Tuesday, May 31, 2022

కాకతీయుల నుంచి కేసీఆర్ దాకా..... : వనం జ్వాలా నరసింహారావు

 కాకతీయుల నుంచి కేసీఆర్ దాకా.....

వనం జ్వాలా నరసింహారావు

ఆంధ్రజ్యోతి దినపత్రిక (01-06-2022)

ప్రపంచంలోని అతి ప్రాచీనమైన ఆవాస ప్రాంతాలలో ప్రధానమైంది దక్కన్ భూభాగం. 1766 నుండి నైజాం పరిపాలన కింద వున్న తెలుగు ప్రాంతానికే తెలంగాణ అన్న పేరొచ్చింది. తిలింగ పదం కాకతీయుల కాలం నుంచి వ్యవహార శైలికొచ్చింది. శాతవాహనులు తెలంగాణ లోని కోటి లింగాల నుంచి పాలన ప్రారంభించారని చారిత్రిక ఆధారాల ద్వారా తెలుస్తోంది. శాతవాహనుల తరువాత ఇక్ష్వాకులు తెలంగాణ ప్రాంతాన్ని పాలించారు. వీరికి సమాంతరంగా వాకాటకులు ఉత్తర తెలంగాణ జిల్లాలను పాలించారు. వాకాటకుల తరువాత విష్ణుకుండినులు ఏడవ శతాబ్దం దాకా పాలించారు. అ తరువాత బాదామి చాళుక్యులు, రాష్ట్రకూటులు, వేములవాడ చాళుక్యులు, కళ్యాణి చాళుక్యులు తమ పాలనను విస్తరించారు.

కాకతీయుల యుగం తెలంగాణలో స్వర్ణయుగంగా ప్రసిద్ధికెక్కింది. వ్యవసాయానికి నీటి పారుదల 22ప్రణాళికలు, గొలుసు కట్టు చెరువులు వారి హయాంలోనే వచ్చాయి. వ్యవసాయం లాభసాటిగా రూపుదిద్దుకున్నది కాకతీయుల పాలనలోనే. 1500 ప్రాంతంలో బహమనీ రాజ్యం ఐదు చిన్న రాజ్యాలుగా విడిపోయింది. విడిపోయిన వారిలో కుతుబ్ షాహీలు కూడా వున్నారు. గోల్కొండ రాజ్య స్థాపకుడు కులీ కుతుబ్ షా 1592 లో రాజధానిని హైదరాబాద్ కు మార్చాడు. కుతుబ్ షాహీల కాలంలో హైదరాబాద్ నిర్మాణం జరిగింది. అప్పట్లో దాని పేరు భాగ్యనగరం. గోల్కొండ కోట మొఘల్ చక్రవర్తుల ఆధీనమైన తరువాత నిజాముల్ ముల్క్ సుబేదారుగా నియమించబడ్డాడు. ఆయనే స్వతంత్రం ప్రకటించుకుని ఆసఫ్ జాహీ వంశ పాలనకు శ్రీకారం చుట్టాడు. ఏడవ రాజైన నిజాం ఉస్మాన్ మీర్ అలీఖాన్ తో ఆసఫ్ జాహీ వంశం అంతరించింది.

           సాలార్ జంగ్ సంస్కరణలో భాగంగాప్రస్తుతం వున్న జిల్లాల వ్యవస్థరెవెన్యూ పాలనా వ్యవస్థజిల్లా బందీ విధానం వచ్చిందిహైదరాబాద్ తో కలుపుకుని తెలుగు మాట్లాడే ఎనిమిది (దరిమిలా అవే పది జిల్లాలయ్యాయి) జిల్లాలను ఒక ప్రాంతంగా ఏర్పాటు చేశారుఅదే ఇప్పటి 33 జిల్లాల తెలంగాణ రాష్ట్రం. సాలార్ జంగ్ నిజాం రాజులను ఒప్పించి కృష్ణా నదికి వెళ్లే వరదలను సముద్రం పాలు కాకుండా నివారించడానికి డిండిమూసిపాలేరువైరా మొదలైన జలాశయాలను నిర్మించాడుఇప్పటి నాగార్జున సాగర్ ప్రాజెక్టును మొదటగా ఆలోచించి డిజైన్ చేసినిర్మాణానికి ప్రయత్నం ఆయన కాలంలోనే జరిగిందిఅలాగేహైదరాబాద్ నగరానికి వరదలు తెచ్చే ప్రాంతంలోని నీటిని నియంత్రించేందుకు ఉస్మాన్ సాగర్హిమాయత్ సాగర్ రిజర్వాయర్ల నిర్మాణం కూడా జరిగిందిఅండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థవిద్యుత్ శక్తి వ్యవస్థ నెలకొల్పారువీటి నిర్మాణంలో అలీ నవాజ్ జంగ్ కృషి వుంది. 1918 లో ఉస్మానియా యూనివర్సిటీసిటీ కాలేజీఆసిఫియా గ్రంధాలయం ఏర్పాటయ్యాయిపోలీసు చర్య తదనంతరం ఆంధ్ర ప్రాంత అధికారుల పెత్తనం పెరిగిపోయిందికమ్యూనిస్టుల సాయుధ రైతాంగ పోరాటం జరిగింది. 1950 లో పౌర ప్రభుత్వం ఏర్పాటైఎం కే వెల్లోడి ముఖ్యమంత్రి అయ్యారు. 1952 ఎన్నికల వరకు బూర్గుల రామకృష్ణారావు మంత్రి పదవిలో వున్నారు. 1952 లో బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా ప్రభుత్వం ఏర్పాటైంది.

1952 నాటి ముల్కీ ఆందోళనలో స్థానికులకే ఉద్యోగాలివ్వాలన్న డిమాండ్ వూపందుకుందితెలంగాణలో గైర్ ముల్కీ గో బ్యాక్ ఉద్యమందరిమిలా తెలంగాణ రాష్ట్రం కోసం కూడా డిమాండ్ చరిత్రలో భాగాలు. 1956 లో ఆంధ్ర ప్రదేశ్ ఏర్పాటైఅందులో తెలంగాణ విలీనమైందిపేరుకు పెద్దమనుషుల ఒప్పందం కుదిరింది. అది కేవలం కాగితాలకే పరిమితమై పోయింది. అంతటితో ఆగకుండాతెలంగాణ ప్రాజెక్టులను పక్కనబెట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంఆంధ్ర ప్రాంతానికి ఉపయోగపడే విధంగా ప్రాజెక్టుల డిజైన్ చేసిందిఅన్ని రంగాల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందివనరులు దోపిడీ చోటు చేసుకుందిఆంధ్ర ప్రాంతం వారే ఉద్యోగాలు దక్కించుకున్నారు. తెలంగాణ రాష్ట్రం విడిపోతే తప్ప న్యాయం జరుగదనే భావన సర్వత్రా కలిగింది. 1969 లో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి నాయకత్వంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉధృతంగా కొనసాగిందికొంతకాలం తరువాత అనేక కారణాల వల్ల అప్పట్లో ఉద్యమం రాష్ట్రం ఏర్పాటయ్యే వరకు కొనసాగలేకపోయింది. తెలంగాణకు సంబంధించిన నిధులునీళ్లునియామకాల్లో అన్యాయం జరుగుతూనే వచ్చింది. ఈ అన్యాయం కాంగ్రెస్, తెలుగు దేశం ప్రభుత్వాలలో నిరాటంకంగా కొనసాగింది.

          ఈ నేపధ్యంలోవిద్యుత్ చార్జీల పెంపుకు నిరసనగాతెలంగాణకు జరుగుతున్న అన్యాయానికి నిరసనగాసిద్దిపేట ఎమ్మెల్యేగాఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ గా కల్వకుంట్ల చంద్రశేఖర రావు పదవులకు రాజీనామా చేశారు. 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి ప్రారంభించిప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం మొదలుపెట్టారుసుదీర్ఘంగా పదమూడేళ్ల పాటు సాగిన ఉద్యమంలో తెలంగాణ ఏర్పాటుకు దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలలో వున్న ప్రాంతీయ పార్టీలతో సహాజాతీయ పార్టీ నాయకుల మద్దతు కూడగట్టారు కేసీఆర్. 2009 నవంబర్ 29న లో కేసీఆర్ ఆమరణ దీక్ష తెలంగాణ ఉద్యమంలో ఒక కీలకమైన మలుపుతెలంగాణ ప్రజల సమిష్టి పోరాట ఫలితంగా డిసెంబర్ 9న తెలంగాణ ఏర్పాటు చేస్తామని కేంద్రం ప్రకటించి వెనక్కు తగ్గింది. తెలంగాణ సమాజం ఉద్యమాన్ని తీవ్రతరం చేసిసకల జనుల సమ్మెమిలియన్ మార్చ్ లాంటివెన్నో చేపట్టి తెలంగాణ సాధన దిశగా ముందుకు సాగింది. 2014 ఫిబ్రవరిలో పార్లమెంటు ఆమోదం పొందిన విభజన చట్టం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి నాంది పలికింది. జూన్ 2, 2014 , 29 వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భావం కావడంఉద్యమ నాయకుడు కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ నెరవేరింది. బంగారు తెలంగాణ సాధన దిశగా అడుగులు వేయడం జరిగింది.

              ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం నుంచేటీఆరెస్ ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న వాగ్దానాల అమలు దిశగాపరేడ్ మైదానంలో జరిగిన రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాల సందర్భంగా ప్రభుత్వ భవిష్యత్ కార్యక్రమాన్నిప్రణాళికను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించారు. పదవీ బాధ్యతలు చేపట్టిన వారంలోపలప్రభుత్వం చేయబోయే కార్యక్రమాలు ఎలా వుండబోతోందీఎన్నికల ప్రణాళికలో ప్రజలకు చేసిన వాగ్దానాలను ఎలా అమలు చేయబోతోందీవాటి అమలుకు ప్రభుత్వం రూపొందించుకుంటున్న కార్యాచరణ ప్రణాళిక ఏంటీఅన్న విషయంలో స్పష్టమైన అవగాహనతోఆలోచనతో ముందుకు సాగుతూవాగ్దానాల అమలు దిశగా వడివడిగా అడుగులు వేసింది కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం.

ఇక అప్పటినుంచి...ఒక్కొక్కటిగా ఎన్నికల హామీలన్నీ అమలు జరుగుతున్నాయివాటన్నింటి కన్నా ముఖ్యంగారాజకీయ అవినీతిని కూకటి వేళ్లతో పెకలించి వేసే దిశగా వ్యూహం రూపొందించడం జరిగింది. సంక్షేమ పథకాలన్నీ అవినీతి రహితంగాపారదర్శకంగా అమలు కాసాగాయికేంద్రంతోపొరుగు రాష్ట్రాలతో సత్సంబంధాలు ఏర్పడ్డాయిప్రభుత్వ పాలన కూడా ఉద్యమ పథంలోనే జరగ సాగిందితెలంగాణ రాష్ట్రాన్ని దేశానికి తలమానికమయ్యేలా సుపరి పాలన అన్ని రంగాల్లో చోటు చేసుకుందిదళితులుగిరిజనులుబీసీలుమైనారిటీ వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యం దొరికిందిఈ వర్గాల కోసం ఏటేటా వేల కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయింపులు జరిగాయిఅభివృద్ధి-సంక్షేమ పథకాల రూపకల్పన-అమలు దేశంలో ఎక్కడ లేని విధంగా జరుగుతోందిక్కడ. ఎస్సీలుఎస్టీలుబిసిలుమైనారిటీలుఇతర ఆర్థికంగా వెనుకబడిన పేదల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిందీ ప్రభుత్వంసంక్షేమ రంగానికి అత్యధిక మొత్తంలో ఖర్చు చేస్తున్నది తెలంగాణ రాష్ట్రం

సీమాంధ్ర పాలనలో నిర్లక్ష్యానికి గురైన చెరువులనుదెబ్బతిన్న వ్యవసాయాన్నిగ్రామీణ ఆర్థిక వ్యవస్థనుపునరుద్ధరించడానికి పటిష్ఠమైన ప్రణాళిక వేసి అమలు చేస్తున్నదీ ప్రభుత్వం. చెరువులకు పూర్వ కళ రాసాగింది. ప్రాజెక్టుల రీ డిజైనింగ్ కు శ్రీకారం చుట్టిందీ ప్రభుత్వం. శాస్త్రీయం అధ్యయనం చేసి ప్రాజెక్టుల రీ-డిజైన్ అవసరం వున్న చోట చేసింది. కాళేశ్వరం లాంటి ప్రపంచ ప్రఖ్యాత నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం శరవేగంతో పూర్తయ్యాయి. ప్రజలకు సురక్షిత మంచినీరు అందించేందికు మిషన్ భగీరథను చేపట్టింది. వందకు వంద శాతం ఆవాసాలకు సురక్షిత మంచినీరు సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రంగా పలువురి ప్రశంసలు అందుకున్నది తెలంగాణ. 51 నెలల పాలన అనంతరం ముందస్తు ఎన్నికలుకు పోవాలని నిర్ణయించుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభ రద్దుకు సిఫార్సు చేశారు. దరిమిలా డిసెంబర్ 2018 లో జరిగిన ఎన్నికలలో అఖండమైన మెజారిటీ సాధించిన ఆయన నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి మరోమారు అధికారంలోకి వచ్చింది. ముఖ్యంత్రిగా కేసీఆర్ రెండో పర్యాయం ప్రమాణ స్వీకారం చేశారు. అలా ఇప్పటికి కీసీఆర్ పాలన మొత్తం ఎనిమిది సంవత్సరాలు పూర్తిచేసుకుని తొమ్మిదో సంవత్సరంలో అడుగు పెట్తున్నది.  

ఇంతకు ముందే చెప్పినట్లు గత ఎనిమిది సంవత్సరాల కాలంలో అనేకానేక అద్భుతమైన, అమోఘమైన, ప్రత్యేకత సంతరించుకున్న, దేశానికే తలమానికమైన, తెలంగాణ మోడల్ గా పేర్కొనదగిన, దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని, వినూత్న పధకాలకు, కార్యక్రమాలకు ఒకవైపున సంక్షేమ రంగంలో, మరోవైపున అభివృద్ధి రంగంలో, శ్రీకారం చుట్టి విజయవంతంగా అమలు చేస్తున్న ఘనత కేసీఆర్ దే. నీటిపారుదల ప్రాజెక్టులు పూర్తయ్యాయి. 24 గంటలు నిరంతర నాణ్యమైన విద్యుత్ అన్ని రంగాలకు సరఫరా చేస్తున్నదీ ప్రభుత్వం. ర్రైటు బందు, రైతు భీమా, దళిత బంధు లాంటి కార్యక్రమాలు ఈ రాష్ట్రానికే ప్రత్యేకం. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ దేశానికే తలమానికం. ఆర్థికంగా శరవేగంతో పురోగమిస్తూ అత్యంత ధనిక రాష్ట్రంగా మన్ననలు ఓండుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ.

ఎన్నికల్లో చేసిన వాగ్దానాల అమలుకు అదనంగా, చెప్పనివెన్నో కూడాప్రజల బహుళార్థ సంక్షేమం-అభివృద్ధిని దృష్టిలో వుంచుకుని రూపొందించి అమలు చేస్తున్నదీ ప్రభుత్వంప్రజలకు ఈ ప్రభుత్వం పైన నమ్మకంఅభిమానంవిశ్వాసం వుందనడానికి నిదర్శనంగా అధికారంలోకి వచ్చినప్పటినుంచి జరిగిన ఎంపీఎమ్మెల్యేఎమ్మెల్సీకార్పొరేషన్మునిసిపాలిటీ ఎన్నికల ఫలితాలను తీసుకోవాలిప్రజా క్షేత్రంలో ప్రతి ఎన్నికల్లో కూడా గెలుపు ప్రభుత్వంలో వున్న పార్టీదేప్రభుత్వం చేపట్టిన ప్రతి కార్యక్రమం ప్రజల సంక్షేమానికేననేది తిరుగులేని సత్యంప్రతి పథకం ఈ రోజున దేశంలోనే కాకుండా విదేశాలలో కూడా ప్రశంసలను అందుకుంటున్నదిఎన్నో రాష్ట్రాలు తెలంగాణ ప్రభుత్వం చేపట్టి అమలు చేస్తున్న పథకాల గురించి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారుఆవార్డులందుతున్నాయి

ఏ తెలంగాణ కోసం ఇక్కడి ప్రజలందరూ పోరాడారో, ఏ తెలంగాణ పోరాట ఫలితంగా సాకారమైందో, ఏ తెలంగాణాలో ప్రతి వ్యక్తీ సుఖ శాంతులతో జీవించాలని కోరుకుంటున్నాడో, ఏ తెలంగాణాలో ప్రతి వ్యక్తీ తన అవసరాలు తీరాలని భావిస్తున్నాడో, ఏ తెలంగాణలో గతంలో జరిగిన దోపిడీకి తావులేకుండా పోతుందో, ఏ తెలంగాణాలో బంగరు భవితకు బాటలు పడాల్నో, ఆ తెలంగాణాలో మనం వున్నాం ఇప్పుడుతెలంగాణ ధనిక రాష్ట్రంఇక్కడి వనరులు ఇప్పుడు ఇక్కడివారికేమన నిధులు మనవే. మన ఉద్యోగాలు మనవేమన సాగు నీరు మనదేఅనతికాలంలో మనం రూపొందించుకున్న ప్రాజెక్టులుపథకాలుకార్యక్రమాలు పూర్తి ఫలితాలను ఇవ్వడం నగ్న సత్యంమన రాష్ట్రంలోని ప్రతి వ్యక్తి ఆదాయంరాష్ట్ర ఆదాయం వృద్ధి చెందుతుందిసంపద పెరుగుతుంది. రాష్ట్రం బంగారు తెలంగాణ అవుతుందిజాతి పునర్నిర్మాణంలో మనవంతు పాత్ర పోషిస్తాం. మన కలలు పండుతాయి.

తెలంగాణ ఇలా రూపుదిద్దుకోవడానికి కారణం రాష్ట్ర రధసారధి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, ఆయన నాయకత్వం. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ నాయకుడే రాష్ట్రం ఏర్పాటైన తరువాత ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో నడిపిస్తే కానిదేముంది? దటీజ్ కేసీఆర్!!!   

(జూన్ నెల 2, 2022 న తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం సందర్భంగా)

 

Monday, May 30, 2022

KCR’s Telangana Model of Governance : Vanam Jwala Narasimha Rao

 KCR’s Telangana Model of Governance

Vanam Jwala Narasimha Rao

The Pioneer (31-05-2022)

Telangana, the youngest State of India has achieved all round and inclusive growth within a short period eight years.  The state commenced its arduous journey to prosperity against the backdrop of all odds. Soon after the formation of Telangana, fulfilling the aspirations of people, which remained unattended to in the combined State, was a major challenge before the new Government. Without losing time brooding over the past neglect, the Government under the dynamic leadership of CM K Chandrashekhar Rao got into the action mode with a number of first of its kind unique innovative programs to usher in ‘Bangaru Telangana’.   

Telangana has earned the unique distinction of defining, designing and delivering as also successfully implementing many first-of-its kind developmental and welfare programs in such a shortest period of time.  To dwell on some of these important trailblazing initiatives taken by the KCR Government which made Telangana model a role model for India is a matter of astonishment for the rest of the country. Now the entire country looking at Telangana to replicate developmental and welfare schemes.   

Leading and the newest scheme is Dalit Bandhu. Recognising the imperative to improve the lot of Dalits and moved by their plight, Chief Minister KCR came up with an unparallel innovative and revolutionary Dalit Bandhu Scheme. This is not a mere scheme but an effective policy to empower the Dalits, with an objective to extend free financial assistance of Rs.10 lakh to each Dalit family in the State in a phased manner. The intention is to enable the Dalits to start their own enterprises and empower them on a permanent basis. It is one of the biggest cash transfer schemes in the country and will herald a sea change in the upliftment of Dalits.

In the erstwhile combined State, agriculture sector was a proverbial gamble in monsoon. With the neglect of irrigation sector and frequent droughts, farmers’ suicides were one of the highest in the country. The situation dramatically changed after the formation of the State. With development of irrigation facilities and 24x7 uninterrupted free power supply, agriculture sector in the State made rapid strides.

Government is incentivising farmers to go for alternate crops to maximise their incomes. Telangana has emerged as the seed bowl of the country. Rythu Bandhu Samithis have been formed in the State to bring the farmers onto an organised platform and to create awareness among them to link crop production to demand.

To improve the economic conditions of the poor people dependent on allied sectors, the Government is distributing sheep at 75% subsidy to the Golla kurumas community.  As a result of this measure, the meat production increased to a record level. With the development of water resources and the proactive policies of the Government including assistance to fishermen and distribution of fish seedlings to beneficiaries, fish production increased enormously.

Apart from these, yet another major programme known as Rythu Bandhu, an investment support for agriculture of Rs.5,000 per acre per season totalling Rs 10000 per acre is being extended without any ceiling on the land holdings benefitting nearly 60 lakh farmers. For providing financial security to the farmers’ families in the unfortunate event of death of a farmer, government has introduced Rythu Bhima scheme under which, an amount of Rs.5 lakh is being paid to the family of the deceased. The entire premium for the insurance coverage is being paid by the Government without any contribution from the farmer.

To alleviate the hardships of the farmers, Government took up Kaleshwaram Project, the world’s largest multi-stage lift irrigation project. In addition, the Government adopted strategy of completing all pending projects and taking up a number of new projects. Under Mission Kakatiya, the Government has taken up and completed renovation of minor irrigation tanks in a phased manner.

Telangana is the first in the country to have conceived Mission Bhagiratha to provide protected and safe drinking water to every household in all the habitations in the State.  Mission Bhagiratha has been completed within a record period and today cent percent households are getting the benefit of this.  This Mission has once and for all put an end to all water borne diseases in the State. 

     

Telangana which was facing acute power crisis at the time of formation affecting the operations of both industrial and agricultural sectors, was able to overcome the problem within six months of KCR assuming office and ensure 24x7 uninterrupted quality power to the consumers and free power to the farmers.  The installed capacity is more than doubled.

Telangana has become the role model by launching the most investor friendly industrial policy TS-I PASS facilitating approvals for industries in a time bound manner based on self-declarations. This resulted in large scale investments providing employment to lakhs of persons. The pharma city and the textile park are the other major initiatives, which will make Telangana one of the major industrial hubs in the country. Hyderabad, the capital city of Telangana, has emerged as a major centre for the IT sector. Some of the multi-national companies have expanded their activities significantly.

In its journey towards faster and inclusive growth, the Telangana crossed a number of milestones. By the yard stick of number of innovative welfare schemes like Aasara Pensions, Kalyan Laxmi, Shadi Mubarak, KCR kits, Brahmin welfare etc and scale of assistance, there is no parallel to the State. The State received a number of awards from the national as well as international organizations. The State is not resting on these laurels. These rewards and awards have further strengthened Government’s resolve to achieve the ultimate goal of Bangaru Telangana within the shortest possible time.

State’s GSDP growth has consistently been higher than the national GDP growth since 2015-16 and the gap has been widening. Despite the adverse impact of Covid-19 pandemic, Telangana ducked the declining growth in most of the States and the country by clocking a positive GSDP growth as compared with the negative growth in the national GDP. The fact that Telangana withstood the havoc of the pandemic is a testimony to the strong foundations laid since the formation of the State for sustained and resilient economy. The contribution of Telangana to country’s GDP improved considerably.

The growth performance of Telangana has been commended by the NITI Aayog. It observed that Telangana is one of the fastest growing States in the country. In terms of growth of per capita income, a very broad measure of economic development and average living standards, Telangana’s performance has been spectacular. The per capita income of Telangana is higher than the national per capita income.

It is by no means a small achievement for a State which is formed only eight years ago, to rebuild itself, revive, bounce back and achieve majority of its aims and objectives. All this is possible due to the dynamic leadership of CM KCR, his administrative skills, his visionary leadership and his innovative thinking. As a strong leader who led the separate Telangana statehood movement despite all odds, obstacles and difficulties, he knew the problems, issues and strengths of the Telangana state like back of his palm. Hence, from the day one he assumed charge as the CM, he solved each and every problem and laid a blue print for the Telangana state’s progress and development. And that is KCR!

Sunday, May 29, 2022

కావాల్సింది ప్ర‌త్యామ్నాయ జాతీయ ప్రణాళికే! .... వ‌నం జ్వాలా న‌ర‌సింహారావు

 కావాల్సింది ప్ర‌త్యామ్నాయ జాతీయ ప్రణాళికే!

వ‌నం జ్వాలా న‌ర‌సింహారావు

సాక్షి దినపత్రిక (30-05-2022)

పటిష్ఠ సహకార సమాఖ్య దిశగా దేశాభివృద్ధికి అసలు సిసలైన జాతీయ ప్రత్యామ్నాయ ప్రణాళిక రూపొందించేటందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రాంతీయ రాజ‌కీయ పార్టీల ఏకీక‌ర‌ణ‌కు మరో అడుగు ముందుకు వేశారు. రాష్ట్రాల అధికారాల‌ను పున‌ర్నిర్వచించాలనీ, అన్ని రంగాల్లో సంస్క‌ర‌ణ‌లు అమలు చేయాలనీ కూడా కేసీఆర్ పిలుపునిచ్చారు. ఫెడరల్ వ్యవస్థ మీద కేంద్ర ప్రభుత్వాల వ్యూహాత్మ‌క దాడిని పలు సందర్భాలలో ఆయన దుయ్యబట్టారు. 

స్ప‌ష్ట‌మైన జాతీయ ప్ర‌త్యామ్నాయ అజెండాను రూపొందించడంలో ముఖ్య‌మంత్రి కె. చంద్ర‌శేఖ‌ర‌రావు నిమగ్నమైనట్లు ఆయన పర్యటనలు రుజువు చేస్తున్నాయి. ఇటీవలి కేసీఆర్ ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల ప‌ర్య‌ట‌న‌లోను, ఢిల్లీలో వున్న సందర్భంలో ఆయన కలిసిన కొందరు ప్రముఖులతో జరిపిన చర్చల్లోనూ, ఇది సూచనప్రాయంగా వెల్ల‌డైంది. త‌న‌లాగే ఆలోచించే రాజ‌కీయ నేత‌ల‌ను క‌ల‌వ‌డంలో, సహకార స‌మాఖ్య‌ను బలపర్చాల్సిన ఆవశ్యకత దీని వెనుక క‌నిపిస్తోంది. ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో నాయ‌కుల‌ను క‌లుస్తున్న సంద‌ర్భంలో, జాతీయ రాజకీయాల్లో త్వ‌ర‌లోనే సంచ‌ల‌నం చోటుచేసుకోనున్నదని కేసీఆర్ స్పష్టంగా చెబుతున్నారు. కొత్త విధానాల‌ను అమలు చేసేట‌ప్పుడు రాష్ట్రాల‌ను కేంద్రం సంప్ర‌దించాల్సిన అవ‌స‌రాన్ని కేసీఆర్ నొక్కి చెప్పారు. స‌హ‌కార స‌మాఖ్య స్ఫూర్తి పెంపొందాల్సిన ఆవ‌శ్య‌క‌త ఉంద‌ని కేసీఆర్ సూచిస్తున్నారు. ప‌రిస్థితుల‌కు అనుగుణంగా వ్య‌వ‌హ‌రించే వెసులుబాటును రాజ్యాంగం కేద్ర ప్ర‌భుత్వానికి క‌ల్పించింది. అంతమాత్రాన ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం కలగాలని రాజ్యాంగంలో ఎక్కడా చెప్పబడలేదు. కారణాలు ఏమైనప్పటికీ మ‌న దేశం ఉదాత్తమైన స‌హ‌కార స‌మాఖ్య వైపు కాకుండా ఏక‌ప‌క్ష విధానాల వైపే ఎక్కువ‌గా మొగ్గు చూపుతున్న‌ట్లు క‌నిపిస్తోంది.

ఫెడ‌ర‌ల్ వ్య‌వ‌స్థ‌పై ప్ర‌స్తుత ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ గుజ‌రాత్ ముఖ్య‌మంత్రిగా ఉండ‌గా తనదైన శైలిలో ఒక పథకం ప్ర‌కారం దాడికి పూనుకున్నారు. భారతదేశానికి కావలసింది నిర్బంధ స‌మాఖ్య కాదు స‌హ‌కార స‌మాఖ్య అనేది అప్ప‌ట్లో ఆయ‌న త‌న నినాదంగా మ‌లుచుకున్నారు. ఆయ‌న ప్ర‌ధాన మంత్రి అయిన త‌ర‌వాత త‌న వైఖ‌రిని మార్చుకున్నారు. అంటే, ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ గుజ‌రాత్ ముఖ్య‌మంత్రిగా ఉండ‌గా ఫెడ‌ర‌ల్ వ్య‌వ‌స్థ‌పై అనుస‌రించిన విధానం ఇప్పుడు ప్రస్తుతం ఆయన అనుస‌రిస్తున్న‌ విధానం భిన్నంగా ఉన్నాయి. ప్ర‌స్తుత వైఖ‌రి ఆందోళ‌న‌క‌ర‌మైన ప‌రిణామం. ఇది మారాలి.  

తెలంగాణ సీఎం కేసీఆర్ అనేక సంద‌ర్భాల‌లో అనే వేదిక‌ల‌పై స‌హకార సమాఖ్య ఈ దేశానికి అవ‌స‌ర‌మ‌ని ఎలుగెత్తి చాటారు. కో ఆప‌రేటివ్ ఫెడ‌ర‌లిజ‌మ్‌ ప్రణాలికాబద్దంగా ప‌రిణామం చెందాల్సిన అవ‌స‌రాన్ని ప్ర‌స్తుత దేశ ప‌రిస్థితులు చాటిచెబుతున్నాయి. వివిధ సంద‌ర్భాల‌లో సహకార సమాఖ్యకు విరుద్ధంగా రుజువైన నిష్క్రియాశీల‌మైన ఒర‌వ‌డిని రూపుమాపాల్సి ఉంది.

స‌హకార సమాఖ్య నినాదం ఈనాటిది కాదు. భారతదేశంలో దీనికి చారిత్రాత్మ‌క‌మైన పునాదులున్నాయి. రాజ్యాలు మ‌నుగ‌డ‌లో ఉన్న కాలంలో దేశం స‌మాఖ్య విధానాల‌ను క‌చ్చితంగా అనుస‌రించింది. ఆ స‌మ‌యంలో స్థానిక పాలనా వ్యవహారాలలో జోక్యం చేసుకునే పద్ధతిలో రాజ్యాధికారం చలాయించేవారు కాదు. బ్రిటీష్ ప్ర‌భుత్వం సైతం ఈస్ట్ ఇండియా వ్య‌వ‌హారాల‌ను నియంత్రించేదే త‌ప్ప‌, దాని అధికారాల్లో ఎన్న‌డూ జోక్యం చేసుకోలేదు. భార‌త ప్ర‌భుత్వ చ‌ట్టం 1919 కూడా ద్వంద్వ ప్ర‌భుత్వానికే మొగ్గుచూపింది. జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ సైతం రాష్ట్రాల‌తో సంప్ర‌దింపులు, స‌హ‌కారం అనే నీతిని పాటించారు. స‌హ‌కార స‌మాఖ్య అనే లక్ష్యంతోనే స్వాతంత్ర్యానంతరం అప్ప‌టి ప్ర‌భుత్వం భార‌త యూనియ‌న్‌ను ఏర్పాటు చేసింది. ఇప్పుడేం జ‌రుగుతోంది?

రాష్ట్రాల‌కు సంబంధించిన కీల‌క‌మైన వ్య‌వ‌హారాల‌లో కేంద్ర ప్ర‌భుత్వం విపరీతంగా జోక్యం చేసుకుంటూనే ఉంది. కేంద్రం కేవ‌లం విదేశీ వ్య‌వ‌హారాలు, ర‌క్ష‌ణ‌, జాతీయ ర‌హ‌దారుల నిర్వ‌హ‌ణ వంటి అంశాల‌కే ప‌రిమితం కావాలి. అలాగే దేశ భ‌ద్ర‌త‌పైనే కేంద్రం దృష్టి కేంద్రీక‌రించాలి. విద్య‌, వైద్యం, గ్రామీణ అభివృద్ధి, స్థానిక సంస్థ‌లు, త‌దిత‌ర అంశాల బాధ్య‌త‌ల‌ను రాష్ట్రాల‌కే విడిచిపెట్టాలి. మరి అలా జరగడం లేదే?

రాజీవ్ గాంధీ హ‌యాం నుంచి ప్ర‌స్తుత ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర‌మోడీ వ‌ర‌కూ స్థానిక సంస్థ‌ల‌కు నిధుల‌ను నేరుగా బ‌దిలీ చేస్తూ, రాష్ట్రాల‌ను న‌మ్మ‌కుండా వ్య‌వహ‌రిస్తూ వస్తున్నాయి కేంద్ర ప్రభుత్వాలు. ఇది సహకార సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమైన చర్య అంటూ ఇటీవ‌ల నిర్వ‌హించిన ఓ స‌మీక్ష స‌మావేశంలో సీఎం కేసీఆర్ తీవ్రంగా విమ‌ర్శించారు. ఇది రాష్ట్రాల‌ను అవ‌మానించ‌డ‌మేన‌న్నారు. జ‌వ‌హ‌ర్ రోజ్‌గార్ యోజ‌న‌, పీఎమ్ గ్రామ్ స‌డ‌క్ యోజ‌న‌, ఎన్ఆర్ఇజిఎ (ఉపాధి హామీ) వంటి ప‌థ‌కాల‌కు ఢిల్లీ నుంచి నేరుగా స్థానిక సంస్థ‌ల‌కు నిధుల‌ను బ‌ద‌లాయించ‌డం రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు పక్కన పెట్టడమే అని అన్నారు. వాస్తవానికి కేంద్రం కంటే రాష్ట్రాల‌కే స్థానిక స‌మ‌స్య‌లపై అవ‌గాహ‌న అధికంగా ఉంటుంది. దేశంలో పలు రాష్ట్రాలలో గ్రామీణ‌, ప‌ట్ట‌ణ సంస్థ‌లు ఇప్ప‌టికీ క‌రెంటు స‌ర‌ఫ‌రా వంటి స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటున్నాయి. ప్ర‌జ‌లు ఇంకా అంధ‌కారంలోనే ఉండాల్సి వ‌స్తోంది. మంచి నీటి స‌ర‌ఫ‌రా కోసం, సాగునీటి అవ‌స‌రాల కోసం ప్ర‌జ‌లు ఇంకా రోడ్లు ఎక్కాల్సి వ‌స్తోంది. విద్య‌, ఉద్యోగ రంగాల్లో అంచ‌నాకు అనుగుణంగా ఇప్ప‌టివ‌ర‌కూ అభివృద్ధిని సాధించ‌లేక‌పోయాం. కేంద్రం ఇలాంటి కీల‌క‌మైన అంశాల‌పై దృష్టి పెట్ట‌కుండా రాష్ట్రాల వ్య‌వ‌హారాల్లో త‌ల దూరుస్తుండ‌డం ఆహ్వానించ‌ద‌గ్గ ప‌రిణామం కాదు.

ఈ నేప‌థ్యంలోనే తెలంగాణ సీఎం కేసీఆర్ తాను ఒక ప్ర‌త్యామ్నాయ జాతీయ ప్ర‌ణాళిక‌తో ప్రజల ముందుకొస్తాన‌ని ప్ర‌క‌టించారు. దేశవ్యాప్తంగా భావసారూప్యం క‌లిగిన రాజ‌కీయ శ‌క్తుల‌ను ఏకం చేయ‌డానికీ, దేశాన్ని అభివృద్ధి బాట ప‌ట్టించ‌డానికీ వీలుగా ఈ అజెండా ఉంటుంద‌నేది ఆయ‌న ప్ర‌క‌ట‌న సారాంశం. రాజ‌కీయ పార్టీల‌తో చ‌ర్చ‌ల అనంత‌రం అజెండాను రూపక‌ల్ప‌న చేసే అవ‌కాశ‌ముంది. ఇందులో ఆర్థికవేత్త‌లు, సామాజిక శాస్త్రవేత్త‌లు, రైతులు, ప్ర‌జ‌లు, ఇలా అన్ని రంగాల వారి స‌హ‌కార‌మూ తీసుకుంటారు. తెలంగాణ రాష్ట్రం నుంచే ఈ మార్పు ప్రారంభ‌మ‌వుతుంద‌న‌డంలో ఎటువంటి సందేహ‌మూలేదు. వాస్త‌వ‌మైన‌ స‌హ‌కార స‌మాఖ్య విధానం గురించి కేసీఆర్ ఎప్పటినుండో ప్ర‌య‌త్నాలను ప్రారంభించారు. స్థానిక అవ‌స‌రాలు, ఆకాంక్ష‌లు, రిజర్వేషన్లు వంటి రంగాల‌లో విధాన‌ప‌ర‌మైన నిర్ణ‌యాలు రాష్ట్రాల ప‌రిధిలోనే ఉండేలా అజెండా ఉంటుంద‌నేది నిస్సందేహం.

తెలంగాణ బాట‌లోనే దేశం, ఇతర రాష్ట్రాలు కూడా కొత్త విధానాల‌ను అనుస‌రించాల్సింద‌నేది కేసీఆర్ అభిప్రాయం. ప్ర‌పంచ‌వ్యాప్తంగా అనుస‌రిస్తున్న ఉత్త‌మ విధానాల‌పై అధ్య‌య‌నం చేసి, భార‌త ప‌రిస్థితుల‌కు అనుగుణంగా వాటిని మ‌లుచుకోవాల‌ని కేసీఆర్ సూచిస్తున్నారు. దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను అంచ‌నా వేసి, ఒక విధాన‌ప‌ర‌మైన వ్య‌వ‌స్థ‌ను రూప‌క‌ల్ప‌న చేయడానికి వీలుగా భార‌త్ ఎక్క‌డ వెనుక‌బ‌డి వుందో తెలుసుకోవ‌డం త‌క్ష‌ణ క‌ర్త‌వ్య‌మ‌ని కేసీఆర్ అంటున్నారు. వీట‌న్నింటిని దృష్టిలో ఉంచుకునే దేశానికి ప్ర‌త్యామ్నాయ అభివృద్ధి వ్య‌వ‌స్థ లేదా ప్ర‌త్యామ్నాయ ప్ర‌ణాళిక‌ను రూపొందించుకోవాల్సి ఉంద‌ని కేసీఆర్ దృఢంగా అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఈ సంద‌ర్భంలోనే వివిధ రాష్ట్రాల అవ‌స‌రాలు, స‌మాజంలోని వివిధ వ‌ర్గాల‌ అవసరాలను ప‌రిగ‌ణ‌న‌లోనికి తీసుకోవాల‌ని అంటున్నారు.

రాజ్యాంగాన్ని వ్య‌వ‌స్థ‌కు అనుగుణంగా మార్చాల్సిన అవ‌స‌రం కూడా ఉంది. రిజ‌ర్వేష‌న్లు వంటి అంశాలపై రాష్ట్రాల‌కే నిర్ణ‌యాధికారం ఉండాలి. రాష్ట్ర ప్ర‌జ‌ల అవ‌స‌రాలు స్థానిక ప్ర‌భుత్వాల‌కే బాగా తెలుస్తాయి క‌న‌క ఈ అధికారం వాటికే ఉండాల‌నేది కేసీఆర్ ఆకాంక్ష‌. రాష్ట్రం అంటే ఏమిటి, సహకార స‌మాఖ్య ప్ర‌భుత్వం అంటే ఏమిటి అనే అంశాన్ని పున‌ర్నిర్వ‌చించాల్సిన స‌మ‌యం కూడా ఇదేన‌ని అంటున్నారు తెలంగాణ ముఖ్య‌మంత్రి. రాష్ట్రాల‌ను బ‌లోపేతం చేయ‌డం, ఎక్కువ అధికారాల‌ను ఇవ్వ‌డం తప్ప‌నిస‌రి అంటున్నారు. కేంద్రం నుంచి ఎక్కువ అధికారాలు రాష్ట్రాల‌కు బ‌దిలీ కావాల‌నేది ఆయ‌న నిశ్చిత అభిప్రాయం. స‌హ‌కార స‌మాఖ్య అంటే అస‌లైన ఉద్దేశం లేదా ల‌క్ష్యం ఇదే. ఈ మేర‌కు రాజ్యాంగంలో మార్పులు చేయాలి. కేంద్ర రాష్ట్ర సంబంధాల‌లో అనేక సంస్క‌ర‌ణ‌లు చేయాల‌ని నిపుణులు ప్ర‌తిపాదించిన‌ప్ప‌టికీ, వాటిని కేంద్ర ప్ర‌భుత్వాలు ఉద్దేశ‌పూర్వ‌కంగా ప‌క్క‌న‌పెట్టి, ఫెడ‌ర‌ల్ స్ఫూర్తికి విఘాతం క‌లిగించాయి.

తెలంగాణ ప్ర‌భుత్వం అభివృద్ధిలో అనేక ల‌క్ష్యాల‌ను చేరింది. సంక్షేమ‌, మౌలిక వ‌స‌తులు, వంటి రంగాల‌లో ఇది స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. వినూత్నమైన తెలంగాణ రాష్ట్ర ప‌థ‌కాలు, సృజ‌నాత్మ‌క కార్య‌క్ర‌మాలు కేంద్రానికీ, ఇత‌ర రాష్ట్రాల‌కు ఆద‌ర్శంగా నిలిచాయి. ఇవే అన్నిచోట్లా వివిధ రూపాల‌లో ప్ర‌తిబింబిస్తున్నాయి. తెలంగాణలో అమ‌లవుతున్న రైతుల‌కు ఎక‌రానికి ప‌దివేల రూపాయ‌ల సాగు పెట్టుబ‌డి ప‌థ‌కం, రైతు బంధును జాతీయ స్థాయిలో చేప‌ట్టి 40కోట్ల మంది రైతుల‌కు ప్ర‌యోజ‌నం చేకూర్చవచ్చు. రైతు బీమా, ద‌ళిత బంధును కూడా దేశ‌వ్యాప్తంగా అమ‌లుచేయ‌వ‌చ్చు.

రాష్ట్రాల అవ‌స‌రాల‌కు అనుగుణంగా ప‌థ‌కాల‌ను రూపొందించాల్సిన అవ‌స‌రం ఉంది. సామాజిక‌, న్యాయ‌, రాజ్యాంగ‌, ప‌రిపాల‌న రంగాల‌లో నిర్మాణాత్మ‌క‌మైన మార్పుల‌ను తేవాల్సిన ఆవ‌శ్య‌క‌త ఉంది. ఆర్థిక రంగాన్ని బ‌లోపేతం చేయ‌డం ద్వారా ఇలాంటి కార్య‌క్ర‌మాల‌ను చేప‌ట్ట‌వ‌చ్చు. మూలుగుతున్న న‌ల్ల ధ‌నాన్ని వెలికితేవ‌డానికి మార్గాల‌ను అన్వేషించాలి. ప‌న్నుల విధానంలో మ‌రిన్ని ప్రోత్సాహ‌కాలుండాలి. ప్ర‌క‌టిత ఆదాయాన్ని ప్ర‌భుత్వ రంగ సంస్థ‌లు లేదా మౌలిక వ‌స‌తుల రంగాల‌లో పెట్టుబ‌డి పెట్టేలా ఒక సుల‌భ‌సాధ్య‌మైన వ్య‌వ‌స్థ ఉండాలి. దీనివ‌ల్ల ప్ర‌భుత్వ రంగాల‌కు పెట్టుబ‌డులు వెల్లువ‌లా వ‌చ్చే అవ‌కాశ‌ముంటుంది. ఈ ర‌క‌మైన చ‌ర్య జిడిపి స్థాయిని పెంచి, ఆర్థిక వ్య‌వ‌స్థ బ‌లోపేతానికి తోడ్ప‌డుతుంది.

పార్ల‌మెంటు, రాష్ట్ర అసెంబ్లీల ప్రాధాన్య‌త ఇందులో నిస్సందేహంగా కీల‌క‌పాత్ర వ‌హిస్తాయి. ఈ దారిలో ఎదుర‌య్యే ఆటంకాలను స‌మ‌ర్థంగా ఎదుర్కొనాలి. న్యాయ‌, త‌దిత‌ర రంగాల‌లో సంస్క‌ర‌ణ‌ల‌కు నాంది పలకాలి. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో మ‌నం అనుస‌రిస్తున్న ‘అంతా బాగుంది’ అనే విధాన‌మే దేశాన్ని స‌మ‌స్య‌ల కూపంలోకి నెట్టేస్తోంద‌నే వాస్త‌వాన్ని గుర్తించాలి. ఎన్నికైన ప్ర‌భుత్వ‌మే దేశానికి కీల‌కం. దాన్ని ఎన్నుకునే వ్య‌క్తులకూ, దేశాన్ని ఏలే వారికి మ‌ధ్య వ్య‌త్యాసం వుండకూడదు. కేంద్ర ప్ర‌భుత్వాలు తీసుకునే నిర్ణ‌యాలు ఎంత‌వ‌ర‌కు స‌బ‌బు అనేది చ‌ర్చ‌నీయాంశం.

అనేక సంద‌ర్భాల‌లో తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న‌ సమర్థతను, నాయకత్వ పటిమను, ఉద్యమ శైలిని అనేకవిధాలుగా రుజువు చేసుకున్నారు. రాజ‌కీయంలో తేడాను చూపించారు. అతీతంగా ఆలోచించి, ల‌క్ష్యాల‌ను సాధించి, ఏ నాయ‌కుడు సాధించ‌న‌న్ని విజ‌యాల‌ను తన సొంతం చేసుకున్నారు. ప్ర‌జా నాయ‌కుడిగా కేసీఆర్ త‌న తెగువ‌ను ప్ర‌ద‌ర్శించారు. స‌మ‌ర్థుడైన ప‌రిపాల‌కునిగా ప్ర‌తిభ‌ను క‌న‌బ‌రిచారు. జాతీయ స్థాయిలో త‌న ఆలోచ‌న‌ల‌ను ఇటీవ‌లి కాలంలో కేసీఆర్ వెల్ల‌డిస్తున్నారు. స‌మాఖ్య స్ఫూర్తి, స‌హ‌కార స‌మాఖ్య వంటి అంశాల‌లోనూ, కేంద్ర‌, రాష్ట్రాల సంబంధాలు వంటి అంశాలు ఇందులో ఉన్నాయి. ఆయ‌న ప్ర‌స్తుతం చేస్తున్న ప్ర‌త్యామ్నాయ ప్ర‌ణాళిక దేశంలో స‌హ‌కార స‌మాఖ్య‌ను క‌చ్చితంగా బ‌లోపేతం చేస్తుందన‌డంలో సందేహం లేదు. అదే ప్ర‌స్తుత త‌రుణంలో కీల‌కం. భావసారూప్యం క‌లిగిన రాజ‌కీయ పార్టీలు కేసీఆర్ ఆలోచ‌న‌లను స‌మ‌ర్థించాల్సిన స‌మ‌య‌మిదే. భ‌విష్య‌త్తుకు బాట‌లు వేసేది ప్ర‌త్యామ్నాయ జాతీయ ప్ర‌ణాళిక‌ అనేది నిస్సందేహం.

ఈ నేపధ్యంలో బహుశా దేశవ్యాప్తంగా పెరుగుతున్న ఒత్తిడి కారణంగా దేశంలో సహకార సమాఖ్యను బలోపేతం చేసేందుకు అంతర్ రాష్ట్ర మండలిని పునర్వ్యవస్తీకరిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం గమనార్హం. ప్రధాని చైర్మన్ గా వ్యవహరించే ఈ మండలిలో దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ఆరుగురు కేంద్ర మంత్రులు సభ్యులుగాను, మరో పదిమంది శాశ్వత ఆహ్వానితులుగాను కేంద్ర ప్రభుత్వం పేర్కొన్నది. ఇదెలా పనిచేస్తుందో కాలమే నిర్ణయిస్తుంది.

 

Saturday, May 28, 2022

పన్నెండవ రోజు యుద్ధం, ధర్మరాజుకు దూరంగా సంశప్తకులతో తలపడిన అర్జునుడు : ఆస్వాదన-73 : వనం జ్వాలా నరసింహారావు

 పన్నెండవ రోజు యుద్ధం, ధర్మరాజుకు దూరంగా సంశప్తకులతో తలపడిన అర్జునుడు

ఆస్వాదన-73

          వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక ఆదివారం సంచిక (29-05-2022)    

మహాభారత యుద్ధం పన్నెండవ రోజున, అంటే, ద్రోణాచార్యుడి రెండవనాటి యుద్ధం పూర్వరంగంలో ధర్మరాజును బంధించే విషయాన్ని దుర్యోధనుడు మరోమారు ప్రస్తావించినప్పుడు, అర్జునుడు లేని చోట తనను చూసి ధర్మజుడు పారిపోకుండా వుంటే, అతడిని తప్పక పట్టుకుంటానని ద్రోణుడు హామీ ఇచ్చాడు. ఒకవేళ అతడు పారిపోతే మరీమంచిదన్నాడు. ఇది విన్న సుశర్మ, అతడి తమ్ములు సత్యవ్రతుడు, సత్యకర్ముడు, సత్యవర్ముడు మొదలుగాగల త్రిగర్తాధిపతులంతా ఆర్జునుడిని యుద్ధం నుండి తొలగించుకొని దూరంగా తీసుకు పోవడానికి సిద్ధమయ్యారు. వారికి కేరళ, మాళవ, శిలీంద్ర, మగధ, మచ్చిల్లికాది దేశాదిపతులు తోడ్పడుతామన్నారు. తామంతా ఆర్జునుడిని హతమారుస్తామని శపథం చేశారు. ఆ విధంగా ప్రతిజ్ఞ చేసి సంశప్తకులు యుద్ధానికి బయల్దేరి వెళ్లిపోయారు.

ఇక ద్రోణాచార్యుడు ఇక్కడ యుద్ధరంగంలో ఆనాడు గరుడవ్యూహం ఏర్పాటుచేశాడు. అందులో ముక్కుగా తాను; దుర్యోధనుడు, అతడి తమ్ములు తలగా; కృప, కృతవర్మలు కన్నులుగా; సింహళులు, ఆభీర, సుదక్షిణ, విందానువిందులు ఎడమ రెక్కగా; శకుని, పౌండ్ర, కళింగ, అంబష్ట, మాగధులు వెన్నుగా; కర్ణుడు తోకగా; సైంధవుడు ఇతరులు అక్కడక్కడా నిలబడ్డారు. ఆ వ్యూహంలో నడిమి భాగాన భగదత్తుడు ఏనుగునెక్కి నిలిచాడు. మరోవైపు త్రిగర్తాధిపతి సుశర్మ మొదలైన సంశప్తకులు తమతో యుద్ధానికి రమ్మని అర్జునుడిని ఆహ్వానించారు. అర్జునుడు అన్నగారైన ధర్మరాజు అనుమతి, సలహా అడిగాడు. ఇద్దరి పరస్పర అంగీకారంతో సత్యజిత్తును ధర్మరాజుకు రక్షణగా, ద్రోణుడిని అడ్డుకోవడానికి నియమించి అర్జునుడు ధర్మరాజుకు దూరంగా వెళ్లాడు. సత్యజిత్తు మరణిస్తే, ధర్మరాజు యుద్ధరంగం నుండి తొలగిపోవాలని నిర్ణయం జరిగింది.  

కౌరవుల గరుడ వ్యూహానికి దీటుగా ధృష్టద్యుమ్నుడిని అర్ధమండలాకార వ్యూహం నిర్మించమని ధర్మరాజు చెప్పగా అతడు అలాగే చేశాడు. ఆ విధంగా ఉభయుల వ్యూహాలూ సమర్థవంతంగా యుద్ధానికి సన్నద్ధమయ్యాయి. ధర్మరాజు ఆదేశం మేరకు ధృష్టద్యుమ్నుడు ద్రోణాచార్యుడిని ఎదుర్కున్నాడు. ఇక దూరంగా అర్జునుడు సంశప్తకులమీదికి యుద్ధానికి దిగాడు. అందరినీ అమితంగా బాధించాడు. దూరం నుండే పదిహేను వేలమంది రథికులను కూల్చివేశాడు. సుబాహుడు, సుశర్మ, సురథుడు, సుధన్వుడు అర్జునుడిని ఎదుర్కొన్నారు. అర్జునుడు సుబాహుడి తల నరికాడు. మరో రెండు వేల రథాలను అర్జునుడు నశింపచేయగానే శత్రుసేన భయపడి, తొలగిపోయి దుర్యోధనుడి సేనలో చేరింది. బెదిరిన సైనికులకు సుశర్మ ధైర్యాన్ని నూరిపోయగా అర్జునుడితో యుద్ధం చేయడానికి వెనక్కు మళ్లారు.

సంశప్తకులకు తోడుగా నారాయణ గోపాల సైనికులు కలిసి యుద్ధానికి పూనుకున్నారు. వారంతా కృష్ణార్జునుల మీద బహువిధాలైన అస్త్రాలను ప్రయోగించారు. అర్జునుడు విశ్వకర్మ ఇచ్చిన మహాస్త్రాన్ని ప్రయోగించాడు. దాని మహిమకు సైనికులు ఒకరినొకరు సంహరించుకున్నారు. చనిపోగా మిగిలినవారు పారిపోకుండా ఎదురు తిరగ్గా అర్జునుడు అందరినీ చీల్చి చెండాడాడు. సంశప్తకులందరూ ఒక్క పెట్టున అర్జునుడి రథం మీద పడ్డారు. సింహనాదాలు చేశారు. అప్పుడు అర్జునుడు వాయువ్యాస్త్రాన్ని ప్రయోగించగా సంశప్తకులు తూలిపడ్డారు. ఇలా కృష్ణార్జునులు దూరంగా యుద్ధం చేస్తుండగా మరో దిక్కున ధర్మరాజు ప్రోత్సాహంతో పాండవ సేనలు కౌరవ సైన్యాన్ని తరిమాయి.

ద్రోణాచార్యుడు విజృంభించడంతో కౌరవ పాండవ సైనికులు పరస్పరం భీకరమైన  పోరుసల్పారు. ఇరువైపులా వినాశనానికి గురయ్యారు సైనికులు. అప్పుడు ద్రోణాచార్యుడు సింహనాదం చేసి ధర్మరాజు వున్న దిక్కుగా వెళ్లాడు. ధర్మరాజు ద్రోణాచార్యుడిమీద బాణాలను ప్రయోగించాడు. వాళ్లిద్దరూ యుద్ధం చేయడం చూసిన సత్యజిత్తు, ద్రోణాచార్యుడిని తీవ్రంగా ఎదిరించి బాణాలు వేశాడు. వృకుడనే పాంచాల రాకుమారుడు సత్యజిత్తుకు సాయంగా వచ్చాడు. అయినా విజృంభించిన ద్రోణుడు వారిద్దరినీ ఎదిరించి, చివరకు సత్యజిత్తును సంహరించాడు. ద్రోణాచార్యుడి బాహుబలానికి ఉలిక్కిపడ్డ ధర్మరాజు గుర్రాలను తోలుకొని పారిపోయాడు అక్కడి నుండి.

ధర్మారాజు వెంటబడ్డ ద్రోణాచార్యుడిని విరాటరాజు తమ్ముడైన సూర్యదత్తుడు అడ్డగించాడు. కాని ద్రోణుడి బాణాలకు సూర్యదత్తుడు నేలకూలి చనిపోయాడు. ద్రోణాచార్యుడు విజృంభించాడు. ధర్మరాజును పట్టుకోవడానికి ఉత్సాహంతో తరుముతున్న ద్రోణాచార్యుడిని ఎదుర్కొని యుధామన్యుడు, ఉత్తమౌజుడు, వసుదానుడు, శిఖండి, సాత్యకి, క్షత్రధర్ముడు యుద్ధం చేస్తుంటే ధర్మరాజు కూడా వెనక్కు మళ్లి ధృష్టద్యుమ్నుడిని, చేకితానుడిని ముందుంచుకుని బాణాలు వేశాడు. అయినప్పటికీ వెనక్కు తగ్గని ద్రోణుడు వసుదానుడిని నేలమీద కూల్చి, క్షేముడిని చంపి, మిగిలినవారిని బాణాలతో బాధించి ముందుకు రావడం చూసిన ధర్మరాజు ఉపాయంగా యుద్ధభూమి నుండి తొలగిపోయాడు. ద్రోణాచార్యుడిని దృఢసేనుడు తాకగా అతడిని చంపాడు ద్రోణుడు. ఆ తరువాత సుమిత్రుడిని కూడా చంపాడు. అలా అలా విజృంభిస్తున్న ద్రోణాచార్యుడిని ఎదుర్కోవడానికి పాండవ సేనలో ఆ సమయంలో ఎవరూ ముందుకు రాలేకపోయారు.

అప్పుడు ధర్మరాజు, భీముడు, నకులుడు, సహదేవుడు, ద్రుపదుడు, విరాటుడు, సాత్యకి మొదలైన వీర సమూహాలు ద్రోణుడి మీద దూకారు. వెంటనే దుర్యోధనుడు భీముడిని ఎదుర్కోగా ఇతర కౌరవ వీరులు ఒక్కొక్క పాండవ వీరుడిని ఎదుర్కొన్నారు. అలా అలా భయంకరమైన యుద్ధం జరుగుతుండగా మధ్యాహ్నం అయింది. భీముడి మీదికి దుర్యోధనుడు ఏనుగుల గుంపును తోలాడు. వంగదేశపు రాజు పంపిన ఏనుగును, అతడిని చంపాడు భీముడు. భగదత్తుడు సుప్రతీకం అనే ఏనుగును భీముడి మీదికి తోలాడు. ఆ ఏనుగు పాండవ సైన్యాన్ని చిందరవందర చేసింది. భీముడు దాన్ని భయంకరంగా ఎదుర్కొన్నాడు. అయినా దాని విజృంభణకు భీమసేనాదుల సైన్యం బాధపడి పారిపోవడం జరిగింది. భగదత్తుడు ఆ సమయంలో పాండవ సైన్యాన్ని తరమసాగాడు.

ఇది గమనించి భగదత్తుడి వైపుగా రథాన్ని మళ్లించమని అర్జునుడు శ్రీకృష్ణుడికి చెప్పాడు. ఆయనలా చేయగానే సంశప్తకులు అడ్డు తగిలి యుద్ధానికి కవ్వించారు. వెంటనే విజృంభించి వారిమీదికి యుద్ధానికి పోయిన అర్జునుడు గాండీవాన్ని ధరించి, దివ్యాస్త్రాలను ప్రయోగించి, ఆ వీరరథికులను చాలామందిని చంపాడు. ఆ తరువాత వెంటనే రథాన్ని పాండవులు యుద్ధం చేసే దిక్కుగా మళ్లించాడు కృష్ణుడు. సంశప్తకుల మీద భీభత్సాన్ని సృష్టించి వెళ్తున్న ఆర్జునుడిని సుశర్మ, అతడి సోదర వర్గం మళ్లీ యుద్ధానికి పిలిచింది. వెంటనే రథాన్ని మరల్చి అర్జునుడు యుద్ధానికి దిగాడు. సుశర్మ వింటి దబ్బను, పతాకాలను విరిచి, అతడిని మూర్ఛపోగొట్టి, అతడి సోదరులను చంపి, భగదత్తుడి సుప్రతీక గజం విజృంభిస్తున్న వైపు వెళ్లి, ఆ ఏనుగుకు అడ్డం తిరిగాడు అర్జునుడు.

భగదత్తుడికి, అర్జునుడికి భీకరమైన పోరు జరిగింది. ఒక పక్క సుప్రతీక గజం పాండవ సైన్యాన్ని ముప్పుతిప్పలు పెట్టింది. ఒకటి, రెండు పర్యాయాలు భగదత్తుడి బాణాల నుండి అర్జునుడిని కాపాడాడు శ్రీకృష్ణుడు. భగదత్తుడు అభిమంత్రించి ప్రయోగించిన  అంకుశాన్ని శ్రీకృష్ణుడు అర్జునుడికి అడ్డంగా తన దేహాన్ని నిలిపి దాన్ని ధరించాడు తన వక్షస్థలం మీద. ఎందుకలా చేశావని అర్జునుడు అడుగగా, తండ్రి నరకాసురుడి దగ్గర నుండి పొందిన భగదత్తుడి వైష్ణవాస్త్రం తనకు తప్ప ఇతరులకు సహించరానిదని, అందుకే దాన్ని అడ్డుకోవాల్సి వచ్చిందని చెప్పాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ప్రోద్బలంతో అర్జునుడు గాండీవాన్ని ఎక్కుపెట్టి తన శక్తి కొలది వేయడంతో, సుప్రతీక గజం నేలకు ఒరిగిపోవడం, భగదత్తుడి కంఠం తెగిపోవడం ఏక కాలంలో జరిగిపోయాయి.  

ఆ తరువాత ఎదురు తిరిగిన శకుని సోదరులిద్దరినీ ఒకే బాణంతో చంపాడు. అప్పుడు శకుని మాయా యుద్ధం చేశాడు కాసేపు. కాని అర్జునుడి ధాటికి ఆగలేక పారిపోయాడు. పాండవులు అప్పుడు ద్రోణుడిని చుట్టుముట్టమని అంటూ విజృంభించారు.

అప్పుడు మళ్లీ సంశప్తకులు, నారాయణ గోపాల సేనలతో సహా కలిసి వచ్చి ఆర్జునుడిని యుద్ధానికి రమ్మన్నారు. ఆయన పోగానే, ఆ అవకాశం చూసుకొని కౌరవ సేనలు, పాండవ సేనలను తరమసాగాయి. భీముడు పాండవ సేనలను గద్దించాడు ధైర్యంగా వుండమని. భీముడి మీద దుర్యోధనుడు, ద్రోణుడు, కర్ణుడు, అశ్వత్థామ ఒకేసారి బాణ వర్షాన్ని కురిపించారు. ఇంతలో ధర్మరాజు ప్రోత్సహించగా నకుల సహదేవులు, సాత్యకి, అభిమన్యుడు భీముడికి సాయంగా వచ్చారు. అప్పుడు ధృష్టద్యుమ్నుడు ద్రోణుడిని ఎదుర్కోవడంతో ఆయన దివ్యబాణాలను ప్రయోగించాడు. కాసేపట్లో భీముడి దగ్గరికి అర్జునుడు తోడుగా వచ్చాడు. పాండవులు తరుముతుంటే కౌరవ యోధులు నిశ్చేష్టులయ్యారు.

ఇంతలో కర్ణుడు ఆర్జునుడిని ఎదిరించాడు. కర్ణార్జునుల యుద్ధం సాగింది. అర్జునుడి మీద ఆగ్నేయాస్త్రం ప్రయోగించగా, అతడు వాయువ్యాస్త్రం వేసి దాన్ని శాంతింప చేశాడు. భీముడు, సాత్యకి, ధృష్టద్యుమ్నుడు అర్జునుడితో కలిశారు. అర్జునుడు కర్ణుడి తమ్ముల శిరస్సులను మూడింటిని ఖండించాడు. భీముడు రథం దిగి వచ్చి కర్ణుడి బంధువులను బాధించాడు. భీముడు, సాత్యకి, ధృష్టద్యుమ్నుడు ముగ్గురూ కలిసి కర్ణుడి సారథిని కూల్చి, అతడి ధనుస్సును ఖండించారు. దుర్యోధనాదులు కర్ణుడిని ఆదుకున్నారు. ద్రోణుడు, అర్జునుడు కూడా విజృంభించి యుద్ధం చేయడం వల్ల, యుద్ధరంగం రౌద్ర, బీభత్స నాట్యరంగం లాగా ఘోరంగా కనిపించింది.

ఇంతలో సూర్తుడు అస్తమించాడు. ద్రోణుడు సేనలను మరల్చడానికి ఆజ్ఞాపించాడు. పాండవ సైన్యాలు కూడా వెనక్కు మరలాయి. ఇలా ఉభయ సేనలు తమ తమ శిబిరాలకు చేరే సమయంలో కౌరవ వర్గంవారు, ద్రోణుడి ప్రతిజ్ఞ తీరకపోవడం గురించి, అర్జునుడి శౌర్యం ప్రకాశించడం గురించి చర్చించుకున్నారు.   

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, ద్రోణపర్వం, ప్రథమాశ్వాసం

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)

 

Sunday, May 22, 2022

Strengthening Cooperative Federalism......KCR’s Alternative National Agenda : Vanam Jwala Narasimha Rao

 Strengthening Cooperative Federalism

KCR’s Alternative National Agenda

Vanam Jwala Narasimha Rao

The Hans India (23-05-2022)

Telangana Chief Minister K Chandrashekhar Rao who is on a visit to Delhi and neighboring states to firm up his proposal for an alternative agenda for the country after meeting couple of like-minded political leaders and others hinted at a ‘sensation in National Politics’ soon. KCR also emphasized the need for center consulting states whenever it comes up with new policies in the spirit of cooperative federalism.

Indian Constitution creates a central government which can move either on the federal or on the unitary plane, according to the needs of the situation. Over a period, because of diverse political features in our country it looks like we are moving towards extra emphasis on strong unitary features instead of moving towards liberal cooperative federalism.

Prime Minister Narendra Modi while he was Gujarat CM made a strong case against systematic onslaught on the federal structure that was causing concern. His slogan then was Co-operative and not coercive federalism. After he became Prime Minister there appears a U-turn in this approach. Many a times CM KCR’s statements in different platforms advocated a strong cooperative federalism in the country. And hence, the present Indian scenario demands for a fresh look at the conceptual evolution of cooperative federalism in India and be done away with its inoperative nature in several contexts.

Cooperative Federalism has historical roots. During the days of kingdoms in India we practiced federal policies with non-intervention in local affairs. Even the British Government was only regulating the work of East India Company but did not intervene in its powers. The Government of India Act 1919 also provided for a federal India called the dyarchy. Jawaharlal Nehru philosophy was “cooperation and consultation with the states”. The Princely states joining Indian Union was with the spirit of cooperative federalism.

But what has been happening now in India is, Central Government continues to keep under its purview key subjects of importance to states. Centre needs to take care of just foreign affairs, defense and maintenance of national highways. It should focus its attention on issues relating to national security. Subjects like education, health, rural development, local bodies etc. should be completely transferred to States.

Telangana CM KCR in a recent review meeting said that it is a cheap practice that the union governments from Rajiv Gandhi era to the present Prime Minister are transferring funds to the villages directly without trusting the state governments. It is not a supportive practice of transferring funds under Jawahar Rojgar yojana, PM Gram Sadak yojana, Employment scheme (NREGA) etc. to the local bodies directly from Delhi. The states are better informed about the local issues. Many villages and urban bodies are still struggling with lack of power supply and people are living in dark. People are taking to the streets for drinking water and irrigation water needs, The expected growth in education and employment has not been registered. The union government is not concentrating on such important issues and instead involving in the state affairs is not a welcome.


Against this background KCR announced that he would be soon coming up with an alternative agenda for unification of like-minded political forces to put the nation on the path of development. The agenda may perhaps would be chalked out after consultations with political parties, economists, social scientists, farmers and people from all walks of life. No doubt that the change will start from Telangana State. KCR has already begun his efforts for a truly cooperative federalism in the country where the State governments would be empowered to take policy decisions based on local needs, aspirations and demography.

This apart, Chief Minister of Telangana K Chandrashekhar Rao says that on the lines of Telangana, India too needs to be reinvented and reoriented to make it Great. Towards this the best practices across the globe are to be collected and studied making them applicable to Indian situation. Leveraging country’s economy and drafting a policy framework to understand where the country is lagging behind is the need of the hour according to him. Keeping this in view CM KCR opines that, it is absolutely necessary to prepare a national growth agenda or an alternate agenda for the country, taking in to account the requirements of different states and various strata of the society.

There is also need for structural changes in the polity. Subjects like reservations shall be with states only as they know better the requirement of people of their state. It’s also time now to redefine as to what is a state and what is exactly a federal government. States should be made more powerful and need to be empowered. More and more powers are to be transferred from center to states. This is what the true spirit of cooperative federalism. To this effect changes are required in the Constitution.

Several reforms suggested by experts in Centre-State Relations, have been ignored and the federal sprit has been given the go-by. The Telangana State has reached several milestones in development, welfare, infrastructure and other such sectors. The Telangana State schemes, innovative programs have become a role model for the Centre and other States which can be replicated allover. For example, the investment support scheme or the Rythu Bandhu of Rs 10000 per acre could be taken-up at the national level benefiting the 40 crores farmers. The Rythu Bhima and Dalit Bandhu may be replicated all over the country.

There is a need to formulate schemes based on the needs of the states. Structural changes in social, judiciary, Legislature and administration areas are required. All these will have to be brought about by leveraging the economy better. We need to find out a way to convert the enormous amount of black money into white money. Tax policy must have better incentives and there must be an enabling mechanism wherein the declared money could be invested in public sectors or in infrastructure development. There is a need to bring such a policy where they will liberally invest. This will boost the GDP level and the economy.

Parliament and State Legislatures supremacy as the case may be must be unequivocal. The stumbling blocks that come in the way of this from any corner must be countered and we should not shy away from necessary judicial and other reforms. All is not well with the so-called checks and balances and they landed the country in problems. Any day the maker of the country is the elected government and the individuals at the helm of the affairs make a difference. Elected Government is final. To what extent the government’s decisions are to be subjected to scrutiny is debatable and certainly not every aspect.

On more than one occasion, Telangana State Chief Minister K Chandrashekhar Rao has proved himself that he is one who can make a difference in politics in India and who can think out of the box to achieve goals that seldom any leader ever attempted.

Having proved his mettle as a people’s leader and an able administrator par excellence, KCR, in the recent past has been airing his thoughts on the national level issues especially the federal spirit and cooperative federalism of our country as well as the Centre-State relations. And his proposal for Alternative Agenda certainly strengthens cooperative federalism in the country which is the dire need now. It is also time that all likeminded political parties support his idea of alternative national agenda for a better tomorrow.