది. చట్ట విరుద్ధంగా, సక్రమైన అనుమతులు లేకుండా, పొందిన అనుమతికి విరుద్ధంగా చేసిన నిర్మాణాలను ముందస్తు నోటీసు లేకుండా కూల్చివేయడానికి చట్టం వీలు కలిగించింది. ప్రణాళికాబద్ధంగా కొత్త ప్రాంతాలు అభివృద్ధి చెందడానికి ప్రభుత్వం ఒక నూతనమైన ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ విధానాన్ని కూడా ప్రవేశపెట్టింది ఈచట్టంలో.    

         కాలాగుణంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా, పట్టణప్రాంత ప్రజల అభీష్టానికి, ఆకాంక్షలకు అనుగుణంగా, రూపుదిద్దుకున్నదీ నూతన పురపాలక చట్టం. అత్యంత పారదర్శకంగా మాత్రమే కాకుండా, సున్నా స్థాయి అవినీతి సహన చట్టంగా, అత్యంత శక్తివంతమైందిగా ఉన్నదీ చట్టం. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పనులు జరిగిపోయేలా నిబంధనలున్నాయీ చట్టంలో. ప్రభుత్వం తెచ్చిన ఈ చట్టాన్ని ఇక పూర్తీ స్థాయిలో వినియోగించుకోవాల్సింది పౌరులే!    

Saturday, July 20, 2019

రాముడికి సమాధానం చెప్పిన లక్ష్మణుడు .... శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-70 : వనం జ్వాలా నరసింహారావు


రాముడికి సమాధానం చెప్పిన లక్ష్మణుడు
శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-70
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రభూమి ఆదివారం సంచిక (21-07-2019)
ఎంతగానో కలతచెందిన మనసుకల శ్రీరామచంద్రుడు, సీతాదేవి రాక్షసుల చేతిలో చిక్కి మరణించిందేమోనని అనుమాన పడతాడు. అలా కాకపొతే ఇంతలోనే ఎక్కడి పోయి వుంటుందని అనుకుంటాడు. “అయ్యో! అందమైన కమ్మలతో, చంద్రబింబం, కమలాలతో సమానమైన సీత ముఖం ఇప్పటికే ఎంత వాడిపోయిందో కదా? మనోహరమైన సంపెంగ పూవు లాగా వుండే ఆమె పచ్చని దేహంతో ముత్యాల సరాలు ఆమె వంటిమీద వేలాడుతుంటే, ఆమెను అదే పనిగా అరుస్తుంటే రాక్షసులు నరికి వేశారేమో? చిగురైన, కోమలమైన ఆమె చేతులను తెగేవిధంగా విరిచి చెరుకు తుంటలాగా తింటున్నారేమో? చెరకు తుంటలాగా భావించి ఆమె నడుమును రేమ్డులాగా విరిచి పాపాత్ములు తింటున్నారేమో? దుష్ట రాక్షసులు సీతను చంపారేమో? అన్నా! లక్ష్మణా! నేను చిత్త భ్రమలో వున్నాను కాబట్టి, బహుశా, నాకు సీత కనపడలేదేమో? నీకైనా కనిపించిందా? చిన్నారి చిన్నదానా! నిన్ను నేను మళ్లీ చూడగలనా?” ఇలా ఏడుస్తూ శ్రీరాముడు వేగంగా ఒక వనం తరువాత మరో వనంలొ వెతుకుతూ, భ్రమతో, సీతా-సీతా అని పిలుస్తూ వెర్రివాడిలాగా శోకించాడు.

సీతాదేవిని తలచుకుంటూ శ్రీరాముడు భయంతో, శోకంతో రెండు చేతులెత్తి “హో” అని ఏడ్చాడు. అలా ఏడుస్తూనే, “ఏరా తమ్ముడా! లక్ష్మణా! సీత ఆశ్రమంలో లేదుకదరా? ఎక్కడికి పోయిందో కదరా? ఘాతుకంగా ఏదైనా తిన్నదేమో? ఎవరైనా ఎత్తుకుని పోయారేమో కదరా? కమలాల లాంటి కళ్ళున్న సీతాదేవిని విడిచి నేను ఒక్క నిమిషమైనా బ్రతకగలనా? నా చెలీ! మళ్లీ నిన్ను కళ్లారా చూడగలనా? అయ్యో! స్త్రీ రత్నమా! బాలా రత్నమా, నా ఏడుపు అలా వుండనీ, నువ్వు మచ్చిక చేసుకున్నందున నీతో తిరిగిన క్రీడామృగాలు నిన్ను విడిచినందువల్ల విశేషంగా ఏడుస్తున్నాయే? అదికూడా నీకు తెలియదా? సీతాదేవిని విడిచిన దుఃఖాతిశయంతో మరణించి స్వర్గానికి పొతే, అక్కడ నా తండ్రి ‘ఏమిరా! రామా! నీకు నేనేం చెప్పానురా? పద్నాలుగు సంవత్సరాలు అడవిలో వుండమన్నాను కదా? ఆ గడువు ముగిసిందా? ఇక్కడికి వచ్చావెందుకురా? ఛీ!’ అని అసత్యవాదిని, మోసగాడిని, మర్యాద తప్పినవాడిని అయిన నన్ను చీవాట్లు పెట్తాడు. నా మంచి కీర్తి అంతా వదిలిపోయే విధంగా నామీద దయలేకుండా నన్ను వదిలి నువ్వు ఇలా పోవచ్చా? నన్ను విడిచి నువ్వు ఎక్కడికో పోగాలిగావు కాని, నేనలా పోలేను కదా? ఇంక నా గతేంటి? ఈ శరీరాన్ని నేనెలా మోసుకుని తిరగ్గలను?” అంటాడు.

         సీతాదేవిని ఇలా వెతుక్కుంటూ బురదలో మునిగిన ఏనుగులాగా సహించలేని బాధతో వున్న అన్నకు లక్ష్మణుడు హితవాక్యాలను చెప్పడిలా.


         “అన్నా! ఎందుకిలా దుఃఖంతో బాధపడతావు? ఈ వంకల్లో, వాగుల్లో, గుహలలో, లోయలలో, కానలలో, కోనలలో,  కొండగుహల్లో, సీతను వెతికితే ఆమె కనిపించదా? ఎక్కడా వుండకుండా ఎక్కడికి పోతుంది? దీరుల్లో శ్రేష్టుడా! లే..లెమ్ము. సీతాదేవికి వనసంచారం అంటే ఇష్టమని నీకు తెలియదా? స్నానానికే పోయిందో, వికసించిన కమలాల కోసమే పోయిందో, నవ్వులాటకై దాక్కుందేమో లేక మనల్ని భయపెట్టడానికి దాక్కుందేమో? సీతాదేవి ఎక్కడికి పోగలదు? మనం ప్రయత్నం చేసి వెతుకుతే దొరక్క పోతుందా? అవశ్యం దొరుకుతుంది. నువ్వు బాధను వదలుకో. దుఃఖపడవద్దు”. ఈ మాటలు విన్న రాముడు మళ్లీ లేచి అడవిలో తిరిగి వెతకడం మొదలుపెట్టాడు.

         కొండలు, గుట్టలు, కోనలు, నదులు, కాన్లు, కొలకులు వెతికి-వెతికి సీతాదేవి జాడ లేకపోయేసరికి రామచంద్రమూర్తి లక్ష్మణుడితో ఇలా అన్నాడు. “ లక్ష్మణా! దండకారణ్యం అంతా వెతికాం. వృధా కష్టం అయింది కదా? ఆ మదగజగామిని ఎక్కడికి పోయిందో, ఏమో? నేనేమి చేయాలిప్పుడు?”. జవాబుగా లక్ష్మణుడు, “అన్నా, పూర్వం బలి దగ్గరనుండి బలాత్కారంగా భూమిని గ్రహించినట్లు నువ్వు సీతను మళ్లీ పొందగలవు”. అప్పుడు రామచంద్రమూర్తి ఇలా అన్నాడు.

         “ఈ ప్రదేశమంతా వెతికాం. శ్రమ కలిగిందే కాని సీతైతే కనబడలేదు. ఈ పర్వతంలో అనేక గుహలున్నాయి. ఎక్కడని మనం వెతకగలం?” అని అంటూ, కాసేపు మూర్ఛపోవడం, కాసేపు నేలమీద పడడం, కాసేపు ఏడవడం, “బాలా! సీతా! సీతా! ఎక్కడికి పోయావే?” అని నేలమీద పడిపోయాడు. తమ్ముడు లక్ష్మణుడు సమాధాన పరచడానికి ఏవేవో మాటలు చెప్పినా వాటిని అంగీకరించకుండా దుఃఖంతొ బాధపడుతూ పరితపించాడు. సీతాదేవిని కానక రామచంద్రుడు, తానూ భరించాల్సిన భార్యను ఆపదల నుండి రక్షించ లేదే అనుకుంటాడు. ఆశ్రితురాలైన పతివ్రతను వదలడం మహా పాపకార్యం అనుకుంటాడు. మన్మథ బాణ పీడితుడైన రాముడు “సీతా” అని గట్టిగా ఏడ్చాడు.