Tuesday, May 30, 2017

It is now the Royal way for Irrigation Projects : Vanam Jwala Narasimha Rao

It is now the Royal way for Irrigation Projects
Vanam Jwala Narasimha Rao

The Right to fair compensation and transparency in land acquisition and, rehabilitation and resettlement (Telangana Amendment) Bill 2016 came into effect in the State with the issuing of a Gazette notification. The Bill which had the assent of the President was sent to the state government and it has now become the Act 21 of 2017. The Act became necessary to avoid delays in land acquisition and to give immediate compensation to the displaced persons. The Bill was introduced and was passed in both houses of legislature on December 28, 2016. Consequent to suggestions to incorporate couple of changes in the Act by Centre, before it could be sent to Presidential Assent, the Bill was sent back to the State government. The State Assembly and Council passed the bill with changes. The President subsequently gave his assent and the Bill became an Act. 

The Act assumes significance since several irrigation projects are taken up in the State. Chief Minister K Chandrashekhar Rao has taken personal interest in getting assent to the Act, while revenue officials especially Chief Advisor Dr Rajiv Sharma played a key role.

Constitution of India, under Article 298, empowers states to buy land through land acquisition. Accordingly the Telangana Government taken up land acquisition vide GOs 123, 190, 191. On Dec 28, 2016 a Bill was introduced and passed in the Assembly amending the centre Act of 2013, to clear all the doubts and apprehensions expressed by some political parties on land acquisition. In fact, the Centre also made an attempt thrice to amend the 2013 Act and to that effect brought ordinances. The first Ordinance was promulgated on Dec 31, 2014, the second on April 3, 2015 and the third on May 30, 2015.  However, for political reasons these Ordinances could not be passed in Rajya Sabha.

During the Niti Aayog meeting, Prime Minister Narendra Modi raised this issue and suggested the CMs to draft their own Acts suiting to the local needs. In fact, the states have a right to do so under Constitution. However theses Acts require Presidential Assent. Couple of states followed the suggestion and gone for their own Acts. There is nothing new in this. Earlier also amendments were brought to Land Acquisition Acts and President’s assent was obtained. Nagarjuna Sagar project land acquisition in 1956, Land Acquisition 1959, Vizag Steel Project Act 1972, Land Acquisition Act 1976, Land Acquisition Act 1983 are some examples of this.

Telangana is a new state. The aspirations and desires of people are also new. The entire Telangana agitation revolved around demand for water, employment and funds. For the water, we need irrigation projects and the irrigation projects are a reality if we have speedy land acquisition. In other words, to march the state forward in development, land acquisition should be done on a fast track.

While introducing the Land Acquisition Bill in the State Assembly, the government has clarified many doubts. Wherever, the landowner voluntarily gives the land GOs 123, 190, 191 are implemented and wherever the farmers want implementation of the Land Acquisition 2013 Act, it will be applied there. But the question remains that why should bring in amendments to the 2013 Act? The Act, which came into being during the Congress regime, is, to put it in KCR’s words, “The act was made by those who have no bearings.”

Introducing the Bill in Legislature the Government detailed several aspects without any ambiguity. If the land owner volunteers to offer his land for acquisition there are many GOs like 123, 190 and 191 to implement it. On the other hand if the owner desires compensation as per Act 2013, government also facilitated it. However the Act 2013 was an Act that was enacted hurriedly by Congress and without a proper thought process.

There is need to clarify few points to those who question the reality of the Land Acquisition Act. Without land acquisition, projects cannot be built. Projects like Nagarjuna Sagar, Srisailam became a reality only due to land acquisition. The World’s biggest rehabilitation project Three Gorges Dam in China caused relocation of 12 lakh families. This was done for the benefit of the people. The projects that will be useful for posterity and for ages together will cause some minor loss to some section of the people. But this will not mean we will stop constructing projects and land acquisition.


The idea to bring amendments to the Act came when some people tried to politicise the land acquisition for the Mallanna Sagar project. 75 per cent farmers gave their land voluntarily for Mallanna Sagar project. Politics came into play for others. There was an attempt to stop the project and wanted a litigation. Where is the justification in people who do not belong to the place and anywhere connected with the issue agitating?

In fact, the Telangana state government has given the rehabilitation and compensation package, which none of the governments gave under the united AP. For the farmers who gave their land for Tapaspally reservoir, which is a stone’s throw away distance from Mallanna Sagar, the compensation given was Rs 80,000 per acre. For Mallanna Sagar project displaced persons the compensation is Rs 6 lakh per acre!  Then why agitate? Whenever a project is constructed, certain villages will submerge completely while some partially. For those submerged partially rehabilitation colonies are constructed on the land available. But yet there is criticism against the government!

Under the 2013 Act, Rs one lakh is given as compensation for house under Indira Awas Yojana. 200 square yards land given as compensation in the village will not cost more than Rs 20,000. On the whole it amounted to Rs. 1, 20, 000. Under the Act, three times of the registration value of the land should be given as compensation but the Telangana state government has given more than 10 times. Many farmers are benefited. The government paid Rs 6.5 lakh while the registered value of the Land is Rs 60,000. It has the option to pay Rs 1.20 Lakh under the 2013 Act and wash off its hands. Over and above the government gave an option for them to construct a 2BHK house on the lines of 2BHK constructed by the government any place of their choice. Another Rs 5.04 Lakh additionally is given for the construction of house. All this was done under GO 123.

Some people went to court on GO 123. In its Affidavit in the High Court, the government clarified all the issues. All these measures are initiated for the benefit of the farmer, but, yet the politicization of issue continued. There is no change in the attitude of certain political parties. They are only thinking about how to stop the projects. They started agitating at the project sites, went to courts and to the Green Tribunal and got a stay. This is not expected from an Opposition party.

Finally the state government consulted the Centre. The Centre also admitted that the land Acquisition Act 2013 was made irresponsibly. CM KCR has consulted PM Modi. States like Gujarat, Rajasthan, Madhya Pradesh, Tamil Nadu and a few other States have amended the 2013 Act as the subject was under the Concurrent list. It became clear that Telangana state too could amend the Act and get the presidential assent to it. Based on the advice of the Centre, the state had brought in amendments to the Act. A lot of exercise was done by the state government officials who were in touch with the officers from Centre’s law department and made a foolproof draft Bill before it was introduced in the Assembly and was passed.


Now no one can ever stop the projects conceived by the state government and the commitment to give water to one crore acres. END

Monday, May 29, 2017

మనం మళ్లీ పొందలేని మహానేతలు : వనం జ్వాలా నరసింహారావు

మనం మళ్లీ పొందలేని మహానేతలు
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రభూమి దినపత్రిక (30-05-2017)

          అలనాటి అంతర్జాతీయ స్థాయి "రోల్ మోడల్" నాయకత్వం, లీలా జ్ఞాపకంగా మాత్రమే మిగిలిపోతోంది. అలాంటి ఉద్దండ నాయకులు, ఆ స్థాయి రాజనీతిజ్ఞత, వారి తరహాలో తమ-తమ దేశాలకు ప్రాతినిధ్యం వహించిన తీరు, తమ దేశాల వాణినే కాకుండా వారి-వారి ప్రాంతాల గురించి ఆ మహా నాయకులు పడ్డ ఆరాటం, వ్యక్తిగతంగా, ఉమ్మడిగా తాము పోరాడుతున్న అంశాల విషయంలో వారు ప్రదర్శించిన నిబద్ధత, బహుశా, ప్రస్తుత అంతర్జాతీయ స్థాయి నాయకుల్లో లోపించిందనడం అతిశయోక్తి కాదు. దురదృష్టవశాత్తు, రాజనీతి శాస్త్రం అధ్యయనం చేసే నేటి తరం విద్యార్థులు కాని, వర్తమాన చరిత్ర కారులు కాని, ఆ మాటకొస్తే సాధారణ చదువరి కాని, యువత కాని, గత కాలం నాటి మహా నాయకుల గురించి తెలుసుకోవడానికి ఆసక్తి కనబరుస్తున్న దాఖలాలు అంతగా కనిపించడం లేదు.

అప్పట్లో, అంతర్జాతీయ స్థాయిలో ఒక గోష్టి కాని, సమావేశం కాని, సదస్సు కాని, ప్రపంచ దేశాల సమ్మేళనం కాని, ఎప్పుడు-ఎక్కడ ఏ మూల జరిగినా, ఆ నిర్వహణలో కనిపించిన హంగూ-ఆర్భాటం, ఆనందం, అంగరంగ వైభవం ఇప్పట్లో లోపించిందనాలి. ఉదాహరణకు, బెల్ గ్రేడ్‌లో 1961 లో, జవహర్లాల్ నెహ్రూ, సుకర్ణో, నాజర్, ఎన్ క్రుమా, టిటోల సారధ్యంలో పురుడు పోసుకున్న అలీనోద్యమ సదస్సు పేర్కొన వచ్చు. ఆ ఐదుగురు ప్రపంచ నాయకులు, అగ్రరాజ్యాల ఆధిపత్యం తగ్గించడానికి, అభివృద్ధి చెందుతున్న దేశాలన్నింటినీ ఒక్క తాటిపైకి తెచ్చేందుకు చేసిన ప్రయత్నం, అగ్రరాజ్యాల మధ్య సాగుతున్న ప్రచ్ఛన్న యుద్ధాన్ని నివారించడానికి తెర పైకి తెచ్చిన అలీనోద్యమం తీరుతెన్నులు, నేటి తరంవారు, కనీసం తెలుసుకోవాలన్న, అవగాహన చేసుకోవాలన్న ప్రయత్నం కూడా చేయడం లేదే? అలానే 1955 నాటి జెనీవా సదస్సు గురించి కాని, ఆ రోజుల్లో జరిగిన ఐక్య రాజ్య సమితి సర్వ సభ్య సమావేశాల గురించి కాని, కామన్ వెల్త్ దేశాధి నేతల సమావేశాల గురించి కాని, బాండుంగ్ సమావేశంగా పిలుచుకునే ఆప్రో-ఏషియన్ సమావేశం కాని, 1954 లో జరిగిన జెనీవా సమావేశం కాని, అలాంటి మరెన్నో అంతర్జాతీయ సమావేశాల గురించి కాని నేటి తరం యువత తెలుసుకునే ప్రయత్నం చేయకపోవడం విచారకరం.

          అలనాటి అంతర్జాతీయ స్థాయి అగ్ర నాయకుల పేర్లలో ప్రముఖంగా చెప్పుకోదగ్గవి: జవహర్లాల్ నెహ్రూ, ఆయన కుమార్తె ఇందిరా గాంధీ, జాన్ ఫిట్జ్ గెరాల్డ్ కెన్నెడీ, నికితా కృశ్చేవ్, చార్లెస్ డి గాలె, డేవిడ్ బెన్ గ్యూరియన్, ఆయన వారసురాలు గోల్డా మీర్, మార్షల్ టిటో, గమాల్ అబ్దుల్ నాజర్, చౌ-ఎన్-లై, మావో సేటుంగ్, సిరిమావో బండార నాయికే, విల్లీ బ్రాండ్ట్, సుకర్ణో, క్వామే ఎన్ క్రుమా, ఫిడల్ కాస్ట్రో, హోచిమిన్, నెల్సన్ మండేలా.....లాంటి వారు.

          జవహర్లాల్ నెహ్రూ, భారత ప్రప్రధమ ప్రధాన మంత్రి. ఐక్య రాజ్య సమితి విధానాలకు ఆయన తన సంపూర్ణ మద్దతిచ్చేవారు. ప్రపంచ వ్యాప్తంగా, శాంతిత్వ వాదనకు, ఆయన పేరు పర్యాయపదం అనవచ్చు. అలీనోద్యమ వ్యవస్థాపకుడిగా, అలనాటి అగ్ర రాజ్యాలైన అమెరికా, రష్యా దేశాల ఆధిపత్యాన్ని ఎదిరించిన వాడిగా, ఆ రెండు దేశాలకు చెందకుండా అభివృద్ధి చెందుతున్న దేశాలు మధ్యే మార్గాన్ని అనుసరిచేట్లు చేసిన వాడిగా, చరిత్రలో ఆయనో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నాడు. పొరుగునున్న చైనా దేశంతో "పంచశీల" పేరుతో శాంతి-సహజీవనం దిశగా ఒప్పందం చేసుకున్నాడాయన. ఆయన కూతురు ఇందిరా గాంధీ కూడా తండ్రి మార్గంలోనే అంతర్జాతీయ స్థాయి నాయకురాలిగా ఆయన తదనంతరం పేరు తెచ్చుకుంది. భారత దేశానికి మొదటి పర్యాయం మూడో ప్రధాన మంత్రిగా, ఆ తరువాత ఆరవ ప్రధాన మంత్రిగా హత్యకు గురయ్యేదాకా ఇందిరాగాంధీ పని చేశారు. ఆమె కాలంలో అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్న దేశంగా భారత దేశానికి పేరొచ్చింది. రాజకీయ, ఆర్థిక, సైనిక పరంగా దక్షిణ ఏషియా ప్రాంతంలో ఒక గొప్ప రాజ్యంగా అవతరించింది భారత దేశం. బంగ్లాదేశ్ ఆవిర్భావం, పాకిస్తాన్ పై భారత్ గెలుపు ఆమె నేతృత్వంలో సాధించినవే. అలీనోద్యమానికి కూడా అమె చేసిన కృషి అమోఘం. అలానే పాలస్తీనా విమోచనోద్యమానికి ఆమె ఇచ్చిన మద్దతు మరువరానిది.

          జాన్ కెన్నెడీ అమెరికా దేశపు 35 వ అధ్యక్షుడుగా, తాను హత్యకు గురయ్యేవరకు పనిచేశారు. ఆయన కాలంలోనే "బే ఆఫ్ పిగ్స్" దాడి, క్యూబన్ మిస్సైల్ సంక్షోభం, బెర్లిన్ గోడ నిర్మాణం, ఆఫ్రికా-అమెరికా పౌర హక్కుల ఉద్యమం తో సహా వియత్నాం పైన యుద్ధంలో అమెరికా మితిమీరిన జోక్యం చోటు చేసుకున్నాయి. అతి పిన్న వయసులోనే అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టిన కెన్నెడీ, అచిర కాలంలోనే ప్రపంచ స్థాయి అగ్రనాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన తదనంతరం అమెరికాకు ఎంతో మంది అధ్యక్షులు వచ్చినప్పటికీ ఆయన కొచ్చిన గుర్తింపు ఇంతవరకు మరెవ్వరికీ రాలేదనవచ్చేమో! అగ్రరాజ్యంగా అమెరికా ఆయన నేతృత్వంలోనూ, ఆ తరువాత కాలంలోనూ వెలుగొందుతున్న నేపధ్యంలో, మరో అగ్ర రాజ్యంగా, అమెరికాకు పోటీగా వున్న సోవియట్ యూనియన్‌కు ప్రధాన మంత్రిగా నికితా కృశ్చేవ్ వుండేవారు. జర్మనీ ఐక్యత కొరకు కృశ్చేవ్ నిరంతరం కృషి చేసేవారు. ఆ దిశగా అమెరికాకు, ఇంగ్లాండుకు, ఫ్రాన్స్ దేశానికి ఒక అల్టిమేటం కూడా ఇచ్చారు.

          చార్లెస్ డి గాలె ఫ్రాన్స్ ఐదవ గణతంత్ర రాజ్య వ్యవస్థాపకుడి గాను, ఆ దేశానికి అధ్యక్షుడి గాను, ఫ్రెంచ్ సైన్యాధినేతగాను, ప్రముఖ రాజనీతిజ్ఞుడిగాను, ఆ రోజుల్లో యావత్ ప్రపంచానికి చిరపరిచితుడు. ఫ్రెంచ్ రిపబ్లిక్ స్థాపన జరగడానికి చాలా కాలం క్రితమే, ఆ దేశానికి, 1945 లోనే ఐక్య రాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం పొందడానికి కారణ భూతుడు డి గాలె. నాటో సైనిక కూటమి నుంచి ఫ్రాన్స్ దేశాన్ని ఉపసంహరించుకోవడమే కాకుండా, ఐరోపా సమాజంలో బ్రిటన్ దేశానికి ప్రవేశం కలగకుండా వీటో అధికారాన్ని ఉపయోగించిన వ్యక్తి డి గాలె. అమెరికా, సోవియట్ యూనియన్ దేశాల మధ్య సమతుల్యం పాటించుకుంటూ, ఒక పటిష్టమైన దేశంగా ఫ్రాన్స్ ను అభివృద్ధి చేయాలన్న విషయంలో డి గాలె ఎన్నడూ రాజీపడలేదు.


అలాగే...ఇజ్రాయిల్ కు చెందిన గోల్డా మీర్, బెన్ గ్యూరియన్ లు. ఆ దేశ నాల్గవ ప్రధాన మంత్రిగా అధికారంలో వున్న గోల్డా మీర్ ను ఇజ్రాయిల్ రాజకీయాలలో "ఐరన్ లేడీ" గా అభివర్ణించే వారు. గోల్డా మీర్ అనేక మంది ప్రపంచ నాయకులను కలిసి ఆమె కలలు కన్న రీతిలో, మధ్య ప్రాచ్య ప్రాంతంలో శాంతి స్థాపనకు కృషి చేశారు. ఆమెకు ముందు ప్రధానిగా పని చేసిన డేవిడ్ బెన్ గ్యూరియన్ ఇజ్రాయిల్ రాజనీతిజ్ఞుడిగాను, జాతి పిత గాను ప్రసిద్ధికెక్కాడు. అరబ్-ఇజ్రాయిల్ యుద్ధంలో తన దేశానికి నాయకత్వం వహించడమే కాకుండా, వివిధ జ్యూయిష్ సైనిక సంస్థలను, ఇజ్రాయిల్ సైన్యాన్ని కలిపి సమైక్యంగా పోరు సల్పారు.

          యుగోస్లేవియా విప్లవకారుడిగా, ఆ దేశ రాజనీతిజ్ఞుడిగా గుర్తింపు పొందిన మార్షల్ టిటో, చనిపోయేంత వరకు వివిధ హోదాలలో తన దేశానికి ఎనలేని సేవ చేశాడు. నెహ్రూ, నాజర్, ఎన్ క్రుమా, సుకర్ణో లతో కలిసి అలీనోద్యమ ప్రధాన నాయకుడిగా అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించారు. అలీనోద్యమ ప్రప్రధమ సెక్రటరీ జనరల్ గా ఆయన ఎంపికయ్యారు. అంతర్జాతీయ స్థాయిలో కూడా తిరుగులేని నాయకుడని పేరు తెచ్చుకున్నాడు. ఇక గమాల్ అబ్దుల్ నాజర్ విషయానికొస్తే...ఆయన, ఈజిప్ట్ దేశానికి రెండవ అధ్యక్షుడిగా చనిపోయేంత వరకు వున్నారు. అగ్ర రాజ్యాల ఆధిపత్యానికి వ్యతిరేకంగా, "సూయజ్‌ కెనాల్ కంపెనీ" ని జాతీయం చేయడంతో ఈజిప్ట్ లోను, మొత్తం అరబ్ ప్రపంచంలోను తిరుగులేని నాయకుడిగా గుర్తింపు పొందాడు. సిరియాతో కలిసి "యునైటెడ్ అరబ్ రిపబ్లిక్" ను స్థాపించాడాయన. ఆయన మరణం ప్రపంచ నాయకులనెందరినో కదిలించింది. యావత్ అరబ్ ప్రపంచానికి చెందిన నేతలు ఆయన అంత్య క్రియలకు హాజరయ్యారు. జోర్డాన్ రాజు హుస్సేన్, పాలస్తీనా విమోచనోద్యమ నాయకుడు యాసర్ అరాఫత్ బహిరంగంగా కంట తడి పెట్టుకున్నారు. లిబియాకు చెందిన కల్నల్ గడాఫి ఉద్వేగంతో రెండు పర్యాయాలు స్పృహ తప్పి పడిపోయాడు!

          "పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా" ప్రప్రధమ ప్రధాన మంత్రిగా చౌ-ఎన్-లై చనిపోయేంతవరకు పదవిలో కొనసాగారు. కొరియా యుద్ధం నేపధ్యంలో, పశ్చిమ దేశాలతో శాంతి కొరకు ఆయన పాకులాడాడు. అమెరికాతో, తైవాన్‌తో, సోవియట్ యూనియన్‌తో, భారత దేశంతో, వియత్నాంతో తలెత్తిన సంఘర్షణల నేపధ్యంలో, చౌ-ఎన్-లై సామరస్య పూరకంగా సమస్యలను పరిష్కరించుకునే దిశగా కొన్ని విధాన పరమైన నిర్ణయాలను తీసుకున్నాడు. ఆయన మెంటర్...నాయకుడు, మావో సేటుంగ్ 1949 లో "పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా" వ్యవస్థాపకుడు. చైనా కమ్యూనిస్ట్ పార్టీ వ్యవస్థాపకులలో మావో ఒకరు. మార్క్స్, లెనిన్‌ల సరసన కమ్యూనిజాన్ని వ్యాపింప చేయడంలో కృషి చేసిన త్రిమూర్తులలో ఆయనొకరు. ప్రపంచ చరిత్రకు ఆయన చేసిన తోడ్పాటు చరిత్ర గతినే మార్చిందనాలి.

పాలస్తీనా నాయకుడిగా, పాలస్తీనా విమోచన సంస్థ అధ్యక్షుడిగా యాసర్ అరాఫత్ చరిత్రలో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. పాలస్తీనా జాతీయ అథారిటీకి ప్రధమ అధ్యక్షుడిగా ఆయన పనిచేశారు. పాలస్తీనా స్వయం ప్రతిపత్తి కొరకు తన జీవితాంతం ఇజ్రాయిల్‌తో ఆయన పోరాటం సాగించాడు. అసలు ఇజ్రాయిల్ ఉనికే వద్దన్న అరాఫత్ ఆ తరువాత రాజీపడి, ఐక్య రాజ్య   సమితి తీర్మానానికి అనుగుణంగా తన విధానాన్ని మార్చుకున్నాడు. శ్రీలంక ప్రధానిగా సిరిమావో బండారు నాయిక ఎన్నో సార్లున్నారు. ప్రధానిగా పనిచేయడమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా నాయకురాలిగా గుర్తింపు తెచ్చుకున్నారు.

          విల్లీ బ్రాండ్ట్ జర్మనీ దేశానికి చెందిన రాజకీయ నాయకుడు, రాజనీతిజ్ఞుడు. 1969-1974 మధ్య కాలంలో ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ జర్మనీ ఛాన్స్ లర్‍ గా పనిచేశారు. పశ్చిమ జర్మనీ, సోవియట్ అనుకూల దేశాల మధ్య సయోధ్య కుదిరించడానికి ఆయన చేసిన కృషికి గుర్తింపుగా, విల్లీ బ్రాండ్ట్ కు నోబెల్ శాంతి బహుమానం లభించింది. ఇండోనేషియా ప్రధమ అధ్యక్షుడిగా పనిచేసిన సుకర్ణో, ఆ పదవిలో 22 సంవత్సరాల పాటు కొనసాగారు. ఇండోనేషియాను వామపక్ష భావాల దిశగా మళ్లించి, ఇండొనేషియన్ కమ్యూనిస్ట్ పార్టీకి తన పూర్తి మద్దతిచ్చారు. అంతర్జాతీయ స్థాయిలో తన దేశానికి ప్రాముఖ్యత-గుర్తింపు తెచ్చేందుకు, సామ్రాజ్యవాద దేశాలకు వ్యతిరేకంగా మూడో ప్రపంచ దేశాలను కూడగట్టాడాయన. అలీనోద్యమంలో ప్రముఖ పాత్ర వహించారు.


క్వామే ఎన్ క్రుమా ఘనా దేశానికి తిరుగులేని నాయకుడుగా వుండేవారు. బ్రిటీష్ వలస రాజ్యంగా వున్న ఘనాకు స్వాతంత్ర్యం సంపాదించడంలో కీలక పాత్ర పోషించిన ఎన్ క్రుమా ఆ దేశానికి ప్రధమ అధ్యక్షుడి గాను, ప్రధమ ప్రధాన మంత్రి గాను పనిచేశారు. ఆఫ్రికన్ యూనిటీ సంస్థ వ్యవస్థాపకుల్లో ఆయనొకరు. లో లెనిన్ శాంతి బహుమతిని అందుకున్నారు ఎన్ క్రుమా. వియత్నాం కమ్యూనిస్ట్ విప్లవ నాయకుడిగా ప్రసిద్ధికెక్కిన హో చి మిన్ ఆ దేశాధ్యక్షుడిగా, ప్రధాన మంత్రిగా పనిచేశారు. వియత్నాం స్వాతంత్ర్యం కొరకు పోరాటం సాగించిన హో చి మిన్, కమ్యూనిస్ట్ పాలనలోని వియత్నాం ప్రజాస్వామ్య రిపబ్లిక్ ను స్థాపించారు. ఫ్రాన్స్ దేశాన్ని ఓడించిన ఘనత ఆయనదే. ఎలిజబెత్ రాణి తర్వాత బహుశా ఎక్కువ కాలం అధికారంలో వున్న వ్యక్తి క్యూబాకు తిరుగులేని నాయకుడు ఫిడల్ కాస్ట్రోనే. లాటిన్ అమెరికాలో కాస్ట్రోను మించిన కమ్యూనిస్ట్ నాయకుడు మరొకరు లేరు. కమ్యూనిస్ట్ విప్లవ పంథాపై ఆయనకు గట్టి పట్టుంది. అప్పటి నుంచి తానే పదవిని ఆశించనని, చేపట్టనని ప్రకటన చేశారు. నెల్సన్ మండేలా గురించి ఎంత చెప్పినా తక్కువే. దక్షిణాఫ్రికా మహాత్మా గాంధీగా ఆయన్ను పిలిచేవారు. అలాంటి మహా నాయకులు అరుదుగా వుంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే, గత కాలంలో ఇలాంటి మహా నాయకులు మరికొందరుండవచ్చు....ఏరీ అలాంటి నాయకులిప్పుడు?

రుణ మాఫీ నుంచి పెట్టుబడిదాకా : వనం జ్వాలానరసింహారావు

రుణ మాఫీ నుంచి పెట్టుబడిదాకా
వనం జ్వాలానరసింహారావు
ఆంధ్రజ్యోతి దినపత్రిక (30-05-2017)

          జూన్ 2, 2014 న తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన నాటి నుండి నేటి దాకా, ఈ మూడేళ్ల కాలంలో సీఎం చంద్రశేఖర రావు నాయకర్వంలో ప్రభుత్వం చేపట్టిన ఆనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలలో అగ్ర భాగాన నిలిచేది రైతు సంక్షేమం. బహుశా...ఏ రాష్ట్రంలో....ఆ మాటకొస్తే ఏ దేశంలో...ఇంత పెద్ద ఎత్తున రైతుల ప్రయోజనాలు కాపాడుకుంటూ, అహర్నిశలూ వారి గురించే ఆలోచన చేస్తూ పనిచేస్తున్న ప్రభుత్వం లేదంటే అతిశయోక్తి కాదేమో! రైతుల పంట రుణాలు మాఫీ చేయడం, ఇన్ పుట్ సబ్సిడీ అందించడం, ఉచిత విద్యుత్ సరఫరా చేయడం, గోదాముల నిర్మాణంతో పాటు వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చేందుకు అవసరమైన అన్ని చర్యలు ప్రభుత్వం తీసుకుంటున్నది. రాష్ట్రంలో ఎక్కువ మంది ఆధారపడే రంగం వ్యవసాయం. ఎక్కువ మంది బతికేది వ్యవసాయంతోనే. అందుకే వ్యవసాయానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. రైతులు వలస వెళ్లకుండా దిగుబడి, తలసరి ఆదాయం పెంచేందుకు ఆధునిక వ్యవసాయ పద్ధతులను అమలు పరుస్తున్నది ప్రభుత్వం. రైతులు పండించిన పంటలకు గిట్టుబాట ధర కోసం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వమే ఏర్పాటు చేసింది. ఋణమాఫీతో రైతు సంక్షేమానికి శ్రీకారం చుట్టిన సీఎం వ్యవసాయానికి అవసరమైన అన్నిరకాల పెట్టుబడులకు ఎకరాకు ఎనిమిది వేల సబ్సిడీ ఇవ్వడానికి నిర్ణయించడం వ్యవసాయ రంగం పైనా, రైతు సంక్షేమం పైనా ఆయనకున్న నిబద్ధతకు నిదర్శనం. ఆద్యతన భవిష్యత్ లో కోటి ఎకరాలకు నీరు వచ్చిన నాడు తెలంగాణ రాష్ట్రం సశ్యశ్యామలమై, అసలు సిసలైన బంగారు తెలంగాణ గా రూపుదిద్దుకోవడం అవశ్యం.

          రైతు సంక్షేమంలో భాగంగా చేపట్టిన కార్యక్రమాల జాబితాలో సంక్షేమ పథకాల సంఖ్య ఒకటి కాదు పదుల్లో వుంటాయి.....రుణమాఫీ; సకాలంలో ఎరువులు, విత్తనాలు సరఫరా చేయడం; నకిలీ, కల్తీకి పాల్పడే వ్యాపారులపై పిడి యాక్టు అమలు చేయడం; రైతులు ఎరువులు కొనుక్కోవడానికి, వ్యవసాయ పెట్టుబడికి ప్రతీ ఎకరాకు రూ.8000 వేలు ఇవ్వడం; ఇంటర్ నెట్ ద్వారా వ్యవసాయ సమాచారం చేయడం; భూసార పరీక్షలు చేయించడం; భూ రికార్డులు సవరించాలని నిర్ణయించడం; సాదా బైనామాలను ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయించడం; ప్రతీ 5వేల ఎకరాలకు ఒక వ్యవసాయాధికారిని నియమించడం; రాష్ట్రీయ కృషి వికాస యోజన పథకం తేవడం; మైక్రో ఇరిగేషన్ కు ప్రాధాన్యత ఇవ్వడం; పాలీ హౌజ్, గ్రీన్ హౌజ్ సాగు కోసం ఎస్సీ, ఎస్టీ రైతులకు సబ్సిడీ ఇవ్వడం; వ్యవసాయంలో యాంత్రీకరణ ప్రోత్సహించడం; ప్రత్యేకంగా ఒక హార్టీకల్చ్రర్ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడం; ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్ ఏర్పాటు; ఫారెస్టు కాలేజీ నెలకొల్పడం; వ్యవసాయ పాలిటెక్నిక్ ల ఏర్పాటు; పాత బకాయిలతో సహా ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వడం; భారీ ఎత్తున గోదాముల నిర్మాణం; గోదాముల్లో నిల్వ చేసుకున్న సరుకు విలువలో 75 శాతం మేర రైతులకు రుణం ఇచ్చే ఏర్పాటు; వ్యవసాయ మార్కెట్లలో రైతులకు రూ. 5 కే బోజనం పెట్టడం; హమాలీల కూలి రేట్లు పెంపుదల; వ్యవసాయానికి 9 గంటల కరెంటు సరఫరా; 2018 చివరి నాటికి రైతులకు 24 గంటల కరెంటు ఇచ్చే ప్రయత్నం; వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల మంజూరు; మార్కెట్ కమిటీలలో రిజర్వేషన్లు; దేశానికే తలమానికమైన విత్తన భాండాగారంగా తీర్చిదిద్దడం; ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకోవడం.....ఇలా ఎన్నో....ఎన్నెన్నో వున్నాయి. ఇంకా ఇంకా చేయాలన్న తపన భవిష్యత్ లో మరిన్ని రైతు సంక్షేమ కార్యక్రామల రూపకల్పనకు దారితీస్తుందనడంలో కూడా సందేహం లేదు. వివరాల్లోకి పోతే....


అధికారంలోకి వచ్చిన వెను వెంటనే, టీఆర్‌ఎస్‌ పార్టి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామి మేరకు, రాష్ట్రంలోని రైతులందరికి 2014న మార్చి 31 వరకు ఉన్న రూ. లక్ష లోపు పంట రుణాలను మాఫీ చేసింది ప్రభుత్వం. 2017 ప్రారంభం నాటికి మూడు విడుతల్లో రైతుల బాకీలను తీర్చిన ప్రభుత్వం.. నాలుగవ, తుది విడుత కింద ప్రభుత్వం ఎప్రిల్ 11, 2017 నాడు రూ.4వేల కోట్లను వ్యవసాయ శాఖకు విడుదల చేసింది. దీంతో మొత్తంగా రైతులకు రూ.16,374 కోట్ల రుణమాఫీ సంపూర్ణమయ్యింది. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా 35.3 లక్షలమంది రైతులకు ప్రయోజనం కలిగిందివిత్తనాలు, ఎరువులు, పురుగు మందులు సకాలంలో రైతులకు అందే విధంగా చర్యలు తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. గతంలో మండలానికి ఒకే ఒక విత్తన విక్రయ కేంద్రం ద్వారా రైతులకు విత్తనాలు పంపిణీ చేసేవారు. దీని వలన రైతులు క్యూలో గంటల తరబడి, రోజుల తరబడి నిలబడేవారు. లాఠి చార్జి వంటి సంఘటనలు కూడా చోటు చేసుకునేవి. కానీ తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సకాలంలో సరిపడే విత్తనాలను ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా రైతు ముంగిటకే రాయితీపై పంపిణీ చేయబడుతుంది. రైతులకు విత్తనాలు, ఎరువుల కొరత రాకుండా ముందుగానే స్టాక్ తెప్పించి గోదాముల్లో నిల్వ చేస్తున్నది ప్రభుత్వం. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు ఎట్టి పరిస్థితుల్లోనూ నకిలీ, కల్తీకి అవకాశం లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.

          రాష్ట్రంలోని 55 లక్షల మంది రైతులకు మే, 2018 నుంచి దాదాపు 25 లక్షల టన్నుల ఎరువులను ఉచితంగా అందిస్తామని ఎప్రిల్ 13, 2017 జనహితలో రైతులతో జరిగిన సమావేశంలో  ముఖ్యమంత్రి ప్రకటించారు. రైతులకు ఎకరానికి నాలుగు వేల రూపాయల చొప్పున వర్షాకాలం, యాసంగి  రెండు పంటలకు కలిపి రు.8,000 అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. పండ్లు, పూల తోటలకు కూడా నాలుగు వేల రూపాయలు ఇవ్వనుంది. ప్రతి రైతు ఖాతాలో ఈ డబ్బులు డిపాజిట్ చేస్తుంది ప్రభుత్వం. తొలి పంటకు మే నెల మొదటి వారంలో, రెండో పంటకు అక్టోబర్ లో ఎకరానికి నాలుగు వేల రూపాయల చొప్పున రైతు ఖాతాలో సొమ్ము డిపాజిట్ చేస్తారు. ఈ పథకం పకడ్బందీగా, అవినీతికి ఆస్క్రారం లేకుండా వుండడానికి గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి రైతు సమాఖ్యలను ఏర్పాటు చేసే ఆలోచన చేసింది ప్రభుత్వం. ఆధునిక సాంకేతిక వ్యవసాయ సమాచారాన్ని, సేవలను రైతులకు ఇంటర్ నెట్ వంటి ఆధునిక మాధ్యమాల ద్వారా త్వరితంగా, సమర్ధవంతంగా రైతులకు అందించడం జరుగుతున్నది. రైతాంగానికి సాంకేతిక సలహాలను ఇచ్చిఏయే భూములలో ఎటువంటి పంటలను పండించాలో నిర్ణయించడానికి భూసార పరీక్షలు చేయిస్తున్నది తెలంగాణ ప్రభుత్వం.

రాష్ట్రంలో భూ వివాదాలన్నీ సత్వరం పరిష్కరించి, భూ రికార్డులు సవరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ వ్యవహారాల్లో అనేక సంస్కరణలు తీసుకొచ్చింది. సాదా బైనామాలను (గ్రామీణ ప్రాంతాల్లో 5 ఎకరాల లోపు) ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయించింది. దాదాపు 11.19 లక్షల మందికి 1638.58 ఎకరాల భూమిని సాదా బైనామాల ద్వారా ఉచిత రిజిస్ట్రేషన్ జరిగింది. వారంతా పట్టాలు పొందారు. ఈ భూమి విలువ 9,487 కోట్ల రూపాయలు. వారసత్వంగా వచ్చిన భూములను పది రోజుల్లోగా మ్యుటేషన్ చేశారు అధికారులు. ఇతర భూములు రిజిస్ట్రేషన్ అయిన 15 రోజుల్లో మ్యుటేషన్ కావాలని నిబంధన పెట్టింది. అన్యాక్రాంతానికి గురైన భూములను వాపస్ తీసుకుని అర్హులకు అందించింది. ప్రతీ 5 వేల ఎకరాలకు ఒక వ్యవసాయాధికారి అందుబాటులో ఉంచి రైతులకు సూచనలు, సలహాలు ఇవ్వడానికి ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. రాష్ట్రీయ కృషి వికాస యోజన పథకం కింద 50% రాయితీతో హైబ్రిడ్ కూరగాయల విత్తనాల సరఫరా చేయడం జరిగింది. తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి సాధించే అవకాశమున్న మైక్రో ఇరిగేషన్ కు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నది. ఈ పథకం ద్వారా షెడ్యూల్డ్ కులాలు, తెగల రైతులకు 100% రాయితీ, వెనుకబడిన తరగతులకు, సన్న, చిన్నకారు రైతులకు 90% రాయితీ, ఇతర రైతులకు 80% రాయితీలు ఇవ్వడం జరుగుతున్నది.

కూరగాయలు, పండ్లు, పూలు పండించడానికి అనువుగా ఉండే పాలీ హౌజ్, గ్రీన్ హౌజ్ కల్టివేషన్ కోసం ఎస్సీ, ఎస్టీ రైతులకు 95 శాతం సబ్సిడీ, ఇతర రైతులకు ప్రభుత్వం 75 శాతం సబ్సిడీ జరుగుతున్నది. వ్యవసాయంలో యాంత్రీకరణ పెంచేందుకు ప్రభుత్వం ఫామ్ మెకనైజేషన్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపడుతున్నది. కూరగాయల సాగులో ఆధునిక నూతన పద్ధతులను అందుబాటులోకి తీసుకువచ్చి నాణ్యమైన దిగుబడులను పెంచడమే కాకుండా రైతుకు గిట్టుబాటు ధరల కోసం హార్టికల్చర్ కార్పొరేషన్ ఏర్పాటు జరిగింది. పంట రుణాలను మాఫీ చేయడమే కాకుండా, ప్రభుత్వం 2009 నుంచి రైతులకు చెల్లించాల్సిన ఇన్ పుట్ సబ్సిడీ పాత బకాయిలను కూడా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే చెల్లించింది. గిట్టుబాటు ధర వచ్చేవరకు రైతులు తమ ఉత్పత్తులను నిల్వ చేసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున గోదాముల నిర్మాణాన్ని చేపట్టింది. గోదాములు కట్టడమే కాదు, గోదాముల్లో నిల్వ చేసుకున్న సరుకు విలువలో 75 శాతం మేర రైతులకు రుణం ఇస్తున్నారు. రైతులకు విత్తనాలు, ఎరువుల కొరత రాకుండా ముందుగానే స్టాక్ తెప్పించి ఈ గోదాముల్లో నిల్వ చేస్తున్నది ప్రభుత్వం.


వ్యవసాయ సాగుకు తగినంత నీరు బోరు లేదా బావుల ద్వారా అందుబాటులో ఉన్నప్పటికీ నిరంతర కరెంటు కోతల వల్ల వ్యవసాయాన్ని సాగు చేసుకోలేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రధాన సమస్య విద్యుత్తే కనుక ప్రభుత్వ వారికి 9 గంటల పాటు విద్యుత్తు ను ఎప్రిల్ 1, 2016 నుంచి సరఫరా అందిస్తున్నది. రాష్ట్రంలోని 35 శాతం కరెంటు ఉచిత విద్యుత్ కోసమే వినియోగిస్తున్నారు. 2018 సంవత్సరం చివరికల్లా, రైతులకు 24 గంటల కరెంటు అందివ్వడానికి, ప్రణాళికలు సిద్ధం చేసింది ప్రభుత్వం. ఇందులో భాగంగా అదనంగా సబ్ స్టేషన్లు, పవర్ ట్రాన్స్ ఫార్మర్స్, కె.వి. లైన్లను ఏర్పాటు చేస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం. డిసెంబర్ 2016 నాటికి 2,58,195 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు రైతులకు మంజూరు చేసిన ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న మరో 63,700 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను మంజూరు చేయాలని అధికారులకు అదేశం ఇచ్చింది. దేశంలో మరెక్కడా లేని విధంగా, చరిత్రలో మొదటి సారిగా తెలంగాణలోని అన్ని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవులను రిజర్వేషన్ ద్వారా భర్తీ చేయడం జరిగింది. దీని వల్ల ఎస్సీ, ఎస్టీ, బిసి, మహిళల్లోని రైతులు మార్కెట్ చైర్మన్లు అయ్యే అవకాశం కలిగింది. ప్రపంచంలోనే విత్తనాభివృద్ధికి అనువైన అత్యుత్తమ నేలలున్న తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికే తలమానికమైన విత్తన భాండాగారం గా మారుస్తున్నదీ ప్రభుత్వం. పంట నష్టాలతో ఆత్మహత్య చేసుకుంటున్న రైతు కుటుంబాలకు 6 లక్షల పరిహారం ఇస్తున్నదీ ప్రభుత్వం. రైతు ప్రయోజనాలు కాపాడడానికి ఇంకా...ఇంకా...ఏం చేయాలనే ఆలోచనలో వున్న సీఎం మరికొన్ని ప్రయోజనాలను వారికి కలిగించే దిశగా అడుగులేస్తున్నారు. రాష్ట్రంలో వున్న సుమారు 97% మందికి పైగా సన్న, చిన్నకారు రైతుల ప్రయోజనాలకు విరుద్ధంగా ఏ విధమైన చట్టాలున్నా వాటిని సవరించాల్సిన ఆవశ్యకత వుందని ప్రభుత్వం భావిస్తోంది. 

ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులు లంచం ఇచ్చి పని చేయించుకునే అవసరం లేకుండా, రాకుండా వుండాలనేది ప్రభుత్వ సంకల్పం. అది భూముల రిజిస్ట్రేషనే కావచ్చు, ఎంకబరెన్స్ సర్టిఫికేటే కావచ్చు, మ్యుటేషన్ ప్రక్రియే కావచ్చు, పట్టాదారు పాసు పుస్తకం పొందడమే కావచ్చు, పాస్ పుస్తకంలో అదనంగా ఎంట్రీలు వేయించుకోవడమే కావచ్చు, రైతు చనిపోయిన తరువాత వారసులకు భూమి యాజమాన్య హక్కులు దఖలు చేయడమే కావచ్చు...మరేదైనా రైతు సంబంధిత సమస్యే కావచ్చు....అవినీతికి ఆస్కారం లేకుండా ప్రభుత్వంలో పనులు వేగంగా జరగాలనేదే ప్రభుత్వ ఆలోచన. ఈ దిశగా బహుశా రాబోయే రోజుల్లో మరికొన్ని సంస్కరణలను ప్రభుత్వం చేపట్టబోతుందనడంలో సందేహం లేదు. రైతుల ప్రయోజనాలు వంద శాతం రక్షించబడాలనేదే సీఎం ధ్యేయం, లక్ష్యం, ఆలోచన. ఆయన మదిలో మెదిలిన గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి రైతు సమాఖ్యలు రైతుల బహుళ ప్రయోజనకారిగా, రైతులను ఈ దిశగా చైతన్యపరచడానికి దోహద పడేవిగా వుండాలనేది సీఎం కోరిక.

Sunday, May 28, 2017

భగవత్ దాస్యం "యోగ-జ్ఞానాల" కంటే కూడా గొప్పది ..... ఆంధ్ర వాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి? : వనం జ్వాలా నరసింహారావు

భగవత్ దాస్యం "యోగ-జ్ఞానాల" కంటే కూడా గొప్పది
ఆంధ్ర వాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి?
వనం జ్వాలా నరసింహారావు
సూర్యదినపత్రిక (29-05-2017)

సుందరకాండలో వివరించబడిన రెండు ప్రధాన విషయాలు: సీతాదేవిలో కనిపించిన ప్రేమ, ప్రవృత్తి. ఓడ నడిపేవాడికి ధనరూపంలో కూలి ఇచ్చినట్లే, శ్రధ్ధాభక్తులనే కూలిని భగవంతుడికియ్యాలి. సంసారాన్ని దాటాలన్న కోరికున్నవారికి ఇది అత్యంత ఆవశ్యం. ఆ కూలివ్వకపోతే భగవంతుడు నావను దాటించడు. సంసారమనే నావను దాటితే లాభమేమిటని ప్రశ్నించే వారికి, దొరికే జవాబు మోక్షమనే సుఖం.

            హనుమంతుడు "మహాయోగి-మహాజ్ఞాని"అనే విషయం నిర్వివాదం. అంతటి ఘనుడు కూడా, లంక వెళ్లేటప్పుడు రామ ముద్రికను, వచ్చేటప్పుడు సీతమ్మ చూడామణిని తోడుంచుకుని మరీ సముద్రాన్ని దాటుతాడు. లంకలో వున్నంత సేపూ భగవత్ దాస్యం "యోగ-జ్ఞానాల"కంటే కూడా గొప్పదని నమ్మాడు. "దాసుడ రామచంద్రునీ" కని, రహస్యంగా అనకుండా, దిక్కులు మారుమ్రోగేటట్లు చాటి చెప్పాడు. "రామదాసుడ"నని ఎప్పుడు హనుమంతుడు అన్నాడో, అప్పుడే, హనుమంతుడుకి చల్లదనం కలిగించాలని అగ్నిహోత్రుడిని అజ్ఞాపిస్తుంది సీతమ్మ తల్లి. తన స్వభావం మానుకోలేనని రామచంద్రుడితో సముద్రుడనగలిగాడు కానీ, సీత అడిగినప్పుడు కాదనే ధైర్యం అగ్నిహోత్రుడికి లేకపోయింది. రామబాణం కంటే కూడా, సీతాదేవి వాక్కు అమోఘమనే అర్ధం దీనివలన స్పష్టమవుతోంది.

            "శ్రీరామదాసోహ"మనే షడక్షర మంత్రం హనుమంతుడికి లంకలో ఎలాంటి బాధలు కలగకుండా రాక్షసులను జయించడానికి తోడ్పడింది. అందుకే, శ్రీరామదాసోహమని ఎవరన్నప్పటికీ, వారిని సంసారసాగరం దాటించి రామపాద సన్నిధికి చేర్చగలదా మంత్రం. షడక్షరమంత్ర మహిమ తెలుసుకోవడం ఎవరి తరమూకాదు.

            "శ్రీ-సీత" శబ్దాలను పరిశోధన చేస్తే, దేవతల్లో, మనుష్యులలో, పశు, పక్ష్యాదులలోని మగవారి పేర్లన్నీ విష్ణుమూర్తివిగానూ, ఆడవారి పేర్లన్నీ లక్ష్మీదేవివి గానూ విషదమవుతుంది. లక్ష్మీనారాయణులు, సీతారాములు, ఇరువురూ సమానులే. లోకంలో పురుష వాచకాలన్నీ "రామ" అనీ, స్త్రీ వాచకాలన్నీ "సీతాదేవి"అనీ, ముల్లోకాల్లో వీరిరువిరికంటే వేరైందేదీలేదనీ తెలుసుకోవాలి.

            చేతనాత్మక తత్వాన్నీ, లక్ష్మీనారాయణుల సమత్వాన్నీ, చిద-చిదీశ్వర తత్వాలను, మూడింటినీ కూడ, "శ్రీ-సీత" శబ్దాలను పరిశోధిస్తే విషదమవుతుంది. ఈమూడింటి ఏకీభావం, ఇంతకంటే పరమైన మహాత్మ్యం కలిగిందేదీ లేదన్నవిషయం కూడా బోధపడ్తుంది. భగవంతుడంటే "ఆనందం-నిశ్చయం" అనే శ్రుత్యర్ధం కూడ సీత శబ్దం బోధిస్తుంది. అంటే, ""కారానికి, స్త్రీ లింగ రూపం "సీ" కాబట్టీ, "సీ" శబ్దానికి భగవతి-లక్శ్మీదేవి అనే అర్ధం కూడా స్ఫురిస్తుంది. అలాగే ""కారానికి "నిశ్చయ"మనే భావం, ""శబ్దానికి "దయ" అనే అర్ధం ఏర్పడుతోంది. సీతాదేవి ఎంతటి దయావతో రామాయణం చదివేవారికి వేరే చెప్పాల్సినపనిలేదు.

సీతా శబ్దం లాగానే, ""కార, ""కార శబ్దాలతో, "సతీ"-"సత్"-"సేతు"-"సత్య" అనేవి కూడా వున్నాయి. వీటికీ సీతాదేవికీ సంబంధం వుండవచ్చుకదా! సతీ శబ్దం సాధారణంగా పతివ్రతకు పేరు. అలానే దర్శన మాత్రాన్నే పాపాలు పోగొట్టేది "సతి". ఇది సామాన్య సతుల లక్షణం. అందు సీతాదేవి ఎట్టి సతియో రామాయణం చదివేవారికి చెప్పాల్సిన పనిలేదు. ఒక్కసారి ఆమె కటాక్షం మనమీద పడ్డా, ఆమె దర్శనం మనకొక్కసారి కలిగినా, మన పాపాలన్నీ నశించి, కృతకృత్యులమవుతామన్న విషయంలో సందేహం ఏమాత్రం లేదు. ఆమె దర్శన ప్రాప్తి లేనప్పుడు అట్టి పుణ్యాత్మురాలి చరిత్ర పఠించినా సర్వపాపాలు హరించి పోతాయికదా! అందుకే చదవాలి సుందరకాండ.

            నీళ్లు వృధాగా పోకుండా రెండొడ్డుల నడుమ అడ్డంగా నిర్మించే కట్టను "సేతు"వంటారు. కట్టలు నిర్మించే ఉద్దేశ్యం నీళ్లు వ్యర్ధం కాకుండా పైర్లు వృధ్ధి చేసుకోవటమే కదా? అదే విధంగా సీతాదేవిని మనం ఆశ్రయిస్తే, మన జన్మ ప్రవాహాలు వ్యర్ధమై పోకుండా ఫలవంతమయ్యేటట్లు చేసి, ఐహిక సుఖాలు కలిగిస్తాయి. "సేతు"వుకు మరో అర్థం...ఈ ఒడ్డున వున్నవారు ఆవలి ఒడ్డుకు పోవటానికి అవసరమైన నిరపాయసదుపాయం. సీతాదేవి కూడా, భగవత్ ప్రాప్తి కోరి, తనను ఆశ్రయించే వారికి సేతువు లాంటిదే. కాబట్టే ఆమెను పురుషకారంగా భక్తులు-ప్రపన్నులు ఆశ్రయిస్తారు. పురుషకారం అంటే మన యోగ్యతలతో నిమిత్తం లేకుండానే, స్వామివారికి, మనల్ని గురించి మంచిమాటలు చెప్పి మేలు చేయడమన్నమాట!

            ఇక "సత్య" పాదంలోని ""కారానికి "జీవుడ"నీ; ""కారానికి "పరబ్రహ్మమ"నీ; ""కారానికి ఈండింటినీ చేర్చే శక్తైన "లక్ష్మి"అనీ అర్ధం. కాబట్టి లక్ష్మీదేవే "జీవాత్మ"ను, "పరమాత్మ"తో చేరుస్తుందని అర్ధం.

మనకు గోచరించేది జీవుల తోను, ప్రకృతి తోను వుండే "చిదచిద్విష్ఠం". ఈ రెంటికీ అంతర్యామి ఈశ్వరుడు. ఆయన మన కంటికి కనిపించడు. అయినా మనం చేరవలసింది ఆయన్నే. చేరేదెట్లా అనేదే ప్రశ్న. ఆయనో గృహస్తుడి లాంటి వాడు. జీవ, ప్రకృతులే గృహం. ఆ గృహంలో ఆయన తన ఇష్టులతో, శిష్టులతో సంతోషంగా కాలక్షేపం చేస్తుంటాడు. గృహ కృత్యాలను ఆయన భార్య నిర్వహిస్తుంది. పతివ్రత కాబట్టి ఆమె తన భర్తకు, ఏ విచారం కలుగకుండా, ఆనందంగా కాలం గడిపే అవకాశం కలిగిస్తుంది. అట్టి భార్యే లక్ష్మీదేవి. భర్తను విడిచి పెట్టకుండా సర్వదా ఆయనకు ఆనందం కలిగించే రీతిలో వ్యవహరిస్తుంటుంది. ఆయన అభిమతానికి అనురూపంగా ప్రవర్తిస్టుంటుందిప్రపంచ వ్యవహారం నిర్వహిస్తుంది కూడా. "జీవ,ప్రకృతులు" ఆమె ఆజ్ఞానుసారం వర్తించేవే. ఇందు"జీవులు" బిడ్డలు. ఇల్లు, ఇంటి చుట్టూ వున్న తోటలోని వినోద వస్తువులే "ప్రకృతి". బిడ్డలు తోటలో ఆడుకున్నంత సేపు ఆమె తన పనిలో నిమగ్నమై వుంటుంది. బిడ్డలు ఆటలు చాలించి ఆకలితో ఎప్పుడొస్తారో అప్పుడు అమ్మ, వారిని లోనికి పిల్చి, తగిన ఆహారం ఇస్తుంది. ఇవన్నీ గ్రంథాల్లో స్పష్ఠంగా చెప్పిన విషయాలే. బిడ్డలు మళ్లీ ఆటలకు పోకుండా మాతా, పితల సేవలో దిగితే, వారిని తండ్రికి అప్పగించి, ఆ సేవలోనే వుంటుంది. బిడ్డలకు అపాయం కలగకుండా అవసరమైన వారిని ఏర్పాటుచేసే బాధ్యత తండ్రిది. ఇదే "అంశావతారం". ఒక వేళ ఆఅపాయం కష్ట సాధ్యమైన కార్యమైతే స్వయంగా తానే బయలుదేరి, భార్య దగ్గర తగుపరికరాలను తీసుకొని, అవసరమైన వేషం ధరించి, అపాయాన్ని తప్పించి, వేషం మార్చుకుంటాడు. ఇదే "పూర్ణావతారం".  

            భర్తకొరకు వచ్చి ఆయన్ను కలవదల్చుకున్న వారెవరైనప్పటికీ, భార్య అనుగ్రహించి తలుపు తీసి, దారి చూపేవరకు ప్రవేశించలేరు. ఈ తలుపు తానైనా తీస్తుంది....లేదా....భర్త పంపిన వారితోనైనా చేయిస్తుంది. అలా పంపబడినవాడే "ఆచార్యుడు". మనం  స్వశక్తితో ఎంత కాలమైనా, ఎన్ని కల్పాలకైనా లోనికి పోలేం. మన ఏడ్పులు విని, ఆమె మనస్సు కరిగి తలుపులు తీస్తేనే మనం లోపలికి పోగలుగుతాం. ఇంతకు మించి వేరే మార్గం లేదు.

            "తలుపులు" అనే నామ రూపాలతో వ్యాపించి ఉన్న దాన్నే "మాయ"అనీ, "ప్రకృతి" అనీ, "కర్మ"అనీ, రకరకాలుగా పిలుస్తారు. ఇదంతా శ్రీదేవి చిద్విలాసం. కాబట్టి భగవత్ ప్రాప్తి కోరేవారికి శ్రీదేవి అనుగ్రహం అనివార్యం. భగవంతుడు పంపిన ఆచార్యుడు కూడా, ఈమె అనుగ్రహం లేందే ఏపనీ చేయలేడు. బయటకు పోనూలేడు, లోనికి రానూలేడు. కాకపోతే, శ్రీదేవి భర్త సంకల్పం ప్రకారమే సమస్త కార్యాలు చేస్తుందే కాని ఆయన ఆజ్ఞను అతిక్రమించి ఏమీ చేయదు.


            కావున భగవత్ సంకల్పమే"శ్రీ"...."శ్రీ"యే భగవత్ సంకల్పం. భగవత్ సంకల్పం, ఆ వ్యవహారం అంతా ఈమె మూలాన్న జరగాల్సిందే. భగవత్ కరుణాస్వరూపిణైన ఈశక్తినే సాత్వికులు "శ్రీ"అనీ, "లక్ష్మి"అనీ కొలుస్తారు. రామ కటాక్ష ప్రాప్తికి సీతానుగ్రహం అవశ్యం.

          సుందరకాండ పఠించే వారు ప్రత్యుత్తరం కోరి చదవ వలసిన కొన్నిముఖ్య విశయాలు:

·       బధ్ధ జీవ తారతమ్యం
·       లంకలోవున్న రాక్షస స్త్రీలు
·       చెరనుండి తప్పించుకోదలచీ ఆపని చేయలేని దేవతా స్త్రీలు
·       కర్మవశాత్తు లంకకు చేరి, అందు లగ్నం కాక, ప్రసన్నయై భగవత్ సహాయంతో తప్పించుకున్న సీత
·       యధేచ్చగా లంక ప్రవేశించి, అందులో చిక్కుకోకుండా, దాన్నే దగ్దం చేసిన హనుమంతుడు(వీరు మహాత్ములు-ఋషులు)
          పైన వివరించబడిన నాలుగు విధాలైన జీవాత్మలు సుందరకాండ లో కనిపిస్తారు.
·       జీవాత్మ-పరమాత్మలకు గల సంబంధం సీతారాముల సంబంధం లాంటిది
·       జీవాత్మ తరణోపాయం....ఇది సీతాదేవి చర్య వలన అర్ధమవుతుంది.
·       శిష్య-ఆచార్య లక్షణాలు....ఇది సీత-ఆంజనేయ చర్యవలన తెలుస్తుంది.
·       జీవాత్మలకు సేవ్యుడు నిర్విశిష్ట రాముడా? సీతావిశిష్ట రాముడా?.....ఇది హనుమంతుడి చర్యవలన విశదమవుతుంది.
·       ఆత్మావలోకన పరుడైన యోగి లక్షణం హనుమంతుడి చర్యవలన తెలుస్తుంది.
·       సీతాదేవి ఉపాయమా? ఉపేయమా?....రెండూనా?
·       యోగికి, ప్రపన్నుడికి భేదమేంటి?

            ఈ ముఖ్య విషయాలన్నింటికీ ప్రత్యుత్తరం సుందరకాండలో దొరుకుతుంది. ఎన్నిసార్లు సుందరకాండ చదివితే అంత వివరంగా సమాధానాలు దొరకుతాయి. ఇక సీతా, హనుమంతులను విడిచినవారికి రామచంద్రుడి అనుగ్రహ ప్రాప్తం కలుగదు. సుందరకాండ ఈ ఇరువురి చరిత్రే. అందుకే పలువురి ఆదరణకు నోచుకున్నది. పారాయణ రూపంలో జనావళిచే ఆదరించబడుతున్నది. వారి, వారి అభీష్టాలను నెరవేర్చి సంతోషపెట్టేదీ సుందరకాండ. సుందరకాండను వాసుదాస స్వామి శ్రీరామచంద్రమూర్తికి విన్నవించేటందుకు ఆయన్ను సంబోధిస్తూ: "శ్రీదేవికి నివాస స్థానమైనవాడా! సంసార సాగరాన్ని దాటేందుకు "గురువు" అనే గొప్ప పడవను నడిపేవాడా! అట్టి సాగరాన్ని దాటేందుకు కావాల్సిన శ్రధ్ధా భక్తులను అనుగ్రహించువాడా! శాశ్వత సుఖాన్నిచ్చేవాడా! జానకీదేవి హృదయకమలములందు నివసించేవాడా!" అని అంటారు.


          సంసారి చేతనుడిని ఉధ్ధరించేందుకు ఆచార్యుడు చేసే ప్రయత్నం, దూతకృత్యం, పతివ్రతా లక్షణం, వివరంగా సుందరకాండలో చెప్పడం జరిగింది. End

Wednesday, May 24, 2017

Apologise Amit Shah…Demands KCR : Vanam Jwala Narasimha Rao

Apologise Amit Shah…Demands KCR
Vanam Jwala Narasimha Rao

Chief Minister K Chandrashekhar Rao on Wednesday (24th May 2017) demanded an unconditional apology from BJP National president Amit Shah for uttering blatant lies, falsehood and insulting the Telangana state and its people. Confronting and countering Amit Shah’s utterances with detailed statistics, the CM said, if Amit Shah or the local BJP leaders or to that matter anyone who dares him to prove wrong he is prepared to quit the chief ministership. He demanded Amit Shah to tender his apology before he leaves the State and correct himself.

            Addressing a media conference at Pragathi Bhavan, the Chief Minister repeatedly proved Amit Shah’s comments and statements as baseless and far from truth and charged the BJP National President with indulging in malicious propaganda to show Telangana State in poor light and attempting to scuttle its growth. The CM said Telangana State is one of the six states along with Gujarat, Maharashtra, Tamil Nadu, Karnataka and Haryana which have been contributing to the Nation and its economy. In return the Telangana State is getting whatever it is rightly due under the federal structure and in accordance with the provisions of the Constitution and no favour whatsoever is shown to the state by the Centre. CM also said in foreign exchange Telangana is earning for the centre to a tune of one lakh crores and that is also a contribution by the state to the centre.

The CM However said, he had a great respect towards Prime Minister Modi but was pained to see a leader like Amit Shah President of a national party which is heading power at the Centre is indulging in utter falsehood without applying his mind. To a query, the CM said he found no danger to his relationships with the PM against this background. He also said that having good faith in the leadership of Modi, he had extended his support to him during the demonetisation which none of the BJP CMs did.

            Giving the statistics about the financial assistance given by Centre from the day the Telangana state is formed on June 2, 2014 to this day, 24 May 2017, the CM said the state received Rs 67, 390 Crores from Government of India. The split of these funds are: Rs. 37, 773 Crores towards Tax Devolution, Rs. 18, 574 Crores towards Central Schemes, Rs. 2055 Crores towards National Highways, Rs. 1016 Crores towards special funding in accordance with Reorganization Act, Rs. 5, 160 Crores for local bodies as per the recommendations of finance commission, Rs. 855 Crores towards NDRF and Rs. 1,957 towards CST. Hence the claim of Amit Shah that the centre had give Rs. One lakh crores is wrong said CM.

The CM further said that in 2016-2017 financial year an amount of  Rs 50,013 Crore (Income Tax, Rs 32, 186 Crore, Service Tax, Rs 7671 Crore, Customs Tax, Rs 3328 Crore, Central Excise Rs 6828 Crore) was given as the State’s share to the centre. As part of Central Devolution (including the national highways) it is only Rs 24,561 Crore that was given to the state said CM. This means the state had given more (Rs. 25, 452 Crores) to the centre which is more than what has been given by centre.

The CM further questioned Shah that, “Let Amit Shah and the BJP leaders answer this from where the state got additional funds? Where is that Rs 20,000 Crore additional assistance that the Centre gave as claimed by Shah? Show me that the centre gave at least Rs 200 more?” the CM asked. As far as starting the universities like the Tribal, Horticulture and Veterinary, these universities are created under the Bifurcation Act and so far the Tribal University has not been sanctioned and Amit Shah says the centre gave Rs 40,800 Crore for the universities which again are totally false!


The CM said that last year also Amit Shah came here and said certain things which the local BJP leaders ran a camping for week but he did not react. “I will tolerate anyone who talks against me personally. I will not keep quiet when Telangana State is belittled and insulted with falsehood. If I don’t react now people may think I am endorsing what Amit Shah said. Amit Shah or another Shah for me Telangana State is Badshah. I have seen many leaders like Amit Shah and have weathered many a storms. What the BJP is doing now is not even a small wind. I met Amit Shah only once till this day,” the CM said.

The CM reminded Amit Shah that several new and innovative initiatives taken by the Telangana government have won appreciation from Chief Ministers of other states, Central ministers including the PM, Niti Aayog Vice Chairman and even from heads of States abroad. “My competition is not with the neighbouring state or other states, or even Centre. I am in global competition and literally competing with countries abroad. Union Minister Uma Bharathi told other states especially regions like Bundelkhand to emulate the Telangana State model. UNDP and Niti Aayog have praised Mission Kakatiya and Mission Bhagiratha and recommended for the sanction of Rs 25,000 Crores which the Centre so far not released. Let Amit Shah go to Delhi and get the dues from the Centre to the State. He also reminded Amit Shah that not even a single project from the State is declared as a national project. Though, 7 Mandals and Sileru power project were illegally transferred to the AP, the CM said he kept quiet. There are several programes of the Centre like the Model schools which were discontinued by the Centre but were continued by the state government. Though there is budget cut for the salaries of Aanganwadi and Asha programmes, the Telangana government is paying them increased salaries.

Stating that the Telangana State had initiated several welfare schemes which are first in the country, the CM said the Centre has allocated Rs 52, 392 Crore for SC welfare while the Telangana State allocated Rs 14,375 Crore, for STs, the Centre gave 31, 919 Crore while the Telangana State Rs 8,165 Crore which is five times higher than the Centre. Rs 17,000 Crore farmers’ loan was waived and an innovative first of its kind farm policy is being pursued by the government to end the problems of the farming community forever. Though the state has asked for Rs 6, 076 Crore the drought and cloud burst, the Centre gave precious little Rs 855 Crore. The centre is due to the states an amount of Rs. 10, 190 towards CST dues and Rs 1431 Crore towards CAMPA funds and let Amit Shah and other BJP leaders get them released suggested CM KCR.

The CM took strong exception to the remarks made in sarcastic manner on Telangana. He said he was particularly upset over Amit Shah’s remarks on the high court’s bifurcation issue. “The Centre is not bifurcating the High Court despite several reminders and even the matter was brought to the notice of the Supreme Court. He said Amit Shah’s remarks on High Court reminded him of the remarks made by LK Advani when he was the union home minister and Deputy PM. “Advani asked during the height of Telangana struggle where the need for Telangana state is when Hyderabad is very much its capital?”

The CM also took a dig at the “gimmicks” played by Amit Shah while visiting the dalit Basties. “He had lunch prepared outside at a mango grove and ate it at a dalit’s house which is protested by Dalits. He made a senior BJP leader and dalit leader stand behind him while he and other ate sitting on the chairs. Dalits of the State watched this and I have seen several such cheap gimmicks. “Amit Shah should realise where is he standing and what is he speaking, is it his own script or the script given by local BJP leaders? In this context, the CM also reminded how the BJP for several years played games on Telangana issue. Everyone knows what did BJP done after passing the two states resolution in Kakinada in 1999.

When his attention was drawn to a tweet by the local BJP that the CM is rattled by Amit Shah’s statements, the CM rebutted by saying that he is one leader who will not be rattled by any one. The BJP which could not win even a single division in GHMC polls is the least that he is bothered. “I have a detailed survey done on the prospects of each political party if there is an election now, the BJP will not get even a single seat. In last elections they got five seats in the confusion. He said he would make public results of the survey later. However, the CM clarified that Amit Shah as a political leader is free to express his views but not unnecessary sarcasm, falsehood and utter lies. “I hope wisdom will prevail upon Amit Shah and he will correct himself,” the CM said. In this context, the CM also recalled how Amit Shah’s flippant remarks have proved costly to the BJP in Delhi polls especially his observation that getting black money issue was nothing but an election Jumla.

Answering another question, the CM observed that Telangana is known for its Ganga Jamuna Tehjeeb. “In 1927, when Mahatma Gandhi visited VV College in Jambagh in the city, he said he was impressed with the people here who are living in harmony under the Nizam’s rule. Mahatma Gandhi said that people in north should learn couple of things from Telangana,” the CM recalled. He also said nothing stops BJP from dreaming about coming to power in Telangana State. “I can also dream about leading the country, but it will be a dream only and may not be a reality,” he said.

The CM also advised Amit Shah to stop performing Tamashas in Telangana state. ‘People here can see through the things. After a prolonged 60 years movement and 14 years battle we have achieved Telangana state.


On the Muslim reservation issue, the CM once again reminded the BJP leaders in general and Amit Shah in particular what the PM spoke at the BJP National Executive meeting Odisha where he advocated for uplifting the backward among the Muslims. “I have personally spoke to the PM and explained him the need to hike the reservations for those backward among Muslims which he said he would consider. “ In any case if the Centre accepts it is fine otherwise we are not beggars and we will fight for our rights.” 

Monday, May 22, 2017

ఆంధ్ర వాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి? : సుందర హనుమంతుడు నిజంగా సుందరుడే-2 : వనం జ్వాలా నరసింహారావు


ఆంధ్ర వాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి?
సుందర హనుమంతుడు నిజంగా సుందరుడే-2
 వనం జ్వాలా నరసింహారావు
సూర్యదినపత్రిక (22-05-2017)

            "యమ-నియమములు" హనుమంతుడికు వుండడం సుప్రసిధ్ధం. అభ్యాసమందు ప్రాణాయామం కంటే ప్రత్యాహారం కష్టసాధ్యం. ప్రాణాయామ దశలో, తానింత లావు-పొడవు కలవాడినన్న స్తూల దేహజ్ఞానముండవచ్చు. ప్రత్యాహార దశకు చేరుకునేటప్పటికి, దేహం అతి స్వల్పమైనట్టుగ భావించి, దేహసంధులన్నీ తొలగించి, సడలించిన గాని, ప్రత్యాహారం సాధ్యం కాదు. ఉదాహరణకు హనుమంతుడు పిల్లి ఆకారంలోకి మారడం. అదేవిధంగా ఎంత మెల్లగా మనస్సును లోనికి ప్రవేశింప చేయాలన్న పట్టుదల వున్నప్పటికీ, ఏదో ఒక ప్రతిబంధకం అడ్డుపడే అవకాశం వుంది. ఉదాహరణకు లంకా రాక్షసి.....దాన్ని జయిస్తేనేగాని ఆత్మ దర్శనం సాధ్యపడదు. ఆత్మసాక్షాత్కారం పొందిన పెద్దల ద్వారానూ.....ఉదాహరణకు సంపాతి, శ్రుతివలన, ఆత్మ హృదయగుహలో వున్నట్లు తెలుసుకోవచ్చు. అయినప్పటికీ దానిని కనులారా కనుగొనాలంటే, హనుమంతుడు చేసిన రీతిలో, రాత్రి వేళ ఆయన శ్రమించిన రీతిలో, మరల-మరల శ్రమించాల్సి వుంటుంది. ఇలాంటప్పుడు కూడా భ్రాంతి (మండోదరి) దర్శనం లాంటి విఘ్నాలు సంభవించవచ్చు. ఈ గండాలన్నీ గడిస్తేనేగాని ఆత్మదర్శనం కలగదు. అదేమాదిరిగా, సీతాసంభాషణ, లంకా దహనం, వానరులతో సీతావృత్తాంతం చెప్పడం, సీతాదేవిపై భక్తి, ఇవన్నీ సాధకులకు అనుభవ గోచరాలు.

            సీతాదేవికున్న ఒకే ఒక కోరిక, రామసమాగమం. అది అనన్యసాధ్యం. రాముడు ఎట్లాగైనా తన్ను రక్షిస్తాడని ఆమె నమ్మకం. అందుకే హనుమంతుడు ప్రాధేయపడినా ఆయనతో వెళ్లడానికి  ఇష్ట పడకుండా వుంటుంది. అంగీరించలేదు కూడా.

            యోగ మార్గంలో సంచరించేవారికి ప్రధమ విఘ్నం తన హితులు-సన్నిహితుల వల్లనే కలుగుతుంది. దాన్నే "సాహాయిక రూప విఘ్నం"అంటారు. అది విఘ్నమే కాబట్టి అభ్యాసి దాన్ని ఆమోదించ కూడదు, అంగీకరించనూ కూడదు. ఉదాహరణకు మైనాకుడి చరిత్ర. ఆ పరీక్షలో నెగ్గిన తర్వాత, అభ్యాసి శుధ్ధ శక్తిని పరీక్షించేందుకు దేవతలే విఘ్నం కలిగిస్తారు. ఉదాహరణకు సురస వృత్తాంతం. దానికీ లోను కాకూడదు. ఇది కూడా గెల్చిన తర్వాత భూత గ్రహాలు పీడిస్తాయి (సింహిక వృత్తాంతం). ఇట్టి యోగసిధ్ధిని హనుమంతుడు పరభక్తి సాధనంగా చేసుకున్నాడు.

            సుందరకాండలో ప్రధమాక్షరం "" (తతో రావణీతాయా). కడపటి అక్షరం కూడ "" (తతో మయా వాగ్భిరదీ నభాషిణా). ఇది "తత్" అనే దాన్ని బోధిస్తుంది.

అదే విధంగా సుందరకాండలో ప్రతి సర్గలో మొదటి అక్షరం ""కారమో, ""కారమో వుంటుంది. లేదా "సీత" శబ్దం కాని, పర్యాయ పదం కాని వుంటుంది. అదీ తప్పితే రెండవ శ్లోకం మొదటి అక్షరం "-" తప్పదు. "-"లు "సీత"ని సూచించడం స్పష్టంగా తెలుస్తోంది. సీతేకదా సుందరకాండకు అధిష్టాన దేవత. వీటిని పర్యాలోచించి చూస్తే, సుందరకాండ పఠనం వల్ల భుక్తి-ముక్తి కలుగుతుంది అని అర్థమవుతుంది. కాకపోతే శ్రధ్ధ-భక్తి వుండాలి. ఇహ పర సాధనానికిది మార్గాన్ని సుగమం చేస్తుంది.


            సంస్కృత రామాయణం అర్ధం గ్రహించి పారాయణం చేస్తే సర్వ శ్రేయస్కరం. ఆంధ్రవాల్మీకి రామాయణం పారాయణం చేసినా అంతే శ్రేయస్కరం. అయితే, అర్ధం తెలియని చదువు వ్యర్ధం. అర్ధం తెలీక పోతే మనసు రంజిల్లదు. మనసు రంజిల్లక పోతే భక్తి కుదరదు.

            అందుకే సుబోధకమగు ఈ గ్రంథాన్ని ఈరీతిలో పఠించే వారికి కూడా సత్ఫలితాలు కలుగుతాయి. మూలమందున్న విషయ సారమంతా దీంట్లో కూడా వుంది. ఇది చదివిన వారికీ, పారాయణం చేసినవారికీ, భగవంతుడు సకల శ్రేయస్సులు ఒసంగుననీ, తద్వారా దైవభక్తి లోకంలో వర్ధిల్లుననీ.....శ్రీరామచరణానందుడు, భక్తచరణ పరచరణుడు, వాసుదాసస్వామి, భగవంతుడినీ, శ్రీరామచంద్రుడినీ ప్రార్థించారు. End