Saturday, April 30, 2022

ఎనిమిదవ రోజు యుద్ధంలో భీష్ముడి కూర్మవ్యూహం, ధృష్టద్యుమ్నుడి శృంగాటకవ్యూహం.... పాండవులను జయించడం ఈశ్వరుడికి కూడా సాధ్యం కాదన్న భీష్ముడు : ఆస్వాదన-69 : వనం జ్వాలా నరసింహారావు

ఎనిమిదవ రోజు యుద్ధంలో భీష్ముడి కూర్మవ్యూహం, ధృష్టద్యుమ్నుడి శృంగాటకవ్యూహం

పాండవులను జయించడం ఈశ్వరుడికి కూడా సాధ్యం కాదన్న భీష్ముడు

ఆస్వాదన-69

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక ఆదివారం సంచిక (01-05-2022)

కురుక్షేత్రంలో ఎనిమిదవ రోజున కౌరవ పాండవులు యుద్ధానికి మొహరించినప్పుడు భీష్ముడు కూర్మవ్యూహాన్ని ఏర్పరిచాడు. పాండవుల సేనాపతి ధృష్టద్యుమ్నుడు దానికి ధీటైనిదిగా వుండేలా శృంగాటకవ్యూహాన్ని పన్నాడు. ఇలా ఉభయ సైన్యాలు వ్యూహాలు ఏర్పాటు చేసుకుని యుద్ధానికి సిద్ధమై ఒకరినొకరు తలపడ్డారు. అప్పుడు భీష్ముడి విజృంభణకు ఆయన్ను ఎదిరించలేక పాండవ సేనలోని మహావీరులంతా మారుమూలలకు తొలగారు. భీముడు ఒక్కడు మాత్రం భీష్ముడిని ఎదిరించాడు. అతడి సారథిని హతమార్చగా గుర్రాలు రథాన్ని లాక్కొని పరుగెత్తాయి. అప్పుడు దుర్యోధనుడి తమ్ముడు సునాభుడు భీముడిని ఎదుర్కున్నాడు. భీముడు ఒక్క నవ్వు నవ్వి సునాభుడి తల నరికాడు. ఇది చూసిన అతడి ఏడుగురు సోదరులు దొమ్మిగా భీముడి మీదికి దూకారు. భీముడు రోషంతో ఆ ఏడుగురిని చంపాడు. దీన్ని చూసి మిగతా కురుకుమారులు భయంతో అక్కడినుండి తొలగిపోయారు.

భీముడి చేతుల్లో తన తమ్ములు చావడం చూసిన దుర్యోధనుడు దుఃఖంతో భీష్ముడి దగ్గరికి వెళ్లి, ఆయన వారిని కాపాడలేదని, బాగా యుద్ధం చేయలేదని ఎత్తిపొడుపు మాటలన్నాడు. ఇలాంటి ఆపత్తు వస్తుందని తాను, ద్రోణాచార్యుడు, విదురుడు దుర్యోధనుడికి ఏనాడో చెప్పామని, కాని తమ మాటలను అప్పుడు ఆయన ఏమాత్రం లెక్కచేయలేదని, మహాపరాక్రమవంతులైన పాండవులకు ఎదురుగా నిలిచి జయించడానికి ఈశ్వరుడికి కూడా సాధ్యం కాదని, ఇక కౌరవులు ఏపాటి అని భీష్ముడు పలికాడు దుర్యోధనుడితో. కౌరవ కుమారులలో ఎవరైనా భీముడికి ఎదురైతే వాడిని కాపాడడం ఎలాంటి శూరుడికైనా సాధ్యం కాదని, ఈ దుస్థితిని గురించి ఏడ్వాల్సిన అవసరం లేదని కూడా అన్నాడు భీష్ముడు. ఇక ముందు వీరస్వర్గాన్నే ధనంగా కోరి యుద్ధం చేయమని, రాజ్యం మీద ఆశలు వదలమని, తానైతే చేతనైనంత తెగించి యుద్ధం చేస్తానని స్పష్టం చేశాడు.

ఇలా చెప్పిన భీష్ముడు భయంకరమైన ఆకారంతో భీముడున్న వైపుకు రథాన్ని పోనిచ్చాడు. అది చూసి ధృష్టద్యుమ్నుడు, శిఖండి, దర్మరాజు సూచన మేరకు ముందుకువచ్చి భీష్ముడితో తలపడ్డారు. అంతకు ముందే అర్జునుడు, చేకితానుడు, ద్రౌపదీ పుత్రులు ఒకవైపు కౌరవులతో పోరాడుతుంటే, మరో వైపున అభిమన్యుడు, ఘటోత్కచుడు దుర్యోధనుడి మీదికి ఉరికారు. ఆ విధంగా మూడు గట్టి సైన్యాలు చాలా కఠోరంగా యుద్ధం సాగించాయి.

కౌరవుల పక్షాన ద్రోణాచార్యుడు; పాండవుల పక్షాన భీముడు, అర్జునుడు, నకుల సహదేవులు విజృంభించారు. అర్జునుడికి, నాగకన్య ఉలూచికి పుట్టిన ఇరావంతుడు విజృంభించి కురుసేనమీద దూకడంతో, శకుని ఆరుగురు తమ్ముళ్లు అతడిని ఎదుర్కున్నారు. అయినా ఇరావంతుడు చాలా నైపుణ్యంతో వారితో యుద్ధం చేశాడు. ఒక దశలో ఇరావంతుడు నేలమీద నిలబడి యుద్ధం చేస్తుంటే, ఆ ఆరుగురు కూడా కిందికి దిగారు యుద్ధం చేయడానికి. తన దగ్గరికి వచ్చిన ఆ ఆరుగురు శకుని తమ్ముళ్లను పన్నెండు తునకలుగా నరికేశాడు ఇరావంతుడు. ఇది చూసి దుర్యోధనుడు అలంబసుడిని ఇరావంతుడి మీదికి పురికొల్పాడు. మాయాబలంతో యుద్ధం చేయసాగాడు అలంబసుడు. అయినా ఇరావంతుడు ధైర్యంగా అలంబసుడిని ఎదిరించాడు. ఇద్దరూ ఒక దశలో ఆకాశానికి ఎగిరి మాయా యుద్ధం చేశారు. ఇద్దరూ ఇంద్రజాల, మహేంద్రజాల విద్యలను ప్రదర్శించి యుద్ధం చేశారు. ఇరావంతుడు ఆదిశేషుడి రూపాన్ని ధరిస్తే, అలంబసుడు గరుత్మంతుడి ఆకారం ధరించాడు. అప్పుడు ఇరుకున పడ్డ ఇరావంతుడి మెడ అలంబసుడు నరికేశాడు.

తన సోదరుడు మరణం చూసిన ఘటోత్కచుడు కోపించి కురుసైన్యంలో చొరబడ్డాడు. అతడిని దుర్యోధనుడు ఎదుర్కున్నాడు. అదనంగా, వేగవంతుడు, విద్యుజ్జిహ్వుడు, బహ్వాశి అనే ముగ్గురు రాక్షసులను కూడా అతడి మీదికి పంపాడు. ఘటోత్కచుడు తన బాణాలతో దుర్యోధనుడి శరీరాన్నంతా నింపేశాడు. ఆ తరువాత శక్త్యాయుదాన్ని ప్రయోగించడానికి పూనుకోగా, దుర్యోధనుడు ఒక గొప్ప ఆయుధాన్ని అతడి మీదికి వేశాడు. కాని దాన్ని మధ్యలోనే ముక్కలు చేశాడు ఘటోత్కచుడు. తరువాత పెద్దగా సింహనాదం చేశాడు. అది విన్న భీష్ముడు పన్నెండు మంది ద్రోణాది వీరులను (కృపాచార్యుడు, అశ్వత్థామ, చిత్రసేనుడు, బాహ్లికుడు మొదలైనవారు) దుర్యోధనుడి రక్షణకు పంపాడు. వారంతా దుర్యోధనుడి చుట్టూ రక్షణగా నిలిచి ఘటోత్కచుడిని ఎదిరించారు. ఘటోత్కచుడు విజృంభించి ద్రోణాది వీరులందరితో యుద్ధం చేసి, కొందరి సారథులను చంపాడు. కొందరి ధనుస్సులను విరిచాడు. కౌరవసైన్యాన్ని చీల్చి చెండాడాడు. అతిరథ మహారథ వీరులను చిక్కుపెట్టాడు.

అప్పుడు ద్రోణుడాదిగాగల పన్నెండు మంది వీరులు కోపించి ఘతోత్కచుడిని ఒక్కడిని చేసి చుట్టుముట్టారు. ఘటోత్కచుడు ఆకాశానికి ఎగిరి యుద్ధం చేయడం మొదలుపెట్టాడు. అప్పుడు అక్కడికి, కౌరవ సేనను ఎదిరించడానికి, ధర్మారాజు ఆదేశానుసారం భీముడు వచ్చాడు. అదే సమయంలో అక్కడికి వచ్చిన దుర్యోధనుడికి, భీముడికి మధ్య యుద్ధం జరిగింది. దుర్యోధనుడి దెబ్బకు భీముడు ఒళ్లు మరిచి ఒరిగిపోయాడు. అతడి దుస్థితి చూసి ఉప పాండవులు విజృంభించారు. ఇంతలో భీముడు తెప్పరిల్లుకుని ద్రోణుడిని కొట్టి మూర్ఛపోయేలా చేశాడు. అప్పుడు అశ్వత్థామ, దుర్యోధనుడు భీముడిని ఎదుర్కున్నారు. ఘటోత్కచుడు, ఉప పాండవులు, అభిమన్యుడు అంతా యుద్ధానికి దిగారు.

ఘటోత్కచుడు మాయా యుద్ధం చేయడం మొదలు పెట్టాడు. కౌరవ యోధులంతా చచ్చిపడి వున్నట్లు సైనికులకు కనబడేలా మాయ చేశాడు. అదంతా రాక్షసమాయ అని భీష్ముడు చెప్పినా వారు వినిపించుకోలేదు. అప్పుడు దుర్యోధనుడు భీష్ముడి దగ్గరికి వచ్చి ఎప్పటి మాదిరిగానే నిష్టూరాలు పలికాడు. ఆయన లాంటి, ద్రోణుడు లాంటి గొప్ప వీరులు కౌరవ పక్షంలో ఉన్నప్పటికీ శత్రువుల చేతుల్లో కష్టాలు పడుతున్నానని, ఇక తానే స్వయంగా పాండవులతో పోరాడి చావనైనా చస్తానని, లేదా జయాన్నైనా పొందుతానని అన్నాడు. భీష్ముడు దుర్యోధనుడి మాటలు విని నవ్వాడు. పాండవులను ఎదిరించడానికి పాండవులంతటి వారే వుండాలి కాని దుర్యోధనుడి లాంటి వాడికి సాధ్యం కాదని, హీనమైన నడవడి అతడికి తగదని, అసాధ్యమైన యుద్ధంలో కౌరవుల పక్షాన యుద్ధం చేయడానికి తన లాంటి వారున్నారని, దుర్యోధనుడు యుద్ధం చేయనక్కరలేదని అన్నాడు.

తరువాత భీష్ముడు ప్రోత్సహించగా భగదత్తుడు ఏనుగును ఎక్కి పాండవ సేనతో యుద్ధానికి దిగాడు. ఇది చూసి ఘటోత్కచుడు పెద్ద ఏనుగునెక్కి, తన రాక్షస సైన్యాన్ని తీసుకుని భగదత్తుడి మీదకు పోరాటానికి వచ్చాడు. అతడికి అండగా భీముడు, అభిమన్యుడు, ద్రౌపది కొడుకులు వచ్చారు. అయినా భగదత్తుడు విజృంభించి యుద్ధం చేయసాగాడు. ద్రోణాచార్య, కృపాచార్య యోధులు పాండవ సేనను వెంటబడి తరిమారు. కౌరవ సేనలో కోలాహలం పుట్టింది. అది చూసి ధర్మరాజు, అర్జునుడు, ద్రుపదుడు అటు వెళ్లారు యుద్ధం చేయడానికి. అలా వచ్చిన వారిలో అర్జునుడు విజృంభించి యుద్ధం చేయసాగాడు. అప్పుడు భీముడు అర్జునుడికి ఇరావంతుడి మరణం గురించి చెప్పాడు. అర్జునుడు విధిని నిందించాడు. శ్రీకృష్ణుడు తత్త్వబోధ జ్ఞప్తికి తెచ్చుకున్న అర్జునుడు దుఃఖాన్ని మరచి కౌరవ సేన వైపు రథాన్ని పోనిమ్మని శ్రీకృష్ణుడిని కోరాడు.

అర్జునుడు గొప్పవైన బాణాలను కౌరవ సేనమీద ప్రయోగించాడు. మరో వైపున భీముడు యుద్ధంలో విచ్చలవిడిగా విహరిస్తూ కౌరవులను ఏడుగురిని చంపగా మిగిలినవారు భయపడి పారిపోయారు. అప్పుడే సూర్యుడు అస్తమిస్తున్నాడు. అప్పుడు దుర్యోధనుడు యుద్ధం చేయడానికి పూనుకోగా, పాండవులు కూడా వెనక్కు తగ్గకుండా ఉత్సాహంగా పోరు సాగించారు. ఇంతలో చీకటి అంతా వ్యాపించగా, పాండవులు, కౌరవులు యుద్ధాన్ని చాలించి తమ తమ నివాసాలకు వెళ్లిపోయారు. తన సైన్యం చాలా నష్టం కావడం వల్ల, ఆ ఎనిమిదోనాటి రాత్రి, దుర్యోధనుడి మనస్సు కలత చెందింది.

యుద్ధం ఆగిఅన తరువాత ఆ సాయంత్రం, దుర్యోధనుడు దుశ్శాసనుడు, కర్ణుడు, శకునిలతో సమావేశమయ్యాడు. భీష్ముడు, ద్రోణుడు, కృపుడు, అశ్వత్థామ మధ్యస్థంగా వుంటూ పాండవ సైన్యాలను చంపడం లేదని, ఏం చేస్తే మంచిదని వారిని అడిగాడు దుర్యోధనుడు. మున్ముందు భీష్ముడిని యుద్ధానికి తీసుకుపోవద్దని, తాను పాండవులను ఎదుర్కుని వారిసైన్యాన్ని హతమారుస్తానని కర్ణుడు అన్నాడు. భీష్ముడి యుద్ధాన్ని నిలిపివేద్దాం అని దుశ్శాసనుడితో అన్నాడు దుర్యోధనుడు. ఇలా అంటూ కర్ణుడిని, శకునిని వారి ఇళ్లకు పంపించి వేశాడు.  స్నానాది కార్యక్రమాలు ముగించుకుని దుశ్శాసనుడిని తీసుకుని భీష్ముడి దగ్గరికి పోయాడు.

భీష్ముడు యుద్ధం చేస్తున్న తీరు గమనిస్తే ఆయన పాండవుల పట్ల మెతకదనం చూపిస్తున్నాడని, వారికి నొప్పి కలిగించకుండా వుంటున్నాడని, వారు చేత చిక్కినా ఏమీ చేయడం లేదని అన్నాడు దుర్యోధనుడు భీష్ముడితో. భీష్ముడిని యుద్ధంలో దేవదానవులైనా ఎదిరించలేరని, అయినా యుద్ధం మొదలయ్యి ఎనిమిది రోజులు జరిగినా ఇంకా ఆర్జునుడిని భీష్ముడు చంపలేదని, కాబట్టి ఇక ఆయన యుద్ధం విరమిస్తే కర్ణుడిని యుద్ధానికి పంపిస్తానని అన్నాడు దుర్యోధనుడు. భీష్ముడు ఆ మాటలకు బాధపడ్డాడు. అతడలా కఠినంగా మాట్లాడడం న్యాయం కాదన్నాడు. అర్జునుడి పరాక్రమాన్ని (ఖాండవ వన దహనం, శివుడిని మెప్పించడం, పాశుపతం ఇతర దివ్యాస్త్రాలు సంపాదించడం, గంధ్రవుల బారి నుండి దుర్యోధనుడిని విడిపించడం, ఉత్తరగోగ్రహణంలో అర్జునుడు విజయం మొదలైనవి) గుర్తు చేశాడు. జయింపరాని పాండవులతో విరోధం తెచ్చుకున్నాడని, కల్లబొల్లి మాటలతో ప్రయోజనం లేదని, దుర్యోధనుడు యుద్ధంలో తన ప్రతాపాన్ని చూపాలని అన్నాడు భీష్ముడు. తాను ఆర్జునుడిని జయించలేనని, శిఖండిని చంపలేనని, తక్కినవారు ఎంతమందైనా చీల్చి చెండాడుతానని స్పష్టం చేశాడు.

తాను, తన సైన్యం కలిసి ద్రుపద, విరాట, యాదవ సైన్యాన్ని ఎదుర్కొని యుద్ధం చేస్తామని, తక్కిన కౌరవ వీరులంతా దుర్యోధనాదులతో కలిసి పాండవులను గెలవడానికి ప్రయత్నించమని అన్నాడు భీష్ముడు. అర్థరాత్రి వచ్చి తనను సూటిపోటి మాటలు అనడం వల్ల లాభం లేదని, దీనివల్ల గెలుపు రాదని, మర్నాడు యుద్ధానికి సన్నద్ధుడిగా వెళ్లమని, తన బాహుబలాన్ని మర్నాడు చూడవచ్చని చెప్పాడు భీష్ముడు దుర్యోధనుడికి. భీష్ముడు చెప్పిన ఆ మాటలకు దుర్యోధనుడు సంతోషించాడు. మర్నాటి యుద్ధానికి సిద్ధం కాసాగాడు.

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, భీష్మపర్వం, తృతీయాశ్వాసం

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)

                        

                                                          


Any hard and fast rule for protocol? : Vanam Jwala Narasimha Rao

 Any hard and fast rule for protocol?

Vanam Jwala Narasimha Rao

The Hans India (01-05-2022)

In the recent past a section of media and few politicians are abuzz with news that when Telangana Governor visited Sammakka Sarakka tribal event and later Yadagirigutta temple and subsequently Bhadrachalam, due protocol was not accorded to her in receiving her properly. Some even attributed these happenings to the so-called strained relations between the Governor and Chief Minister. The Governor also met Prime Minister and Union Home Minister and apparently appraised of developments in the state including protocol violations said to have been meted out by her. The Governor even addressed media after she met them. Notwithstanding all this the Chief Minister maintained stoic silence on Governor’s comments and even in TRS plenary though he mentioned what the other states’ governors are doing, he did not take her name which speaks of his ethos.      

It may not be out of context if it is pointed out here that Kumud Ben Joshi was the Governor of the united Andhra Pradesh from 26 November 1985 to 7 February 1990. She was the second female Governor of the state after Sharda Mukherjee. Soon after taking charge, she travelled to all the state's 23 districts and often outside, to create a record of sorts. It was recorded that between 26 November 1985 and 30 September 1987, she travelled to the districts on 108 occasions, and outside the state 22 times. What protocol arrangements were made to her at that time by the then NTR Government is an open book. At least she never openly complained. Notwithstanding all that she concentrated more on social and rural developmental activities through non-governmental organizations headed by her like Red Cross Society, Chetana and National Institution of Social Action ably assisted by individuals with commitment from different walks of life. Flood relief measures, monsoon shelters construction, strengthening of Rd Cross blood banks, tree plantation, rehabilitation of Jogins, computer training program were some of the activities Kumud Ben Joshi had taken up through the voluntary organizations which became popular during her tenure.        

A protocol is a rule or a convention followed all over the globe, which describes how an activity should be performed and relationship has to be cordially maintained by the stakeholders involved. It is the decorum of maintaining healthy relations and affairs among functionaries of high precedence. It creates a welcoming environment for people conducting business and diplomacy. With the proper protocol in place, cross-cultural relationships can be built with confidence and without confusion or wondering who does what, when.  

In what is construed to be a grass protocol violation and an unhealthy unprecedented precedence, Prime Minister’s Office informed Telangana Chief Secretary’s Office, that Chief Minister K Chandrashekhar Rao need not be present at the airport to receive Prime Minister Narendra Modi during one of his official visits to Hyderabad few months ago to take stock of progress of ‘Covaxin’ being developed by Bharat Biotech Company. At least media reported so. On hearing the tour program of Prime Minister, Telangana CMO and Telangana State government promptly informed the PMO that the Chief Minister would be receiving Modi at the airport. It was nothing but giving a go-by to established protocol and practices. Despite this the Chief Minister’s office seems to have not registered a complaint or protest with PMO.

The visit by the PM to Bharat Biotech facility without accompanying the CM has raised several eyebrows then. How can the PM defy the Protocol and ignore the CM? Even for a small official function in a village, local Sarpanch is invited. Moreover, while reviewing the availability of the vaccine for Covid, the PM should have asked the CM and Health Ministers and other officials concerned to accompany him. Imagine the CM of the state where the vaccine is developed having no clue on what transpired between the PM and the scientists at the Pharma facility. Can the CM be kept in darkness about such an important matter? Is it in tune with the great democratic legacy our country is proud of?


It is an established practice in our country since Independence that the official visit of the elected representatives from the Prime Minister to the Village sarpanch will follow certain well laid down procedures. In every state government and the government at the Centre, a special department will take care of the Protocol matters.

Ever since the BJP led NDA government came to power at the Centre, all the basic norms, laid down procedures are given a go by and whatever the PM decides is followed diligently. According to media reports, Prime Minister addressed the nation announcing the demonetization in the middle of the night keeping all his Cabinet colleagues in dark denying them even the mobile access to them till he finished his address. The case is no difference when the Article 370 was abrogated. The Cabinet ministers, MPs are all kept in dark till the Ordinance got the assent of the President. Of course, one can understand the need to do so by PM as a matter of convenience and probably in the interest of Nation.   

Such practices which are contrary to parliamentary democratic spirit are indicative of scant respect to the cooperative federalism of this country. If these practices continue unabated then the cooperative federalism concept would be on the verge to collapse. There are umpteen occasions where the Union Ministers, key officials are not taken into confidence while making key decisions according to media reports. Does this mean that the country is governed by the decisions of a single individual? Where did the collective responsibility of the Cabinet or the federal spirit of our Constitution go?

Are we in a parliamentary democracy run by a union Cabinet or are we under the rule of an individual? Unfortunately, people are not reacting such wider violations, which have become an order of the day? People are now habituated to react to non-issues or the mythical things that may or may not have happened in the history.

The people have been brainwashed into indulging in a scripted narrative than to express their feelings, views, and opinions on burning issues that are engulfing our country. People in Telangana are well mannered and known for their courtesies, Tehzeeb. Hence, they did not react the way they should when their own CM is taken for granted.

Just for academic interest, we may recall that, the Uttar Pradesh legislature in 2016 deferred the implementation of a set of protocol guidelines issued by the President’s office for receiving Governor Ram Naik during the joint session of the state legislature. The new guidelines are meant for all states, and need to be accorded to state governors. The objections of the UP legislature have been sent to Raj Bhawan, from where they have been forwarded to the President’s office. Hence there seems to be no hard and fast rule or convention in observing protocol in India.

Notwithstanding all this, is there any standard protocol arrangement adhered to by Union Government like nominating a standard designated protocol officer to receive visiting Chief Ministers to New Delhi on official work to meet the Prime Minister or other Union Ministers? Why not?   

Wednesday, April 27, 2022

KCR: Statesman and man of the hour : Vanam Jwala Narasimha Rao

 KCR: Statesman and man of the hour

Vanam Jwala Narasimha Rao

The Pioneer (27-04-2022)

The Telangana Rashtra Samithi for over two decades has been progressively marching ahead with a characteristic success, probably unique to it alone and in the process registered two successive remarkable victories in the state Assembly elections and gearing itself for the third consecutive one which will be a hattrick. The Telangana state government during the last nearly eight years initiated and implemented a variety of programs. The basic reason and the driving force for achieving this success are the statesmanship, vision, strategic leadership qualities and commitment, decision making process through consensus, consultation and quality review methodology of Chief Minister K Chandrashekhar Rao.

All these resulted in defining, designing and delivering or to say more explicitly in conceptualization and implementation of people oriented, welfare oriented and development-oriented schemes in the state. Above all it is the Statesman like Leadership that is causing development.

In this context we may probably refer to Jim Collins who authored a book on leadership titled “Good to Great” where he deals extensively with the qualities and success of level five leadership and differentiates leader and manager. His assumptions and presumptions are aptly applicable to a leader in Government also.

According to Jim Collins “Good-to-Great” leaders embody a paradoxical mix of personal humility and professional will. “Good” is The Enemy of “Great”. Level Five Leadership does not happen overnight. It refers to the highest level in a hierarchy of executive capabilities. Leaders of this type are those who combine extreme personal humility with intense professional will; shun the attention of celebrity, channeling their ambition toward the goal of building a great system. They provide new vision, strategy and direction, around which institution gains people’s commitment. The transformation from Good to Great has a process that includes building first level five leadership, deciding on first who and then what, confronting the brutal facts, transcending the curse of competence, inculcating culture of discipline for breakthrough results and technology accelerators. Collins also differentiates between the levels of leadership and elaborates the other four levels in support of level five leaders.

Level five leaders like KCR rise to that level against a background of rich experience in various fields of activity, individual discipline, ups and downs in the life, colleagues support and many more most of which are success stories. Level one in the hierarchy is a highly capable individual who makes productive contributions through talent, knowledge, skills and good work habits. Level two is a member who contributes individual capabilities to the achievement of group objectives and works effectively with others in a group setting. Level three is a competent manager and capable of organizing people and resources towards the effective and efficient pursuit of predetermined objectives. Level four is an effective leader who catalyzes commitment to and vigorous pursuit of stimulating higher performance standards. But, Level five the highest in the Hierarchy builds enduring greatness through paradoxical blend of personal humility and professional will. The greatness of level five leaders lies in choosing the other four levels for successful accomplishment.

            Professional will of level five leadership creates superb results, demonstrates resolve to produce the best long-term results, no matter how difficult, sets standard of building institution and will settle for nothing less. He looks in the mirror, not out the window, to apportion responsibility for poor results, never blaming other people, external factors or bad luck. He is never boastful, acts with quiet calm relying on inspired standards, channels ambition into the institution. He chooses the right people for right work and lets them into his vehicle of performance and achieving results and only with them forms a superior executive team. The wrong people are off the vehicle and when and why is the tactical choice of level five leaders. For him Great vision without Great people is irrelevant.

            When we talk of governance and politics the level five leader is basically a Statesman like qualities person like KCR. We heard of Governance and later Good Governance. But today people want Great Governance and Governance with a difference. It is just not enough to attend to mere current needs of people and call it as a development. Long term planning along with short term and medium term are essential. This is what has been happening in the state during the last eight years and with this same leadership would happen in the coming days and months. The schemes conceived in the state are all keeping the long terms needs of people in mind. All these are examples of statesmanship and strategic leadership of Chief Minister Chandrashekhar Rao.

            In the two elections for the state Assembly and many more elections from time to time, after formation of Telangana, the landslide victory of TRS under the leadership of statesman KCR did not happen just like that. In the first election KCR presented an excellent manifesto to the people and every bit of it was implemented during the first term. Ever since the state was formed, by initiating and implementing number of welfare and development schemes during the eight years of governance, which did not happen during the erstwhile Congress and TDP rule for over 50 years, CM KCR who is also the TRS Party President successfully presented with statistical data of the success story of his government. The progress card of government is being presented to the people from time to time through different platforms. As a leader, as a statesman, as a politician, as a designer of development-welfare schemes, as a visionary, as a pragmatist and an intellectual KCR won the hearts of people at large. Today the welfare and development programs being implemented in the state are byheart to the people at large. 

         It is not just “Governance” or “Good Governance” that is seen and felt now, but it is a “Great Governance” with a “Huge Difference” headed by a Statesman strategic Leader Chief Minister K Chandrashekhar Rao. Today Telangana model has become so popular in the country that almost all states are in line to study the schemes being implemented in the state and replicate them in their states.

            At a time when there is a gap for right leadership in the country the leadership of a statesman like politician of KCR caliber is highly essential so that the people at large in the country could be benefited through umpteen welfare and development schemes that are being implemented in Telangana. Let us hope that KCR in his address in the TRS plenary gives a new direction towards this for formation of an effective and efficient alternate leadership in the National Politics which is long waited.    

Tuesday, April 26, 2022

రాజనీతిజ్ఞతే అభివృద్ధికి ఆలంబన : వనం జ్వాలా నరసింహారావు

 రాజనీతిజ్ఞతే అభివృద్ధికి ఆలంబన  

వనం జ్వాలా నరసింహారావు

ఆంధ్రజ్యోతి దినపత్రిక (27-04-2022)

         రెండు దశాబ్దాలకు పైగా జైత్రయాత్ర సాగిస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి మరోమారు ప్లీనరీ ఘనంగా జరుపుకుంటున్న సందర్భంలో ఆ పార్టీ వ్యవస్థాపకుడు, పార్టీకి అద్భుతమైన నాయకత్వాన్ని అందించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి, రాష్ట్ర శాసనసభకు రెండు పర్యాయాలు జరిగిన ఎన్నికలలో పార్టీకి అఖండ విజయాన్ని సాధించి ప్రభుత్వాన్ని స్థాపించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన రాజనీతిజ్ఞుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, సమకాలీన రాజకీయ నాయకులలలో ఒక ప్రత్యేకతను సంతరించుకున్న థీశాలి అని నిర్వచించడంలో అతిశయోక్తి ఏమాత్రం లేదనాలి. ఉమ్మడి రాష్ట్రం ఏర్పాటైన నాటినుండి అధికారంలో వున్న కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు చేయలేని, చేతకాని అభివృద్ధిని, అమలుపర్చలేని సంక్షేమ పథకాలను, తన ఎనిమిది సంవత్సరాల  పాలనలో అలవోకగా చేసి చూపించి, ప్రజల మెప్పు పొందుతున్నారు తెరాస అధినేత చంద్రశేఖర్ రావు.

తన సారధ్యంలోని ప్రభుత్వం రూపకల్పన చేసి, కార్యాచరణ పథకం తయారుచేసి, చేపట్టి, విజయవంతంగా అమలుచేసిన పలు అభివృద్ధి-సంక్షేమ పథకాలను, కార్యక్రమాలను ఎప్పటికప్పుడు అనేక సందర్భాలలో ప్రజలకు గణాంకాలతో సహా సవివరంగా తెలియచేస్తున్నారు కేసీఆర్. కేసీఆర్ ప్రభుత్వ ప్రగతి  నివేదిక తెలంగాణ అబాలాగోపాలానికి ఆసాంతం తెలుసు. ఒక నాయకుడిగా, ఒక రాజనీతిజ్ఞుడిగా, ఒక వ్యూహకర్తగా, ఒక రాజకీయవేత్తగా, ఒక అభివృద్ధి-సంక్షేమ పథకాల రూపకర్తగా, ఒక దార్శనికుడిగా, ఒక యదార్థవాదిగా, ఒక మేథావిగా ప్రజల మనసు చూరగొన్నాడు. ఫలితంగా కేసీఆర్ అన్నిరంగాలలో అఖండ విజయాన్ని తన సొంతం చేసుకుంటున్నారు. రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఆయన నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి మరోమారు (హాట్రిక్) బ్రహ్మాండమైన విజయాన్ని సాధించి, ప్రజలకు మరిన్ని సంక్షేమ అభివృద్ధి పథకాలను అమలు పరచడం తథ్యం. తెలంగాణ మోడల్ దేశమంతా ఎప్పుడో ఒకప్పుడు అనుసరించడం కూడా తథ్యం.  

         వాస్తవానికి, అందుబాటులో వున్న, పదిమంది అంగీకరించిన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రజల అవసరాలకు, ఆకాంక్షలకు, వర్తమాన-భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా, అందునా ఒక క్రమ పద్ధతిలో వాటిని అన్వయించుకుంటూ, వారి సర్వతోముఖాభివృద్ధికి ఉపయోగపడే పథకాల రూపకల్పన-అమలు జరుగుతేనే అది అసలు-సిసలైన అభివృద్ధి అనడానికి వీలవుతుంది. ప్రజల మనసులు చూరగోనడానికి వీలవుతుంది. అదే జరిగింది తెలంగాణ రాష్ట్రంలో 2014 జూన్ నెలనుండి. అదే భవిష్యత్ లొ కొనసాగనుంది. కేసీఆర వ్యూహం, ఆలోచన కార్యరూపం దాలిస్తే దేశమంతా ఆయన ఆశించిన ప్రత్యామ్నాయ నాయకత్వంలో అమలు కావడం కూడా అతత్యం.

అమలు చేయడానికి అలవికాని వాగ్దానాలు చేసుకుంటూ, సైద్ధాంతిక భావజాలాన్ని ప్రదర్శించుకుంటూ, "ప్రాక్టికల్" అవగాహనతో కాకుండా "థియరీ" తో సరిపుచ్చుకుంటూ కాలం వెళ్లబుచ్చడం అభివృద్ధిని సాధించడం అనరు. ప్రజల అవసరాలకు అనుగుణంగా ఏం చెయ్యాలనేది ఆలోచన చేసి, దానికి అవసరమైన ప్రణాళికను రూపొందించి, అమలుకు పటిష్ఠమైన కార్యాచరణ పథకాన్ని తయారుచేసి, నిర్ణీత కాలవ్యవధిలో పూర్తిచేస్తేనే అభివృద్ధి సాధ్యమౌతుంది. దీనికి పర్యాయ పదం కేసీఆర్.

ఈ మొత్తం ప్రక్రియలో, ప్రజల సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, సాంప్రదాయక, సహజసిద్ధమైన అంశాలు పరిగణలోకి తీసుకోవాలి. సరిగ్గా ఇదే జరిగింది కేసీఆర్ అధికారంలో వున్న ఎనిమిది సంవత్సరాల  కాలంలో. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో-ఎన్నెన్నో అభివృద్ధి-సంక్షేమ కార్యక్రమాల రూపకల్పనకు, అమలుకు శ్రీకారం చుట్టడం జరిగింది. ఇలా జరగడానికి అన్నింటికన్నా ప్రధాన కారణం రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు రాజనీతిజ్ఞత, దూరదృష్టి, నాయకత్వ లక్షణాలు, నిబద్ధత, ప్రతి అంశాన్నీ పదిమందితో కలిసి ఆలోచన చేసి నిర్ణయం తీసుకునే విధానం, దేన్నైనా ఒకటికి పది సార్లు సమీక్షించిన తదుపరే నిర్ణయం చేసే సుగుణం...ఇలా మరెన్నో. వీటన్నిటి ఫలితమే అనేక పథకాల రూపకల్పన-అమలు. అభివృద్ధిని, విజయాన్ని సాధించాలంటే అన్నింటికన్నా ముఖ్యం లీడర్షిప్ లేదా పటిష్టమైన నాయకత్వం.

విశ్వవిఖ్యాత మేనేజ్‌మెంట్ రంగ నిపుణుడు జిమ్ కాలిన్స్, రాసిన "గుడ్ టు గ్రేట్" పుస్తకంలో  లీడర్షిప్ లక్షణాలను, లీడర్ నాయకత్వంలో నడుస్తున్న సంస్థ బలోపేతానికి అనుసరించాల్సిన పద్ధతులను, మేనేజర్ కు లీడర్ కు, అందునా ఉన్నత స్థాయి లీడర్ కు వుండే వ్యత్యాసాన్ని వివరిస్తాడు. ఆయన తన సిద్ధాంతంలో "గుడ్", "గ్రేట్" అనేవి, ఒకదానికి మరొక టి బద్ధ శతృవులని,  ఒక సంస్థను, వ్యవస్థను "సముచిత స్థాయి నుంచి సమున్నత స్థాయికి" తీసుకెళ్లడానికి కావలసిందల్లా ఐదో స్థాయి నాయకత్వమని, అది అందరికీ సాధ్యమయ్యేది కాదని సోదాహరణంగా వివరిస్తాడు. లీడర్ అనే వాడు మొదలు తనకు కావాల్సిన వ్యక్తులను ఎంపిక చేసుకుంటాడని, వారిలో ఎవరు-ఏమిటి అన్న ఆలోచన చేసి ఎవరెవరికి ఎలాంటి బాధ్యతలు అప్పచెప్పాలో నిర్ణయిస్తాడని, నగ్న సత్యాల లాంటి పాశవిక వాస్తవాలను ధైర్యంగా విశ్లేషణ చేసుకుంటూ ఆ వాస్తవాలను వున్నదున్నట్లు పది మందికి తెలియచేస్తాడని, అర్హత-యోగ్యతల ప్రకంపనలను అధిగమించడమనే హెడ్గెహాగ్ సిద్ధాంతాన్ని తుచ తప్పకుండా పాటిస్తాడని, నిరంతరం సత్ఫలితాల సాధనకు క్రమశిక్షణతో కూడిన విధానాన్ని, సంస్కృతిని అలవరచుకుంటాడని, సాంకేతిక వేగ సాధనాలను సక్రమంగా ఉపయోగించుకుంటాడని, ఇవన్నీ చేసేవాడు ఐదో స్థాయి (అత్యున్నత స్థాయి) నాయకుడనిపించుకుంటాడని జిమ్ కాలిన్స్ అంటాడు. ఇవన్నీ కేసీఆర్ లో కనిపిస్తాయి.

అరుదైన ఐదో స్థాయి (అత్యున్నత స్థాయి) నాయకత్వ లక్షణాలున్న వారు, ఆ స్థాయికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లాగా అంచలంచలుగా ఎదుగుతారు. అలా ఎదిగే నేపధ్యంలో వివిధ రంగాలలో వారు పొందిన అనుభవం, వ్యక్తిగత క్రమశిక్షణ, జీవితంలో ఎదురైన ఆటుపోటులు, అనుభం నేర్పిన గుణపాఠాలు, సహచరుల తోడ్పాటు, ఇలా ఎన్నో వారిని ఆ స్థాయికి తీసుకెళ్తాయి. అందరికీ ఇలా ఎదగడం కుదరదు. అతికొద్ది మంది మాత్రమే ఆ స్థాయికి చేరుకో గలరు. మరో విధంగా అలా ఎదిగినవారు, ఆ ప్రక్రియలో వివిధ స్థాయిలలో నాయకత్వ-యాజమాన్య (మేనెజీరియల్) లక్షణాలెలా వుంటాయో అవగాహన చేసుకోవాలి.

వివరాల్లోకి పోతే: వ్యక్తిగత ప్రజ్ఞతో, తెలివి తేటలతో, నైపుణ్యంతో, మంచి అలవాట్లతో, ఫలవంతమైన తోడ్పాటును సంస్థకు అందించగల వారే మొదటి స్థాయి "స్వయం సాధకులు". ఇక రెండో స్థాయికి చెందిన వారు, నలుగురున్న బృందంలోని "భాగస్వామ్య సభ్యులు". వీరు సామూహిక లక్ష్యాలను అధిగమించడానికి తమ-తమ వ్యక్తి గత సమర్థతలను జోడించి, తోటి బృంద సభ్యులతో కలిసి-మెలిసి పనిచేయగల వారై వుంటారు. మూడో స్థాయికి చెందిన "మేనేజర్స్-కార్య నిర్వాహకులు", ముందస్తుగా నిర్దారించిన లక్ష్యాలను సమర్థవంతంగా-సార్థకంగా చేరుకునే ప్రయత్నంలో భాగంగా, అవసరమైన మానవ-మానవేతర వనరులను ఏర్పాటు చేసుకోగల నైపుణ్యం కల వ్యక్తులై వుంటారు. నాలుగవ స్థాయి "సార్థక నాయకులు", శ్రేష్టమైన కార్యసాధక ప్రమాణాలను పాటించేందుకు, పురికొల్పే ప్రయత్నం-పట్టుదలతో, నిబద్ధతను ప్రోత్సహించే తరహా వ్యక్తులై వుంటారు. వీరు తమ వ్యక్తిగత నమ్రత-అణకువలను-అనుభవాన్ని-నైపుణ్యాన్ని వృత్తి పరమైన కార్య సాధనతో రంగరించి, ఒక అసంభవమైన మిశ్రమంగా తయారుచేసి, తద్వారా శాశ్వతమైన గొప్పదనాన్ని-సమున్నత స్థాయి సంస్థను నిర్మించగల సామర్థ్యం గల వ్యక్తి అయి వుంటారు. ఇలా వున్న అంచెలంచల వ్యవస్థలోనే, "గుడ్ టు గ్రేట్" ఆచరణ సాధ్యమవుతుంది.

ఐదో స్థాయి కార్యనిర్వహణాధికారి నాయకత్వ తీరుతెన్నులను అర్థం చేసుకోగలగడం ఆ స్థాయి వారికే తప్ప ఇతరులకు అంత త్వరగా అర్థంకాదు. తన కార్య సాధనలో భాగంగా సముచిత స్థాయి నుంచి సమున్నత స్థితికి సంస్థ రూపాంతరీకరణ చేసే దిశగా పతాక స్థాయి ఫలితాలను సాదించగలడు ఆ నాయకుడు. ఎంత కష్టమైనా-ఎన్ని అవాంతరాలెదురైనా సడలించని సంకల్పం ప్రదర్శించి దీర్ఘకాలిక ఫలితాలను సాధించేందుకు కృషి చేస్తాడు. శాశ్వత సమున్నత స్థితి సంస్థను నిర్మించేందుకు, తగిన ప్రమాణాలను నిర్ణయించగలడు. తన కృషి ప్రతిబింబిస్తోందా, లేదా అన్న అంశాన్ని స్వయంగా పరిశీలించేందుకు అద్దంలో దృష్టి సారిస్తాడు గాని నాలుగు గోడల అవతల వాటి మధ్య నున్న కిటికీ బయట తలపెట్టి చూడడు. అలా చూసి, నిస్సారమైన ఫలితాల బాధ్యతను ఇతరులపై మోపి, వాళ్లపై నింద వేయడు. తన దురదృష్టమనో-కారణాంతరాల వల్ల అనుకున్నది సాధించలేక పోయాననో, తప్పు తనది కాదనో అనడు. వినయ-విధేయతలతో కార్యోన్ముఖుడవుతాడే గాని, గొప్పలు చెప్పడం-ముఖ స్తుతి కోరుకోవడం చేయడు. పట్టుదలతో, హంగు-ఆర్భాటం లేకుండా నిర్ధారించిన ప్రమాణాల ఆధారంగా ముందుకు సాగుతాడు. తన లాంటి ఇతరులను తయారుచేసి, భవిష్యత్ లో, రాబోయే తరం వారిలో మరిన్ని విజయాలను సాధించేందుకు తగిన వారసులను సృష్టించగలడు.

         సంస్థలో పనిచేసే వారిలో తాను నిర్దేశించిన ప్రమాణాలను-సంస్థ లక్ష్యాలను చేరుకోలేని వ్యక్తులను "సంస్థ వాహనం" నుంచి తక్షణమే దింపగల నేర్పరితనముంటుంది వారికి. "గొప్ప దూరదృష్టికి గొప్ప మనుషులే కావాలి" అన్న సిద్ధాంతాన్ని పాటించుతారు వీరందరు. తన కింది వారు నిబద్ధతతో పనిచేయలేరని అనుమానం వచ్చిన వెంటనే, సరైన వ్యక్తులను వారి స్థానంలో నియమించడం వారిలోని నైపుణ్యం. అలా నియమించబడిన "సరైన వ్యక్తుల" తెలివితేటలు-నేర్పరి తనం కంటే, వారిలోని సామర్థ్యం-ప్రవర్తన-నడత, సంస్థ ఎదుగుదలకు తోడ్పడుతుంది. అలాంటి వారి పనితనాన్ని నిరంతరం అజమాయిషీ చేయడం కంటే, వారికి సరైన మార్గదర్శకాలను సూచించితే సరిపోతుంది. వారిని ముందుకు దూసుకుని పొమ్మని బోధించితే చాలు. "సముచిత స్థితి నుంచి సమున్నత స్థితికి" నడిపించగల బృంద సభ్యులు జీవితాంతం స్నేహితులుగానే నిలిచిపోతారు. ఐదో స్థాయి కార్య నిర్వాహక నాయకుడు చేయాల్సిందల్లా అలాంటి వారిని వెతికి పట్టుకుని, సంస్థ వాహనం ఎక్కించి సత్ఫలితాలను సాధించడమే. అవసరం అనుకుంటే వాహనంలోంచి దింపడంలోనూ చాకచక్యం చూపడమే !

         "గుడ్ టు గ్రేట్" నాయకత్వ సిద్ధాంతం కేవలం ప్రయివేట్ సంస్థలకు మాత్రమే కాదు. ప్రభుత్వ నిర్వహణకు కూడా అన్వయించాలి. ప్రభుత్వంలో, రాజకీయాలలో ఐదో స్థాయి "కార్యనిర్వహణాధికారి" నాయకత్వమంటే, "రాజనీతిజ్ఞుడు" అని చెప్పకనే చెప్పొచ్చు. ఒకప్పుడు "పరిపాలన" గురించి విన్నాం. ఆ తరువాత కాలంలో "సుపరిపాలన" అనేది పాపులర్ అయింది. అంతకంటే మెరుగైన పాలన కోరుకుంటున్నారు ప్రజలు. “రాజనీతిజ్ఞతతో కూడిన సుపరిపాలన" కావాలంటున్నారు. అభివృద్ధి పేరుతో ప్రజల వర్తమాన అవసరాలను మాత్రమే తీరుస్తే సరిపోదు. దీర్ఘకాలిక ప్రణాళికలు వేయాలి. భవిష్యత్ కు బంగారు బాటలు (బంగారు తెలంగాణ) వేయాలి. కేసీఆర్ ఎనిమిది సంవత్సరాల పాలనా కాలంలో ఈ రాష్ట్రంలో జరిగింది, ఇప్పుడు జరుగుతున్నది, భవిష్యత్ లో జరగబోయేది అదే. రాష్ట్ర వ్యాప్తంగా రూపొందించి, అమలు చేస్తున్న పథకాలు సార్వజనీనమైన పథకాలే! పది కాలాల పాటు మనుగడ సాగించి ప్రజల అవసరాలను తీర్చే పథకాలే! ఈ పథకాలన్నీ ముఖ్య మంత్రి "రాజనీతిజ్ఞత" కు నిదర్శనాలే! జిమ్ కాలిన్స్ సిద్ధాంతంలోని సమున్నత స్థాయికి రాష్ట్రాన్ని తీసుకుని పోవడానికి వేస్తున్న బంగరు బాటలే! ఉదాహరణలు కోకొల్లలు.

         అభివృద్ధి అంటే ఇలా వుంటుంది అని ప్రజలు అనుకునేలా ప్రణాళికలు రూపొందించి అమలు పరిచింది, పరుస్తున్నది ఈ ప్రభుత్వం. అందుకే...ఇప్పుడున్నది కేవలం "పరిపాలనో", లేక "సుపరిపాలనో" కాదు, "పరిపాలనలో రాజనీతిజ్ఞత". అదే అభివృద్ధికి పునాది. అందుకే, ఇందుకే, రాజనీతిజ్ఞతకు పర్యాయపదం కేసీఆర్. ఈ నేపధ్యంలో ఒక్కసారి వర్తమాన దేశ రాజకీయాలను నిశితంగా విశ్లేషించి గమనిస్తే ప్రస్తుతం కావాల్సింది కేసీఆర్ లాంటి రాజనీతిజ్ఞత, వ్యూహాత్మక నాయకత్వమే. మార్పు కోరుకుంటున్న ప్రజలకు ఇప్పుడు జరుగుతున్న తెరాస ప్లీనరీలో ఆ దిశగా కేసీఆర్ సందేశం ఇస్తారని ఆశిద్దాం.

Sunday, April 24, 2022

ఏడవ నాటి యుద్ధంలో కౌరవుల మండలవ్యూహం, పాండవుల వజ్రవ్యూహం..... ఆస్వాదన-68: వనం జ్వాలా నరసింహారావు

 ఏడవ నాటి యుద్ధంలో కౌరవుల మండలవ్యూహం, పాండవుల వజ్రవ్యూహం

ఆస్వాదన-68

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (24-04-2022)

మహాభారత యుద్ధంలో ఏడవరోజు ఉదయాన యుద్ధ భూమికి వెళ్ళిన భీష్ముడు యుద్ధరంగాన్నంతా వ్యాపించే విధంగా ‘మండలవ్యూహాన్ని’ ఏర్పాటు చేశాడు. దాని మధ్యభాగాన దుర్యోధనుడున్నాడు. అతడి తమ్ములు, అతడికి సాయపడే రాజులు ఇరుపక్కలా నిలిచారు. అప్పుడే యుద్ధరంగానికి వచ్చిన పాండవులు ఆ వ్యూహాన్ని తేరిపార చూశారు. ధర్మరాజు ఆదేశానుసారం సేనాపతైన ధృష్టద్యుమ్నుడు ‘వజ్రవ్యూహాన్ని’ ఏర్పాటు చేశాడు.

ద్రోణుడు విరాటుడిని, అశ్వత్థామ శిఖండిని, ధుర్యోధనుడు ధృష్టద్యుమ్నుడిని, శల్యుడు నకుల సహదేవులను, విందానువిందులు యుధామన్యుడిని, పలువురు రాజులు అర్జునుడిని ఎదుర్కున్నారు. అలాగే భీమసేనుడు కృతవర్మను, అభిమన్యుడు చిత్రసేనుడిని, దుశ్శాసనుడిని, వికర్ణుడిని, ఘటోత్కచుడు భగదత్తుడిని, సాత్యకి అలంబసుడిని, ధృష్టకేతుడు భూరిశ్రవుడిని, చేకితానుడు కృపాచార్యుడిని, ధర్మరాజు శ్రుతాయువుని, చాలా మంది రాజులు భీష్ముడిని ఎదిరించారు.

కౌరవ రాజులు ఒక్కసారిగా విజృంభించి కృష్ణార్జునులను బాణ వర్షంలో ముంచివేయగా, అర్జునుడు కోపంతో ఐంద్రాస్త్రాన్ని ప్రయోగించాడు. దాని ధాటికి కౌరవ సేనలు భయపడి భీష్ముడి చాటుకు పారిపోయారు. దుర్యోధనుడి ప్రోద్బలంతో అప్పుడు రాజులంతా అర్జునుడి మీద యుద్ధం చేస్తున్న భీష్ముడికి అండగా నిలిచారు. ద్రోణుడికి, విరాటుడికి మధ్య జరుగుతున్న యుద్ధంలో ఇరువురు భీకరంగా పోరాడారు. ద్రోణుడి బాణాల దెబ్బకు విరాటుడు భయంతో పరుగెత్తాడు. ఇంకో పక్క శిఖండికి, అశ్వత్థామకు మధ్య పోరు జరిగింది. మరోవైపున ధృష్టద్యుమ్నుడు దుర్యోధనుడి మీద బాణాలు గుప్పించాడు. దుర్యోధనుడు కూడా అతడి మీద బాణాలు వేశాడు. విల్లు విరిగిన దుర్యోధనుడిని శకుని తన రథంలో ఎక్కించుకుని పోయాడు. సాత్యకి, అలంబసుల మధ్య జరిగిన యుద్ధంలో సాత్యకిది పైచేయి కాగా అలంబసుడు భయపడి పారిపోయాడు. సాత్యకి కురుసైన్యం మీద ఉరికాడు.

భీముడికి, కృతవర్మకు జరిగిన యుద్ధంలో బాణాలతో గాయపడ్డ కృతవర్మ వృషకుడి రథం మీద వెళ్లాడు. యుధామన్యుడు విజృంభించి విందానువిందుల మీద బాణాలు గుప్పించి, అనువిందుడి రథాన్ని నుగ్గు చేశాడు. అదే సమయంలో భగదత్తుడి ఏనుగు విజృంభించి పరుగెత్తడంతో పాండవుల సేన చిందరవందర కాగా ఘటోత్కచుడు ఆ ఏనుగును ఆపాడు. భగదత్తుడికి, ఘటోత్కచుడికి జరిగిన యుద్ధంలో భగదత్తుడిది పైచేయి అయింది. ఘటోత్కచుడి సైన్యం మీదకు మళ్లీ తన ఏనుగును పురికొల్పాడు భగదత్తుడు. ఇదిలా వుండగా శల్యుడికి, నకుల సహదేవులకు మధ్య జరిగిన యుద్ధంలో సహదేవుడి బాణం దెబ్బకు శల్యుడు రథం మీద మూర్ఛపోయాడు. దాంతో అతడి సారథి రథాన్ని యుద్ధభూమి నుండి అవతలకు తోలుకుని పోయాడు. అదే సమయంలో ధర్మరాజు శ్రుతాయువు మీద బాణాలు వేశాడు. ధర్మరాజు విజృంభించగా కౌరవ సైన్యం చిందరవందరైంది.

చేకితానుడు కృపాచార్యుడి మీద బాణాలను వర్షంలాగా కురిపించాడు. కృపాచార్యుడు వెనక్కు తగ్గలేదు. ఇద్దరూ ఒకరినొకరు ఎదురెదురుగా ఢీకొన్నారు. ఒకరినొకరు నొప్పించుకున్నారు. ఇద్దరు మూర్ఛపోయి నేలమీదికి ఒరిగారు. వారిద్దరినీ సహాయకులు వచ్చి తీసుకుపోయారు. ధృష్టకేతుడికి, భూరిశ్రవుడికి మధ్య భీకరమైన పోరు జరిగింది. దుశ్శాసనుడు, చిత్రసేనుడు, వికర్ణుడు కలిసి అభిమన్యుడితో యుద్ధం చేశారు. ఆ యుద్ధంలో అభిమన్యుడు ఆ ముగ్గురి రథాలను ధ్వంసం చేశాడు. భీముడి శపథం గుర్తుకు వచ్చి, అభిమన్యుడు, వారిని బాధపెట్టాడే కాని చంపలేదు. వారి దుస్థితి చూసిన భీష్ముడు అభిమన్యుడిని ఎదుర్కున్నాడు. ఇది గమనించిన అర్జునుడు అభిమన్యుడికి సాయంగా పోతుంటే, త్రిగర్తపతైన సుశర్మ ఆర్జునుడిని ఎదుర్కున్నాడు కాని దెబ్బతిన్నాడు. అర్జునుడు స్వైరవిహారం చేశాడు.

అర్జునుడు భీష్ముడి మీదికి యుద్ధానికి వెళ్ళాడు. ధర్మరాజు భీమనకుల సహదేవులతో కలిసి అర్జునుడికి అండగా వెళ్లారు. ఇంతలో దుర్యోధనుడు, సైంధవుడు పాండవులను ఎదుర్కున్నారు. ఆ సమయాన శిఖండి భీష్ముడిని ఎదుర్కున్నాడు. అప్పుడు శల్యుడు ఆగ్నేయాస్త్రాన్ని శిఖండి మీద ప్రయోగించాడు. శిఖండి వారుణాస్త్రాన్ని వేశాడు. భీష్ముడు ధర్మారాజును ఇబ్బందికి గురిచేశాడు. భీముడు దుర్యోధనుడి మీదికి ఉరికాడు. దుర్యోధనుడు కూడా భీముడిమీద దాడి చేశాడు. మధ్యలో తన మీదికి వచ్చిన చిత్రసేనుడి మీద భీముడు గదను విసిరాడు. అది చిత్రసేనుడి రథాన్ని, గుర్రాలను, సారథిని పిండిపిండి చేసింది. రథం లేని చిత్రసేనుడిని వికర్ణుడు తీసుకునిపోయాడు.

ధర్మరాజు, నకుల సహదేవులు భీష్ముడి చేతిలో దెబ్బ తిన్నారు. అప్పుడు వారు మరికొందరు రాజులతో కలిసి భీష్ముడిని ఎదిరించారు. ఇంతలో శిఖండి భీష్ముడి సమీపానికి వచ్చాడు. వాడిని లెక్కచేయకుండా భీష్ముడు పాండవ సేనను బాధించాడు. ఇది గమనించి సాత్యకి, ధృష్టద్యుమ్నుడు బాగా విజృంభించి కౌరవ సైన్యాన్ని కలత పెట్టారు. అప్పుడు దుర్యోధనుడు స్వయంగా యుద్ధానికి దిగాడు. భీష్ముడితో కలిసి ధర్మరాజు సేనలను కమ్మివేశారు. అదే సమయంలో అక్కడ అర్జునుడు ప్రత్యక్షమయ్యాడు. అంతలో ద్రోణాచార్యుడు విజృంభించి, అర్జునుడిని ఎదిరించి, పాండవుల మీద పడ్డాడు. ఇంతలో సూర్యుడు అస్తమించాడు. కౌరవ, పాండవ సేనలు తమతమ విడిదులకు చేరుకున్నారు.

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, భీష్మపర్వం, తృతీయాశ్వాసం

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)