Sunday, December 31, 2023

భారతీయ సాంప్రదాయం, ఇతిహాసమే సాంస్కృతిక ఇతిహాసం .... ఋగ్యజుస్సామాథర్వ వేదాల సారం-5 : వనం జ్వాలా నరసింహారావు

 భారతీయ సాంప్రదాయం, ఇతిహాసమే సాంస్కృతిక ఇతిహాసం

ఋగ్యజుస్సామాథర్వ వేదాల సారం-5

వనం జ్వాలా నరసింహారావు

సూత్యదినపత్రిక (01-01-2024)

‘సకల సృష్టిస్థితిలయాలకు కారకుడైన ఆ ఒక్కడెవరు? ఏక, ఏవ లేదా ఒక్కడే అనే పదాన్ని స్పష్టంగా చెప్పబడినది. ఏకవబ్రహ్మా, ద్వితీయం బ్రహ్మం అంటే ఒక్కడేనని, రెండవవాడు లేడని అర్థం. “అజస్య” అనే ఒక పదాన్ని వేదంలో వాడినారు. అతడు జన్మరహితుడు. ఇది మరొక విశేణం. “అజస్యనాభావధ్యేకమర్పితం తస్మిన్విశ్వాని భువనాని తస్థుః” అంటే అజుని నాభిలోని బ్రహ్మాండంలో సకల భువలాలు ఉన్నవని. అజ్ఞానం మంచు లాంటిది. “నీహారేణ” అన్నారు. ఒక పదార్థాన్ని చూడడానికి మధ్యనున్న మంచు కరగాల్సిన అవసరం వున్నది. పదార్ధం వున్నా, దానిని చూసేవాడు వున్నా, మధ్యలో అజ్ఞానం అనే మాయ తొలగినప్పుడే పదార్ధం దర్శనము ఇస్తుంది. చీకటిలో తాడును చూసి పాము అని భ్రమపడే వాడికి పోవలసినది చీకటి. అప్పుడే వాస్తవం కనిపిస్తుంది.’

         ‘మానవుడు ఏకాకిగా, వంటరిగా, వేరుగా జీవించలేడు. పశుపక్ష్యాదులు సహితం వంటరి జీవితాన్ని గడుప లేవు. తోడూ, నీడా లేనిది జీవితం సాగదు. ఒంటరి బ్రతుకు ఒక బ్రతుకే కాదు. జీవితంలో ఎక్కువకాలం కలిసి వుండడానికి మగకు ఆడ, ఆడకు మగ తోడు అవసరం. ఈ జంట తోడుకు మాత్రమేకాకుండా గురుతరమైన కుటుంబ బాధ్యతలు నిర్వహించాల్సి వున్నది. సమాజపు స్వరూప, స్వభావాలు ఎటువంటివి అయినా, అది దంపతులు, కుటుంబం మీదనే ఆధారపడతారు. మంచి కుటుంబమే మంచి సమాజమవుతుంది. ఏ ఇద్దరి స్వభావాలు, అభిరుచులు, అభిప్రాయాలు ఒకే తీరుగా వుండవు. ఇది ప్రకృతి రీతి. అలాగైతే ఒక ఆడ, మగ జంటను కూర్చడం అవసరం. కొన్ని పక్షిజాతులలో దాంపత్యం అపూర్వం. మనిషి పశుపక్ష్యాదుల  నుండి నేర్చినాడో, లేక, అవసరమే అలా చేసినదో? ప్రశ్నార్థకం! ఆడ, మగను కలపడానికి పవిత్రమైన వివాహ బంధాన్ని ఏర్పరిచినారు. ఈ వివాహ బంధాన్ని నిలపడానికే సాహిత్యంలో అనేక విషయాలు కనిపిస్తాయి’.

         ‘వేద సూక్తంలో అందంగా, రమ్యంగా, మనోహరంగా వివాహం గురించి చెప్పబడినది. వివాహం అనేది ఏనాటిదో తెలియని కాలంలో ఎంతో చక్కగా చెప్పబడినది. ఇందులో వధువుకు ప్రాధాన్యత ఇవ్వబడినది. “గృహిణీగృహముచ్యతే” అనే నానుడి ప్రకారం, ఇటుకలు ఇల్లు కాదు!! ఇల్లాలే ఇల్లగును!!! ఇల్లాలికి ఇంటి మీద, భృత్యులమీద, పశువులమీద, అత్తమామలు, మరుదుల మీద అధికారమిచ్చినారు. “సామ్రాజ్ఞీ” అన్నారు. ఆమె తోడుగా తనను వృద్ధావస్థవరకు నడుపుమని వరుడు ప్రార్థించడం ఆమె అధికారానికి సంకేతం. మరో వేద మంత్రంలో దాంపత్యాన్ని గురించిన ఆశయాన్ని చక్కగా వివరించడం జరిగింది. పిల్లలు, పిల్లల పిల్లలతో ఆడుకుంటూ గడిపే వార్థక్యం! ఇంతకు మించి ఆశించగలమా? మరో మంత్రంలో సతిని సహితం పదిమంది పుత్రులలో చేర్చి పదకొండవ దానిగా చేసినారు. పదిమందిని కన్న తల్లి, భర్తకు తల్లిలాగా ప్రేమించడమే కోరుకొనేది. శారీరకమైన కామ సంబంధాన్ని వివరించడంతో పాటు మనసుల కలయికను గురించి చెప్పారు వేదంలో.’

‘సమాజం అధికభాగం సంతానం మీద ఆధారపడి ఉంది. సంతానమే సమాజపు నిరంతర జీవనం. సంతానం తల్లి మీద, స్త్రీమీద ఆధారపడి ఉంది. కాబట్టి స్త్రీయే సమాజం. స్త్రీ ఎంత సౌశీల్యవతి అవుతే సమాజం అంత సుశీలం అవుతుంది. ఇంటికి వచ్చిన కోడలే కుటుంబానికి మహారాణి. స్త్రీకైనా, పురుషునికైనా అనుకూల దాంపత్యం ఒక వరం. కలిసి ఉన్న దంపతులు కష్టాలను లెక్కచేయరు. ఆనందం సంపదలో లేదు! అనన్యత్వంలో ఉంది!! సుఖ దుఃఖాలు సాపేక్షాలు. కలసి నవ్వడంలో ఎంత ఆనందం ఉందో, కలసి ఏడవడంలోనూ అంత ఆనందం ఉంది!. అన్ని దశల్లోనూ కలసిసాగడం వల్ల హృదయానికి విశ్రాంతి, మనశ్శాంతి. వార్ధక్యం వచ్చినా అదే వలపు, అదే ప్రేమ. కాలం నడుస్తుంటే ప్రేమ పండుతుంది. స్నేహం స్థిరంగా ఉంటుంది. అలాంటి దాంపత్యం ఆశించని వాడు ఎవడు? హిందూ వివాహం పవిత్ర బంధం. దాన్ని మృత్యువు సహితం విడదీయలేదు. అది ఏడేడు జన్మల బంధం. నూరేళ్ల పంట! ఎంతటి సమాజంలోనైనా కుటుంబానిదే అగ్ర స్థానం. కుటుంబమే సమాజానికి మూల కారణం. వేదం సుఖమయ, శాంతిమయ కుటుంబానికి బాటలు పరచింది. ఒక్క స్త్రీ మాత్రమే కాదు సంసార రథానికి స్త్రీ పురుషులు రెండు చక్రాలు. అనుకూల దాంపత్యం సమాజానికి మూల స్థంబం.    

         ‘శరీర నిర్మాణం, అవయవాల కూర్పును గురించి వేదంలో వివరించిన తీరు వైద్య శాస్త్రంలో నాటి ప్రావీణ్యతను తెలియపరుస్తుంది. వేదం శాస్త్రానికి మూలం. ఆయుర్వేదం వైద్యశాస్త్రం. ఆయుర్వేదం కనుగొన్న వేప, తులసి లాంటి వనస్పతులకే మళ్లీ ప్రాధాన్యత కలుగుతున్నది! శతాబ్దాలలోనే అల్లోపతి వైద్యం మీద వ్యామోహం తగ్గుతున్నది. వేల సంవత్సరాల ఆయుర్వేదానికి ప్రాధాన్యత పెరుగుతున్నది! ఇంగ్లీషు వైద్యానిది నివారణ మాత్రమే! రోగి జీవితాతంతం రోగియే! చికిత్స జీవితాంతం కావాల్సిందే. వ్యాధి నిర్మూలన ఇంగ్లీషు వైద్యపు పరిభాషలో లేదు. అది వైద్యం కాదు. వ్యాపారం. వర్తకం. ఆయుర్వేదపు వ్యాధి నిర్మూలన అంటే శరీరంలోని సమస్త అవయవాల నుండి వ్యాధి తొలగిపోవడం అని వేదంలో వివరించారు.’

         ‘వేదంలో రాజకీయాన్ని గురించి స్పష్టంగా ఉన్నది. మేధావిని, సామాజిక నేతను, ధర్మాన్నే రాజును చేస్తుంది అంటుంది వేదం. భారత తాత్త్వికతలో ధర్మం రాజకీయాన్ని శాసించింది. సమాజం రాజకీయాన్ని శాసించింది. ఇలా అనడం మరింత సమంజసం. ప్రస్తుతం రాజకీయం కండకావరం, ధన మదంతో సమాజాన్ని శాసిస్తున్నది. ఇది భారత, పాశ్చాత్య తాత్త్వికతల మౌలిక భేదం. రాజు, రాచరికిం, చంచలం కారాదు. స్థిరం కావాలి. ప్రజలు అభిలషించేట్లుగా రాజు రాజ్యం చేయాలి. రాజ్యానికి హాని కలుగకుండ సమాజం, రాజకీయం చూడాలి.’    

‘గోవుకు వేదం ఎంతో ప్రాముఖ్యతనిచ్చింది. గోవును పవిత్రంగా భావించింది. గోవును దేవత అన్నది. గోవులు, విప్రులు, వేదాలు, పతివ్రతలు, సత్యవచనులు, లుబ్దులు కానివారు, దానశీలురు, ఈ ఏడుగురి వల్లనే భూమి నిలిచి ఉంది. ‘ఆవుపాలను గురించి వేదం బహుదా ప్రశంసించింది. ఏనాడైనా పాడి ఆహారానికి తప్పనిసరి. ఎంతో ఆధునికం అనుకుంటున్న ఈ కాలంలోనూ పాడి తప్పని సరి. పాడికి గోవు అవసరం. పాడి జీవనాధారం. భారత వ్యవసాయానికి ఈ నాటికీ పశువే పట్టుగొమ్మ. యజ్ఞానికి నేయి అవసరం. ఆహారానికి సహితం ఘృతం తప్పని సరి. “ఘృతంవినా భోజనమప్రశస్తం”. ఇన్నింటి వల్ల గోవు సామాజిక జీవితానికి అవసరం అని అర్థం అయింది.’ 

‘భూమి వ్రేలాడు తున్నదని యజుర్వేదం ప్రవచించింది. భూమి నిరాధారంగా నిలిచి, గాలిలో తేలియాడుతూ, రాలకుండా, నిలిచి ఎట్లా ఉన్నది! “శ్రీమహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య” అంటే, శ్రీమహావిష్ణువు ఆజ్ఞాపించడం వల్ల, భూగోళం ఆకాశంలో, గాలిలో, ఏ ఆధారం లేకుండా నిలిచి ఉంది! ఇది భౌతికం. ఈ భూమండలం మీదనే సకల ప్రాణిజాలం నివసిస్తున్నది. అగ్ని, వరుణ, వాయు దేవుల సహితంగా నరుడు మహీతలం మీదనే నివసిస్తున్నాడు. వేదం వారికోసం ఒక సమాజం, ఒక జీవన విధానం ఏర్పరిచింది. ఇవి నిరంతరం సాగాలంటే “ధర్మం” అవసరం. ధర్మం కొనసాగాలంటే కావాల్సిన అవసరాన్ని శ్లోకం వివరించింది.’  

‘మానవుడు సుఖజీవనం సాగించడానికి నిరంతర పరిశోధన జరిగింది. తెలుపురంగు మేధావులు యజ్ఞంలో పశుబలి “ఆర్యుల ఆటవిక జీవనం” అంటున్నారు. వేదం 5000 సంవత్సరాలదని పాశ్చాత్య విద్వాంసులు అంగీకరిస్తున్నారు. ఉదాహరణకు పశుబలి తీసుకుందాం. 5000 సంవత్సరాల క్రితపు పశుబలి ఆటవికం అయితే, పొట్ట నింపుకోవడానికి రోజూ లక్షల పశువులను హతమారుస్తున్న జాతి ఆటవికం కంటే అధ్వాన్నం కదా! వేయేళ్ల చరిత్ర గల ఆధునిక యూరోపు, 400 ఏళ్ల చరిత్ర గల అమెరికా, కెనడా, ఆస్ట్రేలియాలు వేలాది సంవత్సరాల నాగరికతను ఏర్పరిచిన వేదాన్ని ఆటవిక జీవనం అనడం అంటే, గ్రుడ్లు వచ్చి తల్లిని వెక్కిరించడమే!! ఇది అధికారమదం. సూర్యుడు అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యం అస్తమించింది! మిగతావీ అస్తమించాలి!! ఇది ప్రకృతి శాసనం. తప్పదు.’

‘విప్రులు అంటే మేధావులు. ఇతరులు కూడా మేధావులు కావచ్చు. అది వేరే సంగతి. రాజ్యం చేతులు మారినప్పుడల్లా వ్రేటు పడేది మాత్రం మేధావుల మీదనే! అది ఈనాటికీ సత్యమే! వంది, మాగధ మేధావుల సంగతి వేరే విషయం. వారు ఎవరినైనా స్తుతిస్తారు. నిత్యం స్తుతించే వారు కొల్లలు. సత్యం చెప్పేవారు అరుదు!! ఏ ప్రభుత్వమూ సత్యం సహించదు. దానికి పొగడ్తలు కావాలి. విప్రులు బ్రాహ్మణులు. అనంతర కాలంలో కులం అయింది. కులం కావడం తప్పనిసరి. వృత్తులు వంశపరంపరగా వచ్చాయి. అందువల్ల కొందరు మేధావులు కాని వారూ విప్రులు అవుతారు. కాలక్రమాన ప్రతి సంస్థ స్వప్రయోజనపరుల చేతుల్లో పడుతుంది. అప్పుడవి ఆత్మను కోల్పోయిన నిర్జీవ ప్రతిమలు అవుతాయి! విచిత్రం ఏమంటే సమాజం ఈ నిర్జీవ ప్రతిమలనే గుర్తిస్తుంది! ఇవ్వాల్టి కులాలు అన్నీ అర్థం కోల్పోయిన ఆర్భాటాలే! పూర్వం కులాలున్నాయి కాని నేటి కుల రాజకీయాల్లేవు. ఓట్ల చదరంగంలో కులం పావు అవుతున్నది.’

 ‘విప్రులు సమాజానికి వెన్నెముక లాంటివారు. వారి నిత్య పరిశ్రమ వల్లనే సామాజిక ప్రగతి సాధ్యం. మేధావి నిర్భయంగా తన అభిప్రాయం వెల్లడించగల వాతావరణం వుండాలని వేదం ఆ నాడు గుర్తించింది. సత్యానికి జరామరణాలు ఉండవు. ఏ సమాజానికైనా మేధావుల స్వేచ్చ అవసరం. “గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, బ్రాహ్మణాస్పంతు నిర్భయాః” అనేవి వేదం చేసిన నినాదాలు. భారత చరిత్ర వ్రాసిన కొందరు బ్రాహ్మణులను మతపు గుత్తాధికారులుగా, అత్యాచారాలు చేసినవారిగా వర్ణించి, వాస్తవ విరుద్ధంగా ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు.’

‘భారత ఇతిహాసం సాంస్కృతిక ఇతిహాసం. దాన్ని రాజకీయం చేయడమే ద్రోహం. కులమతాల పేర భారత సమాజాన్ని ఛిన్నాభిన్నం చేయాలనే కుట్రతో ఆంగ్లపాలకులు భారత చరిత్రను వంచించారు. మేధావులతో వప్పించారు. సనాతన కాలం నుండీ భారత సమాజంలో ధర్మం వేరుగానూ, రాజకీయం వేరుగానూ వర్ధిల్లాయి. ధర్మం సమాజాన్ని నిర్మించింది. భారత రాజులు కేవలం పాలించారు. భారత ప్రభువులు ఏనాడూ శాసించలేదు! ధర్మానికీ, రాజకీయానికీ స్పర్థ వచ్చినప్పుడు ధర్మానిదే పైచేయి అయింది. రాజకీయం ధర్మం ముందు లొంగింది. బ్రాహ్మణం ధర్మం అనుకుంటే రాజకీయం క్షాత్రం అయింది. క్షాత్రం, బ్రాహ్మణం పోటీలు పడలేదు. ఒకదాని సరసన ఒకటి వర్ధిల్లాయి. ఒకరి హద్దులను ఒకరు అతిక్రమించలేదు. చాణక్యుడు, విద్యారణ్యుడు ఉదాహరణలు. ఇది భారతీయ సంప్రదాయం. సమాజానికి మెదడు మేధావి. అతని ఆవశ్యకత తెలియపరచింది వేదం.’

‘సమాజానికి సర్వస్వం వేదం. జరిగిందీ, జరుగనున్నదీ వేదమే. వర్తమానం వుండదు. అది క్షణకాలంలో భూతకాలం అవుతుంది. మరుక్షణంలో భవిష్యత్ అవుతుంది! ప్రత్యక్షం, అనుమానంతో ఉపాయం దొరకదు. అప్పుడు వేదం ఉపాయం చూపుతుంది. అదే వేదపు వేదత్వం. ప్రత్యక్షం, అనుమానం రెండు ప్రమాణాలు, కొలతలు. ప్రత్యక్షం అంటే కంటికి కనిపించేది. అగ్ని మన ముందు మండుతున్నది. ఇది ప్రత్యక్ష ప్రమాణం. అగ్ని కంటికి కనిపించడం లేదు. దూరంగా పొగ వస్తున్నది. కాబట్టి అక్కడ అగ్ని ఉన్నదని అనుమానం. ఇది అనుమాన ప్రమాణం. ప్రత్యక్ష, అనుమాన ప్రమాణాల వలన అవగతం కాలేదు. అప్పుడు వేదం అవగతం చేయిస్తుంది. అర్థం చేయించడమే వేదపు వేదత్వం. వేదం సనాతనం, సాధ్వి. కొలమానాల్లో ఉత్తమం. ఇంద్రియాలకు అందని విజ్ఞానానికి వేదమే కొలమానం. వేదానికి మాత్రమే గోచరమయ్యే సూక్ష్మార్థం ఉంటుంది. దానికి తర్కం ఎలా ఉపయోగిస్తుంది? తర్కం ఇతర ప్రమాణాల మీద ఆధారపడింది. తర్కం స్వయంగా ప్రమాణం కాదుకదా! వేదం శాస్త్రం మాత్రం కాదు. సకల శాస్త్రాలకూ జన్మనిచ్చింది. అన్నీ వేదం నుంచే ఆవిర్భవించాయి. వేదం వల్లనే జీవితం నిలిచి ఉంది.’

(డాక్టర్ దాశరథి రంగాచార్య వేద సంహితల ఆధారంగా)

Saturday, December 30, 2023

‘Let Telangana Remain a Guiding Light for Nation’ Despite ‘Biased White Paper on State Finances’ : Vanam Jwala Narasimha Rao


'Let Telangana Remain a Guiding Light for Nation

'Despite ‘Biased White Paper on State Finances’

(Projecting Telangana as a ‘Debt-Ridden State’ will have serious Repercussions)

Vanam Jwala Narasimha Rao

The Hans India (31-12-2023)


{The debt claimed in the ‘White Paper’ is ‘Neither Loan nor Expenditure,’ but an ‘Investment’ that resulted in Creation of Rs 50 Lakh Crore assets in the last 10 years by the KCR Government. KTR clarified in his ‘Sweat Paper’ that FRBM Debts are only Rs 3,89,673 crores, including Rs 72,658 crores old loans and therefore, Net Loans are only Rs 3,17,015 crores but not Rs 6,71,757 crores as claimed in ‘White Paper’}.


TELANGANA Deputy Chief Minister and Finance Minister, Mallu Bhatti Vikramarka, tabling ‘White Paper’ on state's finances in the Assembly on December 20, 2023 said that, the economy of state was ruined by BRS Government by taking unlimited loans. He disclosed that, the debt has gone up to Rs 6,71,757 crores, and would further go up, with no tangible fiscal assets in proportion to the money spent were created in ten years. ‘White Paper’ is the first step to meet the fiscal challenges in a ‘Responsible, Prudent, and Transparent Manner,’ said the Deputy CM. He and Chief Minister A Revanth Reddy presented a copy of ‘White Paper’ to Prime Minister Narendra Modi, when they called on him on December 26, requesting him to come to the state’s rescue.


 Both ‘White Paper’ and ‘Telangana Economy Document,’ released earlier, placed on record the ‘Exceptional Financial Growth’ in KCR Government, in terms of GSDP (Rs 13,13,391 Crores) and Per Capita Income (Rs 3,12,398) growth. Despite making a remark that, ‘Quality of Telangana Budget Making Exercise’ was poor, the ‘White Paper’ observed that from 2014-15 to 2022-23, ‘Budget Estimates (from Rs 1,00,638 to Rs 2,56,859 crores) and Actual Expenditure Figures (from Rs 62,306 to Rs 2,04,085 crores)’ saw an upward trend.


The percentage share of ‘Actual Expenditure’ in the overall ‘Budget Estimates’ also gone up from lowest level of 61.9% in 2014-15, to 82.3% during 2014-23, on an average. The Paper also noted that, Telangana started on firm footing on the fiscal front, registering ‘Revenue Surplus’ during the first five years adhering to the ‘Fiscal Responsibility Norms’ broadly, except during 2019-22, (obviously due to economic recession arising out of corona). In all the remaining years Revenue was in surplus!!!

During the lively discussion on ‘White Paper,’ AIMIM floor leader Akbaruddin Owaisi questioning its intention expressed serious concern that, despite progress achieved under BRS Government, an attempt was made to send wrong message by highlighting that, the State is in distress. Former Finance Minister, Harish Rao argued that, it was not in the interests of Telangana to project it as a ‘Debt-Ridden State’ the repercussions of which would be disastrous. 


I fondly reminisce the day, June 17, 2014, when (Former) Chief Minister K Chandrashekhar Rao, held an informal marathon meeting for about eight hours, participated by CMO and other senior officers including from Finance. KCR put forth his ‘Broad but Crystal-Clear Vision’ of the newly formed State, frequently repeating with passion that, ‘Telangana Needs to be Reinvented and Reoriented.’ In my nine and half a years’ of working with KCR, with CMO team, and with other senior officers, that included from Finance Department, I had an opportunity to involve in the ‘Broad Contours of Budget Making.’ I never had an iota of doubt, at any point of time, that KCR was deviating from his approach to the state’s growth as envisioned.


White Papers’ are supposed to be ‘Authoritative Guides’ on ‘Shortcomings’ with ‘Proposed Solutions’ to tackle them. They are equally ‘Documents of Governments’ describing ‘Policy Preferences and Proposal.’ Of late, the rationale of white papers by and large, turned out to be pin pointing negative side of previous Governments, ignoring ‘Every Good’ done. Interpretation of data and twisting facts suiting one side of argument, is the strategy being followed. To what extent does the data interpretation in the ‘White Paper on State Finances’ is in consonance with spirit of BRS Budgets, ‘debts, and growth apart,’ is arguable.  



According to white paper, for any Government to manage the finances, ‘Budget is the Principal Tool’ and ‘Budget Data’ is standard. Preparing Annual Budget for a State is not a ‘Trivial Matter’ but a ‘Workout Literally’ requiring knowledge, skill, right attitude, commonsense, vision, and statesmanship. As KCR said repeatedly, Budget was not a mere ‘Financial Statement of Accounts’ or repeating ‘Same Budgetary Heads with increased Percentages in Figures.’!!!


Therefore, an elaborate and scientific exercise backed by hours and days of homework, visionary, and incredible thinking process, involving ‘Highly Learned Civil Servants and Experts in Finance Matters’ as well as ‘Elected Public Servants’ preceded drafting the successive Annual Budgets of Telangana since its formation. They were not ‘Showcase Budgets.’ Strictly speaking, every BRS Government Budget in itself was no less than a ‘Full-fledged White Paper,’ transparently posted in public domain the entire data of which was endorsed from time to time by Government of India bodies like CAG and NITI Aayog.  


            For BRS Government led by KCR, first ten months it was all confusion. Budget had to be prepared based on ‘No Precedence, No Blue Print and No Specimen.’ It was difficult to arrive at right fiscal resources. KCR envisaged, evolving an inclusive policy for formulating Budget Proposals for the financial year 2014-2015 based on the nature and size of state’s economy vis-à-vis country economy, dovetailing both to generate wealth. Fourteen ‘Expert Task Force Committees’ were constituted. Based on their reports, the first budget was prepared based on available information. In the second financial year it was bit of better understanding about positive and negative aspects of state finances.


It was only after the income and expenditure under ‘Plan and Non-Plan Schemes’ from 31st March 2015 to 31st March 2016 (One Full Year) was known clearly, ‘Factual Basis for Telangana State Budget Calculation’ was arrived.


A near total understanding and deep study, department wise, scheme wise and priorities wise was done for third year Budget. The Conceptual comprehensive framework was that, not even a single budgeted rupee should go waste. In fact, it never happened!! Budget of fourth year was ‘Inspirational and Message Oriented’ aimed at welfare to all sections of people. As desired by Union Government, it was broadly classified as ‘Revenue and Capital’ expenditures instead of ‘Plan and Non Plan.’


The genuine efforts of KCR attracted instant attention from Fiscal Experts and Institutions. Chairman 14th Finance Commission Dr YV Reddy in September 2014, placed on record his deep appreciation about the competence, integrity, and commitment of CM KCR, and his team of officers from Finance Department. ICRA, an Indian independent and Professional Credit Rating Agency, awarded 'A' category status to Telangana as early as in October 2015. In November 2017 Telangana State was ranked ‘Number One’ in the ‘India Today’s State of the State’s Rankings’ that showcased the buoyant economy of the state, based on the average annual growth of GSDP. Earlier, ASSOCHAM an Apex Industry Body lauded Telangana for attracting investments with highest growth rate in a short period. These are just sample of many appreciations.

2018-2019 Budget chronicled financial stability and progress of state despite GST and demonetization. 2019-20 Vote-on-Account Budget was explicitly in the direction of fulfilling poll promises and full-fledged budget later, was in the context of severe economic slowdown. Following ‘Carona Pandemic Effect’ economic slowdown there was decrease in Revenue Receipts and increase in Revenue Expenditure. 2021-22 Budget was the largest one since formation of state. By the time 2022-23 and 2023-24 budgets were prepared, State’s wealth increased in a significant way due to fiscal prudence. Telangana became ‘Role Model for Entire Country,’ and followed by rest of the states. White Paper should have acknowledged these realities. White Paper’s observation that, ‘Quality of Telangana Budget Making Exercise’ was poor is incorrect.

KCR always used to say that ‘Funds Raised or Managed for Leveraging Economy’ shall not be construed as ‘Loans and Debts.’ Announcing in Assembly once that, Telangana Loans are the lowest compared to other states, KCR said that, to transform State as ‘Golden Telangana’ required loans only were taken and not beyond. KCR further said that, borrowings were within the limits of ‘Fiscal Responsibility and Budget Management (FRBM)’ and Centre’s guidelines, strictly adhering to ‘Fiscal Prudence Norm.’ BRS Government, as per the data available, never defaulted on repayment to banks and financial institutions not even by a day.

Meanwhile, the ‘Sweda Patram’ (Sweat Document) released by BRS Working President, KT Rama Rao on December 24, refuting the ‘White Paper’ and attempting to set the record straight, said that, FRBM Debts are only Rs 3,89,673 crores, including Rs 72,658 crores old loans and therefore, Net Loans are only Rs 3,17,015 crores but not Rs 6,71,757 crores as claimed in White Paper. KTR said, that creation of ‘Assets and Wealth in Telangana’ is Ten Times more than Expenditure of Rs 13,72,930 crores in ten years.

KTR further mentioned that, the so-called debt is ‘Neither Loan nor Expenditure,’ but an ‘Investment’ resulting in the ‘Creation of Wealth’ worth Rs 50 Lakh Crore. Therefore, ‘Let Telangana Remain as Guiding Light for the Nation.’

Thursday, December 28, 2023

ఆదర్శ పాఠాలతో ముందుకు! (అభివృద్ది, సంక్షేమానికి అతీతంగా ఒక ఉత్తమ జీవనం) : వనం జ్వాలా నరసింహారావు

 ఆదర్శ పాఠాలతో ముందుకు!

(అభివృద్ది, సంక్షేమానికి అతీతంగా ఒక ఉత్తమ జీవనం)

వనం జ్వాలా నరసింహారావు

ఆంధ్రప్రభ దినపత్రిక (29-12-2023)

ప్రజాస్వామ్య ప్రభుత్వాల ఉద్దేశ్యాలు, లక్ష్యాలు ఎంత ఉదాత్తమైనవైనా, వాటి రూపకల్పనలో, అమలులోవేసే ప్రతీ అడుగు, చిత్తశుద్దితో కూడినవి మాత్రమే కాకుండా, సార్వజనీన, విస్తృత ప్రజా భాగస్వామ్యం కలవైనప్పుడే అసలు, సిసలైన అంతిమ ఫలితం లభిస్తుంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సారధ్యంలో రాష్ట్రంలో ఒక మార్పు మొదలయిందనడానికి సంకేతంగా, ఆయన స్వయంగా నామకరణం చేసిన ‘మహాత్మా జ్యోతిభా ఫూలే ప్రజాభవన్’ లో ‘ప్రజావాణి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ప్రజల సమస్యలను ఒక ముఖ్యమంత్రి నేరుగా, వ్యక్తిగతంగా విని పరిష్కరించే ఆదర్శ కార్యక్రమమిది. ప్రజలను కలవని, వారి సమస్యలు వినని కొందరు పాలకుల వైఖరిన తప్పని ఆచరణాత్మకంగా ఎంచి చూపడానికి, అలాంటివారికి భిన్నంగా తమ పాలన ఉంటుందని తెలియచేయడానికి, ‘ప్రజావాణి’ లాంటి కార్యక్రమం ప్రతీకాత్మకమైనదని, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఒక మార్గదర్శిగా, ఆదర్శంగా నిలుస్తుందని చెప్పుకోవాలి. ఆశించినంత, ప్రచారం జరిగినంత మేరకు కార్యశుద్ధితో ‘ప్రజావాణి’ వేదిక కొనసాగి, అమలయితే, ఇది ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి సులువైన మార్గంగా దోహదపడుతుందని ఖచ్చితంగా చెప్పవచ్చు.

వివిధ కారణాలవల్ల, ప్రభుత్వాలన్నా, ప్రభుత్వ పరిపాలనన్నా సమాజంలో, ప్రజల్లో ఒక అవ్యక్త వ్యతిరేకతా భావన ఏర్పడి, పెరిగిపోతున్నది. ప్రభుత్వ సేవల్లో ఉదాసీనత, నిర్లక్ష్యం, జాప్యం, నిజాయితీలేమి, పారదర్శకతలేమి, పక్షపాతం ప్రబలిపోతున్నవనే అభిప్రాయం జనంలో నాటుకుపోయింది. పౌరుడంటే కేవలం ప్రభుత్వ పథకాల లబ్దిదారుడే అనే భావన పోయి, పౌరుడే కేంద్రంగా పాలన జరగాల్సిన పరిస్థితులు ఏర్పడాలి. అసలు ప్రభుత్వ పాలనంటే ఏమిటి? సేవల్లో ఏమి ఉండాలి? అనే విషయంలో ప్రభుత్వాలకు మరింత స్పష్టత రావాల్సిన అవసరమున్నది. ‘ప్రభుత్వ పాలన అంటే కేవలం అభివృద్ధి, సంక్షేమం మాత్రమే’ అనే భావన సర్వత్రా నెలకొని ఉంది. అదే నిజమైతే, అభివృద్ధి, సంక్షేమం గణనీయంగా, పౌరులకు మిక్కిలి సంతృప్తికర స్థాయిలో అమలు చేసిన ప్రభుత్వాలు ఎన్నికల్లో ప్రజల తిరస్కరణకు ఎందుకు గురికావాలి? అంటే, ప్రభుత్వ పాలనలో ప్రజలు ‘అభివృద్ధి, సంక్షేమానికి అతీతంగా ఒక ఉత్తమ జీవనం’ ఆశిస్తున్నారని అర్థం చేసుకోవాలి.

పాలకులు తమకు తోచింది, తమ మనసుకు తట్టింది చేసుకుపోవడం కాకుండా, ప్రజలు ఆశిస్తున్నదేమిటో గ్రహించి, అదే చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వమంటే ‘రాజ్యాన్ని పాలించడం, పౌరుల్ని నియంత్రించడం’ అనే మాంధాతల కాలంనాటి విధానం ఇప్పుడు కుదరదు. ప్రస్తుతం, ప్రభుత్వమంటే కేవలం ‘ఒక వ్యవస్థాగత నిర్మాణం’ కాగా, ‘ప్రభుత్వపాలనంటే పౌరులను సంపూర్ణంగా పరిగణలోకి తీసుకుని చేపట్టే సమిష్ట చర్యల సమహారం.’ పిల్లల జీవితాల్లోకి హద్దుమీరి చొరబడే తల్లిదండ్రుల మాదిరిగా ప్రభుత్వం, ప్రభుత్వ పాలన ఉండకూడదు. ‘బొమ్మరిల్లు’ సినిమాలో లాగా తమ జీవనగమనంలో విపరీతజోక్యం, మితిమీరిన శ్రద్ధ ప్రదర్శిస్తే, పిల్లలకు తల్లిదండ్రుల మీద వెగటు పుట్టే అవకాశాలే ఎక్కువ వున్నట్లే, పౌరులకు కూడా!!!

పరిమిత అజమాయిషీయే అత్యుత్తమ పాలన’ అని అమెరికన్ తత్వవేత్త డేవిడ్ థరూ అన్న మాటలు అక్షరసత్యమని రాజనీతి, ప్రభుత్వ పాలన అభ్యసించిన విద్యార్థిగా ఏకీభవిస్తాను. ప్రఖ్యాత తత్వవేత్తలైన థామస్ జఫర్సన్, జాన్ లాక్ కూడా దీన్ని అంగీకరించారు. లైబ్రేరియన్ గా వృత్తిగత జీవితం ప్రారంభించి ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో 53 సంవత్సరాలు క్రియాశీలకంగా పనిచేసి, తెలంగాణ మొదటి ముఖ్యమంత్రికి ప్రధాన ప్రజా సంబంధాల అధికారి స్థాయి వరకు వెళ్లగలిగాను. 15 ఏళ్ల పాటు మాజీ గవర్నర్ కుముద్ బెన్ జోషితోనూ, అసామాన్యమైన వ్యక్తులు, అసాధారణ మేధావులు, ప్రభావశీలురైన ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు డాక్టర్ మర్రి చెన్నారెడ్డి, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుల దగ్గర పనిచేసే వీలు కలిగింది. ఉన్నతహోదా సివిల్ సర్వీస్ అధికారులతో సన్నిహితంగా మెలగడం వల్ల విధాన నిర్ణయ ప్రక్రియను స్వయంగా చూసేందుకు, పరోక్షంగా పాల్గునేందుకు కూడా అవకాశం లభించింది.

ఎంసిఆర్ హెచ్ఆర్డి సంస్థలో తొమ్మిదేళ్ళు శిక్షణ కార్యక్రమాలు పర్యవేక్షించే రోజుల్లో శిక్షణలో ఉన్న ఐఎఎస్ అధికారులతోనూ, ఒకసారైతే ఏకంగా ఎపి కేబినెట్ మొత్తంతోనూ కలిసి ప్రభుత్వ పాలన గురించిన లోతుపాతులను సంయుక్తంగా అభ్యసించే వీలు కలిగింది. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన సూచనల మేరకు, సీనియర్ సహోద్యుగులు ఆర్ సీతారాంరావు, ఎంపి సేథీలతో కలిసి సీనియర్ ఐఎఎస్ అధికారులు, శాఖాధిపతులతో నిర్వహించిన ‘గవర్నింగ్ ఫర్ రిజల్ట్స్’, ‘ఓరియంటేషన్ టు మేనేజ్మెంట్ ఆఫ్ ట్రైనింగ్’ శిక్షణా కార్యక్రమాలతో పాటు; సిటిజన్స్ చార్టర్, పబ్లిక్ గ్రీవెన్సెస్ రీడ్రెస్సల్, పబ్లిక్ ఫెసిలిటేషన్ సెంటర్స్, సమాచారహక్కు, రిఫార్మ్స్ ఇన్షియేటివ్స్ లాంటి కార్యక్రమాలు, ప్రభుత్వం, పాలన, అభివృద్ధి, సంక్షేమంపై విషయ పరిజ్ఞానాన్ని పెంచుకునేందుకు ఉపయోగపడ్డాయి. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో 108 అత్యవసర వైద్య సహాయ సేవలు విస్తృత పరిచి అమలు చేసే విషయమై పదికి పైగా రాష్ట్రాలకు చెందిన ఆరోగ్య-వైద్య శాఖ మంత్రులు, అధికారులు, కొందరు ముఖ్యమంత్రులతో సంప్రదింపులు జరిపే సందర్భంలో, ప్రభుత్వ పాలన గురించి, భిన్నమైన పాలనా పద్ధతుల గురించి మరింత అవగాహన కలిగింది.

ప్రభుత్వపరంగా లభించాల్సిన సేవల్లో మితిమీరిన జాప్యం కొనసాగుతున్నప్పటికీ, ప్రభుత్వాలు మితిమీరిన శ్రద్ధకు పోయి, అహరహం పథకాల మీద పథకాలు ప్రకటిస్తూ పోతున్నాయి. అసలు ఆ పథకాలు పౌరులకు ఏమేరకు అవసరం? తమకు కావాలా? వద్దా? అనే ప్రజాభిప్రాయాన్ని ససేమిరా పట్టించుకోకుండా అమలుకు పూనుకుంటున్నాయి. స్థూల రాష్ట్ర జాతీయోత్పత్తి, తసలరి ఆదాయం, తలసరి వినిమయ శక్తి లాంటి ఆర్థికపర అంశాల్లో సాధించిన గణనీయమైన వృద్ధి వల్ల పేదరికం తగ్గిందనే సూచనలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నప్పటికీ, వాటిని ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుడా ప్రత్యక్ష నగదు బదిలీ పథకాలను (DBT) అమలు చేస్తున్నారు. పురోగతిని, సంక్షేమాన్ని స్వాగతించాల్సిందే. కానీ, అవాంఛనీయ పరిణామాల మీద దృష్టి పెట్టకుండా జరుగుతున్న అనియత అభివృద్ధి నమూనా గురించి నిర్భయంగా చర్చ జరగాల్సిందే. ఉదాహరణకు, భారీ నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణం అవసరమే అయినప్పటికీ, వాటిద్వారా బహుళ పంటల సాగుకు స్వస్తి పలికి, కేవలం పెద్దమొత్తంలో వరి సాగుకే పరిమితం కావడం వాంఛనీయమేనా ఆలోచించాలి.

ఒకప్పుడు రాజ్యాలు, సామ్రజ్యాలుండేవి. రాచరికాలు, నియంతృత్వాలు చలామణిలో ఉండేవి. భూస్వామ్య, పెట్టుబడిదారీ వ్యవస్థలుండేవి. క్రమేపీ, విశ్వవ్యాప్తంగా ప్రజాస్వామ్య, సంక్షేమ ప్రభుత్వాలు ఏర్పడసాగాయి. భారతదేశంలాగా సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య ప్రభుత్వాలు వచ్చాయి. ఇంకా వస్తున్నాయి. ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల ద్వారా ఎన్నుకోబడే ప్రజా ప్రభుత్వమే ప్రజాస్వామ్యమనే అబ్రహంలింకన్ సిద్ధాంతం సర్వత్రా అంగీకారమైనప్పటికీ, అది కాగితాలకే పరిమితమైంది. పాలన సుపరిపాలనగా, గొప్ప పాలనగా, వైవిధ్యమైన పాలనగా పరిణితి చెంది భిన్నకోణాల్లో జరగాలి. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు జనాకర్షకంగా కాకుండా, ప్రజోపయోగంగా ఉండేలా ప్రాధాన్యతా క్రమం నిర్ణయించబడాలి.

నిత్యం మార్పు చెందే ఆర్థిక స్థితిగతులు, సామాజిక, రాజకీయ అవగాహన, అవకాశాల విస్తృతి, స్వయం సమృద్ది పట్ల శ్రద్ధ తదితర అంశాల్లో పరిస్థితిని, ప్రజల దృష్టికోణాన్ని పట్టించుకోకుండానే విధాన నిర్ణయాలు జరిగిపోతున్నాయి. ఏకపక్ష, నిర్హేతుక నిర్ణయాలకు బదులుగా ప్రజలకు ‘ఎక్కవ, తక్కువ కాకుండా ఖచ్చితమైన అవసరాలను’ తీర్చే విధంగా ప్రభుత్వ పాలన ఉండాలి. నిరంతరం మారుతున్న పరిస్థితులు, ఎదురవుతున్న సవాళ్లకు అనుగుణంగా ప్రభుత్వాల ఆలోచనా సరళిలో మౌలికమైన మార్పులు వచ్చి తీరాలి. విధాన నిర్ణయ ప్రక్రియలో విస్తృత ప్రజా భాగస్వామ్యం కల్పించి, ప్రభుత్వ పాలన పట్ల ప్రజల విశ్వాసాన్ని, నమ్మకాన్ని చూరగొనాలి. దురదృష్టవశాత్తు, అలాంటి వాస్తవిక దృక్పథం ఏ కోశానా కనిపించడం లేదు. విధానాలు రూపొందించడం, అమలు చేయడం, ఉదారంగా, అత్యంత లాభసాటిగా కనిపించినప్పటికీ ప్రజల భాగస్వామ్యం లేకపోతే అవి చివరికి అసంబద్ధంగానో, తాత్కాలిక విజయానికి ప్రయోజనకారిగానో మాత్రమే మిగులుతాయి. తమ ప్రభుత్వ యంత్రాంగం యొక్క జవాబుదారీతనం, సమర్థత, నైతిక నిబద్ధత మీద ప్రజలకు అనుమానాలు పెరగకుండా నిత్యం జాగరూకత పడాల్సిన అవసరం ఉంది.

అధికారంలోకి ఎలాగైనాసరే రావాలి, వచ్చిన అధికారంలో ఏవిధంగానైనా కొనసాగాలి అనే నిర్హేతుకమైన రాజకీయ తహతహ విలువలతో కూడిన పాలన సాగించడానికి ప్రతిబంధకమయ్యే ప్రమాదం వుంది. పాలకులతో పాటు అధికారుల నుంచి కూడా నిబద్ధతతను ఆశించడం కష్టమవుతుంది. కాబట్టి సాధారణ పాలన నుంచి సులభమైన, సౌకర్యవంతమైన పాలన అందించే దిశగా సమూల మార్పు అవసరం. ప్రభుత్వ పాలన ప్రజలను నియంత్రించేదిగా కాకుండా ప్రజల అవసరాలు తీర్చే సాధనంగా ఉండాలి. ప్రజలతో మమేకం కావాలనే సంకల్పం, సేవా తత్పరత, ప్రజల పట్ల బాధ్యత, జవాబుదారీతనం పెరిగితేనే ఇధి సాధ్యం. ఇలాంటి మార్పు కేంద్రంలో ప్రధానమంత్రి, రాష్ర్టాల్లో ముఖ్యమంత్రుల నుంచే ఆరంభం కావాలి.

‘చేసింది ఇక చాలులే అని మందగించే పాలన నుంచి, చురుగ్గా అప్రమత్తంగా ఉండే పాలన’ దిశగా; ‘ఉగ్యోగస్వామ్యం నుంచి నిజాయితీ’ వైపు; ‘కదలిక లేని సంస్కృతి నుంచి చొరవ చూపే శక్తి’ దిశగా; ‘ప్రజలను ఈసడించుకునే వైఖరి నుంచి వారిని ఆదరించే వైఖరి’ దాకా; ‘అన్నీ మాకే బాగా తెలుసు అనే అహంకారం నుంచి అందరితో కలిసి తెలుసుకుందాం’ అనే అణుకువ దాకా; ‘ప్రభుత్వం అంటే భయం, అపనమ్మకం పొగొట్టి నాయకత్వం పట్ల విశ్వాసం, నమ్మకం కలిగించే’ దాకా; ‘ప్రభుత్వంలోని పెద్దలే అంతా నియంత్రించే పద్ధతి నుంచి సమిష్టి కృషితో విధానాలు’ తీసుకునే దాకా; ‘అధికార కేంద్రీకరణ నుంచి సమన్వయంతో సమిష్టిగా పనిచేసే సంస్కృతి’ వరకు; ‘పౌరులను అక్కున చేర్చుకోలేని దుర్దశ నుంచి ప్రజలతో స్నేహంగా మెలిగే వాతావరణం’ వచ్చే వరకు; ‘కేవలం స్థానిక ప్రమాణాలే పాటించే స్థితి నుంచి స్థానిక, అంతర్జాతీయ ప్రమాణాలను’ పాటించే దాకా; ‘సంప్రదాయ, జడ పదార్ధంగా కాకుండా సృజనాత్మక, వినూత్న పంథాలు’ అవలంభిచేదిగా ప్రభుత్వ వ్యవస్థలో సమూల మార్పు రావల్సిన తక్షణ అవసరం అవశ్యం.

సమర్థత, విశాల దృక్పథం, స్పందించే గుణం, జవాబుదారీతనం, స్వచ్ఛమైన ఆలోచనా విధానం, చైతన్యం, సర్దుబాటుతనం కలిగిన ప్రభుత్వాలనే ఇప్పుడు పౌరులు కోరుకుంటున్నారు. 25 ఏళ్ల క్రితమే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా, ప్రస్తుతం రద్దు కావడమో లేదా నామమాత్రంగా అమల్లో వుండడమోగా మిగిలిన సిటిజన్ చార్టర్లను (పౌర సేవాపత్రాలు) విజయవంతంగా అమలుచేసిన నేపథ్యముంది. వీటినిప్పుడు తక్షణమే పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ పాలనలో సేవాతత్పరత పెరిగేలా ప్రమాణాలు నిర్ధేశించబడినప్పుడే ఆ ప్రభుత్వం తమకోసమే పనిచేస్తుందని ప్రజలు నమ్ముతారు. ఏమీ చేయకుండా ప్రభుత్వ ఉచిత సహాయం పొందే లబ్దిదారుడనే భావన ప్రజల్లో తొలగిపోతుంది. అభివృద్ధి, సంక్షేమానికి అతీతంగా ఒక ఉత్తమమైన జీవనాన్ని కోరుకునే పౌరులు ఆశించేది: మాకు కాస్త కనీస మర్యాద, గౌరవం ఇవ్వండి. సేవలందుకునే వెసులుబాటును సులభతరం చేయండి. అవసరమైన సహాయాన్ని సకాలంలో అందచేయండి. ఏదైనా చెప్పుకునే అవకాశం ఇవ్వండి. ఏంకావాలో నిర్ణయించుకునే అవకాశం ఇవ్వండి’ అనే. ఉత్తమమైన జీవితం అంటే స్వీయ సంతృప్తి, స్వీయ వివేకం, స్వయం సమృద్ధి.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించిన ‘ప్రజావాణి’ కార్యక్రమం ఈ దిశగా ఒక మంచి అడుగు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఉభయ సభలనుద్దేశించి డిసెంబర్ 15న ప్రసంగిస్తూ, తమ ప్రభుత్వం ప్రజలకు స్వేచ్చ, స్వాతంత్ర్యం, సమానత్వం, సమాన అవకాశాలు కల్పిస్తుందని, అందుకోసం వేసిన మొదటి అడుగు ప్రజావాణి అని చక్కగా అభివర్ణించారు. భవిష్యత్తులో, దీన్ని ప్రతిరోజూ నిర్వహించి, ఒక్క రోజు ముఖ్యమంత్రితో సహా, ఒక్కో రోజు ఒకటి-రెండు శాఖల అంశాలను చేపట్టి, సంబంధిత మంత్రులు పిర్యాదులు స్వీకరిస్తే మంచిదేమో! అలాగే, సిఎం రేవంత్ రెడ్డి ఇటీవలే ఎంసిఆర్ హెచ్ఆర్డి సంస్థను సందర్శించి, ప్రజా సేవకులకు శిక్షణ ఇచ్చే కార్యక్రమం విషయంలో ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. ప్రజాసేవలో ఉండే అధికారులకు, అనధికారులకు శిక్షణావకాశాలు కలిగిస్తే,  ‘ప్రజలతో మమేకం కావాలనే సంకల్పం, సేవా తత్పరత, ప్రజల పట్ల బాధ్యత, జవాబుదారీతనానికి సంబంధించి ‘విషయ పరిజ్ఞానం, పనితనం, వైఖరిలో మార్పుకు’ దోహదపడే వీలు కలుగుతుంది. గత ప్రభుత్వ జయాపజయాల ఆదర్శ పాఠాలే వర్తమాన ప్రభుత్వ కార్యాచరణకు మార్గదర్శి కావాలి. (నా ఆంగ్ల వ్యాసానికి తెలుగు అనువాదంలో తోడ్పడ్డ నా పూర్వ సహోద్యోగి గటిక విజయ్ కుమార్ కు ధన్యవాదాలతో)

Sunday, December 24, 2023

ప్రాచీన సంస్కృతి, మహోన్నత నాగరికత, విలక్షణ సాంప్రదాయాల భారతజాతి ..... ఋగ్యజుస్సామాథర్వ వేదాల సారం-4 : వనం జ్వాలా నరసింహారావు

 ప్రాచీన సంస్కృతి, మహోన్నత నాగరికత, విలక్షణ సాంప్రదాయాల భారతజాతి

ఋగ్యజుస్సామాథర్వ వేదాల సారం-4

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (25-12-2023)

భారత జాతికి ప్రాచీన సంస్కృతి, మహోన్నత నాగరికత, విలక్షణ సాంప్రదాయం, కాలానికి అందని చరిత్ర, అపార సాహిత్యం, అనంత కళలు వున్నాయి. అందువల్ల భారత జాతి హిమదున్నతమై గర్వించాలి. భారత దేశాన్ని పాలించిన ఆంగ్లేయ ప్రభువులు (ఆంగ్లేయ ప్రజలు కాదు) భారత సంప్రదాయ సంస్కృతులకు ఎనలేని ద్రోహం చేసినారు. ఉదాహరణకు అనంత చరిత్రగల మన భారతజాతిని చరిత్రహీనులైన ఆంగ్లేయులు మనకు నీటిని గురించి, నీటి వాడకము గురించి తెలియదని హాస్యాస్పదంగా అన్నారు. దానికి స్పందనగా, అవును మహాప్రభూ, తెలియదు. మీరు ఆదేశించండి మేము ఆచరిస్తామని అన్నామే కాని, కాలం యొక్క సుదీర్ఘ హస్తాలకు వేదాలందే నీటిని గురించి వివరించబడి వున్నదని మనం అనలేదు. జీవనానికి నీరే ఆధారం అన్న ఋగ్వేదం “ఆపత్సు సర్వేభేషజేః” అన్నది. నీటిలోనే సర్వ వైద్యాలున్నవి అని దీనర్థం. మన ఆరోగ్యం నీటివాడకం మీద ఆధారపడి ఉన్నదన్న పాశ్చాత్య వైద్య విధానం దీనిని కొత్తగా కనుగొన్నదా? అంటే, మన మాటలే మనకు చెప్పి మనల్ని వంచించడం కాదా! మనం వంచకులకు స్వచ్చందంగా బానిసలం అయినామనడం నిత్యసత్యంకాదా!’

‘వేదం మానవ జీవితామృతం. వేదమే నరపశువును మానవుడిగా మార్చినది. అతనికి బందాలు, అను బందాలు, సంబందాలు నేర్పినది. వేదంలో “దంతావ్ ధావయేత్ ప్రాతః పలాశవట పిప్పలైః” అని ఉంది. దీనర్థం: ఉదయమే దంత ధావము చేయవలెనని. దానికొరకు మోదుగు, మర్రి, రావిని వాడవలెనని అని దాని అర్థం. వేదమే మానవుడికి సకలం నేర్పినదని దీని భావం. ఇది వాస్తవం. వేదాన్ని సంహితం చేసే సమయంలో స్థిరపడిన ఆచార సంబంధ మంత్రాలను తొలగించి ఉండవచ్చు. మానవ జీవితానికి సంఘం తప్పనిసరి.

‘మానవ సంబంధాలు అన్నిటికీ ప్రధానమైనవి. మానవ సంబంధాలలో లైంగిక సంబంధం ప్రధాన పాత్ర వహిస్తుంది. ఈ సంబంధం వల్లే సంతానం, కుటుంబం, రక్తసంబందాలు ఏర్పడుతున్నాయి. సమాజపు సౌదానికి కుటుంబం పునాది లాంటిది. కుటుంబం ఎంత పటిష్టమైతే సమాజం అంతే బలవత్తరమవుతుంది. కుటుంబానికి మూలం స్త్రీ, పురుషుల లైంగిక సంబంధం. ఇదే ప్రేమలకు, అభిమానాలకు, అనుబంధాలకు కారణమైతున్నది. మానవ జీవితం ఈ అనుబంధాలతోనే మధురమై వుంటుంది.’

‘నేటి మన మానవ సంబందాలు అనాదిగా జరుగుతున్ననిరంతర సాంఘిక, అధ్యయన, ఆచరణ ఫలితాలు. ఇంతటి మహాత్తరమైన మానవ చరిత్రలో మానవ లైంగిక సంబంధాలు నియంత్రించడంలో మేధావులు చాలా వరకు కృతకృత్యులైనారని అనాలి. ఎంతటి రాక్షసుడైనా తల్లిని, చెల్లెను, అక్కను ఆశించడు. ఇది రాజకీయ బలప్రయోగం అవసరంలేని స్వచ్చంద చెలియలికట్ట! మానవ పరిశ్రమ ఈ చెలియలికట్టను, ఆర్ధిక, రాజకీయ రంగాలలో నిర్మించలేకపోయింది! అదే సాధ్యమైతే మానవజాతి ఒక నిర్మల మానవతా సామ్రాజ్యాన్ని నిర్మించుకోవచ్చు. ఇప్పటికి అది మృగ తృష్ణయే అనాలి!’.

‘స్త్రీ పురుష లైంగిక సంబంధాలు సంతానానికి కారణమవుతున్నాయి. సంతానమే సమాజపు కొనసాగింపు. శారీరక, మానసిక, ఆరోగ్య సంతానమే సమాజానికి ఆధారం. అందువల్లనే స్త్రీ, పురుష సంబంధాలను కఠినంగా నియంత్రించాల్సి ఉన్నది. ఒకే రక్తానికి కలిగిన సంతానానికి బుద్ధికుశలత లోపించుననే విషయం నిర్దిష్టమైనప్పుడు ఏక గర్భజాతుల లైంగిక సంబంధం నిషేధించ బడినది’.

‘ఆత్మజ్ఞానాన్ని కేవలం భారతీయులు మాత్రమే సాధించినారు. పాశ్చాత్యులు దీనిని అర్థం చేసుకోవడానికి, తెలుసుకోవడానికి, పూర్తిగా అవగాహన చేసుకోవడానికి యుగాలు పడుతుంది. ఎందుకంటే, వారికి ఈ విషయంలో ఇంకా కనీసం అక్షరాభ్యాసం కూడా కాలేదు. ఆత్మకు దేహం వస్త్రం లాంటిది. మనిషి పాతబట్టలను వదిలేస్తాడు. కొత్తవాటిని ధరిస్తాడు. ఆత్మకూడా అంతే. పాత శరీరాన్ని విడిచేస్తుంది. కొత్తదానిని ధరిస్తుంది. ఇది ఉహాజనితం కాదు. జీవితాన్ని కాచి వడబోసి కనుగొన్న నిత్య సత్యాలు! ప్రకృతికి పరిణామమే కాని నాశనం లేనే లేదు. గింజ చెట్టుగా మారుతుంది. చెట్టు కర్రగా మారుతుంది. కర్రకు నిప్పంటుకుని బూడిద అవుతుంది. బూడిద మట్టిగా పరిణమిస్తుంది. ప్రకృతి సాంతం ఇంతే! ఇది ప్రకృతి ధర్మం! ఈ ప్రకృతి ధర్మాన్ని అనుసరించే ఆత్మ పరిణామం. అది నశించదు’.

‘జీవితానికి మృత్యువు కేవలం మార్పు మాత్రమే. అంతం కాదు. భౌతికంగా ఆలోచించినా మనిషి చనిపోయిన విధంగా అతడి ఆస్తిపాస్తులు చావడంలేదు. మరణించినవారి మరణశాసనాన్ని అమలుపరచాల్సిన అవసరం ఉన్నది. వారి సంతానం, వారసులు వారి అభీష్టాలను తీర్చవలసి ఉన్నది! శాసనపరంగా మరణించిన వారికే హక్కులు ఎక్కువ!! కొడుకు తండ్రి రూపంలో పుట్టుతున్నాడు. తలితండ్రులనుంచి వారి సంతానం వట్టి జీవితాన్నే అందుకొనదు. వారి కోపం, గుణగణాలు, బుద్ధి, ఆరోగ్యం, అనారోగ్యం అన్నింటిని అందుకుంటున్నారు. ఇవన్నీ ఏడు తరాలలనుండి సంక్రమిస్తాయని శాస్త్రం చెప్తున్నది. అన్నింటివలెనె ఆస్తి కూడా సంతానానికి చెందుతున్నది. తలిదండ్రులు విగత జీవులైనప్పుడు సంతానంవారి విషయంలో కృతజ్ఞత, ప్రేమాభిమానాలు ప్రదర్శించాల్సి ఉన్నది. అందుకు సంబంధించినవే శ్రాద్ధాది కర్మలు.

‘మనిషి ఎంతో విచిత్రమైనవాడు. తన అంతరంగాన్ని మార్చలేడు. బహిరంగాన్ని బ్రహ్మాండంగా మార్చగలడు!! మనిషి గ్రహాంతరాల మీద అడుగులు వేస్తున్నాడు! సంతోషమేకాని తన ఈర్ష్యాద్వేషాలను, అభిమాన దురభిమానాలను సంస్కరించుకొనలేక పోతున్నాడు. వదలుకోవడం అసాధ్యం. అసంభవం. సంస్కారమే జరుగలేదా అని దిగమ్రింగుతున్నాడు. బయట పడలేక పోతున్నాడు. ఇది వదలడం కాదు. మరింత వేగంచేయడం! వేదం మనిషిని అధ్యయనం చేసింది. మనిషి స్వభావాన్ని చదివింది. మనిషి మనసును చూసింది. మానవ స్వభావపు నిత్యసత్యాలను చాటింది! నాటి నుంచి నేటివరకు ఏనాటికైనా మారేది మనిషి స్వభావం కాదు, వేషం మాత్రమే! పయనానికి నాడు రథం వాడితే, నేడు విమానాన్ని ఉపయోగిస్తున్నాం. చక్ర భ్రమణం మూలసూత్రంలో మార్పు లేదు. మార్పు ఆకారంలో మాత్రమే! ఈ సూత్రం అన్వయించుకుంటే అన్నిటికి చెల్లుతుంది.

         ‘వ్యసనాన్ని మనిషి ఏర్పరుచుకున్నాడు. భగవద్దత్తం కాదు. భగవంతుడు ప్రసాదించినవన్నీ మానవుడి శ్రేయస్సునకే అవుతాయి. మానవుడు ఒక విచిత్రప్రాణి. తనను తాను ధ్వంసం చేసుకోవడంలో నిపుణుడు! ఈ నైపుణ్యం ఇతర ప్రాణులకు లేదు!! మనిషి ఇతరులను సహితం ధ్వంసం చేయగల దిట్ట!!! జూదాన్ని ఒక వ్యసనంగా మనిషి ఏర్పరుచుకున్నాడు. ఎంతో నాగరికులమని చెప్పుకునే జాతులు సహితం నేటికీ ఈ వ్యసనం నుండి బయట పడలేకున్నాయి! సత్యమేమిటంటే ఈ నాగరికత మనిషికి మత్తునిచ్చి జూదపు సంకెళ్ళలో బంధించింది! నేటి నాగరికత ప్రధాన లక్షణమేమిటంటే ఇది బంధాలను తెలియనీయదు!! కట్లలో కృంగేవాడు సహితం తానూ స్వతంత్రుడిని అని అనుకొనునుకుంటాడు!!!’.

         ‘వేదసూక్తం జూదాన్ని గురించి సుందరంగా వివరించింది. బహుశా ఇంత కొద్దిలో వేదాన్ని గురించిన ఇంత వివరణ సాహిత్యంలో కనిపించలేదు. ఇంత వివరించినప్పటికీ ధర్మరాజు, నలుడు జూదమాడేకదా నలిగినారు! మనిషి వేదం చెప్పింది వినకపోతే చెడిపోతున్నాడు!! అందుకు వీరి వృత్తాంతమే సరైన నిదర్శనం. ఒక వ్యసనాన్ని కలిగించుట, నేర్చుకునుట సులభం. మాన్పించుట, మానడం దాదాపు అసాధ్యం. వ్యసనం వ్యక్తి అధిగమించాల్సి ఉన్నది! అందుకే వేదం వ్యసనపరులనే సంబోధించింది. “అక్షౌర్మాదీవ్యః కృషిమిత్కృష, అంటే, జూదమాడవద్దు, కృషి చేయాలి, కృషి చేయాలి అని! కుటుంబాన్ని గురించి వేదానికి ఎంత ఆవేదన! కుటుంబమే కదా లోకానికి మూలం!’.

         ‘ప్రకృతి విచిత్రాతి విచిత్రం, నిగూఢాతి నిగూఢం. విశాలాతి విశాలం. ఇంకేమని అనగలం? ఇంతే. అయితే, ప్రకృతి ఇంతేనా? కాదు. భాష ఇంతే! భాష పరిమితం. ప్రకృతి అపరిమితం. అపరిమితమైనదాన్ని పరిమితమైనదానితో చెప్పకూడదు. అందుకే ఆకాశం ఆకాశం లాంటిదని, సముద్రానికి సముద్రమే ఉపమానమని అన్నారు వాల్మీకి మహర్షి. సృష్టి మొదలై ఇప్పటికి 195,58,85,170 పైగా సంవత్సరాలు. పాశ్చాత్యులు పేర్కొంటున్న చరిత్ర అనే పదానికి కనీసం వెయ్యేళ్లు కూడా లేవు. ఈ పరిజ్ఞానంతో అనంతమైన కాలాన్ని కొలవడానికి ప్రయత్నించడం కాళిదాసు అన్నట్లు “గమిష్యామ్యపహాస్యతామ్” మాత్రమే. నాగరికతలు ఎన్ని వచ్చినాయో, ఎన్ని భూస్థాపితాలైనావో రాతియుగం లాంటి కాలమానానికి అందనటువంటిది. ఇందులోని తాత్వికత ఏమిటంటే, ఏదీ  ఎప్పటికీ ఎదుతూనే వుం డదు. పెరుగుట, తరుగుట  ప్రకృతి నియమం. ఈ చిన్న విషయం తెలియని వాళ్లు చెప్పే చరిత్ర అనే దానిని అనంత చరిత్రగల భారతీయులం మనసా, వాచా, కర్మణా నమ్ముతున్నాం! ఇది పతనానినికి పరాకాష్ట కాదా!’.

         ‘ఈ అనంతమైన కాలక్రమంలో భూమిమీదనుండి అగ్ని అదృశ్యమైన కాలం ఉండవచ్చును. అగ్ని ఆకాశాన, భూమిమీద, జలాలో వున్నాడు. భూమిమీది అగ్ని అదృశ్యమైనప్పుడు జలాలోని అగ్నిని ఆవిష్కరించడానికి జరిగిన బృహత్ ప్రయత్నపు సంకేతమే వేదం. అది అలా సూక్త సంకేతంగా కనిపిస్తున్నది. అదృశ్యమైన అగ్నిని పునః ప్రతిష్టించడం సామాన్య విషయం కాదు. ఇది వేదకాలంలోనే జరిగి వుండాల్సిన అవసరం లేదు. అంతకు ముందు ఎన్నడో జరిగినదానిని వేదం ఉల్లేఖించి ఉండవచ్చును. రెండు వేల ఏండ్ల క్రితంనాటి బైబిలులో  సృష్టి ఆదిని గురించి చెప్పబడింది!

         ‘ప్రాణి దేనివలన జీవిస్తున్నది? ఏది పోవడంతోనే జీవితం చాలిస్తున్నది? ఆ ఉన్నదేది? ఈ పోయిందేది? ఇది ప్రశ్నే! దీనికి జవాబు లభించడం లేదు, దొరకడం లేదు! దొరకదు, లభించదు కూడా!! ఎందుకంటే ఇది సత్యం. ఇది ఋతం. దీనిని ఎవరూ చూడలేరు! ప్రాప్రాణం, ఆత్మ, ఉన్నంత కాలం జీవితం వుంటుంది. ఇవి లేనప్పుడు కళేబరమే మిగులుతుంది. ప్రాణం, ఆత్మ, నామ వాచకాలు మాత్రమే! వాటి స్వరూప స్వభావాలు తెలియవు! వేద సూక్తంలో మనసు ప్రాణమైంది. మనసే ప్రాణమని అప్పటి అవగాహన. మనసుకు, ప్రాణానికి రూపం లేదు. కాబట్టి పర్యాయమైన తప్పు కాదు. మనసే మనిషిని కదిలిస్తున్నది. మనసులేకుంటే ఏ అవయవం కూడా తన విధి నిర్వర్తించలేదు. మనసులేనప్పుడు కళ్లుచూసినా కంచలేడు. ఈ న్యాయం అవయవాలన్నిటికీ వర్తిస్తుంది. అందువల్లనే మనసున్న ప్రాణం అని అన్నారు పెద్దలు. ఈ మనసు మనిషిని వదిలి ఎక్కడికి వెళ్తుంది? అదే ప్రశ్న వేదం, సూక్తంలో ఉన్నది. అన్వేషణ ఎంతో అందంగా చెప్పడం జరిగింది. ఇదొక అంతంలేని అన్వేషణ!’.

‘అన్వేషణే జీవితం. చివరకు మనం ఆలోచించినవి, అనుకున్నవి లభించడం అరుదు. అలాంటప్పుడు సృష్టి మూలాన్ని గురించి చేసే ఆలోచనకు అంతమెక్కడిది? విశ్వాన్ని నిర్మించినవాడు, నిర్మించేవాడు విశ్వకర్మ. కర్మను బట్టే నామం. ఆ పదార్థమెలాంటిది? ఆ అన్వేషణలోనే పేర్లు. ఇవి మనం పెట్టినవే. అసలు ఆ పదార్థమెలాంటిది? ఇది ప్రశ్నే! వేదం, సూక్తములలో సృష్టిని గురించి తెలిసికొనే జిజ్ఞాస ఉన్నది. ఒక మహత్తరమైన ప్రశ్న ఉన్నది. లోకాలను సృష్టించిన వాడు దేనిమీద నిలిచినాడు? విద్వాంసులైనవారు ఈ విషయాన్ని అడగాల్సింది మనసునే. విశ్వాన్ని సృష్టించిన వాడు సృష్టికి పూర్వం ఎక్కడ నుండి సృష్టించాడన్నది మేధావులు ప్రశ్నించుకోవాలి! ఇది ఇంతవరకు ప్రశ్నగానే మిగిలి పోయింది! అసలు ఈ భూమి దేనిమీద నిలిచి ఉన్నది? ఇది కూడా ఈనాటివరకూ మనిషి మేధస్సుకందని, అంతుచిక్కని కోట్ల కోట్లాది రూకల ప్రశ్న. జవాబిచ్చే సామర్థ్యం ఎవరికైనా వున్నదా?’.

(డాక్టర్ దాశరథి రంగాచార్య వేద సంహితల ఆధారంగా)

 

 

Governor’s Speech Ignores Growth During KCR Regime : Vanam Jwala Narasimha Rao

 Governor’s Speech Ignores Growth During KCR Regime

(Inclusion of ‘A Little Growth’ of KCR Government

In Governor’s Address may well be ‘Value Addition’)

Vanam Jwala Narasimha Rao

The Hans India (24-12-2023)

(The Editor Hans India observed that: Had the contents been ‘Little More Graceful,’ acknowledging, ‘A Little Growth,’ in few areas of KCR Government, sitting now in opposition, it may well be a ‘Value Addition’ and ‘Statesmanlike Approach’ by the Government that prepared it as a prerogative. Grace was displayed by KCR on another occasion. Describing Modi Government’s ‘Ayushman’ as inferior to ‘Arogyasri,’ KCR in the Assembly credited ‘Arogyasri’ and ‘108 Ambulance Services’ to YS Rajashekhar Reddy and Congress Government. KCR also made it clear that, whatever good schemes were implemented by his previous Governments, his Government, without any false prestige, continue them. ‘Assignment of Lands’ policy of Congress Party initiated during Indira Gandhi’s time as part of 20-point Economic Program was welcomed by KCR. It is hoped that, in future, succeeding Governments could avoid contents that are absolutely false about preceding Governments and thus establish ‘New Healthy Convention’).    

Telangana Governor Dr Tamilisai Soundararajan’s Address to both Houses of Legislature on December 15, 2023, was a neatly prepared ‘Vision Document’ by the New Congress Party Government. Nonetheless, had the contents been ‘Little More Graceful,’ acknowledging, ‘A Little Growth,’ in few areas of KCR Government, sitting now in opposition, it may well be a ‘Value Addition’ and ‘Statesmanlike Approach’ by the Government that prepared it as a prerogative.

Customarily, Governor Addresses the First Session of Legislature each year, or a new Legislature after General Election, under Articles 175 and 176 of Constitution, without deviating from Cabinet approved speech. However, negligible deviations once in a while, cannot be construed as violation of Constitutional Law, though it may amount to ‘Little Aberration’ of a Convention. Governor’s Address as approved by Cabinet, shall contain a review of ‘Government’s Progress Card and Future Plans.’ Formally, the draft maybe forwarded to Governor, beforehand, seeking suggestions. The Law and convention is, Governor reads the final speech in toto.

Governor Dr Tamilisai Soundararajan in Her address, commended the Cabinet led by Chief Minister A Revanth Reddy and assured that the ‘Fruits of Change’ will reach the people in full measure. Governor described previous Government, as ‘Ten Years of Repression, Autocratic Rule, and Dictatorial Tendencies,’ whereas the new Government is ‘People’s Government, and People’s Governance.’ Governor thanked former Prime Minister, Dr Manmohan Singh, and UPA Chairperson Sonia Gandhi for creating Telangana State in 2014. Assurance of ‘Definite and Time-Bound Action Plan’ to implement guarantees promised in poll manifesto is highlight of Her Address.

In spite-12-2023) of the fact, that the document, ‘Telangana Economy,’ released by Government a day before, factually placing on record the ‘Exceptional Financial Growth’ in ten years (of KCR Government), the Governor’s Address mentioned that the, ‘Entire Financial Discipline’ in the state is destroyed, and there is ‘No Fiscal Discipline’ or ‘Financial Prudency.’

According to Telangana Economy, the Gross State Domestic Product (GSDP) which is a comprehensive scorecard of a ‘State’s Economic Health, Size of the Economy, and its Growth Rate,’ at current prices in 2022-23 is Rs 13,13,391 crore, with a growth of 16.3%. Per Capita Income (PCI) which is the metric for determining a ‘State’s Economic Output or Average Income for Each Person’ and ‘Measure of Standard of Living in a State,’ is Rs 3,12,398, and ranked 3rd in the country.

Reminiscing the past, on March 6, 2020, Governor Tamilisai Soundararajan in Her Maiden Address to the Joint Session of Telangana Legislature, showered praises on the then Chief Minister K Chandrashekhar Rao and even mentioned that, ‘The Greatest Advantage for Telangana State is that the person who led Separate Statehood Movement himself became the Chief Minister of the newly formed State and leading it from the front and getting marched towards the path of progress and development.’ Governor further mentioned that, ‘if we make a comparison of the situation that existed when the Telangana State was formed and now, the delightful achievements and success, in such a short span of time, is being observed with admiration by the entire country.’ Well, this is the normal way of Governor’s Address, irrespective of who is CM and whichever party is in power. Governor ‘Seldom has Any Other Option or say,’ except to read the Cabinet Approved Speech, irrespective of authenticity. This is Democracy and Politics!!!

Once speaking on Motion of Thanks to Governor’s Address, the then CM KCR categorically said that, the Governor had to read the prepared script of Government and cannot even change one word from the cabinet approved speech. Refuting criticism by (Congress) opposition parties that, the speech resembled like ‘TRS Manifesto,’ KCR said that, poll promises of the party in power necessarily reflect in Governor’s Address. The same way Chief Minister A Revanth Reddy responded, when a similar criticism was made by (BRS) opposition, that, Governor Tamilisai Soundararajan’s address resembled Congress Manifesto. Unhesitatingly CM brushed aside BRS criticism, and declared that ‘Yes, it is Our Manifesto.’

Politics are often Unpleasant in India. Taking one stand while in ‘Position’ and diametrically the other stand while in ‘Opposition’ is typical. Gracefully accepting suggestions from opposition is seldom done, with few exclusions. For instance, when Congress Leader K Jana Reddy pointed out that the Governor’s Address immediately after formation of Telangana, should have included ‘Thanks to Sonia Gandhi’ for her role in formation of Telangana, the then CM KCR positively responded. KCR Thanked Sonia Gandhi profusely, saying that, it was because of her initiative, the dream of Telangana people came true and placed it on record in the House.  KCR also thanked BJP, CPI, BSP and 33 parties, who supported the Telangana Bill, while replying on motion of thanks.

A Similar Grace was displayed by KCR on another occasion. Describing Modi Government’s ‘Ayushman’ as inferior to ‘Arogyasri,’ KCR in the Assembly credited ‘Arogyasri’ and ‘108 Ambulance Services’ to YS Rajashekhar Reddy and Congress Government. KCR also made it clear that, whatever good schemes were implemented by his previous Governments, his Government, without any false prestige, continue them. ‘Assignment of Lands’ policy of Congress Party initiated during Indira Gandhi’s time as part of 20-point Economic Program was welcomed by KCR.    

In the ‘British Model of Parliamentary Democracy,’ delivering the Speech in each ‘New Session of Parliament’ is an important prerogative of Monarch. Right from receiving the King at the Sovereign’s Entrance of the Palace of Westminster among others by Lord Chancellor, with the ‘Purse containing the King’s Speech,’ proceeding to the Robing Room where the King robes and puts on the ‘Crown and Regalia,’ and then ceremonially proceeding to the Chamber of the House of Lords, where the King is seated on the Throne, with the Lord Speaker and Lord Chancellor stand on His Right, and finally after few more ceremonial formalities, the King delivering His Speech from the Throne, ‘Prepared by the Government of the Day,’ it is all strictly ‘Conforming to both Law and Convention.’ The President of India’s Address too is the ‘Statement of Policy’ of the Government and drafted by it, containing a review of various activities and achievements.

In couple of instances, Governors did deviate from ‘Cabinet Approved Speech.’ Tamil Nadu Governor RN Ravi, on this year January 9, skipped some portions from prepared speech. In 2020, Kerala Governor Arif Mohammed Khan, before reading out one paragraph, with which he disagreed, read it to honor CM Pinarayi Vijayan. In 2018 Kerala Governor P Sathasivam, skipped few parts critical of Modi Government. Governor Tripura Tathagata Roy in 2017, skipped parts of speech drafted by Left Front Government. West Bengal Governor Dharma Vira In 1969, skipped the words, ‘Unconstitutional Dismissal of first UF Government by the Congress Ruled Center.’   

In a Democratic Polity, systems and practices are guided either by ‘Laws or Conventions or Both.’ The former is a rule and binding as its compliance is ensured by state machinery. The latter, though universally observed, is an unwritten understanding and more optional except fear of moral or social alienation but not legally enforceable. A blatant breach of convention is likely to be criticized by the press and bring the violator into disrepute. Conventions are obeyed in Britain, the ‘Mother of Democracies’ by letter and spirit. British Model is adopted in India to some extent.

Including opposition’s choice of contents, in the Governor’s Address, however much True they may be, other than the one, prepared by Government of its choice, with the approval of Cabinet, which is binding on Governor is absolutely right, for the time being. It is both Convention and Law. However, it is for consideration, whether in future, succeeding Governments could avoid contents that are absolutely false about preceding Governments and thus establish ‘New Healthy Convention!!!

Sunday, December 17, 2023

మానవుడి సృష్టి ఆదిగా ఎదుగుతున్న ఒక మహా దివ్యవరం ..... ఋగ్యజుస్సామాథర్వ వేదాల సారం-3 : వనం జ్వాలా నరసింహారావు

 మానవుడి సృష్టి ఆదిగా ఎదుగుతున్న ఒక మహా దివ్యవరం

ఋగ్యజుస్సామాథర్వ వేదాల సారం-3

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (18-12-2023)

         ‘ఆలోచనకు అవధులు లేవు. ఆకాశాన్ని, సముద్రాన్ని వర్ణించడానికి ఉపమానాలు లేవు. అందువల్ల ఆకాశం ఆకాశంలాగా, సముద్రం సముద్రంలాగా వున్నాయని అన్నారు. అలాగే ఆలోచననకు ఆద్యంతాలు, ఎల్లలు, పరిథులు, అస్తి-నాస్తి లేవు. ఆలోచన ఉన్నదానిని గురించి మాత్రమే కాకుండా లేనిదానిని గురించి కూడా రావచ్చు. భూతం, అభూతం ఆలోచన సంతానాలే! ఆలోచనే మానవుడిని నాగరికుడిని, సభ్యతకలవాడిని, విజ్ఞానవంతుడిని, ఉన్నతుడిని చేసింది.  “అహం బ్రహ్మాస్మి” అంటే, నేనే బ్రహ్మను అనుకునేట్లు చేసింది. ఆలోచనే మానవుడిని దానవుడిని, క్రూరుడిని, నరహంతకుడిని, మానవనాశకుడిని చేసింది. కాబట్టి సదాలోచన మాత్రమే మానవుడిని దైవాంశకు చేర్చగలదు’.

         ‘నిర్వచనం లేనిదే సదాలోచన? చాలావాటికి నిర్వచనాలు లేవు. ఎందుకంటే, జీవితం ప్రవాహం లాంటిది కాని స్థిరమైంది కాదు కాబట్టే. నిలకడలేనిదానికి నిర్వచనం అసాధ్యం. “ఏకం సద్విప్రాబహుధావదన్తి” అనేది వేదవాక్కు. ఒకే సత్యాన్ని మేధావులు బహువిధాలుగా చెప్పుతారు అని దీనర్థం. అసత్యం ఏది? మానవజాతి పుట్టినప్పతి నుండీ సత్యాన్వేషణే జరుగుతున్నది. సత్యం ఏదో తెలిసినప్పుడే కదా బహుధా చెప్పేనది? నిర్దిష్టత ప్రకృతికి లేదు. కాబట్టి ప్రాకృతములైన ఏ పదార్థానికీ లేదు. భగవానుడికి తన సృష్టిలో పరిపూర్ణత దేనికిని లేవు. సర్వం సాపేక్షమే!’.

         ‘లోచనానికి అందనిది ఆలోచన. మానవుడి సర్వావయాలను శాసించేది మనసు. మనసు ఆదేశించనిది ఏ అవయవం పనిచేయదు. కన్ను చూసినట్లున్నా, మనసు లేకపోతే చూడలేం. మనిషి అక్కడే వుంటాడు. మనసులేకున్న గ్రహించలేడు. అలాగని ప్రాణం లేదనలేం. చలనం ఉన్నది. ప్రాణం జీవించడానికి మాత్రమే పనికివస్తుంది. జీవితానికి మనసు అవశ్యం. యాత్ర ప్రాణులకు లేనిది, మనిషికి ఉన్నది, విశిష్టమైనది మనసు మాత్రమే! మనువు సంతతి అయినందువల్ల కాకుండా, మనసు ఉన్నందు వల్ల మానవుడు అయినాడు. అయినా మనసు చెప్పినదంతా సత్యం కాదు. మానవుడు ఇంకా సత్యాన్ని తెలుసుకోవాల్సి ఉన్నది.  

         ‘ప్రకృతికి జలం, జలానికి వర్షం ఆధారం. ఇది వేదం వెల్లడించిన పరమ సత్యం. పరమ సత్యమే శాశ్వత సత్యం అవుతుంది. “ఏకం సద్విప్రా బహుధా వదంతి” అన్నట్లు వర్షం రావడానికి, వచ్చేట్లు చేయడానికి కారణాల విషయంలో అనేక వాదనలు, మతాలు వున్నాయి. అందువల్ల వర్షాన్ని గురించి వేదంలోని వాదనలను, మతాలను, రీతులను ఆధునిక విజ్ఞానవేత్తలు నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే, ఆధునికమనబడే రాక్షస ఉత్పత్తి విధానం భూగోళాన్ని జలరహితం చేయడానికి ఉరుకులు పెట్తున్నది! మానవ ప్రగతిలో ఆహారపు అలవాట్లు ప్రదాన భూమిక నిర్వహిస్తాయి. మాంసాహారం పాశవికమని, శాకాహారం సాత్వికమని, మానవీయమని శాస్త్రాలు నిశ్చయించినప్పటికీ, వేదకాలంలో మాసం నిషేధం కాదు. మాంస భక్షణ ఒకనాటి ఆచారమనే సత్యాన్ని కాదనలేం’.

         ‘అగస్త్యుడు రతిని దేవతను చేసి మానవ జీవితానికి రతి ఆవశ్యకతను గురించి చెప్పినాడు. రతికి చాటు అవసరమైనా రతి రహస్యంకాదు. రతి భార్యా భర్తల మధ్యనే జరగాలనేది ఒక విధి. ఆరోగ్యవంతమైన సమాజానికి రతి విషయంలో కట్టుబాట్లు తప్పనిసరి. ఎవరైనా జీవించినంతకాలం మంచిగా జీవించాలి. మానవుడి సృష్టి ఆదిగా ఎదుగుతున్న ఒక మహా దివ్యవరం, ఆలోచన. బాహ్యాలోచనకు అందనిది ఆలోచన. ఆలోచన భగవత్ సృష్టివలె ఆద్యంతరహితం, అనంతం, సర్వవ్యాపకం. ఆలోచనకు అందనిది సత్యం, భగవత్ స్వరూపం. దీనిని తెలుసుకోవడానికే మానవుడు నిరంతరం అన్వేషిస్తున్నాడు. సత్యస్వరూపం, భగవత్ స్వరూపం తెలిసినప్పుడే పండితులు దానిని అనేక రీతులు చెప్పగలరు. ఈ అన్వేషణలో మానవుడికి అర్థమైంది చాలా తక్కువ. సత్యస్వరూపం తెలుసుకోవడం, తెలియపరచడం, వేదం పరమావధి. ఈ ప్రయత్నంలోనే ఇంద్రాగ్నులు, మరుత్తులు, అశ్వినులు, ఆదిత్యులు, సకల దేవతలు దర్శనం ఇస్తున్నారు.

         ‘స్త్రీకి ఏకాలంలోనూ పురుషుడితో అన్ని విషయాలలో సమాన ప్రతిపత్తి కలిగించలేదు. కొందరు మహిళలు తమ ప్రతిభాపాటవములతో పురుషులను మించిన ఉదాహరణలు వున్నాయి. అవి వ్యక్తిగతమైనవి. సమాజంలో స్త్రీకి గౌరవం, ఆదరణ ఉన్న కాలాలు, లేని కాలాలు వున్నాయి. కాలం పాదరసం లాంటిది. ఒకచోట నిలువదు. అది పరిణామ శీలం. అలాగే స్త్రీల విషయంలో హెచ్చుతగ్గులు కావడం సాధారణం. వేద కాలం మొత్తంలో స్త్రీకి ఏ స్థాయి ఉన్నది నిర్దిష్టంగా చెప్పడం సాధ్యపడదు. కాని స్త్రీకి పురుషుడి నుండి ఆదరాభిమానాలు లభించినవని మాత్రం చెప్పవచ్చును. స్త్రీకి నీచ దశ లేకుండెను’.

         ‘ధనం, కీర్తికన్న అన్నానికి, ఆహారానికి ప్రాధాన్యత ఇస్తున్నాడు మానవుడు. ఆహారం లేని ప్రాణం నిలువదు. ప్రాణమున్నకదా ధనం, యశం! అందుకే “అన్నం బ్రహ్మేతి వ్యజనాత్” అని వేదం ఘోశించింది. అన్నమే బ్రహ్మమని తెలిసికొమ్మని వేదం చెప్పింది. అన్నం, ఆహార పదార్థాలు, ధనాన్ని సృష్టిస్తాయి. కేవలం ధనమే దేనిని సృష్టించలేదు. కనీసం తనను సృష్టించుకేలేదు. డబ్బు మాత్రం ధనం ఎన్నటికి కాజాలదు. అన్నపానాదులు, యశస్సు ధన ఉత్పత్తికి కారణాలవుతాయి. కావున ప్రాణికి అన్నమే ప్రదానమవుతుంది.

         ‘అవ్యయములైన ధనాలను పర్వతాలు పోషించాలని అని వేదం చెప్తున్నది. సమస్త జలాలు ఆ ధనాన్ని పోషించాలి. దాన పరాయణులైన దేవపత్నులు దానిని పోషించాలి. ఓషధులు ద్యులోకం సహితం పాలన పోషణ చేయాలి. వనస్పతులు సహితమై అంతరిక్షాన్ని సహితం పాలించాలి. అవ్యయ ధనాలు ప్రకృతి సంపదలు. వాటికి స్వయంగా పునరుత్పత్తి ఉన్నందున అవ్యయములైనాయి. ఆధునిక రాక్షస నాగరికతలో పునరుత్పత్తిగల ప్రకృతి సంపదల ఉత్పత్తిని నాశనము చేయు ప్రయత్నం నిరంతరం జరుగుతున్నది. భరించ కలిగినంత ధనంమాత్రమే వుండాలి. అది ప్రకృతి శక్తుల అనుమతి గలది కావాలి. ఈ యంత్ర నాగరికతకు పట్టిన రోగం ప్రకృతి అనుమతిలేని భరించలేని ధనం! ఆశ్చర్యమేమిటి అంటే ఆనాటి ఋషులు నేటి మానవుడిని ఇలా హెచ్చరించినారు’.

         ‘శాంతి అనేది మానవాళికి ఈ నాటికి అందలేదు. ముందు అందగలదని నమ్మకం లేదు. ఎందుకంటే మనిషి, మనసు, ప్రకృతి అలజడిగలవి. వాటికి నిలకడలేదు. అందుకే శాంతికి నిలకడలేదు. శాంతి అందదు. అందుకని అందమైనది కాదు. అందని ప్రతిది అందం కాదు. శాంతికొరకని సాగిన యుద్దాలెన్ని? శాంతి కొరకని చెలరేగిన అశాంతి ఎంత? ఒకనికి అశాంతి, మరొకరికి శాంతి. మానవ జీవితం మరీచిక. దానికి అన్నీ కనిపిస్తాయి. వాటివెంట పరుగే జీవితం. మనిషికి నిశ్చయంగా అందేది మృత్యువు మాత్రమే. జీవితం అనిశ్చితం. మృత్యువు నిశ్చితం. మానవుడి జీవితం వాస్తవం, సత్యం, ఋతం మీద ఆధారపడినది కాదు. అది ఆదర్శం, లక్ష్యం, గమ్యం మీద ఆధారపడినది. మానవుడు ఏనాటికయినా ఆదర్శాన్ని అందుకొనగలడా? అదొక ప్రశ్న. మానవ జీవితం ప్రశ్నల తోరణం. అన్నింటికి సమాధానం ఉండదు’.

         ‘పాపం మానవ దోషం కాదని వేదం చెప్తున్నది. అది అతని అధీనంలో లేదు. ఉదాహరణగా స్వప్నం తీసుకోవాలి. స్వప్నం మానవుడి అధీనంలో లేదు కదా! అది పాపమెందుకు కావాలి? సుర, భ్రమ, క్రోధం, జాదం, అజ్ఞానం, పాపానికి కారణాలు. ఇది నిత్య సత్యం. నిశ్చితం. ఈ దుర్గుణం, దైవకృతాలా? మనిషికి స్వాధీనంలో లేనిదానిని దైవ కృతం అంటాం. కామక్రోధాది అరిషడ్వర్గాలను మానవుడు తన ఆధీనంలో ఉంచుకోవాలని అంటారు. అది ఆదర్శం. అసాధ్యంకాడు. కాని దుస్సాధ్యం. అందరికీ సాధ్యమయ్యేదికాదు. కాబట్టి తాము చేసిన పనికి దైవాన్ని బాధ్యుడిని చేయడం సమంజసమా? కాకపోవచ్చును. కాని ఒక్కొక్కసారి తన పరిధిని దాటిపోయినపుడు దైవ కృతాలు కావచ్చును’.

         ‘ఈ నేలమీద మానవుడు పుట్టి లక్షల సంవత్సరాలు దాటాయి. అయినా మనిషి స్వభావం, మనిషి గుణం, ఏ మాత్రం మారినట్లు కనిపించదు. మానవునిలో కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యాలు, సుఖ దుఃఖాలు, రాగ ద్వేషాలు మొదలైన లక్షనాలు మనిషిని అన్నికాలాలలో పట్టుకుని వున్నాయి. రాగాద్వేషాదులు మృత్యువుకన్న బలవత్తమైనవి. అవి మహాత్ములను తప్ప మానవులను విడవవు. అవి ప్రాణముతో వచ్చును కాని, ప్రాణంతో పోవు. మనకు పూర్వ, పర జన్మలమీద విశ్వాసం ఉన్నది. విశ్వాసం మాత్రమేకాదు. అది సత్యం. వాస్తవం. తధ్యం. ఎందుకనగా ప్రకృతిలో పదార్ధాలన్నిటికి పరిణామం, మార్పు మాత్రమున్నది. నాశనం లేదు. ప్రకృతి వలయం లాంటిది. పదార్ధాలన్నీ ఒక బిందువు వద్ద ఆరోహణ క్రమంలో పెరుగును. మరొక బిందువు వద్ద అవరోహణ క్రమంలో దిగును. దీనికి అంతం మనకు తెలియదు. నిరంతర పరిణామమే ప్రకృతి ధర్మం’.

జీవితం అన్వేషణ మాత్రమే! వ్యక్తి జీవితం, వ్యష్టి జీవితం, సమిష్టి జీ జీవితం, సమాజ జీవితం, రాష్ట్ర జీవితం, లోక జీవితం సమస్తం అన్వేషణమే! అన్వేషణమే జీవితం. అందు లభించేది కొంత, అందనిది మరింత, మరింత, మరింత. ఎంతో తెలియదు. అందువల్ల మరింత. పార్థివ ప్రయాణానికి ఒక గమ్యం, ఒక లక్ష్యం ఉండవచ్చును. పార్థివ ప్రయాణమంటే నేల మీది నడక కావచ్చును. గమ్యం పార్థివమైనప్పుడు చేరుకొనె అవకాశమున్నది. తప్పక చేరగలమని మాత్రం చెప్పలేము. జీవితం పార్థివం, పదార్ధం, అర్థం. ఆర్థికం మాత్రం కాదు. ఆర్ధిక లక్ష్యాలను సహితం సాధించిన నిదర్శనాలు మానవజాతి చరిత్రలో అరుదాతి అరుదు. లేవని చెప్పినా అతిశయోక్తి మాత్రం కాదు. మానవుడు, సకల ప్రాణిజాలం పంచభూతాత్మకమైన ప్రకృతి, వట్టి ప్రాణంతోనూ, పిడికెడు అన్నంతో మాత్రం జీవించడం లేదనడానికి ఉదాహరణలు, ఉపమానాలు చెప్పపనిలేదు’.

         ‘మనసుకు అవయవ నిర్మాణంలో చోటులేదు. అది కనిపించనిది. కనిపించక పోవడం వాస్తవం కావచ్చును. కాని మనసే జీవితాన్ని నడిపిస్తున్నది అనడం అనుభవైక సత్యం! మనసు నడపకపోతే వాల్మీకి ముందు నిషాదుడి బాణపు దెబ్బకు కూలిన మగ క్రౌంచాన్ని చూసి ఆడక్రౌంచం ఏడ్వవలసిన పనిలేదు. దీరోదాత్తుడగు రాముడు సీతనుబాసి చెట్టుకు, పుట్టకు చెప్పుకొని ఏడ్వవలసిన  పనిలేదు. ఏడ్చినంత మాత్రాన సీత రాదనే విషయం ధర్మానికి విగ్రహరూపుడైన రాముడికి తెలియదని అనుకోవడం తప్పు. ఏడ్చినది రాముడు కాడు! ఏడ్పించినది మనసు!! మనసు రాముడి కన్న మిన్నా? కావచ్చును! కాకున్నా అదెట్లు ఏడిపిస్తుంది?

         ‘పార్థివమునకన్నా, అర్థానికన్నా, వినిపించి, కనిపించే ప్రకృతి కన్నా, కనిపించని మనసే మనను నడిపిస్తున్నదనడం కొంతవరకు మాత్రమే వాస్తవం. సత్యం మాత్రం కాదు. అట్లయితే ఈ మనిషిని, సమస్త సృష్టిని నడిపిస్తున్నది ఏది? ఎవడు? తెలియని నిరంత అన్వేషణము మాత్రమే! ఈ అన్వేషణలోని భాగం, లేక, ఈ అన్వేషణకు ఆది, లేక ఈ అన్వేషణకు మార్గదర్శి మహత్తరమైన వేదమే. ఈ జీవితం సాగడానికి కేవలం మానవ ప్రయత్నం మాత్రమే చాలదనే మూల సత్యాన్ని వేదం ఎలుగెత్తి చాటింది. అయితే మానవ ప్రయత్నానికి అతీతమైన శక్తి ఏది మనిషిని నడిపిస్తున్నది? ఇది ఒక మహాప్రశ్న! దీనికి సత్యమైన సమాధానం మానవుడికి లభించడం అసాధ్యం, అసంభవం. అలాగని అన్వేషణ ఆగదు. అది ఎందుకు? ఎందుకంటే జీవితమే అన్వేషణ! అన్వేషణ ఆగితే జీవితం నిలుస్తుంది, జీవితం నిలువదు. అన్వేషణ ఆగదు. అన్వేషణకు అంతం లేదు!!’.

‘వేదం సకల ప్రాణులను సమానంగా పరిగణించింది. మానవులు, పశువులు, పక్షులు, వృక్షాలు, పర్వతాలు సమానమని దర్శించినది. వీటిలోలో కొన్నిటిని దేవతలలో చేర్చినది. దేవతలలో చేర్చుడం అంటే, అవి మానవజాతి జీవనానికి అత్యవసరమని గుర్తించడమే. అంతేకాదు, వాటికి హాని కలిగించరాదని పూజించాలని నిర్ణయించడమే. మానవుడు పంచభూతాలను, తన పిశాచ దాహానికి, విషపూరితం చేస్తున్న అత్యంత ఆధునికమని భావిస్తున్న ఈ రాక్షస యుగానికి, వేదం ఇచ్చిన సందేశం అమృతప్రాయం. కాని ఆశ రక్కసి. అది అమృతాన్ని హరిస్తుంది. మనిషిని యంత్రంగా మార్చినది, మనిషికి విషమిచ్చి ఆత్మహత్యకు పురికొల్పేది పురోగతి అనిపించుకోదు!! కృతజ్ఞత, దయ, కరుణ, ప్రేమ, అభిమానం, ఆత్మీయత, అనురాగం, అనుబంధం మానవత లక్షణాలు. ఇవి మచ్చుకైనా కనిపించని యంత్ర నాగరికతను పురోగతి అనడం రాక్షస లక్షణం!’. (డాక్టర్ దాశరథి రంగాచార్య వేద సంహితల ఆధారంగా)