Monday, September 30, 2024

పాండవుల స్వర్గారోహణ, పరీక్షిత్తు పాలన ....... శ్రీ మహాభాగవత కథ-4 : వనం జ్వాలా నరసింహారావు

 పాండవుల స్వర్గారోహణ, పరీక్షిత్తు పాలన

శ్రీ మహాభాగవత కథ-4

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (30-09-2024)

కంII             చదివెడిది భాగవతమిది,

చదివించును కృష్ణు, డమృతఝరి పోతనయున్

                             చదివినను ముక్తి కలుగును,

చదివెద నిర్విఘ్నరీతి ‘జ్వాలా మతినై

         ఒకనాడు ధర్మరాజు భీముడితో ఇలా అన్నాడు: “కాలం పోకడ చాలా వింతగా ఉన్నది. శ్రీకృష్ణుడిని చూడడానికి అర్జునుడు వెళ్లి ఏడు నెలలు దాటింది. ఇంకా తిరిగి రాలేదు. మురారి క్షేమంగా ఉన్నదీ, లేనిదీ అర్థం కావడం లేదు. నా మనస్సు విచారంగా ఉన్నది. దుశ్శకునాలు కనపడుతున్నాయి. మాధవుడు అవతారాన్ని ఉపసంహరించుకుందామని అనుకుంటున్నాడేమో? శ్రీకృష్ణుడి వృత్తాంతం తెలియడం లేదు” అని ధర్మరాజు భీముడితో విచారించసాగాడు.

         అదే సమయంలో అర్జునుడు దుఃఖ భారంతో యాదవపురి నుండి తిరిగి వచ్చాడు. తన పాదాలమీద వాలిపోయిన తమ్ముడు అర్జునిడిని చూసి ధర్మరాజు, యాదవపురిలో అంతా క్షేమమే కదా అని పేరు పేరున అందరి గురించి అడిగాడు. ముఖ్యంగా శ్రీకృష్ణుడిని గురించి మరీ-మరీ అడిగాడు. ఇలా అడిగిన అన్న గారితో అర్జునుడు, గద్గత స్వరంతో, శ్రీకృష్ణుడు అందర్నీ విడిచి పెట్టి వెళ్లిపోయిన విషయం బయట పెట్టాడు. వివిధ సందర్భాలలో ఆ మహానుభావుడు శ్రీకృష్ణుడు తమకు చేసిన సహాయాన్ని గుర్తు చేసుకుంటూ ఆ మాటలు బాధాకరంగా చెప్పాడు అర్జునుడు.

నిండు సభలో ద్రౌపదిని ఆదుకున్న సందర్భం, దుర్వాసుడి కోపాగ్ని నుండి తమను కాపాడిన సందర్భాన్ని, పాశుపతాస్త్రాన్ని ఆయన దయతో పొందిన సందర్భాన్నీ, గోగ్రహణ విజయ సందర్భాన్నీ, కురుక్షేత్రంలో తనకు సారథిగా ప్రోత్సహించిన సందర్భాన్నీ, తనను యుద్ధంలో భీష్మ, కృపాచార్య, అశ్వత్థామ, కర్ణ, ద్రోణ మహావీరుల నుండి కాపాడిన సందర్భాలనూ, సైంధవ వధనాడు అండగా ఉండడాన్నీ అన్నగారితో పంచుకున్నాడు అర్జునుడు. శ్రీకృష్ణుడు శరీరాన్ని విడిచిన తరువాత, ఆయన పదహారువేల మంది శుద్ధాంత స్త్రీలను తీసుకొస్తున్నప్పుడు బోయలు చుట్టుముట్టి అల్లరి చేస్తుంటే, చక్రిలేని కారణంగా తాను ప్రయోగించిన అస్త్రాలు వ్యర్థమైపోయిన సంగతి కూడా ధర్మరాజుకు చెప్పాడు. హరి వచనాలను తలచుకుంటూ, తన మనస్సు పరమేశ్వరుడి మీదనే ఉన్నాడని చెప్పి మౌనంగా ఉండి పోయాడు అర్జునుడు.

ధర్మరాజు భగవంతుడైన శ్రీకృష్ణుడు వెళ్లిన మార్గాన్ని తెలుసుకుని, యాదవులు నాశనమైన విషయాన్ని కూడా విని, నిశ్చలమైన చిత్తంతో లోకాన్ని విడిచి పెట్టడానికి సిద్ధపడ్డాడు. మాధవుడి స్వర్గారోహణం విన్న కుంతీదేవి భక్తితో ఈ లోకాన్ని విడిచి పెట్టింది. ఏ రోజునైతే శ్రీకృష్ణుడు ఈ భూమ్మీద తన శరీరాన్ని విడిచి పెట్టేశాడో ఆ రోజు నుండి అశుభమైన కలియుగం ప్రారంభమైంది. ధర్మరాజు హస్తినాపురంలో మనుమడైన పరీక్షిత్తును రాజుగా దీవించి అభిషేకం చేశాడు. అనిరుద్ధుడి కుమారుడైన వ్రజుడిని మథురకు రాజుగా పట్టం కట్టాడు.

ఆ తరువాత ధర్మరాజు వైరాగ్య మార్గాన్ని ఆశ్రయించాడు. ప్రాజాపత్యం అనే ఇష్టిని చేసి, అన్ని బంధాలను తెగతెంపులు చేసుకున్నాడు. నార చీరెలు ధరించి, మౌనిగా, నిరాహారుడై, దేనిమీదా ఆసక్తిలేకుండా, ఉత్తర దిక్కుగా ప్రయాణం సాగించాడు. ఆయన తమ్ములు అర్జున, భీమసేనాదులు ఆయన్ను అనుసరించారు. నారాయణ స్థానానికి చేరుకున్నారు. తదనంతరం, విదురుడు శరీరాన్ని విడిచి పెట్టాడు. ద్రౌపదీ దేవి కూడా వాసుదేవుడి మీద మనస్సు నిలిపి ఆ లోకాన్ని చేరుకుంది.

పట్టాభిషిక్తుడైన పరీక్షిత్తు సమస్త విద్యలను నేర్చుకున్నాడు. మహాభాగవత శేఖరుడై రాజ్య పాలన చేస్తూ, ఉత్తరుడి కూతురు ఇరావతిని పెళ్లి చేసుకుని జనమేజయుడుతో సహా నలుగురు కుమారులను కన్నాడు. మూడు అశ్వమేధ యాగాలను చేశాడు. కలిని శిక్షించాడు.

ఆ వివరాల్లోకి పోతే: పరీక్షిన్మహారాజు తన రక్షణలో ఉన్న కురుజాంగల దేశంలోకి కలి ప్రవేశించాడని విన్నాడు. యుద్ధం చేయాలన్న సంకల్పంతో ద్విగ్విజయ యాత్రకు బయల్దేరి తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణంలో ఉన్న కురుభూములను జయించాడు. ఈ నేపధ్యంలో, ఒకనాడు, వృషభ రూపాన్ని ధరించి ఒంటికాలితో సంచరిస్తున్న ధర్మదేవుడు, తన సమీపంలో ఆవు రూపంలో కన్నీరు కారుస్తూ ఉన్న భూదేవితో ఎందుకు అలా ఉన్నావని అడిగాడు. ఆమెకు వచ్చిన ఆపద ఏమిటని ప్రశ్నించాడు. జవాబుగా భూదేవి, ‘ఈ లోకంలో పూర్వం నాలుగు పాదాలతో నడిచే నువ్వు ఈనాడు శ్రీవల్లభుడు లేని కారణంగా ఒంటికాలి మీద నడుస్తున్నావు కదా! అలాగే, చక్రి అవతారం చాలించగానే పాప సమూహంతో నిండిన జనాలను చూసి నేను దుఃఖిస్తున్నాను. దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు, నాకు, నీకు, ధీరులకు, నానా వర్ణాశ్రమాల వారికి, గోవులకు బాధలు కలుగుతున్నందు వల్ల నేను దుఃఖిస్తున్నాను అన్నది. ఇలా వారిద్దరూ తూర్పు దిక్కుగా ప్రవహించే సరస్వతీ నదీతీరంలో వృషభ, గోవు రూపాలలో మాట్లాడుకుంటున్నప్పుడు అక్కడికి పరీక్షిత్తు వెళ్లాడు.

అప్పుడు ఆ వృషభాన్ని, రాజు వేషంలో ఉన్న ఒక క్రూరుడు, రాక్షసుడులాగా నేలమీద పడేట్లు తన్నాడు. అది అప్పుడు మూత్ర విసర్జన చేస్తూ నేలమీద పడిపోయింది. ఆ తరువాత పరమ పవిత్రమైన గోవును కూడా బలంగా తన్నాడు. ఇలా ఆ రెంటినీ దుర్మార్గంగా తన్నుతున్న రాజలక్షణాలతో ఉన్న పురుషుడిని చూశాడు. వెంటనే తన కోదండాన్ని ఎక్కు పెట్టాడు. వాడిని దండిస్తానన్నాడు. తన బాణంతో వాడిని చంపుతానని వృషభంతో, గోవుతో అన్నాడు. అలా భూదేవిని, ధర్మదేవతను బుజ్జగించి పరీక్షిత్తు తన ఖడ్గంతో ‘కలి’ ని రూపుమాపాలని ప్రయత్నించాడు. అప్పుడు వాడు తన రాజవేశాన్ని విడిచి వాడిపోయిన ముఖంతో భయపడి, పరీక్షిత్తు పాదాలమీద పడ్డాడు. శరణు వేడాడు. తనను చంపవద్దని ప్రాధేయపడ్డాడు.

పరీక్షిత్తు అప్పుడు వాడిని మందలించి, తన దుర్జన భావాన్ని విడిచిపెట్టి వెళ్లమని చెప్పాడు. పాపులకు బంధువైన వాడు తాను పాలిస్తున్న భూమ్మీద నిలవడానికి వీల్లేదన్నాడు. ఇక్కడ ఉండవద్దు అన్నాడు. తాను ఎక్కడికి పోవాలో చెప్పమని అడిగాడు కలి. జవాబుగా రాజు, ప్రాణివధ, స్త్రీ, జూదం, మద్యపానం అనే నాలుగు స్తానాలను ఇచ్చాడు కలికి. అవి తనకు సరిపోవని చెప్పేసరికి, సువర్ణం మూలంగా కలిగే అసత్యం, మదం, కామం, హింస, వైరం అనే అయిదు ప్రదేశాలను ఇచ్చాడు. మిగతా ప్రదేశాలను స్పృశించకూడదు అని గట్టిగా చెప్పాడు. ఇలా కలిని నిగ్రహించి, వృషభ మూర్తి అయిన ధర్మదేవుడికి ఆయన పోగొట్టుకున్న తపస్సు, శుచిత్వం, దయ అనే మూడు పాదాలను ఇచ్చాడు. అప్పుడు భూదేవి అపరిమితమైన ఆనందాన్ని పొందింది.

ఆ తరువాత పరీక్షిత్తు హస్తినాపురంలో కౌరవ సామ్రాజ్య లక్ష్మిని పాలించాడు. శ్రీహరి నిర్యాణం అనంతరం భూలోకం అంతా వ్యాపించిన కలి, పరీక్షిత్తు కాలంలో మాత్రం అణగి, మణగి ఉన్నాడు. అలా కలిప్రభావం తన రాజ్యంలో లేకుండా చేసినప్పటికీ, కలిని మాత్రం ప్రాణాలతో విడిచి పెట్టాడు.                                 (బమ్మెర పోతన శ్రీమహాభాగవతం, రామకృష్ణ మఠం ప్రచురణ ఆధారంగా)

Sunday, September 29, 2024

A Red-Light District that thrived for Centuries : Vanam Jwala Narasimha Rao

 A Red-Light District that thrived for Centuries

De Wallen’ Area: Legalized and Regulated Sex Work

Vanam Jwala Narasimha Rao

The Hans India (29-09-2024)

{The origin of historic ‘Red-Light District’ can be traced back to the medieval period, by which time Amsterdam had grown into a significant port city, attracting male sailors, traders, and travelers from around the world. Their stay for long periods, necessitated sex work to cater to their needs that resulted in establishment of specific areas, which in the process also generated revenue through taxation. Thus, ‘De Wallen’ emerged as a hub for sex work, which was also driven by economic factors that provided a livelihood for women in a male-dominated society} – Editor Hans India

During my two-day visit to ‘Paris City’ from Amsterdam our team passed through the Famous Prostitution Place’ known as ‘Pigalle Area’ around ‘Boulevard de Clichy’ which looked similar to any normal locality. The street ‘Boulevard de Clichy’ resulted from the fusion in 1864, of the roads that paralleled the Wall of the 'Farmers-General, both inside and out’ and the adjoining ‘Pigalle Area’ is reputed for its adult entertainment in association with sex work and nightlife. Pigalle still retains its historical character, while ensuring meticulous safety and welcoming for all residents and visitors.    

Similarly, in Amsterdam, the ‘Red-Light District’ known as ‘De Wallen’ is city's one of the most famous and historic areas. Known for its legalized and regulated sex work, the sex workers here display themselves behind ‘Red-Lit Windows’ offering their services. This oldest part of Amsterdam is a mix of narrow lanes, canals, bars, coffee shops, and adult entertainment venues. It is a complex history that reflects broader social, economic, and legal developments in the city. The strict policing rules to ensure the safety and rights of the sex workers, transformed ‘Red-Light District’ in to a tourist destination.

The Genesis of the ‘Red-Light District’ can be traced back to the medieval period, by which time Amsterdam had grown into a significant port city, attracting male sailors, traders, and travelers from around the world. Their stay for long periods, necessitated sex work to cater to their needs, that resulted in establishment of specific areas, which in the process also generated revenue through taxation. Thus, ‘De Wallen’ emerged as a hub for sex work, which was also driven by economic factors that provided a livelihood for women in a male-dominated society.  

It is said that, Amsterdam's relatively liberal attitude towards sex work was also rooted in the city’s broader culture of tolerance. The city was a melting pot of different cultures and ideas, and this tolerance extended to the regulation, rather than outright banning of sex work. Delving into the ‘Concept and Legalization,’ the interesting phase was that, by the 19th and early 20th centuries, when there were growing demands worldwide to criminalize sex work, in Amsterdam, the focus remained on ‘Regulation Rather Than Prohibition’ due to a pragmatic understanding that prohibition may lead to practicing it underground, making it harder to manage.

The concept of regulated sex work was formalized in the Netherlands in 2000 when the Dutch government legalized it, allowing for the official licensing of brothels. This move aimed to protect the rights of sex workers, ensured better health standards, and combat human trafficking. Consequently, ‘Amsterdam's Red-Light District’ became a model for sex work regulation in a ‘Modern European City.’ Gradually the ‘Red Light District’ has become crowded tourist attraction, resulting in significant impact on the area, and cultural degradation.

Evolution of the Red-Light District reflecting changing social attitudes, propelled to an ongoing debate in Amsterdam on the whole gamut of sex work in the city, aimed at balancing rights and safety of sex workers, and the historical significance with the realities of modern urban life. This led to considering various reforms to address the challenges by the Dutch Government and Amsterdam’s City Council. This included proposals to move parts of the ‘Red-Light District’ away from the city center, stricter regulations on tours, and efforts to combat human trafficking.


The phenomenon of ‘Red-Light Districts’ is also present in several European countries, though the approaches to deal with them vary significantly. There have been marked ‘Differences and Deviations’ in allowing sex-work. Germany’s approach is similar to the Netherlands, where prostitution has been legal and regulated since 2002. It is more decentralized, with brothels and sex work establishments spread across cities rather than concentrated in one area. Sex workers can work legally in brothels, and they have access to health care, social insurance, and legal protection.

Prostitution is legalized in Belgium though it is regulated only at the municipal level. It has generally stricter controls on the conditions of sex work and a strong focus on combating human trafficking. Switzerland legalizes and regulates prostitution. Cities like Zurich and Geneva have designated areas for sex work, including outdoor ‘Sex Boxes’ in Zurich where workers can meet clients in a controlled environment. The Swiss model emphasizes safety, health checks, and taxation.

Austria permits legalized prostitution with strict regulations. Registered Sex Workers must undergo regular health checks. Vienna has specific zones where sex work is allowed, but it lacks a large, internationally known red light district like in Amsterdam. Denmark legalized prostitution in 1999, but pimping and operating brothels remain illegal, which limits the formal organization of sex work. There are no prominent red-light districts like in Amsterdam, and the practice is more dispersed and less visible.

Countries like Sweden and Norway have adopted the ‘Nordic model’ where selling sex is legal but buying is criminal. This model is based on the idea of reducing demand and protecting sex workers from exploitation. Amsterdam's ‘Red-Light District’ is unique in its combination of sex work, tourism, and cultural heritage. Similarly, few other European Cities have such a prominent and well-known areas dedicated to sex work as well as a major tourist attraction. Several countries may have legalized and regulated sex work, but often they are with stricter controls, less visibility, or different legal frameworks, reflecting different social attitudes and priorities.

International Organizations like the UN, UN Women, UNAIDS, WHO, ILO, and Amnesty International etc. through their guidelines, generally emphasized a ‘Rights-Based, Health-Focused’ approach to sex work. Decriminalization, Human Rights, Combatting Trafficking, Health, and Safety etc. are the common themes. For instance, The UN has advocated for a ‘Human Rights-Based Approach’ to sex work, emphasizing the need to protect the rights, health, and safety of sex workers.

UN Women in 2016, held consultations to develop a position on sex work, focusing on the rights and safety of sex workers while also addressing issues like trafficking and exploitation. UNAIDS has been a strong advocate for the decriminalization of sex work, arguing that criminalization increases vulnerability to HIV and other health issues by pushing sex work underground.  World Health Organization advocates for the decriminalization of sex work as part of a public health strategy. The organization emphasizes that criminalization increases the risk of violence, sexually transmitted infections (STIs), and other health problems among sex workers.

International Labor Organization (ILO) has considered the issue of sex work within the broader context of labor rights. Amnesty International in 2016 adopted a policy calling for the full decriminalization of consensual adult sex work. Global Network of Sex Work Projects advocates for the rights and health of sex workers globally. It supports the decriminalization of all aspects of sex work, opposes punitive laws, and promotes the empowerment of sex workers.

During the day, the district is less lively and even less attractive as the messier aspects reveal themselves in natural daylight. Although there are women tapping on the windows even during the light hours, most of the action takes place around 11pm. The district is swarming with crowds and the red neon lights illuminate the canals. The atmosphere lives until around 2am or 3am when the streets get emptier and businesses shuts down.

The average income of a sex worker varies significantly depending on several factors, including the country or city they work in, the legal and regulatory environment, the type of services offered, their experience, the clientele they serve, and the working conditions. More importantly, sex workers often have significant expenses related to their work, including safety measures, health care, taxes, and, in some cases, payments to third parties.

(Writer’s Dispatch from Amsterdam).

Sunday, September 22, 2024

పరీక్షిత్తు జననం, ధృతరాష్ట్రుడి దేహత్యాగం ..... శ్రీ మహాభాగవత కథ-3 : వనం జ్వాలా నరసింహారావు

 పరీక్షిత్తు జననం, ధృతరాష్ట్రుడి దేహత్యాగం

శ్రీ మహాభాగవత కథ-3

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (23-09-2024)

కంII             చదివెడిది భాగవతమిది,

చదివించును కృష్ణు, డమృతఝరి పోతనయున్

                             చదివినను ముక్తి కలుగును,

చదివెద నిర్విఘ్నరీతి ‘జ్వాలా మతినై

          భీష్మాచార్యుల మరణానంతరం, ఆయనకు ధర్మరాజాదులు అంతిమ సంస్కారాలు చేసిన తరువాత, శ్రీకృష్ణుడు హస్తినాపురంలో మరి కొన్ని రోజులున్నాడు. తరువాత ద్వారకానగారానికి ప్రయాణమయ్యాడు. సుభద్ర, ద్రౌపది, కుంతి, ఉత్తర, గాంధారి, ధృతరాష్ట్రుడు, విదురుడు, ధర్మరాజు ఇలా అందరూ శ్రీకృష్ణుడు బయల్దేరి పోతుంటే, ఆయనకు ఘనంగా వీడ్కోలు చెప్పారు. యమునా నదీ తీరంలోని కురుజాంగల, పాంచాల, శూరసేన దేశాలు దాటాడు. బ్రహ్మావర్తాన్ని, కురుక్షేత్రాన్ని, మత్స్య, సారస్వత, మరుధన్వ, సౌవీర, అభీర, సైంధవ దేశాలను దాటి, ద్వారకలో అంతర్భాగమైన ఆవార్త మండలానికి చేరుకొని అక్కడ నుండి ద్వారక నగరాన్ని చూసి, సూర్యాస్తమయం సమయానికి ద్వారక నగారానికి చేరుకున్నాడు శ్రీకృష్ణుడు. ఆయన రాకకు పురజనులంతా అమితంగా ఆనందపడ్డారు. ఇక ముందు ఆయన ఎక్కడికీ వెళ్లకుండా ద్వారకలోనే ఉండాలని ప్రార్థించారు వారంతా. ద్వారక రాజమార్గం ద్వారా ప్రయాణం చేసి, ఆయన, తల్లిదండ్రుల నివాసాలలోనికి వెళ్లి, దేవకికి, ఇతర ఏడుగురు తల్లులకు మొక్కాడు. అనంతరం ఏక కాలంలో పదహారువేల నూట ఎనిమిది మంది భార్యల భవనాలలోకి వెళ్లాడు. వాళ్ళతో సరససల్లాపాలు ఆడాడు.

         ఇదిలా ఉండగా, అశ్వత్థామ కోపంతో ప్రయోగించిన బ్రహ్మశిరోనామ అస్త్రం బారినుండి ఉత్తర గర్భం శ్రీకృష్ణుడి దయవల్ల బతికింది కదా! గర్భస్థ శిశువును వాసుదేవుడు ఎలా రక్షించాడు? అలా రక్షించబడిన బాలుడు ఈ భూమ్మీద ఎన్ని సంవత్సరాలు జీవించాడు? అతడు ఎలాంటివాడు? ఏమి సాధించాడు? ఆయన తనువును ఎలా చాలించాడు అనే విషయాలను వరుసగా చెప్పడం ప్రారంభించాడు సూతుడు శౌనకాది మహా మునులు వింటుంటే.

         అభిమన్యుడి భార్య గర్భంలో ఉన్న శిశువు పదినెలలు నిండేసరికి అశ్వత్థామ ప్రయోగించిన బాణానికి అంతులేని బాధపడుతూ ఆక్రోశించాడు. అలా ఆ బాలుడు చింతిస్తున్న సమయంలో అంగుష్ఠమాత్ర దేహంతో ఒక గద ధరించి విష్ణువు ఆ శిశువు ముందు ఆవిర్భవించాడు. అశ్వత్థామ వేసిన బ్రహ్మాస్త్రం వేడి తగలకుండా, గదను గిరగిరా తిప్పుతూ, శిశువుకు రక్షణ కలిగించి ఆనందాన్ని చేకూర్చాడు. బాణాగ్నిని గదతో ముక్కలు చేశాడు. చేసి, అదృశ్యమయ్యాడు. ఇది జరిగాక ఒక శుభ లగ్నంలో కుమారుడు పుట్టాడు ఉత్తరకు. విష్ణువు రక్షించడం వల్ల పుట్టాడు కనుక విష్ణురాతుడు అనే పేరుతో ప్రసిద్ధికెక్కుతాడని బ్రాహ్మణులు చెప్పారు. ధర్మరాజు అతడి భవిష్యత్ గురించి అడిగిన ప్రశ్నకు జవాబుగా, వారు, అతడు అఖండమైన కీర్తి గడిస్తాడని, విష్ణు భక్తుడు అవుతాడని చెప్పారు. చాలా సంవత్సరాలు జీవించిన తరువాత తక్షకుడు అనే సర్పం విషాగ్ని వలన తనకు మరణం ఉందని తెలుసుకుంటాడని అంటారు. శుకయోగి ద్వారా ఆత్మజ్ఞాన సంపన్నుడై, గంగానదీ తీరంలో శరీరాన్ని విడిచి పెడుతాడు అని జాతక ఫలం చెప్పారు.

         తల్లి గర్భంలో ఉన్నప్పుడు చూసిన విభుడు, ఈ విశ్వమంతా ఉన్నాడు కాబట్టి, అతడే నిత్యం పరీక్షించాడు కాబట్టి, అతడిని ‘పరీక్షిత్తు అన్నారు. ఆ బాలుడు క్రమేపీ పెరిగి పెద్దవాడై, అన్నిటా పూర్ణుడయ్యాడు.

         తదనంతరం, ధర్మరాజు బంధువులను కౌరవ-పాండవ యుద్ధంలో చంపినందుకు దోష పరిహారంగా అశ్వమేధయాగం చేయాలనుకున్నాడు. యజ్ఞానికి అన్నీ సమకూర్చుకుని శ్రీకృష్ణుడిని ఆహ్వానించాడు. ఆయన్ను ఉద్దేశించి మూడు యజ్ఞాలు చేశాడు. ఆ తరువాత అర్జునుడితో కలసి ద్వారకకు వెళ్ళిపోయాడు కృష్ణుడు. కొంతకాలానికి విదురుడు మైత్రేయ ముని దగ్గర పరమార్థ జ్ఞానానికి సంబంధించిన విషయాలను తెలుసుకుని హస్తినాపురానికి వచ్చాడు. లోకంలోని వార్తలు ఏమిటని ఆయన్ను ధర్మరాజు అడిగాడు. అప్పుడాయన మేలు కలిగించే లోకంలోని సమస్త విషయాలను విశదంగా చెప్పాడు. కీడు వార్తలు ఏవీ చెప్పలేదు.

         ధర్మరాజు రాజ్యభారాన్ని వహించి తన తమ్ములు, తానూ, మనుమడిని ముద్దు చేస్తూ, చాల కాలం మహావైభవంగా పాలన చేశాడు.

         కొంతకాలానికి, ఒకనాడు, విదురుడు ధృతరాష్ట్రుడికి విరక్తి మార్గాన్ని ఉపదేశించాడు. అప్పుడాయన జ్ఞాన మార్గంలో హిమవత్పర్వతం దిశగా గాంధారి సమేతంగా వెళ్లాడు. విదురుడు కూడా వారితో వెళ్లాడు. ఆ మర్నాడు ఈ విషయం తెలియని ధర్మరాజు వారెక్కడికి పోయారని సంజయుడిని అడిగాడు. అలా ఇద్దరూ ఎటూ పాలుపోక దుఃఖిస్తున్న సమయంలో నారదుడు వచ్చాడు. ఆయన్ను వీరి గురించి అడిగాడు ధర్మరాజు. జవాబుగా నారదుడు:

         ‘కాలాన్ని దాటడం ఎవరికీ శక్యం కాదు. చింత అక్కర లేదు. ధృతరాష్ట్రుడు గాంధారీ, విదురులతో హిమవత్పర్వత దక్షిణ భాగంలో ఉన్న ఒక మునివనానికి వెళ్లారు. అక్కడ సప్త మహర్షులకు సంతోషం కలిగించడానికి ఏడు ప్రవాహాలుగా ప్రవహిస్తున్న ఆకాశగంగ పుణ్య తీర్థంలో విష్ణువు గూర్చి ప్రార్థన చేస్తున్నాడు. నేటికి ఐదవ నాడు శరీర త్యాగం చేయబోతున్నాడు. ఆ తరువాత గాంధారి కూడా అగ్నిలో పడి భస్మమైపోతుంది. అది చూసిన విదురుడు చింతించి,  తీర్థయాత్రలకు పోతాడు’ అని విదుర, గాంధారీల వృత్తాంతాన్ని ధర్మరాజుకు చెప్పి, నారదుడు స్వర్గానికి వెళ్లిపోయాడు.     

              (బమ్మెర పోతన శ్రీమహాభాగవతం, రామకృష్ణ మఠం ప్రచురణ ఆధారంగా)

Exploring Enchanting Realm of Paris (Love Locks, Russian Orthodox Churches, Louis Vuitton) : Vanam Jwala Narasimha Rao

 Exploring Enchanting Realm of Paris

(Love Locks, Russian Orthodox Churches, Louis Vuitton)

‘Cultural, Historical, and Artistic Richness of Paris’

Vanam Jwala Narasimha Rao

The Hans India (22-09-2024)

{Montmartre is a picturesque place in Paris, known for its rich artistic history, charming streets, and stunning views of the city, and once home to famous artists like Picasso and Van Gogh. Paris also hosts several Russian Orthodox churches, each with its own significance. The city is a global fashion capital, home to some of the most luxurious shopping centers in the world}- Hans Editor

One of the 30 bridges which is a pedestrian bridge on the ‘Seine River,’ the lifeblood of Paris, the ‘Pont des Arts’ is famous for the ‘Love Lock Tradition’ which became quite famous in Paris. It is a very interesting and human-interest belief, where couples attach padlocks to a bridge and throw away the key as a symbol of their everlasting love. Over a period, the ‘Pont des Arts Pedestrian Bridge’ was covered with thousands of locks, turning it into a kind of monument to romance, but in the process, the weight of these locks began to damage the bridge, leading to safety concerns. A decade ago, in 2015, authorities removed the locks and replaced the bridge's railings with glass panels to prevent further damage. Despite this, the tradition continued in other locations, and Paris is still full of romantic spots.

The Sacre-Cœur Catholic Church area located on Montmartre Hill, the highest point in Paris, became another popular location for couples to attach love locks to railings and fences around the church contributing to the city’s romance culture. Sacre-Cœur Basilica is a major landmark known for its stunning white-domed architecture and panoramic views of Paris. It was built between 1875-1914 as a symbol of national reconciliation after the Franco-Prussian War and the Paris Commune.

Montmartre is a picturesque place in Paris, known for its rich artistic history, charming streets, and stunning views of the city, and once home to famous artists like Picasso and Van Gogh. The reason for the presence of love locks in this area is largely due to its romantic and scenic appeal. The Church itself is a major landmark that attracts many visitors, making it a natural spot for the love lock tradition to take root. The Church is noted for its Romanesque-Byzantine style, expansive mosaics, and the vast piazza in front, which offers one of the best viewpoints in the city.

An other interesting place we passed through was the ‘Pont de l'Alma Tunnel’ the tragic site where Princess Diana died in a car crash in August 1997. Located near the Seine, the tunnel has become a somber point of reflection for visitors. Above the tunnel, the ‘Flame of Liberty’ a full-sized replica of the Statue of Liberty's torch, originally a gift from the United States, has become an unofficial memorial for Diana, where people leave flowers, messages, and tributes in her memory.

Paris hosts several Russian Orthodox churches, each with its own significance. These churches reflect the rich cultural heritage and historical presence of the Russian Orthodox community in Paris, each contributing to the city’s diverse spiritual and architectural landscape. ‘Saint-Alexandre-Nevsky’ built to serve the Russian aristocracy, Orthodox and diplomatic community in the city.  It features ‘Ornate Onion Domes and Intricate Frescoes.’ ‘Russe de la Sainte-Trinite,’ Church ‘de la Protection-de-la-Mère-de-Dieu,’ ‘Saint-Serge-de-Radonege,’ and ‘Chapel of the Russian Orthodox Church’ are the other churches of Russian architectural style.

The ‘Ritz Paris’ with its elegance, opulence, and high society, is one of the most iconic and luxurious hotels in the world, located in the heart of Paris. The hotel has hosted royalty, celebrities, and artists over the years, with its lavish suites, legendary bar, where Hemingway was a frequent guest. Paris is equally renowned for its charming wayside restaurants, often referred to as ‘Bistros’ or ‘Brasseries’ that have been in operation for decades, typically adorned with outdoor seating, creating a warm and inviting atmosphere where locals and tourists alike can enjoy a leisurely meal and variety of French classics like croissants, escargots, and Frech Fries.


While Parisians generally welcome tourists as they contribute to the city's economy and cultural exchange, there appears to be a preference for a balanced flow of visitors. Popular tourist areas can become crowded, leading to occasional frustration among locals. And hence, the city has been working on managing tourism sustainably, promoting less crowded areas and encouraging responsible tourism practices, reflecting Paris's unique lifestyle.

Paris is a global fashion capital, home to some of the most luxurious shopping centers in the world. On the way we saw, ‘Louis Vuitton’ the largest high-end flagship store in Paris, a symbol of luxury and fashion, an architectural masterpiece, blending modern design with traditional elegance, offering an extensive collection of the brand's iconic bags, luggage, accessories, and clothing, and providing a premium shopping experience for fashion enthusiasts and luxury seekers from around the globe. There is always a long queue to enter the store. The others in Paris are: Le Bon Marche, Galleries Lafayette, Printemps etc. are famous shopping streets.

We passed through the historic ‘Le Marais’ district, is the heart of the Jewish community in Paris. It is home to numerous Jewish shops, restaurants, and temples. Yet another interesting place is the ‘Le Marais’ a central hub for the ‘LGBTQ+ Community’ (lesbian, gay, bisexual, transgender, and queer) known for its lively gay-friendly atmosphere, with numerous bars, clubs, and cafes. Close to this in the ‘Les Halles’ area also number of LGBTQ+ friendly establishments are there. Similarly, ‘Montmartre’ area has a historical association with the LGBTQ+ community. Paris generally welcomes diverse neighborhoods and communities.

Typically, Paris City has a ‘Famous Prostitution Area.’ Historically, ‘Pigalle Area’ particularly around Boulevard de Clichy, has a reputation for its adult entertainment venues and has been a focal point for discussions about sex work in Paris, and has been known for its association with sex work and nightlife. Pigalle retains some of its historical character, while ensuring that the area remains safe and welcoming for all residents and visitors.

Paris streets by and large remained narrow due to historical preservation and it is said that widening would disrupt the historical and architectural integrity of many neighborhoods. The city’s planning focuses on preserving the character of its historic districts, which often means maintaining existing street layouts rather than expanding them. The close alignment of buildings along streets that were designed before the advent of modern urban planning, helps create a dense, walkable urban environment. Driving or walking through Paris, it is seen that the ‘Road Traffic and Parking Discipline’ is unique.

To reduce road traffic and pollution various measures were taken, like expanding pedestrian zones, implementing car-free days, and promoting use of public transport and bicycles. Paris has limited parking spaces and enforces orderly parking practices to manage space efficiently. Double parking or zigzag parking is rare. Paris City has low use of two-wheelers unlike other cities. The strict parking regulations discourage the use of scooters and motorcycles, as finding parking can be challenging. It is a compact city making walking and cycling convenient and practical, and encourages pedestrian and cyclist mobility. Dedicated bike lanes and pedestrian zones are seen.

Paris is famous for its old-looking apartments with their grand façades, that open directly onto the streets, wrought-iron balconies, high ceilings, and considered as highly desirable. These buildings were constructed before modern zoning laws, leading to a blend of residential and commercial uses. Their value can vary significantly depending on the location, though they still offer the charm of ‘Parisian Architecture’ reflecting the neighborhood's prestige, proximity to landmarks, and the level of renovation the apartments have undergone.

Their design fosters a lively, street-level environment, encouraging interaction between residents, businesses, and visitors, and promoting a sense of community and vibrancy, with shops, cafes contributing to the city's lively street life. However, Street vending and pavement shops are regulated tightly in Paris to maintain order and aesthetics. The city has strict rules governing where vendors can set up, leading to fewer such shops. Most commercial activities are concentrated in designated areas such as markets and shopping districts rather than on the pavements.

This is the ‘Cultural, Historical, and Artistic Richness of Paris.’

(Dispatch from Amsterdam)

Monday, September 16, 2024

వాసుదేవుడిలో ఐక్యమైన భీష్మాచార్యుడు ...... శ్రీ మహాభాగవత కథ-2 : వనం జ్వాలా నరసింహారావు

 వాసుదేవుడిలో ఐక్యమైన భీష్మాచార్యుడు

శ్రీ మహాభాగవత కథ-2

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (16-09-2024)

కంII             చదివెడిది భాగవతమిది,

చదివించును కృష్ణు, డమృతఝరి పోతనయున్

                             చదివినను ముక్తి కలుగును,

చదివెద నిర్విఘ్నరీతి ‘జ్వాలా మతినై

సూతుడు శౌనకాది మహామునులకు భాగవత కథ చెప్పడం కొనసాగిస్తూ, పరీక్షిన్మహారాజు జన్మ, ఆయన చేసిన కర్మలు, ఆయన పొందిన ముక్తి, పాండవుల మహా ప్రస్తానం, కృష్ణుడి కథ ఒకటి వెంట మరొకటి వినిపించాడు. కురుపాండవ యుద్ధంలో కౌరవ సేన, నాయకులు అంతా మరణించిన తరువాత, భీముడి గదాఘాతానికి ధుర్యోధనుడు తొడలు విరిగి నేలకూలాడు. అప్పుడు అశ్వత్థామ, రాజును సంతోష పరచడానికి, ద్రౌపది కొడుకుల తలలు క్రూరంగా నరికి తెచ్చి చూపించాడు ధుర్యోధనుడికి. దుఃఖిస్తున్న ద్రౌపదిని ఓదార్చి, తన గాండీవంతో అశ్వత్థామ శిరస్సును ఖండించి తెస్తానని ఆమెకు చెప్పాడుఅర్జునుడు అర్జునుడు. ఇది తెలుసుకున్న అశ్వత్థామ భయంతో ప్రాణాలు కాపాడుకోవడం కొరకు పరుగెత్తసాగాడు.

అశ్వత్థామ తన ప్రాణాలను రక్షించుకోవడానికి సమాధిలో కూర్చుని, ప్రయోగమే తప్ప ఉపసంహారం తెలియని, ‘బ్రహ్మశిరోనామక అస్త్రాన్ని అర్జునుడి మీద వేశాడు. బ్రహ్మాండమైన తేజస్సుతో వేగంగా వస్తున్న దాని వివరాలు కృష్ణుడిని అడిగాడు అర్జునుడు. దాన్ని ఉపసంహరించడానికి బ్రహ్మాస్త్రం ప్రయోగించమని అర్జునిడికి సూచించాడు పరమాత్మ కృష్ణుడు. అలాగే చేశాడు అర్జునుడు. రెండు అస్త్రాలు భీకరంగా పోరాడుతుంటే, దానిమూలాన ముల్లోకాలకు భయం కలుగుతుంటే, కృష్ణుడి ఆజ్ఞానుసారం రెండు అస్త్రాలనూ ఉపసంహరించాడు అర్జునుడు. ఆ వెంటనే అశ్వత్థామను వెంటాడి పట్టుకున్నాడు. తాడుతో బంధించి తమ శిబిరం దగ్గరకు తీసుకువచ్చి అతడిని చంపుతానన్నాడు. ప్రాణ భయంతో పారిపోతున్న అతడిని కనికరించమని, కఠినంగా దండించవద్దని కృష్ణుడు అన్నాడు. బ్రాహ్మణుడు అపరాధం చేసినప్పటికీ అతడిని చంపకూడదన్న ధర్మాన్ని పాటించి అర్జునుడు అశ్వత్థామను చంపకుండా బంధించి తెచ్చి ద్రౌపది ముందు పడేశాడు.

సిగ్గుతో తల వంచుకున్న ఆశ్వత్తామను అనాల్సిన మాటలన్నీ అన్నది ద్రౌపది. అతడు చేసింది చాలా అన్యాయమని చెప్పింది. ‘బాలుర ప్రాణాలు తీయడం అసుర కృత్యం కదా తండ్రీ అన్నది. పుత్రశోకంతో తాను బాధపడుతున్నట్లే అశ్వత్థామ తల్లి ఆయనను బంధించి తెచ్చినందుకు, చంపుతారేమోనని బాధపడుతుండవచ్చు కదా! అని అంటుంది ద్రౌపది. అతడిని చంపకుండా విడిచి పెట్టమని అంటుంది. ఒక్క భీముడు తప్ప అందరూ దానికి అంగీకారం తెలియచేశారు. ‘బ్రాహ్మణుడిని చంపకూడదని వేదం చెప్తున్నది. వేద ధర్మాన్ని దృష్టిలో వుంచుకుని అతడిని రక్షించడం తక్షణ కర్తవ్యం’ అని కృష్ణుడు భీముడికి సలహా ఇచ్చాడు. భీముడు కూడా ఒప్పుకున్నాడు. అప్పుడు అర్జునుడు తన కత్తితో అశ్వత్థామ శిరోజాలను ఖండించాడు. ఆ తరువాత తాళ్లను విప్పి తన శిబిరంలో నుండి బయటకు ప్రాణాలతో ఆయన్ను వెళ్ళగొట్టాడు. ఆ తరువాత పాండవులు మృతులైన బంధువర్గానికి దహన కృత్యాలు నిర్వర్తించి, తిలోదకాలు ఇచ్చారు.

ఇదంతా జరిగిన తరువాత శ్రీకృష్ణుడు ద్వారకకు బయల్దేరుతున్న సమయంలో సుభద్ర-అర్జునుడి కోడలు, అభిమన్యుడి భార్య ఉత్తర ఆయన దగ్గరకు తత్తరపడుతూ వచ్చింది. తన కడుపులో ఉన్న బిడ్డడిని కాల్చేయడానికి ఒక బాణం ప్రయత్నం చేస్తున్నదని, దాన్నుండి శిశువును రక్షించమని ప్రార్థించింది. ఆ బాణం అశ్వత్థామ వేసిన దివ్యాస్త్రం అని తెలుసుకున్నాడు కృష్ణుడు. ఆ బ్రహ్మాస్త్రాన్ని అడ్డుకోవడం కోసం తన సుదర్శన చక్రాన్ని అడ్డువేశాడు కృష్ణుడు. పాండవ వంశాంకురాన్ని రక్షించడం కోసం వైష్ణవ మాయతో  కప్పి అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని అణచి వేశాడు కృష్ణుడు. అలా అది నిరర్థకం అయిపోయింది. ఇదంతా గమనించుతున్న కుంతీదేవి శ్రీకృష్ణుడిని పరి-పరి విధాలుగా స్తుతించింది. ఆ మహానుభావుడు పాండవులకు చేసిన ఉపకారాలను గుర్తుచేసింది. తనను కీర్తిస్తూ ఉన్న కుంతీదేవి మాటకు అంగీకరించి, మరి కొంతకాలం హస్తినాపురంలో ఉండడానికి అంగీకరించాడు కృష్ణుడు. కురుపాండవ యుద్ధంలో కొన్ని అక్షౌహిణుల సైన్యం చనిపోవడం ధర్మరాజుకు బాధాకరం అనిపించింది. ఆయన ఆహారాన్ని తీసుకోకుండా అంపశయ్య మీద భీష్మాచార్యుడు పడి వున్న చోటుకు వెళ్లాడు ఒకనాడు.

ఆ సమయంలో కృష్ణార్జునులు, తక్కిన పాండవులు ధర్మరాజుతో కూడి కురుక్షేత్రానికి  వెళ్లారు. అక్కడ భీష్ముడికి నమస్కారం చేశారు. అప్పుడే అనేకమంది బ్రహ్మర్షులు, రాజర్షులు అక్కడికి వచ్చారు. భీష్ముడు పాండవులతో గత విషయాలను నెమరు వేసుకుంటూ సంభాషించాడు. తాను ప్రాణాలు విడవక ముందే సర్వేశ్వరుడు, దేవతా సార్వభౌముడు అయిన శ్రీకృష్ణుడు తన ముందర సాక్షాత్కరించడం వల్ల తన భాగ్యం పండిందని అన్నాడు భీష్ముడు. ఆ తరువాత స్వచ్చందంగా మరణించే వారు కోరుకునే ఉత్తరాయణం వచ్చిందని ఆయన తెలుసుకున్నాడు. భీష్ముడు ఆ తరువాత శ్రీకృష్ణుడిని స్తుతించసాగాడు అనేక విధాలుగా. యుద్ధ రంగంలో తన బందు మిత్రులను చంపడానికి మనసొప్పక వెనక్కు పోదామన్న అర్జునిడికి గీతను చెప్పి, యుద్ధానికి పురిగోల్పే సందర్భాన్ని గుర్తు చేసుకున్నాదు. అక్కడ పోతన గారు రాసిన పద్యం:

సీ.       కుప్పించి ఎగసినఁ గుండలంబుల కాంతి గగన భాగంబెల్లఁ గప్పి కొనఁగ!

నుఱికిన నోర్వక యుదరంబులోనున్న జగముల వ్రేఁగున జగతి గదలఁ!

జక్రంబుఁ జేపట్టి చనుదెంచు రయమునఁ బైనున్న పచ్చని పటము జాఱ!

నమ్మితి నాలావు నగుఁబాటు సేయక మన్నింపు మని క్రీడి మఱల దిగువఁ!

తే.       గరికి లంఘించు సింహంబు కరణి మెఱసి, నేఁడు భీష్మునిఁ జంపుదు నిన్నుఁ గాతు

విడువు మర్జున! యనుచు మద్విశిఖ వృష్టిఁ దెరలి చనుదెంచు దేవుండు దిక్కు నాకు

తనను మన్నించమని అర్జునుడు వేడుకోవడం, ‘నేడు భీష్ముడిని చంపి నిన్ను రక్షిస్తాను. నన్ను విడిచి పెట్టు....’ అని శ్రీకృష్ణుడు అనడం గుర్తు తెస్తూ ఆ శ్రీకృష్ణుడే తనకు రక్ష అన్నాడు భీష్మాచార్యుడు. ఇలా మనస్సు ద్వారా, వాక్కు ద్వారా, దర్శించడం ద్వారా పరమాత్ముడైన కృష్ణుడిని హృదయంలో నిలుపుకుని, వాసుదేవుడిలో ఐక్యమైపోయాడు భీష్ముడు. మృతుడైన భీష్మాచార్యుల వారికి ధర్మరాజు పరలోక క్రియలు చేయించి, కృష్ణుడితో కలిసి హస్తినాపురానికి వెళ్లిపోయాడు. రాజ్యాన్ని ధర్మ మార్గంలో పాలించాడు ధర్మరాజు. ఆయన పాలన చేస్తున్నప్పుడు ప్రజలంతా హాయిగా ఉన్నారు.                      

(బమ్మెర పోతన శ్రీమహాభాగవతం, రామకృష్ణ మఠం ప్రచురణ ఆధారంగా)