Wednesday, April 29, 2020

యాగాల ఫలమా శ్రీరామావతారం? ..... వనం జ్వాలా నరసింహారావు


యాగాల ఫలమా శ్రీరామావతారం?
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రప్రభ చింతన కాలమ్ (30-04-2020) 
ముని కుమారుడిని చంపినందువలనే  తనకు సంతాన ప్రాప్తి కలగడం లేదని దశరథుడు చింతించాడు. బాల్యంలో జరిగిన ఆ సంఘటనను, చాలాకాలం మరిచిపోతాడు దశరథుడు. జ్ఞప్తికి వచ్చిన వెంటనే, పాప పరిహారార్థం, అశ్వమేధ యాగం చేయాలన్న ఆలోచన చేస్తాడు. అనిష్ఠ పరిహారం కొరకు అశ్వమేధ యాగం చేయడంతో పాటు, ఇష్ట ప్రాప్తికొరకు పుత్ర కామేష్ఠి యాగం కూడా చేద్దామనుకుంటాడు. పుత్ర కామేష్ఠికి పూర్వ రంగంగా అశ్వమేధ యాగం చేయాలని దశరథుడి కోరిక. సంతాన ప్రాప్తికి ఉద్దేశించిన అశ్వమేధ యాగానికి ఋత్విజుడిగా వ్యవహరించాల్సిందిగా, ఋశ్యశృంగుడిని ప్రార్తించాడు దశరథుడు.

దశరథుడి కోరికను మన్నించిన ఋశ్యశృంగుడు, క్రతువుకు కావాల్సిన సామాగ్రిని సమకూర్చుకోమని, యజ్ఞాశ్వాన్ని వదలమని చెప్పగా, ఋత్విజులను, పండితులను, బ్రహ్మ వాదులను పిలిపించమని దశరథుడు మంత్రి సుమంత్రుడిని ఆదేశిస్తాడు. రాజాజ్ఞ మేరకు, సుమంత్రుడు, బ్రాహ్మణోత్తములను పిల్చుకుని వస్తాడు. వచ్చిన వారందరినీ సగౌరవంగా స్వాగతించి, సంతానం కలిగేందుకు అశ్వమేధ యాగం చేయ తలపెట్టానని అంటాడు దశరథుడు.

దశరథుడి మాటలు విన్నవారందరూ సంతోషంతో, ఆయన తలపెట్టిన కార్యం మంచిదని అంటారు. వారిలో ముఖ్యులైన వశిష్ఠుడు, ఋశ్యశృంగుడు, రాజు ఆలోచన గొప్పదని, ఫలితం తప్పక లభిస్తుందని, ఆలశ్యం చేయకుండా కార్యక్రమం ఆరంభించమని సలహా ఇస్తారు. బ్రాహ్మణులు చెప్పిన పనులన్నీ తక్షణమే చేయాలని, వస్తువులన్నీ సమకూర్చాలని, గురువులు చెప్పినట్లు యజ్ఞాశ్వాన్ని విడవమని, దానికి రక్షణగా పురోహితుడొకడిని పంపమని, సరయూ నదికి ఉత్తర దిశగా యజ్ఞశాల నిర్మించమని, శాంతి కార్యాలన్నీ చక్కగా నిర్వహించమని మంత్రులను ఆదేశిస్తాడు దశరథుడు. రాజు తలపెట్టిన కార్యం విఘ్నం కాదని, తమకప్పగించిన పనులన్నీ నిర్విఘ్నంగా కొనసాగేటట్లు చూస్తామని మంత్రులు హామీ ఇచ్చిన తదుపరి బ్రాహ్మణులు శలవు తీసుకుని వెళ్లారప్పటికి.

మొదటి సంవత్సరం చైత్ర పౌర్ణమి నాడు సాంగ్రహణేష్టిని జరిపించి, మర్నాడు, శాస్త్రోక్తంగా బ్రహ్మౌదనం, మేధ్యాశ్వబంధనం, స్నాపనం, ప్రోక్షణం, అశ్వ విమోచనం మొదలైన ’చత్వారస్సముక్షంతి’ అనే కార్యాలను నెరవేర్చి, ఆ తర్వాత ప్రతిరోజూ శ్రుత్యుక్తంగా సావిత్రాది కర్మాలను చేస్తుండాలి. ఆవిధంగా మొదటి సంవత్సరం గడచిన తర్వాత, రెండో సంవత్సరం ఆరంభంలో అశ్వం యాగ స్థానానికి బయల్దేరాలి.

అశ్వాన్ని విడిచిన తర్వాత ఒక సంవత్సరకాలం పూర్తయి, తిరిగి వసంత రుతువు చైత్ర మాసం రాగానే దశరథుడు వశిష్ఠుడి దగ్గరకు వచ్చి అశ్వం తిరిగొచ్చిందని తెలియచేస్తాడు. వశిష్ఠుడు చెప్పిన ప్రకారం తాను యజ్ఞం ప్రారంభిస్తానని, యాగానికి విఘ్నం లేకుండా ఆయన కాపాడాలనీ విజ్ఞప్తిచేస్తాడు. రాజుకోరినవిధంగానే సర్వం తానే నిర్వహిస్తానని ఆయనకు మాట ఇచ్చి, యజ్ఞ కార్యాలను పర్యవేక్షిందేకు నియమించిన వృద్ధ బ్రాహ్మణులను, నియమవంతులైన ధర్మాత్ములను, స్థపతిసంఘాలను, శిల్పవిద్యాప్రవీణులను, గుంతలు తవ్వేవారిని, ఇతరత్రా పనులు చేసేవారిని, వడ్రంగులను, చిత్రకారులను పిలిచి, ఎవరెవరికి అప్ప చెప్పాల్సిన పనులను వారివారికి అప్పగించి, ఇతర ఏర్పాట్లలో నిమగ్నమయ్యాడు వశిష్ఠుడు.

"యాగ నిర్వహణకు వేలాది ఇటుకలు కావాలి కనుక వాటిని యాగశాల సమీపానికి తేవాలి. ఉత్తమ బ్రాహ్మణులు, ఋత్విక్కులు బసచేసేందుకు, వారికవసరమైన భక్ష్యభోజ్యపానీయాలు నిలవచేసేందుకు, విశాలమైన, ఎత్తైన రాజగృహాలు, అనువైన ఇతర రకాల భవనాలు నిర్మించాలి. అదేవిధంగా ఋత్విక్కులకు సహాయపడేందుకు వస్తున్న బ్రాహ్మణుల విడిదికొరకు, వారికి భక్ష్యాన్నపానీయాలు వినియోగించేందుకు అనువైన ఇళ్ళుకూడా నిర్మించాలి. యాగాన్ని చూసేందుకొచ్చే పౌరులకు దృఢమైన ఇళ్ళు కట్టించి, ప్రతి ఇంటిలో కావాల్సిన పదార్థాలన్నీ మళ్ళీ-మళ్ళీ అడగకుండా ఏర్పాటుచేయాలి”.

"వీరూ-వారూ అనే తేడాలేకుండా, అన్నిజాతులవారినీ, అన్నితరగతులవారినీ, వారివారియోగ్యమైన రీతిలో సత్కరిస్తూ, వారిని తృప్తిపరచాలి. కామంతో కానీ, కోపంతో కానీ ఎవరినీ అవమానించరాదు. యజ్ఞ కార్యాలలో తిరిగేపనివాళ్ళను, శిల్పులను, ఇతరులను అందరి లాగే గౌరవించాలి. వారెవరూ కూటికీ, నీళ్ళకూ ఇబ్బందిపడకూడదు. చేయాల్సినపని చిన్నదైనా, పెద్దదైనా వదలకుండా పూర్తిచేయాలి. చేసే ప్రతి పనినీ స్నేహంతో, ప్రీతితో చేయాలి. ఇదేదో వెట్టికి చేస్తున్నామన్న రీతిలో చేయొద్దు." అని వశిష్ఠుడు పనులు చేసేందుకు నియమించిన వారితో అనగా, వారందరూ "మునీంద్రా! మీరు చెప్పిన పనులన్నీ చేసాం. ఏలోపమూలేదు" అని జవాబిచ్చారు.


వశిష్ఠుడు సుమంత్రుడితో ఆయన స్వయంగా చేయాల్సిన పనులను, ఇతరులతో చేయించాల్సిన పనులనూ వివరిస్తాడు. "సుమంత్రా! నీకు అందరిగురించీ, వారి అవసరాల గురించీ క్షుణ్ణంగా తెలుసు. ఎవరిని ఏవిధంగా పిలవాల్నో, ఎలా ఆదారించాల్నో తెలిసినవాడివి నువ్వు. నువ్వు నీ అనుభవం ఆదారంగా, దేశంలోని ధర్మాత్ములైన, శిష్టులైన బ్రాహ్మణులను, రాజులను, వైశ్యులను, శూద్రులను, నానా వర్ణాల ప్రజా బాహుళ్యాన్ని యజ్ఞం చూసేందుకు రమ్మని శ్రద్ధగా, త్వరగా పిలిపించు." అని ఆదేశిస్తాడు వశిష్ఠుడు.

ఆయన చెప్పినట్లే పిలిచేందుకు, పిలిపించేందుకు సన్నద్ధమయ్యాడు సుమంత్రుడు. ఇలా వశిష్ఠుడు పనివారందరినీ హెచ్చరిస్తుండగానే, నానా దేశాల రాజులు అయోధ్యా నగరానికి చేరుకున్నారు. అంతవరకు పూర్తి అయిన పనులను, యాగానికి సిద్ధంగా వున్న స్థలాలను, పరిశీలించేందుకు రమ్మని వశిష్ఠుడు, ఋశ్యశృంగుడు అనగానే దశరథుడు మంచి ముహూర్తంలో బయలుదేరి, యజ్ఞశాలకు వెళ్తాడు. వెంటనే బ్రాహ్మణులందరు ఋశ్యశృంగుడుని ముందుంచుకుని, సరయూనది ఉత్తర తీరంలో యజ్ఞకర్మను ఆరంభిస్తారు.   
                                                  
సంవత్సరాంతంలో యజ్ఞాశ్వం తిరిగి రావడంతో, యాగం ఆరంభించడానికి సన్నాహాలు మొదలయ్యాయి. యజ్ఞాశ్వం మరలివచ్చేటప్పుడు చేయాల్సిన కార్యక్రమాలు శాస్త్రంలో చెప్పినట్లే చేయాలి. మొదటి సంవత్సరం గుర్రాన్ని స్వేచ్ఛగా తిరిగేందుకు విడిచిన తర్వాత, అది విహరించేందుకు, దాని సంరక్షణార్థం వీరులు దానివెంబడే పంపాలి. గుర్రాన్ని వారు మరలించకూడదు. అది తిరుగుతూ, తిరుగుతూనే తుదకు తనకుతానుగా గృహానికి మరలిరావాలి.

వచ్చిన వెంటనే, బ్రహ్మ, అధ్వర్యుడు, హోత, ఉద్గాత అనిపిలువబడే నలుగురు ఋత్విక్కులు దానిని రథకారుడి ఇంటిలో బంధించి, దానినాలుగుపాదాలపై మంత్రాలుచెప్తూ హోమం చేస్తారు. అశ్వ విసర్జన సంవత్సరంలో పదకొండు నెలలు గడచిన తర్వాత దానిని, అక్కడనుండి తరలించి, సదస్సు వద్దకు తెచ్చి, మళ్ళీ అక్కడ అశ్వత్థప్రజంలో బంధిస్తారు. పన్నెండో నెల యజ్ఞానికి కావాల్సిన సామానులను తెచ్చుకొని, కడపటి ఫాల్గుణ అమావాస్య నాడు ఋత్విక్కులతో యజ్ఞశాలలో ప్రవేశించి, రెండవ సంవత్సరం మొదటిరోజు పాడ్యమినుండి మొదలుపెట్టి అశ్వమేధయాగం ప్రారంభిస్తారు. అది మొదలు ఏడు రోజులు శాస్త్రోక్తంగా ఇరవై ఒక్క హోమాలు జరుపుతారు. సోమ ప్రయోగంలో భాగంగా, ఇంద్రుడు దేవతగా గల అయిదు హవిస్సులను (దానం, కరంభం, పరివాపం, పురోడాశం, నయస్య) ప్రాతస్సవనమున ఇంద్రుడిగూర్చి హోమం చేయాలి. మాద్యందినసవనమున, సాయంసవనమున నయస్య తప్ప ఇతర హోమాలను చేయాలి. ఈ విధమైన కార్యక్రమాలను ఋషి పుత్రుడైన ఋశ్యశృంగుడు, ఇతర బ్రాహ్మణులు కొరత రానీకుండా నిర్వహించారు.

ఔపవసత్థ్యదినాన అశ్వాలంభమనే కార్యాన్ని జరిపించేందుకు యూపస్తంభ (యజ్ఞ పశువును కట్టివేయాల్సిన స్తంభం) స్థాపన జరగాలి. యూపస్తంభాలు నాటే సమయం రాగానే, మారేడువి ఆరు, చండ్రవి ఆరు, మోదుగువి ఆరు నాటారు మొదలు. అగ్నిని వుంచే తిన్నె (వేది) సమీపంలో ఒక ’విరిగి కట్టె’ స్తంభాన్ని నాటారు. దానికి ఇరు పక్కల ఒక్కో ’దేవదార’ స్తంభాన్ని నాటారు. మొత్తం ఇరవై ఒక్క స్తంభాలను నాటి వస్త్రాలతో వాటిని అలంకరించారు. చందనం పూసి, వస్త్రాభరణాలతో అలంకరించిన ఆ యూపస్తంభాలు ఆకాశంలో సప్తర్షులలాగా ప్రకాశించాయి.

శాస్త్రంలో చెప్పిన విధంగానే, అందులో సూచించిన కొలతలుగల ఇటుక రాళ్లను తెచ్చి "శుల్బ" మనే పనిలో నైపుణ్యమున్న బ్రాహ్మణులు అగ్నినుంచే తిన్నె (వేది) ను కట్టారు. అది గరుడి ఆకారంలో, బంగారు రెక్కలతో, మూడంతలుగా, పద్దెనిమిది ప్రస్తారాలుగా, ప్రకాశించింది. ఆ తర్వాత శాస్త్రోక్తంగా దైవ ధ్యానం చేసుకుంటూ, మూడువందల పక్షులను, పశువులను, జలజంతువులను కట్టారు. అటు పిమ్మట, కౌసల్య అశ్వానికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి, మూడు బంగారు సూదులతో గాట్లుచేసింది అశ్వానికి. ఒక రాత్రంతా గుర్రం సమీపంలో పడుకుంది ధర్మంగా. తర్వాత దశరథుడు బ్రహ్మకు, హోతకు, అధ్వర్యునకు, ఉద్గాతకు, మహిషిని, వావాతను, పాలాకలిని, పరివృత్తిని, దానంగా ఇచ్చాడు. ఋత్విజుడప్పుడు "వపను" మంత్రోక్తంగా అగ్నిలో హోమం చేయడంతో, దశరథుడు, శాస్త్రోక్తంగా తగిన సమయంలో దాని వాసన చూసాడు.

పదహారు మంది బ్రాహ్మణులు అశ్వానికి చెందిన ఒక్కొక్క అంగాన్ని తీసుకొని, మంత్రోక్తంగా అగ్నిలో వేసి హోమం చేసారు. ఇతర యజ్ఞాలలో హవిస్సును "రావి" సమిధలతో పాకం చేయగా, అశ్వమేధంలో "ప్రబ్బలి" సమిధలతో పాకం చేయాలి కనుక అలానే చేసారు. బ్రాహ్మణములలో అశ్వమేధం మూడురోజులు చేయాలని చెప్పారు. మొదటిరోజు చతుష్టోమం, రెండవ రోజున ముక్త్యం, మూడోనాడు అతిరాత్రం అనే కార్యాలను చేయాలని చెప్పబడింది. అలానే చేసిన ఋత్విక్కులు అదనంగా ఇతర శాస్త్రోక్త కార్యాలైన జ్యోతిష్టోమం, ఆయురధ్వరం, అతిరాత్రం, అభిజిత్తు, విశ్వజిత్తు, నప్తోరామ్యం కూడా జరిపించారు.

ఈవిధంగా యజ్ఞం పూర్తవగానే, హోతకు తూర్పుదిక్కునవున్న రాజ్యాన్ని, అధ్వర్యునకు పశ్చిమదిక్కునవున్న రాజ్యాన్ని, బ్రహ్మకు దక్షిణ రాజ్యాన్ని, ఉద్గాతకు ఉత్తరదిక్కునవున్న రాజ్యాన్ని, ఇక్ష్వాకు కులవర్ధనుడైన దశరథుడు దానంగా ఇచ్చాడు. రాజ్యానికి మారుగా గోవులను, రత్నాలను, కొంత బంగారాన్ని ఇస్తే చాలని కోరుతారు బ్రాహ్మణులు. దశరథుడు, వారుకోరినవిధంగానే, ఋత్విజులకు ఇచ్చాడు.

సంతాన లాభం అనుగ్రహించమని వేడుకొనిన దశరథుడితో ఋశ్యశృంగుడు, ఆయన కోరిన విధంగానే నలుగురు కొడుకులు ఆయనకు కలుగనున్నారనీ, కొడుకులు పుట్టేందుకు అధర్వణమంత్రాలతో యాగాన్ని చేయిస్తానంటాడు. దశరథుడు సంతోషించి యజ్ఞానికి పూనుకుంటాడు. అదే పుత్రకామేష్టి యాగం.

దశరథుడి పుత్రకామేష్ఠి యాగం నిర్విఘ్నంగా కొనసాగుతుండగా, అగ్నిహోత్రం మధ్యనుండి ప్రాజాపత్య మూర్తి దర్శనమిస్తాడు. బయట కొచ్చిన ప్రాజాపత్య మూర్తి దశరథుడితో ఆయన్ను చూడటానికి వచ్చానని అంటాడు. దశరథుడిని ధన్యుడిని చేసేదయిన పాయసాన్ని తెచ్చానంటాడు. ఆ పాయసాన్ని తనకిష్ఠమైన భార్యలకు-తనకు గల గుణచేష్టాకీర్తులలో తగినవారని తోచిన వారికి, ఇమ్మని చెప్తాడాయన. దివ్య పాయసాన్నంతో నిండినదైన బంగారు పాత్రను దశరథుడు తీసుకొని, తన భార్యలుండే చోటికి పోయి పట్టపు దేవైన కౌసల్యతో సంతోషంతో జరిగిన విషయాన్నంతా చెపుతాడు.

ప్రాజాపత్య పురుషుడిచ్చింది భగవత్తేజః పూరితమైన పాయసాన్నం. తాను తెచ్చిన పాయసం సగం మొదలే కౌసల్యకిచ్చాడు. ఆమె దాన్ని తాగింది. మిగిలిన సగంలో సగం (పాతిక భాగం) రెండో భార్యైన సుమిత్రకు ఇచ్చాడు. మిగిలిన పాతిక భాగాన్ని రెండు భాగాలు చేసి, ఒకభాగం కైకకు, మరో భాగం తిరిగి సుమిత్రకు ఇచ్చాడు.

పాయసాన్ని రాజపత్నులు సమ్మతితో స్వీకరించారు. కౌసల్య పాయసాన్ని తొలుత తాగిన కారణం వల్ల ఆమె కొడుకు తొలుత (శ్రీరాముడు) జన్మించి జ్యేష్ఠడయ్యాడు. సుమిత్ర తాగకుండా మొదలు ఊరుకుంది. తనకు న్యాయంగా భాగమొచ్చిందనుకున్న కైకేయి కూడా వెంటనే తాగడంతో, ఆమె కొడుకు రెండవవాడుగా (భరతుడు) పుట్టాడు. పాతిక-పరక వేర్వేరుగా ఆఖరున తాగిన సుమిత్రకు కవలలు (లక్ష్మణ-శత్రుఘ్నులు) చివరలో జన్మించారు. 
(వాసుదాసు ఆంధ్రవాల్మీకి రామాయణం మందరం ఆధారంగా)

Life after Lockdown : Vanam Jwala Narasimha Rao


Life after Lockdown
Vanam Jwala Narasimha Rao
The Pioneer, Hyderabad (30-04-2020)

Life after lockdown in our country, like elsewhere in the world, will no longer be the same. The moot question is: will the new diktats survive post lockdown?  

Social distancing is something, which is alien to Indian acceptance, tradition, culture, way of life, customs, beliefs and day-to-day activities. Can anyone ever imagine people following social distancing at Kumbh Mela or Pushkaras that come every 12 years to every major river in the country? How about following social distancing at bazaars, at marriages, temples, religious congregations, political rallies, protests, places of worships, at birth and death ceremonies, during the festivals, at agriculture operations, at malls, cinema halls, hostels, colleges, universities, even at small family gatherings?

Not a day goes without people gathering. It could be a small social get-together of four to five men or even women in the evenings over a drink or over a chit-chat or over playing cards. No day goes to womenfolk particularly in rural areas and also in urban, without a meeting of couple of like-minded individuals over a chanting of some goddess related prayer like the Vishnu or Lalita Sahasra Namam. Can social distancing be imposed on the newly married couple, or the boy and girl in passionate romance? The list is not exhaustive. There are innumerable places and occasions where social distancing is just not possible in this country even if it is mandated by Laws.

It is a different matter that Covid-19 has shaken the world and shattered its customs and mores. But for reasons best known to the powers that be, medical professionals, virologists, epidemic and pandemic experts all over the globe, in the annals of the present-day dispensation of mankind history, a tiny virus named corona seemed to have shaken the world as never before. On one hand, there is a claim that no one could ever identify cause of this virus nor be able to find a vaccine as on date, on the other the fear of the unknown virus had literally locked down the like never before.

Whatever it may be, for us in the Indian sub-Continent, leading a solitary life in confinement is the biggest punishment. We have our laws from time immemorial sentencing hard-core criminal to solitary life imprisonment. For the past several weeks we are experiencing one without committing anything remotely as crime. This of course is something like a necessary evil, an evil that someone believes must be done or accepted because it is necessary to achieve a better outcome, especially because possible alternative courses of action or inaction are expected to be worse. 

Let us for a minute, presume, that the precautionary measures that we are taking now will be a permanent feature and become can’t but (When we have to believe that something must be true and that there is no possibility of anything else being the case) mandatory post-lockdown. From this point of view let us presume our daily life. Our daily morning prayer will have to be necessarily be done in isolation. The Teertha and prasad that we take after the poojas may have to be sanitized. While offering the Teertha and Prasadam the head of family may have to maintain a respectable social distance.


God only knows as to how many of us really go to office to work, as many of us will be working from home. School and college going children may well be accustomed to the online classes and examinations. The homemaker may have to do without any maid with the help of other family members. As for workingwomen, most of them may find options to work from home. In all these settings, social distancing will continue.

If at all a need arises for a shopping for say groceries or vegetables (Anyway all kind of shopping will be made available only through online and very few over the counter) or when it becomes a must to go out for any emergency, everyone has to wear a mask, gloves, a bottle of sanitizer and an apron if you can afford in addition to carrying his mobile and spectacles from the house. The errands that one would go for the local markets will not be the same as before. If anyone has to travel by a bus or an aircraft or a rail, it may be necessary to wear a specialised travel suit duly sanitized. One may no longer have the pleasure of hugging his or her kids or grand kids. In other words, friction between the skin and skin becomes a sin and a crime.

Having family get together, going for a film in a theatre or in a multiplex, going for shopping, visiting a Pub, Club, playing cards with friends and relatives, sitting in the company of those who love, will all become a part of the history text book or at the most nostalgic experiences to be cherished in our wildest dreams. There will not be any News Television Live discussions and everything will be through skype, the most effective communication tool for free chats. No newspapers and only online editions. There may be piped milk and gas supply, who knows?

Like most people of the present generation who are not aware of a village life and say a bullock-cart riding, buttermilk chilling, cow dung making etc. the immediate past life preceding lockdown will become a strange phenomenon.  We even, after sometime, wonder whether we ever lived the life that we did prior to lockdown. We wonder whether human being everywhere had the pleasure in the company of their friends. It would be next to impossible for the next generation to even think what socializing or intimate relationship means.

How future generations would evolve with social distancing is another debatable topic. Social anthropologists, historians, researchers and behavioural scientists in future would come out with tonnes of research papers on how once a civilization lived in this sub-continent without any social distancing. They would wonder how millions of people for millions of years lived without any masks, social distancing, sanitizers, basic hygiene and never bothered to worry about the viruses and bacteria. They also wonder how human being despite the fact that they carried thousands of bacteria and viruses in their body, never ever scared of the pandemics and epidemics, till Corona arrived in the twenty-first century.

In other words, post lock down, our day-to-day lives will not be the same as we lived pre lockdown. Like a prisoner undergoing a solitary life confinement forever, we have to lead our lives. Or else either we are doomed or a new research finds that Corona pandemic had nothing to do with the social non-distancing.

Perhaps Karl Marx may become more and more relevant in that, with social distancing  as the predominant guidepost, there will be no discrimination between haves and have-nots, rich and poor, upper or lower caste, believers and non-believers, neta in position and neta in opposition, between a Prime Minister and an ordinary common man and so on. All are equal before social distancing and all have to necessarily follow the rules of the game. (With VJM Divakar)    

Tuesday, April 28, 2020

పరిమాణాత్మక సడలింపుతో ఆర్థికప్రగతి : వనం జ్వాలా నరసింహారావు


పరిమాణాత్మక సడలింపుతో ఆర్థికప్రగతి
వనం జ్వాలా నరసింహారావు
మన తెలంగాణ దినపత్రిక (29-04-2020)
తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు ఏప్రిల్ 11న ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో క్వాంటిటేటివ్ ఈజింగ్ (పరిమాణాత్మక సడలింపు) గురించి, హెలికాష్టర్ నగదు గురించి చెప్పారు. అప్పటి నుంచి ఈ రెండు పదాల గురించి చాలా చర్చ జరుగుతుంది. ఇప్పుడు నిరక్షరాస్యులు కూడా వీటి గురించి మాట్లాడుతు న్నారు. ముఖ్యమంత్రి కెఆర్ చాలా స్పష్టంగా తన మాటలు చెప్పారు. “ప్రస్తుతం మనం క్లిష్టపరిస్టితుల్లోఉన్నాం. ఈ పరిస్థితుల నుంచి బయటపడే పరిష్కారం గురించి మనం ఆలోచించాలి. ఈ సంక్షోభం నుంచి దేశం బయటపడడానికి ఒకే ఒక్క మార్గం పరిమాణాత్మక సడలింపు” అని ముఖ్యమంత్రి చెప్పారు.

పరిమాణాత్మక సడలింపు అనేది సాంప్రదాయేతర ద్రవ్యవిధానం. ఈ విధానంలో ఆర్జిక వ్యవస్థలోకి సరికొత్త ద్రవ్యసరఫరా బయటి నుంచి జరుగుతుంది కాబట్టి, ఈ నగదు ఆకాశం నుంచి అనుకోని సహాయంగా లభిస్తుంది కాబట్టి దీన్ని హెలికాఫ్టర్ మనీ అంటారు. (రాజకీయాల్లో బయటి వాడిని తీసుకొచ్చి ఒక నియోజకవర్గంలో నిలబడితే, పారాచూట్ అభ్యర్థి అనడం మనకు తెలిసిందే కదా? ఇది కూడా అలాంటిదే అనుకోవచ్చు. అర్జిక వ్యవస్థలోకి బయటి నుంచి డబ్బును సరఫరా చేయడం. దీన్ని హెలీకాప్టర్ మనీ అంటారు). సాధారణంగా కేంద్ర రిజర్వు బ్యాంకులు ఈ పని చేస్తుంటాయి. ఆర్థిక వ్యవస్థ తీవ్రమైన సంక్షోభానికి, సంకటానికి గురైనప్పుడు మరలా గాటన పెట్టడానికి ఈ పద్ధతి పాటించడం జరుగుతుంది.

ఆ రోజు కేబినేట్ సమావేశం తర్వాత కెసిఆర్ ప్రధాని మోడీకి ఒక లేఖరాశారు. ఆ లేఖలో తన అభిప్రాయాలను స్పష్టంగా చెప్పారు. “ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో కేద్ర బ్యాంకులు సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఆర్జిక సంక్షోభాన్ని నివారించడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ ఆర్థిక సంక్షోభం 1929 సంక్షోభం కన్నా, 2008 నాటి మాంద్యం కన్నా చాలా తీవ్రమైనది. ఇలాంటి క్షిష్టమయాల్లో సాహసోపేత నిర్ణయాలు అవసరం. కోరలు చాస్తున్న ఈ ఆర్ధిక సంక్షోభాన్ని నివారించడానికి ఒకే ఒక్క మార్గం పరిమాణాత్మక సడలింపు మాత్రమే. హెలీకాష్టర్ మనీని సమర్ధవంతంగా ఉపయోగించుకోవాలి. ప్రపంచంలోని ప్రముఖ దేశాల్లో కేంద్ర బ్యాంకులు ఈ పద్ధతినే పాటిస్తున్నాయి. ఫెడరల్ రిజర్వ్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, బ్యాంక్ ఆఫ్ జపాన్, పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా, సెంట్రల్ బ్యాంక్ ఆపహ రష్యా, బ్యాంక్ ఆఫ్ కెనడా, రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఆస్ట్రేలియా తదితర బ్యాంకులు ఈ పద్ధతినే ఆచరణలో పెట్టాయి. ప్రతిపాదిత పరిమాణాత్మక సడలింపు దేశ స్తూల జాతీయోత్పత్తిలో కనీసం 5 శాతం ఉండాలి. 2019-20లో భారత స్థూల జాతీయోత్పత్తి 203.85 లక్షల కోట్ల రూపాయలు. ఇందులో 10 శాతం అంటే 10.15 లక్షల కోట్ల రూపాయలు పరిమాణాత్మక సడలింపు రూపంలో ఇవ్వాలి” అని ముఖ్యమంత్రి వివరించి రాశారు.

పరిమాణాత్మక సడలింపులో మార్కెటు నుంచి పెద్దస్థాయిలో సెక్యురిటీల కొనుగోలు జరుగుతుంది. ఒకదేశానికి చెందిన కేంద్రబ్యాంకు, అంటే మనదేశంలో రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ధారితమొత్తంలో ప్రభుత్వ బాండులు కొనుగోలు చేయడం, ఇతర ఆర్థిక పెట్టుబడులకు ఖర్చుపెడతాయి. ఈ విధంగా ఆర్థిక వ్యవస్థలోకి నగదు ప్రత్యక్షంగా ప్రవేశించేలా చేస్తాయి. ఇది కేంద్ర బ్యాంకులు అసాధారణ' పరిస్థితుల్లో పాటించే ద్రవ్యనీతి. ఇలా కొత్తగా ప్రవేశపెట్టిన నగదుతో ప్రభుత్వ రుణాలను కొనుగోలు చేస్తారు. పరిమాణాత్మక సడలింపు కాలం ముగిసిన తర్వాత ఈ పెట్టబడులను ఉపసంహరిస్తారు. తిరిగి చెల్లించనవసరం లేని రుణాలు మిగిలిపోతాయి.

పరిమాణాత్మక సదలింపు వల్ల ఆర్ధిక వృద్ధికి గొప్ప ప్రోత్సాహం లభిస్తుంది. ఎందుకంటే, ఆర్ధిక వ్యవస్థలోకి ప్రవేశపెట్టిన నగదు ప్రజల చేతుల్లోకి చేరుతుంది. ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది. కౌనుగోళ్ళు పెరగడం వల్ల వినియోగదారులపై. వాణిజ్య వర్గాలపై దాని ప్రభావం పడుతుంది. ద్రవ్యప్రవాహం క్రింది స్థాయివరకు వ్యాపిస్తుంటుంది. ఫలితంగా స్టాక్ మార్కెట్ పనితీరు మెరుగవుతుంది. స్థూలజాతీయోత్పత్తిలో వృద్ధి నమోదవుతుంది. అయితే ఇక్కడ సమస్యేమిటంటే, పరిమాణాత్మక సడలింపు ద్వారా తయారు చేసిన కొత్త డబ్బుతో ఆర్థికవిపణిలో ప్రభుత్వ బాండ్లను కొనడం జరుగుతుంది. అందువల్ల కొత్తగా తయారు చేసిన డబ్బు తిన్నగా ఆర్ధిక విపణిలోకి వెళ్ళిపోతుంది. బాండ్లు, స్టాక్ మార్కెట్ల విలువను ఒకేసారి పెంచేస్తుంది. చరిత్రలో అత్యధిక స్థాయి విలువ బాండ్లకు లభిస్తుంది. పరిమాణాత్మక సడలింపును ముగించడం వల్ల తర్వాత ద్రవ్యసంకోచం (deflation) తలెత్తవచ్చు.


పరిమాణాత్మక సడలింపు లక్ష్యమేమిటంటే, ఆర్థిక కార్యకలాపాలు పెంచడం, ఆర్థిక వ్యవస్థలో నగదును అందజేయడం ద్వారా ఆర్టిక కార్యకలాపాలను పెంచుతారు. పరిమాణాత్మక సడలింపు వల్ల ద్రవ్యోల్బణం పెరగవచ్చు. ఆర్థికవ్యవస్థకు అవసరమైన మొత్తం ఎంత అన్నది నిర్ణయించడంలో పొరబడితే, అవసరం కన్నాఎక్కువ మొత్తం నగదు ఆర్థికవ్యవస్థలో ప్రవేశపెడితే, సెక్యూరిటీల కొనుగోలు ద్వారా పెద్దమొత్తంలో నగదు చేర్చితే ద్రవ్యోల్బణం చోటుచేసుకుంటుంది. అలాగే వ్యాపారాలకు, గృహావసరాలకు బ్యాంకులు రుణాలివ్వకుండా తిరస్కరించడం జరిగితే మార్కెటులో డిమాండ్ అనేది జన్మించదు. పలితంగా పరిమాణాత్మక సడలింపు విఫలమవతుంది.

కేంద్ర బ్యాంకు ద్రవ్య సరఫరా పెంచితే దానివల్ల ద్రవ్యోల్బణం పెరుగుతుంది. పరిస్థితి పూర్తిగా చేయిజారితే, పరిమాణాత్మక సడలింపు వికటించవచ్చు. ఆర్థికవృద్ధి లేకుండా ద్రవ్యోల్బణం పెరిగిపోవచ్చు. దానివల్ల డిమాండ్ మందగిస్తుంది. ద్రవ్య నిశ్చలనం (stagflation) దశ ఏర్పడవచ్చు. అంటే ధరలు పెరగడం, ద్రవ్యోలృణం, డిమాండ్ లేకపోవడం, నిరుద్యోగం పెరిగిపోతాయి. మీడియా, బ్యాంకర్లు, ఆర్థిక విశ్లేషకులు కొందరు పరిమాణాత్మక సడలింపును కరెన్సీ ముద్రణగా పేర్కొంటున్నారు. సాధారణంగా పరిమాణాత్మక సడలింపు ద్వారా ప్రవేశపెట్టే నగదుతో ప్రభుత్వ బాండ్లు కాకుండా ఇతర ఆర్థిక ఆస్తులు కొనడం జరుగుతుంది.

అమెరికాకు చెందిన ఆర్థిక నిపుణుడు, వరల్డ్ మనీ వాచ్ అధ్యక్షుడు కింబర్లే అమాడియో ప్రకారం జపాన్ ప్రపంచంలో మొదటిసారి పరిమాణాత్మక సడలింపును 2001 నుంచి 2006 వరకు ప్రయోగించింది. తర్వాత 2012లో షింజో అబే ప్రధానిగా ఎన్నికైన తర్వాత కూడా పరిమాణాత్మక సడలింపు మళ్ళీ ప్రారంభించారు. అమెరికాలోని ఫెడరల్ రిజర్వు 2008లో అత్యంత జయప్రదంగా పరిమాణాత్మక సడలింపు అమలు చేసింది. దాదాపు 2 ట్రిలియన్ డాలర్లను ద్రవ్య సరఫరాలో చేర్చింది. చరిత్రలో ఆర్థిక ప్రోత్సాహక కార్యకలాపాల్లో ఈ స్థాయిలో జరిగింది మరొకటి లేదు. జనవరి 2015లో యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు పరిమాణాత్మక సడలింపును ఆచరణలో పెట్టింది. గత అనుభవాలను చూస్తే పరిమాణాత్మక సడలింపు వల్ల కొన్ని లక్ష్యాలు సాధించగలిగారు. చాలా లక్ష్యాలు సాధించడం సాధ్యపడలేదు. అలాగే కొన్నిఆర్థిక బుడగలను కూడా ఇది సృష్టించింది. ఆర్థిక వ్యవస్థ నిలదొక్కుకోడానికి ఉపయోగపడింది. ఆర్థిక మాంద్యం నుంచి బయటపడే నిధులు, అవసరమైన ఆత్మవిశ్వాసాన్ని అందజేసింది. వడ్డీ రేట్లు తక్కువస్థాయిలో ఉండేలా చేసింది. దానివల్ల నివాసగ్భహాల మార్కెటు పునరుద్ధరణ సాధ్యపడింది.

         ఆర్థికవృద్ధికి పరిమాణాత్మక సడలింపు తోడ్పడిందన్నది నిజమే కాని అనుకున్న స్థాయిలో కాదు. మరింతగా రుణాలు అందుబాటులోకి వస్తాయనుకున్నారు, కాని అది సాధ్యపడలేదు. దీనివల్ల బ్యాంకులకు డబ్బు దొరికింది. బ్యాంకులు ఆ డబ్బును ఇనప్పెట్టెల్లో దాచుకున్నాయి. ప్రజలకు రుణాలివ్వలేదు. ఈ నిధులను బ్యాంకులు ఉపయోగించుకుని డివిడెండ్లు, స్టాక్ ప్రతి కొనుగోళ్ళ ద్వారా తమ స్టాకుల విలువ పెంచుకోడానికి ప్రయత్నించాయి. అయితే పరిమాణాత్మక సడలింపు వల్ల ద్రవ్యోల్బణం పెరుగుతుందని భయపడిన స్థాయిలో పెరగలేదు. బ్యాంకులు రుణాలిచ్చి ఉన్నట్లయితే వ్యాపారం పుంజుకుని ఉండేది. ఉద్యోగాలు పెరిగేవి.

         పరిమాణాత్మక సడలింపులో భారీస్థాయిలో నగదు మార్కెటులోకి ప్రవేశపెట్టడం జరుగుతుంది. కొత్తగా భారీ సంఖ్యలో ముద్రించిన నోట్లను హెలికాఫ్టర్ మనీ అంటారు. ఆర్ధిక మాంద్యం నుంచి బయట పడడానికి, వడ్డీరేట్లు శూన్యానికి చేరుకున్నప్పుడు పరిస్థితి మార్చడానికి ఈ విధంగా ముద్రించిన సొమ్మును ప్రజల చేతికి అందేలాచేస్తారు. దీన్ని హెలీకాప్టర్ డ్రాప్ అని కూడా అంటారు. విపత్తుల సందర్భంగా ఆకాశం నుంచి నిత్యావసరాలను హెలీకాష్టర్ల ద్వారా జారవిడిచిన మాదిరిగా అని అర్థం చేసుకోవచ్చు. ఇది సంప్రదాయేతర ఆర్థిక విధానం. కూలబడిన ఆర్థిక వ్యవస్థను మళ్ళీ లేపి నిలబెట్టడానికి ఈ విధానాన్ని అవలంబిస్తారు. అమెరికా ఆర్థికవేత్త మిల్దన్ ప్రయిడ్ మ్యాన్ ఈ పదాన్ని మొదట ఉపయోగించాడు. సంక్షోభంలో ఉన్న ఆరిక వ్యవస్థను నిద్ర నుంచి ఒక్క కుదుపు ద్వారా లేపడానికి అనూహ్యంగా భారీ పరిమాణంలో నగదును ప్రవేశపెట్టడమని (ఫైడ్ మ్యాన్నిర్వచించాడు.

ఈ విధానం ప్రకారం కేంద్ర బ్యాంకు ప్రత్యక్షంగా దవ్యసరఫరా పెంచేస్తుంది. ప్రభుత్వం ద్వారా కొత్తగా ముద్రించిన సొమ్మును ప్రజలకు చేరవేస్తుంది. ఆ విధంగా డిమాండ్ పెంచడానికి, ద్రవ్యోల్బణం పెంచడానికి ప్రయత్నిస్తుంది. కేంద్ర బ్యాంకులు కరెన్సీనోట్లను ముద్రించడం వాటితో ప్రభుత్వ సెక్యూరిటీలను కొనడం పరిమాణాత్మక సడలింపులో భాగం. అయితే పరిమాణాత్మక సడలింపులో ప్రభుత్వం ఉపయోగించే డబ్బును హెలీకాష్టర్ మనీగా చాలా మంది భావించడం లేదు. కేంద్ర బ్యాంకులు బాండ్లను కొనుగోలు చేయడం వంటిది కాదిది. ఇలా బాండ్లను కొనడం అంటే బ్యాంకు ఆస్తులను సెంట్రల్ బ్యాంకు రిజర్వుతో మార్చుకోవడం జరుగుతుంది. అలాగే ప్రభుత్వ అప్పుల కోసం సెంట్రల్ బ్యాంకు ప్రత్యక్షంగా పెట్టుబడిపెట్టడం కూడా కాదిది.

మాజీ ఆర్థిక సలహాదారుడు అరవింద్ సుబ్రహ్మణ్యం ప్రకారం వర్థమాన విపణులపై పరిమాణాత్మక నడలింపు ప్రభావం సమతుల్యంగాను, సానుకూలంగాను ఉంటుంది. ఆవిధంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై దీని ప్రభావం ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో వర్థమాన విపణుల్లో అస్తిరత్వానికి కూడా ఇది కారణమైంది. స్థూల ఆర్థిక నిర్వహణను సంక్షిష్టమయ్యేలా చేసింది. ఫలితంగా ఆయా దేశాల్లో ఆర్థిక పరిస్థితి మాత్రమే కాదు ప్రపంచ ఆర్థిక పరిస్థితిపై కూడా ప్రభావం పడింది. అమెరికాలో, ఆర్థిక విధానాలు వాణిజ్యానికి సంబంధించిన హౌస్ కమిటీ ముందు అరవింద్ సుబ్రహ్మణ్యం ఇంతకుముందు ఈ విషయమై వాంగ్మూలం ఇచ్చి ఉన్నాడు.

ఫెడరల్ రిజర్వులకు పరిమాణాత్మక సడలింపు అమలు చేస్తే అంతర్జాతీయంగా పడే ప్రభావం గురించి తన అభిప్రాయాలు చెప్పారు. పరిమాణాత్మక సడలింపు వల్ల ప్రయోజనాలున్నాయి. ఇబ్బందులు కూడా ఉన్నాయి. ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థలో ఏర్పడిన పరిస్థితులుదృష్ట్వా, ముంచుకు రాబోతున్న ఆర్ధిక సంక్షోభం దృష్ట్వా, పరిమాణాత్మక సడలింపు ప్రవేశపెడితే అవసరమైనంత నగదు పంపిణీలోకివస్తుంది. ఫలితంగా ఆర్ధిక కార్యకలాపాలు ఊపందుకుంటాయి. కొనుగోలు శక్తి పెరుగుతుంది. ప్రభుత్వానికి తగినంత ద్రవ్యనిల్వల సదుపాయం లభిస్తుంది. రుణ సామర్థ్యం, వ్యయ సామర్థ్యం రెండు పెరుగుతాయి. దీనివల్ల ఇబ్బందులేమిటంటే, మార్కెటులో పంపిణీ అయిన ద్రవ్యానికి తగిన స్థాయిలో ఉత్పత్తి పెరక్కపోతే, కొనుగోలు శక్తి ఒక్కసారి పడిపోవడమే కాదు, ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది.

ఈ నేపథ్యంలో, కొన్ని ఇబ్బందు లున్నప్పటికీ పరిమాణాత్మక సడలింపు అనేది ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రధాని మోడీకి చేసిన గొప్ప సూచన.

Sunday, April 26, 2020

వాల్మీకి అడిగిన ప్రశ్న లోకోత్తర విషయం .... శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-5 : వనం జ్వాలా నరసింహారావు


వాల్మీకి అడిగిన ప్రశ్న లోకోత్తర విషయం
శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-5
వనం జ్వాలా నరసింహారావు
సూర్య దినపత్రిక (27-04-2020)
తాను ఏ విషయాన్ని బ్రహ్మ దగ్గర తెలుసుకుని వాల్మీకికి ఉపదేశించాలని వచ్చాడో, ఆవిషయాన్ని గురించే వాల్మీకి ప్రశ్నించినందువల్లా, శత కోటి పరిమితమైన రామాయణం తాను బ్రహ్మవల్ల విన్నందువల్లా, తనకు తెలిసిన విషయమే వాల్మీకి అడిగినందువల్లా సులభంగా చెప్పొచ్చునని భావించాడు నారదుడు. రామగుణస్మరణమనే అమృత పానానికి అవకాశం లభించిందని సంతోషపడ్తాడు. అయితే తెలియని విషయాన్ని అడగకుండా తెలిసిన విషయమెందుకు అడిగాడు వాల్మీకి? శ్రీరాముడిని ఆయన ఎరుగును కదా! అయోధ్య సమీపంలోనే, ఆయన రాజ్యంలోనే వాల్మీకి ఆశ్రమం వుంది కదా? శ్రీరాముడిని గురించి వాల్మీకికీ తెలుసు-నారదుడికీ తెలుసు. మరి ప్రశ్న-జవాబు ఎందుకు? వాల్మీకి అడిగిన ప్రశ్న లోకోత్తర విషయానికి సంబంధించింది. అడిగినవాడు, జవాబిచ్చేవాడూ వేదాంతజ్ఞులే. ఇరువురూ సర్వదా భగవత్ చింతన చేసేవారే. అయితే, వాల్మీకి వేసిన ప్రశ్న భగవంతుడి గురించే అయితే, ఆ భగవంతుడు సగుణుడా, నిర్గుణుడా, సాకారుడా, నిరాకారుడా, ద్రవ్యమా, అద్రవ్యమా, ఏకతత్వమా, అనేకతత్వమా అని అడక్క గుణాలగురించే ఎందుకడిగాడు? అనుష్ఠానం ప్రధానంగాని, వాదం కాదు. మామిడిపండు తింటేనే తీపో-పులుపో తెలుస్తుంది. అనుష్ఠాన రూపకమైన భక్తి మార్గమే శ్రేష్ఠం. నారదుడు భక్తుడు. తత్వవిచారంకంటే గుణ విచారమే శ్రేయస్కరమని ఆయన నమ్మకం. వాల్మీకీ ఆ కోవకి చెందినవాడే. అందుకే భగవత్ గుణ వర్ణన వాల్మీకి చేయగానే నారదుడు సంతోషించాడు.

అందంగా-శాస్త్రంలో చెప్పినట్లుగా, పరిమాణంలో ఒకదానికొకటి సరిపోయే అవయవాలు రాముడికి వున్నాయని నారదుడు వాల్మీకికి చెప్పడంలో చాలా అర్థముంది. కనుబొమలు, ముక్కు పుటాలు, కళ్లు, చెవులు, పెదాలు, చను ముక్కులు, మోచేతులు, మణికట్టు, మోకాళ్లు, వృషణాలు, పిరుదులు, చేతులు, కాళ్లు, పిక్కలు, ఎవరికి సమానంగా వుంటాయో వారు భూమిని ఏలుతారని సాముద్రిక శాస్త్రంలో వుంది. జంట-జంటగా వుండే ఈ అవయవాలలో, జంటలోని రెండు, ఒకదానికొకటి సమానంగా వుండడమే కాకుండా ఆకారం సరిగా వుండాలి. ఇవన్నీ రాముడికున్నాయని భావన. కౌసల్య ఆనందాన్ని అభివృద్ధి చేస్తూ, కౌసల్యా నందనుడని శ్రీరామచంద్రుడు పేరు తెచ్చుకున్నాడని నారదుడంటాడు. రాముడు తండ్రి పేరు చెప్పలేనివాడని కానీ, అందుకే తల్లి పేరు చెపుతున్నాడే అనిగానీ భావించరాదు.

దశరథుడు నిష్కారణంగా శ్రీరాముడిని అడవులకు పంపాడు. కౌసల్య నవమీ వ్రతాలు చేసి రాముడిని కనింది. భర్త చనిపోయినప్పటికీ, పుత్ర వాత్సల్యం వల్ల జీవించి, శ్రీరామ పట్టాభిషేకాన్ని చూసిన ధన్యురాలు. అట్టి ధన్యత దశరథుడికి కలగలేదు. పన్నెండు నెలలు శ్రీరామచంద్రుడిని గర్భంలో ధరించింది కౌసల్య. ప్రధమ ముఖ దర్శనం కూడా కౌసల్యదే. పాలు-నీళ్లు పోసి, ముద్దులాడిందీ కౌసల్యే. బాల క్రీడలు చూసి ఆనందించిన ధన్యత కౌసల్యకు కలిగింది. "కౌసల్యా సుప్రజ రామా" అని రాముడిని సంబోధించాడు విశ్వామిత్రుడు. సాక్షాత్తు విష్ణుమూర్తి ముఖ దర్శనం మొదలు కలిగింది కౌసల్యకేగాని దశరథుడికి కాదు. దశరథ పుత్రుడంటే ఏ భార్యకు పుట్టిన ఏ కొడుకో అనుకోవచ్చు. కౌసల్యకు ఒక్కడే కొడుకు. శ్రీరాముడిని తన వెంట యాగ రక్షణకై పంపమని విశ్వామిత్రుడు కోరినప్పుడు, పామరుడివలె అంగీకరించలేదు దశరథుడు. పుత్రుడి శ్రేయస్సు కోరి, కౌసల్య మారు మాట్లాడకుండా అంగీకరించిందే కాని, తన వళ్లో వుంచుకుని ముద్దులాడలేదు. అందుకే "కౌసల్యానంద వర్థనుడు" అని నారదుడు, "కౌసల్యా సుప్రజ రామా" అని విశ్వామిత్రుడు, "లోకచయభర్త శుభమతి యా కోసల తనయ గాంచె" అని సీతాదేవి చెప్పడం గమనించాలి. దశరథుడికంటే కౌసల్యే ప్రశంసనీయమైందని ఆమె పేరు చెప్పబడింది. కుశల భావమే కౌసల్యం.


వాల్మీకి అడిగిన ప్రశ్నల్లో, నారదుడిచ్చిన సమాధానంలో, విశేషణాలన్నీ భగవంతుడికే అన్వయించి చెప్పి, రామాయణాన్ని పెద్ద వేదాంత గ్రంథం చేసారని ఆక్షేపించవచ్చు. ఆ గుణాలన్నీ ఉత్తమపురుషులకు కూడా వుండొచ్చునని అనవచ్చు. శ్రీమద్రామాయణం ధ్వనికావ్యమని అర్థం చేసుకోవాలి. అదో గూఢార్థగుంభితం. వ్యర్థ పదాలు, వ్యర్థ విశేషణాలు అసలే కనపడవు. రామాయణార్థం సరిగ్గా గ్రహించాలంటే అనేక శాస్త్రాల జ్ఞానం వుండాలి. అదిలేనివారికి యదార్థ జ్ఞానం కలగదు. వాస్తవానికి నారదమంటే మేఘమని అర్థం. మేఘం నీళ్లిస్తుంది. నిప్పులు కురిపించదు. నారదుడంటే జ్ఞాన దాత. జ్ఞాన దాత చేయాల్సింది జ్ఞానముపదేశించడమో, మోక్ష విషయం చెప్పడమో అయ్యుండాలి. నారదుడు నారాయణుడి వద్ద భాగవతాన్ని విని, పాంచరాత్ర ఆగమం ఏర్పరిచాడు. అందుకే దాన్ని "నారద పాంచరాత్రం" అంటారు. ఇదే సాత్త్వతశాస్త్రం. వాల్మీకికి ఉపదేశించిదిదే. ఆ ఉపదేశంతో వాల్మీకి శ్రీమద్రామాయణం రచించాడు. ఋషీశ్వరులు సంభాషించుకొనేటప్పుడు లౌకిక ప్రసంగాలు చేయరు. కాబట్టే వాల్మీకి ప్రశ్నించింది అవతార మూర్తి గురించే-నారదుడు జవాబిచ్చిందీ అవతార మూర్తిని గురించే. నారదుడు చెప్పిన సంక్షిప్త రామాయణంలో, రాముడిని అడవులకు పంపినందువల్ల దశరథుడు మరణించడంతో, రాజ్యార్హుడైన జ్యేష్ఠ పుత్రుడు అరణ్యాలలో వున్నందున, రాజ్యం అరాజకం కాకుండా వుండాలని తలచిన వశిష్ఠుడు-ఇతర పెద్దలు, రాజ్యభారం వహించాలని భరతుడిని ప్రార్థించినా ఆయనొప్పుకోలేదని వుంది. సూర్య వంశపు రాజులకు పురోహితుడు వశిష్ఠుడు. ఆయన దశరథుడి అభిప్రాయం ప్రకారం చెప్పినా భరతుడు తిరస్కరించడం సబబేనా-గురు వాక్యం మీరినట్లు కాదా అన్న సందేహం రావచ్చు. అయితే రాజు చెప్పిన మాటలను మాత్రమే వశిష్ఠుడు చెప్పాడే కాని, పెద్దవాడుండగా చిన్నవాడు రాజ్యం ఏలడం అన్యాయమని ఆయనకూ తెలుసు. ఇక భరతుడేమో భగవత్ పరతంత్రుడు. తనను, తన దేహాన్ని, తన సర్వస్వాన్ని రామార్పణం చేసాడు. దాన్ని మరల గ్రహించడమంటే పారతంత్ర్య విరోధమే. అంటే స్వరూప హాని కలగడమే. ఇది ఆత్మహత్యలాంటి ఘోర పాపం. మాట వినకపోతే వశిష్ఠుడు శపించవచ్చు కాని ఆత్మ హాని కూర్చలేడు. అయినా వశిష్ఠుడు  ప్రార్థించాడే గాని శాసించలేదు.

బాల కాండలోని సంక్షిప్త రామాయణంలో  నారదుడు అయోధ్యకాండ అర్థాన్ని సంగ్రహంగా చెప్పి, పితృవాక్య పాలన అనే సామాన్య ధర్మాన్ని, స్వామైన భగవంతుడి విషయంలో దాసుడు చేయాల్సిన కైంకర్య వృత్తిని, ప్రపన్నుడు భగవత్ పరతంత్రుడిగానే వుండాలన్న విషయాన్ని, ప్రపత్తికి భంగం కలిగే పనులు ఎవరు చెప్పినా చేయకూడదనే విశేష ధర్మాన్ని తెలియ పరుస్తాడు.

సీతను రక్షించ బోయి రావణుడి వల్ల చనిపోయిన జటాయువుకు దహన సంస్కారాలు చేసి రాముడు శోకించాడని సంక్షిప్త రామాయణంలో నారదుడు చెప్పాడు. రామచంద్రమూర్తి విష్ణువు అవతారమైనందున ఆయనకు ఇతర మానవులవలె శోక మోహాలుంటాయా అన్న సందేహం కలగొచ్చు. మనుష్యులకెలాంటి శోక మోహాలు ప్రాప్తిస్తాయో, అలానే రాముడికి ప్రాప్తించాయని భావించరాదు.   మనిషికి శోక మోహాలు కలగడానికి కారణం కామ-క్రోధాలే. ప్రకృతి పరిణామమే దేహం. ప్రకృతి గుణమే రజస్సు. రజో గుణాలవల్ల జన్మించినవే కామ-క్రోధాలు. కామం విఘ్నమైతే కోపంగా మారుతుంది. ఇష్టపడే వస్తువు దొరక్కపోయినా-పోగొట్టుకున్నా శోకం కలుగుతుంది. మోహానికీ కారణం కోపమే. ప్రకృతి పరిణామమైన దేహం, ప్రకృతి గుణాలైన సత్వ-రజస్సు-తమస్సులను కలదై వుంటుందనీ, కొద్దో-గొప్పో ఈ మూడు గుణాలు లేకుండా దేహి వుండడనీ, రజస్సు కారణాన శోక-మోహాలు కలుగుతాయని, ఇవన్నీ పూర్వ జన్మలో చేసిన పాపాల మూలాన ఈ జన్మలో ఫలితం అనుభవించాల్సివస్తుందనీ శాస్త్రం చెప్తుంది. అంటే, ప్రకృతి బద్ధుడైన పురుషుడు, ప్రకృతి గుణాలైన శోక-మోహాల వలన పీడించ బడుతాడని అనుకోవాలి. అలాంటప్పుడు ప్రకృతికి అతీతుడైన విష్ణువు, ప్రకృతి గుణాల మూలాన ఎలా పీడించబడుతాడన్న సందేహం కలగొచ్చు. అవతార దశలో ప్రకృతికి విష్ణువు కూడా బద్ధుడనే సమాధానం చెప్పుకోవాలా?

Friday, April 24, 2020

కరోనా లాక్ డౌన్: కలిసొచ్చిన వరం, కానరాని దీవెన ..... వనం జ్వాలా నరసింహారావు


కరోనా లాక్ డౌన్: కలిసొచ్చిన వరం, కానరాని దీవెన
వనం జ్వాలా నరసింహారావు
మన తెలంగాణ దినపత్రిక (25-04-2020)
లాక్ డౌన్ .. ఓ వరం 
ఆంధ్ర ప్రభ దినపత్రిక (25-04-2020) 
కరోనా లాక్ డౌన్ అనంతర పరిస్థితులను సునిశితంగా పరిశీలించనట్లయితే, హైదరాబాద్ నగరంలో, సాయంత్రం వేళల్లో, గత కొన్ని సంవత్సరాలలో లాగా కాకుండా భిన్నంగా, చల్లని గాలులతో, ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొని ఉంది. సాయంకాలాలో ఇంట్లో బాల్కనీలో కూర్చుని కబుర్లు చెప్పుకునే వారికి, మునుపటిలా వేడి వడ గాలులు పలకరించటం పోయి, హాయినిచ్చే చల్లని గాలులు వీస్తున్నాయి. 1960-70 దశకంలోని కాలుష్యరహిత వాతావరణం గుర్తుకొస్తున్నది. సరిగ్గా, అదే, అలాంటి అనుభూతే ఇప్పుడు పొందగలుగుతున్నాం.  అప్పట్లో ఏడాదంతా సాయంత్రాలు చల్లగా ఉండటం పరిపాటిగా ఉండింది.  మధ్యలో చిరుజల్లులు కురవటం దొరికిన దాంతో ఒళ్లు దాచుకునే ప్రయత్నం చేయటం తరచుగా తారసపడే నిత్య కృత్యం అనే చెప్పాలి.  నడి ఎండా కాలంలో కూడా అప్పట్లో ఇదే పరిస్థితి వుండేది.  ఈ మధ్య కాలంలో కూడా అప్పటిలాగే వుండడంతో, ఎయిర్ కండీషన్ల వాడకం బాగా తగ్గింది. అప్పటిలాగా వానలు, జల్లులు లేకున్నా వాతావరణం మాత్రం చల్లగా మారింది.  దీనంతటికీ కారణం వాతావరణంలో చోటుచేసుకున్న మార్పులు అయినా కావచ్చు, లేదా కరోనా వైరస్ నేపథ్యంలో విధించబడిన లాక్ డౌన్ వల్ల నైనా కావచ్చు. నాలుగ్గోడల మధ్య ఉండటాటనికి పరిమితమైన ప్రజలు బయట తిరగక పోవడం వల్ల వాహన కాలుష్యం, వాయు కాలుష్యం తగ్గి ఎటువంటి విషవాయువులు విస్తరిచకపోవటం అయినా కావచ్చు.  ఇదొక రకమైన  రేడియేషన్ రహిత పర్యావరణం అనే చెప్పవచ్చు.

         న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం సాధారణ రోజుల్లో కూడా నిరంతరం ముఖాలకు మాస్కులు ధరించి ప్రజానీకం సంచరించే న్యూడిల్లీ నగరంలో, అందునా ప్రపంచంలోనే అత్యంత కాలుష్య భరిత ప్రాంతంగా పేరొందిన ఈ పట్టణంలో,  ఆశ్చర్యకరంగా, అనూహ్యంగా ఎటువంటి వాహన కాలుష్యం లేకపోవటంతో నీలిగగన తలం బయల్పడి ఆహ్లాదపరుస్తొందట. అలాగే అతి కొద్దిపాటి వాహనాల కదలికలు, ఏ విధమైన నిర్మాణ కార్యక్రమాలు లేకపోవటం, పరిశ్రమల నుండి నల్లని పొగలు చిమ్మకపోవటం, మేఘాలను పూర్తిగా వాయి కాలుష్యంతో కమ్మేయకపోవటం, వంటివి భారత మెగలాపోలీస్ (megalopolis) రాజధానిలో తగ్గుముఖం పట్టాయి అని పేర్కొంది.

         ఇదిలా వుండగా యావత్ ప్రపంచంలో కూడా ఇటువంటి పరిణామాలే కానవస్తున్నాయి.  బిబిసి కి చెందిన మార్త హెన్రిక్స్ వార్తా కథనం ప్రకారం అన్ని ఖండాలలో, అన్ని దేశాలలో కరోనా వైరస్ కట్టడి నేపథ్యంలో వాతావరణ కాలుష్యం, గ్రీన్ హౌస్ గ్యాస్ లు వెదజల్లటం వంటివి పెద్ద మొత్తంలో తగ్గుముఖం పట్టాయన్నది ఒక అంచనా.  కరోనా మహమ్మారి తాకిన కొద్ది నెలల్లోనే ప్రపంచం మొత్తం కూడా పర్యావరణంలో వినూత్న మార్పును పొందింది.  ముఖ్యంగా కరోనా బారిన పడని కోట్లాది మంది ప్రజలు వారి జీవితాల్లో పెను మార్పులను గమనించారు.   ప్రభుత్వాలు కరోనా కట్టడికి విధించిన కాల్ డౌన్ ఒక విధంగా వారి జీవితాలకు అంతో-ఇంతో మేలు చేసిందనే చెప్పాలి.

         వూహాన్, చైనాల వీధులు  లాక్ డౌన్ నేపథ్యంలో పూర్తిగా నిర్మానుష్యంగా మారాయి.    ఇటలీ, మహా నగరంలో పూర్తి స్థాయిలో ప్రయాణ నియంత్రణలు అమలులోకి వచ్చాయి. లండన్ పట్టణంలో నిత్యం కిటకిటలాడే పబ్ లు, బార్లు, సినిమా హాళ్లు, మూసివేసి ప్రజలను పూర్తిగా ఇళ్లకే పరిమితం చేసింది.   ప్రపంచ వ్యాప్తంగా విమానాలు రద్దు చేయబడ్డాయి. ఆకాశంలోనే అవి తిరుగుటపా కట్టాయి.


         పరిశ్రమలు, రవాణా, వ్యాపారాలు మూతపడి ఉండటంతో వాతావరణంలో కార్బన్ కాలుష్య విడుదల శాతం తగ్గుముఖం పట్టింది.  కాలుష్యం పెద్ద మొత్తంగా కరోనా కట్టడి నేపథ్యంలో కట్టడి చేయబడింది. వాతావరణంలో మంచి గాలి శాతం పెరిగింది. గత కొద్ది నెలల్లో అనూహ్యంగా వాతావరణం మెరుగుపడింది.  ఇదీ ఒకరకంగా అనూహ్యమైన దీవెనగానే భావించాల్సిన తరుణం ఆసన్నమయింది. ఇందుకు కరోనా వైరస్ వ్యాప్తి వల్ల విధించబడిన లాక్ డౌన్ కట్టడికి కృతజ్ఞతలు చెప్పాల్సిందే.   ప్రపంచ వ్యాప్తంగా చూసినట్లయితే కరోనా మహమ్మారి ప్రభావం వల్ల గాలిలో ఉండే కాలుష్యం ఖండాంతరాల్లో పెద్ద సంఖ్యలో తగ్గిపోయింది.  ఇదీ మరీ ముఖ్యంగా అభివృద్ధి చెందిన, చెందుతున్న పారిశ్రామిక దేశాలైన చైనా, భారత్ వంటి చోట్ల ప్రస్పుటంగా కానవస్తోంది. 

         ప్రపంచ వ్యాప్తంగా వ్యక్తిగతంగానో, నియమాల చేతనో, అధికారిక బలవంతపు లాక్ డౌన్ వత్తిడుల నేపథ్యమో కాని, కట్టడులు విధించుకోవటం వల్ల ముఖ్య నగరాలు, పట్టణాలు నాణ్యమైన గాలిని పర్యావరణనాన్ని పొందగలుగుతున్నారు.  జనం లేక వాహనాలు నియంత్రించబడి, ప్రభుత్వ, ప్రైవేటు వాహనాల రాకపోకలు తగ్గి, రోడ్లు నిర్మాణుష్యం కావటం వల్ల కార్బన్ మోనాక్సైడ్ కారకాలు కూడా పెద్ద మొత్తంగా తగ్గాయి. మరో   ఆశ్చర్యకర అంశం ఏంటంటే విమానాల రాకపోకలు నియంత్రించబడటం వల్ల గాలిలో నాణ్యత పెరిగి ఆకాశం నిర్మలంగా మారిపోయింది.   అతి తక్కువ విమానాలు ఎగరటం మూలంగా కాలుష్య కారకాలు వెదజల్లటాలు కూడా తగ్గిపోయాయి.

         కరోనా కట్టడి నేపధ్యంలో ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఇళ్లనుంచే పనిచేయటం మొదలు పెట్టటంతో డోమెస్టిక్ విద్యుత్ వినియోగం పెరగటం అలాగే మరీ తక్కువ మొత్తంలో కమర్షియల్ పనులు జరగటం వల్ల విద్యుత్ వినియోగం తగ్గుముఖం పట్టటం జరిగిందనే చెప్పాలి. కమర్షియల్ బిల్డింగ్ లలో విద్యుత్ శక్తి వినియోగం కూడా తగ్గుముఖం పట్టిందన్నది వాస్తవం.   ఇది ఒక రకంగా విద్యుత్ శక్తి పొదుపుకు దారి తీసిందనే చెప్పాలి. డిమాండ్ తగ్గడంతో పవర్ స్టేషన్లపై కూడా పర్యావరణ కాలుష్య ప్రభావం తగ్గుముఖం పట్టిందనే చెప్పుకోవాలి.


         ఇదే విధంగా పర్యావరణ సంబంధమైన అనారోగ్యం కూడా తగ్గుముఖం పట్టింది. గతంలో ప్రజల్లో చిన్నచిన్న సమస్యల వల్ల తుమ్ములు, ముక్కులు కారటం, కళ్లు మంటలతో నలపటం, ఊపిరి అందకపోవటం వటి వాతావరణ మార్పుల సంబంధమైన రుగ్మతలు చోటు చేసుకునేవి.   ఇవన్నీ ఒకరకమైన ఆస్తమా సంబంధ వ్యాదులు, ఆ వ్యాధికి సంబంధించిన లక్షణాలు.  పర్యావరణ మార్పు ఇందుకు మూల కారణంగా చెప్పుకోవాలి.   చర్మ సంబంధ దురదలు, వాపులు, పొక్కులు, దద్దుర్లు వంటివి వాతావరణ ప్రభావితమే, వాటి కాలుష్య ఫలితమే.  వాతావరణ కాలుష్యం వల్ల ఊపిరితిత్తుల్లోని కొన్ని కణాలు చిట్లి అనారోగ్యానికి దారి తీస్తుంది.  కళ్లు కూడా వాతావరణ కాలుష్యానికి వెంటనే స్పందిస్తాయి.   కళ్లల్లో మంటలు, దురదలు, ఎర్రబడటం వంటివి వాతావరణ మార్పుకు సంకేతాలు. కొత్తగా జరిగిన పరిశోధనలు తేల్చినది ఏంటంటే వాతావరణ కాలుష్యం మానవ ఆరోగ్యాన్ని సంబంధిత బాక్టీయాను ప్రేరిపించి ప్రభావితం చేస్తుంది అన్న సత్యం.

         ప్రఖ్యాత పల్మనాలజిస్ట్, ఎలర్జీ స్పెషలిస్ట్ డా. వ్యాకరణం తేల్చినదేమిటంటే నైట్రోజన్ ఆక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్ వంటివి ఊపిరి తిత్తులకు, గుండెకు, మెదడులోని కొన్ని సెల్స్ కు కానరాని హానిచేస్తాయని తేల్చారు. ముఖ్యంగా పార్టికులేట్ మ్యాటర్ 2.5 సైజు (పరిమాణంలో)  ఉన్న కాలుష్యంలోని ఎరోసెల్స్, సహజంగా 10 నుండి 20 శాతం మైక్రో ఆర్గానిజమ్స్ తేలుతుంటాయి.   వీటిలో 80 శాతం బాక్టీరియా ఆర్గానిజమ్స్, ఫంగల్ ఎలిమెంట్స్ ఇవే అనేక రకాల పాథోజెమ్స్ కి ఎలర్జీలకు కారణం అని తేల్చారు.  నిరూపించబడిన అంశం ఏమిటంటే ఎంత ఎక్కువ వాతావరణ కాలుష్యం ఉంటే అంత పెద్ద మొత్తంలో సూక్ష్మజీవులు చేరి ఊపిరి సంబంధిత రుగ్మతలకు దారితీస్తుందని, అది న్యూమెనియా  సూడోమోనాస్, ఎపెడో బ్యాక్టీరియస్, స్టాఫిలో కోకస్ వంటివి వాతావరణ కీడు చేస్తుందని పేర్కోన్నారు. ఇవే కాకుండా పాథోజెనిక్ బ్యాక్టీరియా వంటి ఆక్టినోబాసిలస్, ప్రోటిమో బ్యాక్టీరియా, ఫర్మిక్యూటిన్, సియానో బ్యాక్టీరియా, క్లోరోఫాస్ట్, బ్యాక్టీరియా డిటెస్, ఆస్కోమైకోటావంటి వుంటాయి అన్నారు.

         కరోనా వైరస్ లాక్ డౌన్ ప్రకటించిన  రోజు నుండి వీటిలో పైన పేర్కోన్న ఏ  ఒక్కటికూడా ప్రైవేటు డిస్పెన్సరీలలో గాని, ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులలో గానీ రిపోర్ట్ కాలేదు.   లేదా ఇటువంటి రోగులకు సేవలు అందించటం అన్నది జరుగలేదు.  ఇది  హైదరాబాద్ లో గాని ఇతర ముఖ్య పట్టణాల్లో కానీ ఉన్న పరిస్థితి.

         1970 ప్రాంతంలో హైదరాబాద్ మహానగరం చెరువులకు, చెలిమలకు, ముత్యాలకు పేరుగాంచిన పట్టణం ఇక్కడి వాతావరణం ప్రశాంతంగా, చల్లగా ఆహ్లాదకరంగా ఉండేది.   ఎంతటి ఎండా కాలంలోనైనా ఇక్కడ చమట పట్టటం, గాలిలో తేమ తగ్గి ఉక్కిరి బిక్కిరి కావటం, ఎండకి తట్టుకునే పరిస్థితి తలెత్తటం జరుగలేదు.  సాయంత్రాలు చల్లగా మారటం, చిరుజల్లులు కురవటం జరిగేది.   ప్రతి చెడు వెనుక ఒక మంచి దాగి ఉంటుంది అని పెద్దలు ఉద్భదించినట్లుగా, కరోనా భయంతో విధించబడిన లాక్ డౌన్ కారణంగా కీడుకంటే మేలు మెండుగా జరిగింది.   వాతావంణ  పరంగా భాగ్యనగరం తన పూర్వపు స్థితిని పొందింది.  చాలా రోజులుగా పగలు, సాయంకాల వేళల్లో ప్రశాంతతను, ఆహ్లాదాన్ని కలిగిస్తుంది ఈ వాతావరణం. అనూహ్యంగా ప్రజలు చక్కని పర్యావరణం  పొందగలుగుతున్నారు.  దీనినే అనుకోవరంగా భావించాలి.   కలిసొచ్చిన, కానరాని దీవేనగా భావించాలి. 70 దశకం అనుభూతిని ఆ ఆనందాన్ని ప్రజలు పొందుతున్నారు.  ఈ నేపథ్యం హైదరాబాదీ ప్రజలు ఎదురుచూడనిది.  ఈ సందర్భం ‘‘దూర్ కహా రహీ’’ చిత్రంలోని కిషోర్ కుమార్ పాట ‘‘కోయి.. లౌటాదే మేరీ బీత్ హుయే దిన్’’  జ్ఞప్తికి తెస్తున్నది, పాతకాలాన్ని ఎవరో తిరిగి తీసుకొచ్చారు అన్న చందాన.