Monday, January 30, 2023

వల్లభి…భన్సాలీ…శాంతి ..... అరవై-డెబ్బై దశకంలో ఖమ్మం సమితి గ్రామ రాజకీయాలు-4 (గుర్తుకొస్తున్నాయి) : వనం జ్వాలా నరసింహారావు

 వల్లభిభన్సాలీశాంతి

అరవై-డెబ్బై దశకంలో ఖమ్మం సమితి గ్రామ రాజకీయాలు-4

(గుర్తుకొస్తున్నాయి)

వనం జ్వాలా నరసింహారావు

ఆంధ్రప్రభ దినపత్రిక (31-01-2023)

కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ (మార్క్సిస్ట్) పార్టీల వర్గ పోరులో, ముఠా తగాదాలలో ఇరు పక్షాల నుండి అనేకమంది హత్యకు గురైన నేపధ్యంలోనాటి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ ముఠా రాజకీయాలకు ముదిగొండ మండలం (అప్పట్లో ఖమ్మం సమితి) లోని వల్లభి గ్రామం దళితులు బలయ్యారునీలం సంజీవ రెడ్డి గ్రూపుకు చెందిన జలగం వెంగళరావు పక్షాన వున్న గ్రామ అగ్ర వర్ణాల వారికి, కాసు బ్రహ్మానంద రెడ్డి గ్రూపుకు చెందిన శీలం సిద్దారెడ్డి పక్షాన వున్న దళితులకు "వల్లభి" గ్రామం ఒక భూ పోరాటానికి" వేదికైంది. దళితుల భూమిని ఆక్రమించుకునే ప్రయత్నం చేసిన అగ్ర వర్ణాల వారికిదళితులకు మధ్య వివాదం ఘర్షణలకు దారితీసిందిదళితులను భయబ్రాంతులను చేసే ప్రయత్నంలోఅగ్రవర్ణాలకు చెందిన కొందరుపరిసర గ్రామాలలోని తమ మద్దతు దార్లను కూడగట్టుకునిదళిత వాడపై దాడి చేయడంతోపిల్లా పాపలతో-కుటుంబాలన్నీ గ్రామం విడిచి పోవాల్సిన పరిస్థితి కలిగిందిఅలా వెళ్ళిన వారి ఇళ్లను కూడా సర్వ నాశనం చేశారువారి పశువులను తరిమి వేశారుగృహోపకరణాలను పాడు చేశారుమొత్తం మీద దళితులను గ్రామం నుంచి బహిష్కరించారు

దళితులకు అండగా నలిచిన గ్రామ పెద్దప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడుతామ్ర పత్ర గ్రహీత అయితరాజు రాంరావు కూడా గ్రామం విడిచి కొంత కాలం ఖమ్మంలో ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయిదళితులకు ఇబ్బందులు తొలగ లేదుదేశ వ్యాప్తంగా పత్రికలు జరిగిన అన్యాయాన్ని ప్రచురించాయిటైమ్న్యూస్ వీక్ లాంటి అంతర్జాతీయ పత్రికలుబ్రిడ్జ్ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ లాంటి జాతీయ ప్రముఖ పత్రికలు ఆ గ్రామంలో జరిగిన సంఘటనలను పూస గుచ్చినట్లు ప్రచురించాయిఇక స్థానిక రాష్ట్ర స్థాయి పత్రికలు సరే సరి.   ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వం వరకూ తెలిసిందిబ్రహ్మానంద రెడ్డి తన మంత్రివర్గ సహచరులైన వల్లూరు బసవరాజు ప్రభృతులను వల్లభి గ్రామానికి పంపినా ఫలితం కనిపించలేదుగ్రామంలో రిజర్వుడు పోలీసులుఉన్నతాధికారులు కూడా మకాం వేశారుఅయినా మార్పు కానరాలేదు.

సమస్యకు పరిష్కారం “గాంధేయ మార్గం” తప్ప మరోటి కాదని గ్రామ పెద్ద అయితరాజు రాంరావు భావించారుస్నేహితుల సహాయంతో ఆచార్య భన్సాలిని ఆశ్రయించాడు. సంఘసంస్కర్తస్వాతంత్ర్య సమరయోధుడుజాతిపిత మహాత్మాగాంధీ ఆధ్యాత్మిక వారసుడుశాంతిగ్రామ స్వరాజ్యంహరిజనోద్ధరణే ధ్యేయంగా పెట్టుకున్న పవనార్‌ ఆశ్రమవాసి ఆచార్య వినోబా బావేఅనుంగు శిష్యుడుఆయనంతటి ప్రముఖుడుగా పేరొందిన ఆచార్య భన్సాలిపోరాటం కన్నా శాంతే మేలనితన వృద్ధాప్యాన్ని కూడా లెక్క చేయకుండాసరిగ్గా నడవలేని స్థితిలో వుండి కూడావల్లభి గ్రామానికి వచ్చారు.

గ్రామానికొచ్చి ఆమరణ నిరాహార దీక్షకు దిగారుశాంతి యత్నాలు ప్రారంభించారురాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఒక దళితుడు పూజారిగా పనిచేస్తున్న స్థానిక రామాలయంలో దీక్షకు దిగారుఆయనకు అంతకు ముందు ఆ గ్రామం గురించి ఏ మాత్రం తెలియదుఆయనకు తెలియ చేయబడిందల్లాఆ గ్రామంలోఅగ్రవర్ణాల భూస్వాములకుదళిత వర్గాల బీద వారికి మధ్య జరిగిన ఘర్షణలోదళితులు గ్రామ బహిష్కరణకు గురయ్యారనివారు గ్రామంలోకి రావడానికి తాను పూనుకోవాలని మాత్రమేఅంతేవెనుకా-ముందు చూడ కుండాహుటాహుటిన బయల్దేరిఏ ఆర్భాటం చేయకుండానిరాహార దీక్షకు దిగారుఆయన డిమాండు నెరవేరిందిఆ దీక్షకుఒక నిర్దుష్టమైన-సహేతుకమైన కారణం వుంది.

దళితులను గ్రామానికి రప్పించాలనివారిని వెళ్లగొట్టిన అగ్రవర్ణాల వారిని కోరాడుఅంతే కాకుండా శాంతియుత వాతావరణంలో సహజీవనం సాగించాలన్న నిబంధననూ విధించాడుచిట్ట చివరి దళితుడు గ్రామంలోకి వచ్చి ఇతరులతో సహజీవనం సాగించేంతవరకు తన దీక్ష విరమించేది లేదని శపధం చేశారుమొదట్లో పట్టించుకోక పోయినా, ఒకట్రెండు రోజుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో కదిలిక వచ్చిందినాటి గవర్నర్‌ ఖండూభాయ్ దేశాయిముఖ్యమంత్రి బ్రహ్మానంద రెడ్డిఆఘమేఘాల మీద సంధి ప్రయత్నాలు మొదలెట్టారుసంధికి అంగీకరించాల్సిందెవరో కాదు, కాంగ్రెస్‌లోని రెండు వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాకు చెందిన ఇద్దరు ప్రముఖ కాంగ్రెస్ నాయకులే!!! జిల్లా మంత్రుల సమక్షంలో గవర్నర్‌,  ముఖ్యమంత్రి కలిసి భన్సాలి దీక్షను విరమింప చేసారునాటి నుంచి ఆ గ్రామంలో కొట్లాటలు జరిగిన దాఖలాలు లేవు.

రాష్ట్రంలో, ఆ మాటకొస్తే, బహుశా దేశంలోనే దళితుడు పూజారిగా ఉన్న మొదటి (ఏకైక?) రామాలయం వల్లభి గ్రామంలో ఉందిఅప్పటి జాతీయఅంతర్జాతీయ (బ్లిట్జ్, టైం, న్యూస్ వీక్ లాంటి మాగజైన్లు) వార్తా పత్రికల్లో ఈ విశేషాలన్నీ ప్రముఖంగా చోటు చేసుకున్నాయివల్లభి గ్రామ భూపోరాటంలో కమ్యూనిస్టులు దళితుల పక్షాన పోరు సల్పిన కాంగ్రెస్‌ వర్గానికి మద్దతిచ్చారు. వల్లభిలో అయితే పరిస్థితి మారింది కానిఆ ప్రాంత రాజకీయాలు మాత్రం హత్యా రాజకీయాలుగాభౌతికంగా ఒక పార్టీ వారిని మరో పార్టీ వారు అనునిత్యం వెంటాడే స్థితికి చేరుకొని క్రమేపీ పరిస్థితులు మెరుగయ్యాయి.  

ఆ నాడు దళితులకు అండగా నలిచిన గ్రామ పెద్ద అయితరాజు రాంరావు కుమారుడు, నాలుగు సంవత్సరాల క్రితం తన 76 వ ఏట మరణించిన స్వర్గీయ డాక్టర్ ఎపి రంగారావు, హైదరాబాద్ నగరంలో వైద్య విద్యను అభ్యసించి, పైచదువులకు, ఉద్యోగానికి ఇంగ్లాండ్ వెళ్లి, తిరిగొచ్చి, అందరిలా పట్టణాలలో కాకుండా, మారుమూల గిరిజన ప్రాంతమైన భద్రాచలం ఆసుపత్రిలో డాక్టర్ గా పనిచేసి, అనేక సంస్కరణలు చేపట్టారు.  పదవీ విరమణ చేసిన తరువాత విశ్వ విఖ్యాతి గాంచిన 108 అంబులెన్స్ , 104 ఆరోగ్య సేవల రూపశిల్పిగా ప్రసిద్ధికెక్కాడు. కాళోజీ పేరుమీద గొప్ప టెలీ మెడిసిన్ కేంద్రాన్ని వల్లభి గ్రామంలో ఏర్పాటు చేసి ఉచితంగా వైద్యదానం చేశాడు. పాతిక సంవత్సరాల క్రితం శ్రీలంకలో చోటుచేసుకున్న అంతర్యుద్ధం సందర్భంగా భారత ప్రభుత్వ రెడ్ క్రాస్ సొసైటీ ప్రత్యేక ప్రతినిధిగా భారత శాంతి దళాలతో కలిసి పనిచేసిన ఘనత ఆయనది.

Sunday, January 29, 2023

పాపపుణ్యాలు నరుడిని వదలవని, సృష్టి అంతా పంచభూతాత్మకమని చెప్పిన భీష్ముడు ..... ఆస్వాదన-105 : వనం జ్వాలా నరసింహారావు

 పాపపుణ్యాలు నరుడిని వదలవని,

సృష్టి అంతా పంచభూతాత్మకమని చెప్పిన భీష్ముడు

ఆస్వాదన-105

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (30-01-2023)

భీష్ముడు చెప్పిన అజగర వచనాలను విన్న ధర్మరాజు తన తదుపరి ప్రశ్నగా, ‘బంధువుల కలిమి, కర్మం, ధనం, బుద్ధిబలం అనే నాలుగింటిలో దేనివల్ల నరుడికి గొప్ప కీర్తి కలుగుతుంది అని తాతగారిని అడిగాడు. జీవితాన సర్వాంతర్యామి ప్రజ్ఞ అని, జీవనంలోని సుఖదుఃఖాలు, రాగద్వేషాలు, సర్వజీవన వ్యాపారాలు ప్రజ్ఞాజనితాలే అని, కాబట్టి ప్రజ్ఞ కీర్తికరమని అనడం నిశ్చయమని, అన్ని విధాలా ప్రజ్ఞయే ఉత్తమాశ్రయమని భీష్ముడు సమాధానం ఇచ్చాడు.

నరుడు యజ్ఞాలలాగా చేస్తుండే దానం, తపస్సు, పెద్దల సేవ అనే పనులన్నీ ఏవిధంగా మార్పు చెందుతాయని, వాటి పర్యవసానం ఆ నరుడికి ఎట్లా చెందుతుందని, వాటి ఫలితాన్ని అతడెలా అందుకొంటాడని, స్పష్టం చేయమని అడిగాడు భీష్ముడిని ధర్మరాజు.

జవాబుగా భీష్ముడు ఇలా అన్నాడు: ‘శుభం వెంట శుభం, అశుభం వెంట అశుభం ఎడం లేకుండా వచ్చి పడుతుంటాయి. అలాగే భయం మీద భయం వెన్నంటి మనిషిని కుంగదీస్తుంది. చేటుమీద చేటు, కీడుమీద కీడు, పరుగు పరుగున వచ్చి మనిషిని కమ్ముకుంటాయి. ఈ స్థితిలో నరుడు ఒక కీడునుండి మరొక కీడును ఎదుర్కొంటూ చెడు పనుల బారిన పడి చెడుగై మిగులుతాడు. నరుడిని ధర్మం మరొక ధర్మానికి నడిపించి అతడికి శుభపరంపర కలిగేట్లు చేస్తుంది. అదే అధర్మమైతే వ్యతిరేక దిశలో సాగి, ఫలితాలు కూడా వ్యతిరేకంగా వుంటాయి. నరుడు చేసిన పాపపుణ్యాలు అతడిని నీడలాగా వెన్నంటి వుంటూ, అతడు చనిపోతే అవీ అతడిని అనుసరించి పరలోకాలకు వెళ్లుతాయి. అతడు జీవించి వుంటే అవీ అతడితో పాటే జీవిస్తూ అతడు చేసే ప్రతి పనిమీదా తమ ప్రాభవాన్ని చూపుతూ వుంటాయి. నరుడు బతికినా, చనిపోయినా అతడు చేసిన పాపపుణ్యాలు మాత్రం అతడిని వదలవు. తమ ప్రభావాన్ని చూపుతూనే వుంటాయి.

‘సృష్టిని ఎవరు ఏవిధంగా కలిగించారో తెలపమని అడిగాడు ధర్మరాజు. ఆయన ప్రశ్నకు సమాధానం భరద్వాజ ఋషికి భృగు మహర్షి వివరించిన విషయాలలో లభ్యమవుతుందని అంటూ ఆయన మాటలను చెప్పాడు భీష్ముడు. విష్ణువు నాశనం, అంతం లేనివాడని, అతడు మనస్సులో సృష్టిని నిర్మించాలనుకొని ముందుగా తనలోని వెయ్యో వంతులో అవ్యక్తుడు అనేవాడిని పుట్టించాడని, ఆ అవ్యక్తుడు జరామరణాలు లేనివాడని, సాటిలేనివాడని, అతడి వల్ల ప్రకృతితత్త్వం కలిగిందని, అతడు దివ్యకాంతితో నిండిన ఒక పద్మాన్ని కలిగించాడని, ఆ పద్మం నుండి బ్రహ్మ ఉద్భవించాడని భీష్ముడు అన్నాడు. ఆ బ్రహ్మ భూమి మొదలైన ఎల్ల భూతాలను తన శరీరంలాగా ధరించి వుంటాడని, అలా నారాయణుడి వల్ల లోకం పుట్టిందని చెప్పాడు. సృష్టి రహస్యం వివరాలను భృగు మహర్షి మాటలుగా ఇంకా చెప్పుకుంటూ పోయాడు భీష్ముడు. 

 

 ‘బ్రహ్మ శరీరానికి సృష్టిలోని పర్వతాలు ఎముకలు, భూమి కొవ్వు- మాంసం, సముద్రాలు నెత్తురు, ఆకాశం పొట్ట, గాలి ఊర్పు, నిప్పు వెలుతురు, నదులు నరాలు, సూర్యచంద్రులు కళ్లు, పైలోకం తల, పాతాళలోకం కాళ్ల అడుగులు, దిక్కులు చేతులు.....ఇలా అంతం లేని శరీరం కలవాడు నారాయణుడు. బ్రహ్మ విష్ణు మానస పుత్రుడు. ఆయనకు పీఠంగా పద్మం నిర్మించడం జరిగింది. పద్మం వాస్తవానికి భూమి అని అనాలి. దానికి ఆకాశమే శీర్షంగా కల మేరుపర్వతం అందమైన కర్ణిక, అక్కడి నుండి బ్రహ్మదేవుడు సకల చరాచర జంతు సమూహాన్ని సృజించే భారాన్ని వహిస్తున్నాడు. సృష్టిలో చేష్టలు, శబ్దాలు, స్రావాలు, వేడిమి, గట్టితనం ఏర్పడడానికి పంచ మహాభూతాలు ఆవిష్కరించడం జరిగింది. చేష్టలు వాయురూపాన, శబ్దాలు ఆకాశం ద్వారా, స్రావాలు నీటివల్ల, వేడిమి నిప్పునుండి, గట్టితనం భూమివల్ల కలిగాయి. కాబట్టి పంచ మహాభూతాల అవసరం ఆ విధంగా ఏర్పడింది’.

‘పంచ భూతాల కారణంగా సృష్టిలో కనిపించే రెండు విధాలైన పదార్థాలు-జంగమాలు (తిరుగాడేవి), స్థావారాలు (నిలిచి వుండేవి) ఏర్పడ్డాయి. సృష్టి సర్వస్వం ఆ జంగమ స్థావరాత్మకమే. స్థావరమైన చెట్టులో పంచభూతాల లక్షణాలు వ్యక్తమౌతాయి. ఉదాహరణకు పిడుగుపాటుకు చెట్టు వికృతిని పొందడం. కాబట్టి చెట్టును పంచభూతాత్మకమైనదిగా అంగీకరించాలి. సృష్టి అంతా పంచభూతాత్మకం. ఇతరమైనదేదీ లేదు. పదార్థాలు, వాటిని గ్రహించే ఇంద్రియాలు, వాటిని నియంత్రించే మనస్సు, వరుసగా అనుభవ క్రియకు సాధనాలు. అనుభోక్త లోపలి జీవుడు. అతడే అంతరాత్మ. అతడు పదార్థాలను, ఇంద్రియాలను, మనస్సును చూస్తూ పంచభూతాల స్వభావాలను అనుభవిస్తాడు. అనుభవించి తత్ఫలితంగా సుఖాన్నో, దుఃఖాన్నో పొందుతాడు. కాబట్టి అనుభోక్త అంతరాత్మ. అతడి కింద మనస్సు, దాని అధీనంలో ఇంద్రియాలు, ఇంద్రియాల దగ్గర పదార్థాలు, ఇదీ కిందినుండి చూస్తే క్రమం’.

‘బ్రహ్మదేవుడు మొదట బ్రాహ్మణులను సృజించాడు. తరువాత క్షత్రియ, వైశ్య, శూద్రులను పుట్టించాడు. ఈ నాలుగు వర్ణాల వారిలో ఏజాతి వారైనా తమ వృత్తులు వదలి అన్యుల వృత్తులు స్వీకరిస్తే వారికి ఆ వృత్తి ఏర్పడుతుంది. సత్యమే వేదం. సత్యమే తపస్సు. సత్యవ్రతాన్ని పాటిస్తే తపస్సు చేసినట్లే. సృష్టిలో ప్రజాసంతతిని సత్యమే సృష్టిస్తున్నది. లోకం నిలిచి వుండడానికి కారణం సత్యమే. ఈ విధంగా లోక సృష్టికి, లోకస్థితికి ఆధారమైన ఈ సత్యం అసత్యం వల్ల కప్పబడిపోతున్నది. సత్యమంటే ధర్మం, కాంతి, జ్ఞానం, స్వర్గం, సుఖం అని అర్థాలు. అసత్యమంటే పాపం, చీకటి, తెలివితక్కువతనం, నరకం, దుఃఖం అని గ్రహించాలి. లోకంలోని మంచి మొత్తం సత్యం కాగా, చెడంతా అసత్యమే. బాధలు రెండు రకాలు-ఒకటి శారీరక, రెండు మానసిక. నియమనిష్టలతో నియంత్రించ గలుగుతే ఇవి నరుడిని బాధించవు.

‘బ్రహ్మచారిగా, గృహస్థుడుగా, వానప్రస్థుడుగా, సన్న్యాసిగా మానవుడు ఆశ్రమ ధర్మాలను పాటించాలి. బ్రహ్మచర్యం నాలుగు ఆశ్రమాలలో మొదటిది. బ్రహ్మచారి గురుభక్తి కలిగి నిరంతరం వేదాభ్యాసం చేస్తూ వుండాలి. త్రికాలం హోమాలు చేయాలి. ఇదీ బ్రాహ్మణ ధర్మం. ముందుగా అతిథి సత్కారం చేసి, అ ఆతరువాత భోజన పానీయాదులను స్వీకరిస్తూ వుండడం గృహస్థుడి ధర్మం, వానప్రస్థ ఆశ్రమానికి ఆహారం, కందమూలాలు, కూరలు, పండ్లు మాత్రమే. అతడికి పడక నేలమీదే. సన్న్యాసాశ్రమంలో మనిషి అనాసక్త ప్రవృత్తితో బిచ్చమే జీవనంగా శాంతితో మెలగాలి. ఈ నాలుగు ఆశ్రమ ధర్మాలను నియమంగా, ప్రయోజన కాంక్షతో కాకుండా ఆచరిస్తే తప్పకుండా ముక్తిపదం లభిస్తుంది’.

భృగు మహర్షి భరద్వాజ మునికి వివిరించిన ధర్మాలను భీష్ముడు ధర్మరాజుకు తెలియ చేసిన తరువాత తనకు ఆచార విధులను వినాలనే కోరిక వున్నదని అన్నాడు ధర్మరాజు. చెడు నడత సజ్జనులను, దుర్జనులను ఇద్దరినీ కష్టపెట్టుతుందని, కాబట్టి నడతను గురించి వినడం చాలా మంచిదని అంటూ అవేమిటో తెలియచేశాడు భీష్ముడు. ‘రాజమార్గంలో, సభలో, పశువుల మందలో మలమూత్ర విసర్జన చేయకూడదు. శుచిగా ఆచమనం చేసి నిలకడగా నీట మునగాలి. సంధ్యవేళలలో సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చి పూజించాలి. సూర్యుడు పొడిచేటప్పుడు, కుంకేటప్పుడు నిద్రపోకుండా వుండాలి. పాద్య అర్ఘ్యస్నానాదికాలు ముగిసిన తరువాత భుజించాలి. అన్నాన్ని నిందించకూడదు. తడి కాళ్లతో నిద్రపోకూడదు’ అని అంటూ వీటిని ఆచారాలాని అంటారని చెప్పాడు భీష్ముడు.

భీష్ముడు ఇంకా ఇలా చెప్పాడు. ‘ఉదయించే సూర్యుడిని చూడకూడదు. ఇతర స్త్రీ వివస్త్రగా వున్నప్పుడు చూడకూడదు. తన మలాన్ని తాను చూస్తే కీడు కలుగుతుంది. ఈ మూడూ చూడరానివి. ఇక తన పాపాన్ని తాను దాచిపెట్టడం చేయాల్సిన పని కాదు. సంభోగక్రియను గుప్తంగా వుంచడం, గురువును సేవించడం, బ్రాహ్మణులను కీర్తించడం చేస్తే నరుడి ఆయుస్సు పెరుగుతుంది. వీటి మూలాన నరుడు సంపత్కరమైన పైలోకాలకు చేరుకోగలడు’.

ఆచారం ధర్మానికి మూలమని, ఇది అనూచానంగా, పరంపరగా మానవ సమూహంలో ఒక తరం నుండి మరొక తరానికి వారసత్వంలాగా అందుతూ వుంటుందని, అయితే ఈ సుదీర్ఘ కాలవాహినిలో కొన్ని ఆచారాలు కాలం చెల్లి అసందర్భాలుగా, అసంగతాలుగా కూడా మారుతూ వుంటాయని, వివేకైన నరుడు కాలానుగుణమైన మార్పుతో ఆచారాన్ని స్వీకరించాలని, ఈ విషయాలన్నీ విశ్లేషిస్తూ రాశారు డాక్టర్ ఆకురాతి పున్నారావు గారు.  

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, శాంతిపర్వం, చతుర్థాశ్వాసం

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)

Saturday, January 28, 2023

FIRST OF ITS KIND ‘AGHUB’ MODEL IN TS ..... The Agri Innovation Hub in Telangana : Vanam Jwala Narasimha Rao

 FIRST OF ITS KIND ‘AGHUB’ MODEL IN TS

The Agri Innovation Hub in Telangana

Vanam Jwala Narasimha Rao

The Hans India (29-01-2023)

(The vision of AgHub is to emerge as a world class centre that promotes innovations and entrepreneurship in Agri-food systems through mentoring, piloting, and facilitating access to market, research, and investment. As part of this the incubator has been funded by National Bank for Agriculture and Rural Development (NABARD) and has been functioning since October 2020-Editor’s Comment)

Agriculture is a way of life and tradition that has shaped the culture and economic life of people of Telangana and continues to be the focal point, to all the strategies for planned socio-economic development of the Telangana state. The sector had undergone sea change in the last century responding to everchanging technological advancements as well as the expansion of the global market. This unorganized sector was totally neglected due to poor agricultural reforms in the past, that led Agriculture into a crisis. After formation of Telangana state, the situation bettered and improved marvelously with Chief Minister K Chandrashekhar Rao taking special interest.

Until four-five decades ago, when every village in our country functioned as a Republic in itself, agriculture was not considered as a mere profitable vocation. It was then more a profession, a passion, a way of life and a serving mechanism. With majority of the population dependent directly or indirectly on agriculture, the entire village economy flourished and thrived on a convenient barter system. Each village produced mainly for its needs and nobody gave a thought for any surplus production. Every farmer, big and small, had some sort of a storage mechanism that included storage of seeds for the next year. There was no concept of buying seeds. Gradually with the advent of market-based economy, agriculture produce started moving out of the villages, to the nearby markets. Problems to farmers to farmers commenced with middlemen, traders and agents entering the system. This gave rise to commercialization and the producer of an agriculture product became dependent on outside market even for his needs. After formation of Telangana under the dynamic leadership of KCR the state government has made several attempts to bring in a much desirable change in the farm sector.

The pro-farmer and pro-agriculture schemes like Rythu Bandhu, Rythu Bhima, Rythu Vedikas, Rythu Bandhu Samithis, 24-hour free power supply, increased irrigation facilities through projects, and host of other schemes were initiated by KCR government. Area of irrigation increased multifold as well as huge increase in production. Alternate cropping pattern further helped the farmer. All this helped farmer to double and triple their incomes. Thus emerged Telangana Model.

As part of several review meetings on agriculture connected issues, in one meeting held during third week of August 2015, about 14 months after KCR sworn in as CM, he underscored the importance of Professor Jayashankar Telangana Agriculture University (PJTSAU). He said that the University should play a vital role in evolving a strategy to bring back the past glory of agriculture in Telangana by strengthening research activity in the university. Every bit of land in the state has to be subjected to soil testing and the details are to be computerized. Different places in Telangana have to be divided in to particular crop colonies felt CM KCR.

Apart from this, the CM suggested that, the agricultural university should also undertake extensive research on mechanization aspects. Students of the university should be given free hand in doing research. They should be on the move to interact with farmer on go forward basis.  The university should have a clear idea of soil, technique, crops and others available in each and every mandal of the state. Probably a control room kind of campaign center should be set up in each mandal that addresses the problems of the farmers and giving quick solution to make things easy. 

CM KCR further said then that, there was a time when the university played a crucial role in farming. The kind of research, training camps and many were widely done in the university. Farmers and officers were given special training to know about the latest methods in agriculture. Farmers in batches used to go to Agricultural University to learn about the advanced methods of farming. But over the period of time, in the united AP, this practice has been ignored and barely any farmer reached University to learn the new techniques in agriculture. CM further desired that, it is also the responsibility of Agriculture University to restore the faith in farmers and bring back the past glory.

Against this background and realising the importance of research and innovation in university and as an important and vital step, aiming at making new frontiers in the Food and Agribusiness Innovation landscape in Telangana, four years ago, a first of its kind initiative of Agri Innovation Hub was conceived by PJTSAU. It has taken an ideal shape now. The vision of AgHub is to emerge as a world class centre that promotes innovations and entrepreneurship in Agri-food systems through mentoring, piloting, and facilitating access to market, research, and investment. As part of this the incubator has been funded by National Bank for Agriculture and Rural Development (NABARD) and has been functioning since October 2020.

  AgHub is structured in Hub and Spoke model of the Agri Innovation Centre, where the Innovation Hub is housed in the PJTSAU campus at Hyderabad and caters to the promotion of innovation and entrepreneurship among the Agri Tech start-ups and student entrepreneurs. The initiatives of the Hub among others include, four specially designed programmes namely: Incubation Program, Agri Tech Innovation Pilots (AIP), Co-Innovation and Enterprise Acceleration Program (EAP). As part of Incubation Program, start-up entrepreneurs who are venturing with ideas are offered product development support, customized scientific, business mentoring, advisory on regulatory issues, go to market assistance and fund-raising assistance. Agri Tech Innovation Pilots, the first of its kind program, validates the start-up technology through a soft-landing platform at real farm situation. Agri Tech start-ups can deploy their solutions on ground and avail scientific validation. The Co-Innovation, also the first of its kind program, offers early and growth stage start-ups to collaborate and co-create and co-develop technology offering jointly between a start-up team and agricultural scientists. Enterprise Acceleration Program is a distinct platform for the acceleration of growth stage enterprises and Small and Medium Enterprises in Agribusiness. Currently 40+ Food and Agri tech start-ups are being nurtured for the benefit of farming community in Telangana and India.

In accordance with the National Educational Policy Agri Hub is building student entrepreneurship for young agricultural graduates in PJTSAU to inculcate the culture of innovation. This is probably the first ever program in any agricultural university in India with a three-month curriculum through ‘Design Thinking’ approaches and modules on entrepreneurship and translational research. Post ‘Design Thinking Program’ the pool of student design thinkers builds their ideas under the Ideation Platform named ‘Idea Sprout’. Till date 5 Design Thinking Programs, 1500+ Design Thinkers Pool and 400+ Ideas have been built through student innovator pool.

The Rural Innovation Spokes across the State, upcoming in Jagtial, Warangal and Tandoor would cater to the promotion of entrepreneurship and agribusinesses among rural youth, women, farmers, Farmer Producer Organizations (FPOs) and Grass roots Innovators. As a first initiative, series of awareness programs to promote rural entrepreneurship among rural youth, women, grassroots innovators, farmers and FPOs in Telangana are currently being undertaken. Agri Innovation Hub is determined to move fast to bring a new paradigm shift in Agricultural research, extension, and education through its wide network and vibrant, converging platform. It seeks to build a two-way bridge between urban-to-rural and rural-to-urban entrepreneurial pathways.

On hearing the great work that is being taken up in PJTSAU, a USA based researcher and Director Corporate Development at Rain Oncology, California, Sri Ranga Yarlagadda during his recent trip to Hyderabad visited the university and had a ‘deep and engaging discussion’ with CEO, AgHub Vijay Nadiminti. His instant impression was that the vision of AgHub was inspiring and game changer in the ecosystem. Sri Ranga had a special praise for the AgHub’s commitment to help the entire ecosystem of start-up founders, student entrepreneurs, rural entrepreneurs, grass root innovators, farmers, agribusiness ecosystem through personalized attention and handholding. He said that having been exposed to other incubators in Silicon Valley and the USA, he can truly say that what the Telangana government is building here is truly world-class! He was all praise for CM KCR, Principal Secretary Agriculture, VC PJTSAU and Chairman, AgHub M Raghu Nandan Rao, Director, AgHub Dr V Praveen Rao, and MD Agri Hub Dr R Kalpana Sastry.

(Writer is CPRO to Chief Minister, Telangana).

గర్వం, స్వాభిమానం సమంగా నటించే తార (జమున) : వనం జ్వాలా నరసింహారావు

 గర్వం, స్వాభిమానం సమంగా నటించే తార (జమున)  

(నిర్మాత, దర్శకుడు తిలక్ మాటల్లో)

వనం జ్వాలా నరసింహారావు

సాక్షిదినపత్రిక (౨౯-01-2023) 

తెలుగు చలన చిత్ర రంగంలో ధృవతారామణిగా దశాబ్దాలపాటు ఒక వెలుగు వెలిగిన నటీమణి జమున మరణ వార్త విన్న తరువాత ఆమె గురించి స్వర్గీయ కేబీ తిలక్ తన ఆత్మకథ నేను రాసిన సందర్భంగా ఆయన చెప్పిన కొన్ని అంశాలు గుర్తుకొచ్చాయి. అనుపమ చలన చిత్ర దర్శక నిర్మాతగా, స్వాతంత్ర్య సమరయోధునిగా, సామాజిక సేవకునిగా తిలక్ చాలామందికి సుపరిచితుడే. పాతిక సంవత్సరాల క్రితం ఆయన జీవిత చరిత్రను ఆయన మాటల్లోనే విని, రికార్డ్ చేసి, అక్షరీకరణ చేశాను. ఆ సమయంలో స్వర్గీయ జమున గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పారు.

అనుపమ ఫిలిమ్స్ స్థాపించి, శరత్ బాబు నవల ఆధారంగా ఆరుద్ర రూపొందించిన స్క్రిప్ట్ తో, స్వీయ దర్శకత్వంలో, తన తొలి ప్రయత్నంగా ‘ముద్దుబిడ్డ’ సినిమా తీశారు తిలక్. తిలక్ తో అప్పటికే ప్రముఖ నటిగా పేరు తెచ్చుకున్న శ్రీమతి జి వరలక్ష్మి ప్రధాన భూమిక తనకే ఇవ్వాలన్ని ప్రతిపాదన చేసారు. కథానాయకుడు జగ్గయ్యతో పాటు ఆ సినిమాలో ప్రధాన భూమికకు ‘గర్వం’, ‘స్వాభిమానం’ సమపాళ్లలో నటించగల జమునను ఎంపికచేశారు తిలక్. ఆ పాత్ర కావాలని ఆశపడ్డ జి వరలక్ష్మిని (రిలీజ్ చేయని మొదటి ఎనిమిది రీళ్లలో నటించిన) జమున వదిన పాత్రకు ఎంపికచేశారు. ప్రజానాట్య మండలికి చెందిన పలువురు కళాకారులు యీ సినమాలో నటించారు.

         జమున, జగ్గయ్యల కాంబినేషన్ లో ఓ నాటక బృందం ఉండేదారోజుల్లో.  ఆపాటికే జమున పుట్టిల్లు సినిమాలో నటించారు. అయితే ఆమె సినీ కళాకారిణిగా పేరు తెచ్చుకుని స్థిరపడిపోయేందుకు ముద్దు బిడ్డ సినిమానే కారణమని తిలక్ అభిప్రాయం. సినిమాలోని జమున కారెక్టర్ మొదట్లో, ఓ బొమ్మతో ఆటపాలతో కాలం గడిపే ఆమాయక ‘రాధ’ పాత్ర. మొదటి షాట్లోనే జమున రాధ పాత్రలో బొమ్మను పట్టుకుని “చిట్టి పొట్టి వరాల మూట-గుమ్మడి పండు గోగు పువ్వు” అనే ఒక పాట పాడుతుంది.

అలా పాడుకుంటూ, బొమ్మతో ఆడుకుంటున్న రాధను (జమున) పలహారానికి పిలుస్తే రాలేదని కినుక వహించిన అత్త సుభద్ర ఆమె చేతిలోని బొమ్మ లాక్కోవటంతో మూర్చపోతుంది. మూర్చజబ్బు గల ఆమెను డాక్టర్ గా పనిచేసే జగ్గయ్యకు ఇచ్చి పెళ్లిచేస్తే మంచిదన్న ఆలోచన కలగటమే తాపీగారు సూచించిన 'ముడి’. కథ అలా కొనసాగి జగ్గయ్య సోదరుడు నాగయ్య గారి బిడ్డనే ముద్దుబిడ్డ' గా జమున ఆమె తోటికోడలు పెంచుకుంటారు.

         సినిమా ఎనిమిది రీళ్ల షూటింగ్ అయిపోయిన తర్వాత జరిగిందో అనుకోని సంఘటన, ఓ సన్నివేశంలో వదిన పాత్రలో నటిస్తున్న శ్రీమతి జి వరలక్ష్మి తాను చెప్పాల్సిన ఓ డైలాగును మార్చమని కోరింది. అంగీకరించని తిలక్ ఆమెను తీసేసి లక్ష్మీరాజ్యం గారిని వరలక్ష్మి స్థానంలో ఎంచుకున్నారు. షూటింగ్ తిరిగి మొదటి నుండి ప్రారంభించారు. ముద్దుబిడ్డ సినిమా తోటికోడళ్లు జమున, లక్ష్మీరాజ్యం ఏదో విషయంలో సెట్లో కీచులాడుకున్నారు. కోపంతో వున్న జమునకు సర్ది చెప్పటానికి సూర్యకాంతంగారిని పురమాయించారు తిలక్. రాయబారం ఫలించింది. తోటికోడళ్లు సర్దుకుపోయారు. ముద్దుబిడ్డ సినిమాలోని కారెక్టర్లు మధు (జగ్గయ్య), రాధ (జమున)ల వివాహం అయిన తర్వాత ఏర్పాటు చేసిన రిసెప్షన్ సందర్భంగా చిత్రీకరించిన పాటలో పరోక్షంగా ఆందం-అన్యోన్యం (జమున-జగ్గయ్య) గురించిన ప్రస్తావనతోపాటు, మూర్చ జబ్బున్న రాధ (జమున), డాక్టర్ మధుతో (జగ్గయ్య) ఎలా సంసారం చేయనున్నదో-చేయాలో కూడా జానపద గీతంగా మలచారు శ్రీ ఆరుద్ర.   

         ముద్దుబిడ్డ సినిమాలో ఇ వి సరోజ చేసిన డ్యాన్సు పూర్వరంగంలో, సినిమాలోని తోటి కోడళ్లు (జమున, లక్ష్మీరాజ్యం) తగవులాడుకుంటారు. జమున తన భర్త జగ్గయ్యతో తమ స్వంత (కొత్త) ఇంటికి వెళ్తుంది. అయితే బావగారు (నాగయ్య), తోడికోడలు (లక్ష్మీరాజ్యం) రాకుండా గ్రహప్రవేశం జరుగటానికి వీలు లేదంటుంది జమున. భర్త జగ్గయ్య వదినగారిని తీసుకొస్తారు ఒప్పించి. అయితే, ఆడబిడ్డ సూర్య కాంతం స్వార్థంతో తన కొడుకునే పిల్లల్లేని జమున-జగ్గయ్యల కొడుకుచేయాలని ఆలోచించి, ‘ముద్దుబిడ్డ’ (నాగయ్య, లక్ష్మీరాజ్యం కొడుకు) తో ఎవరికి తెలియకుండా ఒట్టేయించుకుంటుంది. తాను తన పెంపుడు తల్లి జమునకు కనిపిస్తే ఆమెకేదైనా అవుతుందని నమ్మకం కలిగిస్తుందా బిడ్డకు. ఒక వేళ ఆవిషయం ఎవరినా చెప్తే తలపగిలిపోతుందని కూడా చెప్పింది.

         సినిమా కథలో, మూర్చ జబ్బుతో బాధపడుతున్న జమున (తన దగ్గరి బొమ్మను అత్త లాగేసుకున్న తర్వాత మూర్చపోవటంతో ప్రారంభమైన జబ్బు) కు తోడికోడలు లక్ష్మీరాజ్యం, బావగారు నాగయ్య తమ బిడ్డను ఎత్తుకోవటానికి ఇస్తారు (జమున-జగ్గయ్యల పెళ్లి ఆయింతర్వాత). బిడ్డ టచ్ తో మూర్చ జబ్బు పోతుంది. బొమ్మపోతే చంటిబిడ్డ దొరికినందుకు మురిసిపోతుంది రాధ (జమున). లోగడ నాగయ్య, లక్ష్మీరాజ్యంలకు కలిగిన సంతానం పుట్టిన కొన్నేళ్లకు చనిపోతుంటారు. జమున వచ్చింతర్వాత (మరదలుగా) ఆమె పెంపకంలో వున్న ఆ బిడ్డ బ్రతుకుతాడు. జమునను ‘యశోద’తో లక్ష్మీరాజ్యంను ‘దేవకి’ తో పోలుస్తూ ‘ఎవరు కన్నారెవరు పెంచారు-నవనీత చోరుని గోపాల బాలుని’ అనే పాట హిట్ ఆ రోజుల్లో.

          బాల్య వివాహాలకు వ్యతిరేకంగా, వితంతు వివాహాలకు మద్దతుగా వుండే థీమ్ తో, ఇష్టంలేని వివాహం రద్దయి కోరుకున్న వానితో వివాహం జరిపించటం ఇతివృత్తంగా వుండే ఓ సామాజిక స్పృహతో తీసిన ఈడూ జోడూ సినిమాలో జమున నటించింది. మహా బలిపురంలో ఔట్ డోర్ షూటింగ్ చేస్తున్న సందర్భంలో జపాన్ దేశం నుండి అక్కడకు వచ్చింది ఓ పాంస్కృతిక కళాకారుల బృందం సమక్షంలో ఆరుద్ర రచించిన 'ఇదేమీలాహిరి ఇదేవుగారడి’ అనే చక్కటి పాటను ఘంటసాల, సుశీల పాడగా జగ్గయ్య, జమునలపై చిత్రీకరించారని చెప్పారు తిలక్. మరో డ్యూయట్ పాట అదీ ఘంటసాల, సుశీల నేపధ్య గానంలోనే చిత్రీకరించారు జగ్గయ్య జమునలపైన. అదీ ఆరుద్ర కలం నుండి వెలువడింది.

         జమున తల్లి (మాలతి) మణిమాల తల్లి (సూర్య కాంతం) తోటికోడళ్ళు. ఉమ్మడి కుటుంబం. జమున తండ్రి చనిపోతాడు. రెండు కుటుంబాలు ఒకే ఇంట్లో వేర్వేరు భాగాల్లో వుంటుంటారు. జగ్గయ్య జమునను ప్రేమిస్తుంటే, జగ్గయ్యకు తన కూతురు మణిమాలను ఇచ్చి వివాహం చేయాలని పథకం వేస్తుంటుంది సూర్యకాంతం. రమణారెడ్డి సోదరి సూర్యకాంతంతో లాలూచీపడి జమునకు గుమ్మడితో వివాహం జరిపించేటందుకు రంగం తయారు చేస్తాడు. జగ్గయ్య తల్లి హేమలతకు వ్రాసిన పుత్తరాలు చేతులు మారి జమునకు చేరడంతో, జగ్గయ్య నుండి దూరం కావాలన్న భావన కలుగుతుంది. అటు జగ్గయ్య జమున ఉదాసీనత పట్ల బాధ పడుతుంటాడు. గుమ్మడితో పెళ్లి తనకిష్టం లేదని చెప్తుంది జమున. సూర్యకాంతం బలవంతం జగ్గయ్యకు దూరం కావాలన్న స్వయం నిర్ణయం, పెళ్లికి అంగీకరింపచేస్తాయి జమునను. పెళ్లి పీటల మీద ‘మాంగల్యం తంతునాని' అని బ్రాహ్మడు చదువుతుంటే, తప్ప త్రాగిన గుమ్మడి మాంగల్యం కట్టులేకపోవటం, లైట్లు ఆపుచేసి చీకట్లో సూర్యకాంతం జమున మెళ్లో తాళి కట్టటం నేపథ్యంలో జరుగుతాయి.

         జగ్గయ్యకు శాంత (జమున) పెళ్లి విషయం తెలియనీయరు. లక్ష్మీపతి కట్టించిన ఆసుపత్రిలో డాక్టరుగా చేరేటందుకు వస్తూ జమున కొరకు చీర తెస్తాడు. ఆమెకు లక్ష్మీపతి (గుమ్మడి)తో పెళ్లయిందని సూర్యకాంతం ద్వారా తెల్సుకుని ఆమె దగ్గరకెళ్లి దూషిస్తాడు నిందిస్తాడు. కోపంతో, స్మృతి మర్చి మాట్లాడుతున్నావని చెంప పగల కొడ్తుంది జగ్గయ్యను జమున. ఫలితంగా పిచ్చోడయి తిరుగుతుంటాడు.  చివరకు అన్నివిషయాలు బయటపడ్డాయి. జమన జగ్గయ్యలు ప్రేమికులని, పెళ్లి చేసుకోలేకపోయారని తెలుసుకున్నగుమ్మడి, ఓ నిర్ణయానికి వచ్చి, వారిద్దరికీ పెళ్లి చేయాలన్న నిర్ణయానికొస్తాడు.

         జమునను జగ్గయ్యతో వివాహం జరిపించేటందుకు నిర్ణయించుకున్న తర్వాత ఆమె మెళ్లో తాళి తీయించే సీన్ వుంటుంది సినిమాలో. గుమ్మడి జమునను బెదిరించి నేను కట్టని తాళి నీ మెళ్లో వుంటానికి వీల్లేదు అంటాడు. ఈ సీన్ చూపిన నాటి సెన్సార్ అధికారి శ్రీ జి పి శాస్త్రి గారు, తిలక్ ను తప్పుచేస్తున్నావని హెచ్చరిస్తాడు. అట్లా తీయకుండా, సెంటిమెంట్లను దెబ్బతీయకుండా, ప్లాష్ బ్యాక్ లో విడాకులు ఇప్పించినట్లు చూపించమంటాడు. ఎట్లాగో ఆ సీన్ ను మానేజ్ చేస్తాడు తిలక్. గుమ్మడి జమునలు చాలా కాంపిటీటివ్ గా నటించారీ సినిమాలో.

         ఇలా ఈ రెండు సినిమాలైన ‘ముద్దుబిడ్డ, ‘ఈదూజోడూ లలో జమున అద్భుతంగా నటించిన విషయం ఎంతో గొప్పగా చెప్పారు కేబీ తిలక్.

         ఆ మహానటి ఆత్మకు శాంతి కలగాలి.  

Monday, January 23, 2023

బీటలువారిన ఎర్రకోటలు! (గుర్తుకొస్తున్నాయి) : వనం జ్వాలా నరసింహారావు

బీటలువారిన ఎర్రకోటలు!

ముఖ్యమంత్రులను శాసించే స్థాయి అలనాటి జడ్పీ చైర్మన్లది

అరవై-డెబ్బై దశకంలో ఖమ్మం సమితి గ్రామ రాజకీయాలు-3

(గుర్తుకొస్తున్నాయి)

వనం జ్వాలా నరసింహారావు

ఆంధ్రప్రభ దినపత్రిక (24-01-2023)

అరవై-డెబ్బై దశకంలో అమల్లో వున్న మూడంచెల పంచాయితీ వ్యవస్థలో భాగంగా, గ్రామంలో మొదలు ఎన్నికలు జరిగి, వార్డు సభ్యులను ఎన్నుకునేవారు. వారంతా కలిసి సర్పంచ్ ను ఎన్నుకునేవారు. సర్పంచ్ లంతా కలిసి ఆరుగురు కో-ఆప్టెడ్ సభ్యులను ఎన్నుకుని, అంతా కలిసి సమితి అధ్యక్షుడిని రహస్య బాలెట్ ద్వారా ఎన్నుకునేవారు. సమితి అధ్యక్షులంతా కలిసి కో-ఆప్టెడ్ సభ్యులను ఎన్నుకుని, అంతాకలిసి జిల్లా పరిషత్ అధ్యక్షుడిని ఎన్నుకునేవారు. జడ్ పి చైర్మన్ ది చాలా పవర్ ఫుల్ హోదా. కాబినెట్ మంత్రులుగా వుంటూ కొందరు రాజీనామా చేసి, జిల్లా పరిషత్  అధ్యక్షులుగా ఎన్నికైన సందర్భాలున్నాయి. జడ్ పి చైర్మన్లకు, ఎంత పలుకుబడి, ప్రాబల్యం వుండేదంటే, ముఖ్యమంత్రిని ఎంపిక చేయడంలో వారిది కింగ్ మేకర్ల పాత్ర. ఒకే ఒక్క గ్రామ సర్పంచ్ సమితి, జిల్లా పరిషత్ ఎన్నికల భవితవ్యాన్ని మార్చగలిగే స్థితిలో వుండేవారు అప్పుడప్పుడూ. అదే జరిగింది అప్పట్లో ఖమ్మం జిల్లా పరిషత్తులో, సమితిలో.

అన్ని గ్రామాలతో పాటు ఎన్నికలు జరగకుండా, వల్లాపురం-అమ్మపేట ఉమ్మడి గ్రామ పంచాయితీ ఎన్నిక కోర్టు స్టే వల్ల వాయిదా పడి తరువాత జరిగింది. ఆపాటికి చేరి సగం సగం గ్రామాలు సీపీఎం, శీలం సిద్ధారెడ్డి కాంగ్రెస్ వర్గం, సీపీఐ, జలగం కాంగ్రెస్ (ఉపేంద్రయ్య) వర్గం గెలుచుకున్నాయి. సమితి దక్కించుకోవడానికి, ఇరువర్గాలకూ ఇంకొక పంచాయితీ అవసరం, వల్లాపురం ఎన్నిక కీలకమై పోయింది. ఖమ్మం సమితి ఎవరు గెలుస్తే, వారి పక్షమే జిల్లాపరిషత్ గెలుచుకునే పరిస్థితి నెలకొంది. వల్లాపురం ఎన్నిక సందర్భంగా  జిల్లాకు చెందిన అన్ని పార్టీల నాయకులు, అతిరథ-మహారథులు, అందరూ గ్రామానికి చేరుకున్నారు. మా పెదనాన్న వనం శ్రీరాంరావు గారి నాయకత్వంలో ఆ గ్రామ పంచాయితీకి, ఆయన అన్నగారి కుమారుడు సిద్ధారెడ్డి వర్గానికి చెందిన వనం వరదా రావు ఎన్నికయ్యాడు. అప్పటికింకా సమితి ఎన్నిక ఐదారు రోజులే వుంది. వల్లాపురం ఎన్నిక కావడంతోనే జలగం, శీలం వర్గాలు తమ తమ సర్పంచ్‌లతో "క్యాంపులు" పెట్టే చర్యలు చేపట్టారు. అప్పట్లో (ఇప్పుడు కూడా ఉన్నదే) క్యాంపుల సంస్కృతి వుండేది.

         నిర్ధారించిన తేదీ నాడు జరిగిన ఖమ్మం సమితి అధ్యక్ష ఎన్నికలో తొలుత కో-ఆప్టెడ్ సభ్యుల ఎన్నిక జరగాలి. ఇరు పక్షాలకు, ఎవరి లెక్క ప్రకారం వారికి, ఒకే ఒక్క ఓటు మెజారిటీ. మా గ్రామ సర్పంచ్ చాగంటి నారాయణను, ఇరు వర్గాల వారు తమ ఓటు కింద వేసుకున్నారు. చాగంటి నారాయణ కూడా తెలివిగా వ్యవహరించడం మొదలెట్టాడు. మొదటి కో-ఆప్టెడ్ సభ్యుడిగా శీలం-సీపీఎం అభ్యర్థి గెలిచాడు. రెండవ అభ్యర్థిగా గోకినేపల్లి గ్రామానికి చెందిన, ప్రముఖ సీపీఎం నాయకుడు రావెళ్ల సత్యం, శీలం-సీపీఎం పక్షాన పోటీలో వున్నాడు. చాగంటి అతడికి ఓటు వేయకపోవడంతో ఓడి పోయాడు. గెలిచినట్లయితే అతడే సమితి అధ్యక్ష అభ్యర్థి. తెలివిగా ఆయనను ఓడించారు ప్రత్యర్థులు. ఆ సమయంలో చాగంటికి సీరియస్ వార్నింగ్ పోయింది. ఆ తరువాత నలుగురు కో-ఆప్టెడ్ సభ్యులుగా శీలం-సీపీఎం గ్రూపు వారే ఎన్నికయ్యారు. వారిలో కమ్యూనిస్ట్ (మార్క్సిస్ట్) పార్టీ అభ్యర్థి రాయల వీరయ్య ఒకరు. రాయల వీరయ్య సమితి అధ్యక్షుడుగా ఎన్నికయ్యారు. బాణాపురం గ్రామ సర్పంచ్ కమ్యూనిస్ట్ (మార్క్సిస్ట్) పార్టీ అభ్యర్థి గండ్లూరి కిషన్ రావు ఉపాధ్యక్షుడుగా ఎన్నికయ్యారు. ఆ సారి జిల్లాపరిషత్ శీలం వర్గానికే దక్కింది.

ఎన్నికలు ముగిసినప్పటికీ, భూస్వామ్య గుండాల దాడులు-దౌర్జన్యాలు మాత్రం కొనసాగుతూనే వుండేవి. ఇంతలో 1971 లో లోక్ సభకు మధ్యంతర ఎన్నికలొచ్చాయి. ఎన్నికల ఓట్లు లెక్కింపు జరిగే నాటి సాయంత్రం, బాణా పురంలో జరిగిన కవ్వింపు సంఘటనలో, మరో కమ్యూనిస్ట్ కార్య కర్త బొల్లెద్దు రామనాధం ఒక బడా భూస్వామి చేతిలో, లైసెన్స్ లేని పిస్తోలు గుండుకు బలై హత్యకావించబడ్డాడు. చివరకు కోర్టు హత్య చేసినతనిని, ఆత్మ రక్షణ కోసం కాల్పులు జరిపాడని నిర్దోషిగా తేల్చి వదిలేసింది! ఇదిలా వుండగా, మా గ్రామ మరో సరిహద్దు గ్రామం అమ్మ పేటలో ఆ గ్రామ మాజీ సర్పంచ్ కోయ వెంకట్రావు పోలీసుల అండతో అనేక దౌర్జన్యాలు చేసేవాడు. అతడు తాగుబోతు కూడా. తన దగ్గరున్న ఒక లైసెన్సు లేని రివాల్వర్‌తో గ్రామంలో ఒకడిపై దాడి చేసే ప్రయత్నంలో అది విఫలమై పట్టుబడ్డాడు. పోలీసు కేసు అయింది. నాలుగు సంవత్సరాల శిక్ష పడడానికి ఒకటి-రెండు రోజుల ముందర 1972 జనవరి నెలలో హత్యకు గురయ్యాడు.

కోయ వెంకట్రావు హత్యను అండగా చేసుకుని, జలగం గ్రూప్ కాంగ్రెస్ వారు కమ్యూనిస్ట్ (మార్క్సిస్ట్) పార్టీపై ధ్వజ మెత్తారు. కమలాపురం గ్రామ సర్పంచ్ వనం నర్సింగరావును, గంధ సిరి గ్రామ సర్పంచ్ గండ్ర వీర భద్రారెడ్డిని, బాణాపురం గ్రామానికి చెందిన బాజి హనుమంతును (శాసనసభకు జరుగుతున్న ఎన్నికలలో పోటీ చేసి గెలవబోతున్న), అమ్మ పేట గ్రామానికి చెందిన పలువురిని ఆ హత్య కేసులో ముద్దాయిలుగా చేర్పించాడు. గండ్ర వీర భద్రారెడ్డి మొదటి ముద్దాయి కావడంతో మూడు నెలల పాటు బెయిలు కూడా దొరకలేదు. ఆయన జైలులో వుండగా గ్రామంలోని ఆయన వ్యతిరేకులు గూండాయిజం చేసి కమ్యూనిస్ట్ కార్యకర్తలను హింసించారు. ఆయనపై బలవంతంగా అవిశ్వాస తీర్మానం పెట్టించి నెగ్గించుకున్నారు. బెయిలుపై బయట కొచ్చిన గండ్ర వీర భద్రారెడ్డిని గ్రామంలో ప్రవేశించ కుండా అడ్డుకున్నారు. గండ్ర వీర భద్రా రెడ్డి ఆ రోజుల్లో బాణా పురంలో కిషన్ రావు ఇంట్లో వుంటుండేవాడు. అదే సమయంలో మరో హత్య కేసులో కిషన్ రావును, నర్సింగరావును పోలీసులు అక్రమంగా ఇరికించారు. ఏడాదిన్నర పైగా బయట వున్న గండ్ర వీర భద్రా రెడ్డి తన గ్రామం చేరుకున్నాడు. ఆయన నాయకత్వంలో కమ్యూనిస్టులు సంఘటితం కాసాగారు. అది చూసి ఓర్వలేని భూస్వామ్య గుండాలు పోలీసుల సహాయంతో, 1973 డిసెంబర్ నెలలో, బజార్లో వెళ్తున్న గండ్ర వీర భద్రా రెడ్డిని అతి దారుణంగా హత్య చేశారు.

అలా ఒకరి వెంట మరొకరు హత్యా రాజకీయాలకు బలై పోయారు. చివరకు ఉపేంద్రయ్య కాంగ్రెస్ ముఠా వెనక్కు తగ్గింది. నిర్బంధాలు, హత్యలు కమ్యూనిస్టులను లొంగదీయ లేకపోయింది. కొంతకాలం ప్రశాంత పరిస్థితి నెలకొంది. అంతా సర్దు మణిగిందనుకుంటున్న స్థితిలో భయంకరమైన కుట్రకు 1976 ఫిబ్రవరి 7 వ తేదీన కమ్యూనిస్ట్ (మార్క్సిస్ట్) పార్టీ నాయకుడు గండ్లూరి కిషన్ రావు బలై పోయాడు. ఖమ్మంలో సెకండ్ షో సినిమా చూసి ఇంటికి వెళ్తున్న సమయంలో ఆయన ఇంటి సమీపంలో కాపుకాసిన హంతకులు కిషన్ రావుపై దాడి చేసి కత్తులతో పొడిచి హత్య చేశారు. ఆయన హత్యతో ఒక శకం ముగిసి పోయింది. ఒక మహనీయుడు అస్తమించాడు. దురదృష్టవశాత్తు, అలాంటి "ఎర్ర కోట"ల లాంటి గ్రామాలలో, నేడు ఒక్కటి కూడా కమ్యూనిస్టుల ప్రాతినిధ్యంలో లేదు!!!