Wednesday, August 30, 2023

గంగావతరణం : వనం జ్వాలా నరసింహారావు

 గంగావతరణం

వనం జ్వాలా నరసింహారావు

భక్తి మాసపత్రిక (సెప్టెంబర్ నెల, 2023)

(భగీరథుని తపస్సు వల్ల గంగ నెలకు దిగివచ్చిన వృత్తాంతాన్ని అందరూ స్మరిస్తారు. అయితే అంతకంటే ముందుగా హిమవంతుని కూతురే అయిన గంగ... అంతకు పూర్వ యుగాలలోనే ఆకాశగంగగా మారింది. కుమారసంభవ గాథలో ముఖ్యపాత్ర పోషించింది. ఆంధ్రవాల్మీకి వాసుదాసస్వామి రచించిన రామాయణం ‘మందరం’ ఆధారంగా గంగా వృత్తాంతం)

కోసల దేశంలో, సరయూ నదీతీరానున్న అయోధ్యా నగరం వైభవోపేతమైనది. చక్కటి వీధి వాకిళ్లతో, తలుపులతో, మంగళకరమైన పచ్చని తోరణాల స్తంబాలతో వుండేది. విశాలమైన అంగడి వీధులుండేవి. భయంకర శతఘ్నుల ఆయుధాలనుంచిన భవనాలుండేవి. శిల్ప కళాకారుల సమూహాలతో, శ్రీమంతులైన పండితులతో, ఎత్తైన ధ్వజాలతో, తియ్య మామిడి తోపులతో, ‘లక్ష్మీ పురాన్ని’ సహితం మరిపించేదిగా వుండేది. సంతాన ప్రాప్తి కలగడం లేదని చింతిస్తుండే ఆ దేశ మహారాజు దశరథుడు, అశ్వమేధ యాగం, పుత్ర కామేష్ఠి యాగం చేయాలని భావించి, రెండింటికీ ఋత్విజుడిగా వ్యవహరించాల్సిందిగా, ఋశ్యశృంగుడిని ప్రార్తించాడు. పుత్ర కామేష్ఠి యాగం చేస్తే, ఆయనకు నలుగురు కొడుకులు జన్మిస్తాని ఋశ్యశృంగుడు చెప్పాడు.  

శ్రీరామ జననం

దశరథుడు పుత్రకామేష్ఠి యాగం చేస్తుండగా అగ్నిహోత్రం మధ్యనుండి బయట కొచ్చిన ప్రాజాపత్య మూర్తి, భగవత్ పూరితమైన పాయసాన్నం ఇచ్చాడు. దాన్ని స్వీకరించి భార్యల దగ్గరికి పోయిన దశరథుడు, పాయసం సగం మొదలే కౌసల్యకిచ్చాడు. ఆమె దాన్ని తాగింది. మిగిలిన సగంలో సగం (పాతిక భాగం) రెండో భార్యైన సుమిత్రకు ఇచ్చాడు. మిగిలిన పాతిక భాగాన్ని రెండు భాగాలు చేసి, ఒకభాగం కైకకు, మరో భాగం తిరిగి సుమిత్రకు ఇచ్చాడు. తొలుత పాయసాన్ని తాగిన కౌసల్యకు శ్రీరాముడు జన్మించి జ్యేష్ఠడయ్యాడు. వెంటనే తాగిన కైకేయికి , రెండవవాడుగా భరతుడు పుట్టాడు. పాతిక, పరక వేర్వేరుగా తాగిన సుమిత్రకు లక్ష్మణ, శత్రుఘ్నులు కవలలుగా జన్మించారు. ఆ రాజకుమారులంతా అస్త్ర శస్త్ర విద్యలన్నీ నేర్చారు.

విశ్వామిత్రుని రాక

ఒకనాడు విశ్వామిత్ర మహర్షి అయోధ్యకు వచ్చి, దశరథుని కలుసుకుని.....తానిప్పుడు ఒక యజ్ఞం చేద్దామని సంకల్పించుకొని, దీక్ష పూనానని చెప్పాడు. తన యజ్ఞాన్ని విఘ్నం చేయాలని మారీచ, సుబాహువులు అనే ఇద్దరు రాక్షసులు పంతం పట్టారని చెప్పాడు. యజ్ఞాన్ని రక్షించగల సమర్థుడు శ్రీరాముడు కనుక అతడిని తనతో పంపమని కోరాడు. మారీచాది రాక్షసుల సమూహాన్ని శ్రీరాముడు సులభంగా చంపగలడని, శ్రీరాముడికి తానెన్నో శుభాలు కలిగిస్తానని అంటాడు.

మాట వినగానే ముఖం విలవిల బోయిదశరథుడు, శ్రీరాముడికప్పుడు కేవలం పదహారో సంవత్సరం నడుస్తున్నదని, కాబట్టి పంపలేనని, యజ్ఞం రక్షించడానికి తానే స్వయంగా వస్తానంటాడు. ఆ తరువాత విశ్వామిత్రుడికి కోపం రావడం, శ్రీరాముడిని విశ్వామిత్రుడితో పంపమని వశిష్ఠుడు నచ్చచెప్పడం, లక్ష్మణుడితో సహా రామచంద్రుడిని మునివెంట పంపేందుకు దశరథుడు అంగీకరించడం జరిగింది. అలా ’కౌసల్యా నందనుడైన’ శ్రీరామచంద్రమూర్తి లక్ష్మణ సమేతంగా విశ్వామిత్రుడివెంట వెళ్తుంటే, దేవతలు శుభశకునాలను ప్రదర్శించారు.   

తాటక వధ

ప్రయాణంలో విశ్వామిత్రుడు, రామలక్ష్మణులకు సరయూనది చరిత్రను, దాని పుట్టు పూర్వోత్తరాలను చెప్పాడు. ఒకప్పుడు ఈ ప్రాంతమంతా ధన ధాన్య సమృద్ధి కలిగి వుండేదని, అక్కడ ‘మలద, కరూశ మని రెండు వూళ్లు ఉండేవని చెప్పాడు. కొంతకాలం గడిచిన తర్వాత, అక్కడికి వెయ్యేనుగుల బలంకల, తాటక అనే యక్ష స్త్రీ వచ్చిందని, ఆమె మారీచుడు అనే రాక్షస కొడుకును కనిందని, వాళ్లు ప్రతిరోజు ఈ ప్రాంతంలో కనిపించిన ప్రతివాడినీ తినడంతో, ఇదొక శ్మశానంగా మారిపోయిందని, నిష్కారణంగా, అధర్మంగా, ఇంత మందిని చంపుతున్న తాటకను స్త్రీ వధ అధర్మమని భావించక చంపమని, రాముడిని విశ్వామిత్రుడు ఆదేశిస్తాడు.


విశ్వామిత్రుడు సత్యమే చెప్పాడని, తానే దీన్ని చంపాలని, లక్ష్మణుడితో అంటుండగానే, అక్కడికి వచ్చిన రాక్షసి తాటక భయంకరాకారంతో రాముడి మీద పడబోయింది. వెంటనే విశ్వామిత్రుడు, హుంకారంతో అదిలించి, రామభద్రుడికి జయం, జయం అని దీవించాడు. తాటక, మాయలతో, విపరీతంగా రాళ్ల వాన కురిపించసాగింది. ఆలశ్యం చేస్తే, సంధ్య వేళైతే, చంపడం అసాధ్యని విశ్వామిత్రుడు హెచ్చరిస్తాడు. కనబడని తాటకను ధ్వనిని బట్టి గుర్తించి, తీక్షణమైన బాణాన్ని సంధించి, దాని రొమ్ములో నాటుకునేటట్లు వేయడంతో, ఆ రాక్షసి చచ్చిపోయి, భూమి అదిరిపోయేటట్లు దబీలుమని పడిపోయింది.

ఆ విధంగా శ్రీరామచంద్రమూర్తి అవతార కార్యధురంధరత్వం స్త్రీ వధతో ప్రారంభవుతుంది. స్త్రీ వధ పాపని రామాయణంలోనే భరతుడి మాటల వల్ల, హనుమంతుడి మాటల వల్ల తెలుస్తోంది. అలాంటప్పుడు శ్రీరాముడు ఎందుకు స్త్రీ వధ చేశాడు? అంటే, స్వధర్మ నిర్వహణ తన విధి అని భావించిన శ్రీరామచంద్రమూర్తి తాటకను చంపడం దోషం కాదు. విశ్వామిత్రుడి ఆజ్ఞ పాలించమని దశరథుడు ఆదేశించడం కూడా కారణమే.

కుమార సంభవం

(విశ్వామిత్ర ప్రబోధం: విశ్వామిత్రుడు యాగరక్షణ కోసం రామలక్ష్మణులను తీసుకు వెళ్లాడు. దారిమధ్యలో అనేక కథలను, గాథలను వివరించాడు. కొన్ని అస్త్రవిద్యలను రామలక్ష్మణులకు బోధించాడు. రాముని చేత తాటక సంహారం చేయించాడు. సీతాకల్యాణానికి ముందుగా మిథిలా నగరానికి వెళ్లే దారిలో గంగావతరణ గాథను చెప్పాడు. కుమార సంభవ గాథ కూడా గంగావతరణ నేపధ్యంలోనే వస్తుంది. వాల్మీకి రామాయణాన్ని యధాతథంగా అనుసరిస్తూ రచించిన వాసుదాసస్వామి మందరాన్ని వివరణలతో సహా చదివిన వారికి అనిర్వచనీయ అనుభూతి కలుగుతుంది).

విశ్వామిత్రుడి యాగరక్షణ పూర్తైన తరువాత (జరుగనున్న సీతారామ కల్యాణ ఘట్టం కొరకు) మిథిలానగరం దిశగా ప్రయాణం కొనసాగిస్తూ, గంగానదీ తీరంలో విశ్వామిత్రుడి చుట్టూ కూర్చున్న రామలక్ష్మణులకు, దాని వృత్తాంతాన్ని విశ్వామిత్రుడు వివరించాడు.

హిమవంతుడు మేరుపర్వతం కూతురైన మనోరమను పెళ్లి చేసుకున్నాడు. ’గంగ”, ’ఉమ’ అని, ఇద్దరు కూతుళ్లను కన్నాడు. దేవతలు హిమవంతుడిని కలిసి, తమ కొరకు గంగను మూడు మార్గాల్లో ప్రవహింపచేసి, ఒక మార్గాన్ని తమకిమ్మని వేడుకున్నారు. వారికోరిక మేరకు గంగను వెంటనే ఇవ్వడంతో వారామెను తమ లోకానికి తీసుకుపోయారు. ఆ విధంగా పర్వతరాజు కూతురైన గంగ ఆకాశానికి పోయింది.

ఆ తరువాత శివపార్వతుల కల్యాణం జరిగింది. కుమార సంభవం కోసం శివతేజాన్ని బ్రహ్మ సూచనమేరకు అగ్నిహోత్రుడు గంగలో విడిచ పెట్టాడు. గంగ సౌందర్యవంతమైన రూపాన్ని ధరించి ఆయన్ను సమీపించగా, తన సర్వావయాలనుండి తనలో వున్న తేజస్సును ఆమెలో విడిచాడు. దాంతో గంగా ప్రవాహమంతా మిక్కిలి తేజస్సుతో ప్రకాశించింది.

గర్భ వేదనను సహించలేక దిగాలుపడిన గంగ, అగ్నిహోత్రుడి సూచనమేరకు తన గర్భాన్ని హిమవంతం కిందిభాగంలోని శుక్ల శోణితాల్లో విడిచింది. ఆ ప్రదేశం వెండి, బంగారం అయింది. దాని వేడిగాలికి బూడిదైన ప్రదేశం రాగి, ఇనుము అయింది. మలినం నిలిచిన ప్రదేశం సీసం, తగరం అయింది. అది ప్రవహించిన ప్రదేశంలో అనేక ధాతువులు ఏర్పడ్డాయి. ప్రత్యక్షంగా ఎక్కడైతే గర్భం నిలిచిందో అదంతా బంగారు మయమయింది. అది వ్యాపించిన ప్రాంతంలోని చెట్లు, తీగలు, పొదలు, పచ్చిక బంగారమయింది. అప్పటినుంచి బంగారం అగ్ని వర్ణంలో వుండడంతో జాత రూపం అనే పేరొచ్చింది. శరవణంలో పుట్టిన కొడుకును, ఇంద్రాది దేవతలు, తమ సేనలకు నాయకుడిగా అభిషేకం చేశారు.  

సగరుడి మరణం తర్వాత సగరకుమారులకు తర్పణాలు విడవడం కోసం భగీరథుడు గంగను తెచ్చేందుకు గోకర్ణానికి పోయి తపస్సు చేశాడు. ప్రత్యక్షమైన బ్రహ్మను, గంగా తీర్థంతో తన తాతల బూడిద రాసులను తడిపితే వారందరు స్వర్గానికి పోతారని, అలా వరమివ్వమని కోరాడు. అందుకు బ్రహ్మ,ఆకాశగంగ భూమిపై పడితే ఆ వేగాన్ని, భారాన్ని భూమి భరించలేదుకాబట్టి దాన్ని భరించేందుకు శివుడిని ప్రార్థించమని సూచిస్తాడు. భగీరథుడు శివుడి కొరకు తపస్సు చేయడంతో, గంగానదిని తన శిరస్సుపై ధరిస్తానని శివుడు మాటిస్తాడు. కానీ సహించరాని వేగంతో వస్తున్న ఆకాశగంగ పొగరు చూసిన శివుడు, రోషంతో విజృంభించడంతో రుద్రుడి జడలో ప్రవేశించిన ఆకాశ గంగ, వెలుపలకి రాలేక, అందులోనే చాలా సంవత్సరాలు సుళ్లు తిరుగుతూ బాధనుభవించింది.

‘ఆ తరువాత శివుడు, తన జడల గుంపును కొంత సడలించడంతో, ఆ సందులోంచి కొంచం పరిమాణంలో గంగానది బిందు సరోవరం నుండి ఏడు పాయలుగా పారి, హ్లాదిని, పావని, నళిని అనే మూడు పాయలు తూర్పు ముఖంగా, సుచక్షువు, సీత, సింధు అనే మూడు పాయలు పడమటి దిక్కుగా పారాయి. మిగిలిన ఏడో పాయ భగీరథుడి వెంట వచ్చింది. అలా ఆకాశాన్నుండి చీలిపోయి, శివుడి జటాజూటంలోకి చొరబడి, అక్కడినుంచి భూమి పైకొచ్చింది. ఆ పవిత్రమైన గంగా జలాలో దేవతలు, దేవర్షులు, భూమ్మీద వున్నవారు అందులో స్నానం చేసి తరించారు. భగీరథుడి కోరిక నెరవేర్చేందుకు గంగ పాతాళానికి పోయి, ఆయన తాతల బూడిదమీద ప్రవహించడంతో, సగర పుత్రులంతా స్వర్గానికి పోయారు.

గంగ పవిత్రం కావడానికి అసలు కారణం, విష్ణుపాదంలో పుట్టడమేనని కొందరు, హరుడి శిరస్సునందుండి పడడం వల్ల పుణ్య నది అయిందని మరికొందరు వాదిస్తారు. ఈ వివాదాన్ని పరిష్కరించేది వాల్మీకి రామాయణమేనని ఆంధ్రవాల్మీకి వాసుదాసుగారి అభిప్రాయం. రామాయణం మూల శ్లోకంలో పుణ్యగంగ, పుణ్యశివుడి శిరస్సులో పడింది అని వుంది!.

(వాసుదాసుగారి ఆంధ్రవాల్మీకి రామాయణం మందరం ఆధారంగా).

Monday, August 28, 2023

ఉదంకుడికి తన విశ్వరూపాన్ని ప్రదర్శించిన శ్రీకృష్ణ పరమాత్మ ..... ఆస్వాదన-135 : వనం జ్వాలా నరసింహారావు

 ఉదంకుడికి తన విశ్వరూపాన్ని ప్రదర్శించిన శ్రీకృష్ణ పరమాత్మ

ఆస్వాదన-135

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (28-08-2023)

ఆధ్యాత్మ జ్ఞానాన్ని, బ్రహ్మతత్త్వాన్ని, మోక్షప్రాప్తిని అర్జునుడికి బోధించి, అతడిని వాటిలో నిపుణుడిగా తీర్చిదిద్దిన అనంతరం శ్రీకృష్ణుడు, తన తండ్రి వసుదేవుడిని చూడాలని తన మనస్సు ఆరాటపడుతున్నదని అర్జునుడికి చెప్పి అతడి అంగీకారాన్ని కోరాడు. తనను సంతోషపూర్వకంగా ద్వారకకు పంపమని అడిగాడు. నరనారాయణులైన కృష్ణార్జునుల ఆత్మీయతకు ఇదొక నిదర్శనం. ఆ తరువాత ఉభయులూ ఇంద్రప్రస్థంనుండి హస్తినాపురం పోవడానికి నిశ్చయించుకున్నారు. కృష్ణార్జునులు హస్తినాపురం వెళ్తుండగా మార్గమధ్యంలో అర్జునుడు తమకు శ్రీకృష్ణుడు కురుక్షేత్ర సంగ్రామంలో చేసిన సహాయానికి పలువిధాలుగా కృతజ్ఞతలు తెలియచేశాడు. ఆయన చలవ వల్లనే ధర్మరాజు సార్వభౌముడై అందరికీ పరమపూజ్యుడయ్యాడని అన్నాడు. అర్జునుడు తనమీద భక్తితో మాట్లాడిన మాటలకు శ్రీకృష్ణుడు అతడిని ప్రశంసించాడు. ఇద్దరూ అలా మాట్లాడుకుంటూ హస్తినాపురం ప్రవేశించారు.

ముందుగా వారిద్దరూ ధృతరాష్ట్రుడి గృహానికి పోయి ఆయనకు, గాంధారికి నమస్కరించారు. కుంతీదేవిని, విదురుడిని, ధౌమ్యుడిని, యుయుత్సుడిని, సంజయుడిని సందర్శించారు. ధర్మరాజును భక్తిపూర్వకంగా కలిశారు. మర్నాడు అందరూ కొలువుకూటంలో వున్నప్పుడు అర్జునుడు ధర్మరాజుకు, శ్రీకృష్ణుడు ద్వారకానగరానికి పోవాలనుకుంటున్న విషయం చెప్పి, ఆయన ద్వారకకు వెళ్లి బలరాముడిని, వసుదేవుడిని, దేవకిని, ఇతర బంధువులను సందర్శించి తిరిగి హస్తినాపురం వస్తాడని అన్నాడు. శ్రీకృష్ణుడు కూడా అదే విధంగా చెప్పి అశ్వమేధయాగం చేసే సమయానికల్లా తిరిగి హస్తిన చేరుకుంటానని అంటూ, ధర్మరాజుకు నమస్కరించాడు. కుంతికి, ద్రౌపదికి వెళ్లివస్తానని చెప్పాడు. సుభద్రను తనతోపాటు తీసుకెళ్తానని అన్నాడు. అలా శ్రీకృష్ణుడు ధర్మరాజు, అర్జునుడి అంగీకారం పొందాడు. శ్రీకృష్ణుడు ఆ విధంగా హస్తినాపురం నుండి సాత్యకి, సుభద్రలతో సహా బయల్దేరాడు.

ద్వారకకు వెళ్లే దారిలో శ్రీకృష్ణుడు ఉదంకుడి ఆశ్రమం దగ్గర ఆగాడు. కురుక్షేత్ర సంగ్రామంలో శ్రీకృష్ణుడు నిర్వహించిన పాత్ర గురించి ఉదంకుడు వ్యంగ్యంగా, నిందాపూర్వకంగా పలికాడు. ఆయన మాటలను గ్రహించినట్లుగానే నటించి శ్రీకృష్ణుడు ఉదంకుడికి తాను చేసిన సంధి ప్రయత్నాలు వివరించాడు. తన మాటలు కౌరవులు వినలేదని చెప్పాడు. యుద్ధంలో మరణించి కౌరవులు స్వర్గలోకానికి వెళ్లారని, పాండవులలో కూడా వారైదుగురు తప్ప మిగిలిన వారంతా కౌరవుల గతినే పొందారని, కాల నియమాన్ని ఎంతటివారైనా అతిక్రమించలేరని స్పష్టంగా తెలియచేశాడు శ్రీకృష్ణుడు.

శ్రీకృష్ణుడి మాటలకు ఉదంకుడికి ఆగ్రహం కలిగింది. కళ్లు చింత నిప్పులయ్యాయి. కౌరవ వంశాన్ని నాశనం చేసినందుకు భయంకర శాపం పెట్తానన్నాడు. తాను చెప్పే మాటలను వినమని, ఆ తరువాత ఆయన ఇష్టం వచ్చినట్లు చేయమని అంటూ శ్రీకృష్ణుడు ఉదంకుడికి ఇలా చెప్పాడు.

‘ఉదంకా! సత్త్వరజస్తమస్సు అనే గుణత్రయం నాలోనే వున్నది. దేవతలంతా నాలోనే పుట్టారు. నేనే సృష్టి అంతా వ్యాపించి వున్నాను. నాలోనే నిశ్చలంగా సృష్టి వున్నది. చిత్తు, అచిత్తు అనే తత్త్వాలు రెండూ నేనే! నాలుగు వేదాలు, నాలుగు వర్ణాలు, నాలుగు ఆశ్రమాలు, వాటికి సంబంధించిన విధులు, స్వర్గం, మోక్షం నా రూపాలే. యజ్ఞపరాయణులు నన్ను స్తుతించి పుణ్యఫలాన్ని పొందుతారు. పాపాత్ములు కూడా ప్రాయశ్చిత్త కర్మలు చేసి నన్ను స్తుతించి దోష విముక్తులౌతారు. యముడు నా పెద్ద కొడుకు. అవసరమైనప్పుడు ఆయ ఆవతారాలెత్తి లోకాన్ని కాపాడుతాను. సర్వలోకాలలో మహామహిమలు కలిగిన నేనే బ్రహ్మగా సృష్టిని, విష్ణువుగా స్థితిని, శివుడుగా లయాన్ని అనాయాసంగా చేస్తాను. లోకోపకార పనులను చేస్తూ అధర్మాత్ములను నశింపచేస్తాను. ధర్మాత్ములను రక్షిస్తాను. కౌరవపాండవులు సఖ్యతగా వుండడానికి అన్ని ప్రయత్నాలు చేశాను. వారే వినక యుద్ధంలో మరణించారు.

శ్రీకృష్ణుడు చెప్పినదంతా విన్న ఉదంకుడు తాను నిర్మలుడినయ్యానని, గర్వం అణగిపోయిందని అన్నాడు. తన మనోనేత్రాలు ఆనందించే విధంగా తనకు శ్రీకృష్ణుడి విశ్వరూపాన్ని చూపించమని ప్రార్థించాడు ఉదంకుడు. దయామయుడైన శ్రీకృష్ణుడు తాను అర్జునుడికి చూపించిన విశ్వరూపాన్ని ఉదంకుడికి చూపాడు. అది చూసి తన కళ్లకు, మనస్సుకు తృప్తి కలిగిందని అన్నాడు ఉదంకుడు. తిరిగి ఆయన సహజ రూపాన్ని ధరించమని వేడుకున్నాడు. సహజ రూపం ధరించిన శ్రీకృష్ణుడు వరం కోరుకొమ్మని ఉదంకుడికి చెప్పగా, తన చేరువలో నీరు వుండే విధంగా అనుగ్రహించమని అన్నాడు. తనను స్మరిస్తే నీళ్లు ఎప్పుడైనా లభిస్తాయని వరం ఇచ్చాడు శ్రీకృష్ణుడు. ఉదంకుడు వుంటున్న నిర్జల ప్రదేశంలో ఆయనకు ఇష్టమైనప్పుడు మేఘాలు నీళ్లు కురిపిస్తాయని, వాటికి “ఉదంక మేఘాలు” అనే పేరు కలుగుతుందని, అవి ఆ ప్రదేశంలో చక్కగా వ్యాపించి సంచరిస్తాయని అని చెప్పాడు శ్రీకృష్ణుడు. ఆ తరువాత శ్రీకృష్ణుడు అంతర్థానమయ్యాడు.

ఉదంకుడికి అలా చెప్పి ఆయన్ను వీడి శ్రీకృష్ణుడు ద్వారకానగరం చేరుకున్నాడు. ద్వారకావాసులంతా శ్రీకృష్ణ సందర్శనంతో ఉప్పొంగిపోయారు. దేవకీవసుదేవులను, బలరాముడిని, ఇతర బంధువులను, స్నేహితులను చూసిన శ్రీకృష్ణుడు వారివారికి తగిన విధంగా మర్యాదలు చేశాడు. భారత యుద్ధాన్ని గురించి సంపూర్ణంగా వినాలని వున్నదని దాన్ని తనకు చెప్పమని అడిగాడు వసుదేవుడు. భారతయుద్ధ కథ చాలా పెద్దదని, దాన్నంతా చెప్పడానికి చాలా రోజులు పట్తుందని, ముఖ్యమైన ఘట్టాలు చెప్తానని అన్నాడు కృష్ణుడు.

కౌరవపాండవ సైన్యాల పరిమాణాన్ని, భీష్ముడు సైన్యాధిపతి కావడాన్ని, అతడు శిఖండి చేతిలో పడిపోవడాన్ని, అంపశయ్యమీద వుండడాన్ని, ద్రోణాచార్యుడి పోరాటాన్ని, అతడి మరణాన్ని, కర్ణుడి మరణాన్ని, శల్యుడు ధర్మరాజు చేతిలో చావడాన్ని, భీముడి చేతిలో దుర్యోధనుడి ఓటమిని, ప్రాణాలు విడవడాన్ని, పాండవుల విజయాన్ని, అశ్వత్థామ చేసిన ఘోరాన్ని మొదలైన అంశాలతో 18 రోజుల భారత యుద్ధాన్ని సంక్షిప్తంగా చెప్పాడు శ్రీకృష్ణుడు. అభిమన్యుడి చావును గురించి వివరంగా చెప్పలేదు.  

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, అశ్వమేధపర్వం, తృతీయాశ్వాసం

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)

 

 

   

      

      

 

Saturday, August 26, 2023

DOWN THE MEMORY LANE: DR MCR HRD INSTITUTE ..... Premier Administrative Training Center of Telangana State : Vanam Jwala Narasimha Rao

 DOWN THE MEMORY LANE: DR MCR HRD INSTITUTE

Premier Administrative Training Center of Telangana State

Vanam Jwala Narasimha Rao

The Hans India (27-08-2023)

(The duo BP Acharya (Mainly) and MP Sethy were responsible for starting or conducting prestigious programs that included, Orientation Training to Government Employees including HoDs through Centre for Telangana Studies; LBSNAA sponsored Foundation Courses (FC) for All India Services and Central Civil Services; Special FC for backlog AIS officers; FC for IES and ISS officers; First Ever FC for Military Engineering Service; FC for ASOs of Central Secretariat; Training on Soft Skills to over a lakh State’s field staff under DOPT E-Learning Program etc. – Observation by Editor, The Hans India)

Two months ago, when Telangana CM K Chandrashekhar Rao mentioned that Training to political leaders in ‘Effective Leadership,’ would be imparted, I recollected, down the memory lane, my Nine Years Spell in the Premier Administrative Training Center of Government of Telangana, the Dr MCR Human Resource Development Institute (Dr MCR HRD I), as Faculty, Senior Faculty and Additional Director.

Following recommendation of VT Krishnamachari, to facilitate training for all civil and technical services and suggestion by Government of India in 1962, the Institute of Administration (IOA) was set-up in erstwhile AP in March, 1976. This was renamed as Dr MCR HRDI later. V Narayana Rao was the first Director General. An eminent administrator and illustrious person, PVRK Prasad’s everlasting contribution as Director General (DG) for over 7 years, triggered transformation of the Institute, that has come to stay as a widely accepted and internationally acclaimed center.  

When PVRK took charge in 1996, institute confined to organizing traditional, rule-based, class room oriented and monotonous training programs with no precise aim or objective. Additional DG Urmila Subba Rao, from whom PVRK took charge, was responsible for capacity and capability building in the Institute and who in fact, initiated process of building the institute. I still remember meeting the then Chief Minister Chandrababu Naidu with her several times, who evinced keen interest in developing the Institute. For the professional aspects of training, the entire credit goes to MP (Mahavir Prasad) Sethy, whose contribution has no parallel.   

Following guidelines of National Training Policy (NTP), ‘State Training Initiative’ (STI) drafted by Urmila Subbarao was launched with the concept of ‘Training for All (TFA). Institute’s infrastructural facilities by adding two more floors to the existing building, well-furnished training rooms, auditoriums, Conference and Mini Conference Halls, Board Room, indoor and outdoor sports facilities including swimming pool, gymnasium, and hostel blocks, were brought to the ‘State of Art’ level. HRD’s sprawling 33-acre campus in Jubilee Hills blossoms with a lush green area. A separate complex to accommodate, ‘Centre for Good Governance’ (CGG) was set-up in the Institute campus, which too was headed by PVRK initially as DG. Tony Blair the then UK Prime Minister came all the way from England to inaugurate it.

Joining the Institute on September 5, 1995 when Dr V Chandramauli was DG, I worked for 9 years, till August 31, 2004 and was a part and parcel in its phased development and total transformation, into a world class HRD and Training Center. The day I joined hardly people knew Institutes’ exact location since it was little familiar. In the initial days, faculty often had to wait for trainee participants anxiously and desperately at the entrance for their training programs, who were always same for every program. Budget allocation was negligible. But, as the days passed, the Institute was credited with, being the earliest one to implement NTP Guidelines in letter and spirit adopting to the needs of state. Infrastructural facilities were multiplied. The then CM Chandrababu Naidu and his cabinet colleagues made frequent visits to the institute.

Besides PVRK and Urmila Subbarao, it was a privilege for me to work with Distinguished Administrators of the stature of VK Srinivasan, PP Williams, PV Rao, Raghottam Rao, AK Parida, A Chengappa, R Seetharama Rao, MP Sethy, Ranjana Shiva Shankar, Usha Ashok Kumar, Rani Kumudini etc. as my senior Colleagues and DGs. Hierarchy was seldom observed. M Narayana Rao, Dr P Dayachari, Pankaj Dwivedi, Dr Virendra Jauhari, Ajoyendra Pyal, Md Shafiquz Zaman, Dr Prashanta Mahapatra, SK Sinha, Lakshmi Parthasarathi, Vinod K Agrawal, BP Acharya, Harpreet Singh, Benhur Mahesh Dutt Ekka, and Dr Shashank Goel, whose contribution is equally significant, headed the Institute subsequently.

By attending several Trainer-Training Programs, generally organized by ‘Institute of Secretariat Training and Management’ (ISTM) of the Government of India (GOI), ‘Department of Personnel and Training’ (DOPT), in New Delhi, I acquired professional qualifications necessary for training delivery effectively. First among them, ‘Systematic Approach to Training’ (SAT), enabled me to impress Urmila Subbarao, then in charge DG, to initiate ‘Training Needs Analysis (TNA) that ultimately led to OMR formats based massive TNA of all the 11 lakh government employees, the first of its kind in the Country!!!

Management of Training’ (MOT) Course, ‘Director Trainer Skills’ (DTS), ‘Design of Training’ (DOT), ‘Trainer Training Course in DTS to become ‘Recognized User’ to run DTS Course etc. also I attended, in addition to many more such programs. I was selected to attend a three week ‘Trainer Training Program’ in Thames valley University (Slough, UK) based on the Training Module ‘Reform Initiatives in Administration’ designed, developed, and piloted by me.

Organizing a diversity of training programs as Training Coordinator and Faculty, it was a Joint Learning on administration. These included training 9 batches of IAS Probationers (Assistant Collectors under training) during their Institute Attachment and also Group 1 and 2 Officers Foundation Training. Almost all participants of these programs have been in constant touch with me exchanging pleasantries despite working in senior positions. When the first ever Training Program for the entire Cabinet including the then CM for three days in 1999 was held, for which Experts in various fields were invited as guest faculty, I was coordinating it.      

At a time when Training was an identified priority area in Government scheme of things, to seek commitment of HoDs, who included senior IAS Officers, a unique ‘Orientation to Management of Training’ (OMOT) Module was designed and developed by me in consultation with MP Sethy during later 90s. About 150 senior and junior IAS officers, as well as HODs of erstwhile AP attended these series of three days duration workshops. OMOT was later adopted by Nationwide Training Institutes. Governing for Results, Land Reforms, Tribal Welfare, Forest Development, Human Rights, Disaster Management, Media and Public Relations, Communication and Effective Leadership Skills, Role of NGOs, Citizen Charters, Child Labor, Right to Information etc. were other programs designed, developed, and implemented by me.  

At a time when MCR HRD launched STI and was in search of high-profile Master Trainer, on my suggestion, the then DG PVRK Prasad, on obtaining MP Sethy’s consent, proceeded with the process of bringing him on deputation to MCR HRDI from his parent ‘Indian Naval Stores Management Service’ where he was in a senior position. Sethy even now is THE TOP RANKER MASTER TRAINER who had undergone training in Thames Valley and responsible for designing many Trainer Training Programs in the country including drafting ‘National Training Policy.’ 

At one stage, PVRK requested intervention of the then CM to speak to Defense Minister George Fernandez to expedite the process. Sethy joined the Institute in a very Senior Position and soon, Institute’s Capacity and Capability function touched sky high. Even after his term was over and even after his retirement, on my suggestion, (Now 70+ years) Sethy accepted a visiting assignment during BP Acharya’s period as DG and still offering his services on request.

The duo BP Acharya (Mainly) and MP Sethy were responsible for starting or conducting prestigious programs that included, Orientation Training to Government Employees including HoDs through Centre for Telangana Studies; LBSNAA sponsored Foundation Courses (FC) for All India Services and Central Civil Services; Special FC for backlog AIS officers; FC for IES and ISS officers; First Ever FC for Military Engineering Service; FC for ASOs of Central Secretariat; Training on Soft Skills to over a lakh State’s field staff under DOPT E-Learning Program etc.

With lot of Admiration for Training and Premier MCR HRD Institute, I sincerely feel that Training Should continue to be Identified Priority Area in Government Scheme of things.

(The writer is CPRO to CM Telangana and

former Additional Director Dr MCR HRD IT)