Tuesday, November 29, 2022

మడి …. పండుగలు…. తిరునాళ్లు (గుర్తుకొస్తున్నాయి) : వనం జ్వాలా నరసింహారావు

 మడి …. పండుగలు…. తిరునాళ్లు

(గుర్తుకొస్తున్నాయి)

వనం జ్వాలా నరసింహారావు

ఆంధ్రప్రభ దినపత్రిక (29-11-2022)

ఖమ్మం పట్టణానికి ఇరవై కిలోమీటర్ల దూరంలో, సరైన రహదారి సౌకర్యం కూడా లేని ఒక కుగ్రామంలో, 75 సంవత్సరాల క్రితం, నిప్పులమీద నీళ్లు చల్లుకుని శుద్ధి చేసుకునేటంత ఛాందస కుటుంబంలో పుట్టాను. బాల్యంలో గ్రామంలోని పాఠశాలకు వెళ్లొచ్చిన తరువాత, అక్కడ మైల పడిపోయామని, ఇంటికి రాగానే దుస్తులు విడిపించేవారు మా పెద్దలు. స్నానం చేసిన తరువాతే శుద్ధి ఐనట్లు పరిగణలోకి తీసుకునేవారు. అప్పటి రోజులకు ఆ ఆచారం సరిపోయింది. ఇప్పటి సంగతి వేరే. తరాలలో, అంతరాలలో చెప్పలేనంత మార్పు. 

మా ఇంట్లోని బావి నీరు ఉప్పు నీరు. తాగడానికి ఉపయోగపడదు. మా పాలేరు ప్రతిరోజు వాళ్లింటి బావి నుంచి ఒక రెండు బిందెల మంచి నీళ్లు పట్టుకొచ్చేవాడు. అందులో మా అమ్మ కొద్దిగా చల్ల చుక్క వేసేది. అలా చేయడంతో ఆ నీళ్లు చల్లతో సమానమని ఆమె నమ్మకం. ఇంట్లో వంట మడి కట్టుకుని చేసేవారు. మామిడి కాయ వూరగాయలు కూడా మడితోనే పెట్టేవారు. రోజువారీ ఉపయోగానికి కొంత బయటుంచుకునేవాళ్లం. అవి అయిపోతే, మళ్లీ మడి కట్టుకునైనా తీసేవారు, లేదా, పిల్లల్లో ఒకళ్లని ‘బరివాత’ (వంటి మీద బట్టలేమీ లేకుండా) తీయించేవారు. ఆనాటి ఆచారం అది. పెద్దలమాట వినక తప్పేది కాదు. ఇప్పుడు వూరగాయ పచ్చళ్లు పెట్టేవారు దేశమంతా వున్నారు. ఆ మాటకొస్తే విదేశాలలో కూడా వున్నారు. ఇంకా చెప్పాలంటే మూడొందల అరవై ఐదు రోజులు మామిడికాయలు దొరుకుతున్నాయిప్పుడు. ఎవరో కొందరు తప్ప అంతా మార్కేట్లోన్ర్ కొంటున్నారు.

         ఉదయం నిద్ర లేవగానే, వేప పుల్ల నోట్లో వేసుకుని, దంత ధావనం చేస్తూ, మా నాన్న గారు, ఎదురింటి గ్రామ పటేల్, కొంచెం దూరంలో వున్న సర్పంచ్, మరో ఇద్దరు-ముగ్గురు గ్రామ పెద్దలు, వీధిలో వున్న అరుగుల మీద కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ, గ్రామంలో ఆ రోజున తీర్పు చెప్పాల్సిన పంచాయతీలేవన్న వుంటే చర్చించేవారు. ఆ రోజుల్లో గ్రామాల్లో పెద్దమనుషుల పంచాయతీ తీర్పులు అమోఘంగా వుండేవి. అన్నీ పదిమంది సమక్షంలోనే జరిగేవి. పెద్ద మనుషులిచ్చిన తీర్పుకు తిరుగు లేదు. న్యాయస్థానాలలో మాదిరిగా ‘అపీల్’ లేదు. ఒక సారి పెద్ద మనుషులు తీర్పు చెప్పారంటే ఆ గ్రామంలోని ఎవరైనా సరే బద్ధులై పోవడమే! పెద్ద మనుషులుగా వ్యవహరించిన వారిలో గ్రామంలోని వెనుకబడిన వర్గాలకు, దళితులకు చెందిన వారు, ముస్లింలు కూడా వుండేవారు. మా గ్రామానికి సంబంధించినంతవరకు వారికి సమానమైన ప్రాధాన్యత వుండేది.

బాల్యంలో అనుభూతి పొందిన జ్ఞాపకలాలో, ఈ రోజుల్లో అంతగా ప్రాచుర్యం లేని చిన్నతనంనాటి ఆటపాటలింకా మదిలో మెదులుతూనే వున్నాయి. ఇంట్లో ‘అచ్చన గిల్లలు’, ‘వాన (వామన) గుంటలు’,  సాయంకాలాలు కొఠాయి (రచ్చబండ) వైపుకు వెళ్ళి ‘గోలీలు’, ‘బలిగుడు-చెడు గుడు’ (కబడ్డీ), ‘బెచ్చాలు’, ‘పత్తాలు’, ‘జిల్ల గోనె, ‘దస్తీ ఆట’. ‘తొక్కుడు బిళ్ల’, ‘ఉప్పు బీర ఆడేవాళ్లం. మా అక్కయ్య స్నేహితులతో కలిస్  ‘పచ్చీసు’ ఆడుతుంటే మేం కూడా వాళ్లతో కలిసి ఆడేవాళ్లం.  అచ్చన గిల్లలు ఆటలో ఓడిపోయిన వారికి ‘పులుసు పోయడం’ అని పందెం వుండేది.  బలే సరదా ఐన ఆట అది.

ఆ రోజుల్లో పెళ్లి వేడుకలు కూడా ఇప్పటివాటికి పూర్తి భిన్నంగా వుండేవి. మా అక్కయ్య వివాహం ఆ రోజుల్లో (1955 ప్రాంతంలో) ఐదు రోజులు వైభవోపేతంగా జరిపించారు మా నాన్న గారు. ప్రతిరోజూ హరి కథలు, బుర్ర కథలు కూడా ఏర్పాటు చేసారు. ఇప్పటిలాగా పెద్ద-పెద్ద మ్యారేజ్ హాళ్లు లేవప్పుడు. గ్రామంలోని సొంత ఇంట్లో, ముందున్న ఖాళీ స్థలంలో తాటాకుల పందిళ్లు వేసి వివాహం జరిపించేవారు. వచ్చిన బంధువులు ఆ ఇంట్లోనో, లేదా గ్రామంలోని సమీప బంధువుల ఇళ్లల్లోనొ సర్దుకునేవారు. చతుర్ముఖ పారాయణం ఆనవాయితీ!

చిన్నతనంలో బతుకమ్మ పండుగ వచ్చిందంటే మా అక్కయ్యతో పాటు మాకూ సంబరమే! దసరా పండుగకు ముందు వచ్చేది బతుకమ్మ పండుగ. ఒక విధంగా దసరా, బతుకమ్మ పండుగలు ఏక కాలంలోనే జరుపుకుంటాం. బతుకమ్మ పేర్చడానికి కావాల్సిన పూలను మేం ఇంటింటికి వెళ్లి సేకరించేవాళ్లం. పాలేర్లు తంగేడు ఆకును, పూతను తెచ్చే వాళ్లు. ఆ పూలతో, తంగేడు పూతతో బతుకమ్మను పేర్చేవారు. ఒక్కొక్కరి స్థోమతను బట్టి బతుకమ్మను పేరుస్తారు. బతుకమ్మలను ఓ చోట చేర్చి స్త్రీలు లయబద్ధంగా పాటలు పాడుతూ చప్పట్లు కొడుతూ ఆడుతుంటే మేమూ ఆనందించేవాళ్లం. ఓ గుడి ముందో, లేకపోతే ఎవరో ఒకరి ఇంటి ముందో దీనికి అనువుగా వుండే స్థలాన్ని ఎంపిక చేసుకునేవారు. ఎనిమిది రోజులపాటు...అమావాస్య రోజున ఎంగిలి పువ్వుతో మొదలెట్టి, తొమ్మిదో రోజున మా వూరు సమీపంలోని ఊర చెరువు ఒడిలో చేర్చేవారు. చద్దుల బతుకమ్మ నాడు స్త్రీలతో పాటు పురుషులు కూడా వచ్చి దూరం నుంచి సంబురం చూసి ఆనందించేవారు.

గ్రామాలలో ఆనందంతో జరుపుకున్న ఇతర పండుగలు దసరా, దీపావళిలు. దసరాకు విధిగా, జమ్మి చెట్టు దగ్గర గుమిగూడి, ‘శమీ శమయతే పాపం, శమీ శతృ వినాశనం, అర్జునస్య ధనుర్ధారి, రామస్య ప్రియ దర్శనం’ అంటూ ఒక కాగితం మీద రాసి, జమ్మి కొమ్మకి గుచ్చి, రామ చిలుక దర్శనం చేసుకునే వాళ్లం. జమ్మి చెట్టు వద్ద, ‘యాట’ (మేక పోతు కాని, గొర్రె కాని) ను బలి ఇచ్చేవారు. ఇటీవల పండుగ చేసుకుంటున్నప్పటికీ విధానంలో మార్పు కొట్టవచ్చినట్లు కనిపిస్తుంది. దాదాపు చాలామంది ఇంటికే పరిమితం. 

దీపావళికి ‘రోలు-రోకలి’ అనే ఒక పనిముట్టును మా వూరి వడ్రంగితో తయారు చేయించేవారు నాన్న గారు. అందులో పౌడర్ (పొటాషియంతో చేసిందను కుంటా) లాంటిది వేసే రాపిడి కలిగించితే బాంబ్ ధ్వనితో మోగేది. అదే విధంగా, రాత్రిపూట కాల్చుకునే టపాసులు ఎంతో ఆనందాన్ని కలిగించేవి. 15 రోజుల తరువాత వచ్చే కార్తీక పౌర్ణమికి వూరి పరిసరాలలోని చెరువులో దేవుడి ‘తెప్ప ఉత్సవం’ జరిగేది. అక్కడా కొన్ని టపాసులు కాల్చేవాళ్ళం. కొన్నాళ్ల తరువాత వచ్చే ముక్కోటి ఏకాదశికి పండుగ కూడా బాగా జరుపుకునేవాళ్లం.

మరో పండుగ ‘సంక్రాంతి’. ఆ పండుగ రోజుల నాటి ‘గొబ్బిళ్లు’, ‘హరిదాసులు’, ‘గంగిరెద్దులు’, ‘రేగు పళ్లు’, మళ్లీ మళ్లీ జ్ఞప్తికి వస్తున్నాయి. సంక్రాంతికే పంటలు ఇంటికి చేరేవి. కల్లాలు పూర్తై, ఎడ్ల బండ్లలో, ‘బోరాల’ నిండా నింపుకుని పుట్లకు-పుట్ల ధాన్యం ఇంటికి వస్తుంటే బలే ఆనందంగా వుండేది.

ధాన్యం కొలవడానికి కుండలు, మానికలు, తవ్వలు, సోలలు, గిద్దెలు ఉపయోగించేవారు. కుండకు పదిన్నర మానికలు; మానికకు రెండు తవ్వలు, నాలుగు సోలలు, పదహారు గిద్దెలు; తవ్వకు రెండు సోలలు, ఎనిమిది గిద్దెలు; సోలకు నాలుగు గిద్దెలు. ఐదు కుండలైతే ఒక ‘బస్తా’ ధాన్యం అవుతుంది. అలాంటి ఎనిమిది బస్తాలు కలిస్తే ఒక ‘పుట్టి’ అవుతుంది. క్వింటాలలో కొలతలు అప్పట్లో లేవు. ధాన్యం ఇంటికి చేర్చిన తరువాత, ‘పాతర’ లో కాని, ‘గుమ్ముల’ లో కాని, ‘ధాన్యం కొట్టుల’ లో కాని భద్రపరిచేవారు. మార్కెట్ అనుకూలంగా వున్నప్పుడు అమ్మేవారు. ఆ ధాన్యంలోనే కొన్ని బస్తాలు మరుసటి సంవత్సరానికి విత్తనాలుగా ఉపయోగించేందుకు వేరే భద్రపరిచేవారు. మార్కెట్లో విత్తనాలు కొనే ఆచారం లేనేలేదు. ఆశ్చర్యకరమైన విషయం, పంట కోసినప్పటి నుంచి, ధాన్యం ఇంటికొచ్చే వరకు, లక్షలాది (అప్పటి విలువ ప్రకారం) రూపాయల విలువ చేసే ఆ పంట మొత్తం బహిరంగంగా పొలాలలో పడి వుండేది. ఏ రైతుకు కూడా అభధ్రతా భావం వుండకపోయేది.

అలానే శ్రీరామ నవమి, గోదా కల్యాణం పండుగలు. భద్రాచలంలో వలెనే ప్రతిసంవత్సరం శ్రీరామనవమి నాడు, (తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ సందర్శించిన) అపర భాద్రాచలమైన మా రెవెన్యూ గ్రామం ముత్తారంలో కూడా సీతారాముల కళ్యాణోత్సవం అశేష జనవాహిని మధ్య అంగరంగ వైభోగంగా జరిగేది. ఇప్పటికీ జరుగుతూనే వున్నది. గోదాదేవి కళ్యాణం సంక్రాంతి ముందురోజు భోగి రోజున జరుగుతుంది. బాల్యంలో ఎద్దుల బండ్లు కట్టుకొని, వాటిలో శివారు గ్రామమైన మావూరినుండి దేవుడు పెళ్లి చూడడానికి ముత్తారం పొయ్యే వాళ్లం. కచ్చడపు బండ్లలో కూడా వెళ్తుండే వాళ్లం అప్పుడప్పుడు. దేవుడు పెళ్లికి కొన్ని గంటల ముందు, జరిగిన కొన్ని గంటల దాకా దేవాలయం పరిసరాలన్నీ కోలాహలంగా వుండేవి. పల్లెటూళ్లల్లో ఆ సందడిని ‘తిరునాళ్లు’ అని పిలిచే వాళ్లం. ఆ రోజున ఎక్కడెక్కడినుండో, చిరు వర్తకులు అక్కడ కొచ్చి, తమ దుకాణాలను పెట్టి సరకులమ్మేవారు. పట్టణాలలో ఎగ్జిబిషన్ సందడిలాంటిదే కాసేపు కనిపించేది. ఇప్పటికీ దుకాణాలు పెటుతున్నప్పటికీ, బాల్యం నాటి సందడికి మారుగా కొంచం పట్టణ వాతావరణం చోటుచేసుకుంటున్నట్లు అనిపిస్తుంటుంది.

మా గ్రామంలో ముస్లింలు పది-పదిహేను కుటుంబాల వరకున్నారు. వాళ్ల పండుగలను హిందు-ముస్లింల ఐక్యతకు ప్రతీకగా జరుపుకునే వాళ్లం. అన్నింటిలోకి ప్రధానమైంది, అట్టహాసంగా జరుపుకునే పండుగ ‘పీర్ల పండుగ’. గ్రామంలో ‘పీర్ల గుండం’ వుంది. దాన్నిండా కణకణలాడే నిప్పులు పోసి, ఆ నిప్పుల్లోంచి పీర్లను ఎత్తుకునే వ్యక్తులు నడిచి పోతుంటే బలే గమ్మత్తుగా వుండేది. మొత్తం పదకొండు "సరగస్తులు", దినం విడిచి దినం జరుపుకునే వాళ్లం. పీరు అంటే ఒక పెద్ద పొడగాటి గడ లాంటి కర్రకు జండాలు కట్టి, ఆ గడలను బొడ్లో దోపుకుని, హిందు-ముస్లిం అన్న తేడా లేకుండా అందరూ ఎత్తుకుని ఆనందించేవారు. మా కుటుంబానికి వంశ పారంపర్యంగా "హస్సేన్-హుస్సేన్" పీర్లుండేవి. ఏడవ సరగస్తు నాడు వాటిని బయటకు తీసేవారు. కుదాయ్ సాహిబ్ అనే నిబద్ధత కలిగిన ఒక వ్యక్తి అప్పట్లో వీటిని నిర్వహించేవాడు. ఇప్పటికీ అలానే కొద్దిపాటి మార్పులు-చేర్పులతో జరుగుతూనే వున్నాయి.  

Sunday, November 27, 2022

బ్రహ్మ నీతి శాస్త్రం, వైన్యుడి దండనీతి, భీష్ముడు వివరించిన వర్ణాశ్రమ ధర్మాలు ...... ఆస్వాదన-97 : వనం జ్వాలా నరసింహారావు

 బ్రహ్మ నీతి శాస్త్రం, వైన్యుడి దండనీతి, భీష్ముడు వివరించిన వర్ణాశ్రమ ధర్మాలు

ఆస్వాదన-97

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (28-11-2022)

మూడవ రోజున ధర్మరాజాదులు వేకువ జామునే కాలకృత్యాలు తీర్చుకుని భీష్ముడి దగ్గరికి వెళ్లారు. అంతకు ముందే అక్కడికి మహర్షులు వచ్చారు. కుశల ప్రశ్నల అనంతరం ధర్మరాజు భీష్ముడిని బుద్ధిమంతులైన ప్రజలను రాజు ఏవిధంగా తన వశం చేసుకుంటాడని, సంరక్షిస్తాడని, నాశనం చేస్తాడని, ఏవిధంగా భగవంతుడితో సమానంగా పూజార్హుడు అవుతాడని ప్రశ్నించాడు. జవాబుగా భీష్ముడు ఇలా అన్నాడు:

‘పూర్వం ఇలాంటి విషయాలను ప్రత్యేకించి పరిశీలించినవాడు ఎవరూ లేరు. పరస్పరం ఒకరినొకరు రక్షకులై వుంటూ వచ్చారు. ధర్మం వినాశనమై పోయింది. ప్రజలు అకార్యాలకు పాల్పడ్డారు. యథేచ్చగా దుర్మార్గ ప్రవర్తనలతో వేద వినాశకులయ్యారు. ఇది చూసి భయపడి దేవతలప్పుడు తమను కాపాడమని బ్రహ్మదేవుడిని ప్రార్థించారు. లోకంలో రక్షాస్థితిని ఏర్పాటు చేయడానికి బ్రహ్మ సప్త సోపానాలు, దండనీతి, ద్వాదశరాజ మండలాలు, పంచోపాయాలు మొదలుగాగల లక్ష అధ్యాయాల నీతిశాస్త్రాన్ని నిర్మించాడు. ఆ తరువాత బ్రహ్మ నొసటి నుండి ఆవిర్భవించిన విరూపాక్షుడు, విశాలాక్షుడనే పేరుతో దాన్ని సంక్షిప్తీకరించి ‘వైశాలాక్షం’ అనే పేరుతో పదివేల అధ్యాయాలగా కుదించాడు. దరిమిలా ఇంద్రుడు ఐదువేల అధ్యాయాలకు, బృహస్పతి మూడు వేల అధ్యాయాలకు తగ్గించి అందరికీ అర్థమయ్యే రీతిలో తయారు చేశారు’.

‘ఆ నీతి శాస్త్రాన్ని శుక్రాచార్యుడు వేయి అధ్యాయాలకు కుదించాడు. మహర్షులు క్రమంగా మానవుల శక్తికి అనుకూలంగా, అనుగుణంగా సంక్షిప్తం చేశారు. దానిని అభ్యసించి, ఆచరణలో పెట్టి, ఇతరులతో పెట్టించగల మానస పుత్రుడిని విరజుడు అనే పేరుతో విష్ణువు సృష్టించాడు. అతడు దండనీతిని పాటించడానికి భయపడ్డాడు. అతడి మనుమడు అనంగుడు దాన్ని అమలు చేశాడు. అలా, అలా రాజులలో కొందరు దండనీతిని పాటించక అసమర్థులయ్యారు. పాటించిన వారు విష్ణు తేజులయ్యారు. అతడి వంశంలోని వేనుడి చరిత్ర ప్రసిద్దమైనది. వేనుడు రాగద్వేషాల కారణంగా ప్రజా విరుద్ధుడయ్యాడు. అప్పుడు మహర్షులు వచ్చి మంత్రాలతో పవిత్రీకరించిన దర్భలతో అతడిని ఉపశమింపచేసి అతడి కుడి తొడను మథించారు. అలా చేయడం వల్ల అశుచి అయిన ఒకడు పుట్టాడు. అతడి సంతతి జాతులు నిషాదులై దండనీతి విరహితులయ్యారు. మహర్షులు మళ్లీ కుడి బాహువును మథించారు. వైన్యుడు అనే మహాపురుషుడు పుట్టాడు. అతడిని దండనీతి ఆశ్రయించింది’.

‘వైన్యుడు మునుల బోధ విన్నాడు. దురహంకారం, లోభం, కామక్రోధాలు అనే దుర్గుణాలను వదలి సమస్త ప్రాణుల పట్ల సముడివై, శాస్త్ర విహితంగా రాజ ధర్మాన్ని అనుక్షణం నిస్సంకోచంగా పరిపాలించమని మునులు వైన్యుడికి చెప్పారు. ఇష్టానిష్టాలను లెక్క చేయకుండా, నిర్లిప్తుడిగా కర్తవ్యాన్ని యథావిధిగా నిర్వర్తించాలని, దండనీతిని అనుసరించిన ధర్మ రక్షణమే తన దైనందిన విధిగా భావించాలని, వేద సంరక్షణ చేయాలని, వర్ణసాంకర్యం పరిహరించి దయాంతఃకరణంతో ప్రజలను పాలించాలని మునులు ఆయన్ను ఆదేశించారు. బ్రాహ్మణుల సహాయ సహకారాలు వుంటే వారు చెప్పినట్లే ప్రవర్తిస్తానని వైన్యుడు హామీ ఇచ్చాడు. మహర్షులు వైన్యుడికి బ్రాహ్మణులను సహాయకులుగా అనుమతిచ్చారు. సమస్త భూమికి వైన్యుడిని రాజుగా అభిషేకించారు. అతడికి శుక్రాచార్యుడు పురోహితుడిగా, సారస్వతగణం మంత్రులుగా, గర్గుడు జ్యోతిష్కుడుగా వర్తించారు. అంతకు ముందు మిట్ట పల్లాలుగా వున్న భూమిని వైన్యుడు సమతలం చేశాడు. భూమి, సప్తసముద్రాలు, కులపర్వతాలు వైన్యుడిని సేవించాయి.

‘అధికార పదవిని అలంకరించిన వైన్యుడు శాస్త్రోక్తంగా దండనీతితో ధర్మానురక్తుడై, సత్యవ్రతుడై పరిపాలన చేశాడు. వైన్యుడి సంతానం కూడా అతడితో సమానంగా దండనీతిని అనుసరించి రాజ్యపాలన చేశారు. శ్రీమహావిష్ణువు ఫాలభాగంలో ఉద్భవించిన లక్ష్మి, ధర్మదేవుడికి భార్యయై అర్థమనే కొడుకును పొందింది. లక్ష్మి, ధర్మదేవత, అర్థమనే కొడుకు, ముగ్గురూ కలిసి దృఢంగా రాజును ఆశ్రయిస్తారు. అందువల్ల రాజు, ఇతరుల లాంటివాడు కాకుండా విష్ణు సన్నిభుడుగా పరిగణించబడ్డాడు. వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, చతుర్వర్ణాలు, చతురాశ్రమాలు, వాటి రక్షణ రాజాజ్ఞకు లోనై వుంటాయి. అందుకే రాజులు దేవతలతో సమానమని అంటారు.

ఇంకా అడగాల్సిన విషయాలేమన్నా వుంటే అడగమని భీష్ముడు చెప్పగానే ధర్మరాజు నాలుగు వర్ణాల గురించి, నాలుగు ఆశ్రమాల గురించి వివరించమని కోరాడు తాతను. ఆ వివరాలను తన మాటల్లో ఇలా చెప్పాడు భీష్ముడు:

‘ఎట్లాంటి పరిస్థితులలోనైనా కోపం లేకుండా శాంతంగా వుండడం, సత్యాన్నే చెప్పడం, స్వభార్య అంటే ఆసక్తిగా వుండడం, పరిశుద్ధతతో కూడిన రహస్య రక్షణం, ద్రోహ చింతన లేకుండా వుండడం అనే ఉత్తమ గుణాలను నాలుగు వర్ణాల వారు విధిగా పాటించాలి. బ్రాహ్మణుడికి ఇంద్రియ నిగ్రహం శ్రేష్ఠ ధర్మం. వేదాధ్యయనం నిత్యకృత్యం. వేద విహిత కర్మలు సదా నిష్టతో నిర్వహించాలి. సన్మార్గవర్తనం, దయాంతఃకరణం, శాంత స్వభావం, అధిక ధనం లభిస్తే తన సంతానానికి కాకుండా అర్హులైన వారికి పంచిపెట్టడం బ్రాహ్మణుడికి అర్హ లక్షణాలు. ఆజ్ఞాచారణం, దానకర్మ, వేదాధ్యయనం, నేరగాళ్లను శిక్షించడం, ప్రజానురాగంతో పాలన చేయడం, యుద్ధంలో ఓటమికి వెరువకుండా పరాక్రమించడం మొదలైనవి రాజ, క్షత్రియ ధర్మాలు. వీటన్నిటిలో యుద్ధం అనేది అత్యుత్తమ ధర్మం. వైశ్యుడికి వేదాధ్యయనం, దాన యజ్ఞాచరణం, న్యాయార్జనం, పశుపాలనం పరమ ధర్మాలు. ఇక శూద్ర లక్షణం: బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులకు సముచిత రీతిలో పనులు చేస్తూ వుండడం, రాజాజ్ఞతో ధనధాన్యాలు సమకూర్చుకోవడం, దానధర్మాలు నిర్వహించడం మొదలైనవి’.

‘చతురాశ్రమ లక్షణాలు ఇలా వున్నాయి. బ్రహ్మచర్యాశ్రమంలో గురుసేవ, వేదాధ్యయనం, గోష్టుల పట్ల, అలంకారాల పట్ల అనాసక్తి, బిక్షాన్నంతో జీవించడం, రాగద్వేషాలకు దూరమై సమభావంలో వుండడం లాంటివి ధర్మాలు. స్వభార్యాసక్తి, దయ, సత్యనిష్ఠ, ఓర్పు, సజ్జన సాంగత్యం, దేవతల, పితృదేవతల, అతిథుల సమర్చనం, సమస్తాశ్రమ నిర్వాహకులను శక్త్యనుసారం పోషించడం గృహస్తాశ్రమ ధర్మాలు. సంతానం పట్ల మమకారం వదలడం, ఒక్కడుకానీ, భార్యా సమేతంగా కానీ ఘోరమైన అరణ్యాలలోకి పోవడం, అభిమాన అహంకారాలను వదిలిపెట్టడం, జడలు ధరించి ఇంద్రియ నిగ్రహం పాటించడం, శాస్త్రాధ్యయనం చేయడం, జ్ఞానుల గోష్టులలో పాల్గొనడం వానప్రస్థ ఆశ్రమ ధర్మాలు. ఇక సన్న్యాసాశ్రమ ధర్మాలు ఇలా వుంటాయి: మమకార విరహితుడై ఎక్కడో ఒక్క చోట వుంటూ, ఆకలైనప్పుడు ఏదో ఒకటి తింటూ, ఎక్కడ రాత్రి అవుతే అక్కడే పడుకుంటూ, అగ్నికార్యాలను త్యజించి నడుచుకుంటూ, తనంతట తాను ఏదీ కోరకుండా వుంటూ, ఇంద్రియ నిగ్రహంతో వుంటూ, నమస్కారాలను అంగీకరించకుండా జీవితం గడపాలి’.

‘చతుర్వర్ణాలవారెవరైనా ఈ నాలుగు ఆశ్రమాలను చేపట్టవచ్చు. ఆశ్రమ లక్షణాలకు అనుగుణంగా వర్తించవచ్చు. అయితే, శూద్రుడు బ్రహ్మచర్య, గార్హస్థ్య, వానప్రస్థాశ్రమాలను స్వీకరించవచ్చు కాని సన్న్యాసాశ్రమాన్ని మాత్రం స్వీకరించ కూడదు. ధర్మాలు అన్నిటిలో రాజ ధర్మం శ్రేష్టమైనది. రాజు అంటే ధర్మ దేవతే కాని వేరే కాదు. పూర్వం మాంధాత అనే రాజు తపస్సు చేసి, తనకు సంసార జీవితాన్ని తొలగించి, బిచ్చం ఎత్తుకుని జీవించే ఆసక్తిని కలిగించమని ఇంద్రుడిని కోరాడు. అప్పుడు ఇంద్రుడు ఆ రాజుతో, పాలకులకు బిక్షాచరణం తగదని, ప్రజారక్షణం, యుద్ధంలో శరీర త్యాగం వారికి శుభప్రదమని, వారి స్థానం చాలా గొప్పదని చెప్పాడు. ఆశ్రమ ధర్మాలను రక్షిస్తూ ప్రజలను దండనీతితో సమంగా కాపాడుతూ రాజ్యం చేయడం మంచిదన్నాడు’.

ఆ తరువాత ప్రశ్న వేయడానికి ధర్మరాజు సిద్ధమయ్యాడు.           

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, శాంతిపర్వం, ద్వితీయాశ్వాసం

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)

Saturday, November 26, 2022

Record of Sorts in Medical Education ..... From lone Osmania to Govt medical college in every district : Vanam Jwala Narasimha Rao

 Record of Sorts in Medical Education

From lone Osmania to Govt medical college in every district

Vanam Jwala Narasimha Rao

The Hans India (27-11-2022)

Telangana State, the newest in the country, is marching ahead for creating the record of sorts in Medical Education, when every district will be provided with a Government Medical College, including in remote and tribal areas. An exceptional chapter in the contemporary history of Medical Education in Telangana State, was unveiled virtually through video conference, at Pragati Bhavan, the Chief Minister’s Camp Office in Hyderabad on November 15, 2022.

CM KCR formally launched commencement of classes for MBBS first year students in eight new medical colleges in the state heralding a qualitative change in Medical Education. With this initiative of Chief Minister K Chandrashekhar Rao, medical studies, will get a tremendous boost in Telangana. In future no student needs to migrate either for MBBS or in due course for specialty, super-specialty and multi-specialty studies in medicine to other states.

Prior to this, after formation of state, four government medical colleges in Mahbubnagar, Siddipet, Nalgonda and Suryapet were opened. With the addition of eight more government medical colleges in Sangareddy, Mahaboobabad, Manchiryala, Jagtial, Wanaparthy, Kothagudem, Nagar Kurnool and Ramagundam the number of government medical colleges after formation of state touched 12 and the total colleges to 17. Tribal concentrated Mahaboobabad and remote area Wanaparthy too got colleges which is a unique feature.

As part of policy of one medical college in every district, as of now 16 districts are covered including the erstwhile Hyderabad, Warangal, Nizamabad and Adilabad and 17 more districts are yet to be covered. There were only five government medical colleges prior to formation of state. From there Telangana travelled to 17 government medical colleges within a span of 8 years. A phenomenal achievement and a record of sorts indeed! While launching, CM KCR said government nursing colleges will be set up in all 33 districts, along with the medical colleges to produce large number of paramedial staff.  

Opening of new medical colleges means improving the standards of healthcare facilities, better patient care services, availability of adequate number of MBBS as well as specialty and super and multi-specialty doctors. This enabled four times increase in the MBBS seats in government colleges from 850 to 2790, Post Graduate seats from531 to 1180 and multi-specialty seats from 70 to 152. Thus, ample opportunities are available for merit students and also for Dalit, Tribal, Weaker Sections, BC and Minority students. In the true spirit of ‘Telangana practices and the country follow in all spheres’, here is yet another Telangana Model.

The history of Medical Education in this part of the country, dates back to 180 years. Osmania Medical College in Hyderabad, formerly known as ‘The Hyderabad Medical School’, was founded in 1846 by the Fifth Nizam, Afzal-ud-Dowla, Asaf Jah 5 and is one of the oldest medical schools in the country. The Medical School was renamed as Osmania Medical College, after the Seventh Nizam of Hyderabad, Mir Osman Ali Khan. The college is affiliated to Osmania General Hospital (OGH), one of the oldest hospitals in India. Sources divulge that, when the Nizam became ill, probably from diabetes, the then British Resident suggested that, he be treated with Western medicine by Surgeon, Dr William Campbell Maclean. The Nizam recovered fully. Impressed with allopathic medicine, he proceeded with establishment of the Hyderabad Medical School headed by Dr. Maclean. It appears that the world's first female anesthesiologist Dr Rupa Bai Furdoonji was graduated from here in 1889.

The second one started in Telangana was Gandhi Medical College (GMC), originally named as People's Medical College. GMC founded in 1954 was officially inaugurated on 25 June 1955 by the first President of India, Dr Rajendra Prasad. In 1956, the college was taken over by the government. The College which was originally located near the present-day SD Eye Hospital moved to Basheer Bagh and later to its present premises in Musheerabad.  Dr. Syed Nizamuddin Ahmed, the founder of the college was its first principal. The college is affiliated to Gandhi Hospital which was originally established about 150 years ago in 1851 to be developed into a Cantonment Hospital in 1900 and later grown to King Edward Memorial Hospital in 1913.

The third one was Kakatiya Medical College which was founded and was inaugurated on 23 July 1959 by the Warangal Regional Medical Education society supported by the then CM of united AP Neelam Sanjiva Reddy. It was originally in a building donated by the Pingale family at Waddepally and it moved into the makeshift building constructed at the permanent site in November 1961. The then AP Government took over the college in February 1977.

While these three were the only Government Medical Colleges in Telangana prior to formation of united Andhra Pradesh, two more medical colleges namely, Government Medical College, Nizamabad (started in 2013) and Rajiv Gandhi Institute of Medical Sciences, Adilabad (started in 2008) were opened prior to formation of Telangana.

Dr S Murthy Chennapragada, a graduate and Postgraduate from Osmania Medical College 25 years ago and now working as a Senior Lecturer and Senior Pediatric and Interventional Radiologist in Sydney (Australia), was on a visit to Hyderabad when CM KCR launched eight new medical colleges. He was thrilled to see the development initiated in Telangana in Medical Education after its formation. He expressed the view that, the plan to establish a new medical college for every district covering rural, remote and tribal areas in the state has a huge potential to transform the practice of medicine, in particular that of ‘Rural medicine’. 

Dr Murthy however favored couple of additions for added benefit. To quote: ‘Many of these fresher medical colleges may be promoted into dedicated colleges for rural medicine augmenting primary healthcare provision to remote and vulnerable communities. Medical Students in these colleges may be taught concepts and principles of medicine relevant and applicable to unique healthcare needs in remote and rural areas unlike urban health care needs.’

‘Since establishment of a medical college presumes facility of an equally well-equipped teaching hospital for training medical students, which is challenging, setting-up of multi-specialty Government Hospitals in every district with adequate infrastructure (apart from the already existing hospitals) and also qualified teaching staff commensurate to the needs of a teaching hospital needs to be given a thought. Hence, it would be better to affiliate larger tertiary care hospitals that are already in existence and have well proven capacity for teaching such as Osmania, Gandhi, MGM with multiple medical colleges so that the students can undergo in rotations in certain departments in addition to their own local teaching hospitals’.

‘There has been tremendous increase in tertiary healthcare access now. However, essential need still remains in Primary Health Care. The future Doctors coming out of these new medical colleges may be suitably oriented to provide primary care. Towards this, these new medical colleges may have to design the curriculum to cater to regional, rural, tribal Medicare with emphasis on providing global healthcare standards locally. This pathbreaking initiative would be a model for the entire country to replicate and thereby to improve primary healthcare standards.’

In essence, increase in number of medical colleges will go a long way as it would strengthen medical education and to revitalize the government system of primary, secondary and tertiary health care. However, as the majority of people’s medical requirements are basically primary, while continuing to expand all kinds of general and spatiality hospitals, including Basti Davakhanas as well as village Davakhanas and to reduce rush on hospitals like Osmania, Gandhi, Fever etc. it is highly desirable to create large number of round-the-clock dispensaries or clinics. A General Physician or an MBBS doctor assisted by a para-medic in shifts may be posted there to provide Primary Health Care to an identified number of people in a specified area and thus bringing back the ‘Family Doctor’ concept with a personal touch. END

Monday, November 21, 2022

Pathbreaking achievement : Vanam Jwala Narasimha Rao

 Pathbreaking achievement

Vanam Jwala Narasimha Rao

Millennium Post (22-11-2022)

            (From merely five medical colleges prior to its formation, Telangana has come a long way in establishing one in each district of the state-Editor)

ఓనమాలు, వంట్లు, ఎక్కాలు, పెద్దబాలశిక్ష (గుర్తుకొస్తున్నాయి) : వనం జ్వాలా నరసింహారావు

 ఓనమాలు, వంట్లు, ఎక్కాలు, పెద్దబాలశిక్ష

(గుర్తుకొస్తున్నాయి)

వనం జ్వాలా నరసింహారావు

ఆంధ్రప్రభ దినపత్రిక (22-11-2022)   

        తెలంగాణ సాయుధ పోరాటం నేపధ్యంలో, ఆగస్ట్ 8, 1948 న పుట్టిన నేను, బాల్యం, ఐదో తరగతి వరకూ చదువు అంతా స్వగ్రామంలోనే. హయ్యర్ సెకండరీ (11 వ తరగతిని హెచ్ఎస్సీ అనేవారు) చదువు జిల్లా కేంద్రమైన ఖమ్మంలో. నా మూడో ఏట చదువు ప్రారంభమైంది. ఇప్పటి ప్రీ-స్కూల్, కెజి స్కూళ్ల లాగా మా చిన్నతనంలో (70 సంవత్సరాల క్రితం) గ్రామాలలో ఖాన్గీ బడులుండేవి. ఎర్ర శేషయ్య (పంతులు) గారి ఖాన్గీ బడి (పాశాల) లో చేర్పించారు నన్ను. ఉదయాన్నే బడికి పంపేవారు. అందరికంటే ముందు వచ్చిన విద్యార్థికి చేతి మీద ‘శ్రీ’ అని పంతులు గారు రాసేవారు. తరువాత వచ్చిన వారి చేయిపైన ‘ఒక చుక్క’ పెట్టేవారు. ఇలా ఒకరి తరువాత మరొకరు వస్తుంటే వాళ్ల చేతులపైన పెట్టే చుక్కల సంఖ్య పెరిగేది. ‘శ్రీ’ పెట్టించు కోవడం కోసం పరుగెత్తుకుంటూ ముందుగా బడికి చేరుకునే వాళ్లం. సమయానికి స్కూల్ కు వెళ్లడానికి అదొక రకమైన క్రమశిక్షణ అనాలి.

ఇప్పటిలాగా ‘ఎ ఫర్ యాపిల్, బి ఫర్ బాయ్, సి ఫర్ కాట్....’ కాకుండా, ఆ బడిలోనే ‘ఓనమాలు’ (, , , , , ...), ‘వంట్లు’ (1,2,3,4,5...), ‘ఎక్కాలు’ (ఒకాట్ల ఒకటి, ఒక రెండు రెండు, ఒక మూడు మూడు....), ‘కూడికలు, తీసివేతలు’ (1+1=2, 2+2=4, 4+3=7.....1-1=0, 2-1=1…), ‘తెలుగు వారాలు’, ‘తెలుగు మాసాలు’, ‘తెలుగు సంవత్సరాలు’ లాంటివి నేర్పారు. నక్షత్రాలు, రాశులు, రుతువులు కూడా నేర్పించారు. చాలావరకు కంఠస్థం చేయించేవారు. ‘పెద్ద బాల శిక్ష’ లోని వివిధాంశాలను చాలావరకు నేర్చుకున్నదక్కడే. ‘విశ్వక్సేనుడు’, ‘జంబీర బీజం’, ‘మందార దామం’ లాంటి కఠిన (గొట్టు) పదాలను ఎలా పలకాలో నేర్చేవారు పంతులు గారు. అలా, ఒక ఏడాది గడిచి పోయింది.

గ్రామంలో కొఠాయి (రచ్చబండ) దగ్గర ఒక పూరి పాకలో వున్న ప్రభుత్వ పాఠశాలలో మొదటి తరగతిలో చేర్పించారు నాన్న గారు. చేరడానికి కనీస వయసు ఐదేళ్లయినందున నా పుట్టిన తేదీని మార్పించి, పాఠశాల రికార్డులలో జులై 1, 1947 గా రాయించారు. ప్రభుత్వ పాఠశాలలో చేరినప్పుడు, అది ఏకోపాధ్యాయ పాఠశాల. ఒకే ఉపాధ్యాయుడు పని చేసేవారు. కొద్ది కాలానికి మరో ఉపాధ్యాయుడిని పోస్ట్ చేశారు. ఒకరిని ‘పాత పంతులు గారు’ అని, మరొకరిని ‘కొత్త పంతులు గారు’ అని గ్రామంలో చిన్నా-పెద్దా అందరూ వారిని అత్యంత గౌరవంగా సంబోధించే వారు. ఉపాధ్యాయుడు అంటే గ్రామస్తులకు అప్పట్లో వున్న గౌరవ, మర్యాదలు క్రమేపీ క్షీణించడానికి కొంత పంతుళ్లు కారణమైతే, కొంత గ్రామస్తులు కారణం. 

గ్రామంలో క్రమేపీ కొత్త పాఠశాల భవనం (చిన్నది) తయారైంది. అప్పటి ఖమ్మం జిల్లా కలెక్టర్ భట్ సమక్షంలో, అప్పట్లో జిల్లా-రాష్ట్ర రాజకీయాలలో ప్రముఖ పాత్ర వహిస్తున్న మాజీ మధిర ఎమ్మెల్యే బొమ్మకంటి సత్యనారాయణ రావు గారి చేతుల మీదుగా,  పాఠశాల పేరెంట్స్ కమిటీ అధ్యక్షుడైన మా నాన్న గారు వనం శ్రీనివాస రావు గారి సమక్షంలో ప్రారంభించడం జరిగింది (బహుశా 1954 లో కావచ్చు). ఇటీవలి కాలం వరకూ ఆ నాటి ప్రశంసా పత్రం పాఠశాల గోడకు వేలాడుతూనే వుంది. ఈ మధ్యన నేను చూడడం తటస్థించలేదు. పాఠశాల ఆ భవనంలోకి మారిన తరువాత మరో ఉపాధ్యాయుడు చేరారు. మరి కొంతకాలానికి ఒక తెలుగు మాస్టారు కూడా చేరారు. అలా, అలా అభివృద్ధి చెందిన అ పాఠశాలలో ప్రస్తుతం పదవ తరగతి దాకా ఉన్నప్పటికీ రూపురేఖలు చూడ సొంపుగా మాత్రం లేవు. బాగుచేయడానికి ప్రయత్నాలు మాత్రం జరుగుతున్నాయి. మొదట్లో పలకా-బలపం, తరువాత పెన్సిల్-రబ్బర్, మరో రెండేళ్లు గడిచిన తరువాత సిరా బుడ్డి, అందులో ముంచి రాసేందుకు ఒక పొడగాటి కలం ఉపయోగించే వాళ్లం. ఇప్పుడైతే మూడో ఏటనుంచే బాల్ పాయింట్ పెన్నులు, కంప్యూటర్లు, సెల్ ఫోన్లు, ఇలా ఎన్నో పిల్లలకు అందుబాటులో వున్నాయి. వాటి ఉపయోగం పెద్దల కంటే వారికే ఎక్కువ తెలుసంటే ఆశ్చర్యపడక్కరలేదు.

ఐదో తరగతి వరకు ఆ పాఠశాలలోనే చదువుకుని, తరువాత అక్కడ పై తరగతులు ఇంకా ప్రారంభించనందున ఖమ్మం మామిళ్లగూడెంలో, మా ఇంటికి అతి సమీపంలో వున్న రికాబ్-బజార్ పాఠశాలలో చేరి అక్కడే ఆరవ తరగతి నుంచి హెచ్.ఎస్.సీ వరకు ఆరు సంవత్సరాల పాటు చదువుకున్నాను.

సినిమా రీళ్లలాగా మా రికాబ్ బజార్ స్కూల్ విషయాలు కొన్ని గుర్తుకు వచ్చాయి. ఆరవ తరగతిలో నన్ను చేర్పించిన మర్నాడు నాన్న గారు ఆ ఏడాదికి కావాల్సిన పుస్తకాలు కొన్నారు. అన్ని పుస్తకాలు (వాస్తవానికి ఇప్పటికంటే చాలా తక్కువ) చూడగానే, ఇన్ని చదవాల్నా అని ఏడుపొచ్చింది. కొన్నాళ్లకు అలవాటై పోయింది. చరిత్ర, భూగోళం సబ్జెక్ట్ బోధించే సార్ చాలా స్ట్రిక్ట్. ఈనాడు చెప్పిన పాఠాన్ని మర్నాడు అప్ప చెప్పని విద్యార్థులను తీవ్రంగా దండించేవాడు. చేయిపై ‘పేను బెత్తం’ తో కొట్టడంతో సహా, ఒక్కోసారి ‘కోదండం’ కూడా వేయించేవాడు. ఇప్పుడు అలా దండించడం జరగదు. తెలుగు బోధించే మాస్టారు విద్యార్థులతో  పాఠశాల క్లాసులు ముగిసిన తరువాత రిహార్సల్స్ చేయించి నాటకాలు వేయించే వారు.

          హిందీ బోధించే ఇద్దరు సార్లు చక్కగా అది మన మాతృభాషా అన్నరీతిలో బోధించేవారు. రసూల్ సార్ అనే ముస్లిం మాస్టారు చదువుకుంది కేవలం హెచ్.ఎస్.సీ వరకు మాత్రమే అయినా బోధించని సబ్జెక్ట్ లేదు. లెక్కలు బోధిస్తుంటే అరటి పండు వలిచి నోట్లో పెట్టినట్లుండేది. అలాగే సైన్స్ బోధించే మాస్టారు, లెక్కలు చెప్పే మరొక మాస్టారు. అందరిలోకి చాలా చక్కగా, ఆంగ్లాన్ని మాతృభాషంత సులభంగా బోధించే ఒక మాస్టారు ‘కాంజుగేషన్ ఆఫ్ ద వెర్బ్’ బ్రహ్మాండంగా చెప్పేవాడు. అది నేర్చుకున్నందువల్లే బహుశా ఇవ్వాళ ఇంగ్లీష్ లో మేం అంతో-ఇంతో మంచిగా రాయగలుగుతున్నాం. ఇదంతా ఆయన పుణ్యమే! ఇటీవల కాలంలో ఎవరైనా విద్యార్థిని ‘కాంజుగేషన్ ఆఫ్ ద వెర్బ్’ గురించి అడుగుతే ఏమీ తెలియదని , అదేంటో చెప్పిన తరువాత, కంప్యూటర్లో గ్రామర్ చెక్, స్పెల్ చెక్ వుంది కదా, ఇదెందుకు నేర్చుకోవాలని జవాబిచ్చారు!!!.

అప్పటికీ, ఇప్పటికీ చదువుల్లో తేడా కనిపిస్తూనే వున్నది. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియంలో చదివినా రెండు ముక్కలు రాయలేరు, మాట్లాడలేరు. ఇక మాతృభాష తెలుగు మాకు రాదనేవారి సంఖ్యే ఎక్కువ!!!.